రేవంత్ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు: పల్లె | revanth reddy will face punishment if he committed mistake, says minister palle | Sakshi
Sakshi News home page

రేవంత్ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు: పల్లె

Published Sat, Jun 13 2015 6:42 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

రేవంత్ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు: పల్లె - Sakshi

రేవంత్ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు: పల్లె

ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తప్పు చేసి ఉంటే ఆయన శిక్ష అనుభవిస్తారని మంత్రి పల్లె రఘునాధరెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ కేసులో సీబీఐతోనే కాదు ఏ సంస్థతోనైనా విచారణకు సిద్ధమని, చంద్రబాబు మాత్రం కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్టు చేసే దమ్ము, ధైర్యం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేవని చెప్పారు. కేసీఆర్ సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారన్నారు.

చంద్రబాబు సహా 120 మంది ముఖ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర విచారణ జరపాలని పల్లె అన్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలను ముక్కలుగా చేసి అతికించి టేపు విడుదల చేశారని ఆయన ఆరోపించారు. బాలకృష్ణ సీఎం అవుతారంటూ చేసిన ప్రచారం మీడియా సృష్టేనని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement