హైదరాబాద్ : ఓటుకు నోటు స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా చేర్చాలని కోరుతూ టీ లాయర్లు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ను కలిశారు. మంగళవారం తెలంగాణ అడ్వకేట్ జేఏసీ లాయర్లు గుంపుగా వెళ్లి ఖాన్‌ను కలిసి బాబు పేరును నిందితుల్లో చేర్చాలని కోరారు.