ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ వర్గాలు చురుగ్గా కదులుతున్నాయి.
ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ వర్గాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే ఏసీబీ డీజీ ఏకే ఖాన్, డీఎస్పీ శ్రీనివాస్లు తెలంగాణ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఓటుకు కోట్లు కేసును దర్యాప్తు చేస్తున్న విచారణ అధికారులతో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సమావేశమయ్యారు.
కాగా.. తెలంగాణ ఏసీబీ రెండు రకాల నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి చంద్రబాబుకు, మరొకటి తెలుగుదేశం పార్టీ ఎంపీ ఒకరికి ఇవ్వడానికి సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తన కంపెనీ ద్వారా కోట్లాదిర ఊపాయలను చేతులు మార్చిన ఎంపీది ఈ కేసులో కీలకపాత్ర అని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సమస్త వివరాలతో కూడిన 17 పేజీల నివేదికను కేంద్రానికి తెలంగాణ ఏసీబీ పంపింది.