ak khan
-
మైనింగ్ పేరుతో టోకరా!
పంజగుట్ట: మైనింగ్‌లో లాభాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మాజీ మంత్రి సీనియర్ కాగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ, మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏకే ఖాన్‌పై న్యాయస్థానం ఆదేశాల మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .. టౌలీచౌకీకి చెందిన వ్యాపారి మహ్మద్ అబ్దుల్ వాహబ్కు జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి మోహ్సిన్ ఖాన్ పరిచయం ఉంది. మోహ్సిన్ ఖాన్ తనకు బంజారాహిల్స్‌లో సన్‌లిట్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రిజిస్టర్ సంస్థ ఉందని దానికి తానే ఎండీనని చెప్పాడు. తపస్వీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఖమ్మ జిల్లా, రామానుజవరంలో 46 ఎకరాల్లో ఇసుక మైనింగ్ టెండర్ దొరికిందని, ఆ సంస్థతో తమ సంస్థ 25 శాతం వాటాకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పాడు. 25 శాతం వాటాలో సుమారు రూ.6.5 కోట్లు లాభం వస్తుందని అబ్ధుల్ వాహబ్‌ను నమ్మించాడు. రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నట్లు నకిలీ పత్రాలు చూపించాడు. తనతో చేతులు కలిపితే నీకు 50 శాతం వాటా ఇస్తానని అందుకుగాను రూ.90 లక్షలు చెల్లించాలని కోరాడు. మోహ్సిన్ ఖాన్ చెప్పిన మాటలు అబ్థుల్ వాహబ్ నమ్మక పోవడంతో తన మామ జూబ్లీహిల్స్‌కు చెందిన రాజకీయ నాయకుడు మొహ్మద్ అలీ షబ్బీర్‌ను (షబ్బీర్ అలీ)ని పరిచయం చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా చేయడంతో బాధితుడు అబ్థుల్ వాహబ్ అతడిని గుర్తుపట్టాడు. కుందన్‌బాగ్‌లో ఉంటున్న మాజీ పోలీస్ ఉన్నతాధికారి అబ్థుల్ ఖయ్యూం ఖాన్ (ఏకే ఖాన్)ను కూడా అతడికి పరిచయం చేశాడు. దీంతో అబ్థుల్ వాహబ్ అతడి మాటలు నమ్మి 2016లో బ్యాంకు ద్వారా, నగదు ద్వారా రూ.90 లక్షలు చెల్లించాడు. సంవత్సరాలు గడుస్తున్నా లాభం ఇవ్వకపోగా మొహం చేయడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మోహ్సిన్ ఖాన్ బాధితుడిని బెదిరించడం, తప్పించుకుని తిరగడం చేస్తుండడంతో బాధితుడు నాంపల్లి కోర్టును ఆదేశించారు. కోర్టు ఆదేశాలమేరకు పంజగుట్ట పోలీసులు మోహ్సిన్ ఖాన్, మొహ్మద్ అలీ షబ్బీర్, అబ్థుల్ ఖయ్యూం ఖాన్‌లపై 465, 420, 406, ఐపీసీ రెండ్‌విత్ 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. (చదవండి: సెల్‌ఫోన్ వాడడు..సీసీ కెమెరాకు చిక్కడు..శ్మశానంలోనే తిండి నిద్ర) -
అల్లా కే బందే
నేను నా దైవం కుమారులు అబ్దుల్ మౌసింఖాన్, అబ్దుల్ ముజమిల్ ఖాన్‌లతో ఎ.కె.ఖాన్. తల్లి కడుపులో పుడితే తోబుట్టువులవుతాం కన్నవాళ్లకు పిల్లలమవుతాం అవ్వాతాతలకు వారసులమవుతాం. మరి అల్లాహ్ కి ఏమవుతాం? ఖుదాకి దాసులమవుతాం! అల్లాహ్ కే బందే అవుతాం సేవకు దాసులమవుతాం మంచికి బానిసలమవుతాం పవిత్రతకు బందీలమవుతాం. దేవుడున్నాడని మీరు నమ్ముతారా? ఎ.కె.ఖాన్: దేవుడు లేకుండా సృష్టిలో ఇంత క్రమశిక్షణ ఉండదు. మనుషులైనా, పశువులైనా, ఏ జీవ జాలమైనా, చివరకు గ్రహాలు కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండటం వల్లే సృష్టిలో సమతౌల్యం ఏర్పడింది. దేవుడు లేకుండా సృష్టే లేదసలు. ఇంత నమ్మకం మీకు ఎలా కలిగింది? దేవుడు ఉన్నాడని నమ్మి ఒక పనిని చేయడం మొదలుపెట్టి, ఆ పని పూర్తయ్యే విధానాన్ని గమనించండి మీకు తెలుస్తుంది. నిరాశ నిస్పృహలకు లోనయిన చాలా సందర్భాల్లో దేవుడు ఉన్నాడని నాకు తెలిసింది. ఒకటీ రెండు కాదు... ఎన్నో సంఘటనలు. ఎప్పుడైతే దేవుడ్ని ప్రార్థించడం జరిగిందో అప్పుడు అవి సమకూరిన సందర్భాలున్నాయి. ఇటీవలే మా కుటుంబంలో ఒక సంఘటనే తీసుకుందాం. మా చిన్నబ్బాయి ఒక దశలో విదేశీ ఉద్యోగాలకు వెళ్లడానికి సన్నద్ధమయ్యాడు. ఈ దేశంలో, ఈ సంస్కృతిలో వాడుండాలని దైవాన్ని మేం కోరుకున్నాం. ఐఏఎస్‌గా ఎంపిక కావడం దైవబలం అని నమ్ముతాను. అలాగే డెస్టినీని కూడా నమ్ముతాను. నా కెరియర్లోనే రావు అనుకున్నవి వచ్చాయి. వస్తాయి అనుకున్నవి రాలేదు. ఒక ప్రణాళిక అన్నది భగవంతుడి వద్ద సిద్ధంగా ఉంటుంది. దాని ప్రకారమే జరుగుతుంది. దేవుడి దగ్గర మన ప్రణాళిక ముందే ఉంటే ఈ దీక్ష ఎందుకు? రంజాన్ పవిత్రమాసం. చాలా అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. మనం జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాం. ఆ తప్పులను సవరించుకోవడానికి ఒక సమయం కావాలి. ఉదయం నుంచి రాత్రి వరకు ఉండే ఉపవాసం ద్వారా ఆ అవకాశం లభిస్తుంది. రెండవది ఆకలి అనేది తెలిసి వస్తుంది. దీనివల్ల బీదల పాట్లు అర్థమవుతాయి. వారికి చేతనైన సాయం చేయాలనే ఆలోచన కలుగుతుంది. మూడవది.. వీలైనంత వరకు తప్పుడు పనులు చేయకూడదు అని నియమం పెట్టుకుంటాం. ఇస్లాంలో ఈ నెలలోనే ఇవి చేయాలనేది అభిమతం కాదు. ఈ నిష్ట ఎప్పుడూ ఉండాలి. కాకపోతే నెలరోజులు ఎలా నిష్టగా గడుపుతారో మిగతా అంతా అలాగే జీవించడానికి అవకాశం ఉంటుంది. నేను పోలీస్‌గా ఉన్నప్పుడు.. ఏడాదికి ఒకసారి 15 రోజులు మొబిలైజేషన్ పీరియడ్ ఉండేది. దీంట్లో యోగా, స్పోర్ట్స్, పరేడ్‌లో సెల్యూట్, షూటింగ్... ఇవన్నీ ఉండేవి. దీంట్లో విధి నిర్వహణలో జరిగే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఈ మొబిలైజేషన్ ఎలాంటిదో సంవత్సరాంతంలో చేసే తప్పులు సరిదిద్దుకోవడం ఈ మాసం ఇచ్చే ఒక అవకాశం. ఈ మాసంలో ఒక్కసారైనా పూర్తిగా ఖురాన్ పఠించాలి. రోజూ 1/3 ఖురాన్ తప్పక పఠించాలి. అర్థం చేసుకోవాలి. ఇందులో మన ప్రవర్తన ఎలా ఉండాలో రాసి ఉంటుంది. ఈ టైమ్‌లో అర్థం చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. ఈ మాసంలోనే బీదలకు సాయం చేయమనడంలోని ఉద్దేశ్యం..? రంజాన్ చివరలో ‘ఈదుల్ ఫితర్’ ఉంటుంది. ఈదుల్ ఫిత్ర్ అంటే బీదల హక్కును కాపాడటం. జకాత్ అంటే దానం. జకాత్ ఏ నెలలోనైనా ఇవ్వచ్చు. కానీ ఈ నెలలోనే ఇవ్వాలనే నియమం తప్పనిసరి. లేకపోతే దానం చేయాలనే ధ్యాస తర్వాత తర్వాత ఉండకపోవచ్చు. పాపాలలో అధికమైన పాపం నిరుపేదల హక్కులు హరించడం. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడానికి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారో.. ఇది కూడా అలాగే! సంపాదనలో 2.5 శాతం కచ్చితంగా దానం ఇవ్వాలి. మొదట కష్టంలో ఉన్న బంధువులకు, తర్వాత ఇరుగు పొరుగుకి, తర్వాత మిగతా సమాజంలో ఉన్నవారికి. ఇక్కడ మతం, కులం అడ్డురాదు. ఎవరికైనా ఇవ్వచ్చు. రంజాన్‌లో ఏవైనా వండుకుంటే చుట్టుపక్కల వారికీ ఆ ఆహారం ఇవ్వాలనేది నియమం. ఇది సమాజంలో ఉన్న వారికి హక్కుగా వర్తిస్తుంది. ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఈ నియమం పాటిస్తే సమాజంలో పేదరికం చాలావరకు తగ్గిపోతుంది. ఏ మతమైనా అదే చెబుతుంది. పేదలకు మీరిచ్చే వాటా? ఈ మాసంలో నేను, మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు.. అందరం ఎవరికి ఎంత ఆదాయమో చూసుకొని జకాత్ ఇవ్వాల్సింది ఇంత.. అని లెక్క వేస్తాం. మొత్తం 10–15 లక్షలదాకా అవుతుంది. ఇదంతా మా అమ్మగారికి ఇస్తాం. ఆమె మా బంధువుల పరిస్థితి తెలుసుకుని, అవసరం ఉన్నవారికి ఆ డబ్బును పంపిస్తుంది. ఇది మా అన్ని కుటుంబాలలో తరతరాలుగా వస్తోంది. నాకు తెలిసి ఇలా జకాత్ ఇచ్చేవి వేల కుటుంబాలున్నాయి. జకాత్ తీసుకునేవాడు తిరిగి జకాత్ ఇచ్చే స్థాయికి ఎదగాలి. అప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది. వేలాది కుటుంబాలు పేదలకు ఇలా సాయం చేస్తుంటే సమాజంలో ఇంకా పేదరికం కనిపిస్తూనే ఉంది..! అంటే, ఆదుకోవాల్సిన వారు అంత ఎక్కువగా ఉన్నారని అర్థం. ప్రభుత్వాలు ఆ పనులను చక్కగా నిర్వర్తించాలి. ఇప్పుడు ప్రభుత్వ పథకాల ద్వారా ఆ పనులకు పూనుకుంటున్నాం. సింహభాగం వ్యాపారం, విద్యకు కేటాయిస్తున్నాం. లక్షల మంది పిల్లలకు విద్య, చిరువ్యాపారులకు, స్వయంకృషితో ఎదగాలనే అమ్మాయిలకు ఆర్థిక సహకారం అందిస్తున్నాం. ఈ పండగకు ఎంత బీదవారైనా వారు, వారి పిల్లలు కొత్త బట్టలు వేసుకోవాలనేది ఒక ఆచారం. ఎన్ని పాట్లు పడైనా పిల్లలకు కొత్తబట్టలు కొంటారు. కె.సి.ఆర్ గారు ఉద్యమం జరిగే రోజుల నాటి ఒక సంఘటన చెబుతుంటారు. అది రంజాన్ మాసం. వరంగల్‌లో చాలామంది మహిళలు బుర్ఖా ధరించి ఒకచోట నిలబడి ఉండటం చూశారు. ఎందుకని అడిగితే–‘పిల్లలకు కొత్త బట్టలు కొనడానికి రక్తం అమ్ముకుంటున్నామ’ని చెప్పారట. ఇది కళ్లనీళ్లు వచ్చే సంఘటన. రెండేళ్లుగా 200 ప్లేస్‌లలో ప్రభుత్వం తరపున 2 లక్షల కుటుంబాలకు (భార్యాభర్త, ఒక అమ్మాయికి) భోజనం, కొత్తబట్టలు ఇస్తున్నారు. ఈ సంవత్సరం దీనిని రెట్టింపు చేస్తున్నారు. అలాగే, ఈసారి నాంపల్లిలో అనీస్ ఘుర్బా ఆశ్రమ పిల్లలకు బట్టలు, భోజనం పెట్టించిన తర్వాతే ఇఫ్తార్ విందు. ఆ పిల్లలనీ విఐపిల దగ్గర కూర్చోబెడతాం. ఈ ఏడాది జరుగుతున్న మరో గొప్ప విషయం ఆ ఆశ్రమం వెనుక ఎకరం స్థలంలో ఆధునిక వసతులతో 600 మంది పిల్లలకు సరిపడా (ఎక్కువ మంది అమ్మాయిలు) రక్షణ కల్పించే దిశగా ప్లాన్లు చేస్తున్నాం. ఇస్లామ్‌లో దైవం స్త్రీకి ప్రత్యేకమైన నిబంధనలు ఏమైనా పెట్టిందా? ఇస్లాంలో అమ్మాయికి, అబ్బాయికి చదువు విషయంలో ఎక్కడా తేడా లేదు. ముందు ‘చదువు’ అన్నది దైవం చెప్పిన మాట. ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడకు వెళ్లి తెచ్చుకోమని చెబుతుంది. జ్ఞాన సముపార్జనలో చైనాకు కూడా వెళ్లమని చెప్పింది. ఆ దేశంలో ఏ ముస్లింలు ఉన్నారని. అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడు ఎవరైతే ఓడిపోతారో బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టాలంటే రెండు కండిషన్స్ ఉండేవి. ఒకటి యుద్ధ పరిహారమైనా చెల్లించాలి. రెండవది అతనికి వచ్చిన విద్య అయినా ఇంకొకరికి నేర్పాలి. సైనికుడు విద్యాధికుడైతే అతని విద్యను బట్టి రిలీజ్ చేసేవారు. మహమ్మద్ ప్రవక్తతోనూ మహిళలు చాలా చర్చలు జరిపిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మార్పు అనేది సమాజంలోనూ వస్తోంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని అనుకుంటున్నారు. దీనికి కావల్సిన సపోర్ట్ ఇవ్వడమే దైవత్వం. విధి నిర్వహణలో రాజకీయ నాయకుల వద్ద తలవంచాల్సిన పరిస్థితి వస్తే... ఇస్లామ్‌లో దైవానికి మాత్రమే తల వంచాలనే నియమం ఉంది కదా! రాజకీయ నాయకులు ఎప్పుడూ కోరుకునేది వ్యవస్థను సక్రమంగా నడపండి అనేదే! ఇస్లాంలో సాష్టాంగ ప్రణామం నమాజ్‌లో వస్తుంది. దేవుడికే తప్ప ఎవరికీ లేదు. తల్లిదండ్రులలో కూడా తల్లికే ఆ ప్రాధాన్యత ఉంది. ఈ విషయంలో మహమ్మద్ ప్రవక్త మూడు మాటలు చెప్పాడు. ఆ మూడు మాటలు కూడా తల్లి గురించే! తల్లి, తండ్రి, దైవాన్ని రక్షకులుగా భావిస్తాం. సమాజం పోలీసును రక్షకుడిగా భావిస్తుంది. దైవత్వానికీ, రక్షణ స్థానంలో ఉన్న యూనిఫామ్‌కి సంబంధం ఎలాంటిది? అన్నింటిలో పోలీస్ ఉద్యోగాన్ని మించిన ఉద్యోగం లేదు. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం అనేది కేవలం పోలీసు ఉద్యోగంలో ఉంది. రక్షణ కల్పించే అవకాశం పోలీసుశాఖలో పనిచేసే వ్యక్తికే ఉంటుంది. కాకపోతే చక్కటి విలువలున్న వ్యక్తి ఈ శాఖలోకి రావాలి. విలువల్లేని వ్యక్తి వస్తే ఇక్కడ కలిగేటంత హాని మరెక్కడా కలగదు. బాధించడం, అవమానించడం, ప్రాణాలు తీయడం.. ఈ ఫీల్డ్‌లోనే జరుగుతాయి. పోలిస్ అంటే దైవ స్వరూపమే! మీకు దక్కాల్సినవి దక్కనప్పుడు దేవుడి మీద మీకు కలిగిన భావం? నాకు పెద్ద పెద్ద జిల్లాలో మంచి పోస్టింగ్‌లు వచ్చాయి. కొన్ని నా హక్కు అనుకున్నప్పుడు రాలేదు. అప్పుడు నాకు రావాల్సింది రాలేదు అని బాధపడటంలో అర్థంలేదు. ఎందుకంటే, నాతో పాటు సమర్థత ఉన్నవారికి వాళ్లకు రాకుండా నాకు ఆ పదవులు వచ్చినప్పుడు ‘నన్నే ఎందుకు తీసుకుంటున్నారు?’ అని నేనడగలేదు కదా! 30 ఏళ్ల సర్వీసులో కొన్ని అర్హమైన పోస్టింగ్‌లు రానప్పుడు బాధపడ్డాను. కాకపోతే దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. రిటైర్మెంట్ తర్వాత నాకు బాధ్యతాయుతమైన పదవి వచ్చింది. కొన్నిసార్లు తాత్కాలికంగా బాధపడిన సందర్భాలున్నాయి. ఇవన్నీ సహజంగా జరిగిపోతుంటాయి. నేను క్రికెట్ ఆడుతుంటాను. ఒకసారి అనుకోకుండా ఈజీ బాల్ వస్తుంది. ఒకసారి డిఫికల్టీ బాల్ వస్తుంది. ఒకసారి బోల్డ్ అవుతాం. దీన్నే స్థితప్రతిజ్ఞత అంటారు. దేనికి పొంగిపోనివాడు, దేనికీ కుంగిపోనివాడు.. అనేది భగవద్గీతలోనూ ఉంటుంది. అయితే, కష్టం అనుకున్న సమయంలో దేవుణ్ణి ప్రార్థించిన సందర్భాలు లేవా? ఎందుకు లేవు. చాలా ఉన్నాయి. ఆ సమయంలో ఇంకా ఎక్కువ ప్రార్థిస్తాను. ఇప్పుడు కూడా ప్రతి రోజూ ప్రార్థన చేస్తాను. కష్టం గట్టెక్కిన తర్వాత ప్రార్థనలో కృతజ్ఞతలు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఒకసారి ఓల్డ్‌సిటీలో కమ్యూనల్ సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో నేను దేవుణ్ణి పదే పదే ప్రార్థించాను. ‘నేను నా ప్రయత్నం చేస్తున్నాను. నీ సహకారం కావాలి’ అని వేడుకున్నాను. గీతలో కూడా ఒక అంశం ఉంది.. కృష్ణుడు అర్జునుడితో– ‘నీ విధిని నువ్వు నిర్వర్తించు. ఫలితం దైవానికి వదులు..’ అని చెబుతాడు. ‘నీవు ఆ విధిని కూడా చేయలేకపోతే ఆ పనిని దేవునికి అప్పగించు’ అని కూడా దైవం చెప్పిన విషయమే. పాహిమామ్ అంటే అదే కదా! సరెండర్ అయిపోవడం. ఇస్లామ్‌లో కూడా అంతే! చేయాల్సింది అంతా చేయ్, చేయలేని సమయంలో దైవానికి అప్పగించు. మానవప్రయత్నం చేయడం ఒక్కటే మన చేతుల్లో ఉంది. డీప్లీ ఇస్లాంలో 10 సంవత్సరాల కేసులు స్టడీ చేసి చూశాను ఒక్కటి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన లేదు. భగవంతుడు ఉన్నాడు. ఈ కష్టాలు ఇస్తున్నది అతనే, దానిని దాటించే శక్తిని ఇచ్చేది అతనిదే! ఇలా అనుకున్నడప్పుడు మనకు సహనం అలవడుతుంది. ఆ కష్టం కూడా సులువుగా దాటేస్తాం. ఇస్లామ్‌లో విగ్రహారాధన ఉండదు కదా! ప్రార్థనలో ఏకాగ్రత ఎలా కలుగుతుంది? ఇస్లామ్‌లో దైవం నిర్గుణాకారం. నమాజ్‌లో ఉన్నప్పుడు మనస్సు నిశ్చలంగా పెట్టుకొని ‘భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నాను. దేవుడు నన్ను చూస్తున్నాడు’ అనే నమ్మకంతో చేస్తాను. ఈద్గాలో నమాజ్ చేసేటప్పుడు 2 –3 లక్షల మంది ఉంటారు. ఆ సమయంలో గమనించండి. చిన్న శబ్దం కూడా కాదు. కేవలం ఇమామ్ చదివే విషయాల మీదే ఫోకస్ ఉండాలి. రెప్ప పాటు కాలంలో కూడా నమాజ్ పక్కకు వెళ్లిందంటే అది ప్రార్థన కాదు. దైవత్వానికి ఆహారానికి ఉన్న సంబంధం ఏంటి? ఆహారం అన్నది బతికుండటం కోసం, సరైన పోషణ కోసం ఆరోగ్యంగా ఉంటే దైనందిన జీవితం, విధి నిర్వహణ సరిగ్గా ఉంటుంది. ఏ మతంలోనైనా సరే సరైన పోషణ, సరైన ఆహారపు అలవాట్లు తప్పనిసరి. ఆ ప్రాంతాన్ని బట్టి, సంస్కృతిని బట్టి వారికా ఆహారపు అలవాట్లు వస్తాయి. ఇది మంచిది, ఇది మంచిది కాదు అని జడ్జ్ చేయకూడదు. మిమ్మల్ని ప్రజలుదేవుడిగా భావించిన ఘటనలు ఉన్నాయి కదా! అలా అని కాదుగానీ... ఒకరోజు అర్ధరాత్రి ఒక వృద్ధురాలు వచ్చింది. కొడుకు, కోడలు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఆరోగ్యం సరిగా లేదు. కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఇల్లెవరిద’ని అడిగాను. ‘మా ఆయనది, ఆయన చనిపోయాడు’ అని చెప్పింది. ఎస్సైని పిలిచి‘కొడుకు, కోడల్ని బయటకు పంపించి, ఈమెను ఆ ఇంట్లో ఉంచండ’ని చెప్పాను. అలాగే జరిగింది. తెల్లవారుజామున ఆమె కోడల్ని, పిల్లల్ని తీసుకొచ్చింది. ‘అయ్యా! చిన్న పిల్లలు. వీళ్ల ముఖాలైనా చూసి ఇంట్లో ఉండనివ్వండి’ అని. అప్పుడు వాళ్లకి చెప్పాను ‘ఆమెను మంచిగా చూసుకోండి. ఈ పిల్లల మొహం చూసి మిమ్మల్ని ఆ ఇంట్లో ఉండనిస్తాను’ అని. ఇది జరిగి ఎనిమిదేళ్లు జరిగింది. వాళ్లంతా కలిసి మెలిసి ఉన్నారు. చాలా ఆనందం వేసింది. లాలాపేట ఏరియాలో ఒక మహిళ... రైల్వే ఉద్యోగి అయిన ఆమె భర్త చనిపోయాడు. రావాల్సిన డబ్బులు ఈమెకు అందలేదు. ఈమెకు ఒక బిడ్డ. సపోర్ట్ కోసం ఒక వ్యక్తితో ఉంది. కొన్నాళ్లకు ఈమెకు ఉద్యోగం, ఆ ఎక్స్‌గ్రేషియా కూడా వచ్చింది. ఆమె విడిగా ఉండే ప్రయత్నం చేసింది. ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. పైగా ఈమె డబ్బంతా అతనే తీసుకునేవాడు. బాధించేవాడు. ముందు ఎస్సై దగ్గరకు వెళ్తే అతను ‘నీ ఖర్మ. అనుభవించు’ అన్నాడట. నా దగ్గరకు వచ్చింది. ‘గతం గతః. ఆమె ఇప్పుడు తనుగా బతకాలనుకుంటోంది. అతని నుంచి ఆ డబ్బులు ఇప్పించి కూతురి పేరున ఫిక్స్డ్ చేయండి. ఆమెను అతను వేధించకుండా వార్నింగ్ ఇవ్వండి’ అని చెప్పాను. అలాగే జరిగింది. రిటైర్ అయ్యాక కూడా ఇలాంటివే జ్ఞాపకం ఉంటాయి. మనుషుల్లో మీరు చూసిన దైవత్వం...? చాలా చోట్ల, చాలా సందర్భాల్లో చూశాను. స్థోమత లేకపోయినా వారు చేసే సాయం ఎంత గొప్పదో ఓల్డ్ సిటీలో ఫైరింగ్ జరిగినప్పుడు చూశాను. మరొక సంఘటన .. 2000వ సంవత్సరంలో విశాఖ పట్టణంలో కమిషనర్‌గా ఉన్నాను. విక్టర్ అనే ఒక అబ్బాయి కలకత్తాలో చదువుకుంటున్నాడు. హాలీడేస్‌లో ఇద్దరు ఫ్రెండ్స్‌తో ఇంటికి వచ్చాడు. టీ తీసుకురావడానికి అతని తల్లి లోపలికి వెళ్లింది. ఈ పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటూ.. ఏమైందో ఏమో అందులో ఒకడు స్క్రూæడ్రైవర్‌తో విక్టర్ని పొడిచాడు. అది ఛాతీలోకి దూసుకుపోయి ఆ పిల్లవాడు చనిపోయాడు. వాళ్లు భయపడి పారిపోయారు. కేస్ ఫైల్ అయ్యింది. పారిపోయిన వారిని పట్టుకొని జైల్లో పెట్టారు. ఆ తల్లి మా దగ్గరకు వచ్చింది ఆ అబ్బాయిలను కలవాలని. పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. ‘ఆమె వారితో ఏదో మాట్లాడాలనుకుంటుంది. ఆ ఏర్పాట్లు అక్కడే ఉండి చూడమ’ని చెప్పాను. ఆమె ఆ పిల్లల దగ్గరకు వెళ్లి ‘ఎందుకు చేశారయ్యా ఈ పని..’ అని అడిగింది. వాళ్లూ ఏడవడం మొదలుపెట్టారు ‘ఇలా జరుగుతుందని ఊహించలేద’ని. ఆ అబ్బాయిలను క్షమించి వదిలేయమని ఈమె వేడుకుంది. పైగా ‘వాళ్ల తల్లిదండ్రులు ఎక్కడుంటారు?’ అని అడిగింది. ‘ఎందుకు?’ అని అడిగితే.. ‘నేను నా కొడుకును పోగొట్టుకొని బాధపడుతున్నాను. వీళ్లు చేసిన పిచ్చి పని వల్ల జైల్లో ఉన్నారు. దీనికి వాళ్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో.. వాళ్లను ఓదార్చాలి’ అంది. ఎంత గొప్పతనం. ఎంతటి దైవత్వం. సమాజంలో కలిసి పనిచేస్తేనే ఇలాంటి అనుభవాలు కలుగుతాయి. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
జకాత్ నిధులు విద్య కోసం వెచ్చించండి: ఏకేఖాన్
హైదరాబాద్: రంజాన్ మాసంలో వచ్చే సుమారు వెయ్యి కోట్ల రూపాయల జకాత్ ధనాన్ని ముస్లింల విద్య, సంక్షేమం కోసం ఖర్చు చేస్తే నగరంలో పేదరికం అంతమౌతుందని మాజీ డీజీపీ, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహదారులు అబ్దుల్ ఖయ్యూం ఖాన్ అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్ జకాత్ అండ్ చారిటెబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బంజారహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రస్టు కార్యకలపాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅథితిగా ఏకే ఖాన్ పాల్గొని మాట్లాడారు. జకాత్ నిధుల వల్ల నగరంలోని పేద ముస్లింల పరిస్థితులు బాగుపడతాయన్నారు. హైదరాబాద్ జకాత్ ట్రస్టు ద్వారా గత 25 ఏళ్లలో 11 వేల ముస్లిం కుటుంబాలు లబ్దిపొందాయని తెలిపారు. జకాత్ నిధులను సాముహికంగా జమ చేసి ముస్లిం విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఖర్చు చేయాలని పిలుపు నిచ్చారు. ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో చేరితే అ కుటుంబం నుంచి పేదరికం దూరం అవుతుందన్నారు. ముస్లింలు ఇతర ఖర్చులను తగ్గించి పిల్లల విద్యపై డబ్బులు ఖర్చు చేయాలని కోరారు. జకాత్ ట్రస్టు విద్య కోసం చేస్తున్న కృషి అభినందనీయమని ఏకే ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. -
హజ్ యాత్రికుల ఎంపిక పూర్తి
మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు ఏకే ఖాన్ హైదరాబాద్: ఈ ఏడాది మన దేశం నుంచి హజ్ వెళ్లేందుకు లక్షా 72 వేలమందికి సౌదీ అరేబియా ప్రభుత్వం అనుమతినిచ్చిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య సలహాదారు అబ్దుల్ ఖయ్యూం ఖాన్ తెలిపారు. శనివారం నాంపల్లి హజ్‌హౌస్‌లో హజ్‌కు వెళ్లే యాత్రికులను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...2017 హజ్ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా 20,601 దరఖాస్తులు అందాయన్నారు. ఇందులో సాధారణ క్యాటగిరీలో 17,564, ఏ క్యాటగిరీలో 743, బీ క్యాటగిరీలో 2294 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కేంద్ర హజ్ కమిటీ నిబంధనల ప్రకారం ఏ,బీ క్యాటగిరీలో దరఖాస్తు చేసుకున్న 3,037 మంది నేరుగా హజ్ యాత్రకు ఎంపికైయ్యారన్నారు. అనంతరం మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ..ఈ ఏడాది హజ్ యాత్రికుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. 2017 హజ్ యాత్రకు ఎంపికైన వారు ఏప్రిల్ 5 లోపు మొదటి విడత రూ. 81 వేలు హజ్ రుసుమును కేంద్ర హజ్ కమిటీ పేరున డీడీ తీసి జమచేయాలని హజ్ కమిటీ ప్రత్యేక అధికారి తెలిపారు. ఏప్రిల్ 13వ తేదీ లోపు ఎంపికైన యాత్రికులు తమ పాస్‌పోర్టును రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో అందించాలని కోరారు. -
తెలంగాణ కొత్త సీఎస్ గా ఎస్పీ సింగ్
-
తెలంగాణ కొత్త సీఎస్ గా ఎస్పీ సింగ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎస్పీ సింగ్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్ర పదవీకాలం శనివారంతో ముగిసింది. ఆయన పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. శనివారం రాత్రి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ప్రదీప్ చంద్ర స్థానంలో ఎస్పీ సింగ్ ను ఎంపిక చేసింది. బిహార్ కు చెందిన ఎస్పీ సింగ్ పూర్తి పేరు శేఖర్ ప్రతాప్ సింగ్. కాగా, అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ గా శనివారం పదవీ విరమణ చేసిన ఏకే ఖాన్ ను మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారుగా నియమించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా అరవింద్ కుమార్ ను ఎంపిక చేసింది. -
తెలంగాణ ఏసీబీ డీజీగా చారు సిన్హా
హైదరాబాద్: అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) నూతన అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి చారు సిన్హాను నియమిస్తూ శనివారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ పదవిలో కొనసాగుతున్న ఏకే ఖాన్ (డిసెంబర్ 31న) రిటైర్ కానున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చారు సిన్హా ప్రస్తుతం అదే విభాగంలో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పదవీ విరమణ చేయనున్న ఏకే ఖాన్(1981 ఐపీఎస్ బ్యాచ్).. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోట్లు సహా పలు కీలకమన కేసులను పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఈ-ఆఫీసు, లీగల్ సెల్, సైబర్‌సెల్ ఏర్పాటుచేసి దేశంలోనే తొలి సాంకేతిక హంగులు గల ఏసీబీ ఆఫీసుగా తెలంగాణ ఏసీబీ ఆఫీసును తీర్చిదిద్దడంలో ఖాన్ నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. -
విద్యా వ్యవస్థలో మనం దేశానికే ఆదర్శం
♦ తెలంగాణలో సరికొత్త విప్లవం ♦ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ♦ సిద్దిపేటలో తొలి మైనార్టీ గురుకుల పాఠశాల ప్రారంభం ♦ పాల్గొన్న ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ సిద్దిపేట జోన్: విద్యా వ్యవస్థలో మనం దేశానికే ఆదర్శంగా నిలిచామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల విద్యావ్యవస్థలో స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో సీఎం కేసీఆర్ మైనార్టీ గురుకుల పాఠశాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. సోమవారం పట్టణ శివారులోని పొన్నాల వద్ద తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మైనార్టీ గురుకుల పాఠశాలను రాష్ట్ర సొసైటీ చైర్మన్, ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మైనార్టీ విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే రెండేళ్లలో గురుకుల పాఠశాలల నిర్వహణకు రూ.4వేల కోట్లను ఖర్చుచేస్తామన్నారు. ఇంగ్లిష్ మీడియంలో ఉర్దూ, తెలుగు భాషలతోపాటు ముస్లిం విద్యార్థులకు నమాజ్ చేసే అవకాశాన్ని కూడా క ల్పిస్తున్నామన్నారు. అధ్యయన బాటలో మూడు రాష్ట్రాలు... మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీ ముబారక్ పథకం పొరుగున ఉన్న మూడు రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలువనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం రూ.1,200 కోట్లను బడ్జెట్లో ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు, ఏకే ఖాన్లు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్ పటేల్, పొన్నాల సర్పంచ్ రాజమణి, ఎంపీటీసీ నారాయణ, పాఠశాల ప్రిన్సిపాల్ నజీమ్ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
దత్తత గ్రామంలో ఏకేఖాన్ వైద్యశిబిరం
శంషాబాద్: తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ దత్తత గ్రామంలో ఆదివారం వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జుకల్ గ్రామంలో కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఖాన్ పుస్తకాలు పంపిణీ చేశారు. దీనిపై జుకల్ గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
'ఓటుకు కోట్లు కేసు విచారణ కొనసాగుతోంది'
-
'ఓటుకు కోట్లు కేసు విచారణ కొనసాగుతోంది'
హైదరాబాద్ : అవినీతి నిరోధక వారోత్సవాలు డిసెంబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ బుధవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఈ వారంపాటు యువత, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, కళాకారుల బృందాలతో అవగాహన కల్పిస్తామన్నారు. అవినీతిని నిర్మూలిద్దాం, దేశాన్ని అభివృద్ధి చేద్దామన్న నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు. అవినీతిపై సమాచారాన్ని 1064కు ఫోన్ కాల్ చేయాలని ఈ సందర్భంగా ఏకే ఖాన్ ప్రజలకు సూచించారు. ఓటుకు కోట్లు కేసులో ఇద్దరు ఎమ్మెల్యేల స్వర పరీక్షల నివేదిక కోర్టుకు అందిందని చెప్పారు. ఆ నివేదిక తమకు అందించేందుకు ఇప్పటికే కోర్టు అనుమతి కోరామన్నారు. దశల వారీగా ఓటుకు కోట్లు కేసులో విచారణ కొనసాగుతోందని ఖాన్ పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ల్యాబరేటరీ నివేదిక అందాక తదుపరి చర్యలు చేపడతామని ఏకే ఖాన్ తెలిపారు. -
కేటీఆర్‌తో ఏకే ఖాన్ భేటీ
హైదరాబాద్ : ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సోమవారం ఉదయం మంత్రి కేటీఆర్‌తో సచివాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో భాగంగా ఆయన ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దత్తత గ్రామం విషయంపై ఏకే ఖాన్ ఈ సందర్భంగా కేటీఆర్‌తో చర్చించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు, ఊరిలోని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. -
కేసీఆర్‌తో డీజీపీ, ఏసీబీ డీజీ సమావేశం
-
కేసీఆర్‌తో డీజీపీ, ఏసీబీ డీజీ సమావేశం
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు వ్యవహారం గంట గంటకు ఉత్కంఠ పెరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంతో పాటు తాజా పరిణామాలపై వీరు...కేసీఆర్‌తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో మరికొందరికి నోటీసులు ఇచ్చే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. అలాగే ఈ కేసులో పురోగతితో పాటు, జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి అధికారులు వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కేంద్ర హోంశాఖ ప్రతినిధులు ఇవాళ హైదరాబాద్ రానున్నారు. సెక్షన్-8, ఇతర సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. -
రాజధాని గరం గరం..
* బాబు, ఏపీ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారనే ప్రచారం * హైదరాబాద్‌లో రాజకీయ, అధికార వర్గాల హడావుడి * కేసీఆర్‌తో రెండుసార్లు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ *ఏపీ మంత్రులు, అధికారులతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకోవడంతో రాజధాని హైదరాబాద్ కేంద్రంగా మంగళవారం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, మరో ఇద్దరు ఎంపీలకు ఏసీబీ నోటీసులు జారీ చేయనుందన్న వార్తలు, తదనుగుణంగా జరిగిన పరిణామాలు ప్రకంపనలు సృష్టించాయి. ఉదయం ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలవడంతో మొదలైన టెన్షన్.. రాత్రి వరకు కొనసాగింది. కేసీఆర్‌తో ఏకే ఖాన్ భేటీ అయిన కొద్దిసేపటికే డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. దీంతో టీడీపీ అధినేత బాబు, ఆ పార్టీ నేతల్లో ఏదో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందన్న ఉత్కంఠ మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ జేవీ రాముడు, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధ తదితరులతో బాబు సమావేశమై.. తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించేందుకు గల అవకాశాలను సమీక్షించారు. అనంతరం బాబు సచివాలయంలో ఏపీ మంత్రులతో సుదీర్ఘంగా భేటీ అయి... తెలంగాణ పోలీసులు, ఏసీబీ తీసుకునే చర్యలపై చర్చించారు. మరోవైపు ఇదే సమయంలో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ‘ఓటుకు నోటు’ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులతో రెండుసార్లు సమావేశమై మరోసారి సీఎం కేసీఆర్‌ను కలిసి తాజా పరిస్థితిని వివరించారు. కాగా ఏపీ మంత్రుల భద్రతను తామే చూసుకుంటామని ఆ రాష్ట్ర డీజీపీ రాముడు గవర్నర్‌ను కలిసి వివరించడం గమనార్హం. రోజంతా హడావుడి తాజా పరిణామాల నేపథ్యంలో ఏసీబీ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్), ఏపీ, తెలంగాణ సీఎంల క్యాంపు కార్యాలయాలు, సచివాలయం, ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు హడావుడి కొనసాగింది. ఒకదశలో సచివాలయంతో పాటు ఏసీబీ కార్యాలయం, బాబు నివాసం వద్ద పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం వందలాది మంది తెలుగు తమ్ముళ్లు ట్రస్ట్భవన్ వద్దకు తరలివచ్చారు. ఈ హడావుడిని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న మీడియాను టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఏపీ పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
కేసీఆర్‌తో ఏకే ఖాన్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఏకే ఖాన్ సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏసీబీ సమన్లు జారీ చేయనుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఏకే ఖాన్ ఓటుకు నోటు కేసు విషయం కేసీఆర్‌తో చర్చించినట్టు సమాచారం. -
బాబుపై కేసు నమోదుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ !
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న ఓటుకు నోటు వ్యవహారంలో దూకుడు పెంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులోభాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అవినీతి నిరోధక శాఖ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో చంద్రబాబుకు ఏ క్షణమైనా నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసుకుంటోది. అదీకాక చంద్రబాబు ఢిల్లీ పయనంపై కూడా వారు ఈ సందర్భంగా వారు చర్చించినట్లు తెలుస్తోంది. -
బాబుపై కేసునమోదుకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్!
-
ఉచ్చు బిగించాకే..!
రేవంత్‌ను విచారించిన తర్వాతే చంద్రబాబుకు నోటీసులు ♦ సూత్రధారిగా మరిన్ని ఆధారాల సేకరణకు ఏసీబీ యత్నాలు ♦ అన్ని కోణాల్లో నిందితులను ప్రశ్నించేందుకు సంసిద్ధం సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముడుపుల కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నోటీసులు జారీ చేయాలని అవినీతి నిరోధక శాఖ భావిస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలినప్పటికీ, స్టీఫెన్‌కు రేవంత్ ఇవ్వజూపిన రూ.50 లక్షల సొమ్ముకు సంబంధించిన వ్యవహారంలో పురోగతి ఉన్న దృష్ట్యా కొద్ది రోజులు వేచి చూడాలన్న వైఖరితో ఏసీబీ ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని విచారణకు రప్పించడానికి అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఇప్పటికే ఉన్నప్పటికీ, మరిన్ని వివరాల సేకరణకు దర్యాప్తు సంస్థ ప్రయత్నిస్తోంది. రేవంత్, మరో ఇద్దరు నిందితులను ఐదు రోజుల కస్టడీకి కోర్డు అప్పగిస్తే కేసులో మరింత పురోగతి ఉంటుందని భావిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు సమీపంలోని ఓ బ్యాంక్ నుంచి డ్రా చేసిన డబ్బు ఎవరి ఖాతాలోనిది, ఆ ఖాతాదారునికి టీడీపీతో ఉన్న సంబంధం, ఆ డబ్బును ఓ సినీ నిర్మాత ఇంటికి ఎందుకు చేర్చారు? బ్యాంక్ నుంచి డ్రా చేసిన రూ.2.5 కోట్లలో మిగిలిన రూ.2 కోట్ల సొమ్ము ఎక్కడుంది వంటి వివరాల సేకరణలో ఏసీబీ నిమగ్నమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలులో భాగంగా ఐదుగురు ఎమ్మెల్యేలకు అడ్వాన్ప్‌గా రూ.50 లక్షల చొప్పున ఇచ్చేందుకే ఆ డబ్బును డ్రా చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. సీఎంకు వివరించిన ఖాన్ అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ జనరల్ ఎ.కె.ఖాన్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆయన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. రేవంత్ కేసు పురోగతిని సీఎంకు వివరించారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్ సంభాషణలను ఒకచోట కూర్చి తయారు చేసిన నివేదికను కూడా అందజేసినట్లు తెలిసింది. బాస్ పంపితే వచ్చానని రేవంత్ పదే పదే ప్రస్తావించిన నేపథ్యంలో ఆ బాస్ చంద్రబాబేనని ధ్రువీకరించేందుకు ఆధారాలను కూడా ఏసీబీ సేకరించింది. ఇటీవలే ఓ న్యూస్ చానల్ అధినేతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ పదేపదే చంద్రబాబును బాస్‌గా సంభోదించారు. బాస్ ఫలానా పని అప్పగించారని రేవంత్ అనడం, బాస్ చంద్రబాబునాయుడు అంటూ యాంకర్ ఉచ్చరించడం వంటి అంశాలతో కూడిన సీడీని ఏసీబీ సంపాదించింది. రేవంత్ బాస్ అని సంభోదించినప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న చానల్ యాంకర్ చంద్రబాబు అని ఉచ్చరించడం ఆ సీడీలో చాలాచోట్ల స్పష్టంగా ఉంది. ఇది తమకు సాక్ష్యంగా ఉపయోగపడుతుందని ఏసీబీ భావిస్తోంది. కస్టడీకిస్తే ప్రశ్నల పరంపర రేవంత్‌రెడ్డిని కోర్టు కస్టడీకి అప్పగిస్తే ఆయన్ని ప్రశ్నించడానికి ఏసీబీ ప్రశ్నావళిని రూపొందించింది. వాటికి రేవంత్ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసేం దుకు అవసరమైన ఆధారాలను కూడా సిద్ధం చేసుకుంది. ఈ కేసులో పరారీలో ఉన్నట్లు చెబుతున్న నాలుగో నిందితుడు మత్తయ్యను కూడా అరెస్టు చేసి మిగతా నిందితులతో కలిపి విచారించే అవకాశముంది. మత్తయ్యకు సంబంధించిన కీలక ఆధారాలను ఏసీబీ ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది. కాగా, రేవంత్ కస్టడీ గడువు ముగిసిన తర్వాతే చంద్రబాబును విచారించవచ్చని ఏసీబీ వర్గాలు చె బుతున్నాయి. ‘ప్రస్తుతమున్న ప్రాథమిక ఆధారాల ను పరిగణనలోకి తీసుకుని చట్టబద్ధంగా ఏపీ ముఖ్యమంత్రికి నోటీసులివ్వడం సమస్య కానేకాదు. రేవంత్‌ను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశమున్నం దున వ్యూహాత్మకంగానే ఆచితూచి వ్యవహరిస్తున్నామ’ని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. -
బాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలి
ఏకే ఖాన్‌కు తెలంగాణ అడ్వొకేట్ల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే కొనుగోలు కుంభకోణంలో ఏసీబీకి చిక్కిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరును వెంటనే ఎఫ్ఐఆర్లో చేర్చాలని తెలంగాణ అడ్వొకేట్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అడ్వొకేట్లు టి. శ్రీరంగారావు, కె. గోవర్దన్‌రెడ్డి, వి. ఇంద్రసేనారెడ్డి, తిరుపతివర్మ తదితరులు మంగళవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లి డీజీని కలిసేం దుకు ప్రయత్నించారు. ఆయన లేకపోవడంతో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. స్టీఫెన్‌సన్‌తో సంభాషణల్లో బాబు పేరును ‘బాస్’, ‘నాయుడు’ పేరుతో రేవంత్పలుమార్లు సంబోధించినట్లు వీడియో ఫుటేజీల్లో ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రే కాక టీడీపీ జాతీయ అధ్యక్షుడని, ఆయన బయట ఉంటే కేసులోని సాక్షాధారాలను తారుమారు చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. -
ఏకే ఖాన్‌ను కలిసిన టీ లాయర్లు
హైదరాబాద్ : ఓటుకు నోటు స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా చేర్చాలని కోరుతూ టీ లాయర్లు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ను కలిశారు. మంగళవారం తెలంగాణ అడ్వకేట్ జేఏసీ లాయర్లు గుంపుగా వెళ్లి ఖాన్‌ను కలిసి బాబు పేరును నిందితుల్లో చేర్చాలని కోరారు. -
రేవంత్‌పై నాన్‌బెయిలబుల్ కేసు
-
రేవంత్‌పై నాన్‌బెయిలబుల్ కేసు
మీడియాతో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ.50 లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ డీజీ ఎ.కె.ఖాన్ తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీఫెన్సన్ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి ట్రాప్ చేసినట్లు తెలిపారు. ‘‘రేవంత్‌రెడ్డి ప్రలోభపెడుతున్నారంటూ మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీతో విచారణకు ఆదేశించాం. ఆదివారం రేవంత్ రూ.50 లక్షలు స్టీఫెన్సన్కు ఇస్తూ పట్టుబడ్డారు. రేవంత్‌తో పాటు, డబ్బు లు తెచ్చిన బిషప్ సెబాస్టియన్ హరి, ఉదయ్‌సింహలను అదుపులోకి తీసుకున్నాం. అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 12, ఐపీసీ సెక్షన్ 120డి, 34 (లంచం ఇవ్వజూపడం, మూకుమ్మడిగా ప్రలోభానికి గురిచేయడం) కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశాం. వీరితోపాటు, ఇంతకు ముందు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఈ డీల్ గురించి మాట్లాడిన మాథ్యూస్ జెరూసలం అనే వ్యక్తిపైనా కేసు నమోదు చేశాం. అతను మా అదుపులో లేడు. రూ.50 లక్షలు కూడా రికవరీ చే శాం’’ అని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పంపిస్తేనే వచ్చానన్న రేవంత్ వ్యాఖ్యలపై విచారణలో అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ‘‘సాక్షాలన్నీ దొరికాయి. వాటిని, ప్రాథమిక ఆధారాలను పరిశీలించాకే కేసు నమోదు చేశాం. విచారణ అనంతరం రేవంత్‌ను జడ్జి ముందు ప్రవేశపెడతాం’’ అని వివరించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఎక్కడినుంచి వచ్చిందనేది కూడా విచారణలో తెలుస్తుందన్నారు. డీజీపీని కలిసిన టీడీపీ నేతలు: రేవంత్ అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు ఎర్రబెల్లి తదితరులు డీజీపీ అనురాగ్‌శర్మను కలిశారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్‌ను చంపే కుట్ర జరుగుతోందని, కావాలనే కేసులో ఇరికించారని ఫిర్యాదు చేశారు. కాగా చంద్రబాబు అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. -
పాక్‌పై విజయం: తెలంగాణ ఎసిబి డిజి ఎకె ఖాన్ స్పందన
-
అవినీతిపై తెలంగాణ రాష్ట్ర ప్రజల గళం
-
లంచావతారులు!
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఫోన్ నంబర్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు 4 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన ఫోన్‌కాల్స్ 10,750 అవినీతిపై వచ్చిన కాల్స్ 499 అవినీతిలో మునిగిన ప్రభుత్వ యంత్రాంగం పలు సమస్యలతో పాటు అవినీతిపై 499 ఫిర్యాదులు ఎమ్మెల్యేలు మొదలుకొని వీఆర్వోల వరకు అక్రమార్కులే అధికారుల లైంగిక వేధింపులపైనా ఆరోపణలు ఫిర్యాదులపై ఆరా తీసిన ఏసీబీ డీజీ ఏకే ఖాన్ వారం రోజుల్లో ఏసీబీకి అందనున్న సమగ్ర నివేదిక సీఎంవో నిర్వాకంతో ఫిర్యాదుదారుల వివరాలు బహిర్గతం సాక్షి, హైదరాబాద్: అవినీతిపై రాష్ర్ట ప్రజలు గళం విప్పారు. అక్రమార్జనలో ఆరితేరిన ప్రజాప్రతినిధులు, అధికారులు, కిందిస్థాయి ప్రభుత్వ సిబ్బందిపై ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఎమ్మెల్యేల నుంచి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శుల వరకు విధుల్లో భాగంగా వెలగబెడుతున్న అవినీతి బాగోతాన్ని కుప్పలుతెప్పలుగా బయటపెడుతున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో లంచావతారుల ఆగడాలపై సామాన్య ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల ప్రకటించిన ఫోన్ నంబర్(040-23254071)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే అవినీతిపరుల పేర్ల చిట్టా చాంతాడంత తయారైంది. ప్రభుత్వ యంత్రాంగం అక్రమాలపై సగటున గంటకు ఐదు.. రోజుకు 125 ఫిర్యాదులు అందుతున్నాయి. సీఎం కార్యాలయం ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్‌కు ఇప్పటివరకు 10,750 కాల్స్ అందగా.. వాటిలో 499 కాల్స్ అవినీతికి సంబంధించినవి ఉన్నాయి. మిగిలిన వారంతా ఇతర సమస్యలను మొరపెట్టుకున్నారు. కాగా, అవినీతిపై అందిన ఫిర్యాదుల్లో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా.. ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రేషన్‌కార్డులు, సామాజిక పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, పట్టాదారు పాసు పుస్తకాలు, పౌర సరఫరాలు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, ఆధార్‌కార్డుల జారీ తదితర అనేక పథకాల్లో ప్రభుత్వ సిబ్బంది లంచాల కోసం వేధిస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారుల లైంగిక వేధింపులను కూడా కొందరు వెల్లడించారు. రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్ నేతృత్వంలోని అధికారుల బృందం బుధవారం కోఠిలోని ఆరోగ్యశ్రీ కాల్ సెంటర్‌ను సందర్శించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీసింది. ఈ బృందంలో ఏబీసీ జేడీ ఎన్వీ శ్రీనివాస్, డీఎస్పీలు అశోక్ కుమార్, రవికుమార్, నరేందర్ రెడ్డి ఉన్నారు. అవినీతిపై అందిన ఫిర్యాదులపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని కాల్‌సెంటర్ జనరల్ మేనేజర్‌ను ఏసీబీ అధికారులు కోరారు. సమాచార సేకరణ కోసం నిర్ణీత ఫార్మాట్‌ను అందజేశారు. ఆధారాలు లభిస్తే చర్యలు తప్పవు: ఖాన్ ఫిర్యాదుదారుడి ఫోన్ కాల్ ఆధారంగా లంచం అడిగినట్లు బలమైన ఆధారాలు లభిస్తే సదరు ఉద్యోగి లేదా అధికారిని సస్పెండ్ చేస్తామని ఏకే ఖాన్ తెలిపారు. జైలు శిక్ష కూడా తప్పదన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేందుకు ఏసీబీ కృషి చేస్తుందన్నారు. మిగతా ఫిర్యాదులను జిల్లాలవారీగా జిల్లా ఏసీబీ డిఎస్పీ కార్యాలయాలకు పంపుతామని తెలిపారు. ఏసీబీ హెడ్ క్వార్టర్స్ ద్వారా కేసుల విచారణను సమీక్షిస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అవినీతి రహితంగా అందించేందుకు అధికారుల్లో మార్పు రావాలన్నారు. ఫిర్యాదుల సేకరణ కోసం నాలుగు ఏసీబీ బృందాలను ఏర్పాటు చేస్తామని, అవినీతికి సంబంధించిన కేసులనే తాము పరిశీలిస్తామని తెలిపారు. మీడియాకు ఫిర్యాదుదారుల వివరాలు సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఏర్పాటైన ప్రత్యేక ఫోన్ నంబర్‌కు అవినీతిపై ఫిర్యాదు చేసిన ప్రజల వివరాలు బహిర్గతమయ్యాయి. సీఎం కార్యాలయం ప్రచార విభాగం అధికారుల నిర్వాకంతో ఈ పొరపాటు జరిగింది. అవినీతిపై సామాన్యుల నుంచి అందిన ఫిర్యాదుల సమగ్ర సమాచారాన్ని కాల్‌సెంటర్ నుంచి తెప్పించుకున్న సీఎంవో వర్గాలు.. దాన్ని పూర్తిగా పరిశీలించి చూడకుండానే పాత్రికేయులకు విడుదల చేశాయి. అయితే ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న ఈ-డాక్యుమెంట్లలో ఫిర్యాదు చేసిన వ్యక్తుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఎవరిపై ఫిర్యాదు చేశారు తదితర సమాచారం కూడా ఉంది. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచాల్సిన సీఎం కార్యాలయం ఈ విషయంలో విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్కారుకు అందిన కొన్ని ఫిర్యాదులు * మహబూబ్‌నగర్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంత ఎమ్మెల్యే ఒకరు పింఛన్ల మంజూరు కోసం లంచాలు వసూలు చేస్తున్నారు. * మెదక్ జిల్లాలోని వెనకబడిన ప్రాంత ఎమ్మెల్యే ఒకరు డబ్బులు అడుగుతున్నారు. * మెదక్ జిల్లా వైద్యాధికారి ఒకరు లంచాల కోసం వేధిస్తున్నారు. ఓ అదనపు వైద్యాధికారీ మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. * ఎస్సీఈఆర్టీ అధికారి ఒకరు లంచాలు వసూలు చేస్తున్నారు. మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. * ఉస్మానియా ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది రోగులను డబ్బులు అడుగుతున్నారు. చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. * భూమి రిజిస్ట్రేషన్‌కు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర మండల డిప్యూటీ తహసీల్దార్ రూ. 5,000 లంచం అడుగుతున్నారు. * వృద్ధాప్య పింఛన్ మంజూరు కోసం నల్లగొండ జిల్లా నేరేడుచర్ల ఎంపీడీవో రూ. 5,000 లంచం అడిగారు. * నల్లగొండ జిల్లా నిడ్మనూరు మండలం ఉట్కూరులో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కోసం విద్యుత్ శాఖ హెల్పర్ లంచం అడిగాడు. * నల్లగొండ వీఆర్వోకు డబ్బులు చెల్లించినా రేషన్ కార్డు జారీ చేయలేదు. * మెదక్ జిల్లా కోహిర్ సబ్‌స్టేషన్ కాంట్రాక్టు ఉద్యోగి జీతం నుంచి ‘శబరి ఎలక్ట్రికల్స్’ అనే కాంట్రాక్టు సంస్థ ప్రతి నెలా రూ. వెయ్యి మిగుల్చుకుంటోంది. ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తోంది. * కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో వికలాంగ ధ్రువీకరణ పత్రాల కోసం వైద్యులు రూ. వెయ్యి నుంచి రూ. రెండు వేలు వసూలు చేస్తున్నారు. -
ఏసీబీలో విభజన కసరత్తు పూర్తి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర అవినీతినిరోధకశాఖ(ఏసీబీ)లో విభజన కసరత్తును ఆ శాఖాధిపతి ఏకే ఖాన్ దాదాపుగా పూర్తి చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ విభాగానికి బంజారాహిల్స్‌లో కొత్త భవానాన్ని గత సంవత్సరం నిర్మించారు. మొదట మోజంజాహి మార్కెట్ వద్ద ఉన్న ఏసీబీ భవనాన్ని సమాచార హక్కు కమిషనర్లకు కేటాయించడంతో కొత్త భవనంలోకి ఏసీబీ హెడ్‌క్వార్టర్స్‌ను మార్చారు. సువిశాలమైన ఈ భవనంలో ఏసీబీ డెరైక్టర్ జనరల్‌తో పాటు డెరైక్టర్, అదనపుడెరైక్టర్లు, జాయింట్ డెరైక్టర్లు, డీఎస్పీ,ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులు మొత్తం 900 మంది ఉన్నారు. వీరితోపాటు ఒక వంద మంది వరకు మినిస్టీరియల్ స్టాఫ్ ఉన్నారు. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులను ఈ ప్రాంతానికి, సీమాంధ్రకు చెందిన వారిని ఆ ప్రాంతానికి దాదాపుగా కేటాయించినట్లు సమాచారం. -
ఉత్సాహంగా 10కె రన్
-
అవినీతి అధికారుల జాబితా పంపండి
ఏసీబీ డీజీకి గవర్నర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లోని అవినీతి అధికారుల జాబితాను పంపాల్సిందిగా గవర్నర్ నరసింహన్ ఏసీబీ డీజీ ఎ.కె.ఖాన్‌ను ఆదేశించారు. అవినీతి ఎక్కువగా ఉందని, అవినీతికి పాల్పడే అవకాశం ఉందని భావించిన శాఖల్లోని అధికారుల జాబితాను పంపాలని తెలిపారు. ఏసీబీ, విజిలెన్స్ కేసులకు సంబంధించి ప్రభుత్వం ఉపసంహరించిన వాటి జాబితాను కూడా పంపాలన్నారు. అవినీతికి పాల్పడే అధికారులపై నిఘా ఉంచనున్నట్లు గవర్నర్ హెచ్చరించారు. బుధవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్ మహంతి ఈ విషయం తెలియజేశారు. గవర్నర్‌కు పంపించే నోట్‌ను సాధారణ పరిపాలన శాఖకు కూడా పంపాలని ఖాన్‌కు మహంతి సూచించారు. ఆ నోట్‌ను అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులేట్ చేయనున్నట్లు సీఎస్ తెలిపారు. ఎంతటి వారినైనా వదలం: ఎ.కె ఖాన్ హైకోర్టు ఆదేశాల మేరకు మద్యం సిండికేట్ల కేసుపై తిరిగి దృష్టి సారించిన ఏసీబీ, దర్యాప్తు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి అప్పటి జేడీ (ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి) శ్రీనివాసరెడ్డి సేకరించిన ఆధారాలను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరిన్ని ఆధారాల కోసం ఏసీబీ ప్రత్యేక బృందం శోధిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎ.కె. ఖాన్ మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు సాగిస్తున్నామని, ఆధారాలుంటే ఎంతటి వారున్నా చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో గతంలో వెలుగు చూసిన మద్యం సిండికేట్ల కుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇక్కడ ఏసీబీకి పట్టుబడ్డ ఎక్సైజ్ అధికారుల డైరీల్లోని సమాచారం ఆధారంగా ఇతర జిల్లాల్లో విస్తరించిన మద్యం సిండికేట్ల వ్యవహారం బట్టబయలైన విషయం విదితమే. -
అవినీతిపరుల భరతంపడతాం
ఆలంపల్లి, న్యూస్‌లైన్: అవినీతి అధికారుల భరతంపడతామని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) డీజీ ఏకే ఖాన్ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ సమీపంలో హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతిపరుల చిట్టాను రూపొందించే క్రమంలో వివిధ శాఖలవారీగా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. తిమింగలాల్ని వదిలేసి చిన్న చేపలను పడుతున్నారని వస్తున్న ఆరోపణలపై మాట్లాడుతూ.. ‘ చిన్న పెద్ద అధికారి అనే తేడా లేదు.. తప్పు ఎవరు చేసినా తప్పే కదా’ అన్నారు. అవినీతి వ్యవహారాల్లోనూ చాలావరకు సుమోటోలుగా కేసులు నమోదు చేస్తున్నట్లు ఏసీబీ డీజీ తెలిపారు. తమ శాఖలో సిబ్బంది కొరత ఉందని, ప్రస్తుతం ఉన్నవారితో నెట్టుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఖాళీల జాబితాను రూపొందిస్తున్నాం.. త్వరలో నియమాకాలు చేపడతామని ఏకే ఖాన్ చెప్పారు. అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తామని, ఇందుకు ప్రజలు కూడా ఏసీబీతో సహకరించాలని ఆయన కోరారు. -
సచివాలయంలో కూడా దాడులు చేస్తాం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత అవినీతి శాఖలను ఏసీబీ గురువారం ప్రకటించింది. అవినీతిలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో ఉండగా, రెండోస్థానంలో హోంశాఖ, మూడో స్థానంలో పంచాయతీ రాజ్ శాఖ నిలిచింది. అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వశాఖల్లో ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేస్తామని, ఆయా శాఖల్లో అత్యంత అవినీతిపరుడిని గుర్తించి వల వేస్తామని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తెలిపారు. అవసరం అయితే సచివాలయంలో కూడా దాడులు చేస్తామన్నారు. 2013లో రెవెన్యూ శాఖ అధికారులపై 98 కేసులు నమోదు కాగా, హోంశాఖలో 46 కేసులు నమోదైనట్లు ఏకే ఖాన్ తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నవారిపై కూడా దృస్టి సారిస్తామని ఆయన చెప్పారు. ఎక్కువ అవినీతికి పాల్పడుతున్న వారి సమాచారం సేకరించామని ఏకే ఖాన్ తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టులపై తనిఖీలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. ప్రజల సహకారంతో ఎట్టకేలకు అవినీతిని నిర్మూలిస్తామని ఏకే ఖాన్ పేర్కొన్నారు. -
అవినీతి ప్రభుత్వ ఉద్యోగులకు హడల్!
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కొరడా ఝుళిపించనున్నారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం ఏసిబికి అందజేయడానికి ప్రత్యేకంగా ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. అవినీతిపై సమాచారం ఉంటే తమకు తెలియజేమని ఏకే ఖాన్ చెప్పారు. రేపు అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రభుత్వశాఖల్లో అవినీతిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏసీబీకి చిక్కకుండా లంచాలు తీసుకుంటున్న వారికోసం ఎలక్ట్రానిక్ డివైస్, స్పై కెమెరాలను ఉపయోగిస్తామని చెప్పారు. -
అధికారులపై నిఘా ఉంచాం: ఏకే ఖాన్
-
అధికారులపై నిఘా ఉంచాం: ఏకే ఖాన్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అర్థరాత్రి నుంచి చెక్‌పోస్టుల్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ ఇప్పటివరకూ ఏడుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. అధికారులతో పాటు వారికి సహకరిస్తున్న ప్రయివేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఏకే ఖాన్ తెలిపారు. సిబ్బందితో పాటు ఉన్నతాధికారులపై విచారణ జరిపిస్తామని ఏకే ఖాన్ పేర్కొన్నారు. ప్రజలతో మమేకం అయ్యే శాఖలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న అధికారులపై నిఘా ఉంచామన్నారు. ఈ సంవత్సరంలో 334 ట్రాప్ కేసులు, 36 తనిఖీ కేసులో, 21 అక్రమాస్తుల కేసులు నమోదు చేశామన్నారు. అవినీతి అధికారులతో పాటు వారిని ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏకే ఖాన్ హెచ్చరించారు. సీబీఐ సహకారంతో కేసులు విచారణ మరింత వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏసీబీ తనిఖీలను విస్తృతం చేసేందుకు అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను సమకూర్చుంటున్నామని ఆయన తెలిపారు. -
తేజ్‌దీప్‌పై విచారణకు అనుమతి
సాక్షి,హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్ మీనన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎపీఎస్పీఎఫ్) డెరైక్టర్ జనరల్‌గా ఉన్న అదనపు డీజీ తేజ్‌దీప్‌పై అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరపడానికి ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్ సోమవారం మీడియాకు తెలిపారు. లీగల్ మెట్రాలజీ(తూనికలు, కొలతల శాఖ) కంట్రోలర్‌గా ఉన్న సమయంలో ఆమె అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే విభాగానికి చెందిన డిప్యూటీ కంట్రోలర్ శ్రీరాంకుమార్.. తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్లను వారు కోరుకున్నచోట పోస్టింగ్ ఇవ్వడానికిగాను లంచం తీసుకుంటుండగా 2008లో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే కంట్రోలర్ తేజ్‌దీప్ ఆదేశాల మేరకే తాను లంచం తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో శ్రీరాంకుమార్ వెల్లడించారు. ఈ ఘటనపై అప్పుడు ఏసీబీ డీజీగా ఉన్న ఆర్ఆర్ గిరీష్‌కుమార్ ప్రభుత్వానికి నివేదికను కూడా పంపించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత తేజ్‌దీప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఎట్టకేలకు ప్రభుత్వం ఇప్పుడు అనుమతించింది. సీఐడీ కేసులోనూ త్వరలో చార్జిషీటు..! సీఐడీలో కూడా తేజ్‌దీప్‌పై ఇప్పటికే ఒక కేసు పెండింగ్‌లో ఉంది. ఆమె హైదరాబాద్ నగర జాయింట్ పోలీసు కమిషనర్‌గా ఉన్నప్పుడు హరిత అనే మహిళను బెదరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై బాధితురాలు జాతీయ మానవహక్కు ల కమిషన్లోనూ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ హరితకు రూ.4 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని తేజ్‌దీప్‌ను ఆదేశించింది. కాగా హరితపై దాడికి సంబంధించిన కేసుపై సీఐడీ విభాగం విచారణను పూర్తి చేసింది. అప్పటి సీఐడీ అదనపు డీజీ రమణమూర్తి హయాంలో ఈ కేసుపై కోర్టులో చార్జిషీటును వేయడానికి ప్రభుత్వ అనుమతి కోరినా స్పందన రాలేదు. అయితే తాజాగా ఏసీబీ అధికారులు తేజ్‌దీప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపడానికి ప్రభుత్వం అనుమతించడంతో తమ వద్ద ఉన్న కేసుపైనా చార్జిషీటు వేయడానికి అనుమతి కోరడానికి సీఐడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
అవినీతి అంతానికి నిజాయితీగా వ్యవహరిస్తాం:ఏకే ఖాన్
హైదరాబాద్:అవినీతి అంతానికి నిజాయితీగా వ్యవహరిస్తామని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తెలిపారు. ఇన్నాళ్లు ఆర్టీసీ ప్రగతి చక్రాలను నడిపించిన ఖాన్ అవినీతి నిరోధక శాఖకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. రోజు రోజుకూ హెచ్చరిల్లుతున్న అవినీతికి సంబంధించి ఆయన మాట్లాడారు. అవినీతి రూపుమాపడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. అవినీతి సమస్య అనేది ఒక్క రోజులో అంతరించిపోదని, దీని నివారణకు కొత్త పద్దతులను అనుసరిస్తామన్నారు. అవినీతి అధికారులను పట్టుకునేందుకు సమగ్రమైన ప్రణాళికలు చేపట్టాల్సిన అవశ్యకత ఉందని ఏకే ఖాన్ తెలిపారు. -
మా నాన్నబస్సు కండక్టర్: ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు
హైదరాబాద్: ' మా నాన్న ఆర్టీసీ కండక్టర్. అయినా కూడా మమ్ముల్ని కష్టపడి చదివించారు. నేను ఈ స్థాయికి చేరడానికి నాన్న కృషే నని' ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన జె. పూర్ణచంద్రరావు తెలిపారు. ఏకే ఖాన్ కు స్థానం చలనం కల్గడంతో పూర్ణ చంద్రరావు శనివారం ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నాన్న రాధాకృష్ణ మూర్తి ఆర్టీసీ కండక్టర్ చేసినా కూడా పిల్లల పట్ల బాధ్యాయుతంగా ఉండేవారన్నారు. ఆయన రుణం తీర్చుకునేందుకు అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉందని పూర్ణ చంద్రరావు తెలిపారు. 1988 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావును ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మొహంతి గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఇన్నాళ్లూ ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలను నడిపించిన సారథి ఏకే ఖాన్.. అవినీతి నిరోధక శాఖకు బదిలీ అయ్యారు. -
ఏసీబీ డీజీగా ఏకే ఖాన్; ఆర్టీసీకి పూర్ణచంద్రరావు
ఇన్నాళ్లూ ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలను నడిపించిన సారథి ఏకే ఖాన్.. అవినీతి నిరోధక శాఖకు బదిలీ అయ్యారు. 1981 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన అబ్దుల్ ఖయ్యూంఖాన్ గత కొంత కాలంగా ఆర్టీసీ ఎండీగా ఉంటూనే ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. అంతకుముందు ఆ పదవిలో ఉన్న బయ్యారపు ప్రసాదరావును డీజీపీగా నియమించినప్పటి నుంచి ఖాన్ జోడు పదవుల్లో ఉన్నారు. కాగా ఇప్పుడు ఆయనను పూర్తి స్థాయిలో ఏసీబీ డీజీగా నియమించారు. కాగా, ఆయన స్థానంలో 1988 బ్యాచ్‌కి చెందిన మరో సీనియర్ ఐపీఎస్ అధికారి జె.పూర్ణచంద్రరావును ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మొహంతి గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. -
ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు: ఏకే ఖాన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు విస్తరించిన ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు, సర్వీసులు నడపాలని, రాత్రి సర్వీసుల సమయాన్ని పొడిగించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ వెల్లడించారు. ఐటీ కంపెనీలు కోరితే వారి ఉద్యోగుల కోసం ప్రత్యేక సర్వీసులతోపాటు, అద్దెకు కూడా బస్సులను అందజేస్తామని తెలిపారు. ఐటీ కారిడార్ పరిధిలో ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చే అంశంపై ఐటీ సంస్థల ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులతో సీఎం కిరణ్ శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఐటీ కారిడార్‌లో 2 లక్షల మంది పనిచేస్తుండగా వారిలో 40% మంది ప్రజారవాణా ద్వారానే ప్రయాణిస్తున్నారని, వీరి సౌకర్యార్థం ఆర్టీసీ రోజూ 300 బస్సులతో 4 వేల ట్రిప్పులు నడుపుతోందని తెలిపారు. నగరం నలుమూలలతోపాటు దగ్గరలోని ఎంఎంటీఎస్ స్టేషన్లతో బస్సులను అనుసంధానిస్తామని చెప్పారు. -
సీమాంధ్రలో కదిలిన బస్సు
-
సీమాంధ్రలో కదిలిన బస్సు
ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ - ఫలించిన సర్కారు చర్చలు ‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం’పై సవరణతో జీవో 9,500 మంది కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణకు ఓకే కార్మికులకు పండగ అడ్వాన్సు ఇచ్చేందుకు సర్కారు సరే సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి యథావిధిగా బస్సు రథచక్రం కదిలింది. దాదాపు రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం రెండు రోజుల పాటు జరిపిన చర్చలు శుక్రవారం రాత్రికి కొలిక్కివచ్చాయి. బస్ భవన్లో రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌లతో జరిగిన సుదీర్ఘ చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకించడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ సీమాంధ్రలో గత 60 రోజులపాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు డిమాండ్లపై మంత్రి బొత్స ఆధ్వర్యంలో బస్ భవన్లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మొదలైన చర్చలు రాత్రి 11 గంటల వరకూ ఏడు గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమించేందుకు అంగీకరించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌ను అంగీకరిస్తూ అధ్యయన కమిటీ ఏర్పాటు చేసేందుకు సర్కారు ముందుకు రావటంతో పాటు మరికొన్ని డిమాండ్లను కూడా అంగీకరించడంతో.. 60 రోజులుగా జరుగుతున్న సమ్మెకు తెరపడింది. మా డిమాండ్లకు అంగీకరించారు: కార్మిక సంఘాలు సమ్మె వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ప్రస్తుత తుఫాను పరిస్థితిని పరిగణలోకి తీసుకుని సమ్మెను విరమిస్తున్నట్టు ఈయూ అధ్యక్షడు పద్మాకర్ తెలిపారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. ఇందుకోసం అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం జారీచేసిన జీవో సంతృప్తికరంగా లేదన్న తమ అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని, దీనిని సవరిస్తూ శుక్రవారం కొత్త జీవోను జారీచేయటాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. దీనితో పాటు సీమాంధ్ర ప్రాంతంలో జరిగిన సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణించటంతో పాటు.. కార్మికులకు పండుగ అడ్వాన్స్ చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించడంతో ఎలాంటి షరతులు లేకుండా సమ్మె విరమించేందుకు సిద్ధమయ్యామన్నారు. కార్మికులు వెంటనే విధుల్లోకి చేరతారని ఎన్ఎంయూ అధ్యక్షుడు మహ్మమూద్ తెలిపారు. సమ్మె విరమించారు: బొత్స ‘‘రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో గత 60 రోజులుగా జరుగుతున్న ఉద్యమం వల్ల ఆర్టీసీ తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రజలు కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే సున్నితాంశ పరిష్కారం రాజకీయపరంగా జరగాల్సి ఉంది. దీనిని ప్రభుత్వంపై ఉంచి సమ్మె విరమించాలని చేసిన విజ్ఞప్తికి ఆర్టీసీ కార్మికులు అంగీకరించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే విధుల్లోకి వస్తామని హామీ ఇచ్చారు’’ అని మంత్రి బొత్స అనంతరం మీడియాకు తెలిపారు. డిమాండ్లు - పరిష్కారాలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ మేరకు సవరణ ఉత్తర్వులను శుక్రవారం ప్రభుత్వం జారీచేసింది. ఆర్టీసీలో ఉన్న అప్పులపై కోటి రూపాయలు వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీని ప్రభుత్వమే భరించటంతో పాటు ఇప్పటివరకు ఉన్న అప్పులను మాఫీ చేసేందుకు ప్రభుత్వ సాయాన్ని పరిశీలిస్తున్నామని సర్కారు స్పందించింది. సకల జనుల సమ్మె సందర్భంగా మోటార్ వెహికల్ (ఎంవీ) ట్యాక్స్‌ను మినహాయించారని.. 2013-14 ఆర్థిక సంవత్సరానికి కూడా ఎంవీ ట్యాక్స్‌ను మినహాయించాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆర్టీసీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దృష్ట్యా డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను మినహాయించి ట్యాక్స్ హాలిడేగా ప్రకటించాలని కోరారు. అయితే, ట్యాక్స్ మొత్తాన్ని రీ-యింబర్స్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 10 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలని, ఇప్పటికే కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా.. ఇందుకు కూడా అంగీకరిస్తూ 100 కోట్లు కేటాయించేం దుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరగా, నవంబర్1 నాటికి 9,500మంది కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సమ్మెను దృష్టిలో ఉంచుకుని అడ్వాన్సు రూపంలో రెగ్యులర్ కార్మికులకు రూ.25వేలు, కాంట్రాక్టు కార్మికులకు రూ.15 వేలు చెల్లించనున్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని కార్మికులకు దసరా అడ్వాన్స్ చెల్లించేందుకు యాజ మాన్యం అంగీకరించింది. 1-4-2013 నుంచి ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ అమల్లోకి వచ్చే విధంగా చర్యలను తీసుకోవాలని సంఘాలు కోరాయి. వచ్చే జనవరి 31 నాటికి వేతన సవరణ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. -
వచ్చే 6 నెలల్లో అప్రమత్తత అవసరం: ఏకే ఖాన్
సాక్షి, హైదరాబాద్: ‘అనేక సంవత్సరాలుగా చూస్తున్నా. బాగా గమనిస్తున్నా. రాబోయే ఆరు నెలలు అత్యంత కీలకమైనవి. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా అప్రమత్తత అవసరం’ అంటూ ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్హాల్లో సాదత్ హసన్ మంటో కథలు అనువాద పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ.. మత కలహాలు భయంకరమైన వని, తాను 40 సంవత్సరాలుగా చాలా సంఘటనలు చూశానని అన్నారు. వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నాయని, ఓటరును పోలింగ్ బూత్‌కు మతం తీసుకెళుతుందని రాజకీయ నాయకులు ఆలోచిస్తారన్నారు. అందువల్ల రాబోయే ఆరు నెలల్లో ఏమైనా జరగొచ్చని, ఓటర్ను తమ వైపు తిప్పుకునేందుకు ఏమైనా చేస్తారన్నారు. చారిత్రక తప్పిదాలు మరిస్తే అవి పునరావృతం అవుతాయన్నారు. -
సమ్మె విరమణ మా చేతుల్లో లేదు
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమం నేపథ్యంలో చేపట్టిన సమ్మె వల్ల ఆర్టీసీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని, వెంటనే సమ్మె విరమించాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నేతలకు ఆ సంస్థ ఎండీ ఎ.కె.ఖాన్ విజ్ఞప్తి చేశారు. అయితే, దీనిపై ఈయూ నేతలు సానుకూలంగా స్పందించలేదు. సమ్మె విరమించడం తమ చేతుల్లో లేదని, జేఏసీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని ఈయూ నేతలు పద్మాకర్, దామోదరరావు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం మినహా మరో మార్గం లేదని, దీనిపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలని కోరారు. విలీనంపై హామీ వస్తే, సమ్మె విరమణపై చర్చిస్తామని తెలిపారు. కాగా, ఈయూ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని ఖాన్ తెలిపారు. హరీష్‌రావు వ్యాఖ్యలకు ఖండన తెలంగాణలో వస్తున్న ఆదాయంతో సీమాంధ్రలో ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్తిస్తున్నారంటూ టీఆర్ఎస్ నేత హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఈయూ సమైక్యాంధ్ర పోరాట కమిటీ ఖండించింది. తెలంగాణలోని 90 డిపోల్లో 2, సీమాంధ్రలోని 123 డిపోల్లో 3 మాత్రమే లాభాల్లో ఉన్నాయని, అన్ని ప్రాంతాల్లోనూ ఆర్టీసీ నష్టాల్లోనే ఉందని కమిటీ చైర్మన్ సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి, కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు. -
తిరుపతిలో యూనియన్ నేతలతో భేటీ కానున్న ఎ.కె.ఖాన్
సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసి పడుతోంది. దాంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సమయం సమీపించింది. ఈ నేపథ్యంలో తిరుమల వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ చర్యలకు ఉపక్రమించింది. అందులోభాగంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఏ.కే.ఖాన్ మంగళవారం చిత్తూరు జిల్లాలోని ఆర్టీసీ కార్మిక నేతలతో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం ఆర్టీసీ అధికారులు, యూనియన్ నేతలతో ఖాన్ చర్చలు జరుపుతారు. అనంతరం టీటీడీ ఉన్నతాధికారులతో ఖాన్ సమావేశం అవుతారు. సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ఉద్యమాల ఉధృతిని తగ్గించడానికి ఎవరైన తమపై ఒత్తిడి పెంచితే సహించేది లేదని ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు సోమవారం సాయంత్రం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెల్చి చేప్పారు. ఓ వేళ అలా చేస్తే ప్రస్తుతం తిరుమలకు నడుస్తున్న బస్సులను కూడా నిలిపివేస్తామని వారు ప్రభుత్వానికి ఈ సందర్బంగా హెచ్చరించారు.