HMDA
-
హెచ్ఎండీఏ ‘మెగా మాస్టర్‌ప్లాన్–2050’పై భారీ కసరత్తు
సాక్షి, సిటీబ్యూరో: రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధికనుగుణంగా ‘మెగా మాస్టర్‌ప్లాన్–2050’పై హెచ్ఎండీఏ భారీ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్ (సీఎంపీ) పైన లీ అసోసియేషన్ రూపొందించిన ప్రాథమిక నివేదికతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో బ్లూ, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌పైన సమగ్రంగా చర్చించారు. ప్రణాళికా విభాగం, ఇంజనీరింగ్, అర్బన్‌ఫారెస్ట్, మాస్టర్‌ప్లాన్, ఇరిగేషన్ తదితర విభాగాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (Hyderabad Metropolitan Area) పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, నీటి వనరులు, అడవుల పరిరక్షణ, ట్రిపుల్ ఆర్ (RRR) వరకు పచ్చదనం విస్తరణకు చేపట్టాల్సిన చర్యలపైన చర్చించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి బేసిన్లపైన చర్చించారు. 2050 వరకు నగర అవసరాలకు సరిపడా నీటి లభ్యతపైన నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. అలాగే ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) వరకు నివాస జోన్లు, ఆర్థిక అభివృద్ధి మండళ్లు, లాజిస్టిక్ హబ్‌లు, పారిశ్రామిక కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపైన అధికారులు మాట్లాడారు.ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వరకు అందుబాటులో ఉన్న అడవులతో పాటు నగరీకరణకు అనుగుణంగా పచ్చదనం విస్తరణ, పార్కుల అభివృద్ధి, తదితర అంశాలపైన చర్చించినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టుతో పాటు, వివిధ మార్గాల్లో మెట్రో రెండోదశ విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2050 నాటికి ఇంకా ఏయే ప్రాంతాలకు మెట్రో విస్తరణకు అవకాశాలు ఉన్నాయనే అంశంతో పాటు, మెట్రో విస్తరణకు అవకాశం లేని ప్రాంతాల్లో ఏరకమైన ప్రజా రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాలనే అంశంపైన కూడా సమగ్రమైన చర్చ జరిగింది.సెప్టెంబర్ నాటికి ముసాయిదా... హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధిపైన ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిన నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి మెగా మాస్టర్‌ప్లాన్–2050 ముసాయిదాను సిద్ధం చేయాలని హెచ్ఎండీఏ (HMDA) భావిస్తోంది. వచ్చే సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో సమగ్రమైన మహా ప్రణాళిక అందుబాటులోకి వచ్చేవిధంగా కార్యాచరణ చేపట్టారు. ఈ మేరకు మాస్టర్‌ప్లాన్ (Master Plan) రూపకల్పన కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీల నుంచి దరఖాస్తులను స్వీకరించి త్వరలో అర్హత కలిగిన సంస్థను ఎంపిక చేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారి ఒకరు చెప్పారు.చదవండి: ఇక RRR వరకు హెచ్ఎండీఏ అనుమతులే! -
ఇక RRR వరకు హెచ్ఎండీఏ అనుమతులే..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా విస్తరణకనుగుణంగా కార్యకలాపాలను సైతం విస్తరించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. ట్రిపుల్ ఆర్ వరకు పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్, ప్లానింగ్ తదితర విభాగాలను బలోపేతం చేసేందుకు దృష్టిసారించింది. హెచ్ఎండీఏ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయించడంతో భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఆక్యుపెన్సీలు తదితర నిర్మాణ రంగానికి చెందిన అనుమతుల ప్రక్రియలు డీటీసీపీ నుంచి హెచ్ఎండీఏకు బదిలీ అయ్యాయి. అలాగే ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యకలాపాలు కూడా హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోకి వచ్చాయి. దీంతో వివిధ విభాగాల్లో అవసమైన అధికారులు, సిబ్బందిని నియమించి సంస్థాగతంగా బలోపేతం చేయవలసి ఉన్నదని హెచ్ఎండీఏ అధికారి ఒకరు వివరించారు. ఈ దిశగా దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నారు.‘ప్రస్తుతం జోనల్ అధికారులు రీజనల్ రింగ్‌రోడ్డు (Regional Ring Road) వరకు విధులు నిర్వహించడం టెక్నికల్‌గా కూడా సాధ్యం కాదు. కొత్తగా మరిన్ని జోన్లు ఏర్పాటు చేస్తే తప్ప సకాలంలో విధులు నిర్వహించడం సాధ్యం కాదు’ అని చెప్పారు. హైదరాబాద్ మహానగర పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడంతో హెచ్ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. హైదరాబాద్ చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్న రీజనల్‌రింగ్ రోడ్డు వరకు నిర్మాణ అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తరణ వంటి పనులను చేపట్టివలసి ఉంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలతో పాటు కొత్తగా నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలతో కలుపుకొని మొత్తం 11 జిల్లాల పరిధిలో హెచ్ఎండీఏ కార్యకలాపాలను కొనసాగించవలసి ఉంది. ఇలా భారీగా పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా మరో 4 జోన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.గతంలో మేడ్చల్, శంకర్పల్లి, ఘట్కేసర్, శంషాబాద్ (Shamshabad) నాలుగు జోన్లు మాత్రమే ఉండగా, శంకర్పల్లి, మేడ్చల్ జోన్లలో అదనంగా ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. దీంతో హెచ్ఎండీఏ జోన్ల సంఖ్య 4 నుంచి 6 కు పెరిగింది. ఇప్పుడు తాజాగా ట్రిపుల్ ఆర్ (RRR) వరకు పరిధి పెరగడం వల్ల కొత్తగా మరో 4 జోన్లను ఏర్పాటు చేసి మొత్తం 10 జోన్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 1355 గ్రామాలు ఉన్నాయి. పరిధిని పెంచడం వల్ల 11 జిల్లాల్లోని 104 మండలాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. రీజనల్ రింగ్‌రోడ్డు తరువాత 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా నిర్ణయించారు. రీజనల్ రింగ్‌రోడ్డు తరువాత కనీసం 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలనే ప్రతిపాదన ఉంది. ఈ మేరకు జోన్ల విస్తరణ అనివార్యం అయింది.చదవండి: 111 జీవో స్థలాలను క్రమబద్ధీకరిస్తారా?ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం రావిర్యాల (Raviryal) నుంచి ఆమన్‌గల్ వరకు 41 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు తరహాలోనే రీజనల్ రింగ్‌రోడ్డుకు, ఔటర్‌రింగ్‌రోడ్డుకు సుమారు 40 చోట్ల రహదారుల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. కొత్తగా రూపొందించనున్న మాస్టర్‌ప్లాన్–2050లో రహదారులు, శాటిలైట్ టౌన్‌షిప్పులు, ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు. ‘హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్‌సిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.ఈ మేరకు హెచ్ఎండీఏ కార్యాచరణను పటిష్టం చేయవలసి ఉంది’ అని ఒక అధికారి చెప్పారు. -
111 జీవో స్థలాలను క్రమబద్ధీకరిస్తారా?
మెయినాబాద్ మండలం ఎంకేపల్లె గ్రామంలో 600 గజాల స్థలం ఉండగా, భూ యజమాని 2020 అక్టోబర్ నెలలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నాడు. తాజాగా రేవంత్ సర్కారు ఎల్ఆర్ఎస్లను క్రమబద్దికరిస్తుండంతో అధికారులు డాక్యుమెంట్లను స్క్రూట్నీ చేసి ఫీజు రూ.83,651గా నిర్ధారించారు. 25 శాతం రాయితీ రూ.20,912 పోను, మిగిలిన రూ.61,738 చెల్లించాలని ఈనెల 10న దరఖాస్తుదారునికి ఫీజు ఇంటిమేషన్ లెటర్ పంపారు. దీంతో ఆయన రుసుము చెల్లించేశాడు. ట్విస్ట్ ఏంటంటే.. సంబంధిత స్థలం 111 జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో ఒకటి కావడమే. సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల పరిధిలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు 27 ఏళ్ల క్రితం నాటి ప్రభుత్వం 111 జీవోను తీసుకొచ్చింది. ఇప్పటికే దీని పరిధిలోని 84 గ్రామాల్లో అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించకుండానే దరఖాస్తుదారులకు ఫీజు ఇంటిమేషన్ పంపిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా భావిస్తున్న దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి, ప్రొసీడింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు హెచ్ఎండీఏ పరిధిలో ఎల్ఆర్ఎస్కు సంబంధించి మూడు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈనెల 31 లోపు ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుండటంతో చాలామంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎలాంటి వివాదాలు, న్యాయపరమైన చిక్కులు లేని లేఅవుట్లలో ప్లాట్లకు ఆటోమేటిక్‌గా ఫీజు చెల్లించాలని ఆన్లైన్లో నోటీసులు అందుతున్నాయి. రిజెక్ట్ అయితే 10 శాతం కట్.. గతంలో అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే ఫీజు ఇంటిమేషన్ లెటర్‌ను అధికారులు పంపించేవారు. కానీ ఇప్పుడు డీఫాల్ట్‌గా ఫీజు ఇంటిమేషన్ లింక్‌లను పంపిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే ఫీజు చెల్లించడానికి అవకాశం ఇవ్వాలి. కానీ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దరఖాస్తుదారుడు ఫీజు చెల్లించిన తర్వాత ఒకవేళ తిరస్కరణకు గురైతే చెల్లించిన ఫీజులో 10 శాతం ప్రాసెసింగ్ చార్జీల కింద కట్ చేసుకొని మిగిలిన మొత్తం ఇస్తామని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఆదాయం కోసమే దరఖాస్తుదారులకు ముందు ఫీజు ఇంటిమేషన్ పంపించి, రుసుములు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తిరస్కరణలో శాస్త్రీయత లోపం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న లేఅవుట్లు, స్థలాలు చెరువులు, కాల్వలు, నీటి వనరులకు 200 మీటర్ల దూరంలో ఉంటే వాటిని నిషేధిత జాబితాలో చేర్చుతున్నారు. అయితే ఈ ప్రక్రియను సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఆధారంగా నీటి వనరులను గుర్తిస్తుండటం శాస్త్రీయంగా సరైన పద్ధతి కాదని పీర్జాదిగూడ మాజీ మేయర్ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆయా మ్యాప్‌లు పురాతన కాలం నాటివని, పట్టణీకరణ అయ్యాక విలేజ్ మ్యాప్‌లలో పిల్ల కాల్వలు, వాగులు కనిపించవని తెలిపారు. ఈ కారణంగా ఆయా దరఖాస్తులను తిరస్కరించడం సరైంది కాదన్నారు. కొన్ని లేఅవుట్లు నీటి పరిధిలో లేకున్నా, మాస్టర్‌ప్లాన్‌లో తప్పుల కారణంగా నిషేధిత జాబితాలోకి చేరాయి. ఇలాంటి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు చర్యలు తీసుకోవాలి. సిబ్బంది కొరత, దరఖాస్తుల పరిశీలనలో సిబ్బంది తీరిక లేకుండా ఉండటంతో ఆటువైపు ఎవరూ చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
RRR వరకు హెచ్ఎండీఏ విస్తరణతో డీటీసీపీకి బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా, సమగ్రమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించకుండానే ఆగమేఘాల మీద హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తూ తెచ్చిన జీఓ.. రియల్ ఎస్టేట్ (Real Estate) రంగాన్ని కుదేలు చేసేలా మారింది. నిర్మాణ రంగం కూడా మరింత బలహీన పడే పరిస్థితి నెలకొంది. ఇంచుమించు ఏడాదిన్నరగా చతికిల పడ్డ ‘రియల్ భూమ్’ను ఇది మరింత భూస్థాపితం చేసేలా మారిందని నిర్మాణరంగ నిపుణులు భావిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఆవిర్భవించినప్పటి నుంచి రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల నుంచే ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయం లభించింది. నగరం చుట్టుపక్కల ఉన్న భూములు బంగారం కంటే ప్రియంగా మారాయి. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. హెచ్ఎండీఏ (HMDA) భూములకు సైతం భారీ డిమాండ్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు (Outer ring road) పరిధిలో ఎక్కడ హెచ్ఎండీఏ భూములను అమ్మకానికి పెట్టినా రూ.వందల కోట్ల ఆదాయం లభించింది. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలతో రియల్ రంగం వెనుకంజ వేసింది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ విస్తరణతో తిరిగి కొంత రియల్ భూమ్ రావచ్చని మొదట్లో భావించారు. కానీ.. ఏ విధమైన ప్రణాళికలు, విధి విధానాలు లేకుండానే ఆకస్మికంగా జీఓ తేవడంతో అనుమతులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్‌ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి లభించే అనుమతులకు తాజాగా బ్రేక్ పడింది. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది.అనుమతులు ఇచ్చేదెవరు? ఇప్పటికే డీటీసీపీ పరిధిలో భూములు కొనుగోలు చేసి లేఅవుట్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న రియల్టర్లకు ఎలాంటి సమాధానం లభించడం లేదు. ప్రస్తుతం లే అవుట్ అనుమతుల అంశం తమ పరిధిలో లేదంటూ డీటీసీపీ (DTCP) అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణదారులు రెండు, మూడు రోజులుగా హెచ్ఎండీఏకు తరలివస్తున్నారు. కానీ.. హెచ్ఎండీఏలో సైతం చుక్కెదురే కావడం గమనార్హం. ట్రిపుల్ ఆర్ వరకు తమ పరిధి పెరిగినప్పటికీ ఇంకా ఎలాంటి విధివిధానాలు రాలేదని చెబుతున్నారు.మరోవైపు కొత్త మాస్టర్‌ప్లాన్ వస్తే తాము అనుమతులు ఇవ్వలేమంటున్నారు. దీంతో రియల్టర్లు, వ్యాపార వర్గాలు, ఆర్కిటెక్టర్లు తదితర వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. ‘అనుమతుల కోసం కొంత కాలం ఆగాల్సిందేనంటున్నారు. కానీ.. ఎంతకాలం అనే దానిపై స్పష్టత లేకుండాపోయింది. పైగా మాస్టర్ ప్లాన్ లేకుండా అనుమతులను ఇవ్వడం కూడా సాధ్యం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇది నష్టదాయకంగా మారింది’ అని కందుకూరు ప్రాంతానికి చెందిన రియల్టర్ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు బ్యాంకుల నుంచి, ఇతరత్రా రుణాలు తీసుకుని భూములు కొనుగోలు చేసిన వ్యాపారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.మాస్టర్‌ప్లాన్‌కు మరో ఏడాది.. మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేసి సమగ్రమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం ఏడాది క్రితం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔటర్‌రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్‌గా, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్‌గా, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి మిగతా తెలంగాణ అంతా రూరల్‌గా పరిగణిస్తూ రీజినల్ రింగ్ రోడ్డు వరకు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమగ్రమైన మాస్టర్‌ప్లాన్– 2050ని రూపొందించాల్సి ఉంది. కానీ.. ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.చదవండి: ఎల్ఆర్ఎస్తో తిప్పలు.. దరఖాస్తుదారులకు చుక్కలు మాస్టర్‌ప్లాన్ (Mastar Plan) రూపకల్పన కోసం ఆసక్తి గల అంతర్జాతీయ సంస్థల నుంచి రిక్వెస్ట్ ప్రపోజల్స్‌ను ఆహ్వానించేందుకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు చెప్పారు. ఎంపిక చేసిన సంస్థ పూర్తిగా అధ్యయనం చేసి సమగ్రమైన మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేసేందుకు కనీసం ఏడాది సమయం పట్టవచ్చని అంచనా. మాస్టర్ ప్లాన్ సిద్ధమైతే తప్ప హెచ్ఎండీఏ నుంచి అనుమతులు లభించవు. అంటే అప్పటి వరకు ట్రిపుల్ ఆర్ వరకు అన్ని రకాల నిర్మాణాలు, లే అవుట్లు, వెంచర్లు నిలిచిపోవాల్సిందేనా అనే సందేహం నెలకొంది. ఈ పరిణామం రియల్ ఎస్టేట్ భవిష్యత్‌ను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చిందని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పరిస్థితి అగమ్యగోచరం.. హైదరాబాద్ విస్తరణ పట్ల ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.. అసలు మాస్టర్‌ప్లాన్ లేకుండానే విస్తరణ జీఓ ఇవ్వడం వల్ల స్పష్టత లేకుండా పోయింది. రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ రంగానికే కాదు హైదరాబాద్ అభివృద్ధికి కూడా ఇది నష్టమే. – సత్యనారాయణ చిట్టి, రియల్ ఎస్టేట్ నిపుణులు -
ఎల్ఆర్ఎస్తో ముప్పు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) జనానికి చుక్కలు చూపిస్తోంది. గడువులోగా స్థలాలను క్రమబద్ధీకరించుకొనేందుకు దరఖాస్తు చేసుంటున్నవారిని సాంకేతిక చిక్కుముడులు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఫీజుల లెక్కలు సైతం గందరగోళానికి గురిచేస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న నాటి మార్కెట్ విలువతో సంబంధం లేకుండా ఒక్కో ప్లాట్‌కు ఒక్కో విధంగా ఫీజు విధించడంతో దరఖాస్తుదారులు అమీర్‌పేట్‌లోని హెచ్ఎండీఏ (HMDA) కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. కొంతమంది దరఖాస్తుదారులకు ఎల్ఆర్ఎస్ (LRS) ఫీజు కంటే ఓపెన్ స్పేస్ ఫీజులు ఎక్కువగా వస్తున్నాయి. కొందరికి భూమి మార్పునకు సంబంధించిన ఫీజులు తేలడం లేదు. మరోవైపు సాంకేతిక సమస్యల కారణంగా అధికారులు సైతం ఎలాంటి పరిష్కారం చూపలేక చేతులెత్తేస్తున్నారు.మార్చి 31వ తేదీ లోపు ఫీజు చెల్లిస్తే 25 శాతం తగ్గింపు లభిస్తుందనే ఉద్దేశంతో జనం ఆసక్తి చూపుతున్నారు. కానీ ఫీజులు చెల్లించిన వారికి ఇప్పటి వరకు ప్రొసీడింగ్స్ రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఫీజు చెల్లించిన వారికి మార్చి అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ప్రొసీడింగ్స్‌ను ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. దీంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3.44 లక్షల దరఖాస్తులు ఉండగా.. ఇప్పటి వరకు కనీసం 10 వేల దరఖాస్తులు కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ ప్రకటించిన తర్వాత ఒక్కో జోన్ పరిధిలో కనీసం వెయ్యి దరఖాస్తులను కూడా పరిష్కరించలేకపోయినట్లు అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వెంటాడుతున్న సాంకేతిక చిక్కులు.. ఎల్ఆర్ఎస్ పథకానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)సాంకేతిక వ్యవస్థను రూపొందించింది. దీనిపై హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల్లోని పట్టణ ప్రణాళికా విభాగాలకు అవగాహన కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం వెబ్‌సైట్‌తో పాటు అధికారుల పనిని సులభతరం చేసేలా ఓ మొబైల్ యాప్‌ను కూడా రూపొందించారు. కానీ.. ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలులో రకరకాల చిక్కులు ఎదురవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.‘ఒక్కోసారి సేకరించిన డాటా మొత్తం డిలీట్ అవుతోంది. దాంతో మరోసారి డాటా నమోదు చేసుకోవాల్సి వస్తోంది. ఒక పనిని ఒకటికి రెండుసార్లు చేయడంతో జాప్యం జరుగుతోంది’ అని ప్లానింగ్ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో మొబైల్ యాప్ (Mobile App) పని చేయడం లేదు. దీంతో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. సాధారణంగా ఎల్ఆర్ఎస్ ఫీజు నమోదైన తర్వాత స్థల మార్పిడికి చెల్లించాల్సిన ఫీజు వివరాలు కూడా నమోదు కావాలి. కానీ ఇందులో ఏదో ఒకటి మాత్రమే నమోదు కావడంతో అలాంటి ఫైళ్లను పెండింగ్ జాబితాలో పెట్టేస్తున్నారు.దరఖాస్తుదారుల్లో గందరగోళం.. ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించింది. ఆ ఏడాది ఆగస్టు వరకు దరఖాస్తు చేసుకున్నవాళ్లకు మాత్రమే ఇప్పుడు క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుంది. ఆ సంవత్సరం ప్రభుత్వం నిర్ణయించిన భూముల మార్కెట్ ధర ప్రకారం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. ఈ ఫీజుల లెక్కల్లోనూ రకరకాల తప్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో దరఖాస్తుదారులు గందరగోళానికి గురవుతున్నారు. చదవండి: మా గ్రామాలను ఎఫ్‌సీడీఏలో కలపండిఇలా తప్పుడు ఫీజులు నమోదైన దరఖాస్తులను పరిశీలించి సవరించేందుకు సాంకేతికంగా మార్పులు చేయాల్సివస్తోంది. ఈ సవరణలు అధికారులు స్వయంగా చేసేందుకు అవకాశం లేదు. సీజీజీలోనే సవరణ జరగాలి. ఆ విధంగా మరికొంత జాప్యం జరుగుతోంది. హెచ్ఎండీఏలోని శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ (Ghatkesar) జోన్ల పరిధిలో ఇలాంటి తప్పులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. కేవలం రూ.4000 చొప్పున ఓపెన్ స్పేస్ ఫీజు నమోదు కావాల్సి ఉండగా.. కందుకూరు మండలం పులిమామిడిలో ఒక స్థలంలో ఓపెన్ స్పేస్ ఫీజు ఏకంగా రూ.లక్షకు పైగా రావడంతో అధికారులే విస్మయానికి గురయ్యారు.ఒత్తిడి పెంచడంతోనే.. సీజీజీ రూపొందించిన టెక్నాలజీలో తరచూ మార్పులు, చేర్పులు చేయడంతోనే ఈ ఇబ్బందులు, పొరపాట్లు జరుగుతున్నట్లు టెక్నికల్ సిబ్బంది చెబుతున్నారు. మొదట్లో హెచ్ఎండీకు మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని తర్వాత నీటిపారుదల, రెవిన్యూ శాఖలకు కూడా విస్తరించాల్సి వచ్చింది. ఆ తర్వాత చెరువులు, కుంటలు, నీటి వనరులకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలను మరోసారి మార్పు చేయాల్సి వచ్చింది. ఇలా తరచూ టెక్నాలజీలో మార్పుల వల్ల కూడా తప్పులు చోటుచేసుకుంటున్నాయని సీజీజీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
ట్రిపుల్ ఆర్ వరకు హైదరాబాద్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో వెలువరించింది. దీంతో ఇప్పటివరకు 7,257 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధి 10,472.723 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలతో పాటు కొత్తగా నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలతో కలుపుకొని మొత్తం 11 జిల్లాలకు విస్తరిస్తుంది. మొత్తం 1,355 గ్రామాలు, 104 మండలాలు సంస్థ పరిధిలోకి వస్తాయి. మరోవైపు ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పరిధిలోకి తెచ్చారు. రీజినల్ రింగ్‌రోడ్డు తరువాత 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా నిర్ణయించారు. హైదరాబాద్ చుట్టూ 354 కిలోమీటర్ల పరిధిలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రగతి పరుగులు! అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరం పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడం వల్ల ప్రగతి పరుగులు పెడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న హైదరాబాద్ నగరాన్ని కోర్ అర్బన్ ప్రాంతంగా పరిగణిస్తూ సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల వరకు జీహెచ్ఎంసీని విస్తరిస్తారు. ఆ తర్వాత ఔటర్ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా పరిగణిస్తూ శాటిలైట్ టౌన్‌షిప్పులు, ఇతర మౌలిక సదుపాయాలతో నగరాన్ని విస్తరించనున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు తరువాత ఉన్న తెలంగాణను రూరల్ తెలంగాణగా పరిగణించి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ కోసం కూడా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకోసం త్వరలో అంతర్జాతీయ కన్సల్టెన్సీల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. -
‘మహా ప్రణాళిక’కు కసరత్తు
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధి విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో సమగ్రమైన మాస్టర్‌ప్లాన్ రూపకల్పన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వచ్చే సెప్టెంబర్ నాటికి మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను విడుదల చేసే దిశగా హెచ్ఎండీఏ (HMDA) కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు కొత్తగా విస్తరించనన్న పరిధికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ కోసం మరో వారం, పది రోజుల్లో ఆసక్తి వ్యక్తీరణ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్) దరఖాస్తులను స్వీకరించేందుకు నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్‌లో చేర్చాల్సిన అంశాలపై కసరత్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో రూపొందించిన హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్ – 2031లో దొర్లిన లోపాలు పునరావృతం కాకుండా పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేయనున్నట్లు ఒక అధికారి వివరించారు. 2050 వరకు హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, టౌన్‌షిప్పులు, రహదారులు, ప్రజారవాణా సదుపాయాలు, పచ్చదనం, నీటివనరులు, తదితర అంశాలను సమగ్రంగా ప్రతిపాదించేలా మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు ఆసక్తి గల అంతర్జాతీయ కన్సార్షియంల నుంచి దరఖాస్తులను కోరనున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఉన్న అన్ని మాస్టర్పాల్న్లను ఈ బృహత్తర మాస్టర్‌ప్లాన్‌లో విలీనం చేయనున్నారు. ఎంసీహెచ్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, సైబరాబాద్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ప్లాన్లు విలీనం కానున్నాయి.రీజినల్ రింగ్‌రోడ్డు వెలుపల 2 కిలోమీటర్ల వరకు... హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు రీజనల్ రింగ్‌రోడ్డుకు వెలుపల 2 కిలోమీటర్ల వరకు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తారు. ట్రిపుల్ ఆర్ తరువాత ఒక కిలోమీటర్ను బఫర్‌జోన్‌గా పరిగణిస్తారు. ఆ కిలోమీటర్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం 7,527 చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధి కొత్తగా 10,560 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. మొత్తం 104 మండలాలు, 1,355 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి.చదవండి: హైదరాబాద్‌కు దీటుగా ప్యూచర్ సిటీ!ఇప్పుడు ఉన్న 7 జిల్లాలకు తోడు నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్ కొత్తగా చేరడంతో హెచ్ఎండీఏ పరిధిలోని జిలాల సంఖ్య 11కు చేరనుంది. అలాగే 41 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. కొత్తగా 3 మున్సిపాలిటీలు చేరనున్నాయి. ఔటర్ లోపల 28 మున్సిపాలిటీలు, ఔటర్ వెలుపల 12 మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. -
హైదరాబాద్‌కు దీటుగా ప్యూచర్ సిటీ!
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు దీటుగా నాలుగో నగరం ఆవిష్కృతం కాబోతోంది. ఇటు శ్రీశైలం, అటు నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఉన్న ఏడు మండలాలు.. 56 గ్రామ పంచాయతీలతో సుమారు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (future city urban development authority) పేరుతో మరో అద్భుత నగరం ఆవిష్కరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేసింది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో హెచ్ఎండీఏ (HDMA) పరిధిలో ఉన్న 36 గ్రామాలను కూడా కొత్త గా ఏర్పాటు చేసే ఎఫ్డీసీఏలో విలీనం చేయనున్నట్లు ప్రకటించింది.ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి కోసం కొత్తగా 90 పోస్టులను సృష్టించడమే కాకుండా, వాటి భర్తీకి ఆమోదం కూడా తెలిపింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపనతో ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట మీదుగా ఆర్ఆర్ఆర్ (RRR) వరకు నిర్మించతలపెట్టిన 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ (రతన్‌టాటా) రోడ్డుకు భూసేకరణ చేపట్టింది. తొలి దశలో 19.2 కిలోమీటర్లకు రూ.1,665 కోట్లు కేటాయించింది. అదే విధంగా రెండో విడతలో 22.30 కిలోమీటర్ల దూరంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు రూ.2,365 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.హెచ్ఎండీఏ పరిధిని పెంచుతూ మంత్రివర్గం ఆమోదంహైదరాబాద్ మహా నగర పరిధి విస్తరణకు గురువారం మంత్రివర్గం (Telangana Cabinet) ఆమోద ముద్ర వేసింది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు పెరగనుంది. ఈ మేరకు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండీఏ పరిధి తాజా నిర్ణయంతో సుమారు 11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చ.కి.మీ వరకు పెరగనుంది. ఇప్పుడు 70 మండలాలు, సుమారు 1000 గ్రామ పంచాయతీలు, మరో 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడం వల్ల మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 106 మండలాలు, సుమారు 1400కు పైగా గ్రామాలతో హెచ్ఎండీఏ పరిధి భారీగా పెరగనుంది.హెచ్ఎండీఏ పరిధి పెరగడం వల్ల ట్రిపుల్ ఆర్ పరిధిలో శాటిలైట్ టౌన్‌షిప్పుల నిర్మా ణం జరిగే అవకాశం ఉంది. కొంతకాలంగా స్తబ్దత నెలకొన్ని ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థలు సైతం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చని అంచనా. చదవండి: మల్కాజిగిరి రైల్వే స్టేషన్ న్యూ లుక్ అదరిందిఔటర్రింగ్రోడ్డు వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్‌గా, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఈ మేరకు సెమీ అర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ ను రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ పరిధి పెరగనుంది. ప్రస్తుతం 11 జిల్లాలకు పరిధిని పెంచడం వల్ల నల్లగొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి. -
ఇక ట్రిపుల్ ఆర్ వరకు హైదరాబాద్ నగరమే!
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్‌సిటీ దిశగా పరుగులు తీస్తున్న హైదరాబాద్ పరిధి మరింత విస్తరించనుంది. నిర్మాణాత్మకమైన, ప్రణాళికాబద్ధమైన మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధి పెరగనుంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదించే అవకాశముంది. ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్‌గా, ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీఅర్బన్గా విభజిస్తారు. మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఈ మేరకు సెమీఅర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్‌ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. దీంతో ఔటర్ రింగ్‌రోడ్డు వరకు సుమారు 2,000 చదరపు కిలోమీటర్లు జీహెచ్ఎంసీ పరిధిలోకి రానుంది. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ పరిధి పెరగనుంది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండీఏ పరిధి..11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్టు అంచనా. ఇప్పుడు 70 మండలాలు, 1,000 గ్రామపంచాయతీలు, 8 కార్పొరేషన్లు, మరో 38 కి పైగా మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు పరిధి పెరగనున్న నేపథ్యంలో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు కొత్తగా చేరుతాయి. దీంతో 11 జిల్లాలు, 106 మండలాలు, 1,400లకు పైగా గ్రామాలతో హెచ్ఎండీఏ పరిధి భారీగా పెరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించిన వెంటనే జీవో విడుదల అవుతుందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంచలంచెలుగా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా)ని ఏర్పాటు చేశారు. 650 చదరపు కిలోమీటర్ల వరకు దీని పరిధి ఉండేది. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో 2008లో హుడా స్థానంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)ని ఏర్పాటు చేశారు. దీంతో 7,257 చదరపు కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ పరిధి పెరిగింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. కొత్తగా జిల్లాల విభజన జరిగిన తర్వాత హెచ్ఎండీఏలోని జిల్లాల సంఖ్య 7 కు పెరిగింది. ప్రస్తుతం 11జిల్లాలకు దీని పరిధిని పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు నల్లగొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి. సుమారు 1,400 గ్రామాలు హెచ్ఎండీఏలో కలిసే అవకాశముంది. ట్రిపుల్ ఆర్ తర్వాత 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ పరిధి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్లు, ప్రజా రవాణా సదుపాయాలు, మౌలిక సదుపాయాల విస్తరణకు ఇప్పటికే లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. ⇒ రీజినల్ రింగ్‌రోడ్డును అనుసంధానం చేసే రేడియల్ రోడ్ల నిర్మాణానికి సైతం హెచ్ఎండీఏ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఔటర్‌రింగ్ రోడ్డు(రావిర్యాల) నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ఆమన్‌గల్లు) వరకు రేడియల్ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ⇒ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెట్రో విస్తరణపైన కూడా దృష్టి సారించింది. లీ అసోసియేషన్ రూపొందించే కామన్ మెబిలిటీ ప్లాన్ సమగ్ర నివేదిక త్వరలో వెలువడనుంది. వచ్చే నెలలో మాస్టర్‌ప్లాన్‌కు బిడ్డింగ్ మరోవైపు ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ పరిధి పెరగనున్న దృష్ట్యా భవిష్యత్ అవసరాల మేరకు 2051 వరకు హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందించాల్సిన సమగ్ర మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు ఆసక్తి గల అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చే నెలలో ఆన్లైన్ బిడ్డింగ్‌ను ఆహ్వానించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడు ఉన్న 5 మాస్టర్ ప్లాన్లను విలీనం చేసి ఒకే మాస్టర్‌ప్లాన్‌గా అభివృద్ధి చేస్తారు. ఫోర్త్ సిటీకి స్పెషల్ అథారిటీ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫోర్త్‌సిటీ అభివృద్ధికి స్పెషల్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు సైతం చర్యలు చేపట్టింది. ఈ మేరకు గత నెలలోనే జీవో వెలువడింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కొత్తగా స్కిల్ యూనివర్సిటీతో పాటు విద్యాసంస్థలకు, పారిశ్రామికరంగానికి ఈ ప్రాంతం హబ్‌గా మారనుంది. ఈ క్రమంలో ఫోర్త్‌సిటీ పరిధిలోని వచ్చే 56 రెవెన్యూ గ్రామాను అభివృద్ధి చేస్తారు. -
అంతర్జాతీయ హంగులతో నియో పోలిస్
సాక్షి, హైదరాబాద్: కోకాపేట కొత్త కళను సంతరించుకుంది. ఆకాశ హర్మ్యాలతో ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ హంగులను అద్దుకున్న కోకాపేటలో హెచ్ఎండీఏ (HMDA) భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను విస్తరించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నియోపోలిస్ లే అవుట్ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. రహదారులు, నీటి సదుపాయం, పార్కులు, విద్యుత్ తదితర సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. నియోపోలిస్ (neopolis) నుంచి నగరంలోని అన్ని వైపులకు రాకపోకలు సాగించేలా రహదారుల విస్తరణ చేపట్టారు. ఔటర్ రింగ్‌రోడ్డుతో అనుసంధానం చేసే ట్రంక్‌రోడ్డు పనులు తుదిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం టోల్‌ప్లాజా (Toll Plaza) నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరో 20 రోజుల్లో పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలను ప్రారంభించనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు తెలిపారు. నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం.. వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు, ఐటీ కంపెనీలు, నివాస సముదాయాలతో విస్తరించిన కోకాపేటకు మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రెండో దశలో డీపీఆర్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. మహా నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట గుర్తింపు పొందింది. నియోపోలిస్‌లో హెచ్ఎండీఏ నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో ఎకరా భూమి సుమారు రూ.100 కోట్లు పలికింది. బడా బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యాపార వర్గాలు పోటీ పడి మరీ ప్లాట్లను కొనుగోలు చేశాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలకు అవకాశం ఉండడంతో అనూహ్యమైన పోటీ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో రెండు దశల్లో వేసిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో సుమారు రూ.5000 కోట్లకు పైగా ఆదాయం లభించింది. మొదటి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ లేఅవుట్లో రూ.268 కోట్లతో హెచ్ఎండీఏ మౌలిక సదుపాయాలను అభివృద్ధిపర్చింది. రెండో దశలో భారీ స్పందన.. కోకాపేట (Kokapet) నియోపోలిస్‌లో రెండు దశల్లో 14 ప్లాట్లలో ఉన్న భూములను విక్రయించారు. 2021 జూన్‌లో నిర్వహించిన మొదటి దశ బిడ్డింగ్‌లో 8 ప్లాట్లకు బిడ్డింగ్ నిర్వహించగా.. గరిష్టంగా ఎకరానికి రూ.42.4 కోట్ల చొప్పున అమ్ముడైంది. సగటున రూ.35 కోట్ల చొప్పున విక్రయించారు. మొత్తం 48.27 ఎకరాలపై రూ.1901.04 కోట్లు వచ్చాయి. 2023లో నిర్వహించిన రెండో దశ బిడ్డింగ్‌లో 7 ప్లాట్లలో 46.33 ఎకరాలను విక్రయించారు. ఎకరానికి గరిష్టంగా రూ.100.75 కోట్ల ఆదాయం లభించింది. సగటున రూ.73 కోట్ల చొప్పున విక్రయించారు. రెండో దశలో మొత్తం రూ.3319.60 కోట్ల ఆదాయం లభించింది. మొదటి నుంచి ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేశారు. ఔటర్తో అనుసంధానం.. కోకాపేట నుంచి వివిధ మార్గాల్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా కోకాపేట లే అవుట్ ప్రవేశ రహదారిని ఔటర్తో అనుసంధానం చేసేలా రహదారులను విస్తరించారు. ఈ లే అవుట్లో పెద్ద ఎత్తున హైరైజ్ భవనాలను నిర్మిస్తున్న దృష్ట్యా వాహనాల రాకపోకలు సైతం భారీగా ఉంటాయని అంచనా. ఈ మేరకు భవిష్యత్ అంచనాలకు అనుగుణంగా రహదారుల విస్తరణకు హెచ్ఎండీఏ అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. నార్సింగి వద్ద సుమారు రూ.15 కోట్లకు పైగా వెచ్చించి ఇంటర్‌చేంజ్‌ను ఏర్పాటు చేశారు. మరో రూ.65 కోట్లతో ట్రంపెట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. కోకాపేట నుంచి ట్రంపెట్‌కు రాకపోకలు సాగించే మార్గంలో ప్రస్తుతం టోల్గేట్ నిర్మిస్తున్నారు. చదవండి: ఓఆర్ఆర్ చుట్టూ హౌసింగ్ కాలనీలుట్రంపెట్ రోడ్డును వినియోగించుకొనేందుకు వాహనదారులు ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ఇటు పటాన్చెరు వైపు అటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు రాకపోకలు సాగించవచ్చు. -
చారిత్రక దారి.. 300 ఏళ్ల మెట్లబావి
నాటి చారిత్రక కట్టడాలు నేటి తరానికి గొప్ప సంపద. గతాన్ని చూడని ఇప్పటి జనానికి అలనాటి నిర్మాణాలే సజీవ సాక్ష్యాలు. దశాబ్దాల కాలం నాటి నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటం అప్పటి సాంకేతికతకు నిదర్శనం. యంత్రాలు, ఇతర నిర్మాణ పనిముట్ల గురించి తెలియని సమయంలో కేవలం మానవుల తెలివితో చేపట్టిన నిర్మాణాలు నేటి సాంకేతికత కంటే చాలా పటిష్టంగా ఉన్నా యి. అలాంటి వారసత్వ సంపద ఎక్కడ ఉన్నా గుర్తించి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.రాజధానికి 52 కి.మీ. దూరంలో..హైదరాబాద్‌కు (Hyderabad) సరిగ్గా 52 కి.మీ. దూరంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై విజయవాడ (Vijayawda) మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం (Lingojigudem) గ్రామం ఉంది. ఈ గ్రామంలో జాతీయ రహదారి వెంట ప్రస్తుతం ఉన్న సాయిబాబా దేవాలయాన్ని గతంలో గోసాయిమఠంగా పిలిచేవారు. దశాబ్దాల కిందట ఈ మఠాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దేవాలయం వెనుక భాగాన దిగుడుబావి (మెట్లబావి) ఉంది. ఆ దిగుడు బావిని 300 ఏళ్ల కిందట అప్పటి రాజులు నిర్మించారు. ఎంతో గొప్ప సాంకేతికతతో నిర్మించిన ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటంతో కొంత మేరకు నిర్మాణాలు దెబ్బతిన్నాయే తప్పిస్తే మిగతా కట్టడాలన్నీ యథావిధిగా ఉన్నాయి. రాజుల కాలంలో దిగుడుబావి నిర్మాణందిగుడుబావి (మెట్లబావి) గొప్ప చరిత్ర కలిగి ఉంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఇక్కడ విశ్రాంత మందిరాన్ని నిర్మించుకున్నారని, ఆ విశ్రాంత మందిరానికి అనుసంధానంగా అన్ని రకాల సౌకర్యాలతో ఈ దిగుడుబావిని నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. దిగుడుబావి పరిసరాల్లోని రాజు భూములు కాలక్రమేణా స్థానికులకు వచ్చాయి. పూర్తిగా రాళ్లతోనే..ఈ దిగుడుబావిని పూర్తిగా రాళ్లతోనే నిర్మించారు. తూర్పున 6 అడుగుల వెడల్పు, దిగువకు 20 అడుగులు, ఉత్తరంలో 10 అడుగుల వెడల్పు ప్రకారం మొత్తంగా దిగువకు 60 అడుగుల మేర మెట్లు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గాన్ని గ్రానైట్ రాళ్లతో అందంగా తీర్చిదిద్దారు. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో ఈ బావిని నిర్మించారు. భూమి నుంచి 25 అడుగుల దిగువన బావిలో ప్రత్యేకంగా ఆర్చీలతో మూడు గదులు ఏర్పాటు చేశారు. బావిలో స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు ఈ గదులను నిర్మించారు. ఆ గదులు ప్రత్యేకంగా మహిళలు (నాటి రాణులు) వినియోగించేవిగా తెలుస్తోంది. పొలాలకు సాగునీరు, స్థానిక ప్రజానీకానికి తాగు నీరు అందించడంతో పాటు ప్రజలు స్నానాలు చేసేందుకు అనువుగా బావిని నిర్మించారు. గోసాయి మఠంగా ప్రత్యేక గుర్తింపుచౌటుప్పల్ పట్టణ కేంద్రానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగోజిగూడెం గ్రామం ఒకప్పుడు గోసాయిమఠంగానే గుర్తింపు పొందింది. కొన్నేళ్ల కిందట గోసాయిదొర అనే వ్యక్తి హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ప్రస్తుతం సాయిబాబా దేవాలయం ప్రాంతంలో మఠాన్ని ఏర్పాటు చేశాడు. పలు ప్రాంతాలకు ప్రయాణాలు చేసే బాటసారులు అలసిపోయిన సందర్భాల్లో విశ్రాంతి తీసుకోవడంతోపాటు అక్కడే విడిది చేసేందుకు అనువుగా అందులో వసతులు ఉండేవని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో ఆర్టీసీ బస్సులు కూడా గోసాయిమఠం స్టేజీ అంటేనే ఆగేవంటే ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయానికి ప్రస్తుతం రెండు ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది.మెట్లబావి పరిరక్షణకు ముందుకొచ్చిన హెచ్ఎండీఏశతాబ్దాల కాలంనాటి మెట్లబావి గురించి సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అందుకు సంబంధించి 2022, ఫిబ్రవరి 14న ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ స్పందించారు. వెంటనే మెట్లబావి విషయాన్ని తెలుసుకుని మరమ్మతులు చేయాలని హెచ్ఎండీఏ (HMDA) అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అలా ఈ మెట్లబావిని సుందరీకరించారు. అనంతరం ఏప్రిల్ 14న దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ మెట్లబావి బాధ్యతలు హెచ్ఎండీఏ చూసుకుంటోంది. అయితే ఆ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.ఇదీ చదవండి: రాజాబావి.. రాజసం ఏదీ?కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తాం పురాతన మెట్లబావి అభివృద్ధి అంశాన్ని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్తాం. పర్యాటక ప్రాంతంగా మారితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పురాతన కట్టడాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మూడొందల ఏళ్ల కిందట నిర్మించిన మెట్లబావి మా గ్రామంలో ఉండటం మాకెంతో గర్వకారణం. ప్రభుత్వం, మున్సిపల్ శాఖ నిరంతరం పర్యవేక్షించాలి. – రమనగోని శంకర్, మాజీ సర్పంచ్, లింగోజిగూడెం -
ప్రతాప సింగారంలో హెచ్ఎండీఏ భారీ వెంచర్
హైదరాబాద్‌కు తూర్పున ఉన్న ప్రతాప సింగారం (pratap singaram) ‘రియల్’శోభ సంతరించుకోనుంది. దీనికిగాను హెచ్ఎండీఏ (HMDA) నడుంబిగించింది. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. భారీ వెంచర్‌కు ఫైనల్ లేఅవుట్ (lay out) సిద్ధం చేసింది. నగరం నలుదిక్కులా శివారు ప్రాంతాలు శరవేగంతో అభివృద్ధి చెందాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఇది కార్యరూపం దాల్చబోతోంది. ఉప్పల్ భగాయత్ (uppal bhagayath) తరహాలో వెంచర్ రూపుదిద్దుకోనుంది. దాదాపు 150 మంది రైతుల నుంచి ఇప్పటికే 133 ఎకరాల పట్టాభూమితోపాటు మరో 18 ఎకరాల అసైన్డ్ భూమిని అధికారులు ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా సేకరించారు. అసైన్డ్ భూమిని రైతులు ఇచ్చినప్పటికీ కలెక్టర్ ఆమోదముద్ర పడాల్సి ఉంది.వెంచర్ అభివృద్ధికి రూ.120 కోట్లు వెంచర్‌ను అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏకు ప్రభుత్వం రూ.120 కోట్లను ఈ ఏడాది జనవరి 7న విడుదల చేసింది. 60:40 నిష్పత్తిలో ప్లాట్ల విస్తీర్ణాన్ని విభజించి ఎకరాకు 1,741 చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతు వాటాగా కేటాయిస్తారు. హెచ్ఎండీఏకు మొత్తం 30 ఎకరాల వాటా వస్తుంది. దీని విలువ సుమారు రూ. 270 కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నందున ప్రతాపసింగారానికి రూ. 10 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించి తమ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసైన్డ్ ల్యాండ్ ఇచ్చిన రైతులకు చట్ట ప్రకారం అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఎకరాకు 600 చదరపు గజాలు కేటాయించాలి. కానీ, వెయ్యి చదరపు గజాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం, ప్లాట్ల కేటాయింపు.. వెంచర్ ప్రతిపాదనలు సిద్ధం చేసి మూడేళ్లు అవుతోంది. కొద్ది మంది రైతులు భూములను స్వాధీనం చేయడంలో జాప్యం కారణంగా లేఅవుట్ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు. నిర్ణీత గడువులోగా లెంచర్ అభివృద్ధి చేయలేకపోతే రైతులకు భూమి విలువలో ఏటా 5 శాతం పరిహారంగా హెచ్ఎండీఏ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే వెంచర్లో రోడ్లు నిర్మించి, మార్కింగ్ చేసిన ప్లాట్లను రైతులకు కేటాయించారు. ఉప్పల్ భగాయత్ నుంచి ఓఆర్ఆర్ వరకు 150 అడుగుల వెడల్పుతో వెళ్లే రేడియల్ రోడ్ నెంబర్ 20 మణిహారంలా ఈ వెంచర్‌కు ఆనుకునే ఉంది.త్వరలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ షురూ.. ఇరిగేషన్ అధికారులు వెంచర్‌ను పరిశీలించి ఎన్వోసీ జారీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగియగానే రైతులకు ప్లాట్లను రిజిస్టర్ చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేవిధంగా 110, 130, 190, 200, 220, 300, 400, 600, 1,200, 1,300, 1,500, 2,000 గజాల చొప్పున, ఒక ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలుగా ప్లాటింగ్ చేశారు. ఐటీ, వర్క్ స్టేషన్లు, డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. వీటి ద్వారా సుమారు 10 వేలకుపైగా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి.చదవండి: నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా..డేటా సెంటర్ కోసం కృషి ప్రతాప సింగారంలోని హెచ్ఎండీఏ వెంచర్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరాం. రూ.10 కోట్లను ప్రత్యేకంగా కేటాయించి ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సహకరించడాన్ని శుభపరిణామంగా భావిస్తున్నా. – మలిపెద్ది సుభాష్‌రెడ్డి, ప్రతాపసింగారంతూర్పు వైపు అభివృద్ధికి దోహదం.. హెచ్ఎండీఏ వెంచర్ల వల్ల తూర్పు హైదరాబాద్‌లో ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. నగరంతో అద్భుతమైన అనుసంధానం ఏర్పడుతోంది. వ్యక్తిగతంగా భూములను అభివృద్ధి చేసుకోవడం అనేక ఖర్చులతో కూడుకున్న పని, కష్టసాధ్యం. అందుకే ల్యాండ్ పూలింగ్ను సమ్మతించాం. ఈ వెంచర్‌ను సకాలంలో అభివృద్ధి చేసి, మరో వెంచర్‌కు శ్రీకారం చుట్టాలని కోరుతున్నాం. – జున్ను నరేష్, భూ యజమాని, ప్రతాపసింగారం -
అలలపై అలా..
సాక్షి, హైదరాబాద్: పోటెత్తే అలలను వీక్షిస్తూ హుస్సేన్ సాగర్‌లో ఇటు నుంచి అటు నడుచుకుంటూ వెళితే ఎలా ఉంటుంది? నీటిపై తేలే బాక్సుల్లో చేరి ఏదో ఒక ఆట ఆడితే ఆ థ్రిల్ ఎలా ఉంటుంది? అర్ధరాత్రి దాటిన తర్వాత స్ట్రీట్ ఫర్నిచర్ వద్ద నింగిని తాకే ఫౌంటేన్ వెల్లువను చూస్తూ గడపడం చక్కటి అనుభూతినిస్తుంది కదా. అంతేకాదు, సాగర్ చుట్టూ సైకిల్ తొక్కవచ్చు. హాయిగా నడుచుకుంటూ ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు. అందమైన పార్కుల్లో సేదతీరొచ్చు. పార్టీలు, ఫంక్షన్లు, విందులు, వినోదాలు, ఆటా పాటలు వెరసీ.. ఒక అద్భుతమైన నైట్‌లైఫ్. నగరవాసులకే కాదు. దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను సైతం ఆకట్టుకొనేలా హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్, సైకిలింగ్, ఎంటర్టైన్మెంట్, నైట్‌లైఫ్ షాపింగ్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అనుబంధ హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (హుమ్టా) ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, బాబాసాహెచ్ అంబేడ్కర్ భారీ విగ్రహం, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, సంజీవయ్య పార్కు, లేక్‌వ్యూ పార్కులతో ఆకట్టుకుంటున్న ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు ప్రాంతాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు హుమ్టా దృష్టి సారించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ డిజైన్లను రూపొందించింది. స్కైవాక్, సైక్లింగ్.. హుస్సేన్‌సాగర్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో స్కైవాక్, సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. ఈ ట్రాక్ అటు ట్యాంక్‌బండ్, సంజీవయ్య పార్కు నుంచి ఇటు ఐమాక్స్ థియేటర్ వరకు, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌కు కనెక్టివిటీని కలిగి ఉంటుంది. పర్యాటకులు ట్యాంక్‌బండ్ మీ దుగా ఇందిరా పార్కుకు వెళ్లేందుకు అనుగుణంగా నిర్మి స్తారు. ఇలా నలువైపులా కనెక్టివిటీ ఉండడంతో పర్యాటకులు అన్ని వైపులా రాకపోకలు సాగిస్తారు. సైకిలింగ్ పట్ల అభిరుచి ఉన్నవాళ్లకు ప్రత్యేకంగా పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేసి సైకిళ్లను అందుబాటులో ఉంచుతారు. సొంత సైకిళ్లను తెచ్చుకోవచ్చు. గంటల చొప్పున అద్దెకు తీసుకోవచ్చు. మొత్తం 5.5 మీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేయనున్న స్కైవాక్‌లో 3.3 మీటర్లు సైకిలింగ్ కోసం కేటాయిస్తారు. అలాగే 10 కిలోమీటర్ల మార్గంలో అక్కడక్కడా రెస్టరెంట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఉంటాయి. సాగర్‌లోంచి రాకపోకలు సాగించేవిధంగా స్కైవాక్, సైక్లింగ్ సదుపాయాలు ఉంటాయి. నైట్‌లైఫ్ ప్లాజాలు.. నెక్లెస్‌రోడ్డు, పీపుల్స్‌ప్లాజా ప్రాంతంలో నైట్‌లైఫ్ షాపింగ్‌లో భాగంగా ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్ ప్లాజాలను ఏర్పాటు చేయాలని హుమ్టా ప్రతిపాదించింది. పర్యాటకులు రాత్రి వేళల్లో హాయిగా కాలక్షేపం చేసేందుకు వీలుగా స్ట్రీట్ ఫర్నిచర్ ఉంటుంది. రెస్టరెంట్లు, హోటళ్లు రాత్రిపూట అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఉన్న పార్కులతో పాటు అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో మరిన్ని పార్కులను ఏర్పాటు చేయనున్నారు. స్పోర్ట్స్ బాక్సులు.. సింగపూర్‌లోని ఫ్లోటెడ్ ఫుట్‌బాల్ తరహాలో హుస్సేన్‌సాగర్‌లో చిన్న గ్రౌండ్లో ఒక క్రికెట్బాక్సు లేదా ఇతర ఆటలకు అనుగుణమైన బాక్సులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. నీటిపై తేలియాడే వేదికలపై క్రీడాకారులు ఆటలాడుకోవచ్చు. మరోవైపు ఫ్లోటెడ్ ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు ప్రశాంతంగా ఫౌంటెన్ చుట్టూ కూర్చొని గడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. ఈ భారీ ప్రాజెక్టుకు సుమారు రూ.500 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. పబ్లిక్ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించాలని హుమ్టా ప్రతిపాదించింది. సందర్శకుల నుంచి కొంత మొత్తం రుసుము వసూలు చేస్తారు.చదవండి : భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్ -
టీజీబీపాస్ సర్వర్‌డౌన్.. వీకెండ్స్‌లోనే ఎందుకిలా?
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్లు, భవనాల నిర్మాణాలు, ఎల్ఆర్ఎస్ తదితర అనుమతుల కోసం అందుబాటులోకి తెచ్చిన సింగిల్‌విండో సాంకేతిక వ్యవస్థ టీజీబీపాస్ శుక్రవారం మరోసారి స్తంభించింది. దీంతో హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో పనులు నిలిచిపోయాయి. ఫైళ్ల పరిష్కారంలో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంది. వివిధ రకాల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తుదారులు గంటల తరబడి పడిగాపులు కాశారు. టీజీబీపాస్లో సర్వర్‌డౌన్ కావడం వల్లనే సమస్యలు తలెత్తినట్లు అధికారులు చెప్పారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచే హెచ్ఎండీఏ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది.మరోవైపు ఇళ్లు, భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయలేకపోయారు. పలు కన్సల్టెన్సీల్లో సైతం పనులు నిలిచిపోయాయి. టీజీబీపాస్లో తరచుగా సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సకాలంలో ఫైళ్లను పరిష్కరించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. హెచ్ఎండీఏలోని ఘట్కేసర్, మేడ్చల్–1, మేడ్చల్–2, శంషాబాద్, శంకర్పల్లి–1, శంకర్పల్లి–2 జోన్లలో ప్రతి రోజు వివిధ రకాల అనుమతుల కోసం సుమారు 100 వరకు వస్తాయి. ప్రణాళికా విభాగంలోని వివిధ స్థాయిల్లో ఈ ఫైళ్లను పరిశీలించి, చివరకు కమిషనర్ ఆమోదంతో అనుమతులు అందజేస్తారు.చదవండి: హైదరాబాద్‌లోనే ఎక్కువ.. సూపర్ పవర్! ఫైళ్ల పరిష్కారంలో జాప్యాన్ని నివారించేందుకు ఇటీవల హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ కోసం చర్యలు చేపట్టారు. 10 రోజుల్లోనే దరఖాస్తుదారులకు అనుమతులను అందజేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. కానీ తరచుగా తలెత్తే ఇలాంటి సాంకేతిక సమస్యల వల్ల ఆటంకం కలిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీకెండ్స్‌లోనే ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని పలువురు దరఖాస్తుదారులు చెప్పారు. టీజీబీపాస్ సర్వర్‌డౌన్ కావడంతో హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ, నగర శివార్లలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా అనుమతుల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. -
హైదరాబాద్ : హోం శాఖ విజయోత్సవాల్లో సీఎం రేవంత్ (ఫొటోలు)
-
ఇల్లు కట్టుకోవాలా..? ఇదిగో ఈజీగా పర్మిషన్!
సాక్షి, సిటీబ్యూరో: మధ్యతరగతి వర్గాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకున్నా.. నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలన్నా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. భవన నిర్మాణాలకే కాకుండా నిర్మాణం పూర్తయిన ఇళ్లు, అపార్ట్మెంట్లలో నివాసానికి సైతం హెచ్ఎండీఏ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ) తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.అన్ని రకాల డాక్యుమెంట్లు, ఆధారాలు ఉంటే దరఖాస్తుదారులు ప్రత్యేకంగా హెచ్ఎండీఏ అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. టీజీబీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకొని నిర్ణీత వ్యవధిలో ప్రొసీడింగ్స్ పొందవచ్చు. కొత్తగా అపార్ట్మెంట్ కానీ, బిల్డింగ్లు కానీ నిర్మించేందుకు చాలామంది సకాలంలో సరైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడం వల్లనే ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల్లో.. పెట్ పార్క్అన్ని విధాలుగా నిర్మాణ యోగ్యత ఉన్నట్లు తేలితే వారం, పది రోజుల్లోనే ప్రొసీడింగ్స్ లభిస్తాయని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ‘కొద్ది రోజులుగా హెచ్ఎండీఏ ఫైళ్లకు కదలిక వచ్చింది. లేఅవుట్లు, అపార్ట్మెంట్లకు ఇచ్చే అనుమతుల్లో వేగం పెరిగింది. సమస్యలు ఉన్న స్థలాల్లో మాత్రమే ప్రతిష్టంభన నెలకొంటోందని’ అన్నారు. ఈ క్రమంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సమయంలోనే అన్ని డాక్యుమెంట్లను సరి చూసుకోవాలని చెప్పారు.మీ స్థలం జాడ తెలుసుకోండి.. » హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3,350కి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి సమీపంలో ఉండే నిర్మాణ స్థలాలు బఫర్ జోన్లలో ఉన్నా, ఎఫ్టీఎస్ పరిధిలో ఉన్నా అనుమతులు లభించవు. ఇందుకోసం హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లోని చెరువుల మ్యాపులను పరిశీలించి నిర్ధారణ చేసుకొనే అవకాశం ఉంది.» టీజీబీపాస్లో దరఖాస్తు చేసుకొనే సమయంలోనే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి అనుమతులు పొంది ఉండటం తప్పనిసరి. ప్రభుత్వం కొత్తగా హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తనిఖీలు చేసి ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాతే హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం దరఖాస్తులను స్వీకరించే విధంగా మార్పు చేశారు.» ఇప్పుడు ఈ అనుమతుల ప్రక్రియ రెండు అంచెలుగా మారింది. మొదట నీటి పారుదల, రెవెన్యూ అధికారులు పరిశీలించి నివేదికలు ఇచ్చిన అనంతరం ప్లానింగ్ అధికారి పరిశీలనలోకి వెళ్తుంది. అక్కడ ఏమైనా సందేహాలు ఉంటే సదరు ఫైల్‌ను వెనక్కి పంపించే అవకాశం ఉంది. అన్నీ క్లీయర్‌గా ఉంటే ప్లానింగ్ డైరెక్టర్ పరిశీలిస్తారు. అనంతరం హెచ్ఎండీఏ కమిషనర్ ఆమోదంతో నిర్మాణానికి అనుమతి పత్రాలు (ప్రొసీడింగ్స్) లభిస్తాయి.డాక్యుమెంట్లు ఇవీ..» సాధారణంగా నిర్మాణ సంస్థలు సొంతంగా కానీ లేదా కన్సల్టెంట్ సంస్థల ద్వారా కానీ టీజీబీపాస్ ద్వారా దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నాయి. సొంత ఇళ్లు నిర్మించుకొనే మధ్యతరగతి వర్గాలు సైతం ఆర్కిటెక్చర్లు, కన్సల్టెంట్ల సహాయం తీసుకుంటారు. అన్ని అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్లు స్వయంగా తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా దరఖాస్తు చేసినప్పటికీ అవసరమైన డాక్యుమెంట్లు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే.» భూమి డాక్యుమెంట్లు, లింక్‌డాక్యుమెంట్లు, పాస్‌బుక్, టైటిల్ డీడ్, ఎమ్మార్వో ప్రొసీడింగ్స్, భూమికి సంబంధించిన పహణీలు, కాస్రాపహణీ, రెవెన్యూ స్కెచ్, 13 ఏళ్ల ఈసీ పత్రాలను అప్లోడ్ చేయాలి.» మార్కెట్ వాల్యూ, నాలా చార్జీలు, ఎన్ఓసీలు, సైట్ ఫొటోలు, జియో కోఆర్టినేట్స్, సైట్ సర్వే బౌండరీలు తదితర పత్రాలన్నీ ఉంటే సకాలంలో అనుమతులు పొందవచ్చు.» భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కూడా అధికారులు పరిశీలిస్తారు. ఇందుకోసం భూమి స్వభావాన్ని ధ్రువీకరించే సర్టిఫికెట్, నీటి నాణ్యత ధ్రువీకరణ, డిజైన్లు, ఫైర్, పర్యావరణ తదితర సంస్థల అనుమతులు, బిల్డింగ్ రిస్క్ ఇన్సూరెన్స్ వంటివి ఉండాలి. -
హైదరాబాద్‌లో చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే: హైకోర్టు
హైదరాబాద్: నగరంలోని అన్ని చెరువులపై పూర్తి పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని జులైలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలపగా.. వాటన్నింటికీ బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ నిర్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.రామమ్మ చెరువు బఫర్‌జోన్‌లో నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇవాళ హెచ్ఎండీఏ కమిషనర్ విచారణకు హాజరై.. ఇప్పటి వరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసినట్టు తెలిపారు. అలాగే.. 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు పూర్తయినట్టు వెల్లడించారు. అయితే..మూడు నెలల్లోగా హైదరాబాద్ పరిధిలోని అన్ని చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధరిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబరు 30కి వాయిదా వేసింది. -
వరద రావచ్చేమో..
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ ప్రగతినగర్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ నెల రోజుల క్రితం అయిదంతస్తుల భవన నిర్మాణానికి అనుమతుల కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు దరఖాస్తు చేసుకుంది. నెల రోజుల పాటు దరఖాస్తు పరిశీలన దశలోనే ఉంది. వివిధ స్థాయిలకు చెందిన అధికారులు పరిశీలించి చివరకు ఆ ప్రాంతంలో వరద నీరు రావచ్చేమోననే సందేహాన్ని చల్లగా వ్యక్తం చేశారు. ఈ సందేహాన్ని నివృత్తి చేసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి టోపోమ్యాప్తో కూడిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కావాలంటూ కొర్రీలు పెట్టారు. నెలరోజుల పాటు ఎటూ తేల్చకుండా చివరకు ఎన్ఓసీలు కావాలంటూ షరతులు పెట్టడంతో సదరు నిర్మాణ సంస్థకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నిజానికి అదే ప్రాంతంలో దశాబ్దాలుగా ఎంతో మంది నివాసం ఉంటున్నారు. దరఖాస్తు చేసుకున్న స్థలానికి చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. పైగా హెచ్ఎండీఏ గతంలో ఇచ్చిన దరఖాస్తులతోనే ఆ భవనాలను కట్టారు. నిర్మాణానికి అన్ని విధాలా అర్హత ఉన్న ఆ స్థలానికి కొత్తగా టోపో మ్యాప్‌తో పాటు ఎన్ఓసీ కావాలని ఆంక్షలు విధించారు. ఒక్క ప్రగతినగర్‌లోనే కాదు. హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలన్నా బిల్డర్లు, మధ్యతరగతి వర్గాలు హడలెత్తుతున్నాయి. టీజీబీపాస్ ద్వారా హెచ్ఎండీఏ నుంచి అనుమతి పొందడమే ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారింది. ఎండమావుల్లా ఎన్ఓసీలు... ⇒ భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఎల్ఆర్ఎస్లు, ఆక్యుపెన్సీ సరి్టఫికెట్లు వంటి వివిధ రకాల పనులపై సాధారణంగానే నెలలు గడిచినా అనుమతులు లభించడం దుర్లభంగా మారింది. కేవలం 15 రోజుల్లో దరఖాస్తులను పరిశీలించి అనుమతులను జారీ చేయాల్సి ఉండగా నెలలు గడిచినా అనుమతులు లభించడం లేదంటూ దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఫైళ్లు పెండింగ్ జాబితాలో పేరుకుపోతున్నాయి. ఇదే సమయంలో కొత్తగా రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. హెచ్ఎండీఏ అనుమతుల్లో ఇరిగేషన్, రెవిన్యూ శాఖలను కూడా చేర్చారు. దీంతో ఫైళ్ల కదలికలో మరింత జాప్యం ఏర్పడుతోంది. ⇒ ఇదంతా ఒకవైపైతే.. మరోవైపు హెచ్ఎండీఏ ఆంక్షల మేరకు ఇరిగేషన్, రెవిన్యూ విభాగాల నుంచి ఎన్ఓసీలు జారీ కావడం లేదు. తుర్కయంజాల్‌కు చెందిన ఓ దరఖాస్తుదారు ఏడాది క్రితం భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దశాబ్దాల క్రితం అక్కడ పంట కాల్వ ఉన్నట్లు పరిగణించి ఎన్ఓసీ కోరారు. ఈ మేరకు ఆరు నెలల పాటు ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి ఎన్ఓసీ సంపాదించారాయన. కానీ.. అదొక్కటే చాలదు. రెవెన్యూ ఎన్ఓసీ కూడా అవసరమన్నారు. ఇప్పటి వరకు రెవెన్యూ నుంచి ఎన్ఓసీ లభించలేదు. దీంతో భవన నిర్మాణాన్ని ఆయన వాయిదా వేసుకున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు.రెవెన్యూ అవసరం లేకపోయినా.. సాధారణంగా వర్షం కురిసినప్పుడు ఎత్తు నుంచి పల్లానికి వరద నీళ్లు ప్రవహిస్తాయి. టోపో మ్యాప్‌ల ఆధారంగా ఇలాంటి వరద కాల్వలను గుర్తిస్తారు. భవన నిర్మాణం చేపట్టనున్న స్థలానికి చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఎలాంటి వరదలు రావని నిర్ధారిస్తూ ఎన్ఓసీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నీటిపారుదల అధికారులు ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరిస్తే అది వరద ముప్పు ఉన్న ప్రాంతంగానే పరిగణించాలి. ఇందులో రెవెన్యూ శాఖ భాగస్వామ్యం అవసరం లేదు. వర్షపు నీరు ప్రవహించే ప్రాంతాలుగా అనుమానించి కొర్రీలు విధిస్తున్న హెచ్ఎండీఏ అధికారులు ఇరిగేషన్‌తో పాటు రెవెన్యూ ఎన్ఓసీలను కూడా తప్పనిసరి చేయడం గమనార్హం. కాగా.. హైడ్రా రాకతోనే తాము ఇలాంటి ఎన్ఓసీలను కోరుతున్నామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. -
HMDA Master Plan: అంతులేని పొర‘పాట్లు’
సాక్షి, హైదరాబాద్: 👉‘నాగోల్ నుంచి కుంట్లూర్ వరకు రెండువందల అడుగుల వెడల్పుతో రోడ్డు ఉన్నట్లు మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. కానీ.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. చుట్టుపక్కల పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. రోడ్డు వస్తుందో, రాదో తెలియదు కానీ మా స్థలం రోడ్డు మధ్యలో ఉన్నట్లు చెప్పి ఎల్ఆర్ఎస్ నిరాకరించారు. ఏళ్లు గడిచాయి. అక్కడ రోడ్డు నిర్మించలేదు. అలాగని మాస్టర్‌ప్లాన్ సవరించలేదు. నాతో పాటు ఎంతోమంది తీవ్రంగా నష్టపోయాను’ నాగోల్‌కు చెందిన రాంరెడ్డి ఆందోళన ఇది. తప్పుల తడకలాంటి హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్ కారణంగా ఆ స్థలాన్ని అమ్ముకోలేక, ఎలాంటి నిర్మాణం చేపట్టలేక మానసికంగా ఎంతో ఆవేదన గురవుతున్నారాయన. 👉‘తుర్కయంజాల్ సమీపంలో ఒక వ్యక్తి గతంలో 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ ప్రాంతంలో 150 ఫీట్ల రోడ్డు పోతున్నట్లుగా మాస్టర్‌ప్లాన్‌లో ఉందన్నారు. కానీ.. ఆ ప్లాట్ పక్కనే ఉన్న మరో ప్లాట్‌కు ఎల్ఆర్ఎస్ ఇచ్చారు. ఇదే అంశంపై సదరు బాధితుడు హెచ్ఎండీఏ అధికారులను సంప్రదించగా ‘మాస్టర్‌ప్లాన్ ఒక్కటే తమకు ప్రామాణికం’ అని సెలవిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనికి ఎలాంటి పరిష్కారం లభించలేదు.వేలాది తప్పులు.. హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం 2031 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2013 బృహత్ ప్రణాళికను రూపొందించిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ, ఎంసీహెచ్, ఎయిర్పోర్ట్ అథారిటీ, సైబరాబాద్ అథారిటీ, హెచ్ఎండీఏ ప్రణాళాకలన్నింటినీ కలిపి బృహత్ ప్రణాళికను తయారు చేశారు. కానీ.. అప్పట్లో దీనిపై ఎలాంటి శాస్త్రీయమైన అధ్యయనం చేయకపోవడంతో అంతులేని తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. రోడ్లు, చెరువులు, కుంటలు, నాలాలు లేని చోట ఉన్నట్లు, ఉన్న చోట లేనట్లు మాస్టర్ ప్లాన్‌లో నమోదైంది. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోని వందలాది గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లు, ఊళ్లు మాయమైనట్లుగా కూడా గుర్తించారు. అయిదు మాస్టర్ప్లాన్లను సమన్వయం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. సుమారు 3000కు పైగా తప్పులు ఉన్నట్లు అప్పట్లోనే గుర్తించారు. దీంతో 50 వేల మందికి పైగా బాధితులు ఎల్ఆర్ఎస్ను తీసుకొనే అవకాశం కోల్పోయారు. ఆ తప్పులు ఇప్పటికీ తమను వెంటాడుతూనే ఉన్నాయని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలింది నిరాశే.. సమగ్ర మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వచ్చిన తర్వాత రెండు మూడుసార్లు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ మాస్టర్‌ప్లాన్‌లో తప్పుల కారణంగా నష్టపోయిన బాధితులకు ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. ‘ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని, మాస్టర్‌ప్లాన్‌లో తప్పులను సవరిస్తారని అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ నిరాశా నిస్పృహలే మిగులుతున్నాయి’అని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు 2031 మాస్టర్ ప్లాన్‌ను సవరించి కొత్తది రూపొందించేందుకు అయిదారేళ్లుగా ప్రతిపాదనలు చేస్తూనే ఉన్నారు. మాస్టర్‌ప్లాన్–2041 రానుందన్నారు. ఆ తర్వాత ట్రిపుల్ వన్ జీఓలోని ప్రాంతాలన్నింటినీ కలిసి హెచ్ఎండీఏ పరిధిలోని 7,200 చ.కి.మీలకు వర్తించేలా మహా మెగా మాస్టర్‌ప్లాన్ అన్నారు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ట్రిపుల్ ఆర్ వరకు వర్తించేలా సమగ్ర మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని భావిస్తోంది. మాస్టర్‌ప్లాన్– 31 కారణంగా నష్టపోయిన బాధితులు దశాబ్ద కాలంగా ఎలాంటి పరిష్కారం లభించక పడిగాపులు కాస్తూనే ఉండటం గమనార్హం. ప్రస్తుతం 2050 బృహత్ ప్రణాళిక.. తెలంగాణ మూడు భాగాలుగా విభజించి 2050 వరకు దశలవారీగా చేపట్టాల్సిన అభివృద్ధిపై బృహత్ ప్రణాళికను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని అర్బన్‌గా, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న భూభాగాన్ని సబర్బన్గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రీజినల్ రింగ్‌రోడ్డు నుంచి ఉండే మిగతా తెలంగాణ ప్రాంతాన్ని రూరల్‌గా పరిగణిస్తారు. ఇందుకనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో హెచ్ఎండీఏ పరిధి ప్రస్తుతం ఉన్న 7,200 చ.కి.మీ నుంచి సుమారు 10 వేల చదరపు కి.మీ వరకు పెరగనుంది. ఈ మొత్తం భూభాగానికి వర్తించేవిధంగా ‘మెగా మాస్టర్ ప్లాన్ –2050’ని రూపొందిస్తారు. ఇందులో ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు సమగ్ర ప్రజా రవాణా సదుపాయాల ప్రణాళిక (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్) ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక, బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు ఉంటాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మెగా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. -
రిజిస్ట్రేషన్లకు రేవంత్ సర్కార్ బ్రేక్
-
తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్లకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో లేఔట్ల రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోకి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కొత్తగా గ్రామాలను చేర్చింది. హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికే పలు ఫామ్‌హౌస్‌లకు గ్రామ పంచాయితీలు అనుమతులు ఇచ్చాయి. జాన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్‌లకు గ్రామ పంచాయితీ అనుమతినిచ్చింది. హైడ్రా తెర మీదకు రావడంతో గ్రామ పంచాయితీల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సర్కార్ నిర్ణయించింది.కాగా, వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది.దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు.ఇదీ చదవండి: ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్నగదు అవసరమైనప్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది. -
Hydra: హెచ్ఎండీఏ అధికారుల్లో ‘హైడ్రా’ గుబులు!
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణాలు, లే అవుట్లకు గతంలో అడ్డగోలుగా అనుమతులిచ్చిన కొందరు హెచ్ఎండీఏ అధికారులను హైడ్రా హడలెత్తిస్తోంది. చెరువులు, కుంటలు, పార్కు స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన భవనాలకు కొందరు అధికారులు నిర్మాణ సంస్థలు, బిల్డర్లతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా అనుమతులను ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు మ్యాపుల ఆధారంగా కొందరు అక్రమాలకు పాల్పడితే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇచి్చన నిరభ్యంతర పత్రాల ఆధారంగా మరి కొందరు నిర్మాణ అనుమతులను ఇచ్చారు. ఇలా హెచ్ఎండీఏ పరిధిలో గత ఐదారేళ్లుగా వందల కొద్దీ అక్రమ కట్టడాలు వెలిశాయి. చివరకు పార్కు స్థలాలను సైతం వదిలిపెట్టకుండా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు హెచ్ఎండీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని అప్పట్లో పలు సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినప్పటికీ అవి బుట్టదాఖలయ్యాయి. ప్రస్తుతం అలాంటి నిర్మాణాలన్నింటిపైన హైడ్రా బుల్డోజర్ను ఎక్కుపెట్టడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే అక్రమ నిర్మాణానికి అనుమతినిచి్చన ఓ సహాయ ప్లానింగ్ అధికారిపైన చర్యలకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇదే బాటలో మరి కొందరు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాల నెపాన్ని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపైన నెట్టేందుకు ప్రయతి్నస్తున్నారు. కానీ హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగానికి చెందిన ఏపీఓలు, జేపీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించిన తరువాత మాత్రమే ఫైళ్లు కదులుతాయి. ఈ క్రమంలో సదరు అధికారులు అన్ని అంశాలను సీరియస్‌గా పరిశీలించవలసి ఉంటుంది. ఈ పరిశీలన క్రమంలోనే అక్రమాలకు తెరలేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత మ్యాపులతో మాయ... ‘చెరువులు, కుంటలు, పార్కులు ఉన్న చోట భవనాలు కట్టే క్రమంలో అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో సదరు స్థలం బఫర్‌జోన్‌లో ఉన్నట్లు తేలితే గూగుల్మ్యాపులను దరఖాస్తులతో జత చేస్తున్నారు. కొన్ని చోట్ల మాస్టర్‌ప్లాన్ (2013) కంటే ముందు ఉన్న మ్యాపులను పెట్టేస్తున్నారు’ అని ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధి విస్మయం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ రూపొందించిన మాస్టర్‌ప్లాన్ మాత్రమే ప్రామాణికమైనదని చెప్పే అధికారులు అందుకు విరుద్ధంగా పాత మ్యాపులతో అనుమతులకు లైన్లు క్లియర్ చేయడం గమనార్హం. మరోవైపు కొందరు ప్లానింగ్ అధికారులే బడా నిర్మాణ సంస్థలకు కన్సల్టెంట్లుగా, లైజనింగ్ అధికారులుగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. పటాన్చెరు, ఇస్నాపూర్, దుండిగల్, ఘట్కేసర్, శంషాబాద్, మేడ్చల్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లో లేక్వ్యూప్రాజెక్టుల పేరిట వెలిసిన పలు అపార్ట్మెంట్లకు ఇలాంటి అనుమతులు లభించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో కొన్ని నిర్మాణాలను హెచ్ఎండీఏ ఉన్నతాధికారులే స్వయంగా గుర్తించినప్పటికీ రకరకాల ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలను తీసుకోలేకపోయారు. కొందరు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మౌనంగా ఉండిపోతే మరి కొందరు నిర్మాణ సంస్థల నుంచే వచ్చే ఆఫర్లను దృష్టిలో ఉంచుకొని మౌనం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల హైడ్రా అధికారులు అమీన్పూర్ లేక్ చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో అక్రమ నిర్మాణాలను గుర్తించారు.ఇదే ప్రాంతంలో అప్పట్లో క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వహించిన ఓ ఏపీఓ స్థాయి అధికారి ఫ్లాట్లను బహుమతులుగా పొంది మ్యాపులను మాయ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. అప్పుడు ఇష్టారాజ్యంగా అడ్డగోలు అనుమతులు ఇచి్చన అధికారులు, ఉద్యోగులు.. హైడ్రా చర్యలతో ఇప్పుడు బెంబేలెత్తుతున్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు రకరకాల మార్గాలను అన్వేíÙస్తున్నారు. అదే సమయంలో కొత్తగా వచ్చే ఫైళ్లపైన ఆచితూచి ముందుకెళ్తున్నారు. నెలల తరబడి ఫైళ్లను పెండింగ్‌లో పెట్టేస్తున్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో ఉన్నా, లేకున్నా ఎన్ఓసీల కోసం షార్ట్‌ఫాల్స్ పెట్టి వేధిస్తున్నట్లు దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘అప్పట్లో అనుమతులు ఇచి్చన ప్రాంతంలోనే ఇప్పుడు ఇరిగేషన్ నుంచి ఎన్ఓసీ కావాలని అడుగుతున్నారు. మున్సిపాలిటీ అనుమతులపైన భవనాలను నిరి్మంచిన చోట అదనపు అంతస్థుల కోసం దరఖాస్తు చేసుకొంటే రెవెన్యూ, ఇరిగేషన్ అనుమతి కావాలని చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం’ అని బాలాపూర్, మీర్పేట్, బడంగ్పేట్, తదితర ప్రాంతాలకు చెందిన భూ యజమానులు ప్రశ్నిస్తున్నారు. -
నిల్చున్న చోటే నిగ్గుతేల్చే యాప్!
సాక్షి, హైదరాబాద్: ఏ చెరువు పరిధి ఎక్కడి దాకా ఉంది? దాని ఫుల్ ట్యాంక్ లెవల్ ఎంత వరకు? బఫర్ జోన్ ఏ మేరకు విస్తరించి ఉంది? తెలుసుకోవడం ఎలా?.. ఔటర్ రింగు రోడ్డు పరి«ధిలోని ఆక్రమణలపై అనునిత్యం హైదరా బాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో స్థలం, ఇల్లు, ఫ్లాట్ కొనాలని భావిస్తున్న సామాన్యుడికి వస్తున్న సందేహాలు ఇవి. బడా బాబులు, రియల్టర్లు, వ్యాపారుల మాదిరిగా వీరికి సమాచారం సేకరించే నెట్వర్క్ ఉండదు. దీంతో ఏమాత్రం తొందరపడి ముందడుగు వేసినా నిండా మునిగిపోతామనే భయం ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఔటర్’ పరిధిలోని చెరువులకు సంబంధించిన సమాచారంతో ఓ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నారు. హెచ్ఎండీఏ ఆన్లైన్లో ఉంచినా.. రాజధానితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న చెరువులకు సంబంధించిన సమస్త సమాచారం ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) వద్ద ఉంది. ఈ విభాగం ప్రతి చెరువు, కుంట, ట్యాంక్‌కు ప్రత్యేక ఐడీ సైతం జారీ చేసింది. దానికి సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల లెక్కలతో పాటు వీటిని గుర్తిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ వివరాలనూ క్రోడీకరించింది. ఈ వివరాలన్నింటినీ మ్యాపులతో సహా అధికారిక వెబ్సైట్ (https:// lakes. hmda. gov. in) లో అందుబాటులో ఉంచింది. అయితే ఈ వివరాలు పూర్తి సాంకేతిక పదజాలంతో ఉండటంతో సామాన్యుడికి అర్థమయ్యే పరిస్థితి లేదు. టెస్ట్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్... ఇలా సాంకేతిక పరిభాష, అంకెలతో ఉన్న ఆ వివరాలను డీ కోడ్ చేయాలంటే సాధారణ ప్రజలు నిపుణుల సహాయం తీసుకోవాల్సివస్తోంది. లేనిపక్షంలో తాను ఖరీదు చేయబోతున్న ప్రాంతం వివరాల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.వివరాలన్నీ సరళంగా అందుబాటులో.. అదే సమయంలో ప్రస్తుతం హెచ్ఎండీఏ వద్ద అందుబాటులో ఉన్న వివరాలన్నింటినీ సరళంగా మార్చి హైడ్రా కోసం రూపొందించే ప్రత్యేక వెబ్‌సైట్‌తో పొందుపరచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆక్రమణలు సహా వివిధ అంశాలపై ఫిర్యాదులు చేయడానికి వాట్సాప్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలతో పాటు యాప్‌ను హైడ్రా అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులోనే జియో ట్యాగింగ్ డేటాను పొందుపరుస్తారు. అవసరమైతే ఈ విషయంలో గూగుల్ మ్యాప్స్ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న ఎవరైనా ఓ ప్రాంతంలో నిల్చుని యాప్‌ను ఓపెన్ చేస్తే.. ఆ ఏరియా ఏదైనా చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల కిందికి వస్తుందా? అనేది స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వ భూములు, పార్కులు తదితరాలనూ ఈ యాప్‌లోకి తీసుకురావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భావిస్తున్నారు. నగరంలో ఉన్న చెరువుల్లో సర్వే, ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఫైనల్ వెరిఫికేషన్ ప్రక్రియలు పూర్తయినవి 54 ఉన్నాయి. వీటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై స్పష్టత ఉండటంతో తొలిదశలో వీటికే జియో ఫెన్సింగ్ చేయించనున్నారు. జియో ఫెన్సింగ్‌తో పరిరక్షించనున్న హైడ్రా సువిశాలంగా విస్తరించి ఉన్న నగరంలోని కొన్ని చెరువులు, పార్క్‌లు, ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచడానికి డ్రోన్లు, సీసీ కెమెరాలు, గార్డుల వ్యవస్థ సైతం సరిపోదు. ఈ నేపథ్యంలో కీలకమైన వాటిని పరిరక్షించడానికి జియో ఫెన్సింగ్ విధానాన్ని అమలు చేయడానికి హైడ్రా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ), అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (అడ్రిన్) సహా మరికొన్ని సంస్థలతో సంప్రదింపులు జరపనున్నారు.వీరి సహకారంతో ఉపగ్రహాల ద్వారా ఆయా చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల హద్దులను పక్కాగా గుర్తించడంతో పాటు వాటికి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా ఆ పరిధిలోకి వెళ్లి పూడ్చటానికి, నిర్మాణాలు చేపట్టడానికి సహా ఏ ఇతర ప్రయత్నం చేసినా ఆ కార్యకలాపాలను జియో ఫెన్సింగ్ ఆధారంగా శాటిలైట్లు గుర్తిస్తాయి. వెంటనే ఆ సమాచారాన్ని హైడ్రా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)తో పాటు కీలక అధికారులకు అందిస్తూ అప్రమత్తం చేస్తాయి. -
ఆక్రమణదారులకు సింహస్వప్నం!
హైదరాబాద్ పరిధిలో అన్యాక్రాంతమైన అన్ని రకాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడా నికీ, కొత్తగా ఆక్రమణలకు గురికాకుండా చూడడానికీ ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్తగా ఆలోచన చేసి దీనిని ప్రత్యేక వ్యవస్థగా రూపుదిద్దారు. జీహెచ్ఎమ్సీ, హెచ్ఎమ్డీఏ పరిధిలోని వేలాది ఎకరాల ప్రభుత్వ, ఇనాం, వక్ఫు, దేవాదాయ భూములు, చెరువులు కబ్జాకు గురయ్యాయి. గత బీఆర్ఎస్ పాలనలో చెరువులను మాయం చేసి, కొండలు గుట్టలను ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అమ్మేశారు. జీవో 59 ముసుగులో భూములను రక్షించాల్సిన వారే భక్షించారు. అధికారులు వారికి వంత పాడారు. రోజురోజుకూ కబ్జాలు పెరిగిపోతుండడంతో ముఖ్యమంత్రి ఇతర దేశాల్లో ప్రభుత్వాస్తుల రక్షణకు చేపట్టిన విధి, విధానాలపై అధ్యయనం చేశారు. అక్కడ సత్ఫలితాలు ఇస్తున్న విధానాన్ని హైదరాబాద్ లోనూ అమలు చేయడానికి హైడ్రాను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేశారు. దీని విధి విధా నాలు ఖరారు చేస్తూ ఇటీవల జీవో 99ని జారీ చేశారు. దీనికి ఐజీ స్థాయి సీనియర్ పోలీసు అధికారి ఏవీ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియ మించారు.హైడ్రాను ఏర్పాటు చేసిన వెంటనే ప్రభుత్వం దానికి సంబంధించి రూ. 200 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అక్రమ నిర్మాణాల అంతు తేల్చడానికి ప్రభుత్వం ఎంత అంకితభావంతో ఉందో ఈ బడ్జెట్ కేటాయింపే నిదర్శనం. జీహెచ్ఎమ్సీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 2,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలను కలిపి స్వయం ప్రతిపత్తితో ఉండేలా హైడ్రాను అందుబాటులోకి తెచ్చారు. జీహెచ్ఎమ్సీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి,సంగారెడ్డి జిల్లాల్లోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) గా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఆ ప్రాంతం వరకు విపత్తు నిర్వహణ తదితర అధికారులతో హైడ్రాను ఏర్పాటు చేశారు. హైడ్రా పాలకమండలికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా, మున్సిపల్ మంత్రి, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి; హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల ఇన్చార్జి మంత్రులు; హైదరాబాద్ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు.చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం హైడ్రా త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నది. చెరువులు కుంటలు, నాళాలు, పార్కులు ప్రభుత్వ స్థలాల్లో జరిగిన అక్రమ కట్టడాలే కాకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఏళ్ల క్రితమే అనుమతులతో వెలసిన భవనాలను చట్ట ప్రకారం కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు రంగంలోకి దిగింది. అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతోంది. జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్, బంజారాహిల్స్‌లోని మిథిలా కాలనీ, గాజుల రామారం, భూమ్ రుఖా ఉద్ దవాల్ చెరువుల్లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆక్రమణలపై హైడ్రాకు రోజుకు 40 నుంచి 50 ఫిర్యాదులు వస్తుండడం విశేషంగా చెప్పవచ్చు.ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే ఇచ్చిన లే ఔట్లకు సంబంధించిన అనుమతులు రద్దు చేసే ఆలోచనతో హైడ్రా ముందుకు వెళ్తోంది. చెరువుల ఆక్రమ ణలు జరగకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సాంకేతికంగా కూడా చర్యలు తీసు కుంటున్నది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచ నున్నది. ప్లాట్లు, ఇండ్లుకొనే వ్యక్తులు ఈ స్థలం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా రాదా అన్నది తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందిస్తున్నారు.హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఈ పోలీస్ స్టేషన్ ద్వారానే ఎస్ఓటీ ఏర్పాటు చేసి కబ్జా దారులపై ఉక్కు పాదం మోపనున్నారు. హైడ్రాకు మొత్తం 3,500 మంది సిబ్బందిని త్వరలో నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. హైడ్రా కింద అసెట్ ప్రొటెక్షన్‌తో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు కూడా కొన సాగుతుంది. పట్టణ ప్రణాళిక– విపత్తుల నిర్వహణ విభాగాలు, ట్రాఫిక్ పోలీ సులతో సమన్వయం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో 72 టీమ్‌లు పనిచేస్తున్నాయి. త్వరలో కొన్ని జిల్లాల్లోనూ ఇటువంటి వ్యవస్థలను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ఆలోచించడం ముదావహం.– వెలిచాల రాజేందర్ రావు, వ్యాసకర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, 9849 061481 -
అనుమతి పొందిన కట్టడాలను ఎలా కూలుస్తారు?: బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: హైడ్రా ఆలోచన బాగున్నా ఆచరణలో మాత్రం సరైన తీరు లేదని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘సామాన్య ప్రజలకు శికం భూమా, బఫర్ జోన్లో ఉందా? అనేది తెలీదు. కష్టపడి సంపాదించిన సొమ్మంతా పెట్టి భూమి కొంటారు. అధికారులు చేసే పనుల వల్ల సామాన్య జనం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది’’ అని వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు.‘‘చెరువులను కాపాడాలి. అక్రమ కట్టడాలను కుల్చాలి కానీ అనుమతులు ఇచ్చిన అధికారులను ఏం చేస్తారు?. అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చితే మంచిదే.. కానీ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతి పొందిన వాటిని ఎలా కూలుస్తారు? రాజకీయ నాయకులు, అధికారులు కలిసి సామాన్య ప్రజలది తప్పు అన్నట్లు చేస్తున్నారు. రంగనాథ్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఉండటం తెలంగాణకు మంచిదే కానీ ఇలా ఎంతకాలం చేస్తారు?. నోటీసు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూలగొట్టడం మంచిది కాదు’’ అని వెంకటరమణారెడ్డి చెప్పారు.‘‘గత ప్రభుత్వ తప్పిదాలకు ప్రజలను బలి పశువు చేస్తారా..?. రేవంత్ రాత్రికి రాత్రి తీసుకునే నిర్ణయంతో సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. చెరువుల్లో కట్టడాలకు అనుమతి ఇచ్చిన వారికి బేడీలు వేసి జైల్లో వేయాలి అప్పుడే మిగతావారికి భయం వస్తుంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం పక్కకి పోయాయి ఇప్పుడు హైడ్రా కొన్నాళ్లు హడావుడి’’ అంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. -
లేక్‌లు లేఔట్లపాలు
సాక్షి, హైదరాబాద్: ఒకనాడు నిండుగా చెరువులతో, వాటి పక్కన తోటలతో కళకళలాడిన నగరం హైదరాబాద్.. కానీ నాటి చెరువులు కుంటలు అయిపోతే.. కుంటలన్నీ బస్తీలుగా మారిపోయాయి. చెరువు కనిపిస్తే చెరపట్టడమే లక్ష్యంగా చెలరేగిపోయిన కబ్జాదారులతో ఎక్కడికక్కడ భారీ నిర్మాణాలు వెలిశాయి. దశాబ్దాలుగా ఈ తతంగం జరుగుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల కమీషన్ల కక్కుర్తితో.. వందల కొద్దీ చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి. పెద్ద పెద్ద కాలనీలను చూపించి.. ఒకప్పుడు ఇక్కడ పెద్ద చెరువు ఉండేదని చెప్పుకునే రోజులు వచ్చాయి. గత 45 ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 61 శాతం చెరువులు మాయమైపోయినట్టు ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’ తేల్చింది. దీనికి సంబంధించి ఇటీవల ‘హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (హైడ్రా)’కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధిలో ఉన్న నిర్మాణాల తొలగింపుపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అనేక ప్రాంతాలకు అవే గుర్తింపు హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల పేర్లలో బాగ్, తలాబ్, కుంట, కట్ట వంటి పదాలు ఉంటాయి. అవన్నీ నగరంలో చెరువులు, కుంటలు, తోటలు ఉన్న ప్రాంతాలే. దానికితోడు పెద్ద పెద్ద చెరువులూ ఎన్నో ఉండేవి. రియల్ఎస్టేట్ బూమ్‌తో కబ్జాలు, ఆక్రమణలతో పరిస్థితులు మారిపోయాయి. చెరువుల శిఖం భూములతోపాటు తూములు,అలుగులు, నాలాలపై అడ్డగోలుగా నిర్మాణాలు వచ్చి చేరాయి. ఈ క్రమంలో 1979, 2024 మధ్య హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేసిన ఎన్ఆర్ఎస్సీ.. పెద్ద సంఖ్యలో చెరువులు మాయమైనట్టు తేల్చింది. బుధవారం ఎన్ఆర్ఎస్సీలో జరిగిన సమావే«శంలో ఈ వివరాలను వెల్లడించింది. ఉదాహరణకు శాతం చెరువు విస్తీర్ణం గతంలో 70 ఎకరాలుకాగా.. ఇప్పుడు మిగిలింది పదెకరాలే. ఎల్బీనగర్ కప్రాయి చెరువు 71 ఎకరాలకుగాను 18 ఎకరాలే మిగిలింది. హెచ్ఎండీఏ యంత్రాంగం నిర్లక్ష్యంతో.. ఇటీవలి వరకు గ్రేటర్లో చెరువుల బాధ్యతలను హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పర్యవేక్షించింది. దీని పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 1,728 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పూర్తి నీటి మట్టం (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ హద్దులను నిర్ధారించడంలో దశాబ్దాలుగా నిర్లక్ష్యం చూపారు. కేవలం 200 చెరువుల హద్దులను మాత్రమే నోటిఫై చేశారు. ఈ కారణంగానే కబ్జాల పర్వం యథేచ్చగా కొనసాగింది. 472 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫాక్స్‌సాగర్‌లో.. ఇప్పటివరకు 120 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయి. ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే రసాయన గోదాములు, భారీ నిర్మాణాలు వెలిశాయి. 2003లో అప్పటి ప్రభుత్వం చెరువు భూముల్లోనే 11 ఎకరాల్లో పేదలకు పట్టాలివ్వడం గమనార్హం. ఇక మూసాపేట మైసమ్మ చెరువు భూముల్లో ఏకంగా ఆకాశ హరŠామ్యలే వెలిశాయి. శేరిలింగంపల్లిలోని దేవునికుంట, సున్నం చెరువు, మంగలి కుంటలు దాదాపు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు గోల్కొండ రాజులకు మంచినీరు అందించిన దుర్గం చెరువు చిక్కిపోయింది. దీని 125 ఎకరాల విస్తీర్ణంలో 25 ఎకరాల మేర గార్డెన్స్ వెలిశాయి. నేతలు, రియల్టర్లు, అధికారులు కుమ్మక్కై చెరువులు, కుంటలు కబ్జా చేసి నిర్మించిన, నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు, లేఔట్ల వెనుక రాజకీయ నాయకులు, రియల్టర్లు ఉంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు బినామీ పేర్లతో చెరువుల్లో వెంచర్లు, లేఔట్లు వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి కొందరు అధికారుల కక్కుర్తి తోడుకావడంతో అక్రమాలు విచ్చలవిడిగా కొనసాగాయి. కొన్ని సందర్భాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి, హడావుడి చేయడం పరిపాటిగా మారిపోయింది. వాటిని పూర్తిగా కూల్చివేయడానికి బదులు నిర్మాణాల పైకప్పు, గోడలకు పెద్ద పెద్ద రంధ్రాలు చేసి వదిలేస్తూ వచ్చారు. నేతలు, రియల్టర్లు తమ పలుకుబడి వినియోగించి తర్వాతి చర్యలు లేకుండా చూసుకుంటున్నారు. భవనాలకు పెట్టిన రంధ్రాలను పూడ్చేసి తమ దందా కొనసాగించేస్తున్నారు. తాజాగా ఎన్ఆర్ఎస్సీ ప్రజెంటేషన్ నేపథ్యంలో ‘హైడ్రా’ డైరెక్టర్ ఏవీ రంగనాథ్ వేగంగా స్పందించారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను పూర్తిగా కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో నిర్మాణంలో ఉన్నవాటిని కూల్చాలని, తర్వాత పాత నిర్మాణాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో.. ఎనిమిది భవనాలను (ఐదు అంతస్తులు, అంతకంటే ఎక్కువ ఎత్తయినవి) అధికారులు కూల్చేశారు. రెండు లేఔట్లను ధ్వంసం చేశారు. స్థిరాస్తి కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోండి చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ భవనాలను కూల్చేయడంతోపాటు వారికి సహకరించిన ప్రభుత్వ అధికారులపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. శనివారం రెండు ప్రాంతాల్లో నిర్మాణాలను కూల్చివేసి దాదాపు 15 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం. చెరువుల పరిసరాల్లో ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని.. తెలుసుకోకుండా ముందుకెళ్తే నష్టపోవాల్సి వస్తుంది. ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్రమ నిర్మానాలు, కబ్జాలపై సమాచారం ఇవ్వాలి. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్ -
మియాపూర్ పరిస్థితులపై సైబరాబాద్ సీపీ సమీక్ష
-
‘మహా’ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర విస్తరణ, అభివృద్ధికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశలో కీలకమైన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు ఉన్న ప్రాంతాన్ని కూడా హెచ్ఎండీఏ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు హెచ్ఎండీఏలోని వివిధ విభాగాలను బలోపేతం చేయనున్నారు. ప్రస్తుతం 7 జిల్లాల్లో సుమారు 7,200 చదరపు కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ సేవలు విస్తరించి ఉన్నాయి.ట్రిపుల్ ఆర్ వరకు పరిధి పెరిగితే ఇది 10 వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం, ఉద్యోగులు, సిబ్బంది సంఖ్యను కూడా పెంచవలసి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట కీలకమైన సంస్థ ప్రణాళికా విభాగాన్ని విస్తరించడం ద్వారా సేవలను మరింత పారదర్శకం చేయనున్నారు. ప్రస్తుతం ప్రణాళికా విభాగంలో శంకర్పల్లి, ఘటకేసర్, మేడ్చల్, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. నిర్మాణ రంగానికి సంబంధించిన అనుమతులన్నీ ఈ నాలుగు జోన్ల నుంచే లభిస్తాయి.వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధి గతంలో కంటే ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగింది. కానీ ఇందుకనుగుణంగా జోన్లు, ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మాత్రం పెరగలేదు. దీంతో అధికారులపై పని ఒత్తిడి బాగా ఎక్కువైంది. వందల కొద్దీ ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. టీజీబీపాస్ (తెలంగాణ బిల్డింగ్ పరి్మషన్ అండ్ సెల్ఫ్ సరి్టఫికేషన్ సిస్టమ్) ద్వారా వచ్చే దరఖాస్తుల పరిశీలనలోనూ తీవ్రమైన జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న 4 జోన్లను 8కి పెంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా ప్రణాళికలను సిద్ధం చేశారు. నలువైపులా అభివృద్ధి పడమటి హైదరాబాద్‌కు దీటుగా తూర్పు, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తేనే రాబోయే రోజుల్లో సుమారు 3 కోట్ల జనాభా అవసరాలకు నగరం సరిపోతుందని అంచనా. ఈ క్రమంలో హెచ్ఎండీఏ బాధ్యతలు మరింత పెరగనునున్నాయి. టౌన్íÙప్ల కోసం ప్రణాళికలను రూ పొందించడం, రోడ్డు, రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయడం, లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేయడం వంటి కీలకమైన ప్రాజెక్టులను హెచ్ఎండీఏ చేపట్టనుంది. అన్ని వైపులా టౌన్‌షిప్పులను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే నగర అభివృద్ధి సమంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు హెచ్ఎండీఏలో ప్రణాళికా విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు. ‘అధికారు లు, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించడమే కాకుండా సేవల్లో పారదర్శకతను పెంచాల్సి ఉంది. అప్పు డే ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించగలం..’అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.జోన్ల విస్తరణ ఇలా..ప్రస్తుతం ఉన్న ఘట్కేసర్ జోన్లో మరో కొత్త జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్ జోన్లను కూడా రెండు చొప్పున విభజించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 8 జోన్లను ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు ఉన్న ప్రతిపాదన.. మొదట 6 వరకు ఆ తర్వాత 8కి పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా భవన నిర్మాణాలు, లే అవుట్ అనుమతులను ఇక నుంచి పూర్తిగా ఆన్లైన్లో టీజీ బీపాస్ ద్వారానే ఇవ్వనున్నారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి చేసే లే అవుట్లు, భవనాలకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) ద్వారా కూడా అనుమతులను ఇస్తున్నారు. ఈ నెలాఖరుతో డీపీఎంఎస్ సేవలను నిలిపివేయనున్నారు. హెచ్ఎండీఏలోని 7 జిల్లాల్లో ఉన్న 70 మండలాలు, సుమారు 1,032 గ్రామాల్లో టీజీబీపాస్ ద్వారానే అనుమతులు లభించనున్నాయి. -
నీటి వనరుల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు?
సాక్షి, హైదరాబాద్: నీటి వనరుల పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యలు, వాటి పరిరక్షణకు ఏం చేస్తున్నారో వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హోంశాఖ, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ మహానగరం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలను ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తూపోతున్నారని.. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే నీటి వనరులు లేని నగరంగా హైదరాబాద్ మారే ప్రమాదం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టి యుద్ధప్రాతిపదిక ప్రభుత్వం నీటి వనరుల రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణ, వాటి దుస్థితిని వివరించారు. ఈ లేఖను సీజే ధర్మాసనం సుమోటో పిల్‌గా విచారణ చేపట్టేందుకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది. -
అంతరించిపోయే దశలో నీటి వనరులు
సాక్షి, హైదరాబాద్: మహా నగరం హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తూపోతున్నారని.. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే నీటి వనరులు లేని నగరంగా హైదరాబాద్ మారే ప్రమాదం పొంచి ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టి యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం నీటివనరుల రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన లేఖ రాశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణ, వాటి దుస్థితిని అందులో వివరించారు. ఈ లేఖను సీజే ధర్మాసనం.. సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హోంశాఖ, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది. ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు ‘అక్రమంగా నాలాలను ఆక్రమించి విల్లాల నిర్మాణం చేపడుతున్నారు. చెరువులు, కుంటలు సహా నీటివనరుల ఆక్రమణను ఇలానే వదిలేస్తే భవిష్యత్‌లో తాగునీటికీ కటకట ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చెరువులు, కుంటలనూ వదలని అక్రమార్కులు వాటిలోకి నీరు చేరకుండా పరీవాహక ప్రాంతాలనూ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే నగరంలోని చాలాప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. కొన్నిచోట్ల నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. సంప్రదాయ నీటివనరుల ఆక్రమణను ఇలా వదిలేస్తూ పోతే చెరువులు, నీటివనరులు, నాలాలు లేని నగరంగా హైదరాబాద్ త్వరలోనే మారుతుంది. పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న ఆక్రమణలు, భారీ విల్లాల నిర్మాణాల కారణంగా హైదరాబాద్‌లోని నీటివనరులు అంతరించిపోయే పరిస్థితి. ఇది పర్యావరణంలో తీవ్ర అసమతుల్యతకు దారితీస్తోంది. భారీ వర్షాలు వస్తే నీరు సాఫీగా పోయే మార్గాలు లేక ఒత్తిడి పెరిగి వరదలు జనావాసాలను ముంచెత్తుతాయి. ఆస్తులకే కాకుండా ప్రజల జీవితాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చే ప్రమాదం లేకపోలేదు. చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ప్రజా జీవనం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. జనాభా నిష్పత్తికి తగ్గట్టు చెట్లు కూడా లేక స్వచ్ఛమైన గాలి అందడం లేదు. పర్యావరణం దెబ్బతిని ఎల్‌నినో, లానినో లాంటివి సంభవిస్తున్నాయి. చెరువులు, నీటివనరులు, నాలాల పరిస్థితిపై రెడ్ అలర్ట్ ప్రకటించాలి. వాటిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలి. పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన పలు శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలి’అని జస్టిస్ వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్, జిన్నారం, పటాన్చెరు, ఆర్సీ పురం, కంది, సంగారెడ్డి, హత్పూర మండలాల్లో 90కి పైగా చెరువుల ఆక్రమణను ఆయన సీజే దృష్టికి తెచ్చారు. ఈ పిల్‌పై నేడు (గురువారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
తవ్వేకొద్దీ బయటపడుతున్న శివబాలకృష్ణ లీలలు
-
తవ్వేకొద్దీ బయటపడుతున్న శివబాలకృష్ణ లీలలు
సాక్షి, హైదరాబాద్: తవ్వేకొద్దీ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో టీడీఆర్ స్కాం వెలుగులోకి వచ్చింది. కృష్ణకుమార్, శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. కృష్ణకుమార్ని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పని చేసిన బీవీ కృష్ణ కుమార్.. బడా బిల్డర్లతో కుమ్మక్కై టీడీఆర్ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నష్టం చేశారు. బిల్డర్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఫైల్స్ క్లియర్ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కృష్ణ కుమార్ చర్య వల్ల ప్రభుత్వానికి 3800 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ అంచనా వేస్తోంది. మరో ఇద్దరు హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. బడా బిల్డర్ల ప్రాజెక్ట్‌ల ప్లానింగ్‌లో టీడీఆర్ విలువ తగ్గించి, తక్కువ ఫీజులు కట్టించి ప్రభుత్వానికి నష్టం చేశారు. శివ బాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు కాగానే కృష్ణకుమార్ అమెరికాకు వెళ్లిపోగా, అక్కడ నుంచి హైదరాబాద్‌కు రప్పించే ప్రయత్నాలను ఏసీబీ అధికారులు చేస్తున్నారు. శివబాలకృష్ణ, కృష్ణ కుమార్, మరో ఇద్దరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సిండికేట్‌పై ఏసీబీ దృష్టి పెట్టింది. -
హెచ్ఎండీఏ ఏపీఓ కృష్ణకుమార్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి పరిశీలన లేకుండానే టీడీఆర్ సర్టిఫికెట్ల జారీలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన శంకర్పల్లి జోన్ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి బీవీ.కృష్ణకుమార్‌ను హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ బుధవారం సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఉదంతంపై సంబంధిత ప్లానింగ్ అధికారులకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నగరానికి పడమటి వైపున శంకర్పల్లి జోన్లో ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగాయి. అనేక చోట్ల నిబంధనలను విరుద్ధంగా కొనసాగిన ఈ నిర్మాణాల్లో కృష్ణకుమార్ ప్రమేయం ఉన్నట్టు మొదటి నుంచీ ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఈయన ప్రధాన అనుచరుడిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో కబ్జారాయుళ్లు, అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారికి కృష్ణకుమార్ అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ♦ గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలో టీడీఆర్లపైన వచ్చిన దరఖా స్తులను పరిశీలించకుండానే ఉన్నతా«ధికారులను తప్పుదోవ పట్టించినట్టుగా తాజాగా రుజువు కావడంతో కమిషనర్ ఆయన్ను సస్పెండ్ చేశారు. ♦ పుప్పాలగూడలోని 330 నుంచి 332 వరకు సర్వేనంబర్లలో తమకు ఉన్న 11,698 గజాల్లో 100 ఫీట్ల రోడ్డుకు భూమిని గిఫ్ట్‌డీడ్ కింద గ్రా మపంచాయతీకి రిజిస్టర్ చేసినట్టు శ్రావణ్‌కుమా ర్తో పాటు, మరికొందరు తెలిపారు. ఈ మేరకు వారు టీడీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ♦పుప్పాలగూడ గ్రామంలోనే వెంకటరమణ, మరికొందరు 314 నుంచి 317 వరకు సర్వేనంబర్లలో ఉన్న 22,046 గజాల్లో మాస్టర్‌ప్లా¯న్ కింద 100 ఫీట్ రోడ్డులో భూమి పోయిందంటూ టీడీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ♦టీడీఆర్ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే కృష్ణకుమార్ తన పై అధికారులను తప్పుదోవ పట్టించారు. ప్రస్తుతం ఈ ఒకటిరెండు ఉదంతాలే బయటకు వచ్చినా, ఇంకా వెలుగులోకి రాని అక్రమాలు పెద్దఎత్తునే ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో శివబాలకృష్ణపై ఏసీబీ దాడులు కొనసాగుతున్న సమయంలోనే కృష్ణకుమార్ అమెరికాకు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఆయన అమెరికాకు వెళ్లడంతో ఏసీబీ దాడుల నుంచి తప్పించుకున్నాడని అప్పట్లో హెచ్ఎండీఏ వర్గాలు చర్చించుకోవడం గమనార్హం. -
మణికొండలో అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా
-
HMDA పరిధిలో ఒకే కార్పొరేషన్ లోకి తేవాలని ప్రభుత్వం యోచన
-
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలో జీవో 111 అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన ఈ జీవో ఇప్పటికే అన్ని విధాలుగా నిర్వీర్యమైంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మహానగర విస్తరణ చేపట్టనున్న దృష్ట్యా జీవో 111పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న అన్ని ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్–2050 రూపొందించాలని ఆయన హెచ్ఎండీఏను ఆదేశించారు. దీంతో ట్రిపుల్ వన్ పరిధిలోని 82 గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్‌లో విలీనం చేస్తారా, లేక త్రిబుల్ వన్ జీవోను యధాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపైన సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌తోపాటు, సైబరాబాద్, పాత ఎంసీహెచ్, ఎయిర్‌పోర్టు, జీహెచ్ఎంసీ మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. ఈ ఐదింటిని కలిపి ఒకే బృహత్తర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని, ట్రిపుల్ వన్‌లోని ప్రాంతాలను కూడా మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అప్పట్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశారు. కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యదాతథస్థితి కల్పించవలసి వచ్చింది. ఈ క్రమంలో బృహత్తర మాస్టర్ప్లాన్పైన హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కానీ తాజా ప్రతిపాదనల మేరకు మెగా మాస్టర్‌ప్లాన్–2050పైన దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 7000 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండీఏ పరిధిని మరో 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ భారీ మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తే ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్న ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే 82 గ్రామాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి కూడా ఈ మాస్టర్‌ప్లాన్‌లో భాగం కానుంది. పరిరక్షణపై నీలినీడలు... ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీవో చర్చనీయాంశమవుతూనే ఉంది. మరోవైపు జీవోను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. జీవోకు విఘాతం కలిగించే చర్యలపైన కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీవోను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జీవో 69ను కూడా తెచ్చారు. కానీ న్యాయస్థానంలో జీవో 111 అమల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో తీవ్రమైన సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారీగా అక్రమ నిర్మాణాలు... ఒకవైపు ఇలా వివిధ రకాలుగా ట్రిపుల్ వన్ జీవోను నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లోనే అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. మరోవైపు రియల్ఎస్టేట్ వర్గాలు, నిర్మాణ సంస్థలు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్, శంకర్పల్లి, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ‘శంషాబాద్ పరిధిలోని శాతంరాయి, పెద్ద తుప్రా, ముచ్చింతల్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అనుమతులు తీసుకుంటున్నారు.’ అని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఏం చేస్తారు... ఇలా అన్ని విధాలుగా జీవో 111 ప్రమాదంలో పడిన దృష్ట్యా మెగామాస్టర్ ప్లాన్‌పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేషన్ జోన్లో ఉన్న ప్రాంతాలను అలాగే ఉంచి మిగతా ప్రాంతాలకు మాస్టర్‌ప్లాన్ విస్తరిస్తారా లేక, ఈ జీవోలోని గ్రామాల కోసం ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. మరోవైపు మెగా మాస్టర్‌ప్లాన్ ఎప్పటి వరకు రూపొందిస్తారనేది కూడా చర్చనీయాంశమే. ట్రిపుల్ ఆర్ వరకు నిర్మాణ రంగానికి అనుమతులపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఏ ప్రమాణాలను పాటిస్తారనేది కూడా తాజాగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలో ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు వివిధ రకాల జోన్ల విభజనపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఎలా ముందుకెళ్తారనేది కూడా రియల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, అన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలా లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ సిటీల పేరుతో నాలుగు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం ఇటీవలే అధికారులను ఆదేశించారు. పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే.. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించాలని, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఇటీవల సమాలోచనలు చేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత విలీనం చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని యూనిట్‌గా తీసుకొని ఒకే గ్రేటర్ సిటీ కార్పొ రేషన్‌గా చేయటం, లేదా సిటీ మొత్తాన్ని 4 కార్పొరేషన్లుగా విభజించడం అనే అంశాన్ని పరిశీలించాలని మున్సిపల్ శాఖ అధికా రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జనాభా ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన.. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలున్నాయని విమర్శలున్నాయి. కొన్ని డివిజన్ల పరిధిలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో కేవలం 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి, కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిటీలో అభివృద్ధి చెందిన డివిజన్లకు తక్కువ నిధులు సరిపోతాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఏకరీతిగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించారు. ఇంచుమించుగా సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై ముందుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ కార్పొరేషన్ తరహాలో... దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందటే అక్కడున్న మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేసింది. అక్కడ జరిగిన విలీనం తీరు, అందుకు అనుసరించిన విధానాలను సీఎం మున్సిపల్ శాఖను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ పేట్, మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్లు, మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. 30 మున్సిపాలిటీలివే.. ► రంగారెడ్డి జిల్లా: పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్‌నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకరపల్లి, తుక్కుగూడ ►మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా: మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ ►యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి ►సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, చేర్యాల ►మెదక్ జిల్లా: తూప్రాన్, నర్సాపూర్ -
మెగా హెచ్ఎండీఏ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఏడు జిల్లాల్లో ఏడువేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ సుమారు పదివేల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో పురపాలక శాఖ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి కొత్తగా రానున్న ఆర్ఆర్ఆర్ మధ్య ఉండే ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకుని రావాలని ఆదేశించారు. రెండు రింగ్ రోడ్లను అనుసంధానించేలా రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఓఆర్ఆర్ లోపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా, ఆర్ఆర్ఆర్ లోపు ఉన్న ప్రాంతాన్ని మరో యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న శివారు మునిసిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్– 2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలని ఆదేశించారు. ఆమ్రపాలికి ‘టోల్ నివేదిక’ బాధ్యత ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం ఆదేశించారు. కనీస రేటు నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని ప్రశ్నించారు. టెండర్లలో ఏయే సంస్థలు పాల్గొన్నాయి? అవకతవకల్లో ఎవరెవరి ప్రమేయముంది? తదితర అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని చెప్పారు. టెండర్లకు అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరు, జరిగిన అవకతవకలపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే.. వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్లో చర్చించి, టెండర్ల వ్యవహారంపై సీబీఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టెండర్ విధానంతో రూ.15 వేల కోట్లకు పైగా నష్టం! టెండర్లకు ముందు ఓఆర్ఆర్పై టోల్ కింద ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు. అలాంటప్పుడు 30 ఏళ్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని కానీ కేవలం రూ.7,380 కోట్లకు ఐఆర్బీ కంపెనీకి ఎలా అప్పగించారని రేవంత్ ప్రశ్నించారు. హెచ్ఎండీఏ అనుసరించిన టెండర్ విధానంతో ప్రభుత్వం రూ.15 వేల కోట్లకు పైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనా వేశారు. హెచ్ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్ తయారు చేయించగా, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డీపీఆర్‌ను ఎంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయిస్తేనే నిజాలు బయటకు వస్తాయని సీఎం పేర్కొన్నారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీలతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటల్ని పరిరక్షించాలి హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలను పరిరక్షించాలని, అలాగే ల్యాండ్ పూలింగ్ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హెచ్ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, డిజిటల్, జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ల్యాండ్ పార్శిల్స్, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురి కాకుండా ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. డీఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారిని నియమించాలని, ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. కాగా హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్ పార్శిళ్లు ఉంటే.. అందులో 2,031 ఎకరాల పార్శిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ‘కమ్యూనిటీ’ స్థలాలపై తక్షణ సర్వే హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాల లే అవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు ఇచి్చన స్థలాలు తమ అ«దీనంలోనే ఉన్నాయా? లేక ఆక్రమణకు గురయ్యాయా? వెంటనే సర్వే చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాఠశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పొరేట్ కంపెనీలు, పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వీటిని అప్పగించాలని సూచించారు. స్థానికులైన పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా కనీసం 25 శాతం అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పారు. ప్రపంచ స్థాయి టూరిస్ట్ ప్లేస్‌గా హుస్సేన్‌సాగర్ పరిసరాలు హుస్సేన్‌సాగర్‌పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరమైన, అందమైన జోన్‌గా తీర్చిదిద్దాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఇటు అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, తెలంగాణ అమరుల జ్యోతి నుంచి అటు నెక్లెస్ రోడ్డు, ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి సందర్శనీయ ప్రాంగణంగా తయారు చేయాలని సూచించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలిగించాలన్నారు. దుబాయ్ తరహాలో స్కై వాక్ వే, ఫుడ్ స్టాళ్లు, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ జోన్, గ్రీనరీ, ల్యాండ్ స్కేప్లను అభివృద్ధి చేయాలని సూచించారు. అవసరమైతే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను మరో రూట్‌కు మళ్లించి పర్యాటక జోన్‌గా మార్చాలని చెప్పారు. వెంటనే అంతర్జాతీయ స్థాయి కన్సెల్టెన్సీలతో ఈ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయాలని ఆదేశించారు. సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
హెచ్ఎండీఏ డైరెక్టర్లే లక్ష్యంగా.. విజిలెన్స్ సోదాలు!
-
ఆక్రమణలే అడ్డంకులు!
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరికి వడ్డాణంలో వంకెలు తిరుగుతూ వయ్యారంగా ఉండే మూసీ నదిని సుందరీకరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే, ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రధాన అడ్డంకులు మూసీ చుట్టూ ఉన్న ఆక్రమణలే. మూసీ నది పరివాహకం వెంబడి 8,500 ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. చారిత్రక మూసీ నదికి ఇరువైపులా బఫర్ జోన్లో, నదీగర్భంలో కూడా భవన నిర్మాణాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), రెవెన్యూ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) సాంకేతికతను ఉపయోగించి మూసీ నది వెంట విస్తృత సర్వే చేశారు. మూసీ వెంబడి ఉన్న గ్రామ పటాలపై ఆ చిత్రాలను స్పష్టంగా కనిపించేలా (సూపర్ఇంపోజ్) చేశారు. ఆక్రమణలే పెద్ద సవాల్.. మూసీని శుభ్రం చేయడం ఎంత పెద్ద సవాలో అంతకు రెట్టింపు మూసీ నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నది పరివాహకం వెంబడి చాలా చోట్ల చిన్న గుడిసెలు, బస్తీలతో పాటు భవన నిర్మాణాలు ఉన్నాయి. నది గర్భంలో 1,700, బఫర్ జోన్లో 6,800 నిర్మాణాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వరకు మతపరమైన కట్టడాలున్నాయి. వీటిలో చాలా వరకు గత రెండు దశాబ్ధాల కాలంలోనే నిరి్మతమయ్యాయి. ముఖ్యంగా హైకోర్టు నుంచి చాదర్‌ఘాట్ మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన ఈ మతపరమైన కట్టడాలను తొలగించడం చాలా అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంత నివాసితులకు 2 బీహెచ్‌కే గృహాలను కేటాయించి ఆక్రమణలను తొలగించాలని భావించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. భన్వర్‌లాల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన తరుణంలో మూసీ ఒడ్డున నివసిస్తున్న కాలనీ వాసుల కోసం నందనవనంలో ప్రత్యేకంగా గృహా సముదాయం కట్టించి ఇచి్చనా.. నదీ గర్భంలో ఆక్రమణలు మాత్రం ఆగలేదు. మూసీకి మాస్టర్ ప్లాన్.. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ భూ వినియోగం, ఇతర వివరాలు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. తాజాగా మూసీ నదిలో వరద స్థాయి, సరిహద్దులను గుర్తించేందుకు 55 కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే చేయాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) నిర్ణయించింది. హద్దుల లెక్క తేలిన తర్వాత గ్లోబల్ కన్సల్టెంట్ల సహాయంతో మూసీ నదీ గర్భంలో రిక్రియేషనల్ జోన్, ల్యాండ్ స్కేపింగ్, కమర్షియల్ జోన్లతో సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అభివృద్ధి చేయనున్నారు. మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా గ్లోబల్ సిటీ రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కల. మూసీ అభివృద్ధికి అయ్యే వ్యయంలో కొంత బ్యాంకు నుంచి రుణం, మరికొంత పీపీపీ పద్ధతిలో చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
శివ బాలకృష్ణ కేసులో మరో కీలక ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. శ్రీకృష్ణ నిర్మాణ సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన రెండు కోట్ల 70 లక్షల రూపాయలను నగదును సీజ్ చేశారు. బాలకృష్ణ ఇంకా ఏ ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై ఏసీబీ విచారణ చేస్తోంది. బినామీల పేర్లతో భారీగా ఆస్తుల కొనుగోలుపై ఆరా తీస్తోంది. పలు నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులపై ఏసీబీ దృష్టి పెట్టింది. కాగా, శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రోజుకో విస్తుపోయే విషయం వెలుగు చూస్తోంది. తన పేరిటే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి.. దూరపు బంధువుల పేరిట కూడా ఆయన భారీగా ఆస్తుల్ని జమ చేశాడు. ఆఖరికి తన దగ్గర పని చేసేవాళ్లనూ వదల్లేదాయన. తాజాగా.. ఆయన దగ్గర అటెండర్, డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తుల్ని అవినీతి నిరోధక శాఖ(ACB) అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి పేరిటా భారీగానే బినామీ ఆస్తుల్ని శివ బాలకృష్ణ కూడబెట్టి ఉంటాడన్న అనుమానాల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. శివబాలకృష్ణ దగ్గర అటెండర్‌గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీలను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. శివ బాలకృష్ణకు లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యహహరించారని .. ప్రతిఫలంగా ఇద్దరి పేర్లపైనా బాలకృష్ణ ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. ఈ క్రమంలోనే.. డ్రైవర్ గోపీకి కాస్ట్లీ హోండా సిటీకారును శివ బాలకృష్ణ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరి పేరిట ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ. ఇదీ చదవండి: తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు! -
ఏసీబీ ఎంక్వయిరీలో షాకింగ్ నిజాలు
-
HMDA భూముల వేలం ఆపేసిన సర్కార్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ‘కల్పతరువు’గా భావిస్తూ వస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) భూముల వేలంను ఆపేయాలని నిర్ణయించుకుంది. వేలంపాటలో అక్రమాలు.. అవకతవకలు జరిగినట్లు గుర్తించడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. హెచ్ఎండీఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. వేలానికి ముందే పలువురు రియల్టర్లకు హెచ్ఎండీఏలోని అధికారులు సమాచారం చేరవేశారట. తద్వారా ఆ ఫలానా రియాల్టర్లకే భూములు దక్కేలా అధికారుల చర్యలు తీసుకున్నట్లు తేలింది. ఈ మేరకు.. వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. దీంతో వేలంపాటను ఆపేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు.. ఇప్పటికే వేలం వేసిన భూములపై అధికారులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే.. వేలంపాట సమయంలోనే కాకుండా.. ఆ తర్వాత కూడా హెచ్ఎండీఏలో తన పరిచయాల ద్వారా శివ బాలకృష్ణ ఈ తతంగాన్ని నడిపించినట్లు గుర్తించారు . భూములు వేలం తో పాటు ప్రాజెక్టుల వివరాలను రియల్టర్లకు చేర్చారు హెచ్ఎండీలో పని చేసిన అధికారులు. అంతేకాదు ధరలను నిర్ణయించడంలోనూ వీళ్లే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ అధికారుల పాత్రపైనా ఏసీబీ లోతైన దర్యాప్తు చేపట్టింది. ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాన్వేషణలో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూముల్ని వేలం వేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధికారం అండతో.. అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు శివబాలకృష్ణ. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఏసీబీకి అతను ఆస్తులు కూడబెట్టిన తీరు ఏసీబీని సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇంట్లోవాళ్లు, బంధువులు, ఆఖరికి పనివాళ్ల పేరిట మీద కూడా బినామీ ఆస్తుల్ని కూడబెట్టాడతను. దీంతో బినామీలను అరెస్ట్ చేసి ఈ పాటికే విచారణ చేపట్టిన ఏసీబీ.. ఇవాళో, రేపో కీలక అరెస్టులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
శివ బాలకృష్ణ సోదరుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్‌కు ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయ్యింది. నవీన్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. శివ బాలకృష్ణ కేసులో ఆయన సోదరుడు నవీన్ కుమార్ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో మూడు రోజుల క్రితం శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను కూడా నాంపల్లి ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన అక్రమాస్తులను ఏబీసీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఆయన బినామీలను కూడా ఏసీబీ అదికారులు విచారించారు. మరోవైపు శివ బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి లోతుగా ఆరాతీస్తున్నారు. ఆస్తులు, భూములు ఇంకా ఏమైనా ఉన్నాయా? అని సమాచారం సేకరిస్తున్నారు. చదవండి: అసెంబ్లీలో కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ -
శివ బాలకృష్ణ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు షాక్..
-
డ్రైవర్‌నూ వదలని శివబాలకృష్ణ!
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రోజుకో విస్తుపోయే విషయం వెలుగు చూస్తోంది. తన పేరిటే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి.. దూరపు బంధువుల పేరిట కూడా ఆయన భారీగా ఆస్తుల్ని జమ చేశాడు. ఆఖరికి తన దగ్గర పని చేసేవాళ్లనూ వదల్లేదాయన. తాజాగా.. ఆయన దగ్గర అటెండర్, డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తుల్ని అవినీతి నిరోధక శాఖ(ACB) అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి పేరిటా భారీగానే బినామీ ఆస్తుల్ని శివ బాలకృష్ణ కూడబెట్టి ఉంటాడన్న అనుమానాల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. శివబాలకృష్ణ దగ్గర అటెండర్‌గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీలను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. శివ బాలకృష్ణకు లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యహహరించారని .. ప్రతిఫలంగా ఇద్దరి పేర్లపైనా బాలకృష్ణ ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. ఈ క్రమంలోనే.. డ్రైవర్ గోపీకి కాస్ట్లీ హోండా సిటీకారును శివ బాలకృష్ణ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరి పేరిట ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ. ఇదిలా ఉంటే.. ఇప్పటికే శివ బాలకృష్ణ బినామీలకు నోటీసులు జారీ చేశారు. భరత్, భరణి, ప్రమోద్ కుమార్‌లతో పాటు సోదరుడు శివ నవీన్‌కుమార్, స్నేహితుడు సత్యనారాయణలను ఇవాళ ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. శివ బాలకృష్ణ దగ్గర పీఏగా పని చేసిన భరణి.. కంప్యూటర్ ఆపరేటర్గానూ పని చేశాడు. అదే సమయంలో ఎన్విస్ డిజైన్ స్టూడియో పేరుతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, లే అవుట్ బిల్డింగ్‌లకు అనుమతులు మంజూరు చేశాడు. మరో బినామీ అయిన ప్రమోద్‌కు మీనాక్షి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఆర్థిక వ్యవహారాలు చూసుకునే సోదరుడు నవీన్‌కుమార్‌తో పాటు స్నేహితుడు సత్యనారాయణను సైతం ఏసీబీ విచారిస్తోంది. -
మేనళ్లుల్లను సైన్యంగా మలచుకొని కోట్లు సంపాదన
-
సిటీ చుట్టూ 11 మినీ టౌన్‌షిప్‌లు
గ్రేటర్ హైదరాబాద్‌పై వలసల ఒత్తిడిని, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య శాటిలైట్ టౌన్‌షిప్‌లను నిర్మించాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో ఔటర్, ట్రిపుల్ ఆర్ మధ్య లే–అవుట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వస్తాయని.. వాటికి రహదారులను అనుసంధానం చేస్తే అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ 11 ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా.. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ మేడ్చల్, సంగారెడ్డి, షాద్‌నగర్, ఘట్కేసర్ తదితర మార్గాల్లోని 11 ప్రాంతాల్లో మినీ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ‘హైదరాబాద్ నగరాభివృద్ది సంస్థ (హెచ్ఎండీఏ)’ ప్రతిపాదించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద తుర్కపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలను మినీ నగరాలుగా నిర్మిస్తే బాగుంటుందని సూచించింది. ఈ ప్రాంతాల్లో మినీ నగరాలను నిర్మించేందుకు విధివిధానాలను కూడా రూపొందించినట్టు సమాచారం. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. భూసేకరణ పనులను హెచ్ఎండీఏ చేయాలని.. మౌలిక సదుపాయాల కల్పన వంటివాటిని ప్రైవేట్‌కు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. గ్రోత్ ఇంజిన్‌లా మార్చాలి ట్రిపుల్ ఆర్‌ను రవాణాపరమైన రోడ్డుగానే కాకుండా ఒక గ్రోత్ ఇంజిన్‌లా మార్చాలి. ఇరువైపులా పరిశ్రమల ఏర్పాటుతో ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ట్రిపుల్ ఆర్ ప్రవేశించే జిల్లాల్లో మూడు నుంచి పదెకరాల విస్తీర్ణాలలో నైపుణ్య కేంద్రాలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలి. దీంతో కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. – జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మినీ నగరాలలో ఏమేం ఉంటాయంటే..! ఒక్కో శాటిలైట్ టౌన్‌షిప్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, సుమారు 10 లక్షల జనాభా నివాసం ఉండేందుకు వీలుగా నిర్మించనున్నారు. 100 అడుగుల అప్రోచ్ రహదారి, 30 నుంచి 60 అడుగుల అంతర్గత రహదారులు ఉంటాయి. ఈ టౌన్‌షిప్‌లలో బహుళ అవసరాల కోసం భూమిని అందుబాటులో ఉంచుతారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు గృహాలు, బ్యాంకులు, మార్కెట్లు, హోటళ్ల, ఇతర వాణిజ్య సదుపాయాలతోపాటు విద్యా, వైద్య అవసరాలు, పౌర సేవలు, ప్రజారవాణా, క్రీడా సదుపాయాలు, పార్కులు, ఆట స్థలాలు ఉంటాయి. కాలుష్యాన్ని విడుదల చేయని, అంతగా ప్రమాదకరంకాని పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. -
ఏసీబీ దూకుడు.. శివబాలకృష్ణ బినామీలకు నోటీసులు
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు విచారణలో వేగం మరింత పెంచింది అవినీతి నిరోధక శాఖ(ACB). ఈ క్రమంలో విచారణకు రావాల్సిందేనంటూ బినామీలందరికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. బాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్‌కు ఏసీబీ లేఖ రాసింది. శివబాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించిన భరత్, సత్యానారాయణ, భరణిలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఆయనకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దర్యాప్తులో దొరికిన పత్రాల ఆధారంగా.. ప్రభుత్వ అనుమతి తీసుకుని ఆ ఐఏఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది. ఇదిలా ఉంటే.. 2021-23 సంవత్సరాల మధ్య శివబాలకృష్ణ కోట్ల ఆస్తుల్ని కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అయితే ఆ ఆస్తులన్నింటినీ ఆయన తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్ చేయించారు.ఈ క్రమంలో యాదాద్రిలో 57 ఎకరాల భూమిపై ప్రత్యేక విచారణ చేయాలని ఏసీబీ భావిస్తోంది. -
శివ బాలకృష్ణ కేసులో బయటపడ్డ అసలు నిజాలు
-
HMDA శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్.. ఐఏఎస్ అరవింద్..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈకేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ.. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అంశాన్ని బయటకు తీసింది. దీంతో, విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. వివరాల ప్రకారం.. హెచ్ఎండీఏ అధికారి శివబాలకృష్ణ అవినీతి కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. శివ బాలకృష్ణ కేసులో తాజాగా ఏసీబీ నివేదిక రెడీ చేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇక, ఈ కేసులో మరో కొత్త అంశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఏసీబీ నివేదికలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వ్యవహారాన్ని ప్రస్తావించింది. బాలకృష్ణ దగ్గర నుంచి అరవింద్ కుమార్ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు నివేదికలో పేర్కొంది. ఇక, ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్‌ను విచారించేందుకు ఏసీబీ.. ప్రభుత్వ అనుమతిని కోరింది. మరోవైపు.. బాలకృష్ణ నుంచి రికవరీ చేసిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, గత పదేళ్ల కాలంలో దాదాపు 15 సెల్‌ఫోన్స్ మార్చినట్టు ఏసీబీ నివేదికలో వెల్లడించారు. ఈ ఫోన్లు, కాంటాక్ట్‌లకు సంబంధించి మరిన్ని కీలక విషయాలను ఏసీబీ వెల్లడించే అవకాశం ఉంది. -
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు
-
బాలకృష్ణ కేసులో కీలక మలుపు.. తెరపైకి మరో ఐఏఎస్ అధికారి పేరు!
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో కస్టడీ కన్పెషన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. తన వాంగ్మూలంలో మరో ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పలువురి ఒత్తిడి మేరకే అక్రమాలకు పాల్పడినట్లు బాలకృష్ణ అంగీకరించారు. అక్రమాల చిట్టాను బయటపెట్టారు. ఐఏఎస్ అధికారి చెప్పిన ఫైళ్లు వెంటనే క్లియర్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఐఏఎస్‌ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం,కోర్టు అనుమతిని ఏసీబీ కోరనుంది. ఇప్పటికే శివ బాలకృష్ణ వద్ద డాక్యుమెంట్ లెక్కల ప్రకారం 250 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 214 ఎకరాలు భూములను ఏసీబీ గుర్తించింది. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీ లోకి తీసుకుని ఏసీబీ విచారించగా, శివ బాలకృష్ణతో పాటు ఇతర అధికారుల పాత్రపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివ బాలకృష్ణ బినామీలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ ఫోకస్ పెట్టింది. సోదరుడు నవీన్ అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బాగోతం బయటపడుతోంది. మొన్న సోమేష్‌కుమార్, నిన్న అరవింద్ కుమార్, నేడు రజత్‌కుమార్ ఆస్తులపై వివాదం నెలకొంది. ఐఏఎస్ రజత్‌కుమార్..గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పని చేశారు. హేమాజీపూర్ సర్వే నంబర్ 83, 84, 85లో ఆయన కుటుంబం పేరు మీద భూములు ఉన్నట్లు సమాచారం. వరుసగా పలువురు ఐఏఎస్‌ల మీద ఆరోపణలు రావడంతో భూములను ఇతరుల పేర్లు మీద మార్చడానికి రజత్‌కుమార్ స్లాట్ బుక్ చేసినట్లు తెలిసింది. 15 ఎకరాల భూమిని ఇతరుల పేరు మీద మార్చేందుకు రజత్‌కుమార్ సిద్ధమయినట్లు సమాచారం. ఇదీ చదవండి: శివ బాలకృష్ణపై ఈడీ.. ఐటీ? -
శివ బాలకృష్ణపై ఈడీ.. ఐటీ?
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి భాగోతంపై త్వరలోనే ఇన్ కమ్‌ట్యాక్స్ (ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు రంగంలోకి దిగనున్నట్టు తెలిసింది. అధికార దుర్వినియోగం, అడ్డగోలు అనుమతుల జారీతో దాదాపు రూ.250 కోట్ల మేర ఆస్తులను శివబాలకృష్ణ కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఐటీ అధికారులు సైతం ఏసీబీ నుంచి ఈ కేసు వివరాలు తీసుకోనున్నట్టు సమాచారం. అతనిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ, కేసు దర్యాప్తులో గుర్తించిన అక్రమాస్తుల వివరాలను ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఏసీబీ నుంచి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ, ఐటీ రంగంలోకి దిగితే మరిన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మరో ఇద్దరు బినామీల అరెస్టుకు రెడీ! శివబాలకృష్ణ తన అక్రమార్జనలో ఎక్కువ భాగం తన కుటుంబ సభ్యులు, ఇతర బినామీల పేరిట ఉంచినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. శివబాలకృష్ణకు ప్రధాన బినామీగా ఉన్న ఆయన సోదరుడు శివనవీన్ కుమార్‌ను ఏసీబీ మంగళవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శివబాలకృష్ణ బినామీలుగా ఉన్న మరో ఇద్దరిని అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు శివ నవీన్‌కుమార్ కస్టడీ కోసం ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హెచ్ఎండీఏలో ముగిసిన ఏసీబీ సోదాలు హెచ్ఎండీఏలో ఏసీబీ సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు వివిధ జోన్లకు చెందిన ఫైళ్లను క్షుణ్ణ్గంగా తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు 4వ రోజు గురువారం పంచనామా నిర్వహించారు. ఈ నాలుగు రోజుల్లో శంకర్పల్లి, శంషాబాద్, ఘట్కేసర్ జోన్ల పరిధిలోని సుమారు 120 ఫైళ్లను పరిశీలించారు. వాటిలో కీలకమైన వాటిని తమ వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. ముఖ్యంగా శివబాలకృష్ణ హెచ్ఎండీఏ నుంచి రెరాకు బదిలీ అయిన తరువాత కూడా పాత తేదీలతో పెద్ద ఎత్తున భూమార్పిడి అనుమతులను ఇవ్వడాన్ని ఏసీబీ సీరియస్‌గా పరిగణిస్తోంది. జోవో 111 పరిధిలో కన్జర్వేషన్ జోన్లో ఉన్న భూములను రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లకు మారుస్తూ అనుమతులను ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. పుప్పాలగూడ నుంచి వట్టినాగులపల్లి వరకు వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాలను ఇలా అడ్డగోలుగా మార్చేసినట్లు తెలిసింది. అలాగే ఘట్కేసర్, శంషాబాద్ జోన్లలో ఇచ్చిన మరి కొన్ని అనుమతులపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. అలా ఎలా అనుమతులిచ్చారని నిలదీసిన ఏసీబీ నీటివనరులు ఉన్న ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులను ఇచ్చేందుకు కొందరు ప్లానింగ్ అధికారులు మొదట నిరాకరించినా ఆ తరువాత ఆ అధికారులే తిరిగి అనుమతులను ఎందుకిచ్చారని ఏసీబీ వర్గాలు ప్రశ్నించినట్లు తెలిసింది. ‘వాళ్లకు అనుమానం వచ్చిన ప్రతి ఫైల్‌ను పోస్టుమార్టం చేశారు. అనేక రకాల సందేహాలను వ్యక్తం చేశారు. అన్నింటికీ మా వైపు నుంచి సమాధానాలు చెప్పాం.’అని ఒక ప్లానింగ్ అధికారి తెలిపారు.‘ప్రతి ఫైల్ పరిష్కారంలో పై అధికారుల సూచనలు, సలహాలు, దిశా నిర్ధేశం మేరకే పని చేశాం.’అని మరో ప్లానింగ్ అధికారి వివరించారు. డైరెక్టర్ స్థాయిలో ఉన్న బాలకృష్ణ ఆదేశాలను తప్పకుండా పాటించవలసి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ ఏపీఓలపై ఏసీబీ కన్ను ఏసీబీ అధికారులు తమ వెంట తీసుకెళ్లిన ఫైళ్ల కారణంగా ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని కొందరు ప్లానింగ్ అధికారులు, ఏపీఓలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు ఏపీఓలు బాలకృష్ణకు అన్నివిధాలుగా సహకరించి అక్రమార్జనలో శివబాలకృష్ణకు పోటీపడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. తెర వెనుక సూత్రధారులెవరు? అసలు శివ బాలకృష్ణ తెరవెనుక ఉండి.. ఆయనను నడిపించిందెవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక డైరెక్టర్ స్థాయిలో ఇష్టారాజ్యంగా అనుమతులనివ్వడం అసాధ్యం. భూమి జోన్ మార్పునకు సంబంధించిన అనుమతులకు కమిటీ ఆమోదం తప్పనిసరి. ఈ కమిటీలో ఐఏఎస్ అధికారులతో పాటు మున్సిపల్‌శాఖ మంత్రి కూడా ఉంటారు. రూ.వందల కోట్ల విలువైన భూములను కన్జర్వేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్లోకి మార్చేందుకు సదరు కమిటీ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇలాంటి ఫైళ్లు పదుల కొద్దీ ఎలాంటి సమావేశాలు లేకుండానే ఎడాపెడా ఇచ్చేశారు. ఈ క్రమంలో కింది నుంచి పై వరకు భారీ మొత్తంలో చేతులు మారాయి. కానీ చివరకు బాలకృష్ణ మాత్రం మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని హెచ్ఎండీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ అక్రమ అనుమతులను మరింత లోతుగా, సమగ్రంగా అధ్యయనం చేస్తే తెరవెనుక ఉన్న కీలకమైన వ్యక్తులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ‘ప్రతి చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ వెనుక వాళ్లు ఉన్నారు. వారిచ్చే ఆదేశాల మేరకే బాలకృష్ణ పని చేసి తన వాటా తాను పొందాడు. ’అని హెచ్ఎండీఏ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో ’వాళ్లు’ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థల ఫోకస్
-
TS: శివబాలకృష్ణకు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి ఈడీ, ఐటీ
హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెంచాయి. ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. శివబాలకృష్ణ ఎఫ్ఐర్, రిమాండ్ రిపోర్టు తదితర పత్రాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ ఇప్పటికే లేఖ రాసింది. మనీలాండరింగ్ కోణంలోను శివబాలకృష్ణను ఈడీ విచారించనుంది. మరోవైపు శివబాలకృష్ణ బినామీ ఆస్తులపై కూడా ఐటీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. అధికారాన్ని అపయోగించుకుని హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఆ ఆస్తుల విలువ సుమారు రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. డాక్యుమెంట్ వాల్యు ప్రకారం రూ. 250 కోట్లు ఆస్తులను బాలకృష్ణ కుడబెట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో ఈ ఆస్తుల విలువ నాలుగు రెట్లు ఉండే అవకాశం ఉంది. ఈ కేసులో శివబాలకృష్ణ, సోదరుడు నవీన్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్ లో ఉన్నారు. ఇదీ చదవండి: HYD: ‘వీక్షణం’ పత్రిక ఎడిటర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు -
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడీ పూర్తి
-
శివబాలకృష్ణ అక్రమాస్తులు వెయ్యి కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారం ముగిసింది. దీంతో ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. మరో 14 రోజులు రిమాండ్‌ను పొడగించింది. అయితే ఎనిమిది రోజుల విచారణలో శివబాలకృష్ణ చెప్పిన విషయాలు.. బయటపడుతున్న ఆస్తులు.. వాటిని కూడబెట్టేందుకు ఆయన అనుసరించిన విధానాల్ని చూసి ఏసీబీ అధికారులే నిర్ఘాంతపోతున్నారు. శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చని ఏసీబీ భావిస్తోంది. దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి అవుతుండడంతో.. మరిన్ని వివరాలు రాబట్టేందుకు శివబాలకృష్ణ రిమాండ్‌కు పొడగించాలని కోర్టును కోరింది. దీంతో శివబాలకృష్ణ రిమాండ్‌ను 14 రోజుల పాటు కోర్టు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇప్పటివరకు రూ.250 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ పేరుతో 214 ఎకరాలు భూమి ఉన్నట్లు ఏసీబీ జాయింగ్ డైరెక్టర్ వెల్లడించారు. తెలంగాణతోపాటు విశాఖపట్నంలో కూడా శివబాలకృష్ణకు 29 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా శివబాలకృష్ణకు ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు సంబంధించి హెచ్ఎండీఏలో పలువురు అధికారులు పాత్రపై కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చప్పారు. పలు ఫైల్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. లాకర్స్‌లో ఉన్న బంగారం, ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలను సీజ్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
బాలకృష్ణ కేసులో భారీ ట్విస్ట్..
-
హెచ్ఎండీఏలో రెండో రోజూ ఫైళ్ల తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏలో రెండో రోజూ ఏసీబీ దాడులు హడలెత్తించాయి. అమీర్‌పేట్‌లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లో ఉన్న హెచ్ఎండీఏ కార్యాలయానికి మంగళవారం ఉదయమే చేరుకున్న ఏసీబీ అధికారులు వివిధ జోన్లకు చెందిన ఫైళ్లను తెప్పించుకొని తనిఖీ చేశారు. హెచ్ఎండీఏ కార్యాలయంలోని ఏడో అంతస్తులో ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలను కొనసాగించారు. ఫైళ్లను పరిశీలించే క్రమంలో హెచ్ఎండీఏలోని ఘట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి జోన్లకు చెందిన ప్లానింగ్ అధికారులు, ఏపీఓలను తమ వద్దకు రప్పించుకొని పలు అనుమతులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకు పని చేసిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ హయాంలో ఇచ్చిన హైరైజ్ భవనాల అనుమతులపై ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఆ జోన్ల ఫైళ్లపైనే నజర్.. ► వివిధ జోన్లలో భారీ లేఅవుట్లకు అనుమతుల్విడంలో చోటుచేసుకున్న అవకతవకలపైనా ఏసీబీ ఫోకస్ పెట్టింది. మరోవైపు ఏసీబీ సోదాల నేపథ్యంలో హెచ్ఎండీఏ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగో అంతస్తు నుంచి ఏడో అంతస్తుకు ఉరుకులు పరుగులు పెట్టారు. ఒకవైపు ఏసీబీ అధికారులు అడిగిన సమాచారాన్ని, ఫైళ్లను అందజేయడంతో పాటు సందేహాలను నివృత్తి చేసేందుకు ప్లానింగ్ అధికారులు పరుగులు పెట్టారు. మొదటి రోజు సుమారు 26 మంది ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా, మంగళవారం రెండో రోజు 10 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు శంషాబాద్, శంకర్పల్లి, ఘట్కేసర్ జోన్లకు సంబంధించిన ఫైళ్లనే తనిఖీ చేశారు. శివబాలకృష్ణ హయాంలో ఇచ్చిన అక్రమ అనుమతులపై ముందస్తు సమాచారాన్ని సేకరించిన ఏసీబీ అధికారులు...ఆ సమాచారానికి సంబంధించిన వివరాలను మరింత లోతుగా సేకరించేందుకే ఫైళ్లను తనిఖీ చేసినట్లు తెలిసింది. ఏసీబీ దాడులు కొనసాగిన సమయంలో బయటివారు ఏడో అంతస్తులోకి రాకుండా తలుపులు మూసివేశారు. బడా సంస్థల అనుమతులే టార్గెట్.. ► నిర్మాణరంగంలో బడా సంస్థలుగా కొనసాగుతున్న కొన్నింటికి శివబాలకృష్ణ అడ్డగోలుగా అనుమతులను ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హైరైజ్ భవనాలకు అనుమతులనిచ్చే క్రమంలో కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులను ఇచ్చారు. ఈ క్రమంలో మాస్టర్‌ప్లాన్ నిబంధనలను కూడా తుంగలో తొక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. అడ్డగోలు అనుమతులను ఇవ్వడంలో ప్రస్తుతం సెలవులో ఉన్న ఒక ఏపీఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ గుర్తించింది. మరో ఇద్దరు ప్లానింగ్ అధికారులు కూడా శివ బాలకృష్ణకు అన్ని విధాలా అనుకూలంగా ఉండి అక్రమ అనుమతుల్లో ప్రధాన భాగస్వాములుగా నిలిచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ► తాజా సోదాల్లో ఈ మూడు జోన్లకు సంబంధించిన ఫైళ్లనే ప్రధానంగా విచారిస్తున్నారు. హైదరాబాద్ గ్రోత్కాడార్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. కొన్ని చోట్ల సమాంతర రోడ్ల కోసం కేటాయించిన భూములను ఆక్రమించుకోగా.. మరికొన్ని చోట్ల కన్జర్వేషన్ జోన్లలో ఉన్న భూములకు సైతం ఇష్టారాజ్యంగా అనుమతులను ఇచ్చినట్లు సమాచారం. తెల్లాపూర్, అమీన్పూర్ తదితర ప్రాంతాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను సైతం పక్కన పెట్టి చెరువుల్లో భారీ కట్టడాలకు అనుమతులనిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ► శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో పార్కులు, ఎమ్యూనిటీస్ కోసం కేటాయించిన స్థలాలను ఆక్రమించి భవనాలను నిర్మించేందుకు అప్పట్లో హెచ్ఎండీఏ అనుమతులను ఇచ్చిందని బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు శివబాలకృష్ణను తమ కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్న అధికారులు, మరోవైపు ఏసీబీ కార్యాలయానికి వచ్చే బాధితుల నుంచి కూడా ఫిర్యా దులను స్వీకరిస్తున్నారు. ఇలా శివబాలకృష్ణ నుంచి సేకరించిన వివరాలు, బాధితుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని అందుకు సంబంధించిన ఫైళ్లపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిసింది. బుధవారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతా టెన్షన్.. టెన్షన్.. మంగళవారం సాయంత్రం వరకు ఫైళ్లను పరిశీలించిన ఏసీబీ అధికారులు కొన్నింటిని తమతో పాటు తీసుకెళ్లినట్లు తెలిసింది. కొన్ని బడా సంస్థలకు చెందిన అనుమతులపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారించి తమ సోదాలు కొనసాగించారు. దీంతో శివబాలకృష్ణ ఆదేశాల మేరకు అప్పట్లో ఆయా బడా సంస్థలకు అన్ని విధాలుగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. ఆ ఫైళ్లు, ఆ అనుమతులు తమ మెడకు చుట్టుకుంటాయేమోననే భయాందోళనకు గురవుతున్నారు. శివబాలకృష్ణకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన ఒక ఏపీఓ ఇప్పటికే సెలవులో వెళ్లిపోవడం ఏసీబీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. -
షేర్లు.. ఆస్తులు..పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల అక్రమార్జనతో దొరికిపోయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుని తాను పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ బినామీల పేరిట షేర్లు తీసుకోవడంతో పాటు పెట్టుబడులు సైతం పెట్టినట్టు సమాచారం. శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆరో రోజు కస్టడీలో భాగంగా సోమవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. తమ సోదాల్లో గుర్తించిన ఆస్తులు, ఆభరణాలు, బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలు, లాకర్లు, కీలక ఆస్తులకు సంబంధించిన పత్రాలు.. ఇలా పలు అంశాలపై గత ఐదు రోజులుగా శివబాలకృష్ణ నుంచి సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు.. తాజాగా రియల్ ఎస్టేట్ కంపెనీలతో లింకులపై ఫోకస్ పెట్టారు. పలు రకాల అనుమతులకు సంబంధించి లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రియల్ కంపెనీలతో పలు లావాదేవీలు ప్రాథమిక ఆధారాల ప్రకారం..ప్రధానంగా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో శివబాలకృష్ణ పలు లావాదేవీలు జరిపినట్టు తెలిసింది. సోమవారం నాటి విచారణలో భాగంగా సంబంధిత వివరాలు ఏసీబీ అధికారులు సేకరించినట్టు తెలిసింది. అదేవిధంగా లాకర్లు ఓపెన్ చేసినప్పుడు లభించిన పలు భూ పత్రాలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటికే శివబాలకృష్ణ సోదరుడు సునీల్‌ను అధికారులు ప్రశ్నించారు. అతడి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మరిన్ని అంశాలపై శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఔటర్ చుట్టూ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్లోనూ అవినీతికి పాల్పడిన శివబాలకృష్ణ తన బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. వీటి గురించి కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రోజుల్లో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కీలక అంశాలపై మరిన్ని వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారులు ప్రశ్నావళి రూపొందించుకుంటున్నట్టు తెలిసింది. -
HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో విస్తుపోయే నిజాలు
-
ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు
హైదరాబాద్: హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ ఉత్తర్వులు విడుదల చేశారు. హెచ్‌జీసీఎల్ ఇన్చార్జి ఎండీగా విధులు నిర్వహించిన అప్పటి చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి తన పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమ్రపాలికి హెచ్‌జీసీఎల్ నిర్వహణ, పర్యవేక్షణపై ఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆమె ఔటర్‌రింగ్‌రోడ్డు ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్‌గా, స్పెషల్ కలెక్టర్‌గా కూడా విధులు నిర్వహించనున్నారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీకి ఎండీగా కూడా ఆమె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
బాలకృష్ణ కక్కుర్తి.. కళ్లు బైర్లు కమ్మేలా..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణ నాలుగో రోజు ముగిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపై ఏసీబీ ఆరా తీసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరెవరు బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించారనే దానిపై ఏసీబీ అధికారులు విచారించారు. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్‌ను ఏసీబీ విచారించింది. ఏసీబీ కార్యాలయానికి పిలిపించి సునీల్‌ను అధికారులు ప్రశ్నించారు. బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ఏసీబీ గుర్తించింది. బాలాజీ పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు తేలింది. బాలకృష్ణ కాసుల కక్కుర్తిపై విచారణ అధికారులు షాక్ అవుతున్నారు. రెరా కార్యాలయం నాలుగో అంతస్తులోని బాలకృష్ణ చాంబర్లో లాకర్‌ను అధికారులు బ్రేక్ చేశారు. 12 లక్షలు విలువ చేసే చందనపు చీరలు, 20 లక్షలకు పైగా క్యాష్ లభ్యమైంది. వాటితో బాలకృష్ణ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు ఫోటో ఆల్బమ్‌లు, కీలకమైన భూముల పాసు పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఆ కార్లు ఎక్కడివి? -
ఆ కార్లు ఎక్కడివి?
సాక్షి, హైదరాబాద్: ఆ కార్లు ఎక్కడివి..ఎవరు బహుమతిగా ఇచ్చారు? ఒకవేళ మీరే కొంటే..అందుకు సొమ్ము ఎక్కడిది? అంటూ మూడో రోజు కస్టడీలో ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఏసీబీకి పట్టుబడడానికి కొద్ది నెలల కిత్రమే రెండు కొత్త కార్లు శివబాలకృష్ణకు బహుమతిగా వచ్చినట్టు ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఇందులో హోండాసిటీ కారును ఓ బిల్డర్, నెక్సాన్ కారు ఓ రియల్‌బ్రోకర్ నుంచి బహుమతిగా వచ్చినట్టుగా ప్రాథమిక ఆధారాల మేరకు అనుమానిస్తున్నారు. ఈ రెండు కార్ల విషయంతోపాటు కుటుంబసభ్యులు, ఇతర బినామీల పేరిట నడుపుతున్న పలు బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలపైనా ఏసీ బీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. శివ బాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరిట మరో మూడు లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా శుక్రవారం మూడో రోజు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. తొలిరోజు విచారణలో భాగంగా బుధవారం ఏడు గంటలు, గురువారం ఆరుగంటలపాటు శివబాలకృష్ణను ఏసీబీ అధికారుల బృందం ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం విచారణలో భాగంగా ఉద యం చంచల్‌గూడ జైలు నుంచి శివబాలకృష్ణను తమ కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు తొలుత రెరా కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం. అక్కడ సోదా ల్లో రూ.కోటి విలువైన ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నించారు. అయితే తొలి రెండు రోజులు ఏసీబీ విచారణకు సహకరించకపోయినా, వరుసగా కీలక పత్రాలు ముందుంచి తమదైన శైలిలో ప్రశి్నస్తుండడంతో శివబాలకృష్ణ కొన్ని ప్రశ్నలకు ఏసీబీ అధికారులకు సమాధానాలు ఇస్తున్నట్టు తెలిసింది. లాకర్లలో భారీగా బంగారం? శివబాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యుల పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిపించినట్టు సమాచారం. ఈ లాకర్లలో పెద్ద మొత్తంలో దాచిన బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఎంతమేర బంగారం, ఇతర పత్రాలు స్వా«దీనం చేసుకున్నారన్న సమాచారం పూర్తిగా తెలియరాలేదు. కాగా, ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత శివబాలకృష్ణపై మరికొందరు ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తుండడంతో ఏసీబీ అధికారులు ఆ అంశాలపైనా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. శనివారం మరోమారు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు. -
శివబాలకృష్ణకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏసీబీ
-
ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ.. అక్రమ అనుమతులు, బినామీ ఆస్తులపై ఆరా
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎమ్డీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏపీసీ కస్టడీలోకి తీసుకుంది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌గా ఉన్న ఆయన్ను.. నేటి నుంచి 8 రోజుల వరకు కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. కాగా ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఎనిమిది రోజుల కస్టడీకి నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో బాలకృష్ణను మరింత లోతుగా ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీయనున్నారు. అక్రమ అనుమతులు, బినామీ ఆస్తులపై ఆరా తీయనున్నారు. మరోవైపు హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీవేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పుప్పాలగూడ 447సర్వే నంబర్లో అనుమతులపై సూర్య ప్రకాష్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో బాలకృష్ణ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమ ఆస్తులను గుర్తించారు. చదవండి: ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం -
HMDA: శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇక.. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ -
ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ
-
HMDA: ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు మంగళవారం విచారణ జరిపింది. 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా, 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు చేయాలన్న ఏసీబీ.. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. అధికారులను సైతం ఏసీబీ విచారించనుంది. హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఆరా తీయనుంది. హైరేస్ బిల్డింగ్ అనుమతుల్లో అక్రమాలపై విచారణ చేపట్టనుంది. కోర్టులను సైతం తప్పుదోవ పట్టించి వివాదస్పద భూముల్లో అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పుప్పాలగూడ 447సర్వే నంబర్లో అనుమతులపై సూర్య ప్రకాష్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమ ఆస్తులను గుర్తించారు. బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారిస్తే అక్రమ ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: హెచ్ఎండీఏలో ‘ఏసీబీ’ ప్రకంపనలు -
హెచ్ఎండీఏలో ‘ఏసీబీ’ ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏలో ఏసీబీ దాడులు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై దాడుల నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. బాలకృష్ణ ఇంటిపై దాడులు అనంతరం ఏసీబీ అధికారులు తమ దర్యాఫ్తులో భాగంగా హెచ్ఎండీఏపై దృష్టి సారించారు. గత మూడేళ్లలో ప్రణాళికా విభాగం నుంచి ఇచి్చన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినమైనప్పటికీ ప్రణాళికా విభాగానికి చెందిన ప్లానింగ్ అధికారులు, ఏపీఓలు, జేపీలు, ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. మరోవైపు ఈ మూడేళ్ల అనుమతులకు సంబంధించిన ఫైళ్లను హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్‌కు కూడా అధికారులు అందజేశారు. శంకర్పల్లి, శంషాబాద్, ఘటకేసర్, మేడ్చల్ జోన్లలో పెద్ద సంఖ్యలో వివిధ రకాల అనుమతుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొందరు అధికారులు ‘డాక్యుమెంట్ల పరిశీలన’సాకుతో అక్రమార్జన కోసం నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చారు. కన్జర్వేషన్ జోన్లలో ఉన్న భూములను యథేచ్చగా కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లలోకి మార్చేశారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలోనూ ఇలాంటి అక్రమాలు చాలా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు వట్టి నాగులపల్లి ప్రాంతానికి చెందిన సుమారు 70 భూమారి్పడి ఫైళ్లకు ఆగమేఘాల మీద అనుమతులు ఇవ్వడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో మరిన్ని అక్రమ అనుమతులు ఇచి్చనట్లు లభించిన సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగంపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఔటర్ సమీపంలో ఉన్న మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల, తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రోత్ కారిడార్‌లో భవిష్యత్తులో వాహనాల రద్దీని నియంత్రించేందుకు సమాంతర రహదారుల కోసం కేటాయించిన భూముల్లో పలుచోట్ల ఇలాంటి ఉల్లంఘనలు జరిగినట్లు తెలిసింది. మరోవైపు బాలకృష్ణ ఇంటిపై దాడులు, అతడి అరెస్టు, రిమాండ్ అనంతరం వెలుగులోకి వచి్చన అక్రమ ఆస్తులకు సంబంధించి రోజుకో కొత్త విషయం బయట పడుతుండడంతో హెచ్ఎండీఏ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అడ్డగోలుగా అనుమతులు ప్రస్తుతం ఏసీబీ.. బాలకృష్ణకు నమ్మిన బంట్లుగా ఉండి ఆయనకు అన్ని విధాలుగా సహకరించిన కొందరు అధికారులపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. లే అవుట్లు, భవన నిర్మాణాలు, ప్రత్యేకించి హైరైజ్ భవనాల కోసం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. కొన్నిచోట్ల పర్యావరణ సంస్థలు విధించిన ఆంక్షలను సైతం పక్కన పెట్టి, నీటివనరులు ఉన్న చోట భవనాలకు అనుమతులిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే పారిశ్రామిక ప్రాంతాల్లో నివాస సముదాయాలు వెలిశాయి. ఇలాంటి అనుమతులను ఇచ్చేందుకు ఒకరిద్దరు ఏపీఓ స్థాయి అధికారులు బాలకృష్ణకు ప్రధాన అనుచరుల మాదిరి వ్యవహరించినట్లు సమాచారం. ఈ క్రమంలో వారు సైతం రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కీలకమైన జోన్లో పని చేస్తున్న ఒక ఏపీఓ బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా ఉండి అన్ని రకాల వ్యవహారాలు చక్కబెట్టినట్లు తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు ఆ ఏపీఓపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు బాలకృష్ణపై ఏసీబీ దాడుల అనంతరం ఒకరిద్దరు వ్యక్తిగత కారణాలు చూపుతూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం గమనార్హం. -
HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించేందుకు చర్యలు
-
అక్రమాస్తుల కేసు.. ఉద్యోగం నుంచి బాలకృష్ణ తొలగింపు ?
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. శివ బాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించే అంశంపై పురపాలక ఉన్నతాధికారులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోపక్క బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన పలువురు ఉద్యోగులకు ఏసీబీ నోటీసులిచ్చింది. ఉద్యోగులతో పాటు బాలకృష్ణతో అక్రమ లావాదేవీలు జరిపిన వారిని ఏసీబీ విచారించనుంది. ఇప్పటికే శివబాలకృష్ణ బినామీలు, బ్యాంకు లాకర్లపైన ఏసీబీ దృష్టి పెట్టింది. కాగా, శివబాలకృష్ణను 10రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ వేసిన కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో కోర్టు విచారించనుంది. కోర్ట బాలకృష్ణను కస్టడీకి ఇస్తే ఆయన జరిపిన లావాదేవీలు, బినామీలకు సంబంధించిన వ్యవహారాలు తదితర అంశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది. బాలకృష్ణ చెప్పే విషయాల ఆధారంగా ఈ కేసులో మరికొందరి అరెస్టులు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శివబాలకృష్ణ ఇంటిపై రెయిడ్స్ జరిపిన ఏసీబీ ఆయన ఆదాయానికి మించి ఆస్తులను పోగేసినట్లు తేల్చింది. దీంతో అక్రమాస్తుల కేసులో ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే ఆయన భారీగా అక్రమాలకు పాల్పడ్డట్టు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ఏసీబీకి బాలకృష్ణ భాదితుల క్యూ.. అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్టయిన తర్వాత ఆయన బాధితులు ఒక్కొక్కరుగా ఏసీబీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. లే అవుట్లకు, నిర్మాణాలను అనుమతులిచ్చేందుకుగాను తమతో శివబాలకృష్ణ జరిపిన లావాదేవీలపై వారు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఏసీబీని కోరుతున్నారు. ఇదీచదవండి.. కేటీఆర్ తన భాష మార్చుకోవాలి.. కోమటిరెడ్డి -
ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్ !
-
శివబాలకృష్ణ అక్రమ సంపాదన విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
-
బినామీలుగా సంబంధంలేని వ్యక్తులు!
సాక్షి, హైదరాబాద్: భూవినియోగ మార్పు, భవన అనుమతుల్లో అక్రమాలతో భారీగా ఆర్జించిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా కార్యదర్శి శివబాలకృష్ణ.. చాలా తెలివిగా తనకు బంధుత్వం, దగ్గరి సంబంధమేదీ లేని వ్యక్తులను బినామీలుగా పెట్టుకుని వందల కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. తెలిసినవారైతే అనుమానం వస్తుందని భావించి ఇలా వ్యవహరించారని.. అధికారులు, రాజకీయ నేతల సహకారంతో వందల కోట్ల విలువ చేసే భూములను ఆర్జించారని అంటున్నారు. శివబాలకృష్ణపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కోర్టులో దాఖలు చేసిన 45పేజీల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించారు. సహకరించిన అధికారుల పాత్రపైనా విచారణ శివ బాలకృష్ణ ఇంటితోపాటు పీర్జాదిగూడలో రమాదేవి, జూబ్లీహిల్స్ ప్రమోద్‌కుమార్, మాదాపూర్‌లో సందీప్‌రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణమూర్తి ఇళ్లు, ఇతర కార్యాలయాలు కలిపి మొత్తం 18 చోట్ల సోదాలు చేశామని.. భారీగా స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లను గుర్తించామని రిమాండ్ రిపోర్టులో అధికారులు వివరించారు. ‘‘బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 50 స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లను పరిశీలించాం. పట్టణాల్లో విల్లాలు, ఇళ్లతోపాటు నాగర్‌కర్నూల్‌లో 12.13 ఎకరాలు, అబ్దుల్లాపూర్, భువనగిరి, చేవెళ్ల, యాదగిరిగుట్ట, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో భూములు ఉన్నట్టు గుర్తించాం. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల మేరకు స్థిరాస్తుల విలువ రూ.4.9 కోట్లుగా ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ అంతకు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే రూ.83,80,000 నగదు, నాలుగు కార్లు, రూ.8.26 కోట్ల విలువైన బంగారం, వెండితోపాటు పలు వస్తువులు సీజ్ చేశాం. 155 డాక్యుమెంట్లు, 4 బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఖరీదైన వాచీలు, సెల్ఫోన్లు, లాకర్ పత్రాలు, ఎల్ఐసీ బాండ్లను స్వాధీనం చేసుకున్నాం. వీటిలో బినామీలను విచారించాల్సి ఉంది. అలాగే ఈ ఉదంతంలో ఇతర అధికారుల పాత్రపైనా దర్యాప్తు జరపాల్సి ఉంది..’’ అని అధికారులు పేర్కొన్నారు. రాజకీయ నాయకులూ సహకరించారు లేఔట్ల అనుమతుల కోసం శివబాలకృష్ణ పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసేవారని.. రెరా సెక్రటరీ హోదాలోనూ పలు అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బాలకృష్ణ హయాంలో అనుమతులు ఇచ్చిన వాటిపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. అక్రమాలకు తనవారు అవసరమని భావించిన బాలకృష్ణ బంధువులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నియమించుకున్నారని.. కొందరు రాజకీయ నాయకులు కూడా సహకరించారని పేర్కొన్నారు. సోదాల్లో పట్టుబడిన ఆస్తులు, వస్తువులకు సంబంధించిన వివరాలపై ఎంత అడిగినా.. బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు సహకరించలేదన్నారు. అన్ని వివరాలు బయటపడాలంటే ఇప్పటికే అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న బాలకృష్ణను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. డ్రైవర్ పేరిట రూ.20 కోట్ల ఆస్తులు బాలకృష్ణ డ్రైవర్ పేరిట నగర శివార్లలో రూ.20 కోట్లకుపైగా (మార్కెట్ రేట్ల ప్రకారం) విలువైన భూములు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పలు జిల్లాల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఉద్యోగులు, బ్యాంకు లాకర్ల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ ఆధారాలను బట్టి ఈ కేసుతో సంబంధమన్న వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బినామీల్లో ఒకరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నట్టు గుర్తించి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. హెచ్ఎండీఏ పరిధిలో ఏ పని జరగాలన్నా తొలుత ఆయన బినామీలను సంప్రదించాకే అధికారుల వద్దకు వెళ్లేలా బాలకృష్ణ ప్రత్యేకంగా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు కూడా విచారణలో తేలిందని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. -
సాక్షిటీవీ చేతిలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్
-
శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
-
బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ మరో వారం రోజుల కస్టడీ కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఆమోదించిన ఫైల్స్, బినామీ ఆస్థులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. మరోవైపు.. బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలను అధికారులు వెల్లడించారు. కాగా, లేఅవుట్ అనుమతుల కోసం బాలకృష్ణ భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు. అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయని లాభాలు పొందినట్టు తెలిపారు. ప్లాట్స్ నిర్మాణాల్లో విల్లాలను సైతం లంచంగా బాలకృష్ణ తీసుకున్నాడు. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగినట్టు స్పష్టం చేశారు. హెచ్ఎండీఏలోని మూడు జోన్లపై బాలకృష్ణకు మంచిపట్టు ఉందని గుర్తించారు. ఇక, హెచ్ఎండీఏలోని కీలక పోస్టులో బాలకృష్ణ సుదీర్ఘంగా పనిచేశారు. మరోవైపు.. బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నాక ఏసీబీ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనుంది. ఇదే సమయంలో బాలకృష్ణకు సహాయం చేసిన అధికారులపై కూడా విచారించనున్నారు. ఇదిలా ఉండగా.. వట్టి నాగులపల్లిలో ప్రభుత్వ భూముల యాజమాన్యం, వినియోగ హక్కుల మార్పిడిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్రమాలు జరిగిన భూముల ఫైల్స్‌పై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. వట్టి నాగులపల్లిలో ఎలక్షన్ కోడ్‌కు కొద్దిరోజుల ముందే పెద్ద ఎత్తున భూ వినియోగ మార్పిడి జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా లేకపోయినా ఫైల్స్ ఆమోదంలో బాలకృష్ణ పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక, హెచ్ఎండీఏ నుండి ఆరు నెలల క్రితమే బదిలీ అయి తెలంగాణ రేరా సెక్రటరీగా బాలకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో, బాలకృష్ణ హయాంలో ఇచ్చిన అక్రమ అనుమతులపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. అయితే, బాలకృష్ణ తన దగ్గరి బంధువులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించుకుని అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. కొందరు పొలిటికల్ లీడర్లు కూడా అక్రమాలకు మధ్యవర్తులుగా వ్యవహరించినట్టు సమాచారం. -
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ కోర్టులో అధికారులు హాజరు పర్చారు. కాగా.. ఆయనకు కోర్టు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 8వరకు రిమాండ్ ఉండనుంది. పోలీసులు ఆయన్ను చంచల్ గూడా జైలుకు తరలించారు. బాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రదేశాల్లో సోదాలు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడు బాలకృష్ణపై 13 (1) (b), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాలకృష్ణ ఇంటితో పాటు, బందువులు, సహచరుల ఇళ్లల్లో సోదాలు చేశామని పేర్కొన్నారు. బాలకృష్ణ ఇంట్లో రూ.99.60 లక్షలు నగదు సీజ్ చేశామని స్పష్టం చేశారు. 1988 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశామని తెలిపారు. 6 కేజీల సిల్వర్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రూ.8.26 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వ్యాల్యూ లో ఇంకా ఎక్కువ ఉంటుందని అన్నారు. మిగిలిన బీనామీలపై విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. బాధితుల ఆవేదన.. ఏసీబీ అరెస్టుతో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పుప్పాలగూడ సర్వేనెంబర్ 447లో కోర్టు పరిధిలోని వివాదస్పద భూములకు అనుమతులు ఇచ్చారని సూర్యప్రకాష్ అనే బాధితుడు తెలిపాడు. తమకు కోర్టు డిక్రీ ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి పరిమీషన్ ఇచ్చాడని వెల్లడించాడు. రఘురామ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్ కు హైరేస్ అపార్ట్ మెంట్స్ కు అనుమతులు ఇచ్చాడని పేర్కొన్నాడు. అక్రమ అనుమతులపై హైకోర్టకు వెళ్తే కోర్టును తప్పుదోవ పట్టించి ఫేక్ అఫిడవిట్ వేశారని తెలిపాడు. ఆర్టీఏ ద్వారా సమాచారం అడిగితే ఇప్పటివరకు ఎలాంటి సమాదానం ఇళ్వకుండా దాటవేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ.400కోట్ల విలువైన 6.36 ఎకరాల భూమిలో అక్రమ పర్మిషన్ ఇచ్చాడని బాధితులు తెలిపాడు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఉన్నారని గతంలో తమను బెదిరించారని తెలిపారు. సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శివ బాలకృష్ణ హయాంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు. ఇదీ చదవండి: నేడో రేపో కోర్టులో ప్రవేశపెట్టనున్న ఏసీబీ -
మొత్తం 7 జిల్లాల్లో విస్తరించి ఉన్న HMDA
-
వంద కోట్ల దొంగ ఆస్తులు? కోర్టుకు HMDA మాజీ డైరెక్టర్..
-
శివబాలకృష్ణ అరెస్ట్ తో HMDA అధికారుల్లో టెన్షన్
-
బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..!
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ చైర్మన్, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి శివ బాలకృష్ణను అక్రమాస్తుల వ్యవహారంలో దర్యాప్తు చేసే క్రమంలో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వందల కోట్ల ఆస్తుల్ని కూడబెట్టుకునేందుకు బాలకృష్ణ ఎలాంటి మార్గాల్ని అనుసరించాడో తెలిసి అధికారులే కంగుతింటున్నారు. పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో శివబాలకృష్ణ బారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తుల్లో వెల్లడైంది. అయితే.. రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చి.. ఆ లంచాలను పెట్టుబడుల్లోకి ఆయన మార్చుకున్నట్లు తేలింది. ఇందుకోసం హైదరాబాద్ శివారుల్లో వందల కొద్దీ ఆయన అనుమతులు ఇచ్చినట్లు తేలింది. హెచ్ఎండీఏ, రెరాలో పని చేస్తూనే ఆయన ఈ అనుమతులు జారీ చేసినట్లు గుర్తించారు. ఇక.. ఆయన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. బంజారాహిల్స్ స్టేషన్‌ను తరలించి విచారిస్తోంది. ఆయన ఏ కంపెనీలకు, ఎవరెవరికి అనుమతులు ఇచ్చిందో ఆరా తీస్తోంది. మరోవైపు బంధువులు, మిత్రుల పేర్లు మీద కూడా ఎకరాల కొద్దీ ఆయన భూములు కొన్నారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 90 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బాలకృష్ణ ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. కీలకమైన డాక్యుమెంట్లనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటిదాకా బయటపడిన పత్రాలు, ఇతరాలను బట్టి.. ఆయన కూడబెట్టిన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ. 300-400 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం జరిగిన సోదాల్లో.. ఒక్క నానక్‌రామ్‌గూడ లోని బాలకృష్ణ ఇంట్లోనే రూ. 84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లు.. నగర శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు ఆయన వెనకేసినట్లు గుర్తించారు. -
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్
-
అవినీతి అనకొండ..HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
బాలకృష్ణను అదుపులో తీసుకున్నాం: ఏసీబీ
హైదరాబాద్, సాక్షి: ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్టు అయ్యారు. బుధవారం ఆయన ఇంట్లో చేసిన తనిఖీల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. సోదాలు పూర్తి కావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేపు ఆయన్ని కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. ‘‘బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నాం. రేపు ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తాం. ఆ తర్వాత కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుంటాం. తనిఖీల సమయంలో కుటుంబ సభ్యులెవరూ మాకు సహకరించలేదు’’ అని ఏసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు శివబాలకృష్ణ ఇంట్లో సోదాలు ముగియగా.. మరో నాలుగు చోట్ల మాత్రం ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇంకోవైపు ఆయన బ్యాంకు లాకర్స్‌ను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. మొత్తం 20 చోట్ల తనిఖీలు చేపట్టిన ఏసీబీ.. భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలకు స్వాధీనం చేసుకుంది. తన పదవిని, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో సన్నిహిత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అంచనా వేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే శివబాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్థుల కేసు నమోదు అయ్యింది. గుర్తించిన ఆస్తులు ఇవే.. రూ. 40 లక్షల నగదు, ఐదుకోట్ల విలువైన బంగారం భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం 70 ఎకరాల భూమి, ఇండ్లు 60 ఖరీదైన చేతి గడియారాలు.. 100 మొబైల్ ఫోన్లు(భారీగా ఐఫోన్లు), నాలుగు కార్లు భారీగా ల్యాప్ టాప్స్ వీటితో పాటు ఇంట్లోనే ఆయన క్యాష్ కౌంటింగ్ యంత్రాలు ఉంచుకోవడం గమనార్హం. అలాగే.. ఆయన బ్యాంకు లాకర్లు తెరవడంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు ముగిస్తే మరికొన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శివ బాలకృష్ణతో సంబంధం ఉన్న అధికారులను వదలకుండా ప్రశ్నిస్తామని ఏసీబీ తాజాగా ప్రకటించింది. ఇక బుధవారం సాయంత్రం వరకు స్వాదీనం చేసుకున్న ఆస్తుల విలువే బహిరంగ మార్కెట్లో రూ.వంద కోట్లకుపైగానే ఉందని తేలింది. ఏసీబీ దాడుల్లో ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడటం ఇదే తొలి సారి అని అధికారులు పేర్కొంటున్నారు. ‘‘బాలకృష్ణ 2018–2023 మధ్య హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా కొనసాగారు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో శివబాలకృష్ణ భారీగా అవినీతికి పాల్పడి, అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి. భారీ ఎత్తున అతి విలువైన భూముల పత్రాలు దొరికాయి. అవన్నీ బినామీల పేరిట కొనుగోలు చేశారు. వాటిని పరిశీలిస్తున్నాం. బాలకృష్ణ ఇంట్లో రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. ఇంకా బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉంది..’’అని ఏసీబీ డీజీ తెలిపారు. -
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు
సాక్షి, రంగారెడ్డి: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై బుధవారం ఏసీబీ సోదాలు జరిగాయి. ఆదాయం మించి ఆస్తుల కేసు నమోదు చేసి 8 ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టాయి. 20 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. బాలకృష్ణ ఇల్లు, బంధువులు ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టంది. గతంలో పదవిని అడ్డం పెట్టుకొని రూ. కోట్లు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో బాలకృష్ణ కీలక స్థానంలో పనిచేశారు. చదవండి: సీఎం రేవంత్ సెక్యూరిటీలో లీక్ రాయుళ్లు.. ఐబీ కీలక నిర్ణయం -
స్పీడ్ పెంచిన సీఎం రేవంత్.. ఇక GHMC, HMDA వంతు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్షలు నిర్వహించారు. ఇక, తాజాగా కొత్త ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏపై సమీక్ష చేపట్టనుంది. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 25వ తేదీ తరువాత జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏ పరిధిలో రిపోర్టు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్, పెండింగ్ పనుల లిస్ట్‌పై బల్దియా కసరత్తు మొదలు పెట్టింది. ఇక, హెచ్ఎండీఏ పరిధిలో ఓఆర్ఆర్ టెండర్లు, భూముల వేలంతో పాటు పెండింగ్ పనుల లిస్ట్‌ను అధికారులు సిద్దం చేస్తున్నారు. మరోవైపు, ఆదాయ మార్గాల్లో భాగంగా రెండింటిపై ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి వద్దే మున్సిపల్ శాఖ ఉన్న విషయం తెలిసిందే. -
IAS Amrapali: బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: డ్యాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా పేరున్న ఆమ్రపాలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్‌గా ఇవాళ సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. బదిలీ ద్వారా పదోన్నతితో హెచ్ఎండీఏకు ఆమె నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను అభినందించారు. హెచ్ఎండిఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఆపై మూసి రివర్ ఫ్రెంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టి కార్పొరేషన్ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు. హెచ్ఎండీఏకు ఉన్నత పరిపాలనాధికారిగా కమిషనర్ మాత్రమే కొనసాగుతుండగా.. తాజాగా సంయుక్త కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2019 నుంచి హెచ్ఎండీఏకు కమిషనర్‌గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కొనసాగుతున్నారు. హెచ్ఎండీఏను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో అర్వింద్‌ను హెచ్ఎండీఏలో కొనసాగిస్తారా.. ఆ స్థానంలో నూతన అధికారిని నియమించనున్నారా? అనే దానిపైనా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలి
-
ఆ 181 ఎకరాలు HMDAవే.. హైకోర్టులో భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో హైదరాబాద్ మహనగర అభివృద్ధి సంస్థ(HMDA)కు భారీ ఊరట లభించింది. శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములు హెచ్‌ఎండీఏవేనని హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. పిటిషనర్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆశ్రయించినట్లు గుర్తించిన కోర్టు.. వాళ్ల తీరును తప్పుబడుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏకు చెందిన 181 ఎకరాల భూముల్లో.. 50 ఎకరాల భూముల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఈ మేరకు కోర్టులో పత్రాలు సమర్పించి మరీ రిట్ పిటిషన్ వేశారు కొందరు. అయితే సంబంధంలేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండీఏ ఆధీనంలోని భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారని హెచ్ఎండీఏ వాదించింది. ఇరువైపులా వాదనలు నవంబర్ 18వ తేదీన పూర్తికాగా.. తీర్పును రిజర్వ్ చేసింది డివిజన్ బెంచ్. ఈ క్రమంలో పిటిషనర్లు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు గుర్తించిన ఉన్నత న్యాయస్థానం డివిజన్ బెంచ్.. ఇవాళ రిట్ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది. తీర్పు వెల్లడించే క్రమంలో అక్రమార్కుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, తమ ఉన్నతాధికారుల చొరవతో మొత్తానికి హెచ్ఎండీఏ కేసు గెలిచింది. -
HMDA: భూములు వేలం.. హెచ్‌డీఎంకు బిడ్డర్ల ఝలక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు బిడ్డర్లు హ్యాండ్ ఇచ్చారు. హెచ్ఎండీఏ పరిధిలో ఇటీవల ఈ-వేలంలో ప్లాట్లకు పాటపాడి బిడ్డర్లు డబ్బులు చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఆరు లేఅవుట్లలో ఏకంగా 497 మంది డిఫాట్లర్టుగా మారడం గమనార్హం. కాగా, డబ్బులు చెల్లించేందుకు నిర్ణీత గడువు కంటే ఎaక్కువ సమయం ఇచ్చినా బిడ్డర్లు మిగతా వాయిదాలు చెల్లించలేదు. దీంతో, ఆ ప్లాట్ల ధరావతు సొమ్ము రూ.4.5 కోట్లకుపైగా హెచ్ఎండీఏ జప్తు చేసింది. వివరాల ప్రకారం.. హెచ్ఎండీఏలో ఈ-వేలంలో ప్లాట్లను దక్కించుకున్న వారిలో చాలామంది డిఫాల్టర్లుగా నిలిచారు. ఆరు లేఅవుట్లకు సంబంధించి 497 మంది చెల్లింపులు చేయలేక చేతులెత్తేశారు. వారికి నిర్ణీత గడువు కంటే మరికొంత సమయం ఇచ్చినా సొమ్ము చెల్లించలేదు. ఈ క్రమంలో చేసేదేమీ లేకపోవడంతో ఆ ప్లాట్ల ధరావతు సొమ్ము రూ.4.5 కోట్లకుపైగా హెచ్ఎండీఏ జప్తు చేసింది. ► ఇక, మోకిలలో ఇటీవల నిర్వహించిన ఈ-వేలంలో చదరపు గజం రూ.లక్ష పలకడం రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలా అధిక ధరకు ప్లాట్లు దక్కించుకున్న చాలామంది డబ్బులు చెల్లించడంలో వెనకడుగు వేశారు. ఒక్క మోకిలలోనే 148 మంది వరకు డిఫాల్టర్లుగా మిగిలారు. షాబాద్‌లో 50 ప్లాట్లకుగాను కేవలం 10 మందే చెల్లింపులు చేశారు. తొర్రూరులో 504 ప్లాట్లకు 114 మంది డబ్బులు కట్టలేదు. మిగతా లేఅవుట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ►ఆరు నెలల్లో మోకిల, మేడిపల్లి, బాచుపల్లి, బహదూర్‌పల్లి, తొర్రూరు, షాబాద్ తదితర ప్రాంతాల్లో వెయ్యికి పైగా ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేసింది. వేలంలో పాల్గొనాలంటే ప్రతి ప్లాటుకు తొలుత రూ.లక్ష ధరావతు చెల్లించాలి. కొన్నిచోట్ల ఈ మొత్తం తక్కువ ఉంటుంది. అలా వేలంలో ప్లాటు దక్కించుకున్న తర్వాత మిగతా మొత్తం కట్టకుంటే డిఫాల్టర్లుగా తేల్చి ఆ ధరావతును జప్తు చేస్తారు. అంతేకాక డిఫాల్టర్లు భవిష్యత్తులో వేలంలో పాల్గొనలేరు. -
కనువిందుగా.. పసందుగా..
హైదరాబాద్: ఆహ్లాదానికి చిరునామాలాంటి భాగ్యనగర ప్రత్యేకతలకు మరో సరికొత్త ఆకర్షణ తోడయింది. ప్రకృతి అందాలకు నిలయమైన హుస్సేన్ సాగర్ అభిముఖంగా పచ్చని సొగసుల లేక్ ఫ్రంట్ పార్క్ కొలువుదీరింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) తీర్చిదిద్దిన ఈ పార్క్ నేటి నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. దాదాపు రూ.26.65 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న లేక్ ఫ్రంట్ పార్క్‌ను గత మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాకర్స్ కోసం ప్రత్యేక వేళలు.. ఈ లేక్ ఫ్రంట్ పార్క్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శకులకు ప్రవేశానికి అనుమతిస్తారు. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు వ్యాయామ అభిలాషులైన వాకర్స్ కోసం మాత్రమే ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఆహ్లాదకరమైన పరిసరాల్లో నడక ద్వారా ఆరోగ్యాన్ని అందుకోవాలనే ఆరోగ్యాభిలాషులు నెలకు రూ.100 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వేడుకలకూ.. వేదికగా.. పరిమిత బడ్జెట్లో చిన్న చిన్న వ్యక్తిగత వేడుకలు నిర్వహించాలని కోరుకునే నగరవాసులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ లేక్ ఫ్రెండ్ పార్కులో వంద మందికి మించకుండా బర్త్ డే ఫంక్షన్స్, గెట్ టుగెదర్ ఫంక్షన్స్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. దీనికి రూ.11 వేలు చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా వేడుకలు నిర్వహించుకునే అవకాశాన్ని హెచ్ఎండీఏ కల్పిస్తోంది. ఫుడ్ స్టాల్స్‌కూ చోటు.. సందర్శకుల సౌకర్యార్థం లేక్ ఫ్రంట్ పార్క్ లో ఫుడ్ స్టాల్స్‌కు కూడా చోటు కల్పించారు. కరాచీ బేకరీ అవుట్ లెట్‌తో పాటు మరికొన్ని అవుట్ లెట్స్ సందర్శకుల కోసం ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. -
హెచ్ఎండీఏ ఆదాయం రూ.6945 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కోకాపేట, బుద్వేల్లోని భూముల విక్రయాల ద్వారా హెచ్ఎండీఏకు రూ.6,945.33 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రెండు చోట్ల హెచ్ఎండీఏకు ఉన్న భూములను ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించగా, కొనుగోలుదారులు పూర్తిగా డబ్బులు చెల్లించారు. ► కోకాపేటలో మొత్తం 7 ప్లాట్లలో ఉన్న 45.33 ఎకరాల భూమిని విక్రయించారు. ఇందులో ఒక్కో ప్లాట్‌లో 3.60 ఎక రాల నుంచి 9.71 ఎకరాల వరకు ఉంది. ఎకరం అత్యధికంగా రూ.100.75 కోట్లకు అమ్ముడుపోగా, సగటున ఎకరానికి రూ.73.23 కోట్ల చొప్పున ధర పలికింది. మొత్తం 7 ప్లాట్లపై రూ.3319.60 కోట్ల ఆదాయం లభించింది. ► బుద్వేల్లోని 14 ప్లాట్లలో ఉన్న 100.01 ఎకరాలు కూడా పూర్తిగా అమ్ముడుపోయింది. ఎకరానికి గరిష్టంగా రూ.41.75 కోట్లు ధర లభించింది. సగటున ఎకరం రూ.36.25 కోట్ల చొప్పున విక్రయించారు. బుద్వేల్లోని మొత్తం భూములపై రూ.3625.73 కోట్ల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. ► మోకిలాలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో కొందరు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోవడానికి పలు కారణాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సకాలంలో బ్యాంకు రుణాలు లభించకపోవడం వల్ల కొందరు చెల్లించలేదన్నారు. బిడ్డర్ల విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. -
Durgam Cheruvu Musical Fountain Pics: దుర్గం చెరువులో వాటర్ ఫౌంటెన్లు ప్రారంభం (ఫోటోలు)
-
మూసీ, ఈసా నదులపై ఫోర్‌లేన్ బ్రిడ్జీలు
హైదరాబాద్: చారిత్రక మూసీ, ఈసా నదులపై అందమైన వంతెనలు అందుబాటులోకి రానున్నాయి. నగరానికి ఉత్తర, దక్షిణ మార్గాల్లో రాకపోకలకు అనుగుణంగా సరికొత్త డిజైన్లలో బ్రిడ్జీలను నిర్మించేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఔటర్ లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజల మౌలిక అవసరాలకు సరిపడా ప్రజా రవాణా వ్యవస్థలో పెద్దఎత్తున మార్పులు చేపట్టారు. అందులో భాగంగానే మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ రెండు నదులపై వివిధ చోట్ల 14 బ్రిడ్జీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో ప్రస్తుతం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మూసీ నదిపై 3 చోట్ల, ఈసా నదిపై 2 చోట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. సుమారు రూ.168 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ వంతెనల నిర్మాణ పనులకు హెచ్ఎండీఏ ఇప్పటికే ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బ్రిడ్జీల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. తగ్గనున్న ప్రయాణ సమయం.. సుమారు రూ.42 కోట్లతో ఉప్పల్ భగాయత్ లే అవుట్ వద్ద ఒక బ్రిడ్జి నిర్మించనున్నారు. మరో రూ.35 కోట్లతో ప్రతాపసింగారం– గౌరెల్లి వద్ద నిర్మిస్తారు. మంచిరేవుల వద్ద రూ.39 కోట్ల వ్యయంతో, బుద్వేల్ ఐటీపార్కు–2 వద్ద ఈసా నదిపై రూ.32 కోట్లతో నిర్మించనున్నారు. రూ.20 కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్–1 సమీపంలో ఈసా నదిపై హెచ్ఎండీఏ వంతెనల నిర్మాణాలను చేపట్టనుంది. ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున మూసీపై నాలుగు వరుసల్లో వంతెన నిర్మాణం జరగనుంది. 15 నెలల్లో ఈ బ్రిడ్జీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని హెచ్ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది. వంతెనల నిర్మాణం పూర్తయితే వివిధ ప్రాంతాల మధ్య దూరం తగ్గడమే కాకుండా ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది. -
ఓఆర్ఆర్ లీజుపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్‌ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతలను 30 ఏళ్ల పాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిలిడ్ కంపెనీకి అప్పగింత, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కు చెందిన నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం.. తుది ఉత్తర్వుల మేరకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 30 ఏళ్ల పాటు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతల టెండర్‌ను రూ.7,380 కోట్లకు ఓ కంపెనీకి అప్పగించడంలో పారదర్శకత లేదంపిల్ దాఖలైంది. ఈ టెండర్‌ను ఐఆర్బీ కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కనుగుల మహేశ్‌కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రాథమిక అంచనా రాయితీ విలువ (ఇనీషియల్ ఎస్టిమేటెడ్ కన్సెషన్ వాల్యూ) ఎంత అనేది వెల్లడించకుండా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, హెచ్ఎండీఏ కలసి ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకోవడం అక్రమమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అంచనా విలువను వెల్లడించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఒప్పందం వాస్తవ పరిస్థితిని పరిశీలించేలా కాగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ ఒప్పందం విలువ తక్కువగా ఉందని కాగ్ నిర్ధారిస్తే లీజును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిధుల బదిలీ చట్టవిరుద్ధమన్న పిటిషనర్ న్యాయవాది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవా ది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ప్రాథమిక అంచనా విలువను ప్రకటించకుండానే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిలిడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌కు ఓఆర్ఆర్ను 30 ఏళ్లు అప్పగించారని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వచ్చిన రూ.7,380 కోట్లను హెచ్ఎండీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేలా ఏప్రిల్ 27న జీవో తీసుకొచ్చిందని.. ఈ జీవో హెచ్ఎండీఏ చట్టంలోని సెక్షన్ 40(1)(సీ)కి విరుద్ధమని వాదించారు. హెచ్ఎండీఏ పరిధిలోని అభివృద్ధి పనులకు మాత్రమే ఆఆదాయాన్ని వెచ్చించాల్సి ఉందని వెల్ల డించారు. ఇప్పటికే రూ.7 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు తెలిసిందని, వాటిని ఖర్చు చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. సర్కార్ వద్ద డబ్బు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కేసులో వాదనలు వినిపించడానికి సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. -
చివరి రోజూ మోకిలలో అదే ఊపు.. రూ. 716 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భూముల వేలం హెచ్ఎండీఏకు కాసులుకు కురిపిస్తోంది. మోకిలలో ప్లాట్ల ఈ-వేలానికి రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించింది. చివమోకిల హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలంలో చివరి రోజు మొత్తానికి మొత్తం 60 ప్లాట్లు మంచి రేట్లతో అమ్ముడుపోయాయి. మోకిలలో చేస్తున్న భారీ వెంచర్లో ఫేజ్–1లో 50 ప్లాట్లు, ఫేజ్–2లో 300 ప్లాట్లతో కలిపి 350 ప్లాట్లకు వేలం నిర్వహించగా వాటిలో 346 ప్లాట్లు మంచిరేట్లతో అమ్ముడయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్లను ఆన్లైన్(ఈ–ఆక్షన్)లో అమ్మకాలు నిర్వహించిన విషయం తెలిసిందే. చివరి రోజు మంగళవారం మొత్తం 60 ప్లాట్లు అమ్ముడుపోయాయి. దీంతో రెండు దశల్లో 346 ప్లాట్లకు మొత్తం రూ.716.39 కోట్ల రెవెన్యూ వచ్చింది. చదవండి: కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ!.. 29 స్థానాలకు 263 దరఖాస్తులు -
నాల్గో రోజూ మోకిలలో అదే జోరు.. గజం రూ.66 వేలు
హైదరాబాద్: మోకిల హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలానికి నాల్గో రోజు సోమవారం మంచి రేట్లతో ఆదరణ లభించింది. తొలి మూడు రోజుల్లో లేఅవుట్లో ముందు వరుసలో ఉన్న ప్లాట్లకు గజం ధర రూ.70 వేల నుంచి రూ.1,05,000 వరకు ధర పలికిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్లో ఫేజ్–1లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా, ఫేజ్–2లో 300 ప్లాట్లకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టీ.సీ. వేలం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 30 ప్లాట్లు, మధ్యాహ్నం 30ప్లాట్లు కలిపి మొత్తం 60 ప్లాట్లకు అప్సెట్ వ్యాల్యూ రూ.46.50 కోట్లు కాగా, ప్లాట్ల అమ్మకాల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.105.16 కోట్లు కావడం గమనార్హం. మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ, రెండవ రోజు రూ.131.72 కోట్లు, మూడో రోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. మోకిల హెచ్ఎండీఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ ప్లాట్ల కొనుగోలుకు ఎంతో మంది పోటీ పడుతున్నారు. -
రైతు ప్రాణం తీసిన 'హెచ్ఎండీఏ' సర్వే..
మెదక్: హెచ్ఎండీఏ అధికారులు సర్వే చేసి హద్దులు పాతారనే సమాచారం తెలిసి భూమి ఎక్కడ పోతుందోనని ఆందోళనతో ఓ రైతు గుండె ఆగిపోయింది. ఈ సంఘటన పెద్దశంకరంపేటలో గురువారం తెల్లవారుజాము చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన డాగ్గారి నారాయణ(75)కు పట్టణ శివారులో కొన్ని ఎకరాల భూమి ఉంది. ఇందులో అతడి తమ్ముడికి కూడా కలిపి 3 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. బుధవారం హెచ్ఎండీఏ అధికారులు సర్వే చేసి హద్దులు పాతారనే సమాచారం తెలియడంతో భూమి ఎక్కడ పోతుందోనని ఆందోళనతో గుండెపోటుకు గురై మృతిచెందాడని తెలిపారు. రైతుల ఆందోళన.. అధికారులు సర్వే సక్రమంగా చేపట్టకుండా తమ భూముల్లో హద్దులు పాతారాని సుమారు 70 మంది రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై తహసీల్దార్ గ్రేస్బాయి, ఎస్ఐ బాలరాజు, ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎంపీటీసీ వీణసుభాష్గౌడ్లు వారికి నచ్చజెప్పారు. రైతులు సాగు చేసుకుంటున్న అసైన్డ్, పట్టా భూముల విషయంపై ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు నివేదించి వారికి న్యాయం చేస్తామని తహసీల్దార్ రైతులకు హామీ ఇచ్చారు. విషయానికొస్తే.. పట్టణ శివారులో గత ఏడాది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కు 217 సర్వే నంబర్లో 257 ఎకరాల 18 గుంటల భూమిలో.. 85 ఎకరాల సాగుకు పనికిరాని భూమిని అభివృద్ధి కోసం రెవెన్యూ అధికారులు అప్పగించారు. ఈ విషయమై కొంతకాలంగా రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ భూమిని సర్వే చేపట్టేందుకు బుధవారం హెచ్ఎండీఏ అధికారులు జేసీబీలతో వచ్చి పలు చోట్ల హద్దులను గుర్తించి జెండాలను పాతారు. -
బుద్వేల్ భూం భూం.. ముగిసిన వేలం
Updates.. ►బుద్వేల్‌లో భూముల ఈ-వేలం ముగిసింది. మొత్తం 14 ప్లాట్లు 100.1 ఎకరాలను హెచ్ఎండీఏ విక్రయించింది. ఈ-వేలంలో రూ.3625.73 కోట్లు హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరింది. ►ఈరోజు జరిగిన వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ.41.75కోట్లు పలికింది. ► అత్యల్పంగా ఎకరం ధర రూ.33.25 కోట్లు పలికింది. ► కాసేపట్లో బుద్వేలు భూముల ఈ-వేలం ముగియనుంది. ► భూముల వేలంంలో సరాసరి రూ.33 నుంచి 35 కోట్లతో బుద్వేల్ భూములు అమ్ముడవుతున్నాయి. ► ఈ క్రమంలో ప్రభుత్వానికి దాదాపు రూ.5వేల కోట్ల భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ► రెండో సెషన్లో రెండు ప్లాట్లకు వేలం కొనసాగుతోంది. ► రెండో సెషన్లో ప్లాట్ నెంబర్-13 కోసం హోరాహోరి బిడ్డింగ్ జరుగుతోంది. ప్లాన్ నెంబర్-13లో అత్యధికంగా ఎకరం ధర రూ.40.25కోట్లు పలుకుతోంది. ► ప్లాట్ నెంబర్-13లో మొత్తంగా 6.96 ఎకరాల ల్యాండ్ ఉంది. ► బుద్వేల్ భూముల ఈ-వేలం తొలి సెషన్ ముగిసింది. తొలిసెషన్లో 1,2,4,5,8,9,10 ప్లాట్లకు వేలం జరిగింది. ► తొలి సెషన్ బుద్వేల్ భూముల వేలంలో 58.19 ఎకరాలకు మెత్తం ఆదాయం రూ.2061 కోట్లు వచ్చింది. ► అత్యధికంగా ప్లాట్ నంబర్-4లో ఎకరం ధర రూ.39.25 కోట్లు. (14.33 ఎకరాలు) ► అత్యల్పంగా ఎకరం ధర ప్లాట్ నంబర్-2,5లో ఎకరం ధర. రూ.33.25 కోట్లు (plot no 2&5 total 18.74 ఎకరాలు) ► ప్లాట్ నెంబర్-1లో ఎకరం రూ.34.50 కోట్లు. ► ప్లాట్ నెంబర్-8లో ఎకరం రూ. 35.50 కోట్లు. ► ప్లాట్ నెంబర్-9లో ఎకరం రూ. 33.75 కోట్లు. ►ప్లాట్ నెంబర్-10లో ఎకరం రూ. 35.50 కోట్లు. ► కొనసాగుతున్న బుద్వేల్ భూముల వేలం ► రెండో సెషన్ వేలం ప్రారంభం ► రెండో సెషన్లో 11, 12,13,14,15, 16,17 ప్లాట్ల వేలం జరుగనుంది. ► మొదటి సెషన్లో ఇంకా కొన్ని ప్లాట్లకు కొనసాగుతున్న వేలం. ► మొదటి సెషన్లో సరాసరి ఎకరం 25 కోట్లు దాటి నడుస్తున్న వేలం ► అత్యధికంగా 5వ నెంబరు ప్లాట్లోలో ఎకరం 32 కోట్లు దాటిన ధర. ► ప్లాట్ నంబర్-1.. ఎకరం రూ. 33.25 కోట్లు ► ప్లాట్ నంబర్-4.. ఎకరం రూ. 33.25 కోట్లు. తొలి సెషన్లో ఇలా.. ప్లాట్ నెంబర్-9లో ఎకరం 22.75కోట్లు ప్లాట్ నెంబర్ -10లో ఎకరం 23 కోట్లు. ప్లాట్ నెంబర్-7లో ఎకరం 27కోట్లు. ప్లాట్ నెంబర్-8లో ఎకరాకు 28 కోట్లు పలికింది. ► కోకాపేట తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా అత్యంత విలువైన బుద్వేల్ భూముల వేలానికి ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. ఈ క్రమంలో వేలం కొనసాగుతోంది. కాగా, అత్యధికంగా 4వ నెంబర్‌కు 31 కోట్లు, 5వ నెంబరు ప్లాట్‌లో ఎకరం రూ.30 కోట్లు దాటి ధర పలికింది. ఇక పదో నెంబర్ ప్లాట్‌కి 23 కోట్లతో వేలం కంటిన్యూ అవుతోంది. ► ఇక, వేలం ప్రారంభం నుంచి ఈ-వేలం మందకోడిగా సాగుతోంది. వేలం ప్రారంభమై రెండు గంటలు దాటినా ధరలు మాత్రం పెద్దగా పలకడం లేదు. కాగా, సెషల్ ముగిసే సమయానికి ధరలు జోరందుకున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి వేలం జోరందుకుంది. ఈ-వేలంలో ప్లాట్ నెంబర్ 9, 10లకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. సరాసరి ఎకరం రూ. 25 కోట్లు దాటి వేలం నడుస్తోంది. కాగా, కనీస నిర్దేశిత ధర ఎకరం రూ.20 కోట్ల రూపాయలతో వేలం ప్రారంభమైన విషయం తెలిసిందే. ► ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) రాజేంద్రనగర్ సమీపంలో బుద్వేల్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దాదాపు 182 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న బుద్వేల్ లే అవుట్ ప్లాట్ల అమ్మకంలో భాగంగా గురువారం ఈ వేలం ప్రక్రియను ప్రారంభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన ఫస్ట్ సెషన్ వేలంలో ప్లాట్ నెం.1,2,4,5,8,9,10 లకు బిడ్డర్, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటాపోటీగా బిడ్లను సమర్పిస్తున్నారు. ► మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు రెండో సెషన్‌గా నిర్వహించే వేలంలో మరో ఏడు ప్లాట్లకు వేలం జరగనుంది. ఇక్కడి లే అవుట్ లో ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు, గరిష్టంగా 14.3 ఎకరాలుగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వివరించారు. ఒక్కో ఎకరానికి మినిమమ్ అప్ సేట్ రేటుగా రూ. 20 కోట్లుగా నిర్ణయించి, ఈ ఆక్షన్ నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత.. స్లోగన్స్‌తో దద్దరిల్లుతున్న పరిసరాలు -
బుద్వేల్ భూముల వేలంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: బుద్వేల్ భూముల అంశంలో హెచ్ఎండీఏ వేలాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. భూముల వేలంపై స్టే ఇవ్వాలని కోర్టుని కోరింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. దీనిపై స్పందిస్తూ.. బార్ అసోసియేషనల్లో విభేదాలు ఉన్నాయని, అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా బుద్వేల్ లోని ప్రభుత్వ భూములను గతంలో హైకోర్టు కోసం కేటాయిస్తామన్న వాదనతో బార్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లింది. దీంతో బుద్వేల్ భూముల వేలంపై న్యాయవాదుల సంఘం కోర్టుని ఆశ్రయించింది. రంగారెడ్డి బుద్వేల్లోని 100 ఎకరాలకు హెచ్ఎండీఏ ఈ వేలం వేసేందుకు సిద్ధమైంది. 100 ఎకరాల్లో 14 ప్లాట్‌కు ఆన్లైన్ వేలం జరపాలని నిర్ణయించింది. ఈ భూమూలను దక్కించుకోవాలని రియల్ ఎస్టేట్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. దీని ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. చదవండి: హవ్వ.. చెట్లను కొట్టేసి మొక్కలు నాటుతారట? -
కాసులు కురిపించిన మోకిలా.. ప్లాట్లకు మూడు రెట్ల ధర.. గజం రూ.1,05,000
సాక్షి, హైదరాబాద్: మోకిలాలోని హెచ్ఎండీఏ ప్లాట్లకు సోమవారం నిర్వహించిన ఆన్లైన్ వేలానికి అనూహ్యమైన స్పందన లభించింది. చదరపు గజం అత్యధికంగా రూ.1,05,000, కనిష్టంగా రూ.72,000 చొప్పున ధర పలికింది. సగటున రూ.80,397 చొప్పున ఆన్లైన్ బిడ్డింగ్‌లో విక్రయించినట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మొత్తం 50 ప్లాట్లపైన హెచ్ఎండీఏకు రూ.121.40 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ప్లాట్లకు చదరపు గజానికి రూ.25 వేల చొప్పున కనీసధర నిర్ణయించగా, దానికి మూడురెట్లు వేలంలో డిమాండ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. నార్సింగి–శంకర్పల్లి మార్గంలో ఉన్న మోకిలాలో భూములు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం విశేషం. హెచ్ఎండీఏకు ఇక్కడ 165 ఎకరాల భూమి ఉంది. వీటిలో 15,800 చదరపు గజాల్లో విస్తరించి ఉన్న 50 ప్లాట్లకు సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా అధికారులు వేలం నిర్వహించారు. ఒక్కో ప్లాట్ 300 గజాల నుంచి 500 గజాల వరకు ఉంది. ఇటీవల కోకాపేటలో నియోపోలీస్ రెండో దశ భూముల తరహాలోనే మోకిలాలోనూ హెచ్ఎండీఏ ప్లాట్లకు భారీ డిమాండ్ రావడం గమనార్హం. ఈ లే అవుట్లో త్వరలో రెండోదశ ప్లాట్లకు కూడా ఆన్లైన్ వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. చదవండి: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు -
Rs 100 Crore Per Acre In Kokapet: కోకాపేటలో ఎకరం 100 కోట్లు.. ఏముందక్కడ? ఎందుకంత స్పెషల్? (ఫోటోలు)
-
Hyderabad: కోకాపేట ‘కనకమే’.. ఎకరం రూ.100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ఎకరం భూమి అంటే వేలల్లో.. ఆనక లక్షకో, రెండు లక్షలకో వచ్చేది. ఇప్పుడు రాష్ట్రంలో మారుమూల కూడా ఇరవై, ముప్పై లక్షలు లేకుంటే భూమివైపు చూసే పరిస్థితి లేదు. హైదరాబాద్‌లో, చుట్టుపక్కల అయితే కోట్లు పెట్టినా స్థలం దొరకడం కష్టమే. ఇప్పుడు కోకాపేటలో భూముల ధరలు అలాంటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశాయి. నియోపోలిస్ లేఅవుట్లో ఎకరానికి ఏకంగా రూ.100.75 కోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది. హెచ్ఎండీఏ ఇదే లేఅవుట్లో ఇంతకుముందు నిర్వహించిన వేలంలో ఎకరానికి గరిష్టంగా రూ.60 కోట్ల రేటు పలకగా.. గురువారం నాటి రెండోదశ దాన్ని మించిపోయింది. రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థల నుంచి అనూహ్య పోటీ కనిపించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇదే అత్యధికమని ఆ రంగానికి చెందిన నిపుణులు చెప్తున్నారు. ఎకరానికి రూ.వంద కోట్లకుపైగా ధర పలకడంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా హైదరాబాద్ చర్చనీయాంశమైందని అంటున్నారు. రెండు విడతలుగా బిడ్డింగ్.. నియోపోలిస్‌లో 7 ప్లాట్లలోని భూములకు గురువారం ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించారు. హెచ్ఎండీఏ అన్ని ప్లాట్లలో భూములకు ఎకరానికి రూ.35 కోట్ల కనీస ధరను నిర్ణయించింది. ఆన్లైన్ బిడ్డింగ్‌లో తొలి నుంచీ ఉత్కంఠభరిత పోటీ కనిపించింది. కనిష్టంగా ఎకరానికి రూ.67.25 కోట్ల నుంచి గరిష్టంగా రూ.100.75 కోట్ల వరకు ధర పలికింది. సగటున ఎకరానికి రూ.73.23 కోట్ల చొప్పున లభించినట్టు హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించారు. గురువారం మొత్తం 45.33 ఎకరాల భూములకు వేలం నిర్వహించగా రూ.3,319.60 కోట్ల ఆదాయం లభించినట్టు తెలిపారు. హెచ్ఎండీఏ ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన భూముల వేలంపై వచ్చిన ఆదాయం కంటే ఇదే ఎక్కువని వివరించారు. ప్రత్యేక అనుమతులతో డిమాండ్ హైదరాబాద్ నగరానికి పడమటి వైపు ఉన్న కోకాపేట్ అంతర్జాతీయ హంగులతో దేశవిదేశాలకు చెందిన వ్యాపార సంస్థలను ఆకట్టుకుంటోంది. ఇక్కడ భవన నిర్మాణాలకు సంబంధించి అంతస్తులపై పరిమితి లేదు. అపరిమితంగా అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఉండటం.. గృహ, వాణిజ్యం, వ్యాపారం వంటి అన్నిరకాల వినియోగానికి అనుమతి ఉండటం.. రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థలు కోకాపేట్పై దృష్టి సారించడానికి కారణమైంది. ఒకవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు, మరోవైపు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నిర్మించతలపెట్టిన మెట్రో రైల్‌కు నియోపోలిస్ లేఅవుట్ అందుబాటులో ఉండటం మరింత డిమాండ్ పెంచింది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సొసైటీతోపాటు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఫార్చూన్ 500 కంపెనీలు కూడా నియోపోలిస్ లేఅవుట్‌కు చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలతో.. హెచ్ఎండీఏ నియోపోలిస్ లేఅవుట్‌ను సుమారు రూ.300 కోట్లతో భారీ స్థాయిలో, ఉత్తమ మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసింది. విశాలమైన రహదారులు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలను కల్పించింది. ఇక్కడ తొలిదశలో ఒకటి నుంచి ఐదో ప్లాట్ వరకు మొత్తంగా 64 ఎకరాలను విక్రయించారు. ప్రస్తుతం 6, 7, 8, 9, 10, 11, 14వ నంబర్ ప్లాట్లలోని 45.33 ఎకరాలను వేలం వేశారు. ఈ ప్లాట్లు కనిష్టంగా 3.60 ఎకరాల నుంచి గరిష్టంగా 9.71 ఎకరాల వరకు ఉన్నాయి. నియోపోలిస్ లేఅవుట్ విశేషాలివీ.. ► నియోపోలిస్ లేఅవుట్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ రూ.300 కోట్లు ఖర్చు చేసింది. సుమారు 40 ఎకరాల భూమిని అన్నిరకాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకోసమే వినియోగించడం గమనార్హం. ► సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు, ఇతర సదుపాయాలతో 45 మీటర్లు, 36 మీటర్ల వెడల్పున్న అంతర్గత రోడ్లను నిర్మించారు. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తు, ఇతర సదుపాయాలను సమకూర్చారు. ఇక్కడ కమర్షియల్, రెసిడెన్షియల్, ఎంటర్టైన్మెంట్ తదితర అన్నిరకాల వినియోగానికి ముందస్తు అనుమతులు ఇచ్చారు. ► నియోపోలిస్‌లో ఎన్ని అంతస్తుల వరకైనా హైరైజ్ బిల్డింగ్‌లను నిర్మించేందుకు అనుమతి ఉంటుంది. ► ఔటర్ రింగ్‌రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 5 నిమిషాలు, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాలు, హైటెక్‌సిటీకి 20 నిమిషాల వ్యవధిలో చేరుకొనేలా రోడ్డు నెట్వర్క్ అందుబాటులో ఉంది. ప్లాట్ నంబర్–10కు ఎందుకంత క్రేజ్ హెచ్ఎండీఏ గురువారం మొత్తం ఏడు ప్లాట్లను వేలం వేసినా.. అందులో 10వ నంబర్ ప్లాట్‌కు మాత్రం బాగా డిమాండ్ వచ్చింది. 3.60 ఎకరాల విస్తీర్ణమున్న ఈ ప్లాట్‌ను హ్యాపీ హైట్స్ నియోపొలిస్, రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థలు కలసి ఏకంగా ఎకరానికి రూ.100.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. ఈ ప్లాట్ మిగతా ప్లాట్ల కంటే ఎత్తులో ఉంటుంది. దీనికి వెనక వైపు నుంచి గండిపేట చెరువు, ముందు నుంచి హైదరాబాద్ నగరం వ్యూ స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్లే ఈ ప్లాట్‌కు పోటాపోటీ వేలం జరిగిందని ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్లాట్‌ను ఆనుకొని ఉన్న 11వ నంబర్ ప్లాట్‌లో 7.53 ఎకరాల స్థలం ఉంది. దీన్ని ఎకరం రూ.67.25 కోట్ల ధరతో ఏపీఆర్ గ్రూప్ సొంతం చేసుకుంది. పక్కపక్కనే ఉన్న రెండు ప్లాట్ల మధ్య ఎకరానికి రూ.33.5 కోట్ల తేడా ఉండటం గమనార్హం. ప్లాట్–10 స్థలంలో రెండు హైరైజ్ టవర్లను నిర్మించేందుకు రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయాలు వచ్చే అవకాశం ఉంది. ఇదేకాదు.. ప్రస్తుతం కోకాపేటలో నిర్మితమవుతున్న భవనాల్లో చాలా వరకు ఆకాశ హరŠామ్యలేనని.. ఈ ప్రాంతం మినీ షాంఘైగా మారనుందని రియల్ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. -
ఎకరానికి వంద కోట్లు.. కోకాపేట వేలంలో ఆల్‌టైం రికార్డు!
సాక్షి, హైదరాబాద్: నిధుల సమీకరణలో భాగంగా గండిపేట మండలం కోకాపేటలో హెచ్ఎండీఏ చేపట్టిన భూముల అమ్మక ప్రక్రియ సంచలనాలకు నెలవైంది. కోకాపేట నియోపోలీస్ లే అవుట్ భూముల ధరలు అంచనాలకు మించి పలికాయి. అత్యధిక ధరతో ఆల్ టైం రికార్డు నెలకొల్పడమే కాకుండా.. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక రేటుకి భూమి అమ్ముడుపోయిన రికార్డూ నెలకొన్నట్లు తెలుస్తోంది. కోకాపేట భూముల్లోని నియోపోలీస్ లే అవుట్‌లోని 6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు గురువారం వేలం వేసింది హెచ్ఎండీఏ. ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాలు ఉండగా.. ఎకరాకి రూ. 100.75 కోట్లు వేలంలో పలికింది. ఈ ఒక్క ప్లాట్‌తోనే రూ.360 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక భూమి రేటుగా భావిస్తున్నారు. అత్యల్పంగా ఎకరానికి రూ.67.25 కోట్లు వచ్చాయి. ఈ ప్లాట్లలోని భూముల్లో ఎకరానికి.. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర రూ. 35 కోట్లుగా ఉంది. అయితే.. కోటాపేట భూముల్లో.. గజం ధర సరాసరి రూ.1.5 లక్షలు పలికింది. మొత్తంగా 45 ఎకరాల్లో(45.33 ఎకరాలు) ఉన్న ఏడు ప్లాట్లతో రూ.2,500 కోట్ల వరకు సమీకరించుకోవాలనుకుంది హెచ్ఎండీఏ. కానీ, సగటున రూ.73.23 కోట్లతో మొత్తంగా రూ.3,319 కోట్లు సమీకరించుకోగలిగింది. -
మూసీపై వంతెనలు!
హైదరాబాద్: మూసీ నదిపై ఇక రయ్‌మంటూ వాహనాలు పరుగులు తీయనున్నాయి. ట్రాఫిక్ చిక్కులకు చక్కటి పరిష్కారం లభించనుంది. నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలకు ఆటంకంగా ఉన్న మూసీ నదిపైన వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూసీ, ఈసీ నదులపైన మొత్తం 14 చోట్ల బ్రిడ్జిలను నిర్మించనున్నారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ వంతెనల నిర్మాణంలో భాగంగా 9 చోట్ల హెచ్ఆర్డీసీఎల్, జీహెచ్ఎంసీ, కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కూడా) సంస్థలు పనులు చేపట్టనుండగా, మరో 5 ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఈ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనుంది. ఇందుకోసం తాజాగా ఆసక్తి గల నిర్మాణ సంస్థల నుంచి టెండర్లను సైతం ఆహ్వానించింది. హైదరాబాద్ మహానగరం అన్ని వైపులా అనూహ్యంగా విస్తరిస్తోంది. అందుకనుగుణంగా రోడ్డు నెట్వర్క్ విస్తరణకు నోచకపోవడంతో అనేక చోట్ల వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఇరుకై న రహదారులు ఆటంకంగా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రహదారుల విస్తరణ, వివిధ ప్రాంతాల మధ్య రోడ్ నెట్వర్క్ అభివృద్ధిపైన సీరియస్‌గా దృష్టి సారించింది. ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఈజీగా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల విస్తరణ చేపట్టింది. హెచ్ఆర్డీసీఎల్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లింక్‌రోడ్లను అభివృద్ధి చేసింది. ప్రధాన రహదారులను కలిపే ఈ లింక్ రోడ్ల వల్ల వందలాది కాలనీలు దగ్గరయ్యాయి. ఇదే క్రమంలో మూసీపైన 14 చోట్ల బ్రిడ్జిల నిర్మించడం ద్వారా నిరాటంకమైన రోడ్డు నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు.. పడమటి వైపున నార్సింగి నుంచి ఇటు తూర్పు వైపున గౌరెల్లి వరకు సుమారు 48 కిలోమీటర్ల మార్గంలో మూసీ ప్రవహిస్తోంది. ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆ చివరి నుంచి ఈ చివర వరకు మూసీ పరవళ్లు తొక్కుతోంది. పాత ఎంసీహెచ్ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) పరిధిలో ప్రజలు మూసీ నది ఉత్తరం నుంచి దక్షిణం వరకు వెళ్లేందుకు అవసరమైన చోట్ల వంతెనలు అందుబాటులో ఉన్నాయి. ఇంచుమించు ప్రతి 2 నుంచి 3 కిలోమీటర్లకు ఒకటి చొప్పున వంతెనల నిర్మాణం చేపట్టారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం ఔటర్‌ను దాటుకొని విస్తరించింది. దీంతో నగర శివారు ప్రాంతాల్లో మూసీకి ఉత్తర, దక్షిణ మార్గాల్లో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కోచోట కనీసం 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు అదనంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. సమగ్ర ట్రాఫిక్ అధ్యయనం(సీటీఎస్) ప్రకారం మూసీ నదిని దాటే ప్రయాణికుల సంఖ్య 2031 నాటికి 36 లక్షల ట్రిప్పుల నుంచి 60 లక్షల ట్రిప్పులకు పెరుగనున్నట్లు అంచనా. శివార్ల వైపు నగరం శరవేగంగా విస్తరిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తేలిగ్గా రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రస్తుతం కోర్ సిటీలో ఉన్నట్లుగానే కనీసం ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున వంతెనలు అందుబాటులో ఉండేవిధంగా సుమారు రూ.545 కోట్ల అంచనాలతో 14 చోట్ల నిర్మించనున్నారు.ఒక్కోటి 200 మీటర్ల చొప్పున ఉంటుంది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఐదు వంతెనలు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మూసీ, ఈసీ నదుల పైన ఐదు చోట్ల వంతెనల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు. ఆసక్తిగల నిర్మాణ సంస్థలు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ దరఖాస్తులను అందజేయవచ్చు. ఈ ప్రాజెక్టుపైన ఈ నెల 18వ తేదీన హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగంలో ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పడమటి వైపు మంచిరేవుల వద్ద ఒకటి, బుద్వేల్ వద్ద రెండు వంతెనలతో పాటు ఇటు తూర్పు వైపున ఉప్పల్ భగాయత్‌లో ఒకటి, ప్రతాప్‌సింగారం వద్ద మరొకటి చొప్పున మొత్తం 5 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఐదు వంతెనల నిర్మాణానికి రూ.130 కోట్ల వరకు నిర్మాణ వ్యయంగా అంచనా వేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఔటర్ నిర్వహణకు ‘గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే’.. 30ఏళ్ల పాటు టోల్ వసూలు, ఇంకా
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లీజు వ్యవహారంలో ముందడుగు పడింది. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటైంది. లీజు ఒప్పందంలో భాగంగా ‘ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే’ను ఎస్పీవీగా ఏర్పాటు చేశారు. ఇది ఐఆర్బీ ఇన్ఫ్రా తరఫున ప్రాతినిధ్య సంస్థగా ఉంటుంది. ఈ మేరకు ఈ నెల 28న హెచ్ఎండీఏతో కుదుర్చుకున్న లీజు ఒప్పందంపై ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే సంతకాలు చేసింది. ఇక నిర్ణీత 120 రోజుల గడువులోపు లీజు మొత్తం రూ.7,380 కోట్లను చెల్లించి ఔటర్ నిర్వహణ బాధ్యతలను చేపడతామని ఐఆర్బీ ఇన్ఫ్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీరేంద్ర డి.మహిష్కర్ తెలిపారు. ఔటర్ ప్రాజెక్టును తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు చెప్పారు. నిర్వహణ అంతా ‘గోల్కొండ’దే.. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కు అనుబంధంగా ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఔటర్ రింగ్‌రోడ్డు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. ఐఆర్బీ ఇన్ఫ్రాతో కుదిరిన లీజు ఒప్పందం మేరకు వచ్చే 30ఏళ్ల పాటు ‘ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే’ సంస్థ.. ఓఆర్ఆర్పై వాహనాల నుంచి టోల్ వసూలు చేయడం, రహదారుల నిర్వహణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, ఇతర ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) బాధ్యతలను చేపట్టనుంది. హెచ్‌జీసీఎల్ ఇక ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్లు, ఔటర్ మాస్టర్‌ప్లాన్ అమలు, పచ్చదనం పరిరక్షణ వంటి బాధ్యతలకు పరిమితం కానుంది. టోల్ రుసుముపై హెచ్ఎండీఏ పర్యవేక్షణ 2006లో హైదరాబాద్ మహానగరం చుట్టూ 8 లేన్లతో ఔటర్‌రింగ్‌రోడ్డును నిర్మించారు. 2018 నాటికి ఇది పూర్తయింది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) 2008లో విధించిన నిబంధనల మేరకు ఇప్పటివరకు టోల్ రుసుమును వసూలు చేస్తున్నారు. భవిష్యత్తులోనూ టోల్ రుసుము పెంపుపై హెచ్ఎండీఏ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఏకమొత్తంగా రూ.7,380 కోట్ల చెల్లింపు! ‘టోల్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (టీఓటీ) విధానంలో ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు గతేడాది ఆగస్టు 11న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సంవత్సరం నవంబర్ 9న అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 11 బిడ్లు వచ్చాయి. ఇందులో చివరికి 4 సంస్థలు తుది అర్హత సాధించగా.. ఐఆర్బీ ఇన్ఫ్రాకు టెండర్ దక్కింది. ఒప్పందం మేరకు లీజు మొత్తం రూ.7,380 కోట్లను ఐఆర్బీ సంస్థ ఒకేసారి చెల్లిస్తుందని, ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని హెచ్ఎండీఏ అధికారి ఒకరు చెప్పారు. ఒప్పందంలోని నిబంధనలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామని.. మొత్తం నిధులు చెల్లించాకే ఔటర్ బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు. -
48 గంటల్లో రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)ను టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతి (టీఓటీ)లో లీజుకివ్వడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆయనకు శుక్రవారం హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు పంపింది. ఈ వ్యవహారంలో హెచ్ఎండీఏతో పాటు అధికారులపై రేవంత్‌రెడ్డి తప్పు డు, నిరాధార, ధ్రువీకరించలేని ఆరోపణలు చేస్తున్నారని, వెంటనే తన ఆరోపణలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, లేదంటే తాము తీసుకోబోయే న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ లీగల్ నోటీసులో పేర్కొంది. కాగా, హెచ్ఎండీఏ నోటీసులపై తాను న్యాయపరంగానే పోరాడుతానని రేవంత్ చెప్పారు. -
GO 111: మాస్టర్‌ప్లాన్ ఇప్పట్లో లేనట్టే!
హైదరాబాద్: జీఓ 111 పరిధిలో ఎలాంటి మాస్టర్‌ప్లాన్ లేకుండానే భూ వినియోగ మార్పిడికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగానే అనుమతులను ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 111 జీఓ పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించే అవకాశం లేదు. ప్రస్తుతం బయో కన్జర్వేషన్ జోన్‌లోని భూములను చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ (సీఎల్‌యూ) కింద వివిధ రకాలుగా వినియోగంలోకి అనుమతులను ఇస్తారు. ప్రభుత్వ అనుమతితో భూ యజమానులు తమ భూమిని పారిశ్రామిక, నివాస, వాణిజ్య, వ్యాపార అవసరాల కోసం మార్చుకోవచ్చు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోని వ్యవసాయ భూములను, నాలా భూములను ప్రత్యేక కమిటీ ద్వారా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ద్వారా నివాసయోగ్యమైన స్థలాలుగా మార్పు చేస్తున్నట్లుగానే జీఓ 111 పరిధిలోని బయో కన్జర్వేషన్ భూములను కూడా మార్చుకొనేందుకు సదుపాయం ఉంటుందని ఒక అధికారి వివరించారు. ప్రస్తుతం జంట జలాశయాలకు 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలను అనుమతించడం లేదు. బఫర్ జోన్ పరిధిని ఎంత వరకు అనుమతించాలనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. ముంచుకొస్తున్న ఎన్నికలు.. ► మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్ల ఆహ్వానించడం మొదలుకొని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేవరకు కనీసం18 నెలల సమ యం పడుతుంది. ఈ ప్రక్రియలో ఏ మాత్రం జాప్యం జరిగినా 2 సంవత్సరాలు కూడా దాటవచ్చు. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు తరుముకొస్తున్న దృష్ట్యా ఎలాంటి మాస్టర్ ప్లాన్ లేకుండానే భూముల బదలాయింపునకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన జీఓ 168 ప్రకారం సీఎల్‌యూ అందజేయనున్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో హెచ్ఎండీఏ కమిషనర్ తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ ఆమోదంతో భూమిని మార్పు చేస్తారు. ► మరోవైపు జీఓ 111 పరిధిలోని శంషాబాద్, మెయినాబాద్, గండిపేట, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, కొత్తూరు మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో ఉన్న 1.32 లక్షల ఎకరాల భూములలో ఇప్పటికే సుమారు 70 శాతం భూములు సినీ, రాజకీయ, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఆయా వర్గా లకు చెందిన భూయజమానులు తమ అవసరాలకు అనుగుణంగా సీఎల్‌యూ తీసుకొనే అవ కాశం ఉంది. భూ వినియోగ మార్పిడికి అనుమ తిచ్చే క్రమంలో జల వనరులు, అడవులు, కొండలు, గుట్టలు, నాలాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని వెసులుబాటు కల్పించనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎన్నికల తర్వాతే ఒకే నగరం–ఒకే ప్రణాళిక.. ● ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం మొత్తం 5 మాస్టర్ప్లాన్లతో కూడి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్), సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ), హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఏడీఏ), ఓఆర్ఆర్ మాస్టర్ప్లాన్లతో పాటు 2013లో హెచ్ఎండీఏ రూపొందించిన 2030–31 మాస్టర్ ప్లాన్ కూడా అమల్లో ఉంది. ఈ అయిదు ప్రణాళికల మధ్య సమన్వయం లేకపోవడంతో అనేక రకాలుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ● అన్నింటిని కలిసి ఒకే బృహత్తర ప్రణాళికను రూపొందించేందుకు ప్రభుత్వం గతంలోనే కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలోనే గతేడాది జీఓ 111 తొలగించనున్నట్లు ప్రకటించిన అనంతరం ‘ఒకే నగరం–ఒకే ప్రణాళిక’ లక్ష్యంతో బృహత్తర ప్రణాళిక కోసం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ ఒకసారి సమావేశమైంది. కానీ ముందుకు వెళ్లలేదు. ఒకే నగరం – ఒకే ప్రణాళిక లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కోసం చర్యలు చేపట్టింది. ఎన్నికల తర్వాత ఈ ప్రతిపాదనను తిరిగి ముందుకు తెచ్చే అవకాశం ఉంది. -
మెడికో ప్రీతి సోదరికి హెచ్ఎండీఏలో ఉద్యోగం
సాక్షి, హైదరాబాద్: సీనియర్ వేధింపులు భరించలేక పాయిజన్ ఇంజెక్షన్‌తో ఆత్మహత్య చేసుకున్న కేఎంసీ మెడికో ప్రీతి ఉదంతం అందరికీ తెలిసిందే. అయితే ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రీతి సోదరికి ఇప్పుడు ఉద్యోగం ఇప్పించింది తెలంగాణ ప్రభుత్వం. డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ సోదరి పూజకు hmda(హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ)లో సపోర్ట్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూజకు ఐటీ సెల్లో కాంట్రాక్ట్ బేసిస్‌లో ఈ ఉద్యోగం ఇచ్చినట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది హెచ్ఎండీఏ. ఈ సందర్భంగా.. ప్రభుత్వం తరపున ఇచ్చిన మాట నిలుపుకున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని నాడు చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పరిహారంతో పాటు పార్టీ తరపున సేకరించిన విరాళాలను కలిపి ప్రీతి కుటుంబానికి అందించాం. అదే సమయంలో తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించమని వాళ్లు కోరారు. ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. సానుకూలంగా స్పందించిన ఆయన.. ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తన పరిధిలోని హెచ్ఎండీఏలో ప్రీతి సోదరికి ఉద్యోగం ఇప్పించారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. -
సర్కారీ ఆస్తుల అమ్మకాలకు హెచ్ఎండీఏ రెడీ.. రూ.5 వేల కోట్లకు ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సర్కారీ ఆస్తుల అమ్మకాలకు హెచ్ఎండీఏ మరోసారి సన్నాహాలు చేపట్టింది. సుమారు రూ.5 వేల కోట్లు సమకూర్చుకోవడమే లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లోని స్థలాలు, ఫ్లాట్లను విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఎయిర్‌పోర్టు మార్గంలో ఉన్న బుద్వేల్‌లో భారీ లేఅవుట్ పనులు వేగంగా కొనసాగుతుండగా.. కోకాపేటలో రెండో దశ, ఉప్పల్ భగాయత్‌లో మూడో దశ ఆన్లైన్ బిడ్డింగ్‌కు కార్యాచరణ చేపట్టింది. మరోవైపు పోచారంలో ఏడంతస్తుల చొప్పున ఉన్న రెండు రాజీవ్ స్వగృహ టవర్లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రెండు టవర్లలో కలిపి 142 ఫ్లాట్లు ఉన్నాయి. అందరిచూపు బుద్వేల్ వైపే.. ఐటీ సంస్థలు మొదలుకొని మధ్యతరగతి వరకు ఇప్పుడు అందరిచూపు బుద్వేల్ వైపు పడింది. విమానాశ్రయం మార్గంలో ఉండటంతో సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా బుద్వేల్ హెచ్ఎండీఏ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ సుమారు 182 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రీన్‌ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అధికారులు రూ.200 కోట్లతో పనులు ప్రారంభించారు. ఒక్కో ప్లాట్ విస్తీర్ణం 6.13 ఎకరాల నుంచి 14.58 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. తొలివిడత ఇక్కడ 50 ఎకరాల్లో విక్రయాలు చేపట్టనున్నారు. బహుళ ప్రయోజనాల జోన్‌గా ఈ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అంటే కార్యాలయ సముదాయాలు, నివాసాలు, రిటైల్, ఎంటర్టైన్మెంట్, హెల్త్‌కేర్ వంటివి అభివృద్ధి చెందడానికి ఆస్కారముంది. వేలం ద్వారా ప్లాట్లను కొనుగోలు చేసేవారికి మూడు వారాల్లో నిర్మాణ అనుమతులన్నీ మంజూరు చేయనున్నారు. ఈ భూముల విక్రయాల ద్వారా కనీసం రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. కోకాపేటలో 64 ఎకరాలకు.. కోకాపేట నియో పోలీస్ లేఅవుట్లో రెండో దశ ప్లాట్ల విక్రయానికి అధికారులు సన్నాహాలు చేపట్టారు. 2021 జూలైలో నిర్వహించిన మొదటి దశ వేలంలో సుమారు 49 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 8 ప్లాట్లను విక్రయించారు. ఎకరానికి రూ.25 కోట్ల చొప్పున కనీస ధర నిర్ణయించినా.. అనూహ్యమైన పోటీతో ఎకరానికి కనిష్టంగా రూ.40.05 కోట్ల నుంచి గరిష్టంగా రూ.60 కోట్ల వరకు ధర పలికింది. ఇప్పుడు కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలోనే 64 ఎకరాలను విక్రయించనున్నారు. రూ.2,500 కోట్లకుపైగా రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఉప్పల్ భగాయత్‌లో మూడో దశ.. ఉప్పల్ భగాయత్‌లో ఇప్పటికే రెండుసార్లు హెచ్ఎండీఏ ప్లాట్లను విక్రయించారు. మెట్రోస్టేషన్‌కు అందుబాటులో ఉన్న ఈ స్థలాలకు బాగా డిమాండ్ ఉంది. ఇక్కడ మొత్తం 450 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. మొదటి, రెండో దశలో ప్లాట్లను కొనుగోలు చేసినవారు పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు చేపట్టారు. 2021 డిసెంబర్లో జరిగిన వేలంలో చదరపు గజానికి కనిష్టంగా రూ.75 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు పలికింది. ప్రస్తుతం మూడో దశలో 40 ఎకరాలను విక్రయిస్తామని, రూ.650 కోట్లకు పైగా రావచ్చని అధికారులు చెప్తున్నారు. ఇది కూడా చదవండి: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు -
ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు
హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల లాంగ్ లీజుకు ఇవ్వడానికి 'హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ' (HMDA) ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే ఈ కాంట్రాక్టును కైవసం చేసుకునేందుకు నాలుగు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీని కోసం బిడ్డింగ్ సుమారు రూ. 8,000 కోట్లు వరకు ఉంటుంది. ఈ రేసులో ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్, దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, గవార్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కంపెనీలు తమ బిడ్లను ఇప్పటికే హెచ్ఎండీఏకి సమర్పించాయి. ఈ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎల్‌అండ్‌టి, క్యూబ్ హైవేస్ వంటి సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం, కానీ బిడ్లలో ఈ సంస్థలు పాల్గొనలేదు. బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి టోలింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్, ట్రాన్స్పోర్ట్ కోసం హెచ్ఎండీఏ టెండర్లను పిలిచింది. ఇందులో ఎక్కువ సంస్థలు పాల్గొనటానికి గడువు కూడా రెండు రోజులు పొడిగించింది. కొంతమంది వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ప్రీ-బిడ్ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే టెక్నీకల్ కమిటీ మంగళవారం నుంచి టెక్నికల్ బిడ్లను మూల్యాంకనం (Evaluating) చేయడం ప్రారంభించింది. త్వరలోనే ఫైనాన్సియల్ బిడ్ ప్రారంభమవుతుంది. దీనికోసం పోటీ గట్టిగానే ఉంటుందని భావిస్తున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి & ఓఆర్ఆర్ టోల్ డిమాండ్‌పై ఉన్న సందేహాల వల్ల ఇప్పటికి కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే బిడ్డింగ్‌లో పాల్గొనటానికి ఆసక్తి చూపాయి. అయితే ఈ బీడ్ సొంతం చేసుకునే కంపెనీ నాలుగు నెలల్లో మొత్తం డబ్బుని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. బిడ్లలో అవసరమైన మొత్తం రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రీ-టెండర్ ప్రకటించే అవకాశం ఉంటుందని కొందరు హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి హెచ్ఎండీఏ ఈగిల్ ఇన్ఫ్రా సంస్థ నుంచి టోల్ ఫీజు సంవత్సరానికి రూ. 415 కోట్లు వసూలు చేస్తోంది. ఓఆర్ఆర్ ని టోల్ ఆపరేట్ ట్రాన్స్పర్పై 30 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నట్లయితే, బిడ్డర్ నుంచి మొత్తం డబ్బుని పొందుతుంది. అయితే ORRని నిర్వహించడానికి హెచ్ఎండీఏపై ఎటువంటి భారం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తమ రోడ్లు, ఇతర ఎక్స్‌ప్రెస్‌వేల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా లాంగ్ లీజుపై 'టోల్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్' (TOT)ని స్వీకరించింది. -
కోకాపేట్ తరహాలో.. మరో భారీ వెంచర్‌కు హెచ్ఎండీఏ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: మరో భారీ వెంచర్‌కు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో, ఎయిర్‌పోర్టు మెట్రో మార్గానికి దగ్గరలో రాజేంద్రనగర్ బుద్వేల్ వద్ద సుమారు 200 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. మధ్యతగతి, ఉన్నత ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ఈ లేఅవుట్ అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ రెండు రోజుల క్రితం టెండర్లను సైతం ఆహ్వానించింది. 200 ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలతో పాటు విల్లాల కోసం 2 నుంచి 3 ఎకరాల ప్లాట్లు, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకొని 500 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల ప్లాట్ల చొప్పున ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు కార్యాచరణ సిద్థం చేశారు. రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ వరకు నగరానికి దక్షిణం వైపు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న దృష్ట్యా ఈ లేఅవుట్‌కు భారీ డిమాండ్ ఉండే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లేఅవుట్ ఔటర్ రింగురోడ్డుకు దగ్గర్లో ఉండడం, రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మించనున్న ఎయిర్‌పోర్టు మెట్రో మార్గానికి చేరువలో ఉండడంతో బుద్వేల్ లేఅవుట్ హాట్‌కేక్‌లా అమ్ముడవుతుందని అధికారులు భావిస్తున్నారు. కోకాపేట్ తరహాలో.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఎక్కడ లే అవుట్లను అభివృద్ధి చేసినా కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. హెచ్ఎండీఏ స్థలాల్లో ఎలాంటి వివాదాలు లేకపోవడం, ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసి ఇవ్వడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇటీవల మేడ్చల్, ఘట్కేసర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో చేపట్టిన హెచ్ఎండీఏ స్థలాల విక్రయాలకు కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. బాచుపల్లిలో చదరపు గజం అత్యధికంగా రూ.68 వేల వరకు డిమాండ్ రావడం గమనార్హం. గతంలో ఉప్పల్‌లోనూ బిల్డర్లు, రియల్టర్లు, వ్యాపారవర్గాలు, మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. నగర శివారు ప్రాంతాల్లో, ఔటర్ రింగ్ రోడ్‌కు అందుబాటులో అభివృద్ధి చేస్తున్న వెంచర్ల పట్ల నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సుమారు 500 ఎకరాల్లో కోకాపేట్లో అభివృద్ధి చేస్తోన్న నియో పోలీస్ లేఅవుట్ కు సైతం కొనుగోలుదారుల నుంచి ఆసక్తి కనిపిస్తోంది. నియో పోలీస్ లే అవుట్ అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. కోకోపేట తరువాత బుద్వేల్‌లో చేపట్టనున్న ప్రాజెక్టు అతిపెద్ద లేఅవుట్ అవుతుందని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం 200 ఎకరాల్లో దీన్ని చేపట్టి విస్తరిస్తారు. అక్కడ ప్రభుత్వభూమి అందుబాటులో ఉండడం వల్ల 350 ఎకరాల వరకు కూడా విస్తరించేందుకు అవకాశం ఉంది. కాగా.. జంట జలాశయాలకు సమీపంలో ఉన్న బుద్వేల్ లే అవుట్‌కు అన్నీ అనుకూలమైన అంశాలే ఉన్నాయి. చదవండి: సాత్విక్ మృతిపై కమిటీ రిపోర్ట్ ఇదే.. శ్రీచైతన్యకు షాక్! -
అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే?
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లోని హెచ్ఎండీఏ స్థలాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. అందుబాటు ధరల్లో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎమ్మెస్టీసీ ఈ వేలం ప్రక్రియను నిర్వహించనుంది. మధ్యతరగతి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లు ఈ ల్యాండ్ పార్సిళ్లను కొనుగోలు చేసేందుకు అనుగుణంగా స్థలాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఔటర్‌రింగ్ రోడ్డుకు దగ్గరలో 39 ల్యాండ్ పార్సిళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6 ప్లాట్లు, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిళ్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ స్థలాల వివరాలను కేఎంఎల్ ఫైల్ ద్వారా చూసుకునే సదుపాయం ఉంది. 121 నుంచి 10,164 గజాల వరకు ఈ స్థలాలు ఉన్నాయి. గండిపేట వద్ద 3 ప్లాట్లు, శేరిలింగంపల్లిలో 5, ఇబ్రహీంపట్నంలో 2 ప్లాట్లు, అమ్మకానికి ఉన్నాయి. మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో 4, ఘట్కేసర్లో 1, బాచుపల్లిలో 1 చొప్పున ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో 16, ఆర్సీపురంలో 6 ప్లాట్లు, జిన్నారంలో ఒకటి చొప్పున స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఆన్లైన్ వేలం.. 39 స్థలాలను వచ్చే నెల మార్చి 1న ఎమ్మెస్టీసీ ఆధ్వర్యంలో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్ కలిగిన ఈ స్థలాలను కొనుగోలు చేసిన వారు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు అవకాశం ఉంది. ఆన్లైన్ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెస్‌టీసీలో నమోదు చేసుకోవాలి. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశించిన ఈఎండీ (ధరావత్తు) రుసుమును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా పరిధిలోని స్థలాలకు శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసులో, 22వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని స్థలాలకు ఆర్సీపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో 23న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్థలాలపై ఉప్పల్ సర్కిల్ ఆఫీసులో ప్రీ బిడ్ సమావేశాలను నిర్వహించనున్నారు. చదవండి: ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి! -
రాజీవ్ స్వగృహ టోకెన్ అడ్వాన్స్ చెల్లింపు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన ఫ్లాట్స్‌ను సొంతం చేసుకునేందుకు వినియోగదారులు టోకెన్ అడ్వాన్స్ చెల్లించే గడువును హెచ్ఎండీఏ పొడిగించింది. ఫిబ్రవరి 15 వరకు అడ్వాన్స్ డిమాండ్ డ్రాఫ్ట్‌లను మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్, ఉర్దూగల్లీ, స్ట్రీట్‌నెం.17, హిమాయత్‌నగర్ హైదరాబాద్‌కు చేరేలా పంపించాలని సూచించింది. అనంతరం ఫ్లాట్స్ కేటాయింపునకు సంబంధించి లాటరీని పారదర్శక విధానంలో నిర్వహిస్తామని తెలిపింది. ప్రస్తుతం పోచారంలో 3 బీహెచ్‌కె ఫ్లాట్స్ 16, 2బీహెచ్‌కే ఫ్లాట్స్ 570, 1 బీహెచ్‌కె ఫ్లాట్స్ 269 ఉన్నాయని తెలిపింది. ఇక బండ్లగూడలో 1బీహెచ్‌కే ఫ్లాట్స్ 344, సీనియర్ సిటీజన్లకు 1 బీహెచ్‌కే ఫ్లాట్స్ 43 ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌కు రూ.3 లక్షలు, 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌కు రూ.2 లక్షలు, 1 బీహెచ్‌కే ఫ్లాట్‌కు రూ.లక్ష చొప్పున టోకెన్ అడ్వాన్స్‌గా చెల్లించాలని కోరింది. -
విక్రయానికి రాజీవ్ స్వగృహ టవర్లు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్‌ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగృహ టవర్లు ఎక్కడ ఎలా ఉన్నవి అలా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హెచ్ఎండీఏకు బాధ్యతలను అప్పగించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఈ నెల 9వ తేదీ సోమవారం ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు హిమాయత్ నగర్, ఉర్దూగల్లీలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. పోచారంలో 9 అంతస్తులవి నాలుగు టవర్లు ఉండగా, వాటిల్లో ఒక్కొక్క టవర్‌లో కనీసం 72 నుంచి 198 ఫ్లాట్లను నిర్మించుకునే సదుపాయం ఉంది. అదేవిధంగా గాజుల రామారంలో 14 అంతస్తుల ఐదు టవర్లు ఉండగా వాటిల్లో ఒక్కొక్క టవర్ లో 112 ఫ్లాట్ లను నిర్మించుకునే సదుపాయం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న పోచారం, గాజులరామారం స్వగృహ టవర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిగల బిల్డర్లు, డెవలపర్లు, సొసైటీలు, వ్యక్తులు ఈ నెల 30వ తేదీ నాటికి గడువు విధించారు. ఈ గడువు వరకు రూ.10 లక్షలు ధరావత్తును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ధరావత్తు చెల్లించిన దరఖాస్తుదారుల ఎంపిక పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా టవర్లను కేటాయిస్తారు. ఆసక్తిగల వ్యక్తులు, సంస్థలు, బిల్డర్లు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు సోమవారం జరిగే ప్రీ బిడ్ సమావేశానికి హాజరై ఇతర వివరాలను అడిగి తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు. -
HMDA: భూముల వేలానికి మరోసారి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల వేలానికి మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ). ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ వెలువరించింది. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ జనవరి 16, 2023 గా పేర్కొంది. ప్రీ బిడ్ సమావేశాలు జనవరి 4,5,6 ఉంటాయని, ఈఎండీ చెల్లింపునకు జనవరి 17వ తేదీ వరకు గడువు విధించింది. భూముల వేలం జనవరి 18న ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలోని భూముల వేలానికి ముందుకు వచ్చింది. 300 గజాల నుండి 10 వేల గజాల వరకు ప్లాట్లను వేలంలో పెట్టింది హెచ్ఎండీఏ. ఈ వేలం ద్వారా భారీ ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. -
Hyderabad: ఇండియన్ రేసింగ్ లీగ్ కోసం ఉత్కంఠగా..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం ప్రారంభం కానుంది. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఆదివారం కూడా ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఇందుకోసం హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోటీలో 12 కార్లు 24 మంది డ్రైవర్లు తమ సత్తా చాటనున్నారు. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకుల కోసం ట్రాక్ మార్గంలో 7 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సుమారు 7,500 మంది ఈ ఈవెంట్‌ను వీక్షించనున్నారు. ఇప్పుడు జరిగేవి ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు మాత్రమేనని, ఫిబ్రవరి 11న ఫార్ములా–ఈ కార్ రేసింగ్ జరుగుతుందని హెచ్‌జీసీఎల్ ఎండీ సంతోష్ చెప్పారు. ట్రాక్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కూడా ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో మరోసారి ఈ పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. -
ప్రణాళికాబద్ధంగా పచ్చదనం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రణాళికాబద్ధంగా పచ్చదనం పెంచుతున్నామని, భవన నిర్మాణాలకు అనుమతుల సమయంలోనే 25 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ తెలిపారు. లేఅవుట్లకు అనుమతిచ్చిన తర్వాత నిర్ణీత స్థలంలో గ్రీన్‌జోన్‌ను అభివృద్ధి చేసిన తరువాతే తుది అనుమతులను ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో గ్రీన్ సిటీపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏఐపీహెచ్ గ్రీన్ సిటీ కమిటీ ప్రతినిధి బిల్ హార్డీ అధ్యక్షతన ఆన్లైన్లో జరిగిన ఈ సమావేశంలో... హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మక గ్రీన్‌సిటీ అవార్డు లభించడం వెనుక ఉన్న కృషిని అరవింద్ వివరించారు. హైదరాబాద్ నగరంలో 150 చెరువులను సుందరీకరణ చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ 16 అటవీ ప్రాంతాల్లో అర్బన్ఫారెస్టు పార్కులు అభివృద్ధి చేసి పట్టణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. మహానగరం చుట్టూ 158 కి.మీ. మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డులో పచ్చదనం పెంపొందించి గ్రీన్ జోన్‌గా మార్చామని తెలిపారు. ఫార్ములా ఈ ట్రాక్ నిర్మాణంలో కోల్పోతున్న చెట్లను పూర్తిగా మరో చోటుకు తరలించి ట్రాన్స్‌లొకేట్ చేస్తున్నట్లు అరవింద్‌కుమార్ వివరించారు. ప్రతియేటా ‘హరితహారం’ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తూ పచ్చదనాన్ని అభివృద్ధి చేసిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
Hyderabad: మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో స్థలాలు
సాక్షి, సిటీబ్యూరో: సర్కారు భూముల వేలానికి సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశాలకు ఆసక్తిగల కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. హెచ్ఎండీఏ పరిధిలోని బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ, తుర్కయంజాల్, తొర్రూరులతో పాటు, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని అమిస్తాపూర్‌లో ప్రభుత్వ స్థలాలను ఈ– వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో గతంలో నిర్వహించిన ఈ– వేలం ద్వారా కొన్ని ప్లాట్లను విక్రయించగా మిగిలిన వాటిని రెండో దశలో విక్రయించేందుకు అధికారులు తాజాగా చర్యలు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న స్థలాలు కావడంతో సాధారణ, మధ్యతరగతి వర్గాల నుంచి రియల్టర్లు, బడా బిల్డర్ల వరకు కూడా ప్రభుత్వ స్థలాల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకొనే మధ్యతరగతి వర్గాలకు బహదూర్‌పల్లి, తొర్రూరులలో 197 చదరపు గజాల నుంచి 267 చదరపు గజాల విస్తీర్ణం వరకు కూడా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బహదూర్‌పల్లి, తుర్కయంజాల్, కుర్మల్‌గూడ, తొర్రూరు, తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల కోసం 325 చదరపు గజాల నుంచి గరిష్టంగా 1,145 చదరపు గజాల వరకూ గరిష్ట విస్తీర్ణంలో కొన్ని ప్లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి 23 వరకు ప్లాట్లకు ఈ– వేలం నిర్వహించనున్నారు. ఆదాయ మార్గాల అన్వేషణలో.. ► ఆదాయ సముపార్జన కోసం ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల విక్రయానికి చర్యలు చేపట్టింది. హెచ్ఎండీఏ పరిధిలోని స్థలాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఈసారి సుమారు రూ.500 కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు అంచనా. కుర్మల్‌గూడ, తొర్రూర్‌లలో చదరపు గజానికి రూ.10 వేల చొప్పున కనీస ధర నిర్ణయించగా, తుర్కయంజాల్‌లో కనీస ధర రూ.40 వేలుగా నిర్ణయింంచారు. బహదూర్‌పల్లిలో కనీస ధర రూ.25వేల చొప్పున ఉంటుంది. అన్నిచోట్లా ఈసారి భారీ డిమాండ్ ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ► ఒకవైపు భూముల విక్రయం ద్వారా ఆదాయం కోసం చర్యలు తీసుకొంటూనే మరోవైపు గతంలో నిలిచిపోయిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా కూడా ఫీజుల రూపంలో ఖజానా నింపుకొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని సుమారు 633 వెంచర్లను అధికారులు గుర్తించారు. వీటికి ఎల్ఆర్ఎస్ జారీ చేస్తే మరో రూ.500 కోట్ల వరకు ఫీజుల రూపంలో లభించే అవకాశం ఉంది. (క్లిక్ చేయండి: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్.. ఎయిర్‌పోర్ట్‌కు సాఫీగా జర్నీ) -
హైదరాబాద్ నడిబొడ్డున రేసింగ్.. గంటకు 280 కి.మీ వేగంతో..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న ‘ఫార్ములా-ఈ’ రేసింగ్ మొదటిసారిగా మన దేశంలో ట్రాక్ ఎక్కనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. ఇందుకోసం 100 రోజుల కౌంట్ డౌన్ దేశ రాజధాని ఢిల్లీలో లాంఛనంగా అభిమానుల కోలాహలం మధ్య శుక్రవారం ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ను కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురీ, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, టీఆర్ఎస్ ఎంపీలు సురేశ్‌రెడ్డి, దామోదర్ రావు, వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, గ్రీన్ కో సంస్థ ప్రతినిధి సునీల్ చలిమిశెట్టి, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో 2.7 కి.మీ మార్గంలో రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి వెళ్లే విధంగా ట్రాక్‌ను రూపొందిస్తున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు మీదుగా మొత్తం 17 టర్నింగ్‌లు వచ్చేలా ట్రాక్ ప్లాన్ ఉంటుందన్నారు. 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ద్ అంతర్జాతీయ సర్క్యూట్లో ఫార్ములా వన్ రేసు జరిగిన తర్వాత దేశంలో జరగబోగే రెండో అతి పెద్ద రేసింగ్ ఈవెంట్‌గా ఫార్ములా–ఈ నిలవనుంది. 12 దేశాల్లోనే.. ఫార్ములా-ఈ ప్రిక్స్ ఈవెంట్‌ను ప్రపంచంలో 12 దేశాలు మాత్రమే నిర్వహిస్తున్నాయని, అందులో భారత్ కూడా ఒకటని కేంద్రమంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్‌లో జరగబోయేది 9వ సీజన్ అని వివరించారు. గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు లండన్, బెర్లిన్, రోమ్, సౌ పాలో, మెక్సికో, జకార్తా, కేప్ టౌన్, మొనాకో, దిరియా (సౌదీ అరేబియా) సరసన నిలివనుంది. రానున్న నాలుగు సంవత్సరాల వరకు ఈ ఈవెంట్‌ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. 2014లో ప్రారంభమైన ఫార్ములా-ఈ రేసింగ్ ఇప్పటివరకు 100 రేసులను పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగే ఈ ఈవెంట్‌ను హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) బాధ్యులైన రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆర్గనైజ్ చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున సచివాలయం ముందు జరిగే ఈ రేసింగ్‌లో గంటకు 280 కిలోమీటర్ల వేగంతో బ్యాటరీ కార్లు దూసుకుపోనున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల కంపెనీల్లో ఒకటైన గ్రీన్ కో ఈ ఈవెంట్‌ను ప్రమోట్ చేస్తుంది. కేటీఆర్ సందేశం.. ’ఫార్ములా ఈ-ప్రిక్స్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌తో అనేక గ్లోబల్ సిటీల స్థాయికి హైదరాబాద్ చేరుకున్నట్లయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు తన సందేశంలో పేర్కొన్నారు. విశ్వనగరంలో హైదరాబాద్‌కు గుర్తింపు రావడానికి అనేక అంశాల్లో ఇప్పుడు ఇది కూడా చేరిందన్నారు. ఈ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో సమర్ధవంతంగా నిర్వహిస్తామని, 'ఈ-మొబిలిటీ సమ్మిట్’ పేరుతో ఆ రంగానికి చెందిన అనేక కంపెనీల ప్రతినిధులు, ఇన్వెస్టర్లు వస్తారని, ఆ సందర్భంగా హైదరాబాద్ నగరానికి 'ఈ-వెహికల్' రంగంలో ఉన్న ప్రత్యేకతలను, ప్రాధాన్యతను వివరిస్తామని మంత్రి అన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న ’ఫార్ములా-ఈ ప్రిక్స్’ ఈవెంట్ ఒక్కసారితో అయిపోదని , ఇకపైన ప్రతి ఏటా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని, ’ఈ-మొబిలిటీ’లో హైదరాబాద్ నగరం గ్లోబల్ లీడర్‌గా ఆవిష్కృతమవుతుందని పేర్కొన్నారు. ఫార్ములా వన్ తరహాలోనే ఇప్పుడు జరగనున్న ఫార్ములా-ఈ కూడా ఉంటుందని, అయితే ఈ రేస్‌లో పాల్గొనే వాహనాలు పూర్తిగా బ్యాటరీ సాయంతో నడిచే ఈ-వెహికల్స్ అని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తు ఆటోమొబైల్ రంగం మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంటుందని, గంటకు 300 కి.మీ. వేగంతో నడిచే జెనరేషన్-3 కార్లు మొదటిసారిగా ఈ ఈవెంట్ సందర్భంగా ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో తయారైన బ్యాటరీ, వేగంగా రీచార్జ్ అయ్యే టెక్నాలజీ వీటి ప్రత్యేకత అని అన్నారు. ఫార్ములా వన్ రేసింగ్ ప్రత్యేకంగా తయారుచేసిన ట్రాక్ రోడ్లపై జరుగుతాయని, కానీ ఫార్ములా-ఈ ఈవెంట్ మాత్రం నగరంలోని సాధారణ రోడ్లపైనే జరగనున్నట్లు తెలిపారు. స్ట్రీట్ సర్క్యూట్ తరహాలో వీధులపైనే జరుగుతుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తిగా, ఉత్కంఠగా వీక్షించే క్రీడ కార్ రేసింగ్ అని, 1990వ దశకం నుంచే ఎఫ్-3 రేసులు జరుగుతున్నట్లు గుర్తుచేశారు. ఫార్ములా వన్ రేసింగ్ మాత్రం 2011లో మొదలైందని, ఇప్పుడు ఫార్ములా-ఈ పేరుతో తొలిసారి హైదరాబాద్‌లో జరుగుతుందన్నారు. రానున్న మూడు నెలల్లో అనేక ఈవెంట్లు జరుగుతాయని, సుమారు 40 వేల మందికి పైగా దీన్ని ప్రత్యక్షంగా వీక్షించబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. త్వరలోనే టికెట్ల విక్రయంపై నిర్ణయం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చదవండి: పీసీఎస్ హెడ్– క్వార్టర్స్‌గా ఐసీసీసీ -
గల్లా పెట్టె ఘల్లుమనేలా!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు సర్కారు భూముల అమ్మకాలు, మరోవైపు లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా ఆదాయ సముపార్జనకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకాలకు చర్యలు చేపట్టిన అధికారులు.. సర్కారు ఖజానాను భర్తీ చేసేందుకు మరిన్ని చోట్ల భూముల అమ్మకాలకు ప్రణాళికలను రూపొందించారు. హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా చోట్ల వివాదంలో ఉండడంతో లేఅవుట్ల అభివృద్ధి, ప్లాట్ల విక్రయాల్లో జాప్యం చోటుచేసుకొంటోంది. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలు లేని భూములపై అధికారులు తాజాగా దృష్టి సారించారు. గతంలోనే అమ్మకానికి సిద్ధంచేసిన లేమూరుతో పాటు, కుత్బుల్లాపూర్‌లోని హెచ్ఎంటీ భూములు, ఔటర్‌కు సమీపంలోని కుర్మగూడలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్లు వేసి విక్రయించేందుకు కార్యాచరణను సిద్ధంచేశారు. రెండు చోట్ల వెంచర్లు.. లేమూరులో ప్రభుత్వ భూమితో పాటు కొంత భూమిని రైతుల నుంచి సేకరించారు. సుమారు 44 ఎకరాల్లో ప్లాట్లను సిద్ధం చేశారు. గతంలోనే ఈ ప్లాట్లకు వేలం నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యం జరిగింది. ప్రస్తుతం లేమూరు అన్ని విధాలుగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. 300 చదరపు గజాలు, 200 చదరపు గజాల చొప్పున సుమారు 350 ప్లాట్ల వరకు లేఅవుట్లు వేసి విక్రయానికి ఏర్పాట్లు చేశారు. లేమూరు భూముల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.250కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుమారు 90 ఎకరాల హెచ్ఎంటీ భూముల్లోనూ తాజాగా లేఅవుట్లకు సన్నాహాలు చేపట్టారు. రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, తదితర అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం చేస్తున్నారు. స్థానికంగా ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 150 గజాల చిన్న ప్లాట్ల నుంచి 500 చదరపు గజాల ప్లాట్ల వరకు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడ గజానికి రూ.25 వేల కనీస ధర నిర్ణయించే అవకాశం ఉంది. ఔటర్‌కు సమీపంలో ఉన్న కుర్మగూడలో ప్రభుత్వానికి మరో 60 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో ఇంకా లేఅవుట్ చేయాల్సి ఉంది. ఇక్కడ డిమాండ్ బాగా ఉంటుందని అంచనా. ఈ మూడు చోట్ల కలిపి ప్లాట్ల విక్రయం ద్వారా కనీసం రూ.750 కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. క్రమబద్ధీకరణకు సన్నద్ధం... లేఅవుట్ల క్రమబదీ్ధకరణ కోసంఇప్పటికే చర్యలు చేపట్టిన అధికారులు నాలుగు జోన్లలో కలిపి సుమారు 1000 లే అవుట్లను గుర్తించారు. వారంతా గతంలోనే ఎల్ఆర్ఎస్ కోసం డాక్యుమెంట్లను సమర్పించారు. రూ.10 వేల ఫీజు చెల్లించారు. అధికారులు గుర్తించిన లే అవుట్లలో సుమారు 700 కు పైగా లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ను ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఈ స్థలాలన్నీ ఎకరానికి పైగా ఉన్నవే కావడంతో ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. తాజాగా హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగం అధికారులతో ఈ అంశంపై సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీపావళి తర్వాత అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. (చదవండి: హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం) -
Bandlaguda: రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు హెచ్ఎండీఏ నిర్వహించిన వేలానికి వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మొత్తం 3,716 ఫ్లాట్లకు సంబంధించి 39,082 మంది వినియోగదారులు ఆన్లైన్లో బిడ్లు దాఖలు చేశారు. ఇందులో బండ్లగూడలోని 2,246 ఫ్లాట్లకు 33,161 మంది బిడ్లు దాఖలు చేశారు. పోచారంలోని 1470 ఫ్లాట్టకు 5921 మంది బిడ్లు దాఖలు చేశారు. బిడ్లు దాఖలు చేసిన వారిలో లాటరీ ద్వారా ఎంపిక చేసి ఫ్లాట్లను కేటాయించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి పోచారం ఫ్లాట్స్ వినియోగదారులకు లాటరీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఫేస్బుక్, యూట్యూ బ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ నిర్వహిస్తున్నారు. బండ్లగూడ ఫ్లాట్స్‌కు మంగళవారం లాటరీ నిర్వహించనున్నారు. బండ్లగూడ డీలక్స్ ఫ్లాట్స్ వినియోగదారులకు బుధవారం లాటరీ నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. (క్లిక్: పబ్ కేసులో మరో ట్విస్ట్.. కోర్టును ఆశ్రయించిన పోలీసులు) -
కౌంటర్ వేయండి.. లేదంటే వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్) పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగాయనే ప్రజాహిత వ్యాజ్యంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయని పక్షంలో ఆగస్టు 23న జరిగే విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వా లని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్ల ను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలీతో కూడిన ధర్మా సనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. హుస్సేన్ సాగ ర్లోని ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగాయని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త లుబ్నాసార్వత్ 2020, ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్‌కు ఈ–మెయిల్ చేశారు. గోడల నిర్మాణాలు కూడా జరిగాయం టూ ఆమె గూగుల్ ఎర్త్ నుంచి తీసిన జియో ట్యాగ్ చిత్రాన్ని కూడా హైకోర్టుకు పంపారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న ఆమె ఈ–మెయిల్ ఫిర్యాదును హైకోర్టు సుమో టో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. -
లేఅవుట్ డెవలపర్లకు గట్టి షాక్...రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం..!
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ డెవలపర్లకు పెద్ద షాక్ తగిలింది. హెచ్ఎండీఏ, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) అనుమతులు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను అంగీకరించేది లేదని రిజిస్ట్రేషన్ల శాఖ తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం లేఅవుట్లలో ఉన్న అనుమతి లేని ప్లాట్లపై క్రయవిక్రయ లావాదేవీలు జరిపే అవకాశం ఉండదు. గతంలోనే ఈ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రియల్టర్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనుమతి లేకున్నప్పటికీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, సదరు ప్లాట్లకు అనుమతులు లేవని, దీనిపై లావాదేవీలు జరపడం క్రయ, విక్రయదారుల రిస్క్ అంటూ ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌పై పేర్కొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయడంతో ఈ మేరకు కొట్టివేసింది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతుల్లేని ప్లాట్ల క్రయ, విక్రయ లావాదేవీలకు అనుమతి ఇవ్వవద్దని తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ శుక్రవారం నుంచి సదరు ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. అమ్ముడుపోకుండా మిగిలినవాటికే.. అనుమతుల్లేని లేఅవుట్ల ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం స్థలాల రెగ్యులరైజేæషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకంపట్ల ప్రజల నుంచి వ్యతిరేకత రావడం... హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికారపార్టీకి చేదు ఫలితాలు రావడంతో ఉపసంహరించుకున్న ప్రభుత్వం లేఅవుట్లలో అప్పటికే అమ్ముడైన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, అప్పటివరకు అమ్మని ప్లాట్లకు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అక్రమ లేఅవుట్లలో డెవలపర్ల వద్ద ఉన్న ప్లాట్లకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే క్రయవిక్రయ లావాదేవీలు జరిపిన ప్లాట్లకు వర్తించదని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు వెల్లడించారు. -
హెచ్ఎండీఏలో అంతా మా ఇష్టం.. ఆన్లైన్లో స్వీకరణ.. ఆఫ్‌లైన్‌లో జారీ
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ అనుమతుల జారీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు అధికారులు నిబంధనల్లో మార్పులు చేస్తున్నారు. కాల్వలు, పంటపొలాలు, వక్ఫ్‌స్థలాలు సైతం ఉన్నపళంగా ‘రెసిడెన్షియల్ జోన్’ జాబితాలో చేరిపోతున్నాయి, నిర్మాణదారులు నేరుగా హెచ్ఎండీఏకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ.. నేరుగా కలిస్తే తప్ప పనులు కావడం లేదు. మరోవైపు ఎంఎస్‌బీఆర్ (మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ రెగ్యులేటరీ కమిటీ) సమావేశాలు ఏర్పాటు చేయకుండానే బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులను ఇస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, మేడ్చల్, శేరిలింగంపల్లి, ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో నిబంధనలను పాతరేసి లేఅవుట్ పర్మిషన్లు ఇస్తున్నారు. ఉల్లంఘనలు ఇలా.... ∙తెల్లాపూర్, నల్లగండ్ల తదితర ప్రాంతాల్లో కొన్ని భూములపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో వివాదం కొనసాగుతోంది. ఈ భూములు వ్యవసాయ కాల్వల పరిధిలో ఉండటంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. కానీ కొంతమంది రియల్టర్లు కొందరు అధికారుల సహకారంతో వివాదాస్పద భూ ముల్లోనూ అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. ∙తెల్లాపూర్‌లోని ఓ సర్వే నంబర్లో ఉన్న ఇలాంటి పంట కాల్వ (క్రాఫ్ట్ కెనాల్) పరిధిలోని 5 ఎకరాల భూమిలో 9 అంతస్తుల భవనానికి ఇటీవల అనుమతులిచ్చారు. ఈ మేరకు హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ‘రెసిడెన్షియల్ జోన్’గా మార్చేశారు. సదరు నిర్మాణ సంస్థ రెండేళ్ల క్రితమే భవన నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోని నిబంధలకు విరుద్ధంగా ఉన్నట్లు అప్పట్లో ఓ ఉన్నతాధికారి ఏకంగా నాలుగుసార్లు తిరస్కరించారు. చివరకు ఇటీవల మోక్షం లభించింది. ఎంఎస్‌బీఆర్ (మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ రెగ్యులేటరీ ) కమిటీ సమావేశం కూడా లేకుండానే అనుమతులను ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఎంఎస్‌బీఆర్ కమిటీ గతంలో నిర్వహించిన సమావేశాల్లోని మినిట్స్‌లో మార్పులు చేసినట్లు తెలిసింది. నిర్మాణదారులకు, అధికారులకు నడుమ మధ్యవర్తులే అన్ని విధాలా “ఈ వ్యవహారాన్ని’ నడిపించడం గమనార్హం. ఏమార్చి ఎల్పీ ఇచ్చారు... అధికారులు తలుచుకుంటే చెరువులు, కుంటలు, అడవులు సైతం నివాసయోగ్యమైన జాబితాలో చేరిపోతాయి. చివరకు వక్ఫ్‌భూములకు సైతం రక్షణ కొరవడింది. మహేశ్వరం మండలంలోని కొంగరకుర్దు గ్రామంలో ఓ సర్వే నంబర్లో ఉన్న 11.17 ఎకరాల వక్ఫ్‌భూమిని ఇలాగే మార్చేసి లే అవుట్ పర్మిషన్ ఇచ్చారు. ధరణిలోనూ, రిజిస్ట్రార్ రికార్డుల్లోనూ ఇది నిషేధిత జాబితాలో ఉంది. దీనిపై ఇటీవల స్థానికంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా మరోసారి అదేస్థలంలో నిర్మాణ అనుమతులను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ‘మాస్టర్‌ప్లాన్‌లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న స్థలాల్లో రకరకాల కొర్రీలు పెట్టి తిప్పుకొంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములకు మాత్రం అడ్డగోలుగా అనుమతులిచ్చేస్తారు’అని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రతినిధి విస్మయం వ్యక్తం చేశారు. చదవండి: ..అంతకుమించి.. బీజేపీ దృష్టి మొత్తం ఆ సభ మీదే! -
సర్కారు వారి పాట
సాక్షి, హైదరాబాద్: సర్కారు భూముల అమ్మకానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ఈ ఏడాది హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ప్రస్తుతం సుమారు 4500 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా చోట్ల వందల ఎకరాల్లో అన్యాక్రాంతం కాగా కొన్ని చోట్ల కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి వివాదాలు లేకుండా అందుబాటులో ఉన్న భూమిని అంచనా వేసి లేఅవుట్లు చేసి వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇలాంటి భూమి సుమారు 2000 ఎకరాలకుపైగానే ఉన్నట్లు అంచనా. అందులో ప్రస్తుతంవెయ్యి ఎకరాలను అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతుల నుంచి సేకరించిన భూముల్లో లేఅవుట్లు వేసి వేలం ద్వారా విక్రయించిన హెచ్ఎండీఏ తాజాగా తన అధీనంలోని ప్రభుత్వ భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేసింది. కోకాపేట్లో ఇటీవల ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు కేసులు లేకుండా అన్ని రకాల అనుమతులతో కూడిన భూములను మొదట విక్రయించనున్నారు. రెండుచోట్ల వెంచర్లు.. ప్రభుత్వ భూముల విక్రయంలో భాగంగా తొలుత మోకిల, కుత్బుల్లాపూర్‌లలో ఉన్న సుమారు 190 ఎకరాల భూముల్లో లేఅవుట్లు వేయనున్నారు. రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర అన్ని మౌలిక సదుపాయాలతో రెండు మూడు నెలల్లో ఈ రెండు చోట్ల ప్లాట్లను వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 150 గజాల చిన్న ప్లాట్ల నుంచి 500 చదరపు గజాల ప్లాట్ల లేఅవుట్లు వేయనున్నారు. ప్రభుత్వ భూములతో పాటు అవసరమైన చోట్ల రైతుల నుంచి కూడా భూములను సేకరించే అవకాశం ఉంది, భారీ లే అవుట్లకు తగినంత భూమి అందుబాటులో లేని చోట్ల రైతుల నుంచి సేకరించనున్నారు. కుత్బుల్లాపూర్‌లో మండలం పరిధిలోని హెచ్ఎంటీ కంపెనీని ఆనుకొని ఉన్న వంద ఎకరాల హెచ్ఎండీఏ భూమిలో సుమారు 10 ఎకరాల వరకు అన్యాక్రాంతం కాగా, మిగతా 90 ఎకరాల భూమి కొద్ది రోజల క్రితమే హెచ్ఎండీఏ చేతికి వచ్చింది. మోకిలలో హెచ్ఎండీఏకు 60 ఎకరాల భూమి ఉండగా, రైతుల నుంచి సేకరించిన మరో 40 ఎకరాలతో కలిపి ఇక్కడ లేఅవుట్ వేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఉప్పల్ భగాయత్, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములపై నిర్వహించిన ఆన్లైన్ వేలానికి రియల్టర్లు, బిల్డర్లు, సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ స్పందనతో మరోసారి హెచ్ఎండీఏ పెద్ద ఎత్తున భూముల బేరానికి దిగింది. ఉప్పల్ భగాయత్‌లో మరో 40 ఎకరాలలో లే అవుట్‌ను సిద్ధం చేస్తున్నారు. త్వరలో ప్లాట్లు చేసి విక్రయించనున్నారు. కరువైన రక్షణ.. హెచ్ఎండీఏ భూములకు పలు చోట్ల రక్షణ కరువైంది. వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. జవహర్‌నగర్‌లో సుమారు 2300 ఎకరాల హెచ్ఎండీఏ భూములు ఉన్నాయి. ఇక్కడ చాలా చోట్ల భూములు కబ్జాకు గురయ్యాయి. కొన్ని చోట్ల పేదలు గుడిసెలు వేసుకున్నారు. మియాపూర్‌లోనూ వెయ్యి ఎకరాల వరకు ఉన్నట్లు అంచనా. కబ్జాకోరులు పెద్ద ఎత్తునే స్వాహా చేశారు. జవహర్‌నగర్, మియాపూర్‌లలో రెండు చోట్ల పేదల పేరుతో ఆక్రమించుకొని కొందరు భూబకాసురులు రూ.కోట్లు గడించారు. మరోవైపు పుప్పాలగూడలో 100 ఎకరాలు, ఐడీఏ బొల్లారంలో 120 ఎకరాల చొప్పున హెచ్ఎండీఏ భూములు ఉన్నట్లు అంచనా. ఇవి కాకుండా బుద్వేల్‌లో 60 ఎకరాలు, కోకాపేట్లో 60, కొత్వాల్‌గూడలో 50 ఎకరాలు, తెల్లాపూర్‌లో 300 ఎకరాల వరకు హెచ్ఎండీఏకు చెందిన భూములు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. ఇంకా లెక్కతేలాల్సినవి వేల ఎకరాల్లోనే ఉన్నాయి. -
ఇల్లు కడుతున్నారా.. వెంటనే పర్మిషన్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతులను మరింత సులభతరం చేసినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. 75 నుంచి 240 చదరపు గజాల వరకు ఉన్న స్థలాల్లో ఇళ్లు, స్టిల్ట్+2, జీ+1 అంతస్తుల భవనాల అనుమతుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సత్వరమే అనుమతులను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం భవన యజమానులు నేరుగా అధికారులను సంప్రదించాల్సిన అవసరం లేదు. టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సర్టిఫికెట్లను పరిశీలించి అనుమతులనిస్తారు. నాలుగు దశల్లో ఇది పూర్తవుతుంది. భవన నిర్మాణదారులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో ఈ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు సమర్పించిన సమాచారం సరైందేనని పేర్కొంటూ స్వీయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. మూడో దశలో ఆన్లైన్లో నిర్ణీత ఫీజు చెల్లించాలి. నాలుగో దశలో భవన యజమానులు అనుమతి పత్రాలను ఆన్లైన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీఎస్‌బీపాస్ అనుమతుల్లో సందేహాలపై టోల్‌ఫ్రీ నంబర్ 1800–5992266ను సంప్రదించవచ్చు. 040–22666666కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. వాట్సప్ ద్వారా సమాచారం కోసం ఫోన్: 9392215407ను సంప్రదించవచ్చు. (క్లిక్: సెల్ ఫోన్ డ్రైవింగ్ వీకెండ్లోనే ఎక్కువ.. ఎందుకంటే!) -
అక్కడ పిరం.. ఇక్కడ స్థిరం!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరులో స్థిరాస్తి వ్యాపారి ఒకరు అయిదెకరాల విస్తీర్ణంలో లేఅవుట్ వేసేందుకు స్థలాన్ని చూశాడు. భూ యజమానితో ఎకరాకు రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. సరిగా నెల తర్వాత 8 కి.మీ. దూరంలో ఉన్న కడ్తాల్‌లో ఎకరా రూ.4 కోట్ల చొప్పున లే అవుట్ ప్రారంభించాడు. అందేంటి? హెచ్ఎండీఏ పరిధిలో, హైవేకు ఆనుకొని ఉన్న స్థలాన్ని కాదని.. ఎక్కువ ధర పెట్టి డీటీసీపీలో వెంచర్ వేశారేంటని ప్రశ్నించగా.. హెచ్ఎండీఏ పరిధిలో ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్ల కారణంగా నివాసిత స్థలం తక్కువగా ఉంది. పైగా లే–అవుట్ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూడాలి. ఫీజులూ ఎక్కువే. అదే డీటీసీపీ ఫ్రీ జోన్. చార్జీలు తక్కువే, పర్మిషన్లూ సులువుగా వచ్చేస్తాయని సమాధానమిచ్చాడు. పైగా ధర కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాట్లూ త్వరగానే అమ్మకం జరుగుతాయని సెలవిచ్చాడు. .. ఇది ఆ ఒక్క డెవలపర్ అభిప్రాయమే కాదు. చాలా మంది బిల్డర్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రాంతాలలో కాకుండా దగ్గరగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలో వెంచర్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హెచ్ఎండీఏలో కంటే డీటీసీపీ ప్రాంతాల్లోని భూముల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఆంక్షల్లేవ్.. ఆకాశంలో ధరలు హెచ్ఎండీఏ పరిధిలో చాలా వరకు ప్రాంతాలు ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్లలో ఉంటాయి. ఇక్కడ ప్లాంటింగ్ లేదా నివాస భవనాలకు అనుమతి లేదు కేవలం పరిశ్రమలు, ఇతరత్రా నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. లే– అవుట్, నిర్మాణాలకు పనికొచ్చే రెసిడెన్షియల్ (ఆర్)–1 జోన్ స్థలాలు చాలా తక్కువగా ఉంటాయి. డీటీసీపీలో జోన్ల సమస్య ఉండదు కాబట్టి ఇక్కడ భూముల ధరలు హెచ్ఎండీఏతో పోలిస్తే 20–30 శాతం ఎక్కువ పలుకుతున్నాయని స్పేస్ విజన్ సీఎండీ నర్సింహారెడ్డి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ఫీజు చదరపు మీటరుకు రూ.40 చెల్లించాలి. బెటర్మెంట్ చార్జీలు, పార్క్‌లు, ఇతరత్రా లోడ్ల పేరిట ఫీజుల మోత మోగుతుంది. పైగా అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడాలి. డీటీసీపీలో గ్రామ పంచాయితీ తీర్మానాన్ని బట్టి ఫీజుల్లో తేడా ఉంటుంది. బెటర్మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్, లే అవుట్ ఫీజు (చ.మీ.) గజానికి రూ.5–12 వరకు ఉంటుంది. డీటీసీపీలో రోడ్ల విస్తీర్ణం ఎక్కువే.. లే–అవుట్ విస్తీర్ణంలో 10 శాతం ఓపెన్ ప్లేస్, 30 శాతం రోడ్లకు పోగా మిగిలిన స్థలంలో ప్లాటింగ్ చేసుకోవచ్చు. రహదారుల హద్దులను బట్టి ఎకరం స్థలంలో 55–59 శాతం ప్లాటింగ్ ఏరియా ఉంటుంది. అంటే ఎకరానికి సుమారుగా 2,600 గజాల నుంచి 2,900 గజాల ప్లాటింగ్ చేసుకోవచ్చు. హెచ్ఎండీఏలో పోలిస్తే డీటీసీపీలో రహదారుల విస్తీర్ణం కాస్త ఎక్కువగా ఉంటుంది. హెచ్ఎండీఏలో 30 అడుగుల రోడ్లు ఉన్నా అనుమతులు వస్తాయి. అదే డీటీసీపీలో అయితే అంతర్గత రోడ్లు 33 ఫీట్లు ఉండాల్సిందే. ఒకవేళ హెచ్ఎండీఏ పరిధిలో అప్రోచ్ రోడ్ 40 ఫీట్లు ఉంటే ఇంటర్నల్ రోడ్ కూడా 40 ఫీట్లు ఉండాల్సిందే. హెచ్ఎండీఏ, డీటీసీపీ ఏ ప్రాంతంలోనైనా సరే లే–అవుట్‌లోని మొత్తం ప్లాటింగ్ 15 శాతం మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. అమ్మకాలు సులువు.. అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలతో పోలిస్తే ఓపెన్ ప్లాట్ల విషయంలో కొనుగోలుదారుల ఎంపిక భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ధరే కొనుగోలు నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అందుకే చాలా మంది డెవలపర్లు హెచ్ఎండీఏ పరిధిలో అధిక ధర పెట్టి స్థలాన్ని కొని వెంచర్ చేస్తే డెవలపర్‌కు పెద్దగా లాభం ఉండదు. అదే హెచ్ఎండీఏ ప్రాంతం నుంచి 4–5 కి.మీ. దూరంలో ఉన్న డీటీసీపీలో తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి అన్ని రకాల అభివృద్ధి పనులను చేపట్టి ప్లాట్లను చేస్తే సులువుగా అమ్ముడవుతాయి. డెవలపర్‌కూ గిట్టుబాటవుతుంది. ప్రతికూల మార్కెట్ ఉన్న ప్రస్తుత సమయంలో డీటీసీపీలో వెంచర్లు చేయడమే ఉత్తమమని మిర్చి డెవ లపర్స్ ఎండీ మల్లారెడ్డి అన్నారు. (చదవండి: 4 గంటలు.. 3 సర్జరీలు) -
హైదరాబాద్‌లో కంచికి చేరని అక్రమ కట్టడాల కథ
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ కట్టడాల కథ కంచికి చేరకుండానే తిరిగి మొదటికొచ్చింది. హెచ్ఎండీఏతో పాటు వివిధ విభాగాల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా.. భవన యజమానులు తిరిగి నిర్మిస్తున్నారు. చాలాచోట్ల స్థానిక నేతల అండదండలతో అక్రమ భవనాల పునర్నిర్మాణం యథావిధిగా కొనసాగుతోంది. కూల్చివేసిన చోట మరోసారి నిర్మాణం చేపట్టకుండా హెచ్ఎండీఏ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ అక్రమాలు ఎక్కడా ఆగడం లేదు. ఒక్క దుండిగల్‌లోనే మున్సిపల్ అధికారులు అక్రమ భవనాలను ఏకంగా మూడుసార్లు కూల్చివేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. దుండిగల్‌తో పాటు శంకర్పల్లి, ఘట్కేసర్, మేడ్చల్, శంషాబాద్ జోన్లలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు చివరికి చేతులెత్తేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రహసనంగా కూల్చివేతలు.. హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన అధికారులు నెల రోజుల వ్యవధిలో 202 అక్రమ భవనాలను గుర్తించి కూల్చివేశారు. వీటిలో చాలా వరకు 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించివే. గ్రామ పంచాయతీల్లో జీ+2 భవనాల కోసం అనుమతులు తీసుకొని అయిదారు అంతస్తుల వరకు అపార్ట్మెంట్లను నిర్మించారు. కొన్ని చోట్ల గోడౌన్లను ఏర్పాటు చేశారు. అధికారులు ఇలాంటి వాటిని గుర్తించారు. వీటిని కూల్చివేయించారు. వేల సంఖ్యలోనే అక్రమాలు.. నగరం చుట్టు శివారు ప్రాంతాల్లో వేలాదిగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. రెండంతస్తుల కంటే ఎక్కువగా అపార్ట్మెంట్లు నిర్మించేందుకు టీఎస్‌బీ పాస్ నుంచి చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవాలి. ఔటర్ రింగురోడ్డుకు అన్ని వైపులా విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులను అందుబాటులోకి తెచ్చింది. కానీ చాలామంది నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘించి గ్రామ పంచాయతీల అనుమతులతోనే బహుళ అంతస్తులు చేపట్టారు. (క్లిక్: బన్సీలాల్‌పేట్ కోనేరు బావిపై మోదీ ప్రశంసలు) ► దుండిగల్, నిజాంపేట్, శంకర్పల్లి, మేడ్చల్, పోచారం, బడంగ్పేట్, తుర్కయంజాల్ తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా కొనసాగాయి. ప్రత్యేకంగా కోవిడ్ కాలంలో రెండేళ్లుగా ఇలాంటి అక్రమ భవనాలను ఎక్కువగా నిర్మించినట్లు అధికారులు అంచనా వేశారు. మరోవైపు తాము చేపట్టిన కూల్చివేతల కారణంగా కొత్తగా భవనాలను నిర్మించేవాళ్లు మాత్రం నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నారని, ఈ మేరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఫలితాన్నిచ్చాయని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. (క్లిక్: నల్సార్ సాహసోపేతమైన నిర్ణయం) -
సాక్షి ఎఫెక్ట్: హెచ్ఎండీఏ భూముల పరిశీలన
సాక్షి, శంషాబాద్: కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎండీఏ స్థానిక అధికారుల తీరుపై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పాటు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు శుక్రవారం ఆరా తీసినట్లు సమాచారం. ప్రైవేట్ వెంచరు పరిధిలోకి వెళ్లిన భూమి వివరాలను పూర్తిగా నివేదించాలని అధికారులను కోరినట్లు తెలిసింది. పట్టణంలోని సర్వేనంబరు 626/1 ఉన్న హెచ్ఎండీఏకు 360 ఎకరాల భూమి ఉండగా అందులో పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్లో 5.15 ఎకరాల భూమి, రైతుల ఆధీనంలో మరో 6.29 ఎకరాల భూమి ఉన్నట్లు తాజాగా రెవిన్యూశాఖ చేపట్టిన సర్వేలో తేలింది. ఈ విషయమై శుక్రవారం ‘సాక్షి’ ‘ఆ స్థలం సర్కారుదే’ అన్న శీర్షికతో వచ్చిన కథనం అటు అధికార వర్గాల్లో.. ఇటు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పరిశీలించిన అధికారులు మున్సిపల్, రెవిన్యూ అధికారులు మరో మారు హెచ్ఎండీఏ స్థలాన్ని పరిశీలించారు. హెచ్ఎండీఏ స్థలంలో ఉన్న రహదారితో పాటు ఓ వ్యక్తికి సంబంధించిన ప్రహరీ, మరో వ్యక్తి ఇంటికి సంబంధించి ఓ పిల్లర్‌తో పాటు ఓ గది కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని హెచ్ఎండీఏ అధికారులకు వివరించారు. త్వరలో హెచ్ఎండీఏ అధికారులు పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ లేదా ఎదైనా ఇతర సరిహద్దులను ఏర్పాటు చేసి విలువైన స్థలాలను పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: ఐదుగురు పోలీసులపై వేటు తప్పదా..!) -
ఆ స్థలం సర్కారుదే.. వెలుగులోకి కబ్జా పర్వం
సాక్షి, శంషాబాద్: కోట్లాది రూపాయల విలువజేసే హెచ్ఎండీఏ భూ కబ్జా గుట్టు రట్టయింది. ఆరోపణలు, ఫిర్యాదులు వాస్తవమేనని సర్వే తేల్చిచెప్పింది. శంషాబాద్ పట్టణం నడిబొడ్డున చేసిన అక్రమ వెంచర్లో 5.15 ఎకరాల హెచ్ఎండీఏ భూమి అన్యాక్రాంతమైనట్లు తేలింది. దాదాపు రూ.50 కోట్ల పైచిలుకు విలువ చేసే ఈ భూమి అన్యాక్రాంతంపై హెచ్ఎండీఏ నిండా నిర్లక్ష్యం వహించినా స్థానికులు పోరు చేసి వాస్తవాలను బయటికి రప్పించారు. అసలేం జరిగింది? ► శంషాబాద్ పట్టణంలోని సర్వేనంబరు 626బై1 హెచ్ఎండీఏకు సంబంధించి 360 ఎకరాల భూమి ఉంది. ఓఆర్ఆర్ నిర్వాసితులతో పాటు విమానాశ్రయంలో ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి ఇక్కడ ప్లాట్లు కేటాయించడంతో పాటు ఖాళీ స్థలాలున్నాయి. దీని పక్కనే ఆరేళ్ల క్రితం సర్వేనంబరు 551 నుంచి 600 వరకు సర్వే ఉన్న భూమిలో భారీ వెంచర్ ఏర్పాటు చేశారు. దీని పక్కనే హెచ్ఎండీఏకు సంబంధించిన సర్వే నంబరు 626బై1ని ఆనుకుని ఉంది. ► ఇది పూర్తిగా గుట్ట ప్రాంతంతో పాటు కొన్ని దేవాలయాలు కూడా ఉండేవి. కార్పొరేట్ స్థాయి వ్యక్తులు వెంచర్లు ఏర్పాటు చేసినప్పటికీ కొందరు స్థానిక నేతలే ఇందులో భారీగా క్రయ విక్రయాలు దగ్గరుండి మరీ చూసుకున్నారు. క్రమంగా అభివృద్ధి చేసిన వెంచర్లో పురాతన దేవాలయాలను తొలగించడంతో పాటు పక్కనే ఉన్న హెచ్ఎండీఏ 5.15 ఎకరాల భూమిని కూడా అందులో కలిపేసుకున్నారు. ► ఈ స్థలంలో రహదారులు వేసి అభివృద్ధి కూడా చేశారు. ఇందులో అధికార పార్టీ నేతల నుంచి కొందరు హెచ్ఎండీఏ మాజీ అధికారులు కూడా సహకరించినట్లు సమాచారం. ఇదే సర్వేనంబరు హెచ్ఎండీఏకు సంబంధించిన మరో 6.29 ఎక రాల భూమిలో రైతులు కబ్జాలో కొనసాగుతున్నారు. ఇది ప్రారంభం నుంచి వివాదాస్పదంగానే ఉంది. (క్లిక్: దృశ్యం సినిమా తరహాలో తప్పించుకునేందుకు యత్నం) నిండా నిర్లక్ష్యం ► పునరావాసం కింద కేటాయించిన స్థలాలతో పాటు హెచ్ఎండీఏ మిగులు స్థలాలపై ఆది నుంచీ నిండా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇదే అదనుగా ఇప్పటికే కొందరు నకిలీ దస్తావేజులతో ఒకే ప్లాటు నలుగురైదుగురికి విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతేడాది ఆర్డీఓ జారీ చేసినట్లు నకిలీ పట్టా సర్టిఫికెట్లు సృష్టించిన వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆర్డీఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అక్రమార్కులను కటకటాల్లోకి పంపారు. ► ఇటీవల హెచ్ఎండీఏ భూమి కబ్జాపై స్థానికులతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు కూడా సీఎంఓ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డిసెంబరు 29 రెవిన్యూ అధికారులు సర్వే పనులు షురూ చేశారు. రెండు రోజుల క్రితం సర్వే పూర్తి చేసి అధికారులకు నివేదిక అందించారు. కబ్జా జరిగింది వాస్తవమేనని తేల్చారు. త్వరలోనే సంబంధిత భూమిని స్వాధీనం చేసుకునేందుకు హెచ్ఎండీఏ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. (క్లిక్: హెచ్ఎండీఏ ప్లానింగ్‌లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే) కబ్జా వాస్తవమే.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని సర్వేనంబరు 626బై1 ఉన్న హెచ్ఎండీఏకు సంబంధించిన 360 ఎకరాలతో పాటు సమీపంలో ఉన్న స్థలాను సర్వే పూర్తి చేశాం. హెచ్ఎండీకు సంబంధించిన 5.15 ఎకరాల భూమి వెంచర్లో కలిసినట్లు తేలింది. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా హెచ్ఎండీఏ, మున్సిపాలిటీలకు సూచించాం. సర్వే నివేదికలను ఉన్నతాధికారులకు అందజేశాం. – జనార్దన్‌రావు, శంషాబాద్ తహసీల్దార్ -
హెచ్ఎండీఏ ప్లానింగ్‌లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం దళారులు, మధ్యవర్తులకు అడ్డాగా వరింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ మధ్యేమార్గంలో అధికారులను సంప్రదించాల్సిందే. లేదంటే ఫైళ్లు పెండింగ్ జాబితాలో పడిపోతాయి. నెలల తరబడి పడిగాపులు కాసినా అనుమతులు లభించవు. భవన నిర్మాణాలు, లేఅవుట్ అనుమతులు తదితర అన్ని రకాల పనుల్లో దళారుల దందానే నడుస్తోంది. ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసి టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించినా సకాలంలో అనుమతులు లభించడం లేదు. దీంతో గత్యంతరం లేక మధ్యవర్తులను ఆశ్రయించాల్సివస్తోందని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అనుమతులకు వెళితే రకరకాల కొర్రీలు పెట్టి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో వందలాది ఫైళ్లు పెండింగ్ జాబితాలో చేరిపోతున్నాయి. ఈ క్రమంలో ‘మధ్యేమార్గంగా’ సంప్రదించి చేయి తడిపితే ఫైళ్లు చకచకా ముందుకు కదులుతున్నాయని భవన నిర్మాణదారులు, రియల్డర్లు చెబుతున్నారు. కొర్రీలు ఇలా.. ► హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో సవరించిన విధంగానే వెంచర్‌కు సన్నాహాలు చేసుకొని డాక్యుమెంట్లు సమర్పించినా ఏదో ఓ లోపాన్ని ఎత్తి చూపుతారు. రోడ్డు వెడల్పు తక్కువగా ఉందని, వెంచర్లో పార్కులు, గ్రీనరీ సూచించిన విధంగా లేదని అనుమతులను నిలిపివేస్తారు. ► నిబంధనలను అనుగుణంగా డాక్యుమెంట్లను అప్లోడ్ చేసినప్పటికీ ఏదో ఒకవిధంగా కాలయాపన చేస్తే సదరు నిర్మాణదారు నేరుగా కాని, మధ్యవర్తి ద్వారా కాని కలిసేలా ఒత్తిడి తెస్తారు. దీంతో లేఅవుట్ పర్మిషన్లు, భవన నిర్మాణ అనుమతుల్లో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటోంది. ► ఇలాంటి జాప్యానికే కారణమైన ముగ్గురు అసిస్టెంట్ ప్లానింగ్ అధికారులు, ఓ తహసీల్దారుపై హెచ్ఎండీఏ కమిషనర్ పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే వాళ్లు ఫైళ్లను పక్కన పెట్టినట్లు కమిషనర్ గుర్తించారు. రోజుకు 100కు పైగా ఫైళ్లు.. ► హెచ్ఎండీఏ పరిధిలోని శంషాబాద్, శంకర్పల్లి, ఘట్కేసర్, మేడ్చల్ జోన్ల పరిధిలో రియల్ బూమ్ జోరుగా సాగుతోంది. ఇటు దుండిగల్, శంకర్పల్లి నుంచి అటు చౌటుప్పల్, భువనగిరి తదితర ప్రాంతాల వరకు లే అవుట్ పర్మిషన్ల కోసం రోజుకు 100కు పైగా ఆన్లైన్ దరఖాస్తులు వస్తున్నాయి. ► సాధారణంగా ఈ ఫైళ్లను పరిశీలించి నిబంధనల మేరకు ఫీజులు తీసుకొని అనుమతులు ఇచ్చేందుకు వారం రోజులు సరిపోతుంది. ఉద్దేశ్యపూర్వకంగా ఫైళ్లను పక్కన పెట్టడంతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నట్లు రియల్టర్లు ఆరోపిస్తున్నారు. ► మధ్యేమార్గంగా అధికారులను ప్రసన్నం చేసుకుంటే మాత్రం క్షణాల్లో అనుమతులు వస్తాయి. ఇందుకోసం ఎకరానికి రూ.లక్ష వరకు సమర్పించుకోవాల్సివస్తోందని ఓ మధ్యవర్తి తెలిపారు. ‘పది ఎకరాల లోపు వెంచర్లైతే కిందిస్థాయి అధికారులతోనే పని పూర్తి చేసుకోవచ్చు. భారీ ప్రాజెక్టులకు మాత్రం ఉన్నతాధికారులను సంప్రదించాల్సి ఉంటుంది’ అని వివరించారు. పెరిగిన పని భారం... ► రియల్ ఎస్టేట్ బూమ్‌ను సొమ్ము చేసుకొనేందుకు కొందరు అధికారులు అక్రమాలకు తెర తీయడంతోనే కాకుండా ఒకరిద్దరు అధికారులపై పెరిగిన పని భారంతో కూడా ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ► శంకర్పల్లి, శంషాబాద్, ఘట్కేసర్ జోన్లకు మూడింటికీ ఒక్క అధికారే ఉన్నారు. పైగా అదనపు బాధ్యతలు కూడా ఉండడంతో పని భారం పెరుగుతోంది. ల్యాండ్ సర్వేయరు సైతం ఒక్కరే ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో పనుల్లో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటున్నట్లు నిర్మాణదారులు, రియల్టర్లు చెబుతున్నారు. -
కారులో కూర్చుని వెండితెరపై సినిమా చూడొచ్చు.. త్వరలో హైదరాబాద్‌లో..
Hyderabad: డ్రైవ్ ఇన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ నగర వాసులకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఈ ఆలోచన ఆచరణ రూపం దాల్చితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇక్కడ ఉండనుంది. డ్రైవ్ ఇన్ థియేటర్ సాధారణ సినిమా థియేటర్/మల్టీప్లెక్స్‌కి వెళితే ముందుగా వాహనం పార్కింగ్ చేయాలి. ఆ తర్వాత టిక్కెట్ తీసుకుని క్లోజ్డ్ హాల్లో అక్కడున్న సీట్లో కూర్చుని సినిమా చూడాలి. కానీ డ్రైవ్ ఇన్ థియేటర్లో మనం కారులో కూర్చుని.. ఎదురుగా కనిపించే అతి భారీ స్క్రీన్‌పై సినిమా చూడొచ్చు. ఈ ఓపెన్ థియేటర్‌కి తగ్గట్టుగా సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అక్కడ కామన్ యూరప్, అమెరికా దేశాల్లో డ్రైవ్ ఇన్ థియేటర్ కాన్సెప్టు ఎప్పటి నుంచో ఉంది. కార్లలో థియేటర్‌కి వచ్చే వినియోగదారుడు అందులో ఉంటూనే తన కంఫర్ట్‌కి అనుగుణంగా సినిమాను అక్కడ చూస్తుంటారు. మనదగ్గర ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నైలలో కూడా ఈ డ్రెవ్ ఇన్ థియేటర్లు ఉన్నాయి. రజనీకాంత్ శివాజీ మూవీలో ఓ ఫైట్ సీన్లో ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ కనిపిస్తుంది. లోకేషన్ ఎక్కడ కనీసం 150 కార్ల సామార్థ్యంతో డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటు చేయాలంటే రూ. 5 నుంచి 8 కోట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా వేస్తున్నారు. 150 కార్లు సుళువుగా వచ్చి పోయేలా, నిలిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీనికి సువిశాలమైన స్థలం కావాలి. నగరం మధ్యలో లోకేషన్ కోసం అన్వేషిస్తున్నారు. ఓఆర్ఆర్ మరోవైపు నగరం నలువైపులా విస్తరిస్తూ ఓఆర్ఆర్ని తనలో కలిపేసుకుంటోంది. దీంతో నగర పరిధిలో ఉన్న 19 ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ పాయింట్ల సమీపంలో ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను అందుబాటులోకి తెస్తే ఎలా ఉంటుందనే అంశంపై హెచ్ఎండీఏ పరిశీలిస్తోంది. అనువైన స్థలాలను గుర్తిస్తోంది. వెనువెంటనే పర్మిషన్లు హెచ్ఎండీఏ డ్రైవ్ ఇన్ థియేటర్‌కి సంబంధించిన స్థలాలను గుర్తించిన తర్వాత నిర్మాణ కంపెనీల నుంచి దరఖాస్తులు అహ్వానించనుంది. ఎవరైనా డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటుకు ముందుకు వస్తే త్వరితగిన అనుమతులు జారీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కోవిడ్‌తో కోవిడ్ ఎఫెక్ట్‌తో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేందుకు వెనుకాడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అదే డ్రైవ్ ఇన్ థియేటర్ అందుబాటులోకి వస్తే ఎవరి కారులో వారు ఉంటూనే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే బిగ్స్క్రీన్పై థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు డ్రైవ్ ఇన్ థియేటర్ ఫెసిలిటీ ఉన్న అతి కొద్ది నగరాల జాబితాలో హైదరాబాద్‌కి చోటు దక్కుతుంది.] చదవండి: 47 అంతస్తులతో ‘హైదరాబాద్ వన్’.. దేశంలోనే ఫస్ట్! -
జీ+2 పర్మిషన్ తీసుకుని.. అయిదారు అంతస్తులు వేసారా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టిన భారీ అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించిన హెచ్ఎండీఏ తాజాగా తక్కువ విస్తీర్ణంలోని అక్రమ భవనాలపై దృష్టి సారించింది. హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో, అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరపంచాయతీలలో అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టింది. వివిధ జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగాలు, మున్సిపల్ అధికారులు, పోలీసులు తదితర విభాగాలకు చెందిన ప్రత్యేక బృందాలతో త్వరలోనే విస్తృత స్థాయిలో దాడులు చేపట్టనున్నారు. పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నారు. గత నెల 17 నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగించారు. నగర శివార్లలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 202 అక్రమ భవనాలను గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. చట్టవిరుద్ధమని తెలిసినా.. గ్రామ పంచాయతీలలో జీ+2 కోసం అనుమతులు తీసుకొన్న భవన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా అయిదారు అంతస్తుల భవనాలను నిర్మించారు. హెచ్ఎండీఏ ఇప్పటి వరకు చేపట్టిన కూల్చివేతలలో చాలా వరకు 600 నుంచి1000 గజాల విస్తీర్ణం కలిగిన స్థలాలు. ఇక నుంచి 600 చదరపు గజాల లోపు స్థలాల్లోనూ చేపట్టిన అక్రమ నిర్మాణాలే టార్గెట్‌గా దాడులు కొనసాగించనున్నారు. 150 గజాల నుంచి 250 గజాల వరకు ఉన్న స్థలాల్లో కూడా చాలా చోట్ల బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. ఇలాంటివి పూర్తిగా చట్టవిరుద్ధం. (క్లిక్: ఫ్లాట్ కొంటున్నారా? ఏం చేస్తే బెటర్!) అక్రమాలు వేల సంఖ్యలో.. నగర శివారు ప్రాంతాల్లో వేలాది అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులను అందుబాటులోకి తెచ్చింది. చాలామంది నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘించి గ్రామపంచాయతీల అనుమతులతోనే బహుళ అంతస్తులు చేపట్టారు. కోవిడ్ కాలంలో ఇలాంటి అక్రమ భవనాలను ఎక్కువగా నిర్మించినట్లు అధికారులు అంచనా వేశారు. తక్కువ విస్తీర్ణంలో చేపట్టిన అక్రమ కట్టడాలు వేల సంఖ్యలో ఉంటాయని అంచనా. కొరవడిన నిఘా... హెచ్ఎండీఏ ఇప్పటి వరకు చేపట్టిన కూల్చివేతల్లో తిరిగి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కూల్చిన కట్టడాలను ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, ఎమ్మెల్యేల అండతో తిరిగి నిర్మిస్తున్నారు. నిజాంపేట్, తుర్కయంజాల్, పోచారం, ఘట్కేసర్, అన్నోజీగూడ తదితర చోట్ల ఇలా పునర్నిర్మించి కొనుగోలుదారులకు అప్పగించారు. (క్లిక్: హైదరాబాదీలకు శుభవార్త! నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు) -
వివాదాస్పద 6 ఎకరాల స్థలానికి హెచ్ఎండీఏ ఎల్పీ.. ఇదో అంతుచిక్కని ప్రశ్న!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న వక్ఫ్ భూమికి ఏకంగా హెచ్ఎండీఏ లే అవుట్ పర్మిషన్ (ఎల్పీ) ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం రూపొందించిన ధరణి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలో పొందుపర్చిన ఈ భూముల వివరాలను కనీసం పరిశీలించకుండా ఏకపక్షంగా అనుమతులు జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాస్‌బుక్‌ను రద్దు చేసినా.. మహేశ్వరం మండలం కొంగరకుర్దు రెవెన్యూ పరిధిలోని ఔటర్‌ను ఆనుకుని సుమారు 500 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. 1962 నుంచి ఇప్పటి వరకు పహానీల్లో పట్టాదారు కాలంలో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్‌సాబ్ దర్గా పేరిట నమోదైంది. దీన్ని వక్ఫ్ భూమిగా పేర్కొంటూ 2008లో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూమిని సాగు చేసుకుంటున్న కొందరు రైతులు గెజిట్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేటస్ కో విధించింది. అప్పటి నుంచి కేసు పెండింగ్‌లోనే ఉంది. అనంతరం వక్ఫ్‌భూముల రిజిస్టేషన్లు సైతం నిలిచిపోయాయి.కానీ సర్వే నంబర్ 82/అ/1/1లో 11.17 ఎకరాలు ఉండగా, ఇందులో ఆరు ఎకరాలకు 2018లో ఒకరి పేరిట (ఖాతా నంబర్ 429 టీ 0516090202) పట్టాదారు పాస్‌బుక్ జారీ చేయడం.. ఒకే భూమికి రెండుసార్లు ఓఆర్సీ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో పాటు రిజిస్ట్రేషన్లు నిషేధం ఉన్న సమయంలో కొత్త పట్టాదారు పాస్‌బుక్ ఎలా ఇచ్చారని స్థాని కులు రెవెన్యూ అధికారులను నిలదీశారు. రికార్డుల్లో పొరపాటున పట్టాదారుగా నమోదైందని పేర్కొంటూ, సదరు పాసుపుస్తకాన్ని రద్దు చేస్తూ 2021 జనవరి 5న ఎండార్స్మెంట్ జారీ చేశారు. వివాదాస్పదమని తేలినా.. పట్టాదారు పాస్‌బుక్‌ను ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ సదరు వ్యక్తి నుంచి ఈ భూమిని నగరానికి చెందిన ఇద్దరు రియల్టర్లు కొనుగోలు చేశారు. ఈ మేరకు 20 ఏప్రిల్ 2021న మహేశ్వరం రిజిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్ రిజిస్ట్రర్ చేయించేందుకు యత్నించగా ఇది నిషేధిత జాబితాలో ఉన్న వివాదాస్పద స్థలమని తేలింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పెండింగ్‌లో పెడుతూ ఇదే అంశాన్ని సంబంధిత డాక్యుమెంట్‌పై కూడా రాసి పెట్టారు. ఇటు ధరణి, అటు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వెబ్సైట్లలో నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమికి హెచ్ఎండీఏ అధికారులు తాజాగా ఎల్పీ నంబర్ ఎలా జారీ చేశారనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఫైనల్ లే అవుట్ అప్రూవల్ జారీ చేయాల్సిందిగా సదరు రియల్టర్లు ప్రస్తుతం తుక్కుగూడ మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం. చాలాసార్లు ఫిర్యాదు చేశాం వక్ఫ్‌బోర్డుకు చెందిన భూమిని అమ్మడం, కొనడం నేరం. కొంతమంది రియల్టర్లు దీన్ని ఆక్రమించి, చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. హెచ్ఎండీఏ అధికారులు లేఅవుట్ పర్మిషన్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. తప్పుడు రికార్డులు సృష్టించి, అధికారులను తప్పుదోవ పట్టించి భూమిని అమ్మేందుకు యత్నిస్తున్న వారిపై.. రికార్డులు పరిశీలించకుండా అనుమతులు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. – ఎ.శ్రీనివాస్‌గౌడ్, రావిర్యాల అది ముమ్మాటికీ వక్ఫ్ భూమే.. కొంగరకుర్దు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 82లోని భూమి వక్ఫ్‌బోర్డుకు చెందినదే. కొంతమంది రియల్టర్లు ఇటీవల ఆ భూమిని చదును చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. వెంటనే సిబ్బందిని అక్కడికి పంపి పనులు నిలుపుదల చేయించాం. భూమికి సంబంధించిన డాక్యు మెంట్లు ఉంటే చూపించాలని కోరాం. ఇప్పటి వరకు రాలేదు. ఈ భూమికి హెచ్ఎండీఏ ఎల్పీ నంబర్ జారీ చేసిన విషయం తెలియదు. నిషేధిత జాబితాలో ఉన్న భూమికి ఎల్పీ నంబర్ ఎలా ఇచ్చారనేదీ అర్థం కావడం లేదు. – జ్యోతి, తహసీల్దార్, మహేశ్వరం -
చెరువులను పరిరక్షించండి
సాక్షి, సిటీబ్యూరో: హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల అభివృద్ధి, పరిరక్షణకు, చెరువుల సుందరీకరణకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హెచ్ఎండీఏ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టులపై శనివారం నానక్‌రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెరువుల సంరక్షణపై ప్రత్యేకంగా చర్చించారు. నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరువుల సంరక్షణకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కేటీఆర్ సూచించారు. హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ కూడా అనేక చెరువులను అభివృద్ధి చేస్తోందని, ఈ మేరకు రెండు సంస్థలు సమన్వయంతో ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. గండిపేట సుందరీకరణను మరింత వేగంగా విస్తృతస్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉందని, ఇది అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారుతుందన్నారు. భూముల భద్రతపై దిశానిర్దేశం.. మరోవైపు హెచ్ఎండీఏ అదీనంలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రేడియల్ రోడ్లు, మూసీ ప్రక్షాళన, మూసీపై బ్రిడ్జీల నిర్మాణం, హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు, లాజిస్టిక్ పార్కుల నిర్మాణం, రానున్న స్వల్ప , దీర్ఘకాలిక భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రణాళికలపై అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. -
ఉల్లంఘనలపై ఉక్కుపాదం
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ దాడులు కొనసాగుతున్నాయి. జనవరి 17 నుంచి ఇప్పటి వరకు 168కిపైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. వాటిలో చాలా వరకు 600 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన బహుళ అంతస్తుల భవనాలు, గోదాములు వంటి భారీ నిర్మాణాలున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు అధికారులు నాలుగు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల్లో బడంగ్పేట్, శంకర్పల్లి మున్సిపాలిటీల్లో ఎక్కువ అక్రమాలు ఉన్నట్లు అధికారులు గు ర్తించారు. ఆ తర్వాత మేడ్చల్, పోచంపల్లిలో ఎక్కు వ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ‘కూల్చివేసిన చోట తిరిగి నిర్మాణాలు చేపట్టకుండా గట్టి నిఘాను ఏర్పా టు చేశాం. క్షేత్రస్థాయిలో అధికారుల బృందం ఎ ప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఎలాంటి ఉల్లంఘన లు చోటుచేసుకొన్నా గట్టి చర్యలు ఉంటాయి’.అని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. భారీ నిర్మాణాలే ఎక్కువ... రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో సుమారు 927 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్క హెచ్ఎండీఏ పరిధిలోనే మొత్తం 459 వరకు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం 600 చదరపు గజాల నుంచి వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలో చేపట్టినవే. నిబంధనల మేరకు టీఎస్–బీపాస్ నుంచి నేరుగా అనుమతులు పొందే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది భవననిర్మాణ యజమానులు గ్రామపంచాయతీల నుంచి జీ+2 కోసం అనుమతులను పొంది అక్రమంగా 5 అంతస్తులు, అంతకంటే ఎక్కువ స్థాయిలో నిర్మాణాలు కొనసాగించారు. బడంగ్పేట్, శంకర్పల్లి, దుండిగల్లలో ఇలాంటి నిర్మాణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు కూల్చివేసిన వాటిలో అనుమతులు లేనివి, ఆమోదించిన లే– అవుట్ కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించినవే ఎక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల ప్రభుత్వ స్థలాలను, చెరువు భూములను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. కొనసాగుతున్న దాడులు... జిల్లా రెవిన్యూ అధికారులు, పోలీసు, మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీంలు హెచ్ఎండీఏ పర్యవేక్షణలో గత నెల 17 నుంచి దాడులు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 168 అక్రమాలను కూల్చివేశారు. రెండు రోజుల క్రితం జవహర్‌నగర్ పరిధిలో నాలుగు, చౌటుప్పల్ పరిధిలో మరో రెండింటిని కూల్చివేశారు. బండ్లగూడ జాగీర్, ఘట్కేసర్, బోడుప్పల్, దమ్మాయిగూడ, మణికొండ, నిజాంపేట్, తదితర ప్రాంతాల్లో అక్రమాలపై హెచ్ఎండీఏ కొరడా ఝళిపించింది. దాడులను మరింత ఉద్ధృతం చేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారి చెప్పారు. -
అవినీతి కేసులో డీఎస్పీ జగన్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని నుంచి లంచం డిమాండ్ చేసి, కొంత మొత్తం తీసుకున్న కేసులో డీఎస్పీ గ్యార జగన్‌ను అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు బుధవారం ప్రకటించారు. ఈయనతో పాటు హెచ్ఎండీఏలో ఔట్ సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న బి.రామును సైతం కటకటాల్లోకి పంపారు. కొన్ని రోజుల క్రితం వరకు హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీఎస్పీగా పని చేసిన జగన్ ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్నారు. ఈ లంచం వ్యవహారం అప్పట్లోనే చోటు చేసుకుంది. నిజాంపేటకు చెందిన బొమ్మిన కోటేశ్వరరావు ప్రజాపతి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సంస్థ కొన్ని ఉల్లంఘనలకు పాల్పడింది. ఆ విషయంలో చూసీ చూడనట్లు పోవడంతో పాటు సహకరించడానికి జగన్ రూ.4 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అందులో రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరారు. కోటేశ్వరరావు ఈ మొత్తాన్ని జూన్ 11న రాము ద్వారా జగన్‌కు ఇచ్చారు. మిగిలిన మొత్తం కూడా ఇవ్వాల్సిందిగా జగన్ వేధిస్తుండటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. తన వద్ద ఉన్న ఆధారాలతో పాటు జగన్, రాములతో జరిగిన ఫోన్ సంభాషణల వివరాలనూ అందించాడు. చదవండి: రైళ్లలో పూజలు చేసుకోవచ్చు కానీ.. దీంతో జగన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఏసీబీ అధికారులు రెండు నెలల క్రితమే వలపన్నారు. ఇది కార్యాచరణలోకి వచ్చేసరికి జగన్ హెచ్ఎండీఏ నుంచి బదిలీ అయ్యారు. బాధితుడు అందించిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు మంగళవారం హబ్సిగూడలోని జగన్ ఇంటిపై దాడి చేసి అతడిని, అనంతరం సెక్యూరిటీ గార్డు రామును అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం. నిందితులను కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. చదవండి: గాడిద పాలకు మంచి డిమాండ్.. కప్పు పాల ధర ఎంతంటే.. -
తెలంగాణ మున్సిపల్‌శాఖ కీలక ఉత్తర్వులు
సాక్షి హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ కొరడా ఝుళిపించింది. హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరుతో హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా అక్రమంగా భారీ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలు కూల్చివేతలను ఆదేశించింది. సాధారణంగా హెచ్ఎండీఏ పరిధిలో గ్రామ పంచాయతీలు జీ ప్లస్ 2 వరకు మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. - అంతకు మించి భారీ నిర్మాణాలు, అనుమతి లేని విల్లాలను కూల్చి వేయాలని ఆదేశించింది. కాగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాలాలపై ఆక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి మంగళవారం నాళాల అభివృద్ధి పై సమీక్ష చేయనున్నట్లు తెలిపారు. వారానికి ఒకసారి క్షేత్ర స్థాయిలో నాలలను పరిశీలన చేయనున్నట్లు వెల్లడించారు. నాళాలపై నిర్మణాల కూల్చివేతల బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయించాలని నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: నయా మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై నజర్ -
Uppal: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ మరోసారి అ‘ధర’హో అనిపించింది. గురువారం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో చదరపు గజానికి ఏకంగా రూ.లక్షా ఒక వెయ్యి ధర పలికింది. ఓ కొనుగోలుదారు 222 చదరపు గజాల ప్లాట్‌ను సొంతం చేసుకోగా, మరొకరు ఇంతే ధర చెల్లించి 368 చదరపు గజాలను దక్కించుకున్నారు. 1,196 గజాలున్న మరో ప్లాట్‌కు రూ.77 వేల ధర లభించింది. మరోవైపు గురువారం నాటి బిడ్డింగ్‌లో 1,787 గజాలున్న మరో ప్లాట్‌కు గజానికి రూ.53 వేల చొప్పున కనిష్ట ధర లభించింది. ఈ వేలంలో సగటున గజానికి రూ.71,815.5 చొప్పున ధర పలికినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో హెచ్ఎండీఏకు రూ.141.61 కోట్ల ఆదాయం లభించింది. ఉప్పల్ భగాయత్‌లో వేలం నిర్వహించతలపెట్టిన 44 ప్లాట్లలో సుమారు 150 చదరపు గజాల నుంచి 1,787 చదరపు గజాల వరకు మొత్తం 19,719 చదరపు గజాల మేర విస్తరించి ఉన్న 23 ప్లాట్లకు ఆన్లైన్ బిడ్డింగ్ జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ.77000, కనిష్టంగా రూ.53 వేలు పలికింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ.లక్షా వెయ్యి చొప్పున, కనిష్టంగా రూ.73 వేల చొప్పున డిమాండ్ రావడం విశేషం. లుక్ ఈస్ట్ లక్ష్యంగా.. ►సుమారు రెండు వేల గజాల నుంచి 15 వేల గజాలకు పైగా ఉన్న మరో 21 ప్లాట్లకు శుక్రవారం ఈ– బిడ్డింగ్ జరగనుంది. ఉప్పల్ భగాయత్‌లోని హెచ్ఎండీఏ లేఅవుట్ ప్లాట్లకు వేలం నిర్వహించడం ఇది వరుసగా మూడోసారి. 2019లో నిర్వహించిన ఈ బిడ్డింగ్‌లో గజానికి గరిష్టంగా రూ.79 వేలు, కనిష్టంగా రూ.36 వేల వరకు ధర పలికింది. ఈ సారి పోటీ మరింత పెరిగింది. ►ఉప్పల్‌లో నిర్మాణ రంగం ఊపందుకుంది. పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణమవుతున్నాయి. మెట్రో రైలు సదుపాయంతో పాటు ఉప్పల్ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అనువైన రవాణా సదుపాయం ఉండడం, ఇటు వరంగల్ హైవేకు, అటు విజయవాడ హైవేకు అందుబాటులో ఉండడంతో మధ్యతరగతి, ఉన్నత ఆదాయ వర్గాలు ఉప్పల్ భగాయత్‌పై ఆసక్తి చూపుతున్నాయి. ►ఈ క్రమంలోనే ప్రభుత్వం సైతం ‘లుక్ ఈస్ట్’ లక్ష్యంతో ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన దృష్టి సారించింది. దీంతో బడా బిల్డర్లు, నిర్మాణ సంస్థలు 10 అంతస్థుల నుంచి 26 అంతస్థుల వరకు కూడా అపార్ట్మెంట్ల నిర్మాణాలను చేపట్టాయి. ఈ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు హాట్ కేక్‌లా అమ్ముడవుతుండడంతో నిర్మాణ సంస్థలు ఈసారి మరింత పోటీ పడ్డాయి. ►గతంలో రూ.79 వేల వరకు డిమాండ్ రాగా ఈ సారి రూ.లక్ష దాటినట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 1.35 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 44 ప్లాట్లలో 21 రెసిడెన్షియల్ ప్లాట్లు, 15 బహళ ప్రయోజన ప్లాట్లు ఉన్నాయి. షాపింగ్ కేంద్రాల కోసం మరో ప్లాట్లు, ఆస్పత్రులకు 2, విద్యాసంస్థలకు 2 ప్లాట్ల చొప్పున కేటాయించారు. -
చైనా పోన్జీ స్కీముల తరహాలో.. హైదరాబాద్‌లో మోసాలు.. డెవలపర్ల సంఘం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మార్కెట్ రేటు కంటే తక్కువ ధర అని సామాన్య ప్రజలకు ఆశ చూపిస్తూ.. తనది కాని స్థలంలో ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తానని నమ్మబలుకుతూ కొనుగోలుదారులను నట్టేట ముంచుతున్న బిల్డర్లకు కంచె వేయాలని డెవలపర్ల సంఘాలు ముక్త కంఠంతో కోరాయి. అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) కింద విక్రయాలను చేపడుతున్న ప్రాజెక్ట్‌లకు అనుమతులను, రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సూచించా రు. బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు ఆయా ప్రాజెక్ట్‌లకు రుణాలను మంజూరు చేయవద్దని కోరాయి. నిర్మాణ రంగానికి భద్రత, భరోసా కల్పించకపోతే గ్లోబల్ హైదరాబాద్ ఎదుగుదలకు యూడీఎస్ డెవలపర్లు విరోధంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ, రెరాలకు శాశ్వత కమిషనర్లను నియమించడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, ప్రజలలో విస్తృతమైన అవగాహన చేపట్టాలని సూచించారు. శుక్రవారం క్రెడాయ్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ సంఘాల సమావేశం జరిగింది. ► గతంలో చైనా కంపెనీలు పోన్జీ స్కీమ్‌లతో ఎలాగైతే అమాయక కస్టమర్ల నుంచి కోట్ల రూపాయాలను కొల్లగొట్టాయో.. అదే విధంగా యూడీఎస్ విక్రయాలతో కొందరు డెవలపర్లు తయారయ్యారని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణా రావు ఆరోపించారు. ప్రారంభ దశలోనే ఆయా డెవలపర్లను ఆడ్డుకోకపోతే సామాన్య, మధ్యతరగతి ప్రజల పెట్టుబడులు గాల్లో కలిసిపోతాయని తెలిపారు. గత ఏడాదిన్నర క్రితం ఒకట్రెండు యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసిన కస్టమర్లు నిర్మాణ పనులు ప్రారంభం కాక, కట్టిన డబ్బులూ వెనక్కి ఇవ్వకపోవటంతో రోజూ డెవలపర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. సంఘటిత నిర్మాణ రంగానికి యూడీఎస్ ఒక కేన్సర్ మహమ్మారి లాగా తయారవుతోందని... దీన్ని ప్రాథమిక దశలోనే నిర్మూలించాలి. లేకపోతే ఝాడ్యం ముదిరి బ్రాండ్ హైదరాబాద్‌ను దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. ► హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెరా నిబంధనల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయడమే పరమావధిగా యూడీఎస్ ప్రాజెక్ట్‌లు చేపట్టడుతున్నారు. మార్కెట్ రేటు కంటే 50 శాతం తక్కువ ధరకు ఆఫర్ చేస్తుండటంతో కస్టమర్లు ఆశ పడుతున్నారు. ముందు వెనకా ఆలోచించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. నిర్మాణ అనుమతులు రాకపోయినా, ఆయా స్థలానికి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా లేదా సంబంధిత భూమి కన్జర్వేషన్ జోన్ లేదా 111 జీవో పరిధిలో ఉన్నా నిర్మాణ అనుమతులు రావు. కస్టమర్ల పెట్టుబడులకు భరోసా లేదు. భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలకు తామూ బాధ్యత వహించాల్సి వస్తుందని కొనుగోలుదారులకు అర్థం కావట్లేదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా కొనుగోలుదారులు మోసపోయామని తెలుసుకొని వినియోగదారుల ఫోరంకు, రెరాకు వెళ్లినా లాభం ఉండదు. సివిల్ కోర్ట్‌కు పోతే ఎన్నేళ్లు పడుతుందో బహిరంగ రహస్యమే. ► గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించాలనే ఉద్దేశంలో రెరా చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, మన రాష్ట్రంలో రెరా అమలు అంతంత మాత్రంగానే సాగుతోందని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి అన్నారు. హైదరాబాద్ మార్కెట్లో 60–70 శాతం కొనుగోళ్లు అంతిమ గృహ కొనుగోలుదారులు, 30–40 శాతం పెట్టుబడిదారులుంటారు. ఇలాంటి చోట కస్టమర్ల పెట్టుబడులకు భద్రత కల్పించాల్సిన రెరా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అక్రమ పద్దతిలో నిర్మాణాలు, విక్రయాలు చేపడుతున్న డెవలపర్లను ఎలా నియంత్రించాలనే అంశంపై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు డెవలపర్ల సంఘాలు ప్రభుత్వంతో కలిసి వస్తాయని తెలిపారు. ► రెరాలో డెవలపర్లే కాదు కొనుగోలుదారులకు శిక్ష ఉంటుంది. భవిష్యత్తులో ఏమైనా జరిగితే కోర్ట్‌కు వెళ్లినా లాభం ఉండదు. రెరాలో నమోదు కాని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేయాలన్న ప్రాథమిక నిబంధనలను మరిచిపోయి తక్కువ ధర అని ఆశ పడి యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసినందుకు మీకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల ఫోరం, రెరా న్యాయం చేయవని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీకృష్ణా రెడ్డి తెలిపారు. సామాన్య, మధ్యతరగతి నుంచి ముందస్తు సొమ్ము వసూలు చేసి.. అక్రమ డెవలపర్లు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. ఎవరు చేస్తున్నారో చెప్పరు! యూడీఎస్, ప్రీలాంచ్లలో కొనుగోలు చేయొద్దని, కష్టార్జితాన్ని బూదిదపాలు చేసుకోవద్దని కొనుగోలుదారులకు డెవలపర్ల సంఘాలు సూచిస్తుండటం ప్రశంసించదగ్గ పరిణామమే. కానీ, ఆయా ప్రాజెక్ట్‌లను ఎవరు చేపడుతున్నారో తెలపమని విలేకరులు ప్రశ్నించగా.. ప్రమోటర్ల పేర్లు బయటకు రాకుండా ఏజెంట్లతో దందా నడిపిస్తున్నారని సమాధానం ఇచ్చారు. వాట్సాప్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సాధారణంగా సంఘటిత డెవలపర్లకు ఏజెంట్లకు 1.5–2 శాతం కమీషన్ ఇస్తుంటే.. యూడీఎస్ డెవలపర్లు మాత్రం 5–10 శాతం కమీషన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో వివరాలు ఉన్నాయని, కానీ, చర్యలు తీసుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఆడిట్ బుక్స్ పరిశీలిస్తే తతంగం బయటపడుతుందని పేర్కొన్నారు. డెవలపర్ల సంఘాల దృష్టికి వచ్చిన యూడీఎస్ ఏజెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి, ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తదితరలు పాల్గొన్నారు. ► జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా కార్యాలయాలలో ఇన్ఫర్మేషన్ గైడెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. గృహ కొనుగోలుకు ముందు కొనుగోలుదారులు ఆయా కేంద్రాలను సంప్రదిస్తే.. వారికి మార్గనిర్ధేశనం చేయాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు సూచించారు. దీంతో అమాయక ప్రజలు మోసపోకుండా ఉండటంతో పాటు ప్రభుత్వం, నిర్మాణ సంస్థలతో నమ్మకం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కన్జర్వేషన్ జోన్, 111 జీవో పరిధిలోనూ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని దీంతో హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుందని తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ రేట్‌ను అంచనా వేయకుండా నిర్మాణ రంగంలో ఏమాత్రం అనుభవం లేకుండా ఆకాశంలో మేడలు కడతామని ఆశచూపిస్తూ అమాయకులను కలలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ► చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకొని కొందరు డెవలపర్లు అక్రమంగా ప్రాజెక్ట్‌లు, విక్రయాలు చేపడుతున్నారు. తక్కువ ధర అని ఆశ చూపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. సంఘటిత నిర్మాణ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డెవలపర్లపై కూడా ఉందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ప్రెసిడెంట్ సీ ప్రభాకర్‌రావు అన్నారు. అందుకే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన చేపట్టనున్నామని పేర్కొన్నారు. ► నోయిడా, గ్రేటర్ నోయిడాలో విక్రయించిన యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో ధర మార్కెట్ రేటుతో సమానంగా విక్రయించారు. అయినా సరే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. అలాంటిది మన దగ్గర మార్కెట్ రేటు కంటే సగం ధరకే యూడీఎస్ స్కీమ్‌లో విక్రయాలు చేపడుతున్నారు. మరి, ఇక్కడెలా నిర్మాణాలు చేయగలరనేది కొనుగోలుదారులు ప్రశ్నించుకోవాలని ట్రెడా ప్రెసిడెంట్ ఆర్ చలపతిరావు అన్నారు. చిన్న వస్తువును కొంటే ఐఎస్ఐ మార్క్ ఉందా? బ్రాండెడేనా అనా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకునే ఈ రోజుల్లో.. లక్షల్లో వెచ్చించే గృహ కొనుగోలు సమయంలో డెవలపర్ చరిత్ర, నిర్మాణ అనుమతులు, రెరా నమోదు వంటి కీలక అంశాలు పరిశీలించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. రిస్క్ లేని చోట పది గజాలు తక్కువైనా మంచిది గడువు లోగా నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశం చేసే వీలుంటుందని పేర్కొన్నారు. ఓపెన్‌స్పేస్, పార్క్‌లు, సెట్‌బ్యాక్స్, పర్మిషన్స్, అంతస్తుల సంఖ్య.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కొనుగోలుకు ముందే పరిశీలించుకోవాలని సూచించారు. ఎకరం రూ.50 కోట్లు ఉంటే 50 అంతస్తులు, రూ.40 కోట్లు ఉంటే 40 ఫ్లోర్లు.. ఇలా ఎంత రేటు ఉంటే అన్ని అంతస్తులు నిర్మిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలుదారులు రేటు తక్కువ చూపించేందుకే ఈ అసత్య ప్రచారమని తెలిపారు. -
వేలానికి 44 ప్లాట్లు.. అందరి చూపు ఉప్పల్వైపు.. నిబంధనలు ఇవే!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మధ్యతరగతి వేతన జీవుల్లో మరోసారి ఆశలు రేకెత్తిస్తోంది. సొంతింటి కలను సాకారం చేసుకొనేందుకు నగరవాసులు తూర్పు వైపు దృష్టి సారించారు. ఉప్పల్ మెట్రో స్టేషన్‌ను ఆనుకొని ఉన్న విశాలమైన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మిగిలిన 44 ప్లాట్లకు ఈ– వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాట్లపై నిర్వహించిన ప్రీ–బిడ్డింగ్ సమావేశానికి అనూహ్య స్పందన లభించింది. వివిధ వర్గాలకు చెందిన కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక రియల్ఎస్టేట్ వ్యాపారులతో పాటు, బిల్డర్లు, డెవలపర్లు, పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు, ఏజెన్సీల ప్రతినిధులు సమావేశానికి హాజరై నియమ నిబంధనలను అడిగి తెలుసుకున్నారు. సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ అధికారులు బి.ఎల్.ఎన్.రెడ్డి(చీఫ్ ఇంజినీర్), కె.గంగాధర్ (ఎస్టేట్ ఆఫీసర్), సి.విజయలక్ష్మి (చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్), ఎం.రాంకిషన్ (ఓఎస్డీ), కె.గంగాధర్ (చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్), ప్రసూనాంబ (ల్యాండ్ అక్విజేషన్ ఆఫీసర్) ఎంఎస్టీసీ పాల్గొన్నారు. (చదవండి: ఊహించిందే జరిగింది; ఎన్నిక లేదు.. ఏకగ్రీవమే!) మధ్యతరగతిలో కొత్త ఆశలు.. ► సుమారు 733 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉప్పల్ భగాయత్‌లో 250 ఎకరాల్లో అన్ని మౌలిక వసతులతో వెంచర్‌ను అభివృద్ధి చేశారు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న ఉప్పల్ భగాయత్ మధ్యతరగతి వర్గాలను ఎక్కువగా ఆకర్షిస్తోంది. వేలం వేయనున్న 44 ప్లాట్లలో 150 గజాల నుంచి 300 గజాల వరకు ఉన్న రెసిడెన్షియల్ ప్లాట్లు 21 వరకు ఉన్నాయి. మిగతావి మల్టీపర్పస్ ప్లాట్లు ఉన్నాయి. ► గతంలో నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ.79 వేలు, కనిష్టంగా రూ.30 వేల వరకు ధర పలికింది. దీంతో ఈసారి వేలంలో కూడా ఎక్కువ మంది రెసిడెన్షియల్ ప్లాట్లపైనే ఆసక్తి చూపుతున్నారు. (చదవండి: వన్నె తగ్గని ఉస్మానియా యూనివర్సిటీ) ► 5 వేల నుంచి 15 వేల గజాల వరకు ఉన్న కొన్ని ప్లాట్లను కూడా ఈసారి వేలానికి సిద్ధంగా ఉంచారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్ వంటి భారీ వాణిజ్య భవనాల నిర్మాణం కోసం విశాలమైన ప్లాట్లు ఉన్నాయి. ► గతంలో పెద్ద ప్లాట్లకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని కూడా చిన్న సైజు ప్లాటుగా అభివృద్ధి చేసి విక్రయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: కూకట్పల్లి టూ కోకాపేట్.. త్వరలో లైట్ రైల్ ?) నిబంధనలివీ.. ► ఉప్పల్ భగాయత్‌లోని 44 ప్లాట్లకు వచ్చే నెల 2, 3 తేదీల్లో ఆన్లైన్ బిడ్డింగ్ జరగనుంది. ఇందులో ప్లాట్లను దక్కించుకున్న వారు 90 రోజుల్లో పూర్తి స్థాయి పేమెంట్ చేసినట్లయితే ఆ తర్వాత మరో 15 రోజుల్లో హెచ్ఎండీఏ ప్లాట్లను వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసి అప్పగిస్తుంది. ► కొనుగోలుదారులు ఫ్లాట్ మొత్తం విలువలో 25 శాతం చెల్లిస్తే మిగతా మొత్తం బ్యాంక్ రుణంగా పొందే అవకాశం ఉంది. ఉప్పల్ భగాయత్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ భవన నిర్మాణ అనుమతులు హెచ్ఎండీఏ మాత్రమే ఇస్తుంది. ► బ్యాంక్ చార్జెస్ కలుపుకొని ఈఎండీ చెల్లించాల్సి ఉంటుంది. సందేహాల నివృత్తికి హెచ్ఎండీఏ అధికారులను సంప్రదించవచ్చు. పౌరులందరూ ఈ బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. దేశంలో నివసిస్తున్న ఇతర దేశస్తులకు మాత్రం అనుమతి ఉండబోదు. -
కూకట్పల్లి టూ కోకాపేట్.. త్వరలో లైట్ రైల్ ?
ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా మరో కొత్త ప్రాజెక్టును హైదరాబాద్‌లో చేపట్టేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇప్పటికే నగరంలో ఉన్న మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్), హైదరాబాద్ మెట్రోరైల్ (హెచ్ఎంఆర్)లకు తోడుగా లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎల్ఆర్టీఎస్)ను తెస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. నగరంలో గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ఏరియాల్లో అనేక బహుళజాతి కంపెనీలు ఇప్పటికే కొలువై ఉన్నాయి. మరిన్ని కంపెనీలు ఈ ఏరియాలో రాబోతున్నాయి. లక్షల మంది ఉద్యోగులు నిత్యం ఇక్కడ పని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వీరంతా ఆఫీసులకు వచ్చి పోయేందుకు ఇబ్బంది రాకుండా ఉండాలనే ప్రస్తుతం ఉన్న రవాణ వ్యవస్థకు అదనంగా మరొకటి తేవాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అతి పెద్ద హౌజింగ్ బోర్డుల్లో ఒకటిగా ఉన్న కూకట్పల్లి నుంచి కోకాపేట వరకు లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్‌పోర్ట్ అథారిటీ (హెచ్‌యూఎంటీఏ)లు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రెడీ చేస్తున్నట్టు సమాచారం. హెచ్‌యేఎంటీఏలో హెచ్ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌లు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం కూకట్పల్లి హౌజింగ్ బోర్డు నుంచి కోకాపేట వరకు మొత్తం 24.50 కిలోమీటర్ల మేర ఎల్‌ఆర్‌టీఎస్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ మార్గం వల్ల ఒకేసారి కేపీహెచ్‌బీ, రాయదుర్గం మెట్రోస్టేషన్లు, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ అనుసంధానం అయ్యే అవకాశం ఉంది. నార్సింగి దగ్గర మెట్రో ఫేట్ 2 లైన్ సైతం టచ్ అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు. -
Sunday Funday: సండే-ఫండే’లో స్టాల్ పెడతారా?
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే-ఫండేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఎందరో ఉత్సాహం కనబరుస్తున్నారు. దీంతో సండే-ఫండే సందర్భంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు.. ముఖ్యంగా హస్తకళలు, చేనేత సంబంధిత, ఈటరీస్ తదితర స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాళ్లలో ఉంచే ఉత్పత్తులు, ధరలతోపాటు సంప్రదించాల్సిన వారి వివరాలు తదితరమైనవి ea2ps-maud @telangana.gov.in మరియు hcip hmda@gmail.com చిరునామాలకు మెయిల్ చేయాల్సిందిగా పేర్కొంది. లేదా హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రతి సోమ, మంగళ వారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లిఖిత పూర్వక విజ్ఞప్తిని అందజేయవచ్చని సూచించింది. లాటరీ ద్వారా ఎంపిక చేసినవారికి నామమాత్రపు ఫీజుతో రెండు వారాల పాటు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అందరికీ సమాన అవకాశం కల్పించేందుకు కేటగిరీల వారీగా లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. దీంతోపాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు సంగీతం తదితర కళారూపాలను ప్రదర్శించాలనుకునే వ్యక్తులు, గ్రూపులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్ఎండీఏ పేర్కొంది. -
‘డబ్బు’ల్ ధమాకా!
మణికొండ(హైదరాబాద్): హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అక్రమాలకు అంతులేకుండాపోతోంది. మాస్టర్‌ప్లాన్‌లో రోడ్డుగా చూపిన స్థలంలో బహుళ అంతస్తు భవనానికి అనుమతి ఇచ్చిన ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ఒక లేఔట్‌కు అనుమతి జారీ చేసిన హెచ్ఎండీఏ.. అందులోని ప్రజావసరాలకు వదిలిన స్థలాన్ని కలుపుకొని మరో లేఔట్‌కు పర్మిషన్ ఇచ్చింది. రెండో లేఔట్ జారీ చేసేనాటికే.. ఈ ఖాళీ స్థలం స్థానిక గ్రామ పంచాయతీకి గిఫ్డ్‌డీడ్ కింద రిజిస్ట్రేషన్ కూడా కావడం గమనార్హం. హెచ్ఎండీఏ చేసిన తప్పును ఎత్తిచూపాల్సిన స్థానిక పురపాలక సంఘం.. లేఔట్ కాపీని పట్టించుకోకుండా తమ పేరిట రిజిష్టర్ అయిన ఖాళీ స్థలంలో వేరొకరికి బిల్డింగ్ పర్మిషన్ను జారీ చేసింది. భవన నిర్మాణ అనుమతి సమయంలో స్థల యజమాని ఎవరనేది కూడా చూడకుండా మున్సిపాలిటీ గుడ్డిగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ అవినీతి భాగోతం ఐటీ హబ్ సమీపంలోని మణికొండ పురపాలిక పరిధిలో జరిగింది. సుమారు రూ.50 కోట్ల విలువైన భూమికి స్కెచ్ వేసిన రియల్టర్లకు కొందరు పెద్దలు, అధికారులు కూడా తోడు కావడంతో భవన నిర్మాణానికి పునాది పడింది. పంచాయతీ పేర రిజిస్ట్రేషన్ 17.36 ఎకరాల విస్తీర్ణంలో వేసిన తిరుమలహిల్స్ లేఔట్లో 8,633 గజాలను పార్కు స్థలాలుగా నిర్దేశించారు. ఈ మేరకు ఈ విస్తీర్ణాన్ని స్థానిక పంచాయతీకి 1993లో గిఫ్ట్‌డీడ్ కూడా చేశారు. మూడేళ్ల క్రితం ఈ పంచాయతీ మణికొండ మున్సిపాలిటీలో విలీనం కావడంతో డాక్యుమెంట్లను ఇక్కడకు బదలాయించారు. విలువైన ఈ స్థలాన్ని కాపాడుకోవాల్సిన మున్సిపల్ యంత్రాంగం.. కనీసం కంచె కూడా వేయకుండా వదిలేసింది. అంతేగాకుండా.. ఈ స్థలాన్ని చూపుతూ మరో లేఔట్ వెలిసినా చోద్యం చూస్తూ ఉండిపోయింది. దీంతో బిల్డర్ల ఆటలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా వేసిన రెండో లేఔట్లో ఇళ్ల నిర్మాణాలకు టౌన్‌ప్లానింగ్ విభాగం పర్మిషన్లు జారీ చేస్తుండటం విశేషం. స్కెచ్ వేశారు.. చెక్కేశారు పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 87, 119లో 17.36 ఎకరాలలో తిరుమల్హిల్స్ పేరిట 1990లో హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ (హుడా) 10132/ఎంపీ2/హుడా/1990 పేరిట లేఔట్‌కు అనుమతి ఇచ్చింది. హుడా అనుమతి ఇచ్చిన వెంచర్ కావడం.. నగరానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడి ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. క్రమేణా ఈ వెంచర్ కాస్తా సంపన్నుల కాలనీగా మారింది. దీంతో ఖాళీ స్థలాలపై పాత రియల్టర్ల కన్ను పడింది. పాత వెంచర్‌లోని ఖాళీ స్థలాలకు పక్కనే మరికొంత స్థలాన్ని (వేరే యజమాని) కలుపుకొని రెండో లేఔట్‌కు ప్రణాళిక రచించారు. హెచ్ఎండీఏ అధికారులతో కుమ్మక్కై 6 వేల గజాల పార్కు స్థలాన్ని (మొదటి లేఔట్లో చూపిన) కాజేసే ఎత్తుగడకు తెర లేపారు. రెండో లేఔట్ ప్రకారం స్థలాలను అమ్మేసి రియల్టర్లు చెక్కేశారు. తాజాగా ఈ ప్లాట్లను కొన్నవారు ఇళ్ల నిర్మాణాలకు రావడం.. మొదటి లేఔట్లో కొనుగోలు చేసినవారు వీరిని అడ్డుకోవడంలో అసలు కథ బయటపడింది. మరో విచిత్రమేమిటంటే.. రెండో లేఔట్లో నిబంధనలకు అనుగుణంగా కేటాయించాల్సిన పార్కు స్థలాన్ని పక్కనే ఉన్న అజయ్హిల్స్ కాలనీ పార్కును చూపడం. అధికారుల వైఫల్యం హుడా అనుమతులతో వచ్చిన లేఔట్లో పార్కు స్థలాలను అప్పటి పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినా వాటిని పరిరక్షించడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలోనే ప్రహరీ నిర్మాణం చేస్తే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. – డాక్టర్ పి.అవినాష్, తిరుమలహిల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసు ఉండగా అనుమతులా..? తమ కాలనీ పార్కు స్థలాలుగా చూపిన దాన్నే తిరిగి హెచ్ఎండీఏ అధికారులు లేఔట్‌కు అనుమతి ఇవ్వటం దారుణం. దాన్ని రద్దుచేశామని ఒకవైపు చెబుతునే మరోవైపు మున్సిపాలిటీ అధికారులు నిర్మాణ అనుమతులు ఇవ్వటం మరింత దారుణం. సదరు భూమి విషయం కోర్టులో ఉన్నా ఇలాంటి చర్యలు జరగటాన్ని ప్రభుత్వం సమర్ది్థస్తుందా..? లేదంటే అలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరిస్తేనే ప్రభుత్వం, శాఖలపై నమ్మకం పెరుగుతుంది. – రంగాచారి, తిరుమలహిల్స్ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి నిబంధనల ప్రకారమే అనుమతులు హెచ్ఎండీఏ జారీ చేసిన లేఔట్ కావడంతోనే భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేశాం. సదరు లేఔట్ రద్దు అయిన విషయం తెలియదు. కాలనీవాసులు పేర్కొంటున్న పార్కు భూమి కోర్టు వివాదంలో ఉండటంతో దాన్ని పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. గతంలో గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచే దానిపై వివాదాలు కోర్టులో ఉన్నాయి. – ఎస్.జయంత్, కమిషనర్, మణికొండ మున్సిపాలిటీ -
HMDA: స్వీపర్లకు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల వేధింపులు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ సర్కిల్ పరిధిలోని శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ)ల ఆగడాలు రోజు రోజుకు తారా స్థాయికి చేరుతున్నాయి. చివరకు డబ్బులిస్తేనే ఉద్యోగం చేయాలని అన్నట్లు వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు నిత్యం వెల్లువెత్తుతున్నాయి. నెల జీతం వచ్చిందంటే చాలు అప్పులోల్ల వలే ఇచ్చేదాక వెంటపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవ్వని వారిని నయాన్నో, భయాన్నో దారిన తెచ్చుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకుంటే వేధింపులు గురిచేస్తూ స్వీపర్లను నానా హింసలు పెడుతున్నట్లు బాధితులు బాహాటంగానే ఫిర్యాదులు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారికి అత్యవసర సమయాల్లో సెలవులు ఇవ్వరు. మెడ తిప్పనీయకుండా పనులు చెబుతూ ఆజమాయిషి చేలాయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా బయోమెట్రిక్ వారి చేతులోనే ఉంటుంది కావునా ఆడిందే ఆటగా ఎస్ఎఫ్ఎలు చలామని అవుతున్నారు. ఇదే విషయం ఉన్నతాధికారులకు తెలిసినా సున్నితంగా మందలించి వదిలేస్తూ పట్టీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఒక్కో స్వీపరు వద్ద ప్రతినెలా రూ. 500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. లేకపోతే వేధింపులు తప్పవని బాధితులు కిమ్మనకుండా అడిగినంతా ఇచ్చుకుంటున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్ సర్కిల్లో ఎస్ఎఫ్ఎలు 22 మంది, జవాన్లు 11 మంది, 476 మంది స్వీపర్లు నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా శానిటరీ సూపర్ వైజర్ ఆధీనంలో ఉంటూ పనిచేస్తున్నారు. ప్రస్తుతం డీఈ స్థానంలో గతంలో ఏఎంఓహెచ్ ఉండే వారు. గత సంవత్సర కాలంగా ఉప్పల్ సర్కిల్లో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. అదే స్థానంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ డీఈని అపాయింట్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. ఎస్ఎఫ్ఐల వేధింపులు మా దృష్టికి రాలేదు. వేధింపులకు పాల్పడే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటాం. బాధితులు ఎవ్వరైన ఉంటే నేరుగా సంప్రదించి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – చందన, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ డీఈ చదవండి: West Godavari: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి -
లింక్ రోడ్డుపై ఏసీబీ విచారణ
మణికొండ: ఓ వైపు హైదరాబాద్ చుట్టూరా లింక్, స్లిప్ రోడ్లను అభివృద్ది చేసి ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పట్టణాభివృద్ది శాఖలు ప్రయత్నిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా హెచ్ఎండీఏ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 2015లో భూసేకరణ చేసిన స్థలంలోనే ఏకంగా బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లకు 2017లో అనుమతులు జారీ చేసింది. దాంతో హైదరాబాద్ శివారు, ఐటీ జోన్‌కు పక్కనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల ప్రజలకు ఔటర్‌రింగ్ రోడ్డును కలుపుతూ అందుబాటులోకి రావాల్సిన లింక్ రోడ్డు రాకుండా పోయింది. అదే విషయాన్ని మార్చి 25న ‘సాక్షి’ దినపత్రిక మొదటి పేజీలో ‘రోడ్డెందుకు సన్నబడింది’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. దాంతో స్పందించిన మంత్రి కె.తారకరామారావు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండీఏ ఇన్చార్జి కమిషనర్ అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. అదే కథనానికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డిలు పట్ణణాభివృద్ది శాఖ మంత్రికి మాస్టర్ ప్లాన్‌లో చూపిన విధంగా అలకాపూర్ టౌన్షిప్ మీదుగా వంద అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అడ్డుగా వచ్చిన అపార్ట్మెంట్లను కూల్చాలని లేఖ రాశారు. అప్పట్లోనే ఓ స్థాయి విచారణ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దానికి అంగీకరించని ప్రభుత్వం ఏకంగా ఈ వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించింది. ఏసీబీ అధికారుల పరిశీలన నార్సింగ్, మణికొండ మున్సిపాలిటీల పరిధిలోని అలకాపూర్ టౌన్షిప్ మీదుగా రేడియల్ రోడ్డు 4 నుంచి రేడియల్ రోడ్డు 5 వరకు నిర్మించాల్సిన వంద అడుగుల లింక్ రోడ్డును గురువారం ఏసీబీ, హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్, ప్రాజెక్ట్స్ విభాగం అధికారులు పరిశీలించారు. రోడ్డు మధ్యల వరకు అపార్ట్మెంట్ల సముదాయానికి అనుమతులు ఇచ్చిన విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు కొలతలు, రోడ్డులోకి వచ్చిన భవనం కొలతలను తీసుకున్నారు. అనుమతులు జారీ చేసే సమయంలో రోడ్డు స్థలాన్ని ఎందుకు పట్టించుకోలేదని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. రోడ్డుకు చెందిన ఎంత స్థలం ఆక్రమణకు గురైందో మరింత లోతుగా సర్వే చేసి నివేదికను అందజేయాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. విచారణలో హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్ అధికారులు కృష్ణకుమార్, నారాయణరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ దీపిక, స్థానిక టీపీఎస్ సంతోష్‌సింగ్, ఏసీబీ అధికారులు శరత్‌లతో పాటు మరికొంత మంది పాల్గొన్నారు.