సాక్షి, కోకాపేట: హైదరాబాద్ నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. తాజాగా కోకాపేటపై ఫోకస్ పెట్టింది. అక్కడ అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది.
కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టిసారించింది. సర్వే నంబర్ 147లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో, ప్రభుత్వ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు శనివారం తెల్లవారుజామునే అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. కోకాపేటలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా.. హైడ్రాకు పూర్తిస్థాయి స్వేచ్ఛ కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖలకు ఉన్న విశేష అధికారాలను హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించింది. సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే.. హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన
Comments
Please login to add a commentAdd a comment