
'చంద్రబాబు ఫోన్లను ఎవరూ ట్యాపింగ్ చేయలేదు'
చంద్రబాబు నాయుడు ఫోన్లను ఎవరూ ట్యాపింగ్ చేయలేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. చంద్రబాబు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసిన వ్యవహారంపై ఏసీబీ విచారణ చేస్తోందని ఆయన అన్నారు. ఇప్పటివరకు బయటపడినవి సెబాస్టియన్ ఫోన్ రికార్డులనే ఏసీబీ చెబుతోందని కేటీఆర్ చెప్పారు.