
గ్రూప్-2 అభ్యర్థులకు వెసులుబాటు
హైదరాబాద్: ఈనెల 11, 13వ తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలు రాసే అభ్యర్థులకు పెద్ద నోట్ల చెలామణి విషయంలో వెసులుబాటు కల్పిస్తున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ గ్రూప్-2 అభ్యర్థుల కోసం మూడు వేల బస్సులను నడుపుతోందని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశారు. ఈ నోట్ల విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు.