
సాక్షి, హైదరాబాద్: బుద్వేల్ భూముల అంశంలో హెచ్‌ఎండీఏ వేలాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. భూముల వేలంపై స్టే ఇవ్వాలని కోర్టుని కోరింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. దీనిపై స్పందిస్తూ.. బార్ అసోసియేషనల్‌లో విభేదాలు ఉన్నాయని, అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని స్పష్టం చేసింది.
కాగా బుద్వేల్ లోని ప్రభుత్వ భూములను గతంలో హైకోర్టు కోసం కేటాయిస్తామన్న వాదనతో బార్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లింది. దీంతో బుద్వేల్ భూముల వేలంపై న్యాయవాదుల సంఘం కోర్టుని ఆశ్రయించింది. రంగారెడ్డి బుద్వేల్‌లోని 100 ఎకరాలకు హెచ్‌ఎండీఏ ఈ వేలం వేసేందుకు సిద్ధమైంది. 100 ఎకరాల్లో 14 ప్లాట్‌కు ఆన్‌లైన్ వేలం జరపాలని నిర్ణయించింది. ఈ భూమూలను దక్కించుకోవాలని రియల్ ఎస్టేట్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. దీని ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తుందని హెచ్‌ఎండీఏ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment