మా నాన్నబస్సు కండక్టర్‌: ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు | j. purnachandra rao takes over as MD of RTC | Sakshi
Sakshi News home page

మా నాన్నబస్సు కండక్టర్‌: ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు

Published Sat, Nov 30 2013 1:25 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మా నాన్నబస్సు కండక్టర్‌: ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు - Sakshi

మా నాన్నబస్సు కండక్టర్‌: ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు

హైదరాబాద్:  ' మా నాన్న ఆర్టీసీ కండక్టర్. అయినా కూడా మమ్ముల్ని కష్టపడి చదివించారు. నేను ఈ స్థాయికి చేరడానికి నాన్న కృషే నని'  ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన జె. పూర్ణచంద్రరావు తెలిపారు.  ఏకే ఖాన్ కు స్థానం చలనం కల్గడంతో పూర్ణ చంద్రరావు శనివారం ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నాన్న రాధాకృష్ణ మూర్తి ఆర్టీసీ కండక్టర్ చేసినా కూడా పిల్లల పట్ల బాధ్యాయుతంగా ఉండేవారన్నారు. ఆయన రుణం తీర్చుకునేందుకు అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉందని పూర్ణ చంద్రరావు తెలిపారు.

 

1988 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావును ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మొహంతి గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఇన్నాళ్లూ ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలను నడిపించిన సారథి ఏకే ఖాన్.. అవినీతి నిరోధక శాఖకు బదిలీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement