
'ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి దురదృష్టకరం'
ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి రావడం దురదృష్టకరమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దీన్ని అరికట్టాలంటే చట్టాలను కఠినతరం చేయాలని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని ఆయన చెప్పారు.
తెలంగాణలో 970 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, 3 వేల మందికి పైగా వడదెబ్బ వల్ల మరణించినా రాష్ట్రప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బ తింటున్నాయని ఆయన అన్నారు.