హైదరాబాద్, సాక్షి: అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబీకులు భారీ అవినీతిని పాల్పడ్డారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమృత్ టెండర్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ నిన్న(శుక్రవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘‘ఈరోజు అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ ఎలాంటి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన రూ. 1137 కోట్ల పనుల దక్కించుకున్న పత్రాలు ఇవిగో.ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీని రంగంలోకి దించి టెండర్లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను దక్కించుకున్న రేవంత్ రెడ్డి కుటుంబం. ఆ తర్వాత ఇదే కంపెనీతో తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ. ఇదే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు అప్పజెప్తుంది.ప్రజలకు అందుబాటులో ఉంచకుండా చీకటి వ్యవహారాన్ని నడుపుతుంది.
అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన టెండర్ల పైన పూర్తిస్థాయి విచారణ జరిపి, టెండర్లు దక్కించుకున్న ప్రతి కంపెనీ వివరాలను బయటపెట్టాలి. 9 నెలలుగా రాష్ట్ర లోని అవినీతి పూరిత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రతి టెండర్ పైన విచారణ జరిపి సమీక్ష చేసి అక్రమాలు జరిగిన ప్రతి టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి టెండర్ల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.
SCAM Alert - AMRUT Tenders
I wrote a letter to Union Ministers Shri Manohar Lal Khattar Ji (@mlkhattar) and Shri Tokhan Sahu Ji (@tokhansahu_bjp) regarding corruption in AMRUT tenders
Contracts were awarded to Chief Minister Revanth Reddy's Brother-in-law, Srujan Reddy’s… pic.twitter.com/pqgz7aLBGR— KTR (@KTRBRS) September 21, 2024
Comments
Please login to add a commentAdd a comment