రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు వ్యవహారంలో కొత్తగా మరో 20 పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం సాయంత్రం కోర్టుకు సమర్పించే కేసు డైరీలో ఏసీబీ వర్గాలు ఈ 20 పేర్లను ప్రస్తావిస్తాయని సమాచారం. ఇప్పటివరకు అరెస్టుచేసిన నిందితులను విచారించిన సందర్భంగా, ఆ విచారణలో బయటకు వచ్చిన పేర్లను ఈ డైరీలో చేరుస్తారని అంటున్నారు. స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు ఆడియో టేపులలో తెలుస్తుండటంతో.. ఆయన పేరు కూడా ఈ డైరీలో ఉండొచ్చని తెలుస్తోంది.
మధ్యవర్తులు ప్రస్తావించిన 'బాస్' చంద్రబాబేనని ఏసీబీ నిర్ధారణకు రావడంతో ఆయన పేరు కూడా పెట్టాలని అంటున్నారు. కొందరు రాజ్యసభ సభ్యులు, పారిశ్రామికవేత్తల పేర్లు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కస్టడీ ప్రస్తుతానికి సరిపోతుందని, తర్వాత అవసరమైతే మరోసారి తీసుకుంటామని ఏసీబీ అధికారులు అంటున్నారు.
ఓటుకు నోటు కేసులో మరో 20 పేర్లు?
Published Tue, Jun 9 2015 2:25 PM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM
Advertisement
Advertisement