సాక్షి, గుంటూరు: ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. గ్రూప్-2 కింద 897 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25న రాష్ట్ర వ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. 4,04,037 (87.17%) మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఇక ప్రాథమిక కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలని సూచించింది. పోస్టు/వాట్సప్/ఎస్‌ఎంఎస్/ఫోన్/వ్యక్తిగతంగా సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది.
స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను ఐదు నుంచి ఎనిమిది వారాల్లో ప్రకటించే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్ -2 మెయిన్ పరీక్షను జూన్/జులైలో నిర్వహించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment