రేవంత్ ను జైల్లో కలిసిన వివరాలపై బాబుతో చర్చలు | chandra babu naidu meets party leaders with reventh reddy issue | Sakshi
Sakshi News home page

రేవంత్ ను జైల్లో కలిసిన వివరాలపై బాబుతో చర్చలు

Published Tue, Jun 2 2015 9:47 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

రేవంత్ ను జైల్లో కలిసిన వివరాలపై బాబుతో చర్చలు - Sakshi

రేవంత్ ను జైల్లో కలిసిన వివరాలపై బాబుతో చర్చలు

హైదరాబాద్:నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడి జైల్లో ఉన్న టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మంగళవారం ఆ పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, వేం నరేందర్ రెడ్డిలు కలిశారు. అయితే దీనికి సంబంధించిన వివరాలను చర్చించేందుకు వారు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఈ రోజు సాయంత్రం సమావేశమయ్యారు. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన రేవంత్ రెడ్డి ఓటు నోటుకు వ్యవహారంలో ఎలా బయటపడాలనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

 

ఇదిలా ఉండగా ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్తో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి.. ఏసీబీ అధికారుల వద్ద చంద్రబాబు ఫోన్ రికార్డులు కూడా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే ఏసీబీ ఉన్నతాధికారులు అధికారికంగా దీన్ని అంగీకరించడం లేదు.  ఇలాంటి సమయంలో చంద్రబాబు ఆడియో ఫుటేజి బయటకు వస్తే మాత్రం రాజకీయంగా అది పెను ప్రకంపనలను సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఈ ఆడియో ఫుటేజిని ఏసీబీ సీనియర్ అధికారులు స్టడీ చేస్తున్నారని,  ఆ తర్వాత అది బయటకు వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement