ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపాత్ముడు కాబట్టే తెలంగాణలో దొరికిపోయాడని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న సొమ్ముతో ఆయన తెలంగాణలో ధనపూజలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆ సీటును బాలకృష్ణ లేదా లోకేశ్ ఎత్తుకుపోతారని చంద్రబాబు భయపడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినా కూడా ఎల్లో పత్రికలు మాత్రం ఆ విషయాన్ని రాయట్లేదని ఆయన చెప్పారు.
'చంద్రబాబు పాపాత్ముడు.. అందుకే దొరికిపోయాడు'
Published Fri, Jun 12 2015 4:29 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement