
సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణ నాలుగో రోజు ముగిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపై ఏసీబీ ఆరా తీసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరెవరు బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించారనే దానిపై ఏసీబీ అధికారులు విచారించారు.
బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్‌ను ఏసీబీ విచారించింది. ఏసీబీ కార్యాలయానికి పిలిపించి సునీల్‌ను అధికారులు ప్రశ్నించారు. బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ఏసీబీ గుర్తించింది. బాలాజీ పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు తేలింది.
బాలకృష్ణ కాసుల కక్కుర్తిపై విచారణ అధికారులు షాక్ అవుతున్నారు. రెరా కార్యాలయం నాలుగో అంతస్తులోని బాలకృష్ణ చాంబర్‌లో లాకర్‌ను అధికారులు బ్రేక్ చేశారు. 12 లక్షలు విలువ చేసే చందనపు చీరలు, 20 లక్షలకు పైగా క్యాష్ లభ్యమైంది. వాటితో బాలకృష్ణ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు ఫోటో ఆల్బమ్‌లు, కీలకమైన భూముల పాసు పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: ఆ కార్లు ఎక్కడివి?
Comments
Please login to add a commentAdd a comment