horsetrading
-
కర్ణాటకలో రాజకీయ హైడ్రామా
-
కర్ణాటకలో హైడ్రామా : అవిశ్వాసానికి బీజేపీ సంసిద్ధం
సాక్షి, బెంగళూర్: కన్నడ సీమలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటకలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. 13 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతును కూడగడుతూ కుమారస్వామి సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. కాగా, ముగ్గురు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముంబైలో ఓ హోటల్లో ఉన్నారని, తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలకు దిగుతోందని స్వయంగా కర్ణాటక మంత్రి శివకుమార్ ఆరోపించారు. మరోవైపు ముగ్గురు ఎమ్మెల్యేలు తనకు సమాచారం ఇచ్చి ముంబై వెళ్లారని, వారితో తాను టచ్‌లో ఉన్నానని సీఎం హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలోని హోటల్లో బీజేపీ నేతల సమక్షంలో ఉన్నారని కర్ణాటక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్ధిరపరచాలనే బీజేపీ కుట్ర ఫలించదని ఆయన అన్నారు. రిసార్ట్ రాజకీయం.. కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు మరోసారి తెరలేచింది. బీజేపీ ఎమ్మెల్యేలు నలుగురైదుగురు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస చేసిన వ్యాఖ్యలు కాషాయకూటమిలో కలకలం రేపాయి. మరోవైపు జేడీఎస్ సైతం తమ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని చూస్తోందని ఆ పార్టీ నేత యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ తమ శాసనసభ్యులను గురుగావ్‌లోని రిసార్ట్స్‌కు తరలించింది. కాగా కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్‌కు ఎలాంటి ముప్పూ లేదని ఆ పార్టీ కర్ణాటక చీఫ్ దినేష్ గుండూరావ్ చెప్పారు. ముంబై హోటల్లో బస చేసిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలో పార్టీ గూటికి చేరుతారన్నారు. ఆరోపణలు అవాస్తవం : యడ్యూరప్ప తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కాషాయపార్టీ నేత, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటకలోని సంకీక్ణ ప్రభుత్వాన్ని కూలదోసే ఆలోచన తమకు లేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురుని ప్రలోభపెట్టేందుకు జేడీఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
కేసీఆర్‌పై ఏపీలో 87 కేసులున్నాయి: యనమల
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 87 కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. చంద్రబాబుతో మంత్రుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తమ ప్రతిచర్య కూడా తప్పనిసరిగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అధికారం ఉంటే, తమకూ ఆ అధికారం ఉంటుందని యనమల చెప్పారు. -
ఒక నోటీసు బాబుకు.. మరోటి ఎంపీకి?
ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ వర్గాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే ఏసీబీ డీజీ ఏకే ఖాన్, డీఎస్పీ శ్రీనివాస్‌లు తెలంగాణ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఓటుకు కోట్లు కేసును దర్యాప్తు చేస్తున్న విచారణ అధికారులతో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సమావేశమయ్యారు. కాగా.. తెలంగాణ ఏసీబీ రెండు రకాల నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి చంద్రబాబుకు, మరొకటి తెలుగుదేశం పార్టీ ఎంపీ ఒకరికి ఇవ్వడానికి సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తన కంపెనీ ద్వారా కోట్లాదిర ఊపాయలను చేతులు మార్చిన ఎంపీది ఈ కేసులో కీలకపాత్ర అని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సమస్త వివరాలతో కూడిన 17 పేజీల నివేదికను కేంద్రానికి తెలంగాణ ఏసీబీ పంపింది. -
చంద్రబాబుకు జేపీ సూటిప్రశ్నలు
-
రేవంత్ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు: పల్లె
ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తప్పు చేసి ఉంటే ఆయన శిక్ష అనుభవిస్తారని మంత్రి పల్లె రఘునాధరెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ కేసులో సీబీఐతోనే కాదు ఏ సంస్థతోనైనా విచారణకు సిద్ధమని, చంద్రబాబు మాత్రం కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్టు చేసే దమ్ము, ధైర్యం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేవని చెప్పారు. కేసీఆర్ సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు సహా 120 మంది ముఖ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరపాలని పల్లె అన్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలను ముక్కలుగా చేసి అతికించి టేపు విడుదల చేశారని ఆయన ఆరోపించారు. బాలకృష్ణ సీఎం అవుతారంటూ చేసిన ప్రచారం మీడియా సృష్టేనని మండిపడ్డారు. -
చంద్రబాబుకు జేపీ సూటిప్రశ్నలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ సూటి ప్రశ్నలు సంధించారు. ఓటుకు కోట్లు కుంభకోణం నేపథ్యంలో ఆయన తన ట్విట్టర్ వేదికగా ఈ ప్రశ్నలు వేశారు. మీ ఎమ్మెల్యే 5 కోట్ల లంచం ఎరవేసి ఒక ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేయడానికి సిద్ధమైన విషయం నిజమేనా? ఒకవేళ అలా చేస్తే.. మీ సూచనలతోనే ఓటుకు నోటు వ్యవహారం జరిగిందా? ఒకవేళ రేవంత్ రెడ్డి సొంతంగా ఈ వ్యవహారం చేస్తే మీరు ఇంతవరకు ఎందుకు ఎలాంటి చర్య తీసుకోలేదు? ఆడియో రికార్డుల్లో ఎలాంటి ఎడిటింగ్ లేదని తేలితేమీరు రాజీనామా చేస్తారా? We demand answers from @ncbn #CashFOrVote #TDPBribegate pic.twitter.com/dwfUYB1MzH — Jayaprakash Narayan (@JP_LOKSATTA) June 13, 2015 -
'చంద్రబాబు పాపాత్ముడు.. అందుకే దొరికిపోయాడు'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపాత్ముడు కాబట్టే తెలంగాణలో దొరికిపోయాడని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో దోచుకున్న సొమ్ముతో ఆయన తెలంగాణలో ధనపూజలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆ సీటును బాలకృష్ణ లేదా లోకేశ్ ఎత్తుకుపోతారని చంద్రబాబు భయపడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా కూడా ఎల్లో పత్రికలు మాత్రం ఆ విషయాన్ని రాయట్లేదని ఆయన చెప్పారు. -
అవినీతి సీఎంను కేంద్రం కాపాడకపోవచ్చు: వైఎస్ జగన్
-
మళ్లీ చర్లపల్లి జైలుకు రేవంత్ రెడ్డి
-
మళ్లీ చర్లపల్లి జైలుకు రేవంత్ రెడ్డి
ఓటుకు కోట్ల కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన కుమార్తె నిశ్చితార్థానికి హాజరై.. తిరిగి చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఆయనకు తాత్కాలిక బెయిల్ సమయం ఉన్నా, చర్లపల్లి జైలు నగరానికి దూరంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ముందుగానే ఆయన బయల్దేరినట్లు తెలుస్తోంది. అత్యంత పటిష్ఠమైన నిఘా మధ్య రేవంత్ రెడ్డిని జైలుకు తరలించారు. ఉదయం 8.45 గంటలకు తన ఇంటి నుంచి ఎన్ కన్వెన్షన్‌కు చేరుకున్న రేవంత్‌రెడ్డి, అక్కడి నుంచి తిరిగి 2.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. గంటన్నర పాటు కుటుంబ సభ్యులతోను మరికొందరు నాయకులతోను గడిపారు. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి, మరికొందరు నాయకులు ఆయనను కలిసినవారిలో ఉన్నారు. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ఆయనే స్వచ్ఛందంగా బయటకు వచ్చి, తనను తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాహనంలోకి ఎక్కారు. వెంటనే ఎస్కార్ట్ సిబ్బంది ఆయనతో పాటు జైలుకు బయల్దేరారు. రెండు గంటల సమయం ఉన్నప్పటికీ, సాయంత్రం 6 గంటల్లోగానే జైలుకు తిరిగి వెళ్లాలన్న నిబంధన ఉండటంతో ఆయన ముందే బయల్దేరినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకే ఆయన చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. చాలామంది ఆయనను కలిసేందుకు జైలు వద్దకు వచ్చినా, ఆయన మాత్రం ముందుగానే సాయంత్రం 5 గంటలకే జైలు లోపలకు వెళ్లిపోయారు. -
అవినీతి సీఎంను కేంద్రం కాపాడకపోవచ్చు: వైఎస్ జగన్
అవినీతి ముఖ్యమంత్రిని కేంద్రప్రభుత్వం కాపాడుతుందని తాను భావించడం లేదని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఢిల్లీలో కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడిని ఎ-1 ముద్దాయిగా చేర్చాలని వైఎస్ జగన్ డిమాండు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతికి పాల్పడిన డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలనుకున్నారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియో, వీడియో టేపులు ఇప్పటికే బయటకు వచ్చాయని గుర్తుచేశారు. రేవంత్ కేసులో చంద్రబాబును ఎ-1 ముద్దాయిగా ఎందుకు చేర్చడం లేదని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన అవినీతిపై దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు వైఎస్ జగన్ చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు టీడీపీ, కాంగ్రెస్ కుట్రపూరితంగా చేసినవేనన్నారు. ఆ సమయంలో తాను సీఎం, ఎంపీ.. చివరకు ఎమ్మెల్యేగా కూడా లేనని తెలిపారు. తాను సచివాలయంలో అడుగుపెట్టలేదని, ఏ అధికారికీ ఫోన్లు కూడా చేయలేదని అన్నారు. అయినా తనపై వచ్చిన ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొన్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన ఏమన్నారంటే... ''రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, విభజన సమయంలో ఇచ్చిన హామీల మీద కేంద్రం నుంచి సహాయం కోసం ఒక కాపీ ఇచ్చాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏరకంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడో, వాస్తవాలను పక్కదోవ పట్టిస్తున్నాడో అవి హోం మంత్రికి వివరించాము. ఒక ముఖ్యమంత్రి తాను తీసుకున్న లంచాలను విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ, లంచం ఇస్తూ దొరికిపోయిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు పక్కదారి పట్టించేందుకు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రే డబ్బులిస్తూ పట్టుబడితే తాను లంచాలుగా సేకరించిన డబ్బును ఇన్ని వందల కోట్లతో ముడిపడిన మొత్తాన్ని లంచంగా ఇస్తూ పట్టుబడితే ఆయనమీద ఎందుకు కేసు పెట్టడం లేదని అడిగాము. కేవలం ఆయన ఒక సీఎం కాబట్టే ఆయన్ను వదిలేయడం ఎంతవరకు ధర్మం అని ప్రశ్నించాము. సామాన్యుడికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయం ఎంతవరకు ధర్మం, చంద్రబాబును కచ్చితంగా ఎ-1గా బుక్ చేయాలని హోం మంత్రిని అడిగాము. గత 12 నెలలుగా చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో ఏవేం స్కాములు చేశారో, అవన్నీ కూడా తెలిపాము. పట్టిసీమ, జీవో నెం. 22, డిస్టిలరీలకు అనుమతులు, కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టులో మెగావాట్‌కు 8 కోట్లు ఇవ్వడం లాంటివాటిపై లోతైన విచారణ జరగాలని కోరాము. నాకు తెలిసి కేంద్రం ఒక అవినీతిపరుడైన ముఖ్యమంత్రిని కాపాడే ప్రయత్నం చేయదని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. కేంద్రం తగు రీతిలో స్పందిస్తుందనే ఆశిస్తున్నాను.'' -
జీతగాడు స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా
చంద్రబాబు వద్ద జీతగాడుగా ఉన్న వ్యక్తి.. ఆయనపైనే స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా అని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు, కూతురు, మేనల్లుడు కోట్ల రూపాయలు సంపాదించారంటూ విమర్శలు గుప్పించారు. పిరికిపంద, అవినీతిపరుడు, పాస్‌పోర్టులు అమ్ముకుని జైలుకు పోయిన కేసీఆర్.. ఇప్పుడు నీతుల గురించి మాట్లాడతాడా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
'వైఎస్ జగన్‌ను వివాదాల్లోకి లాగొద్దు'
విజయనగరం: ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్ కు, టీడీపీ మధ్య జరుగుతున్న వివాదాల్లోకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లాగొద్దని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఓటుకు నోటు విషయం ఇద్దరు సీఎంలు, పార్టీల మధ్య వ్యవహారమే తప్ప రెండు రాష్ర్టాల వివాదం కాదన్నారు. వాస్తవాలను ప్రజలకు చెబితే తమను చెడ్డవారని ప్రచారం చేయడం తగదన్నారు. ఓటుకు కోట్ల వ్యవహారంపై నమోదైన కేసులో చంద్రబాబు ను మొదటి ముద్దాయి గా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. -
నేడు రాజ్‌నాథ్‌ను కలవనున్న వైఎస్ జగన్
-
నేడు రాజ్‌నాథ్‌ను కలవనున్న వైఎస్ జగన్
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్నారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ బృందం కూడా సాయంత్రం నాలుగు గంటలకు హోం మంత్రిని కలుస్తుంది. ఓటుకు కోట్ల వ్యవహారంపై నమోదైన కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎ-1గా చేర్చాలంటూ కేంద్ర హోం మంత్రికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం ఇవ్వనున్నారు. -
తాత్కాలిక బెయిల్ పై రేవంత్ విడుదల
-
బెయిల్ నిరాకరణ
ఓటుకు నోటు కేసులో నిందితుల పిటిషన్లను కొట్టేసిన కోర్టు ♦ రేవంత్‌కు మాత్రం 12 గంటల తాత్కాలిక బెయిల్ ♦ కూతురు నిశ్చితార్థంలో పాల్గొనేందుకు అనుమతి ♦ ఎన్నికల ప్రక్రియను రేవంత్ కలుషితం చేశారు ♦ తన పలుకుబడితో కేసును ప్రభావితం చేస్తారు ♦ మిగతా రూ.4.5 కోట్ల ఆచూకీని కనిపెట్టాల్సి ఉంది ♦ బెయిల్ ఇవ్వొద్దని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ విజ్ఞప్తి ♦ స్టీఫెన్సన్ కక్షగట్టి ఇరికించారని నిందితుల వాదన ♦ ఏసీబీ వాదనతో ఏకీభవించిన కోర్టు, పిటిషన్ల తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు బుధవారం తోసిపుచ్చింది. అయి తే కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొనేందుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిశ్చితార్థంలో రేవంత్ పాల్గొనవచ్చునని జడ్జి లక్ష్మీపతి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.50 వేల పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి రెండు పూచీకత్తు బాండ్లను సమర్పించాలని షరతు విధించారు. బెయిల్ మీద బయట ఉన్న సమయంలో మీడియాతోనూ, రాజకీయ నాయకులతోనూ రేవంత్ కలవకూడదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని, దర్యాప్తుకు ఆటంకం కలిగించరాదని ఆదేశిం చారు. విచారణకు సంబంధించిన విషయాల ను బహిర్గతం చేయరాదని స్పష్టం చేశారు. రేవంత్ కదలికలపై నిఘాకు అనుమతించాలన్న ఏసీబీ విజ్ఞప్తిని కోర్టు ఆమోదించింది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రక్రియను అవినీతితో కలుషితం చేశారని, ఇది ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయడమేనని ఏసీబీ ప్రత్యేక లాయర్ వి.సురేందర్‌రావు కోర్టుకు విన్నవించారు. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తానని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్ అన్నారని, తన పలుకుబడితో ఆయన ఎవరినైనా ప్రభావితం చేయగలరని పేర్కొన్నారు. ఓటు కోసం చేసుకున్న రూ.ఐదు కోట్ల డీల్‌లో అడ్వాన్స్‌గా ఇవ్వజూపిన రూ.50 లక్షలు పోను మిగతా రూ.4.5 కోట్ల ఆచూకీ కనిపెట్టాల్సి ఉందన్నారు. ఈ కేసులో కేవలం ఆడియో, వీడియో రికార్డులపైనే తాము ఆధారపడడం లేదని, కీలక ఆధారాలను సేకరించామని చెప్పారు. రేవంత్ ఇప్పటికే పలు పరువునష్టం దావాలను ఎదుర్కొంటున్నారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదని నివేదించారు. స్టీఫెన్సన్ను ముందుగా ఇద్దరు వ్యక్తులు కలిసి రూ.2 కోట్లు ఇస్తామన్నారని, తర్వాత సెబాస్టియన్ రూ.5 కోట్లు ఇస్తామని చెప్పారని వెల్లడించారు. ఏసీబీలో సిబ్బంది కొరత కారణంగా నిందితుల వాంగ్మూలాలను నమోదు చేయలేకపోయామని, ఆడియో, వీడియో సీడీలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేకపోయామని అన్నారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న ఉదయ్‌సింహ నివాసంలో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద రేవంత్ తరఫున పలు సంస్థల నుంచి సమాచారం తీసుకున్నట్లు వాటి ద్వారా తేలిందన్నారు. స్టీఫెన్సన్ దగ్గరకు వెళ్లిన సమయంలో రేవంత్‌రెడ్డి తన గన్మెన్లను తీసుకెళ్లలేదని, ఈ కేసుతో సంబంధమున్న మత్తయ్య ఇప్పటికీ పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. స్టీఫెన్ ఎంపికను వ్యతిరేకించారు నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్ను ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ రేవంత్ గతంలో మాట్లాడారని, అందుకే ఆయనపై స్టీఫెన్ కోపం పెంచుకున్నారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఓటు హక్కుండదని, అలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని 7, 11(పబ్లిక్సర్వెంట్ ముడుపులు తీసుకోవడం) సెక్షన్లు ఎలా వర్తిస్తాయని, ఆ సెక్షన్లే వర్తించనప్పుడు శిక్షకు సంబంధించిన సెక్షన్ 12 ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఆడియో, వీడియో రికార్డుల ఆధారంగా కస్టడీ కోరడమే సరికాదని, 4 రోజులపాటు కస్టడీలోకి తీసుకుని పూర్తిగా విచారించాక కూడా బెయిల్‌ను వ్యతిరేకించడం సరికాదన్నారు. సీజ్ చేసిన సొమ్ము ఏసీబీ దగ్గరే ఉందని, మిగతా డబ్బును కనిపెట్టేందుకు బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నామనడం సమంజసం కాదన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌రెడ్డి ఎక్కడికి పారిపోరని, దర్యాప్తునకు అందుబాటులోనే ఉంటారని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అందుకు అవకాశం లేకపోతే, కుమార్తె నిశ్చితార్థం కోసం తాత్కాలిక బెయిలైనా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సెబాస్టియన్, ఉదయ్‌సింహ ప్రైవేటు వ్యక్తులని, వారినిప్పటికే కస్టడీలో పూర్తిస్థాయిలో విచారించిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని వారి తరఫు న్యాయవాదులు నివేదించారు. ఏసీబీ వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. రేవంత్‌ను కలసిన ఎమ్మెల్యేలు చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి బుధవారం ములాఖత్‌లో కలుసుకున్నారు. దాదాపు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. రేవంత్‌ను కలుసుకోవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, ఆయన తమకు మిత్రుడని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
రేవంత్ రెడ్డి ఎవరినీ బెదిరించకూడదు..
-
రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు బెయిల్
-
రేవంత్ రెడ్డి ఎవరినీ బెదిరించకూడదు..
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో 12 గంటల పాటు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి షరతులు విధించింది. 12 గంటల సమయంలో రేవంత్ రెడ్డి వెంట ఎస్కార్ట్ ఉండాల్సిందేనని, ఎవరితోనూ సమావేశాలు పెట్టకూడదని, అలాగే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఎవరినీ బెదిరించకూడదని, విచారణకు ఆటంకం కలిగించకూడదని సూచించింది. కాగా రేవంత్ రెడ్డి దాఖలు చేసుకున్న ప్రధాన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. కేసు విచారణ సమయంలో ఉన్నందున ...ఈ దశలో రేవంత్‌కు బెయిల్ ఇవ్వలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. -
రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు బెయిల్
ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బుధవారం షరతులతో కూడిన 12 గంటల పాటు బెయిల్ మంజూరైంది. ఏసీబీ కోర్టు ఆయనకు గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ మంజూరు చేసింది. కుమార్తె నిశ్చితార్థం కోసం బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం కోసమే అయితే బెయిల్ ఇచ్చేందుకు తమకు కూడా అభ్యంతరం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ముందురోజు సాయంత్రం వెళ్లి, తర్వాతి రోజు సాయంత్రం వస్తే పర్వాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి తరఫున సుప్రీంకోర్టు నుంచి వచ్చిన న్యాయవాదులు తమ వాదన వినిపించారు. వాదనలన్నీ విన్న తర్వాత ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. -
'నన్ను అరెస్టుచేస్తే.. కేసీఆర్ సర్కారుకు అదే ఆఖరిరోజు'
-
’సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది’
-
రేవంత్ తప్పు చేస్తే అనుభవిస్తారు
-
'బెయిల్ నిశ్చితార్థం కోసం కాదు'
-
'బెయిల్ నిశ్చితార్థం కోసం కాదు'
రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తానని స్వయంగా ఆయనే మీడియాకు చెప్పారని, అలాంటి వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇస్తే సాక్ష్యాలను పూర్తిగా ప్రభావితం చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. రేవంత్ రెడ్డికి బెయిలిస్తే సాక్ష్యాధారాలను మాయం చేసే అవకాశం ఉందని పీపీ కోర్టుకు విన్నవించారు. అయితే.. ఆయన కూతురి నిశ్చితార్థం కోసం ఎస్కార్టుతో కూడిన ఒకరోజు బెయిల్ ఇస్తే మాత్రం తమకు అభ్యంతరం లేదన్నారు. నిశ్చితార్థం కోసం కాకుండా ఇతర ఉద్దేశాలతోనే బెయిల్ అడుగుతున్నారనే అనుమానం తమకు కలుగుతోందని ఆయన చెప్పారు. లంచం ఇవ్వడం ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయమేనని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డిపై ఇప్పటికే కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని, ఆయన డ్రైవర్ ఇంకా తప్పించుకునే తిరుగుతున్నారని తెలిపారు. ఈకుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారని, వాటికి వెళ్లేటప్పుడు గన్‌మెన్‌ను కూడా వదిలి వెళ్లేవారని పీపీ కోర్టుకు చెప్పారు. ముగ్గురు నిందితులను విచారించాక దొరికిన ఆధారాలతోనే వాళ్ల ఇళ్లలోసోదాలు చేశామని, ఉదయసింహ ఇంట్లో భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని, దాంతోపాటు రేవంత్ రెడ్డికి సంబంధించిన లావాదేవీల డాక్యుమెంట్లు కూడా దొరికాయని అన్నారు. కేవలం వీడియో ఫుటేజి ఆధారంగానే కేసులు పెట్టలేదని, తమవద్ద కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఇచ్చిన 50 లక్షలు కాకుండా మిగిలిన రూ. 4.50 కోట్లు ఎక్కడున్నాయనే కోణంలో విచారణ చేపడుతున్నామన్నారు. -
రేవంత్ తప్పు చేస్తే అనుభవిస్తారు: అచ్చెన్నాయుడు
రేవంత్ రెడ్డిని క్రమంగా దూరం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతం ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇష్యూ పూర్తిగా వేరని, దాంతో తమకు సంబంధం లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తప్పు చేస్తే అనుభవిస్తారని, లేకపోతే నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పారు. ఈ విషయం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నందువల్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనన్నారు. అయినా.. ఫోన్లలో ఏవో సొంత విషయాలు మాట్లాడుతారని, వాటిని ట్యాప్ చేయడం ధర్మమా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విలేకర్లతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అచ్చంనాయుడుతో పాటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు. -
'నన్ను అరెస్టుచేస్తే.. కేసీఆర్ సర్కారుకు అదే ఆఖరిరోజు'
జాతీయ మీడియాతో చంద్రబాబు వ్యాఖ్య గవర్నర్ పాత్రపైనా విమర్శలు న్యూఢిల్లీ తనను అరెస్టు చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తే.. అదే ఆయన ప్రభుత్వానికి చివరి రోజు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు, ప్రధాని, రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన.. అక్కడ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో బద్నాం అయిన చంద్రబాబు.. కేసీఆర్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు కేంద్రంలోని పెద్దలందరినీ కలుస్తున్నారు. ఇందుకోసం ఆయన ఓ ప్రైవేటు హాటల్లో బస చేశారు. ఫోను సంభాషణలు, ఇతర రికార్డులు అన్నింటినీ మార్చేశారని ఆయన ఆరోపించారు. తనను, తన పార్టీ నాయకులను భయపెట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంలో కేసీఆర్ పాత్ర ఏంటని ఆయన ప్రశ్నించారు. తన సంభాషణలను ఆయన రికార్డుచేసినా, ఆయన ఛానల్ చేసినా.. దానికి తానెందుకు సమాధానం చెప్పాలని బాబు అడిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి తనపై బురద జల్లుడు కార్యక్రమానికి పాల్పడుతున్నారని, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం తానెంత ప్రయత్నించినా ఆయన ముందుకు రాలేదని చంద్రబాబు ఆరోపించారు. తనకు తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఉండటం.. ఉండకపోవడంలో పెద్ద ఆసక్తి ఏమీ లేదని, కానీ కేసీఆర్ మాత్రం తన పార్టీని చీల్చి బలాన్ని పెంచుకుంటున్నారని అన్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి గవర్నర్ ఎలా అనుమతి ఇస్తారంటూ గవర్నర్ నరసింహన్ పాత్రపై కూడా ఆయన మండిపడ్డారు. -
చేసేది మీరు.. బలయ్యేది మేమా!
-
చేసేది మీరు.. బలయ్యేది మేమా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం ఎంతవరకు సబబన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఇంటెలిజెన్స్ చీఫ్ అనూరాధపై వేటు వేస్తారన్న కథనాలు సీనియర్ ఐపీఎస్ అధికారుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. ఆమెను మార్చి కొత్త చీఫ్ నియామకం కోసం డీజీపీ రాముడు కూడా ఇప్పటికే రెండు పేర్లను సూచించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఏపీ పోలీసులలో కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్ అధికారుల వరకు అన్ని స్థాయులలోను తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు తీసుకుని, వాటికి పోలీసులను బాధ్యులను చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శేషాచలం ఎన్కౌంటర్ తర్వాత జాతీయస్థాయిలో ఏపీ పోలీసుల ప్రతిష్ఠ మంటగలిసింది. ఈ విషయంలో కూడా ప్రభుత్వ నిర్ణయం తర్వాతే తాము చేశామని, దానికి తమను తప్పుబట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. రాజధాని పంటభూముల్లో మంటలు వచ్చినప్పుడు పోలీసులను ఇరకాటంలో పెట్టారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాల విషయంలో ఎంపీల మాట వినలేదని ఎస్పీని బదిలీ చేశారు. ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో ఫోన్లు మాట్లాడినప్పుడు దీనికి, తమకు ఏంటి సంబంధమని ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఏమైనా జరిగితే తాము బాధ్యులం అవుతాము గానీ, హైదరాబాద్ విషయంలో తమదెలా బాధ్యత ఉంటుందని మండిపడుతున్నారు. ఏదో చేస్తున్నట్లు చెప్పుకోడానికే తప్ప పోలీసులను బద్నాం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
ఢిల్లీ నుంచి రాగానే చంద్రబాబుకు నోటీసులు?
-
ఢిల్లీ నుంచి రాగానే చంద్రబాబుకు నోటీసులు?
ఓటుకు కోట్ల కేసులో ఏసీబీ మరో ముందడుగు వేయనుంది. పూర్తి సాక్ష్యాధారాలతో కూడిన సమగ్ర నివేదికను బుధవారం నాడు కోర్టుకు సమర్పించనుంది. దాంతోపాటు.. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ కూడా దాఖలు చేయనుంది. కేసు కీలక సమయంలో ఉన్న ఈ తరుణంలో బెయిల్ ఇవ్వడం సరికాదని ఏసీబీ వాదించనుంది. ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే విషయంలోకూడా సీనియర్ అధికారులను సంప్రదించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. 48 గంటల్లో విచారణకు హాజరు కావాలని కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత ఈ నోటీసులు ఇవ్వొచ్చని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేసుకు సంబంధించి ఎక్కడ కుట్ర పన్నారు, డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనే వివరాలు నేడు కోర్టుకు వెళ్లనున్నాయి. ఓ కార్పొరేట్ సంస్థ ఖాతాలోకి డబ్బులొచ్చాయనడానికి ఏసీబీ ఇప్పటికే సాక్ష్యాలు సంపాదించింది. ఇద్దరు టీడీపీ నాయకుల విషయంలో కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. బాస్ ఎవరన్న విషయాన్ని కూడా ఏసీబీ తేల్చేసింది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహా కస్టడీలో ఉండగానే ఈ వివరాలు రాబట్టింది. కుట్ర, దాని అమలుకు ప్రయత్నించినవారి పేర్లను కోర్టుకు నివేదించనుంది. నాలుగు రోజుల కస్టడీలో నిందితులు చెప్పిన విషయాల ఆధారంగా 15 మంది పేర్లను ఏసీబీ గుర్తించింది. ఇందులో చంద్రబాబు పేరు కూడా ఉండే అవకాశం ఉంది. చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం వందకోట్లు దాటిన వ్యవహారం కాబట్టి.. ఎక్కువ సంఖ్యలోనే పేర్లున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కారు డ్రైవర్ స్థాయి వరకు పేర్లున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వీడియో, ఆడియో ఫుటేజిలతో పాటు డాక్యుమెంటరీ సాక్ష్యాలను కూడా ఏసీబీ సేకరించింది. -
ఫోన్ ట్యాపింగ్: ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ
ఓటుకు నోటు కుంభకోణం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌ను ట్యాప్ చేశారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జాస్తి వెంకట రాముడు ఢిల్లీకి వెళ్తున్నారు. అసలు తాము ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేయలేదని ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా తమ ముఖ్యమంత్రి ఫోన్‌ను అక్రమంగా ట్యాప్ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ సర్కారు వాదిస్తోంది. -
ఓటుకు నోటు కేసులో మరో 20 పేర్లు?
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు వ్యవహారంలో కొత్తగా మరో 20 పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం సాయంత్రం కోర్టుకు సమర్పించే కేసు డైరీలో ఏసీబీ వర్గాలు ఈ 20 పేర్లను ప్రస్తావిస్తాయని సమాచారం. ఇప్పటివరకు అరెస్టుచేసిన నిందితులను విచారించిన సందర్భంగా, ఆ విచారణలో బయటకు వచ్చిన పేర్లను ఈ డైరీలో చేరుస్తారని అంటున్నారు. స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు ఆడియో టేపులలో తెలుస్తుండటంతో.. ఆయన పేరు కూడా ఈ డైరీలో ఉండొచ్చని తెలుస్తోంది. మధ్యవర్తులు ప్రస్తావించిన 'బాస్' చంద్రబాబేనని ఏసీబీ నిర్ధారణకు రావడంతో ఆయన పేరు కూడా పెట్టాలని అంటున్నారు. కొందరు రాజ్యసభ సభ్యులు, పారిశ్రామికవేత్తల పేర్లు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కస్టడీ ప్రస్తుతానికి సరిపోతుందని, తర్వాత అవసరమైతే మరోసారి తీసుకుంటామని ఏసీబీ అధికారులు అంటున్నారు. -
తప్పు చేయకపోతే సీబీఐ విచారణ కోరండి..
-
తప్పు చేయకపోతే సీబీఐ విచారణ కోరండి..
హైదరాబాద్ : సీఎం ఫోన్ ట్యాప్ చేస్తారా అని అగ్గి మీద గుగ్గిలమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు... ఆ గొంతు నాది కాదని ఎందుకు స్పష్టం చేయడం లేదని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఓటు నోటుకు వ్యవహారంలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన .. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పు చేయక పోతే లీగల్ గా పోరాటం చేయాలి తప్ప చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి తప్పులు మీద తప్పులు చేస్తూ రాష్ట్ర పరువును గంగలో కలుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్‌ను కూడా అవమానిస్తూ రాష్ట్రాభిమానాన్ని తాకట్టు పెడితే, విధ్వంస చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మీరు చేసిన తప్పులను ఆంధ్ర ప్రజలు మోయాలా. ఈ నష్టాన్ని ఆంధ్ర ప్రజలు భరించాలా అని ఆయన ధ్వజమెత్తారు. తప్పు చేయక పోతే సీబీఐ విచారణ కోరాలని బొత్స డిమాండ్ చేశారు. సీఎం ఫోన్ ట్యాప్ చేయడం నేరమైతే దానికి చట్టాలున్నాయని, దానికి వ్యతిరేకంగా చట్టప్రకారం పోరాడాలని బొత్స అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వీధిపోరాటాలు చేస్తోంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని బొత్స మండిపడ్డారు. ఒంటెద్దు పోకడలకు పోతూ ఇలాంటి కార్యక్రమాలకు దిగడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. -
నటనలో ఎన్టీ రామారావునే మించిపోయారు
నటనలో మహానటుడు ఎన్టీ రామారావునే చంద్రబాబు మించిపోయారని వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటే రాష్ట్ర ప్రజలు ఎలా తలెత్తుకుని తిరగాలని ఆయన ప్రశ్నించారు. మంగళవారం ఆయన లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఓటుకు నోటు అంశంపై విలేకరులతో మాట్లాడారు. తన ఫోన్ ట్యాప్ అయిందని మంగళగిరి సభ సాక్షిగా ఆయనే స్వయంగా చెప్పారని గుర్తుచేస్తూ.. ఆ గొంతు మీది కాదని ఎక్కడా చెప్పడం లేదు కదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని మీరెక్కడా ఖండించడంలేదు కదా.. దీన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. అవినీతి కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రయినా, సామాన్యుడైనా ఒకటేనని.. ముఖ్యమంత్రులకు ప్రత్యేక రక్షణ అంటూ ఏమీ ఉండబోదని, అవసరమైతే ఎవరి ఫోన్లనైనా ట్యాప్ చేస్తారని ఆయన చెప్పారు. అవినీతి చేయడానికి రాజ్యాంగం ఏ ముఖ్యమంత్రికీ అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఒక మంత్రిని తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారని అరెస్టు చేయించారని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. రెండు పార్టీల మధ్య వైరాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిచ్చుపెట్టే హక్కు నీకెవరిచ్చారని నిలదీశారు. అసలు ప్రజలకు మీరేం చెప్పదలచుకున్నారని, నీతి, నియమం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడమేంటని ఆయన అన్నారు. మీ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో ఏ ఒక్క హామీనైనా సంతృప్తికరంగా చేశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏవైనా రెండు దేశాలు కాదని, ఫెడరల్ వ్యవస్థలో మనమంతా చట్టానికి లోబడి ఉండాలని హితవు పలికారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రతి జిల్లాలో ఆందోళనలు చేస్తుంటే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని, అక్కడకు వచ్చి ప్రజలు నిన్ను ఎలా ఛీకొడుతున్నారో వెళ్లి చూసుకోవాలని చెప్పారు. నీ వ్యక్తిత్వం ఏంటో ప్రజలు చెప్పాలి తప్ప, నీ అంతట నువ్వు చెప్పుకొంటే కుదరదని బొత్స సత్యనారాయణ తెలిపారు. -
ఫోన్ ట్యాప్ అవుతున్నా మీకు తెలియలేదా?
-
ఫోన్ ట్యాప్ అవుతున్నా మీకు తెలియలేదా?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశానికి డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్ చీఫ్ అనూరాధ తదితరులు కూడా హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ఓటుకు నోటు వ్యవహారం మీదే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ అవుతున్నా కూడా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు దాన్ని గుర్తించడంలో విఫలం అయ్యారంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని,అందులో తన అనుంగు అనుయాయులను నియమించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అలాగే.. తన ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని, ఇది చట్టరీత్యా చెల్లదని కేబినెట్లో తీర్మానం చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మంగళవారం సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ఆయన బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో భేటీ అయ్యే అవకాశం ఉంది. గవర్నర్ నరసింహన్ బుధవారం బయల్దేరి ఢిల్లీ వెళ్తుండటంతో, ముందే వెళ్లాలని.. గవర్నర్ అధికారాలపై కేంద్రంతో చర్చించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఇంతకీ ఆ గొంతు బాబుదా.. కాదా?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) తన పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన 'మహాసంకల్ప' సభలో చంద్రబాబు ప్రసంగం ఆసాంతం విన్న తర్వాత సామాన్యులకు అనేకానేక సందేహాలు తలెత్తుతున్నాయి. ''ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం నీచాతి నీచం. ఫోన్లు ట్యాప్ చేస్తే ప్రభుత్వాలే పడిపోయాయి. ఈరోజు నేను ఒక వ్యక్తిని కాను.. ఏపీ ముఖ్యమంత్రిని. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్ కి ఎవరిచ్చారని అడుగుతున్నాను'' అని ఆయన అన్నారు. అంటే, తన ఫోన్ ట్యాప్ అయ్యిందని ఆయన అంగీకరించినట్లే అవుతుంది కదా. ఆడియో టేపుల్లో ఉన్న సంభాషణలలో గొంతు తనదేనని ఆయన చెప్పక చెప్పినట్లే కదా. ఇక మరొక్క సెకను దాటగానే.. ''నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించారు. అవి టీ-ఛానల్లో ప్రసారం చేశారు. ఇది నీ జాగీరా.. కాదు. నామీద కుట్ర చేస్తున్నారు'' అన్నారు. అంటే, తన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, అది తన గొంతు కాదని చంద్రబాబు చెప్పినట్లవుతుంది. ఇలా రెండు విభిన్న రకాల ప్రకటనలను వెంటవెంటనే చేసేయడం ఒక్క చంద్రబాబు నాయుడికే చెల్లు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి వాస్తవం అయినా.. రెండోది కచ్చితంగా అవాస్తవమే అవుతుంది. రాష్ట్రాల మధ్య చిచ్చు ఓటుకు నోటు వ్యవహారంలో తన మనిషి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వైనాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు.. ఈ వ్యవహారాన్ని రాజకీయ అవినీతి అన్నట్లు కాకుండా, అదేదో రెండు రాష్ట్రాల మధ్య వివాదం అన్న కలరిచ్చారు. ఈ విషయంలో ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ఏం చెప్పారో.. సరిగ్గా అవే మాటలను మరికొంత రంగులద్ది చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌లో మీకు పోలీసులుంటే మాకూ ఉన్నారు, మీకు ఏసీబీ ఉంటే మాకూ ఉందంటూ.. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను రేకెత్తించేలా మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రుల ఇళ్లను కూల్చేస్తున్నారని, ప్రతిరోజూ ఆంధ్రావాళ్లను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. వాస్తవానికి కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత ఈ ఏడాది కాలంలో అలా జరిగిన దాఖలాలు లేవు. చంద్రబాబు మాత్రం.. తన ఫోన్ ట్యాప్ చేయడం ఐదు కోట్ల మంది ఆంధ్రప్రజలకు అవమానమంటూ దీన్ని తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గొడవగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఖబడ్దార్ అంటూ హెచ్చరించి, అక్కడ ఉన్నవాళ్లను రెచ్చగొట్టేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. మధ్యలో 'ఏయ్.. మైకు సౌండు పెంచు' అంటూ, తన గొంతును మరింత పెంచారు. ఈ విషయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పిన విషయాలను ఒక్కసారి తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిందే. ''చంద్రబాబు అత్యంత నీతిబాహ్యమైన, అత్యంత జుగుప్సాపరమైన రాజకీయాలకు తెరతీస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసింది తప్పని గానీ, ఒప్పని గానీ ఆయన ఎందుకు చెప్పలేదు? తెలంగాణ ప్రభుత్వం నీ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆధారాలుంటే బయటపెట్టు, అంతేతప్ప శిఖండి రాజకీయాలు చేయకు. దొంగపనులు చేయడానికి ముఖ్యమంత్రి పదవి లైసెన్సు కాదు. దొంగపనులు చేస్తే మంత్రులనైనా, ముఖ్యమంత్రులనైనా శిక్షించే అధికారం చట్టానికి ఉంటుంది'' అని కేటీఆర్ అన్నారు. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకైనా చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పినట్లు ఎవరికైనా అనిపిస్తే.. వాళ్లకు హ్యాట్సాఫ్!! -
ఆ డబ్బులు ఎవరిచ్చారు?
అది ఎవరి ఖాతాలోని సొమ్ము?..‘బాస్’ సంగతేంటి? ♦ రేవంత్‌ను ప్రశ్నించిన ఏసీబీ ఆధారాలకు బలం చేకూర్చే వివరాల సేకరణ ♦ ఓటుకు నోటు కేసులో నేడు ముగియనున్న కస్టడీ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఏసీబీ ప్రయత్నించింది. ఈ కేసులో ఏసీబీ కస్టడీలో ఉన్న టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని ఆయన లాయర్ సమక్షంలో మూడోరోజు కూడా అధికారులు ప్రశ్నించారు. ఆ సొమ్మును ఏ ‘బాస్’ పంపితే వచ్చిందో రేవంత్ ద్వారానే తెలుసుకునేందుకు ప్రయత్నించారు. తమ వద్ద ఉన్న ఆధారాలకు బలం చేకూర్చేలా ఆయన నుంచి వాస్తవాలు రాబట్టే యత్నంలో విచారణాధికారులు సఫలమైనట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఏసీబీకి లభించిన ఆడియో, వీడియో ఫుటేజీల్లోని సంభాషణ ఆధారంగా సోమవారం రేవంత్‌ను ప్రశ్నించారు. నాలుగు రోజుల కస్టడీ మంగళవారం ముగుస్తోంది. సాయంత్రం 4 గంటల్లోపు నిందితులను కోర్టులో హాజరు పరచాల్సి ఉన్నందున వారి నుంచి వీలైనంత మేర వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు. ఏసీబీ స్వాధీనం చేసుకున్న రూ. 50 లక్షలతోపాటు టీడీపీ నేతలు డ్రా చేసినట్లుగా చె బుతున్న రూ. 2.50 కోట్లను ఎవరెవరికి ఇచ్చారనే దానిపైనా అధికారులు ఆరా తీశారు. స్టీఫెన్‌సన్‌తో ‘బాస్’ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడిన టేపులు వెల్లడైన విషయాన్ని రేవంత్‌కు వివరించారు. ముగ్గురు నిందితుల కాల్లిస్టులతోపాటు ఇతర అనుమానిత నేతల ఫోన్ల ఆధారంగా కూడా కుట్రలోని అన్ని కోణాలను ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. దర్యాప్తు సంస్థ అన్ని కోణాల్లో విచారణ సాగిస్తుందని, ఆ డబ్బు ఏ బ్యాంకు నుంచి, ఎవరి ఖాతా నుంచి డ్రా అయ్యాయో విచారణలో తేలిందని, నిజాలు వెల్లడిస్తే కేసు తీవ్రత తగ్గుతుందని రేవంత్‌తో అధికారులు అన్నట్లు తెలిసింది. కాల్‌లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నప్పుడు మళ్లీ తనను ప్రశ్నించాల్సిన అవసరమేంటని రేవంత్ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. తాను ఎమ్మెల్యేతో మాట్లాడేందుకే వెళ్లానని, ఇంకే వివరాలు తనకు తెలియవని మొండికేశారు. అయితే వెంటవెంటనే అడిగిన ప్రశ్నలనే అడుగుతున్న సమయంలో ఆయన నోరు జారినట్లు తెలిసింది. కాగా రేవంత్‌రెడ్డి విచారణను వీడియోలో రికార్డు చేస్తున్నారు. ఇక ఈ కేసులో ఇతర నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహ వెల్లడించిన విషయాల ఆధారంగా కూడా ప్రశ్నల పరంపర కొనసాగింది. ‘బాస్’పై స్పష్టత కోసం అధికారులు ప్రశ్నల పరంపర కొనసాగించినట్లు సమాచారం. బాస్ ఆడియో టేపులు కూడా వెల్లడైన విషయాన్ని వివరించి రేవంత్‌ను ఆందోళనలోకి నెట్టేలా ఏసీబీ మైండ్‌గేమ్ ఆడినట్లు తెలిసింది. ఇక ఆడియో టేపుల ఆధారంగా చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అంశాలపై ఏసీబీ డీజీ ఎ.కె.ఖాన్ సోమవారం అధికారులు, న్యాయ నిపుణులతో చర్చించారు. బుధవారం నిందితుల బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న దృష్ట్యా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన ఖరారు చేసే పనిలో ఉన్నారు. రేవంత్‌కు ఉస్మానియాలో వైద్య పరీక్షలు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహలకు సోమవారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీ క్షలు నిర్వహించారు. సిట్ కార్యాలయం నుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించే ముం దు వారిని అధికారులు ఉస్మానియాకు తీసుకెళ్లారు. రేవంత్‌కు రక్తపోటు ఎక్కువగా ఉందని, గొంతునొప్పితో బాధపడుతుండడంతో వైద్యం అందించామని, ఉదయ సింహకు రక్తపోటు ఎక్కువగా ఉందని, సెబాస్టియన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. రేవంత్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు రేవంత్‌రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఏసీబీ కస్టడీ ముగిసిన తర్వాత తనను చర్లపల్లి జైలుకు తరలించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కస్టడీ సమయంలో ఆయనను ఏసీబీ సిట్ అధికారుల అధీనంలోనే ఉంచుకోవచ్చని, అయితే అవసరమైన వైద్య చికిత్సలు అందివ్వాలని ఆదేశించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని రేవంత్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. ఉదయం కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించాలని దర్యాప్తు అధికారులకు జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాగా బెయిల్ పిటిషన్‌పై బుధవారం కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతించాలని ఏసీబీ తరఫున స్పెషల్ పీపీ వి.సురేందర్‌రావు నివేదించారు. ఇందుకు అనుమతించని కోర్టు.. 10న కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది. -
నేను చంద్రబాబులా దొంగను కాను: కేసీఆర్
చంద్రబాబును ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఏసీబీ ఉండొచ్చు గానీ, తాను మాత్రం ఆయనలా దొంగను కానని స్పష్టం చేశారు. హైదరాబాద్ నీ అబ్బ జాగీరా అంటూ మండిపడ్డారు. మంగళగిరిలో నిర్వహించిన మహా సంకల్ప సభలో చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు సీఎం కేసీఆర్ దీటుగా, అంతకు మించిన స్థాయిలో సమాధానమిచ్చారు. పట్టపగలు నగ్నంగా దొరికిపోయిన దొంగవు..ఇంకా నువ్వు మాట్లాడేదేంటని నిలదీశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ''పక్కరాష్ట్రం విడివి నువ్వు.. అలాంటిది మా ఎమ్మెల్యేలను కొంటే చూస్తూ ఊరుకోవాలా? చేతులకు గాజులు తొడిగించుకుని కూర్చోవాలా? అసలు ఎమ్మెల్సీని గెలిపించుకునే బలం లేదని తెలిసి కూడా పోటీ ఎందుకు పెట్టావు? నువ్వు లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తే, మా తెలంగాణ బిడ్డ స్టీఫెన్సన్ విషయం ఏసీబీకి చెప్పి మిమ్మల్ని పట్టించాడు. అయినా రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్లు.. సొంత రాష్ట్రం వచ్చినా ఈయన బాధ మాకు తప్పడం లేదు. హైదరాబాద్‌కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి.. తెలంగాణ బిడ్డ. నగ్నంగా పట్టపగలు దొరికిపోయావ్.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బాగోతం బయటపడింది. సత్య హరిశ్చంద్రుడి ఇంటి వెనుక నీ ఇల్లు ఉందిగా.. నువ్వెందుకు చేసినవీ పని? అరువులతో ఏం చేయలేవు.. ఈ గడ్డపై నీ కిరికిరి చెల్లదు. తెలంగాణలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోడానికి మాకు రోజుకు 24 గంటలు సరిపోవడంలేదు. రోజుకు 18-20 గంటలు పనిచేయాల్సి వస్తోంది. అలాంటిది ఈయన గురించి పట్టిచుకోవాల్సిన ఖర్మ మాకేంది? ఇక్కడ కూడా అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నాడు. ఏసీబీకి పట్టుబడితే, ఇరికిస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. ఇరికిస్తే ఇరికిపోతాడా.. చంద్రబాబు?'' -
నేనేమైనా ఈ కేసీఆర్‌కు సర్వెంటునా: చంద్రబాబు
-
నేనేమైనా ఈ కేసీఆర్‌కు సర్వెంటునా: చంద్రబాబు
ఉమ్మడి రాజధానిలో తన ఫోన్లు ట్యాప్ చేసే అధికారం కేసీఆర్‌కు ఎక్కడిదని, తానేమైనా కేసీఆర్‌కు సర్వెంటునా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన 'మహాసంకల్ప సభ'లో ఆయన మాట్లాడారు. తాను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు పెట్టారని, దాన్ని టీ ఛానల్లో ప్రసారం చేశారని అన్నారు. ''మన ఫోన్లు ట్యాప్ చేస్తే ఎంత కడుపు మండిపోతుంది.. చెప్పండి'' అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్రాల మధ్య తగాదా వద్దు. టీఆర్ఎస్ ప్రభుత్వం దయచేసి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించారు. ఇది నీ జాగీరా.. కాదు. నామీద కుట్ర చేస్తున్నారు. నీతి, నిజాయితీగా బతికాను. ప్రజా సేవ కోసం బతికాను. కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నామీద కుట్ర పన్నుతున్నాడు. అవునా కాదా తమ్ముళ్లూ అని అడుగుతున్నా. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కుందో, నాకూ అంతే హక్కుంది. ఖబడ్దార్, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐదో అభ్యర్థిని కూడా టీఆర్ఎస్ నిలబెట్టిందంటే అది నీతిమాలిన చర్య కాదా అని అడుగుతున్నాను. ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం నీచాతి నీచం. ఫోన్లు ట్యాప్ చేస్తే ప్రభుత్వాలే పడిపోయాయి. ఈరోజు నేను ఒక వ్యక్తిని కాను.. ఏపీ ముఖ్యమంత్రిని. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్ కి ఎవరిచ్చారని అడుగుతున్నాను. నేనేమైనా ఈ కేసీఆర్‌కి సర్వెంట్నా అని అడుగుతున్నా. మీరు మామీద ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో నన్ను బెదిరించాలంటే మీ తరం కాదు. మీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నా ఏసీబీ కూడా హైదరాబాద్ లోనే ఉంది. మీకు పోలీసులున్నారు, మాకు కూడా పో్లీసులు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మా ఎమ్మెల్యేని ఎన్నికలకు ముందు మీ ఫాం హౌస్ కు తీసుకెళ్లి, సిగ్గులేకుండా పోలీసు ప్రొటెక్షన్‌తో పంపినప్పుడు మీకు సిగ్గులేదా శ్రీనివాసయాదవ్ అనే ఎమ్మెల్యేకి మంత్రిపదవి ఇచ్చినప్పుడు యాంటీ డీఫెక్షన్ మీకు గుర్తులేదా? 22 మంది ఎమ్మెల్యేలు నాకున్నారు. ఎమ్మెల్సీ నాకో లెక్క కాదు. నాకు ఎమ్మెల్సీ ముఖ్యం కాదు.. నీతి ముఖ్యం, సిద్దాంతం ముఖ్యం. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లను తిడుతూ ప్రతిరోజూ ఇష్టం వచ్చినట్లు ఆంధ్రావాళ్ల ఇళ్లు కూల్చేయడానికి వెళ్తున్నారు. మా ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు సెక్షన్ 8 ఉంటే, గవర్నర్‌కు అధికారం ఉంటే మామీద పెత్తనం చేయడానికి మీరెవరని అడుగుతున్నా పదేళ్లు ఉమ్మడి రాజధానిలో మనం గౌరవంగా బతికే అధికారం ఉందా లేదా అని అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని, గౌరవం లేని మాటలంటారా, అగౌరవ పరుస్తారా? నన్ను కాదు మీరు అగౌరవ పరిచేది.. ఐదుకోట్ల ప్రజలను. మా ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మీకు బుద్ధి లేదా? సమయం వచ్చినప్పుడు ఒక్కో అస్త్రం వదులుతా. టీఆర్ఎస్ పార్టీ పెత్తనంపై నేను ఆధారపడలేదు, వీళ్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదు. -
ఏడాదిలో ఎన్నెన్ని బాగోతాలో!
ఓటుకు నోటు వ్యవహారంలో బయటపడ్డ ఆడియో సంభాషణలు వింటే అసలు సూత్రధారి చంద్రబాబనే విషయం రూఢీ అవుతోంది. ఇంత భారీ డబ్బు ఓట్లు కొనుగోలు చేసేందుకు వాడుతున్నారంటే అదంతా ఎక్కడి నుంచి వస్తోందనే అనుమానం ప్రతీ ఒక్కరిలో కలుగుతోంది. ఏపీలో అక్రమంగా సంపాదించిన సొమ్మును తెలంగాణలో ఓట్లు కొనేందుకు వినియోగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏడాది చంద్రబాబు పాలనలో సాగిన అవినీతి బాగోతాలు దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. చంద్రబాబు అవినీతికి పరాకాష్ఠ - జీ.ఓ.నెంబర్ 1. దీన్ని 2015 జనవరి ఒకటిన జారీ చేశారు. గోదావరి జలాల తరలింపునకు సంబంధించిన జీఓ ఇది. ఎన్నికలకు ముందు పట్టిసీమ ఎత్తిపోతల అనే పదం చంద్రబాబు మదిలో లేదు. పార్టీ మ్యానిఫెస్టోలోనూ దాని ప్రస్తావన కనిపించదు. మరి హఠాత్తుగా ఈ జీఓ ఎందుకు విడుదల చేశారు? పట్టిసీమ దగ్గర ఎత్తిపోతల పథకం కట్టాలని గోదావరి జిల్లాలకు చెందిన ఏ రైతూ ఏనాడూ అడిగిన పాపాన పోలేదు. పట్టిసీమకు రాయలసీమకు లింకు ఎలా కుదిరింది? కాంట్రాక్టర్ల నుంచి భారీగా లంచాలు తీసుకోడానికి జీ.ఓ.నెంబర్ ఒకటి జారీ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రమే పూర్తి చేయాలి. మరీ పట్టిసీమ ప్రాజెక్టుపై ఎందుకు హడావుడి చేస్తున్నట్టు? పట్టిసీమ ఎత్తిపోతల పథకం టెండర్ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా 21.9 శాతం ఎక్సెస్‌కు అనుమతి ఇవ్వడం, గడువులోపు పూర్తి చేస్తే కాంట్రాక్టర్‌కు అదనంగా 16.9 శాతం చెల్లిస్తామని చెప్పడం దేనికి సంకేతం? ఇందులో వందల కోట్ల రూపాయలు దోచుకున్నది వాస్తవం కాదా? ఇక చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి నిలువెత్తు సాక్ష్యం జీ.ఓ. నెంబర్ 22. జలయజ్ఞం ప్రాజెక్టులకు విడుదల చేస్తున్న నిధులన్నీ దోపిడీ అని, జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందన్న చంద్రబాబు మరీ తాను సీఎం అయిన తర్వాత ఆ ప్రాజెక్టులకయ్యే ఖర్చును తగ్గించారా? పెంచారా? జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తోంది చంద్రబాబేనని చెప్పేందుకు జీఓ నెంబర్ 22 చాలు. కాంట్రాక్టర్లు అడగకుండానే వరాలిచ్చేశారు. 2013 నుంచి ఇనుము, సిమెంట్ ధరల్లో పెరుగుదల తీసుకోండని కాంట్రాక్టర్లపై అపార కరుణ చూపారు చంద్రబాబు. ఈ ఆలోచన చేసింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. అప్పట్లో టీడీపీ ఇది భారీ కుంభకోణమని దోచిపెడుతున్నారని గగ్గోలు పెట్టింది. మరి అధికారంలోకి వచ్చాక ఆగమేఘాలపై ఎందుకు ఈ జీ.ఓ. విడుదల చేసినట్టు? ఇంత భారీ కుంభకోణానికి సంబంధించిన ప్రణాళిక రచన చాలా వేగంగా సాగింది. డిసెంబర్ 31, 2014న నీటిపారుదల శాఖ ఫైల్ పుటప్ చేస్తే జనవరి 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దానిపై సంతకం చేశారు. జనవరి రెండున జరిగిన కేబినెట్ సమావేశంలో ఇది అజెండా అయిపోయింది. అదేరోజు చంద్రబాబు దానిపై సంతకం పెట్టేశారు. ఆరోజే మధ్యాహ్నం కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి కోటయ్య కమిటీలు, సవాలక్ష మెలికలు, మరీ కాంట్రాక్టర్లు అడగక ముందే ఇవ్వడానికి ఆగమేఘాలపై సంతకాలు. కోట్ల రూపాయలు దండుకోడానికి కాదా ఈ జీ.ఓ. నెంబర్ 22? శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు పనుల అంచనాలు ఈ జీ.ఓ కారణంగా ఏకంగా 300 కోట్ల రూపాయలు పెరిగాయి. ఇలా ఎన్ని ప్రాజెక్టులో. మరీ వీటిలో బాబు గారి వాటా ఎంతో? ఇక చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో కానుకలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లోని పేద ప్రజలకు కాదు. సంక్రాంతి పండగకు కానుకంటూ ఊరువాడా చంద్రబాబు ప్రభుత్వం ఊదరగొట్టింది. చంద్రన్న కానుకకు ప్రభుత్వం కేటాయించిన మొత్తం 314 కోట్ల రూపాయలు. పథకంలో తన పేరు మాత్రమే కాదు, పథకం వల్ల లాభం కూడా తనకే కలిగేలా చంద్రన్న కానుకను డిజైన్ చేశారు. అరకిలో కందిపప్పు, అర కిలో బెల్లం, అరలీటరు పామోలిన్, కిలో శనగలు, 100 గ్రాముల నెయ్యి, కేజీ గోధుమ పిండి ఇస్తామని గొప్పగా ప్రచారం చేసిన ప్రజలకు మాత్రం అరకొరగా అందజేశారు. తెలుగు తమ్ముళ్లకు అధిక రేట్లకు కాంట్రాక్టులిచ్చి భారీ కుంభకోణానికి తెరదీశారు. చంద్రన్న కానుల వల్ల ప్రభుత్వ ఖజానాకు 27 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని చంద్రబాబు భజన చేసే పత్రికే రాసింది. మార్కెట్లో కిలో కందిపప్పు ధర 69 రూపాయలుంటే 79 రూపాయల 60 పైసలకు కోట్ చేసి దక్కించుకున్నారు. ఇక బహిరంగ మార్కెట్లో కిలో నెయ్యి 320 నుంచి 375 వరకూ ఉంటే, చంద్రన్న కానుక కోసం దాదాపు 200 రూపాయలు ఎక్కువ చెల్లించి కొనుగోలు చేశారు. కొన్నది ఎక్కడి నుంచో అందరికీ తెలిసిందే. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌కు చెందిన హెరిటేజ్ డెయిరీ నుంచే. హెరిటేజ్ డెయిరీ నుంచి వ్యాట్‌తో కలిపి కేజీకి 575 రూపాయలు చెల్లించి మరీ నెయ్యి కొన్నారు. ఒక్క హెరిటేజ్‌కే అప్పనంగా కోటీ 5 లక్షల రూపాయలు అప్పగించారు. సంక్రాంతి సరుకులు జనాలకు ఏ మాత్రం సంతోషం కలిగించకపోయినా, టీడీపీ మంత్రులు, నాయకులకు మాత్రం సరిపడ మేత దొరికింది. హెరిటేజ్ పంట పండింది. ల్యాండ్ పూలింగ్ - మరో అవినీతి బాగోతం. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో భూమి సేకరిస్తున్నామని చెప్పి రైతు నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో సింగపూర్‌కు భూములు కట్టబెడుతూ బాబు గారు రొక్కం వెనకేసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని భూసేకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రైతులపై బలవంతంగా ప్రయోగిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ వివాదాస్పదమై, ఆమోదం లభించక త్రిశంకు స్వర్గంలో ఉంటే దాన్ని ప్రయోగించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపుల వల్ల ల్యాండ్ పూలింగ్‌కు అనుమతించిన రైతులంతా ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు. రాజధాని పేరుతో లక్ష కోట్ల విలువైన భూదోపిడీకి రంగం సిద్ధమైంది. రాజధాని కోసం తీసుకుంటున్న 40 వేల ఎకరాల్లో వాటి యజమానులైన రైతులకు దక్కేది పావు వంతు కంటే తక్కువే. ప్రభుత్వం చేజిక్కుంచుకునే భూమి 22,500 ఎకరాలు. సమగ్రంగా అభివృద్ధి చేసే 10 వేల ఎకరాల భూమంటే మొత్తంగా 4.84 కోట్ల గజాల భూమిని ప్రభుత్వం పైసా పెట్టుబడి లేకుండా అమాయక రైతుల నుంచి కబ్జా చేయబోతోంది. కనిష్టంగా గజానికి 25 వేలు చొప్పున లెక్కించినా ఆ భూమి విలువ లక్ష కోట్ల రూపాయలు దాటుతుంది. చేస్తామన్న రుణమాఫీ చేయకుండా రకరకాల మెలికలు పెడుతున్న చంద్రబాబు - పారిశ్రామికవేత్తలపై మాత్రం అడగకుండానే వరాల జల్లు కురిపించారు. మహిళా సంఘాలకు డ్వాక్రా బకాయిలు మాఫీ చేసేందుకు డబ్బుల్లేవంటున్న బాబుగారు పారిశ్రామికవేత్తలకు మాత్రం వారు అడగకుండానే రాయితీలు అందిస్తున్నారు. అది కూడా రూ. 2వేల కోట్లు. అంగన్వాడీల జీతాలు పెంచడానికి డబ్బుల్లేవు, వ్యవసాయ రుణాల మాఫీకి డబ్బుల్లేవు, మరీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వడానికి మాత్రం నోట్లు జలజలా రాలాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సింపుల్ లాజిక్. పారిశ్రామికవేత్తలకు రాయితీలు విడుదల చేస్తే 30 శాతం కమీషన్లు నేరుగా చినబాబుకు దక్కేలా డీల్ కుదిరందని జోరుగా ప్రచారం సాగుతోంది. పారిశ్రామికవేత్తలకు అందాల్సిన రాయితీ సొమ్ములో 30 శాతమంటే అక్షరాలా 700 కోట్ల రూపాయలు. ఈ డీల్ కుదిరిన తర్వాతే పరిశ్రమల శాఖ 100, 399, 225 జీఓలు జారీ చేసిందనే ప్రచారం సాగుతోంది. మరీ ఇంత రాయితీ ఇచ్చాక ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఏమైనా పరిశ్రమలు వచ్చాయా అంటే అదేమీ లేదు. నాలుగేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న రాయితీలను చంద్రబాబు గారు ఉదారంగా విడుదల చేశారు. ఖజానాలో డబ్బు లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లి మరీ ఈ కోట్ల రూపాయల రాయితీలు చెల్లించారు. బెరైటీస్ లీజు వ్యవహారమంతా గలీజే. పాత బెరైటీస్ లీజులు రద్దుచేసిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేట్‌పరం చేయడానికి, అయినవారికి కట్టబెట్టేందుకు వ్యూహం రచించింది. జీఓ నెంబర్ 163 చంద్రబాబు లొసుగులకు నిదర్శనం. రాష్ట్ర ఖనిజావృద్ధి సంస్థ ఆదాయానికి గండికొడుతూ మైనింగ్ లీజులు కేటాయించారు. అంతర్జాతీయ మార్కెట్ రేటులో 70 నుంచి 75 శాతానికి కేటాయింపులు జరగాలన్నది నిబంధన. ఈ మేరకు తొలుత టెండర్లు పిలిచారు. సీఎం సొంత మనుషులు ఎంటరై టెండర్లు ఖరారు కాకుండా రింగయ్యారు. అంతే నిబంధన మారిపోయింది. పెద్దలకు చేరాల్సింది చేరిపోయింది. 70 నుంచి 75 శాతంగా ఉండాల్సిన బేసిక్ రేటు 65 నుంచి 70 కి తగ్గిపోయింది. దీనివల్ల ఏపీఎండీసీకి అధికారికంగా రూ. 28 కోట్ల నష్టం వాటిల్లింది. మరీ ఏ సంస్థలకు కోట్లు కట్టబెట్టడానికి ఈ నిబంధనలు సడలించారో ఏలినవారికే తెలియాలి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మినీ పవర్ ప్లాంట్ల పేరుతో చంద్రబాబు చేసిన ఘనకార్యాలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు 2300 కోట్ల రూపాయల లబ్ది చేకూర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం పావులు కదిపింది. వారికి లబ్ధి చేకూర్చితే రాష్ట్ర ప్రజలకూ ఎలాంటి మేలు జరగదు. కానీ చంద్రబాబుకు మాత్రం కావాల్సినంత, రావాల్సినంత ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి విద్యుత్ అందుతుంది కాబ్టటి కరెంట్ కొరత లేదు. ప్రస్తుతం గ్యాస్ ఆధారిత ప్లాంట్ల ద్వారా 1.2 మిలియన్ యూనిట్లకు అదనంగా మరో 1.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించడం, తద్వారా గ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వ్యాట్‌ను వదులుకొని ఆ సంస్థల జేబు నింపడం ఈ పథకంలో భాగం. ప్రజాధనాన్ని నష్టపరిచి ఆ కంపెనీలకు వ్యాట్ రాయితీలు ఇస్తే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఖజానాకు వాటిల్లే నష్టం 2300 కోట్లు. డబ్బుల్లేవని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రజలపై పన్నులు, ఛార్జీలు బాదుతున్న చంద్రబాబు మరో వైపు కార్పొరేట్ కంపెనీలకు జనం సొమ్మును ధారాళంగా ధారపోస్తున్నారు. ఇక బాబుగారి దుబారా ఖర్చులకు లెక్కే లేదు. చెట్ల కిందా ఉంటా, మీ దగ్గరే ఉంటా, షెడ్లు వేసి సెక్రటేరియట్ నడిపిస్తానన్న చంద్రబాబు ఎప్పుడూ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు విలాసవంతమైన భవనాలకు, విమాన ప్రయాణాలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరించారు. విజయవాడ క్యాంప్ ఆఫీస్ కోసం ఇప్పటి వరకూ విడుదల చేసిన మొత్తం 16 కోట్లు. ఇక హైదరాబాద్‌లో సెక్రటేరియట్లో ఆయన కార్యాలయంలో హంగు, ఆర్భాటాలకు చేసిన ఖర్చు 25 కోట్లు. అలాగే సీఎం క్యాంప్ ఆఫీసు లేక్ వ్యూ మరమ్మతులకు ఐదు కోట్లు ఖర్చుచేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో సీఎం కొత్త ఇల్లు, ఆఫీసు అద్దె లక్షల్లోనే ఉంది. ఇక ఢిల్లీ ఏపీ భవన్లో సీఎం కాటేజ్ రిపేర్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఢిల్లీలో చంద్రబాబు ఉండేది నెలకు మహా అయితే ఒకటి లేదా రెండు రోజులు. దానికే ఇంత ఖర్చుపెట్టడం, అదికూడా రాష్ట్రం కష్టాల్లో ఉందంటూ.. ఎంతవరకు భావ్యమో! -
సిట్ కార్యాలయంలోనే ఉంచండి: కోర్టు
ఓటుకు నోటు స్కాంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సోమవారం రాత్రి కూడా సిట్ కార్యాలయంలోనే ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. సిట్ కార్యాలయంలో సరైన సౌకర్యాలు లేనందున ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలంటూ రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు చేసిన అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. అలాగే.. రేవంత్‌కు తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని కూడా కోర్టు ఆదేశించింది. రేవంత్ రెడ్డికి సిట్ కార్యాలయంలో తాము మంచి సదుపాయాలే కల్పిస్తున్నామని అంతకుముందు సిట్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా చెప్పిన విషయం తెలిసిందే. ఆయనకు కొత్త బెడ్ షీట్లు, బెడ్లు ఏర్పాటుచేశామని, మినరల్ వాటర్ అందిస్తున్నామని కూడా ఆమె చెప్పారు. -
ఆయనకు కొత్త బెడ్షీట్లు.. బెడ్లు ఏర్పాటుచేశాం
సిట్ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సరైన వసతులు కల్పించలేదని ఆయన తరఫు న్యాయవాదులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని సిట్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా చెప్పారు. సిట్ కార్యాలయంలో రేవంత్ రెడ్డికి భోజనం, మినరల్ వాటర్, పరిశుభ్రంగా పడుకునే వసతులు కల్పించినట్లు ఆమె చెప్పారు. ఆయనకు కొత్త బెడ్ షీట్లు, బెడ్లు ఏర్పాటు చేశామని, అన్ని సదుపాయాలు ఆయనకు ఉన్నాయని ఆమె వివరించారు. -
ఓటుకు నోటు ఆపరేషన్ సాగిన తీరిదీ..
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మధ్య జరిగిన వ్యవహారం మొత్తం ఎలా సాగింది.. ఈ అపరేషన్‌లో స్టీఫెన్‌ను రేవంత్ ఎప్పుడు ఎలా కలిశారు... చంద్రబాబుతో ఎప్పుడు మాట్లాడించారు.. ఈ తతంగం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం... రేవంత్ తనను బాసే ఆథరైజ్ చేసి పంపించాడంటూ స్టీఫెన్‌తో చెప్పారు. అంతేకాక తనకు ఇచ్చిన అప్పర్ లిమిట్ ఇచ్చింది 'రెండున్నర' అని చెప్పారు. దాంతో తాము ముగ్గురిని కలిసి మూడు ఇచ్చామన్నారు. ఈ విషయం తమకు కూడా తెలియాల్సిన పని లేదని, మీరే డైరెక్ట్‌గా సార్‌తో మాట్లాడుకోవచ్చని చెప్పారు. దానికీ స్టీఫెన్.. సార్ ఎప్పుడు కలుస్తారని అడగడంతో.. రేవంత్ 'ఇప్పుడే ఫోన్లో మాట్లాడిస్తా' అని చెప్పారు. ఇక్కడ ఏదైనా సమస్య అనుకుంటే.. మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడే ఇస్తాము.. ఇదే విషయాన్ని సార్‌తో చెబుతానన్నాడు. ఇంతలో చంద్రబాబు తరపు మనిషి ఫోన్లో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడారు. 'హలో బ్రదర్ బాబుగారు మీతో మాట్లాడుతారు.. లైన్లో ఉండండి' అన్నాడు. చంద్రబాబు ఫోన్లో స్టీఫెన్‌తో ఫోన్లో ఇలా మాట్లాడారు... హాలో..బ్రదర్.. మనవాళ్లు నాకంతా వివరించారు. మీకు అండగా నేను ఉంటా...! కంగారు పడాల్సిందేమీ లేదని హామీ ఇచ్చారు. అన్నింటికి మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తామన్నారు. మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి... ఎలాంటి సమస్య ఉండదు..అది మా హామీ... మనం కలిసి పనిచేద్దామని స్టీఫెన్‌కు చంద్రబాబు హామీ ఇచ్చారు. -
ఫోన్లో మాట్లాడించింది ఎవరు.. ఏసీబీ ఆరా
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కోట్లు వెదజల్లిన కేసులో మరికొన్ని కీలక అంశాలు బయట పడుతున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ను చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించింది ఎవరన్నదానిపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఆడియో టేపులలో వినిపించిన మొదటి గొంతును పోల్చేందుకు ఏసీబీ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. 'అవర్ బాబుగారు వాంట్స్ టు టాక్ టు యూ.. బీ ఆన్ ద లైన్' అని చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది. సెబాస్టియన్ ద్వారానే చంద్రబాబు మాట్లాడినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలోనే అనేక ఆపరేషన్లలో సెబాస్టియన్ మధ్యవర్తిత్వం వహించడంపై ఏసీబీ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. -
' ఫోన్లను ఎవరూ ట్యాపింగ్ చేయలేదు'
-
చీమా..చీమా .. ఎందుకు కుట్టావు?
(సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం) సరిగ్గా సంవత్సరం క్రితం ఢిల్లీ విమానాశ్రయంలో ఒక దృశ్యం ఆవిష్కృతమైంది. బియాస్ నదిలో విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థులు కొందరు కొట్టుకుపోయి దుర్మరణం పాలవ్వగా, బతికి బయటపడ్డ విద్యార్థులకు అండగా నిలిచింది తామంటే తామని... మేము ఏర్పాటు చేసిన విమానంలో హైదరాబాద్ తరలిస్తామంటే ... కాదు మేమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు టీవీ కెమెరాల సాక్షిగా తోసుకున్నారు, వాదులాడుకున్నారు. అప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి ఒకటి రెండు రోజులు కాలేదు. తీవ్రమైన షాక్‌లో ఉన్న విద్యార్థులు బిక్కమొహం వేయగా, రాష్ట్ర ప్రజానీకం ఆశ్చర్యపోయింది. సంవత్సరం తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాధం పూడ్చలేనంతగా పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయికి దిగజారిపోయాయి. గత సంవత్సరం రోజుల్లొ ఏ ఒక్క రోజు కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం కనిపించలేదు. కేసీఆర్, చంద్రబాబు పరస్పరం పలకరించుకోవడమే బ్యానర్ స్టోరీగా మారేంతగా సంబంధాలు దిగజారిపోయాయి. ఆస్తులు, అప్పులు విభజన దగ్గర మొదలైన విభేదాలు దాదాపు అన్ని విభాగాలకు పాకాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపకాలు, ఉన్నత విద్యామండలి విభజన, ఎమ్సెట్ లాంటి ప్రవేశ పరీక్షలు, నీటి వినియోగం, విద్యుత్తు కేటాయింపులు, పెట్టుబడుల ఆకర్షణ ఇలా ప్రతీ రంగంలో, ప్రతీ అంశంలో మాటల తూటాలు పేలాయి. గవర్నర్ దగర్గ పంచాయితీ సర్వసాధారణమైపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేంద్రం హోంశాఖ దగ్గర కూడా పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు నోట్ల కట్టలకు ఓటు వ్యవహారంతో పూర్తిగా దిగజారిపోయాయి. రేవంత్ రెడ్డి వ్యవహారం చంద్రబాబుకు ప్రాణ సంకటంగా పరిణమించింది. తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కదులుతోంది. చంద్రబాబు ఆడియో టేపుల వ్యవహారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. చంద్రబాబు మౌనాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తుంటే.. 'కుట్ర' అనే గొంతుకలు వినబడుతున్నాయి. మా ముఖ్యమంత్రికి నోటీసులిచ్చే దమ్ము ధైర్యం ఉందా అని రెచ్చగొడుతున్న వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా ఉన్నాయి. మీరు టేపులు విడుదల చేస్తే, మేము కేసులు పెడతామని ఆంధ్రప్రదేశ్‌లో చాలా పోలీస్ స్టేషన్లలో కేసీఆర్‌పై కుట్ర కేసులు నమోదు చేస్తున్నారు. ఈవారం, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పడుతున్నారు. చంద్రబాబు రేపు విమానం ఎక్కుతుంటే.. ఆ తర్వాత రెండు రోజులకు కేసీఆర్ కూడా ఢిల్లీ గడప తొక్కుతున్నారు. 'నిప్పులాంటి వాడిని...' 'ఎవరికీ భయపడను..' 'బుల్లెట్లా దూసుకుపోతాను' 'నీతికీ, నిజాయితీకి ఆంధ్ర అన్నా హజారేను' అని డాంబికాలు పోయే చంద్రబాబు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. పోగా ప్రజలను తన మందీ మార్బలంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా వ్యక్తిగత నైతికతకు సంబంధించిన అంశాలను ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ సామాన్య ప్రజానీకం సమస్యగా మరల్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో ఇరు రాష్ట్రాల ప్రజల ప్రమేయం ఏమిటో అర్థం కాదు చంద్రబాబు రాజకీయ ప్రయోజనం తప్ప. ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రజలు తిరగబడుతున్న సూచనలు కనపడుతూనే ఉన్నాయి. అసలు నిజం ఏమిటి? రేవంత్ వీడియోలు అబద్ధమా? నోట్ల కట్టలు అంతా ఉత్తివేనా? హలో బ్రదర్ అని వినబడిన గొంతు ఎవరిది? ఇందులోకి రెండు రాష్ట్రాల ప్రజలను ఎందుకు లాగుతున్నారు? లాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో కోకొల్లలు. ఆ ప్రశ్నల వాడి వేడీ కూడా పెరుగుతోంది. అసలు కేసీఆర్ ఎందుకు కుట్టాడు. ''చీమా చీమా ఎందుకు కుట్టావు? .. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?'' ఇపుడు జరుగుతోంది కూడా అదే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి గాలం వేస్తే చేప దొరకలేదు కానీ.. కొక్కెం ఊడిపోయే పరిస్థితి వచ్చింది. నా కొక్కెం ఊడిపోయింది అందుకు చేపల యజమాని కుట్రపన్నాడు.. ఇది నా ప్రజలను అవమానించడమే అంటూ గగ్గోలు. అసలు గాలం ఎందుకు వేయాలనుకున్నావు. పుట్టలో వేలు ఎందుకు పెట్టాలనుకుంటున్నావు. మమ్మల్ని ఈ బురదలోకి ఎందుకు లాగుతున్నావనే ప్రశ్నలకు జవాబులు రావు. ప్రజలనే కాదు.. ఇతర పార్టీలకు కూడా మసిపూసి ఇదుగో కుమ్మక్కు అని చూపించాలనే తాపత్రయం. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ వ్యవహారంతో సంబంధం ఏమిటి? స్టీవెన్ సన్తో మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో నాకు సబంధం లేదు. ఏ విచారణకైనా సిద్ధం అని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు. నిన్నటివరకు సీబీఐ విచారణ కావాలి అని ఎలుగెత్తిన గొంతులు .. ఆడియో టేపులు బయటకురాగానే ఆ మాటే ఎత్తడం లేదు... ఎందుకనో? -
'చంద్రబాబు ఫోన్లను ఎవరూ ట్యాపింగ్ చేయలేదు'
చంద్రబాబు నాయుడు ఫోన్లను ఎవరూ ట్యాపింగ్ చేయలేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. చంద్రబాబు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసిన వ్యవహారంపై ఏసీబీ విచారణ చేస్తోందని ఆయన అన్నారు. ఇప్పటివరకు బయటపడినవి సెబాస్టియన్ ఫోన్ రికార్డులనే ఏసీబీ చెబుతోందని కేటీఆర్ చెప్పారు. -
'చినబాబు, పెదబాబు.. ఎవరున్నా అంతే'
-
'చినబాబు, పెదబాబు.. ఎవరున్నా అంతే'
'ఓటుకు నోటు' వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాత్ర విషయంలో తాము చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు గానీ, చినబాబు, పెదబాబు గానీ ఎవరున్నా కూడా విచారణలో అన్నీ తేలుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇక తాము ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదని నాయిని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మభూమి సభలలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం తనను బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపించిన విషయం తెలిసిందే. -
రేవంత్ రెడ్డికి 4 రోజుల ఏసీబీ కస్టడీ
-
రేవంత్ రెడ్డికి 4 రోజుల ఏసీబీ కస్టడీ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి నాలుగు రోజుల పాటు ఏసీబీ కస్టడీ విధించారు. శుక్రవారం సాయంత్రం ఏసీబీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని విచారించనున్నారు. రేవంత్ రెడ్డిని నాలుగు రోజులూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కస్టడీలోకి తీసుకుంటారు. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలను కస్టడీకి అప్పగించారు. అడ్వకేట్ సమక్షంలో వీరిని విచారించాలని కోర్టు ఆదేశించింది. కస్టడి ముగిశాక నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని ఆదేశించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌కు ముడుపులు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. -
'బుల్లెట్లా దూసుకుపోతా.. ఎవరికీ భయపడను'
-
'బుల్లెట్లా దూసుకుపోతా.. ఎవరికీ భయపడను'
తాను బుల్లెట్లా దూసుకుపోతానని, ఎవ్వరికీ భయపడేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు భయపడవని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలులో నిర్వహించిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ హోం మంత్రి తనపై కేసు పెడతానని చెబుతున్నారని, ఒక ముఖ్యమంత్రి అని కూడా లెక్కలేకుండా మాట్లాడుతున్నారని, వీటికి భయపడబోనని ఆయన అన్నారు. నీతి, నిజాయితీలకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని, తాము ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేశాము తప్ప.. టీఆర్ఎస్లా తప్పుడు రాజకీయాలు చేయలేదని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేను తీసుకెళ్లి ఏం చేశారో టీఆర్ఎస్ చెప్పాలని ఆయన అడిగారు. -
ఆ డబ్బంతా ఒకరిద్దరి నుంచే!
-
ఆ డబ్బంతా ఒకరిద్దరి నుంచే!
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎపిసోడ్లో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో కనిపించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ డబ్బు అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరు బడావ్యక్తుల నుంచే పెద్ద మొత్తంలో డ్రా అయినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే ఓ సినీ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రికి సంబంధించిన వ్యక్తుల ఖాతాలతో పాటు హవాలా పద్ధతిలో వచ్చిన మొత్తం కూడా ఈ నోట్ల కట్టల్లో ఉందని సమాచారం. అటు ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్వయంగా అందజేసిన 50 లక్షల రూపాయల మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. నోట్ల కట్టలపై బ్యాంకు స్లిప్పులు, డినామినేషన్ల ప్రకారం ఏ బ్యాంకు నుంచి అంత మొత్తాన్ని డ్రా చేశారనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ హారీ, ఉదయ్‌సింహల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల కాల్ రికార్డులను బట్టి కూడా డబ్బు కట్టల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేలకు రేవంత్ 'నో ఎంట్రీ'
-
టీడీపీ ఎమ్మెల్యేలకు రేవంత్ 'నో ఎంట్రీ'
ఓటుకు నోటు కుంభకోణంలో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కి ప్రస్తుతం రిమాండు ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కలిసేందుకు నిరాకరించారు. చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్‌ను కలిసేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాధ్, ప్రకాష్ గౌడ్ జైలుకు వచ్చారు. అయితే.. వాళ్లను కలిసేందుకు రేవంత్ నిరాకరించారు. కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే తనను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని, వేరెవ్వరినీ అనుమతించవద్దని ఆయన జైలు అధికారులను కోరారు. కాగా, మంగళవారం నాడు టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్ జైల్లో రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. -
బాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలి
ఏకే ఖాన్‌కు తెలంగాణ అడ్వొకేట్ల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే కొనుగోలు కుంభకోణంలో ఏసీబీకి చిక్కిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరును వెంటనే ఎఫ్ఐఆర్లో చేర్చాలని తెలంగాణ అడ్వొకేట్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అడ్వొకేట్లు టి. శ్రీరంగారావు, కె. గోవర్దన్‌రెడ్డి, వి. ఇంద్రసేనారెడ్డి, తిరుపతివర్మ తదితరులు మంగళవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లి డీజీని కలిసేం దుకు ప్రయత్నించారు. ఆయన లేకపోవడంతో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. స్టీఫెన్‌సన్‌తో సంభాషణల్లో బాబు పేరును ‘బాస్’, ‘నాయుడు’ పేరుతో రేవంత్పలుమార్లు సంబోధించినట్లు వీడియో ఫుటేజీల్లో ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రే కాక టీడీపీ జాతీయ అధ్యక్షుడని, ఆయన బయట ఉంటే కేసులోని సాక్షాధారాలను తారుమారు చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. -
రేవంత్ ను జైల్లో కలిసిన వివరాలపై బాబుతో చర్చలు
హైదరాబాద్:నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడి జైల్లో ఉన్న టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మంగళవారం ఆ పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, వేం నరేందర్ రెడ్డిలు కలిశారు. అయితే దీనికి సంబంధించిన వివరాలను చర్చించేందుకు వారు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఈ రోజు సాయంత్రం సమావేశమయ్యారు. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన రేవంత్ రెడ్డి ఓటు నోటుకు వ్యవహారంలో ఎలా బయటపడాలనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్‌తో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి.. ఏసీబీ అధికారుల వద్ద చంద్రబాబు ఫోన్ రికార్డులు కూడా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే ఏసీబీ ఉన్నతాధికారులు అధికారికంగా దీన్ని అంగీకరించడం లేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఆడియో ఫుటేజి బయటకు వస్తే మాత్రం రాజకీయంగా అది పెను ప్రకంపనలను సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆడియో ఫుటేజిని ఏసీబీ సీనియర్ అధికారులు స్టడీ చేస్తున్నారని, ఆ తర్వాత అది బయటకు వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. -
స్టీఫెన్‌తో చంద్రబాబు సంభాషణ???
-
స్టీఫెన్‌తో బాబు సంభాషణ.. ఏసీబీ వద్ద రికార్డులు?
ఓటుకు నోటు కుంభకోణం మరో పెద్ద మలుపు తిరుగుతోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌తో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి.. ఏసీబీ అధికారుల వద్ద చంద్రబాబు ఫోన్ రికార్డులు కూడా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే ఏసీబీ ఉన్నతాధికారులు అధికారికంగా దీన్ని అంగీకరించడం లేదు గానీ.. అనధికారికంగా మాత్రం తెలుస్తోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఆడియో ఫుటేజి బయటకు వస్తే మాత్రం రాజకీయంగా అది పెను ప్రకంపనలను సృష్టించడం ఖాయమని అంటున్నారు. స్టీఫెన్‌తో ఆయనేం మాట్లాడారన్నది చాలా కీలకంగా మారనుంది. ఇప్పటికే చంద్రబాబుపై పలు విమర్శలు వస్తున్నాయి, ఆయనను ఈ కేసులో ఎ1 చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. తెలంగాణ లాయర్లు ఇదే అంశంపై ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌కు అఫిడవిట్ కూడా ఇచ్చారు. సరైన సాక్ష్యం ఉంటే చంద్రబాబుపై కూడా గట్టి కేసు ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. తమ బాస్ చెప్పడం వల్లే తాను వచ్చానంటూ రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడం దీనికి బలమిస్తోంది. ఇప్పటివరకు ఫుటేజిలో లేని అంశం.. చంద్రబాబు - స్టీఫెన్ సంభాషణ. ఈ ఆడియో ఫుటేజిని ఏసీబీ సీనియర్ అధికారులు స్టడీ చేస్తున్నారని, ఆ తర్వాత అది బయటకు రావచ్చని అంటున్నారు. -
'తప్పు రేవంత్దో.. ఆయన పార్టీదో తేలాలి'
-
'తప్పు రేవంత్దో.. ఆయన పార్టీదో తేలాలి'
రేవంత్ రెడ్డి తప్పు చేశారా.. లేదా ఆయన పార్టీ తప్పు చేసిందా అనే విషయం ఇంకా తేలాల్సి ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తాము రేవంత్‌ను సమర్థించడం లేదని, ఈ విషయాన్ని తమ జాతీయ నాయకుల వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. టీడీపీతో పొత్తు విషయంలో భవిష్యత్తు గురించి తమ జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీకే వేశామని, అయితే రెండో ప్రాధాన్యత మాత్రం నోటాకు వేశామని కిషన్ రెడ్డి చెప్పారు. నోటాకు ఓటు వేస్తే చెల్లదన్న విషయం తమకు తెలియదని ఆయన అన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 ఓట్లు నోటాకు పడిన విషయం తెలిసిందే. -
'మిగిలిన డబ్బు వేరే ప్రాంతంలో ఇస్తాం'
రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ల మధ్య సంభాషణ వింటే.. బేరసారాలు ఎలా సాగాయో అత్యంత స్పష్టంగా తెలుస్తుంది. అదొక్కసారి చూద్దామా.. ''మొత్తం రూ. 5 కోట్లకు డీల్, ప్రస్తుతం 50 లక్షలు ఇస్తున్నాను. మిగతా 4.5 కోట్లు మా బాస్‌తో మాట్లాడి మీ ఇంట్లో కాకుండా.. వేరే ప్రాంతంలో మీకు ఓ వ్యక్తి ద్వారా పంపిస్తాం. ఇక్కడ ఏమైనా జరిగితే ఏపీలో మీకు అవకాశం ఇప్పిస్తాం. నామినేట్ చేస్తాం . రేపు మీ మనిషిని తీసుకురండి. మీకు ఏమైనా పనులు ఉంటే చేసి పెడతాం.'' ఆ సమయంలో డోర్ వేయమని అక్కడున్న వ్యక్తికి రేవంత్ చెబుతారు. ఎవరూ రారని స్టీఫెన్ అనగా.. బై ఛాన్స్ ఎవరైనా వస్తే చెప్పలేమని రేవంత్ అంటారు. టైం అయ్యింది.. త్వరగా వెళ్లాలంటూ రేవంత్ తొందరపెడతారు. ''నా వైపు నుంచి అంతా ఓకే. మా బాస్ నుంచి నేను బాధ్యత తీసుకుంటున్నా'' అనీ చెబుతారు. ''మీకు ఓకే కదా.. ఎటువంటి సందేహం లేదుగా'' అని స్టీఫెన్ సన్ని పలుమార్లు రేవంత్ అడుగుతారు. ''నేను త్వరగా వెళ్లాలి. మీరు చెప్పినచోటుకి రేపు సెబాస్టియన్ వస్తాడు" అని చెబుతారు. -
ఏకే ఖాన్‌ను కలిసిన టీ లాయర్లు
హైదరాబాద్ : ఓటుకు నోటు స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా చేర్చాలని కోరుతూ టీ లాయర్లు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ను కలిశారు. మంగళవారం తెలంగాణ అడ్వకేట్ జేఏసీ లాయర్లు గుంపుగా వెళ్లి ఖాన్‌ను కలిసి బాబు పేరును నిందితుల్లో చేర్చాలని కోరారు. -
బెయిల్ కూడా దొరక్కపోవచ్చు!
ఓటుకు నోటు స్కాంలో ఆధారాలు చాలా గట్టిగా ఉన్నాయని, దర్యాప్తు అధికారులు కేసును సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే రేవంత్ రెడ్డికి కనీసం బెయిల్ కూడా దొరికే అవకాశం ఉండబోదని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. దర్యాప్తు అధికారులు ఆధారాలను చాల పకడ్బందీగా సేకరించారని.. ఆడియో, వీడియో ఆధారాలు రెండూ ఉన్నాయని అంటున్నారు. దొరికిన డబ్బు, వీడియో ఫుటేజి, ఆయన చర్చ, వీడియోలో ఆయన చెప్పిన మొత్తం విషయాలు అన్నీ చూస్తే ఒక కుట్ర చేసి, ప్రజాప్రతినిధికి లంచం ఇచ్చి ఓటు వేయించే ప్రయత్నం చేసినట్లు ఎస్టాబ్లిష్ అయిందని, కేసు నిలబడుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మాజీ పోలీసు అధికారి అన్నారు. ఇక ఏసీబీ అధికారులు కూడా ఈ కేసు విషయంలో గట్టి విశ్వాసంతో ఉన్నారు. తమ వద్ద ఆధారాలు గట్టిగా ఉన్నాయని, రిమాండ్ రిపోర్టు పక్కాగా రాశామని , ఎటువైపు నుంచి చూసినా రేవంత్ రెడ్డికి బెయిల్ కూడా రాదని చెబుతున్నారు. -
'ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి దురదృష్టకరం'
ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి రావడం దురదృష్టకరమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దీన్ని అరికట్టాలంటే చట్టాలను కఠినతరం చేయాలని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని ఆయన చెప్పారు. తెలంగాణలో 970 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, 3 వేల మందికి పైగా వడదెబ్బ వల్ల మరణించినా రాష్ట్రప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బ తింటున్నాయని ఆయన అన్నారు. -
ఆ నోట్ల కట్టలు ఎక్కడివి.. ఎవరివి?
ఓటుకు నోటు స్కాంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. నోట్ల కట్టలు ఎక్కడివనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. రేవంత్ రెడ్డి డీల్ కేసు విచారణను ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. చంద్రబాబు ఇంకా ఎవరెవరిని కొనుగోలు చేయాలనుకున్నారు.. ఆ ఎమ్మెల్యేలకు ఎంతెంత డబ్బు ఇవ్వడానికి ఎరచూపారని అధికారులు ఆరా తీస్తున్నారు. ''కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గరు రెడీ'' అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. విచారణ సందర్భంగా ఆ ఎమ్మెల్యేలు ముందుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాంతో రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు మెడకు కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. స్టీఫెన్‌కు ఇవ్వడానికి తీసుకొచ్చిన నోట్ల కట్టలు ఎక్కడివనే అంశంపై ఆరా తీస్తున్నారు. నోట్ల కట్టలపై ఉన్న సీరియల్ నంబరు ఆధారంగా దర్యాప్తునకు రంగం సిద్ధమవుతోంది. రేవంత్ వ్యవహారంలో మనీలాండరింగ్, ఈడీ కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.