mla stefen
-
రేవంత్ ను జైల్లో కలిసిన వివరాలపై బాబుతో చర్చలు
హైదరాబాద్:నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడి జైల్లో ఉన్న టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మంగళవారం ఆ పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, వేం నరేందర్ రెడ్డిలు కలిశారు. అయితే దీనికి సంబంధించిన వివరాలను చర్చించేందుకు వారు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఈ రోజు సాయంత్రం సమావేశమయ్యారు. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన రేవంత్ రెడ్డి ఓటు నోటుకు వ్యవహారంలో ఎలా బయటపడాలనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్‌తో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి.. ఏసీబీ అధికారుల వద్ద చంద్రబాబు ఫోన్ రికార్డులు కూడా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే ఏసీబీ ఉన్నతాధికారులు అధికారికంగా దీన్ని అంగీకరించడం లేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఆడియో ఫుటేజి బయటకు వస్తే మాత్రం రాజకీయంగా అది పెను ప్రకంపనలను సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆడియో ఫుటేజిని ఏసీబీ సీనియర్ అధికారులు స్టడీ చేస్తున్నారని, ఆ తర్వాత అది బయటకు వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. -
స్టీఫెన్‌తో చంద్రబాబు సంభాషణ???
-
స్టీఫెన్‌తో బాబు సంభాషణ.. ఏసీబీ వద్ద రికార్డులు?
ఓటుకు నోటు కుంభకోణం మరో పెద్ద మలుపు తిరుగుతోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌తో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి.. ఏసీబీ అధికారుల వద్ద చంద్రబాబు ఫోన్ రికార్డులు కూడా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే ఏసీబీ ఉన్నతాధికారులు అధికారికంగా దీన్ని అంగీకరించడం లేదు గానీ.. అనధికారికంగా మాత్రం తెలుస్తోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఆడియో ఫుటేజి బయటకు వస్తే మాత్రం రాజకీయంగా అది పెను ప్రకంపనలను సృష్టించడం ఖాయమని అంటున్నారు. స్టీఫెన్‌తో ఆయనేం మాట్లాడారన్నది చాలా కీలకంగా మారనుంది. ఇప్పటికే చంద్రబాబుపై పలు విమర్శలు వస్తున్నాయి, ఆయనను ఈ కేసులో ఎ1 చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. తెలంగాణ లాయర్లు ఇదే అంశంపై ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌కు అఫిడవిట్ కూడా ఇచ్చారు. సరైన సాక్ష్యం ఉంటే చంద్రబాబుపై కూడా గట్టి కేసు ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. తమ బాస్ చెప్పడం వల్లే తాను వచ్చానంటూ రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడం దీనికి బలమిస్తోంది. ఇప్పటివరకు ఫుటేజిలో లేని అంశం.. చంద్రబాబు - స్టీఫెన్ సంభాషణ. ఈ ఆడియో ఫుటేజిని ఏసీబీ సీనియర్ అధికారులు స్టడీ చేస్తున్నారని, ఆ తర్వాత అది బయటకు రావచ్చని అంటున్నారు. -
'మిగిలిన డబ్బు వేరే ప్రాంతంలో ఇస్తాం'
రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ల మధ్య సంభాషణ వింటే.. బేరసారాలు ఎలా సాగాయో అత్యంత స్పష్టంగా తెలుస్తుంది. అదొక్కసారి చూద్దామా.. ''మొత్తం రూ. 5 కోట్లకు డీల్, ప్రస్తుతం 50 లక్షలు ఇస్తున్నాను. మిగతా 4.5 కోట్లు మా బాస్‌తో మాట్లాడి మీ ఇంట్లో కాకుండా.. వేరే ప్రాంతంలో మీకు ఓ వ్యక్తి ద్వారా పంపిస్తాం. ఇక్కడ ఏమైనా జరిగితే ఏపీలో మీకు అవకాశం ఇప్పిస్తాం. నామినేట్ చేస్తాం . రేపు మీ మనిషిని తీసుకురండి. మీకు ఏమైనా పనులు ఉంటే చేసి పెడతాం.'' ఆ సమయంలో డోర్ వేయమని అక్కడున్న వ్యక్తికి రేవంత్ చెబుతారు. ఎవరూ రారని స్టీఫెన్ అనగా.. బై ఛాన్స్ ఎవరైనా వస్తే చెప్పలేమని రేవంత్ అంటారు. టైం అయ్యింది.. త్వరగా వెళ్లాలంటూ రేవంత్ తొందరపెడతారు. ''నా వైపు నుంచి అంతా ఓకే. మా బాస్ నుంచి నేను బాధ్యత తీసుకుంటున్నా'' అనీ చెబుతారు. ''మీకు ఓకే కదా.. ఎటువంటి సందేహం లేదుగా'' అని స్టీఫెన్ సన్ని పలుమార్లు రేవంత్ అడుగుతారు. ''నేను త్వరగా వెళ్లాలి. మీరు చెప్పినచోటుకి రేపు సెబాస్టియన్ వస్తాడు" అని చెబుతారు.