
ఏకే ఖాన్
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కొరడా ఝుళిపించనున్నారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం ఏసిబికి అందజేయడానికి ప్రత్యేకంగా ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. అవినీతిపై సమాచారం ఉంటే తమకు తెలియజేమని ఏకే ఖాన్ చెప్పారు.
రేపు అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రభుత్వశాఖల్లో అవినీతిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏసీబీకి చిక్కకుండా లంచాలు తీసుకుంటున్న వారికోసం ఎలక్ట్రానిక్ డివైస్, స్పై కెమెరాలను ఉపయోగిస్తామని చెప్పారు.