
రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు బెయిల్
ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బుధవారం షరతులతో కూడిన 12 గంటల పాటు బెయిల్ మంజూరైంది. ఏసీబీ కోర్టు ఆయనకు గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ మంజూరు చేసింది. కుమార్తె నిశ్చితార్థం కోసం బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
నిశ్చితార్థం కోసమే అయితే బెయిల్ ఇచ్చేందుకు తమకు కూడా అభ్యంతరం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ముందురోజు సాయంత్రం వెళ్లి, తర్వాతి రోజు సాయంత్రం వస్తే పర్వాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి తరఫున సుప్రీంకోర్టు నుంచి వచ్చిన న్యాయవాదులు తమ వాదన వినిపించారు. వాదనలన్నీ విన్న తర్వాత ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు.