purushotham reddy
-
జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయ్ చంద్రబాబు పరిస్థితి ఇదే..
-
టీడీపీ నేతలపై ఫిర్యాదు తీసుకోవడానికి వెనకాడారు: YSRCP నేతలు
-
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి జరిగేది ఇదే
-
సీఎం జగన్ గురించి పురుషోత్తం రెడ్డి
-
ట్రెజరీ ఉద్యోగుల అధ్యక్షుడిగా పురుషోత్తంరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రెజరీ, అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గంగుల పురుషోత్తంరెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల్లో పురుషోత్తంరెడ్డి సమీప ప్రత్యర్థిపై ప్రదీప్‌కుమార్‌పై 30 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఫలితాలను ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు సోమవారం విడుదల చేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పురుషోత్తంరెడ్డి ప్రస్తుతం రామన్నపేట ఎస్టీవోగా పనిచేస్తున్నారు. సహ అధ్యక్షుడిగా శ్రీనివాసరా వు, ప్రధాన కార్యదర్శిగా పరుశరామ్లతో పా టు ఆరుగురు ఉపాధ్యక్షులు, ఐదుగురు కార్యదర్శులతో పాటు ఇతర కార్యవర్గం ఎన్నికైంది -
'రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే రావాలి'
సాక్షి, తిరుపతి: మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో రాయలసీమపై దుష్ప్రచారం జరుగుతోందని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. మంగళవారం ఎస్వీయూలో రాయలసీమ మేధావుల ఫోరం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమరావతి రైతు నాయకులు రాయలసీమ వాసులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాయలసీమ వాసులు వారి ప్రాంతానికి రాజధాని వద్దని చెబుతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే రావాలి. చదవండి: (సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం) రాయలసీమలో గ్రామీణ వాతావరణం కలిగిన పట్టణాలే తప్ప ఒక్క నగరం కూడా లేదని గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అమరావతి రైతులు విశాల హృదయం, విశాల త్యాగం చేసినవారు. అమరావతి రైతు నాయకులు రాయలసీమవాసులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, వామపక్షాలు కర్నూలుకు హైకోర్టు రావాలని ఒప్పుకున్నాయి. రాయలసీమ వాసుల మౌనాన్ని అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రాయలసీమకు హైకోర్టు రాకూడదని ఎస్వీయూలో బహిరంగ సభ పెట్టాలంటే మేం ఎందుకు అనుమతించాలి. రాయలసీమ ప్రజలందరూ ఈ విషయంపై స్పందించాలి. రేపటి నుంచి రాయలసీమకు రాజధాని అంశంపై విద్యార్థుల్లోకి వెళ్తామ’ని పురుషోత్తం రెడ్డి అన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కడ్తాల్: వాతావరణ మార్పుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రముఖ పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లిలోని ఎర్త్ సెంటర్లో, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో ‘క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్’ ముగింపు సదస్సులో ఆయన మాట్లాడారు. కాప్–26 సదస్సు నిరాశ పరిచిందని, పర్యావరణవాదుల ఆశలను నీరుగార్చిందని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ పాలసీ నిపుణుడు దొంతి నరసింహారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయరంగంలో రసాయన ఎరువులను వాడటం వల్ల, భూమిలో కర్బన శాతం పెరిగి, ఆహార పంటల్లో పోషక విలువలు తగ్గుతున్నాయని చెప్పారు. దీంతో మనిషి జీవన ప్రమాణ రేటు తక్కువగా ఉంటుందన్నారు. తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలపై రైతులు దృష్టి సారించాలని, వర్షాధార పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల జీవనశైలి, వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. గ్లాస్గో నగరంలో నిర్వహిస్తున్న కాప్–26 సదస్సులో చర్చించిన అంశాలను, క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకుపోవాలనే లక్ష్యంతో స్థానిక ఎర్త్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీజీఆర్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి వివరించారు. ప్రతీఒక్కరు కనీసం ఐదు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎర్త్ సెంటర్ డైరెక్టర్ సాయిభాస్కర్రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి, సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి, ధర్మసేవ ట్రస్ట్ చైర్మన్ నిశాంత్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, వికాస్, నాగరాజు, అర్చన, రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, సిటీ కాలేజీకి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రజా నాయకుడి దూరదృష్టి
నిజమైన ప్రజానాయకుడు ప్రజలు కోరుకున్నది ఇవ్వడం కాకుండా ప్రజలకు ఏది అవసరమో అది చేస్తారు. అలా చేసిన వారే చిరకాలం ప్రజలలో ఉంటారు. అలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నేత వైఎస్సార్. తెలుగు రాష్ట్రాల వరకు నీటికి సంబంధించి ఆంగ్లేయుల తర్వాత సమగ్రమైన ప్రణాళికను రూపొందించినవారు వైఎస్సార్ మాత్రమే అని చెప్పక తప్పదు. కేసీ కెనాల్, కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ ఆంగ్లేయులను గుర్తుతెస్తే, పులిచింతల, పోలవరం, శ్రీశైలం కనీస నీటిమట్టం, పోతిరెడ్డిపాడు వెడల్పు, ప్రాణహిత చేవెళ్ల, దుమ్ముగూడెం టెయిల్ పాండ్, పాలమూరు ఎత్తిపోతల పథకం లాంటివి వైఎస్సార్‌ను గుర్తుకుతెస్తాయి. వైఎస్సార్ అన్ని ప్రాంతాల నీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఈ సమయంలో కొందరు ఒకేసారి ప్రాజెక్టులు చేపట్టకుండా ప్రాధాన్యత క్రమంలో చేస్తే బాగుంటుందన్నారు. (చదవండి: ఇక్కడెవరైనా అమృతం తాగి ఉన్నారా? ) ఆ సమయంలో వైఎస్సార్, ‘అన్ని ప్రాంతాలకు ఉపయోగపడే ప్రాజెక్టుల రూపకల్పన చేసి ప్రజల ముందు ఉంచితే కాల క్రమంలో వాటిని ప్రజలు సాధించుకుంటారు’ అన్నారు. నేడు చాలా ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రజలు పోరాడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వాలు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. నాగార్జున సాగర్ జలాశయం నిర్మాణానికి నాటి ప్రభుత్వం 92 కోట్ల రూపాయల అప్పుతెచ్చి నిర్మించింది. అప్పు చేసి కట్టడం అవసరమా? అని చర్చ జరిగింది. అప్పును తీర్చడమే కాదు, అపారమైన సంపదను నీటి ప్రాజెక్టులు సృష్టిస్తాయని నాటి ప్రధాని నెహ్రూ ముందుకు సాగారు. వైఎస్సార్ కూడా అదే స్ఫూర్తితో ప్రాజెక్టుల విషయంలో వ్యవహరించారు.( చదవండి: అదే స్ఫూర్తి.. అదే లక్ష్యం.. అదే గమ్యం) దశాబ్దాల కల పోలవరం నేడు సాకారం వైపు అడుగులు వేస్తోంది అంటే అందుకు వైఎస్ చొరవ కీలకం. వారు చేపట్టిన కుడికాల్వ పైనే పట్టిసీమ, ఎడమ కాల్వపై పురుషోత్తమ పట్నం రూపుదిద్దుకున్నాయి. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి వారి ఆలోచనే. డెల్టా అవసరాలకు పులిచింతల రూపకల్పన చేశారు. దుమ్ముగూడెం పథకం ఆయన దూరదృష్టికి ఉదాహరణ. ఆయనపై రాజకీయ కోణంలో పోతిరెడ్డిపాడు విషయంలో నాడు వివాదం చేశారు. నేడు తెలంగాణ ప్రాజెక్టులకు సీమలో తలపెట్టిన నిర్మాణాల వల్ల నష్టం అని విమర్శలు చేస్తున్న వారు గుర్తుకుతెచ్చుకోవాల్సిన అంశం దక్షిణ తెలంగాణలో ఏ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుందని వాదిస్తున్నారో వాటి రూపకల్పన చేసింది వైఎస్సార్ అన్న విషయాన్ని మరువకూడదు.( చదవండి: నాకు తెలిసిన మహనీయుడు ) రాయలసీమ ఉద్యమం ప్రధాన లక్ష్యం నీరు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతిరెడ్డిపాడు వెడల్పు, శ్రీశైలం నీటిమట్టం, గండికోట రిజర్వాయర్, కుందూ నదిపై నిర్మాణాలు, గాలేరు నగరి, హంద్రీనీవా పనులకు ప్రాధాన్యత ఇచ్చినారు. నాడు వారు చేసిన కృషి వల్లే కొంత మేరకు అయినా రాయలసీమకు నీరు అందుతోంది. ప్రజానాయకుడు తాను అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు వారి తర్వాత కూడా ప్రాధాన్యత కలిగివుంటాయి. అదే ఆ నాయకుడి దూరదృష్టిని తెలియజేస్తుంది. - మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం -
చుడా చైర్మన్‌గా పురుషోత్తంరెడ్డి
సాక్షి, చిత్తూరు: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తిని ఉన్నత పదవిలో కూర్చోబెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చుడా) చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు కట్టమంచి పురుషోత్తం రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2005లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూ రు మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆయన్ని మునిసిపల్ వైస్ చైర్మన్‌గా నియమించారు. 2009లో జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కట్టమంచి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికై కా ర్పొరేషన్‌లో ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. పార్టీకి నమ్మకంగా ఉన్న ఈయనకు చుడా చైర్మన్ పదవి దక్కడంతో చిత్తూరులోని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఏడాది కాలంపాటు ఆయన చుడా చైర్మన్‌గా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
కంటిచూపు ప్రదాత కన్నుమూత
వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల : పులివెందుల ప్రజలు ఆప్యాయంగా కంటి చూపు ప్రదాత అని పిలుచుకునే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి(89) బుధవారం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం కడపలోని తన కుమారుడు విలియమ్స్ సత్యానందరెడ్డి ఇంటికి వెళ్లిన ఆయనకు బుధవారం ఉదయం 6.30గంటల ప్రాంతంలో గుండెపోటు రాగా.. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అక్కడి నుంచి ఆయన భౌతిక కాయాన్ని కుమారుని ఇంటిలో అక్కడి బంధువుల సందర్శనార్థం ఉంచి అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలోని ఆయన నివాసం ఉండే గృహానికి తరలించారు. వైఎస్ కుటుంబంలో వైఎస్ రాజారెడ్డి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిల మరణం తర్వాత కుటుంబ పెద్దగా ఉంటూ సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. వైఎస్ పురుషోత్తమరెడ్డి దివంగత వైఎస్ రాజారెడ్డికి స్వయాన సోదరుడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు చిన్నాన్న. ఆయన మరణంతో వైఎస్ కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ నేపథ్యం.. విద్యాభ్యాసం డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి 1929 డిసెంబర్ 19న సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామంలో వైఎస్ వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు మూడో కుమారునిగా జన్మించారు. ఎలిమెంటరీ విద్యను బలపనూరులో.. హైస్కూలు విద్యను పులివెందులలో, ఇంటర్ అనంతపురం, ఎంబీబీఎస్ ఆంధ్రా యూనివర్సిటీలో, డీఓఎంఎస్ (ఓపీహెచ్) విశాఖపట్టణం, గుంటూరు మెడికల్ కళాశాలల్లో విద్యనభ్యసించారు. 1958లో డాక్టర్ ఫ్లావియతో ఆయనకు వివాహమైంది. ఆయనకు నలుగురు కుమారులు. వారిలో స్టాన్లీ సత్యానందరెడ్డి, మైఖేల్ సత్యానందరెడ్డిలు ఇంజినీర్లుగా అమెరికాలో స్థిరపడగా.. విలియమ్స్ సత్యానందరెడ్డి కడపలో, థామస్ సత్యానందరెడ్డి తాడిపత్రిలో వైద్యులుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. డాక్టర్‌గా వైద్యసేవలు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి వైద్యునిగా విశేష సేవలందించారు. 1956 నుంచి 22ఏళ్లుగా ఒంగోలు, జమ్మలమడుగు, కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లోని చర్చిల ఆసుపత్రుల్లో వైద్యునిగా ప్రజలకు ఉత్తమ సేవలందించారు. పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రితో ఆయనకు విడదీయరాని సంబంధం ఉంది. దాదాపు 36ఏళ్లుగా వైఎస్‌రాజారెడ్డి ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్‌గా, ఐ స్పెషలిస్ట్‌గా తాను మరణించేవరకు జీతం లేకుండా ప్రజలకు సేవలందించారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు, సిబ్బందితో ఆత్మీయంగా ఉంటూ వైద్యంలోని మెలకువలను నేర్పించేవారు. రాజారెడ్డి ఆసుపత్రిలో రోటరీ క్లబ్, ప్రభుత్వ అంధ త్వ నివారణ సంస్థ సహకారంతో 70వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి వారికి చూపు ప్రసాదించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన మరణంతో ఆసుపత్రి సిబ్బంది తాము పెద్ద దిక్కును కోల్పోయామని బోరున విలపించారు. ఎమ్మెల్యేగా సేవలు వైఎస్ పురుషోత్తమరెడ్డి డాక్టర్‌గానే కాకుండా ఎమ్మెల్యేగా కూడా పులివెందుల ప్రాంత ప్రజలకు సేవలందించారు. 1991లో అప్పటి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ వివేకానందరెడ్డి అనివార్య కారణా లవల్ల రాజీనామా చేయడంతో పులివెందులలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో పురుషోత్తమరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాలస్వామిరెడ్డిపై 97వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పులివెందుల రాజకీయ చరిత్రలో ఈ విజయం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన సాధారణ జీవితాన్నే గడిపారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ సమావేశాలకు పులివెందుల నుంచి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసేవారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ రిజర్వాయర్ నిర్మాణంలోనూ, నియోజకవర్గంలోని 177 గ్రామాలకు మంచినీటి వసతి, పులివెందులలో మొట్టమొదటిసారిగా బైపాస్ రోడ్డు నిర్మాణం, టీటీడీ కల్యాణ మండపం ఏర్పాటు, బాలికల జూనియర్ కళాశాల, నియోజకవర్గంలోని ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఆయన హయాంలో జరిగాయి. పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఐఎంఏ ప్రెసిడెంట్‌గా, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్, ఆసుపత్రి అసోసియేషన్ కడప బ్రాంచ్ ప్రెసిడెంట్‌గా, పులివెందుల సీఎస్ఐ చర్చి ట్రెజరర్‌గా, జీజీఆర్, జీజెడ్ఆర్ఐ క్యాంప్స్ చైర్మన్‌గా సేవలందించారు. ఆయన డాక్టర్‌గా చేస్తున్న సేవలకు ది ఇంటర్నేషనల్ ఇంటిగ్రేషన్ గ్రోత్ సొసైటీ, న్యూఢిల్లీ వారు 1999లో ‘నేషనల్ మెడికల్ ఎక్స్‌లెన్సీ అవార్డు’లో ఆయన పేరును చేర్చారు. నివాళులర్పించిన వైఎస్ కుటుంబీకులు వైఎస్ పురుషోత్తమరెడ్డి మరణవార్త తెలుసుకున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి, డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి, మున్సి పల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేత్రదానం నేత్ర వైద్యుడిగా అమూల్యమైన సేవలు అందించి వేలాది మందికి కంటి చూపును ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన మరణం తర్వాత కూడా మరో ఇద్దరికి చూపును ప్రసాదిం చారు. బుధవారం ఆయన కార్నియాలను కుమారులు స్టాన్లీ, మైఖేల్, విలియమ్స్, థామస్ అంగీకారంతో పురుషోత్తమరెడ్డి మనుమరాలు డాక్టర్వింధ్య సేకరించి స్నేహ సేవా సమితి సభ్యులు రాజు, మధుసూదన్‌రెడ్డిలకు అందజేశారు. రేపు అంత్యక్రియలు వైఎస్ పురుషోత్తమరెడ్డి భౌతిక కాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు థామస్ సత్యానందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 8గంటలకు స్థానిక సీఎస్ఐ చర్చి ఆవరణలో ఆయన భౌతిక కాయం ఉంచి అక్కడ బిషప్‌లు, పాస్టర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్ ఫ్యామిలీ ఘాట్ వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. -
వైఎస్సార్ చిన్నాన్న పురుషోత్తంరెడ్డి కన్నుమూత
కడప కార్పొరేషన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి చిన్నాన్న, మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ వైఎస్ పురుషోత్తంరెడ్డి కన్నుమూశారు. గుండెకు సంబంధించిన వ్యాధితో వైఎస్సార్ జిల్లా కడపలోని సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచారు. వైఎస్ రాజారెడ్డి తమ్ముడైన పురుషోత్తంరెడ్డి పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా ఉంటూ లక్షలాది మంది పేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈయనకు డా. సత్యానందరెడ్డి, థామస్‌రెడ్డి, స్టాన్లీ రెడ్డి, మైఖేల్‌రెడ్డి అనే నలుగురు కుమారులు ఉన్నారు. పురుషోత్తంరెడ్డి మృతికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. కడపలో వైఎస్ పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నివాళులర్పించారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా. రామిరెడ్డి, డా.సురేష్‌బాబు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చిన్నయ్య పురుషోత్తంరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
హెచ్ఎండీఏ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(హెచ్ఎండీఏ) ప్రణాళిక విభాగం అధికారి భీంరావ్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి శేరిలింగంపల్లిలోని భీంరావ్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగం మాజీ అధికారి పురుషోత్తంరెడ్డితో కలిసి భీంరావ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కీలక ఆధారాల కోసం తనిఖీలు చేపడుతున్నారు. -
ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్‌పై వేటు
-
పురుషోత్తం రెడ్డి కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పురుషోత్తం రెడ్డికి సహకరించారన్న కారణంగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బిల్డింగ్ సూపర్ వైజర్ చేరిన పురుషోత్తం రెడ్డి అనంతర కాలంలో హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అయితే ఆయన భారీ అవినీతికి పాల్పడుతున్నాడని 2009 నుంచే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో రూ.వందల కోట్లు అవినీతి సొమ్ము కూడబెట్టుకున్నారన్న ఆరోపణలతో ఈ ఫిబ్రవరిలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు పురుషోత్తం ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. దీంతో తొలుత పురుషోత్తం పరారు కాగా, అతని బినామీలు యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో పురుషోత్తంరెడ్డి ఫిబ్రవరి 16న ఏసీబీ కోర్టులో లొంగిపోగా చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయిలో అధికారులు విచారణ చేపట్టగా హెచ్ఎండీఏ అధికారి పురుషోత్తం రెడ్డి అక్రమాలు, అవినీతికి ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్ సహకరించారని తేలింది. కాగా, ఈ కేసులో ఏసీబీ రూ.50 కోట్లకుపైగా బినామీ పెట్టుబడులను గుర్తించింది. నాలుగు కమర్షియల్ కాంపెక్సులు, వ్యవసాయ భూమికి సంబంధించి రూ.20 కోట్ల మేర ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. పురుషోత్తం అల్లుడు చేపట్టిన విల్లాల నిర్మాణానికి సంబంధించి రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు సేకరించారు. కూతురికి ఇచ్చిన ఆభరణాలు, గిఫ్ట్‌గా ఇచ్చిన ఆస్తుల విలువ మరో రూ.10 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. -
పురుషోత్తంరెడ్డికి పోలీస్ కస్టడీ
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ కె.పురుషోత్తంరెడ్డికి ఏసీబీ కోర్టు గురువారం 6 రోజుల పోలీసు కస్టడీ విధించింది. రూ.వందల కోట్లు అవినీతి సొమ్ము కూడబెట్టుకున్నారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు పురుషోత్తం ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. దీంతో పురుషోత్తం పరారు కాగా, అతని బినామీలు యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరికి కూడా కోర్టు పోలీసు కస్టడీ విధించింది. ఈ క్రమంలో పురుషోత్తంరెడ్డి ఈనెల 16న ఏసీబీ కోర్టులో లొంగిపోగా జైలుకు తరలించారు. అదే రోజు ఏసీబీ అధికారులు కోర్టులో వారం రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా కోర్టు అనుమతి నేపథ్యంలో ఏసీబీ అధికారులు కస్టడీ ఉత్తర్వులను చంచల్‌గూడ జైలు అధికారులకు అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం నుంచి ఆరు రోజులపాటు పురుషోత్తంను విచారించనున్నారు. మరోవైపు యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను ఏసీబీ కోర్టులో హాజరు పరిచి తిరిగి జైలుకు తీసుకెళ్లారు. రూ.60 కోట్ల మేర గుర్తింపు ఈ కేసులో ఏసీబీ రూ.50 కోట్లకుపైగా బినామీ పెట్టుబడులను గుర్తించింది. నాలుగు కమర్షియల్ కాంపెక్సులు, వ్యవసాయ భూమికి సంబంధించి రూ.20 కోట్ల మేర ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. పురుషోత్తం అల్లుడు చేపట్టిన విల్లాల నిర్మాణానికి సంబంధించి రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు సేకరించారు. కూతురికి ఇచ్చిన ఆభరణాలు, గిఫ్ట్‌గా ఇచ్చిన ఆస్తుల విలువ మరో రూ.10 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. బినామీ శ్రీనివాస్‌రెడ్డి అరెస్ట్ పురుషోత్తంరెడ్డికి ప్రధాన బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో రెండు రోజులుగా ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. తనిఖీలకు వచ్చిన సమయంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోనే ఉండటంతో.. ఏసీబీ అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో పురుషోత్తంరెడ్డి కూతురు వివాహం కోసం కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల బిల్లులు, రూ.86 వేల నగదు, ఇతర ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. -
ఏసీబీ అధికారులు వేధిస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగం డైరెక్టర్ కె.పురుషోత్తంరెడ్డి విషయంలో ఏసీబీ అధికారులు తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ అతని బంధువులు హైకోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నారు. పురుషోత్తంరెడ్డి బావమరిది శ్రీనివాస్‌రెడ్డి, అల్లుడు నిపుణ్‌రెడ్డి ఏసీబీ అధికారులపై పిటిషన్లు దాఖలు చేయగా, ఆ జాబితాలో పురుషోత్తంరెడ్డి అత్త సుదేష్ణ కూడా చేరారు. తమ వ్యాపారాల్లో, వ్యక్తిగత జీవితంలో ఏసీబీ అధికారులు జోక్యం చేసుకుంటున్నారని, వారిని నిలువరించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయ వాది పి.గంగయ్యనాయుడు వాదనలు వినిపిస్తూ పురుషోత్తంరెడ్డి ఆచూకీ చెప్పాలని, వ్యాపార వివరాలు చెప్పాలని పిటిషనర్ ఇంటికి పలుమార్లు ఏసీబీ అధికారులు వచ్చారని, పురుషోత్తంరెడ్డికి చెందిన కొన్ని ఆస్తులకు బినామీగా అంగీకరించాలని ఒత్తిడి తెచ్చారన్నారు. తాము చెప్పినట్లు వినకపోతే తప్పు డు కేసులు బనాయించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారని నివేదించా రు. వ్యక్తిగత జీవితంలోనే కాక వ్యాపార వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. పిటిషనర్ ఇంటికి సీలు వేసి తాళం వేశారని, సీలు విషయాన్ని ముందుగా తెలియచేయలేదన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఏసీబీ మాన్యువల్‌ను అధికారులు తుంగలో తొక్కా రని తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, ఏం చేసినా చట్ట నిబంధనలకు లోబడే చేయాలని ఏసీబీ అధికారులకు తెలిపారు. విచారించాలని భావిస్తే సీఆర్పీసీ సెక్షన్ 41ఎ కింద నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. పిటిషనర్ ఇంటికి వేసిన సీలును తొలగించాల ని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
మరింత బిగుస్తున్న ఉచ్చు..
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదు ర్కొంటున్న హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) దర్యాప్తు బృందాలు పురుషోత్తంరెడ్డి బినామీల కోసం వేట సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అతనికి ప్రధా న బినామీలుగా ఉన్న అల్లుడు నిషాంత్‌రెడ్డితో పాటు యాదవరెడ్డి అనే వ్యక్తిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం శ్రీసాయి హరిహరా ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో యాదవరెడ్డి హబ్సిగూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, ఇందులోనూ పురుషోత్తంరెడ్డి రూ.కోట్లు పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. అలాగే మంచిరేవులలో నిషాంత్‌రెడ్డి పురుషోత్తంరెడి అక్రమ సొమ్ముతో విల్లాలు నిర్మిస్తున్నట్టు ఏసీబీ గుర్తించింది. వీరిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు రిమాండ్ విధించినట్టు తెలిపారు. మొదటిసారిగా బినామీ యాక్ట్.. సాధారణంగా నేరుగా లంచం ఇచ్చే కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను అవినీతి నిరోధక శాఖ ఎక్కువగా నమోదు చేస్తోంది. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఇప్పటివరకు పెద్దగా బినామీదారులపై నజర్ పెట్టలేదు. కానీ పురుషోత్తంరెడ్డి కేసులో అరెస్టయిన ఇద్దరు బినామీదారులుగా గుర్తించి, వీరిద్దరితో పాటు పురుషోత్తంరెడ్డిపై బినామీ యాక్ట్ కింద కొత్త కేసు నమోదు చేశారు. వీరిద్దరి లావాదేవీల వివరాలు, ఆర్థిక మార్గాలు తదితర వివరాలపై దృష్టి సారించి విచారణ జరపాలని ఏసీబీ అధికారికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌తోపాటు ఆదాయపన్ను విభాగానికి లేఖ రాసింది. సోమాజీగూడలోని జమ్రూద్దీన్ రెసిడెన్సీలోని చరణ్స్ లైఫ్ డివైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇందులో పురుషోత్తంరెడ్డికి చెందిన ఆస్తుల డాక్యుమెంట్లు, బంగారు అభరణాలకు సంబంధించి ఆధారాలను సేకరించింది. మరో ప్రధాన బినామీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి కోసం కూడా ఏసీబీ అధికారులు వేట సాగిస్తున్నట్టు తెలుస్తోంది. -
హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌పై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కట్టా పురుషోత్తమ్‌రెడ్డి ఇంటిపై శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, సాగర్ సొసైటీ, ఆయన కార్యాలయంతో పాటు మరో తొమ్మిది ప్రాంతాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.5.35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.25 కోట్లకుపైగా ఉంటుందని ఏసీబీ పేర్కొంది. 1985లో బిల్డింగ్ సూపర్వైజర్గా ఉద్యోగంలో చేరిన పురుషోత్తమ్‌రెడ్డి ప్రస్తుతం డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. గతంలో 2009లోనూ పురుషోత్తమ్‌రెడ్డిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆ సమయంలో రూ.3.7 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్రావు ఓ ప్రకటనలో తెలిపారు. పరారీలో పురుషోత్తమ్‌రెడ్డి పురుషోత్తమ్‌రెడ్డి నెల రోజుల నుంచి సెలవులో ఉన్నట్టు తెలిసింది. దాడుల సందర్భంగా సాగర్ సొసైటీలోని మరో ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు తాళం వేసి ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ ఇంటిని సీజ్ చేసి, ఆ మేరకు ఉత్తర్వులను ఇంటి తలుపులకు అంటించారు. అదే విధంగా పురుషోత్తమ్‌రెడ్డికి బినామీగా ఉన్న ఆయన బావమరిది ఇళ్లు సైతం తాళం వేసి ఉండటంతో ఆ ఇళ్లను సైతం సీజ్ చేసినట్టు ఏసీబీ డీజీ తెలిపారు. ప్రస్తుతం పురుషోత్తమ్‌రెడ్డితో పాటు ఆయన బావమరిది శ్రీనివాస్‌రెడ్డి పరారీలో ఉన్నారని, వారు దొరకగానే వీరి ఇళ్లను తెరిచి మరోసారి సోదాలు నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. మరో ఇద్దరిపైనా డీఏ కేసులు నమోదు... ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాస్కర్, కరీంనగర్ ఏఎస్ఐ మోహన్‌రెడ్డిపై కూడా కేసులు నమోదు చేసినట్టు ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు మరో పత్రికా ప్రకటనలో తెలిపారు. -
పలు కొత్త రూట్లకు సిటీ బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: సోమవారం నుంచి కొత్త రూట్లలో సిటీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. రిసాలాబజార్–గచ్చిబౌలీ (5 ఆర్జీ), సికింద్రాబాద్–దమ్మాయిగూడ (16డీ), కుషాయిగూడ–ఎన్జీవోస్ కాలనీ (17హెచ్ఎన్/90ఎల్ఆర్), ఎన్జీవోస్ కాలనీ–కేపీహెచ్‌బీ (186), ఈసీఐ ఎల్–గచ్చిబౌలీ (6ఎన్జీ), మేడ్చెల్–ఇబ్రహీంపట్నం(229/279) రూట్లలో బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బస్సులు రాకపోకలు సాగించ నున్నాయి.