
గవర్నర్‌తో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ భేటీ
⇒ గ్రూప్-2 పరీక్ష ఏర్పాట్లపై వివరణ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11, 13 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వివరించారు. ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుతో కలసి మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను చక్రపాణి మర్యాద పూర్వకంగా కలిశారు. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో చేపడుతున్న నియామకాల ప్రక్రియను వివరించారు.
ముఖ్యంగా గ్రూప్-2 పరీక్ష కోసం చేసిన ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని గవర్నర్‌కు వివరించారు.