ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో గర్భిణి
అంబులెన్సు తెచ్చినా వెళ్లేందుకు తిరస్కృతి
పరీక్ష అనంతరం ఆస్పత్రికి గర్భిణి తరలింపు
నాగర్‌కర్నూల్ క్రైం: ఉద్యోగం సాధించాలన్న తపనతో ఓ నిండు గర్భిణి గ్రూప్–2 పరీక్షకు హాజరైంది. పరీక్ష రాస్తుండగానే పురిటినొప్పులు వచ్చి నా ఆమె చలించలేదు.. పట్టుబట్టి పరీక్ష రాసిన తర్వాతే కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్లింది. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి (25) నిండు గర్భిణి. అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో చాలా కష్టపడి చదివి గ్రూప్–2 పరీక్షల కోసం వేచి చూసింది.
ఈ మేరకు సోమ వారం పరీక్ష రాస్తుండగా అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. విష యం తెలుసుకున్న అధికారులు కలెక్టర్ బదావత్ సంతోశ్‌కు సమాచారం అందించగా.. ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అయితే అందుకు నిరాకరించిన గర్భిణి.. పరీక్ష పూర్తయిన తర్వాతే కాన్పు కోసం వెళ్తానని పట్టుబట్టింది. తీవ్రమైన పురిటి నొప్పులను భరిస్తూనే పరీక్ష రాసిన అనంతరం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రా రియల్ ఎస్టేట్.. టీడీపీ విజన్ డాక్యుమెంట్
Comments
Please login to add a commentAdd a comment