న్యూఢిల్లీ: వివాదాస్పద టెలివిజన్ వ్యాఖ్యాత అర్నాబ్ గోస్వామికి ఎట్టకేలకు బెయిల్ దక్కింది. 2018 నాటి ఓ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం, బెయిల్ దరఖాస్తును బాంబే హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అర్నాబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన బెంచ్ బుధవారం ఈ అంశంపై విచారణ జరిపి అర్నాబ్‌తోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నితీశ్ సర్దా, ప్రవీణ్ రాజేశ్ సింగ్‌లకు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఇంటెరిమ్ బెయిల్ మంజూరు చేసింది. తనపై మోసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని, కేసు విచారణను నిలిపివేయాలన్న అర్నాబ్ వినతులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అర్నాబ్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ‘‘బెయిళ్లు ఇవ్వకుండా..వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు’’ అని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment