Arnab Goswami
-
బయటపడ్డ చంద్రబాబు నిజస్వరూపం
-
సీఎం జగన్‌పై తప్పుడు కథనాలా.. అర్నాబ్ జాగ్రత్త
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జాతీయ మీడియా సంస్థ అయిన రిపబ్లిక్ టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం కావడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని తప్పుడు కథనం ప్రచారం చేయడంపై ఆయన ఫైరయ్యారు. మార్చి 4న జగన్ సన్నిహితుడిపై ఫేక్ వార్తను ప్రసారం చేయడంపై ధ్వజమెత్తారు. నేషనల్ మీడియా ముసుగులో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఫేక్ న్యూస్‌పై న్యాయపరంగా ప్రొసీడ్ అవుతామని పేర్కొన్నారు. 5 కోట్ల మంది ఆదరాభిమానాలున్న వైఎస్సార్సీపీపై తప్పుడు కధనాలు బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీలో ఎలాంటి సంక్షోభం కానీ గందరగోళం కానీ లేవని స్పష్టం చేశారు. చంద్రబాబు కోసం రిపబ్లిక్ టీవీలో ఇలాంటి కథనాలు వండి వార్చారన్న అనుమానం కలుగుతోందని ఆయన ప్రకటించారు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంలోనూ రిపబ్లిక్ టీవీ ఫేక్ కథనాలు ప్రసారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలపై చంద్రబాబు ఆక్రోశం, అశోక్‌గజపతిరాజు మహిళా కార్యకర్తపై చేయి చేసుకోవడం వంటి అంశాలను వదిలి పెట్టి ఫేక్ కథనాలను వండి వారుస్తున్నారని మండిపడ్డారు. ఈ కథనాల వెనక ఎవరున్నారో తెలుగు ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. నిత్యం వివాదాల్లో ఉండే అర్నాబ్ జాతికి పట్టిన పీడ అని ధ్వజమెత్తారు. -
ప్రముఖ న్యూస్ యాంకర్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ వార్త సంస్థ రిపబ్లిక్ ఇండియా యాంకర్ వికాస్ శర్మ (35) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గురువారం రాత్రి మృతిచెందాడు. రిపబ్లిక్ టీవీలో వికాస్ రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ‘యే భారత్ కి బాత్ హై’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. అతడి మృతికి రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి సంతాపం వ్యక్తం చేశారు. వికాస్ మృతితో తన న్యూస్ నెట్‌వర్క్‌కు తీరని లోటు అని అర్నాబ్ గోస్వామి తెలిపారు. ఆయన ఎప్పుడూ సమాజం కోసం ఆలోచించే వ్యక్తి అని.. అలాంటి అరుదైన ప్రతిభ ఉన్న యాంకర్ ఇంత త్వరగా వెళ్లిపోతాడని ఊహించలేదని ఆవేదన చెందారు. కొన్ని రోజుల కిందట కరోనా బారినపడిన వికాస్ శర్మకు మూడు రోజుల కిందట తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు వికాస్‌ను నొయిడాలోని కైలాష్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. వికాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వికాస్ శర్మ మృతిపై బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ, జర్నలిస్ట్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
అర్నాబ్ గోస్వామిపై పరువు నష్టం దావా
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి రిపబ్లిక్ మీడియా అధినేత అర్నాబ్ గోస్వామి, అతని భార్య సమ్యబ్రతా రే గోస్వామిలపై ముంబై జోన్-9 డీసీపీ అభిషేక్ త్రిముఖే పరువు నష్టం దావా వేశారు. తనపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ మిస్టర్ అండ్ మిసెస్ గోస్వామిలపై క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశానని డీసీపీ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతితో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా దాఖలు చేశానని ఆయన తెలిపారు. కాగా, గతేడాది జూన్ 14న బాంద్రాలోని ఫ్లాట్‌లో సుశాంత్ అనుమాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
టీఆర్పీ స్కాం: అర్నబ్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ ఛీప్ అర్నబ్ గోస్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా రిపబ్లిక్ టీవీకి అనుకూలంగా రేటింగ్ మార్చేందుకు భారీ మెత్తంలో అర్నాబ్ గోస్వామి తనకు లంచం ఇచ్చారని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తా తెలిపారు. ముంబై పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. టీఆర్పీలో మార్పులు చేసేందుకు గానూ తనకు 12వేల అమెరికన్ డాలర్లుతోపాటు మూడేళ్లకు గానూ రూ.40 లక్షల మొత్తాన్ని అర్నాబ్ తనకు ముట్టజెప్పారని దాస్‌గుప్తా పేర్కొన్నారు. మూడేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని తాను తీసుకున్నానని ఆయన వెల్లడించారు. (టీఆర్పీ స్కాం: వైరలవుతోన్న వాట్సాప్ చాట్ ) ‘2004 నుంచే అర్ణబ్ నాకు తెలుసు. టైమ్స్ నౌలో మేమిద్దరం కలిసి పనిచేసేవాళ్లం. 2013లో నేను బార్క్ సీఈవోగా నియమితుడినయ్యాను. ఆ తర్వాత 2017లో అర్ణబ్ రిపబ్లిక్ టీవీని ప్రారంభించారు. చానల్ ప్రారంభించక ముందే అర్ణబ్ పలు ప్రణాళికల గురించి నాతో అనేకసార్లు చర్చించేవాడు. చానల్ రేటింగ్ పెంచడంలో సహాయం చేయాలని పరోక్షంగా మాట్లాడేవాడు. నాకు టీఆర్పీ గురించి అన్ని విషయాలు తెలుసన్న విషయం కూడా అర్ణబ్‌కు బాగా తెలుసు. ఇందుకు బదులుగా భవిష్యత్తులో నాకు సాయం చేస్తానని మాటిచ్చాడు. దీంతో రిపబ్లిక్ టీవీకి నంబర్1 రేటింగ్ వచ్చేలా నా టీంతో కలిసి పనిచేశాను. 2017 నుంచి 2019 వరకు ఇది కొనసాగేది. ఇందుకుగానూ అర్నబ్ గోస్వామి నుంచి రెండేళ్ల వ్యవధిలోనే 12000 డాలర్లు (8లక్షల 74 వేలు) అందుకున్నాను' అని దాస్‌గుప్తా తెలిపారు. టీఆర్పీ స్కాంకి సంబంధించి జనవరి 11న 3,600 పేజీల సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను ఇప్పటికే ముంబై పోలీసులు ఫైల్ చేశారు. ఈ కేసులో దాస్‌గుప్తాకు గోస్వామికి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, కాల్స్ వివరాలతోపాటు బార్క్ ఆడిట్ రిపోర్ట్‌ను కూడా పొందుపరిచారు. వీరిద్దరి మధ్యా 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్ మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
జూన్‌లో నూతన అధ్యక్షుడు
సాక్షి,న్యూఢిల్లీ: రాబోయే రెండు మూడు నెలల్లో ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేప«థ్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుని ఎన్నికను జూన్‌లో నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఫార్సుల మేరకు మేలో అ«ధ్యక్ష ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు వాయిదా వేశారు. శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా ప్రసంగంతో ప్రారంభమైంది. రైతు ఆందోళ నలపై కేంద్రం అత్యంత దారుణంగా, అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని సోనియా విమర్శించారు. రైతు ప్రతినిధులతో చర్చల్లో ప్రభుత్వ అహంకార ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెం ట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సోనియా దిశానిర్దేశం చేశారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలబ డాలని, దేశవ్యాప్తంగా కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాలు ఉధృతంగా చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. అంతేగాక కోవిడ్–19 విషయంలో టీకా అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను అభినందించడంతో పాటు, పంపిణీ ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రజలు వాక్సినేషన్‌కు ముందుకు రావాలని తీర్మానం చేసింది. అలాగే, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ టీకా పంపిణీకి సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలను బహిర్గత పరచాలని కోరింది. దేశ రక్షణకు సంబం ధించిన వ్యాఖ్యలతో బహిర్గతమైన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి వాట్సాప్ చాట్ వ్యవహారంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ మరో తీర్మానం చేసింది. గహ్లోత్ సీరియస్ సీడబ్ల్యూసీ సమావేశంలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలపై రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని సమాచారం. సంస్థాగత ఎన్నికల నిర్వహణలో పార్టీ నాయకత్వంపై నమ్మకం లేదా అని గహ్లోత్ ప్రశ్నించారు. గతేడాది ఆగస్టు 24న జరిగిన సమావేశంలోనూ ఆజాద్, శర్మ తదితర నాయకులు పార్టీ అధినేత్రిని ఉద్దేశించి రాసిన ఒక లేఖలో లేవనెత్తిన అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ లేఖ బహిర్గతం అయినప్పటినుంచి పార్టీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కొనసాగుతున్న విష యం తెలిసిందే.ఆ లేఖపై సంతకం చేసిన నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యారని గత సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆరోపణలపై ఆజాద్, కపిల్ సిబల్ అభ్యంత రం వ్యక్తం చేసిన తరువాత, కాంగ్రెస్ అధిష్టా నం డ్యామేజ్ కంట్రోల్ మోడ్‌లోకి వెళ్లింది. -
టీఆర్పీ స్కాం: వైరలవుతోన్న వాట్సాప్ చాట్
ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా, రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు బయటకు లీకయ్యాయి. దాదాపు 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్ మెసేజ్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇవి తిరుగులేని ఆధారాలు అంటూ పలువురు స్పందిస్తున్నారు. అయితే కొన్ని చాట్లలో టీఆర్పీకి సంబంధించి అవసరమైతే పార్థోదాస్‌కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సాయం చేస్తానంటూ అర్నబ్ గోస్వామి హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరో చాట్‌లో మంత్రులంతా మనతోనే ఉన్నారు.. అని చెబుతున్నట్లు ఉంది. కండీవలి పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైనట్లు కనిపిస్తున్న ఈపీడీఎఫ్ పేజీల్లో ప్రతి పేజీకి పలువురి సంతకాలు ఉండటం గమనార్హం. (టీఆర్పీ కేసు: అర్నబ్ గోస్వామికి ఊరట) Mumbai Police releases 500 pages WhatsApp chat between Arnab Goswami and Partho Das Gupta ( Ex CEO of BARC) pic.twitter.com/C3wnxjRi0N — Abhijeet Dipke (@abhijeet_dipke) January 15, 2021 -
టీఆర్పీ కేసు: అర్నబ్ గోస్వామికి ఊరట
ముంబై : టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ఆంగ్ల వార్తాచానెనల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి, ఇతర ఉద్యోగులపై జనవరి 29 వరకు ఎలాంటి కఠిన చర్యలు చేపట్టబోమని ముంబై పోలీసులు శుక్రవారం బొంబాయి హైకోర్టుకు తెలిపారు. కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారు. రిపబ్లిక్ టీవీ యాజమాన్య సంస్థ అయిన ఏఆర్జీ ఔట్లియర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు, హంస రీసెర్చ్ గ్రూప్ ఉద్యోగులకు గతంలో కల్పించిన తాత్కాలిక ఊరటను కూడా జనవరి 29 వరకు కోర్టు పొడగించింది. ఆ ఉద్యోగులను వారానికి రెండు సార్లకు మించి విచారణకు పిలవకూడదని కోర్టు గతంలో ఊరట కల్పించిన విషయం తెలిసిందే. ఏఆర్జీ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. టీఆర్పీ కోసం అర్నబ్ గోస్వామి లంచం ఇచ్చారని ముంబై పోలీసులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని సాల్వే వాదించారు. మరోవైపు, ఈ టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నగదు అక్రమ చలామణీ కేసును నమోదు చేసి, విచారణ చేస్తోందని కోర్టుకు తెలిపారు. ఈడీ నమోదు చేసిన కేసు స్టేటస్ రిపోర్ట్‌ను కూడా కోర్టు తెప్పించుకోవాలని కోరారు. ఈడీ నివేదికకు, ముంబై పోలీసుల నివేదికకు మధ్య తేడాలున్నట్లయితే.. ఏఆర్‌జీపై దురుద్దేశంతో కేసు పెట్టినట్లు అర్థమవుతుందని వివరించారు. నివేదిక సీల్డ్ కవర్లో అందించేందుకు ఈడీ సిద్ధంగా ఉందని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే, ఈ వాదనను ముంబై పోలీసుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఖండించారు. ఈ కేసులో ఆర్థిక అక్రమాలపై వాదించే ఈడీకి భాగస్వామ్యం కల్పించడం సరికాదన్నారు. ఇప్పటివకు ఈడీ ఈ కేసులో భాగస్వామిగా లేదని వాదించారు. కేసులో భాగస్వామి కాకుండానే, స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించాలని ఈడీ ఎందకంత ఉత్సాహం చూపుతోందని ప్రశ్నించారు. -
‘ఇలా బెదిరించే సీఎంని ఎక్కడ చూడలేదు’
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే ఏడాది పాలన విఫలమైందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. ఠాక్రే ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేసుల పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించారని కోర్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయని. ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా ఘాటుగా స్పందించిందని ఆయన గుర్తు చేశారు. ‘మేము అర్నాబ్ గోస్వామి, కంగనా రనౌత్‌కు అనుకూలం కాదు. కానీ ప్రభుత్వం వారితో వ్యవహరించిన తీరు మాత్రం దారుణం. ఠాక్రే బెదిరింపులకు దిగుతున్నాడు. ఇంత బెదిరించే ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ఆయన మాటలు ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చుతున్నాయి’ అని ఫడ్నవిస్ విమర్శించారు.కాగా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఆరోపణలతో చేస్తుందని శుక్రవారం ప్రచురించిన శివసేన మౌత్ పీస్ సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం ఠాక్రే తెలిపారు. "మీరు కుటుంబాలు, పిల్లలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తే, మీకు కుటుంబాలు, పిల్లలు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలి. మీ వైఖరిని ఎలా అణిచివేయాలో మాకు తెలుసు" అని ముఖ్యమంత్రి అన్నారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ, ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడంపై వచ్చిన విబేధాల కారణంగా ఈ కూటమి విడిపోయింది. 56 సీట్లు గెలుచుకున్న శివసేన ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
సుప్రీంపై వ్యంగ్యాస్త్రాలు.. కోర్టుకు కమెడియన్
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చేసి సుప్రీం కోర్టుపై పోలిటికల్ కామెంటర్, ప్రముఖ ముంబై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశ సర్వోన్నత న్నాయస్థానంపై వ్యంగ్యాస్త్రాలు సంధించి చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ కమ్రా తన వ్యాఖ్యాలను వెనకకు తీసుకోబోనని, క్షమాపణలు చేప్పేది లేదంటూ ట్విటర్ వేదికగా స్పష్టం చేశాడు. శుక్రవారం కుమ్రా ట్వీట్ చేస్తూ ‘న్యాయవాదులు లేరు, క్షమాపణలు లేవు, జరిమాన లేదు’ అని చేతులు జోడించి ఉన్న ఎమోజీలను జత చేశాడు. (చదవండి: అర్నాబ్ గోస్వామికి ఊరట) దీంతో అత్యున్నత న్యాయస్థానంపై అతడు చేసిన వ్యాఖ్యలకు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది న్యాయవాదులు కమ్రాను కోర్టులో హాజరుపరచడానికి అతడిపై కోర్టు ధిక్కారణ కేసుకు అనుమితివ్వాల్సిందిగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోరారు. ఆయన వారికి అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసి కమ్రా తన హద్దులు దాటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సుప్రీంకోర్టుపై దాడి చేయడం అన్యాయమని, ధైర్యమైన శిక్షకు దారి తీస్తుందని ప్రజలు అర్థం చేసుకోవలసిన సమయం ఇది’ అంటూ కమ్రాను కోర్టుకు తీసుకెళ్లడానికి అనుమతిస్తూ ఈ లేఖను అందించారు. (చదవండి: కమ్రా ట్వీట్లు కోర్టు ధిక్కారమే: ఏజీ) -
అర్నాబ్‌కు బెయిల్
న్యూఢిల్లీ: వివాదాస్పద టెలివిజన్ వ్యాఖ్యాత అర్నాబ్ గోస్వామికి ఎట్టకేలకు బెయిల్ దక్కింది. 2018 నాటి ఓ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం, బెయిల్ దరఖాస్తును బాంబే హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అర్నాబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన బెంచ్ బుధవారం ఈ అంశంపై విచారణ జరిపి అర్నాబ్‌తోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నితీశ్ సర్దా, ప్రవీణ్ రాజేశ్ సింగ్‌లకు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఇంటెరిమ్ బెయిల్ మంజూరు చేసింది. తనపై మోసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, కేసు విచారణను నిలిపివేయాలన్న అర్నాబ్ వినతులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అర్నాబ్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ‘‘బెయిళ్లు ఇవ్వకుండా..వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు’’ అని వ్యాఖ్యానించింది. -
అర్నాబ్ గోస్వామికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. అర్నాబ్‌తో సహా మరో ఇద్దరికి కూడా సుప్రీం కోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. (చదవండి : అర్నబ్ కేసు: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు) కాగా, ఈ కేసులో గత బుధవారం అరెస్టై జైలులో ఉన్న అర్నబ్‌కు నవంబర్ 18 వరకు రాయిగఢ్ జిల్లా కోర్టు జ్యుడిషియల్ కస్టడి విధించింది. ఇక మధ్యంతర బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో అర్నాబ్ సుప్రీం కోర్టు తపులు తట్టారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరణనూ ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసును మళ్లీ తవ్వారనేది అర్నాబ్ గోస్వామి వాదన. -
అర్నబ్ కేసు: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి సుప్రీం తలుపు తట్టారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరణనూ ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అర్నబ్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసు దర్యాప్తు చట్ట విరుద్ధంగా సాగుతోందని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల బెంచ్ స్పందిస్తూ.. ‘టీవీ చానెల్స్ అరుపులను ప్రభుత్వాలు పట్టించుకుంటే ఎలా? రిపబ్లిక్ టీవీలో అతని అరుపులపై మీ ఎన్నికల భవిష్యత్ ఆధారపడిందా? మేం ఆ టీవీ చూడం.. కానీ, మహారాష్ట్ర సర్కార్ చేసింది సరైనదిగా అనిపించడం లేదు. వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి దూస్తే మేమున్నామని గుర్తుంచుకోండి’అని సుప్రీం బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, సదరు జర్నలిస్టుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మాత్రమే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అర్నబ్ తరపు న్యాయవాది సాల్వే మాట్లాడుతూ.. తమ కేసు ఎఫ్ఐఆర్ దశ దాటిపోయిందని, దర్వాప్తు జరిగిన తర్వాతే మే, 2018లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. ఇక ఈ కేసు పునర్ దర్వాప్తు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారం దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, ఈ కేసులో గత బుధవారం అరెస్టై జైలులో ఉన్న అర్నబ్‌కు నవంబర్ 18 వరకు రాయిగఢ్ జిల్లా కోర్టు జ్యుడిషియల్ కస్టడి విధించింది. ఇక మధ్యంతర బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసును మళ్లీ తవ్వారనేది అర్నాబ్ గోస్వామి వాదన. -
'రిపబ్లిక్ టీవీ'కి మరో షాక్
ముంబై : టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ డిస్స్ర్టిబ్యూషన్ హెడ్ ఘన్‌శ్యామ్ సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు తాజాగా సింగ్‌ను 12వ నిందితుడిగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం ఆయన్ను కోర్టులో హాజరుపరుస్తారని పోలీసు అధికారులు తెలిపారు. కాగా రిపబ్లిక్ టీవీ సెట్స్‌లోపని చేసిన వేతనాలు చెల్లించనందుకు 2018లో ఆర్కిటెక్ట్ అన్వే నాయక్ మరియు అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి అర్నాబ్ గోస్వామి సహా మరో ఇద్దరిని నవంబర్ 4న ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రోజుల వ్యవధిలోనే రిపబ్లిక్ టీవీ డిస్స్ర్టిబ్యూషన్ హెడ్‌ను అరెస్ట్ చేశారు. ముంబైలో టీఆర్పీల నిర్వహణను హంస అనే ఎజెన్సీ చూస్తోంది. అయితే ఆ సంస్థ మాజీ ఉద్యోగుల సాయంతో, వినియోగదారులకు డబ్బులు ఇచ్చి, తమ చానళ్లనే చూడాలని, చూడకపోయినా తమ చానెళ్లనే ఆన్‌లో ఉంచాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా ఎంపిక చేసిన చానళ్లను నిర్ధిష్ట సమయంలో చూసినందుకు నెలవారీ కొంత డబ్బు ఇస్తామని చెప్పడం వల్ల ఒప్పుకున్నానని ఒక వినియోగదారుడు చెప్పారు. ఇందులో రిపబ్లిక్ చానల్‌తో పాటు ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా వంటి రెండు మరాఠీ చానెళ్లు కూడా ఉన్నాయి. (అర్నాబ్‌కు భద్రత కల్పించండి : గవర్నర్ ) టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు ఆరోపించారు. మరో వైపు టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు చానళ్లు అక్రమ మార్గాలను ఎంచుకున్నా యనే ఆరోపణల నేపథ్యంలో టెలివిజన్ చానళ్ల వారపు రేటింగ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ప్రకటించింన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులను సమీక్షించేందుకు 12 వారాలు పట్టొచ్చని, అప్పటిదాకా నిషేధం ఉంటుందని బార్క్ తెలిపింది. టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బార్క్ రేటింగ్‌ల ఆధారంగానే టీవీ ఛానళ్లకు ప్రకటనలు అందుతాయి. టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ సీఎఫ్‌వో సుందరంను విచారించారు. అయితే ముంబై పోలీసులు చేస్తోన్న ఆరోపణల్ని రిపబ్లిక్ టీవీ యాజమాన్యం ఖండించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణంపై పోలీసుల దర్యాప్తును ప్రశ్నించినందుకే తమ ఛానల్‌పై కేసులు పెట్టారని ఆరోపించారు. (అర్నాబ్‌కు బెయిల్ నో ) -
అర్నాబ్‌కు భద్రత కల్పించండి : గవర్నర్
సాక్షి, ముంబై : ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి పోలీసులు పలు ఆరోపణలు చేశారు. తనపై జైలు అధికారులు దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను సైతం కలవడానికి అనుమతి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యుల ద్వారా మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్‌కోశ్యారీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌పై రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముక్‌కు ఫోన్ చేశారు. వెంటనే అర్నాబ్‌కు తగిన భద్రతను కల్పించాలని కోరారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో అర్నాబ్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం కేసు ఉన్న దశలో తాము మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అయితే తమను సంప్రదించే ముందు అలీబాగ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా న్యాయస్థానం అర్నాబ్‌కు సూచించింది. దీనిపై నాలుగు రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. రిపబ్లిక్ టీవీ సెట్స్‌లోపని చేసిన వేతనాలు చెల్లించనందుకు 2018లో ఆర్కిటెక్ట్ అన్వే నాయక్ మరియు అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి గోస్వామి మరో ఇద్దరిని నవంబర్ 4న ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురినీ నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. గోస్వామి అరెస్టును ఖండిస్తూ పలువురు కేంద్ర మంత్రులు అధికార మహా వికాస్ఆఘాడీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. -
అర్నబ్ గోస్వామికి ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై : ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి మరో ఎదురురెబ్బ తగిలింది. 2018 నాటి కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అర్నబ్ గోస్వామి బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేని స్పష్టం చేసింది. అలాగే హైకోర్టును ఆశ్రయించేముందుగా అలీబాగ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే ఇప్పటికే అలీబాగ్ సెషన్స్ కోర్టులో అర్నాబ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సంబంధిత పిటిషనపై నాలుగు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. (అర్నాబ్ గోస్వామి అరెస్ట్ అన్యాయమేనా!?) ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తన భర్త అరెస్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అతని భార్య అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అర్నాబ్‌కు ముంబై పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. -
అర్నాబ్ గోస్వామి అరెస్ట్ అన్యాయమేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ స్టార్ యాంకర్, ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల ఆయన అభిమానులతోపాటు మరి కొంత మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ‘ఇది పత్రికా స్వేచ్ఛ పై జరిగిన దాడి, భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు’ అంటూ కొందరు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులను, ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌లను విమర్శించినందుకు గోస్వామిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం అన్యాయమేనా? అది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం అవుతుందా? బాలీవుడు వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ తార రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలంటూ కొన్ని నెలలపాటు అర్నాబ్ గోస్వామి తన టీవీ ఛానెల్ ద్వారా గోల చేసిన విషయం తెల్సిందే. రియా చక్రవర్తిని అనుమానితురాలిగా ముందుగా అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేవంటూ వదిలేశారు. తన ఆత్మహత్యకు ఫలానా, ఫలానా వారు బాధ్యులంటూ సుశాంత్ ఎలాంటి ఆత్మహత్య లేఖలో పేర్కొనలేదు. అయినప్పటికీ ఆమె కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని, రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి, కేసు పెడితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయంటూ గోస్వామి పదే పదే డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తిని 2018 నాటి ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేయడం తప్పెలా అవుతుంది ? పైగా ఆ డిజైనర్ తనకు అర్నాబ్ గోస్వామి, ఆయన ఇద్దరు మిత్రులు ఇవ్వాల్సిన దాదాపు ఐదు కోట్ల రూపాయలను చెల్లించక పోవడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, సూసైడ్ నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆ డిజైనర్ తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రియా అరెస్ట్‌ను పదే పదే డిమాండ్ చేసిన గోస్వామికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు కూడా ఉన్నప్పుడు అరెస్ట్ చేయకూడదా ? అది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనా? సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్, విరసం కవి వరవర రావు, జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్‌తోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో అనేక మంది జర్నలిస్టులను అనేక కేసుల్లో అరెస్ట్ చేసి నిర్బంధించగా, కొన్నేళ్లుగా వారు బెయిల్ దొరక్క జైళ్లలో అలమటిస్తున్నారు. నేడు గోస్వామి అరెస్ట్‌ను ఖండిస్తున్నావారు వారి నిర్బంధాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నదే ఇక్కడ ప్రశ్న. క్వారంటైన్లో ఉన్న గోస్వామి తన మిత్రుడి సెల్‌ఫోన్ ద్వారా తన వారందరితో మంతనాలు జరుపుతున్నారనే ఫిర్యాదుపై పోలీసులు ఆ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకొని క్వారంటైన్ నుంచి ఆదివారం తెల్లవారు జామున తలోజి జైలుకు పంపించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాను తన న్యాయవాదులతో ఫోన్లో కూడా సంప్రతించేందుకు వీల్లేకుండా తనను అన్యాయంగా జైలుకు తరలించారంటూ గోస్వామి కూడా మీడియాతో మొరపెట్టుకున్నారు. ఒక్క గోస్వామికే కాదు, ఆయన స్థానంలో ఓ సామాన్యుడు ఉన్నా న్యాయవాదులను సంప్రతించేందుకు ఫోన్ అనుమతించడం కూడా రాజ్యాంగం కల్పిస్తున్న హక్కే. సెల్‌ఫోన్‌ను అనుమతించకపోయినా జైల్లో ఉండే ఫోన్లను అనుమతించాల్సిందేగదా!? పారిపోయే అవకాశం లేనందునా గోస్వామికైనా ఈ కేసులో బెయిలివ్వాల్సిందే. ‘బెయిల్ నాట్ జెయిల్’ అన్న అర్నాబ్ నినాదంలో నిజం లేకపోలేదు. -
సుప్రీంకోర్టుకు అర్నాబ్ భార్య సమ్యాబ్రతా
ముంబై: ‘రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి ప్రాణానికి ముప్పు ఉంది. కస్టడీ సమయంలో పోలీసులు విచక్షణ మరిచి ప్రవర్తించారు. అర్నబ్ అరెస్టయి ఇప్పటికే 4 రోజుల జ్యూడీషియల్ కస్టడీలో గడిపారు. జైలులో ఉన్న సమయంలో జైలర్ తనపై దాడి చేశారని, తన ప్రాణానికి ముప్పు ఉందని అర్నబ్ పదేపదే చెప్తున్నాడు. ఈ విషయంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని’ అర్నాబ్ భార్య సమ్యాబ్రతా రే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 'దశాబ్ధాలుగా మీడియా రంగంలో ఖ్యాతి గడించిన వ్యక్తిపై అసంబద్దమైన ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు దాడికి దిగడం, వేధించడం చేశారు. రాజకీయంగా ప్రేరేపించబడిన ఓ చర్యకు రాష్ట్ర యంత్రాంగం వత్తాసు పలుకుతోంది. ప్రజాస్వామ్యం మూలస్తంభాలను సమాధి చేయాలని చూస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు రాష్ట్ర యంత్రాంగం మద్దతుగా ఉండటం సరికాదు. మహారాష్ట్రలో శాంతి భద్రతలను కాపాడటానికి ఉద్దేశించిన సంస్థలే హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. ప్రాథమిక హక్కులను హరిస్తున్నాయి. (అర్నబ్ కోసం జైల్‌భరో చేయట్లేదు కదా?) సంస్థాగతంగా ప్రజాస్వామ్యం మునుపెన్నడు లేని విధంగా ప్రమాదంలో ఉంది. నా భర్త అక్రమంగా అరెస్ట్ చేసి శారీరకంగా హింసించారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి స్పష్టంగా తీసుకెళ్లినప్పటికీ, ఎటువంటి జోక్యం చేసుకోలేదు. అర్నాబ్ తన ప్రాణానికి ముప్పు ఉందని, పోలీసుల అదుపులో తాను ఎదుర్కొంటున్న దారుణాలను బహిరంగంగా వెల్లడించారు. నా భర్తకు ఏదైనా హాని జరిగితే పోలీస్ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. జవాబుదారీతనాన్ని కోరిన ఓ జర్నలిస్టును శిక్షించడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలపై సుప్రీం కోర్టు దృష్టి సారించాలని నేను వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను' అంటూ సమ్యాబ్రాతా రే సుప్రీం కోర్టును కోరారు. -
అర్నబ్ కోసం జైల్‌భరో చేయట్లేదు కదా?
సాక్షి, సెంట్రల్‌డెస్క్: భారతీయ జనతా పార్టీ నాయకులు అన్వయ్ కుటుంబంపై అభాండాలు మోపి, అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని శివసేన ఆరోపించింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్‌చీప్ అర్నబ్ అరెస్టు విషయంలో 1975లో జరిగిన ఎమర్జెన్సీ సమయం, మాజీ ప్రధాని ఇందిరాగాంధీలతో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ను పోలుస్తున్నారని, అది తమకు గౌరవంగా అనుకుంటున్నట్లు సామ్నా సంపాదకీయంలో శివసేన పేర్కొంది. ట్రంప్.. బీజేపీ అమెరికా ప్రస్తుత అధ్యక్షుడిలా నకిలీ వార్తలను ప్రచారం చేయడం, మాటిమాటికీ కోర్టులో కేసులు వేయడం బీజేపీకే చెల్లుబాటయిందని సామ్నా సంపాదకీయం ఎద్దేవా చేసింది. ఓటమి అంచున ఉన్న ట్రంప్‌లాగే బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని విమర్శించింది. అమెరికా ప్రతిష్టకు, చట్టాలకు వ్యతిరేకంగా ట్రంప్ చర్యల్లాగే ఇక్కడ కూడా ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు అర్నబ్‌ను అరెస్టు చేస్తే బీజేపీ ఆందోళనలు చేస్తోందని మండిపడింది. అరెస్టు రాజకీయ కక్షతో కూడుకన్నదని వ్యాఖ్యానించడం, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడటం ప్రజలకు గందరగోళానికి గురిచేస్తోందని శివసేన వ్యాఖ్యానించింది. 2002లో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, (ప్రస్తుత కేంద్ర హోంమంత్రి) అమిత్ షాతో సహా బీజేపీ నాయకులను గుజరాత్ అల్లర్లలో అనేక కేసులలో విచారించారని గుర్తుచేశారు. వారిని చట్టం ప్రకారం నిర్దోషులుగా ప్రకటించారని, కాని బీజేపీపై మోపిన కేసులు రాజకీయ కక్షలో భాగమని ఎందుకు వాదించలేదని శివసేన విమర్శించింది. ఉద్ధవ్ ఫొటోతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటోలు పెట్టి, ప్రస్తుత పరిస్థితిని బీజేపీ పోల్చి చూడటం ఆ పార్టీ పిల్లతనం గుర్తుచేస్తోందని, అయినా శివసేన దాన్ని గౌరవంగానే స్వీకరిస్తోందని సంపాదకీయంలో స్పష్టంచేసింది. ఇందిరా ఐరన్ లేడీ అని, పాకిస్తాన్‌ను విచ్ఛినం చేసి, భారతదేశం విభజనపై ప్రతీకారం తీర్చుకున్నారని సంపాదకీయం కొనియాడింది. ఎన్సీపీయే కాకుండా మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగమని మరోసారి గుర్తుచేసింది. ఇక అర్నబ్ విడుదలయ్యే వరకు బీజేపీ నాయకులు నల్లబ్యాండ్డీలు ధరించాలని ప్రకటించడంపై కూడా పత్రిక విమర్శలు గుప్పించింది. బ్యాడ్జీలతో సరిపెట్టారని, జైల్ భరో, నిరసన దీక్షలు లాంటిపై చేపట్టలేదని ఎద్దేవా చేసింది. అర్నబ్‌కు దొరకని బెయిల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి నిరాకరించింది. తాత్కాలకి బెయిల్ వెంటనే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే పిటిషనర్ బెయిల్ కోసం సెషన్ కోర్టుకు వెళ్లవచ్చని సూచించింది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, అతని తల్లి ఆత్మహత్యకు సంబంధించి నవంబర్ 4 న మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అన్వయ్‌కి బకాయిలు చెల్లించలేదని ఆరోపణలపై అరెస్టు జరిగింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామి మరో ఇద్దరు నిందితులు – ఫిరోజ్ షేక్, నితీష్ సర్దా – మధ్యంతర బెయిల్ కోరుతూ వారి ‘అక్రమ అరెస్టు‘ ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎస్ ఎస్ షిండే, ఎం ఎస్ కార్నికల డివిజన్ బెంచ్ శనివారం విచారించింది. వెంటనే దర్యాప్తు నిలిపివేయాలని, ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. శనివారం మధ్యంతర బెయిల్‌పై మాత్రమే వాదనలు విన్న కోర్టు, దీపావళి సెలవుల తర్వాత డిసెంబర్ 10న ఎఫ్ఐఆర్ను రద్దు చేయడంపై దాఖలైన పిటిషన్లను విచారించనున్నట్లు తెలిపింది. కాగా, అర్నబ్, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి మేజిస్ట్రేట్ నిరాకరించడం పట్ల నవంబర్ 9న విచారణ జరగనుంది. కాగా, అర్నబ్ గోస్వామి తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే తాత్కాలిక బెయిల్ ఉత్తర్వులు జారీచేయాలని అభ్యర్థించగా నిరాకరించింది. హైకోర్టు ఉత్తర్వులు పిటిషనర్ దిగువ కోర్టుకు వెళ్లకుండా నిరోధించవని, బెయిల్ కోసం సెషన్ కోర్టును అశ్రయించవచ్చని సూచించింది. కోర్టు 4 రోజుల్లో మీ పిటిషన్‌పై విచారణ జరపవచ్చని పేర్కొంది. -
అర్నబ్‌కు దక్కని ఊరట
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామికి న్యాయస్థానం నుంచి ఊరట దక్కలేదు. 2018 నాటి కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అయితే, ఈ విచారణ అసంపూర్తిగా ముగియడంలో అర్నబ్‌కు బెయిల్ లభించలేదు. శనివారం విచారణ కొనసాగిస్తామని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ను కించపర్చేలా టీవీలో చర్చ నిర్వహించారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు ప్రారంభిస్తామంటూ అర్నబ్‌కి మహారాష్ట్ర శాసనసభ గతంలో నోటీసిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకెక్కారు. నోటీసుపై కోర్టుకు వెళ్లడం చెల్లదని, జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ అసెంబ్లీ సెక్రెటరీ గతంలో అర్నబ్‌కి లేఖ రాశారు. విచారణ సందర్భంగా కోర్టు.. ‘పిటిషనర్‌ను బెదిరించేలా లేఖ ఎందుకు రాశారు? రెండు వారాల్లోగా వివరణ ఇవ్వండి’ అని అసెంబ్లీ సెక్రెటరీకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. -
అర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట
ఢిల్లీ : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి శుక్రవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 13న మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి అర్నబ్‌కు లేఖ రాసి బెదిరింపులకు పాల్పడ్డారని గోస్వామి తరపు న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంలో ఆరోపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి రాసిన లేఖను సుప్రీం కోర్టులో సమర్పించారు. కాగా అర్నబ్ గోస్వామికి లేఖ రాయడం తప్పుబట్టిన సుప్రీం మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి ధిక్కార నోటీసులు జారీ చేసింది. రెండు వారాల తరువాత జరగనున్న విచారణ సందర్భంగా మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిని హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం కోరింది. అప్పటి వరకు అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. (చదవండి : అర్నబ్‌కు దొరకని బెయిల్) ఈ విషయంలో సహకరించడానికి సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్‌ను అమికస్‌గా నిమమించినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అర్నబ్ గోస్వామి తనను అక్రమంగా అరెస్ట్ చేశారన్న కారణంతో కోర్టును సంప్రదించనందుకే లేఖను రాసి బెదిరించడం ద్వారా న్యాయ పరిపాలనలో తీవ్రంగా జోక్యం చేసుకుందని సుప్రీంకోర్టు ఆరోపించింది. 'అసెంబ్లీ కార్యదర్శి రాసిన లేఖలో ఉద్దేశం ప్రకారమే పిటిషనర్‌ను బెదిరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం కోర్టును ఎవరైనా సంప్రదిచ్చవచ్చు. అర్నబ్ విషయంలో మహారాష్ట్ర అసెంబ్లీ దీనిని ఇది ఒక ప్రాథమిక హక్కుగా భావించాలని' సుప్రీంకోర్టు తెలిపింది. (చదవండి : అర్నాబ్ న్యాయ పోరాటం) కాగా ఈ లేఖ విషయంలో సహకరించాలని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌కు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదిని ఆత్మహత్యకు అర్నబ్ కారణమంటూ వచ్చిన 2018 నాటి ఆరోపణలపై బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అర్నబ్‌ను అలీబాగ్ నగర్ పరిషత్ స్కూల్లో కోవిడ్ సెంటర్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు. -
అర్నబ్‌కు దొరకని బెయిల్
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను గురువారం బాంబే హైకోర్టు తిరస్కరించింది. అరెస్టు అక్రమమనీ, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలనీ, ముంబై పోలీసుల దర్యాప్తుపై స్టే విధించాలని బెయిల్ పిటిషన్లో అర్నబ్ కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధింపునకు పాల్పడుతోందని అర్నబ్ తరఫు లాయర్ హరీశ్ సాల్వే ఆరోపించారు. వాదనలు విన్న బాంబే హైకోర్టు.. వాదనలు వినిపించాలని ప్రతివాదులుగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం, అన్వయ్ నాయక్ భార్య అక్షతను కోరింది. శుక్రవారం వాదనలు వింటామని తెలిపింది. అర్నబ్ అరెస్టు చట్ట విరుద్ధం అర్నబ్‌ను అరెస్టు చేయడం ప్రాథమికంగా చట్ట విరుద్ధమని మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదిని ఆత్మహత్యకు అర్నబ్ కారణమంటూ వచ్చిన 2018 నాటి ఆరోపణలపై బుధవారం ముంబై పోలీసులు అర్నబ్‌ను అరెస్టుచేశారు. అర్నబ్‌తోపాటు అరెస్టు చేసిన ఫిరోజ్ షేక్, నితేశ్ సర్దాలను పోలీసులు రాయగఢ్ జిల్లా అలీబాగ్ కోర్టులో బుధవారం రాత్రి హాజరు పరిచారు. ఈ కేసులో అర్నబ్‌ను 18వరకు అలీబాగ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ సునయన.. మృతులకు, నిందితులకు మధ్య ఉన్న సంబంధాన్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్నారు. అర్నబ్‌ను పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు రుజువులు లేవన్నారు. తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు అలీబాగ్ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం అర్నబ్‌ను అలీబాగ్ నగర్ పరిషత్ స్కూల్లో కోవిడ్ సెంటర్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు. -
అర్నాబ్ జైలు జీవితంలో మొదటిరోజు అలా..
ముంబై : ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి మొదటిరోజు అలీభాగ్‌లోని ఓ పాఠశాలలో గడిపారు. ప్రస్తుతం దీన్ని తాత్కాలిక జైలుగా ఉపయోగిస్తున్నారు. ప్రధాన జైలుకు పంపేముందు మందు జాగ్రత్త చర్యగా 14 రోజుల పాటు నిందితులను జైలు అధికారులు క్వారంటైన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అర్నాబ్‌ను తాత్కాలిక జైళ్లో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. అలీభాగ్ జైలులో మొత్తం సామర్థ్యం 82 మందికి కాగా, ప్రస్తుతం అక్కడ 99మంది ఖైదీలున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైళ్లలో వైరస్ తీవ్రత పెరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 23 నగరాల్లో 30కి పైగా తాత్కాలిక జైళ్లను ఏర్పాటుచేశారు. (మహిళా కానిస్టేబుల్‌పై దాడి..అర్నాబ్‌పై మరో కేసు! ) ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, హాస్టళ్లు , కాలేజీలలో తాత్కాలికంగా ఖైధీలను ఉంచుతున్నారు. దీని వల్ల జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా సహాయపడుతుందని జైలు అధికారి ఒకరు తెలిపారు. 14 రోజులపాటు క్వారంటైన్ అనంతరం వైద్య పరీక్షల తర్వాత సాధారణ జైళ్లకు తరలిస్తామని పేర్కొన్నారు. చుట్టూ పోలీసుల నడుమ తగిన భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ఏడాది మే నెలలో అలీభాగ్ జైళ్లో 158 మంది ఖైధీలకు కరోనా నిర్ధారణ కాగా, ఆర్థర్ జైలులో 28 మంది ఖైధీలకు కరోనా సోకింది. (అర్నాబ్ వివాదం :‘సామ్నా’ సంచలన వ్యాఖ్యలు) -
అర్నాబ్ వివాదం : ‘సామ్నా’ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అరెస్టు వ్యవహారం మరింత ముదురుతోంది. శివసేన, బీజేపీ మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. అర్నాబ్ అరెస్టును "బ్లాక్ డే" గా అభివర్ణించిన బీజేపీ నేతలపై శివసేన మండిపడింది. బీజేపీ మహారాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తున్ననేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో కౌంటర్ ఎటాక్ చేసింది. ముఖ్యంగా "పత్రికా స్వేచ్ఛపై దాడి, "అత్యవసర పరిస్థితులు" అంటున్న పలువురు కేంద్రమంత్రుల వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేసింది. ఈ సందర్బంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను, హత్యలను ప్రస్తావించింది. (మంత్రగత్తె వేట : అర్నాబ్ న్యాయ పోరాటం) మహారాష్ట్ర ప్రభుత్వంలో మీడియాపై దాడి అనే ప్రశ్నే లేదని, ఇలా అరోపిస్తున్నా వారే ప్రజాస్వామ్యం మొదటి స్థంభమైన శాసనసభను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండి పడింది. గోస్వామిని రక్షించడానికే గత రాష్ట్ర ప్రభుత్వం నాయక్ ఆత్మహత్య కేసును కప్పిపుచ్చిందని సామ్నా సంపాదకీయంలో ఆరోపించింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు గుజరాత్లో ఒక జర్నలిస్టును అరెస్టు చేశారు, యూపీలో జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక అమాయక వ్యక్తి తన వృద్ధాప్య తల్లితో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య న్యాయం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు బాధిత నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయాలని సూచించింది. అలాగే ప్రధానమంత్రితో సహా అందరూ చట్టం ముందు సమానమేనని సంపాదకీయం వ్యాఖ్యానించింది -
అర్నాబ్ న్యాయ పోరాటం
సాక్షి, ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసుకు సంబంధించి తన 'అక్రమ అరెస్టు' ను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర అలీబాగ్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేశారని, తన ఇంట్లోకి చొరబడి మరీ పోలీసులు తనపైనా,తన కుటుంబంపైనా దాడిచేశారని అర్నాబ్ పిటిషన్లో ఆరోపించారు. తనను అక్రమంగా, చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారన్నారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, తన కుమారుడిపై దాడిచేశారన్నారు. తన ఛానెల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో ఇది మరో ప్రయత్నమని విమర్శించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను వేటాడుతున్నారని(విచ్–హంట్ చేస్తున్నారని) తన పిటిషన్లో అర్నాబ్ పేర్కొన్నారు. జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను విచారించనుంది. కాగా ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోస్వామిని బుధవారం అరెస్టు చేసిన పోలీసులు రాయ్‌గడ్ జిల్లాలోని అలీబాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. తరువాత ఆయనను అలీబాగ్‌లోని మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరచగా, నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. (అర్నబ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు) -
అర్నబ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి అప్పడే బకాయిలు చెల్లిస్తే ఈ రోజు తన భర్త బతికి ఉండేవారని అన్వయ్ నాయిక్ (53) భార్య అక్షత వ్యాఖ్యానించారు. అర్నబ్ గోస్వామిని అలీబాగ్ పోలీసులు అరెస్టు చేయడంతో తన భర్త, అత్తకు న్యాయం జరిగే దిశగా అడుగులు పడ్డాయన్నారు. బుధవారం అర్నబ్ అరెస్టు అనంతరం ఆమెతోపాటు ఆమె కూతురు ఆద్న్యా నాయిక్ సైతం విలేకరులతో మాట్లాడారు. టీవీ స్టూడియో పనులు చేయించుకున్న అర్నబ్ పూర్తి డబ్బులు చెల్లించలేదని అక్షత ఆరోపించారు. దీంతోనే అప్పుల్లో కూరుకుపోయిన ఆయన కొత్త పనులు చేయలేకపోయారని తెలిపారు. అందుకే తీవ్ర ఒత్తిడికి గురైన తన భర్త అన్వయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దీంతో ఆయన తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని విలపించారు. ఈ విషయానికి సంబంధించి అన్వయ్ సుసైడ్ నోట్ కూడా రాశారని గుర్తు చేశారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయలేదన్నారు. దీనికి సంబంధించి చాలాసార్లు ముఖ్యంగా అర్నబ్ బెదిరించాడని ఆరోపించారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అర్నబ్ గోస్వామిని అరెస్టు చేయడంతో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుందని ఆమె అన్నారు. (అర్నబ్ గోస్వామి అరెస్ట్) అసలు ఏం జరిగింది? ముంబైలో రిపబ్లిక్ టీవీ స్టూడియోకు సంబంధించిన ఇంటీరియర్ పనులు అలీబాగ్‌కు చెందిన డిజైనర్ అన్వయ్ నాయిక్(53) చేశాడు. అయితే కొద్దిరోజుల తర్వాత అలీబాగ్‌లోని తన ఇంట్లో 2018 మే 5వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనతోపాటు అన్వయ్ తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే రిపబ్లిక్ చానెల్లో పనులు చేసిన అనంతరం అర్నబ్ డబ్బులు ఇవ్వలేదని సుమారు రూ. 83 లక్షలు బకాయిలు రావాల్సి ఉందని.. కానీ, ఆ డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు వారి కుటుంబీకులు ఆరోపించారు. కాగా, అన్వయ్ నాయిక్ సుసైడ్ నోట్లో కూడా అర్నబ్ గోస్వామి పేరుతోపాటు మరో ఇద్దరి పేర్లు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేçసినప్పటికీ అనంతరం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ విషయంపై మళ్లీ అన్వయ్ నాయిక్ భార్య, కుమార్తెల ఫిర్యాదు మేరకు ఈ కేసుకు సంబంధించి అర్నబ్ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎమర్జెన్సీని తలపిస్తోంది: ఫడ్నవిస్ రిపబ్లిక్ టీవి చీఫ్ ఎడిటర్ అర్నబ్ గో స్వామిని బుధవారం అరెస్టు చేయడంపై ఉద్దర్ ఠాక్రే నేతృత్వంలోని ఎంవీఎం ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. అర్నబ్ గొంతును మూగబోయేలా చేస్తున్నారని పేర్కొంది. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 1977లో ఎమర్జెన్సీ విధించారనీ, కానీ అది ప్రస్తుతం కూడా కొనసాగుతోందని ట్విట్టర్ ద్వారా విమర్శించారు. ఎమర్జెన్సీ మద్దతుదారులు కాంగ్రెస్, శివసేనలపై గొంతెత్తి ప్రశ్నించేవారి స్వేచ్చకి భంగం కలిగిస్తున్నారని, ఇలాంటి వారితో దేశం పోరాటం చేస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఫడ్నవిస్ ధ్వజమెత్తారు. ముంభైలో బీజేపీ ఎమ్మెల్యే ఆశీష్ శెలార్ విలేకరులతో మాట్లాడుతూ.. అర్నబ్ వంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తారని, సొంత ప్రయోజనాల కోసం ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం వీరి గొంతును కట్టిపడేస్తూ, వారి స్వేచ్చకి భంగం కలిగిస్తుందని ఆరోపించారు. శివసేన నేతృత్వంలోని ఎంవీఎం ప్రభుత్వం జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తోందని, అర్నబ్ విషయంలోనూ ఇదే విధంగా ప్రవర్తిస్తూ, ఆత్మహత్య కేసు ఇప్పటికే పూర్తయిన, దానిని తిరిగి లేవనెత్తిందని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇదొక బ్లాక్ డే అని ఆశీష్ వ్యాఖ్యానించారు. అర్నబ్‌పై దాడి చేశారు : న్యాయవాది రిపబ్లిక్ టీవీ ఛానెల్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసే సమయంలో ముంబైలోని ఆయన ఇంట్లో పోలీసులు చేయి చేసుకున్నట్లు అర్నబ్‌తోపాటు ఆయన న్యాయవాది గౌరవ్ పార్కర్లు ఆరోపించారు. పార్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన అరెస్టుకు సంబంధించి ఆయన భార్యకు కూడా తెలియపరచలేదని, ఇద్దరు పోలీసులు ఆయనపై భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా పోలీసులు కుటుంబ సభ్యులతో తోపులాటకు దిగినట్టు పేర్కొన్నారు. అర్నబ్ ఎడమ చేతికి గాయమైందని, వెన్నుపై చేయిచేసుకున్నారని గౌరవ్ ఆరోపించారు. ఇక ఎలాంటి పత్రాలు లేకుండా మూసి వేసిన కేసుకు సంబంధించి అరెస్టు చేయడాన్ని రిపబ్లిక్ టీవీ తప్పు బట్టింది. అర్నబ్ అరెస్టుతో శివసేన, బీజేపీ నాయకుల మధ్య రాజకీయ రగడ మొదలైంది. బీజేపీ నేతలు అర్నబ్ అరెస్ట్ అన్యాయమని, కక్ష పూరిత చర్యేనని శివసేన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు తప్పు ఎవరు చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని శివసేన నేత, ఎంపీ సంజయ్ రావుత్ పేర్కొన్నారు. అర్నబ్ గోస్వామిని ఆలీబాగ్ పోలీసుల అరెస్టు చేయడాన్ని సంజయ్ సమర్థించారు. ఆధారాలు లభించాయి కావచ్చు అందుకే అరెస్టు చేశారని, పోలీసులు ఎవరినీ ఊరికే అరెస్టు చేయరన్నారు. అలాగే తప్పు తను చేసినా చట్టం తనను విడిచిపెట్టదని తెలిపారు. ఇది రాజకీయపార్టీలు, ప్రభుత్వానికి సంబంధించి కాదని, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛకు సంబంధించి కూడా కాదని ఇది అన్వయ్ నాయిక్ ఆత్మహత్యకు సంబంధించిన కేసుగా పేర్కొన్నారు. శివసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరిని ఉద్ధేశపూర్వకంగా అరెస్టు చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. -
అర్నబ్ గోస్వామి అరెస్ట్
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని రాయగఢ్ జిల్లా అలీబాగ్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయిక్ (53) ఆత్మహత్యకు సంబంధించి అర్నబ్‌ను అరెస్టు చేసినట్టు అలీబాగ్ పోలీసులు పేర్కొ న్నారు. తననెందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నిస్తూ, అరెస్టువారెంటు చూపాలని అర్నబ్ వాదించారని పోలీసులు తెలిపారు. అరెస్టు వారంటును చూపించబోగా, అర్నబ్ భార్య ఆయా పేపర్లను చించేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత అర్నబ్‌ను అలీబాగ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచారు. గోస్వామిని అలీబాగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ ఆయనను కోర్టులో హాజరుపరచాలని చెబుతూ ఈనెల 18 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గోస్వామి ని పోలీసులు అరెస్టు చేసే సమయంలో పోలీసులు అర్నబ్‌పై చేయి చేసుకున్నారని, అర్నబ్‌తోపాటు ఆయన న్యాయవాది గౌరవ్ పార్కర్లు ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఆయన్ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసుల బృందంలో ఉన్న మహిళా పోలీసుపై అర్నబ్ చేయి చేసుకున్నారన్న అభియోగాలతో ఆయనపై మరో ఎఫ్ఐఆర్ దాఖలైంది. మహిళా పోలీసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. తన భర్తకు ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి ఉంటే నేడు తన భర్త బతికి ఉండేవారని అన్వయ్ నాయక్ భార్య అక్షతా పేర్కొన్నారు. చట్టం ముందు అంతా ఒక్కటే.. చట్టం ముందు ఎవరూ గొప్పవారు కాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. అన్వయ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకే ఈ కేసును తిరిగి విచారణ చేపట్టేందుకు కోర్టులో దరఖాస్తు చేసినట్టు చెప్పారు. అనంతరం కోర్టు అనుమతితోనే ఈ అరెస్టు జరిగిందని చట్టప్రకారం పోలీసులు తమ పని తాము చేస్తున్నారన్నారని అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. -
‘అందుకే నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు’
ముంబై : ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడాన్ని ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ కుటుంబ సభ్యులు స్వాగతించారు. అర్నాబ్‌ని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేశారని అన్వే నాయక్ భార్య అక్షత, కూతురు అద్య్నా నాయక్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఆడపడుచుకు ఇచ్చిన మాటను పోలీసులు నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. అర్నాబ్‌పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి : రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) కాగా, రిపబ్లిక్ టీవీ స్టూడియోలను రూపొందించిన డిజైనర్ అన్వే నాయక్.. 2018లో తన తల్లి కుముద్ నాయక్‌తో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బిల్లులు చెల్లించకపోవడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అర్నాబ్‌పై రాయ్‌గడ్‌లో కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక రాయ్‌గడ్ పోలీసులు గోస్వామితో సహా సూసైడ్ నోట్లో పేర్కొన్న నిందితులపై తమకు ఆధారాలు దొరకలేదని 2019 ఏప్రిల్‌లో కేసును మూసివేశారు. అయితే, ఈ ఏడాది మేలో, అన్వే కుమార్తె ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఆశ్రయించడంతో మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. అయితే మన విజ్ఞప్తికి స్పందించి అర్నాబ్‌ను అరెస్ట్ చేసినందుకు మహారాష్ట్ర పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి : ఎమర్జెన్సీని గుర్తు చేసింది : అమిత్‌షా) ‘ నా భర్త సూడైడ్ నోట్లో ముగ్గురి పేర్లు ఉన్నాయి. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని 2018 నుంచి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. నా భర్త ఆత్మహత్య వెనుక అర్నాబ్ గోస్వామి హస్తం ఉంది. అతనిపై చర్యలు తీసుకోని మాకు న్యాయం చేయాలి. అర్నాబ్‌కు ఒక్కరు కూడా సహాయం చేయొద్దని భారతీయులందరికి విజ్ఞప్తి చేస్తునా. మహారాష్ట్ర పోలీసులు మాకు న్యాయం చేశారు. అర్నబ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం’ అని అన్వే నాయక్ భార్య అక్షత మీడీయాతో పేర్కొన్నారు. ‘ మా నాన్న తన డబ్బు, శ్రమను రిపబ్లిక్ టీవీ స్టూడియో ప్రాజెక్టు కోసం ఖర్చు చేశాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ, గోస్వామి నా తండ్రికి బకాయిలు అందకుండా చూసుకున్నాడు. డబ్బులు అడిగితే మా నాన్న కెరీర్‌తో పాటు నా కెరీర్‌ను నాశనం చేస్తాని బెదిరించాడు. అందుకే మా నాన్న చనిపోయాడు’ అని అన్వే నాయక్ కూతురు అద్న్యా అన్నారు. అర్నాబ్‌పై మరో కేసు ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి మరో కేసు నమోదైంది. అరెస్ట్ సమయంలో అర్నాబ్ ఇంటికి వచ్చిన మహిళా కానిస్టేబుల్‌పై ఆయన దాడికి పాల్పాడ్డారని మహారాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ఎమర్జెన్సీని గుర్తు చేసింది : అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రంగా ఖండించారు. అర్నాబ్ అరెస్ట్ పత్రికా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు కలిసి మరోసారి ప్రజాస్వామ్యాని అవమానించాయని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విటర్ వేదికగా మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. (చదవండి : రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) ‘కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాయి. అర్నబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీని అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దాడిని వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభమైన పత్రికపై దాడిగా భావించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ తీరును చూస్తుంటే ఎమర్జెన్సీ కాలంనాటి పరిస్థితులు మరోసారి గుర్తుకు వస్తున్నాయి. మీడియా స్వేచ్ఛపై జరిగిన ఈ దాడిని మనమందరం ఖండించాలి’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా, 2018లో డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పాలరనే ఆరోపణల నేపథ్యంలో అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ప్రతీకారం కాదు, అంతా చట్ట ప్రకారమే!!
సాక్షి, ముంబై : దివంగత బాలీవుడు నటుడు సుశాంత్‌సింగ్ ఆత్మహత్యతో రగిలిన వివాదం, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అనూహ్య అరెస్టు తరువాత మరోసారి రాజుకుంది. బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. తాజాగా అర్నాబ్ గోస్వామి అరెస్టుపై వస్తున్న విమర్శలపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. తమ హయాంలో ప్రతీకారం అనే సమస్యే ఉండదనీ, చట్ట ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఈ క్రమంలో అర్నాబ్ అరెస్టు చట్ట ప్రకారమే చోటు చేసుకుందని వివరించారు. తగిన ఆధారాలుంటే ఎవరిపైనైనా పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. అంతేకాదు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకునే ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన స్పష్టం చేశారు. (రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) మరోవైపు గతంలో మూసివేసిన ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించిన 2018 కేసును విషయంలోనే అర్నాబ్ గోస్వామిని అరెస్టుచేశామని మహారాష్ట్ర హోంమంత్రి ధృవీకరించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుదర్యాప్తు, టీఆర్పీ కుంభకోణంపై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు, అర్నాబ్‌పై రెండేళ్ల కేసును తిరిగతోడారన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్ ఇలా స్పందించారు. ముఖ్యంగా మహారాష్ట్ర పోలీసుల చర్యను పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అర్నాబ్ అరెస్టు సిగ్గు చేటని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అటు మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా అర్నాబ్ గోస్వామికి మద్దతుగా నిలిచారు. అర్నాబ్ గోస్వామి అంటే ఇష్టం ఉన్నా లేకున్నా మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా నిలబడాలన్నారు. మౌనంగా ఉంటే అణచివేతకు మద్దతిచ్చినట్టేననిఆమె ట్వీట్ చేశారు. అటు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా సేన ప్రభుత్వంపై మండిపడింది. (అర్నాబ్ అరెస్టు, పత్రికా స్వేచ్ఛపై దాడి: కేంద్రమంత్రి) Those in the free press who don’t stand up today in support of Arnab, you are now tactically in support of fascism. You may not like him, you may not approve of him,you may despise his very existence but if you stay silent you support suppression. Who speaks if you are next ? — Smriti Z Irani (@smritiirani) November 4, 2020 -
అర్నాబ్ అరెస్టు; స్పందించిన కేంద్రమంత్రి
సాక్షి,న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవడేకర్ స్పందించారు. ఇది ‘‘పత్రికా స్వేచ్ఛపై దాడి" గా అభివర్ణించారు. ఈ ఘటన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందంటూ మహారాష్ట్ర పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్న ఆయన మీడియా పట్ల ఈ వైఖరి సరైంది కాదంటూ ట్వీట్ చేశారు. (రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) కాగా డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణలతో నమోదైన కేసును సాక్ష్యాలు లేవంటూ పోలీసులు దర్యాప్తును నిలిపివేశారు. అయితే రెండేళ్లనాటి కేసును తిరిగి ప్రారంభించాలన్న కుటుంబ సభ్యుల విజ్ఞప్తి నేపథ్యంలో అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజ్, సాయుధులైన పోలీసులతో అర్నాబ్‌ను నిర్బంధించారని రిపబ్లిక్ టీవీ ఆరోపించింది. ఎడిటర్స్ గిల్డ్ ఖండన మరోవైపు అర్నాబ్ అరెస్ట్‌పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఆకస్మిక అరెస్టును ఖండించింది. అర్నాబ్ గోస్వామి అరెస్టు విషయం తెలిసి షాక్ అయ్యామంటూ విచారం వ్యక్తం చేసింది. గోస్వామిని న్యాయపరంగా విచారణ జరగాలని, మీడియా విమర్శనాత్మక రిపోర్టింగ్‌పై అధికార దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సూచించింది. We condemn the attack on press freedom in #Maharashtra. This is not the way to treat the Press. This reminds us of the emergency days when the press was treated like this.@PIB_India @DDNewslive @republic — Prakash Javadekar (@PrakashJavdekar) November 4, 2020 -
రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు
సాక్షి,ముంబై: ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై, రాయ్‌గడ్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పాలరనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని ముంబై పోలీసులు ప్రకటించారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించి బుధవారం అర్నాబ్‌ను అదుపులోకి తీసుకున్నారని రిపబ్లిక్ టీవీ నివేదించింది. ఐపీసీ సెక్షన్ 306 కింద గోస్వామిపై అభియోగాలు మోపారని తెలిపింది. కనీసం 20మంది పోలీసులు అర్నాబ్‌పై దాడి చేశారని, ఆపై బలవంతంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు తీసుకెళ్లారని ఆరోపించింది. అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేయడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజ్‌ను పంపినట్లు రిపబ్లిక్ టీవీ తెలిపింది. ఏకే 47, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో సాయుధ గార్డులు ఆయనపై దాడి చేశారని వ్యాఖ్యానించింది. జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు ఉదయమే తమ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆర్నాబ్‌ను కొట్టి, జుట్టు పట్టి లాక్కెళ్లారని అర్నాబ్ భార్య సమ్యబ్రాతా రే ఆరోపించారు, కొద్ది సమయం అడిగినా ఇవ్వకుండా, లాయర్ వచ్చేంతవరకు వేచి చూడాలని కోరినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్లు అడిగినా ఇవ్వకుండా తీసుకెళ్లారని మండిపడ్డారు. ఛానెల్లోని విజువల్స్ ప్రకారం అర్నాబ్‌ను మొదట కారులో ఉంచి, ఆపై వ్యాన్‌లోకి నెట్టారు. అతన్ని వ్యాన్‌లోకి తీసుకెళ్తుండగా, తన ఇంటి లోపల తనపై, తన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని ఆర్నాబ్ మీడియాకు చెప్పారు. కాగా ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్‌తో కలిసి మే, 2018లో అలీబాగ్‌లోని వారి బంగ్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రిపబ్లిక్ టీవీ స్టూడియోలను రూపొందించిన డిజైనర్ అన్వే నాయక్‌కు బిల్లులు చెల్లించకపోవడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అర్నాబ్‌పై రాయ్‌గడ్‌లో కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక రాయ్‌గడ్ పోలీసులు గోస్వామితో సహా సూసైడ్ నోట్లో పేర్కొన్న నిందితులపై తమకు ఆధారాలు దొరకలేదని 2019 ఏప్రిల్‌లో కేసును మూసివేశారు. అయితే, ఈ ఏడాది మేలో, అన్వే కుమార్తె ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఆశ్రయించారు. -
ముంబైలో టీఆర్పీ స్కామ్
ముంబై: ముంబైలో ఒక టెలివిజన్ రేటింగ్స్ పాయింట్స్(టీఆర్పీ) స్కామ్ వెలుగు చూసింది. టీవీ కార్యక్రమాల ప్రజాదరణను గణాంకాలతో వివరించే టీఆర్పీ ఆధారంగా ఆయా కార్యక్రమాలకు ప్రకటనలు వస్తాయి. ముంబైలో కొన్ని టీవీ చానళ్లు అక్రమ మార్గాల ద్వారా టీఆర్పీలను పెంచుకుంటున్న విషయాన్ని పోలీసులు గురువారం బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. రిపబ్లిక్ టీవీకి కూడా ఈ కుంభకోణంలో భాగం ఉందని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ వెల్లడించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో మహరాష్ట్ర ప్రభుత్వంపై, ముంబై పోలీసులపై ఆ న్యూస్ చానల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆ వార్తాచానల్ పాత్రకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామని పరమ్‌వీర్ సింగ్ తెలిపారు. సుశాంత్ మృతి కేసులో ప్రశ్నించినందువల్ల ముంబై పోలీస్ కమిషనర్ తమపై తప్పుడు అభియోగాలు మోపారని ఆ చానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఆరోపించారు. రెండు మరాఠీ చానళ్లు కూడా రెండు మరాఠీ చానళ్లు అయిన ఫాస్ట్ మరాఠీ, బాక్స్ సినిమాల యజమానులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చానళ్లకు చెందిన బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామన్నారు. ‘టీఆర్పీల ఆధారంగా∙చానళ్లకు ప్రకటనలు వస్తాయి. తద్వారా ఆదాయం వస్తుంది. ఇదంతా వేల కోట్ల వ్యవహారం. తప్పుడు విధానాలతో టీఆర్పీలను పెంచుకుని చూపించి ఆయా చానళ్లు ఆదాయం పెంచుకున్నాయి’ అని వివరించారు. ‘కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారుల ఇళ్లల్లో బారోమీటర్లను ఏర్పాటు చేసి, ఆయా కుటుంబాలు చూస్తున్న చానళ్లను గుర్తిస్తారు. తద్వారా టీఆర్పీలను గణిస్తారు. అయితే, అక్రమంగా టీఆర్పీలను పెంచుకుని చూపాలనుకునే చానల్.. ఆయా వినియోగదారులకు డబ్బులు ఆశ చూపి, తమ చానల్నే ఎక్కువ సేపు చూడాలని, లేదా చూడకపోయినా తమ చానల్నే ఆన్ చేసి ఉంచాలని కోరుతాయి’ అని తెలిపారు. బారోమీటర్లు ఉన్న వినియోగదారుల్లో చాలామంది తాము డబ్బు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించారన్నారు. టీఆర్పీలను ప్రతీవారం విడుదల చేసే బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) అధికారులను కూడా విచారిస్తామన్నారు. ‘టీఆర్పీలను లెక్కించేందుకు ముంబైలో 2 వేల బారోమీటర్లు ఉన్నాయి. వాటి నిర్వహణను హంస అనే ఏజెన్సీకి బార్క్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ ఏజెన్సీ వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ కుంభకోణాన్ని వెలికితీశాం’ అని వివరించారు. హంస ఏజెన్సీ మాజీ ఉద్యోగులు కొందరికి ఇందులో పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. మంబైలోనే కాకుండా ఈ తరహా మోసం దేశంలోని ఇతర నగరాల్లోనూ జరగుతుండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
అర్నాబ్ గోస్వామికి ఊరట
ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై నమోదైన రెండు కేసులను కొట్టివేస్తూ ముంబై హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనకు రక్షణ కల్పించాలని కోరింది. పాల్ఘర్ లించింగ్, వలసకూలీలలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారని అర్నాబ్‌పై కేసు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్, రియాజ్ చాగ్లాతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. విద్వేశాలు రెచ్చగొట్టేలా అర్నాబ్ ప్రయత్నించినట్లు ఎక్కడా కనిపించలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దాఖలైన రెండు ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఓ జర్నలిస్టుకు మతపరమైన సంఘటనలపై విశ్లేషించే హక్కు ఉందన్న అర్నాబ్ తరపు న్యాయవాదుల వాదనను సైతం కోర్టు అంగీకరించింది. సామాజిక అంశాలపై జరిపిన చర్చలో అర్నాబ్ తన వృత్తిధర్మాన్ని పోషించారని న్యాయవాదులు హరీష్ సాల్వే , మిలింద్ సాతే కోర్టుకు వివరించారు. (రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు ) View this post on Instagram ✌️✌️ #republictv A post shared by Arnab Goswami (@arnab_goswami_republictv) on Jun 30, 2020 at 2:16am PDT వివరాల్లోకి వెళితే.. పాల్ఘర్ మూకదాడికి సంబంధించి అర్నాబ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దేశవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో అర్నాబ్ సుప్రీంను ఆశ్రయించగా అన్ని కేసులపైనా స్టే విధించిన ధర్మాసనం.. ఒక్క నాగ్‌పూర్‌లో దాఖలైన కేసుపై స్టే విధించకుండా ముంబైకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే మూడు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. మరోవైపు బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వలస కూలీలు గుమిగూడటంపై ప్రసారం చేసిన కథనంలోనూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏప్రిల్ 22, మే 2న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తాజా తీర్పుతో అర్నాబ్‌కు ఊరట లభించినట్లైంది. (చైనాలో మన న్యూస్ సెన్సార్ ) -
షారుఖ్‌ను ‘ఆ యాడ్’ నుంచి తొలగించారా?
‘‘జియో సిమ్ యాడ్ నుంచి షారుఖ్ ఖాన్‌ను తొలగించాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?’’... ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ ట్విటర్లో తన ‘ఫాలోవర్ల’ను సలహాలు అడిగారు. ఇందుకు వారి నుంచి స్పందన కూడా బాగానే వచ్చింది. పదివేల సార్లు ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. 50 వేలకు పైగా లైకులు కొట్టారు. అంతేకాదు బాలీవుడ్ ఖాన్లకు సరైన రీతిలో బుద్ధి చెప్పారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. వీరిలో ప్రముఖ జర్నలిస్టు ‘అర్నబ్ గోస్వామి’, ప్రఖ్యాత గాయకుడు ‘సోనూ నిగమ్’ కూడా ఉండటం విశేషం. అర్నబ్ అయితే ఓ అడుగు ముందుకేసి.. ‘జియో సిమ్ యాడ్‌లో షారుఖ్‌ను తొలగించి ఆ స్థానంలో అక్షయ్ కుమార్‌ను తీసుకున్నారు. ఈ ఖాన్‌లను బాయ్‌కాట్ చేయాల్సిందే’ అని హ్యాష్‌ట్యాగ్ కూడా జోడించారు.(ఫేక్ ట్వీట్‌కు లైక్: అభాసుపాలైన కాంగ్రెస్ నేత) కర్టెసీ: ఆల్ట్‌న్యూస్ అదేంటి..?! ముకేశ్ అంబానీకి అసలు ట్విటర్ ఖాతానే లేదు కదా! అవును.. నిజమే ఆయనకు ట్విటర్ అకౌంట్ లేదు. మరి ఇదంతా ఏంటి అని అడిగితే ఫేక్ రాయుళ్ల అద్భుత ‘ప్రతిభ’కు నిదర్శనం. మసిపూసి మారేడు కాయ చేసే వారి అసమాన తెలివితేటలకు ఓ ఉదాహరణ. అన్నట్లు ఈ ట్వీట్ ఎంత అబద్ధమో.. అందుకు ప్రముఖుల నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా అంతే అబద్దం. అంటే ముకేశ్ అంబానీతో పాటు అర్నబ్ గోస్వామి, సోనూల అకౌంట్లు కూడా నకిలీవే. సోషల్ మీడియా ప్రమాణాలపై కాస్త అవగాహన ఉన్నవాళ్లెవరికైనా ఇది అర్థమవుతుంది. ఎందుకంటే.. ముకేశ్ అంబానీ పేరిట ఇలా ఇంగ్లీష్, హిందీ భాషల్లో ట్వీట్లు చేయడానికై క్రియేట్ చేసిన రియల్ ముకేశ్ అంబానీ, ముకేశ్ అంబానీ అకౌంట్లకు టిక్ మార్కు లేదు. (చైనా సైనిక మరణాలపై అంతా గందరగోళం) ఇక ఈ నకిలీ అకౌంట్ల యూజర్ల పేర్లు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ముకేశ్‌ను ప్రశంసించిన అర్నబ్ పేరిట ఉన్న ఖాతా.. ఆ తర్వాత కంగనా రనౌత్‌గా పేరుకు మారిపోయింది. వెంటనే మరో నిరాధార, అసత్య వార్త ప్రచారానికి సిద్ధమైపోయింది. రాందేవ్ బాబా పతంజలి కరోనా నివారణకు తయారు చేసిన ‘కరోనిల్’ మందుకు భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది అనేది దాని సారాంశం. అంతేగాక షారుఖ్‌ను తమ యాడ్ నుంచి తొలగించినట్లు జియో నుంచి తనకు సమాచారం అందింది అనేది మరో నకిలి వార్తను కూడా కంగన పేరిట ప్రచారం చేసింది. నిజానికి ముకేశ్‌తో పాటు అర్నబ్ గోస్వామి, కంగన రనౌత్‌కు అధికారిక ట్విటర్ ఖాతాలు లేనేలేవు. (@KanganaTeam పేరిట కంగన బృందం ఆమె ట్విటర్ అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తోంది)(ఆ రెండింటిపై హోం శాఖ అలర్ట్) అయిననప్పటికీ నకిలీగాళ్లు అసత్యాలను ప్రచారం చేయడంలో విజయం సాధించారు. భారీగా ఫాలోవర్లను పెంచుకోవడంలో సఫలీకృతులయ్యారు. ముఖ్యంగా ‘జాతీయవాదాన్ని’ రెచ్చగొడుతూ యాంటీ నేషనలిస్టులు అంటూ కొందరిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. అందుకే బాగా చదువుకుని, పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వాళ్లలో కొంతమంది కూడా వీరి వలకు చిక్కుతున్నారు. వేలల్లో లైకులు కొడుతూ ‘దేశభక్తి’ చాటుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్లో ఈ స్క్రీన్షాట్లను షేర్ చేస్తూ అందరినీ తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారు. గతవారం రోజులుగా తప్పుడు వార్తలతో ప్రచారం పొంది.. ఫేమస్ అయిన ట్విటర్ ఖాతాల్లో మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే..! పలు ఫ్యాక్ట్‌చెక్ సంస్థ ఈ విషయాన్ని వెలికితీశాయి. ఇక ఇట్లాంటి ఫేక్ న్యూస్‌లు, వివిధ వర్గాల మధ్య చిచ్చుపెట్టే అసత్య కథనాలకు కొదవే లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఈ ఫేక్‌న్యూస్ బురద వల్ల మనం ఒక్కోసారి చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త!(కరోనాపై తప్పుడు వార్తలు, భారతీయ టెకీకి షాక్) -
సుప్రీంలో అర్నాబ్‌కు చుక్కెదురు..
న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టులో చుక్కెదురయింది. తనపై నమోదైన ఓ కేసుకు సంబంధించిన విచారణను సీబీఐకి బదిలీ చేయాలనే అర్నాబ్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగించడానికి అనుమతించింది. అయితే అర్నాబ్‌కు మరో మూడు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ముంబై పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. పాల్ఘర్ మూకదాడికి సంబంధించి అర్నాబ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దేశవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో అర్నాబ్ సుప్రీంను ఆశ్రయించగా అన్ని కేసులపైనా స్టే విధించిన ధర్మాసనం.. ఒక్క నాగ్‌పూర్‌లో దాఖలైన కేసుపై స్టే విధించకుండా ముంబైకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే మూడు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. (చదవండి : అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదు ) అయితే తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా అర్నాబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనపై దాఖలైన కేసుకు సంబంధించి ముంబై పోలీసులు 12 గంటలపాటు విచారించారని తెలిపారు. తనను విచారించిన ఇద్దరు అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని అన్నారు. మరోవైపు ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంను ఆశ్రయించింది. అర్నాబ్ తనకు సుప్రీం ఇచ్చిన రక్షణను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. పోలీసుల్లో భయాందోళన కలిగించేలా అర్నాబ్ తీరు ఉందని.. కేసుపై అతని ప్రభావం పడకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. మరోవైపు బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వలస కూలీలు గుమిగూడటంపై ప్రసారం చేసిన కథనానికి సంబంధించి దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని వేసిన క్వాష్ పిటిషన్ కూడా సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. -
అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదు
ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెలలో అర్నాబ్ ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషం రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. నల్ బజార్‌కు చెందిన రాజా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ ఇర్ఫాన్.. అర్నాబ్‌పై ఫిర్యాదు చేశారు. అర్నాబ్, అతని చానెల్.. బాంద్రాలోని ఓ మసీద్ లక్ష్యంగా ముస్లింలపై ద్వేషం సృష్టిస్తున్నారని ఇర్ఫాన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఏప్రిల్ 14న వలస కూలీలు నిరసనకు బాంద్రాలోని మసీదులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. (చదవండి : అర్నాబ్‌కు పోలీసుల నోటీసులు) ‘బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వలస కూలీలు నిరసన తెలపడానికి.. అక్కడికి సమీపంలోని మసీదుకు ఎలాంటి సంబంధం లేదు. అయితే మసీదు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వలస కూలీలు పెద్ద ఎత్తున చేరిపోయారు. కానీ అర్నాబ్ మాత్రం ఆ మసీదు.. మత ఘర్షణలకు యత్నిస్తుందని తన షోలో చెప్పారు. బాంద్రాలోని మసీదు వద్ద జనం గుమిగూడెలా చేసింది ఎవరు?. లాక్డౌన్ సమయంలో ప్రతి మసీదు సమీపంలో ఎందుకు జనం కనిపించారు. ఇది ముస్లింలను టార్గెట్ చేసేందుకే జరిగిన ప్రణాళిక’ అని ఇర్ఫాన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. అర్నాబ్‌పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ కేసు సంబంధించి విచారణ జరుగుతుందని తెలిపారు. అలాగే ఆధారాల్లో భాగంగా.. ఆ షోకు సంబంధించిన క్లిప్స్ సేకరించే పనిలో ఉన్నామని వెల్లడించారు. -
అర్నాబ్‌కు పోలీసుల నోటీసులు
ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి ముంబై పోలీసులు నోటీసులు ఇచ్చారు. అర్నాబ్ తన టీవీ షోలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని మహారాష్ట్ర మంత్రి నితిన్ రౌత్(కాంగ్రెస్) పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు సీఆర్పీసీ 41ఏ కింద విచారణకు హాజరు కావాలని అర్నాబ్‌కు నోటీసులు ఇచ్చారు. కాగా, కొద్ది రోజుల కిందట సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అర్నాబ్ తన టీవీ షోలో వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా అర్నాబ్‌పై దేశంలోని పలుచోట్ల కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై అర్నాబ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అర్నాబ్ అభ్యర్థనపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మూడు వారాల పాటు అతనిపై అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అర్నాబ్‌తోపాటు, రిపబ్లిక్ టీవీ కార్యాలయానికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే నాగ్‌పూర్‌లో నితిన్ రౌత్ చేసిన ఫిర్యాదుకు సంబంధించి మాత్రం కోర్టు స్టే విధించలేదు. దానిని ముంబైకి బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు అర్నాబ్‌కు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇదే సమయంలో అర్నాబ్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడికి కాంగ్రెస్ నాయకులే కారణమని అర్నాబ్ ఆరోపించారు. చదవండి : అర్నాబ్ గోస్వామికి సుప్రీంలో ఊరట -
ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ దాఖలైన కేసుల్లో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామికి ఊరట లభించింది. మూడు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోసం మూడు వారాల్లోపు దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఆయనకు అవకాశం ఇచ్చింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ గోస్వామి పెట్టుకున్న పిటిషన్ మేరకు సర్వోన్నత ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం గోస్వామి పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ జరిపింది. గోస్వామి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. గోస్వామిపై దాఖలైన అన్ని కేసులపైనా స్టే విధించిన ధర్మాసనం.. ఒక్క నాగ్‌పూర్‌లో దాఖలైన కేసుపై మాత్రం స్టే విధించలేదు. ప్రస్తుతం ఈ కేసును ముంబైకి బదిలీ చేశారు. కాగా ఆర్నాబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీకి పూర్తి భద్రత కల్పించాలంటూ సుప్రీంకోర్టు ముంబై పోలీస్ కమిషనర్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల పాల్గఢ్లో చోటుచేసుకున్న మూకహత్యకు సంబంధించి సోనియా గాంధీపై గోస్వామి తన టీవీలో చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఎఫ్ఐఆర్లు దాఖలైన సంగతి తెలిసిందే. కాగా, ఆర్నాబ్ గోస్వామి దంపతులపై ఈనెల 22న అర్ధరాత్రి దాడి జరిగింది. ముంబైలోని స్టూడియో నుంచి ఆర్నాబ్ గోస్వామి, అతని భార్య ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అర్నాబ్ వాహనంపై దాడి
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి వాహనంపై దాడి జరిగింది. బుధవారం అర్ధరాత్రి ముంబైలోని స్టూడియో నుంచి అర్నాబ్ గోస్వామి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో గణపత్రావ్ కాడమ్ మార్గ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై దూసుకొచ్చి అర్నాబ్ వాహనం అద్దంపై బాదుతూ దాడికి యత్నించారు. ఈ దాడిలో అర్నాబ్ దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు. నిందితులు వారు వెంట తెచ్చుకున్న ఇంక్ బాటిల్‌ను కారుపై విసిరారు. అర్నాబ్ కారు వెనుకే వస్తున్న అతడి సిబ్బంది ఆ ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. -
అర్నాబ్ గోస్వామి దంపతులపై దాడి...
ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి దంపతులపై బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. ముంబైలోని స్టూడియో నుంచి ఆర్నాబ్ గోస్వామి, అతని భార్య ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వారిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. బైక్‌పై దూసుకొచ్చిన వ్యక్తులు అర్నాబ్ వాహనం దాడికి యత్నించారు. తనపై దాడికి సంబంధించి అర్నాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో అర్నాబ్ దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఆర్నాబ్ వీడియో సందేశాన్ని రిపబ్లిక్ టీవీ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో.. తనపై దాడికి పాల్పడింది కాంగ్రెస్ యూత్ నాయకులేనని అర్నాబ్ ఆరోపించారు. ఆఫీసు నుంచి తిరిగివస్తున్న తమపై రాత్రి 12.15 గంటలకు దాడి జరిగిందని చెప్పారు. బైక్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దాలు పగలకొట్టడానికి యత్నించారని తెలిపారు. తనకు ఏదైనా జరిగితే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, తనపై జరిగిన దాడిని వ్యక్తిగతంగా ఎదుర్కొంటానని.. దీనిపై ఎంత దూరమైనా వెళ్తానని తెలిపారు. తాను, తన టీవీ చానెల్ నిజం కోసమే పనిచేస్తుందని అన్నారు. #BREAKING | Arnab's message after being physically attacked by Congress goons #SoniaGoonsAttackArnab https://t.co/RZHKU3fdmK pic.twitter.com/SdAvoerhIH — Republic (@republic) April 22, 2020 -
పైలట్ రోహిత్‌కు కునాల్ కృతజ్ఞతలు
ఇండిగో ప్రైవేటు ఎయిర్‌లైన్ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన పైలట్ రోహిత్‌కు కమెడియన్ కునాల్ కామ్రా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 28న ఇండిగో సంస్థ విమానంలో ప్రయాణించిన కునాల్ అదే విమానంలో వెళ్లున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామిని అసభ్యకరంగా మాట్లాడినందుకు కునాల్‌పై నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఆరు నెలలపాటు కామ్రా తమ విమానాల్లో ప్రయాణించరాదని ఇండిగో విమానయాన సంస్థ వేటు వేసింది. మిగతా విమాన సర్వీసుల కూడా కునాల్ కామ్రపై నిషేధం విధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పిలుపునిచ్చారు. (ప్రముఖ కమెడియన్‌పై నిషేధం) ఈ క్రమంలో సదరు విమాన పైలట్ రోహిత్ మాటేటి ఇండిగో విమాన సంస్థకు ఓ లేఖ రాశారు. అందులో ‘కేవలం సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఇండిగో విమానయాన సంస్థ పనిచేసింది. ప్రయాణికుడిపై చర్యలు తీసుకునే ముందు పైలట్ ఇన్ కమాండర్‌ను సంప్రదించలేదు. విమాన సిబ్బంది చెప్పిన సూచనలను కునాల్ పాటించాడు. ఈ చర్యకు చాలా సార్లు క్షమాపణలు కూడా కోరాడు. కామ్రా విమానంలో కొంత విసుగు కలిగించే విధంగా ప్రవర్తించవచ్చు. కానీ అతన్ని బ్యాన్ చేసే అంత అసభ్యకరంగా ప్రవర్తించలేదు’ అంటూ కమెడియన్‌కు మద్దతుగా లేఖలో పేర్కొన్నారు. తన 9 సంవత్సరాల అనుభవంలో ఇలాంటి ఘటన జరగలేదని పైలట్ తెలిపారు. (అర్నాబ్‌పై ఆగ్రహం, కునాల్‌కు షాక్) Captain Rohit Mateti ko mera salaam 🙏🙏🙏 — Kunal Kamra (@kunalkamra88) January 31, 2020 కాగా దీనిపై స్పందించిన కమెడియన్ కునాల్..‘నేను కెప్టెన్ రోహిత్ మాటేటికి నమస్కారం చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఇక పైలట్ లేఖ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించి.. ఈ సంఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని, ఇందుకు అంతర్గత కమిటీ దర్యాప్తును ప్రారంభించిందని ఓ ప్రకటనలో పేర్కొంది. -
ప్రముఖ కమెడియన్‌పై నిషేధం
న్యూఢిల్లీ : ఆంగ్ల వార్తాచానెల్ ‘రిపబ్లిక్ టీవీ’ ఎడిటర్, ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామిపై తమ విమానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కామ్రాపై ఇండిగో విమానయాన సంస్థ నిషేధం విధించింది. 6 నెలల పాటు తమ విమానాల్లో ప్రయాణించేందుకు కామ్రాను అనుమతించబోమని ట్వీట్ చేసింది. ముంబై నుంచి లక్నో వెళ్తున్న విమానంలో గోస్వామితో కామ్రా అభ్యంతరకరంగా, ఎగతాళి చేసినట్లుగా ప్రవర్తించాడని పేర్కొంది. ఇండిగో తరహాలో ఇతర విమానయాన సంస్థలు కామ్రాపై నిషేధం విధించాలని కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి కోరారు. -
రాయని డైరీ
తెలుసు కదా అని ఏదైనా చెప్పబోతే, ‘మాకు తెలియకపోతే కదా’ అని ఎవరైనా చటుక్కున అనేస్తే మనసు ఎంత చివుక్కుమంటుంది! ‘డెబ్బయ్ తొమ్మిదేళ్ల వయసులోని రాజకీయవేత్తకు, ఆరితేరిన ఆర్థిక నిపుణుడికి మనకు తెలిసినవే కాకుండా, అదనంగా మరికొన్ని కూడా తెలిసి ఉండే అవకాశం ఉందేమో తెలుసుకుందాం’ అని వీళ్లంతా ఎందుకు అనుకోరు?! రీసెంట్గా నిర్మలా సీతారామన్‌కు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా గట్టెక్కించవచ్చో ఐదు టిప్స్ ఇచ్చాను. ‘అసలు గట్టెక్కించాల్సిన అవసరం ఏముందీ’ అన్నట్లు విస్తుపోయి చూశారు! బీజేపీ గట్టున ఉంటే దేశం కూడా గట్టునే కదా ఉంటుంది అని ఆమె నమ్మకం కావచ్చు. ‘‘ఎందుకలా విస్తుపోయి చూశారు నిర్మలగారూ?’’ అన్నాను. ‘‘బీజేపీ వాళ్లకు బీజేపీ వాళ్లు టిప్స్ ఇవ్వడం నేనెక్కడా చూళ్లేదు. మీరు బీజేపీ అయుండి, నేను బీజేపీ అయుండి మీరు నాకు టిప్స్ ఇవ్వడమేవిస్మయంగా ఉంది’’ అన్నారు. ‘‘అయితే మీకు నా టిప్స్ నచ్చాయి కానీ, ఆ టిప్స్‌ని నేనివ్వడమే మీకు నచ్చలేదన్నమాట’’ అన్నాను.‘‘నేను అడగకుండా ఎవరు నాకు టిప్స్ ఇచ్చినా నాకు నచ్చదు సుబ్రహ్మణియన్ గారూ. పైగా మీరు ‘టిప్స్ ఇచ్చేదా’ అని నన్ను అడక్కుండానే నాకు టిప్స్ ఇచ్చేశారు’’ అన్నారు సీతారామన్! రెండు పొరపాట్లు చేశానని అర్థమైంది. అడగకుండా టిప్స్ ఇవ్వడం. టిప్స్ఇమ్మంటారా అని అడగకపోవడం.సీతారామన్ గురించి ఆలోచిస్తూ ఉంటే అయోధ్య రాముడి గురించి కబురొచ్చింది! ‘‘మిస్టర్ సుబ్రహ్మణియన్.. కేసును సుప్రీం కోర్టు తీసేసుకుంది. మధ్యవర్తులు చేతులెత్తేశారు. మీరేం చెప్పదలచుకున్నారు? ఇండియా వాంట్స్ టు నో’’ అంటున్నాడు ఆర్ణబ్ గోస్వామి! ‘‘ఇండియా నా నుంచి తెలుసుకోవాలని కోరుకుంటోందా?!’’ అని అడిగాను నిస్సత్తువగా. చెప్పలేకపోవడం వల్ల దేహానికి కలిగిన నిస్సత్తువ కాదది. వినేవారెవరన్న నిస్పృహ వల్ల మనసును ఆవరించిన నిస్సత్తువ. ‘‘ఎస్ మిస్టర్ సుబ్రహ్మణియన్.. ఇండియా వాంట్స్ టు నో అబౌట్ యువర్ కామెంట్స్. అయోధ్య మధ్యవర్తుల కమిటీలో ఉండేందుకు అప్పట్లో మీరూ ఉత్సాహం చూపారు కదా..’’ అన్నాడు ఆర్ణబ్. ‘‘నా దగ్గర కామెంట్స్ ఏమీ లేవు ఆర్ణబ్. టిప్స్ ఉన్నాయి. అవి ఇండియాకు పనికొస్తాయా? ఎందుకంటే ఇండియాలోనే కొందరు నేనిచ్చే టిప్స్‌ని తీసుకోవాలని అనుకోవడం లేదు’’ అన్నాను. ‘‘వెల్ మిస్టర్ సుబ్రహ్మణియన్. ఇండియా అంటే.. మీ టిప్స్‌ని తీసుకోనివాళ్లు మాత్రమే కాదు, మీ టిప్స్‌ని తీసుకునేవాళ్లు కూడా..’’ అన్నాడు ఆర్ణబ్. ‘‘మరి ముందే టిప్స్ కావాలని ఎందుకు అడగలేదు ఆర్ణబ్! ఇండియా వాంట్స్ టు నో అబౌట్ యువర్ కామెంట్స్ అని కదా మీరన్నారు..’’ అన్నాను. ఆర్ణబ్ పెద్దగా నవ్వాడు. ఆర్ణబ్ పెద్దగా చెవులు పగిలేలా మాట్లాడ్డమే తప్ప, ఏవీ పగలకుండా పెద్దగా నవ్వడం ఇదే తొలిసారి నేను వినడం! చెవులు పగలడమే బాగుంది. ‘‘మిస్టర్ సుబ్రహ్మణియన్.. ముందే టిప్స్ కావాలని మిమ్మల్ని ఎందుకు అడగలేదంటే, కామెంట్స్ అడిగినా మీరిచ్చేది టిప్సే కదా అనే నమ్మకం..’’ అన్నాడు! ‘‘నమ్మకం మంచిదే ఆర్ణబ్. ఒకవేళ నా మూడ్ బాగుండి, టిప్స్ ఇవ్వకుండా మీరడిగినట్లు కామెంట్సే ఇస్తే?’’ అన్నాను. ‘‘మీకు తెలియందేముంది మిస్టర్ సుబ్రహ్మణియన్, మూడాఫ్ చెయ్యడానికి మా దగ్గర ఒక టీమ్ ఎప్పుడూ ట్వంటీ ఇంటూ సెవన్.. పని చేస్తూనే ఉంటుంది కదా’’ అన్నాడు ఆర్ణబ్! -
పాకిస్థాన్‌తో టీవీ యాంకర్ల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన టెర్రరిస్ట్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్‌పై యుద్ధం చేయాల్సిందేనంటూ పలు ప్రాంతీయ టీవీలతోపాటు పలు జాతీయ టీవీ ఛానళ్ల యాంకర్లు తీర్మానించడమే కాదు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు భారత సైన్యానికి వెంటనే కదన రంగంలోకి దూకాల్సిందిగా శనివారం పదే పదే పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరు కూడా ఇదే కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. తెలుగు టీవీ యాంకర్ రష్మీ అవేశంతో ఊగిపోతూ పాకిస్థాన్‌పై రెండో సర్జికల్ స్ట్రైక్స్ చేయాలంటూ ‘తెర మాకీ....’ అంటూ రెచ్చిపోయారు. పాకిస్థాన్‌పై ఎలా బదులు తీర్చుకోవాలో తేల్చుకోవడానికి అఖిల పక్ష సమావేశాలతో ప్రధాని నరేంద్ర మోదీ తర్జనభర్జనలు పడుతుండగానే ‘పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలకు మోదీ సిద్ధంగా ఉన్నారు’ అంటూ ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తూ వస్తున్నారు. ‘ప్రతీకారం కోరుకుంటున్న భారత్’ అన్న నినాదంతోనే ‘రిపబ్లిక్ టీవీ’ వార్తలను ప్రసారం చేసింది. సీనియర్ జర్నలిస్ట్, యాంకర్ అర్నాబ్ గోసామి మాట్లాడుతూ ‘పాక్‌తో యుద్ధం చేయడం మినహా మరో మార్గం ఉందా ? లేదు!’ అంటూ సెలవిచ్చారు. ‘పాకిస్థాన్ విషయంలో ఇక వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి లేదు’ అంటూ టైమ్స్ నౌ యాంకర్ నావికా కుమార్ వ్యాఖ్యానించారు. ‘ ఓ భారత ప్రధాని ప్రజలనుద్దేశించి ఇంత స్పష్టంగా మాట్లాడడం ఇదే మొదటి సారి. పాకిస్థాన్‌తో పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు’ అని ఇండియా టుడే టీవీ యాంకర్ రాహుల్ కన్వల్ వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్‌లోని అన్ని టెర్రరిస్టు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపాలి’ అంటూ న్యూస్ 18 యాంకర్ భూపేంద్ర చౌబే పిలుపునిచ్చారు. యుద్ధానికి సమయం ఆసన్నమైందంటూ 2016లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులను ప్రస్తావిస్తూ ఏబీపీ న్యూస్ ఛానల్ అయితే ఇటీవల విడుదలైన ‘యురి’ బాలివుడ్ సినిమాలోని క్లిప్స్‌ను చూపించారు. యాంకర్ల పిలుపులపై ‘ఎన్డీటీవీ ఇండియా’ రవిష్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ‘మన సైనికులు మరణించినందుకు మనకు బాధగా ఉంటుంది. మనసు ప్రతీకారం కోరుకుంటుంది. ఇక్కడే కాస్త సంయమనం అవసరం. అరుపులు, కేకలు వినిపించడానికి ప్రతి సంఘటన ఓ సినిమా ప్లాట్ కాదు. రెచ్చగొట్టే భాష రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తుంది. సమస్యను పరిష్కరించదు. ఈ సమయంలో మనం మౌనం పాటించడమే అమర వీరులకు నిజమైన నివాళి. మృధువుగా మాట్లాడుతాం. బాధిత కుటుంబాల మెదళ్లును తొలుస్తున్న విషయం గురించి ఆలోచిద్దాం. కశ్మీరు పరిస్థితి కంటే మీడియా పరిస్థితి దిగజారినందుకు బాధగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. కార్గిల్ వీరుడి అమూల్య సందేశం ‘జీ న్యూస్’ చర్చాగోష్టిలో పాల్గొన్న 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొని కుడి కాలును కోల్పోయిన యోధుడు మేజర్ నవదీప్ సింగ్ చాలా బాధ్యుతాయుతంగా స్పందించారు. ‘దేశ త్రివర్ణ పతాకానికి అండగా ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధంగానే ఉన్నారు. ఒకప్పుడు టెర్రరిస్టయిన నజీర్ వానిలాగా ఓ కశ్మీర్ యువకుడు ఎందుకు కావాలనుకుంటున్నాడో కూడా ఆలోచించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. యుద్ధం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రాణాలే కాదు, అవయవాలు కూడా పోతాయి. ఆ తర్వాత నష్ట పరిహారం కోసం కోర్టుల తలుపులు తట్టాలి. యుద్ధంలో సైనికుడు చనిపోవాలని మనం కోరుకుంటాం. ఆ తర్వాత ఆ సైనికుడి వితంతు భార్య పింఛను కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. యుద్ధంలో కొన్నిసార్లు మృతదేహం ఆనవాళ్లు కూడా దొరకవు. పింఛను కావాలంటే భర్త మతదేహాన్ని తీసుకరావాలని అధికార యంత్రాంగం ఆదేశిస్తుంది. యుద్ధంలో గాయపడితే అంగవైకల్య నష్టపరిహార పింఛను కోసం ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరగాలి. యుద్ధంలో కాలు కోల్పోయిన నేను పింఛను కోసం ఏడేళ్లు కోర్టుల చుట్టూ తిరిగాను. సైనిక పింఛను విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్పీళ్లను ఉపసంహరించుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు స్వయంగా ఆదేశించినప్పటికీ ఇప్పటికీ వెయ్యి కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రాణాలతో పరాచకాలొద్దు. అన్యాయంగా సైనికుల ప్రాణాలను బలిపెట్టవద్దు. భారత సైన్యానికి ఎప్పుడు ఎలా స్పందించాలో తెలుసు. ఎం చేయాలో వారికి మనం సూచించాల్సిన అవసరం లేదు. సముచిత సమయంలో సముచిత చర్య తీసుకోవడం వారికి తెలుసు. ముందుగా పాకిస్థాన్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రపంచం ప్రకంటించేలా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకరావాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందిగదా అంటూ ఆవేశంతో మాట్లాడడం సముచితం కాదు’ అని ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అయినా ‘సార్! మీరు పుల్వామా దాడి చిత్రాలను చూసినట్లు లేదు. ప్రతీకారం ఒక్కటే పరిష్కారమని మీరు భావించకపోవడానికి అదే కారణం అనుకుంటా’ అని జీన్యూస్ యాంకర్ వ్యాఖ్యానించడం కొసమెరపు. -
రాహుల్‌ను ప్రశ్నించే నోళ్లు మోదీని ప్రశ్నించవా?!
సాక్షి, న్యూఢిల్లీ : షేక్స్పియర్ నవల ‘మ్యాక్బెత్’లో బాంక్యోస్ భూతం వెంటాడినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇంటా బయట 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు వెంటాడుతున్నాయి. ఆయన శుక్రవారం నాడు లండన్‌లో బ్రిటీష్ పార్లమెంటేరియన్లను ఉద్దేశించి ముచ్చటించినప్పుడు కూడా ఈ అల్లర్లు వెంటాడక తప్పలేదు. అల్లర్లలో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నట్లు మీరు అంగీకరిస్తున్నారా? అన్న ప్రశ్న ఎదురుకాగానే రాహుల్ గాంధీ ఎప్పటిలాగానే బేల మొఖం వేసి ‘నేను అంగీకరించను. అయితే హింసాకాండ చెలరేగిన మాట వాస్తవమే. అదొక విషాధ ఘటన. 1984 అల్లర్లను ప్రతీకారా భూతంగా పిలవచ్చు’ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ సమాధానాన్ని అల్లర్లలో పార్టీ పాత్రను అంగీకరించినట్లుగానే స్వీకరించాలని ఆయన మద్దతుదారులు అంటున్నారు. అంతకుమించి ఆయన నుంచి సమాధానాన్ని రాబట్టేందుకు ప్రయత్నించడమంటే అది అహేతుకం, కఠనం అవుతుందన్నది వారి వాదన. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగినప్పుడు రాహుల్ గాంధీకి 14 ఏళ్లు. ఆ వయసులో జరిగిన అల్లర్ల గురించి ఆయన్ని ప్రశ్నించడం అహేతకమని, ఆ అల్లర్లు జరిగినప్పుడు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నారు కనక ఆ ప్రశ్న కొడుకును అడగడం కఠినమన్నది రాహుల్ మద్దతుదారుల భావన. 2005, ఆగస్టు 11వ తేదీన అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సిక్కు అల్లర్లకు బేషరుతుగా క్షమాణలు చెప్పారు. ఆయన ఒక్క సిక్కు సామాజిక వర్గానికే కాకుండా మొత్తం దేశానికి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికీ నాటి అల్లర్ల గురించి ప్రశ్నించడం ఎందుకన్నది ఆయన మద్దతుదారుల వాదన. నాటి అల్లర్లలో కాంగ్రెస్ పాత్ర ఉందన్న విషయాన్ని అంగీకరించినదీ, లేనిదీ మన్మోహన్ క్షమాపణలు స్పష్టం చేయడం లేదు కనుక పార్టీ నాయకత్వంలో ఉన్నంత కాలం రాహుల్ ఈ ప్రశ్నను ఎదుర్కోవాల్సిందేనన్నది వ్యతిరేకుల వాదన. గుచ్చి గుచ్చి ప్రశ్నించిన అర్నాబ్ గోస్వామి 2014లో టీవీ యాంకర్ అర్నాబ్ గోస్వామి రాహుల్ గాంధీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన 1984 అల్లర్లకు సంబంధించి గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. నాడు అల్లర్లను అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నదని రాహుల్ సమాధానమిచ్చి తప్పుకునేందుకు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా నాటి అల్లర్లలో కమల్ నాథ్ లాంటి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర ఉందన్నది ప్రజలందరికి తెల్సిందే. నాటి అల్లర్లను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిన కమల్ నాథ్ నేడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదుతున్నందున, ఏడాదిలోగా సార్వత్రిక ఎన్నికలు రానున్నందున రాహుల్ గాంధీని అల్లర్ల భూతం వెంటాడక తప్పదు. నాటి అల్లర్లకు సంబంధించి రాజీవ్ గాంధీనే ప్రశ్నించినప్పుడు ‘ఓ మహావృక్షం కూలినప్పుడు భూమి కంపించడం’ సహజమని చెప్పారు. పరోక్షంగాన్నైనా అల్లర్లలో పార్టీ పాత్ర ఉందన్న విషయాన్ని రాజీవ్ గాంధీ అంగీకరించారు. తండ్రి తప్పులకు తనయుడిని బాధ్యుడిని చేయడం ఎంత అసమంజసమో, ఒకతరంలో పార్టీ చేసిన తప్పులకు మరో తరం నాయకుడిని బాధ్యుడిని చేసి ప్రశ్నించడం అంతే అహేతుకం. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూల నాయకత్వానికి వారసుడే కాకుండా, స్వాంతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్ర ఉందని చెప్పుకుంటున్నందున, అది తనకు గర్వకారణం అంటున్నందున ఆయన ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందే. ప్రధాని మోదీ లాగా తాను ఓ జాతి విద్వేషిని కానను, తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని చెప్పుకుంటున్నందున కాంగ్రెస్ తప్పిదాన్ని అంగీకరించాల్సిందే. మోదీలో లేని నిజాయితీ తనలో ఉందని నిరూపించుకోవడానికైనా రాహుల్ నిజాయితీగా వ్యవహరించాల్సిందే. 2002 అల్లర్లు: అలాగే వ్యవహరించిన మోదీ ప్రభుత్వం సిక్కు అల్లర్లప్పుడు రాజీవ్ ప్రభుత్వం ఎలా చూసి చూడనట్లు వ్యవహరించిందో 2002లో గుజరాత్లో మత మారణహోమం జరిగినప్పుడు అప్పటి నరేంద్ర మోదీ ప్రభుత్వం అలాగే వ్యవహరించిందని భారతీయులకే కాకుండా యావత్ ప్రపంచానికి తెలుసు. అయినా మోదీ ఎక్కడికెళ్లినా 2002 అల్లర్లకు సంబంధించిన ప్రశ్న తలెత్తదు. కారణం ప్రశ్నలను ఆయనే ఎంపిక చేసుకుంటారు. అనుకోకుండా ఈ ప్రశ్న అడగాల్సిన అవకాశం అప్పుడప్పుడు జర్నలిస్టులకు వచ్చినా వారు వదులుకుంటారు. అందుకు కారణం ఆయనంటే గుడ్డి భక్తి లేదా భయం కావచ్చు. సిక్కు అల్లర్లకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీని గుచ్చి గుచ్చి ప్రశ్నించిన టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి, ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసినప్పుడు గుజరాత్ అల్లర్ల ప్రస్తావనే తీసుకరాలేదు. పారిపోయిన మోదీ మరో టీవీ యాంకర్ కరణ్ థాపర్ తన ‘డెవిల్స్ అడ్వకేట్’ టాక్ షోలో నరేంద్ర మోదీని ఇరికించేందుకు ప్రయత్నించినప్పుడు మోదీ పారిపోయారు. ‘2002లో అల్లర్లు జరిగి ఐదేళ్లు అవుతున్నా (2007) మిమ్మల్ని ఆ భూతం ఎందుకు విడిచి పెట్టడం లేదు. ఆ అల్లర్లను నిరోధించేందుకు మీరెందుకు ప్రయత్నించలేదు’ అని ప్రశ్నించినప్పుడు ‘ఆ.. కరణ్ థాపర్ లాంటి జర్నలిస్టులకు ఆ బాధ్యత అప్పగించాను’ అని చమత్కారంగా మాట్లాడి తప్పించుకోవాలని మోదీ చూశారు. ‘నాటి మారణకాండకు విచారిస్తున్నానని మీరెందుకు అంగీకరించరు?’ అని కరణ్ థాపర్ మళ్లీ ప్రశ్నించగా, ‘నేనేమీ చెప్పాలో అది అప్పుడే చెప్పాను. కావాలంటే నాటి డాక్యుమెంట్లు తిరగేసి చూసుకో!’ అని చిర చిరలాడుతూ సమాధానం ఇచ్చిన మోదీ, అంతటితో ఇంటర్వ్యూను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి టాక్ షో నుంచి అర్ధంతరంగా నడిచి వెళ్లిపోయారు. సైప్రస్ హైకమిషనర్ రాఘవన్ ఎలా అయ్యారు! 2002 అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోదీకి క్లీన్చిట్ ఇచ్చిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)’ చైర్మన్ రాఘవన్, మోదీ ప్రధాన మంత్రి అయ్యాక సిప్రస్ దేశానికి హైకమిషనర్ అవడం కాకతాళీయమేమీ కాదు. మోదీ ప్రధాని అయినప్పుడు, ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ ఆయన్ని గుజరాత్ అల్లర్ల గురించి ఎవరు ప్రశ్నించలేదు. రాయిటర్స్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ఉపమానంతో సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. రాయిటర్స్ ప్రతినిధి రెట్టించి ప్రశ్నించలేక పోయారు. గుజరాత్ అల్లర్ల గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించినందునే మోదీతో తన స్నేహం దెబ్బతిన్నదని, అంతకుముందు మోదీ తనకు మంచి మిత్రుడని, అందుకనే ప్రధాని అయ్యాక మోదీ తనకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించారని ‘2014 : భారత్‌ను మార్చి ఆ ఎన్నికలు’ అనే పుస్తకంలో సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఎప్పటికైనా మంచి మిత్రులవుతారా!?! -
పారిపోయిన మోదీ
-
అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదు
ముంబై: ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రఖ్యాత టీవీ వ్యాఖ్యాత, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై ముంబైలోని అలీభాగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఇటీరియర్ డిజైనర్‌గా పరిచేస్తున్న అన్వాయ్ నాయక్ తనకు అర్నాబ్ గోస్వామి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని, శనివారం అలీభాగ్‌లోని తన బంగ్లాలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాయక్ వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆయన భార్య అలీభాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. నాయక్ భార్య అక్షత ఫిర్యాదు మేరకు గోస్వామితో సహా మరో ఇద్దరు ఫిరోజ్ షేక్, నితీష్ సార్థాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్ అధికారి సంజయ్ పాటిల్ తెలిపారు. రిపబ్లిక్ టీవీ నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నాయక్ భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. రిపబ్లిక్ టీవీ మాత్రం అక్షత ఆరోపణలను ఖండించింది. నాయక్‌కు చెల్లించాల్సిన బకాయిలను వాయిదా పద్దతిలో మొత్తం చెల్లించామని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఆధారాలను తగిన సమయంలో అధికారుల ముందు ఉంచుతామని పేర్కొంది. నాయక్ ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో తమ వద్ద పూర్తి ఆధారాలు లేవని, పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాతనే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నాయక్ భార్య చేస్తున్న ఆరోపణలపై స్పష్టత లేదని, పూర్తి ఆధారాలు లభ్యమయేవరకు ఎవ్వరిని అరెస్ట్ చేయమని పోలీస్ అధికారులు తెలిపారు. -
ఆ మచ్చ నేను భరించలేను
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు గూఢాచర్యం చేసిందన్న ఆరోపణలు రావటంతో మనస్తాపం చెందిన ఓ పాత్రికేయురాలు రాజీనామా చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ఛానెల్ రిపబ్లికన్ టీవీలో శ్వేతా కోఠారి సీనియర్ కరస్పాండెంట్‌గా విధులు నిర్వహించేవారు. ఈ క్రమంలో ఛానెల్ ను వీడుతున్నట్లు చెబుతూ తన ఫేస్ బుక్‌లో ఆమె ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. గూఢాచర్యం చేశానన్న ఆరోపణలు వాస్తవం కాదు. ఆ మచ్చ నేను భరించలేను. అందుకే ఛానెల్ వీడుతున్న అని ఆమె తెలిపారు. కాగా, శ్వేతా కోఠారి.. కాంగ్రెస్ నేత శశిథరూర్ కు తమ ఛానెల్లోని సమాచారం అందవేసిందన్న అనుమానంతో ఎడిటర్ ఆమెపై నిఘా పెట్టాడంట. ఆమె కదలికలను గమనించి తనకు సమాచారం చేరవేయాలని సిబ్బందికి సూచించాడంట. అంతేకాదు ఆమె ఆర్థిక పరిస్థితులపై కూడా ఆరాతీశాడని చెబుతున్నారు. ఈ విషయాలను ఓ సహోద్యోగి ద్వారా తెలుసుకున్న ఆమె.. ఆ ఆరోపణలను నిర్ధారించుకున్నాకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అయితే సోషల్ మీడియాలో శశిథరూర్‌ను ఆమె ఫాలో కావటం.. పైగా శశిథరూర్‌కు సంబంధించి ఛేంజ్.ఓఆర్జీ పిటిషన్‌పై శ్వేత సంతకం చేయటంతోనే అర్నాబ్ ఆ నిర్ణయానికి వచ్చి ఉంటాడని భావిస్తున్నట్లు ఆమె అంటున్నారు. కాగా, సంస్థలో ఇలా వేధింపులు ఎదుర్కుంటున్న సిబ్బంది చాలా మందే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించటం గమనార్హం. ఇక శ్వేతా కొఠారి తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని శశిథరూర్ ట్విట్టర్ వేదికగా హర్షించారు. తనకు గూఢాచారులను నియమించుకోవాల్సిన అవసరం లేదన్న ఆయన.. నిజాయితీపరులైన పాత్రికేయులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ట్వీట్ చేశారు. Congratulations on standing up for your own integrity: https://t.co/QaNyocjFT7 I don't employ spies, but i do respect serious journalists. https://t.co/VtlaqsXMpk — Shashi Tharoor (@ShashiTharoor) October 13, 2017 -
అర్నబ్ దొరికితే..ఆడుకోరా!
అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి... అనేది సామెత. కానీ అలాకాకుండా అబద్ధం ఆడి అడ్డంగా (ససాక్ష్యంగా) దొరికిపోతే.. ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఊహించండి. తన టీవీ షోలో అందర్నీ ఆడేసుకునే విఖ్యాత జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామి పరిస్థితి ఇదే! మరి నెటిజన్లు ఊరుకుంటారా? అసలే అవతలున్నది అర్నబ్... అంతే రెచ్చిపోయారు. తమలోని సృజనకు సానబెట్టి ఒక ఆట ఆడుకున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ‘వావ్... గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో తన కారుపై దాడి జరిగిందని నా మిత్రుడు అర్నబ్ చెబుతున్నాడు. నిజమేమిటంటే... అతనసలు అహ్మదాబాద్ అల్లర్ల కవరేజీలో పాల్గొననేలేదు’ ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఈనెల 19న చేసిన ట్వీట్. ట్వీట్‌తో పాటు యూట్యూబ్‌లో అర్నబ్ ప్రసంగం తాలూకు లింక్‌ను కూడా రాజ్‌దీప్ షేర్ చేశారు. వీడియోలో అర్నబ్ ఏమన్నాడంటే... ‘‘అది 2002. అహ్మదాబాద్‌లో సీఎం నివాసానికి 50 మీటర్ల దూరంలో ఉండగా... చేతుల్లో త్రిశూలాలతో ఒక గుంపు మా అంబాసిడర్ కారును చుట్టుముట్టింది. జర్నలిస్టులమని ఎంత చెబుతున్నా.. మతమేమిటని రెట్టించి అడిగారు. అదృష్టవశాత్తు ఆ రోజు మా కారులో మైనారిటీలు ఎవరూ లేరు. మా ఐడీ కార్డులపై పేర్లు చూసి వదిలిపెట్టారు. అయితే కారు డ్రైవర్‌కు ఎలాంటి ఐడీ కార్డు లేదు. భయంతో వణికిపోయాడు. చివరకు చేతిపైనున్న ‘హే రామ్’అని రాసున్న పచ్చబొట్టు లాంటి దాన్ని చూపించి బయటపడ్డాడు’’ నిజమేమిటంటే ఈ దాడి జరిగింది రాజ్‌దీప్ సర్దేశాయ్ బృందంపై. అప్పుడు రాజ్‌దీప్, అర్నబ్లు ఇద్దరూ ఎన్డీటీవీలో పనిచేసేవారు. గుజరాత్ అల్లర్లను కవర్ చేసిన బృందంలో తొలుత అర్నబ్ లేడు. తర్వాతి దశలో వెళ్లాడు. రాజ్దీప్తోపాటు నాడు కవరేజీలో పాల్గొన్న తోటి జర్నలిస్టులు కూడా దీన్ని ధ్రువీకరించారు. రిపబ్లిక్ టీవీ న్యూస్, స్పెషల్ ప్రాజెక్ట్ ఎడిటర్ ప్రేమా శ్రీదేవి... నాటి కవరేజీలో పాల్గొన్న బృందం గ్రూపు ఫొటోను ట్వీట్ చేశారు. దీనిపై మరో సీనియర్ జర్నలిస్టు మాయా మీర్చందానీ స్పందిస్తూ.. ‘అల్లర్ల తర్వాత వారం రోజులకు తీసిన ఫొటో ఇది. అర్నబ్ రెండు రోజుల కోసం ఖేడాకు వెళ్లారు. అప్పటిదీ ఫొటో. కాబట్టి ఈ ఫొటో అర్నబ్ అబద్ధాన్ని నిజం చేయలేదు’అని పేర్కొన్నారు. ఏ చిన్న ఆధారం దొరికినా... ఇంతెత్తున లేచే అర్నబ్ మాత్రం తన వ్యాఖ్యలపై ఇంత వివాదం జరిగినా ఇప్పటిదాకా స్పందించలేదు. ‘‘గొప్పలు చెప్పుకోవడానికి కూడా ఓ హద్దుండాలి. నా వృత్తి ఈ స్థితికి వచ్చినందుకు చింతిస్తున్నాను’’అని రాజ్‌దీప్ సర్దేశాయ్ మరో ట్వీట్ చేశారు. అర్నబ్ క్షమాపణ చెప్పాలన్నారు. అంతే నెటిజన్లు విరుచుకుపడ్డారు. తమలోని సృజన బయటికి తీస్తూ ప్రముఖుల పాత ఫొటోలను ఫొటోషాప్ ద్వారా మార్ఫింగ్ చేసి... ‘అర్నబ్ డిడ్ ఇట్’అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీటర్లో పోస్ట్‌చేశారు. ఇది బాగా వైరల్ అయ్యింది. నెటిజన్లు పెట్టిన కొన్ని పోస్టుల్లో మచ్చుకు కొన్ని... - ‘‘ఎవరికీ తెలియని విషయమేమిటంటే.. చంద్రుడిపై తొలుత కాలుమోపిన వ్యక్తి అర్నబ్ గోస్వామియే. స్పేస్ సూట్లో ఉంది అతనే. కానీ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఆ క్రెడిట్ తీసేసుకున్నాడు’’ - ‘‘మహాత్మాగాంధీని అహింసామార్గంలో నడిపిస్తున్న అర్నబ్’’’ - ‘‘ఇండియన్ నేషనల్ ఆర్మీని పరిశీలిస్తున్న అర్నబ్’’ - ‘‘ఎడ్వినా మౌంట్‌బాటెన్ సిగరెట్‌ను వెలిగిస్తున్న అర్నబ్’’ - ‘‘1857లో బీఫ్ తినడానికి నిరాకరించి సిఫాయి తిరుగుబాటును లేవదీసిన అర్నబ్’’ - ‘‘క్విట్ ఇండియా పిలుపునకు ముందు గాంధీ కోసం తాను రాసిన ప్రసంగ పాఠాన్ని మహాత్మునికి అందజేస్తున్న బాల అర్నబ్’’ - ‘‘అర్నబ్ కారును అడ్డగిస్తున్న డైనోసార్’’ - ‘‘అర్నబ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు నెహ్రూకు ధన్యవాదాలు తెలుపుతున్న ఐన్‌స్టీన్. ఐన్‌స్టీన్‌కు సాపేక్ష సిద్ధాంతాన్ని అర్నబ్ బోధించేందుకే ఈ భేటీ.’’ - ‘‘జార్జ్ ఫోర్మన్తో తలపడటానికి ముందు మహ్మద్ అలీకి శిక్షణ ఇస్తున్న అర్నబ్’’ - ‘‘1893లో దక్షిణాఫ్రికాలోని పీటర్‌మార్టిజ్‌బర్గ్ రైల్వేస్టేషన్లో తెల్లవారి కోసమే ప్రత్యేకించిన ఫస్ట్‌క్లాస్ బోగీలో కూర్చున్నందుకు రైలు నుంచి బయటకు తోసివేయబడ్డ అర్నబ్’’ -
ఆర్నాబ్‌కు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు ఆర్నాబ్ గోస్వామికి ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఒక లైవ్ టెలివిజన్‌లో ఓ వ్యక్తి పేరును ఎలా ప్రస్తావిస్తారని, అతడిని తప్పుచేసిన వ్యక్తిగా ఎలా చెప్తారని ప్రశ్నించింది. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. సునంద పుష్కర్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అసిస్టెంట్ నారాయణ్‌తో రిపబ్లిక్ టీవీ ద్వారా లైవ్‌లో మాట్లాడిన గోస్వామి నేరుగా శశిథరూర్ పేరును ప్రస్తావించడంతోపాటు, ఆయనే తప్పుచేశారని అర్ధం వచ్చేట్లుగా మాట్లాడారు. దీనికి సంబంధించి థరూర్ కోర్టులో ఆర్నాబ్‌పై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసుపైనే తాజాగా హైకోర్టు స్పందిస్తూ ఆర్నాబ్‌కు అక్షింతలు వేసింది. గోస్వామినే ఒక లైవ్ టీవీ ద్వారా ఒక వ్యక్తిపై అంతిమ నిర్ణయానికి రాకూడదని, దోషిగా ఓ వ్యక్తిని ప్రకటించకూడదని, శశిథరూర్ పేరును ప్రస్తావించరాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో, ఆర్నాబ్ తరుపు న్యాయవాది సందీప్ సేథి వివరణ ఇస్తూ ఇకపై ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. తదుపరి వాదనలు ఆగస్టు 16కు కోర్టు వాయిదా వేసింది. -
సీనియర్ జర్నలిస్ట్‌పై క్రిమినల్ కేసులు
ముంబై: సీనియర్ జర్నలిస్ట్, టైమ్స్ నౌ ఛానల్ మాజీ సంపాదకుడు, న్యూస్ అవర్ యాంకర్ ఆర్నబ్ గోస్వామి మరో సారి చిక్కుల్లో పడ్డారు. ఎడిటర్ ఇన్ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న ఆర్నబ్ పై టైమ్స్ నౌ క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేసింది. తమ చానల్ కు సంబంధించిన సమాచార కాపీలను రిపబ్లిక్ టీవీలో మే 6, 8 తేదీలలలో అక్రమంగా వాడుకున్నారని మండిపడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అని పిలిచే బెన్నెట్, కోల్మన్ అండ్ కో లిమిటెడ్ గ్రూప్ ఆర్నాబ్ గోస్వామిపై దొంగతనం, క్రిమినల్ ఉల్లంఘన, ఆస్తి దుర్వినియోగం, బిసిసిఎల్ మేధోసంపత్తి హక్కుల వినియోగం కింద ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రిపబ్లిక్ టీవీ లాంచ్ అయిన మొదటి రోజు, ఆ తర్వాత లో తమకు సంబంధించిన కొన్ని ఫుటేజీ వాడుకున్నట్టు ఆరోపించారు. వారిద్దరూ తమ చానల్ ఉద్యోగులుగాఉన్నప్పటి సమాచారిన్నఅక్రమంగా వాడుకున్నారన్నారు. లాలు ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి మరియు షాబాబుద్దీన్ మధ్య ఉన్న ఫోన్ సంభాషణల ఆడియో టేపులను మే 6న , సునందా పుష్కర్ తో (కాంగ్రెస్ నాయకుడు శశి తారూర్ భార్య) అప్పటి తమ రిపోర్టర్‌గా ఉన్న ప్రేమా శ్రీదేవి ఫోన్ సంభాషణలను టేపులను రిపబ్లిక్ టీవీలో మే 8న వాడుకున్నారని పిర్యాదు చేసింది. ఈ రెండు ఫోన్ సంభాషణల ఆడియో టేపులను వారు ఉద్యోగం లో ఉన్నప్పటివని బీసీసీఎల్ ఆరోపించింది. గోస్వామి, శ్రీదేవి ఉద్దేశపూర్వకంగా టైమ్స్ నౌ మేధో సంపదను వాడుకోవడంపై భారత శిక్షాస్మృతిసెక్షన్ 403, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, ఇతర నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాలని కోరింది. కాగా గత నవంబర్‌లో టైమ్స్ కు రాజీనామా అనంతరం పేరుతో కొత్త చానల్‌ను రిపబ్లిక్ పేరుతో మే 6న లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
ధోనీ, అర్నబ్, రాంరహీంలకు కేంద్రం నో!
పద్మ పురస్కారాల తిరస్కరణ.. పలువురు ప్రముఖ వ్యక్తులకు పద్మా పురస్కారాలు అందజేయాలంటూ వచ్చిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ, వివాదాస్పద ఆధ్యాత్మిక నాయకుడు గుర్మీత్ రాంరహీం సింగ్, తబలా మ్యాస్ట్రో జకీర్ హుస్సేన్, జర్నలిస్టు అర్నబ్ గోస్వామి తదితరులకు పద్మా అవార్డులు ఇవ్వాలంటూ ప్రతిపాదనలు వచ్చినా.. వాటిని కేంద్రం తోసిపుచ్చిందని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రిక ఓ కథనంలో తెలిపింది. అయితే, ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్, బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషీ పేర్లు మొదటి నామినేషన్ల జాబితాలో లేవని, అయినా వారికి దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిందని పేర్కొంది. ప్రతిష్టాత్మకమైన పద్మా పురస్కారాలు 'ప్రజావ్యవహారాల' విభాగంలోకి వస్తాయని, ఈ అవార్డులు ఎవరికి ఇవ్వాలన్న విషయంలో కేంద్రం విచక్షణాధికారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీజేడీ ఎంపీ బైజయంతి పాండా, సంగీత దర్శకుడు అనూ మాలిక్, 1986లో విమాన హైజాక్ వ్యవహారంలో హత్యకు గురైన ఎయిర్‌హోస్టెస్ నీర్జా బనోత్ తదితర ప్రముఖులకు కూడా కేంద్రం పద్మ పురస్కారాలను నిరాకరించింది. ఏడుగురు పద్మవిభూషణ్, ఏడుగురికి పద్మభూషణ్ సహా మొత్తం 89మందికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్థంలో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. -
అర్ణబ్ ఈజ్ కమింగ్ బ్యాక్...ట్విట్టర్ లో సందడి
న్యూఢిల్లీ: 'ఇండియా వాంట్స్ టు నో' అంటూ టీవీ ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి ఈజ్ కమింగ్ బ్యాక్. అవును ఈ విషయాన్ని స్వయంగా ఆయనే దృవీకరించినట్టుగా ట్విట్టర్ లో అభినందనలు వెల్లువెత్తాయి. తనదైన స్టైల్ యాంకరింగ్‌తో...బాగా పాపులర్ అయిన అర్ణబ్ 'రిపబ్లిక్ ' అనే కొత్త వెంచర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'నా కొత్త వెంచర్ పేరు రిపబ్లిక్. నాకు భారత ప్రజల సపోర్ట్ కావాలి' అంటూ ట్వీట్ చేశారంటూ పేర్కొంటున్నారు. మిగతా విషయాలను మరో రెండు వారాల్లో అందించినున్నట్టు పేర్కొన్నారంటున్నారు. 'రిపబ్లిక్' అనే పేరుతో వస్తున్న అర్ణబ్ గోస్వామి కొత్త మీడియా ఛానల్ 2017 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ ఛానల్ లైవ్‌లోకి రానుందని సమాచారం. అలాగే ముంబైకి వెలుపల ఈ ఛానల్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం తన టీంతో కొత్త వెంచర్ పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పెద్ద టీవీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్.. ఒక ప్రభావవంతమైన అడ్వర్టైజింగ్ కంపెనీలు ఈ వెంచర్లో భాగం కానున్నాయట. కాగా ది న్యూస్ అవర్ ప్రోగ్రామ్‌తో పేరు గడించిన అర్ణబ్ గోస్వామి తన వెంచర్ పేరును ప్రకటించిన గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అభినందనలతో పాటూ, ఛలోక్తులు, వ్యంగ్యోక్తులు వెల్లువెత్తాయి. తను పనిచేస్తున్న ఛానల్ ఎడిటర్-ఇన్-చీఫ్ పదవికి నవంబర్ 1న అర్ణబ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. While#Presstitutes r busy in Rapes of PUBLIC There is a ray of hopes EMERGING as #Republic . Best Of Luck -
ఆర్నబ్ గోస్వామి వీడ్కోలు వీడియో లీక్
-
ఆర్నబ్ గోస్వామి వీడ్కోలు వీడియో లీక్
న్యూఢిల్లీ: ప్రముఖ ఆంగ్ల న్యూస్ చానల్ 'టైమ్స్ నౌ' ఎడిటర్ ఇన్ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న సీనియర్ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి వీడ్కోలు ప్రసంగం వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. మూడు నిమిషాల నిడివున్న ఈ వీడియోను గురువారం ఆన్ లైన్ లో పెట్టారు. 'ఆట ఇప్పుడే మొదలైదంటూ' తన సహచరులను ఉద్దేశించి ఆర్నబ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. మీడియా స్వేచ్ఛపై నమ్మకం కోల్పోవద్దని తన టీమ్ కు సూచించారు. 'ఇండిపెండెంట్ మీడియా గురించి మనకు ఎవరూ బోధించరు. మనతంట మనమే నేర్చుకోవాలి. నేను ఇంత స్వేచ్ఛగా పనిచేయగలిగానంటే అందుకు మీరే కారణం. విధి నిర్వహణలో భాగంగా నేను కొంతమంది నోరు పారేసుకున్నాను. వారికి క్షమాపణ చెబుతున్నాను. మన చానల్ ను టాప్ లో నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించాన'ని వివరణయిచ్చారు. ప్రైమ్‌టైమ్ షో ‘ద న్యూస్ అవర్'తో పాపులరయిన ఆర్నబ్ గోస్వామి పదేళ్ల పాటు 'టైమ్స్ నౌ'లో పనిచేశారు. ఆయన సొంతంగా వార్తా చానల్ పెడతారని ప్రచారం జరుగుతోంది. -
టాటా సన్స్ చైర్మన్‌గా ఆర్నాబ్ గోస్వామి?
న్యూఢిల్లీ: ‘టైమ్స్ నౌ’ టీవీ ఛానెల్ ఎడిటర్ పదవికి రాజీనామా చేసినట్లు భావిస్తున్న ఆర్నాబ్ గోస్వామికి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో ఖాతా లేకపోయినా, ఫాలోవర్లు మాత్రం పుంఖానుపుంఖంగా ఉన్నారు. ఆర్నాబ్ తన పదవికి రాజీనామా చే సినట్లు వార్త వెలువడగానే ఆగమేఘాల మీద యూజర్లు స్పందించి తమదైన రీతిలో ట్వీట్లు చేశారు. స్వీట్లు పంచారు. ‘ఇంతకాలం టీవీలో అనధికార జడ్జీగా వ్యవహరించిన ఆర్నాబ్ ఇప్పుడు అధికారికంగా సుప్రీం కోర్టు జడ్జీగా వెళ్లేందుకు రాజీనామా చేశారు......కాదు, కాదు, పాకిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లారు....అదికాదు, టాటా సన్స్ చైర్మన్ పదవిని చేపట్టేందుకు వెళ్లారు....ఆర్నాబ్ నిష్క్రమణతో టైమ్స్ నౌ ‘వ్యాల్యూ’ సారీ, సారీ ‘వ్యాల్యూమ్’ తగ్గింది......మొన్న టాటా సన్స్‌లో, నిన్న ట్విట్టర్లో, నేడు టైమ్స్ నౌలో ఉన్నత పదవులు ఖాళీ, అర్హులు ధరఖాస్తు చేసుకోండి....ఆర్నాబ్ రాజీనామా ఎలా చేసి ఉంటారు? కచ్చితంగా అరచి, గీపెట్టి చెప్పే ఉంటారు.....ఆయన చెప్పా పెట్టకుండా రాజీనామా చేస్తే ఎలా? నా అభిప్రాయం ఎలా ఉండాలో ఇప్పుడు నాకెవరు చెబుతారు?....ఎస్ఎమ్మెస్ పోల్ లేకుండా ఎలా రాజీనామా చేస్తారు?..... ‘24 గంటలపాటు ఆర్నాబ్‌ను భరించే ఛానెల్ పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా?....దీపావళి అంటే నిజంగా ఇదే, పటాసుల పేలుళ్లు లేకుండా ప్రశాంతంగా ఉంది....నేను మాత్రం ఒక్క క్షణం టపాసులు పేలుస్తా కాలుష్యం పోయినందుకు....తూ కిత్నే ఆర్నాబ్కో మారేగా హర్ ఛానెల్ సే ఏక్ ఆర్నాబ్ నిక్లేగా.....ఆర్నాబ్ నిష్క్రమణకు ఆందోళనే అవసరంలేదు ఛానెల్, ఆర్కీవ్స్ నుంచి పాత న్యూస్ అవర్ కార్యక్రమాల వీడియోలు ప్రసారం చేస్తే చాలు, తేడా ఎవరూ గుర్తించరు...’ అంటూ ట్వీట్లు ఇలా సాగిపోతున్నాయి. ఆర్నాబ్ గోస్వామి రాజీనామా గురించి తానుగానీ, టైమ్స్ నౌగాని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ పాశ్చాత్య మీడియాను కాలదన్నే స్థాయిలో భారత్ మీడియా సామ్రాజ్యం ఎదగాలని ఆయన ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కనుక అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆయన బయటకు వెళ్లి ఉంటారని....తాను సొంతంగా ఎప్పటి నుంచో ఓ మీడియా చానెల్ ప్రారంభించాలన్నది ఆయన కోరికని, ఆ ప్రయత్నాల్లోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని ఊహాగానాలు చెలరేగులుతున్నాయి. Arnab Goswami 'resigns' from Times Now. To start his own venture. After being one unofficially. He will now officially become S.C. Judge. — Sorabh Pant (@hankypanty) 1 November 2016 Arnab the new Chairman of Tata Sons? — ClooneyOfKerala (@sidin) November 1, 2016 -
బ్రేకింగ్ న్యూస్: ఆర్నబ్ గోస్వామి ఔట్!
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి ప్రముఖ ఆంగ్ల న్యూస్ చానెల్ 'టైమ్స్ నౌ' ఎడిటర్ ఇన్ చీఫ్ పదవి నుంచి తప్పుకొన్నారు. ఆయన గతకొన్నిరోజులుగా ప్రైమ్‌టైమ్ షో ‘ద న్యూస్ అవర్'లో కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ఎడిటోరియల్ మీటింగ్‌లో ఆర్నబ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్నట్టు సమాచారం. టైమ్స్ నౌ చానెల్లో ఆవేశపూరితమైన చర్చలు చేపట్టడం ద్వారా ఆర్నబ్ ప్రముఖంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆర్నబ్ పలు ఆవేశపూరితమైన టీవీ చర్చలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు 'వై కేటగిరీ' భద్రత కల్పించింది. దీంతో ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు సహా మొత్తం 20 మంది భద్రతా సిబ్బంది ఆయనకు నిరంతరం రక్షణ కల్పిస్తున్నారు. ఆర్నబ్ రాజీనామా వార్త తెలియడంతో ట్విట్టర్లో ఆయన ట్రేండ్ అవుతున్నారు. -
ఆర్నాబ్ కే అంత భద్రత ఎందుకు?
న్యూఢిల్లీ: టైమ్స్ నౌ న్యూస్ ఛానెల్ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామికి ఏకంగా 22 మంది భద్రతా సిబ్బందితో ‘వై’ కేటగిరీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కల్పించాల్సి వచ్చిందో జర్నలిస్టు పెద్దలందరూ ‘న్యూస్ అవర్’ కార్యక్రమంలో కూర్చొని చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ప్రాణాలకు ముప్పున్న కారణంగానే ఈ రక్షణ కల్పించాల్సిన అసరం వచ్చిందని కేంద్ర హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచే భద్రతా సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నందున ఆర్నాబ్ గోస్వామికి ఎందుకు? వై ? భద్రతను ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఒక్క జర్నలిస్టులకే కాకుండా మొత్తం ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకు చర్చించి, సమాధానాలు రాబట్టాల్సిన అంశాలు ఏమిటంటే..... 1. ఆర్నాబ్ గోస్వామి ప్రాణాలకు ముప్పుందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు ఎలా తెలిసింది? ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చిన సందేశాలనుగానీ, సమాచారాన్నిగానీ వారు మధ్యలో ట్రేస్ చేశారా? 2. ఆర్నాబ్ గోస్వామి వ్యాఖ్యలకు ఏ ఉగ్రవాద సంస్థ నొచ్చుకుంది? ఏ ఉగ్రవాద సంస్థ నుంచి ఆయన ప్రాణాలకు ముప్పుంది? 3. ‘వై’ కేటగిరీ భద్రతనే ఆయనకు ఎందుకు కల్పించాలనుకున్నారు? జెడ్ లేదా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఎందుకు కల్పించడం లేదు? 4. తమకు వ్యతిరేకంగా ఆర్నాబ్ చేసిన ఏ వ్యాఖ్యలు తీవ్రమైనవిగా ఉగ్రవాద సంస్థలు భావించాయి? ఇవి తెలుసుకుంటే ఎలాంటి వ్యాఖ్యలు తక్కువ తీవ్రతగలవో జర్నలిస్టులు అర్థం చేసుకునేందుకు వీలవుతుంది. 5. టైమ్స్ నౌ ఛానెల్లో ఒక్క ఆర్నాబ్ గోస్వామి ప్రాణాలకు మాత్రమే ముప్పుందా? ఆయన సిబ్బంది ప్రాణాలకు ముప్పు లేదా? ఆయన్ని చంపేందుకు వచ్చే ఉగ్రవాదులు దాడి సందర్భంగా సిబ్బందికి ఎలాంటి హాని తలపెట్టరా? 6. టైమ్స్ నౌ ఛానెల్లో చర్చల కోసం వచ్చే అతిథులకు ఎలాంటి ముప్పులేదా? వారంతా క్షేమంగానే ఉంటారా? 7. ఆర్నాబ్ గోస్వామికి రక్షణ కల్పించడం కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఎంత ఖర్చు పెడుతున్నారు? 8. ముకేశ్ అంబానీకి జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నందుకు ఆయన నుంచి15 లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారు. మరీ ఆర్నాబ్ గోస్వామి నుంచి గానీ, ఆయనకు ఉద్యోగం ఇచ్చిన బెన్నెట్, కోల్మెన్ అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఎన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు? 9. ‘వై’ కేటగిరీ భద్రతా సిబ్బందికి సరైన శిక్షణ ఉందో, లేదో పరీక్షించారా? వారి ధరించే బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు నాణ్యమైనవేనా? దేశంలో జర్నలిస్టులకు కూడా వీఐపీల్లాగా భద్రతను కల్పించడంలో ఆర్నాబ్ గోస్వామి మొదటి వ్యక్తి కాదు. బీజేపీ ఎంపీ, పంజాబ్ కేసరి పత్రిక యజమాని అశ్విణి కుమార్ చోప్రాకు దేశంలోనే అత్యంత ఉన్నతమైన ‘జెడ్ ప్లస్’ కేటగిరీ భద్రతను కల్పించారు. ఆర్నాబ్ స్వామికన్నా చోప్రా భద్రతకు 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. పంజాబ్‌లో ఖలిస్థాన్ ఉద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో ఆయన తాత లాలా జగత్ నారాయణన్ 1981లో, ఆయన తండ్రి రమేశ్ చందర్ 1984లో హత్యకు గురయ్యారు. మరి అలాంటి ముప్పు ఇప్పుడు చోప్రాకు లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగిస్తున్నారు. ఒక్క ఉగ్రవాదుల నుంచి ముప్పుందన్న కారణంగానే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా జర్నలిస్టులకు భద్రతను కల్పిస్తున్నారు. దౌర్జన్యంగా డబ్బు దండుకున్నారన్న కేసులో మాజీ కాంగ్రెస్ ఎంపీ, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ నుంచి ముప్పుందన్న కారణంగా జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరికి ‘ఎక్స్’ కేటగిరీ కింద నలుగురు సెక్యూరిటీ గార్డులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్క జర్నలిస్టులకే కాకుండా ఏ పౌరుడి ప్రాణాలకు ముప్పున్నా దేశ రాజ్యాంగం ప్రకారం ఆ పౌరుడికి భద్రతను కల్పించాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానిది. అలాంటప్పుడు కేంద్రం నేరుగా జోక్యం చేసుకొని ఎందుకు భద్రతను కల్పిస్తుందో కూడా సమాధానం రాబట్టాలి. 2010 సంవత్సరం నుంచి దేశంలో 22 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వారంతా తమ ప్రాణాలకు ముప్పుందంటూ ఎంత మొత్తుకున్నా ఏ రాష్ట్ర ప్రభుత్వంగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ పట్టించుకోలేదు. జగేంద్ర సింగ్ అనే జర్నలిస్ట్ గత జూన్ నెలలో తన ప్రాణాలకు ముప్పుందంటూ అధికారులకు మొరపెట్టుకున్నా, ఫేస్బుక్లో తనకున్న ప్రాణాపాయాన్ని తెలియజేసినా పట్టించుకోలేదు. ఫలితంగా గతేడాది జూన్ నెలలో జగేంద్ర సింగ్ హత్యకు గురయ్యారు. ప్రభుత్వం ఈ జర్నలిస్టులందరికి భద్రత కల్పించి ఉన్నట్టయితే వీరంతా నేడు బతికి ఉండేవారు కాదా? --------------- ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
ఆర్నబ్ గోస్వామికి భారీ భద్రత
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం 'వై' కేటగిరి భద్రత కల్పించింది. పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ఆయనకు ప్రభుత్వం సెక్యురిటీ కల్పించిందని 'హిందూస్థాన్ టైమ్స్' వెల్లడించింది. ఆర్నబ్ గోస్వామికి 24 గంటల పాటు 20 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తారు. 'ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత ఆర్నబ్ కు భద్రత కల్పించాం. టైమ్స్ నౌ చానల్ లో పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయనను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నార'ని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు. టైమ్స్ నౌ చానల్ లో ప్రైమ్ టైమ్ న్యూస్ డిబేట్ ద్వారా పాపులరయిన ఆర్నబ్.. ఉడీ దాడుల తర్వాత తీవ్రవాద సంస్థలు, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా బలంగా గళం వినిపించారు. ఆర్నబ్ తో పాటు జీ న్యూస్ కు చెందిన సుధీర్ చౌధరీ(ఎక్స్ కేటగిరి), సమాచార్ ప్లస్ కు చెందిన ఉమేశ్ కుమార్(వై కేటగిరి), అశ్విని కుమార్ చోప్రా(జడ్ ప్లస్ కేటగిరి)లకు కేంద్రం భద్రత కల్పించింది. -
ఆర్నబ్ ఏం అడిగాడు.. సెహ్వాగ్ ఏం చెప్పాడు!
రియో ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శనపై చెత్త వ్యాఖ్యలు చేసి బ్రిటిష్ జర్నలిస్టు పీర్స్ మోర్గాన్ వార్తలో నిలిచిన సంగతి తెలిసిందే. ’120 కోట్లమంది జనాభా కలిగిన దేశం కేవలం రెండంటే రెండు పతకాలు సాధించినందుకు సంబరాలు చేసుకుంటోంది. ఎంత చిరాకు కలిగించే విషయమిది’ అని మోర్గాన్ నోరు పారేసుకున్నాడు. నోటి దురుసుతనం బాగా ఎక్కువైన ఈ సీఎన్ఎన్ మాజీ ప్రజెంటర్కు ట్విట్టర్లో భారతీయులు ఓ రేంజ్లో కౌంటరిచ్చారు. మాజీ డ్యాషింగ్ క్రికెటర్ సెహ్వాగ్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఇప్పటివరకు క్రికెట్లో వరల్డ్ కప్ గెలువని మీరా (ఇంగ్లండ్) మాగురించి మాట్లాడేదని దెప్పిపొడిచాడు. దీంతో రోషం పొడుచుకొచ్చిన మోర్గాన్ ఏకంగా సెహ్వాగ్‌కే సవాల్ విసిరాడు. ’హాయ్ వీరేంద్ర సెహ్వాగ్.. ఇండియా మరో ఒలింపిక్స్ మెడల్ గెలిచేలోపే ఇంగ్లండ్ వన్డే వరల్డ్ కప్ కొడుతోంది. నాతో రూ. 10 లక్షల బెట్టు కాస్తావా’ అని సవాల్ చేశాడు. ఈ సవాల్‌ను లైట్ తీసుకున్న సెహ్వాగ్.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి తన షో 'న్యూస్ అవర్'లో మోర్గాన్‌పై మాట్లాడమని అడిగారని, కానీ, టీవీలో ప్రసారమయ్యేంత సీన్ ఆయనకు లేదని తాను తోసిపుచ్చానని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సున్నితమైన హాస్యంతో కూడిన ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Arnab Goswami wants me to speak on that British guys views on India on NewsHour,but that man doesnt deserve any airtime,hence I have denied — Virender Sehwag (@virendersehwag) 2 September 2016 -
ఆడపిల్లకు ‘సేఫ్ జోన్’ లేదు
ధీర దత్ పదేళ్లప్పుడు తనతో తను యుద్ధం. పీజీలో ప్రేమలోంచి బయట పడేందుకు యుద్ధం. జర్నలిస్ట్‌గా అవినీతి, అక్రమాలతో యుద్ధం. వ్యక్తిగతంగా విసుర్లు, విమర్శలతో యుద్ధం. ప్రస్తుతం ఆర్ణబ్ గోస్వామితో మాటల యుద్ధం! వార్ కరస్పాండెంట్ బర్ఖాదత్.. ఎప్పుడూ... ఏదో ఒక వార్ జోన్లో ఉంటూనే ఉంటారు. ఆ మాటే అని చూడండి... ‘అసలు వార్ జోన్లో లేని ఆడపిల్ల ఎవరో చెప్పండి’ అని అడుగుతారు బర్ఖా. బర్ఖాదత్.. ధీర వనిత! ధీర దత్!! ఆడపిల్లకు అమ్మ ఒడి తప్ప ప్రపంచంలో వేరే ‘సేఫ్ జోన్’ లేదు. ఒడిలో ఉన్నంత వరకే అభయం. ఒడి దిగితే అరణ్యం. ఇల్లు, కాలేజ్, కెరియర్... చెడు చూపు ఏ వైపు నుంచి మెల్లిగా చెట్టు దిగి వస్తుందో చెప్పలేం. ఏ పుట్టలోంచి చల్లగా పాక్కుంటూ వస్తుందో కనిపెట్టలేం. ఏ పాతాళంలోంచి పువ్వులా పరిమళమై విరుస్తుందో, ఏ గగనంలోంచి నవ్వులా పరవశమై కురుస్తుందో అస్సలు ఊహించలేం. ప్రభాదత్కి ఇలాంటి భయాలేం లేవు. పిల్లని ఒడిలోంచి తోసేసింది! చెట్టు పుట్టా ఎక్కడం నేర్చుకో. కొండల్నీ గుట్టల్నీ తొలుచుకుంటూ వెళ్లిపో. నింగిలోకి విహంగమై ఎగిరిపో. ఎక్కడా.. నిలవకు, తడవకు, జడవకు. ఇదీ ఆ ఇంట్లో ఫస్ట్ చైల్డ్‌కి ఫస్ట్ లెసన్. ప్రభాదత్ జర్నలిస్ట్. బర్ఖాదత్ కూడా జర్నలిస్టే అయింది. తండ్రిలా ఆమె ఎయిర్ ఫోర్స్‌ని ఎంచుకోలేదు. అన్ని ఫోర్సులను రాత్రీపగలు మునివేళ్లపై నిలిపి ఉంచే మీడియా ఫోర్స్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇండియన్ మీడియాలోనే.. ఒక శక్తిమంతమైన క్షిపణి.. బర్ఘాదత్. ఆ క్షిపణి ఇప్పుడు.. సాటి జర్నలిస్ట్ ఆర్ణబ్ గోస్వామిపై నిప్పులు కురిపిస్తూ విరుచుకు పడడం దాదాపుగా ఒక యుద్ధవార్తే అయింది. ‘గ్రౌండ్ జీరో’ జర్నలిస్ట్! కేట్ ఆడీ, లిండ్సే హిల్సమ్, అలెక్స్ క్రాఫోర్డ్, ఆర్లా గ్యూరిన్, జీనా కోడర్, మార్తా గెల్హార్న్, బర్ఖాదత్... అంతా ఒకే బెంచ్ స్టూడెంట్స్. ఒకే కాలంలో కాకపోవచ్చు. యుద్ధ కాలాల్లో.. ‘గ్రౌండ్ జీరో’ (విస్ఫోటస్థలి) లోకి వెళ్లి పోయి అక్కడి నుంచి వార్తల్ని ప్రత్యక్షంగా అందించిన మహిళా జర్నలిస్టులు. దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆ దేశాల మధ్యలోకి వెళ్లి యుద్ధాన్ని కవర్ చెయ్యడానికి గట్స్‌తో పని లేదు. జర్నలిజం మీద భక్తి ఉంటే చాలు. భక్తితో పాటు బర్ఖాకు జర్నలిజంపై ప్రేమ, గౌరవం ఉన్నాయి. వాటిని శంకిస్తే మాత్రం ఆమె అపరకాళే అవుతుంది. అయింది. ప్రో-పాకిస్థానీ పావురం?! ఆర్ణబ్ గోస్వామి సంగతి తెలిసిందే. ‘టైమ్స్ నౌ’ న్యూస్ రూమ్‌లో రంకెలేస్తూ, డిబేట్ కి వచ్చినవాళ్ల పీక నొక్కేస్తుంటాడు. అరవడం ఆయన యు.ఎస్.పి. (యునీక్ సెల్లింగ్ పాయింట్). జూలై 8న కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బర్హన్ వాని ఎన్కౌంటర్ జరిగిన తర్వాత టీవీలన్నీ ఎన్‌కౌంటర్‌పై డిబేట్ పెట్టాయి. ఆర్ణబ్ తన డిబేట్లో జర్నలిస్టుల్ని ఉతికేశారు. భారతదేశంలో ఉంటున్న ప్రో-పాకిస్థానీ జర్నలిస్టు పావురాల్ని జైల్లో పడేసి రెక్కలు కత్తిరించేయాలి అనేశారాయన! ఆ మాట ఎన్డీటీవీలో పనిచేస్తున్న బర్ఖాదత్‌కు తగిలింది. వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆర్ణబ్ పని చేస్తున్న ఫీల్డులోనే తను పనిచేస్తున్నందుకు సిగ్గుపడుతున్నానని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యా మాటల వార్ నడుస్తోంది. ‘‘న్యూస్ రూమ్‌లో కూర్చొని చెత్తను పోగేసుకునే నీలాంటి వ్యక్తికి జనం మధ్య తిరిగి వాస్తవాలను చూస్తుండే జర్నలిస్టులను అనే అర్హత లేదు’’ అని ఆర్ణబ్‌పై విరుచుకుపడ్డారు బర్ఖాదత్. బర్హన్ ఎన్కౌంటర్ విషయంలో బర్ఖా మన సైనికుల్ని తప్పుపట్టే విధంగా మాట్లాడారన్నది ఆర్ణబ్ ఆరోపణ. పోరాటమే ఊపిరి రాజకీయ నాయకులతో యుద్ధం. అధికార యంత్రాంగంతో యుద్ధం. అవినీతి, అక్రమాలపై యుద్ధం. అప్పుడప్పుడు ఆర్ణబ్లాంటి వాళ్లతో యుద్ధం. ఆ యుద్ధంలో ఆమె గెలిచారా లేదా అన్నది కాదు, పోరాడారా లేదా అన్నదే ముఖ్యం. బర్ఖా పోరాట యోధురాలు. ఆమె దేశభక్తిపై అనుమానాలు రేకెత్తించడానికి, ఆమె శీల ప్రతిష్టను భంగపరచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వాటన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు బర్ఖా. రెండేళ్ల క్రితం ఆమెపై ఒక రూమర్ వచ్చింది. ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని, వాళ్లిద్దరూ కశ్మీర్ ముస్లింలని! బర్ఖా వాటిని పట్టించుకోలేదు. తనతో తను తొలి యుద్ధం! పట్టించుకోకుండా ఉండడానికి కూడా ఒకోసారి పెద్ద యుద్ధమే చెయ్యాల్సి వస్తుంది! ప్రత్యర్థులను, విరోధులను, పనిలేనివాళ్లను తన మాటలతో, తన నిర్లక్ష్యంతో, తన పరిణతితో తేలిగ్గా మట్టి కరిపించగల బర్ఖా.. బాల్యంలో ఒక్క విషయంలో మాత్రం తనతో తనే తలపడలేకపోయారు! అప్పుడు తనకు పదేళ్లు. పదేళ్లు కూడా ఉన్నాయో లేవో. ఆ సంఘటన మాత్రం బర్ఖాకు బాగా గుర్తుంది. అత్తయ్యలు, మామయ్యలు; పిన్నమ్మలు, బాబాయిలు; బంధువులు, స్నేహితులు, ఆ స్నేహితుల స్నేహితులు... పంజాబీ ఇళ్లల్లో సందడికి కొదవేముంది? ఆ బంధువుల్లో.. ఓ ‘మంచి మామయ్య’ బర్ఖాను ఒకరోజు ఆడుకుందాం రమ్మని తన గదికి తీసుకెళ్లి మీద చెయ్యి వేశాడు. బ్యాడ్ టచ్కీ, గుడ్ టచ్కీ తేడా తెలియని వయసు. కానీ ఆ టచ్‌లో అసహజత్వం ఉందని మాత్రం బర్ఖాకు అర్థమవుతోంది. మంచి మామయ్య ఏదో డర్టీ పని చేస్తున్నాడు. భయపడిపోయింది. అక్కడి నుంచి పరుగెత్తింది. ఆ తర్వాత ఆ మంచి మామయ్య దగ్గరికి వెళ్లలేదు. అమ్మకు చెప్పలేదు. నాన్నకు చెప్పలేదు. అలాగని ఆ ‘డర్టీ’ నుంచి తనూ బయటికి రాలేదు. తనేదో తప్పు చేసిన ఫీలింగ్! కొన్నేళ్ల పాటు ఆ ఫీలింగ్ బర్ఖాను వెంటాడింది. ఎంతవరకు అంటే... ఇంకో డర్టీ ఫెలో ఆమె జీవితంలోకి ప్రవేశించేంత వరకు. కాలేజ్‌లో... ప్రేమ వయెలెన్స్ జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీలో మూస్ కమ్యూనికేషన్ పీజీ కోర్సులో చేరింది బర్ఖా. అప్పటికామె పరిపూర్ణమైన స్త్రీ. తన జీవితం ఎలా ఉండాలన్న దానిపై ఆమెకు స్థిరమైన నిర్ణయాలు ఉన్నాయి. ఒక్కమాటలో... లోకం తెలిసిన పిల్ల. అప్పుడొచ్చాడు కో-స్టూడెంట్ ఒకడు. వచ్చి, ‘‘నిన్ను ప్రేమిస్తున్నాను’’ అన్నాడు. అంత లోకాన్ని చూసిన పిల్ల, అన్ని పుస్తకాలను చదివిన పిల్ల.. అతడి ప్రేమలో పడిపోయింది! తర్వాత అతడు బర్ఖాను సాధించడం మొదలు పెట్టాడు. ఓరోజు చెంప పగలగొట్టాడు. చెయ్యి మెలితిప్పాడు. కిందపడేసి, తలను నేలకేసి కొట్టాడు! ఇదంతా కాలేజ్‌లోనే. కాలేజ్‌లో డొమెస్టిక్ వయలెన్స్! ఎలాగో అతడిని వదిలించుకుంది. పీజీ అయ్యాక ఎన్డీటీవీ ఇంటర్వ్యూకి వెళితే.. అక్కడికి అతడు కూడా వచ్చాడు! కెమెరామెన్‌గా అప్లై చేశాడని తెలిసింది బర్ఖాకు. ‘అతడికి ఉద్యోగం ఇచ్చేపనైతే.. నేనిక్కడ ఉద్యోగం చెయ్యాల్సిన పని లేదు’ అని గట్టిగా చెప్పేసింది బర్ఖా. ఆమె కోసం అతడిని వద్దనుకుంది ఎన్డీటీవీ. ప్రతి ఆడపిల్లా ఒక యోధురాలు ఆడపిల్ల జీవితమే ఒక యుద్ధం అంటారు బర్ఖాదత్. ఆమె ఉద్దేశం.. పరిస్థితులు స్త్రీని యుద్ధ సైనికురాలిగా మార్చేస్తాయని. దేశాలకు యుద్ధాలు రావచ్చు రాకపోవచ్చు. హద్దుల్ని చెరిపేసుకుంటే, స్వేచ్ఛను కాపాడుకునే ప్రయత్నంలో స్త్రీ.. బాల్యంలో, యవ్వనంలో, ఆ తర్వాత కూడా యుద్ధం చేస్తూనే ఉండాల్సి వస్తుందని చెప్పడానికి బర్ఖా జీవితం ఒక నిదర్శనం. రచనలు బర్ఖాదత్ 2015లో ‘ది అన్‌క్వైట్ లాండ్’ అనే పుస్తకం రాశారు. భారతదేశపు తప్పొప్పులపై రిపోర్టర్‌గా బర్ఖా పరిశీలన, విశ్లేషణల సంకలనం ఈ పుస్తకం. అంతకుముందు 2002 నాటి గుజరాత్ అల్లర్లపై ప్రముఖ ఇండో-అమెరికన్ జర్నలిస్టు రాసిన ‘గుజరాత్: ది మేకింగ్ ఆఫ్ ట్రాజెడీ’ పుస్తకంలో బర్ఖా.. ‘నథింగ్ న్యూ?: ఉమెన్ యాజ్ విక్టిమ్స్’ అనే విమర్శనాత్మక అధ్యాయం రాశారు. విమర్శలు, వివాదాలు 2008లో ముంబై దాడుల ప్రత్యక్ష వార్తాసేకరణకు (లైవ్ కవరేజీకి) వెళ్లినప్పుడు బర్ఖాదత్ అక్కడి తాజ్‌మహల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటళ్లలో బస చేసిన కొందరిని ఉగ్రవాదుల ఘాతుకాన్ని ప్రత్యక్షసాక్షులుగా టీవీలో చూపించి, వారి ప్రాణాలకు ముప్పు కలిగేలా రిపోర్టింగ్‌ను సంచలనాత్మకం చెయ్యడం ఆమెపై విమర్శలకు దారితీసింది. పనులు నడిపించడంలో మోరుమోసిన లాబీయిస్టు నీరా రాడియాతో 2జి స్ప్రెక్ట్రమ్ అమ్మకాలకు సంబంధించి సంభాషణ జరిపిన వారిలో బర్ఖా దత్కూడా ఉన్నట్లు సీబీఐ వెల్లడించడంతో బర్ఖా దత్ తను నిర్దోషినని నిరూపించుకోవలసి వచ్చింది. బర్ఖాదత్ - బాలీవుడ్ బర్ఖాదత్ స్ఫూర్తితో బాలీవుడ్లో ‘లక్ష్య’, ‘ఫిరాక్’, ‘పీప్లీ లైవ్’, ‘నో వన్ కిల్డ్ జెస్సీకా’ చిత్రాలు వచ్చాయి. మలయాళంలో వచ్చిన ‘కీర్తిచక్ర’ చిత్రంలోని జర్నలిస్ట్ పాత్రకు కూడా బర్ఖానే ప్రేరణ. అవార్డులు: పద్మశ్రీ, అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అవార్డ్, ఇండియన్ న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ అవార్డ్, కామన్వెల్త్ బ్రాడ్‌కాస్టింగ్ అసోసియేషన్ అవార్డ్. బర్ఖా దత్ (44), టీవీ జర్నలిస్ట్ జననం : 18 డిసెంబర్ 1971 జన్మస్థలం : న్యూ ఢిల్లీ తల్లిదండ్రులు : ఎస్.పి.దత్ (ఎయిర్ ఇండియా అధికారి){పభాదత్ (హిందూస్థాన్ టైమ్స్ జర్నలిస్ట్) తోబుట్టువు : బహర్ దత్ (చెల్లెలు) (సి.ఎన్.ఎన్.-ఐ.బి.ఎన్. జర్నలిస్ట్) చదువు : ఇంగ్లిష్ లిటరేచర్ (డిగ్రీ) ఢిల్లీ మాస్ కమ్యూనికేషన్ (రెండు పీజీలు) జామియా మిల్లియా, కొలంబియా కెరీర్ ప్రారంభం : ఎన్డీటీవీతో. ప్రస్తుతం : ఎన్డీటీవీలోనే న్యూస్ యాంకర్, కన్సల్టింగ్ ఎడిటర్ ప్రతిష్ట : కార్గిల్ యుద్ధక్షేత్రంలో రిపోర్టింగ్, కెప్టెన్ విక్రమ్ బాత్రాతో ఇంటర్వ్యూ (కశ్మీర్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ యుద్ధక్షేత్రాల రిపోర్టింగ్) వైవాహిక స్థితి : అవివాహిత -
అర్నాబ్ గోస్వామిపై రూ.500 కోట్ల దావా
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మతబోధకుడు జకీర్ నాయక్ మరో సంచలనానికి తెరలేపారు. పగతో కూడిన ప్రచారంతో తన ప్రతిష్ఠకు భంగం కల్గిస్తున్నారని ఆరోపిస్తూ ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేశారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న జకీర్ నాయక్.. ముంబైలోని తన న్యాయవాది ద్వారా శుక్రవారం అర్నాబ్ కు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా జకీర్.. అర్నాబ్ పై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. టైమ్స్ నౌ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అయిన అర్నాబ్ గోస్వామి వ్యక్తులపై మీడియా విచారణ(మీడియా ట్రయల్) జరుపుతున్నారని, ఆ క్రమంలో మత విశ్వాసాలను కించపరుస్తూ, విద్వేషాలనున్ని రెచ్చగొడుతున్నారని జకీర్ నాయక్ విమర్శించారు. సత్యదూరమైన ప్రసారాలతో తన ప్రతిష్టకు భంగం కలిగించారని, అందుకే రూ.500 కోట్ల పరువునష్టం దావా వేస్తున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బీభత్సం సృష్టించి 22 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల్లో ఒకడు 'జకీర్ నాయక్ ప్రసంగాల స్పూర్తితోనే తుపాకి పట్టాన'ని వెల్లడించడంతో మత గురువు వ్యవహార శైలిపై వివాదం మొదలైంది. ముంబై కేంద్రంగా 'పీస్ టీవీ' చానెల్ ద్వారా బోధనలు చేసే జకీర్ నాయక్.. ఆత్మాహుతి దాడులను ఇస్లాం సమర్థిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలు వెలుగులోకి రావడం అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా వెళ్లిపోయిన జకీర్ నాయక్ నైస్ (ఫ్రాన్స్) దాడుల అనంతరం స్కైప్ ద్వారా భారతీయ మీడియాతో మాట్లాడారు. అప్పుడుకూడా కొన్ని చానెళ్ల తీరును ఆక్షేపించిన ఆయన ఇప్పుడు ఏకంగా ఎడిటర్ ఇన్ చీఫ్ పై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేశారు. -
ఆర్ణబ్ గోస్వామి (న్యూస్ యాంకర్) రాయని డైరీ
మాధవ్ శింగరాజు మనుషులు భలేగా ఉంటారు! దావూద్ ఇబ్రహీం అంటే వాళ్లకెప్పుడూ ఒకటే ఇమేజ్ గుర్తుకు వస్తుంది. ఖరీదైన కుషన్ చెయిర్లో ఠీవిగా వెనక్కి వాలిపోయి, కాలు మీద కాలు వేసుకుని ఒకలాటి నిర్లక్ష్యపు డాన్ చూపు చూస్తున్న దావూదే వాళ్లకు మైండ్లోకి వస్తాడు. అరవై ఏళ్ల దావూద్‌ని, గ్యాంగ్రీన్‌తో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న దావూద్‌ని వాళ్లు ఎప్పటికీ అంగీకరించలేరు! ‘‘లిజన్.. గోస్వామీ! దావూద్ ఇబ్రహీం గ్యాంగ్రీన్‌తో లేవలేకపోతున్నా సరే.. గన్ పట్టుకుని ముంబై వీధులలోకి వచ్చి గ్యాంగ్‌వార్‌లో కనీసం రోజుకు ఇద్దరు ముగ్గురినైనా ధనాధన్మని పేల్చిపారేసి భారత ప్రభుత్వం కన్నుగప్పి తిరిగి కరాచీ వెళ్లిపోతుండాలని ఈ మనుషులంతా ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. ప్రైమ్ టైమ్‌లో రోజూ మనం ఆ న్యూస్ ఇవ్వగలగాలి.. వ్యూయర్స్ ఖాళీ లంచ్బాక్సులతో ఇంటికి చేరే సమయానికి’’ అన్నారు.. ఉదయం బోర్డు మీటింగులో చైర్పర్సన్. ‘‘ఎగ్జాట్లీ మేమ్’’ అన్నారు సమీర్ జైన్, వినీత్ జైన్, రాజ్ జైన్! ఒకరు వైస్ ఛైర్మన్, ఒకరు మేనేజింగ్ డెరైక్టర్, ఒకరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్! ఆలోచిస్తున్నాన్నేను. ‘‘వెల్ గోస్వామీ! వ్యూయర్స్‌లో మీకొక ఇమేజ్ ఉంది. దావూద్ ఇబ్రహీం మాఫియా డాన్ అయితే, ఆర్ణబ్ గోస్వామి మీడియా డాన్. దాన్ని మీరు కంటిన్యూ చేయాల్సింది! కానీ ఏం చేశారు?! మోదీజీని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మెత్తగా, కొత్తగా, కాస్త చెత్తగా కూడా మాట్లాడారు! మీరలా గన్ తీసి జేబులో పెట్టుకుని మాట్లాడ్డం ఈ దేశానికి నచ్చలేదు. ఎందుకలా చేశారు గోస్వామీ.. ది నేషన్ వాంట్స్ టు నో’’ అంటున్నారు బోర్డు మెంబర్లు.. కలగాపులగంగా, పరమ కంగాళీగా. లగడపాటి లాంటి వాళ్లనైతే ఈపాటికి లేపేసేవాడిని. ‘యు ఆర్ ఎ రకస్ క్రియేటింగ్ రౌడీ ఇన్ పార్లమెంట్ మిస్టర్ రాజగోపాల్. యు షుడ్ బి త్రోన్ అవుటాఫ్ పార్లమెంట్ అండ్ నెవర్ బి అలౌడ్ అగైన్ మిస్టర్ రాజగోపాల్’ అంటూ ఉంటే పాపం ఆయన నోరెత్తలేకపోయారు. బోర్డు రూమ్‌లో ఇవాళ నేను.. నాట్ లెస్ దేన్ ఎ రాజగోపాల్! ‘‘పి.ఎం. ఇంటర్వ్యూ తర్వాత మన టిఆర్పీలు పడిపోయాయి మిస్టర్ గోస్వామీ’’ అంటున్నారు మేడమ్. ‘‘గుజరాత్ సియెంగా ఉన్నప్పుడు మోదీని కరణ్ థాపర్ నీళ్లు తాగించినట్లుగా మీరూ ఏదైనా చేస్తారని అంతా ఎదురు చూశారట. ఫోన్లు వస్తున్నాయి గోస్వామీ. మోదీ చేత కనీసం ఒక్క గుటకనైనా వేయించలేకపోయారని మీ మీద, మన చానల్ మీద అంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు’’ అంటున్నారు ఎం.డీ. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలా, డిబేట్ డిబేట్లా ఉండాలి కదా.. అనబోయాను. ‘‘మీరు స్క్రీన్ మీద ఒకలా, స్ట్రీట్ మీద ఒకలా ఉంటే చానల్ డౌన్ అయిపోతుంది గోస్వామీ’’ అన్నారు బోర్డు మెంబర్లు. గాట్ ది పాయింట్. చానల్ వేల్యూ పెరగాలంటే నా వాల్యూమ్ తగ్గకూడదు! -
వాళ్లిద్దరి మధ్య సంబంధం ఏమిటి?
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మీడియాపై దాడి చేశారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి, ఓ ఆంగ్ల పత్రిక ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి మధ్య ఉన్న సంబంధమేంటో చెప్పాలని డిమాండ్ చేయడం సంచలనం రేపింది. శుక్రవారం సోషల్ మీడియాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ నేత వినీతా దేశ్‌ముఖ్ ట్వీట్‌కు స్పందించిన కేజ్రీవాల్.. అర్ణబ్ గోస్వామిపై విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రిని వెనకేసుకు రావడంలో అర్ణబ్ ఉద్దేశం ఏమిటో.. వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని ట్వీట్ చేశారు. రాజ్‌దీప్ సర్దేశాయ్లా నిష్పాక్షికంగా వ్యవహరించకుండా ఎందుకు అరుపులు, పెడబొబ్బలు పెడతున్నారంటూ అర్ణబ్‌ను ఉద్దేశించి వినీత ట్వీట్ చేశారు. అర్ణబ్ గోస్వామి.. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని ఎందుకు వెనకేసుకు వస్తున్నారని ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేజ్రీవాల్.. జైట్లీతో ఆయనకున్న రిలేషన్ ఎలాంటిదో వెల్లడించాలని ప్రశ్నించారు. కాగా ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో భారీ ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఫైలు కోసమే ఢిల్లీ సచివాలయంలో సీబీఐ దాడులు చేసిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సీబీఐ దాడుల పేరుతో ద్వారా తనను, తన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎన్డీయే ప్రయత్నిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మీద పరుష పదజాలంతో విమర్శలు చేసిన సీఎం వ్యక్తిత్వం ఎలాంటిదో దేశ ప్రజలంతా చూశారని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే డీడీసీఏ మాజీ అధ్యక్షుడు జైట్లీ, ఢిల్లీ సీఎం మధ్య వివాదం రాజుకుంది. Arnab ought to answer this. What is Arnab's relationship wid Jaitley ji? https://t.co/VdmSx6P60p — Arvind Kejriwal (@ArvindKejriwal) December 18, 2015