‘ఇండియన్ రైన్’ అని ఏ నదిని పిలుస్తారు? | Grand Test For VRO / VRA | Sakshi
Sakshi News home page

‘ఇండియన్ రైన్’ అని ఏ నదిని పిలుస్తారు?

Published Thu, Jan 16 2014 2:27 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Grand Test  For VRO / VRA

1.ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) మంత్రిత్వ స్థాయి సమావేశం 2013, డిసెంబర్‌లో ఎక్కడ జరిగింది?
 1) జెనీవా     
 2) దోహా
 3) బాలి
 4) టోక్యో
 
2.గతేడాది డిసెంబర్ 5న మరణించిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు నోబెల్ శాంతిబహమతి ఏ సంవత్సరంలో లభించింది?
 1) 1990
 2) 1991
 3) 1989     
 4) 1993
 
 

3.కాత్యాయనీ విద్మహేకు 2013 సంవత్సరానికి ఏ అవార్డు లభించింది?
 1) జ్ఞాన్‌పీఠ్ అవార్డు
 2) మూర్తీదేవీ అవార్డు
 3) కేంద్రసాహిత్య అకాడమీ పుర స్కారం
 4) కాళిదాస్ సమ్మాన్‌పురస్కార్
 
 4.చెన్నై ఓపెన్ టెన్నిస్ విజేత?
 1) స్టాన్‌స్లాస్ వావ్‌రింకా
 2) రోజెర్ వాసెలీన్
 3) రోజర్ ఫెదరర్
 4) ఆండీ ముర్రే
 
 5.రమణ్‌సింగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు?
 1) మధ్యప్రదేశ్     
 2) రాజస్థాన్
 3) ఛత్తీస్‌గఢ్     
 4) మిజోరం
 
 6.వీకే దుగ్గల్ ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యారు?
 1) మేఘాలయ     
 2) సిక్కిం
 3) నాగాలాండ్
 4) మణిపూర్
 
 7.కామన్‌వెల్త్ దేశాధినేతల సదస్సు (చోగమ్) 2013, నవంబర్‌లో ఎక్కడ జరిగింది?
 1) పెర్త్
 2) కొలంబో
 3) న్యూఢిలీ
 4) కౌలాలంపూర్
 
 8.భారతీయ మహిళా బ్యాంక్ తొలిశాఖను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గతేడాది నవంబర్ 19న ఎక్కడ ప్రారంభించారు?
 1) ముంబై     
 2) న్యూఢిల్లీ
 3) ైెహ దరాబాద్     
 4) జైపూర్
 
 9.ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన భాషా, సాంస్కృతిక శాఖను ఎవరికి కేటాయించారు?
 1) శైలజానాథ్
 2) కె. జానారెడ్డి    
 3) వట్టి వసంతకుమార్
 4) డి.కె.అరుణ
 
 10.సునామీ :: జపాన్, సైక్లోన్ ::
 1) గ్రీక్     
 2) లాటిన్
 3) అరబ్బీ
 4) ఇంగ్లిష్
 
 11.చిత్రావతి ఏ నదికి ఉపనది?
 1) కృష్ణా     
 2) గోదావరి
 3) పెన్నా
 4) వంశధార
 
 12.‘మానవసేవే మాధవ సేవ’ అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన సంస్థ?
 1) దివ్యజ్ఞాన సమాజం
 2) ఆర్య సమాజం
 3) రామకృష్ణ మిషన్
 4) బ్రహ్మ సమాజం
 
 13.గవర్నర్ కనీసం ఎంత కాలం తన పదవిలో కొనసాగవచ్చు?
 1) ఐదేళ్లు
 2) ఆరేళ్లు
 3) ప్రధానమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
 4) రాష్ట్రపతి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
 
 14.షెడ్యూల్ బ్యాంకులను నియంత్రించేది?
 1) ఫెడరల్ బ్యాంక్
 2) రిజర్వ్ బ్యాంక్
 3) పార్లమెంట్
 4) రాష్ట్రపతి
 
 15.తొలి వేదకాలంలో ఆర్యుల నాయకున్ని ఏమని పిలిచేవారు?
 1) రాజన్
 2) గ్రామణి
 3) సేనాని
 4) సేనాధిపతి
 
 16.దేశాలన్నీ తమ ఆర్థిక కార్యకలాపాలను ప్రపంచమంతటా విస్తరించుకోవడాన్ని ఏమంటారు?
 
 1) ఆధునికీకరణ     
 2) ప్రపంచీకరణ
 3) నగరీకరణ
 4) పైవన్నీ
 
 17.ఆంధ్రప్రదేశ్‌లో కాఫీ తోటల పెంపకాన్ని ఏ జిల్లాలో చేపడుతున్నారు?
 1) వరంగల్
 2) పశ్చిమగోదావరి
 3) విశాఖపట్టణం
 4) చిత్తూరు
 
 18.రక్తచందనం చెట్లు ఏ జిల్లాలో ఉన్నాయి?
 1) నెల్లూరు
 2) నిజామాబాద్
 3) చిత్తూరు
 4) ప్రకాశం
 
 19.‘ఇండియన్ రైన్’ అని ఏ నదిని పిలుస్తారు?
 1) గంగ
 2) గోదావరి
 3) కృష్ణా
 4) బ్రహ్మపుత్ర
 
 20.ఎర్రరక్త కణాల జీవితకాలం?
 1) 24 గంటలు
 2) 100 రోజులు
 3) 120 రోజులు    
 4) ఏడాది
 
 21.కంటికి కనిపించే కాంతి తరంగదైర్ఘ్యం ఎంత?
 1) 400-700 నానోమీటర్లు
 2) 800-1000 నానోమీటర్లు
 3) 400-500 నానోమీటర్లు
 4) లక్ష నానోమీటర్లు
 
 22.మిశ్రమ గ్రంథి అని దేన్ని అంటారు?
 1) పిట్యూటరీ
 2) క్లోమం
 3) అధివృక్క    
 4) అవటుగ్రంథి
 
 23.పిండాన్ని-తల్లి గర్భాశయ కుడ్యానికి కలిపే నిర్మాణాన్ని ఏమంటారు?
 1) అండకోశం     
 2) వృక్కనాళం
 3) పిత్తాశయం     
 4) జరాయువు
 
 24.ఎయిడ్స్ వల్ల నశించే రక్తకణాలేవి?
 1) లింపోసైట్స్     
 2) మోనోసైట్స్
 3) బేసోఫిల్స్     
 4) థ్రాంబోసైట్స్
 
 25.వేడిచేయడం వల్ల నశించే విటమిన్?
 1) బి     
 2) సి
 3) డి
 4) ఇ
 
 26.ఒక గ్రాము గ్లూకోజ్ నుంచి ఎంత శక్తి విడుదలవుతుంది?
 1) 3 కిలో కేలరీలు
 2) 4 కిలో కేలరీలు
 3) 5 కిలో కేలరీలు
 4) 6 కిలో కేలరీలు
 
 27.మిత స్థిర స్థాయిలో ఎలక్ట్రాన్ల జీవిత కాలం?
 1) 10-8 సెకన్లు     
 2) 3ప10-8సెకన్లు
 3) 10-3 సెకన్లు     
 4) 3ప10-3 సెకన్లు
 
 28.ఆంధ్రప్రదేశ్‌లో అయస్కాంత క్షేత్ర తీవ్రత విలువ సుమారుగా?
 1) 10-4 టెస్లా     
 2) 0.39ప10-6 టెస్లా
 3) 0.39ప10-4 టెస్లా
 4) 0.39ప10-3 టెస్లా
 
 29.ప్రెషర్‌కుక్కర్‌లో ఉష్ణోగ్రత సుమారుగా?
 1) 120 డిగ్రీల సెంటీగ్రేడ్
 2) 100 డిగ్రీల సెంటీగ్రేడ్
 3) 108 డిగ్రీల సెంటీగ్రేడ్
 4) 150 డిగ్రీల సెంటీగ్రేడ్
 
 30.ఈథేన్ నుంచి ఏ పద్ధతి ద్వారా పాలిథీన్‌ను పొందవచ్చు
 1) కాటనేషన్
 2) ప్రతిక్షేపణ
 3) పొలిమరీకరణం
 4) సంకలనం
 
 31.2,000 నుంచి 10,000 హెక్టార్ల భూమికి నీటి పారుదల అందించే ప్రాజెక్టులు ఏ తరహాకి చెందినవి?
 1) చిన్న నీటిపారుదల
 2) మధ్య తరహా నీటిపారుదల
 3) భారీ నీటిపారుదల
 4) సాధారణ నీటిపారుదల
 
 32.ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా నీటి పారుదలను  కల్పిస్తున్న వనరులు?
 1) బావులు    
 2) చెరువులు
 3) కాలువలు
 4) నదులు
 
 33.కలంకారి వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
 1) శ్రీకాకుళం
 2) సిరిసిల్ల
 3) మచిలీపట్నం    
 4) తూర్పుగోదావరి
 
 34.2006, సెప్టెంబర్ 1న రాజీవ్ స్వగృహ పథకాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు?
 1) రంగారెడ్డి
 2) మహబూబ్‌నగర్
 3) శ్రీకాకుళం
 4) గుంటూరు
 
 35.‘దక్షిణ గంగా’ అని ఏ నదిని పిలుస్తారు?
 1) గోదావరి
 2) కృష్ణా
 3) పెన్నా
 4) ప్రాణహిత
 
 36.పట్టణ ప్రాంత నిరుపేదలకు ఉచితంగా అపార్ట్‌మెంట్‌లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం?
 1) రాజీవ్ స్వగృహ    
 2) రాజీవ్ గృహకల్ప
 3) ఇందిరమ్మ    
 4) రాజీవ్ ఆవాస్‌యోజన
 
 37.బీడీ తయారీకి ఉయోగించే తునికాకు ఏ ప్రాంతంలో లభిస్తోంది?
 1) రాయలసీమ
 2) ఉత్తరాంధ్ర
 3) దక్షిణాంధ్ర    
 4) తెలంగాణ
 
 38.గ్రామీణ ప్రాంత సమస్యల పరిష్కారానికి రాజీవ్ పల్లెబాట కార్యక్రమాన్ని 2004 జూన్ 13న ఎక్కడ ప్రారంభించారు?
 1) రంగారెడ్డి జిల్లా - చేవెళ్ల
 2) రంగారెడ్డి జిల్లా - రాజేంద్రనగర్
 3) మహబూబ్‌నగర్ జిల్లా - షాద్‌నగర్
 4) శ్రీకాకుళం జిల్లా - నందిగాం
 
 39.    పట్టణ ప్రాంత సమస్యల పరిష్కారానికి 2005 జనవరి 9న రాజీవ్‌నగర బాట కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు?
     1) హైదరాబాద్     2) చిత్తూరు
     3) కర్నూలు    4) రంగారెడ్డి
 
 40.    {పస్తుతం 104 , 108 సేవలను నిర్వహిస్తున్న సంస్థ?
     1) సత్యం ఫౌండేషన్
     2) జీవీకే ఫౌండేషన్
     3) ప్రేమ్‌జీ ఫౌండేషన్        4) పైవన్నీ
 
 41.    వైఎస్సార్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించిన తేదీ?
     1) 2009, నవంబర్ 1
     2) 2009, అక్టోబర్ 2
     3) 2010, నవంబర్ 1
     4) 2010, అక్టోబర్ 2
 
 42.    స్వయం సహాయక బృందాల మహిళలకు పింఛన్ అందించే పథకం ఏది?
     1) పావలా వడ్డీ     2) ప్రజాపథం
     3) వైఎస్సార్ అభయహస్తం
     4) రచ్చబండ
 
 43.    వైశాల్యం పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది?
     1) రెండో    2) మూడో
     3) నాలుగో    4) ఐదో
 
 44.     ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు  ఎంత?
     1) 974 కిలోమీటర్లు     2) 1000 కిలోమీటర్లు
     3) 970 కిలోమీటర్లు     4) 990 కిలోమీటర్లు
 
 45.    వైఎస్సార్ అభయ హస్తం పథకంలో భాగంగా ఏ తరగతి చదివే విద్యార్థులకు రూ. 1,200 ఉపకారవేతనం అందజేస్తారు?
     1) ఒకటి నుంచి పదోతరగతి
     2) ఐదు నుంచి పదోతరగతి
     3) 9 నుంచి పన్నెండో తరగతి
     4) ఒకటి నుంచి ఐదో తరగతి
 
 46.    ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏ పేరుతో అమలు చేస్తున్నారు?
     1) వైఎస్సార్ అభయహస్తం
     2) ఇందిర జీవిత బీమా పథకం
     3) అంబేద్కర్ జీవనధార
     4) ఇందిరా క్రాంతి పథం
 
 47.    రాష్ర్టంలోని ఏ జిల్లాలో కొమరం భీమ్ ప్రాజెక్ట్ ఉంది ?
     1) నిజామాబాద్    2) కరీంనగర్
     3) ఆదిలాబాద్    4) వరంగల్
 
 48.    {V>Ð]l*-ÌZÏని వ్యవసాయ కూలీలకు భూమిలేని గ్రామీణ నిరుపేదలకు వర్తించే బీమా పథకం?
     1) వైఎస్సార్ అభయహస్తం
     2) ఇందిర జీవిత బీమా
     3) ఇందిరా క్రాంతి    4) పైవన్నీ
 
 49.    ఉపగ్రహ సమాచారంతో భూసంబంధ ఫొటోలను సేకరించి కంప్యూటరీకరించే విధానాన్ని ప్రారంభించిన పథకం ఏది?
     1) పొలంబందీ     2) ఇందిరప్రభ
     3) రాజీవ్ అభ్యుదయ
     4) భూభారతి
 
 50.    రాష్ర్టంలో బంగాళదుంపలు ఎక్కువగా పండే జిల్లా ఏది?
     1) రంగారెడ్డి     2) మెదక్
     3) విజయనగరం
     4) ప్రకాశం
 
 51.    500 మంది దళితులు నివసించే ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించే పథకం ఏది?
     1) అంబేద్కర్ మంచినీటిపథకం
     2) అంబేద్కర్ జీవన ధార
     3) ఇందిరా నీటి పథకం
     4) రాజీవ్ నీటిపథకం
 
 52.    తెలంగాణలో ఖరీఫ్ పంటను ఏమని పిలుస్తారు?
     1) అబి     2) తబి
     3) దాళ్వా     4) సార్వా
 
 53.    రాష్ట్రంలో సహకార వ్యవస్థకు ఆద్యుడు ఎవరు?
     1) పట్టాభి సీతారామయ్య
     2) మోహన్‌కందా     3) ఎన్.టి.రామారావు
     4) కొండా లక్ష్మణ్ బాపూజీ
 
 54.    సహకార వారోత్సవాలను ఏ తేదీల్లో నిర్వహిస్తారు?
     1) నవంబర్ 1- 8    2) నవంబర్ 14-20
     3) నవంబర్ 15- 20    4) నవంబర్ 2- 9
 
 55.    ఏకగవాక్ష విధానం (సింగిల్‌విండో సిస్టమ్) ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రారంభించారు?
     1) ఎన్.టి.రామారావు
     2) వైఎస్ రాజశేఖరరెడ్డి
     3) వైద్యనాథన్     4) మోహన్‌కందా
 
 56.    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (కోఆపరేటివ్ బ్యాంక్ -ఆప్కాబ్)ను ఎప్పుడు ప్రారంభించారు?
     1) 1950     2) 1952
     3) 1963     4) 1985
 
 57.    సహకార సంఘంలో కనీస సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి?
     1) 10     2) 15     3) 25
     4) ఎంతమందైనా ఉండొచ్చు.
 
 58.    ‘అందరికైతాను, తనైకై అందరూ’ అనే నినాదంతో ఏర్పడిన సంస్థ?
     1) ట్రస్ట్     2) కంపెనీ
     3) సహకారసంఘాలు
     4) భాగస్వామ్యసంస్థ
 
 59.    చేనేత సహకార సంఘాలు ఎవరి అధీనంలో పనిచేస్తాయి?
     1) ఆప్కో     2) ఆప్కాబ్
     3) ఎస్‌బీఐ     4) ఆర్‌బీఐ
 
 60.    జనతా వస్త్రాలకు అత్యంత ఆదరణ కల్పించిన ముఖ్యమంత్రి ఎవరు?
     1) వైఎస్ రాజశేఖరరెడ్డి        2) మొరార్జీదేశాయ్
     3) ఎన్.టి.రామారావు        4) మర్రిచెన్నారెడ్డి
 
 61.కింది వాటిలో 3, 4, 5, 6, 8 లతో నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఏది ?
     1) 80     2)100
     3) 120     4) 160
 
 62.4 మొదటి 6 గుణిజాల సరాసరి ఎంత?
     1) 5     2) 14
     3) 16     4) 22
 
 63.మూడు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లలో ఎరుపు లైట్ ప్రతి 60 సెకన్లకోసారి 72 సెకన్లకోసారి, 120 సెకన్లకోసారి మారుతాయి. అవన్నీ ఉదయం 9 గంటలకు ఒకేసారి మారితే తిరిగి అవన్నీ ఒకేసారి ఏ సమయంలో మారుతాయి?
     1) 9: 02     2) 9: 04
     3) 9: 05     4) 9 : 06
 64.ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఆఫీస్‌కు 15 కి.మీ./గంట వేగంతో ఆఫీస్ నుంచి ఇంటికి 60 కి.మీ/గంట వేగంతో ప్రయాణించాడు. మొత్తం ప్రయాణానికి పట్టిన కాలం 30 నిమిషాలు. అయితే ఆఫీస్ నుంచి ఇంటికి ఎంత దూరం?
     1) 24 కి.మీ.     2) 12 కి.మీ.
     3) 6 కి.మీ.     4) 3 కి.మీ.
 
 65.రూ. 600 లను ఎ, బి అనే ఇద్దరు వ్యక్తులు 2 : 3 నిష్పత్తిలో పంచుకుంటే బి వాటా ఎంత?
     1) రూ. 120     2) రూ. 240
     3) రూ. 360     4) రూ. 480
 
 66.రెండు సంఖ్యలు 5 : 3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి వ్యత్యాసం 10. అయిన అందులో చిన్న సంఖ్య?
     1) 15     2) 25
     3) 35     4) 45
 
 67.వ్యాపారి ఒక వస్తువును రూ. 1600 లకు అమ్మితే 20 శాతం నష్టం వచ్చింది. అతనికి 10 శాతం లాభం రావాలంటే ఆ వస్తువును ఎన్ని రూపాయలకు అమ్మాలి?
     1) రూ. 2,000     2) రూ. 2,200
     3) రూ. 2,400     4) రూ. 2,500
 
 68.తండ్రి ప్రస్తుత వయసు, అతని కొడుకు వయసుకు 4 రెట్లు. ఐదేళ్ల తర్వాత తండ్రి వయసు, కొడుకు వయసుకు 3 రెట్లు ఉంటుంది. అయితే ఐదేళ్ల క్రితం తండ్రి వయసు, కొడుకు వయసుకు ఎన్ని రెట్లు?
     1) 5 రెట్లు     2) 6 రెట్లు
     3) 7 రెట్లు     4) 9 రెట్లు
 
 గమనిక:
 ప్రస్తుతం తండ్రీ, కొడుకుల వయసులు- 40 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఐదు సంవత్సరాల తర్వాత తండ్రీ, కొడుకుల వయసులు 45 సంవత్సరాలు,15ఏళ్లు. ఐదేళ్ల కిందట వారి వయసులు 35సంవత్సరాలు, 5 సంవత్సరాలు
 
 69.ఒక తరగతిలో గల 25 మంది విద్యార్థుల సరాసరి వయసు 12 సంవత్సరాలు. వారితో పాటు ఉపాధ్యాయుని వయసు కూడా కలిపితే సరాసరి ఒక సంవత్సరం పెరుగుతుంది. అయితే ఉపాధ్యాయుని వయసెంత?
     1) 13 సంవత్సరాలు    2) 26 సంవత్సరాలు
     3) 38 సంవత్సరాలు     4) ఏదీకాదు
 
 70.20 మంది వ్యక్తులు 30 పనులను 30 రోజులలో పూర్తి చేయగలరు. అయితే 15 మంది వ్యక్తులు 180 పనులను ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు?
 1) 180     2) 120
 3) 60     4) 56
 
 71.ఒక వ్యక్తి తన ఆస్తిలో ముగ్గురు కొడుకులకు 20 శాతం వాటా ఇచ్చాడు. 30 శాతం ఆస్తిని తన భార్యకు, మిగిలిన దానిలో 50 శాతాన్ని అనాధాశ్రమానికి విరాళంగా ఇస్తే చివరగా అతని వద్ద రూ. 20 వేలు మిగిలాయి. అయితే అతని మొత్తం ఆస్తి ఎంత?
 1) రూ. 4 లక్షలు     2) రూ. 6 లక్షలు
 3) రూ. 2 లక్షలు     4) రూ. 5 లక్షలు
 
 72.ఒక వ్యక్తి తన పనిలో 2/3 వ వంతును 12 రోజులలో పూర్తి చేశాడు. మిగిలిన పనిని ఎన్నిరోజులలో పూర్తి చేయగలడు?
 1) 3 రోజులు     2) 6 రోజులు
 3) 9 రోజులు     4) 12 రోజులు
 
 73.    వ్యాపారి ఒక వస్తువును కొన్న ధర కంటే 20 శాతం అధికంగా ముద్రించి 10 శాతం డిస్కౌంట్‌తో అమ్మాడు. అయితే అతనికిఎంత శాతం లాభం వస్తుంది?
 1) 10     2) 8
 3) 30     4) 15
 
 74.    అ ఒక పనిని 20 రోజులలో, ఆ అదే పనిని 36 రోజులలో చేయగలరు. అ ఒంటరిగా ఆపనిని ప్రారంభించిన 5 రోజుల తర్వాత పని నుంచి తప్పుకోగా, మిగిలిన పనిని ఆ ఎన్నిరోజులలో పూర్తి చేయగలడు?
 1) 18 రోజులు     2) 27 రోజులు
 3) 31 రోజులు     4) 25 రోజులు
 
 75.    ఒక నీళ్ల ట్యాంకును మొదటి కుళాయి 10 నిమిషాలలో, రెండో కుళాయి 15 నిమిషాలలో నింపగలవు. కానీ దాని అడుగున ఉన్న చిన్న రంధ్రం ద్వారా పూర్తిగా నిండి ఉన్న ట్యాంకు 30 నిమిషాలలో ఖాళీఅవుతుంది. అయితే ఆ రెండు కుళాయిలు ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది?
 1) 7 నిమిషాల 50 సెకన్లు
 2) 7 నిమిషాల 30 సెకన్లు
 3) 12 నిమిషాల 40 సెకన్లు
 4) 10 నిమిషాలు
 
 76.ఎ, బి ల మధ్య దూరం 440 కి.మీ. ఒక వ్యక్తి ఎ నుంచి బి దిశలో గంటకు 50 కి.మీ. వేగంతో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాడు. మరో వ్యక్తి అదే సమయంలో బి నుంచి ఎ దిశలో గంటకు 60 కి.మీ. వేగంతో ప్రారంభమయ్యాడు. అయితే వీరిద్దరూ ఏసమయంలో కలుసుకుంటారు?
 1) మధ్యాహ్నం 12.30
 2) మధ్యాహ్నం 1.00
 3) మధ్యాహ్నం 2.00
 4) సాయంత్రం 4.00
 
 77.ఒక చతురస్ర వైశాల్యం 31,250 చదరపుమీటర్లు. అయితే దాని కర్ణం ఎంత?
 1) 250 మీటర్లు     
 2) 125 మీటర్లు
 3) 210 మీటర్లు     
 4) 245మీటర్లు
 
 78.ఒక సమబాహు చతుర్భుజం (రాంబస్) రెండు కర్ణాలు వరుసగా 12 మీ.,16 మీ. అయితే దాని చుట్టుకొలత ఎంత?
 1) 40 మీటర్లు
 2) 56 మీటర్లు
 3) 60 మీటర్లు
 4) ఏదీ కాదు
 
 79.ఒక త్రిభుజం మూడు భుజాలు వరుసగా 9 మీటర్లు, 12 మీటర్లు, 15మీటర్లు. అయితే దాని వైశాల్యం ఎంత?
 1) 1620 చ.మీ.     
 2) 243 చ.మీ.
 3) 54 చ.మీ.
 4) 36 చ.మీ.
 
 80.పరీక్షలో పాస్ మార్కులు 40 శాతం. ఒక విద్యార్థికి పరీక్షలో 280 మార్కులు రావడంతో 40 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. అయితే ఆ విద్యార్థి పాసవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి?
 1) 400     
 2) 600
 3)750
 4) 800
 
 81.ఒక సంచిలో 20 పైసలు, 25 పైసలు, 50 పైసల నాణేలు 1: 2: 3 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ సంచిలో మొత్తం రూ. 220 లు ఉంటే 20 పైసల నాణేలు ఎన్ని ఉంటాయి?
 1) 100     2) 200
 3) 300     4) 400
 
 82.30 లీటర్ల మిశ్రమంలో పాలు, నీళ్లు 11:1 నిష్పత్తిలో ఉన్నాయి. అందుల్లోంచి 6 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి దాని స్థానంలో 6 లీటర్ల నీరు పోస్తే, కొత్త మిశ్రమంలో పాలు, నీళ్ల నిష్పత్తి ఎలా ఉంటుంది?
 1) 5:2     2) 9:5
 3) 10:7 4) 11:4
 
 83.ఒక వ్యక్తి రమేశ్‌కు రూ. 600లను నాలుగేళ్లకు, సురేశ్‌కు రూ. 800లను ఐదేళ్లకుగాను బారువడ్డీ ప్రకారం ఒకే వడ్డీ రేటుతో ఇచ్చాడు. వారిద్దరి నుంచి వచ్చిన వడ్డీ రూ. 320. అయితే వడ్డీరేటు ఎంత?
 1) 2 శాతం     2) 3 శాతం
 3) 4 శాతం     4) 5 శాతం
 
 84.ఆర్నెల్లకోసారి లెక్కగట్టే పద్ధతిలో సంవత్సరానికి 10 శాతం వడ్డీరేటుతో రూ. 400లకు ఒక ఏడాదికి ఎంత చక్రవడ్డీ అవుతుంది?
 1) రూ. 441     2) రూ. 41
 3) రూ. 40     4) రూ. 44
 
 85.రూ. 60 వేల పెట్టుబడితో ఎ అనే వ్యక్తి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. నాలుగు నెలల తర్వాత రూ. 80 వేల పెట్టుబడితో బి అనే వ్యక్తి ఆ వ్యాపారంలో చేరాడు. ఆ సంవత్సరం చివర వారికి రూ. 34 వేలు లాభం వస్తే అందులో ఎ వాటాఎంత?
 1) రూ. 16 వేలు     2) రూ. 18 వేలు
 3) రూ. 20 వేలు     4) రూ. 22 వేలు
 
 86.ఒక వ్యాపారి కొన్న ధరకే వస్తువులను అమ్ముతున్నాడు. కానీ అమ్మేటప్పుడు కిలోకు బదులుగా 800 గ్రాముల సరుకు ఇస్తున్నాడు. అయితే అతనికి ఎంత శాతం లాభం వస్తుంది?
 1) 25     2) 20
 3) 18     4) 16
 
 87.ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఆఫీస్‌కు 3 కి.మీ./గంట వేగంతో ప్రయాణించడం వల్ల 9 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. తర్వాత రోజు 4 కి.మీ/గంట వేగంతో ప్రయాణించడం వల్ల 6 నిమిషాలు త్వరగా చేరుకున్నాడు. అయితే ఇంటి నుంచి ఆఫీస్‌కు ఎంతదూరం?
 1) 1 కి.మీ.     2) 2 కి.మీ.
 3) 3 కి.మీ.     4) 4 కి.మీ.
 
 88.200 మీటర్లు పొడవున్న రైలు 72 కి.మీ./గంట వేగంతో ప్రయాణిస్తే, నిలబడి ఉన్న వ్యక్తిని ఎంత సమయంలో దాటుతుంది?
 1) 10 సెకన్లు     2) 10 నిమిషాలు
 3) 20 సెకన్లు     4) 20 నిమిషాలు
 
 89.0.5% = ?
 1) 0.5     2) 0.05
 3) 0.005     4) 0.0005
 
 90.ఏ కనిష్ట సంఖ్యను కలిపితే 4,220 కచ్చిత వర్గమవుతుంది?
 1) 2     2) 5
 3) 8     4)16
 
 91.ఒక కోడ్ భాషలో ఖీఅఆఔఉ ను ్ఖఇఉ్కఒ గా రాస్తే ఇఏఅఐఖ ను ఏవిధంగా పేర్కొనాలి?
 1) DIBJS     2) DJDMW
 3) DJCKT     4) EJDMW
 
 92.2, 3, 8, 31, 154, 923.... ఈ సిరీస్‌లో తర్వాత వచ్చే సంఖ్య?
     1) 6460     2) 6461
     3) 5538     4) 5537
 
 93.ఒక వ్యక్తి ఉత్తరం దిశలో 4 కి.మీ. ప్రయాణించి, కుడివైపు 8 కి.మీ. ప్రయాణించాడు. తర్వాత కుడివైపు 20 కి.మీ. ప్రయాణించి, చివరగా కుడివైపు మరో 20 కి.మీ. ప్రయాణించాడు. ఇప్పుడతను తన ప్రారంభ స్థలం నుంచి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు?
 1) ఈశాన్యం 20 కి.మీ.
 2) నైరుతి 20 కి.మీ.    
 3) తూర్పు 16 కి.మీ.
 4) దక్షిణం 12 కి.మీ.
 
 94.కింది వాటిలో భిన్నంగా ఉంది?
 1) చతురస్రం     
 2) దీర్ఘచతురస్రం
 3) త్రిభుజం     
 4) సమబాహుత్రిభుజం
 
 95.ధీరజ్ వేదికపై బహుమతి తీసుకుంటున్న అమ్మాయిని పరిచయం చేస్తూ - ఆమె తల్లి, నా తండ్రి ఏకైక కొడుకు భార్య అని చెప్పాడు. అయితే ధీరజ్‌కు ఆ అమ్మాయి ఏమవుతుంది?
 1) భార్య     
 2) సోదరి
 3) తల్లి
 4) కూతురు
 
 96.2018వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏవారం 5 సార్లు వస్తుంది?
 1) ఆదివారం
 2) మంగళవారం
 3) శుక్రవారం    
 4) ఏదీకాదు
 
 97.కింది శ్రేణిలో తర్వాత వచ్చే అక్షరాన్ని కనుక్కోండి?
 A, C, F, J, O  ....................
 1) U
 2) T
 3) S
 4) R
 
 98.తమిళనాడు : చెన్నై :: కర్ణాటక ::
 1) మంగుళూరు     
 2) బెంగళూర్
 3) త్రివేండ్రం     
 4) గాంధీనగర్
 
 99.C = 9, E = 25, G = 49 అయితే కింది వాటిలో సరైంది?
 1) B = 4, F = 36    
 2) D = 4, M = 36
 3) C = 4, R = 36
 4) H = 8, I = 36
 
 100.
     
     1)     2)
 
 
 
     3)     4)
 
 Answers
     1) 3    2) 4    3) 3    4) 1    5) 3
     6) 4    7) 2    8) 1    9) 3    10) 1
     11) 3    12) 3    13) 4    14) 2     15) 1
     16) 2    17) 3    18) 3    19) 2    20) 3
     21) 1    22) 2    23) 4    24) 1    25) 2
     26) 2    27) 4    28) 3    29) 1    30) 3
     31) 2    32) 1    33) 3    34) 1    35) 1
     36) 2    37) 4    38) 1    39) 4    40) 2
     41) 1    42) 3    43) 3    44) 1    45) 3
     46) 2    47) 3    48) 2    49) 4    50) 2
     51) 2    52) 1    53) 1    54) 2    55) 4
     56) 3    57) 1    58) 3    59) 1    60) 3
     61) 3    62) 2    63) 4    64) 3    65) 3
     66) 1    67) 2    68) 3    69) 3    70) 2
     71) 1    72) 2    73) 2    74) 2    75) 2
     76) 3    77) 1    78) 1    79) 3    80) 4
     81) 1    82) 4    83) 4    84) 2    85) 2
     86) 1    87) 3    88) 3    89) 3    90) 2
     91) 2    92) 1    93) 2    94) 3    95) 4
     96) 4    97) 1    98) 2    99) 1    100) 4
 
 
 రూపొందించినవారు
 విజయేందర్ రెడ్డి      - కరెంట్ అఫైర్‌‌స
 బి. శ్రీనివాస్     - సోషల్ స్టడీస్
 ఎస్. సత్యనారాయణ    - బయాలజీ
 నాగరాజశేఖర్     - ఫిజికల్ సైన్‌‌స
 అల్లాడి అంజయ్య     - గ్రామీణాంశాలు
 బి. రవిపాల్ రెడ్డి     - అర్థమెటికల్, లాజికల్ రీజనింగ్
 for VRO/VRA & Panchayat Secretary Guidance
 visit: www.sakshieducation.com
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement