
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్రణాళిక విభాగం అధికారి భీంరావ్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి శేరిలింగంపల్లిలోని భీంరావ్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు.
హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగం మాజీ అధికారి పురుషోత్తంరెడ్డితో కలిసి భీంరావ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కీలక ఆధారాల కోసం తనిఖీలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment