interim bail
-
కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్
బొమ్మనహళ్లి: హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు భారీ ఊరట లభించింది. ఆయనతోపాటు ఏడుగురికి హైకోర్టు బెయిలిచ్చింది. వెన్నునొప్పితో బాధపడుతున్న దర్శన్ మధ్యంతర బెయిల్‌పై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. అనంతరం దర్శన్, అతడి సన్నిహితురాలు పవిత్రా గౌడ, ప్రదోశ్, అనుకుమార్, నాగరాజు, లక్ష్మణ్, జగదీష్‌కు బెయిల్ మంజూరు చేస్తు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురికి బెయిల్ లభించింది. పవిత్రా గౌడను దుర్భాషలాడాడనే కోపంతో రేణుక స్వామి అనే వ్యక్తిని చంపారనే ఆరోపణలపై దర్శన్‌ను జూలైలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్
రాజకీయ నాయకుల ర్యాలీలు, ప్రదర్శనల్లో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం. అలాంటి కేసుల్లో నేతలకే ఊరట లభిస్తున్నప్పుడు అల్లు అర్జున్ అరెస్టు సరికాదు. ఈ దేశ పౌరుడిగా ఎక్కడికైనా వెళ్లే హక్కుఆయనకు ఉంటుంది. – హైకోర్టు న్యాయమూర్తిసాక్షి, హైదరాబాద్: పుష్ప–2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో నిందితుడు, ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ (ఏ11)కు హైకోర్టు 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హత్య చేయాలన్న ఉద్దేశం, పదునైన ఆయుధాలతో దాడి చేయడానికి సంబంధించిన సెక్షన్లు ఇక్కడ వర్తించవని స్పష్టం చేసింది. పోలీసులు అనుమతి ఇచి్చన తర్వాతే హీరో సినిమా చూసేందుకు వచ్చారని, ఆయన్ను రావొద్దని పోలీసులు చెప్పారనడానికి ఎలాంటి ఆధారం లేదని పేర్కొంది. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగా మరణం చోటుచేసుకున్నా, గరిష్టంగా ఐదేళ్లు శిక్ష పడే నేరంలో బెయిల్‌కు ఆయన అర్హు డని పేర్కొంది. పలు తీర్పులను ప్రస్తావి స్తూ.. 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలర్‌కు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమరి్పంచాలని స్పష్టం చేసింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, దర్యా ప్తు అధికారులకు అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్‌కు సూచించింది. తదుపరి విచారణ జనవరి 21కి వాయిదా వేసింది. భద్రత కల్పించని పోలీసులదే బాధ్యత: అల్లు అర్జున్ తరఫు న్యాయవాది పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేయడంతో ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని పిటిషన్ వేశాం. అది ఇంకా ధర్మాసనం ముందుకు రాకముందే అరెస్టు చేశారు. క్వాష్ పిటిషన్ ద్వారా మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఇచ్చాయి. తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయిన కేసులో నటుడు షారుక్‌ఖాన్‌కు గుజరాత్ హైకోర్టు ఊరటనిచి్చంది. అర్నబ్ గోస్వామి కేసులో బాంబే హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు దానిని సవరించింది. కిందికోర్టు రిమాండ్ విధించినా.. దాన్ని నిరాకరించే అధికారం హైకోర్టుకు ఉంటుంది (బండి సంజయ్ కేసును ప్రస్తావించారు).రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందారు. అందుకు ఆయన్ను బాధ్యున్ని చేయలేదు కదా. పుష్ప ప్రీమియర్ షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. హీరో, హీరోయిన్ వస్తారంటూ పోలీసులకు థియేటర్ యాజమాన్యం సమాచారం ఇచి్చంది. అల్లు అర్జున్ మొదటి అంతస్తులో ఉండగా, గ్రౌండ్‌ఫ్లోర్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. దానికి ఆయన బాధ్యుడెలా అవుతారు? ఇది ఉద్దేశపూర్వంగా లేదా కావాలని చేసింది కాదు. దురదృష్టవశాత్తు మహిళ మృతి చెందింది. 118 (1) బీఎన్ఎస్తో పాటు సెక్షన్ 105 ఈ కేసులో వర్తించదు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ స్థాయిలో భద్రత కల్పించని పోలీసులే దీనికి బాధ్యత వహించాలి. తొక్కిసలాటను ఆపే ప్రయత్నం వారు చేయలేదు. పిటిషనర్ బెయిల్‌కు అర్హుడు. విడుదలకు ఆదేశాలు ఇవ్వాలి..’అని కోరారు. లంచ్‌మోషన్ అనుమతించవద్దు: పీపీ ప్రభుత్వం తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ.. ‘క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసరం కాదు. బెయిల్ కోసం మరో పిటిషన్ వేసుకోవాలి. కోరగానే లంచ్‌మోషన్ ఇవ్వడం తప్పుడు సంకేతం ఇస్తుంది. లంచ్‌మోషన్ మధ్యాహ్నం వేయడాన్ని అనుమతించకూడదు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని క్వాష్ పిటిషన్లో ఎక్కడా కోరలేదు. కనీసం పిటిషన్ చదువుకునే సమయం అయినా ఇవ్వకుండా వాదనలు వినిపించాలంటే ఎలా? విచారణ సోమవారానికి వాయిదా వేయాలి. థియేటర్‌కు వెళ్లొద్దని అల్లు అర్జున్‌కు పోలీసులు చెప్పారు. ఆయన్ను ఇప్పటికే రిమాండ్‌కు తరలించాం..’అని తెలిపారు. హీరో అయినంత మాత్రాన స్వేచ్ఛను కోల్పోవాలా? ‘లంచ్ మోషన్ విచారణకు అనుమతి ఇవ్వొద్దని తొలుత భావించా. సామాన్యులైతే ఇద్దామనుకున్నా. అయితే సినీ హీరో అయినంత మాత్రాన స్వేచ్ఛను కోల్పోవాలా? అనే సందేహం వచి్చంది. అతని హోదా కారణంగా స్వేచ్ఛను కోల్పోవడం సరికాదని అనిపించింది. అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఇదే హైకోర్టు పలువురికి బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్‌కు పంపిన తర్వాత బీజేపీ నేత బండి సంజయ్‌కి, అలాగే 489ఏ వ్యవహారంలో ఒక సామాన్యునికి ఊరట దక్కింది..’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే అంశంపై సంధ్యా థియేటర్ యాజమాన్యం, తదితరులు దాఖలు చేసిన మరో పిటిషన్లో అరెస్టయిన మరో ఇద్దరిని (ఏ–1, ఏ–2) కూడా విడుదల చేయాలంటూ ఉత్తర్వులిచ్చారు. ఇతర పిటిషనర్లపై అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. -
ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: ఫోన్‌ట్యాపింగ్ కేసులో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు వెళ్తున్న వేళ.. ఈ కేసులో నిందితుడు భుజంగరావుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తూ బుధవారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసిన కోర్టు.. రేపు(గురువారం) సాయంత్రం. 4గం. లోపు జైలుకు వెళ్లాలని భుజంగరావును ఆదేశించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఏ2 నిందితుడు. అనారోగ్య కారణాల రిత్యా ఈ ఏడాది ఆగష్టు 19వ తేదీన ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దానిని పొడగిస్తూ వచ్చింది. అయితే కిందటి నెలలో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు దానిని తిరస్కరించింది. అదే టైంలో మధ్యంతర బెయిల్ విషయంలో మరికొంత ఊరట ఇచ్చింది.ఫోన్ టాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్ట్ అయ్యింది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పంజాగుట్ట పోలీసులు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ1 ప్రభాకర్‌రావు అమెరికాలో ఉండగా.. ఆయన కోసం ఈ మధ్యే రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. -
కన్నడ స్టార్ దర్శన్ కు మధ్యంతర బెయిల్
-
ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?.. ఈడీకి సుప్రీం కోర్టు మందలింపు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సస్పెండ్ అయిన సివిల్ సర్వెంట్ సౌమ్య చౌరాసియాకు ఆమె కస్టడీలో గడిపిన సమయం, ఆరోపణలు నమోదు చేయకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఈరోజు(గురువారం) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే విచారణలో ఉన్నవారిని ఎన్నాళ్లు జైలులో ఉంచుతారని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించిందిఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మాజీ డిప్యూటీ సెక్రటరీగా చౌరాసియా పనిచేశారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమె నిందితురాలు. సుప్రీం న్యాయమూర్తులు సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సౌమ్య చౌరాసియాకు బెయిల్ మంజూరు చేసింది. ఆమె ఇప్పటికే ఒక సంవత్సరం తొమ్మిది నెలల పాటు కస్టడీలో ఉన్నారని, ఆమె సహ నిందితుల్లో కొందరు ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.ట్రయల్ కోర్టుకు హాజరుకాక పోవడం, నిందితులలో కొందరిపై నాన్-బెయిలబుల్ వారెంట్లను అమలు చేయకపోవడం వల్ల అభియోగాలు నమోదు చేయడం సాధ్యం కాదని ఛత్తీస్ హైకోర్టు గతంలో పేర్కొంది. ఈ దరిమిలా, తదుపరి తేదీలో విచారణకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో, తాము పిటిషనర్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని నిర్దేశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఆమె మధ్యంతర బెయిల్‌పై ఉన్నందున తిరిగి సర్వీస్‌లో చేర్చుకోవద్దని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్‌లో ఉంచాలని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.చౌరాసియా తదుపరి కోర్టు విచారణకు హాజరుకావాలని, అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడానికి లేదా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించవద్దని, ఆమె తన పాస్‌పోర్ట్‌ను ప్రభుత్వానికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న కేసుల్లో నేరారోపణ రేటు ఎంతని? నిందితులను ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాగా ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించగా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది పల్లవి శర్మ ఈ కేసులో చౌరాసియా తరపున వాదించారు. సౌమ్య చౌరాసియా 2022 డిసెంబర్లో బొగ్గు కుంభకోణంతో సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. తన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఆదేశాలను చౌరాసియా సుప్రీం కోర్టులో సవాలు చేశారు.ఇది కూడా చదవండి: తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..! -
బిల్కిస్ బానో దోషులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేప్ కేసులో ఇద్దరు దోషులకు శుక్రవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శిక్ష తగ్గింపును కొట్టివేస్తూ ఈ ఏడాది జనవరి 8న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును సవాల్ చేస్తూ దోషులు రాధేశ్యామ్ భగవాన్‌దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనిలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సమాన సంఖ్యలో జడ్జీలు ఉన్న ధర్మాసనం ఇచి్చన తీర్పుపై తామెలా విచారణ చేపట్టగలమని (రెండు ధర్మాసనాల్లోనూ సమంగా ఇద్దరేసి జడ్జీలు ఉన్నందువల్ల) ప్రశ్నించింది. 2002లో గోద్రా అలర్ల అనంతర ఘటనల్లో గర్భవతి బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు హత్యకు గురుయ్యారు. ఈ కేసులో మొత్తం 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. భగవాన్‌దాస్ షా పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2022 మే 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష విధానానికి అనుగుణంగా షాను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో గుజరాత్ ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టు 15వ తేదీన బిల్కిస్ బానో కేసుల యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న 11 మందిని స్రత్పవర్తన కలిగి ఉన్నారనే కారణంతో క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు తలెత్తాయి. వివిధ రంగాలు చెందిన మేధావులు, ప్రముఖులు ఆరు వేల మంది దోషులకు శిక్ష మినహాయింపును రద్దు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఒక లేఖలో కోరారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 8న వారికి శిక్ష మినహాయింపు సరికాదని తీర్పునిచి్చంది. రెండు వారాల్లోగా దోషులందరూ జైలులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. విచక్షణాధికారాలను తప్పుగా వాడారని, అనైతిక పద్దతుల ద్వారా దోషులకు అనుకూలంగా వ్యవహరించారని గుజరాత్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసింది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి క్షమాభిక్షను ప్రసాదించే అధికార పరిధి కూడా ఆ రాష్ట్రానిదేనని, గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్ర అధికారాన్ని చట్టవిరుద్ధంగా లాక్కుందని పేర్కొంది. సమానబలం కలిగిన సుప్రీంకోర్టు ధర్మాసనాలు (రెండూ ద్విసభ్య ధర్మాసనాలే) శిక్ష మినహాయింపుపై పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయని, విస్తృత ధర్మాసనానికి ఈ కేసును రిఫర్ చేయాలని పిటిషనర్లు కోరారు. ‘ఇదేం పిటిషన్. ఇది ఎలా విచారణార్హం అవుతుంది? ఇది పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని వేసిన పిటిషన్. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎలా వేస్తారు? సమాన సంఖ్య ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పును మేము సమీక్షించలేం’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లు శుక్రవారం స్పష్టం చేశారు. దీంతో పిటిషన్ల తరఫున న్యాయవాది రిషి మల్హోత్రా తమ వ్యాజ్యాన్ని ఉపసహరించుకోవడానికి అనుమతి కోరారు. ధర్మాసనం దీనికి సమ్మతించింది. భగవాన్‌దాస్ షా మధ్యంతర బెయిల్‌ను కూడా కోరారు. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్
-
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ,సాక్షి: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అనేక అంశాలపై తదుపరి విచారణ కోసం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. కానీ ఇటీవల కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో జైల్లోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం కేజ్రీవాల్ అరెస్టుకు తగిన కారణాలు ఉన్నాయి. అయితే, ఇప్పటికే 90 రోజులపాటు కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నాం. సీఎం పదవికి రాజీనామా చేయాలా లేదా అన్నది ఆయన (కేజ్రీవాల్) నిర్ణయానికే వదిలేస్తున్నాం అని వ్యాఖ్యానించింది. కాగా, ప్రస్తుతం ఈడీ కేసులో సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ దక్కినా..ఇటీవల కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ కేసు పెండింగ్‌లో ఉన్నందున ఆయన జ్యుడిషయల్ కస్టడీ నిమిత్తం జైల్లోనే ఉండనున్నారు. ఈనెల 17న సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.ఈడీ అరెస్ట్ ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ మార్చి 21న ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అక్రమమని ఈడీని సవాల్ చేస్తూ ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సమర్ధించింది. అందులో ఎలాంటి చట్టవిరుద్దం లేదని, కేసు నిమిత్తం దర్యాప్తుకు రావాలని కోరుతూ పదే పదే జారీ చేసిన సమన్లపై స్పందించ లేదు కాబట్టే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని సమర్దించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఏప్రిల్ 15న సుప్రీం కోర్టు ఈడీ స్పందన కోరింది. విచారణ సందర్భంగా,మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత, అతనికి బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెలువడిన తర్వాత,కేజ్రీవాల్ అరెస్టుకు ముందు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించాలని, సంబంధిత ఫైళ్లను సమర్పించాలని ఈడీకి సూచించింది.ఈ పిటిషన్‌పై తీర్పును జస్టిస్ సంజీవ్ ఖన్నా,దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తీర్పును మే 17న రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులు ఇవాళ వెలువరించింది. -
పిన్నెల్లికి ముందస్తు బెయిల్ 20 వరకు పొడిగింపు..
సాక్షి, అమరావతి: పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఆ మధ్యంతర ముందస్తు బెయిల్‌ను ఈ నెల 20 తేదీ వరకు పొడిగిస్తూ.. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈవీఎం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులు సహా మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు పోలీసులు నమోదు చేసిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.తరువాత ఈ వ్యాజ్యాలు గత వారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ వ్యాజ్యాల్లో వాదనలు రాత్రి 10.30 గంటల వరకు సాగడంతో అదే రోజు ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానానికి సమయం దొరకలేదు. దీంతో న్యాయస్థానం గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం పిన్నెల్లి వ్యాజ్యాలు విచారణకు రాగా న్యాయమూర్తి జస్టిస్ విజయ్ స్పందిస్తూ.. పూర్తిస్థాయిలో వాదనలు విన్నప్పటికీ, నిర్ణయం వెలువరించేందుకు కొంత సమయం పడుతుందన్నారు.ఈలోగా కోర్టుకు వేసవి సెలవులు ముగుస్తాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలను రెగ్యులర్ బెంచ్ ముందు వచ్చేలా విచారణను వాయిదా వేస్తానని ప్రతిపాదించారు. ఈ విషయంపై ఇరుపక్షాల తరఫు న్యాయవాదుల అభిప్రాయాన్ని కోరారు. ఇందుకు ఇరుపక్షాల న్యాయవాదులు అంగీకరించడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. -
Delhi liquor scam: కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు 5కు వాయిదా
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఈ నెల 5వ తేదీకి రిజర్వ్ చేసింది. దీంతో కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైలులో లొంగిపోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. -
రేపు మళ్లీ జైలుకు కేజ్రీవాల్..కోర్టులో నో రిలీఫ్
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పొడిగింపుపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. జూన్ 5న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ రేపు(జూన్2) తీహార్ జైలులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం అత్యున్నత కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న కేజ్రీవాల్ తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ రౌస్ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం(జూన్1) విచారణ జరిగింది. విచారణ సమయంలో కేజ్రీవాల్ మధ్యంత బెయిల్ పొడిగింపును ఈడీ వ్యతిరేకించింది. -
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
సాక్షి, అమరావతి: పచ్చ బ్యాచ్, పోలీసులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకునేందుకు వారు పన్నిన కుట్రలను పటాపంచలు చేసింది. రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ, పోలీసులు కుమ్మక్కయినా కూడా ప్రయోజనం లేకపోయింది. రికార్డులను తారుమారు చేసి, బాధితులను ముందు పెట్టి పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ను అడ్డుకునేందుకు పన్నిన కుట్రలు విఫలమయ్యాయి. రామకృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో హైకోర్టు ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్ట్‌తో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ నెల 6వ తేదీ వరకు ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. జేసీ అస్మిత్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, చింతమనేని ప్రభాకర్, పరిమి సోమశేఖర్ నాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరహాలోనే పిన్నెల్లికి కూడా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌కు పలు షరతులు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల చర్య చాలా తీవ్రమైనదిఈ మూడు కేసుల్లో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. మిగిలిన నిందితులను 16వ తేదీనే అరెస్ట్ చేసినప్పటికీ, వారిని 23వ తేదీన నిందితులుగా చేర్చినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది చాలా తీవ్రమైన విషయమని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇలా చేయడం డీకే బసు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పిన్నెల్లిని 22వ తేదీనే నిందితునిగా చేర్చారని పోలీసులు చెప్పిన విషయాన్ని, కింది కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో 23వ తేదీ రాత్రి 8 గంటలకు నిందితునిగా చేర్చినట్లు పేర్కొనడాన్ని హైకోర్టు తన ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించింది. దీనిపై తుది విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరింత వివరణనివ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు...ఈవీఎం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేర్వేరుగా మూడు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది ఎస్.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్ జ్యోతిర్మయి ఆ మూడు అనుబంధ వ్యాజ్యాలను అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇవీ షరతులు..పిన్నెల్లిపై నిఘా ఉంచేలా పోలీసులను ఆదేశించాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి నేరపూరిత చర్యల్లో పాల్గొనకూడదని, పునరావృతం చేయరాదని పిన్నెల్లిని ఆదేశించింది. జిల్లాలో శాంతిభద్రతల సమస్య సృష్టించకూడదని చెప్పింది. ప్రజాశాంతికి, సాక్షుల రక్షణకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని, అనుచరులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూడాలని పిన్నెల్లిని ఆదేశించింది. అనుచరుల బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని స్పష్టం చేసింది. ఈ కేసు గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సాక్షులు, బాధితులతో సంభాషించవద్దని, వారిని బెదిరించడం వంటివి చేయరాదని తెలిపింది. పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో మాత్రమే ఉండాలని, ఒకవేళ కౌంటింగ్ కేంద్రం మరో చోట ఉంటే లెక్కింపు రోజున ఆ కేంద్రానికి వెళ్లొచ్చునని తెలిపింది. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు పల్నాడు ఎస్పీ ముందు హాజరు కావాలని పిన్నెల్లిని ఆదేశించింది. నర్సరావుపేటలో తాను ఎక్కడ ఉంటున్నదీ, తన మొబైల్ నంబరు వివరాలను పోలీసులకు తెలియచేయాలని ఆదేశించింది. స్థానిక కోర్టుల్లో పాస్‌పోర్ట్ జమ చేయాలని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. బాధితులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే, ఓ షరతును కొద్దిగా సవరించాలని పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి అభ్యర్థించారు. కౌంటింగ్ రోజున ఎస్పీ ముందు హాజరయ్యేంత సమయం ఉండదని, అందువల్ల ఆ రోజున రిటర్నింగ్ అధికారి ముందు హాజరవుతారని తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి సమ్మతించి ఆ మేరకు ఆ షరతును సవరించారు. ప్రజా ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ చర్యల విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తన ఉత్తర్వుల్లో న్యాయమూర్తి స్పష్టం చేశారు. ‘న్యాయ చక్రాలు నెమ్మదిగా కదిలినప్పటికీ, అవి గొప్పగా కదులుతాయి,’ అంటూ ఓ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన కొటేషన్‌తో న్యాయమూర్తి తన ఉత్తర్వులను ముగించారు. -
హేమంత్ సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. జనవరిలో ఈడీ సొరెన్‌ను ఆరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. రాంచీ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్న ఫిర్యాదులో వాస్తవాలను బయటపెట్టకపోవటంపై ప్రశ్నించింది. దీంతో తాము దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు సొరెన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసే అవకాశాలు ఉన్నందున బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరిచుకున్నారు. దీంతో మాజీ సీఎం సొరెన్ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. జార్ఖండ్ మొత్తం 14 లోక్‌సభ సీట్లలో ఇప్పటి వరకు 7 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మరో 7 స్థానాకలు ఆరో విడత( మే 25), ఏడో విడత (జూన్ 1)న పోలింగ్ జరగనుంది. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం పాల్గొనడాడికి మధ్యంతర బెయిల్ కోరుతూ సొరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనపై దాఖలైన నగదు అక్రమ చలామణీ కేసులో దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా సొరెన్ చెడగొట్టేందుకు ప్రయత్నించొచ్చని సుప్రీంకోర్టుకు తెలిపింది -
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. ఆర్జేడీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆర్జేడీ ఎంపీ 'మనోజ్ ఝా' హర్షం వ్యక్తం చేశారు. సరైన విచారణ లేకుండానే హేమంత్ సోరెన్‌ను, అరవింద్ కేజ్రీవాల్‌కు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడం సంతోషంగా ఉంది. హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభిస్తే జార్ఖండ్‌లో కూడా బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని మనోజ్ ఝా అన్నారు.ఎక్సైజ్ పాలసీ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి 50 రోజుల జైలులో ఉంచారు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికలకు పార్టీ తరపున ప్రచారం చేయడానికి కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నిలకు పూర్తయిన తరువాత జూన్ రెండున ఆయన స్వచ్చందంగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడానికి ముందు.. ఏప్రిల్‌లో, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మద్యం పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో ఆరు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన తర్వాత సింగ్ బయటకు వచ్చారు.#WATCH | On interim bail to Delhi CM Arvind Kejriwal, RJD MP Manoj Kumar Jha says, "The way he was arrested without solid investigation, the way it was done to Hemant Soren ji and being done with others...We are happy that he has got bail, he will campaign also. If he (Hemant… pic.twitter.com/G9jXUcKyNP— ANI (@ANI) May 11, 2024 -
Aravind Kejriwal: నేను వచ్చేశా...
న్యూఢిల్లీ: త్వరలో తిరిగి వస్తానని చెప్పాను కదా! చెప్పినట్లే వచ్చేశా అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకు మధ్యంతర బెయిల్ ఇచి్చన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచి ఆశీస్సులందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం తన శక్తిమేరకు పోరాడుతానని, తనకు 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలని కోరారు. ప్రజలంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. తాను ఎంతగానో విశ్వసించే హనుమంతుడి ఆశీర్వాదంతో జైలు నుంచి బయటకు వచ్చానని తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోబోతున్నానని, తనను చూడాలంటే ప్రజలు అక్కడికి రావాలని కేజ్రీవాల్ సూచించారు. ఆయన శనివారం మధ్యాహ్నం ఆప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతారు. రోడ్ షోలో పాల్గొంటారు. ‘ఇండియా’ కూటమిలో హర్షాతిరేకాలు అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్)తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరో నాలుగు దశల పోలింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తమ కూటమికి లాభిస్తుందని వారు చెప్పారు. సత్యమేవ జయతే అని ఆప్ నేతలు నినదించారు.‘‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ లభించిన ఈ విజయం మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కేజ్రీవాల్ విడుదల న్యాయానికి ప్రతిబింబం. ఆయన రాకతో ‘ఇండియా’ కూటమిని మరింత బలోపేతం అవుతుంది. ఈ ఎన్నికల్లో మా విజయావకాశాలు ఇంకా పెరుగుతాయి’’ – ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి ‘‘హనుమాన్జీ కీ జై.. ఇది ప్రజాస్వామ్య విజయం. లక్షలాది మంది ప్రజల ప్రార్థనలు, ఆశీస్సులతో అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. వారందరికీ నా కృతజ్ఞతలు’’ – సునీతా కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పరిణామం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయానికి దోహదపడుతుందని భావిస్తున్నా’’ – మమతా బెనర్జీ, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వును స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో మన దేశం దృఢంగా వ్యవహరిస్తోంది’’ – శరద్ పవార్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత -
Delhi liquor scam: కేజ్రీవాల్‌కు ‘ప్రచార’ బెయిల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు పలు షరతులు విధించింది. జూన్ 2న తిరిగి తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు వచ్చే నెల 5వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోరగా, ధర్మాసనం అంగీకరించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన కేజ్రీవాల్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడం లేదా జైలు నుంచి విడుదల చేయడం వంటి అంశాల్లో సదరు నిందితుడికి సంబంధించిన ప్రాధాన్యతలు, అతడి చుట్టూ ఉన్న పరిణామాలు, పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. వాటిని విస్మరించడం పొరపాటే అవుతుందని ఉద్ఘాటించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైన కార్యక్రమం అని గుర్తుచేసింది. కేజ్రీవాల్ దోషిగా నిర్ధారణ కాలేదు కేజ్రీవాల్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయనడంలో సందేహం లేదని.. కానీ, ఆయన ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదని, ఆయనకు గతంలో నేర చరిత్ర లేదని, సమాజానికి ఆయన వల్ల ముప్పు సంభవించే పరిస్థితి కూడా లేదని వివరించింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం చట్టబద్ధమేనా? అది చెల్లుబాటు అవుతుందా? అని ప్రశి్నస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని, దానిపై ఇంకా తుదితీర్పు వెలువడలేదని వెల్లడించింది. కేజ్రీవాల్ కేసు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉంది కాబట్టి అతడికి బెయిల్ ఇచ్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలించామని తెలియజేసింది. నిందితులకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తనకున్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో ఉపయోగించుకుందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రతి కేసుకు సంబంధించిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని కోర్టులు మధ్యంతర బెయిల్ ఇస్తుంటాయని పేర్కొంది. 21 రోజులు బెయిలిస్తే పెద్దగా తేడా ఉండదు తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వివరించింది. కేజ్రీవాల్ అప్పీల్ తమవద్దే పెండింగ్‌లో ఉందని, ఈ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలంటూ ఆయనను ఆదేశించడం సరైంది కాదని భావించామని పేర్కొంది. తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ లెక్కచేయలేదని, అందుకే అరెస్టు చేశామంటూ ఈడీ లేవనెత్తిన వాదనపై ధర్మాసనం స్పందించింది. ఇందులో ఇతర కోణాలు కూడా చూడాలని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అని ప్రస్తావించింది. మద్యం కుంభకోణంలో దర్యాప్తు 2022 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉందని, కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారని, ఇప్పుడు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తే పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోకేజ్రీవాల్కు వచ్చే నెల 1వ తేదీ దాకా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. షరతులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈ కేసు మెరిట్‌పై అభిప్రాయాల వ్యక్తీకరణగా చూడొద్దని సూచించింది. తిహార్ జైలు నుంచి విడుదలసుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ఎదుట భారీసంఖ్యలో గుమికూడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కేజ్రీవాల్ తన కాన్వాయ్‌తో జైలు నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, కుమార్తె హర్షితా, ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ఉన్నారు. సుప్రీంకోర్టు షరతులివే.. 1. రూ.50,000 బెయిల్ బాండు సమరి్పంచాలి, అంతే మొత్తం పూచీకత్తును తిహార్ జైలు సూపరింటెండెంట్‌కు అందజేయాలి. 2. బెయిల్‌పై బయట ఉన్నప్పుడు అధికారిక కార్యాలయంలో గానీ, ఢిల్లీ సచివాలయంలోని గానీ అడుగు పెట్టరాదు. 3.లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు 4. మద్యం కుంభకోణం కేసు గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని, సాక్షులతో భేటీ కావడం, సంప్రదింపులు జరపడం వంటివి చేయొద్దు. 5. మద్యం కేసుతో సంబంధం ఉన్న అధికారిక ఫైళ్లను చూడొద్దు. -
తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ రిలీజ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మధ్యంత బెయిల్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే శుక్రవారం(మే10) సాయంత్రం ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన కారులో నుంచి ఆప్ కార్యకర్తలకు అభివాదం చేశాారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయమని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరపున ప్రచారం చేయడానికి గాను సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మధ్యంతర బెయిల్‌పై ఉన్న సమయంలో సీఎంగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించొద్దని, ఫైల్స్ చూసేందుకు వీలులేదని కోర్టు స్పష్టం చేసింది. తిరిగి జూన్2న కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు తెలిపింది. మే 25న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు దేశ అత్యున్నత కోర్టు మధ్యంతర బెయిల్ రూపంలో భారీ ఊరటనిచ్చింది. కాగా, లిక్కర్‌స్కామ్ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ అప్పటి నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే. -
Enforcement Directorate (ED): ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. అలాగే అది చట్టపరమైన హక్కు కూడా కాదని తేల్చిచెప్పింది. ఎన్నికల్లో ప్రచారం చేయాలన్న కారణంతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ నాయకులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సందర్భాలు గతంలో ఉన్నాయని, ప్రచారం చేసుకోవడానికి వారికి కోర్టులు మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని ఈడీ తన అఫిడవిట్లో ప్రస్తావించింది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కేవలం ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇచి్చన ఉదంతాలు కూడా లేవని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని ఉద్ఘాటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం చట్ట ముందు అందరూ సమానమేనన్న నిబంధనను ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించింది. అదేకాకుండా ఇప్పుడు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తే భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఇలాంటి వెసులుబాటు కోరే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచి్చంది. కేజ్రీవాల్‌పై అతి త్వరలో ఈడీ చార్జిషీట్ ఢిల్లీలో ఎక్సయిజ్ విధానంలో అవకతవక ల సంబంధ కేసులో ఈడీ అతి త్వరలో ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఈ చార్జిషీట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఇతర నిందితుల పేర్లతో అదనంగా మరిన్ని వివరాలు, ఆస్తుల గురించి ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. మద్యం కుంభకోణంలో ఈడీ ఇప్పటిదాకా 18 మందిని అరెస్టు చేసింది. ఇప్పటికే ఆరు చార్జిషీట్లు దాఖలు చేసింది. మరో నాలుగైదు రోజుల్లో దాఖలు చేయబోయే చార్జిషీట్ ఏడోది కానుంది. -
సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తిహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ తరఫున ఆప్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, దిపాంకర్ దత్తాలతో కూడిన ధర్మానం విచారణ జరుపనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీం కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పరిశీలిస్తామని సుప్రీం కోర్టు మే 3వ తేదీన పేర్కొంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని, కేవలం సమాచారం అందిస్తున్నామని సుప్రీం కోర్టు ఈడీ తరఫు న్యాయవాదికి తెలియజేసింది.దీనికంటే ముందు జరిగిన విచారణలో లోక్‌సభ ఎన్నికల ముందు సీఎం కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగే మధ్యంతర బెయిల్ విచారణలో సుప్రీం కోర్టు వెల్లడించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. -
ప్రచారం చేస్తా.. బెయిల్ ఇవ్వండి: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం(ఏప్రిల్ 12) విచారించింది. ఈ నెల 20లోపు సిసోడియా బెయిల్ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపించింనదున ఆమ్ఆద్మీపార్టీ తరపున ప్రచారం కోసం తనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోర్టును సిసోడియా కోరారు. ఈ నెల 20వ తేదీన కోర్టు సిసోడియా మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. అనంతరం ఈడీ కూడా సిసోడియాను ఇదే కేసులో అరెస్టు చేయడం గమనార్హం. అరెస్టు అనంతరం ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుల అరెస్టు.. స్పందించిన ‘దీదీ’ -
కవితకు బెయిల్‌పై 8న తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. ఈనెల 8వ తేదీ సోమవారం తీర్పు వెలువరిస్తామన్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ చేపడతామని తెలిపారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్, బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింíఘ్వీ, ఈడీ తరఫున జొహెబ్ హొస్సేన్‌లు వాదనలు వినిపించారు. తల్లి పర్యవేక్షణ అవసరం: సింఘ్వీ కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, 16 ఏళ్ల కుమారుడికి తల్లి పర్యవేక్షణ, భావోద్వేగ మద్దతు ఈ సమయంలో ఎంతో అవసరమని సింఘ్వీ పేర్కొన్నారు. తల్లి అరెస్టుతో కుమారుడు ఎంతో దిగ్భ్రాంతి చెందిన పరిస్థితిని మనం చూడాలన్నారు. కవిత కుమారుడు పరీక్షలు రాసే సబ్జెక్టులు ప్రస్తావిస్తూ.. తల్లి స్థానాన్ని తండ్రి లేదా సోదరుడు భర్తీ చేయలేరని, మానసిక ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పారు. తల్లి దగ్గర ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుందని తెలిపారు. కవితకు బెయిల్ ఇచ్చినా ఈడీకి వచ్చే ఇబ్బందేమీ లేదని, ఆమెను తిరిగి సుల భంగానే అదుపులోకి తీసుకోవచ్చని అన్నారు. తండ్రి ఢిల్లీలో ఉండి న్యాయపోరాటం చేస్తున్నారని కుమారుడు తెలంగాణలో ఉన్నారని సింఘ్వీ తెలిపారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయంలో ప్రధాని ఆల్ ఇండియా రేడియోలో ఉపన్యాసాలు ఇస్తున్నారని, ఆ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఊహకు మించి ఉంటుందని వ్యాఖ్యానించారు. అన్నీ చూసి కోర్టు నిర్ణయం తీసుకోవాలి: హొస్సేన్ సెక్షన్ 45 నిబంధనలు సింఘ్వీ నొక్కి చెబుతున్నారని, అయితే ప్రజా జీవితంలో ఉండే ప్రముఖ రాజకీయ నాయకురాలికి అవి వర్తించవని ఈడీ తరఫు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ అన్నారు. ఈ కేసులో లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలున్న ప్రధాన వ్యక్తుల్లో ఒక మహిళను ప్రశ్నిస్తున్నామని, ప్రాక్సీల ద్వారా ఆమె లబ్ధి పొందారని వాదించారు. కేవలం ఇతర నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ విషయం చెప్పడం లేదని, సంబంధిత పత్రాలు, వాట్సాప్ చాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం, ఆమెకు వ్యతిరేకంగా ఉన్న అన్ని విషయాలు చూసి న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తన దగ్గర ఉన్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక సాక్ష్యాలు ఎలా నాశనం చేశారో నిరూపిస్తుందన్నారు. కవిత పలు ఫోన్ల నుంచి సమాచారం డిలీట్ చేశారని, మొత్తంగా 100 కంటే ఎక్కువ ఫోన్లు నాశనం చేశారని ఆరోపించారు. ఈ కేసులో చాలా పెద్ద పురోగతి సాధించే దశలో ఉన్నామని, తాత్కాలిక ఉపశమనం కల్పిస్తే దర్యాప్తు పక్కకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని, ప్రజలను కూడా ఆమె ప్రభావితం చేస్తారన్నారు. సాక్షుల్ని పిలిచి వారి వారి వాంగ్మూలాలు మార్చుకోవాలని బెదిరించే అవకాశం ఉందంటూ హొస్సేన్ వాదించారు. ఈ దశలో కవిత న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరోసారి జోక్యం చేసుకొని కవిత కుమారుడికి 12 పేపర్లలో ఏడు పూర్తయ్యాయని భారతీయతలో తల్లి ఒకరే తగిన సాన్నిహిత్యాన్ని అందించగలరని తెలిపారు. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. -
కవితకు బెయిల్ వచ్చేనా?
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. జ్యుడీషియల్ రిమాండ్ కింద ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన పిల్లలకు పరీక్షలున్నాయంటూ ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. మద్యం పాలసీ కేసు విచారణలో ఉన్నదని, కవిత పలుకుబడి ఉన్న రాజకీయనేత అని, బెయిల్ ఇస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విజ్ఞప్తి చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న మరిన్ని వాదనలు వింటామని చెబుతూ.. విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వేసిన సాధారణ బెయిల్ పిటిషన్‌నూ విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు కోరే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్‌లోని నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. తీహార్ అధికారుల తీరుపై.. ఇదిలా ఉంటే.. కోర్టు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించే సందర్భంలో కవిత కొన్ని విజ్ఞప్తులు చేశారు. జైల్లో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయమూర్తి కావేరీ బవేజాను కోరారు. దీంతో ఇంటి నుంచి భోజనం, దుస్తులు, మంగళసూత్రం ధరించడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లకు న్యాయమూర్తి అనుమతిచ్చారు. అయినప్పటికీ తీహార్ జైలు అధికారులు వాటికి అనుమతివ్వడం లేదంటూ కవిత తరఫు న్యాయవాది ఈనెల 28న మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం విచారణ సందర్భంగా కవిత తరఫున న్యాయవాదులు ఈ అంశాన్ని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఊరట దక్కని పక్షంలో.. జైల్లో రిమాండ్ ముగిసేవరకు ఆ వసతులైనా కల్పించేలా జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరే అవకాశం కనిపిస్తోంది. -
క్యాన్సర్ బారిన పడ్డ నరేష్ గోయల్! - కోర్టు కనికరిస్తుందా..
మనీలాండరింగ్ కేసులో వేలకోట్ల మోసానికి పాల్పడ్డ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు 'నరేష్ గోయల్' గత ఏడాది సెప్టెంబర్ 1న అరెస్ట్ అయ్యారు. అయితే క్యాన్సర్ భారిన పడి.. దాని చికిత్స కోసం ఇటీవల మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టులో గురువారం పిటీషన్ దాఖలు చేశారు. మధ్యంతర బెయిల్ కోసం నరేష్ గోయల్ అభ్యర్థనను కోర్టు పరిశీలిస్తోంది. ఆరోగ్య పరిస్థితులను పరిశీలించడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కోర్టు ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసి.. సంబంధిత వివరాలను ఈ నెల 20లోపు సమర్పించాలని ఆదేశించింది. నరేష్ గోయల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రిపోర్ట్ అందించిన తరువాత కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే ఈ తీర్పు ఎలా ఉంటుందనేది త్వరలోనే తెలుస్తుంది. నరేష్ గోయల్ గత జనవరిలో కోర్టుకు హాజరైన తనకు బ్రతకాలనిగానీ, భవిష్యత్తు మీద ఎలాంటి ఆశ లేదని, జైల్లోనే చనిపోవాలనుకున్న ప్రతిసారీ విధి కాపాడుతోంది, ఇలాంటి జీవితం భరించడం కంటే చనిపోవడం మేలని తనకు ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించవద్దని కన్నీరు పెట్టుకున్నారు. ఒకప్పుడు ఇండియాలోనే టాప్ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ అధినేత నరేష్ గోయల్ ప్రస్తుతం దుర్భర జీవితం గడుపుతున్నారు. 1990 నుంచి 2000 వరకు భారతీయ వైమానిక రంగంలో ఓ మెరుపు మెరిసిన సంస్థ ఈ రోజు అధో పాతాళానికి పడిపోయింది. అయితే ఈ నెల 20న నరేష్ గోయల్ బెయిల్ పొందుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్‌లో యూజర్ చాట్ వైరల్ -
మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు అయంది. తనకు మూడు రోజులు బెయిల్ ఇవ్వాలని మనీష్ సిసోడియా రూస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజులు బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు మనీష్ సిసోడియా తన మేనకోడలు వివాహానికి హజరవుతారని సమాచారం. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి అవినీతి కేసులో సీబీఐ 26, ఫిబ్రవరి 2023న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరీంగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సైతం మార్చి 9న ఆయన్ను ఆరెస్ట్ చేసింది. చదవండి: Liquor Policy Case: మనీష్ సిసోడియాకు ఊరట -
Land for jobs scam: ప్రత్యేక కోర్టులో రబ్డీదేవికి ఊరట
న్యూఢిల్లీ: రైల్వే శాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బిహార్ మాజీ సీఎం రబ్డీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లకు ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిలిచి్చంది. రెగ్యులర్ బెయిల్ కోసం వీరు పెట్టుకున్న పిటిషన్‌పై స్పందన తెలపాలంటూ ఈడీని ఆదేశిస్తూ స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నె తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు సమయంలో నిందితులను అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కస్టడీకి కోరడమెందుకని జడ్జి ఈ సందర్భంగా ఈడీని ప్రశ్నించారు. -
సత్యేందర్ జైన్ బెయిల్ గడువు మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ ఆరోపణలెదుర్కొంటున్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. బెయిల్ గడువు శుక్రవారంతో ముగియడంతో జస్టిస్ ఏఎస్ బొపన్న సారథ్యంలోని ధర్మాసనం విచారించాల్సి ఉంది. ఆయన అందుబాటులో లేకపోవడంతో జస్టిస్ బేలా ఎం. త్రివేది బెయిల్ గడువును డిసెంబర్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. జైన్ పెట్టుకున్న రెగ్యులర్ బెయిల్ దరఖాస్తుపై విచారణ కూడా అదే రోజున ఉంటుందని స్పష్టం చేశారు. మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై గత ఏడాది మేలో జైన్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ..!
-
చంద్రబాబుపై తొందరపాటు చర్యలుండవు
సాక్షి, అమరావతి: అస్మదీయుల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై నమోదు చేసిన కేసులో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేయడంతో పాటు క్విడ్ ప్రోకోకు పాల్పడినందుకు సీఐడీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి మంత్రులు నారాయణ, లోకేశ్ తదితరులను నిందితులుగా చేర్చింది. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మల్లికార్జునరావు మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న నేపథ్యంలో ఆ బెయిల్ ఇచ్చిన ఉద్దేశం నెరవేరేంత వరకు ఆయన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు ఉండవని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులోనూ ఇలాంటి హామీనే ఇచ్చానని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు సైతం అదే హామీ ఇస్తున్నానని తెలిపారు. కంటిశస్త్ర చికిత్స నిమిత్తం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ముందుకెళ్లే ఉద్దేశం తమకు లేదన్నారు. అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన హామీని నమోదు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ రకంగానూ ముందుకెళ్లొద్దంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆదేశిస్తూ గతంలో తానిచ్చిన ఉత్తర్వులను ఈ నెల 28 వరకు హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక కుంభకోణం.. ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ ఉచిత ఇసుక విధానం పేరుతో ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం కలిగించినందుకు సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు బుధవారం విచారణ జరపనున్నారు. తనను రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం తనపై కేసుల మీద కేసులు పెడుతోందన్నారు. వేధింపులకు గురి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ కేసు నమోదు చేసిందన్నారు. తాను ఏ అంశంపై ప్రశ్నిస్తే ఆ అంశానికి సంబంధించి కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అక్రమాలపై గళం విప్పకుండా చేసేందుకే ప్రభుత్వం తనపై తప్పుడు కేసు నమోదు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. -
చంద్రబాబు జీవితం ఓటమితో మొదలై ఓటమితో ముగియడం ఖాయం..!
-
Nov 4th : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Cases Today Updates 06:06 PM, నవంబర్ 04 2023 BJPని ఎలా ఒప్పిద్దాం? ► హైదరాబాద్: చంద్రబాబు, పవన్ సమావేశంలో ప్రధానంగా బీజేపీపై చర్చ ► సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, నాదెండ్ల మనోహర్ ► బీజేపీని ఎలాగైనా ఒప్పించాలని పవన్ కళ్యాణ్‌ను అడిగిన చంద్రబాబు ► బీజేపీ వస్తేనే ఏపీలో తమ పరిస్థితి బెటర్ అవుతుందని స్పష్టీకరణ ► తెలుగుదేశం, జనసేన కలిసినా.. గెలవడం కష్టమన్న అభిప్రాయం ► తెలుగుదేశం బలహీనంగా ఉందని ఇప్పటికే పలు బహిరంగ సభల్లో చెబుతోన్న పవన్ కళ్యాణ్ ► నిజమే, తెలుగుదేశం బలహీనంగా ఉంది కాబట్టే పొత్తు అంటోన్న చంద్రబాబు & కో ► అసలు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే సొంతంగానే పోటీ చేసేవారమన్న ఆలోచన ► బీజేపీ తమతో కలిస్తేనే ఏమైనా సీట్లు గెలవగలమన్న అభిప్రాయం ► 2014లో కూడా బీజేపీ కలిసి రావడం వల్ల ప్రయోజనం ఉందని చర్చ 05:05 PM, నవంబర్ 04 2023 చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘ భేటీ ► హైదరాబాద్: కొనసాగుతున్న చంద్రబాబు, పవన్ సమావేశం ► గంటన్నర నుంచి కొనసాగుతున్న చంద్రబాబు , పవన్ భేటీ ► తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చంద్రబాబు, పవన్ చర్చ ► తెలంగాణ ఎన్నికల్లో జనసేన కు టీడీపీ మద్దతు, క్యాడర్ ఓట్ల పై చర్చ ► ఏపీలో టీడీపీ, జనసేన సమన్వయం పై సమాలోచనలు 04:15 PM, నవంబర్ 04 2023 చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో ఏం తేల్చారు? ► హైదరాబాద్: కొనసాగుతున్న చంద్రబాబు, పవన్ సమావేశం ► తెలంగాణ ఎన్నికలు, ఏపీలోని తాజా రాజకీయాలపై చర్చ ► తెలుగుదేశం, జనసేన విస్తృతస్థాయి సమావేశాల నిర్వహణపై ప్రస్తావన ► క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ ► ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చిస్తున్న చంద్రబాబు, పవన్ ► 10 అంశాలతో మినీ మేనిఫెస్టో రూపొందించాలనుకున్నాం, ఎందుకు ఆలస్యం? ► అసలు మేనిఫెస్టోలో ఏం పెడదాం? ► ఇన్నాళ్లు సంక్షేమ కార్యక్రమాలను విమర్శించాం కదా; ఇప్పుడు ప్రజలకు ఏం చెబుదాం? 04:00 PM, నవంబర్ 04 2023 జనసేన అభ్యర్థులు కూడా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తారా? ► ఒకే గుర్తుపై పోటీ చేద్దామన్న ప్రతిపాదన యోచనలో తెలుగుదేశం ► మీ గుర్తు అంతగా ప్రజల్లోకెళ్లలేదు కాబట్టి సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామని జనసేనకు ప్రతిపాదన ► పొత్తు ఉంటుంది, మీ అభ్యర్థులు మీకుంటారు, మా అభ్యర్థులు మాకుంటారు, అందరం సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామన్న ప్రతిపాదన ► 1983లో సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీ పక్షాన నలుగురు ఉమ్మడి ఏపీలో పోటీచేశారు. వారంతా సైకిల్ సింబల్ పైనే పోటీచేశారంటున్న టిడిపి వర్గాలు ► తెలుగుదేశం ఆలోచనపై జనసేనలో గందరగోళం ► ఒకే గుర్తుపై పోటీ చేస్తే.. పార్టీని విలీనం చేసినట్టవుతుందన్న ఆందోళన ► ఒకే గుర్తుమీద అంతా పోటీచేస్తే సాంకేతికంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికైనవారంతా ఒకే పార్టీవారు అవుతారు కదా? ► చంద్రబాబును నమ్మి పూర్తిగా సరెండర్ అవుతే వెన్నుపోటు తప్పదని చరిత్ర చెబుతోంది కదా.! ► ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్‌కు రెండో ఏడాది ఇస్తారని ఇప్పుడే ఎలా నమ్ముతామంటున్న జనసేన వర్గీయులు 03:50 PM, నవంబర్ 04 2023 ఇక చేతులు కలిపేద్దామా? ► తెలుగుదేశంలో తీవ్ర అంతర్మథనం, రేవంత్ కోసం పావులు ► ఇటీవల వరుసగా జరుగుతున్న టిడిపి భేటీల్లో పార్టీ దుస్థితిపై చర్చ ► తెలంగాణలో రేవంత్ వస్తేనే ఏపీకి మనకు సాయమన్న భావనలో చంద్రబాబు ► ఎన్నికలకు ఆరు నెలలే ఉంది కాబట్టి ఇక మన స్టాండ్ బహిర్గతం చేయాలన్న యోచనలో బాబు ► తాను అరెస్ట్ అయితే పార్టీ అతలాకుతులం అయిన దుస్థితిని సీనియర్ల ముందు ప్రస్తావించిన బాబు ► ఇక మనకు మిగిలింది కాంగ్రెస్సేనన్న భావనలో బాబు, పార్టీ సీనియర్లు ► బీజేపీ ఎలాగు నమ్మదు కాబట్టి, కాంగ్రెస్ కోసం ప్రయత్నాలు చేద్దామంటున్న బాబు ► కాంగ్రెస్ పోటీ చేసే రాష్ట్రాల్లో నగదు సమకూర్చడం కోసం తెరవెనక ప్రయత్నాలు ► గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు పలు రాష్ట్రాల్లో ఆర్థికంగా అండగా చంద్రబాబు నిలిచాడని పార్టీలో ప్రచారం 03:42 PM, నవంబర్ 04 2023 ఇంతకీ పవన్ కళ్యాణ్ పొత్తు బీజేపీతోనా? తెలుగుదేశంతోనా? ► తెలంగాణలో బీజేపీతో పవన్ కళ్యాణ్ చట్టాపట్టాల్ ► తెలంగాణలో కమలంతో పొత్తు, కలిసి పోటీ చేస్తోన్న జనసేన ► ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతున్న దోబూచులాట ► జనసేనతో పొత్తుకు బీజేపీ ఓకే ► తెలుగుదేశం పార్టీని మాత్రం దగ్గరకు రానివ్వబోనని చెబుతోన్న బీజేపీ ► బీజేపీకి తెలియకుండా పవన్‌కళ్యాణ్‌ను దువ్విన చంద్రబాబు ► బీజేపీకి సమాచారం ఇవ్వకుండానే జైలు ముందు పవన్ పొత్తు ప్రకటన ► ఇదే విషయంపై ఇటీవల పవన్‌ను ప్రశ్నించిన అమిత్‌షా ► జనసేన పార్టీలోనూ ఇదే గందరగోళం, ఎవరితో పొత్తు? ఎవరితో దూరం? 03:31 PM, నవంబర్ 04 2023 చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ అడగబోయే అంశాలేంటీ? ►తెలుగుదేశం, జనసేన పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ►జనసేనకు ఇచ్చే సీట్లలో ఏ ప్రాంతంలో ఉంటాయి? (రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాల వారీగా) ►కేవలం సామాజిక వర్గం జనాభా ప్రాతిపదికనే సీట్ల కేటాయింపు ఉంటుందా? ►పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఇస్తారా? ►జనసేన సహకరించినందుకు అయ్యే ఖర్చు ఎలా భరిస్తారు? ►కనీసం 50 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయాలి 03:20 PM, నవంబర్ 04 2023 చంద్రబాబు, పవన్ భేటీ ►హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ ►చంద్రబాబును పరామర్శించడానికి వచ్చిన పవన్ ►పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ 02:30 PM, నవంబర్ 04 2023 LV ప్రసాద్ ఆస్పత్రిలో ముగిసిన పరీక్షలు ►హైదరాబాద్: చంద్రబాబుకు ముగిసిన కంటి పరీక్షలు ►ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో గంటపాటు కంటి పరీక్షలు ►కంటి సర్జరీ మంగళవారం నిర్వహించనున్న డాక్టర్లు 01.46pm, నవంబర్ 04 2023 అసలు ఈ కేసు గురించి సీమెన్స్‌కు CID వారు లేఖ రాశారా? అచ్చెన్నాయుడు ప్రశ్న అయ్యా.. అచ్చెన్న.. కొంచెం ఈ ప్రశ్నలు, జవాబులు చదువుకోగలరు ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : 3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు లో మీరు 90 శాతం పెట్టుబడితో 10 శాతం ప్రభుత్వం పెట్టుబడితో స్కిల్ సెంటర్స్ పెట్టడానికి డిజైన్ టెక్ తో కలిసి ఒప్పందం చేసుకున్నారా..? ►సీమెన్స్ సమాధానం: అలాంటి ఒప్పందం మేము చేసుకోలేదు, 90 శాతం పెట్టుబడి పెట్టి ప్రాజెక్ట్ చేసే పద్దతి మా దగ్గరలేదు.. ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : 3300 కోట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా మీకు డిజైన్ టెక్ నుండి గాని స్కిల్ కార్పొరేషన్ నుండి గానీ ఏమైనా పర్చేజ్ ఆర్డర్ వచ్చిందా..? ►సీమెన్స్ సమాధానం : ఈ ప్రాజెక్టు లో భాగంగా మాకు ఎటువంటి పర్చేజ్ ఆర్డర్ రాలేదు..2015 లో డిజైన్ టెక్ నుండి 3 సార్లు మొత్తంగా 58 కోట్ల రూపాయలకు మాకు ఆర్డర్ వచ్చింది,మేము సప్ప్లై చేశాం.. ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : ప్రస్తుతం సుమన్ బోస్ ఎక్కడున్నారు?? వారు అసలు ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్ట్ ని ఒప్పందం చేసుకునే అర్హత ఉందా..? ►సీమెన్స్ సమాధానం : సుమన్ బోస్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, 2018 లో వారు మా కంపెనీలో లేరు,ఇక ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్టులను మేము చేయం,ఇలాంటి ఒప్పందం చేసుకోవదానికి సుమన్ బోస్ కి ఆ అర్హత లేదు,ఇక ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం ఇలాంటి ఒప్పందం కూడా లేదు 1:05 PM, నవంబర్ 04 2023 బుద్ధా వెంకన్నకు CID నోటీసులు కోర్టుల మీద నోరు పారేసుకుంటారా? క్రిమినల్ కేసు పెట్టమని గత నెలలో హైకోర్టు సీరియస్ ► చంద్రబాబు అరెస్టు తర్వాత న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఎల్లో బ్యాచ్ ► నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసిన పచ్చ మీడియా, టిడిపి నేతలు ► హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణలకు దిగిన గ్యాంగ్ ► తెలుగుదేశం నాయకులు, సానుభూతి పరులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హైకోర్టు ► టిడిపి నేతలు బుచ్చయ్య చౌదరీ, బుద్ధా వెంకన్న, రామకృష్ణ సహా 26 మందికి నోటీసులు ► ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులు ఇవ్వాలని AP DGPకి ఆదేశం ► బుద్ధా వెంకన్న ► గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ► ఎస్. రామకృష్ణ ► రామకృష్ణ గోనె ► మువ్వా తారక్ కృష్ణ యాదవ్ ► రవికుమార్ ముదిరాజు ► రుమాల రమేష్ ► ఎల్లా రావు ► కళ్యాణి ► అకౌంట్ : @NCHIRAN17457886 ► అకౌంట్ : In Jesus New Life @ NewIN34229 ► అకౌంట్ : @TrueAPDeveloper ► అకౌంట్ : Mosapu ► అకౌంట్ : Jail Jj ► అకౌంట్ : The Ark @ArkTheAce ► అకౌంట్ : @EdukondaluMupp2 ► అకౌంట్ : @Royanenenu ► అకౌంట్ : @Wish_cap ► అకౌంట్ : @Cdattu ► అకౌంట్ : @Bean9989 ► అకౌంట్ : Chary Veda ► అకౌంట్ : Paramasivaiah Gsanju Chandu ► అకౌంట్ : SriKishore Kumar ► సంస్థ : గూగుల్ ఇండియా ► సంస్థ : ట్విట్టర్ ఇండియా ► సంస్థ : ఫేస్బుక్ ఇండియా 12:35 PM, నవంబర్ 04 2023 టిడిపి వాళ్ల నోట నిజం వస్తుందా? అసలు భువనేశ్వరీ మళ్లీ యాత్ర చేపడుతుందా? చేపడితే నిజాలు చెబుతారా? 1)నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? 2)బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? 3)మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? 4)గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? 5)బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? 6)బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? 7)అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 8 ) 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? 9) ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డితో రూ.50 లక్షల నగదును స్టీఫెన్సన్కు ఇచ్చిన నేరంలో తెర వెనక కథనడిపింది, మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు. నిజమా? కాదా? 10)బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? 11:05 AM, నవంబర్ 04 2023 బుద్ధా.. విచారణకు రండి ►తెలుగుదేశం నేత బుద్దా వెంకన్నకు సీఐడీ అధికారుల నోటీసులు ►జడ్జిలను ఇష్టానుసారంగా దూషించిన బుద్దా వెంకన్న ►ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్ లో ఉన్న బుద్దా వెంకన్న ►బుద్దా వెంకన్నకు హైదరాబాద్ వెళ్లి నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు ►హైకోర్టు ఆదేశాలతో నోటీసులు ఇస్తున్నామన్న సీఐడీ అధికారులు ►బుద్దా వెంకన్న వివరణ ఇవ్వాలని సీఐడీ ఆదేశాలు 10:55 AM, నవంబర్ 04 2023 మరికొద్దిసేపట్లో LV ప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు ►కంటి వైద్య పరీక్షలకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లనున్న చంద్రబాబు ►చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని ఇప్పటికే సూచించిన వైద్యులు ►హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో జరగనున్న ఆపరేషన్ 10:52 AM, నవంబర్ 04 2023 ఫైబర్ గ్రిడ్‌లో ఆస్తుల అటాచ్ ►ఫైబర్ గ్రిడ్ స్కాం కేసులో చంద్రబాబు సన్నిహితుల ఏడు స్థిరాస్తుల అటాచ్ కు ప్రతిపాదించిన సీఐడీ అధికారులు ►అనుమతి కోసం ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ 10:45 AM, నవంబర్ 04 2023 ఇసుక కేసులో విచారణ ►చంద్రబాబుపై సీఐడీ అధికారుల కేసు నమోదుపై నేడు విచారణ ►టీడీపీ హయాంలో ఇసుక అక్రమాల పై ఏపీఎండీసీ ఫిర్యాదు పై కేసు నమోదు 10:39 AM, నవంబర్ 04 2023 పురందేశ్వరిదీ వెన్నుపోటు రాజకీయమేనా? ►అమ్మా పురందేశ్వరి గారూ.. ►తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ►అది భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా ►కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారు ►అంటే... మీది కుటుంబ రాజకీయమా? ►కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? ►లేక బీజేపీని వెన్నుపోటుపొడిచే మీ రాజకీయమా? పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అమ్మా పురందేశ్వరి గారూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే... మీది కుటుంబ రాజకీయమా? కుల… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 4, 2023 08:59 AM, నవంబర్ 04 2023 బీజేపీలో ఆందోళనలు.. జనసేన సీట్లపై తెగని పంచాయతీ ►తెలంగాణలో అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తి ►ఇప్పటిదాకా 88 సీట్లకు అభ్యర్థుల ప్రకటన ►మిగతా సీట్లపై నేతల కసరత్తు ►ఇప్పటిదాకా ఏకాభిప్రాయం కుదరని సీట్లపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ►జనసేన సీట్లపై తెగని పంచాయతీ ►పలు నియోజకవర్గాల త్యాగానికి సిద్ధంగా లేని బీజేపీ కేడర్ ►ఇప్పటికే బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనలు.. ధర్నాలు ►ఏ ప్రతిపాదికన జనసేనకు సీట్లు ఇస్తున్నారని బీజేపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్న వైనం ►తలపట్టుకుంటున్న రాష్ట్ర కీలక నేతలు ►అనవసరంగా జనసేనతో పొత్తు ప్రకటన చేశామనే ఫీలింగ్‌లో నేతలు 08:22 AM, నవంబర్ 04 2023 జడ్జిలనే తిడతారా? ►చంద్రబాబు కేసుల్ని విచారణ చేసిన జడ్జిలను దూషించిన యెల్లో బ్యాచ్ ►సోషల్ మీడియాలోనూ న్యాయమూర్తిలపై దుష్ప్రచారం ►టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు ►అభియోగాల మేరకు ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులిచ్చిన సీఐడీ ►అభియోగాలపై వెంటనే వివరణ ఇవ్వాలని వెంకన్నకు స్పష్టం ►వైద్య పరీక్షలంటూ బాస్ చంద్రబాబు తరహాలోనే హైదరాబాద్‌కి బుద్దా వెంకన్న.. స్వయంగా నోటీసులు అందించిన సీఐడీ అధికారులు 07:47 AM, నవంబర్ 04 2023 బీజేపీ ఓట్లను టీడీపీకి మళ్లిస్తున్నారే! ►బీజేపీ నేత పురంధేశ్వరిపై వైసీపి ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ ►పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారు ►ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు ►మొదట టీడీపీ..తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్...మళ్లీ బీజేపీ...ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరిది ►బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమెవల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా? ►ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుంది ►ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతయతమైన పదవిలో ఉండి ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తంచేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? ►మీ నిజాయితీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా ►ఆ మేరకు కేంద్రానికి రాయగలరా? ►మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీరు, మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా? ►హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ►ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు? 1/4: పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు. మొదట టీడీపీ..తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్...మళ్లీ బీజేపీ...ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 3, 2023 07:29 AM, నవంబర్ 04 2023 చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలోనే.. ►బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం ►2014లో మహిళా సంఘాల ముసుగులో ఇసుక దోపిడీ ►పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం స్మగ్లర్ల ముఠా చేతికి ►భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందన్న లాయర్ శ్రావణ్‌కుమార్ ►పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కిన నటి బాబు ప్రభుత్వం ►పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర ►తీవ్రంగా ఆక్షేపించిన ఎన్జీటీ ►అయినా ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు.. ►ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించిన రైతులు ►ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ కమిటీ ఈ ►కమిటీ చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో 2019 జనవరి 17–18న కమిటీ పరిశీలన ►స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక సమర్పణ ►ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్‌కు ఎన్జీటీ అల్టిమేటం ►ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానా ► మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టం ►నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏప్రిల్ 4, 2019లో ఇచ్చిన తీర్పులో ప్రస్తావన 07:16 AM, నవంబర్ 04 2023 అదనపు షరతులు వర్తిస్తాయి ►ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి మరో ఎదురు దెబ్బ ►మధ్యంతర బెయిల్ అదనపు షరతులు కోరుతూ సీఐడీ అదనపు పిటిషన్ ►అదనపు షరతులు అక్కర్లేదంటూ చంద్రబాబు పిటిషన్ ►చంద్రబాబు లాయర్ల వాదనతో ఏకీభవించని ఏపీ హైకోర్టు ►చంద్రబాబు బహిరంగ ర్యాలీలు నిర్వహించడం, పాల్గొనడం చేయరాదు ►బహిరంగ సభల్లో కూడా పాల్గొనరాదు ►కేసుకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేయకూడదు ►మేం ఇచ్చింది కేవలం మెడికల్ బెయిల్ మాత్రమే ►కస్టోడియల్ బెయిల్‌తో సమానంగా పరిగణించడానికి వీల్లేదు ►అదనపు షరతులు అవసరం లేదన్న బాబు వాదనను తిరస్కరించిన హైకోర్టు ఇదీ చదవండి: ర్యాలీలు అంటే.. బెయిల్ ఇచ్చే వాళ్లమా? 07:08 AM, నవంబర్ 04 2023 ఇసుకాసురుడు చంద్రబాబు ►చంద్రబాబు ముఠా రూ.10 వేల కోట్ల ఇసుక దోపిడీపై కేసు నమోదు ►ఏ–1 పీతల సుజాత, ఏ–2 చంద్రబాబు, ఏ–3 చింతమనేని, ఏ–4 దేవినేని ఉమా ►నాడు ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో భారీ దోపిడీ ►ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల గండి ►గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు బేఖాతరు ►ఆర్థిక శాఖ ఆమోదం, మంత్రి మండలి తీర్మానం లేదు ►‘ప్రత్యేక మెమో’ ద్వారా దోపిడీకి రాచబాట ►ఇసుక రీచ్‌లన్నీ టీడీపీ ప్రజాప్రతినిధుల హస్తగతం ►ఎక్కడ ఎంత ఇసుక తవ్వారన్న లెక్కలు లేకుండా పక్కా స్కెచ్ 07:03 AM, నవంబర్ 04 2023 మావనతా దృక్ఫథంతోనే బాబుకి బెయిల్ ►స్కిల్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ మీద చంద్రబాబు ►ఆరోగ్య కారణాల రీత్యా నాలుగువారాల బెయిల్ ఇచ్చిన కోర్టు ►తిరిగి నవంబర్ 28 సాయంత్రం 5గం.లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశం ►షరతులతో కూడిన బెయిల్.. ఉల్లంఘిస్తే వెంటనే రద్దు ►కంటికి సర్జరీ, ఇతర ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు ►వైద్య నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశం -
ర్యాలీలు అంటే.. బెయిల్ ఇచ్చే వాళ్లమా?
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిందితుడు నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా విధించిన షరతులకు అదనంగా ఎలాంటి షరతులు విధించాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎక్కడా బహిరంగ ర్యాలీలు నిర్వహించడం గానీ, అందులో పాల్గొనడం గానీ చేయరాదని చంద్రబాబును హైకోర్టు ఆదేశించింది. అలాగే బహిరంగ సభల్లో కూడా పాల్గొనరాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని కూడా ఆయన్ను ఆదేశించింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులకు అదనంగా తాజా షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కోర్టు షరతులను ఉల్లంఘించకుండా చంద్రబాబు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇద్దరు డీఎస్పీలను అనుమతించాలన్న సీఐడీ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తెల్లాప్రగడ మల్లికార్జునరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సహేతుక ఆంక్షలే.. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన చంద్రబాబుకు కంటి శస్త్రచికిత్స నిమిత్తం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విధించిన షరతులకు అదనంగా మరిన్ని షరతులు విధించాలని కోరుతూ సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుకు కేవలం అరోగ్య పరిస్థితి ఆధారంగానే మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తాజా ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పునరుద్ఘాటించారు. ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను కస్టోడియల్ బెయిల్‌తో సమానంగా పరిగణించడనికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చారు. ‘చంద్రబాబును చూడకుండా ప్రజలను నియంత్రిస్తూ ఈ కోర్టు ఆదేశాలు జారీ చేయజాలదు. మధ్యంతర బెయిల్ పిటిషన్లో చంద్రబాబు ఎక్కడా ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణకు అనుమతినివ్వాలని కోరలేదు. మెడికల్ బెయిల్‌కు అదనంగా బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణకు చంద్రబాబు అనుమతి కోరి ఉంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మా ముందున్న ఆధారాలను పరిశీలించిన తరువాత రాజకీయ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకుండా చంద్రబాబును ఆదేశించేందుకు ఈ కోర్టు సుముఖత చూపుతోంది. ఇది చంద్రబాబు ప్రాథమిక హక్కులను హరించడం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇది కోర్టు విధిస్తున్న సహేతుక ఆంక్ష మాత్రమే. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో ఈ నెల 31న విధించిన షరతులకు అదనంగా ఈ షరతులు విధిస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతులు పెంచాలంటూ సీఐడీ పిటిషన్
-
బెయిల్ కోసం రోగిష్టి సాకులు
-
కోర్టు ఆదేశాలు బేఖాతరు
-
ఆరోగ్యంపై ప్రజలను మోసం చేసిన బాబు, ఆయన కుటుంబసభ్యులు
-
గెలిచింది నిజం కాదు..రోగం మాత్రమే
-
చంద్రబాబు బెయిల్ పై సజ్జల కౌంటర్
-
బాబు బెయిల్ పై అంజాద్ బాషా కామెంట్స్..
-
ఇదెక్కడి ‘రోగం’?
సాక్షి, అమరావతి: రోగానికి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తానంటూ కాళ్లావేళ్లా పడి ఎలాగోలా బయటపడ్డ ఓ వృద్ధ నేత విజయోత్సవాలు నిర్వహించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో న్యాయస్థానం షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ ఇస్తే నిజం గెలిచిందంటూ టీడీపీ నేతలు నిస్సిగ్గుగా బుకాయించడం విస్తుగొలుపుతోంది! 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధ నేత, రిమాండ్ ఖైదీకి కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు మానవతా దృక్పథంతో హైకోర్టు షరతులతో తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. సహజంగా జైల్లో ఉండే ఏ ఖైదీకైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే, అత్యవసరంగా సర్జరీ లాంటివి నిర్వహించాల్సి వస్తే న్యాయస్థానం కొన్ని షరతులతో బెయిల్ ఇస్తుంది. ఇప్పుడు కూడా అదే తరహాలో హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చింది. అంతేకానీ ఆయనేమీ శుద్ధపూసగా భావించి క్లీన్చిట్ ఇవ్వలేదు. చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఇంకా అలాగే ఉంది. అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, ఫైబర్‌నెట్ స్కామ్, అక్రమంగా మద్యం డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చిన కేసులు న్యాయస్థానాల్లో అలాగే ఉన్నాయి. ఏ కేసులోనూ చంద్రబాబు నేరం చేయలేదని కోర్టు తీర్పు చెప్పలేదు. అయినా సరే చంద్రబాబు, ఆయన బృందం నిజం గెలిచిందంటూ ఊరేగింపులు నిర్వహిస్తూ స్వాతంత్య్ర పోరాటం చేసి జైలు నుంచి విడుదలైనట్లుగా రాద్ధాంతం చేయడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఆపరేషన్ చేయించుకున్నాక నవంబర్ 28వతేదీ సాయంత్రం 5 గంటల్లోపు మళ్లీ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని కోర్టు స్పష్టంగా చంద్రబాబును ఆదేశించింది. అలాంటప్పుడు ఇందులో నిజం ఎక్కడ గెలిచిందో, ఎలా గెలిచిందో అర్థంకాక సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కార్యకర్తలను తరలించి హడావుడి అనారోగ్య సమస్యలున్న ఖైదీలకు అత్యంత సాధారణంగా న్యాయస్థానాలు ఇచ్చే బెయిల్‌ను తమ విజయంగా టీడీపీ నేతలు అభివర్ణిస్తుండడంపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. షరతులతో తాత్కాలిక బెయిల్ వస్తుందని ముందే తెలియడంతో రాజమహేంద్రవరానికి టీడీపీ కార్యకర్తలను పెద్దఎత్తున తరలించారు. సెంట్రల్ జైలు పరిసరాలకు చేరుకుని నానా హడావుడి సృష్టించారు. పోలీసులను, బారీకేడ్లను తోసుకుంటూ జైలు వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ చేరుకునే వరకు హడావుడి చేసేలా టీడీపీ ముందే ప్రణాళిక రూపొందించింది. జాతీయ రహదారి మీదుగా చంద్రబాబు ఏ ప్రాంతానికి ఏ సమయంలో వస్తారో రూట్‌మ్యాప్, షెడ్యూల్ కూడా ఆ పార్టీ విడుదల చేసింది. ప్రతిచోటకూ కార్యకర్తలు, నాయకులు రావాలంటూ పార్టీ కార్యాలయం నియోజకవర్గ ఇన్‌ఛార్జిలకు సమాచారం ఇచ్చింది. ఇతర జిల్లాల నుంచి కూడా కార్యకర్తలను తీసుకువచ్చారు. కాన్వాయ్‌ను నెమ్మదిగా పోనిస్తూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఆయన్ను చూసేందుకు ఎగబడుతున్నారని ప్రచారం హోరెత్తించారు. వాస్తవానికి చంద్రబాబును చూడడానికి సాధారణ ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఆది నుంచి డ్రామాలే చంద్రబాబు అరెస్టయిన నాటి నుంచి ఆయనతోపాటు టీడీపీ నేతలంతా నిజాలను దాచి కేవలం అబద్ధాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. స్కిల్ స్కామ్‌లో అవినీతి జరిగిందా? లేదా? అనే ప్రశ్నకు సూటికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఐటీకి ఆద్యుడని, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, నిప్పని, ఆయన లేకపోతే రాష్ట్రమే లేదనే తరహాలో ప్రచారాలకు దిగారు. కోర్టుల్లో మాత్రం చంద్రబాబు 70 ఏళ్ల వయసు పైబడిన వారని, అనారోగ్య సమస్యలున్నాయనే కారణాలతో బెయిల్ అడుగుతూ వచ్చారు. ఇందుకోసం చంద్రబాబు కుటుంబం రోజుకో కొత్త డ్రామాను తెరపైకి తెచ్చింది. ఆయన జైలుకు వెళ్లిన మొదట్లో స్నానానికి వేడి నీళ్లు ఇవ్వడంలేదని, దోమలు కుడుతున్నాయనే అర్థం లేని ఆరోపణలు చేసి అబాసుపాలయ్యారు. చంద్రబాబు ఉన్న బ్యారక్‌లోకి సీఎం జగన్ కావాలని దోమలను పంపి ఆయన అనారోగ్యం పాలయ్యేలా చేస్తున్నారంటూ వాదనలు కూడా చేసి ప్రజల్లో చులకనయ్యారు. వీటిని చూసి జనం నవ్వుకోవడంతో బాబుకు చర్మ సమస్యలున్నాయని, దద్దుర్లు వస్తున్నాయని, జైల్లో సరైన వైద్యం అందించడం లేదంటూ మరో ఎత్తుగడ వేశారు. వైద్యులు ఆయనకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ టీడీపీ చెబుతున్న వాటిల్లో నిజం లేదని స్పష్టం చేయడంతో మరో నాటకానికి తెర తీశారు. జైల్లో గంజాయి స్మగ్లర్లు, నక్సలైట్లు ఉన్నారని, వారి నుంచి బాబుకు ప్రాణహాని ఉందంటూ కొన్నిరోజులు హంగామా నడిపారు. చంద్రబాబును చంపేస్తామంటూ నక్సలైట్లు పోలీసులకు లేఖ రాశారని, జైల్లో డ్రోన్లు ఎగరేస్తున్నారని పసలేని ప్రచారాలు చేశారు. తొలిరోజే కోర్టు ఆదేశాలు బేఖాతర్ తమ అధినేతను అన్యాయంగా జైల్లో పెట్టారు, ఆధారాలు లేవంటూ రోజూ డ్రామాలతో కాలం గడపడమే కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో జరిగిన అవినీతిపై ఒక్క ప్రశ్నకు కూడా చంద్రబాబు కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు సమాధానం చెప్పలేకపోయారు. కోర్టుల్లోనూ తమ అధినేత గొప్పతనం, అనారోగ్యం, గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్టు చేశారనే వాదనలు వినిపించారు. అంతేకానీ చంద్రబాబు అవినీతి చేయలేదని ఎక్కడా ఒక్కసారి కూడా ఆయన న్యాయవాదులు చెప్పలేదు. చివరికి ఆయన కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ చేయించాలని వైద్యులిచ్చిన ఓ నివేదికను చూపించి కనికరించి బెయిల్ ఇవ్వాలని వేడుకున్నారు. ఇన్ని డ్రామాల తర్వాత ఎట్టకేలకు కోర్టు ఆయన వయసు, అనారోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీన్ని గొప్ప విజయంగా, నిజం గెలిచిందని, ధర్మం నిలబడిందని చెప్పుకుంటూ చంద్రబాబును ఊరేగింపుగా తరలించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు తొలిరోజే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించినా ఖాతరు చేయలేదు. జైలు నుంచి బయటకు రాగానే మైకు అందుకున్నారు. -
చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదు
సాక్షి, అమరావతి: ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసిన కేసులో రిమాండ్‌పై జైల్లో ఉన్న చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసమే కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తే విజయోత్సవాలు, ర్యాలీలు ఎందుకు నిర్వహిస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలను నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రోగిగా జైలు నుంచి బయటకు వస్తున్నారా లేక ఏదైనా యుద్ధంలో గెలిచి వీరయోధుడిగా వస్తున్నాడనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. కంటి చికిత్స కోసం నాలుగు వారాల తాత్కాలిక బెయిల్‌పై చంద్రబాబు బయటకు వస్తున్నారని.. చికిత్స తర్వాత ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాల్సిందేనన్నారు. ఈ మాత్రానికే రాజమండ్రి నుంచి రోడ్ షో నిర్వహించడానికి, సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలని టీడీపీ నేతలకు చురకలంటించారు. స్కిల్ స్కాంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని స్పష్టం చేశారు. ఈ కేసులో సీఐడీ పోలీసులు సమర్పించిన ఆధారాలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు చంద్రబాబును రిమాండ్‌పై జైలుకు పంపిందని గుర్తు చేశారు. సానుభూతి కోసమే నాటకాలని ఒప్పుకోండి చంద్రబాబు జైలుకెళ్లడంతో ప్రజల్లో పెద్దఎత్తున సానుభూతి వస్తుందని టీడీపీ నేతలు ఆశపడ్డారని.. తీరా పరిస్థితి చూసి భంగపడ్డారంటూ సజ్జల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రజల్లో ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో చర్మవ్యాధులే ప్రాణాంతకమైనట్టు చూపుతూ చంద్రబాబుకు ఆరోగ్యం క్షీణిస్తోందంటూ టీడీపీ సానుభూతి డ్రామాలకు తెరతీసిందన్నారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు రోజుకో అబద్ధం చెబుతూ జైలు అధికారులు, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. చెప్పుకోవడానికి కూడా న్యూసెన్స్‌గా అనిపించే చర్మ వ్యాధులు చంద్రబాబుకు ఉన్నాయనే అంశాన్ని ఆయన కుటుంబ సభ్యులే ప్రపంచానికి చెప్పి.. ఏసీ కావాలని కోర్టును అడిగారని దెప్పిపొడిచారు. జైలులో చంద్రబాబు ఉండే బ్యారక్‌లో ఏసీ ఏర్పాటుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయనను బయటకు తెచ్చుకోవడానికి అడ్డదారుల్లో ఆలోచన చేశారని మండిపడ్డారు. రోగాల్ని చూపి సానుభూతి డ్రామాలాడి మొత్తానికి చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ తెచ్చుకున్నారు కనుక.. ఇప్పటికైనా తాము నాటకాలు ఆడామని ప్రజల ముందు ఒప్పుకోవాలని చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలను సజ్జల డిమాండ్ చేశారు. నిర్దోషిగా బయటకొచ్చారా.. నిజం గెలిచిందనడానికి స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన న్యాయవాదులు వాదనలు వినిపించకుండా కంటి చికిత్సను సాకుగా చూపి తాత్కాలిక బెయిల్‌పై వాదనలు వినిపించారని సజ్జల గుర్తు చేశారు. కంటి చికిత్స కోసమే.. మానవీయ కోణంలో షరతులతో కూడిన బెయిల్ ఇస్తే నిజం గెలిచిందంటూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు సంబరాలు జరుపుకోవడం వెనుక అర్థమేమిటని ప్రశి్నంచారు. చంద్రబాబు నిర్దోíÙగా బయటకొస్తున్నారా నిజం గెలిచిందనడానికి అని నిలదీశారు. ఇలా చెప్పుకోవడానికి టీడీపీ నేతలకు సిగ్గు అనిపించడం లేదా అని చురకలంటించారు. ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి సీమెన్స్ సంస్థతో చేసుకున్నది ఫేక్ అగ్రిమెంటా? కాదా?, చేసుకున్న ఒప్పందం ప్రకారం 90 శాతం అంటే రూ.3,000 కోట్లు సీమెన్స్ సంస్థ పెట్టుబడి పెట్టకుండానే.. 10 శాతం మొత్తం అంటే, 370 కోట్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు రిలీజ్ చేశాడా? లేదా?, సీమెన్స్ సంస్థ ప్రభుత్వం నుంచి మాకెటువంటి సొమ్ము అందలేదని చెప్పిందా? లేదా?, చంద్రబాబు తన సొంత మనుషుల్ని బయటినుంచి తెచ్చుకుని స్కిల్ స్కామ్‌కు పాత్రధారులుగా పెట్టుకున్నాడా? లేదా?, 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నాయా? లేవా?, చంద్రబాబు రిలీజ్ చేయమంటేనే.. ఖజానా నుంచి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నామని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు నోట్ ఫైల్స్ రాశారా? లేదా? ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫండ్స్‌లో రూ.240 కోట్లు షెల్ కంపెనీలకు వెళ్లాయని కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ సంస్థ బయటపెట్టిందా? లేదా?, షెల్ కంపెనీలకు వెళ్లిన ఫండ్స్ క్యాష్ రూపంలో తిరిగి చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చేరాయని ఐటీ దాడుల్లో రుజువైందా? లేదా?, ఈ విషయం పూర్తి నిర్థారణ కోసం పెండ్యాల శ్రీనివాస్‌ను పట్టుకుంటే అసలు వాస్తవాలు తెలుస్తాయనడం నిజమా? కాదా?, పెండ్యాల శ్రీనివాస్ కోసం సీఐడీ నోటీసులు జారీ చేస్తే.. ఆయన్ను అమెరికాకు పంపడం ద్వారా తప్పు చేసినట్టుగా చంద్రబాబు అంగీకరించారా? లేదా?’ అంటూ టీడీపీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. అందరూ నీ తండ్రిలా ఉంటారు అనుకుంటే ఎలా లోకేశ్! చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నన్ని రోజులూ ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు చేసిన విషప్రచారం అంతాఇంతా కాదని సజ్జల గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారంటూ లోకేశ్ చౌకబారు మాటలు మాట్లాడారన్నారు. ‘అందరూ నీ తండ్రిలా ఉంటారనుకుంటే ఎలా’ అని లోకేశ్‌పై మండిపడ్డారు. ఆదినుంచీ వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి విష సర్పాలను పెంచి పోషించిందే చంద్రబాబు అని మండిపడ్డారు. నిజంగా సీఎం వైఎస్ జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఉంటే 52 రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి ఎలా బయటకొస్తాడని ప్రశ్నించారు. ఇదీ చదవండి: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు -
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
-
చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది . స్కిల్ స్కాం కేసులో.. అదీ ఆరోగ్య కారణాల దృష్ట్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈ క్రమంలో పలు షరతులు విధించింది. ‘‘చంద్రబాబు మీడియా, ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కేవలం ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనరాదు. బెయిల్ గడువు ముగిశాక నవంబర్ 28వ తేదీ సాయంత్రం లొంగిపోవాలి. చంద్రబాబు ఈ కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ మరుక్షణమే రద్దు అవుతుంది’’అని తీర్పు కాపీలో జస్టిస్ మల్లికార్జున రావు స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేవలం స్కిల్ స్కామ్ కేసులో.. అదీ కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు అయినట్లు తెలుస్తోంది. అలాగే నవంబర్ 10న ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేటికి రిమాండ్ ఖైదీగా 52 రోజులు పూర్తి చేసుకున్నారాయన. చంద్రబాబు మధ్యంతర బెయిల్ కోర్టు కాపీ కోసం క్లిక్ చేయండి -
Oct 31st 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest, Remand, Cases, Petitions, Court Hearings And Political Updates 07:05 PM, అక్టోబర్ 31, 2023 52 రోజుల ప్రస్థానం ఇది - టైంలైన్ ►రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు ►సెప్టెంబరు 9న స్కిల్ స్కాంలో అరెస్టు, అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్ ►రిమాండ్ ఖైదీగా సెప్టెంబరు పది అర్ధరాత్రి ఒంటిగంటన్నరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు ►జైల్లో చంద్రబాబుకు ప్రత్యేకంగా స్నేహా బ్లాక్ కేటాయింపు ►కోర్టు ఆదేశాల మేరకు ప్రతి రోజూ భోజనం, మందులు ఇంటినుంచే అందించే వెసులు బాటు ►సెప్టెంబరు 22 వరకు రిమాండ్, రెండురోజులపాటు సీఐడీ కస్టడీ విచారణ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రెండురోజుల పాటు సీఐడీ అధికారులు విచారణ, తెలియదు, గుర్తులేదు అన్న చంద్రబాబు ►జైల్లో దోమలు ఉన్నాయని, చంద్రబాబుకు ముప్పు పొంచిఉందని పచ్చమీడియా విపరీతమైన ప్రచారం ►సెప్టెంబరు 24న మరోసారి చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు, అక్టోబరు ఐదువరకూ రిమాండ్ కొనసాగింపు ►చంద్రబాబుకు చర్మ వ్యాధి ఉందంటూ పచ్చమీడియా విపరీత ప్రచారం, ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు ►కోర్టు ఆదేశాలమేరకు చంద్రబాబుకు టవర్ ఏసీ ఏర్పాటు ►చంద్రబాబుకు రోజుకు మూడు సార్లు వైద్య పరీక్షలు ►ఒక వైద్య పరీక్షలో ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు ►చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు, అక్టోబరు 5నుండి 19వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు ►వారానికి రెండుసార్లు చంద్రబాబుతో ములాఖత్ అయిన భువనేశ్వరి, లోకేష్ ,బ్రాహ్మణి ►చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం, ఐదు కిలోలు బరువు తగ్గారంటూ ఆందోళన ►చంద్రబాబు కిలో బరువు పెరిగారని, జైలుకు వచ్చినపుడు 66 కిలోలు ఉండేవారని, ఇపుడు 67 కిలోలు ఉన్నారని స్పష్టం చేసిన అధికారులు ►విడుదల సమయానికి మరో అరకిలో పెరిగి 67.5 కిలోలకు చేరుకున్నచంద్రబాబు ►అక్టోబరు 19 నుండి నవంబరు ఒకటి వరకూ చంద్రబాబు జ్యుడిషియర్ రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►తన కుడికంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయాలని జైలు అధికారులకు తెలిపిన చంద్రబాబు ►జీజీహెచ్ వైద్యులతో పరీక్షలు చేయించిన అధికారులు ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు 06:45 PM, అక్టోబర్ 31, 2023 రాజమండ్రిలో టిడిపి అతితో గందరగోళం ►రెండు గంటలయినా రాజమండ్రి దాటని చంద్రబాబు కాన్వాయ్ ►దివాన్ చెరువు మీదుగా వేమగిరి వైపు కాన్వాయ్ ►భారీగా కార్యకర్తలను తరలించిన టిడిపి నేతలు ►టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా పోటెత్తడంతో రాజమండ్రి అస్తవ్యస్తం ►చంద్రబాబు కాన్వాయ్‌కు పోటీగా వందలాది వాహనాలను తీసుకొచ్చిన టీడీపీ నేతలు ►వందలాది వాహనాలు రావడంతో స్తంభించిపోయిన రాజమండ్రి ►తెలుగుదేశం ప్రైవేట్ వాహనాల రాకతో భారీగా ట్రాఫిక్ జామ్ ►దివాన్ చెరువు వద్ద వాహనాలను నిలపడానికి పోలీసుల ప్రయత్నం ►పోలీసుల ఆదేశాలను ధిక్కరించి ట్రాఫిక్‌కు అడ్డు తగులుతోన్న టిడిపి కార్యకర్తలు ►వేమగిరి,రావులపాలెం,పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్,గన్నవరం, విజయవాడ మీదుగా ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు 06:20 PM, అక్టోబర్ 31, 2023 బాబు లాయర్ల పిటిషన్ కొట్టివేత ►చంద్రబాబు లాయర్ల పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు ►సీఐడీ అధికారుల కాల్‌డేటా స్వాధీనం చేసుకోవాలని పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►సీఐడీ తరపున వివేకానంద వాదనలు ►చంద్రబాబు తరపున దమ్మాలపాటి వాదనలు ►ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ►పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 05:49 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ సరే, నిజం గెలవాలి సంగతేంటీ? : మంత్రి కొట్టు సత్యనారాయణ ►విజయవాడలో మాట్లాడిన డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ పిసి ►చంద్రబాబుకు మధ్యంతర బెయిలు వచ్చింది కాబట్టి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటారా? ►టీడీపీ జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది...అలాంటి పార్టీ తెలంగాణాలో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం ఏమిటి? ►తెలంగాణాలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తేలిపోయినట్టేనా? ►సైబర్ సిటినీ తానే నిర్మించానని చెబుతున్న చంద్రబాబు తెలంగాణా ఎన్నికల్లో ఎందుకు చేతులెత్తేసారు? ►ఏపీలోనూ సొంతంగా పోటీ చేసే సత్తా లేక జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జాతీయ పార్టీగా అని ఎలా చెప్పుకుటుంది? ►ఏపీలో జనసేన-టీడీపీ పొత్తు ఎంతవరకూ నిలబడుతుందని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు.! ►మేముంటేనే మీరని జనసేన-టీడీపీ మధ్య క్షేత్రస్థాయిలో కుమ్ములాటలు జరుగుతున్నాయి.! ►చంద్రబాబును జైల్లో పెడితే రోడ్డుపై పడుకుని పవన్ కల్యాణ్ నానా విన్యాసాలు చేశారు 05:42 PM, అక్టోబర్ 31, 2023 షరతులు బేఖాతరు ►తూర్పుగోదావరి జిల్లా : మధ్యంతర బైలుకు సంబంధించి హైకోర్టు విధించిన షరతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు ►జైలు బయటికి వచ్చిన వెంటనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ►నిబంధనలకు విరుద్ధంగా జైలు గేటు వరకు బారికెడ్లను తోసుకొంటూ వచ్చిన టిడిపి కార్యకర్తలు ►ర్యాలీగా రాకూడదని హైకోర్టు అభ్యంతరాలు ఉన్నా పట్టించుకోకుండా జైలు బయట గేటు వద్ద నుండి కార్యకర్తల సమూహంతో రోడ్డుపైకి వచ్చిన చంద్రబాబు ►రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చే రూటును బ్లాక్ చేసిన టిడిపి కార్యకర్తలు 04:40 PM, అక్టోబర్ 31, 2023 బయటకు రాగానే మైక్ అందుకున్న బాబు ►హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కేసిన చంద్రబాబు ►రాజకీయ ర్యాలీలు చేయొద్దని స్పష్టంగా చెప్పిన హైకోర్టు ►ర్యాలీల్లో ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు చెప్పినా.. పట్టించుకోని చంద్రబాబు ►తనకు సంఘీభావం తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు ►ప్రత్యేకంగా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు : చంద్రబాబు 04:30 PM, అక్టోబర్ 31, 2023 కాసేపట్లో బెజవాడకు బాబు ►కాసేపట్లో విజయవాడకు బయల్దేరనున్న చంద్రబాబు ►రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వెళ్లనున్న చంద్రబాబు ►రేపు సాయంత్రం తిరుమలకు వెళ్లాలని నిర్ణయం ►ఎల్లుండి ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్న చంద్రబాబు ►అనంతరం హైదరాబాద్ లో శస్త్ర చికిత్స చేయించుకోవాలని చంద్రబాబు యోచన 04:15 PM, అక్టోబర్ 31, 2023 జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల ►జైలు గేటు వద్ద తెలుగుదేశం నేతల కేకలు, అరుపులు ►జైలు ముందు చంద్రబాబు కోసం కుటుంబసభ్యులు, టిడిపి నేతలు ►చంద్రబాబును కలిసేందుకు నాయకుల పోటాపోటీ ►టిడిపి జెండాలు, ఫ్లెక్సీలతో జైలు ప్రాంగణాన్ని నింపేసిన టిడిపి నేతలు ►అందరిని పక్కకు జరిపి చంద్రబాబును అలింగనం చేసుకున్న అచ్చెన్నాయుడు 04:13 PM, అక్టోబర్ 31, 2023 తెలుగుదేశం నేతల ఓవరాక్షన్‌తో చంద్రబాబుకు మరిన్ని ఆంక్షలు ►రేపటి దాకా చంద్రబాబు ఎలాంటి ర్యాలీలు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ►ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనద్దని హైకోర్టు ఆదేశాలు ►రేపటి వరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దు : హైకోర్టు ఆదేశాలు 04:03 PM, అక్టోబర్ 31, 2023 జైలుకు చంద్రబాబు కాన్వాయ్ ►రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్న చంద్రబాబు కాన్వాయ్ ►జైలు లోపలికి వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్ ►కాసేపట్లో విడుదల కానున్న చంద్రబాబు ►సెంట్రల్ జైలు దగ్గర భారీ స్థాయిలో మోహరించిన టీడీపీ శ్రేణులు ►చంద్రబాబును చూసేందుకు భారీగా రావాలని కార్యకర్తలకు టీడీపీ పిలుపు ►పలు చోట్ల వాహనాలను ఏర్పాటు చేసి మరీ జనాలను తెస్తోన్న టీడీపీ 04:00 PM, అక్టోబర్ 31, 2023 జైలులో జరుగుతున్న బెయిల్ ప్రక్రియ ►రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►చంద్రబాబును కలిసిన లోకేష్, బ్రాహ్మణి ►విజయవాడ వరకు ఎలా వెళ్దాం? ఏం చేద్దాం? ►బయటకు తీసుకొచ్చే విషయంపై చర్చలు ►బాబు బెయిల్ కాపీలను తీసుకుని లోనికి వెళ్లిన లాయర్లు ►జైల్లో బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయనున్న లాయర్లు 03:55 PM, అక్టోబర్ 31, 2023 జైలు వద్ద భారీగా మోహరించిన తెలుగుదేశం కార్యకర్తలు ► రాజమండ్రి జైలు వద్ద నెలకొన్న పరిస్థితిపై పోలీసులు సీరియస్ ► రాజకీయాలకు జైలును అడ్డా ఎలా చేస్తారని ఆగ్రహం ► రాజమండ్రి జైలు చుట్టూ భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు ► జాతీయ రహదారి లాలాచెరువు నుంచి సెంట్రల్ జైలు వరకు రహదారిని మూసివేత ► జైలు వద్ద ఏ ఒక్కరు అతి చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం ► శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఊరుకోబోమంటున్న అధికారులు 03:45 PM, అక్టోబర్ 31, 2023 టిడిపి తీరే అంత.! తొలి రోజే నిబంధనలు ఉల్లంఘిస్తారా? ► రాజమండ్రి జైలు వద్దకు భారీగా చేరుకుంటున్న తెలుగుదేశం శ్రేణులు ► చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలు ► చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దృష్ట్యా తెలుగుదేశం కొత్త వ్యూహం ► రాజమండ్రికి భారీగా కార్యకర్తలను తరలిస్తోన్న తెలుగుదేశం నేతలు ► ప్రతీ నియోజకవర్గం నుంచి ఇంత మంది అంటూ లెక్కలేసుకొని మరీ తరలింపు ► రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ర్యాలీ చేయాలని ప్రణాళిక ► ఇప్పటికే సోషల్ మీడియాలో మొదలైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ► బెయిల్ ఊరేగింపు అడ్డు పెట్టుకుని ఏం చేయబోతున్నారు? 03:15 PM, అక్టోబర్ 31, 2023 నిబంధనలను పెంచండి : CID పిటిషన్ ► ఏపీ హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు మధ్యంతర బెయిల్లో మరో 5 నిబంధనలు చేర్చాలని పిటిషన్ 1. రాజకీయ యాత్రలు, ప్రసంగాలు, సభలు పెట్టొద్దు, 2. మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు 3. కేవలం వైద్యం కోసమే బెయిల్‌ను ఉపయోగించాలి 4. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రెస్, పబ్లిక్ ముందు మాట్లాడొద్దు 5. ఇద్దరు DSP స్థాయి అధికారులు చంద్రబాబుతో ఉంటూ కదలికలను కోర్టుకు సమర్పించాలి ఈ ఐదు షరతులు చేర్చాలని కోరుతూ సీఐడీ పిటిషన్ 03:10 PM, అక్టోబర్ 31, 2023 బాబు జెడ్ ప్లస్‌కు ఏర్పాట్లు ► రాజమండ్రి జైలు నుంచి కరకట్ట నివాసం దాకా భద్రత ►రోడ్డు మార్గంలో రాజమండ్రి నుంచి విజయవాడ కరకట్ట నివాసానికి వచ్చేందుకు ఏర్పాట్లు 03:01 PM, అక్టోబర్ 31, 2023 మద్యం కేసులోనూ చంద్రబాబుకు ఊరట ►మద్యం కేసులోనూ చంద్రబాబుకు హైకోర్టులో ఊరట ►చంద్రబాబును అరెస్ట్ చేయబోమని తెలిపిన ఏజీ ►హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించబోమని కోర్టుకు తెలిపిన ఏజీ ►అడ్వకేట్ జనరల్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన హైకోర్టు ►విచారణ నవంబర్ 21కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 03:00 PM, అక్టోబర్ 31, 2023 జైలుకు చేరిన రిలీజ్ ఆర్డర్ ►రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరిన చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఆర్డర్ ►కండిషన్స్ ను చంద్రబాబుకు చదివి వినిపించనున్న జైలు సూపరింటెండెంట్ ►కాసేపట్లో జైలు నుంచి బయటకు రానున్న చంద్రబాబు 03:00 PM, అక్టోబర్ 31, 2023 రిలీజ్ ఆర్డర్ తీసుకున్న TDP నేతలు ►విజయవాడ : ACB కోర్టు దగ్గర బోండా ఉమ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ విషయంలో ఏసీబీ కోర్టుకు ష్యూర్టీలు సమర్పించాం ►వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చాం ►చంద్రబాబు రిలీజ్ ఆర్డర్లను జైలు అధికారులకు కోర్టు మెయిల్ చేశారు ►పర్సనల్ ఆర్డర్ కూడా మేం తీసుకున్నాం ►రాజమండ్రి జైలు అధికారులకు మెయిల్ ద్వారా హైకోర్టు బెయిల్ ఆర్డర్, ఏసీబీ కోర్టు రిలీజ్ ఆర్డర్ అందాయి ►సుప్రీం కోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం రావాల్సి ఉంది ►మరో గంటన్నరలో చంద్రబాబు జైలు నుంచి బయటకు రావొచ్చు 02:50 PM, అక్టోబర్ 31, 2023 రిలీజ్ ఆర్డర్ ఇది ►చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ACB కోర్టు రిలీజ్ ఆర్డర్ ►CrPL No.7951/2023 ప్రకారం చంద్రబాబును విడుదల చేయాలని ఉత్తర్వులు ►ప్రస్తుతం రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691గా ఉన్న చంద్రబాబు 02:30 PM, అక్టోబర్ 31, 2023 మద్యం కేసులోనూ బెయిలివ్వండి : చంద్రబాబు లాయర్లు ►హైకోర్టులో చంద్రబాబు లాయర్ల లంచ్ మోషన్ పిటిషన్ ►మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ ►చంద్రబాబు పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ ►మద్యం కేసులో చంద్రబాబు ఏ3 02:30 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు వచ్చింది కండీషనల్ బెయిలే : సజ్జల ►కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు చంద్రబాబుకు కోర్ట్ బెయిల్ ఇచ్చింది ►టీడీపీ ఎందుకు సంబరాలు చేసుకుంటుందో అర్థం కావడం లేదు ►స్కిల్ కేసులో షెల్ కంపెనీలకు దారి మళ్లాయా? లేదా? ►వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తే చంద్రబాబు బయటకు వస్తారా? ►చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయటపెట్టాలి ►స్కిల్ కేసులో రూ.240 కోట్లు దారి మళ్లాయి ►రాజమండ్రి నుంచి రోడ్ షో చేస్తామంటున్నారు ►రోడ్ షోతో జనానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ►లయన్ ఈజ్ బ్యాక్ అని టీడీపీ గొప్పగా చెప్పుకుంటోంది ►చంద్రబాబు ఏమైనా వీర యోధుడా? ►చంద్రబాబు ఇంతకాలం వ్యవస్థల్ని మ్యానేజ్ చేశారు ►చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా ఉండదు ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదంటే విజయయాత్ర ఎందుకు? ►చంద్రబాబు విషయంలో ప్రభుత్వానికి కక్షసాధింపు లేదు ►చంద్రబాబు బయట ఉంటేనే పొలిటికల్ ఫైట్ నడుస్తుంది ►నిజం గెలిచిందని ఉపన్యాసాలు చేస్తుంటే జనం ఏమనుకుంటారు? 01:43 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ ప్రాసెస్ ఎక్కడివరకు వచ్చిందంటే.? ►విజయవాడ : ఎసిబి కోర్టులో హైకోర్టు ఇచ్చిన చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఆర్డర్ కాపీని అందజేసిన చంద్రబాబు న్యాయవాదులు ►ACB కోర్టుకు ష్యూరిటీలు సమర్పించిన టిడిపి నేతలు దేవినేని ఉమ, బోండా ఉమ ►చెరో రూ. లక్ష పూచీకత్తు సమర్పించిన టీడీపీ నేతలు ►మధ్యంతర బెయిల్ ఆర్డరుతో పాటు అఫిడవిట్లని ఏసీబీ కోర్టుకు సమర్పించిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►తదుపరి ఆదేశాలను రాజమండ్రి జైలు అధికారులకు మెయిల్ ద్వారా పంపుతామన్న ఏసీబీ కోర్టు ►ప్రొసీజర్ అంతా పూర్తయితే ఈ సాయంత్రానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం 01:35 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ వచ్చినా ఆగని ములాఖత్‌లు ►రాజమండ్రి జైల్లో మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబుతో నారా లోకేశ్ ములాఖత్ ►లోకేశ్‌తో పాటు చంద్రబాబును కలవనున్న బ్రాహ్మణి ►జైల్లో చంద్రబాబును కలవనున్నతెలుగుదేశం ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి 01:25 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ షరతులతో మాత్రమే : వెల్లంపల్లి ►కోర్టు చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇచ్చింది రోగాలు ఉన్నందునే ►ప్రపంచంలో ఉన్న రోగాలన్ని చంద్రబాబుకు ఉన్నట్టు చూపించి బెయిల్ తెచ్చుకున్నారు ►చంద్రబాబుకు ఇచ్చింది కండీషన్డ్ బెయిల్ మాత్రమే.. ►తిరిగి చంద్రబాబు మరలా జైలుకు వెళ్లాల్సిందే ►చంద్రబాబు నేరం చేయలేదని వాళ్ల న్యాయవాదులు ఎక్కడా చెప్పలేదు ►అనారోగ్య కారణాలతో చంద్రబాబు కు మద్యంతర బెయిల్ వచ్చింది చంద్రబాబు రాజకీయాలకు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు ►కాసాని జ్ఞానేశ్వర్ ను ఎన్ని కల్లో పోటీ చేయిస్తామని చెప్పి మోసం చేసారు ►కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందంతో పోటీ చేయడం లేదని జెండా పీకేశారు ►బిసిలను మరోసారి చంద్రబాబు మోసం చేశాడు ►తెలంగాణాలో పోటీచేసే అవకాశం లేకుండా జెండా పీకేసిన వ్యక్తి చంద్రబాబు ►2024 లో ఏపిలోనూ టిడిపి జెండా పీకేస్తారు ►పవన్ టీడీపీతో కలిసినా ప్రయోజనం లేదు తండ్రి జైలులో ఉంటే నారా లోకేష్ ఎక్కడ ఉన్నట్టు ►విజయనగరం భువనేశ్వరి కాకుండా లోకేష్ వెళ్లచ్చుకదా.. ఎందుకు వెళ్ళలేదు..? ►లోకేష్ అసమర్ధుడని వాళ్ళ క్యాడర్ భావిస్తుంది ►ఎన్డీఆర్ చావుకు కారణమవ్వడమే కాకుండా నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు పురందేశ్వరికి చంద్రబాబు అవినీతిలో భాగస్వామ్యం ఉంది ►బిజెపి అధ్యక్షురాలిగా టిడిపి కి స్పోక్ పర్సన్ పురందేశ్వరి కొనసాగుతున్నారు ►అమిత్ షా వద్దకు లోకేష్ ను పురందేశ్వరి తీసుకెళ్లలేదా ►చంద్రబాబు ను కాపాడడానికి పురందేశ్వరి కంకణం కట్టుకున్నారు ►చంద్రబాబును జైలు నుంచి తేవాలన్నదే పురందేశ్వరి లక్ష్యం 01:15 PM, అక్టోబర్ 31, 2023 నిజం గెలవాలి యాత్ర అబద్ధమేనా? ►చంద్రబాబు విడుదలతో మారిన తెలుగుదేశం వ్యూహం ►నిజం గెలవాలి యాత్రను నిలిపివేసే యోచనలో భువనేశ్వరీ ►చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉంది: నారా భువనేశ్వరి ►నిజం గెలవాలి యాత్ర పై ఇంకా ఆలోచించలేదు : నారా భువనేశ్వరి 01:05 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబు బెయిల్ అనగానే పవన్ కళ్యాణ్‌లో తెగ ఉత్సాహం ►యూరప్ నుంచే ప్రెస్ నోట్ విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ►చంద్రబాబు విడుదల కోసం ఎదురుచూస్తున్నామన్న పవన్ శ్రీ @ncbn గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/Hd1xjBsOCS — JanaSena Party (@JanaSenaParty) October 31, 2023 12:55 PM, అక్టోబర్ 31, 2023 విడుదల ఎప్పుడంటే..! ►ACB కోర్టు ద్వారా జైలుకు అందనున్న హైకోర్టు ఉత్తర్వులు ►జైలు అధికారులకు కోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత ప్రారంభం కానున్న ప్రొసీడింగ్స్ ►చంద్రబాబు NSG సెక్యూరిటీ పరిధిలో ఉండడంతో SPకి సమాచారం ఇవ్వనున్న జైలు అధికారులు 12:45 PM, అక్టోబర్ 31, 2023 నవంబర్ 28న మళ్లీ జైలుకు ►చంద్రబాబు బెయిల్ గడువు నవంబర్ 28 వరకు ►నవంబర్ 28న రాజమండ్రి సెంట్రల్ జైల్లో సాయంత్రం 5గంటల్లోగా సరెండర్ కావాలి 12:40 PM, అక్టోబర్ 31, 2023 ష్యూరిటీలు సమర్పించిన బొండా, దేవినేని ►చంద్రబాబు బెయిల్ కోసం బొండా, దేవినేని ష్యూరిటీలు విజయవాడ కోర్టులో షూరిటీ సమర్పించిన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరావు 12:32 PM, అక్టోబర్ 31, 2023 జైలు నుంచి చంద్రబాబు ఎక్కడికంటే.? ► సాయంత్రం రాజమండ్రి నుంచి అమరావతికి చంద్రబాబు ► రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన అమరావతికి చంద్రబాబు ► అమరావతి నుంచి రేపు లేదా ఎల్లుండి తిరుమలకు చంద్రబాబు ► తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత హైదరబాద్ కు చంద్రబాబు ► ఆ తర్వాత హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స ► హైదరాబాద్‌లోనే స్కిన్ డాక్టర్‌తో ట్రీట్మెంట్ 12:28 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ ఇచ్చింది ఎందుకంటే.. : మంత్రి అంబటి ►చంద్రబాబు బెయిల్ పై అంబటి రాంబాబు స్పందన ►కేసులో నిర్దోషి అని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేదు ►స్కిల్ స్కాంలో చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చారు ►కంటి ఆపరేషన్ చేయించుకొన్న తర్వాత జైలుకు రావాల్సిందే ►కేసు దర్యాప్తు కొనసాగుతోంది ►రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదు ►తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు ►ఇతర పార్టీ కోసం పార్టీని తాకట్టుపెట్టడం అనైతికం ►కాసాని జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయ్యింది ►చంద్రబాబును నమ్ముకున్న ఎవరికైనా వెన్నుపోటు తప్పదు 12:20 PM, అక్టోబర్ 31, 2023 మద్యం కేసులో బెయిల్ పిటిషన్ ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ ►మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ ►మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులు ఇచ్చారన్న సీఐడీ అధికారుల కేసు పై హౌస్ మోషన్ పిటిషన్ ►పిటిషన్ విచారణకు అనుమతిచ్చిన ఏపీ హైకోర్టు 12:15 PM, అక్టోబర్ 31, 2023 తొలిరోజే షరతుల ఉల్లంఘనకు ప్రణాళిక ►రాజమండ్రి చేరుకున్న లోకేశ్, బ్రాహ్మణి ►కాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్ ►బెయిల్ రావడంతో సాయంత్రం 4గంటలకు జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ►ఎయిర్ పోర్టు వరకు భారీ ర్యాలీకి టీడీపీ ఏర్పాట్లు ►హైకోర్టు సూచించినా.. దానికి విరుద్ధంగా ర్యాలీకి ఏర్పాట్లు చేస్తోన్న టిడిపి 12:10 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్ కేవలం అనారోగ్య కారణాల వల్లే ►కేవలం చంద్రబాబు అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు ►నవంబర్ 28, 2023 మంగళవారం రోజున సా.5 గంటలకు సరెండర్ కావాలని ఆదేశం ►నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వింటామన్న కోర్టు ►ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనరాదన్న కోర్టు ►మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదన్న కోర్టు 12:05 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్లో షరతులు ఇవే ►చంద్రబాబుకు ఐదు షరతులతో మధ్యంతర బెయిల్ 1. రూ.లక్ష పూచీకత్తుతో పాటు ఇద్దరి షూరిటీలు సమర్పించాలి 2. నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స చేయించుకోవచ్చు 3. చికిత్స, ఆస్పత్రి వివరాలు సరెండర్ సమయంలో సీల్డ్ కవర్ లో జైలు సూపరింటెండెంట్ కు సమర్పించాలి 4. ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసును ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదు 5. నవంబర్ 28, 2023 సాయంత్రం 5 గంటల్లోపు తిరిగి సరెండర్ కావాలి 12:05 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్‌కు ష్యూరిటీలు వీళ్లే ►హైకోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు ఇవ్వనున్న ఇద్దరు ►రూ.లక్ష బాండ్, 2 ష్యూరిటీలను ఇవ్వనున్న బోండా ఉమ, దేవినేని ఉమ ►విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న బోండా ఉమ, దేవినేని ఉమ 12:00 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్ ►ఐదు షరతులతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ►సాయంత్రం చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ►హైకోర్టు ఉత్తర్వులు ఏసీబీ కోర్టు ద్వారా రాజమండ్రి జైలుకు ►బెయిల్ కాపీతో రాజమండ్రి జైలుకు రానున్న చంద్రబాబు లాయర్లు ►ప్రొసీడింగ్స్ పూర్తైన తర్వాత ఎస్పీకి సమాచారమివ్వనున్న జైలు అధికారులు ►జైలు దగ్గరికి రానున్న జిల్లా పోలీసులతోపాటు NSG బృందం ►ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు 11:45 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్‌పై పురందేశ్వరీ స్పందన ►చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నాం ►చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం మంచి పరిణామం : పురంధేశ్వరి 11:38 AM, అక్టోబర్ 31, 2023 ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ ►మద్యం కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారని.. సీఐడీ అధికారుల కేసుపై లంచ్ మోషన్ పిటిషన్ ►సీఐడీ నమోదు చేసిన కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు అనుమతిచ్చిన హైకోర్టు ►మధ్యాహ్నాం 2గం.15కి పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు ►టీడీపీ అడ్డగోలు మద్యం వ్యవహారాలపై కేసు ►తన హయాంలో కావాల్సిన కంపెనీలకు దోచిపెట్టిన చంద్రబాబు ►కావాల్సిన డిస్టిలరీలకు అడ్డగోలు అనుమతులు ►క్విడ్‌ప్రోకోలో భాగంగా ఎక్సైజ్ పాలసీనే మార్చేసిన నాటి ప్రభుత్వం ►రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టలరీలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు ►ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం ►ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్.. అనుమతించిన న్యాయస్థానం ►ఏ–1గా ఐఎస్ నరేష్, ఏ–2గా కొల్లు రవీంద్ర, ఏ–3గా చంద్రబాబు 11:12 AM, అక్టోబర్ 31, 2023 స్కిల్డ్ దొంగ చంద్రబాబే! ►టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు ►డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి ►2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో బయటపడ్డ అక్రమం ►అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం ►ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు ►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ ►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్ కూడా ►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ►చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసం ►రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం ►ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం ►రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం ►ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారని సీఐడీ అభియోగం ►ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు ►ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు ►ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ►చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో కొనసాగుతున్న చంద్రబాబు ►తాజాగా.. ఇవాళ నాలుగువారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు 11:12 AM, అక్టోబర్ 31, 2023 బాబు బెయిల్‌పై అంబటి సెటైర్ ►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ►కంటి శస్త్రచికిత్స కోసం బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు ►షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని కోర్టు హెచ్చరిక ►నిజం గెలిచి కాదు.. చంద్రబాబుకి కళ్లు కనిపించట్లేదని కోర్టు బెయిల్ ఇచ్చిందన్న అంబటి ►ఎక్స్‌లో బాబు బెయిల్‌పై అంబటి సెటైర్ నిజం గెలిచి కాదు బాబుకు కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్! — Ambati Rambabu (@AmbatiRambabu) October 31, 2023 11:01 AM, అక్టోబర్ 31, 2023 నవంబర్ 10న చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►నవంబర్ 10వ తేదీన వాదనలు వింటామన్న ఏపీ హైకోర్టు ►మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కాసేపటి కిందట తీర్పు ►నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ►ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు ►కంటి సర్జరీ కోసమే బెయిల్ ఇచ్చినట్లు వెల్లడి ►చంద్రబాబుకు కోర్టు పలు షరతులు ►రాజకీయ, మీడియా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు ►కేవలం ఆస్పత్రికి మాత్రమే వెళ్లాలి ►నవంబర్ 24వ తేదీ సాయంత్రం సరెండర్ కావాలి ►కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు ►షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరిక 10:39 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు ►స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు ►నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ►రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీల్ని సమర్పించాలని ఆదేశం ►నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ ►కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ►షరతులు ఉల్లంఘిస్తే మరుక్షణమే బెయిల్ రద్దవుతుందని హెచ్చరిక 10:15 AM, అక్టోబర్ 31, 2023 కాసేపట్లో మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు ►స్కిల్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు ►కంటికి శస్త్రచికిత్స అవసరం అంటూ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►ఇప్పటికిప్పుడు శస్త్రచికిత్స అవసరం లేదని సీఐడీ తరపు లాయర్ల వాదన ►ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలన్న బాబు లాయర్లు ►చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యులు ఇచ్చిన నివేదికలు కోర్టుకు సమర్పించిన సీఐడీ ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, పైగా బరువు పెరిగారని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సీఐడీ లాయర్లు 09:52 AM, అక్టోబర్ 31, 2023 సీడీఆర్ పిటిషన్ తీర్పు నేడు ►సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు కేస్ అప్ డేట్ ►సీఐడీ అధికారుల కాల్ డేటా పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డ్ ను భద్రపరచాలంటూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ►అరెస్ట్ వెనుక కుట్ర కోణం ఉందంటూ బాబు లాయర్ల వాదన ►ఇతర వ్యక్తుల డైరెక్షన్లోనే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని వాదన ►కాల్ డేటా పిటిషన్ అసలు విచారణ అర్హత లేదని వాదించిన సీఐడీ తరపు న్యాయవాదులు ►అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు, భద్రతకు భంగం కలుగుతుందన్న సీఐడీ లాయర్లు ►అరెస్ట్‌లో ఎవరి ప్రమేయం లేదని సీఐడీ లాయర్ల వాదన ►వాదనలు పూర్తి.. నేడు తీర్పు వెల్లడించనున్న ఏసీబీ జడ్జి 09:22 AM, అక్టోబర్ 31, 2023 ఇంటి భోజనంతో బరువు పెరిగిన చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►బాబు ఆరోగ్యంపై ప్రతిరోజూ హెల్త్ బులెటిన్ విడుదల ►మరోవైపు చంద్రబాబు ఆరోగ్యాన్ని సాకుగా చూపించి మధ్యంతర బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు న్యాయవాదులు ►హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ వెలువడనున్న తీర్పు ►చంద్రబాబుకు రోజూ ఇంటి భోజనం ►జైల్లో చంద్రబాబు బరువు పెరిగారని స్పష్టం చేసిన అధికారులు ►జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలు ఉన్న చంద్రబాబు ప్రస్తుతం 67.5 కిలోలు ఉన్నారని వెల్లడి ►చంద్రబాబు కుడి కంటి క్యాటరాక్ట్ సర్జరీ అత్యవసరంగా చేయాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►ప్రస్తుతం ఇమ్మెచ్యూర్డ్ కాటరాక్ట్ ఉందని జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన రిపోర్టును సమర్పించిన జైలు అధికారులు 08:45 AM, అక్టోబర్ 31, 2023 లోకేష్ బేబీని వదలని ఆర్జీవీ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ అండ్ కోను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న దర్శకుడు రాం గోపాల్ వర్మ ►తాజాగా నారా లోకేష్‌ను బేబీ అంటూ టీజింగ్ ►సీఎం జగన్‌పై నారా లోకేష్ ఎక్స్‌లో అడ్డగోలు వ్యాఖ్యలు ► గుడ్ నైట్ బేబీ అంటూ సింపుల్‌గా లోకేష్‌కు రిప్లై ఇచ్చిన ఆర్జీవీ 08:32 AM, అక్టోబర్ 31, 2023 నారా వారి లిక్కరు స్కామ్ ►చంద్రబాబుపై లిక్కర్ స్కామ్ కేసు నమోదు చేసిన సీఐడీ ►గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపనల నేపథ్యంలో కేసు నమోదు ►ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు ►ఐపీసీ సెక్షన్ 166,167,409,120(B), రెడ్ విత్ 34 మరియు సెక్షన్ 13(1)(d) రెడ్ విత్ 13(2) పిసి యాక్ట్, 1968 గా కేసు నమోదు ►కేసులో A-3 గా చంద్రబాబును చేర్చిన సీఐడీ అధికారులు ►చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు మెమో రూపంలో తెలిపిన సీఐడీ అధికారులు ►మద్యం షాపులు, మద్యం కంపెనీల కు అక్రమ దారుల్లో లబ్ది చేకూర్చిన చంద్రబాబు ప్రభుత్వం ►మద్యం షాపులు (a4) ప్రివిలైజ్ ఫీజు తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం ►ప్రతి ఏటా రూ.1,300 కోట్లు ప్రభుత్వానికి నష్టం ►2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి దాదాపు రూ.2900 కోట్ల ఆదాయం ►తెలంగాణలో ఉన్న ప్రివిలైజ్ ఫీజు.. ఏపీలో తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం ►అప్పట్లో లిక్కర్ సిండికేట్ తో కుమ్మక్కై తగ్గించేసిన చంద్రబాబు ప్రభుత్వం ►టీడీపీ ఎంపీ ఎస్పీ వై రెడ్డి సంస్థ ఎస్పీ వై ఆగ్రో ఇండస్ట్రీకి లబ్ది చేకూరుస్తూ వడ్డీ తగ్గింపు ►హైకోర్టు ఆదేశాలని అమలు చేయకుండా ఏకపక్షంగా వడ్డీ తగ్గింపు ►కేబినెట్ ఆమోదం లేకుండానే వడ్డీ తగ్గించిన చంద్రబాబు ప్రభుత్వం ►ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత హడావిడిగా లిక్కర్ కంపెనీలకు భారీగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►టీడీపీ నేతల లిక్కర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►త్రిసభ్య కమిటీ సిఫార్సులు కి విరుద్ధంగా లిక్కర్ కంపెనీలకు అనుమతులు ►మాజీ మంత్రి యనమల రామ కృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు చెందిన పీఎంకే డిస్టీలరీస్‌కి అనుమతి ►మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టీలరీస్‌కి అనుమతి ►అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►2019 ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కొన్ని బ్రాండ్ల కు హడావుడిగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►సరఫరా కంపెనీలకు భారీ లబ్ది చేకూర్చేందుకు అనుమతులు ►అన్ని వ్యవహరల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించిన సీఐడీ ►బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన సీఐడీ ►ఈ కేసులో ఏ-1గా అప్పటి ఎక్సైజ్ కమీషనర్ శ్రీనివాస నరేష్, ఏ-2గా మాజీమంత్రి కొల్లు రవీంద్ర, ఏ-3గా చంద్రబాబు నాయుడు ►రెండు బేవరేజ్ లు, మూడు డిస్టిలరీలకి లబ్ది చేకూర్చడానికి క్విడ్ ప్రోకి పాల్పడినట్లు ఆరోపణలు ►2012 లో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీని 2015 లో మార్చి అడ్డుకోలుగా ఈ కంపెనీలకి మేలు చేసినట్లు ఆధారాలు 07:57 AM, అక్టోబర్ 31, 2023 స్కిల్ స్కాంలో బాబు మధ్యంతర బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ ► ఏపీ హైకోర్టులో టీడీపీ నేతల పిటిషన్ పై విచారణ వాయిదా ► విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ► గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్షకు ప్రభుత్వం వేసిన సిట్, కేబినెట్ సబ్ కమిటీని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ ► 1411 జీవో, 344 జీవోను సవాల్ చేస్తూ పిటిషన్లు ► ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్‌తో పాటు అనుబంధ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►కంటికి శస్త్రచికిత్స అవసరమని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి ► వాదనలు పూర్తి, ఇవాళ తీర్పు 07:35 AM, అక్టోబర్ 31, 2023 పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? ►టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా ►కాసాని జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది ►మరి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? ►ట్వీట్‌తో పవన్‌కు చురకలంటిన మంత్రి అంబటి రాంబాబు ►టీటీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా ►తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చంద్రబాబు ఆదేశం ►నారా లోకేష్ కనీసం స్పందించలేదని రాజీనామా లేఖలో కాసాని విమర్శలు జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది ! పవన్ ఎప్పుడు పరిపక్వమౌతాడో ?@PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) October 30, 2023 07:13 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ ►పదుల కొద్దీ పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు ►వరుసగా ఎదురు దెబ్బలు.. ఎక్కడా దక్కని ఊరట ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ ►ఆపై ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు ►తాజాగా వెలుగులోకి మరో అవినీతి బాగోతం ►కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ ►మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చినందుకు చంద్రబాబుపై మరో కేసు నమోదు ►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు ►చంద్రబాబుకు లేని రోగాలను అంటగడుతూ సానుభూతి కోసం ప్రయత్నాలు ►తెలంగాణ బరి నుంచి ఓటమి భయంతో తప్పుకున్న తెలుగుదేశం ఇదీ చదవండి: IRR Case.. తోడు దొంగల రింగ్ 06:59 AM, అక్టోబర్ 31, 2023 ఖేల్ ఖతం.. దుకాణం బంద్ ►తెలంగాణలో టీడీపీ బిగ్ షాక్ ►టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా ►నారావారి తీరుపై రాజీనామా లేఖలో తీవ్ర అసంతృప్తి వెల్లగక్కిన కాసాని ►తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పకపోతే ఎలా?: కాసాని ►బాలకృష్ణ తెలంగాణలో నేనుంటా అన్నడు.. ఇప్పుడు ఏమైందో తెలియదు ►లోకేశ్ చిన్న పిల్లవాడో, పెద్దవాడో అర్థంకాదు.. 20సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు ►లోకేష్ ఎవరికి దొరకరు ►హైదరాబాద్ లోనే ఉన్నా లోకేష్ పట్టించుకోలేదు ►లోకేష్ ఇక్కడ పెత్తనం ఎందుకు చేస్తున్నారు ►తెలంగాలో పోటీ చేయవద్దని లోకేష్ ఎలా చెబుతారు ? ►ఆంధ్రాలో టీడీపీకి బీజేపీ కావాలట.. తెలంగాణలో వద్దట.. ఇదేం పద్ధతి.. ►పార్టీలో చేరినప్పుడు రామ్మోహన్‌రావుకు రూ.11 లక్షలు ఇచ్చా.. ►కాంగ్రెస్‌కు ఓటేయాలని పార్టీలోని కమ్మ వాళ్లు ప్రచారం చేస్తున్నారు 06:43 AM, అక్టోబర్ 31, 2023 మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు ►స్కిల్ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►మధ్యంతర బెయిల్ పిటిషన్‌కు అనుబంధ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►చంద్రబాబు కంటి శస్త్రచికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ ►పిటిషన్‌పై సోమవారం కొనసాగిన విచారణ.. ఇరువైపులా వాదనలు వినిపించిన లాయర్లు ►రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబుపై తప్పుడు కేసు అని బాబు తరపు లాయర్ల వాదన ►52 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు.. సీఐడీ దర్యాప్తును సాగదీస్తోంది: బాబు లాయర్లు ►అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలి: బాబు లాయర్లు ►న్యాయస్థానం ఇచ్చిన గత ఆదేశాల మేరకు చంద్రబాబు వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాం: సీఐడీ తరపు లాయర్లు ►పిటిషనర్‌కు జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం:సీఐడీ తరపు లాయర్లు ►కంటికి శస్త్రచికిత్స తక్షణం అక్కర్లేదు: సీఐడీ తరపు లాయర్లు ►చంద్రబాబుకున్న సాధారణ అనారోగ్య సమస్యలను పెద్దవి చేసి చూపుతున్నారు: సీఐడీ తరపు లాయర్లు ►వైద్య నివేదిక ప్రకారం బరువు విషయంలో పెద్ద తేడా లేదు: సీఐడీ తరపు లాయర్లు ►మధ్యంతర బెయిలు ఇవ్వొద్దు: సీఐడీ తరపు లాయర్లు ►పిటిషన్‌పై సోమవారం ముగిసిన వాదనలు ►తీర్పు రిజర్వ్.. నేడు వెల్లడించనున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 06:24 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుపై సీఐడీ మరో కేసు ►వెలుగులోకి నారావారి లిక్కర్ స్కామ్ ►చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ ► గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన సీఐడీ ► అవినీతి నిరోధక చట్టం కింద ( ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చంద్రబాబుపై కేసు ► మద్యం కంపెనీలకు అక్రమ అనుమతుల కేసులో A-3 గా చంద్రబాబు ► చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానానికి తెలిపిన సీఐడీ అధికారులు ► ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు ► పిటిషన్ ను అనుమతించిన ఏసీబీ కోర్టు ► కేసుకు FIR నంబర్ - 18/2023 కేటాయింపు 06:15 AM, అక్టోబర్ 31, 2023 జైల్లో చంద్రబాబు @52వ రోజు ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ►సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.371 కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని అభియోగం ►ఆధారాలతో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ►అరెస్ట్ సమయం నుంచి మొదలైన డ్రామా ►రిమాండ్ విధించిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ఏసీబీ కోర్టు) ►ఇప్పటిదాకా ఐదుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► రేపటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ ►రాజమండ్రి సెంట్రల్ జైలు 52వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది.. ఇంటి భోజనం.. టవర్ ఏసీ సదుపాయం ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు ఇదీ చదవండి: ఫైబర్ నెట్ కుంభకోణం సూత్రధారి బాబే -
మధ్యంతర బెయిల్ కుదరదు
సాక్షి, అమరావతి: స్కిల్ స్కాంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు రాష్ట్ర హైకోర్టు మరోసారి ఝలక్ ఇచ్చింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కుదరదని తేల్చిచెప్పింది. అలాగే, ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని.. ఈ వ్యాజ్యం తేలేలోపు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ప్రధాన పిటిషన్, అనుబంధ పిటిషన్ల తదుపరి విచారణను వాయిదా వేసింది. మరోవైపు.. ఈ విషయంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యాలను దసరా సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు ఏర్పాటయ్యే వెకేషన్ కోర్టు ముందుంచుతూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు చేసిన అభ్యర్థన మేరకు హైకోర్టు ఈ మేర ఉత్తర్వులిచ్చింది. నిజానికి.. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మరో న్యాయమూర్తి ముందు మధ్యంతర బెయిల్ కోసం వాదనలు వినిపించేందుకు వీలుగా చంద్రబాబు న్యాయవాదులు వెకేషన్ కోర్టు ముందుంచాలన్న అభ్యర్థనను తెరపైకి తెచ్చారు. ఇదే సమయంలో.. చంద్రబాబు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వారు కోర్టు దృష్టికి తీసుకురావడంతో, చట్ట ప్రకారం ఆయనకు జైలులో తగిన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. అంతేకాక.. తదుపరి విచారణ సమయంలో చంద్రబాబు వైద్య నివేదికలను కోర్టు ముందుంచాలని కూడా జైలు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ఈ బెయిల్ పిటిషన్లు ఎప్పుడు విచారణకు వస్తాయి.. ఏ న్యాయమూర్తి ముందు విచారణకు వస్తాయన్న విషయాలు రెండు మూడ్రోజుల్లో తెలిసే అవకాశముంది. చంద్రబాబుకు చర్మ సమస్యలున్నాయి.. ఈ సందర్భంగా చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు ఆరోగ్యస్థితికి సంబంధించిన వైద్య నివేదికలను మెమో రూపంలో కోర్టు ముందుంచామని చెప్పారు. చంద్రబాబుకు కొన్ని వైద్య పరీక్షలు అవసరమని వైద్యులు ఆ నివేదికల్లో పేర్కొన్నారని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. సుప్రీంకోర్టు 17ఏపై తీర్పును రిజర్వ్ చేసింది కదా, ఆ తీర్పు ప్రభావం ఈ పిటిషన్లపై ఉంటుంది కదా? అని ప్రశ్నించారు. కొంతమేర ఉంటుందని, అందుకే తాము ప్రధాన బెయిల్ పిటిషన్లో వాదనలు వినిపించడంలేదని, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంలో వాదనలు వినిపిస్తున్నామని లూథ్రా, దమ్మాలపాటి చెప్పారు. మధ్యంతర బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచిచూడటం మంచిదన్నారు. ఆ తీర్పు ప్రభావం ఈ వ్యాజ్యాలపై ఉన్నప్పుడు, ఆ తీర్పు కోసం వేచిచూడటంలో తప్పులేదన్నారు. మధ్యంతర బెయిల్‌ను ‘సుప్రీం’ తోసిపుచ్చింది.. అనంతరం.. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న చంద్రబాబు అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించిందన్నారు. అందువల్ల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదన్నారు. అసలు చట్టంలో ఎక్కడా కూడా మధ్యంతర బెయిల్ ప్రస్తావనే లేదని తెలిపారు. ఈ సమయంలో లూథ్రా జోక్యం చేసుకుంటూ.. అదనపు ఏజీ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బెయిల్ పిటిషన్ 19న హైకోర్టులో ఉందని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పడంతో తమ మధ్యంతర బెయిల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం సాధ్యంకాదని తేల్చిచెప్పారు. వైద్య పరీక్షల విషయంలో ఏం చేయాలగమో అది చేస్తామన్నారు. వ్యక్తిగత వైద్యునితో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అనుమతిచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. దీనిపై పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. తామే వైద్య పరీక్షలు చేయించి తామే తిరిగి జైలుకు తీసుకొస్తామన్నారు. వ్యక్తిగత వైద్యునితో వైద్య పరీక్షలకు మీకేం అభ్యంతరమని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై తాను అధికారులతో మాట్లాడి చెప్పాల్సి ఉంటుందని, అందువల్ల విచారణను కొద్దిసేపు వాయిదా వేయాలని కోర్టును కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను మ. 2.15 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం తరువాత మారిన స్వరం.. తిరిగి మధ్యాహ్నం విచారణ మొదలు కాగా, చంద్రబాబు న్యాయవాదులు వ్యూహాన్ని మార్చారు. మధ్యంతర బెయిల్ సాధ్యంకాదని హైకోర్టు తేల్చిచెప్పడంతో కొత్త అభ్యర్థనను తెరపైకి తెచ్చారు. మరో న్యాయమూర్తి ముందు మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకునేందుకు వీలుగా, తమ బెయిల్, మధ్యంతర బెయిల్ వ్యాజ్యాలను దసరా సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు ఏర్పాటయ్యే వెకేషన్ కోర్టు ముందుంచాలని న్యాయమూర్తిని అభ్యరి్థంచారు. దీంతో న్యాయమూర్తి వారి అభ్యర్థనపట్ల సానుకూలంగా స్పందించి ఆ మేర ఉత్తర్వులు జారీచేశారు. -
స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్‌కు నిరాకరణ
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తూ.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే వాదనలు ముగిసే సమయంలో ఆయన తరపు లాయర్లు మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థించగా.. కోర్టు అందుకు నిరాకరించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట మంగళవారం వాడీవేడిగా వాదనలు సాగాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ప్రత్యేక కోర్టుల విచారణ అధికారం గురించి రోహత్గీ ప్రస్తావించారు. అయితే వాదనలు ముగియడంతో శుక్రవారానికి పిటిషన్‌ను వాయిదా వేసింది ధర్మాసనం. శుక్రవారం ఇరుపక్షాల లాయర్లు లిఖిత పూర్వక వాదనలు అందజేయనున్నారు. అయితే ఈ నెల 23 నుంచి 28 దాకా కోర్టుకి దసరా సెలవులు ఉన్నాయి. దీంతో.. దసరా తర్వాతే చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు వెల్లడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోహత్గీ సుదీర్ఘ వాదనలు ‘‘ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తించదు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు. 17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సెక్షన్ అవినీతిపరులకు రక్షణ ఛత్రం కాకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే’’ అని రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుంది. అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. అవినీతి నిరోధం కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి.. అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. న్యాయపరిధికి సంబంధించి వివాదం లేదు.. ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉంది. రూ.వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 422 సీఆర్పీసీ కింద క్వాష్ చేయలేం. ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చు’’ అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయపరిధి ఉంటుందన్నారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు ఉన్నాయన్నారు. జీఎస్టీ, ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని తెలిపారు. ‘‘నేరం జరిగిందా లేదా? ఎఫ్ఐఆర్ నమోదైందా? లేదా? అంతవరకే పరిమితం కావాలి. అవినీతి నిరోధక, సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు. ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ను ఎలా క్వాష్ చేస్తారు.మీరు అవినీతి ఆరోపణలు వర్తించవంటున్నారు.. మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయి’’ అని రోహత్గీ వాదించారు. ‘‘మీరు కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చింది.. చట్టం అమల్లోకి వచ్చాక కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉటుంది?’’ జస్టిస్ బోస్ ప్రశ్నించారు. ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు.. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని రోహత్గీ కోరారు. వర్చువల్‌గా హరీష్ సాల్వే వాదనలు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపించారు. చట్టసవరణను ముందు నుంచి వర్తింపజేసే అంశంపై పలు తీర్పులను ఉటంకిస్తూ వాదనలు వినిపించారు. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది. రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17ఏ ఉంది. సెక్షన్ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుంది. ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదు. రిమాండ్ రిపోర్టు, కౌంటరు అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయి. విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17ఏ వర్తిస్తుంది అని వాదించారు. మధ్యంతర బెయిల్‌కు నిరాకరణ 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారు. కోర్టు సెలవుల దృష్ట్యా దయ చేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తాం అని సాల్వే కోరారు. ఈ క్రమంలో మరో లాయర్ సిద్ధార్థ లూథ్రా సైతం న్యాయమూర్తులకు అదే విజ్ఞప్తి చేశారు. అయితే మధ్యంతర బెయిల్ ప్రస్తావన లేదన్న జస్టిస్ అనిరుద్ధ బోస్.. ప్రధాన కేసులో వాదనలు విన్నామని, తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేశారు. -
ఏసీబీ కోర్టులో బాబు తరపున రెండు పిటిషన్లు దాఖలు
-
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ బెయిల్ పొడిగింపు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మెడికల్ బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. జైన్ మధ్యంతర బెయిల్‌ను సెప్టెంబర్ 25 వరకు పొడిగించింది. ఈ మేరకు ఏఎస్ బోపన్న, బేల ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం వెల్లడించింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సత్యేందర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు నేడు విచారించింది. ఈడీ తరుపున అడిషనల్ సొలిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ జైన్ కేసును వాయిదా వేయాలని, బెయిల్ పొడిగించాలని కోరారు. దీనికి అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్‌ను పొడిగిస్తూ విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది. జైన్‌కు వెన్నుముక సర్జరీ తర్వాత ఆయన మెడికల్ బెయిల్‌ను పొడిగించడం ఇది మూడోసారి. తొలిసారి మే 26న సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత నెల ఆగస్టులో రెండోసారి పొడిగించింది. అయితే మీడియాతో మాట్లాడకూడదు, అనుమతి లేకుండా ఢిల్లీ వదిలి వెళ్లరాదని పలు ఆంక్షలు విధించింది. కాగా ఆమ్ ఆద్మీ నేత, మాజీ మాంత్రి మనీలాండరింగ్ కేసులో మే నెలలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2015 ఫిబ్రవరి 14నుంచి వివిధ వ్యక్తుల పేరిట అక్రమ ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై నమోదైన సీబీఐ ఫిర్యాదుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును విచారిస్తోంది. చదవండి: ఎట్టకేలకు భారత్ వీడిన కెనడా ప్రధాని.. రెండు రోజులు ఆలస్యంగా -
లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియాకు చుక్కెదురు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. తన భార్య అనారోగ్యం కారణంగా ఆరు వారాలు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ సిసోడియాకు చుక్కెదురైంది. తన భార్యను చూసుకునేందుకు తానొక్కడినే ఉన్నానని, అందువలన మధ్యంతర ప్రాతిపదికన బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ కోసం ఆశగా ఎదురుచూసిన ఆయనకు మరోసారి నిరాశే మిగిలింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన సిసోడియా.. మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, భార్యను చూసేందుకు సిసోడియాకు అనుమతించింది. ఏదైనా ఒకరోజు తన నివాసం వద్ద కానీ, ఆసుపత్రిలోనైనా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో భార్యను కలిసేందుకు ఆమోదం తెలిపింది. భార్యను కలిసేందుకు సిసోడియాకు కోర్టు శనివారం అనుమతిచ్చినప్పటికీ, సిసోడియా నివాసానికి వెళ్లేసరికి అప్పటికే ఆయన భార్య ఆసుపత్రిలో చేరారు. దాంతో సిసోడియా తన భార్యను కలవలేకపోయారు. ఈ నేపథ్యంలో, భార్య కలిసేందుకు సిసోడియాకు కోర్టు మరో అవకాశం ఇచ్చింది. మనీష్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, ఇటీవల సిసోడియా భార్య అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్యను చూడడానికి గత శుక్రవారం జైలు నుంచి బయటకు రావడానికి హైకోర్టు అనుమతించింది. అయితే.. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా మార్చి 9న అరెస్టు అయ్యారు. ఇదీ చదవండి:బ్రిజ్‌భూషణ్ అరెస్ట్‌కు రెజ్లర్ల డిమాండ్.. లభించని అమిత్ షా హామీ -
పవన్ ఖేరాకు సుప్రీం కోర్టులో ఊరట
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హుటాహుటిన సుప్రీం కోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పొరపాటున ఆయన నోరు జారారని, అందుకు ఆయన క్షమాపణ కూడా చెప్పాడని కోర్టుకు వివరించారు పవన్ తరపు న్యాయవాది. దీంతో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ స్థానిక కోర్టును ఆదేశిస్తూ ఊరట ఇచ్చింది సుప్రీం. పవన్ ఖేరా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పేర్ల(దామోదరదాస్, గౌతమదాస్ అనేదానిపై) విషయంలో ఆయనకు స్పష్టత లేదు. ఆయన పొరపాటున నోరు జారారని, తప్పు ఒప్పుకున్నారని, అందుకు క్షమాపణలు కూడా చెప్పారని సుప్రీంకు వివరించారు. మరోవైపు అసోం పోలీసుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.. పవన్ ఖేరా అరెస్ట్‌ను ధృవీకరిస్తూ, ట్రాన్సిస్ట్ రిమాండ్ కింద కోర్టులో ప్రవేశపెడతామని సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే.. పవన్ ఖేరాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, అందుకే కేసులు కొట్టేయమని కోరడం లేదని, కేవలం మధ్యంతర బెయిల్ ద్వారా ఉపశమనం మాత్రం ఇవ్వమని కోర్టును అభ్యర్థించారు పవన్ ఖేరా తరపున న్యాయవాది. దీంతో పిటిషనర్ తరపు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ద్వారకా కోర్టును ఆదేశించారు. ‘పిటిషనర్ (పవన్ ఖేరా) బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ తరుణంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి’ అని సీజేఐ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే.. పవన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్లను కలపాలని కోరుతూ పవన్ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. దీనికి స్పందించాలంటూ అసోం, యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగేంతర వరకు ఆయన మధ్యంతర బెయిల్ బయట స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది సుప్రీం కోర్టు. ఇదీ చదవండి: ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఆ కామెంట్లు.. -
లఖీంపూర్ ఖేరీ కేసులో మిశ్రాకు బెయిల్
న్యూఢిల్లీ: రైతులతో పాటు మొత్తం 8 మందిని బలిగొన్న లఖీంపూర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బుధవారం 8 వారాల మధ్యంతర బెయిలిచ్చింది. ‘‘పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు సమర్పించాలి. బెయిల్ సమయంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో ఉండొద్దు. ఎక్కడ ఉండేదీ ట్రయల్ కోర్టుకు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలపాలి. అక్కడ వారానికోసారి వ్యక్తిగతంగా హాజరై అటెండెన్స్ నమోదు చేయాలి’’ అని ఆదేశించింది. సాక్షులు తదితరులను ప్రభావితం చేయకుండా ఉండేందుకే ఈ షరతు విధిస్తున్నట్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జె.కె.మహేశ్వరి ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌ను, అతని కుటుంబాన్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. మరో నలుగురు నిందితులకూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. -
సుశీల్‌కు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్ దాదాపు ఏడాదిన్నర తర్వాత జైలునుంచి బయటకు రానున్నాడు. కుటుంబపరమైన సమస్యను ఎదుర్కొంటున్న కారణంగా మానవతా దృక్పథంతో ఈ నెల 12 వరకు అతనికి ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. సుశీల్ భార్య తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుండటంతో శస్త్రచికిత్సకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె బాగోగులు చూసుకునేందుకు 3 వారాల బెయిల్ ఇవ్వాల్సిందిగా సుశీల్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అయితే చివరకు కోర్టు వారం రోజుల బెయిల్ కోసం ఆదేశాలు ఇచ్చింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ 2021 జూన్ 2నుంచి జైల్లో ఉన్నాడు. -
రూ.49లక్షలతో పట్టుబడిన ఆ ఎమ్మెల్యేలకు మధ్యంతర బెయిల్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో రూ.49 లక్షల నగదుతో పట్టుబడిన ముగ్గురు జార్ఖండ్ ఎమ్మెల్యేలకు కలకత్తా హైకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చాప్, నామన్ బిక్సల్ కొంగరీ జూలై 30న అరెస్టయిన సంగతి తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేయగా, రూ.49 లక్షల నగదు లభ్యమయ్యింది. ఈ వ్యవహారంపై బెంగాల్ సీఐడీ బృందం దర్యాప్తు చేస్తోంది. నిందితులకు మూడు నెలలపాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. కోల్‌కతా మున్సిపల్ ఏరియాను దాటి వెళ్లొద్దని ఆదేశించింది. పాస్‌పోర్టులను అధికారులకు అప్పగించాలని, ప్రతీవారం విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇదీ చదవండి: మూడొంతుల మందిపై క్రిమినల్ కేసులు! -
Azam Khan: రెండేళ్ల తర్వాత జైలు నుంచి ఆజాం ఖాన్ విడుదల
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ ఎమ్మెల్యే ఆజాం ఖాన్(73) ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. వివిధ కేసుల నేపథ్యంలో ఆయన 27 నెలలపాటు జైలులోనే గడిపారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు విడుదల లభించింది. గురువారం సుప్రీం కోర్టు.. ఆజాం ఖాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ ఉదయం యూపీలోని సీతాపూర్ జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యారు. బయటకు వచ్చిన ఆవెంటనే ఆయన తనయుడు.. ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజాంతో పాటు ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) నేత శివ్‌పాల్ సింగ్ యాదవ్, భారీ ఎత్తున మద్దతుదారులు ఆజాంఖాన్‌కు స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన.. స్వస్థలం రాంపూర్‌కు వెళ్లిపోయారు. గురువారమే ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ.. స్థానిక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆ ఆదేశాలను అందుకోవడం, వాటిని సీతాపూర్ జైలు సూపరిండెంట్‌కు పంపడంతో అర్ధరాత్రి అయ్యింది. ఈ క్రమంలో ఈ ఉదయం ఆయన్ని రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరున్న ఆజాం ఖాన్.. వివాదాస్పద వ్యాఖ్యలు, వైఖరితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు కూడా. భూ కబ్జాతో పాటు చాలా కేసులు ఆయనపై నమోదు అయ్యాయి. ఒకానొక తరుణంలో ఆయన జైలు శిక్షపై న్యాయస్థానాల్లోనూ ఆసక్తికరమైన చర్చ కూడా నడిచింది. మరోవైపు రాజకీయ వైరంతోనే జైలుకు పంపారంటూ ఆజాం ఖాన్ అనుచరులు ఆరోపిస్తున్నారు. మొన్న యూపీ ఎన్నికల్లో జైలు నుంచే ఆయన ఘన విజయం సాధించడం విశేషం. చదవండి: రాబోయే 25 ఏళ్లు బీజేపీవే.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు! -
అజంఖాన్‌కు మధ్యంతర బెయిల్ తిరస్కృతి
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ నాయకుడు ఆజంఖాన్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వీలుగా తనకు మధ్యంతర బెయిలు ఇప్పించాలని ఆజంఖాన్ పలు పిటిషన్లను దాఖలు చేయడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా 32 బెయిల్ పిటిషన్లు వేస్తారా? రాజకీయాలకు కోర్టును తేవొద్దని కటువుగా వ్యాఖ్యానించింది. అయితే బెయిల్‌ను కోరుతూ సంబంధింత కోర్టులో పిటిషన్ వేసుకునే స్వేచ్ఛను ధర్మాసనం ఆజంఖాన్‌కు ఇచ్చింది. వేధింపుల్లో భాగంగా యోగి సర్కారు తనపై ఏకంగా 87 కేసులను బనాయించిందని... వీటిలో 84 కేసుల్లో బెయిల్ మంజూరైందని ఆజంఖాన్ తన న్యాయవాది కపిల్ సిబల్ ద్వారా కోర్టు దృస్టికి తెచ్చారు. -
ట్రైనీ ఐఏఎస్‌పై లైంగిక వేధింపుల కేసు.. నపుంసకత్వ పరీక్షకు వెళ్లాలి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐఏఎస్ బి.మృగేందర్‌లాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 27 నుంచి జనవరి 16 వరకు ఐఏఎస్ శిక్షణకు వెళ్లాల్సి ఉన్నందున హైకోర్టు 15 రోజుల తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై చీటింగ్ కేసు మృగేందర్‌లాల్ దర్యాప్తునకు సహకరించాలని, నపుంసకత్వ పరీక్షకు వెళ్లాలని, లేకపోతే ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దర్యాప్తు అధికారి పిటిషన్ దాఖలు చేయొచ్చని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విచారణను డిసెంబర్ 9కి హైకోర్టు వాయిదా వేసింది. మృగేందర్‌లాల్ 2019 డిసెంబర్ 25న తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: బీఈడీకే దిక్కులేదు.. డీఎడ్ ఎందుకు? -
13 మందికి సుప్రీం బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: బాల నేరస్తులుగా శిక్షా కాలం ముగిసినా సాధారణ జైళ్లలో ఉన్న 13 మందికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఖైదీల వయసు దరఖాస్తులను పరిష్కరించాలని అలహాబాద్ కోర్టులో న్యాయవాది రిషి మల్హోత్రా 2012లో పిటిషన్ దాఖలు చేశారు. దానికి అనుగుణంగా 13 మంది పిటిషనర్లు నేరాలకు పాల్పడిన సమయంలో బాలలేనని ప్రకటించారు. బాల నేరస్తులుగా ప్రకటించడానికి జువెనైల్ జస్టిస్ బోర్డు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. 13 మంది కేసులకు సంబంధించిన అప్పీళ్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 18 ఏళ్లలోపు వారికి గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష అని, అదీ జువెనైల్ గృహాల్లో ఉంచాలని జువెనైల్ జస్టిస్ యాక్ట్ , 2000 సెక్షన్ రెడ్‌విత్ సెక్షన్ 26 చెబుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. జువెనైల్ చట్టం ప్రకారం గరిష్టకాలం శిక్షఅనుభవించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్లను గురువారం జస్టిస్ ఇందిరా బెనర్జీ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం విచారించింది. బాల్యం దాటిన వారిని గుర్తించాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, వారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని అలహాబాద్ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ధర్మాసనానికి తెలిపారు. వారికి బెయిల్ మంజూరు చేయడానికి అభ్యంతరం లేదని, వెరిఫికేషన్ చేయాలని కోరుకుంటున్నామని ధర్మాసనాన్ని కోరారు. -
స్నేహితులకు ‘దృశ్యం’ చూపించాడు.. మరోసారి జైలు పాలయ్యాడు
ఢిల్లీ: వెంకటేశ్ హీరోగా దృశ్యం సినిమా వచ్చిన మీకందరికి తెలిసిందే. అందులో హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం సినిమాల్లోని సన్నివేశాలను ప్రేరణగా తీసుకొని పోలీసులను ముప్పతిప్పలు పెడుతుంటాడు. అచ్చం అదే తరహాలో హత్యకేసులో బెయిల్‌పై బయటకొచ్చిన ఒక వ్యక్తి తన స్నేహితుల సాయంతో దృశ్యం సినిమా ప్రేరణతో పోలీసులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. నార్త్ ఢిల్లీకి చెందిన అమర్‌పాల్ తన ఇంటిపక్కన ఉండే ఒంబిర్ కుటుంబంతో తరచుగా గొడవపడుతుండేవాడు. కాగా జూన్ 29న మరోసారి ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒంబిర్ తల్లిని అమర్‌పాల్ చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అమర్‌పాల్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఆ తర్వాత 60 రోజుల మధ్యంతర బెయిల్‌పై ఇటీవలే బయటికి వచ్చాడు. పెరోల్‌పై బయటికి వచ్చిన అతను తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఒంబిర్ కుటుంబంపై ఒత్తిడి తెచ్చాడు. కానీ వారు మాట వినకపోవడంతో ఒక మాస్టర్‌ప్లాన్ వేశాడు. తన సోదరుడు గుడ్డు, కజిన్ అనిల్‌ను ఇంటికి పిలిపించి వారికి దృశ్యం సినిమాను చూపించాడు. ఆ సినిమాలోలాగా ఇక్కడ జరిగిన సన్నివేశాలను, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే తనకు ఒంబిర్ కుటుంబసభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. అయినా ఒంబిర్ తల్లిని తాను చంపలేదని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఒక దేశీ పిస్టల్, బుల్లెట్ ప్యాలెట్‌ను కొనుగోలు చేశాడు. తనను కాల్చాలని.. కానీ తను చనిపోకూడదని.. ఈ కాల్పుల వెనుక ఒంబిర్ కుటుంబం హస్తం ఉందని పోలీసులను నమ్మించాలని అనిల్, గుడ్డులకు తెలిపాడు. ఆ తర్వాత అనిల్ తన స్నేహితుడు మనీష్‌ను కలిసి ప్లాన్‌ను వివవరించాడు. వారి ప్లాన్ ప్రకారం ముందుగా కైబర్పాస్కు వెళ్లిన అమర్‌పాల్ అనిల్ కోసం వేచి చూశాడు. ఒక గంట తర్వాత తమ ప్లాన్‌లో భాగంగా అమర్‌పాల్ ఉన్న చోటికి వచ్చిన అనిల్ అతనిపై కాల్పులు జరిపి అక్కడినుంచి పారిపోయాడు. ఆ తర్వాత గాయాలతోనే అమర్‌పాల్ తన స్నేహితుని ఇంటికి వెళ్లి ఒంబిర్ కుటుంబం తనను చంపడానికి చూస్తుందని వారికి వివరించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. అనిల్‌ను అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పేశాడు. దీంతో అమర్‌పాల్‌ను మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా పరారీలో ఉన్న గుడ్డు, మనీష్‌లను పోలీసులు గాలిస్తున్నారు. -
ఖైదీలకు మధ్యంతర బెయిలివ్వండి
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని జైళ్లలో పరిస్థితులు, ఖైదీల విడుదల తదితర అంశాలపై ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల చేసిన తీర్మానాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి పరిగణనలోకి తీసుకున్నారు. ఈ తీర్మానాల మేరకు ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేసేందుకు వీలుగా న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనం రెండు రోజుల క్రితం ఈ మొత్తం వ్యవహారంపై సుమోటో రిట్ పిటిషన్‌గా విచారణ జరిపింది. అనంతరం పలు ఆదేశాలిచ్చింది. ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్షపడే కేసుల్లో నిందితులను అరెస్ట్‌చేసే సమయంలో పోలీసులు అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించేలా స్టేషన్ హౌస్ ఆఫీసర్లందరికీ తగిన ఆదేశాలిచ్చేలా రాష్ట్ర డీజీపీకి సూచనలు ఇవ్వాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల్లోని ముఖ్యాంశాలు.. ► గతేడాది మధ్యంతర బెయిల్‌పై విడుదలై తిరిగి జైలుకు చేరిన ఖైదీలు, అండర్ ట్రయిల్ ఖైదీలకు, ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో జైల్లో ఉన్న ఖైదీలకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి. ► రెండోసారి నేరం చేసి శిక్ష పడిన ఖైదీలు, అత్యాచార, పోక్సో కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను విడుదల చేయకూడదు. ► అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేస్తే తిరిగి వారిని జైలుకు తేవడం కష్టమవుతోంది కాబట్టి వారికి బెయిల్ ఇవ్వవద్దన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కె.శ్రీనివాసరెడ్డి అభ్యర్థన మేరకు దోపిడీ, దోపిడీతో పాటు హత్య చేసిన ఖైదీలకు మధ్యంతర బెయిల్ ఇవ్వవద్దని ధర్మాసనం ఆదేశించింది. ► మేజిస్ట్రేట్ల సంతృప్తి మేరకు బెయిల్ బాండ్లు ఉండాలని హైకోర్టు ఆదేశించింది. 90 రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయాలంది. ► మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యాక 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండేలా ఖైదీల నుంచి హామీ తీసుకోవాలని ఆదేశించింది. ► తామిచ్చిన ఈ ఆదేశాలు ఎనిమిది వారాల పాటు అమల్లో ఉంటాయని, ఈ ఆదేశాల అమలుకు అధికారులతో పాటు జిల్లా ప్రిన్సిపల్ జడ్జిలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ► తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. n కాగా, రాష్ట్రంలోని మొత్తం 79 జైళ్ల సామర్థ్యం 8,732 కాగా, ప్రస్తుతం 6,905 మంది ఖైదీలున్నారని జైళ్ల శాఖ డీజీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. -
ఖైదీలకు తాత్కాలిక బెయిల్!
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని జైళ్లలో పరిస్థితులు, మధ్యంతర బెయిల్‌పై ఖైదీల విడుదల తదితర అంశాలపై చర్చించేందుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ (లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్), జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి (హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్), హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, జైళ్ల శాఖ డీజీ మహ్మద్ అసన్ రెజాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల సమావేశమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమావేశమైన ఈ కమిటీ పలు తీర్మానాలు చేసింది. ప్రాథమికంగా 90 రోజుల పాటు.. ఏడేళ్లు అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసే సమయంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించేలా డీజీపీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి సూచనలు ఇవ్వాలి. జిల్లా జడ్జీలంతా ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని మేజిస్ట్రేట్, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లకు సూచనలు చేయాలి. గత ఏడాది కమిటీ తీర్మానాల మేరకు మధ్యంతర బెయిల్‌పై విడుదలై తిరిగి జైలుకు చేరిన ఖైదీలు, అండర్ ట్రయల్ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలి. ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో జైల్లో ఉన్న అర్హులైన ఖైదీలను, అండర్ ట్రయిల్ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలి. విడుదలైన తరువాత 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంటామని వారు హామీ ఇవ్వాలి. దీన్ని ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేసి కస్టడీలోకి తీసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో సొంత ప్రాంతాలకు చేరుకునేలా హోంశాఖ, జైళ్ల శాఖ తగిన రవాణా సదుపాయం కల్పించాలి. ప్రాథమికంగా మధ్యంతర బెయిల్ 90 రోజులకు మంజూరు చేయాలి. బెయిల్ బాండ్ల మొత్తం సమంజసంగా ఉండాలి. వెబ్సైట్లో వివరాలుంచాలి.. దీనికి సంబంధించి హైకోర్టులో ఓ బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రార్ జనరల్ తీర్మానాల కాపీని ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలి. ఈ మొత్తం వ్యవహారంపై సుమోటో పిటిషన్‌ను సిద్ధం చేయాలి. రాష్ట్రంలో జైళ్ల సామర్థ్యం, ఎంత మంది ఖైదీలున్నారన్న విషయాలను జైళ్ల శాఖ వెబ్సైట్లో పొందుపరచాలి. ఈ వివరాలను ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీతో పంచుకోవాలి. ఉన్నత స్థాయి కమిటీ గత ఏడాది చేసిన అన్ని తీర్మానాలను లీగల్ సర్వీసెస్ అథారిటీ, హోంశాఖ, హైకోర్టు వెబ్సైట్లలో పొందుపరచాలి. జైళ్లలో వేగంగా వ్యాక్సినేషన్ ఖైదీలు, సిబ్బంది విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, వైద్య సాయం, రోజూ శానిటేషన్ తదితర వివరాలను ఉన్నత స్థాయి కమిటీకి జైళ్ల శాఖ వివరించింది. ఇప్పటి వరకు 643 మంది ఖైదీలు, సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు జైళ్ల శాఖ డీజీ వివరించారు. మిగిలిన 6 వేల మంది ఖైదీలు, సిబ్బందికి వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 27న మరోసారి సమావేశం కావాలని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. -
అర్నాబ్‌కు బెయిల్
న్యూఢిల్లీ: వివాదాస్పద టెలివిజన్ వ్యాఖ్యాత అర్నాబ్ గోస్వామికి ఎట్టకేలకు బెయిల్ దక్కింది. 2018 నాటి ఓ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం, బెయిల్ దరఖాస్తును బాంబే హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అర్నాబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన బెంచ్ బుధవారం ఈ అంశంపై విచారణ జరిపి అర్నాబ్‌తోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నితీశ్ సర్దా, ప్రవీణ్ రాజేశ్ సింగ్‌లకు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఇంటెరిమ్ బెయిల్ మంజూరు చేసింది. తనపై మోసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, కేసు విచారణను నిలిపివేయాలన్న అర్నాబ్ వినతులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అర్నాబ్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ‘‘బెయిళ్లు ఇవ్వకుండా..వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు’’ అని వ్యాఖ్యానించింది. -
అర్నబ్‌కు దొరకని బెయిల్
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను గురువారం బాంబే హైకోర్టు తిరస్కరించింది. అరెస్టు అక్రమమనీ, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలనీ, ముంబై పోలీసుల దర్యాప్తుపై స్టే విధించాలని బెయిల్ పిటిషన్లో అర్నబ్ కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధింపునకు పాల్పడుతోందని అర్నబ్ తరఫు లాయర్ హరీశ్ సాల్వే ఆరోపించారు. వాదనలు విన్న బాంబే హైకోర్టు.. వాదనలు వినిపించాలని ప్రతివాదులుగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం, అన్వయ్ నాయక్ భార్య అక్షతను కోరింది. శుక్రవారం వాదనలు వింటామని తెలిపింది. అర్నబ్ అరెస్టు చట్ట విరుద్ధం అర్నబ్‌ను అరెస్టు చేయడం ప్రాథమికంగా చట్ట విరుద్ధమని మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదిని ఆత్మహత్యకు అర్నబ్ కారణమంటూ వచ్చిన 2018 నాటి ఆరోపణలపై బుధవారం ముంబై పోలీసులు అర్నబ్‌ను అరెస్టుచేశారు. అర్నబ్‌తోపాటు అరెస్టు చేసిన ఫిరోజ్ షేక్, నితేశ్ సర్దాలను పోలీసులు రాయగఢ్ జిల్లా అలీబాగ్ కోర్టులో బుధవారం రాత్రి హాజరు పరిచారు. ఈ కేసులో అర్నబ్‌ను 18వరకు అలీబాగ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ సునయన.. మృతులకు, నిందితులకు మధ్య ఉన్న సంబంధాన్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్నారు. అర్నబ్‌ను పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు రుజువులు లేవన్నారు. తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు అలీబాగ్ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం అర్నబ్‌ను అలీబాగ్ నగర్ పరిషత్ స్కూల్లో కోవిడ్ సెంటర్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు. -
నళినీ చిదంబరానికి ఊరట
కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం భార్య నళినీ చిదంబరానికి కలకత్తా హైకోర్టు సోమవారం మధ్యంతర ఊరట కల్పించింది. ఈ కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేయరాదని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకూ నళినీ చిదంబరంను అరెస్ట్ చేయకుండా దర్యాప్తు ఏజెన్సీను నిరోధించింది. దర్యాప్తునకు సహకరించాలని నళినీ చిదంబరంను ఆదేశించిన కోర్టు ముందస్తు బెయిల్ దరఖాస్తును పెండింగ్‌లో ఉంచుతూ జస్టిస్ జోమాల్య బాగ్చి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోగా తమ వాదనలకు మద్దతుగా నళినీ చిదంబరం, సీబీఐ అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది. ఇన్వెస్టర్ల నుంచి శారదా చిట్ ఫండ్ సంస్థ అక్రమంగా సేకరించిన సొమ్ము నుంచి సీనియర్ న్యాయవాది నళినీ చిదంబరానికి రూ 1.3 కోట్లు చెల్లించారని సీబీఐ ఆరోపిస్తోంది. అయితే మనోరంజన సింగ్‌కు న్యాయసలహాదారుగా ఆమెకు ఆ మొత్తం చెల్లించారని నళినీ చిదంబరం న్యాయవాది ఘోష్ న్యాయస్ధానానికి నివేదించారు. -
ఈడీ ఎదుట హాజరైన వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బావ, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం భార్య ప్రియాంక గాంధీతో కలిసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. మనీల్యాండరింగ్ కేసులో ఈనెల ఆరున ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని గతవారం ముందస్తు బెయిల్‌కు వాద్రా దరఖాస్తు చేసుకున్న క్రమంలో ఢిల్లీ కోర్టు ఆయనను ఆదేశించింది. లండన్‌లో పలు స్ధిరాస్ధుల కొనుగోలు, స్వాధీనానికి సంబంధించి మనీల్యాండరింగ్ కేసులో వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, ఢిల్లీ కోర్టు వాద్రాకు ఈనెల 16 వరకూ మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా లండన్‌లో స్ధిరాస్తుల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు, ఆస్తుల వివరాలపై వాద్రాను ప్రశ్నించనున్న ఈడీ మనీల్యాండరింగ్ చట్టం కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది. మరోవైపు వాద్రాను ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలతో విరుచుకుపడింది. యూపీఏ హయంలో రాబర్ట్ వాద్రా భారీగా లబ్దిపొందారని, ఈ మొత్తంతో వాద్రా విదేశాల్లో కోట్లాది రూపాయలతో విలాసవంతమైన ఆస్తులను కొనుగోలు చేశారని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర ఆరోపించారు. -
రాబర్ట్ వాద్రాకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బావ రాబర్ట్ వాద్రాకు ఢిల్లీలోని ఓ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఈ నెల 6వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరై విచారణకు సహకరించాలని సూచించింది. లండన్‌లోని రూ.17.77 కోట్ల విలువ చేసే ఆస్తులను మనీలాండరింగ్ ద్వారానే వాద్రా సమకూర్చున్నారంటూ ఈడీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వాద్రా తన న్యాయవాది ద్వారా మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ‘వాద్రా తన తల్లికి చికిత్స చేయించేందుకు లండన్ వెళ్లారు. 6న ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడీ ఎదుట హాజరవుతారు’ అని వాద్రా తరఫు లాయర్ చెప్పారు. దీంతో కోర్టు వాద్రాకు బెయిలు మంజూరు చేసింది. ఇందుకోసం, రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే సమానమైన జామీను సమర్పించాలని ఆదేశించింది. -
బెయిల్ పై విడుదలైన కన్హయ్య కుమార్
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా జేఎన్యూకు వెళ్లాడు. వర్సిటీకి చేరుకున్న విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యకు తోటి వర్సిటీ విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. కొద్దిసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కన్హయ్యకు ఊరట కల్పిస్తూ జస్టిస్ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఆరు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని కోర్టు నిర్దేశించింది. అవసరమైనపుడు అధికారుల ఎదుట ఆయన హాజరుకావాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. విడుదల కోసం రూ. 10 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. తాను భారత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. ఆరు నెలల బెయిల్ మంజూరు కావడంతో కొన్ని షరతులతో విడుదలయ్యాడు. ఫిబ్రవరి 12న కన్హయ్య అరెస్టయిన విషయం విదితమే. -
కన్హయ్యకు షరతులతో బెయిల్
విచారణకు సహకరించాలని ఢిల్లీ హైకోర్టు నిర్దేశం ♦ విచారణ కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదు ♦ రూ. 10 వేల చొప్పున బాండు, పూచీకత్తు ఇవ్వాలి ♦ విద్యార్థుల సిద్ధాంతాలు ఏవైనా రాజ్యాంగానికి లోబడాలి న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకు ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కన్హయ్యకు ఊరట కల్పిస్తూ జస్టిస్ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఆరు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని నిర్దేశించింది. అవసరమైనపుడు అధికారుల ఎదుట ఆయన హాజరుకావాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. విడుదల కోసం రూ. 10 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. తాను భారత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. మిగతా ఇద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. నా కుమారుడు ఉగ్రవాది కాదు: కన్హయ్య తల్లి ‘‘నా కుమారుడు ఉగ్రవాది కాదు. ఈ విషయాన్ని ప్రపంచమంతా త్వరలో తెలుసుకుంటుంది. అతడిపై నాకు విశ్వాసముంది. తనను ఇరికించిన ప్రత్యర్థులతో అతడు పోరాడుతాడు’’ అని కన్హయ్య తల్లి మీనాదేవి పేర్కొన్నారు. తన కుమారుడికి బెయిల్ మంజూరు కావటం పట్ల ఆమె బీహార్ నుంచి పీటీఐ వార్తా సంస్థతో ఫోన్లో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ప్రతి తల్లికీ ఆమె బిడ్డ గొప్పే. అతడు తప్పు చేస్తే శిక్షించండి.. కానీ అతడిని ఉగ్రవాది అనొద్దు’’ అని చెప్పారు. కన్హయ్యకు బెయిల్ రావటం తమకు శుభవార్త అని.. వర్సిటీలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నామని జేఎన్‌యూ రిజిస్ట్రార్ భూపీందర్ జుట్షి బుధవారం పీటీఐతో పేర్కొన్నారు. జేఎన్‌యూ విద్యార్థుల హర్షాతిరేకాలు... కన్హయ్యకు బెయిల్ మంజూరైందన్న వార్త తెలియగానే.. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ ఎదుట గుమిగూడి ఉన్న జేఎన్‌యూ విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆనందోత్సాహం వెల్లువెత్తింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకటన కోసం అక్కడే వేచిచూశారు. కన్హయ్యకు బెయిల్ గొప్ప ఊరట అని.. ఇంకా జైలులోనే ఉన్న ఉమర్, అన్బిరన్ల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని జేఎన్‌యూఎస్‌యూ ఉపాధ్యక్షురాలు షీలారషీద్ పేర్కొన్నారు. దేశ వ్యతిరేక ర్యాలీపై తీవ్ర ఆగ్రహం పార్లమెంటు దాడి కేసులో దోషిగా నిర్ధారితుడై ఉరిశిక్షకు గురైన అఫ్జల్‌గురు, 1971లో విమానం హైజాక్ చేసిన కేసులో దోషిగా నిర్ధారితుడై ఉరిశిక్షకు గురైన మక్బూల్భట్ల ఫొటోలు, పోస్టర్లు ప్రదర్శిస్తూ విద్యార్థులు నిరసన చేపట్టిన తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆ నినాదాల్లో ప్రతిఫలించిన విద్యార్థుల మనోభావాలపై.. ఆ ఫొటోలు, పోస్టర్లు పట్టుకుని ఫొటోల ద్వారా రికార్డుల్లో నమోదైన విద్యార్థి లోకం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. ‘‘కన్హయ్య జేఎన్‌యూలో పీహెచ్డీ చేస్తున్న మేధో వర్గానికి చెందిన వ్యక్తిగా కోర్టు గుర్తిస్తోంది. అతడు ఎటువంటి రాజకీయ సిద్ధాంతం లేదా అనుబంధాన్నయినా కలిగివుండొచ్చు.. అయితే అది భారత రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలి. భారత పౌరుల వాక్స్వాతంత్య్రం.. రాజ్యాంగంలోని 19(2) అధికరణ కింద సహేతుక నియంత్రణలకు లోబడి ఉంటుంది’’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంచేసింది. -
తీస్తా దంపతులకు ఊరట
న్యూఢిల్లీ: నిధుల దుర్వినియోగం కేసులో గుజరాత్‌కు చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌లకు ఊరట లభించింది. శుక్రవారం బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 10 వరకు వారిని అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది. తీస్తా దంపతులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈ రోజు ముంబై సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీంతో ఆ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. 2002 గుజరాత్ అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలో బాధితుల స్మారకార్ధం మ్యూజియం ఏర్పాటుచేస్తామంటూ సేకరించిన నిధులను సొంతానికి వాడుకున్నారన్న కేసులో సెతల్వాద్ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారుల అనుమతి లేకుండా ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి విదేశీ నిధులను స్వీకరించారని ఆరోపిస్తూ గత వారం సీబీఐ సెతల్వాద్ ఇంటిపై దాడులు చేసింది. ఈ నిధులను ఆమె తన మద్యం కోసం, జుట్టు సింగారానికి వాడుకున్నారని ఆరోపించింది. అయితే సెతల్వాద్ దంపతులను బీజేపీ ప్రభుత్వం కావాలనే వేధిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. -
తాత్కాలిక బెయిల్ పై రేవంత్ విడుదల
-
బెయిల్ నిరాకరణ
ఓటుకు నోటు కేసులో నిందితుల పిటిషన్లను కొట్టేసిన కోర్టు ♦ రేవంత్‌కు మాత్రం 12 గంటల తాత్కాలిక బెయిల్ ♦ కూతురు నిశ్చితార్థంలో పాల్గొనేందుకు అనుమతి ♦ ఎన్నికల ప్రక్రియను రేవంత్ కలుషితం చేశారు ♦ తన పలుకుబడితో కేసును ప్రభావితం చేస్తారు ♦ మిగతా రూ.4.5 కోట్ల ఆచూకీని కనిపెట్టాల్సి ఉంది ♦ బెయిల్ ఇవ్వొద్దని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ విజ్ఞప్తి ♦ స్టీఫెన్సన్ కక్షగట్టి ఇరికించారని నిందితుల వాదన ♦ ఏసీబీ వాదనతో ఏకీభవించిన కోర్టు, పిటిషన్ల తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు బుధవారం తోసిపుచ్చింది. అయి తే కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొనేందుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిశ్చితార్థంలో రేవంత్ పాల్గొనవచ్చునని జడ్జి లక్ష్మీపతి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.50 వేల పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి రెండు పూచీకత్తు బాండ్లను సమర్పించాలని షరతు విధించారు. బెయిల్ మీద బయట ఉన్న సమయంలో మీడియాతోనూ, రాజకీయ నాయకులతోనూ రేవంత్ కలవకూడదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని, దర్యాప్తుకు ఆటంకం కలిగించరాదని ఆదేశిం చారు. విచారణకు సంబంధించిన విషయాల ను బహిర్గతం చేయరాదని స్పష్టం చేశారు. రేవంత్ కదలికలపై నిఘాకు అనుమతించాలన్న ఏసీబీ విజ్ఞప్తిని కోర్టు ఆమోదించింది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రక్రియను అవినీతితో కలుషితం చేశారని, ఇది ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయడమేనని ఏసీబీ ప్రత్యేక లాయర్ వి.సురేందర్‌రావు కోర్టుకు విన్నవించారు. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తానని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్ అన్నారని, తన పలుకుబడితో ఆయన ఎవరినైనా ప్రభావితం చేయగలరని పేర్కొన్నారు. ఓటు కోసం చేసుకున్న రూ.ఐదు కోట్ల డీల్‌లో అడ్వాన్స్‌గా ఇవ్వజూపిన రూ.50 లక్షలు పోను మిగతా రూ.4.5 కోట్ల ఆచూకీ కనిపెట్టాల్సి ఉందన్నారు. ఈ కేసులో కేవలం ఆడియో, వీడియో రికార్డులపైనే తాము ఆధారపడడం లేదని, కీలక ఆధారాలను సేకరించామని చెప్పారు. రేవంత్ ఇప్పటికే పలు పరువునష్టం దావాలను ఎదుర్కొంటున్నారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదని నివేదించారు. స్టీఫెన్సన్ను ముందుగా ఇద్దరు వ్యక్తులు కలిసి రూ.2 కోట్లు ఇస్తామన్నారని, తర్వాత సెబాస్టియన్ రూ.5 కోట్లు ఇస్తామని చెప్పారని వెల్లడించారు. ఏసీబీలో సిబ్బంది కొరత కారణంగా నిందితుల వాంగ్మూలాలను నమోదు చేయలేకపోయామని, ఆడియో, వీడియో సీడీలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేకపోయామని అన్నారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న ఉదయ్‌సింహ నివాసంలో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద రేవంత్ తరఫున పలు సంస్థల నుంచి సమాచారం తీసుకున్నట్లు వాటి ద్వారా తేలిందన్నారు. స్టీఫెన్సన్ దగ్గరకు వెళ్లిన సమయంలో రేవంత్‌రెడ్డి తన గన్మెన్లను తీసుకెళ్లలేదని, ఈ కేసుతో సంబంధమున్న మత్తయ్య ఇప్పటికీ పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. స్టీఫెన్ ఎంపికను వ్యతిరేకించారు నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్ను ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ రేవంత్ గతంలో మాట్లాడారని, అందుకే ఆయనపై స్టీఫెన్ కోపం పెంచుకున్నారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఓటు హక్కుండదని, అలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని 7, 11(పబ్లిక్సర్వెంట్ ముడుపులు తీసుకోవడం) సెక్షన్లు ఎలా వర్తిస్తాయని, ఆ సెక్షన్లే వర్తించనప్పుడు శిక్షకు సంబంధించిన సెక్షన్ 12 ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఆడియో, వీడియో రికార్డుల ఆధారంగా కస్టడీ కోరడమే సరికాదని, 4 రోజులపాటు కస్టడీలోకి తీసుకుని పూర్తిగా విచారించాక కూడా బెయిల్‌ను వ్యతిరేకించడం సరికాదన్నారు. సీజ్ చేసిన సొమ్ము ఏసీబీ దగ్గరే ఉందని, మిగతా డబ్బును కనిపెట్టేందుకు బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నామనడం సమంజసం కాదన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌రెడ్డి ఎక్కడికి పారిపోరని, దర్యాప్తునకు అందుబాటులోనే ఉంటారని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అందుకు అవకాశం లేకపోతే, కుమార్తె నిశ్చితార్థం కోసం తాత్కాలిక బెయిలైనా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సెబాస్టియన్, ఉదయ్‌సింహ ప్రైవేటు వ్యక్తులని, వారినిప్పటికే కస్టడీలో పూర్తిస్థాయిలో విచారించిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని వారి తరఫు న్యాయవాదులు నివేదించారు. ఏసీబీ వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. రేవంత్‌ను కలసిన ఎమ్మెల్యేలు చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి బుధవారం ములాఖత్‌లో కలుసుకున్నారు. దాదాపు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. రేవంత్‌ను కలుసుకోవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, ఆయన తమకు మిత్రుడని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
రేవంత్ రెడ్డి ఎవరినీ బెదిరించకూడదు..
-
రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు బెయిల్
-
రేవంత్ రెడ్డి ఎవరినీ బెదిరించకూడదు..
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో 12 గంటల పాటు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి షరతులు విధించింది. 12 గంటల సమయంలో రేవంత్ రెడ్డి వెంట ఎస్కార్ట్ ఉండాల్సిందేనని, ఎవరితోనూ సమావేశాలు పెట్టకూడదని, అలాగే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఎవరినీ బెదిరించకూడదని, విచారణకు ఆటంకం కలిగించకూడదని సూచించింది. కాగా రేవంత్ రెడ్డి దాఖలు చేసుకున్న ప్రధాన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. కేసు విచారణ సమయంలో ఉన్నందున ...ఈ దశలో రేవంత్‌కు బెయిల్ ఇవ్వలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. -
రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు బెయిల్
ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బుధవారం షరతులతో కూడిన 12 గంటల పాటు బెయిల్ మంజూరైంది. ఏసీబీ కోర్టు ఆయనకు గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ మంజూరు చేసింది. కుమార్తె నిశ్చితార్థం కోసం బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం కోసమే అయితే బెయిల్ ఇచ్చేందుకు తమకు కూడా అభ్యంతరం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ముందురోజు సాయంత్రం వెళ్లి, తర్వాతి రోజు సాయంత్రం వస్తే పర్వాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి తరఫున సుప్రీంకోర్టు నుంచి వచ్చిన న్యాయవాదులు తమ వాదన వినిపించారు. వాదనలన్నీ విన్న తర్వాత ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. -
'సల్మాన్‌కు శిక్ష పడింది, మాకేం ఒరిగింది'
-
సల్మాన్ ఖాన్‌కు మధ్యంతర బెయిల్
-
సల్మాన్ ఖాన్‌కు మధ్యంతర బెయిల్
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ముంబై హైకోర్టు రెండు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీంతో సల్మాన్ ఖాన్ రాత్రికి జైలులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ముంబై సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. దాంతో ఆయన్నీ ముంబై ఆర్థర్ రోడ్డులోని జైలుకు తరలించారు. సల్మాన్‌కు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. సల్మాన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని.... ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే హైకోర్టుకు విన్నవించారు. దీంతో సల్మాన్‌కు రెండు రోజు పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. -
తేజ్ పాల్ మధ్యంతర బెయిల్ మరోసారి పొడిగింపు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. వచ్చే నెల 1వ తేదీ వరకూ తేజ్ పాల్ కు మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తేజ్‌పాల్ తల్లి శకుంతల తేజ్‌పాల్ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ గత నెలలో మరణించారు. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ నెల 27 వరకు తేజ్‌పాల్ మధ్యంతర బెయిల్ ను పొడిగించింది. అతనికి ఇచ్చిన బెయిల్ గడువు నేటితో ముగియనుండటంతో తేజ్ పాల్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం బెయిల్ ను మరో నాలుగు రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపింది. గతేడాది నవంబర్‌లో గోవా రాజధాని పనాజీలో ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. -
తేజ్‌పాల్‌కు మధ్యంతర బెయిల్ పొడిగించిన సుప్రీం
లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ నెల 27 వరకు తేజ్‌పాల్ మధ్యంతర బెయిల్ పొడిగిస్తున్నట్లు సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తేజ్‌పాల్ తల్లి శకుంతల తేజ్‌పాల్ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ గత నెలలో మరణించారు. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసింది. గతేడాది నవంబర్‌లో గోవా రాజధాని పనాజీలో ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. -
తరుణ్ తేజ్‌పాల్‌కు మధ్యంతర బెయిలు
పనాజి: అత్యాచార ఆరోపణలతో జైలుపాలైన తెహల్కా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన తల్లి శకుంతల తేజ్ పాల్(87) నేడు కన్నుమూశారు. తల్లి అంత్యక్రియలు, కార్మకాండలు నిర్వహించేందుకు వీలుగా ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. గతేడాది నవంబర్‌లో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పణజీలోని గ్రాండ్ హయత్ ఫైవ్‌స్టార్ హోటల్ లిఫ్టులో తన జూనియర్ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం, తదితర నేరాలకు పాల్పడ్డారని, ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని చార్జిషీట్లో పేర్కొన్నారు. పలు సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించిన తేజ్‌పాల్ ఈ అభియోగాల కింద దోషిగా తేలితే ఏడేళ్లకుపైగా జైలు శిక్ష పడుతుంది. -
తేజ్‌పాల్‌కు ఊరట