
చంద్రబాబుకు జేపీ సూటిప్రశ్నలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ సూటి ప్రశ్నలు సంధించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ సూటి ప్రశ్నలు సంధించారు. ఓటుకు కోట్లు కుంభకోణం నేపథ్యంలో ఆయన తన ట్విట్టర్ వేదికగా ఈ ప్రశ్నలు వేశారు.
మీ ఎమ్మెల్యే 5 కోట్ల లంచం ఎరవేసి ఒక ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేయడానికి సిద్ధమైన విషయం నిజమేనా? ఒకవేళ అలా చేస్తే.. మీ సూచనలతోనే ఓటుకు నోటు వ్యవహారం జరిగిందా? ఒకవేళ రేవంత్ రెడ్డి సొంతంగా ఈ వ్యవహారం చేస్తే మీరు ఇంతవరకు ఎందుకు ఎలాంటి చర్య తీసుకోలేదు? ఆడియో రికార్డుల్లో ఎలాంటి ఎడిటింగ్ లేదని తేలితేమీరు రాజీనామా చేస్తారా?
We demand answers from @ncbn #CashFOrVote #TDPBribegate pic.twitter.com/dwfUYB1MzH
— Jayaprakash Narayan (@JP_LOKSATTA) June 13, 2015