
'మిగిలిన డబ్బు వేరే ప్రాంతంలో ఇస్తాం'
రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ల మధ్య సంభాషణ వింటే.. బేరసారాలు ఎలా సాగాయో అత్యంత స్పష్టంగా తెలుస్తుంది. అదొక్కసారి చూద్దామా..
''మొత్తం రూ. 5 కోట్లకు డీల్, ప్రస్తుతం 50 లక్షలు ఇస్తున్నాను. మిగతా 4.5 కోట్లు మా బాస్తో మాట్లాడి మీ ఇంట్లో కాకుండా.. వేరే ప్రాంతంలో మీకు ఓ వ్యక్తి ద్వారా పంపిస్తాం. ఇక్కడ ఏమైనా జరిగితే ఏపీలో మీకు అవకాశం ఇప్పిస్తాం. నామినేట్ చేస్తాం . రేపు మీ మనిషిని తీసుకురండి. మీకు ఏమైనా పనులు ఉంటే చేసి పెడతాం.''
ఆ సమయంలో డోర్ వేయమని అక్కడున్న వ్యక్తికి రేవంత్ చెబుతారు. ఎవరూ రారని స్టీఫెన్ అనగా.. బై ఛాన్స్ ఎవరైనా వస్తే చెప్పలేమని రేవంత్ అంటారు. టైం అయ్యింది.. త్వరగా వెళ్లాలంటూ రేవంత్ తొందరపెడతారు. ''నా వైపు నుంచి అంతా ఓకే. మా బాస్ నుంచి నేను బాధ్యత తీసుకుంటున్నా'' అనీ చెబుతారు.
''మీకు ఓకే కదా.. ఎటువంటి సందేహం లేదుగా'' అని స్టీఫెన్ సన్ని పలుమార్లు రేవంత్ అడుగుతారు. ''నేను త్వరగా వెళ్లాలి. మీరు చెప్పినచోటుకి రేపు సెబాస్టియన్ వస్తాడు" అని చెబుతారు.