వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ప్రాథమిక ‘కీ’ విడుదల
హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ‘ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్(ఏపీపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. ప్రాథమిక ‘కీ’ని ccla.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో ఉంచినట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 2న జరిగిన ఈ పరీక్షలకు 14 లక్షల మందిపైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రయోజనార్థం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ప్రాథమిక ‘కీ’ని సాక్షి తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ కీని sakshieducation.com లో చూసుకోవచ్చు. ‘కీ’పై అభ్యంతరాలు ఉంటే ఏపీపీఎస్సీకి తెలియజేయవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను www.apspsc.gov.in అనే వెబ్‌సైట్‌కు ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పంపాల్సి ఉంటుంది.
గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరు. ప్రాథమిక ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైతే సవరణలు చేసిన అనంతరం ఈనెల 10న ఫైనల్ ‘కీ’ విడుదల చేస్తారు. తుది కీ ఆధారంగానే ఈ నెల 20న ఫలితాలు ప్రకటిస్తామని, 26 నుంచి అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం.. నెలాఖరులోగా నియామక పత్రాలు జారీ చేస్తామని రెవెన్యూ ఉన్నతాధికారులు తెలిపారు.