group-2 exam
-
ఆంధ్రా రియల్ ఎస్టేట్.. టీడీపీ విజన్ డాక్యుమెంట్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే, పేపర్–4 పరీక్షలో కొన్ని ప్రశ్నలు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేవని, కేవలం సమాచారం కోణంలో మాత్రమే ఉన్నాయని కొందరు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఆంధ్రా నిర్మాణ రంగ సంస్థలు, 1983 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ చేసిన వాఖ్యలు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల నినాదం, విజన్–2020 డాక్యుమెంట్ రూపొందించిన అంతర్జాతీయ సంస్థ, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు తదితర ప్రశ్నలు రావడం పట్ల అభ్యర్థులు కొంత గందరగోళానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నల్లో వాస్తవాధారిత ప్రశ్నలు వచ్చాయని మరికొందరు అభ్యర్థులు చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ప్రశ్న వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన కొత్త విగ్రహానికి సంబంధించినది కాకుండా పాత రూపురేఖల గురించి ఇవ్వడంతో అభ్యర్థులు కొంత ఇబ్బంది పడ్డారు. తెలంగాణ పోరాటయోధుడు వెలిచాల జగపతిరావుకు సంబంధించి రెండు ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ కోసం త్యాగం చేసిన మరికొందరికి సంబంధించిన ప్రశ్నలు కూడా వచ్చాయి. మొత్తంగా పేపర్–4 ప్రశ్నపత్రంలో కొన్ని ప్రశ్నలు మినహాయిస్తే మధ్యస్తంగానే ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. పేపర్–3 లో ప్రశ్నలు కష్టతరంగా...: ఎకానమీ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన ప్రశ్నల్లో చాలావరకు కష్టతరంగానే ఉన్నట్టు పరీక్ష రాసిన అభ్యర్థులు చెప్పారు. ప్రశ్నలు చాలా లోతుగా ఉండడంతో వాటికి సమాధానాలు ఎంచుకునేందుకు ఎక్కువ సమయం పట్టిందని, దీంతో చివరి వరకు సమయం చాలక ఆందోళనకు గురైనట్టు వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రశ్నల్లో నాణ్యత పెరిగిందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. రెండ్రోజులపాటు నాలుగు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా తొలిరోజు(ఆదివారం) జరిగిన రెండు పరీక్షలకు కేవలం 2,55,490(46.30%) మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. సోమవారం ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్), మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–4 (తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్) పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన పేపర్–3 పరీక్షకు 2,51,738 (45.62%) మంది హాజరు కాగా, మధ్యాహ్నం జరిగిన పేపర్–4 పరీక్షకు 2,51,486(45.57%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ గణాంకాలు ప్రాథమికంగా మాత్రమే నని, ఓఎంఆర్ షీట్లు పూర్తిస్థాయిలో అందిన తర్వాత హాజరుశాతంపై స్పష్టత వస్తుందని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్‌నికోలస్ తెలిపారు. -
పురిటి నొప్పులు భరిస్తూ.. పరీక్ష రాసి..
నాగర్‌కర్నూల్ క్రైం: ఉద్యోగం సాధించాలన్న తపనతో ఓ నిండు గర్భిణి గ్రూప్–2 పరీక్షకు హాజరైంది. పరీక్ష రాస్తుండగానే పురిటినొప్పులు వచ్చి నా ఆమె చలించలేదు.. పట్టుబట్టి పరీక్ష రాసిన తర్వాతే కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్లింది. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి (25) నిండు గర్భిణి. అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో చాలా కష్టపడి చదివి గ్రూప్–2 పరీక్షల కోసం వేచి చూసింది. ఈ మేరకు సోమ వారం పరీక్ష రాస్తుండగా అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. విష యం తెలుసుకున్న అధికారులు కలెక్టర్ బదావత్ సంతోశ్‌కు సమాచారం అందించగా.. ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అయితే అందుకు నిరాకరించిన గర్భిణి.. పరీక్ష పూర్తయిన తర్వాతే కాన్పు కోసం వెళ్తానని పట్టుబట్టింది. తీవ్రమైన పురిటి నొప్పులను భరిస్తూనే పరీక్ష రాసిన అనంతరం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రా రియల్ ఎస్టేట్.. టీడీపీ విజన్ డాక్యుమెంట్ -
తెలంగాణ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం
-
నిరుద్యోగులకు సర్కారీ ‘పరీక్ష’!
వారం రోజుల్లో మొదలుకానున్న డీఎస్సీ పరీక్షలు.. అవి ముగిశాక రెండు రోజుల్లోనే గ్రూప్–2 పరీక్షలు.. ప్రిపరేషన్‌కు సమయం సరిపోని పరిస్థితి.. దీంతో డీఎస్సీ పరీక్షల తేదీలను మార్చాలంటూ అభ్యర్థుల ఆందోళనలు.. ఏమాత్రం వెనక్కితగ్గకుండా పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపుతున్న సర్కారు.. ఆందోళనలు చేస్తున్న అభ్యర్థులు, విద్యార్థి సంఘాలపై పోలీసుల లాఠీచార్జీలు.. కాస్త సమయం ఇస్తే బాగుంటుందంటున్న విద్యావేత్తలు.. సమస్యకు పరిష్కారం చూపడం మానేసి లాఠీచార్జీలు ఏమిటంటూ హక్కుల కార్యకర్తల నిలదీతలు.. .. రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో ఆందోళన, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో నెలకొన్న పరిస్థితి ఇది. సర్కారు ఉద్యోగాల భర్తీ హర్షణీయమే అయినా.. నిరుద్యోగుల డిమాండ్లు, విజ్ఞప్తుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్న సూచనలు వస్తున్నాయి.సిలబస్ ఎక్కువ.. సమయం తక్కువ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ బాగా పెరిగింది. మొత్తం 14 సబ్జెక్టులు చదవాలి. కానీ సమయం మాత్రం తక్కువగా ఉంది. రోజుకో సబ్జెక్ట్ పూర్తి చేయడం ఎలా? ఇది ఆందోళన రేపుతోంది. పరీక్ష గడువును కనీసం మూడు నెలలు పొడిగించాలి. – ఐ.సుజిత, డీఎస్సీ అభ్యర్థి, సూర్యాపేట జిల్లాసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్షల (డీఎస్సీ)కు సమయం ముంచుకొస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి సబ్జెక్టుల వారీగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్ ఆధారి తంగా పరీక్షలు నిర్వహించనున్న ప్రభుత్వం.. ఆ దిశగా ఆన్లైన్ కేంద్రాలను సైతం ఎంగేజ్ చేసుకుంది. డీఎస్సీ పరీక్షలు ఆగస్టు 5వ తేదీతో పూర్తికానుండగా.. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు జరగనున్నాయి. వరుసగా పరీక్షలు ఉండటంతో అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి ఉంటుందనే వాదన వస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో.. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది మార్చిలో నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుల స్వీకరణ మార్చి 4 నుంచి జూన్ 20వ తేదీ వరకు కొనసాగింది. సాధారణంగా పోటీ పరీక్షలకు సిద్ధంకావడానికి కనీసం 45 రోజులు ఉండాలి. కానీ ఉపాధ్యాయ నియామక పరీక్షకు కనీసం నెల రోజుల వ్యవధి కూడా ఇవ్వకుండా పరీక్షల తేదీలు నిర్ణయించడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గ్రూప్–2 ఉద్యోగాల భర్తీ కోసం 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి. తాజా తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ.. ఈసారి పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదంటూ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలు దాదాపు ఒకే సమయంలో జరుగుతుండటంతో.. రెండింటికీ సిద్ధమవుతున్న వారికి ఇబ్బందిగా మారింది. ఆందోళనలకు దిగుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్‌కు సమయం తక్కువగా ఉందని.. ఉపాధ్యాయ నియామక పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టెట్ పరీక్ష ఫలితాలను కూడా వారం క్రితమే విడుదల చేశారని.. డీఎస్సీకి ఎలా సిద్ధం కావాలని ప్రశ్నిస్తున్నారు. అయితే మరో వారం రోజుల్లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... వాయిదా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టిందని పేర్కొంటున్నాయి. రెండు నెలలు వాయిదా వేయాలి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన నెలలోపే రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామనడం సరికాదు. కనీసం 45 రోజులు సమయం ఇవ్వాలి. తక్కువ సమయంలో పరీక్షలకు ఎలా సిద్ధమవాలో అర్థంకాని పరిస్థితి. ఇది అభ్యర్థులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టడమే. టీచర్ నియామక పరీక్షలను కనీసం రెండు నెలలు వాయిదా వేస్తే మేలు జరుగుతుంది. – కేశమోని మనోజ్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా (డీఎస్సీ, గ్రూప్–2 పరీక్షల అభ్యర్ధి) పరీక్షలు వాయిదా వేయాలంటే.. పోలీసులతో కొట్టిస్తున్నారు డీఎస్సీ పరీక్షలకు కాస్త సమయం ఇవ్వాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతుంటే స్పందించని సీఎం.. నిరుద్యోగులపై మాత్రం లాఠీచార్జి చేయిస్తున్నారు. ప్రజాపాలన అంటే.. నిరుద్యోగులపై లాఠీచార్జి చేయడం, ఇచి్చన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమేనా? 25వేల టీచర్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తానన్న సీఎం రేవంత్.. కేవలం 11 వేలకే టీచర్ పోస్టులను పరిమితం చేశారు. పైగా విద్యార్థులకు ప్రిపరేషన్‌కు తగిన సమయం కూడా ఇవ్వకపోవడం సరికాదు – గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు కొంత సమయం ఇస్తే బాగుండేది టెట్ ఫలితాలు వెల్లడించిన తర్వాత కొంత సమయం ఇచ్చి ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహిస్తే బాగుండేది. అలాగాకుండా ముందే షెడ్యూల్ ప్రకటించి, తర్వాత టెట్ ఫలితాలు ఇవ్వడంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకుని సమస్యను పరిష్కరిస్తే అభ్యర్థులకు ఊరట కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే జాబ్ కేలండర్ ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది. గ్రూప్–1 పరీక్షలు సవ్యంగా నిర్వహించిందన్న పేరు వచి్చంది. ఇలాంటి సమయంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. – ప్రొఫెసర్ కోదండరామ్, టీజేఎస్ అధ్యక్షుడు లాఠీచార్జీలు కాదు.. సమస్యను పరిష్కరించాలి రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించి రాజకీయ పారీ్టల అభిప్రాయాలు తీసుకుంటే మంచిది. పదేళ్లపాటు ఉద్యోగాల కోసం వేచి ఉండటంతో నిరుద్యోగ యువతలో ఆతృత, ఆందోళన పెరిగాయి. వరుస పరీక్షల నిర్వహణ షెడ్యూల్, ఇప్పటికే ప్రకటించిన పోటీపరీక్షల రీషెడ్యూల్‌పై టీజీపీఎస్సీ నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంది. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఎవరైనా కోర్టుకు వెళితే.. కోర్టు స్టే ఇస్తే మొత్తం సమస్య మొదటికి వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వపరంగా స్పందించడమో లేక ఉద్యమిస్తున్న సంఘాల ప్రతినిధులతో చర్చించి సమస్య పరిష్కారానికి నచ్చజెప్పడమో చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా లాఠీచార్జీలు, దాడులకు దిగడం మంచిది కాదు. దీనితో అసలు సమస్య పోయి పోలీసులు దాడులకు దిగారంటూ మరో సమస్య తెరపైకి వస్తోంది. – ప్రొఫెసర్ హరగోపాల్, హక్కుల కార్యకర్త, విద్యావేత్త వెబ్సైట్లో డీఎస్సీ హాల్‌టికెట్లు డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను గురువారం రాత్రి వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు www. schooledu. telangana. gov. in వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం సుమారు 2.8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. -
ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ కీ విడుదల
సాక్షి, గుంటూరు: ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. గ్రూప్-2 కింద 897 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25న రాష్ట్ర వ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. 4,04,037 (87.17%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక ప్రాథమిక కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని సూచించింది. పోస్టు/వాట్సప్/ఎస్ఎంఎస్/ఫోన్/వ్యక్తిగతంగా సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది. స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను ఐదు నుంచి ఎనిమిది వారాల్లో ప్రకటించే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్ -2 మెయిన్ పరీక్షను జూన్/జులైలో నిర్వహించే అవకాశం ఉంది. -
నిరుద్యోగులకు నిరాశే...!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల కోడ్ కూయడంతో రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థుల ఆశలకు గండిపడింది. దాదాపు ఏడాదిన్నరగా ఉద్యోగాల కోసం చేసిన శ్రమకు ‘కోడ్’బ్రేకులు వేస్తుందేమోనని వారిలో నిరాశ నెలకొంది. ఈ నెల 9న కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో నవంబర్ 3న ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో బిజీ అయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన ప్రకటనల తాలూకు పరీక్షల నిర్వహణ, ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాల ప్రకటనపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్ కారణంగా ఉద్యోగ అర్హత పరీక్షలను నిర్వహించడంతో పాటు ఫలితాల ప్రకటనకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు నిరుద్యోగ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. నియామక సంస్థలు అనుమతి కోరిన వెంటనే ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినప్పటికీ భద్రతా కారణాలు, సిబ్బంది సమస్యలతో అర్హత పరీక్షలను నిర్వహిస్తారా? లేదా? అనే ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది. పరీక్షలు సరే... ఫలితాల మాటేంటి? రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి గతేడాది ఏప్రిల్ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నియామక సంస్థలు సైతం ఎంతో ఉత్సాహంతో భర్తీ ప్రక్రియను మొదలుపెట్టాయి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటికే 38 వేలకు పైగా ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) దాదాపు 11 వేల ఉద్యోగాలకు, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) మరో 17 వేల ఉద్యోగాలకు, తెలంగాణ మెడికల్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంఎస్ఆర్బీ) 10 వేల ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది. వీటితో పాటు ఇటీవల డీఎస్సీ ద్వారా 6 వేల టీచర్ ఉద్యోగాలకు సైతం ప్రకటనలు వెలువడ్డాయి. డీఎస్సీ, గ్రూప్–1 మెయిన్స్, గ్రూప్–2, గ్రూప్–3 అర్హత పరీక్షలు మినహా మిగతా కేటగిరీలకు సంబంధించి పరీక్షలు పూర్తయ్యాయి. పోలీసు నియామక ఫలితాల విడుదల దాదాపు పూర్తి కాగా... మెడికల్ ఆఫీసర్ నియామకాల ప్రక్రియ కూడా పూర్తయింది. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పలు అర్హత పరీక్షల ఫలితాలు వెలువడలేదు. గురుకుల బోర్డు కూడా ఫలితాలను ప్రకటించలేదు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామక సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయోనని వారు ఎదురు చూస్తున్నారు. చిన్నాచితకా ఉద్యోగాలను వదులుకుని ప్రభుత్వ కొలువులకు సన్నద్దమైన అభ్యర్థులకు ఫలితాల కోసం నిరీక్షణ తప్పేలా లేదు. -
ప్రవీణ్‌కుమార్ హౌస్ అరెస్ట్
బండ్లగూడ, నాంపల్లి: అక్రమంగా అరెస్టులు చేసి తమను భయపెట్టాలని చూస్తే మరింత ఉవ్వెత్తున ఉద్యమిస్తామని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. గ్రూప్–2 పరీక్షలను రద్దు చేయాలని కోరతూ నిరసన చేపట్టేందుకు వెళ్తున్న ఆయనను శనివారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఉదయమే బండ్లగూడలోని ఆయన నివాసంలో సత్యగ్రహ దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా దీక్ష చేస్తున్న తనను అర్థరాత్రి పోలీసులు అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. తమకు ఆదేశాలు ఉన్నాయంటూ రాద్ధాంతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన తన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బీఎస్పీ కార్యకర్తలను అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం పోలీసులను నమ్ముకొని పాలన చేస్తున్నారని, భవిష్యత్‌లో ఇదే కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌లోనే బందోబస్తు చేస్తారని ధ్వజమెత్తారు. గ్రూప్–2 ఉద్యోగాల్లో కొన్ని తమ అనుచరులకు కావాలని ముందుగానే పబ్లిక్ సర్విస్ కమిషన్‌కు చెప్పారనీ అందుకే నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్ బోర్డులో కొంత మంది దొంగలను సీఎం నియమించారని విమర్శించారు. లీకేజీ కారకులను అరెస్టు చేయకుండా పరీక్షలు ఎలా? పేపర్ లీకేజీ కారకులను ఇంతవరకూ అరెస్టు చేయకుండా, తిరిగి వెంటనే పరీక్షలు నిర్వహించడం సరికాదని ప్రవీణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. 2014 నుంచి ఉద్యో గ నియామకాలు చేపట్టకుండా 2022లో ఒకేసారి నోటి ఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులపై తీవ్ర భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల కోసమే ఆగమేఘాల మీద ఉద్యోగ పరీక్షలు నిర్వహిస్తున్నారని నిందించారు. ఇప్పటి వరకు డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. నియంత, నిరంకుశ కేసీఆర్ వల్ల ఒక తరం నాశనం అయ్యిందని ప్రవీణ్ ధ్వజమెత్తారు. టీచర్ ఉద్యోగ పరీక్షలు రాసిన వాళ్లు గ్రూప్ పరీక్షలు రాయకూడదనేది కేసీఆర్ కుట్రగా పేర్కొన్నారు. ’’ముఖ్యమంత్రి కొడుకు, మనుమడు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పుడైనా పోటీ పరీక్షలు రాశారా... ఆరునెలల్లో పరీక్ష సిలబస్ మార్చి మెటీరియల్ ఇవ్వకుండా వాళ్లు పరీక్ష రాయగలరా..’’అని నిలదీశారు. ఫేక్ యూనివర్సిటీలు యూనివర్సిటీలు బాగు చేయమంటే ఫేక్ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్, సకల జనుల సమ్మె, ఇలా ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు ఎలాంటి అణచివేత ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబంగా మారిందని విమర్శించారు. పేపర్ లీకేజీలో రమేష్, రాజశేఖర్‌రెడ్డి దొరికిన వెంటనే కేటీఆర్ దొంగ అని తేలిపోయిందనీ, అందుకే కేటీఆర్ ట్విట్టర్లో కూడా నిరుద్యోగ సమస్యలపై మాట్లాడడం లేదని ప్రవీణ్ విమర్శించారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరపాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ నేతల సత్యాగ్రహ దీక్ష భగ్నం గ్రూపు–2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం నగరంలోని గన్‌పార్కు వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగన బీఎస్సీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చేతుల్లో ప్లకార్డులను పట్టుకుని జైభీమ్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రధాన రోడ్డు నుండి గన్పార్కులోనికి పరుగులు తీసిన వారిని పోలీసులు అడ్డుకుని బలవంతంగా లాక్కెళ్లారు. గన్‌పార్కు వైపునకు వచ్చినవారిని వచి్చనట్లుగానే అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని ముషీరాబాదు, నాంపల్లి పోలీసుస్టేషన్లకు తరలించారు. -
వాయిదా వేస్తే ఇప్పట్లో కష్టమే!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షల తేదీల మార్పు కష్టంగానే కనిపిస్తోంది. ఈనెల 29, 30వ తేదీల్లో గ్రూప్–2 పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. దాదాపు ఐదు నెలల క్రితమే పరీక్ష తేదీని ప్రకటించింది. అయితే వరుసగా పరీక్షలు ఉన్నాయని, కాబట్టి సన్నద్ధతకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఆందోళన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. గురువారం టీఎస్పీఎస్సీ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. శుక్రవారం కూడా పలుచోట్ల ధర్నాలు నిర్వహించారు. పలు ప్రతిపక్ష పార్టీలు వీరికి మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సర్విస్ కమిషన్ తర్జనభర్జన పడుతోంది. వాయిదా వేస్తే ఎదురయ్యే పరిణామాలను అధికారులు సమీక్షిస్తున్నారు. ఇప్పుడు వాయిదా వేస్తే మళ్లీ ఎప్పుడు నిర్వహించొచ్చనే కోణంలోనూ పరిశీలన చేస్తున్నట్లు, ఒకవేళ వాయిదా గనుక వేస్తే దీర్ఘకాలం వేచి చూడాల్సి ఉంటుందనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వరుస ఎన్నికల ప్రక్రియతో అధికార యంత్రాంగం బిజీగా ఉండడం, రెండున్నర నెలల వరకు ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేకుండా బుక్ అయిపోవడంతో పరీక్షల వాయిదాపై కమిషన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల్లో గందరగోళం... గతేడాది డిసెంబర్లో గ్రూప్–2 ఉద్యోగ ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా దాదా పు 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల తేదీని దాదాపు ఐదు నెలల క్రితమే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా సన్నద్ధతలో నిమగ్నమయ్యారు. పరీక్ష తేదీ చాలా ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ పుస్తకాలు చేతబట్టారు. అయితే మరికొన్ని పరీక్షలు సైతం సమీప తేదీల్లోనే ఉండటంతో గ్రూప్–2 వాయిదా వేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో కొందరు అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. పరీక్ష నిర్వహిస్తారా? లేదా? అనే సందేహం వారిని వెంటాడుతోంది. అయితే టీఎస్పీఎస్సీ ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఏదో ఒక స్పష్టత ఇచ్చి ఈ గందరగోళానికి తెరదింపాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
టీఎస్పీఎస్సీ ముట్టడి.. గ్రూప్-2 అభ్యర్థుల ధర్నాలో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ వద్ద చేస్తున్న గ్రూప్-2 పరీక్ష అభ్యర్థుల ధర్నాలో కొత్త ట్విస్ట్ నెలకొంది. పరీక్షను వాయిదా వేయాలని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు విద్యార్థులను రెచ్చగొట్టారని ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం అందింది. పరీక్షకు సమయం లేకపోవడంతో కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆందోళనలో ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో పలువురు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్థులను రెచ్చగొడుతున్న ఇద్దరూ కోచింగ్ సెంటర్ యజమానులను అదుపులోకి తీసుకున్నారు. రియాజ్, అశోక్ అనే ఇద్దరు కోచింగ్ నిర్వాహకులు తమ దగ్గర కోచింగ్ తీసుకునే విద్యార్థులను రోడ్డుమీదికి తీసుకొచ్చి ధర్నా చేయించినట్లు తేలింది. చదవండి: టీఎస్పీఎస్సీ ముందు కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత.. -
గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈనెల 29, 30న జరగాల్సిన గ్రూప్ పరీక్ష వాయిదా వేయాలని 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. గురుకుల, ఇతర పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 ఎగ్జామ్ రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థులు కోరారు. కాగా టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర అభ్యర్థుల ఆందోళన కొనసాగుతుంది. అభ్యర్థుల స్గోగన్స్‌తో TSPSC పరిసర ప్రాంతాలు ద్దద్దరిల్లితున్నాయి. చైర్మన్ బయటకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గురుకుల, గ్రూప్ 2, జేఎల్, ఏఓ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల మధ్య తగినంత వ్యవధి లేకపోవడం వల్ల గ్రూప్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. Group 2 aspirants protested at TSPSC office, demanding to postpone the exam. INC leader Addanki Dayakar, TJS President Kodandaram extended support to unemployed#Telangana #Students #Unemployed #Group2 pic.twitter.com/NZi1vTiYha — Aapanna Hastham (@AapannaHastham) August 10, 2023 పై పరీక్షల అన్ని కూడా వేరు వేరు సిలబస్ ఉండడం వల్ల ప్రిపేర్ కావడం కష్టం అంటున్నారు అభ్యర్థులు. గ్రూప్-2 సిలబస్‌లో కొత్త అంశాలను చేర్చటం వల్లవాటి బుక్స్ అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేపర్ల లీకేజీలతో మానసికంగా కుంగిపోయామని, 7 సంవత్సారాలు ఆపారు.. మూడు నెలలు ఆపలేరా అంటూ గ్రూప్-2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని టీఎస్పీఎస్సీ చెబుతోంది. అయితే వాయిదా వేస్తామని ప్రకటన వస్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని అభ్యర్థులు తేల్చి చెబుతున్నారు. -
‘గ్రూప్-2’ ఆందోళన.. పలువురు అభ్యర్థులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా అభ్యర్థులు వెనక్కి తగ్గలేదు. గ్రూప్-2 పరీక్షపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, అభ్యర్థులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు, ఏడుగురు అభ్యర్థులతో టీఎస్పీఎస్సీ చర్చలు జరుపుతోంది. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గ్రూప్-2 అభ్యర్ధుతలు, ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్ టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. వేలాదిగా తరలి వచ్చిన గ్రూప్-2 అభ్యర్థులు ఆఫీస్ ముందు బైఠాయించారు. వరుస పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్‌కు తమకు సమయం లేదని చెబుతూ గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తామని ప్రకటన వస్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని విద్యార్థులు ఆందోళనను ఉద్రితం చేయగా, రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాని టీఎస్పీఎస్సీ చెబుతోంది. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్, టీజేఎస్ మద్దతు తెలిపింది. కోదండరాం, దయాకర్, కాంగ్రెస్ నేతలు నిరనసలో పాల్గొన్నారు. అభ్యర్థుల స్గోగన్స్‌తో టీఎఎస్పీఎస్సీ పరిసర ప్రాంతాలు ద్దద్దరిల్లితున్నాయి. చైర్మన్ బయటకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గురుకుల, గ్రూప్ 2, జేఎల్, ఏఓ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల మధ్య తగినంత వ్యవధి లేకపోవడం వల్ల గ్రూప్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో టెట్ పరీక్ష ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూప్స్‌కు చదివేందుకు సమయం లేదని వాపోయారు. అంతేగాక ఇప్పటికే పలు పేపర్ లీకేజీ జరిగిన అదే బోర్డుతో ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఆగష్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. మొత్తం 5,51,943 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. -
పరీక్షలో నెగ్గి.. విధి చేతిలో ఓడి...
మిర్యాలగూడ అర్బన్: గ్రూప్–2 పరీక్షలో అర్హత సాధించిన ఆ యువకుడు.. జీవితంలో ఓడిపోయాడు. నమ్మి వచ్చే యువతిని మోసం చేయలేక.. నిజాన్ని చెప్పలేక మరణశాసనం లిఖించుకున్నాడు. ఉన్నత ఉద్యోగం.. కోరుకున్న యువతితో వివాహం.. ఇక జీవితం ఆనందమయం అనుకుంటున్న తరుణంలో అనారోగ్యం రూపంలో మృత్యువు కబళిస్తుండటంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘ టన ఆదివారం జరిగింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రానికి చెందిన మోడం బస్వీర్రెడ్డి, వరమ్మలకు ముగ్గురు కుమారులు. చిన్నవాడైన మోడం శ్రీనివాస్‌రెడ్డి(30) గ్రూప్–2 పరీక్షలో అర్హత సాధించాడు. ఇంటర్వ్యూ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఉద్యోగం వస్తుందన్న ధీమాతో పెద్దలు గరిడేపల్లి మండలం పరేడ్డిగూడేనికి చెందిన యువతితో వివాహం చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో వీరి వివాహం చేయాలని ఆలోచనలో పెద్దలున్నారు. ఇక.. కొద్దిరోజులేనని.. శ్రీనివాస్‌రెడ్డి ఏడాదిగా (పెద్ద పేగుకు కేన్సర్) ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల సమస్య పెరగటంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా, రెండు రోజుల క్రితమే రిపోర్టులు వచ్చాయి. వాటిలో కేన్సర్ ముదిరిపోయిందని.. ఆపరేషన్ చేస్తే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. ఎక్కువ కాలం బతకటం కష్టమని వివరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్‌రెడ్డి రెండు రోజులుగా సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని కుమిలిపోయాడు. ఇష్టపడిన యువతికి చెప్పలేక.. తాను ఇష్టపడిన యువతితోనే పెద్దలు వివాహానికి ఏర్పాట్లు చేస్తుండటం.. వారికి విషయాన్ని ఎలా చెప్పాలో శ్రీనివాస్‌రెడ్డికి అర్థం కాలేదు. నమ్మి వచ్చే యువతిని మోసం చేయలేక.. మృత్యువు కబళించబోతోందన్న నిజాన్ని చెప్పలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి స్వగ్రామం నుంచి మిర్యాలగూడకు చేరుకున్న శ్రీనివాస్‌రెడ్డి గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. -
1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతాం
సాక్షి, హైదరాబాద్: ‘‘1.12 లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడంపై కృత నిశ్చయంతో ఉన్నాం. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఇదే విషయం చెప్పాను. ఆ ప్రకారం 1.12 లక్షలే కాదు అంతకు ఒక వెయ్యి ఎక్కువే ఇస్తాం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ టీఎస్పీఎస్సీపై, గ్రూప్స్-2 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేశారు. దాంతో స్పందించిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 4 లక్షలుందని.. కాంగ్రెస్ సహా అంతకుముందు 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా తమలా చేయలేదని పేర్కొన్నారు. నిర్మాణాత్మక పంథాలో సభ్యులు సూచనలు చేస్తే తప్పక స్వీకరిస్తామని, ఇష్టారాజ్యంగా విమర్శలు చేయవద్దని సూచించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి దళితుడని, సంస్కరణలతో ఆయన రాష్ట్రానికి గౌరవం తెచ్చి పెట్టారని సీఎం ప్రశంసించారు. యూపీఎస్సీ కూడా ఆయనను అభినందించి మొదటిసారిగా యూపీఎస్సీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేసిందని చెప్పారు. ఇక నిరుద్యోగుల అంశంలో ఏదో మూటగట్టుకోవాలని ప్రయత్నించడం, అందుకు సోనియాగాంధీ పేరు ముందుకు తీసుకురావడం, అమరులంటూ ఏదేదో మాట్లాడటం మంచిదికాదని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. అదంతా పాత రాజకీయమని, ఇప్పుడది పనిచేయదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఉందని, నిజాలన్నీ బయటకు వస్తాయని.. అందువల్ల పద్ధతిగా వ్యవహరించాలని సూచించారు. పొరపాట్లు సహజం తెలంగాణ కొత్త రాష్ట్రమని, అప్పుడప్పుడు పొరపాట్లు దొర్లుతాయని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరగకుండా ఉంటాయా? వాటిని సరిదిద్దుకుంటూ పోతుంటాం. ఈ ప్రభుత్వం తప్పులు చేయడం సర్వసాధారణమన్నట్లు మాట్లాడితే.. అదో భాషేనా? అలా మాట్లాడితే గౌరవం వస్తుందా? మంచిగా మాట్లాడే వారి విలువ వేరేగా ఉంటుంది. లేకుంటే మరో రకంగా ఉంటుంది. సభ్యులు వారి స్థాయిని, గౌరవాన్ని పెంపొందించుకోవాలి. షార్ట్‌కట్ పద్ధతులతో ఒక్క రోజుకో, ఒక్క పూటకో ప్రశ్న అడిగితే ఐదు నిమిషాలు ఆనందం ఉంటుంది తప్ప అది గొప్పతనం కాదు.’’అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి అమలుపై లక్ష పేజీల పెన్‌డ్రైవ్ ఇస్తాం విద్య, స్కాలర్షిప్ విషయంలో ఆవాస విద్యకు కేంద్రం, నీతి ఆయోగ్ ప్రాధాన్యమిస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. దాన్ని మన రాష్ట్రం ఇప్పటికే మొదలుపెట్టిందని.. మన మోడల్‌నే కేంద్రం తీసుకుందని స్పష్టం చేశారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు పెడుతూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని.. ఐపీఎస్ అధికారి ప్రవీణ్ దీనిపై చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇదే పద్ధతిని మైనారిటీ, బీసీ, ఎస్టీలకు అమలుచేసే దిశగా ముందుకెళుతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బిల్లు తెచ్చాక ఎంత ఖర్చు చేశామో పైసా లెక్కతో సహా ప్రతి సభ్యుడికి ఒకటి రెండు రోజుల్లో దాదాపు లక్ష పేజీలుండే పెన్‌డ్రైవ్ ఇవ్వనున్నామన్నారు. దళితులు, బలహీనవర్గాల పట్ల తమకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భారీగా ‘విదేశీ విద్య’స్కాలర్షిప్ను ఇస్తున్నామని చెప్పారు. అత్యవసర అంశమైనా పట్టించుకోరా? విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై శాసనసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సోమవారం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీనికి నిరాకరించడంతో అధికారపక్షం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టకూడదని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు మాట తప్పుతున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిం చారు. దీనిపై ప్రతిపక్ష నేత జానారెడ్డి స్పందిస్తూ.. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టవద్దన్న నిర్ణ యం వాస్తవమేనని, కానీ అత్యవసర అంశం కాబట్టి వాయిదా తీర్మానం తీసుకోవాలని కోరామని వివరించారు. అయినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వాయిదా తీర్మానాన్ని చేపట్టకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఇక కాంగ్రెస్ తీరును ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. జానారెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, బీఏసీలో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాన్ని పాటించకపోతే ఎలాగని విమర్శించారు. ఇక నిరుద్యోగ యువతకు ప్రభుత్వోద్యోగాలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ అంశంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి తిరస్కరించారు. గ్రూప్స్-2 లో భారీగా అవకతవకలు శాసనసభలో తొలుత కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ మాట్లాడుతూ గ్రూప్స్-2 పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అందువల్ల కొత్త పోస్టులతో మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. కోడింగ్, డీకోడింగ్‌లో అవకతవకలు జరిగాయని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ ఒక నోట్ కూడా ఇచ్చారని.. ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ అయిందని పేర్కొన్నారు. అసలు ఓఎంఆర్ షీట్ నాణ్యత లేదని, దీనిపై కోర్టు కూడా ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిందని.. దాంతో టీచర్ల భర్తీ పరీక్షలో సరిదిద్దుకున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడున్నరేళ్లుగా తప్పులు చేయడం, సరిదిద్దుకోవడమే అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. ఆ ఆరోపణలు అవాస్తవం గ్రూప్స్-2 పరీక్షలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శాసనసభలో బదులిచ్చారు. ఒకవేళ అవకతవకలు జరిగినట్లు తేలితే క్షమాపణ చెబుతామన్నారు. ప్రతి అభ్యర్థి జవాబుపత్రం జిరాక్స్ వారివద్దే ఉందని, దీనిపై కోర్టుకు వివరాలు కూడా ఇచ్చామని స్పష్టం చేశారు. కోర్టు సూచన మేరకు ఎంపిక చేసిన అభ్యర్థుల ధ్రువపత్రాలను తనిఖీ చేసి జాబితాలను కూడా సమర్పించామని చెప్పారు. ఓఎంఆర్ షీట్‌ను పాత పద్ధతి ప్రకారం కాకుండా అధునాతన టెక్నాలజీ ప్రకారం స్కానింగ్ చేశామని, ఆ పద్ధతిని యూపీఎస్సీ కూడా ఉపయోగిస్తుందని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు రాగానే ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. -
గ్రూప్-2 పరీక్షలో గందరగోళం
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే సర్వర్లు మొరాయించడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గీతం యూనివర్సిటీలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులు మూడు ప్రశ్నలకు సమాధానాలు రాసే లోపే సర్వర్లు మొండికేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. -
గ్రూప్-2 పరీక్ష ప్రశాంతం
- 40,042 మంది హాజరు - దూర కేంద్రాలతో ఇబ్బందులు - ఎండ వేడిమికి అల్లాడిన అభ్యర్థులు అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 (స్క్రీనింగ్)పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 135 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 52,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 40,042 మంది (76.95 శాతం) మాత్రమే హాజరయ్యారు. కలెక్టర్ కోన శశిధర్ అనంతపురంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి మల్లీశ్వరిదేవి, ఆర్డీఓ మలోలా, అనంతపురం తహసీల్దార్ శ్రీనివాసులు ఉన్నారు. దూర కేంద్రాలతో ఇబ్బందులు అనంతపురం నగర శివారులో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సిన దూర ప్రాంతాల అభ్యర్థులు ఆయా కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకుని సమయానికి అక్కడకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు తేల్చి చెప్పడంతో ఉదయం 7 గంటల నుంచే నగరంలో అభ్యర్థుల సందడి మొదలైంది. దూర ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలకు రవాణా సౌకర్యం లేక చాలామంది అభ్యర్థులు వందలాది రూపాయలు చెల్లించి ఆటోల్లో వెళ్లారు. ఎండకు అల్లాడిన అభ్యర్థులు ఎండ వేడిమితో అభ్యర్థులు అల్లాడారు. మిట్ట మధ్యాహ్నం పరీక్ష ముగియడంతో వారి వారి ఊళ్లకు చేరుకునేందుకు తంటాలు పడ్డారు. సూర్యడు ప్రతాపం చూపడంతో ఉక్కపోతతో ఇక్కట్లు పడ్డారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ దాదాపు ఒకేస్థాయిలో ఉండటం విశేషం. - జిల్లాల్లోని పలు కేంద్రాల్లో అభ్యర్థులు తీసుకువెళ్లిన సెల్ఫోన్లను ఆయా కేంద్రాల్లో డిపాజిట్ చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.10 వసూలు చేశారు. - పుట్టపర్తికి చెందిన కేశవ్‌కు హిందూపురంలోని ఎన్‌ఎస్‌పీఆర్ కళాశాలను పరీక్ష కేంద్రంగా వేశారు. అయితే హాల్ టికెట్లో కళాశాల పేరు ఎస్‌ఎస్‌పీఆర్ రావడంతో ఆ అభ్యర్థి పట్టణమంతా తిరగాల్సి వచ్చింది. -
నేడు గ్రూప్-2 పరీక్ష
- హాజరుకానున్న 52,028 మంది అభ్యర్థులు - 135 పరీక్షా కేంద్రాల ఏర్పాటు - అభ్యర్థులు ఉదయం 9.45 గంటల్లోపు చేరుకోవాలి అనంతపురం అర్బన్ / అగ్రికల్చర్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో గ్రూపు–2 పరీక్షను ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 135 కేంద్రాల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుంది. 52,028 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. క్యాలికులేటర్లు, సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించరు. అభ్యర్థులను ఉదయం తొమ్మిది నుంచి 9.45 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతింబోమని కలెక్టర్ కోన శశిధర్ శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ తీసుకెళ్లాలి. వెరిఫికేషన్ కోసం హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్..వీటిలో ఏదో ఒకటి ఒరిజినల్ తీసుకొని వెళ్లాలి. హాల్ టికెట్లో అభ్యర్థి ఫొటో లేకున్నా, సరిగా ముద్రణ కాకున్నా, చిన్నదిగా ఉన్నా, ఫొటోపై సంతకం లేకున్నా మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించి ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు. ఆర్టీసీ ఆధ్వర్యంలో అనంతపురం బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి పరీక్షా కేంద్రాల వరకు బస్సులు నడపనున్నారు. పరీక్ష నిర్వహణపై జేసీ సమీక్ష గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమీక్షించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించాలని ఆదేశించారు. ఎండలు అధికంగా ఉన్నందున తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వైద్య శిబిరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ (ఓరల్ రీ హైడ్రేషన్ సాల్ట్) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలన్నారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలన్నారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు, అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 84980 98220 సెల్ నంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. -
గ్రూప్-2 అభ్యర్థులకు వెసులుబాటు
హైదరాబాద్: ఈనెల 11, 13వ తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలు రాసే అభ్యర్థులకు పెద్ద నోట్ల చెలామణి విషయంలో వెసులుబాటు కల్పిస్తున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ గ్రూప్-2 అభ్యర్థుల కోసం మూడు వేల బస్సులను నడుపుతోందని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశారు. ఈ నోట్ల విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. -
గవర్నర్‌తో టీఎస్పీఎస్సీ చైర్మన్ భేటీ
⇒ గ్రూప్-2 పరీక్ష ఏర్పాట్లపై వివరణ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11, 13 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వివరించారు. ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుతో కలసి మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను చక్రపాణి మర్యాద పూర్వకంగా కలిశారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో చేపడుతున్న నియామకాల ప్రక్రియను వివరించారు. ముఖ్యంగా గ్రూప్-2 పరీక్ష కోసం చేసిన ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని గవర్నర్‌కు వివరించారు. -
గ్రూప్–2లో కార్బన్‌లెస్ కాపీ!
► సమాధానపత్రం కాపీని అభ్యర్థులు తీసుకెళ్లేందుకు అవకాశం ► ఏర్పాట్లు చేసిన టీఎస్పీఎస్సీ, వెబ్సైట్లో అభ్యర్థులకు సూచనలు ► పరీక్షకు బూట్లు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలతో రావద్దు ► హాల్‌టికెట్‌తోపాటు ఒక ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి ► ఉదయం 9:45 గంటలు దాటితే పరీక్షకు నో! ► మూడు నాలుగు రోజుల్లో హాల్‌టికెట్ల జారీ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 రాతపరీక్షల్లో అభ్యర్థులు ఓఎంఆర్ సమాధాన పత్రం కార్బన్‌లెస్ కాపీని వెంట తీసుకెళ్లేందుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అవకాశం కల్పిస్తోంది. అభ్యర్థులు తాము రాసిన సమాధానాలను సరిచూసుకునేందుకు, పరీక్షానంతరం సందేహాలను నివృత్తి చేసుకునేందుకు తోడ్పడుతుందనే యోచనతో ఈ నిర్ణయం తీసుకుంది. 1,032 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న గ్రూప్–2 పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 7,89,985 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వారందరికీ సమాధాన పత్రం కార్బన్‌లెస్ కాపీని అందజేసేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. అభ్యర్థులు జవాబులు రాసే ఒరిజినల్ ఓఎంఆర్ పత్రం కింద ఈ డూప్లికేట్ కాపీ ఉంటుంది. ఓఎంఆర్ పత్రంలో గుర్తించే (బబుల్ చేసే) సమాధానాలు కింద ఉన్న కార్బన్‌లెస్ కాపీపైనా అచ్చుగా ఏర్పడతాయి. దీనివల్ల అభ్యర్థులు తాము రాసిన జవాబులను చూసుకునేందుకు, రికార్డు కోసం తమ వద్ద ఉంచుకునేందుకు వీలవుతుంది. పకడ్బందీగా ఏర్పాట్లు.. గ్రూప్–2 పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవాప్తంగా 1,941 వరకు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2 పరీక్ష ఉంటాయి. 13వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్–3, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–4 పరీక్ష జరుగుతాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 8:15 గంటల నుంచి 9:45 గంటల మధ్య.. మధ్యాహ్నం 1:15 గంటల నుంచి 2:15 గంటల మధ్య పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. నిర్ధారిత సమయం తర్వాత అభ్యర్థులెవరినీ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిబోమని స్పష్టం చేసింది. అభ్యర్థులకు హాల్‌టికెట్ల జారీని మూడు నాలుగు రోజుల్లో ప్రారంభించనుంది. ఇక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను టీఎస్పీఎస్సీ తమ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ► పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు (పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్పో ర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగి అయితే సంస్థ ఐడీ కార్డు వంటివి) తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ► హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేని అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను వెంట తెచ్చుకోవాలి. ► పూర్తిస్థాయిలో తనిఖీ చేశాకే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల చేతివేలి ముద్ర, డిజిటల్ ఫొటో తీసుకుంటారు. ఆ వివరాలను టీఎస్పీఎస్సీకి దరఖాస్తు చేసిన వివరాలతో పోల్చిచూస్తారు. ► ప్రశ్నపత్రం బుక్లెట్ కవర్లోనే ఓఎంఆర్ జవాబు పత్రం ఉంటుంది. బెల్ కొట్టిన తరువాతే ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ను విప్పాలి. ప్రశ్నపత్రం బుక్లెట్ కోడ్ 7 నంబర్లతో ఉంటుంది. బుక్లెట్ సిరీస్ కోడ్ రెండు డిజిట్ల (ఏబీ, బీసీ, సీడీ, డీఏ)తో ఉంటుంది. ఓఎంఆర్ జవాబు పత్రం ఏడు నంబర్లతో ఉంటుంది. ► అభ్యర్థులు బూట్లు ధరించి రావొద్దు. ఆభరణాలు, గొలుసులు, చెవిపోగులు, చేతి గడియారాలు, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ఫోన్లు, ట్యాబ్‌లు, పె¯ŒSడ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, గడియారాలు, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, చేతిబ్యాగులు, పర్సులు, నోట్బుక్లు, చార్టులు, రికార్డింగ్ పరికరాల వంటివేమీ పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావొద్దు. ► అభ్యర్థుల చేతిపై గోరింటాకు (మెహెందీ), ఇంకు వంటివేవీ ఉండకూడదు. ► ఓఎంఆర్ జవాబు పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతోనే రాయాలి. పెన్సిల్, ఇంకుపెన్ను, జెల్పెన్ తో రాసిన ఓఎంఆర్ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయరు. ► పరీక్ష పూర్తయ్యాక ఒరిజినల్ ఓఎంఆర్ జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. దాని కింద ఉండే కార్బన్‌లెస్ కాపీని వెంట తీసుకెళ్లవచ్చు. ఒరిజినల్ ఓఎంఆర్ పత్రాన్ని పరీక్షా కేంద్రం నుంచి తీసుకెళ్లడం నేరం. అలా చేస్తే ఆ అభ్యర్థిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. ► పూర్తిస్థాయి అంధులు స్రై్కబ్ సహాయంతో పరీక్ష రాయవచ్చు. వారికి గంటకు 20 నిమిషాల చొప్పున అదనంగా సమయం ఇస్తారు. స్రై్కబ్కు సంబంధించిన మరిన్ని వివరాలను, ఇతర వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందవచ్చు. -
గ్రూప్-2 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచనలు
- 11, 13లలో తెలంగాణ గ్రూప్-2 పరీక్షలు - పరీక్షకు భారీ ఏర్పాట్లు - హాల్‌టికెట్‌తోపాటు గుర్తింపు కార్డు తప్పనిసరి హైదరాబాద్: తెలంగాణలో నవంబర్ 11,13 తేదీల్లో జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు టీఎస్పీఎస్సీ పగడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది. 1,032 పోస్టుల భర్తీకి గాను ఈ నెల 11, 13 తేదీలలో రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ పోస్టులకు రికార్డు స్థాయిలో 7,89,985 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,911 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబర్ 11న పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. పేపర్-2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. నవంబర్ 13న పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. పేపర్-4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పరీక్ష నిర్వహణను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరింది. అభ్యర్థులు ఎలాంటి అపోహలు నమ్మొద్దని సూచించింది. పూర్తిస్థాయి సూచనల కోసం టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సంప్రదించాలని కోరింది. అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచనలు: - అభ్యర్థులు బూట్లు, నగలు, చెవిపోగులు, చేతి గడియారాలు కూడా ధరించకూడదు. - ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, లాగ్ టేబుల్స్, చేతి బ్యాగులు, పర్సులు, నోట్‌బుక్స్, చార్టులు, రికార్డింగ్ పరికరాలకు అనుమతి లేదు. - చేతి వేళ్లపై గోరింటాకు(మెహందీ), ఇంక్ వంటివి లేకుండా చూసుకోవాలి. - అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలని పేర్కొంది. హాల్ టికెట్‌పై ఫొటో కానీ, సంతకం కానీ సరిగా లేని అభ్యర్థులు తమ వెంట రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తెచ్చుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. - ఉదయం 9.45 గంటల తర్వాత, మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని తెలిపింది. - తనిఖీ ప్రక్రియతో పాటు బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల వేలి ముద్ర, ఫొటో తీసుకుంటామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. - ఓఎంఆర్ పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతోనే రాయాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి సూచనలు, వివరాల కోసం టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను అభ్యర్థులు పరిశీలించాలని కోరింది. - పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌పెన్‌తో రాసిన ఓఎంఆర్ జవాబు పత్రాలను అనర్హతగా ప్రకటిస్తామని పేర్కొంది. ఒరిజినల్ ఓఎంఆర్ పత్రంతో పరీక్షా కేంద్రం బయటికెళ్తే ఆ అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
1,032 పోస్టులకు 8 లక్షల దరఖాస్తులు
- గ్రూపు-2 పరీక్షకు దరఖాస్తుల వెల్లువ - ఇతర రాష్ట్రాల వారు 23,628 మంది సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ రాని విధంగా తెలంగాణలో గ్రూపు-2 పరీక్ష రాసేందుకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 1,032 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఈనెల 26 వరకు దరఖాస్తులను స్వీకరించగా, 8,18,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. చివరి గడువు సోమవారం అర్ధరాత్రితో ముగియడంతో కొంత మంది అభ్యర్థుల ఫీజు చెల్లింపు వివరాలు ఆయా బ్యాంకుల నుంచి ఇంకా అందలేదు. బుధ, గురువారాల్లో అవీ అందనున్నాయి. ఏపీ నుంచి 11,346 మంది ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 11,346 మంది పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేశారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, బిహార్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 200 నుంచి 300 మంది చొప్పున దరఖాస్తు చేశారు. కేరళ, మధ్యప్రదేశ్, తమిళ నాడు అభ్యర్థులు ఒక్కో రాష్ట్రం నుంచి 100 మందికిపైగా దరఖాస్తు చేశారు. మొత్తంగా ఇతర రాష్ట్రాల వారు 23,628 మంది దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ నుంచి అత్యధికం గ్రూపు-2 పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో కరీంనగర్ నుంచి ఎక్కువ మంది (1,15,315) దరఖాస్తు చేసుకున్నారు. తక్కువ దరఖాస్తులు నిజామాబాద్ జిల్లా నుంచి 48,015 వచ్చాయి. -
గ్రూప్-2 పరీక్ష యథాతథం.. వాయిదా అబద్ధం
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న గ్రూపు-2 రాత పరీక్ష యథాతథంగా ఉంటుందని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. పరీక్షను వాయిదా వేస్తారంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఇటీవల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు ఎంపికైన 904 మంది అభ్యర్థుల జాబితాలను (శాఖల వారీగా కేటాయించిన ఉద్యోగుల జాబితా) వివిధ శాఖల ఇంజనీర్ ఇన్ ఛీఫ్‌లకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడారు. మరో వారం రోజుల్లో 1050 ఏఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామన్నారు. గ్రూపు-2 మినహా తాము నోటిఫికేషన్లు ఇచ్చిన అన్నింటి భర్తీని ఈనెలాఖరుకల్లా పూర్తి చేస్తామన్నారు. వచ్చే నెలలో గ్రూపు-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బయోమెట్రిక్ విధానం అమలుతోపాటు కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చే స్తామన్నారు. మరోవైపు ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేసే ఆలోచన చేస్తోందన్నారు. సింగరేణి సంస్థ కూడా తమ వద్ద ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరిందని, అయితే అది ప్రభుత్వం నుంచి రావాలని చెప్పామన్నారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించిన ఇండెంట్ ఇంకా తమకు రాలేదన్నారు.