Petition Filed In High Court For Seeking Group 2 Exam Postpone - Sakshi
Sakshi News home page

Group 2 Exam: గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌

Published Thu, Aug 10 2023 1:43 PM | Last Updated on Thu, Aug 10 2023 4:06 PM

Petition Filed In High Court For Seeking Group 2 Exam Postpone - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈనెల 29, 30న జరగాల్సిన గ్రూప్‌ పరీక్ష వాయిదా వేయాలని 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గురుకుల, ఇతర పరీక్షలు ఉన్నందున  గ్రూప్ 2 ఎగ్జామ్‌ రీ షెడ్యూల్ చేయాలని  అభ్యర్థులు కోరారు.

కాగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయం దగ్గర అభ్యర్థుల ఆందోళన కొనసాగుతుంది. అభ్యర్థుల స్గోగన్స్‌తో TSPSC పరిసర ప్రాంతాలు ద్దద్దరిల్లితున్నాయి. చైర్మన్ బయటకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గురుకుల, గ్రూప్ 2, జేఎల్‌, ఏఓ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల మధ్య తగినంత వ్యవధి లేకపోవడం వల్ల గ్రూప్ వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పై పరీక్షల అన్ని కూడా వేరు వేరు సిలబస్ ఉండడం వల్ల ప్రిపేర్ కావడం కష్టం అంటున్నారు అభ్యర్థులు. గ్రూప్-2 సిలబస్‌లో కొత్త అంశాలను చేర్చటం వల్లవాటి బుక్స్ అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేపర్ల లీకేజీలతో మానసికంగా కుంగిపోయామని, 7 సంవత్సారాలు ఆపారు.. మూడు నెలలు ఆపలేరా అంటూ గ్రూప్-2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  

మరోవైపు  గ్రూప్‌-2  పరీక్ష వాయిదాపై ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని టీఎస్‌పీఎస్సీ చెబుతోంది. అయితే వాయిదా వేస్తామని ప్రకటన వస్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని అభ్యర్థులు తేల్చి చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement