సాక్షి, హైదరాబాద్ : వంద ఏళ్ల చరిత్ర కలిగిన హైకోర్టును తరలిస్తే ఉరుకోమంటూ తెలంగాణ హైకోర్టు వద్ద న్యాయవాదులు హెచ్చరించారు. హైకోర్టును బద్వేల్‌కు తరలించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా లాయర్లు రెండవ రోజు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వ ప్రతిపాదనల పేపర్లను న్యాయవాదులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టును తరలిస్తే అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని, అన్ని కోర్టుల్లో కార్యకలాపాలను స్తంభింపజేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా హైకోర్టు తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే మరో తెలంగాణ ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని న్యాయవాదులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment