
అవినీతి అంతానికి నిజాయితీగా వ్యవహరిస్తాం:ఏకే ఖాన్
హైదరాబాద్:అవినీతి అంతానికి నిజాయితీగా వ్యవహరిస్తామని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తెలిపారు. ఇన్నాళ్లు ఆర్టీసీ ప్రగతి చక్రాలను నడిపించిన ఖాన్ అవినీతి నిరోధక శాఖకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. రోజు రోజుకూ హెచ్చరిల్లుతున్న అవినీతికి సంబంధించి ఆయన మాట్లాడారు. అవినీతి రూపుమాపడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. అవినీతి సమస్య అనేది ఒక్క రోజులో అంతరించిపోదని, దీని నివారణకు కొత్త పద్దతులను అనుసరిస్తామన్నారు. అవినీతి అధికారులను పట్టుకునేందుకు సమగ్రమైన ప్రణాళికలు చేపట్టాల్సిన అవశ్యకత ఉందని ఏకే ఖాన్ తెలిపారు.