sakshi bhavita
-
మంచి ర్యాంక్‌కు మాక్ టెస్టులు
సాక్షి మీడియా గ్రూప్, నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్(తెలంగాణ)/ ఈఏపీసెట్(ఆంధ్రప్రదేశ్), నీట్ మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకోసం ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌కు పంపిస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ‘నీట్’.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ కల్పించే ఎంసెట్/ఈఏపీసెట్ కోసం లక్షల మంది సన్నద్ధమవుతున్నారు. వీరికి చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించిన ఎంసెట్/ఈఏపీసెట్, నీట్ మాక్ టెస్టులను నిర్వహించనున్నారు. పరీక్షకు ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే ‘సాక్షి’ మాక్ టెస్ట్ రాయడం ద్వారా.. విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకొని, మరింత మెరుగుపడవచ్చు. అలాగే ‘సాక్షి’ మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపిన టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్‌లకు టెక్నాలజీ పార్ట్నర్గా‘MY RANK’ వారు వ్యవహరిస్తున్నారు. ►సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్) /ఈఏపీసెట్ పరీక్ష 30.06.2022. ►ఎంసెట్ / ఈఏపీసెట్ అగ్రికల్చర్ పరీక్ష 01.07.2022 తేదీల్లో ఆన్లైన్లో జరుగుతుంది. ►సాక్షి మాక్ నీట్ పరీక్ష 03.07.2022 ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. ►ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250. అభ్యర్థులు http://www.arenaone.in/mock ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవంతంగా దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్ మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వస్తుంది. పరీక్ష కేంద్రం: విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, దేశ్ముఖి గ్రామం, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 25.06.2022 వివరాలకు సంప్రదించాల్సిన నంబర్: 9666013544 -
ఆ మూడు స్కిల్స్‌తోనే.. రూ.2 కోట్ల జీతం
ఐ ఫోన్ల తయారీ దిగ్గజ సంస్థ యాపిల్‌లో చిన్నపాటి కొలువు వచ్చినా చాలు.. కెరీర్ నల్లేరుపై నడకే అనే భావన. ఈ సంస్థలో ఉద్యోగం సొంతం చేసుకోవాలనేది ప్రతిభావంతులైన ప్రతి ఒక్క విద్యార్థి లక్ష్యం. అయితే ఏకంగా సంస్థ ప్రధాన కార్యాలయం (కాలిఫోర్నియా)లో ఉద్యోగం సొంతం చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంటి దుర్గా లక్ష్మీనారాయణ స్వామి (దిలీప్ ఇంటి). ఇటీవలే అమెరికాలోని వర్జీనియా టెక్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తిచేసి.. అక్కడ యాపిల్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో నెగ్గి సత్తా చాటిన దిలీప్ మాటల్లోనే.. వర్జీనియా టెక్ యూనివర్సిటీలో 2015లో రెండేళ్ల ఎంఎస్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాను. ఏటా ఇన్స్టిట్యూట్లో యాపిల్, గూగుల్ వంటి సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తాయి. అయితే నన్ను క్యాంపస్ ఇంటర్వూ్య డ్రైవ్‌కు పిలవడానికి ప్రధాన కారణం నా లింక్డ్ఇన్ ప్రొఫైల్. నేను అప్పటికే పూర్తిచేసిన ప్రాజెక్ట్‌లు, పని అనుభవం, అకడమిక్ రికార్డ్లను లింక్డ్ఇన్లో చూసిన యాపిల్ సంస్థ ప్రతినిధులు.. క్యాంపస్ ఇంటర్వూ్యకు హాజరు కావాలని ఈ–మెయిల్ పంపారు. రెండు రౌండ్లలో ఇంటర్వ్యూ వర్క్ ఎక్స్పీరియన్స్, వివిధ రీసెర్చ్ ప్రాజెక్టుల్లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా ఇంటర్వూ్యకు సిద్ధమయ్యాను. ఫండమెంటల్స్‌పై పట్టుండటంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వూ్యకు హాజరయ్యాను. రెండు రౌండ్లలో ఇంటర్వూ్య జరిగింది. తొలి రౌండ్లో టెలిఫోనిక్ ఇంటర్వూ్యలో సంతృప్తికరంగా సమాధానాలు చెప్పడంతో.. యాపిల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వూ్యకు (ఆన్–సైట్) హాజరు కావాలని చెప్పారు. రెండు ఇంటర్వూ్యలు 30 నుంచి 45 నిమిషాల వ్యవధిలో జరిగాయి. ఇంటర్వూ్యలో ప్రొఫైల్ ఆధారిత ప్రశ్నలతోపాటు.. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్‌పై పట్టును పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగారు. ఇంటర్వ్యూలో వేటిపై ప్రశ్నలు/అనుబంధ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముందనే దానిపై ముందే కసరత్తు చేసి ఉండటంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగాను. 2.85 లక్షల డాలర్ల (మన కరెన్సీలో రూ. రెండు కోట్ల) వార్షిక వేతనంతో జాబ్ సొంతమైంది. ఆ మూడు నైపుణ్యాలు యాపిల్ లేదా ఇతర ఏ సంస్థలోనైనా ఇంటర్వూ్య సమయంలో అభ్యర్థుల నుంచి మూడు లక్షణాలు గమనిస్తారు. అవి.. కోర్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ స్కిల్స్. కోర్ నాలెడ్జ్ విషయంలో ఫండమెంటల్స్‌లో ఏ స్థాయిలో పట్టుందో పరిశీలిస్తారు. అంతేకాకుండా వాటిని అన్వయించే విషయంలో ఆలోచన సామర్థ్యాన్ని కూడా పరిశీలిస్తారు. అన్నీ బాగున్నాయనుకుంటేనే ఆఫర్ ఇస్తారు. ఎంఎస్‌లో ప్రవేశం ఇలా.. వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ఎంఎస్‌లో చేరడమే అనూహ్యంగా జరిగింది. వాస్తవానికి బిట్స్–పిలానీలో బీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) పూర్తయ్యాక హైదరాబాద్‌లోనే ఇమాజినేషన్ టెక్నాలజీస్ సంస్థలో వైర్లెస్ పీహెచ్వై ఫిర్మ్వేర్ ఇంజనీర్‌గా రెండేళ్లు పనిచేశాను. ఆ సమయంలోనే ఎంబీఏ చదవాలనే ఆసక్తితో క్యాట్‌కు హాజరై 99.3 పర్సంటైల్ కూడా సొంతం చేసుకున్నాను. వాస్తవానికి ఆ పర్సంటైల్‌కు ఏదో ఒక ఐఐఎంలో సీటు వచ్చేదే. కానీ అప్పటికే.. వైర్లెస్ కమ్యూనికేషన్స్‌పై ఆసక్తి పెరగడం, అందులో నైపుణ్యాలు సైతం లభించడంతో.. ఎలక్ట్రానిక్స్‌లోనే ఉన్నత విద్యనభ్యసించాలనే లక్ష్యంతో ఎంఎస్‌పై దృష్టిసారించాను. 2015లో వర్జీనియా టెక్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకోవడంతో ప్రవేశం లభించింది. ఇప్పుడు యాపిల్ సంస్థలో రూ. 2కోట్ల వేతనంతో ఉద్యోగం సొంతమైంది. ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో కెరీర్ పరంగా ఉన్నత హోదాలు లభించాలంటే ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంఎస్ చేస్తున్న సమయంలోనే రెండు సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేశాను. అదే విధంగా గత డిసెంబర్ నుంచి వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎ.ఎ. లూయిస్ బీక్స్ వద్ద గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాను. మనదేశంలో ఉన్నప్పుడు కూడా ఐఐటీ–ఢిల్లీ, బార్క్ (బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)– ముంబైలలో రీసెర్చ్ ఇంటర్న్‌గా పనిచేశాను. ఎంబీఏ చదవడమే లక్ష్యం ఈ నెల 22 నుంచి విధులకు హాజరుకావాలని చెప్పారు. కానీ, జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పలేదు. అయితే ఎలాంటి విధులనైనా నిర్వర్తించగలననే నమ్మకం ఉంది. ప్రస్తుతం యాపిల్ సంస్థలో ఉద్యోగంలో చేరినా.. ఎంబీఏ చదవడమే నా భవిష్యత్తు లక్ష్యం. ఇంజనీరింగ్ నైపుణ్యాలకు.. నిర్వహణ నైపుణ్యాలు కలిస్తే సాంకేతిక రంగంలో ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు ఆస్కారం ఉంటుంది. విజయాలు ఎంహెచ్ఆర్డీ మెరిట్ స్కాలర్షిప్– 2013 ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మెరిట్ స్కాలర్షిప్– 2012 ఆదిత్య బిర్లా మెరిట్ స్కాలర్షిప్, బిట్స్ పిలానీ– 2009–2013 అకడమిక్ రికార్డ్ పదో తరగతి: 556 మార్కులు ఇంటర్మీడియెట్: 980 మార్కులు బీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్) – 9.41/10 జీపీఏ ఎంఎస్ (వర్జీనియా టెక్ యూనివర్సిటీ) – 3.9/4 జీపీఏ కుటుంబ నేపథ్యం తండ్రి: ఇంటి సుబ్బారావు (పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి) తల్లి: సూర్య కుమారి (గృహిణి) స్వస్థలం: వీకే రాయపురం (సామర్లకోట మండలం, తూర్పు గోదావరి జిల్లా) -
ఇక నిరంతర నియామకాలు
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ * కరీంనగర్లో ‘సాక్షి’ నిర్వహించిన గ్రూప్స్ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి * సదస్సుకు అపూర్వ స్పందన * భారీగా తరలివచ్చిన అభ్యర్థులు * పైరవీలకు తావు లేదన్న ఈటల * అభ్యర్థుల సందేహాలకు నిపుణుల సమాధానాలు కరీంనగర్ సిటీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ‘సాక్షి’ భవిత ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతిలో ‘గ్రూప్స్’ పరీక్షలపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో మాదిరిగా డబ్బుల్లేవనో, నిషేధముందనో నియామకాల ప్రక్రియను నిలిపివేయబోమని చెప్పారు. హైదరాబాద్‌లో మాదిరిగానే కరీంనగర్లో కూడా సదస్సుకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది. జిల్లావాసులతోపాటు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా నిరుద్యోగులు వేలాదిగా తరలివచ్చారు. దాంతో సదస్సు కిక్కిరిసిపోయింది. లోపల చోటు చాలకపోవడంతో కళాభారతి ఆవరణలో లైవ్ ప్రొజెక్టర్ ద్వారా ఎంతోమంది ఉద్యోగార్థులు కార్యక్రమాన్ని వీక్షించారు. వారిని ఉనుద్దేశించి ఈటల మాట్లాడుతూ... 1969లో తెలంగాణ ఉద్యమం ‘మన రాష్ట్రం, మన ఉద్యోగాలు’ అనే నినాదంతోనే మొదలైందని గుర్తు చేశారు. ‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను మేం తీసుకున్నాం. విద్యార్థుల్లేని చోట స్కూళ్లు మూతపడ్డాయి. అవి తప్ప ఇతర ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ ఖాళీల భర్తీని చేపడుతూనే ఉంటాం’’ అని వివరించారు. ఉద్యోగార్థులు సంకల్పాన్ని సడలించకుంటే విజయం తథ్యమని ఉద్బోధించారు. ఉద్యోగ నియామకాలకు ప్రతిభ ఒక్కటే కొలమానమని ఈటల స్పష్టం చేశారు. పైరవీలకు, పైసలకు ఎక్కడా తావు లేదన్నారు. రూ.10 లక్షలు, రూ.20 లక్షలు ఇస్తేనే ఉద్యోగం వస్తుందనే ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మొద్దన్నారు. అభ్యర్థులు మోసపోవద్దని, దళారులను ఆశ్రయించొద్దని, ప్రతిభనే నమ్ముకోవాలని హితవు పలికారు. అక్రమాలు చోటుచేసుకొన్నట్టు తేలితే అవసరమైతే ఆ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడానికి కూడా వెనకాడబోమన్నారు. అభ్యర్థుల కోసం ‘సాక్షి దినపత్రిక’ ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ గ్రూప్స్తోనే సరిపెట్టకుండా జిల్లాల అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత పోస్టులను సాధించాలని ఆకాంక్షించారు. సివిల్స్‌పై కూడా ‘సాక్షి’ అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. ‘సాక్షి’ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సందేహాలకు నిపుణుల సమాధానాలు గ్రూప్స్ పరీక్షల విధానం, సిలబస్, పరీక్షకు సన్నాహకాలకు సంబంధించి ఉద్యోగార్థులు తమ సందేహాలను నిపుణుల ముందుంచారు. పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ చారిత్రక నేపథ్యం, భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు కీలకంగా మారడంతో ఎక్కువగా వాటి గురించి ప్రశ్నించారు. సిలబస్ కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి, జాగ్రఫీ నిపుణుడు, సివిల్స్ సీనియర్ ఫాకల్టీ గురిజాల శ్రీనివాసరావు, చరిత్ర నిపుణుడు లెంకల రామకృష్ణారెడ్డి, ఎకానమీ నిపుణుడు డాక్టర్ కె.ఆర్ రమణ, అర్థమెటిక్, రీజనింగ్ నిపుణుడు మాటూరి లింగమూర్తి, జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణుడు సురుకోంటి మహిపాల్‌రెడ్డి తదితరులు వారి సందేహాలను నివృత్తి చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యాలు పెంచుకోవాలి పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు అదనపు నైపుణ్యాలు అవసరం. తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం పెరగనుంది. రాష్ట్ర వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర స్థితిగతులు, ఉద్యమం, తెలంగాణ సాధించుకున్న తర్వాతి పరిస్థితులకూ ప్రాధాన్యముంటుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రనూ లోతుగా అధ్యయనం చేయాలి. - కృష్ణారెడ్డి, సిలబస్ కమిటీ సభ్యుడు పక్కా ప్రణాళికతో ముందుకు గ్రూప్స్ పరీక్షలకు పక్కా ప్రణాళికతో సన్నద్ధం కావాలి. దేశ, తెలంగాణ చరిత్రలపై పట్టు సాధించాలి. సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. మాదిరి, గత ప్రశ్నపత్రాలను క్షుణ్నంగా సాధన చేయాలి. - రామకృష్ణారెడ్డి, చరిత్ర నిపుణుడు శాస్త్రీయ కోణంలో చదవాలి అర్ధశాస్త్రానికి శాస్త్రీయ కోణంలో సన్నద్ధత కావాలి. ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కాదన్నది అపోహే. నిపుణుల సూచనలతో సరిగా చదివితే మార్కులు సాధించడం సులభమే. - కేఆర్ రమణ, ఆర్థిక శాస్త్ర నిపుణుడు అవగాహన అత్యవసరం సిలబస్‌లో తెలంగాణ అంశాలను చేర్చడంతో అభ్యర్థుల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు ‘సాక్షి’ తలపెట్టిన ఈ సదస్సు ఎంతో దోహదపడుతుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూకూ ప్రాధాన్యమివ్వాలి. బట్టీ పట్టకుండా అంశాలవారీ అవగాహనతో ముందుకె ళ్లాలి. - ఎస్.మహిపాల్‌రెడ్డి, జీకే, నిపుణుడు భిన్నంగా ఆలోచించాలి ఏ పోటీ పరీక్షకైనా అర్థమెటిక్, రీజినింగ్ కీలక అంశం. గణితశాస్త్రానికి సంబంధం లేని అభ్యర్థులకు ఆందోళన అనవసరం. గత ప్రశ్నపత్రాల సాధన ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. - ఎంఎల్ మూర్తి, రీజనింగ్ నిపుణుడు సరైన దృక్పథమే విజయానికి నాంది గ్రామీణ అభ్యర్థుల్లో తెలంగాణ నుంచి పోటీ పెరుగుతుండటం మంచి పరిణామం. సిలబస్‌లో మార్పులున్నా అయోమయపడకుండా నిర్దిష్ట ప్రణాళికతో చదవాలి. రకరకాల పుస్తకాల నుంచి సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి తప్ప ఒకే పుస్తకంపై ఆధారపడొద్దు.పథకాల వివరాలన్నీ తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో సవివరంగా ఉంటాయి. - గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ -
సాక్షి-భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్
-
నేడూ ఎడ్యుకేషన్ ఫెయిర్
-
జాబ్ రిమైండర్స్
ఓఎన్జీసీ వివిధ విభాగాల్లో 865 పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2014 వెబ్సైట్: www.ongcindia.com ........................................................ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 2, 2014 వెబ్సైట్: www.nhb.org.in ........................................................ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో 1,194 పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2014 వెబ్సైట్: http://eapplynew.com/dmrc2014 ........................................................ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో 2,197 ఎస్ఐ పోస్టులు, సీఐఎస్ఎఫ్లో 695 ఏఎస్ఐ పోస్టులు పార్ట్-1 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 9, 2014 పార్ట్-2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2014 వెబ్సైట్: http://ssc.nic.in ........................................................ కోల్ ఇండియా లిమిటెడ్ 339 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 14, 2014 వెబ్సైట్: www.coalindia.in -
ఎడ్యుకేషన్ న్యూస్
పాత పద్ధతిలోనే ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ ఇంజినీరింగ్‌లో మేనేజ్మెంట్ కోటా సీట్లలో ప్రవేశాలను పాత విధానంలోనే చే పట్టాలని ఇంజినీరింగ్ ప్రవేశాల ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. ఈ క్రమంలో తొలుత జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అప్పటికీ మేనేజ్మెంట్ కోటాలో సీట్లు మిగిలిపోతే చివరగా ఇంటర్మీడియెట్ మార్కులతో ప్రవేశాలు చేపడతారు. గతేడాది అనుసరించిన విధంగా 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ చేస్తారు. గతంలో ఎన్ఆర్ఐ కోటా 5 శాతం మాత్రమే ఉండేది. హైకోర్టు ఆదేశాల మేరకు దాన్ని 15 శాతానికి పెంచుతున్నారు. ఈసారి 15 శాతం ఎన్ఆర్ఐ కోటాలో నేరుగా ఎన్ఆర్ఐ పిల్లలనే చేర్చుకోవాల్సి ఉంటుంది. ఏమైనా సీట్లు మిగిలిపోతే అవి మేనేజ్మెంట్ కోటాలోకి వెళతాయి. మిగిలిన 15 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్లను జేఈఈ మెయిన్, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం అంటూ ఏమీ ఉండదు. అప్పటికీ సీట్లు మిగిలిపోతే ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు. ఇక యూనివర్సిటీలకే ఏఐసీటీఈ అధికారాలు టెక్నికల్ కాలేజీలకు ఇకపై యూనివర్సిటీలే అనుమతులిస్తాయి. కాలేజీల్లో సీట్ల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం కూడా వర్సిటీలకే ఉంటుంది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా నిబంధనలు రూపొందించింది. ఏఐసీటీఈ కేవలం సలహా సంస్థ మాత్రమేనని, కాలేజీల పర్యవేక్షణ, అనుమతులిచ్చే అధికారాలు లేవన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో యూజీసీ తాజా నిర్ణయం తీసుకుంది. సాంకేతిక విద్యా కళాశాలల్లో బోధన, పరీక్షలు, పరిశోధనలు, ప్రమాణాల పెంపు కోసం కొత్త నిబంధనలు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా నిబంధనల మేరకు.. ఇంజినీరింగ్, ఎంసీఏ తదితర కోర్సులు నిర్వహించే సాంకేతిక విద్యా కాలేజీలు అనుమతుల రెన్యువల్ కోసం ఇకపై సంబంధిత విశ్వవిద్యాలయాల అనుమతి తీసుకోవాలి. కొత్త కాలేజీలు గుర్తింపు పొందాలంటే నాక్ అక్రెడిటేషన్ తప్పనిసరి. గుర్తింపు కోసం కొత్త కాలేజీలు దరఖాస్తు చేసుకునే ముందు ఆరు నెలల్లో నాక్ అక్రెడిటేషన్ తెచ్చుకుంటామని అండర్ టేకింగ్ ఇస్తేనే యూనివర్సిటీలు అనుమతినివ్వాలి. ఆరేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి నడుస్తున్న కాలేజీలు ఇప్పటి నుంచి ఆరునెలల్లోగా నాక్ అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే నాక్ అక్రెడిటేషన్ ఉన్న కాలేజీలు, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు కలిగిన కోర్సుల విషయంలో ఇతర అన్ని నిబంధనలు పాటిస్తుంటే.. వాటికి శాశ్వత గుర్తింపునిచ్చే అంశాన్ని యూనివర్సిటీలు పరిశీలిస్తాయి. యూనివర్సిటీలు తాము గుర్తింపు ఇచ్చిన కాలేజీల సమగ్ర సమాచారాన్ని, నిబంధనలు పాటిస్తున్న తీరును పేర్కొంటూ ఏటా యూజీసీకి నివేదిక అందజేయాలి. కాలేజీలకు గుర్తింపు మంజూరు చేసే విషయంలో యూనివర్సిటీలు నిబంధనలను అతిక్రమిస్తే వాటికి గ్రాంట్స్ నిలిపివేయడంతోపాటు యూజీసీ గుర్తింపు రద్దవుతుంది. ఐఐఎం నుంచి డిగ్రీ పట్టా! ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఉత్తీర్ణులు ఇక డిగ్రీ పట్టా అందుకునే అవకాశం త్వరలోనే రానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అంశంపై ఎన్నికల తర్వాత ఏర్పడే నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఐఐఎం-ఇండోర్ డెరైక్టర్ రిషికేశ కృష్ణన్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఐఐఎం ఉత్తీర్ణులకు డిగ్రీ పట్టాను అందజేస్తారు. ప్రస్తుతం ఐఐఎంలు కేవలం డిప్లొమా/సర్టిఫికెట్లను మాత్రమే అందజేస్తున్నాయి. ఎందుకంటే వీటిని ఏర్పాటు చేసిన చట్టం మేరకు ఐఐఎంలు యూనివర్సిటీ కేటగిరీలోకి రాకపోవటమే. ప్రస్తుతం ఐఐఎంలు అందజేస్తున్న పీజీడీఎం సర్టిఫికెట్‌కు విదేశాల్లో, కొన్ని ఇన్స్టిట్యూట్లలో గుర్తింపు ఉండకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పీహెచ్డీ సమయంలో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లు పీజీడీఎంను అర్హతగా గుర్తించడం లేదు. ఆన్లైన్ కోర్సులు ః 2.5 లక్షల మంది భారతీయుల రిజిస్ట్రేషన్ మసాచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీలు ఆన్లైన్ కోర్సుల నిర్వహణ కోసం ప్రారంభించిన మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు (MOOC) కోసం ఎడ్ఎక్స్ (ed-X) కేంద్రంగా 2.5 లక్షల మంది భారతీయులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆన్లైన్ కోర్సుల్లో చేరే వారికి ఎడ్ఎక్స్ (ed-X) వేదికగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో అమెరికన్ల తర్వాత ఈ కోర్సుల కోసం అత్యధికంగా దరఖాస్తు చేసుకుంది భారతీయులే. ఎంఐటీ, హార్వర్డ్ కోర్సులు చాలా వరకు స్వల్ప వ్యవధిలో పూర్తయ్యేవి. ఎంచుకున్న కోర్సును బట్టి 4 నుంచి 12 వారాల వరకు కోర్సు వ్యవధి ఉంటుంది. -
ఇగ్నో నుంచి ఎంబీఏ చేయటం ఎలా?
ఇగ్నో నుంచి ఎంబీఏ చేయటం ఎలా? -శ్రీధర్, నిర్మల్. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ద్వారా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సును అందిస్తుంది. కోర్సు కాల వ్యవధి: రెండున్నరేళ్లు. అర్హత: 50 శాతం మార్కులతో (రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం) ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు మేనేజీరియల్/ సూపర్ వైజర్/సంబంధిత వృత్తిలో మూడేళ్ల అనుభవం. లేదా 50 శాతం మార్కులతోపాటు ప్రొఫెషనల్ డిగ్రీ (ఇంజినీరింగ్ /మెడిసిన్/సీఏ/ఐసీడబ్ల్యూఏఐ)/కంపెనీ సెక్రటరీషిప్/లా. జాతీయ స్థాయిలో నిర్వహించే ఓపెన్‌మ్యాట్ పరీక్ష ద్వారా ఎంబీఏ కోర్సులో ప్రవేశం క ల్పిస్తారు. సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు ఫిబ్రవరి, ఆగస్టులలో ఓపెన్మ్యాట్ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎంబీఏలో ఆఫర్ చేస్తున్న స్పెషలైజేషన్స్: హెచ్ఆర్ఎం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్. వివరాలకు: www.ignou.ac.in పలంటాలజీ కోర్సుకు సంబంధించిన వివరాలను తెలపండి? -బాలు, నిజామాబాద్. పలంటాలజీ అంటే శిలాజ అధ్యయన శాస్త్రం. దీనిలో చరిత్ర పూర్వకాల అధ్యయనంతోపాటు శిలాజాల అధ్యయనం వంటి అంశాలు ఈ శాస్త్రంలో ఉంటాయి. ఎలాంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా భూమి పరిణామం చెందింది అనే విషయాలను గురించి వివరిస్తుంది. బయాలజీ, జియాలజీ, ఆర్కియాలజీల అంశాలను వివరించే మల్టీడిసిప్లినరీ కోర్సుగా పలంటాలజీని పేర్కొంటారు. ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు: ఉస్మానియా యూనివర్సిటీ -హైదరాబాద్ కోర్సు: అప్లయిడ్ జియాలజీ(పలంటాలజీ ఒక సబ్జెక్ట్‌గా) అర్హత: 40 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీ. ప్రవేశం: ఎంట్రన్స్ ఆధారంగా వివరాలకు: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం కోర్సు: ఎంఎస్సీ జియాలజీ, ఎంఎస్సీ(టెక్-అప్లయిడ్ జియాలజీ, (పలంటాలజీ ఒక సబ్జెక్ట్‌గా) అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. ప్రవేశం: ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వివరాలకు: www.andhrauniversity.edu.in స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోర్సుల వివరాలను తెలపండి? నరేందర్, సికింద్రాబాద్. మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడుతూ, సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు బోధించేందుకు అవసరమైన..బోధనా పద్ధతుల్లో శిక్షణనిచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం ఈ విభాగంలో మెంటల్ రిటార్డేషన్, హియరింగ్, విజువల్, ఆటిజం, ఇంపెయిర్మెంట్, లెర్నింగ్ డిజబిలిటీ విభాగాల్లో డీఈడీ, బీఈడీ, ఎంఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల కరిక్యులం రూపకల్పన, కళాశాలల గుర్తింపు, పర్యవేక్షణ బాధ్యతలను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఈ కోర్సులను పూర్తి చేసిన వారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల కింద నడిచే పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్‌గా, వివిధ ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా, రెగ్యులర్ ప్రీస్కూళ్లు, వివిధ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవలందించవచ్చు. మన రాష్ట్రంలో.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ - సికింద్రాబాద్; స్వీకార్ రిహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యాండీక్యాప్డ్-సికింద్రాబాద్; ఆంధ్రా యూనివర్సిటీ -విశాఖపట్నం (www.andhrauniversity.edu.in); శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం- తిరుపతి (www.spmvv.ac.in); కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ - ఆంధ్ర మహిళా సభ-హైదరాబాద్ (www. andhramahilasabha.org.in) బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును అందిస్తున్నాయి. ఠాగూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ తదితర ఇన్స్టిట్యూట్లలో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు: http://rehabcouncil.nic.in ఎంబీఏ (ఫార్మా మేనేజ్మెంట్) కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -ప్రవీణ్, కరీంనగర్. ఫార్మసీ రంగానికి నూతన ఔషధాలను కనిపెట్టడంతోపాటు వాటిని మార్కెటింగ్ చేయడం కూడా సవాలుగా మారింది. దాంతో పలు ఫార్మా కంపెనీలు మార్కెటింగ్ సంబంధిత విభాగాలను పర్యవేక్షించడం కోసం వృత్తి నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పలు విద్యాసంస్థలు ఫార్మసీ రంగంలో మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సు చేయడం ద్వారా ఫార్మాస్యుటికల్, కెమికల్, బయోటెక్నాలజీ సంస్థలు, పరిశోధన, విద్యాసంస్థల్లో మేనేజిరియల్ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆఫర్ చేస్తున్న సంస్థలు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పంజాబ్. వెబ్సైట్: www.niper.nic.in నర్సీమొంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ముంబై వెబ్సైట్: www.nmims. edu -
రష్యాలో విలీనమైన క్రిమియా
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం ఆర్థిక స్వేచ్ఛలో గుజరాత్ అగ్రస్థానం ఆర్థికాంశాల స్వేచ్ఛకు సంబంధించి రాష్ట్రాల వారీ జాబితాలో గుజరాత్‌కి అగ్రస్థానం దక్కింది. ఇదే విషయంలో అత్యంత వేగంగా స్కోరును మెరుగుపరుచుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ప్రముఖ ఆర్థికవేత్తలు అశోక్ గులాటీ, బిబేక్ దేబ్రాయ్, లవీష్ భండారీ, జర్నలిస్ట్ స్వామినాథన్ అయ్యర్ రూపొందించిన ఈఎఫ్‌ఎస్‌ఐ-2013 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పాలనా యంత్రాంగం పరిమాణం, న్యాయ వ్యవస్థ, ప్రాపర్టీ హక్కులకు భద్రత, వ్యాపార, కార్మిక చట్టాల అమలు మొదలైన అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించారు. దీనిప్రకారం 2005లో అయిదో స్థానంలో ఉన్న గుజరాత్ ఆర్థిక స్వేచ్ఛతోపాటు వేగంగా పరిస్థితులను మెరుగు పరచుకునే విషయంలో కూడా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో తమిళనాడు ఉండగా ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. హైకోర్టులలో 25 శాతానికి పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్య దేశంలోని అన్ని హైకోర్టులలో న్యాయమూర్తుల సంఖ్యను కేంద్రం 25 శాతానికి పెంచింది. పెండింగ్‌లో ఉన్న 40 లక్షల కేసులను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయశాఖమంత్రి కపిల్ సిబాల్ మార్చి 19న హైకోర్టుల్లో భర్తీ చేయాల్సిన ఖాళీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపవలసిందిగా అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. 25 శాతానికి పెంచితే ప్రస్తుతం ఉన్న న్యాయ మూర్తుల సంఖ్య 906 నుంచి 1112కి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 49 నుంచి 61కి చేరుతుంది. సామాజిక భద్రత పథకాలకు ఆధార్ తప్పనిసరికాదన్న సుప్రీం సామాజిక భద్రత పథకాల కింద లబ్ధి పొందడానికి ఆధార్ కార్డు ఉండాలన్న నోటిఫికేషన్లను వెంటనే విరమించుకోవాలని సుప్రీంకోర్టు మార్చి 24న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యుత్, గ్యాస్, కుళాయి కనెక్షన్లు వంటి సేవలు పొందడానికి ఆధార్ కార్డు చట్టబద్ధం కాదని జస్టిస్ బీఎస్ చౌహాన్,జస్టిస్ జె. చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆధార్ సమాచారాన్ని సీబీఐతో పంచుకోవాలన్న గోవా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కూడా స్టే విధించింది. అంతర్జాతీయం రష్యాలో విలీనమైన క్రిమియా రష్యాలో క్రిమియాను విలీనం చేసే ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మార్చి 18న సంతకం చేశారు. దీంతో రష్యా సమాఖ్యలో క్రిమియా చేరినట్లయింది. 18వ శతాబ్దం నుంచి రష్యాలో భాగంగా ఉన్న క్రిమియాను 1954లో నాటి సోవియట్నేత నికితా కృశ్చేవ్ ఉక్రెయిన్‌కు బదిలీ చేశారు. నాటి నుంచి క్రిమియాలో మెజారిటీ ప్రజలుగా ఉన్న రష్యా జాతీయులు క్రిమియాను రష్యాలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని పుతిన్ తెలిపారు. క్రిమియాను రష్యా విలీనం చేసుకోవడంతో జీ-8 నుంచి రష్యాను సస్పెండ్ చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. దీంతో జూన్‌లో రష్యాలోని సోచిలో జరగాల్సిన జీ-8 సదస్సు నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆగ్నేయాసియా దేశాల్లో టీబీ రోగులకు వైద్యం ఆగ్నేయాసియా దేశాల్లో ఏటా టీబీ వ్యాధి సోకే మూడు మిలియన్లలో మూడింట ఒకవంతు రోగులకు వైద్య సేవలు అందుబాటులో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ బ్ల్యుహెచ్ ఓ) మార్చి 20న విడుదల చేసిన నివేదిక తెలిపింది. టీబీ వ్యాధి మరణాలను సున్నా స్థాయికు తీసుకువచ్చేందుకు వైద్య సేవలు అందని మిలియన్ మందిని గుర్తించి, వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా దేశాలను కోరింది. ప్రపంచంలో ప్రతీ సంవత్సరం తొమ్మిది మిలియన్ల మందికి ఈ వ్యాధి సోకుతుంది. ఇందులో మిలియన్ మందికి వ్యాధి తీవ్రంగా ఉంటోంది. తద్వారా వ్యాధి ఇతరులకు విస్తరిస్తుంది. పౌష్టికాహార లోపం, పేదరికం, పర్యావరణం, అధిక స్థాయిలో ప్రజలను తరలించడం వంటి పరిస్థితులు టీబీకి కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియాప్రాంతీయ డెరైక్టర్ పూనమ్ ఖేత్రపాల్ తెలిపారు. ఓకే పదానికి 175 ఏళ్లు ఇంగ్లిష్ భాషలో అత్యధికంగా వాడుకలో ఉన్న పదం ఓకే (ైఓ)కి 175 వసంతాలు పూర్తయ్యాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ గల నాటి పత్రిక ద బోస్టన్ మార్నింగ్ పోస్ట్‌లో ఓకే పదం తొలిసారిగా 1839 మార్చి 23న ప్రచురితమైంది. మాల్దీవుల ఎన్నికల్లో పాలక సంకీర్ణం విజయం మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌కు చెందిన ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవులు (పీపీఎం) తన సంకీర్ణ భాగస్వామ్య పార్ట్టీల కూటమి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించింది. మార్చి 22న జరిగిన ఎన్నికల్లో ఆ కూటమి పార్లమెంట్‌లోని మొత్తం 85 స్థానాలకు గాను 54 స్థానాల్లో గెలుపొందింది. మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ నాయకత్వంలోని ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) 24 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈజిప్ట్‌లో 529 మందికి ఉరిశిక్ష ఈజిప్ట్‌లో ఒకేసారి 529 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఆ దేశంలోని మనియా కోర్టు తీర్పునిచ్చింది. వీరంతా ఆ దేశ పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మద్దతుదారులని కోర్టు ప్రకటించింది. ముస్లిం బ్రదర్ హుడ్కు చెందిన వీరంతా ఓ పోలీసు అధికారి హత్యకేసు, ప్రజలపై దాడుల కేసులో దోషులుగా నిర్ధారిస్తూ ఈ శిక్షను విధించింది. ఆధునిక ఈజిప్ట్ చరిత్రలో ఇంతమందికి మరణదండన విధించడం ఇదే తొలిసారి. సముద్రంలో కూలిన మలేషియా విమానం తప్పిపోయిన తమ దేశ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలి జలసమాధి అయిందని మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ మార్చి 24న ప్రకటించారు. ఉపగ్రహాల నుంచి లభించిన సమాచారం ఆధారంగా విమానం సముద్రంలో కూలి మునిగిపోయిందన్న నిర్ధారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు. మార్చి 8న మలేషియన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎం.హెచ్.-370 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరి వెళ్లింది. ఇందులో 239 మంది ప్రయాణికులు, 13మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులున్నారు. స్పెయిన్ తొలి ప్రధానమంత్రి అడోల్ఫ్ సూరెజ్ మృతి స్పెయిన్ తొలి ప్రధానమంత్రి అడోల్ఫ్ సూరెజ్ (81) మాడ్రిడ్‌లో మార్చి 23న మరణించారు. 1975లో జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో మరణించిన తర్వాత సూరెజ్ స్పెయిన్ తొలి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. స్పెయిన్‌లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకున్న కాలంలో భాగం పంచుకున్న వారిలో మరణించిన చివరి వ్యక్తి సూరెజ్. నియంతృత్వాన్ని కూల్చి ప్రజాస్వామ్య సంస్కరణలు తీసుకురావడంలో సూరెజ్ నాయకత్వం వహించారు. 1976లో సూరెజ్ను ఆదేశ రాజు ప్రధానిగా నియమించారు. వార్తల్లో వ్యక్తులు రచయిత, పాత్రికేయుడు కుష్వంత్‌సింగ్ మృతి ప్రముఖ రచయిత, పాత్రికేయుడు కుష్వంత్‌సింగ్ (99) న్యూఢిల్లీలో మార్చి 20న మృతి చెందారు. ఆయన 30 నవలలు రాశారు. ఇందులో స్వీయ కథ ట్రూత్, లవ్ అండ్ ఏ లిటిల్ మ్యాలీస్తో పాటు దసన్ సెట్ క్లబ్, కుష్వంత్ నామా, ద లెసన్స్ ఆఫ్ మై లైఫ్, ట్రైన్‌టు పాకిస్థాన్, విత్ మలైస్ టువార్డ్స్ వన్ అండ్ ఆల్, ఐ షల్ నాట్ హియర్ ద నైటింగేల్, ద కంపెనీ అండ్ ఉమెన్, ద మార్క్ ఆఫ్ విష్ణు అండ్ అదర్ స్టోరీస్, బ్లాక్ జాస్మిన్, పోట్రయిట్ ఆఫ్ ఎ లేడీ, వంటి అత్యంత ఆదరణ పొందిన రచనలు చేశారు. ఈయన 1915, ఫిబ్రవరి 2న జన్మించారు. 1947 తర్వాత విదేశీ సర్వీసుల్లో చేరారు. లండన్,పారిస్, ఒట్టావాలలో దౌత్యవేత్తగా పనిచేశారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ టైమ్స్, నేషనల్ హెరాల్డ్ లో సంపాదకుడిగా పనిచేశారు. యోజన పత్రిక (1951-53)కు ఆయన వ్యవస్థాపక సంపాదకుడుగా పనిచేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఆయన రాజ్యసభ (1980 -1986)కు నియమితులయ్యారు. 1974లో పొందిన పద్మభూషణ్పురస్కారాన్ని స్వర్ణమందిరంపై సైనిక చర్యకు నిరసనగా 1984లో తిరస్కరించారు. ఈసీ ప్రచారకర్తగా అమీర్‌ఖాన్ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రచార కర్తగా ఎంచుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు అమీర్సేవలను వినియోగించుకోనుంది. ముఖ్యంగా యువత ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడమే ఈసీ చేపట్టిన కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే ఈసీ తరపున మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రచారకర్తలుగా సేవలందిస్తున్నారు. ఐ.ఎన్.ఎలో పనిచేసిన బాల ఎ చంద్రన్ మృతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఎ)కి చెందిన యూత్వింగ్ లో పనిచేసిన బాల ఎ చంద్రన్ (86) సింగపూర్‌లో మార్చి 20న మరణించారు. ఐ.ఎన్.ఎలో పనిచేసిన చివరి సభ్యుల్లో చంద్రన్ ఒకరు. కేరళకు చెందిన చంద్రన్ 1940లో ఏర్పాటు చేసిన ఐ.ఎన్.ఎ యూత్వింగ్ బాలక్ సేనలో పనిచేశారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ చక్రవర్తి రాజీనామా రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ కె.సి.చక్రవర్తి మార్చి 20న వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఈ ఏడాది జూన్ 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈయన 2009, జూన్ 15న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా చేరారు. మడేళ్ల పదవీ కాలం 2012లో ముగియగా మరో రెండేళ్లు పొడిగించారు. అవార్డులు రాజేశ్ గోపకుమార్‌కు జి.డి.బిర్లా అవార్డు 2013 సంవత్సరానికి జి.డి. బిర్లా అవార్డు భౌతిక శాస్త్రవేత్త రాజేశ్ గోపకుమార్‌కు లభించింది. క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో, స్ట్రింగ్ థియరీలో ఆయన చేసిన కృషికి ఈ పురస్కారం దక్కింది. శాస్త్ర పరిశోధనలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. సుబ్రాన్సు చౌదరికి డిజిటల్ యాక్టివిజమ్ అవార్డు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ సుబ్రాన్సు చౌదరికి యునెటైడ్ కింగ్డమ్ సంస్థ అందించే 2014 డిజిటల్ యాక్టివిజమ్ అవార్డు లభించింది. సెంట్రల్ గోండ్వానా నెట్ (సీజీ నెట్) స్వర కమ్యూనిటీ రేడియో నిర్వహణకుగాను ఈ అవార్డు దక్కింది. ఈ రేడియోను రాయ్‌పూర్‌లో 2004లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రేడియోను మధ్యప్రదేశ్‌లోని హాకర్ గ్రామం నుంచి నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో ఈ రేడియో మధ్యప్రదేశ్‌లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ రేడియో తొలుత ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైనప్పటికీ దీని కార్యక్రమాలు ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు కూడా విస్తరించాయి. క్రీడలు ఎయిరిండియాకు నేషనల్ ఎ డివిజన్ హాకీ చాంపియన్‌షిప్ నేషనల్ ఎ డివిజన్ హాకీ చాంపియన్‌షిప్‌ను ఎయిరిండియా గెలుచుకుంది. లక్నోలో మార్చి 23న జరిగిన ఫైనల్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) జట్టును ఓడించింది. మూడో స్థానాన్ని ఉత్తర ప్రదేశ్ హాకీ సాధించింది. రైల్వేలకు హాకీ ఇండియా ఉమెన్స్ నేషనల్ చాంపియన్ షిప్ నాలుగో హాకీ ఇండియా ఉమెన్స్ నేషనల్ చాంపియన్‌షిప్‌ను రైల్వేస్ గెలుచుకుంది. మార్చి 23న భోపాల్‌లో జరిగిన ఫైనల్లో హర్యానాను ఓడించింది. జార్ఖండ్ మూడో స్థానంలో నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా హర్యానా జట్టుకు చెందిన మోనిక ఎంపికైంది. రాష్ట్రీయం రాష్ట్రంలో మొదటి మహిళాబ్యాంక్ ఏర్పాటు రాష్ట్రంలో భారతీయ మహిళా బ్యాంక్ మొదటి శాఖను హైదరాబాద్‌లో మార్చి 23న ఆ బ్యాంక్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ ప్రారంభించారు. ఏడాదిలోగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 20 శాఖలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇది 19వ మహిళా బ్యాంక్ శాఖ. తూర్పు తీరానికి సుమేధ నౌక ఐఎన్ఎస్ సుమేధ నౌక మార్చి 23న తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రమైన విశాఖకు చేరింది. గోవా షిప్‌యార్డులో మార్చి7న ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ ఛీఫ్ వైస్ అడ్మిరల్ అనిల్‌చోప్రా దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. తూర్పు నౌకాదళంలో ఇటువంటి నౌక చేరడం ఇది తొలిసారి. ఇది మూడో తరం ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ విభాగంలో మూడో నౌక. ఈ నౌక యాంటీ పైరసీ, పెట్రోలింగ్, ఫ్లీట్ సపోర్ట్ ఆపరేషన్స్, మారిటైమ్ సెక్యూరిటీ, ఎస్కార్ట్ ఆపరేషన్స్, నేవీ ఆస్తుల పరిరక్షణ వంటి విధులను నిర్వహిస్తుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ సదుపాయమున్న ఈ నౌకలో పలు రకాల ఆయుధాలు, తుపాకులు ఉన్నాయి. నౌకలో రెండు బోట్లు ఉంటాయి. ఆటోమేటిక్ పవర్మేనేజ్మెంట్ విధానంలో కమాండర్ నేతృత్వంలో పనిచేసే ఈ నౌకలో 9మంది అధికార్లు,వందమంది సెయిలర్లు ఉన్నారు. -
సాధారణ ఎన్నికలు- వివిధ రంగాలపై ప్రభావం
దేశంలో పదహారో సాధారణ ఎన్నికలు ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు జరగనున్నాయి. దేశంలో సుదీర్ఘ కాలం జరిగే ఎన్నికలివి. ఈ సందర్భంలో ఎన్నికలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఏ రంగంలో అనుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి? ఏ రంగంలో ప్రతికూల ధోరణులు పొడచూపుతాయనే అంశాలపై స్పెషల్ ఫోకస్.. ఎన్నికల సంవత్సరాలలో ప్రభుత్వ కోశ విధానంలో భాగంగా పన్నుల వ్యవస్థ, పెట్టుబడి వ్యయం, వినియోగ వ్యయాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రభుత్వ సేవల పంపిణీని పరిశీలిస్తే.. రాష్ట్రాల ప్రజా పనుల విభాగం చేపట్టే రహదారుల నిర్మాణంపై ఎన్నికలు ధనాత్మక ప్రభావం చూపుతాయి. ఎన్నికలు జరిగే ఏడాదిలో ప్రతిపాదించిన బడ్జెట్లో ప్రభుత్వం పన్ను రేట్ల తగ్గింపును చేపట్టినప్పుడు తన నిధులను పెంచుకునేందుకు మూలధన రాబడులపై ఆధారపడుతుంది. ఈ స్థితి రుణ భారం పెరగడానికి దారితీస్తుంది. పెరిగిన ప్రభుత్వ వ్యయం మొదటి సాధారణ ఎన్నికల (జనరల్ ఎలక్షన్స్)తో పోలిస్తే 2009లో జరిగిన 15వ సాధారణ ఎన్నికల నాటికి ప్రతి ఓటరుపై ప్రభుత్వం వెచ్చించిన మొత్తం వ్యయం 20 రెట్లు పెరిగింది. మొదటి సాధారణ ఎన్నికలలో ఒక ఓటరుపై ప్రభుత్వ వ్యయం దాదాపు రూ.0.60. ఇది 2009 ఎన్నికల నాటికి రూ.12కు చేరుకుంది. 1951-52లో జరిగిన ఎన్నికలకు ప్రభుత్వం రూ.10.45 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం 2009 ఎన్నికల నాటికి రూ. 846.67 కోట్లకు పెరిగింది. 2009 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ (రూ.70 కోట్లు), తమిళనాడు (రూ.80.60 కోట్లు)లలోని ఎన్నికల వ్యయం కంటే మహారాష్ట్ర (రూ.155 కోట్లు), పశ్చిమబెంగాల్ (రూ.150 కోట్లు) లోక్‌సభ ఎన్నికల వ్యయం దాదాపు రెట్టింపు ఉంది. 2014 ఎన్నికల స్వరూపం: 2009 సాధారణ ఎన్నికలలో మొత్తం ఓటర్లు 71.40 కోట్లు కాగా ఇది 2014 నాటికి 81.45 కోట్లకు చేరింది. ఐరోపా యూనియన్ (ఈయూ), అమెరికా దేశాలలో ఉన్న మొత్తం ఓటర్ల (Electorate) కంటే భారత్ ఓటర్ల సంఖ్య అధికం. 16వ సాధారణ ఎన్నికల ప్రక్రియను మే 16 నాటికి పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. గత ఎన్నికలలో 59 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014 ఎన్నికలకు సంబంధించి మొత్తం పోలింగ్ స్టేషన్లు 9,30,000. భద్రతా సిబ్బందితో పాటు ఎన్నికల కార్యకలాపాలలో మొత్తం 1.10 కోట్ల మంది పాల్గొంటున్నారు. మొత్తం ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారు 2.30 కోట్లు. ఈ ఎన్నికలలో 18 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) వినియోగించనున్నారు. వ్యయం రూ.వెయ్యి కోట్లు: 2014 ఎన్నికలలో ప్రభుత్వ వ్యయం అధికారికంగా రూ.1000 కోట్లు ఉండగలదని అంచనా. లోక్‌సభ ఎన్నికలలో భాగంగా మొత్తం 543 నియోజకవర్గాలలో ప్రతి అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిమితిని రూ.70 లక్షలుగా నిర్ణయించారు. అయితే ముఖ్యమైన పార్టీ అభ్యర్థుల వ్యయం ప్రతి నియోజకవర్గంలో పరిమితి కంటే పది రెట్లు ఎక్కువ ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ప్రస్తుత ఎన్నికలలో రాజకీయ పార్టీలు రూ.30,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఒక అంచనా. అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యయం తర్వాత అధిక ఎన్నికల వ్యయం భారత్‌లోనే నమోదైంది. ది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాజకీయ పార్టీల వ్యయం అదనంగా రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఏయే రంగాలపై ఎంత ప్రభావం? ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం, విదేశీ మూలధన కొరత, తయారీ రంగవృద్ధి క్షీణత తదితర సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ప్రస్తుత ఎన్నికల వ్యయం కారణంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వృద్ధి అదనంగా 0.2 శాతం నుంచి 0.3 శాతం వరకు ఉండగలదని నేషనల్ స్టాటిస్టికల్ ఛైర్మన్ ప్రొణబ్ సేన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి ముందస్తు అంచనా 4.9 శాతంగా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్లో ఎక్సైజ్ పన్ను తగ్గింపు కారణంగా ఆర్థిక వ్యవస్థలో వ్యయం పెరిగి, స్వల్పకాలంలో వృద్ధి రేటులో పెరుగుదల సంభవించే సూచనలున్నట్లు ఆర్థికవేత్తల అభిప్రాయం. ఎన్నికల ప్రచారంలో జరిగే వ్యయం కారణంగా 2014 రెండో త్రైమాసికంలో భారత్‌లో వినియోగ వ్యయంలో పెరుగుదల సంభవిస్తుంది. గత సాధారణ ఎన్నికల సమయాలలో జరిగిన వ్యయం కారణంగా వినియోగ వస్తు వాణిజ్యంలో వృద్ధిని గమనించవచ్చు. భారత్ అడ్వర్టైజ్మెంట్ పరిశ్రమ బడ్జెట్ 2014లో రూ.34,500 కోట్లు కాగా ఎన్నికల కారణంగా ఈ బడ్జెట్లో 8 నుంచి 10 శాతం పెరుగుదల ఉండవచ్చు. ఈ పరిశ్రమ బడ్జెట్ రూ.38వేల కోట్లకు చేరగలదని అంచనా. రాజకీయ ప్రకటనలపై చేసే వ్యయంలో ముద్రణ మాధ్యమం వాటా 45 శాతం, టీవీ చానళ్లలో ప్రకటనల వాటా 38 శాతం. మిగిలింది ఇతర ప్రచార మార్గాలపై చేసిన వ్యయం. ఇతర రంగాలపై ప్రభావం: ఎన్నికలు జరిగే నెలల్లో స్టాక్‌మార్కెట్‌పై ధనాత్మక, రుణాత్మక ప్రభావాలను గమనించవచ్చు. గత ఐదు వారాలలో స్టాక్ ధరలలో అధిక ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఈ స్థితి ఎన్నికలు పూర్తయ్యేవరకు కన్పించే సూచనలున్నాయి. అనశ్వర వినియోగ వస్తువులు, బ్యాంకులు, బేసిక్ ఇంజనీరింగ్ స్టాక్ ధరలలో పెరుగుదలను గమనించవచ్చు. వాహనాలకు చేసే వ్యయానికి సంబంధించి ఎన్నికల నియమావళి (Code of conduct) కఠినతరంగా ఉన్నందున ఎన్నికలలో అభ్యర్థులు వినియోగించే వాహనాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అన్ని రకాల వాహనాల డిమాండ్ తక్కువైనందువల్ల ఆ రంగంపై ఆధారపడిన ప్రజల ఆదాయంలో పెరుగుదల కనిపించదు. కొన్ని రకాల వ్యాపారాలపై ఎన్నికలు ధనాత్మక ప్రభావం చూపుతాయి. వార్తా పత్రికలు, నగరాలలో ప్రకటనల బోర్డుల ఏర్పాటు, సోషల్ మీడియా, రవాణా, ఆతిథ్యం, బస్సులు, టాక్సీ ఆపరేటర్లు సంబంధిత వ్యాపార వర్గాలపై ఎన్నికల ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. ఎన్నికల కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని జీడీపీ గుణక ప్రభావం (GDP Multiplier Effect) రూపంలో గమనించవచ్చు. వివిధ వర్గాల ప్రజలు ఆర్జించిన ఆదాయంలో 80 నుంచి 90 శాతం వినియోగంపై వెచ్చించడాన్ని గమనించవచ్చు. శ్రామికులు, అల్పాదాయ వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులలోనూ పొదుపు ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. గత మూడు సంవత్సరాల కాలంలో ఎన్నికల అధికారులు రాజకీయ నేతల దగ్గర నుంచి దాదాపు రూ.185 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ఆకర్షించే క్రమంలో రాజకీయ నేతలు అనేక కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఓటర్ల మొబైల్ ఫోన్లకు టాక్‌టైమ్ కోసం కొంత మొత్తాన్ని జమ చేయడం వలన టెలికం కంపెనీల వ్యాపారంలో కొంతమేర వృద్ధి కనిపించింది. రాజకీయ నాయకులు లెక్కల్లో చూపించని ద్రవ్యాన్ని ఎన్నికల సమయంలో చలామణిలోకి తీసుకొస్తున్నందువల్ల దేశంలో ద్రవ్య సప్లై పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంచనా వ్యాపార ధోరణి అనేక రంగాల్లో ప్రబలుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజల జీవన ప్రమాణం కుంటుపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్సైజ్ పన్ను రాబడి పెరుగుతుంది. ఆల్కహాల్ వినియోగం ఎక్కువగా ఉండి ఎక్సైజ్ పన్ను ద్వారా అధిక రాబడి సమకూరుతుంది. సమష్టి చొరవ అవసరం ఎన్నికల సంవత్సరాలలో పన్నురేట్ల తగ్గింపు, మూలధన వ్యయం పెంపు లాంటి చర్యలను ప్రభుత్వాలు చేపడుతున్నందు వల్ల ప్రభుత్వ రాబడి, వ్యయాల మధ్య అంతరం పెరుగుతుంది. ఈ స్థితిని పస్తుత వ్యయాల (Current Spending)ను తగ్గించుకోవడం ద్వారా అధిగమించాలి. దేశంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి. విదేశీ పెట్టుబడిదారులు రాబోవు రోజుల్లో అభద్రతా భావానికి లోనుకాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. రాజకీయ పార్టీలు బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని హామీలు ఇవ్వాలి. అభివృద్ధి వ్యయాన్ని పెంచే చర్యలను తమ ఎన్నికల ప్రణాళికలలో (Manifesto) చేర్చాలి. పన్నుల వ్యవస్థను అభిలషణీయ విధంగా రూపొందించుకోవాలి. నల్లధన ప్రవాహాన్ని గుర్తించాలి. ఇలా అటు పాలక పెద్దలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే శ్రేయో ఆర్థిక వ్యవస్థ సాకారమవుతుంది. -
దీర్ఘకాలిక వ్యూహం.. దర్జాగా కొలువు...
హోదాకు హోదా.. ప్రతిభకు గుర్తింపు.. సుస్థిరమైన భవిష్యత్.. చక్కటి కెరీర్.. వెరసి నేటి యువతలో బ్యాంకింగ్ రంగం క్రేజ్‌ను సంపాదించుకుంది.. సాధారణ డిగ్రీ నుంచి ప్రొఫెషనల్ డి గ్రీ పట్టా ఉన్న విద్యార్థుల వరకూ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల మీదనే దృష్టి ఉంటోంది. నోటిఫికేషన్ వెలువడడమే ఆలస్యం లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు.. దీంతో విపరీతమైన పోటీ నెలకొని ఉంటోంది.. ఈనేపథ్యంలో ఆయా పరీక్షల్లో విజయం సాధించాలంటే దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించాలి.. అప్పుడే భవ్యమైన కెరీర్‌కు పునాది ఏర్పడుతుంది.. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, సంబంధిత అంశాలపై విశ్లేషణ ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో నియామక విధానాన్ని పరిశీలిస్తే.. ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ సంబంధిత అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పీఓ/క్లరికల్/ స్పెషలిస్ట్ ఏ స్థాయి హోదా ఉన్న ఉద్యోగాలకైనా సాధారణంగా ఈ అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. అంటే దీర్ఘకాలికంగా ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ సాగిస్తే.. ఏక కాలంలో పీఓ/క్లరికల్ పోస్టులకు పోటీ పడొచ్చు. స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌కు కూడా ఈ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది (ప్రొఫెషనల్నాలెడ్జ్ను మినహాయిస్తే). విభాగాల వారీగా ప్రిపరేషన్ ఇంగ్లిష్: ఇంగ్లిష్ అత్యంత కీలకమైంది. తెలుగు మీడియం అభ్యర్థులు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి రోజూ దీనికి గంట సమయం కేటాయించాలి. ఇందులో కనీసం 30 నిమిషాలు ఇంగ్లిష్ పేపర్ చదవడం, టీవీ వార్తలు వినడం చేయాలి. దీంతో ఏ పదాన్ని సందర్భానుసారంగా ఏవిధంగా వినియోగించాలో అవగాహన వస్తుంది. అంతేకాకుండా ప్రతి రోజూ 5 నుంచి 10 కొత్త పదాలు నేర్చుకోవాలి. వాటిని వాక్యాల్లో ఏవిధంగా ఉపయోగించవచ్చో తెలుసుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో నేర్చుకున్న పదాలను వాడుతూ సంభాషించాలి. ఈవిధంగా చేయడం వల్ల ఇంగ్లిష్ భాషలో పట్టు సాధించడంతోపాటు ఇంటర్వ్యూను దైర్ఘ్యంగా ఎదుర్కొనే సామర్థ్యం అలవడుతుంది. ఇంగ్లిష్‌లో గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివాటిల్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు వీటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి. రీజనింగ్: బ్యాంకుల్లో నియామకం కోసం నిర్వహించే పరీక్షల్లో అత్యంత క్లిష్టమైన విభాగం రీజనింగ్. అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో ప్రశ్నలను సాధించాలంటే విశ్లేషణ సామర్థ్యంతోపాటు తార్కికత (లాజిక్) కూడా అవసరం. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలను గుర్తించేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రాక్టీస్. కాబట్టి వీలైనంత ఎక్కువ సమయం ప్రాక్టీస్‌కు కేటాయించాలి. ఇదే క్రమంలో సాధ్యమైనన్ని షార్ట్‌కట్ మెథడ్స్‌ను నేర్చుకోవాలి. తద్వారా త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. రీజనింగ్‌లో కీలకమైన అంశాలు.. సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్ కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: అభ్యర్థుల్లోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో చాలా వరకు ప్రశ్నలు నేరుగా లేదా సూత్రాల ఆధారితంగా ఉంటాయి. కాబట్టి గణిత నేపథ్యం లేని విద్యార్థులు కూడా ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే ఈ విభాగంలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలు, కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, నిష్పత్తులకు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే గణిత మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. దాంతోపాటు 20 వరకు టేబుల్స్, 25 వరకు స్క్వేర్స్, 15 వరకు క్యూబ్స్‌ను నేర్చుకోవాలి. న్యూమరికల్ ఎబిలిటీ: న్యూమరికల్ విభాగంలో ఎక్కువగా సింప్లిఫికేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలపై అవగాహన పెంపొందించుకోవాలి. సమస్య చూడగానే నోటితో చెప్పగలిగే స్థాయిలో ప్రిపరేషన్ ఉండాలి. కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, రేషియోస్‌కు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్నెస్: జనరల్ అవేర్నెస్ విభాగాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. 1. స్టాండర్డ్ జీకే. 2. కరెంట్ అఫైర్స్. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; రాజధానులు వంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. నోబెల్, ఆస్కార్లతో పాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, క్రీడల్లో విజేతలు, విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రముఖ అతిథులు, ముఖ్యమైన సంఘటనలను రోజూ పత్రికల ద్వారా తెలుసుకొని ఓ పుస్తకంలో నోట్ చేసుకోవాలి. జనరల్ అవేర్నెస్ (రిఫరెన్స్ టు బ్యాంకింగ్): ఈ విభాగానికి సంబంధించి బ్యాంకింగ్ రంగంలో తాజాగా చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పులపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో ఆర్బీఐ-విధాన నిర్ణయాలు, బ్యాంకింగ్ రంగంలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం (నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్), వివిధ బ్యాంకులు/ఆర్థిక సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, బ్యాంకింగ్/ ఆర్థిక రంగంలో ఉపయోగించే పదజాలం (ఎన్పీఏ, ఎన్ఈఎఫ్టీ వంటివి), ద్రవ్య సాధనాలు (చెక్స్, ఏటీఎం కార్డు తదితర), భారత ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నుంచి అధిక శాతం ప్రశ్నలు రావచ్చు. ఈ విభాగంలో మెరుగైన స్కోర్ కోసం ప్రతిరోజూ ఫైనాన్షియల్ డైలీ/మ్యాగజైన్స్ చదవాలి. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ అంశాలపై కూడా దృష్టి సారించాలి. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; ఆస్కార్లతో పాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమైన సంఘటనలను తెలుసుకోవాలి. ఆర్బీఐ వెబ్సైట్లో ఉండే కామిక్ షో అనే కార్టూన్.. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కంప్యూటర్ నాలెడ్జ్: ఈ విభాగంలో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అభ్యర్థులు తొలుత కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత నమూనా ప్రశ్నలపై దృష్టిసారింంచాలి. కంప్యూటర్స్-జనరేషన్స్; ఎంఎస్ వర్డ్; ఎంఎస్ ఆఫీస్; డేటాబేస్ మేనేజ్మెంట్, షార్ట్‌కట్ కమాండ్స్ తదితరాల గురించి తెలుసుకోవాలి. ఇన్పుట్స్ బై: కె.వి. జ్ఞానకుమార్, బ్యాంకింగ్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. రిఫరెన్స బుక్స్: వెర్బల్-నాన్ వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల్ క్వికర్ మ్యాథ్స్ -ఎం.థైరా క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ -అరుణ్ శర్మ ఇంగ్లిష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ -హరిమోహన్ ప్రసాద్ {పతియోగితా దర్పణ్ మనోరమ ఇయర్ బుక్ సన్నద్ధం ఇలా ముందుగా అన్ని బ్యాంక్ రిక్రూట్మెంట్ పరీక్షల సిలబస్‌ను, ఆ తర్వాత గత ప్రశ్నాపత్రాలను పరిశీలించాలి. తద్వారా ఇచ్చిన సిలబస్ నుంచి ఎటువంటి ప్రశ్నలు, ఏవిధంగా అడుగుతున్నారనే దానిపై స్పష్టత వస్తుంది. వీలైతే గత కటాఫ్ మార్కులను కూడా తెలుసుకోవాలి. తద్వారా పోటీ ఏస్థాయిలో ఉందో ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు మీ సామర్థ్యాలను విశ్లేషించుకుని ఎంత సమయం ప్రిపరేషన్‌కు సరిపోతుందో అంచనా వేసుకోవాలి. ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. పరీక్షించే విభాగాలు ఒకటే అయినా.. ఎంచుకున్న పోస్టును బట్టి ప్రశ్నల క్లిష్టతలో తేడా ఉంటుంది. అయితే దీర్ఘకాలిక వ్యూహాం దృష్ట్యా విస్తృత స్థాయి లో ప్రిపరేషన్ సాగించాలి. ఒక అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. తద్వారా సబ్జెక్ట్‌పై పట్టు వస్తుంది. ప్రశ్న ఏవిధంగా వచ్చిన సమాధానాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది. ............................................................... నోటిఫికేషన్ కోసం ఎదురుచూడకుండా ప్రిపరేషన్ ప్రారంభించాలి. కనీసం మూడు-ఆరు నెలల సమయాన్ని ప్రిపరేషన్ కోసం కేటాయించాలి. ............................................................... ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అంశాలపై అధికంగా దృష్టి సారించాలి. ............................................................... గత విజేతల అభిప్రాయాలను విధిగా పాటించాలి. ............................................................... {పతి రోజూ ఆరు నుంచి ఎనిమిది మంది సభ్యులు ఒక గ్రూప్‌గా ఏర్పడి మోడల్ పరీక్ష రాయాలి. దాని ఫలితాలను వారే విశ్లేషించుకోవాలి. ఎన్ని గంటలు చదివామనే దానికన్నా ఎంత ఫోకస్డ్గా చదివామన్న దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. గ్రూప్‌గా చదవడం వల్ల సమస్యలకు తొందరగా సమాధానాలు గుర్తించేందుకు ఉపయోగపడే షార్ట్‌కట్స్ తెలుస్తాయి. ఐబీపీఎస్ క్లరికల్, పీఓ పరీక్షల్లో విజయానికి వీలైనన్ని మోడల్ పేపర్లు సాధన చేయడం చాలా అవసరం. టైమ్ పెట్టుకొని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల తెలియని ప్రశ్నలపై మరింత దృష్టిపెట్టేందుకు వీలుంటుంది. షార్ట్‌కట్స్ ఎన్ని తెలిసినా తగినన్ని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయకుంటే ఫలితం ఉండదు. ఇంగ్లిష్‌ను తేలిగ్గా తీసుకుంటే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది. అందువల్ల రోజులో కొంత సమయాన్ని ఇంగ్లిష్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, కంప్యూటర్ జనరేషన్స్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలు తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌పై అప్డేట్గా ఉండాలి. దినపత్రికల్లోని ఆర్థిక సంబంధమైన ఎడిటోరియల్స్‌ను చదవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవచ్చు. బ్యాంకింగ్ టెర్మినాలజీ కూడా ఒంటపడుతుంది. ప్రిపరేషన్‌కు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, బ్యాంకింగ్ అవేర్నెస్ బుక్స్‌ను ఉపయోగించుకోవాలి. -
గమ్యాన్ని నిర్ణయించే గణితం..
రాష్ట్ర అటవీ శాఖలో వివిధ విభాగాల్లో కలిపి 2,167 పోస్టుల భర్తీ క్రమంలో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.. దీంతో కీలక ఘట్టమైనపరీక్షను నిర్వహించడమే మిగిలి ఉంది.. మొత్తం మూడు విభాగాల్లో జరిగే రాత పరీక్షలో ఎస్సే రైటింగ్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాల్లో అభ్యర్థులందరూ చక్కని ప్రతిభను కనిపించే అవకాశం ఉన్నప్పటికీ.. విజయాన్ని నిర్దేశించేది.. అంతిమ లక్ష్యానికి చేరువ చేసేది మాత్రం.. మ్యాథమెటిక్స్.. ఎందుకంటేపాఠశాల విద్య తర్వాత చాలా మంది అభ్యర్థులు మ్యాథ్స్ చదవకపోవడం, సూత్రాలను అన్వయిస్తూ సాధన చేయాల్సి ఉండడం వంటి కారణాల దృష్ట్యా మ్యాథమెటిక్స్ కీలకంగా మారింది.. దాంతో ఈ విభాగంలో చక్కని స్కోర్ సాధిస్తే అనుకున్న లక్ష్యానికి చేరువగా వచ్చినట్లే.. ఈ నేపథ్యంలో మ్యాథమెటిక్స్‌లో మెరికల్లా మారడానికి విలువైన సూచనలు.. తాజా నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర అటవీ శాఖ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానాదార్, బంగళా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఆయా పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షలో మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంది. పేపర్-3లో భాగంగా ఉండే ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు. విజయాన్ని నిర్ణయించడంలో ఈ మార్కులే కీలక భూమిక పోషిస్తాయని చెప్పొచ్చు. పరీక్ష విధానం: విభాగం మార్కులు ఎస్సే రైటింగ్ 20 జీకే 100 జనరల్ మ్యాథమెటిక్స్ 100 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు మాత్రం జనరల్ మ్యాథమెటిక్స్ విభాగానికి 50 మార్కులు కేటాయించారు. ప్రశ్నలు-మార్కుల విభజన: పరీక్ష విధానాన్ని పరిశీలిస్తే.. పేపర్-3లో జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ప్రశ్నల వారీగా మార్కుల విభజన ఉంటుంది. దీన్ని పరిశీలిస్తే.. ప్రశ్న మార్కులు క్లిష్టత స్థాయి 1 నుంచి 10 1 సులభం 11 నుంచి 40 2 మధ్యస్తం 41 నుంచి 50 3 కఠినం టెక్నికల్ అసిస్టెంట్‌కు నిర్వహించే పరీక్షలో జనరల్ మ్యాథమెటిక్స్ విభాగంలో 30 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో కూడా ప్రశ్నల వారీగా మార్కుల విభజన ఇలా ఉంటుంది. ప్రశ్న మార్కులు క్లిష్టత స్థాయి 1 నుంచి 15 1 సులభం 16 నుంచి 25 2 మధ్యస్తం 26 నుంచి 30 3 కఠినం ఏ ఒక్క అంశాన్ని విస్మరించకుండా: ఆయా పోస్టుల భ ర్తీ కోసం అటవీ శాఖ పేర్కొన్న సిలబస్‌ను పరిశీలిస్తే.. ‘జనరల్ మ్యాథమెటిక్స్ 10వ తరగతి స్థాయి’ అని మాత్రమే ఇచ్చారు. అంటే గణితంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల అన్ని పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ ఒక్క పాఠ్యాంశాన్ని విస్మరించకుండా అన్ని అంశాలను ప్రిపేర్ కావడం ఉత్తమం. ముందుగా ఆయా పాఠ్యాంశాల్లోని ప్రాథమిక అంశాలను నేర్చుకోవాలి. తర్వాత ముందుగా సులభమైన ప్రశ్నలు, అటుపై కఠిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. కీలకమైనవి: సంఖ్యామానం, క.సా.గు.-గ.సా.భా, వర్గ మూలాలు, భిన్నాలు, దశాంశ భిన్నాలు, నిష్పత్తి-అనుపాతం, సరాసరి, శాతాలు, లాభ నష్టాలు, బారు వడ్డీ-చక్ర వడ్డీ, డిస్కౌంట్, భాగస్వామ్యం, కాలం-దూరం, కాలం-పని, రేఖాగణితం, క్షేత్రమితిలోని వైశాల్యం, ఘనపరిమాణం, బీజగణితం, ఘాతాంకాలు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలు, సాంఖ్యక శాస్త్రం, ప్రవచనాలు-సమితులు, త్రికోణ మితి, సంభావ్యత, గణన (కంప్యూటర్). క్రమ పద్ధతిలో: ప్రిపరేషన్ కోసం ఒక క్రమ పద్ధతిని పాటించాలి. ముందుగా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల తెలుగు అకాడమీ గణిత పాఠ్యపుస్తకాలను రిఫర్ చేయాలి. ప్రతి పాఠ్యాంశంలోని సూత్రాలన్నిటినీ ఒక చోట రాసుకొని సాధన చేయాలి. అంకగణితం, బీజగణితం, వ్యాపారగణితం, రేఖాగణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సాంఖ్యకశాస్త్రం, సంభావ్యత పాఠ్యాంశాలలో సాధారణ స్థాయి నుంచి కఠిన స్థాయి వరకు గల సమస్యలపై ఎక్కువ దృష్టి సారించాలి. ప్రశ్నలను సాధించేటప్పుడు వీలైనన్ని షార్ట్‌కట్ మెథడ్స్‌ను నేర్చుకోవాలి. ఇందుకోసం ఆర్ ఎస్ అగర్వాల్, క్వికర్ మ్యాథ్స్ వంటి పుస్తకాలను రిఫర్ చేయాలి. తద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించవచ్చు. విపులంగా: పరీక్షల్లో నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్నలు, అప్లికేషన్ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా అడుగుతుంటారు. ప్రస్తుత పోటీని దృష్టిలో ఉంచుకుంటే ఎక్కువగా అప్లికేషన్ బేస్డ్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి అంశాన్ని విపులంగా అధ్యయనం చేయాలి. ఒక్కో అంశాన్ని మరో అంశంతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఈ పద్ధతి ఎక్కువగా రేఖాగణితంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు చతుర్భుజ వైశాల్యం తెలిస్తే రాంబస్ వైశాల్యాన్ని సులువుగా నేర్చుకోవచ్చు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు డిగ్రీ, ఇంటర్మీడియెట్ అర్హతగా పేర్కొన్నారు. కాబట్టి ప్రశ్నలు కూడా అదే స్థాయిలో అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రిపరేషన్ స్థాయి పెంచాల్సి ఉంటుంది. సాధనతో: మాదిరి ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ.. ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనే అంశంపై అవగాహన పెంచుకోవాలి. ఏయే అంశాలకు ఎక్కువ వెయిటేజీని ఇస్తున్నారో పరిశీలించాలి. వీలైనన్ని మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చే యాలి. మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సమయం నిర్దేశించుకోవాలి. ఆ సమయంలోనే అన్ని ప్రశ్నలను సాధించడానికి ప్రయత్నించాలి. ఎందుకుంటే ఎంత నేర్చుకున్నా ఇచ్చిన సమయంలోగా సమాధానాలు ఇవ్వకుంటే చక్కని స్కోర్ సాధించడం అసాధ్యం. అంతేకాకుండా ఫలితాలను విశ్లేషించుకోవాలి. తప్పు చేసిన ప్రశ్నకు సంబంధించిన వివరాలపై అవగాహన పెంచుకోవాలి. నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు: మ్యాథ్స్ విషయంలో నాన్-మ్యాథ్స్ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి స్థాయికి అనుగుణంగానే మ్యాథ్స్‌లో ప్రశ్నలు ఇస్తారు. వీరు వ్యాపార గణితం, క్షేత్రమితి పాఠ్యాంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. త్రికోణమితి, సంభావ్యత, రేఖాగణితంలోని ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. సాధ్యమైనన్నీ షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. ప్రిపరేషన్లో ఎక్కువ సమయం పేపర్-3కి కేటాయించడం లాభిస్తుంది. ప్రాధాన్యత క్రమంలో సిలబస్‌ను పరిశీలిస్తే.. విస్తృత స్థాయిలో అంశాలు కనిపిస్తాయి. కాబట్టి అన్ని అంశాలపై పట్టు సాధించడం స్వల్ప సమయంలో అసాధ్యం. కాబట్టి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న అంశాలను ప్రాధాన్యత క్రమంలో సాధన చేయాలి. 1 మొదటి ప్రాధాన్యతలో వ్యాపార గణితంపై దృష్టి పెట్టాలి. ఇందులోని నిష్పత్తి-అనుపాతం, శాతం, లాభ- నష్టాలు, బారు వడ్డీ-చక్రవడ్డీ, కాలం-పని, కాలం-దూరం అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. 2 రెండో ప్రాధాన్యతలో క్షేత్రమితిలోని అంశాలను ప్రాక్టీస్ చేయాలి. ఇందులోని వైశాల్యాలు, ఘనపరిమాణాలు అంశాలపై దృష్టి సారించాలి. వైశాల్యానికి సంబంధించి చతురస్రం, దీర్ఘచతురస్రం, త్రిభుజం, చతుర్భుజం, సమాంతర చతుర్భుజం,ట్రెపీజియం, రాంబస్, వృత్తం, సెక్టర్, కంకణం, బాట వైశాల్యానికి సంబంధించి లెక్కలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఘనపరిమాణాలకు సంబంధించి ఘనం, దీర్ఘఘనం, స్థూపం, శంఖువు, గోళం, ఉపరితల వైశాల్యాలు, వాటి ఘనపరిమాణాలు వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. 3 మూడో ప్రాధాన్యత కింద రేఖాగణితంపై దృష్టి సారించాలి. ఈ అంశం నుంచి కూడా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ అంశాన్ని పూర్తిగా నేర్చుకోవడం కష్టమని భావిస్తే.. కనీసం అందులోని ప్రాథమిక భావనలైనా ఔపోసన పట్టాలి. 4 నాలుగో ప్రాధాన్యత కింద సంఖ్యామానం, క.సా.గు- గ.సా.భా., భిన్నాలు, దశాంశ భిన్నాలు, సాంఖ్యక శాస్త్రం, ప్రవచనాలు-సమితులు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలు, ఘాతాంకాలు, వర్గ మూలాలు, గణన అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. Prepared by: Y.Vanamraju, Mathematics Faculty. -
ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో ఎవరెస్ట్... ఐఈఎస్
అఖిల భారత సర్వీసుల్లో ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్‌ల తర్వాత అత్యున్నత స్థాయిల్లో నిలిచే వాటిలో ఐఈఎస్ (ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్) ఒకటి. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఇంజినీరింగ్ కెరీర్‌తో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునేవారికి సువర్ణావకాశం ఐఈఎస్. యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఈ పరీక్షకు తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది.. ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయితేనే విజయం సాధ్యం.. ఐఈఎస్-2014 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. మొత్తం 4 బ్రాంచ్‌లలో ఐఈఎస్ పరీక్ష ఉంటుంది. అవి.. కేటగిరీ {బాంచ్ 1.సివిల్ ఇంజినీరింగ్ 2.మెకానికల్ ఇంజినీరింగ్ 3. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 4.ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ భర్తీ చేసే విభాగాలు ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీస్ ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ సర్వే ఆఫ్ ఇండియా గ్రేడ్-ఎ సర్వీస్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీస్ ఇండియన్ ఇన్స్పెక్షన్ సర్వీస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ సెంట్రల్ పవర్ ఇంజినీరింగ్ సర్వీస్ గ్రేడ్-ఎ అసిస్టెంట్ నావల్ స్టోర్స్ ఆఫీసర్స్ సెంట్రల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ సర్వీస్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ సెంట్రల్ ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ సర్వీస్ రెండు దశల్లో ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) అనే రెండు దశల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పరీక్ష స్వరూపం: పార్ట్ 1 రాతపరీక్షలో రెండు విభాగాలుంటాయి. సెక్షన్ 1 ఆబ్జెక్టివ్, సెక్షన్ 2 డిస్క్రిప్టివ్ (వ్యాసరూపం)లో ఉంటుంది. రెండు సెక్షన్లకు మొత్తం 1000 మార్కులుంటాయి. సెక్షన్-2 డిస్క్రిప్టివ్ (కన్వెన్షనల్): ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 200 మార్కులుంటాయి. ఒక్కో దానికి సమయం 3 గంటలు. పేపర్-1: ఏడు ప్రశ్నలుంటాయి. ఏవైనా ఐదింటికి సమాధానాలు రాయాలి. ఒక్కోదానికి 40 మార్కులు. పేపర్-2: మొదటి ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి 80 మార్కులు. ఇదే ప్రశ్నకు సంబంధించి మరో 10 అనుబంధ ప్రశ్నలుంటాయి. ఇం దులో మిగిలిన రెండు సెక్షన్లకు మొత్తం 120 మార్కులు. సెక్షన్-ఎ లో మూడు ప్రశ్నలుంటాయి. వీటిలో ఏవైనా రెండింటికి సమాధానం రాయాలి. ఒక్కోదానికి 30 మార్కులు. సెక్షన్-బి లోనూ ఇదే పద్ధతి ఉంటుంది. ఇందులో నెగెటివ్ మార్కులు ఉండవు. కానీ దస్తూరీ ఆకర్షణీయంగా లేకపోతే 5 శాతం వరకు మార్కులు తగ్గవచ్చు. పేపర్-2: ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి 200 మార్కులుంటాయి. ప్రశ్నల స్థాయి (పేపర్-1) ప్రాథమిక పరిజ్ఞానం 40 శాతం, అప్లికేషన్ పద్ధతి 40 శాతం ఫార్ములా, గ్రాఫ్స్ 15 శాతం రీజనింగ్ 05 శాతం ప్రశ్నల స్థాయి (పేపర్-2) పేపర్-2 వ్యాసరూప ప్రశ్నల విషయానికి వస్తే బీటెక్ సిలబస్‌కు అనుబంధంగానే ఉంటాయి. పెద్దగా వ్యత్యాసం ఉండదు. రాతపరీక్ష జనరల్ ఇంగ్లిష్: ఈ విభాగంలో ఇంగ్లిష్ భాషపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. సినానిమ్స్, యాంటానిమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, స్పాటింగ్ ఎర్రర్స్, కాంప్రహెన్షన్ తరహా ప్రశ్నలు వస్తాయి. స్మృతి ఆధారిత ప్రశ్నలు కాబట్టి సులువుగానే సమాధానాలను గుర్తించవచ్చు. జనరల్ స్టడీస్: ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్‌తోపాటు భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, ప్రభుత్వ పరిపాలన, సైన్స్ అండ్ టెక్నాలజీ, కార్పోరేట్ గవర్నెన్స్, జనాభా లెక్క లు, ప్రపంచ బ్యాంక్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే వీలుంది. ఎక్కువ భాగం మాత్రం కరెంట్ అఫైర్స్ నుంచే అడుగుతారు. కనుక పరీక్ష తేదీకి ఏడాదికి ముందు కాలం లో చోటుచేసుకున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో సంఘటనలు, క్రీడలు, అవార్డులు, వార్తల్లో వ్యక్తులపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఇంజినీరింగ్ఆబ్జెక్టివ్ పేపర్లు: ఇంజినీరింగ్ ఆబ్జెక్టివ్ పేపర్-1, పేపర్-2లలోని ప్రశ్నలు... బ్రాంచ్‌ల వారీగా బీఈ/బీటెక్ స్థాయిలో ఉంటాయి. పునస్మరణ, విశ్లేషణ, అన్వయం, ఎర్రర్, డిటెక్షన్ వంటి అంశాల ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఇందులో అడిగే ప్రశ్నలకు కేటాయించిన సమయాన్ని పరిశీలిస్తే... మొత్తం 120 ప్రశ్నలకు 120 నిమిషాలు మాత్రమే. అంటే ప్రతి ప్రశ్నకు సమయం నిమిషం మాత్రమే. అందువల్ల వేగం, కచ్చితత్వం అవసరం. కాలిక్యులేటర్లను పరీక్ష హాలులోకి అనుమతించరు. గుర్తుంచుకోదగిన విషయం ఏమిటంటే.... సెక్షన్-1లోఅర్హత మార్కులు వస్తేనే కన్వెన్షనల్ (సెక్షన్-2) జవాబు పత్రాలు దిద్దుతారు. కన్వెన్షనల్ పేపర్లు: సెక్షన్-2లో ఉండే రెండూ పూర్తిగా కన్వెన్షనల్ పేపర్లు. సెక్షన్-1లోని ఆబ్జెక్టివ్ పేపర్లను సమగ్రంగా ప్రిపేరైతే కన్వెన్షనల్ పేపర్లను కూడా సులువుగా రాయొచ్చు. ఉదాహరణకు ఈసీఈలోని నెట్వర్క్ థియరీ టాపిక్‌ను బాగా ప్రిపేర్ అయితే అనలాగ్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్ అంశాలు సులువు అవుతాయి. కన్వెన్షనల్ విభాగంలోని పేపర్-1లో 7 ప్రశ్నలుంటాయి. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. పేపర్-2లో మొత్తం 9 ప్రశ్నలుంటాయి. ఇందులో మొదటి ప్రశ్న విధిగా రాయాలి. సెక్షన్-ఎ లోని 4 ప్రశ్నలకు 2 ప్రశ్నలు. సెక్షన్-బిలోని 4 ప్రశ్నలకు ఏవైనా రెండిటికి సమాధానాలు రాయాలి. గ్రాఫ్స్‌ను ఉపయోగిస్తే మెరుగైన స్కోరుకు ఆస్కారం ఉంటుంది. పరీక్ష హాలులోకి కాలిక్యులేటర్‌ను అనుమతిస్తారు. ఇందులో డెరివేషన్స్, ప్రాక్టికల్ అప్లికేషన్లకు సంబంధించిన న్యుమరికల్ ప్రశ్నలు, కొంతమేర థియరీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాశామని కాకుండా సరైన సమాధానాలెన్ని రాశామనేదే ముఖ్యం. కొట్టివేతలు లేకుండా నీట్‌గా సమాధానాలు ఇవ్వాలి. లేదంటే 5 శాతం మార్కులు తగ్గే ప్రమాదం ఉంది. ఇంటర్వ్యూ ఈ విభాగానికి 200 మార్కులు కేటాయించారు. రాతపరీక్షలో ఫలితాన్ని అనుసరించి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి నాయకత్వ లక్షణాలు, మానసిక, శారీరక దృఢత్వం, పని-బాధ్యతల పట్ల ఆసక్తి, నిజాయితీ వంటి లక్షణాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఎంఈ/ఎంటెక్ అభ్యర్థులను వారి స్పెషలైజేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సబ్జెక్టు ఆధారిత ప్రశ్నలు, వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై అవగాహన ఉందో లేదో పరిశీలిస్తారు. బీటెక్/ఎంటెక్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలు కూడా ప్రిపేర్ అవడం ఉపయోగకరం. ఉద్యోగం చేస్తుంటే ... దానికి సంబంధించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కవ. ఐఈఎస్-2014 సమాచారం పోస్టుల సంఖ్య:582 అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, సివిల్, మెకానికల్) లేదా తత్సమానం. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా పరీక్షకు హాజరుకావచ్చు. ఎంఎస్సీ/తత్సమాన కోర్సులో వైర్లెస్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్ లేదా రేడియో ఇంజనీరింగ్ సబ్జెక్టులను కలిగిన విద్యార్థులు కూడా కొన్ని పోస్టులకు అర్హులు. వయసు: 21-30 ఏళ్లు ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2014 పరీక్ష తేదీ: మే 24, 2014 వివరాలకు: www.upsconline.nic.in ఫైనల్ కటాఫ్ మార్కులు 2013: కేటగిరీ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సివిల్ 290 240 235 230 ఎలక్ట్రికల్ 358 318 285 254 మెకానికల్ 380 338 315 290 ఎలక్ట్రానిక్స్ 435 395 348 305 టాపర్‌గా నిలవాలంటే ప్రాథమిక అంశాలపై లోతైన పరిజ్ఞానం ఉండాలి ప్రిపరేషన్‌కు ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలి. సంబంధిత టాపిక్స్‌లోని ఫండమెంటల్స్, కాన్సెప్ట్లపై అవగాహన ఏర్పరచుకోవాలి. థియరిటికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవాలి. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. సబ్జెక్ట్‌ను థియరీ, ప్రాబ్లమేటిక్ సబ్జెక్టులుగా విభజించుకోవాలి. బృందంగా చదవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్‌ను పూర్తి చేయవచ్చు. రోజువారీ ప్రిపరేషన్లో టెక్నికల్, జనరల్ ఎబిలిటీ అంశాలు ఉండే విధంగా ప్రణాళిక వేసుకోవాలి. నిర్వచనాలు, ప్రాబ్లమ్స్‌ను ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల కన్వెన్షనల్ పేపర్‌ను ప్రభావవంతంగా ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి. గేట్ ప్రశ్న పత్రాలు కూడా సహాయపడతాయి. బాంచ్ల వారీ ముఖ్య అంశాలు ఈసీఈ: ఈ బ్రాంచ్‌లో నెట్వర్క్స్, కంట్రోల్ సిస్టమ్, ఈడీసీ అనలాగ్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, మైక్రో ప్రాసెసర్ అంశాలకు ఆబ్జెక్టివ్, కన్వెన్షనల్ విభాగాల్లో ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. ఈఈఈ: పేపర్-1 కోసం నెట్వర్క్ థియరీ, కంట్రోల్ సిస్టమ్, మెజర్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. పేపర్-2 పరిధి విస్తృతం. ఇందులో పవర్ సిస్టమ్, పవర్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ అండ్ అనలాగ్ సర్క్యూట్స్ అంశాలను సమగ్రంగా చదవాలి. ఎలక్ట్రికల్ మెషిన్స్‌లోని డీసీ మెషిన్స్, ఇండక్షన్ మెషిన్స్, ట్రాన్స్ ఫార్మర్స్పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. మెకానికల్: పేపర్-1, 2లో ఎక్కువ శాతం ప్రశ్నలు థర్మోడైనమిక్స్, హైడ్రాలిక్స్ బేసిక్స్‌పై ఉంటాయి. పేపర్-2లో స్టెంగ్త్ ఆఫ్మెటీరియల్స్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంశాలను చక్కగా చదవాలి. సివిల్: ఈ బ్రాంచ్‌లో దాదాపు అన్ని టాపిక్స్‌ను చదవాల్సిందే. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, హైడ్రాలిక్స్, ట్రాన్స్ పోర్టేషన్ ఇంజనీరింగ్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అంశాలకు ఆబ్జెక్టివ్, కన్వెన్షనల్ విభాగాల్లో అధిక ప్రాధాన్యం ఉంటుంది. సమగ్రంగా చదివితే విజయం తథ్యం రోజుకు కనీసం 6-8 గంటలు చదవాలి. ప్రతీ అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. సిలబస్ విస్తృతం కనుక 2 నెలల ముందే పూర్తయ్యేలా చూసుకోవాలి. పరీక్షకు ముందు రెండు సార్లు రివిజన్ చేసుకుంటే మంచిది. ఇందుకు సమయపాలన ఎంతో కీలకం. ఒత్తిడిని అధిగమించాలంటే మాక్‌టెస్ట్‌లకు హాజరవ్వాలి. ఎక్కడ తప్పులు చేస్తున్నామో వాటిని సరిదిద్దుకోవాలి. కన్వెన్షనల్ పేపర్ల విషయంలో ప్రశ్నల ఎంపికే కీలకం. ఒక్కో పేపర్లో ఏడు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మనం ఏ ఐదింటికి వరుస క్రమంలో సమాధానాలు రాశామో వాటి మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. కనుక జాగ్రత్త వహించాలి. ఎలాంటి కొట్టివేతలు లేకుండా నీట్‌గా సమాధానాన్ని ప్రెజంట్ చేయాలి. ఇంటర్వ్యూలో ఆయా సబ్జెక్ట్ నిపుణులు నలుగురు ఉంటారు. నా ఇంటర్వ్యూ 15-20 నిమిషాల పాటు సాగింది. టెక్నికల్ అంశాలతో పాటు మన వ్యక్తిగత విషయాలు, హాబీస్ గురించి అడుగుతారు. సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలను అడిగేటప్పుడు తెలియకపోతే రాదు అని సూటిగా చెప్పడం మంచిది. ఇంటర్వ్యూలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పామా అన్నది కాదు ఎంత ఆత్మవిశ్వాసం కనబరిచామనే అంశాన్ని చూస్తారు. -అనిల్‌కుమార్ అడెపు ఐఈఎస్ -2013 జాతీయస్థాయి ఏడో ర్యాంకర్ పి.శ్రీనివాసులు రెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్, వాణి ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ -
ఉపాధ్యాయ కెరీర్‌కు బాటలు వేసే.. ఎడ్‌సెట్
భావి తరాలను తీర్చిదిద్దే పవిత్ర వ్యాసాంగం.. ఉపాధ్యాయ వృత్తి.. అందుకే గురుదేవోభవ అంటూ.. తల్లిదండ్రుల తర్వాతి స్థానాన్ని గురువుకు కట్టబెట్టారు.. అటువంటి మహోన్నతమైన వృత్తిలోకి ప్రవేశించేందుకు బాటలు వేస్తున్న కోర్సుల్లో బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) ఒకటి.. 2014 సంవత్సరానికిగాను బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే ఎడ్‌సెట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ప్రిపరేషన్ ప్లాన్, పరీక్ష నిర్వహణపై ఎడ్‌సెట్-2014 కన్వీనర్‌తో ఇంటర్వ్యూ, తదితర వివరాలు.. ఎడ్‌సెట్ ద్వారా బీఈడీ కోర్సులోని ఫిజికల్ సెన్సైస్, బయాలాజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ వంటి ఐదు రకాల మెథడాలజీల్లో ప్రవేశం పొందొచ్చు. 618కాలేజీలు, 60 వేలకుపైగా సీట్లు (దాదాపుగా) పరీక్ష విధానం పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. సమాధానాలను గుర్తించడానికి రెండు గంటల సమయం (120 నిమిషాలు) ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం మార్కులు 150. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి అనే మూడు భాగాలు ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. పార్ట్-సిలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. వివరాలు.. విభాగం ప్రశ్నలు మార్కులు పార్ట్-ఎ జనరల్ ఇంగ్లిష్ 25 25 పార్ట్-బి జనరల్ నాలెడ్జ్ 15 15 టీచింగ్ ఆప్టిట్యూడ్ 10 10 పార్ట్-సి మెథడాలజీ మ్యాథమెటిక్స్ 100 100 ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ 50 50 కెమిస్ట్రీ 50 50 బయాలాజికల్ సైన్స్ 100 100 బోటనీ 50 50 జువాలజీ 50 50 సోషల్ స్టడీస్ 100 100 జాగ్రఫీ 35 35 హిస్టరీ 30 30 సివిక్స్ 15 15 ఎకనామిక్స్ 20 20 జనరల్ టిప్స్: 120 నిమిషాల్లోనే 150 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక్కో ప్రశ్నకు నిమిషం కంటే తక్కువ సమయం లభిస్తుంది. కాబట్టి వీలైనన్ని మోడల్ టెస్ట్‌లను రాస్తూ తక్కువ సమయంలో కచ్చితత్వంతో కూడిన సమాధానాలను ఇవ్వడం నేర్చుకోవాలి. ఎడ్‌సెట్‌లో అడిగే ప్రశ్నలు ఎనిమిది నుంచి డిగ్రీ వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా హైస్కూల్ స్థాయిలో ఉండి.. ఇంటర్, డిగ్రీలలో పునరావృతమయ్యే అంశాలను చదవాలి. తద్వారా సబ్జెక్ట్‌పై మంచి పట్టు వస్తుంది. కనీసం 110 మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. కనీసం రోజుకు 5-6 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. సబ్జెక్ట్‌తోపాటు ఇంగ్లిష్, జీకే అంశాలను ప్రతి రోజూ చదవాలి. నోటిఫికేషన్ సమాచారం: అర్హత: 50 శాతం(రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులు 40 శాతం) మార్కులతో బీఏ/బీఎస్సీ/ బీకాం/బీఎస్సీ(హోంసైన్స్)/బీసీఏ/బీబీఎం లేదా పీజీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ లేదా తత్సమానం.డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులూ అర్హులే. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 24, 2014. రూ. 500 లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2014. పరీక్ష తేదీ: జూన్ 2, 2014 (11్చఝ-1ఞఝ). వెబ్సైట్: http://apedcet.org ప్రిపరేషన్ ప్లాన్.. పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్: ఈ విభాగంలోని ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, స్పెల్లింగ్, వొకాబ్యులరీ, సినానిమ్స్, యాంటినొమ్స్, సింపుల్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, వాయిస్ డెరైక్ట్ స్పీచ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం కోసం రెన్ అండ్ మార్టిన్ లేదా ఏదైనా ప్రామాణిక గ్రామర్ పుస్తకాన్ని చదవడం ప్రయోజనకరం. పార్ట్-బి: ఈ విభాగం జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా ఉంటుంది. జనరల్నాలెడ్జ్కు సంబంధించి ప్రామాణిక అంశాలుగా భావించే దేశాలు-కరెన్సీ- రాజధానులు, భౌగోళిక ప్రాధాన్యం, సంస్కృతి, నాగరికత, ముఖ్య కట్టడాలు, ప్రదేశాలు, పండగలు, గ్రంథాలు-రచయితలు వంటి వాటిని విస్తృతంగా చదవాలి. వాటితోపాటు వర్తమానంగా జాతీయంగా, అంతర్జాతీయంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చోటు చేసుకుంటున్న సంఘటనలను పరిశీలించాలి. స్టాండర్డ్ జీకే అంశాలను వర్తమాన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఈ విభాగం కోసం మనోరమ ఇయర్ బుక్, రోజూ రెండు దిన పత్రికలు చదవాలి. టీచింగ్ ఆప్టిట్యూడ్: ఈ విభాగం పూర్తిగా కొత్తది. భవిష్యత్‌లో చేపట్టే ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి అభ్యర్థుల ఆసక్తి, నైపుణ్యాలను స్వల్ప స్థాయిలో అంచనా వేయడానికి ఉద్దేశించిన విభాగమిది. ఇందులో టీచింగ్ స్కిల్స్‌ను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. బోధించడంలో టీచర్ల సామర్థ్యం, మంచి టీచర్ల లక్షణాలు, వ్యక్తిగత వైరుధ్యాలున్న విద్యార్థులకు బోధించడంలో బోధకుడి సమర్థత, జనరల్ ఇంటెలిజెన్స్, అనలిటికల్ థింకింగ్‌లపై ప్రశ్నలుంటాయి. ఇచ్చిన ప్రశ్నను బట్టి విచక్షణ (సమయస్ఫూర్తి)తో సమాధానం ఇవ్వాలి. తరగతి గదిలో ఉపాధ్యాయుడి స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? ఎలా వ్యవహరిస్తారు? వంటి అంశాలను విశ్లేషించుకొని సమాధానం ఇవ్వాలి. పార్ట్-సి: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్: సమితులు, సంబంధాలు, ప్రమేయాలు, వర్గ సమీకరణాలు, ద్విపద సిద్ధాంతం, సంయోగాలు, మాత్రికలు, త్రికోణమితి, శ్రేణులు, అవకలనం, సమాకలనం, సమూహాలు, వ లయాలు వంటి అంశాలు కీలకమైనవి. మిగతా సబ్జెక్ట్లతో పోల్చితే ఇందులో సమాధానాలను గుర్తించడానికి ఎక్కువ కసరత్తు చేయాలి. కాబట్టి ప్రతి రోజూ చదివిన టాపిక్కు సంబంధించిన మాదిరి ప్రశ్నలను సమయం నిర్దేశించుకుని సాధించాలి. వీలైనన్నీ గ్రాండ్‌టెస్ట్‌లు రాయాలి. ఫిజికల్ సెన్సైస్: ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 50 ప్రశ్నల చొప్పున వస్తాయి. ఇందులో అడిగే ప్రశ్నలు అప్లికేషన్ పద్ధతిలో ఉంటాయి. టాపిక్ల వారీగా సిద్ధాంతాలు, నిర్వచనాలు, ఫార్ములాలను విస్తృతంగా అధ్యయనం చేయాలి. ఫిజిక్స్‌కు సంబంధించి.. యాంత్రిక శాస్త్రం, విద్యుత్, అయస్కాంతత్వం వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. కెమిస్ట్రీలో.. మూల, భౌతికరసాయన, కర్బన రసాయన శాస్త్రం నుంచి సమాన ప్రాధాన్యతలో ప్రశ్నలు వస్తాయి. మూలక, భౌతిక రసాయన శాస్త్రాలకు ఇంటర్మీడియెట్ స్థాయి పుస్తకాలు, కర్బన రసాయన శాస్త్రానికి సంబంధించి డిగ్రీ పుస్తకాలు చదవాలి. బయాలాజికల్ సెన్సైస్: ఇందులో బోటనీ, జువాలజీ అంశాల నుంచి సమాన సంఖ్యతో ప్రశ్నలు వస్తాయి. జంతువుల విసర్జక వ్యవస్థ, కిరణజన్య సంయోగ క్రియ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. సోషల్ స్టడీస్: అత్యధిక మంది అభ్యర్థులు రాసే సబ్జెక్ట్ ఇది. ఇందులో జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిల్లో జాగ్రఫీ నుంచి అత్యధిక ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి ఈ విభాగంపై దృష్టి సారిస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. ఇందుకోసం పదో తరగతి వరకు ఉండే జాగ్రఫీ ప్రాథమిక అంశాలను ప్రిపేర్ కావాలి. అట్లాస్, మ్యాప్ ఆధారంగా ప్రిపేర్ కావాలి. సివిక్స్‌లో భారత రాజ్యాంగం-రాజకీయ వ్యవస్థ, రాజనీతి సిద్ధాంతాలు, అంతర్జాతీయ సంబంధాలు, రాష్ట్రానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఎకనామిక్స్‌లో సూక్ష్మ ఆర్థిక శాస్త్రం, భారత ఆర్థికాభివృద్ధి, పంచవర్ష ప్రణాళికలు, పన్నులు, ద్రవ్య విధానం, బ్యాంకింగ్, జనాభా వంటి అంశాలను అధ్యయనం చేయాలి. వీటిని వర్తమాన అంశాలతో సమన్వయం చేసుకుంటూ చదవడం ప్రయోజనకరం. హిస్టరీలో ఆధునిక యుగం, సాంస్కృతిక పునరుజ్జీవనం, మత సంస్కరణోద్యమం, ఐరోపా-అమెరికా విప్లవాలు, ప్రపంచ యుద్ధాలు, ఐక్యరాజ్యసమితి, భారతదేశ చరిత్రకు స్వాతంత్య్ర ఉద్యమంలోని దశలు, నాగరికతలు, బౌద్ధ-జైన మతాలు, మౌర్యులు, గుప్తులు, ఆధునిక దక్షిణ భారతదేశ చరిత్ర వంటి అంశాలను క్షుణ్నంగా చదవాలి. ఇంగ్లిష్: ఇందులో ప్రశ్నలు రెండు విధాలుగా ఉంటాయి. మొదటి విధానంలో 8,9,10, ఇంటర్మీడియెట్ తరగతుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు. అందులో భాగంగా.. లాంగ్వేజ్ ఫంక్షన్స్, ఎలిమెంట్ ఫోనెటిక్స్, ఇడియమ్స్, రైటింగ్ స్కిల్స్, స్టడీ స్కిల్స్, రిఫరెన్స్ స్కిల్స్ వంటి అంశాల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. రెండో విధానంలో బీఏ స్థాయిలో ఇంగ్లిష్ ఆప్షనల్‌కు సంబంధించి నిర్దేశించిన బీఏ (స్పెషల్ ఇంగ్లిష్)/ మోడర్న్ లిటరేచర్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. జూన్ 23న ఫలితాలు ఎడ్‌సెట్ నిర్వహణకు సంబంధించి ఎడ్‌సెట్-2014 కన్వీనర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ.. దరఖాస్తులు ప్రారంభం: ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 42 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. గతేడాది దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను బట్టి మొత్తం 287 పరీక్షా కేంద్రాలలో పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం కూడా వచ్చిన దరఖాస్తుల మేరకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. మార్పుల్లేవ్: దరఖాస్తు, పరీక్షా విధానంలో ఎటువంటి మార్పులు చేయలేదు. పాత విధానంలోనే దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో స్వీకరిస్తున్నాం. గతేడాది 1,47,709 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. అత్యధికంగా ఉస్మానియా వర్సిటీ పరిధి నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది 1.5 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. సబ్జెక్ట్‌ల వారీగా చూస్తే సోషల్స్టడీస్ విభాగం కోసం అత్యధికంగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. గతేడాది సోషల్ సబ్జెక్టుకు 65,073 దరఖాస్తులు వచ్చాయి. సవరణలకు అవకాశం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు చేసినా వాటిని సరిచేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఏప్రిల్ 25 నుంచి 27వ తేదీ మధ్య సమయం ఇస్తున్నాం. ఆ సమయంలో నేరుగా విద్యార్థులే వెబ్సైట్లో తప్పులను సరిచేసుకోవచ్చు. లేని పక్షంలో సందేహాలు ఉంటే 0891-2579797 నంబర్లో సంప్రదించవచ్చు. సందేహాలను convenoredcet2014@ gmail.comకు మెయిల్ కూడా చేయవచ్చు. జూన్ 12న ఫైనల్ కీ: ప్రాథమిక ‘కీ’ని జూన్ 5వ తేదీన, ఫైనల్ ‘కీ’ని జూన్ 12వ తేదీన, ఫలితాలను జూన్ 23వ తేదీన విడుదల చేస్తాం. ఫలితాలు విడుదలైన తర్వాత కౌన్సెలింగ్ తేదీలపై నిర్ణయం ఉంటుంది. కోర్సు వ్యవధి పెరగొచ్చు! జస్టిస్ వర్మ కమిషన్ విద్యలో సమూల మార్పులను తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఆ మేరకు బీఈడీ కోర్సుల కాల వ్యవధి పెంపు వంటి మార్పు లు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా విద్యార్థుల సంఖ్య కూడా పెరగవచ్చు. ఎడ్సెట్తోనే ఫీజు రీయింబర్స్మెంట్: ఎడ్‌సెట్ పరీక్ష రాసిన వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తిస్తుంది. ఆంధ్రా విశ్వవిద్యాలయం, బీ.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశం కూడా ఎడ్‌సెట్ ద్వారానే నిర్వహిస్తాం. ఈ సారి కూడా ఒక నిమిషం నిబంధన అమల్లో ఉంది. పరీక్ష సమయాని కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. గడువు వరకు వేచి చూడడం కంటే ముందుగానే దరఖాస్తు చేసుకోవడం శ్రేయస్కరం. -వేదుల నరసింహం, న్యూస్‌లైన్, విశాఖపట్నం. -
‘స్ఫూర్తి’గా నిలిచిన ఉన్నత విజయం...
ఎంసెట్‌లో నాలుగు మార్కులు తగ్గడంతో ఎంబీబీఎస్ సీటు దూరమైంది.. అయినా నిరాశ చెందకుండా అందొచ్చిన బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్)ని ఆమె సద్వినియోగం చేసుకున్నారు.. పక్కా ప్రణాళికతో చదివి, స్వర్ణ పతకం సాధించారు. ఆపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన ఎండీఎస్ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించారు. చిత్తూరు జిల్లాకు చెందిన కె.స్ఫూర్తి రెడ్డి. పేరులోనే స్ఫూర్తిని నింపుకున్న ఆమె గెలుపు బాట అనుభూతుల్ని ‘భవిత’తో పంచుకున్నారు.. మాది చిత్తూరు జిల్లా మదనపల్లి. నాన్న మల్లికార్జునరెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్. అమ్మ విజయలక్ష్మి టీచర్. ఎనిమిదో తరగతి నుంచి బీడీఎస్ వరకు కర్నూల్లోని బాబాయి ప్రసాద్‌రెడ్డి ఇంట్లోనే ఉండి చదువుకున్నాను. వైద్యునిగా బాబాయికి ఉన్న గుర్తింపు, సేవ చేయడం ద్వారా ఆయన పొందుతున్న సంతృప్తి నాలో డాక్టర్ కావాలన్న ఆశను రేకెత్తించాయి. ఆయన స్ఫూర్తితో ఎప్పటికైనా గొప్ప డాక్టర్ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. ‘పది’ నుంచే పట్టుదలతో: పదో తరగతిలో 600 మార్కులకు 557 మార్కులు తెచ్చుకున్నా. ఇంటర్మీడియెట్ బైపీసీలోనూ ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎంసెట్-2007లో నాలుగు మార్కులు తగ్గడంతో ఎంబీబీఎస్ సీటు చేజారింది. బీడీఎస్ సీటు రావడంతో కర్నూలు పుల్లారెడ్డి మెడికల్ కాలేజీలో చేరాను. ఒక ప్రణాళిక ప్రకారం చదవడమనేది పదో తరగతి నుంచే అలవడింది. రోజువారీగా చదవాల్సిన అంశాలను ఒక పేపర్‌పై రాసి, గోడకు అంటించేదాన్ని. ఆ రోజు చదవాల్సిన పాఠాలు పూర్తయితేనే నిద్రపోయేదాన్ని. అది క్రమంగా అలవాటుగా మారింది. ఇదే పద్ధతిని బీడీఎస్లోనూ అనుసరించాను. 69 శాతం మార్కులతో కోర్సును పూర్తిచేశాను. చివరి సంవత్సరంలో స్వర్ణ పతకం సాధించాను. తొలి ప్రయత్నంలో నిరాశ: పీజీ ఎంట్రన్స్ రాయడం ఇది రెండోసారి. బీడీఎస్ పూర్తయిన వెంటనే రాసిన మొదటి ఎంట్రన్స్‌లో ఆశించిన ర్యాంకు రాలేదు. అందుకే కర్ణాటకలోని ఒక కోచింగ్ సెంటర్లో తొమ్మిది నెలలు శిక్షణ తీసుకున్నా. సబ్జెక్టుపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాననే భావన నాలో ఉండేది. అది వాస్తవం కాదని శిక్షణ కేంద్రంలో చేరిన తర్వాత తెలిసింది. పాఠ్యాంశాలను రివిజన్ చేస్తూ, లోతైన అధ్యయనం చేయడం ముఖ్యమని గ్రహించాను. కోచింగ్ క్లాస్‌లో చెప్పబోయే అంశాలను ముందే చదువుకొని వెళ్లేదాన్ని. దీంతో తరగతిలో చెప్పే పాఠాలు రివిజన్లా ఉండేది. రోజువారీ పరీక్షలు రాసి, తప్పులను సరిదిద్దుకునేదాన్ని. పీజీ ఎంట్రన్స్‌లో 100కు 89 మార్కులు వచ్చాయి. ఉస్మానియాలో మెడికల్ కాలేజీలో పీజీ పూర్తిచేసి, మంచి డాక్టర్‌గా పేరుతెచ్చుకోవాలన్నది నా లక్ష్యం. అమ్మా, నాన్న ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఎప్పటికప్పుడు ప్రిపరేషన్లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (ఎండీఎస్) ఎంట్రన్స్‌లో 60 శాతం ప్రశ్నలు తేలిగ్గా ఉంటాయి. మిగిలిన 40 శాతం ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. ర్యాంకింగ్‌కు ప్రతి మార్కూ కీలకమే. డెంటల్ పల్స్‌తో మేలు: తప్పులను సమీక్షించుకుంటూ నిజాయితీగా కష్టపడి చదవాలి. పీజీ ఎంట్రన్స్‌లో బీడీఎస్ విద్యార్థులకు ‘డెంటల్ పల్స్’ పుస్తకం ప్రామాణికమైంది. దాన్ని ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మంచిది. రివిజన్ చేసిన ప్రతిసారీ కొత్త విషయాలు తెలుస్తాయి. డాక్టర్ గౌరీశంకర్ రాసిన పుస్తకాలతో పాటు టెక్స్ట్‌బుక్స్ చదువుతూ, పాత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే విజయం సులువవుతుంది. ‘‘అకడమిక్ అంశాలు చదవగానే అంతా వచ్చినట్లే ఉంటుంది. అదే భావనతో పరీక్షకు హాజరైతే ఉత్తీర్ణత సాధిస్తాంగానీ ర్యాంకులు సాధించలేమన్నది గుర్తించాలి. ఇది నాకు స్వీయ అనుభవంలోకి వచ్చాక, విజయం సాధించేందుకు అవసరమైన మార్గం కనిపించింది. ఫలితం ఎండీఎస్ ఎంట్రన్స్‌లో మొదటి ర్యాంకు’’ కె.స్ఫూర్తి రెడ్డి. -
ఇన్స్ట్రుమెంటేషన్లో పీజీ కోర్సుల వివరాలు...
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఇన్సూరెన్స్ కోర్సులు అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి? - శ్రీధర్, నిర్మల్. వివిధ సంస్థలు ఇన్సూరెన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల ద్వారా బీమా పరిశ్రమపై ఔత్సాహికుల్లో సమగ్ర అవగాహన కల్పిస్తారు. బీమా వ్యాపారానికి యాక్చూరియల్ సైన్స్ ఆధారం. ఇన్సూరెన్స్ రిస్క్స్, ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని యాక్చూరియల్ సైన్స్ అందిస్తుంది. పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన కీలక నిర్ణయాలు బీమా వ్యాపారానికి అవసరం. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు యాక్చూరియల్ సైన్స్ ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్, యాక్చూరియల్ సైన్స్ కోర్సులు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం), హైదరాబాద్.. ది ఇంటర్నేషనల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్; ది ఇంటర్నేషనల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్; ది ఇంటర్నేషనల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిస్క్ మేనేజ్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. అర్హత: గ్రాడ్యుయేషన్. సీఏ, ఐసీడబ్ల్యూఐ లేదా సీఎస్ వంటి ప్రొఫెషనల్ అర్హతలున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఐఆర్ఎం.. పీజీ డిప్లొమా ఇన్ యాక్చూరియల్ సైన్స్ కోర్సును కూడా ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.iirmworld.org.in యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, చెన్నై.. ఎంఎస్సీ యాక్చూరియల్ సైన్స్ కోర్సును అందిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌తో బీఎస్సీ. వెబ్సైట్: www.unom.ac.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, హైదరాబాద్.. ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌తో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. ఎంట్రన్స్, జీడీ, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.ipeindia.org అమిటీ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ యాక్చూరియల్ సైన్స్, నోయిడా.. ఎంబీఏ (ఇన్సూరెన్స్) కోర్సును అందిస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. మ్యాట్/క్యాట్/జీమ్యాట్/అమిటీ ఎంట్రన్స్, జీడీ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.amity.edu కెరీర్: కోర్సు పూర్తిచేసిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కంపెనీలు, బ్యాంకులు, బిజినెస్ కన్సల్టెన్సీలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇన్స్ట్రుమెంటేషన్లో పీజీ ప్రోగ్రామ్ వివరాలు తెలియజేయండి? - గణేశ్, వనపర్తి. ఇన్స్ట్రుమెంటేషన్ అప్లికేషన్స్.. మెడిసిన్, టెలీ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి ఎన్నో విభాగాల్లో ఉపయోగపడతాయి. ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంటెక్ పూర్తిచేసిన వారికి విస్తృత ఉపాధి అవకాశాలు ఉంటాయి. కోర్సులు: జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, హైదరాబాద్.. ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఈఈఈ/ఈసీఈ/ఈఐఈ/ఐసీఈలో బీఈ లేదా బీటెక్. గేట్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.jntuh.ac.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఇన్స్ట్రుమెంటేషన్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ కోర్సును అందిస్తోంది. అర్హత: ఈసీఈ/ ఈఈఈ లేదా సంబంధిత సబ్జెక్టుతో బీఈ లేదా బీటెక్. గేట్ లేదా పీజీఈసెట్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.andhrauniversity.edu.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.. ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ సిస్టమ్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈఈఈ/ ఈసీఈ/ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/ కంట్రోల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్. వెబ్సైట్: svuniversity.ac.in కెరీర్: కోర్సు పూర్తిచేసిన వారికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలీ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. భారతీయ రైల్వేలు, బీఎస్ఎన్ఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తదితర ప్రముఖ సంస్థల్లోనూ ఉన్నత ఉద్యోగాలుంటాయి. సంస్థలు రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగులను ఎంపిక చేస్తున్నాయి. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) ద్వారా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బ్యాచిలర్ ఆఫ్ లా చేయాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయగలరు? - గణేశ్, గుంటూరు. రాజీవ్‌గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, ఐఐటీ ఖరగ్‌పూర్.. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో బ్యాచిలర్ ఆఫ్ లా కోర్సును అందిస్తోంది. ఈ కోర్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. మూడేళ్ల కాల వ్యవధిగల ఈ కోర్సులో ఆరు సెమిస్టర్లుంటాయి. ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్/ ఎల్‌శాట్ ఇండియా/ ఎల్‌శాట్ గ్లోబల్, జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, బేసిక్ సైన్స్, లీగల్ ఆప్టిట్యూడ్, ఎస్సే పరిజ్ఞానాన్ని పరీక్షించేలా పరీక్ష ఉంటుంది. వెబ్సైట్: www.rgsoipl.iitkgp.ernet.in నేను బీటెక్ పూర్తిచేశాను. కెనడాలో ఎంఎస్ చేయడానికి విధివిధానాలేమిటి? - బాల, నిజామాబాద్. కెనడాలో ఎంఎస్ చేయాలనుకుంటే తొలుత అక్కడ ఉన్న కొన్ని యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవాలి. ఆయా వర్సిటీల్లో ప్రవేశ విధానాలను తెలుసుకోవాలి. నిర్దేశ జీఆర్ఈ, టోఫెల్ స్కోర్ ఆధారంగా వర్సిటీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. యూనివర్సిటీ కోరిన అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. యూనివర్సిటీ నుంచి అంగీకారపత్రం లభిస్తే అప్పుడు స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. -
వరల్డ్ వైడ్ వెబ్‌కు 25 ఏళ్లు
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ఏడాదిలో పూర్తి చేయాలన్న సుప్రీం ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను సంవత్సరంలోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు మార్చి 10న కిందిస్థాయి కోర్టులను ఆదేశించింది. అభియోగాలు నమోదైన సంవత్సరంలోగా విచారణ ముగించాలని పేర్కొంది. ఏడాదిలోగా విచారణ పూర్తికాకపోతే దిగువ కోర్టులు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. విచారణలో జాప్యం వల్ల కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు తమ పదవుల్లో కొనసాగుతున్నారని జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. డ్రాపౌట్ల సంఖ్య 8 కోట్లు భారత్‌లో ప్రాథమిక విద్య పూర్తికాక ముందే బడి మానే స్తున్న చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని యూనిసెఫ్ ప్రతినిధి లూయిస్-జార్జెస్ ఆర్సెనాల్ట్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది పిల్లలు వివిధ కారణాల వల్ల మధ్యలోనే స్కూలు డ్రాపౌట్లుగా మారారని తెలిపారు. ప్రాథమిక విద్య (ఎనిమిదో తరగతి వరకూ) పూర్తి కాకుండానే బడి మానేస్తున్న పిల్లల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉందన్నారు. 10వ యంగ్ ఇండియన్ సదస్సు 10వ యంగ్ ఇండియన్ సదస్సు న్యూఢిల్లీలో మార్చి 15న ప్రారంభమైంది. ‘ఇండియా-ద ఫ్యూచర్ ఈజ్ నౌ’ అనే ఇతివృత్తంతో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) కు చెందిన యంగ్ ఇండియన్స్ (వైఐ) సంస్థ ఈ సదస్సును నిర్వహించింది. విద్వేషం చిమ్మే నేతలను బుక్ చేయండి: సుప్రీం కులం, మతం, ప్రాంతం, జాతి ఆధారంగా నేతలు చేసే విద్వేష ప్రసంగాలు సమాజానికి విఘాతకరమని.. అలాంటి ప్రసంగాలు చేసే రాజ కీయ, సంఘ, మత సంస్థల నేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీలు లేదా నేతలు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే... ఆయా పార్టీల గుర్తింపు రద్దు చేయాలా? అన్న అంశాన్ని పరిశీలించాలని లా కమిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం కోరింది. నేతల విద్వేష ప్రసంగాలు ప్రజస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించేలా ఉంటున్నాయని స్వచ్ఛంద సంస్థ ప్రవాసీ భలాయ్ సంఘటన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీం కోర్టు మార్చి 12న విచారించింది. ఎన్నికల్లో నల్లధనం నియంత్రణకు ‘గ్రిడ్’ రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నల్లధనాన్ని నియంత్రించడంలో భాగంగా రెవెన్యూ, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కూడిన ప్రత్యేక నిఘా వ్యవస్థ(గ్రిడ్)ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ విధమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల గురించి ఇది ఎప్పటికప్పుడు ఈసీకి తెలియజేస్తుంది. తద్వారా నల్లధనం నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో తోడ్పడుతుంది. యూఐడీఏఐకి నిలేకని రాజీనామా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మన్ పదవికి నందన్ నిలేకని మార్చి 13న రాజీనామా చేశారు. యూఐడీఏఐ చైర్మన్‌గా నిలేకని 2009 జూన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిలేకని వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు వీలుగా తన పదవికి రాజీనామా చేశారు. అంతర్జాతీయం దేవయానిపై అభియోగాల కొట్టివేత భారత దౌత్యవేత్త దేవయానిపై నమోదైన వీసా మోసం అభియోగాలను అమెరికా కోర్టు మార్చి 12న కొట్టివేసింది. ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ ఉన్న నేపథ్యంలో ఈ అభియోగాలు చెల్లవని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూయార్క్‌లోని జిల్లా కోర్టు జడ్జి షీరా షైండ్లిన్ తీర్పు ఇచ్చారు. దేవయానిపై మార్చి 15 అమెరికా విచారణాధికారులు తాజా అభియోగాలతో అరెస్ట్ వారంట్ జారీ చేశారు. దీంతో ఆమె అమెరికా వెళితే మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉంది. దేవయాని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ అధికారిగా ఉన్నప్పుడు తన ఇంట్లో పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా విషయంలో అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతేడాది ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంలో భారత్‌కు 73వ స్థానం రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం విషయంలో భారత్ ప్రపంచంలో 73వ స్థానంలో నిలిచింది. ‘ద ఉమెన్స్ ఇన్ పాలిటిక్స్ మ్యాప్-2014’ అనే పేరుతో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ), యూఎన్ ఉమెన్ సంస్థలు మార్చి 16న విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మహిళల భాగస్వామ్యం విషయంలో నికరాగువా మొదటి స్థానంలో నిలిచింది. స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళ పార్లమెంటేరియన్ల శాతం 21.8గా ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. భారత్‌లో పార్లమెంటరీ లేదా మంత్రిత్వ పదవుల్లో 9 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఈ విషయంలో ఆఫ్రికా దేశాలు హైతీ, రువాండా, కాంగో, ఛాద్, జాంబియాలు భారత్ కంటే మెరగైన స్థానాల్లో ఉన్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న క్రిమియా ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియా.. ఉక్రెయిన్ నుంచి మార్చి 17న స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఈ ద్వీపకల్పంలోని ఉక్రెయిన్ ప్రభుత్వ ఆస్తులను జాతీయం చేస్తున్నట్లు ప్రకటించింది. పొరుగునే ఉన్న రష్యాలో చేరేందుకు అంగీకరించాలని ఆ దేశాన్ని కోరింది. ‘‘క్రిమియాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలన్నింటికీ క్రిమియా రిపబ్లిక్ విజ్ఞప్తి చేస్తోంది. రిపబ్లిక్ ఆఫ్ క్రిమియాను రష్యా సమాఖ్యలో సభ్యురాలిగా చేర్చుకోవాలని ఆ దేశాన్ని క్రిమియా రిపబ్లిక్ కోరుతోంది’’ అనే తీర్మానాన్ని క్రిమియా ప్రాంతీయ పార్లమెంటు ఆమోదించింది. ఉక్రెయిన్‌లో కొంత కాలంగా కొనసాగుతున్న సంక్షుభిత పరిణామాల నేపథ్యంలో.. స్వయం ప్రతిపత్తి గల క్రిమియా తాను ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా? లేక ఆ దేశం నుంచి విడిపోయి రష్యాలో చేరాలా? అనే అంశంపై మార్చి 16న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓటర్లలో 96.8 శాతం మంది ఉక్రెయిన్ నుంచి వేరుపడి రష్యాలో చేరాలని తీర్పుచెప్పినట్లు రెఫరెండం ఎన్నికల కమిషన్ చైర్మన్ మిఖాయిల్ మలిషేవ్ ప్రకటించారు. మార్చి 30 నుంచి తమ ప్రాంతం మాస్కో కాలమానానికి (జీఎంటీ + 4, ప్రస్తుత క్రిమియా కాలమానం కంటే రెండు గంటలు ముందుకు) మారుతుందని క్రిమియా స్థానిక ప్రధానమంత్రి సెర్గీ అక్సియోనోవ్ పేర్కొన్నారు. ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా సెరెన్ ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా మాజీ వామపక్ష గెరిల్లా కమాండర్ సాల్వెడార్ సాంచెజ్ సెరెన్ ఎన్నికయ్యారు. ఆయుధాల దిగుమతుల్లో భారత్ టాప్ ఆయుధ సంపత్తి దిగుమతుల్లో భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ల కంటే ముందుంది. ఆ దేశాల కంటే మూడు రెట్లు అధికంగానే ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అలాగే ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశంగా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. చైనా, పాక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆయుధాల సరఫరాపై స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... భారత్ భారీ ఆయుధాల దిగుమతులు 2004-08తో పోలిస్తే 2009-13 మధ్య కాలంలో 111 శాతం, పాకిస్థాన్ దిగుమతులు 119 శాతం పెరిగాయి. అలాగే అంతర్జాతీయంగా ఆయుధాల దిగుమతుల్లో భారత్ వాటా 7 నుంచి 14 శాతానికి పెరిగింది. ఇలా భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధ సంపత్తిలో 75 శాతం విక్రయించి రష్యా ప్రథమ స్థానంలో నిలవగా, 7 శాతం సరఫరాతో అమెరికా రెండో స్థానం దక్కించుకుంది. భారత్ తన సైనిక అవసరాలకు స్వదేశీ తయారీ పరిశ్రమ కంటే ఆయుధాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోందని సిప్రి ప్రస్తావించింది. వరల్డ్ వైడ్ వెబ్‌కు 25 ఏళ్లు వరల్డ్ వైడ్ వెబ్(www) మార్చి 12న పాతికేళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టింది. ఇంటర్నెట్లో ప్రస్తుతం ఒక వెబ్ బ్రౌజర్ నుంచే అనేక వెబ్‌పేజీలు మనం చూడగలుగుతున్నాం. దీనంతటికీ ఇంటర్నెట్ కారణమైనా.. దాని వెనక వరల్డ్ వైడ్ వెబ్ చేరడం వల్లే ఆన్లైన్ ప్రపంచం ఇంతగా సులభ సాధ్యమైంది. 1989లో బ్రిటిష్ శాస్త్రవేత్త టీమ్ బెర్నర్స్ లీ ప్రతిపాదనతో వరల్డ్ వైడ్ వెబ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీడలు ఇండియన్ వెల్స్ విజేత జొకోవిచ్ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. ఫైనల్లో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. జొకోవిచ్ కెరీర్లో ఓవరాల్‌గా ఇది 42వ టైటిల్. ఇందులో 17 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఆండ్రీ అగస్సీ (అమెరికా) సరసన జొకోవిచ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో రాఫెల్ నాదల్ (26 టైటిల్స్), ఫెడరర్ (21 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. విజయ్ హజారే విజేత కర్ణాటక దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. మార్చి 16న కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో రైల్వేస్‌ను ఓడించింది. ఈ విజయంతో కర్ణాటక ఈ ఏడాది వరుసగా మూడో టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పటికే రంజీ, ఇరానీ ట్రోఫీలలో విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి విజేత రోస్‌బర్గ్ ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. మాగ్నుసన్ (మెక్లారెన్) రెండో స్థానంలో నిలిచాడు. ఇదే రేసులో ఎఫ్1 చరిత్రలో పిన్న వయస్సులో (19 ఏళ్ల 10 నెలల 18 రోజులు) పాయింట్లు నెగ్గిన డ్రైవర్‌గా డానిల్ క్వియాట్ (రష్యా) రికార్డు నెలకొల్పాడు. హాకీ జూనియర్ ఉమెన్స చాంపియన్‌షిప్ హాకీ ఇండియా జూనియర్ ఉమెన్స చాంపియన్‌షిప్‌ను ఛత్తీస్‌గఢ్ గెలుచుకుంది. మైసూర్లో మార్చి 13న జరిగిన ఫైనల్లో కేరళను ఓడించింది. క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్ సచిన్ భారత మాజీ ఆటగాడు, మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌ను ‘క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్’ అవార్డుకు ఈఎస్పీఎన్-క్రిక్ ఇన్ఫో సంస్థ ఎంపిక చేసింది. ఇతర అవార్డుల విజేతలు: టెస్టు బ్యాటింగ్ అవార్డు: శిఖర్ ధావన్ (ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో 187 పరుగుల ఇన్నింగ్స్) వన్డే బ్యాటింగ్ అవార్డు: రోహిత్ శర్మ (ఆస్ట్రేలియాపై వన్డే డబుల్ సెంచరీ); తొలి ఏడాది అత్యుత్తమ ప్రదర్శన అవార్డు: షమీ (2013లో టెస్టులు, వన్డేలు కలిపి 47 వికెట్లు); ఉత్తమ టెస్టు బౌలింగ్ అవార్డు: మిచెల్ జాన్సన్ (7/40, ఇంగ్లండ్‌పై); ఉత్తమ వన్డే బౌలింగ్ అవార్డు: షాహిద్ ఆఫ్రిది (7/12, వెస్టిండీస్‌పై). అవార్డులు జ్ఞాన్ కొర్రేకు గొల్లపూడి అవార్డు గొల్లపూడి శ్రీనివాస్ (జీఎస్) మెమోరియల్ ఫౌండేషన్ అందజేసే జీఎస్ జాతీయ అవార్డు- 2013కు దర్శకుడు జ్ఞాన్ కొర్రే ఎంపికయ్యారు. గుజరాతీ సినిమా ‘ది గుడ్ రోడ్’కు దర్శకత్వం వహించినందుకుగాను కొర్రేను ఈ పురస్కారం వరించింది. భారతీయ అమెరికన్ విద్యార్థులకు ఇంటెల్ అవార్డులు ఇద్దరు భారతీయ అమెరికన్ విద్యార్థులు ఆనంద్ శ్రీనివాసన్(17), శౌన్ దత్తా(18) మార్చి 12న ప్రతిష్టాత్మక ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డులు గెలుచుకున్నారు. ఇంటెల్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ సైన్స్ అవార్డుల పోటీలో ఎనిమిది, పదో స్థానాలను వీరిద్దరూ కైవసం చేసుకున్నారు. అవార్డు కింద చెరో రూ. 12.23 లక్షల నగదును అందజేశారు. డీఎన్ఏలోని అతి సూక్ష్మ భాగాలను సైతం తెలుసుకునేందుకు ఉపయోగపడే ‘ఆర్‌ఎన్‌ఎన్‌స్కాన్’ అనే న్యూరల్ నెట్వర్క్ సంబంధిత కంప్యూటర్ మోడల్‌ను శ్రీనివాసన్ ఆవిష్కరించగా.. అణు పదార్థాల చర్యలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు దోహదపడే కంప్యూటర్ మోడల్స్‌ను, సూత్రాలను శౌన్ దత్తా అభివృద్ధిపర్చాడు. నలిమెల భాస్కర్‌కు సాహిత్య అకాడమీ అవార్డు ప్రముఖ కవి, భాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్‌కు ‘అనువాద సాహిత్యం’లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ప్రఖ్యాత మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన ‘స్మారక శిలగళ్’ నవలను ‘స్మారక శిలలు’ పేరుతో 2010లో భాస్కర్ తెలుగులోకి అనువదించారు. అవార్డు కింద రూ. 50 వేల నగదు, ప్రశంసా పత్రం బహూకరిస్తారు. సాహిత్య అకాడమీ ఈ పురస్కారాన్ని 1989 నుంచి 24 భాషల్లోని అత్యున్నత అనువాదాలకు అందజేస్తోంది. టోమస్ హలిక్‌కు టెంపుల్టన్ ప్రైజ్ చెక్కు చెందిన మతగురువు, మేధావి టోమస్ హలిక్‌కు 2014 టెంపుల్టన్ ప్రైజ్ లభించింది. పురస్కారాన్ని అందజేసే జాన్ టెంపుల్టన్ ఫౌండేషన్ మార్చి 13న ఈ విషయాన్ని ప్రకటించింది. అవార్డు కింద 1.1 మిలియన్ పౌండ్లు బహూకరిస్తారు. -
రాష్ట్రపతి పాలన - రాజ్యాంగం
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 41 ఏళ్ల తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు.. ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత ఏర్పడిన అనిశ్చితిని తొలగించడానికి రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్ర మంత్రి వర్గ సిఫార్సుకూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 2న ఆమోదం తెలిపారు.. దీంతో ఆంధ్రప్రదేశ్ పాలన వ్యవహారాలు గవర్నర్ నరసింహన్ చేతుల్లోకి వెళ్లాయి.. ఈ నేపథ్యంలో ‘రాష్ట్రపతి పాలన’ అంశం సమకాలీన ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాష్ట్రపతి పాలన అంటే ఏమిటి? ఏయే పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన అనివార్యం అవుతుంది? ఈ అంశానికి సంబంధించి రాజ్యాంగ స్ఫూర్తి ఎలా ఉంది? దీనిపై సుప్రీంకోర్టు తీర్పు, న్యాయ సమీక్ష తదితర అంశాలపై విశ్లేషణ.. భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో తమ అధికార, విధులను నిర్వర్తించాలి. సాధారణంగా ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకూడదు. కానీ దేశ ఐక్యత, సమగ్రత, రక్షణ దృష్ట్యా అనూహ్యమైన పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన అధికారాలకు ‘అత్యవసర అధికారాలు’గా పేరు పెట్టారు. రాజ్యాంగం 18వ భాగంలో ప్రకరణ 352 నుంచి 360 వరకు మూడు రకాల అత్యవసర అధికారాలను పేర్కొన్నారు. అవి.. 1. జాతీయ అత్యవసర పరిస్థితి (ప్రకరణ 352) 2. రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన (ప్రకరణ 356) 3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (ప్రకరణ 360) రాష్ట్రపతి పాలన విధింపు - కారణాలు ప్రకరణ 355 ప్రకారం ప్రతీ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అలాకాకుండా ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా పరిపాలన కొనసాగించడానికి అవకాశం లేనప్పుడు లేదా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిన పరిస్థితుల్లో.. గవర్నర్ పంపిన నివేదిక ద్వారా లేదా మరో విధంగా గానీ, రాష్ట్రపతి భావించినప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అలాగే ప్రకరణ 365 ప్రకారం కేంద్ర ఆదేశాలను రాష్ట్రాలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే కూడా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన విధించిన రోజు నుంచి రెండు నెలల్లోగా పార్లమెంట్ రాష్ట్రపతి పాలనను సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఆమోదించిన రోజు నుంచి ఆరు నెలల వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. అలా ప్రతి ఆరు నెలలకోసారి పార్లమెంట్ ఆమోదాన్ని పొందాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రపతి పాలనను మూడు సంవత్సరాలకు మించి కొనసాగనివ్వకూడదు. రాష్ట్రపతి పాలన - పరిణామాలు రాష్ట్రపతి పాలన విధించినప్పుడు చోటు చేసుకునే పరిణామాలు 1. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. 2. రాష్ట్ర విధాన సభను రద్దు చేయవచ్చు లేదా సుప్తచేతనావస్థలో ఉంచవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సుప్తచేతనావస్థలోనే ఉంచారు (అంటే అసెంబ్లీ రద్దు కాకుండా నిద్రాణ స్థితిలో ఉంటుంది). ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు అసెంబ్లీని తిరిగి పునరుద్ధరించవచ్చు. 3. రాష్ట్రపతి.. రాష్ట్ర పాలన బాధ్యతను స్వీకరించి దాన్ని గవర్నర్ ద్వారా నిర్వహిస్తాడు. 4. గవర్నర్‌కు సహకరించడానికి సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సలహాదారులుగా నియమిస్తారు. 5. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంట్, రాష్ట్రపతి ఆర్డినెన్స ద్వారా చట్టాలను రూపొందించవచ్చు. 6. రాష్ట్ర బడ్జెట్‌ను కూడా పార్లమెంట్ ఆమోదిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు - న్యాయసమీక్ష 1975లో చేసిన 38వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. రాష్ట్రపతి తన అభీష్టం మేరకు లేదా సంతృప్తి మేరకు ప్రకరణ 356ను ప్రయోగించవచ్చు. ఈ విషయంలో రాష్ట్రపతిదే తుది నిర్ణయం. ఆ నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించరాదు అనే ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ చేశారు. అయితే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తొలగించారు. ఆ మేరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు. న్యాయ సమీక్షకు అతీతం కాదు. ఈ మధ్యనే ఢిల్లీలో విధించిన రాష్ట్రపతి పాలనను ప్రశ్నిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దుర్వినియోగం-సమీక్ష అత్యవసర అధికారాలు సమాఖ్య వ్యవస్థకు ప్రమాదం తెస్తాయని, ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలను అణచివేస్తాయని, కేంద్రం నియంతృత్వంగా వ్యవహరించే అవకాశం ఉందని రాజ్యాంగ నిర్మాతలే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అటువంటి అభిప్రాయాలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్లు ఇచ్చిన సమాధానం..‘‘సమాఖ్య వ్యవస్థ కంటే జాతి శ్రేయస్సు మిన్న. చైతన్యవంతమైన ప్రజాభిప్రాయం, చురుగ్గా ఉన్న పార్లమెంట్ గల దేశంలో నియంతృత్వానికి చోటులేదు’’. ‘‘356వ అధికరణం దుర్వినియోగం కావచ్చు. అయినా అది అవసరమైన చెడు’’ అని టి.టి. కృష్ణమాచారి పేర్కొన్నారు. దేశ విభజన సందర్భంలో మతోన్మాదానికి లక్షలాది మంది అమాయకులు బలి అవుతున్న సమయం, జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ దండయాత్రతో ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో జాతి మనుగడకు అలాంటి అధికరణలు అవసరమని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. అందువల్లనే నజీరుద్దీన్ అహ్మద్ దాన్ని ‘రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన అంశం’ అని కొనియాడారు. ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి పటిష్టమైన ఏర్పాట్లు అవసరమని కె.సంతానం వంటి వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 63 ఏళ్ల అనుభవాలు.. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. 1950 నుంచి 2014 వరకు (కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా) సుమారు 120 కంటే ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఈ ప్రకరణను కేంద్రం రాజకీయ స్వప్రయోజనాలకే దుర్వినియోగం చేసిన సందర్భాలే ఎక్కువని ప్రతిపక్షాలు, రాజ్యాంగ నిపుణులు విమర్శించారు. 1977లో జనతాపార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలోని 9 రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది. 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం జనతాపార్టీ పాలన లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది. 1984లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి. రామారావు ప్రభుత్వాన్ని అకారణంగా బర్తరఫ్ చేసి మెజారిటీ లేని నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించడం దుర్వినియోగానికి పరాకాష్టగా పేర్కొనవచ్చు. రక్షణ కవాటంగా (సేఫ్ బై వాల్యూ)గా ఉద్దేశించిన ఈ అధికరణం ఆచరణలో కేంద్రానికి అయిష్టంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి ఉపయోగపడే రాజకీయ ఆయుధంగా మారడం దురదృష్టకరం. మృత శాసనమా లేదా మరణ శాసనమా? రాష్ట్రపతి పాలనను రాజ్యాంగంలో చేర్చడంపై రాజ్యాంగ పరిషత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దీనికి సమాధానం చెబుతూ ప్రకరణ.. 356 రాజ్యాంగంలో మృత శాసనంగా (డెడ్ ఆర్టికల్) ఉంటుందని, దీన్ని చాలా జాగ్రత్తగా, అతి తక్కువగా తుది ప్రత్యామ్నాయంగానే వినియోగిస్తారని భరోసా ఇచ్చారు. కానీ తర్వాతి కాలంలో దీనికి భిన్నంగా ఈ ప్రకరణ రాష్ట్రాల పాలిట మరణ శాసనంగా (డెత్ లెటర్)గా పరిణమించిందనేది జగమెరిగిన సత్యం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం పాలకులకు పరిపాటిగా మారిపోయింది. రాజ్యాంగం ప్రకారం రాజకీయ వ్యవస్థ నడవాలి. కానీ రాజ్యాంగాన్ని రాజకీయ అవసరాలకనుగుణంగా మార్చుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించడమే అవుతుంది. ప్రపంచ ప్రజాస్వామ్య రాజ్యాంగాల్లో మరెక్కడా లేని ఈ అధికరణను రాష్ట్రపతి ఉపయోగించే రోజు బాధాకరమైంది, అవమానకరమైంది అని రాజ్యాంగ పరిషత్ సభ్యుడు హెచ్.వి.కామత్ అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్ బొమ్మై కేసు - మార్గదర్శకాలు 1994లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఆర్ బొమ్మైకేసు సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కేసును ప్రకరణ 356 విషయంలో అత్యంత ప్రామాణికంగా పరిగణిస్తారు. గవర్నర్ నివేదిక రాష్ట్రంలోని వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి. వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించరాదు. రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అనే అంశాన్ని శాసనసభలో మాత్రమే పరీక్షించాలి. బల నిరూపణ కోసం ముఖ్యమంత్రికి తగిన సమయం ఇవ్వాలి. పార్లమెంట్.. రాష్ట్రపతి పాలనను ఆమోదించే వరకు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయరాదు. లౌకిక తత్వానికి విఘాతం కలిగించినా లేదా దాన్ని కాపాడలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకరణ 356 ప్రకారం రద్దు చేయవచ్చు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లడం వేరు, రాజ్యాంగపరమైన వైఫల్యం వేరు. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందనే సాకుతో రాష్ట్రపతి పాలన విధించడం సమంజసం కాదు. ప్రకరణ 356ను ప్రయోగించడాన్ని అంతిమ ప్రత్యామ్నాయంగానే చూడాలి. రాష్ట్రంలోని పరిస్థితులను చక్కబెట్టేందుకు రాజ్యాంగంలోని ఇతర ప్రత్యామ్నాయాలైన ప్రకరణ 256, 257లను కూడా ఉపయోగించాలి. రాష్ట్రపతి పాలనను దురుద్దేశంతో విధించినా లేదా రాష్ట్రపతి పాలన విధించడానికి సమంజసమైన కారణాలు లేకపోయినా న్యాయస్థానం జోక్యం చేసుకొని రాష్ట్రపతి ఆదేశాలను కొట్టివేయవచ్చు. రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రద్దు చేసిన ప్రభుత్వాన్ని, విధానసభను పునరుద్ధరిస్తారు. దేశంలో ఎప్పుడెప్పుడు? దేశంలో ఇప్పటి వరకూ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్రపతి పాలన ఏదో ఒక సందర్భంలో అమల్లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ రాష్ట్రపతి పాలన విధించలేదు. అన్నిటి కంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో 9 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత వరుసగా బీహార్, పంజాబ్‌లలో 8 పర్యాయాలు రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో 1954, నవంబర్ 15 నుంచి 1955, మార్చి 28 వరకు ఒక పర్యాయం రాష్ట్రపతి పాలన విధించారు. సారా వ్యతిరేకోద్యమం, ఆనాటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. 1973లో జై ఆంధ్ర ఉద్యమ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు రాజీనామాతో 1973, జనవరి 11 నుంచి డిసెంబర్ 10 వరకు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ) రాష్ట్రపతి పాలన విధించారు. బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
‘లా’కు చక్కటి మార్గం లాసెట్..
ప్రస్తుతం సమున్నత వృత్తిగా లీగల్ ప్రొఫెషన్ వెలుగొందుతోంది. మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్పెషలైజేషన్లతో కళకళలాడుతోంది. బ్యాంకింగ్, బీమా, టెలికం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్.. ఇలా చాలా విభాగాల్లో న్యాయ సేవల అవసరం పెరిగింది. ఆ అవసరమే కొత్త కొలువులను అందుబాటులోకి తెస్తోంది. దీంతో లా కెరీర్.. యువత ఆకర్షణీయ కెరీర్ ఆప్షన్ల జాబితాలోకి చేరింది. లాసెట్-2014 లాసెట్ (లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్). ఈ పరీక్ష ద్వారా మూడేళ్ల బీఎల్/ఎల్ఎల్బీ కోర్సు, ఐదేళ్ల ఎల్ఎల్బీ/బీఎల్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అర్హత: మూడేళ్ల లా కోర్సుకు 10+2+3 విధానంలో 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్(10+2 విధానంలో). ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కులు సడలింపు ఉంటుంది. పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మూడేళ్ల కోర్సుకు, ఐదేళ్ల కోర్సుకు సిలబస్ ఒకటే అయినప్పటికీ, ఎంపిక చేసుకున్న కోర్సును బట్టి ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. ఐదేళ్ల లా ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో, మూడేళ్ల లా ప్రశ్నపత్రం డిగ్రీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రశ్నపత్రంలో 120 ప్రశ్నలు మూడు విభాగాల్లో ఉంటాయి. 90 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. విభాగం ప్రశ్నల సంఖ్య మార్కులు 1.జనరల్ నాలెడ్డ్, మెంటల్ ఎబిలిటీ 30 30 2.కరెంట్ అఫైర్స్ 30 30 3.లా ఆప్టిట్యూడ్ 60 60 సిద్ధమవ్వండిలా: కరెంట్ అఫైర్స్ తేలికైన విభాగం. తక్కువ శ్రమతోనే ఎక్కువ మార్కులు సాధించేందుకు వీలుకల్పిస్తుంది. ఇందులో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ ముఖ్య పరిణామాలపై ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలు ఏదో ఒక రంగానికి పరిమితం కాకుండా సామాజిక, ఆర్థిక, సదస్సులు, అవార్డులు, ఐరాస నివేదికలు, నియామకాలు, ముఖ్య వ్యక్తులు వంటి అంశాల నుంచి వస్తాయి. ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే ప్రామాణిక దినపత్రికలు చదవాలి. జనరల్ నాలెడ్జ్ విషయానికొస్తే స్టాండర్డ్ జీకేను ప్రిపేర్ కావడం మంచిది. ఈ క్రమంలో అవార్డులు, ప్రథమ వ్యక్తులు, గ్రంథాలు-రచయితలు, సంస్థలు-ఏర్పాటు చేసిన సంవత్సరం, భారత రాజ్యాంగం వంటి అంశాలను చదవాలి. మెంటల్ ఎబిలిటీలో ప్రశ్నల క్లిష్టత ఇతర పోటీ పరీక్షల స్థాయి కంటే కొద్దిగా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విభాగం కోసం అనాలజీ, నంబర్ సిరీస్, అల్ఫాబెట్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్ వంటి అంశాలను ప్రాక్టీస్ చేయాలి. న్యాయ విద్య అభ్యసించేందుకు అవసరమయ్యే ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలు వస్తాయి. ప్రాథమిక న్యాయ సూత్రాలు, భారత రాజ్యాంగం తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి. : ఐక్యరాజ్య సమితిలోని సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యుల సంఖ్య ఎంత? ఎ) ఐదు బి) మూడు సి) ఏడు డి) రెండు పీజీ లాసెట్ పీజీ లాసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష ద్వారా ఎల్ఎల్ఎం/ఎంఎల్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అర్హత: ఎల్ఎల్బీ/బీఎల్ ఉత్తీర్ణులు. పరీక్ష విధానం: మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. వ్యవధి: 90 నిమిషాలు. ప్రశ్నపత్రంలో రెండు పార్ట్లు ఉంటాయి. పార్ట్-ఎలో భాగంగా జ్యూరిస్ ప్రుడెన్స్‌పై 20, కాన్స్టిట్యూషనల్ లాపై 20 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-బిలో మర్కెంటైల్ లా; లేబర్ లా; పబ్లిక్ ఇంటర్నేషనల్ లా; క్రైమ్స్ అండ్ టార్ట్స్; ఐపీఆర్, ఇతర లాలకు సంబంధించిన ఒక్కో అంశంపై 16 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంటర్వ్యూ - లాసెట్ కన్వీనర్ లాసెట్, పీజీ లాసెట్-2014 కన్వీనర్ వి.ఆర్.సి.కృష్ణయ్యతో భవిత ప్రత్యేక ఇంటర్వ్యూ... ప్రస్తుతం లా కోర్సులు పూర్తిచేసిన వారికి కెరీర్ పరంగా ఎలాంటి అవకాశాలున్నాయి? లా కోర్సులు పూర్తిచేసిన వారికి ఆకాశమే హద్దుగా అవకాశాలున్నాయి. దేశవ్యాప్త న్యాయస్థానాల్లో విసృ్తత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. న్యాయవాదులుగా, నాయమూర్తులుగా అంచెలంచెలుగా ఉన్నతావకాశాలు అందుకోవచ్చు. ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో ప్రతి సంస్థకూ న్యాయ సలహాదారుల అవసరం ఏర్పడుతోంది. అందువల్ల ఆ సంస్థలు లా కోర్సులు పూర్తిచేసిన వారిని నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో లా ఆఫీసర్లుగా, ప్రభుత్వ అడ్వొకేట్లుగా, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా కెరీర్‌ను ప్రారంభించడానికి అవకాశాలున్నాయి. లాను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు ఎలాంటి నైపుణ్యాలు అవసరం? లాను కెరీర్‌గా ఎంపిక చేసుకోవాలనుకునే వారికి సమయస్ఫూర్తి, చురుకుదనం, భాషపై పట్టు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఈ ఏడాది లాసెట్, పీజీ లాసెట్‌కు ఎంతమంది దరఖాస్తు చేసుకునే అవకాశముంది? గతేడాది మూడేళ్ల బీఎల్/ఎల్ఎల్బీ కోర్సుకు 17,653 మంది, ఐదేళ్ల బీఎల్/ఎల్ఎల్బీ కోర్సుకు 4,596 మంది, పీజీ లాసెట్‌కు 1712 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది వరుసగా బీఎల్/ఎల్ఎల్బీ కోర్సుకు 25 వేల మంది, పీజీకి రెండు వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశముంది. గతంలో ఓపెన్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించలేదు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏమైనా మార్పులున్నాయా? లా కోర్సుల్లో చేరాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 10+2+3 విద్యార్హతలు తప్పనిసరి. ఓపెన్ యూనివర్సిటీ విధానంలో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉంటేనే లాసెట్ రాయడానికి అర్హులు. పదో తరగతి, డిగ్రీ పూర్తయ్యాక ఇంటర్‌ను పూర్తిచేసిన లాసెట్ రాయడానికి అర్హులు కారు. రాష్ట్రవ్యాప్త కళాశాలలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి? మూడేళ్ల బీఎల్ కోర్సుకు ఏడు యూనివర్సిటీ కళాశాలలో 450 సీట్లు, 42 ప్రైవేటు కళాశాలలో 7,060 సీట్లు ఉన్నాయి. ఐదేళ్ల బీఎల్ కోర్సుకు ఆరు యూనివర్సిటీ కళాశాలలో 370 సీట్లు, 31 ప్రైవేటు కళాశాలలో 2,960 సీట్లు ఉన్నాయి. పీజీ (ఎల్ఎల్ఎం/ఎంఎల్) కోర్సుకు 9 యూనివర్సిటీ కళాశాలలో 475 సీట్లు, 14 ప్రైవేటు కళాశాలలో 480 సీట్లు అందుబాటులో ఉన్నాయ. - బి.హరిమల్లికార్జునరెడ్డి, న్యూస్‌లైన్. ఎస్వీయూ, తిరుపతి. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 12, 2014. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2014. అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2014. వెబ్సైట్: www.aplawcet.org ఇటీవల లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (లాసెట్), పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీ లాసెట్)- 2014 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సెట్లను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. -
వ్యక్తిత్వ పరీక్షలో విజయం సాధించాలంటే..
ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇతర సెంట్రల్ సర్వీసుల (గ్రూప్ ఏ, గ్రూప్ బీ) కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2013 మెయిన్స్ ఫలితాలను మార్చి 11న యూపీఎస్సీ విడుదల చేసింది. దాదాపు మూడు వేల మంది పర్సనాలిటీ టెస్ట్ (మౌఖిక పరీక్ష) దశకు ఎంపికయ్యారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి జరగనున్న నేపథ్యంలో ఇందులో విజయం కోసం తుది దశ ప్రిపరేషన్ వ్యూహాలు.. ప్రఖ్యాత మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హాన్స్ ఐసెంక్ ప్రకారం Personality (మూర్తిమత్వం లేదా వ్యక్తిత్వం) అనేది వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులను తెలిపేది. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థులు తనకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించగలరా? లేదా? అనేదాన్ని తెలుసుకోవడమే పర్సనాలిటీ పరీక్ష ఉద్దేశం. ఇంటర్వ్యూ బోర్డు.. భిన్న ప్రశ్నల ద్వారా అభ్యర్థి మేధస్సును మాత్రమే కాకుండా అతని మానసిక సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. సివిల్స్ పరీక్ష మొత్తం 2,025 మార్కులకు ఉంటే అందులో 275 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించారు. నచ్చిన సర్వీస్, కేడర్ చేజిక్కాలంటే ఇంటర్వ్యూలో అధిక మార్కులు సాధించాలి. ఇంటర్వ్యూలో సాధించే ప్రతి మార్కూ అభ్యర్థి భావి కెరీర్‌ను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పర్సనాలిటీ పరీక్షలో విజయం సాధించేందుకు అభ్యర్థులకు ఉపయోగపడే మార్గాలు... అకడమిక్ అంశాలు ప్రధానం అభ్యర్థి గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన అంశాలపై పర్సనాలిటీ పరీక్షలో ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది. మెడిసిన్, ఇంజనీరింగ్, కామర్స్ ఇలా రకరకాల అకడమిక్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు ప్రజా సేవలో ఆయా రంగాల ఆవశ్యకత ఏమిటనే కోణంలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎంబీబీఎస్ నేపథ్యం ఉన్న అభ్యర్థిని ఇలా ప్రశ్నించవచ్చు... ‘‘ఒక జిల్లా కేంద్ర ఆసుపత్రిలో లంచాలు ఇవ్వందే వైద్య సేవలు అందడం లేదని, ప్రతి విభాగంలోనూ అవినీతి మేటలు వేసిందంటూ ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. నువ్వే కనుక జిల్లా వైద్యాధికారిగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటావు’’? సామాజిక సమస్యలపై అవగాహన పేదరికం, నిరుద్యోగం, వరకట్నం, మత ఘర్షణలు, లింగ వివక్ష వంటి ఎన్నో సమస్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ఇలాంటి వాటిపై అభ్యర్థి ఎలా స్పందిస్తాడు? ఒక సమస్యను ఎదుర్కొనేందుకు తగిన మానసిక దారుఢ్యంతో పాటు ఆ సమస్య పరిష్కారానికి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అభ్యర్థికి ఉందా? అనేదాన్ని బోర్డు సభ్యులు పరిశీలిస్తారు. ఇదే కోణంలో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అందువల్ల ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. వర్తమాన అంశాలు అభ్యర్థులు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ సమకాలీన అంశాలపై పట్టుసాధించాలి. రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా రాష్ట్ర విభజనకు సంబంధించి చోటుచేసుకుంటున్న సంఘటనలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ఉదా: చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి సాధ్యమని కొందరు వాదిస్తున్నారు. అలాంటప్పుడు ఈశాన్య రాష్ట్రాలు చిన్నవిగా ఉన్నప్పటికీ ఎందుకని అభివృద్ధి చెందడం లేదు? మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు పెద్దవిగా ఉన్నప్పటికీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి కదా? అనే ప్రశ్న ఎదురుకావొచ్చు. కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువ తగ్గుదల వంటి ఆర్థిక సమస్యల్ని అధ్యయనం చేయాలి. దేశాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సాధించాల్సిన సమతుల్యతను పరిశీలించాలి. పొరుగుదేశాలతో భారత్ సంబంధాలతో పాటు సిరియా, ఉక్రెయిన్, అఫ్ఘానిస్థాన్‌లో అస్థిర పరిస్థితులను అధ్యయనం చేయాలి. ఆయా దేశాల్లోని పరిణామాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. నైతిక విలువలు నైతిక విలువల (Moral Values)తో కూడిన ప్రజా పాలన అద్భుత ఫలితాలు ఇస్తుంది. నైతిక విలువలు ఉన్న వ్యక్తి తన మాటల ద్వారా, పనుల ద్వారా చుట్టూ ఉండే సమాజాన్ని ప్రభావితం చేయగలడు. ప్రజా పాలనలో కీలకంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులు ఈ విలువలు కలిగి ఉండటం అత్యవసరం. ఈ నేపథ్యంలోనే సివిల్స్ జనరల్ స్టడీస్‌లో నైతిక విలువలపై ప్రత్యేకంగా పేపర్‌ను ప్రవేశపెట్టారు. పర్సనాలిటీ టెస్ట్‌లో కూడా అభ్యర్థి నైతిక ప్రవర్తనను పరీక్షించేలా బోర్డు నుంచి ప్రశ్నలు ఎదురుకావొచ్చు. అందువల్ల ప్రభుత్వ పాలనలో నైతికత కోణంలో అభ్యర్థులు మౌఖిక పరీక్షకు సిద్ధమవాలి. సాఫ్ట్ స్కిల్స్ చుట్టూ ఆత్మస్థైర్యం, వేగంగా కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, భావ వ్యక్తీకరణ సామర్థ్యం, విశ్లేషణా సామర్థ్యం, బృంద స్ఫూర్తి, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు ఎదురవుతాయి. ఇలాంటి వాటికి సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పుడు అభ్యర్థి నిజాయితీగా, సమయస్ఫూర్తితో, ఒత్తిడికి తావు లేకుండా ప్రశాంత చిత్తంతో సమాధానాలు ఇవ్వాలి. ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకుంటే తెలియదని నిజాయితీగా అంగీకరించాలి. అంతేగానీ ఏదోఒకటి చెప్పి, మసిపూసి మారేడుకాయ చేయకూడదు. ప్రశ్నను బాగా వినాలి. బిగ్గరగా అరిసేటట్లు కాకుండా నిదానంగా అందరికీ వినిపించేలా సమాధానం చెప్పాలి. ఆ సమాధానంలో ఆత్మ విశ్వాసం తొణికిసలాడాలి. అభిరుచులు (Hobbies) పర్సనాలిటీ పరీక్షలో తప్పనిసరిగా అభ్యర్థి అభిరుచులకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యర్థులు పుస్తక పఠనం, క్రికెట్ ఆడటం, కవితలు రాయడం.. ఇలా రకరకాల అభిరుచులను బయోడేటాల్లో పేర్కొంటారు. వీటికి సంబంధించి వివిధ కోణాల్లో సమాచారం తెలుసుకోవాలి. ఇష్టమైన విషయానికి సంబంధించిన సమాచారం తెలియకపోతే, మిగిలిన విషయాలపై ఆసక్తి ఏముంటుంది? అని బోర్డు అభిప్రాయపడే అవకాశముంది. బోర్డు సభ్యుల్లో తప్పనిసరిగా ఒక సైకాలజిస్టు ఉంటారు. ఆయన అభ్యర్థి హావభావాలను నిశితంగా గమనిస్తాడు. సమాధానం చెప్పేతీరును పరిశీలిస్తాడు. అందువల్ల కూర్చొనే తీరులోనూ, మాట్లాడే విధానంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. బోర్డు సభ్యులు... అభ్యర్థి తన భావాలను స్వేచ్ఛగా చెప్పగలిగేలా అనువైన వాతావరణాన్ని ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి ఒత్తిడికి గురి కావాల్సిన పనిలేదు. అభ్యర్థి నుంచి ఇంటర్వ్యూ బోర్డు ఆశించే అంశాలు భావ వ్యక్తీకరణలో స్పష్టత. విశ్లేషణ సామర్థ్యం. సామాజిక, ఆర్థిక సమస్యలపై అవగాహన. వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. నైతిక విలువలు, నిజాయితీ. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం. ఆత్మ స్థైర్యం. గుర్తుంచుకోండి: మెయిన్స్‌లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు కూడా వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల ఆప్షనల్‌కు సంబంధించిన సమకాలీన అంశాలను అధ్యయనం చేయాలి. సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థి ఎంపిక చేసుకున్న టాప్ 3 సర్వీస్‌ల ప్రాధాన్యాన్ని, వాటి వర్తమాన అంశాలను తెలుసుకోవాలి. మాక్ ఇంటర్వ్యూలకు హాజరు కావడం వల్ల ఒక ప్రశ్నకు సమాధానం ఎలా చెబుతున్నాం? బలాలు, బలహీనతలేంటి? వంటి విషయాలను గుర్తించి, సరిదిద్దు కోవచ్చు. ఒక విషయంపై స్నేహి తులతో చర్చించి, వారి ద్వారా కచ్చితమైన ఫీడ్‌బ్యాక్ తీసు కోవాలి. రిఫరెన్స్: ఒకట్రెండు తెలుగు, హిందూ దినపత్రికను చదవాలి. ముఖ్యమైన అంశాలపై సొంత, ప్రభావవంతమైన అభిప్రాయాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. సంపాదకీయాలను (Editorials) తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. లోక్‌సభ టెలివిజన్, రాజ్యసభ టెలివిజన్, ఎన్డీటీవీ, సీఎన్ఎన్-ఐబీఎన్ వంటి చానళ్లలో సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలపై చర్చా కార్యక్రమాలు ప్రసారమవుతుంటాయి. వీటిని పరిశీలించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల అధికారిక వెబ్ైసైట్లలో ఆయా శాఖల వర్తమాన అంశాలు అందుబాటులో ఉంటాయి. టాపర్స్ టాక్.. తీయదనం అనే పదం సులభమైందే అయినా దాన్ని నిర్వచన రూపంలో వ్యక్తం చేయడం కష్టం. Personolity (మూర్తిమత్వం లేదా వ్యక్తిత్వం) కూడా అంతే! అలాంటి ‘పర్సనాలిటీ’ ని పరీక్షించేందుకు బోర్డు సభ్యులు రకరకాల ప్రశ్నలతో అభ్యర్థి మనస్సును మథిస్తారు. ఆ మథనం నుంచి స్వచ్ఛమైన వెన్నలాంటి వ్యక్తిత్వం బయటపడేలా అభ్యర్థి సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉండేందుకు ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ జె.మేఘనాథ్‌రెడ్డి సూచనలు.. సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్ అనేది కేవలం ప్రశ్న-సమాధానం రూపంలో ఉండే మౌఖిక పరీక్ష కాదు.. ఒకరి వ్యక్తిత్వాన్ని ఆసాంతం పరీక్షించేదన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షకు సిద్ధమవాలి. అభ్యర్థులు వెర్బల్, నాన్ వెర్బల్ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు సమ ప్రాధాన్యమివ్వాలి. సరళమైన పదాలను ఉపయోగిస్తూ సూటిగా, క్లుప్తంగా సమాధానం చెప్పడం ఎంత ప్రధానమో.. సమాధానం చెప్పేటప్పుడు కనిపించే ముఖ కవళికలు, హావభావాలు, స్వర స్థాయి, చూపులో తీక్షణత సరిగా ఉండటం కూడా ముఖ్యం. మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం, రోజూ కొంత సమయం అద్దం ముందు నిలబడి మాట్లాడటం ద్వారా ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. అభ్యర్థులు బయో డేటా (Summary Sheet)లో పేర్కొన్న ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, వాటిపై ఎలాంటి ప్రశ్న ఎదురైనా చెప్పగలిగేలా ఉండాలి. స్వస్థలం, విద్యార్హతలు, పని అనుభవం, అభిరుచులు తదితరాల నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగేందుకు అవకాశముందో విశ్లేషించుకోవాలి. అభిరుచులు, విద్యార్హతలకు సంబంధించి అనాసక్తి కనబరచడాన్ని బోర్డు తీవ్రంగా పరిగణిస్తుందన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సాధారణంగా పలానా బోర్డు మంచిదని, పలానా బోర్డు మంచిది కాదనే అపోహలు షికారు చేస్తుంటాయి. ఇలాంటి వాటిని పట్టించుకోకూడదు. అన్ని ఇంటర్వ్యూ బోర్డులూ మంచివే. అభ్యర్థులు చెప్పే సమాధానంలో నిజాయితీ, నాణ్యత, తార్కికత ప్రతిబింబించాలి. అలాంటి సమాధానం బోర్డు సభ్యులను ఆకట్టుకుంటుంది. -
పూల వ్యాపారి కొడుకు.. మెడికల్ పీజీ టాపర్
లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో పాటు దారిలో ఎదురయ్యే చేదు అనుభవాలను తట్టుకునే మనోనిబ్బరం కూడా చాలా అవసరం.. అప్పుడే ఎంతటి కఠిన లక్ష్యమైనా మనకు దాసోహమవుతుందంటున్నారు కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కామ్‌డెక్) పీజీసెట్ ఫస్ట్ ర్యాంకర్ టి.అనూష్బాబు. ఆయన విజయ ప్రస్థానం ‘భవిత’తో పంచుకున్నారు.. మాది కాకినాడ. నాన్న కృష్ణ పూల వ్యాపారి. అమ్మ వెంకటరమణ గృహిణి. తమ్ముడు గౌతమ్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి, ప్రస్తుతం వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తమ సంతానంలో ఒక్కరైనా డాక్టర్ కావాలనే కోరిక అమ్మానాన్నల్లో ఉండేది. అక్క అంతగా ఆసక్తి చూపలేదు. నాకు మాత్రం చిన్నప్పటి నుంచి జీవశాస్త్రం సబ్జెక్టు అంటే చాలా ఇష్టం. దీంతో అమ్మానాన్న నన్ను గొప్ప డాక్టర్‌ను చేయాలని అనుకున్నారు. ఆ దిశగా నన్ను ప్రోత్సహించారు. ఇంటర్మీడియెట్ తర్వాత మెడిసిన్‌లో సీటు రాకపోవడం వల్ల రెండేళ్లు విరామం వచ్చింది. ఈ సమయంలో కొందరు ‘ఎన్ని సార్లు దండయాత్ర చేస్తావంటూ’ సూటిపోటి మాటలనేవారు. అయితే అమ్మానాన్నల ప్రోత్సాహం, మంచి ర్యాంకుతో నిట్‌లో సీటు సంపాదించిన తమ్ముడి స్ఫూర్తితో కష్టపడి చదివాను. ఎంసెట్‌లో 2,196 ర్యాంకు వచ్చింది. కానీ, సీటు కేటాయింపు ఆలస్యం కావడంతో, కర్ణాటక సెట్లో 1160 ర్యాంకు రావటంతో అటు వెళ్లిపోయాను. మెడిసిన్ దిశగా అడుగులు: మంగళూరులోని కేఎస్ హెగ్డే మెడికల్ అకాడమీలో ఎంబీబీఎస్‌లో చేరాను. ఐదున్నరేళ్ల ఈ కోర్సును 67.5 శాతం మార్కులతో పూర్తిచేశాను. ఎంత మంచి స్కోర్‌తో ఎంబీబీఎస్ పూర్తిచేసినా, పోస్టు గ్రాడ్యుయేషన్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేయకపోతే ప్రయోజనం ఉండదు. అందుకనే ఎంబీబీఎస్ ఫస్టియర్ నుంచే సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ప్రయత్నించా. ఏ ఏడాది కోర్సులను ఆ ఏడాదే పూర్తిచేశాను. పీజీ చేయడానికి జిప్మర్ ఎంట్రన్స్ కోసం బాగా శ్రమించా. అయితే ఆ పరీక్షను సరిగా రాయలేకపోయా. ఆ ప్రిపరేషన్ కామ్‌డెక్ పీజీసెట్‌కు ఉపయోగపడింది. ఇందులో 180 మార్కులకు 145 మార్కులు సాధించి మొదటి ర్యాంకు చేజిక్కించుకున్నాను. పటిష్ట ప్రణాళిక తోడుగా: ఎంబీబీఎస్ సీటు సాధించే క్రమంలో ఎదురైన ఆటుపోట్లను దృష్టిలో ఉంచుకొని, పీజీ సీటు కోసం మొదటి నుంచి ఏకాగ్రతతో చదివాను. ఎంబీబీఎస్ పూర్తికాగానే పీజీ సీటు సంపాదించడం తపస్సు లాంటిది. సీటు రాకుంటే పడే వేదన వర్ణనాతీతం. మధ్యలో విరామం లేకుండా పీజీ పూర్తిచేయాలి. ఒకసారి మార్గం తప్పితే, గాడిలో పడటం చాలా కష్టం. అందుకే రోజూ 14 గంటల పాటు చదివేవాణ్ని. పీజీ ఎంట్రన్స్‌లో 19 సబ్జెక్టులుంటాయి. అందువల్ల అందుబాటులో ఉన్న సమయాన్ని, సబ్జెక్టుల వారీగా విభజించుకొని చదివాను. ‘‘అమ్మానాన్న ఇచ్చిన ప్రోత్సాహం వల్లే మొదటి ర్యాంకు సాధించగలిగాను. పీజీ రేడియాలజీలో చేయాలా? లేదంటే జనరల్ మెడిసిన్‌లో చేయాలా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ జనరల్ మెడిసిన్‌లో చేరితే, అంకాలజీ స్పెషలైజేషన్ తీసుకుంటాను. పరిశోధనల రంగంపైనా ఆసక్తి ఉంది’’ - టి.అనూష్బాబు -
ఐఐఏ అందిస్తున్న కోర్సుల వివరాలు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ) అందిస్తున్న కోర్సుల వివరాలు తెలపండి? - రఘు, మచిలీపట్నం. ఇగ్నో భాగస్వామ్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ- బెంగళూరు).. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ+పీహెచ్డీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సు ఫిజిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్ సబ్జెక్టులలో అందుబాటులో ఉంది. ఈ కోర్సులో చేరేందుకు సైన్స్ లేదా ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఐఐఏ.. ఆస్ట్రనామికల్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంటెక్+ పీహెచ్డీ (టెక్) కోర్సును అందిస్తోంది. అర్హత: ఆప్టిక్స్ అండ్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ లేదా రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీటెక్. ఫిజిక్స్/ఎలక్ట్రానిక్ సైన్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/ అప్లయిడ్ ఫిజిక్స్‌లో ఎంఎస్సీ పూర్తిచేసిన వారు కూడా అర్హులు. ఐఐఏ.. ప్రత్యేకంగా పీహెచ్డీ ప్రోగ్రామ్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.iiap.res.in జిప్మర్- పుదుచ్చేరి.. అందిస్తున్న కోర్సుల వివరాలు తెలియజేయండి? - భవాని, నల్గొండ. జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) వివిధ రకాల కోర్సులను అందిస్తోంది. బీఎస్సీ: నర్సింగ్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, మెడికల్ రేడియో థెరఫీ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, పెర్ఫ్యూజన్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, న్యూరో టెక్నాలజీ, కార్డియాక్ లేబొరేటరీ టెక్నాలజీ. అర్హత: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2. పోస్ట్ బీఎస్సీ (నర్సింగ్): క్రిటికల్ కేర్ నర్సింగ్, కార్డియాక్ థొరాసిక్ నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ నర్సింగ్, అంకాలజీ నర్సింగ్, నియోనటల్ నర్సింగ్. ఈ కోర్సులను ఏడాది కాల వ్యవధితో అందిస్తున్నారు. ఎంఎస్సీ: మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎల్టీ-మైక్రోబయాలజీ, మెడికల్ బయోమెట్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ఎంఎల్టీ సైటో పాథాలజీ, మెడికల్ ఫిజియాలజీ, మెడికల్ సర్జికల్ నర్సింగ్ కోర్సు, చైల్డ్ హెల్త్ నర్సింగ్ వంటి కోర్సులున్నాయి. మెడికల్ రికార్డ్ ఆఫీసర్, మెడికల్ రికార్డ్ ట్రైనీ, పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్, బ్లడ్ బ్యాంకింగ్ టెక్నాలజీ వంటి స్పాన్సర్డ్ లేదా సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాలు: ఉమ్మడి ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్:jipmer.edu.in ఇంజనీరింగ్ ఫిజిక్స్‌లో బీటెక్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి? - వంశీ, వరంగల్. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి ప్రక్రియలో ఇమిడియున్న ఫిజిక్స్..ఇంజనీరింగ్ ఫిజిక్స్. ఇది ప్రత్యేకించి ఒక బ్రాంచ్‌కు మాత్రమే పరిమితం కాదు. అప్లయిడ్ ఫిజిక్స్ భావనలు విభిన్న అంశాల్లో పరిశోధనలకు ఉపయోగపడతాయి. కోర్సుల వివరాలు: ఐఐటీ, ఢిల్లీ.. బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+ 2. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు కరిక్యులంలో ఫిజికల్ కెమి స్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఆఫ్ మెటీరియల్స్, కంప్యూటర్ సైన్స్, మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్, గ్రాఫిక్ సైన్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్ తదితర అంశాలుంటాయి. వెబ్సైట్: physics.iitd.ac.in ఐఐటీ, బాంబే.. బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.phy.iitb.ac.in -
అత్యున్నత కెరీర్‌కు మార్గం సుగమం చేసే ఐసెట్
గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులకు అత్యున్నత కెరీర్ దిశగా మార్గం సుగమం చేసే కోర్సుల్లో ప్రధానమైనవి.. ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్), ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులు. మారుతున్న ఉద్యోగా వసరాలకనుగుణంగా జాబ్ మార్కెట్ డిమాండ్ మేరకు సాంకేతిక, వ్యాపార నైపుణ్యాన్ని అందించే ఈ కోర్సుల్లో చేరడానికి ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)..ఈ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాన్ని ఖరారు చేసుకోవచ్చు. 2014 సంవత్సరానికి ఐసెట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ప్రిపరేషన్ ప్లాన్, నిర్వహణ తీరుతెన్నులపై ఐసెట్ కన్వీనర్ ఇంటర్వ్యూ, తదితర వివరాలు.. అభ్యర్థిలోని వెర్బల్ (శాబ్దిక), మ్యాథమెటికల్ (గణిత) నైపుణ్యాలను ఒక క్రమ పద్ధతిలో పరీక్షించడానికి ఉద్దేశించిన పరీక్ష ఐసెట్. ఇందులో కచ్చితత్వానికి ప్రాధాన్యతనిస్తారు. పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. మొత్తం 200 మార్కులకు మూడు విభాగాలుగా పరీక్షను నిర్వహిస్తారు. వివరాలు.. విభాగం మార్కులు సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ డేటా సిఫీషియన్సీ 20 ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ అర్థమెటిక్ ఎబిలిటీ 35 ఆల్జీబ్రాకల్ అండ్ జీయో మెట్రికల్ ఎబిలిటీ 30 స్టాటిస్టికల్ ఎబిలిటీ 10 సెక్షన్-సి: కమ్యూనికేషన్ ఎబిలిటీ వొకాబ్యులరీ 10 బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ 10 ఫంక్షనల్ గ్రామర్ 15 రీడింగ్ కాంప్రెహెన్షన్ 15 మొత్తం 200 సమయం 150 నిమిషాలు ప్రిపరేషన్ ప్లాన్: కమ్యూనికేషన్ ఎబిలిటీ: కమ్యూనికేషన్ ఎబిలిటీ విభాగాన్ని తీసుకుంటే ఇది ప్రధానంగా అభ్యర్థిలోని ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించింది. ఇందులోని ప్రశ్నలు వొకాబ్యులరీ, ఫంక్షనల్ గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్ ఆధారంగా ఉంటాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.. వొకాబ్యులరీ విభాగంలో సమాధానం గుర్తించాలంటే ఇంగ్లిష్ భాషలో నైపుణ్యం, పట్టు సాధించడం తప్పనిసరి. అంతేకాకుండా గ్రామర్‌కు సంబంధించిన ప్రాథమిక నియమాలు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇడియమ్స్, ఫ్రేజెస్, సీక్వెన్సెస్ ఆఫ్ టెన్సెస్, వెర్బ్ ప్యాట్రన్స్, కొశ్చన్ ట్యాగ్స్, ఇఫ్ కండిషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ సెంటెన్సెస్ వంటి అంశాలపై అధికంగా దృష్టి సారించాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో ఇచ్చిన ప్యాసేజ్ను ముందుగా చదవి.. దాని నేపథ్యాన్ని విశ్లేషిస్తూ అవగాహన చేసుకోవాలి. తద్వారా సమాధానాలు గుర్తించడం సులభమవుతుంది. ప్రతిరోజూ ఇంగ్లిష్ దినపత్రికలు, మ్యాగజీన్లు చదవడం ద్వారా ఈ విభాగంలో పట్టు సాధించవచ్చు. కమ్యూనికేషన్ ఎబిలిటీలోని మరో విభాగం బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ. ఇందులో బిజినెస్, కంప్యూటర్ టెర్మినాలజీ నుంచి ఐదు ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఈ ప్రశ్నలు ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక అవగాహనను పరీక్షించే స్థాయిలో ఉంటాయి. కంప్యూటర్, బిజినెస్ రంగానికి సంబంధించి అబ్రివేషన్స్ తెలిసి ఉండా లి. ఈ విభాగం కోసం గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ అందులోని అంశాలాధారంగా మార్కెట్లో లభించే ప్రామాణిక పుస్తకాలను చదవాలి. మ్యాట్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం ప్రయోజనకరం. ఈ విభాగాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇందులో కనీసం 30కి పైగా మార్కులు సాధిస్తేనే మంచి ర్యాంకు సాధించవచ్చు. ప్రిపరేషన్ దృష్ట్యా కూడా ఈ విభాగం చాలా సులువైంది. ఎందుకంటే ఇందులోని ప్రశ్నలను సాధించడానికి తార్కికత అవసరం లేదు. చక్కని స్కోరింగ్ చేయడానికి ఈ విభాగాన్ని ఉపయోగించుకోవచ్చు. అనలిటికల్ ఎబిలిటీ: ఇందులో డేటా సిఫీషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే రెండు ఉప విభాగాలు ఉంటాయి. డేటా సఫిషియన్సీలో ప్రతి ప్రశ్నకు ఐ,ఐఐ అనే రెండు స్టేట్మెంట్లు ఇస్తారు. వీటి ఆధారంగా సమాధానం గుర్తించాలి. ఈ క్రమంలో స్టేట్మెంట్ ఐ అవసరమా స్టేట్మెంట్ ఐఐ అవసరమా లేదా రెండూ అవసరమా అనే అంశాన్ని అభ్యర్థి విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందులో అడిగే ప్రశ్నలు అర్థమెటిక్, జ్యామెట్రీ, బీజగణిత విభాగాల నుంచి వస్తాయి. కాబట్టి ఆయా అంశాలపై దృష్టి సారించాలి. విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగాన్ని నాలుగు ఉప విభాగాలుగా విభజించారు. అవి.. సీక్వెన్సెస్ అండ్ సిరీస్ (25 ప్రశ్నలు), డేటా అనాలిసిస్ (10 ప్రశ్నలు), కోడింగ్-డీకోడింగ్ (10 ప్రశ్నలు), డేట్ అండ్ టైమ్ ఆరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ (10 ప్రశ్నలు). వీటిల్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్‌లో అనాలజీ, నంబర్ సిరీస్, అల్ఫాబెట్ సిరీస్, క్లాసిఫికేషన్, ఆడ్‌మ్యాన్ అవుట్ వంటి ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే 1-20 వరకు టేబుల్స్, 1-30 వరకు వర్గమూలాలు, 1-20 వరకు ఘనాలు, A - Z, Z - A వరకు అక్షర క్రమం (ముందు నుంచి వెనక్కు, వెనక నుంచి ముందుకు), స్థాన విలువలపై పట్టు సాధించాలి. డేటా అనాలిసిస్లో పట్టికలు, వెన్ చిత్రాలు, లాజికల్ వెన్ చిత్రాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలను సాధించాలంటే నిష్పత్తి, సగటు, శాతం వంటి అంశాలపై అవగామన తప్పనిసరి. అంతేకాకుండా పరిశీలన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇచ్చిన చిత్రాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే సమాధానాన్ని గుర్తించడం శ్రేయస్కరం. కోడింగ్-డీకోడింగ్‌లో మెరుగైన మార్కులకు A - Z, Z - A వరకు అక్షర క్రమం (ముందు నుంచి వెనక్కు, వెనక నుంచి ముందుకు), స్థాన విలువల పై పట్టు సాధించాలి. డేట్ అండ్ టైమ్‌లో సీటింగ్ ఆరేంజ్మెంట్, వయసు, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఆరైవల్, డిపార్చర్, షెడూల్స్పై ప్రశ్నలు వస్తాయి. మ్యాథమెటికల్ ఎబిలిటీ: అత్యంక కీలక విభాగం మ్యాథమెటికల్ ఎబిలిటీ. అభ్యర్థుల వేగాన్ని, కచ్చితత్వాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో మూడు ఉప విభాగాలు ఉంటాయి. అవి.. అర్థమెటిక్ ఎబిలిటీ, ఆల్జీబ్రాకల్ అండ్ జీయో మెట్రికల్ ఎబిలిటీ,స్టాటిస్టికల్ ఎబిలిటీ. ఒక రకంగా దీన్ని ప్యూర్ మ్యాథమెటికల్ విభాగంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడంతోపాటు షార్ట్‌కట్ మెథడ్స్, కొండ గుర్తులను రూపొందించుకోవాలి. అర్థమెటికల్ ఎబిలిటీలో ఘాతాంకాలు, నిష్పత్తి, భాజనీయత సూత్రాలు, కసాగు-గసాభా, శాతాలు, ఆకరణీయ సంఖ్యలు, లాభ నష్టాలు, భాగస్వామ్యం, కాలం-పని, కాలం-దూరం, వైశాల్యాలు, ఘనపరిమాణాలు, క్షేత్రమితి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ పరీక్షల్లోని సంబంధిత సమస్యలను సాధన చేయాలి. ఆల్జీబ్రాకల్ అండ్ జీయో మెట్రికల్ ఎబిలిటీ విభాగంలో సమితులు, సంబంధాలు, ప్రవచనాలు, బహుపదులు, ప్రమేయాలు, ద్విపద సిద్ధాంతం, వర్గ సమీకరణాలు, మాత్రికలు, శ్రేఢులు, నిరూపక జ్యామితి, త్రికోణమితి వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. వీటి కోసం 10వ తరగతి వరకు ఉన్న గణిత పుస్తకాలను చదివితే సరిపోతుంది. పాలిసెట్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. స్టాటిస్టికల్ ఎబిలిటీలో సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఆయా అంశాల్లో అభ్యర్థుల ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఇ స్తారు. సాంఖ్యక శాస్త్రం కోసం 10వ తరగతి గణిత పుస్తకాలు, సంభావ్యత కోసం 10వ తరగతి, ఆపై స్థాయి తరగతుల గణిత పుస్తకాలను చదవాలి. ఇన్ పుట్స్: లలితాబాయి, ఎస్.ఎం.ఎల్.సి. కామేశ్వర రావు. ఐసెట్-2014 నోటిఫికేషన్ సమాచారం అర్హత: ఎంబీఏ-50 శాతం మార్కులతో(రిజర్వ్ అభ్యర్థులకు 45 శాతం) బ్యాచిలర్ డిగ్రీ. ఎంసీఏ-50 శాతం మార్కులతో (రిజర్వ్ అభ్యర్థులకు 45 శాతం) బ్యాచిలర్ డిగ్రీ. 10+2 స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దూర విద్య డిగ్రీకి యూజీసీ, ఏఐసీటీఈ, డీఈసీ జాయింట్ క మిటీ గుర్తింపు ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు: రూ. 250 దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 4, 2014. రూ. 500 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 15, 2014 రూ. 2,000 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 25, 2014 రూ. 5,000 లేట్ ఫీజుతో: మే 6, 2014 రూ. 10,000 లేట్ ఫీజుతో: మే 19, 2014 పరీక్ష తేదీ: మే 23, 2014 వివరాలకు: www.apicet.org.in టిప్స్ కనీసం రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. గత ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష నాటికి కనీసం ఏడు మాక్ టెస్ట్‌లు రాయాలి. కనీసం 165కిపైగా మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. అప్పుడే మంచి కాలేజీలో సీటు సాధించవచ్చు. బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ వాడాలి గతేడాది మాదిరిగానే ఈసారీ కాకతీయ యూనివర్సిటీ ఐసెట్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సంబంధిత నిర్వహణ ఏర్పాట్లపై ఐసెట్-2014 కన్వీనర్ ప్రొఫెసర్ కె. ఓంప్రకాశ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఐసెట్ -2014 ఏర్పాట్లు: ఐసెట్‌ను సక్రమంగా సకాలంలోనే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో భాగంగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాం. వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. గతంతో పోల్చితే ఈసారి కొన్ని మార్పులు చేశాం. గతంలో నెల రోజుల ముందుగానే దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేది. ఆతర్వాత వచ్చే దరఖాస్తులను అనుమతించే వాళ్లం కాదు. కానీ ఈసారి వారం రోజుల ముందు కూడా అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాం. ఎంతమంది హాజరు కాబోతున్నారు? గత ఏడాది ఐసెట్ -2013లో 1,39,314 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి 1.50 లక్షల దరఖాస్తులు రావొచ్చని అంచనా. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసేటప్పుడు నిబంధనలు చదివి దరఖాస్తును క్షుణ్నంగా పూరించాలి. ఆన్లైన్ దరఖాస్తులో అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాన్ని స్పష్టంగా పేర్కొనాలి. హాల్‌టికెట్లు, ర్యాంకు కార్డులు ఆన్లైన్ ద్వారా డౌన్లోడు చేసుకోవాలి. కొత్తగా మార్పులు: ఖమ్మం జిల్లా భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల్లోని ఏజెన్సీల అభ్యర్థుల కోసం ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో మరో పరీక్షా కేంద్రం కొత్తగూడెంలో ఏర్పాటు చేశాం. మే రెండోవారం కల్లా ఐసెట్ నిర్వహణకు రీజినల్ కోఆర్డినేటర్లను నియమించే ప్రక్రియ పూర్తి చేస్తాం. అభ్యర్థులు ప్రధానంగా గమనించాల్సిన మార్పు.. గతంలో ఓఎంఆర్ షీట్లో సమాధానాలను గుర్తించేందుకు పెన్సిల్‌ను వినియోగించాల్సి ఉండేది. కానీ ఈసారి నుంచి అభ్యర్థులు సమాధానాలను గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. దరఖాస్తు సమయంలో తప్పులు దొర్లితే? దరఖాస్తు సమయంలో ఏవైనా సమస్యలు దొర్లితే హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేశాక కూడా కొన్ని అంశాలను సవరించుకునే అవకాశం ఉంది. అయితే పేరు, ఇతర అంశాలకు సంబంధించిన సవరణలు మాత్రమే అనుమతిస్తాం. పరీక్షాకేంద్రం, హెల్ప్‌లైన్ సెంటర్‌ను మాత్రం మార్చుకునే వీల్లేదు. ఏవైనా సందేహాలు ఉంటే కన్వీనర్ పేరిట ఉన్న ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. ఫలితాలు ఎప్పుడు? మే 26వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తాం. కీ విషయంలో జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం. జూన్ 9వ తేదీన ఫలితాలను, ఫైనల్ ‘కీ’ కూడా విడుదల చేస్తాం. అభ్యర్థులకు సూచనలు ? పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. బ్లూ లేదా బ్లాక్ పాయింట్పెన్ను మాత్రమే వినియోగించుకోవాలి. ఓఎంఆర్‌షీట్‌లో అన్నికాలాలను పూరించాలి. ఏమైనా ఇతర సమాచారం కోసం convernericet2014 @gmail.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. - డి.రమేష్, న్యూస్‌లైన్, కేయూ క్యాంపస్. -
పంచాయతీ కార్యదర్శి కటాఫ్ 240-250?
మొత్తం 2,677 పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-4) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏపీపీఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించింది. ఇటీవల విడుదలైన వీఆర్వో పరీక్ష ఫలితాల్లో వందకు వంద మార్కులు రావడంతో పంచాయతీ కార్యదర్శి పరీక్ష కటాఫ్‌పై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి ప్రశ్నపత్రాల తీరుతెన్నులు, కటాఫ్ అంచనాలపై నిపుణుల విశ్లేషణ.. పంచాయతీ కార్యదర్శి పరీక్షకు 8.14 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 71 శాతం మంది హాజరయ్యారు. ఉదయం జరిగిన పేపర్-1 (జనరల్ స్టడీస్)కు 71.21 శాతం మంది హాజరుకాగా, మధ్యాహ్నం జరిగిన పేపర్-2 (గ్రామీణాభివృద్ధి)కు 70.83 శాతం మంది హాజరయ్యారు. పేపర్-1లో వచ్చిన మూడు ప్రశ్నలు స్వల్ప తేడాతో రెండో పేపర్లోనూ వచ్చాయి. అవి.. 1.బెరి బెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? (పేపర్-1); బి-విటమిన్ లోపం వల్ల సంక్రమించే వ్యాధి? (పేపర్-2). 2.ఏ కమిటీ సూచనల ఆధారంగా నాబార్డ్‌ను స్థాపించారు? (పేపర్-1); నాబార్డ్ సంస్థను ఏ కమిటీ సిఫార్సుల మేరకు స్థాపించారు? (పేపర్-2). 3.భారతదేశ ఏ రెండు రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట ప్రవేశపెట్టారు? (పేపర్-1); రాజస్థాన్‌తో పాటుగా మొట్టమొదట పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభమైన మరో రాష్ట్రం? (పేపర్ 2). పేపర్ 1 (జీఎస్): జనరల్ స్టడీస్ పేపర్లో ఐదారు ప్రశ్నలు తప్ప, మిగిలిన ప్రశ్నలన్నీ తేలిక నుంచి మధ్యస్థాయి (Easy to Moderate) కాఠిన్యత ఉన్నవే. చాలా వరకు ప్రశ్నలు నేరుగా వచ్చాయి. భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?; సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది?; చంద్రునిపై కాలు పెట్టిన మొదటి వ్యోమగామి ఎవరు? వంటి ప్రశ్నలు ఈ కోవకు చెందుతాయి. ఇందులో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విభాగం నుంచి ఏకంగా 37 ప్రశ్నలు వచ్చాయి. వర్తమాన వ్యవహారాల నుంచి 19 ప్రశ్నలు వచ్చాయి. జనరల్ నాలెడ్జ్ విభాగం నుంచి సింహ భాగం ప్రశ్నలు (దాదాపు 42) వచ్చాయి. గ్రూప్స్, జేఎల్ వంటి పోటీ పరీక్షలకు పకడ్బందీగా సిద్ధమవుతున్న వారు జీఎస్ పేపర్లో 135 వరకు స్కోర్ చేస్తారనడంలో సందేహం లేదు. విపత్తుల నిర్వహణ విభాగం నుంచి ఎనిమిది ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్నలు గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన వివిధ పరీక్షల్లో పదేపదే వచ్చినవే. ఉదా: సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది? 1) కటక్ 2) న్యూఢిల్లీ 3) విశాఖపట్నం 4) మదురై జవాబు: 2 ఉదా: ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టాన్ని భారత్‌లో చేశారు? 1) 2003 2) 2004 3) 2005 4) 2006 జవాబు: 3 పేపర్ 2 (గ్రామీణాభివృద్ధి): పరీక్షకు సంబంధించిన పేపర్-2 (గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంత సమస్యలు) సిలబస్‌లో అయిదు అంశాలను పేర్కొన్నారు. అయితే ప్రశ్నపత్రం రూపకల్పనలో వీటికి సమ ప్రాధాన్యం ఇవ్వలేదు. అకౌంటింగ్‌కు సంబంధించి 28 వరకు ప్రశ్నలు వచ్చాయి. ఇవి ఇంటర్, డిగ్రీలో కామర్స్ చదువుకున్న వారు మాత్రమే సమాధానాలు గుర్తించేలా ఉన్నాయి. పేపర్-1 బాగా రాసి, ఉత్సాహంగా పేపర్-2కు హాజరైన వారు ఇందులోని అకౌంటింగ్ ప్రశ్నల సంఖ్య, అడిగే తీరును చూసి నిరాశచెందారు. పదాలు పూర్తిగా కొత్తవి కావడంతో, ప్రశ్నను సైతం అర్థం చేసుకోలేని స్థితిలో ఉండటంతో కామర్స్ నేపథ్యం లేని అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యారు. ఉదా: జంట పద్దు విధానంలో ఖాతా పుస్తకాల నమోదు, నిల్వలు తేల్చడంలో దొర్లిన అంకగణిత కచ్చితత్వాన్ని కనుక్కోవడానికి ఈ కింది దాన్ని తయారు చేస్తారు? 1) నగదు పుస్తకం 2) చిట్టా 3) అంకణా 4) బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ జవాబు : 3 ఉదా: రూ.5 వేలు జీతాల చెల్లింపు అంకణాలో క్రెడిట్ వైపు చూపారు. అప్పుడు అంకణాలోని డెబిట్ వైపు 1) రూ.5 వేలు తగ్గుతుంది 2) రూ.5 వేలు అధికంగా చూపుతుంది 3) రూ.10 వేలు తగ్గుతుంది 4) రూ.10 వేలు అధికంగా చూపుతుంది. జవాబు: 3 పంచాయతీరాజ్ హవా! అందరూ ఊహించినట్లుగానే పేపర్-2లో పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి అధిక ప్రశ్నలు వచ్చాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ- రాజ్యాంగం; స్థానిక సంస్థల నిర్మాణం- విధులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు. ఉదా:1)పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్ని సంవత్సరాల కొకసారి ఎన్నికలు జరపాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది? 2)మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ మూడు ఉన్నాయి? గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో ప్రధానమైన వ్యవసాయం- అనుబంధ రంగాల గురించి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఒకే అంశానికి సంబంధించి నాలుగైదు ప్రశ్నలు వచ్చాయి. విటమిన్లకు సంబంధించి సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ ఏది?; ‘ఎ’ విటమిన్ ఆహారంలో లోపిస్తే దెబ్బతినే అవయవం ఏది?; సి విటమిన్ ఏ ఆహార పదార్థాలలో ఎక్కువగా లభిస్తుంది? బి విటమిన్ లోపం వల్ల సంక్రమించే వ్యాధి ఏది? అనే ప్రశ్నలు వచ్చాయి. వ్యవసాయం, అనుబంధ రంగాల విప్లవాలపై ఆరు ప్రశ్నలు వచ్చాయి. వీటిలో హరిత విప్లవానికి సంబంధించి రెండు, శ్వేత విప్లవం నుంచి రెండు, నీలి విప్లవం నుంచి ఒకటి, యెల్లో విప్లవం నుంచి ఒకటి ప్రశ్నలు వచ్చాయి. కటాఫ్ అంచనా పేపర్-1లో 130-135 మార్కులు తెచ్చుకునే అవకాశముంది. అదే విధంగా రెండో పేపర్లో 110-115 మార్కులు స్కోర్ చేయొచ్చు. దీన్నిబట్టి మొత్తంమీద కటాఫ్ 240-250 (300 మార్కులకు) ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మార్కులు సాధించిన వారు పోటీలో నిలిచేందుకు అవకాశముందంటున్నారు. ఇంటర్ పాఠ్యపుస్తకాల్లోనివే అకౌంటింగ్ ప్రాథమిక అంశాల విభాగంలో వచ్చిన ప్రశ్నల్లో చాలా వరకు ఇంటర్మీడియెట్ కామర్స్ తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్నవే. అయిదారు ప్రశ్నలు సీబీఎస్ఈ 11, 12 తరగతి పుస్తకాల్లో ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ స్థాయిలో కామర్స్ చదువుకున్న వారికి ఈ విభాగం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. - కురుహూరి రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ. డేటా ఇంటర్‌ప్రిటేషన్, అకౌంటింగ్ కీలకం! పోటీ పరీక్షల ప్రశ్నపత్రం ఎప్పుడూ సమతూకంగా ఉండాలి. ఏదో ఒక విభాగం వారికి ప్రయోజనం చేకూరేలా ఉండకూడదు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీని అర్హతగా నిర్దేశించారు. అలాంటప్పుడు అందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రశ్నపత్రాన్ని రూపొందించాలి. కానీ, పరీక్షలో ఏకంగా 28 ప్రశ్నలు అకౌంటింగ్‌కు సంబంధించినవి ఉన్నాయి. అవి కూడా జనరల్‌గా కాకుండా పూర్తిగా టెక్నికల్‌గా ఉన్నాయి. కామర్స్ నేపథ్యమున్న విద్యార్థులు మాత్రమే వాటికి సమాధానాలు రాయగలరు. అదే విధంగా సిలబస్‌లో ‘సమకాలీన సమాజంలో సామాజిక ఉద్రిక్తతలు, ఘర్షణలు- అణగారిన వర్గాల సమస్యలు’ అంశాన్ని పేర్కొన్నారు. కానీ, ఈ విభాగం నుంచి చాలా తక్కువ ప్రశ్నలు వచ్చాయి. మొత్తంమీద పేపర్-1లో డేటా ఇంటర్‌ప్రిటేషన్, పేపర్-2లో అకౌంటింగ్లో మంచి స్కోర్ చేసిన వారు తుది జాబితాలో నిలిచే అవకాశముంది. - బి.కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీసర్కిల్. డిగ్రీ అర్హతతో గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల జనరల్ స్టడీస్ పేపర్‌తో పోల్చితే ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి పేపర్-1 భిన్నంగా ఉంది. దాదాపు అన్ని ప్రశ్నలూ నేరుగా వచ్చాయి. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. పేపర్-1లో 140 మార్కుల వరకూ స్కోర్ చేయొచ్చు. ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తప్పనిసరిగా స్టాండర్డ్ జీకేపై పట్టు సాధించాలి. - ఎన్.విజయేందర్‌రెడ్డి, జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలన్న కోరిక ఉన్నప్పటికీ చాలా మంది.. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ గురించి ఆలోచిస్తారు. అయితే నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో లక్ష్యాన్ని సాధించే దిశగా సాగిపోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో విజేతల జాబితాలో చోటు లభిస్తుంది. ఎక్కువ మంది గ్రూప్స్‌ను లక్ష్యంగా పెట్టుకుంటారు. కొత్త నోటిఫికేషన్లు రావడానికి మరికొన్ని నెలలు ఆగాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రిపరేషన్‌ను కొనసాగించేందుకు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఇలా చేస్తే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా పోటీలో ముందువరుసలో ఉండొచ్చు. ఎన్ని గంటలు చదవాలి: ప్రిపరేషన్‌కు ఎవరెన్ని గంటలు కేటాయించాలనేది వారివారి చేతుల్లోనే ఉంటుంది. వివిధ ఉద్యోగాల్లో ఉన్నవారు, ఫ్రెషర్స్ తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. జనరల్ స్టడీస్ పట్టుపట్టాలి: డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఎంపీడీవో, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డీఎల్, జేఎల్ వంటి ఉన్నత స్థాయి పోస్టుల నుంచి జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్, కానిస్టేబుల్ వంటి ఉద్యోగాల వరకు నిర్వహించే పరీక్షల్లో జనరల్ స్టడీస్ కీలకపాత్ర పోషిస్తుంది. గ్రూప్స్‌తో పాటు వివిధ పోస్టులకు నిర్వహించే పరీక్షల్లో జీఎస్‌కు ప్రత్యేక పేపర్ ఉంటుంది. ఓ ప్రణాళిక ప్రకారం చదివితే ఇందులో అత్యధిక మార్కులు సంపాదించవచ్చు. జీఎస్‌లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, మెంటల్ ఎబిలిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్‌లకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలను చదివి, సొంతంగా నోట్స్ రూపొందించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నోట్స్‌ను చదివిన తర్వాత ఇతర ఏ ప్రామాణిక మెటీరియల్‌ను అయినా త్వరగా చదివేందుకు, తేలిగ్గా అర్థం చేసుకునేందుకు అవకాశముంటుంది. అప్డేట్.. అసలైన ఆయుధం: ఏ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులైనా సిలబస్‌లోని విషయాలకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకోవడం (అప్డేట్) ప్రధానం. దీనికోసం ఒకట్రెండు దిన పత్రికలు చదువుతూ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. పోటీ పరీక్షల డిస్క్రిప్టివ్ పేపర్లలో అత్యధిక మార్కులు సాధించాలంటే రైటింగ్ స్కిల్స్ చాలా ముఖ్యం. దీనికోసం అభ్యర్థులు తక్కువ సమయంలో ఎగ్జామినర్ ఆశించిన సమాధానం రాయాలంటే ఇప్పటి నుంచే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించాలి. -
10వ తరగతి బయాలజీ బిట్ బ్యాంక్
జీవన విధానాలు కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ 1.కార్బోహైడ్రేట్లలో ఉండే శక్తిని విడుదల చేసే క్రియ ----------. 2.అన్ని జీవక్రియల్లో ---------- ముఖ్యమైన జీవక్రియ. 3.కిరణజన్య సంయోగక్రియలో---------- వాయువు విడుదలవుతుంది. 4.విద్యుదయస్కాంత వికిరణంలో ---------- కంటికి కనిపించే కాంతి కంటే ఎక్కువ ధైర్ఘ్య తరంగాలుంటాయి. 5.ఆకుపచ్చని మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియను పరీక్షించే సమయం----------. 6.వాయువుల మార్పిడి, నీటి ఆవిరిని ఆకుల నుంచి నియంత్రించేవి----------. 7.---------- దొంతరలను గ్రానా అంటారు. 8.కిరణజన్య సంయోగక్రియలో పత్రహరిత అణువు ---------- చెందుతుంది. 9.అయోడిన్‌ను ---------- కలిగి ఉందని కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. 10. కాంతి మీద ఆధారపడే జీవ రసాయన చర్య ----------. 11.మెల్విన్ కాల్విన్---------- పై పరిశోధనలు చేసి నోబెల్ బహుమతిని పొందారు. 12.మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎందుకంటే ----------. 13.---------- అనే జీవక్రియ జీవుల జాతిని శాశ్వతంగా ఉంచడానికి సహాయపడుతుంది. 14.కంటికి కనిపించే కాంతి తరంగ ధైర్ఘ్యం----------. 15.కాంతి కిరణాలలో ఉండే శక్తిని ----------అంటారు. 16.శ్వాసక్రియ చెందే పదార్థాన్ని ---------- అంటారు. 17.మైటోకాండ్రియాలో ఉండే లోపలి ముడుతలను ---------- అంటారు. 18.ఆక్సిజన్ లేకుండా సూక్ష్మ జీవులు జరిపే శ్వాసక్రియను ---------- అంటారు. 19.చాలా రకాల బాక్టీరియాలు ఆక్సిజన్ లేనప్పుడు ---------- ఆమ్లాల్ని ఉత్పత్తి చేస్తాయి. 20.గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత ----------. 21.ఫలాలను శీతల స్థలంలో ఉంచినపుడు ---------- రేటు తగ్గుతుంది. 22.ఒక గదిలో ఫలాలను ---------- ఉష్ణోగ్రత మధ్య ఉంచితే అవి తొందరగా పక్వానికి వస్తాయి. 23.గ్లూకోజ్ ఆక్సీకరణంలో మొదటి దశను ---------- అంటారు. 24.సిట్రిక్ ఆమ్లం ఏర్పడేందుకు ఎసిటైల్ కొ ఎంజైమ్ అ, నాలుగు కర్బన పరమాణువులు గల ---------- పదార్థంలో చేరుతుంది. 25.అఖ్కీలో ఎక్కువ శక్తి ---------- అకర్బన అణువుతో నిల్వ అయి ఉంటుంది. 26.అఈ్కకి శక్తిమంతమైన ఫాస్పేట్ కలయికను ---------- అంటారు. 27.గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు పొందే నికర లాభం ----------. 28.అఖ్కీని విస్తరించగా ----------. 29.ఆక్సీకరణ చెందడానికి కణ శ్వాసక్రియలో ఆహార పదార్థాలు ---------- రూపంలో ఉండాలి. 30.---------- క్రియను జంతువులు జరపలేవు. 31.గ్లైకాలసిస్ తుది దశలో ఏర్పడే ఆమ్లం ----------. 32.వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం ----------. 33.మైటోకాండ్రియాలను ---------- అని కూడా అంటారు. 34.కిరణజన్య సంయోగక్రియలో నిలవ ఉండే శక్తి ---------- నుంచి లభిస్తుంది. 35.ఆక్సీకరణ భాస్వీకరణం ----------లో జరుగుతుంది. 36.అమీబాలో శ్వాసక్రియ ---------- పద్ధతి ద్వారా జరుగుతుంది. 37.కప్పలో నాశికలు ---------- లోకి తెరచుకుంటాయి. 38.వానపాములో హిమోగ్లోబిన్ రక్తంలోని----------లో ఉంటుంది. 39.బొద్దింక రక్తం ---------- గా ఉంటుంది. 40.చర్మ శ్వాసక్రియ ---------- లో జరుగుతుంది. 41.వానపాములో శరీర కుహర ద్రవం ---------- ద్వారా బయటకు వస్తుంది. 42.వాయునాళాలు ఉన్న జీవి ----------. 43.ఉపరికుల గల జీవి ----------. 44.స్వరపేటికను ---------- అని కూడా అంటారు. 45.మానవుడిలో గాలిగొట్టాన్ని శాస్త్రీయంగా---------- అంటారు. 46.మానవుడిలో వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్థి ఉంగరాల ఆకారం ----------. 47.కంఠబిలం మీద మూతలా పనిచేసే నిర్మాణం ----------. 48.స్త్రీలలో ---------- శ్వాసకదలికల్లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 49. పురుషుల్లో ---------- శ్వాసకదలికల్లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 50.వాయుగోణులు --------- ల పరిమాణాలు. 51.కప్ప చర్మం ఎండిపోతే అది ---------. 52.బొద్దింకలో శ్వాస రంధ్రాల సంఖ్య ---------. 53.బొద్దింకలో --------- శ్వాసేంద్రియాలు. 54.వానపాములో శ్వాసక్రియ ---------ద్వారా జరుగు తుంది. 55.పుపుస శ్వాసక్రియ --------- ద్వారా జరుగుతుంది. సమాధానాలు 1) శ్వాసక్రియ; 2) కిరణజన్య సంయోగక్రియ; 3) ఆక్సిజన్; 4) పరారుణ కిరణాలు; 5) మొక్కను 2-3 గంటలు సూర్యకాంతిలో ఉంచిన తర్వాత; 6) పత్ర రంధ్రాలు; 7) థైలకాయిడ్; 8) ఆక్సీకరణం; 9) పిండి పదార్థం; 10) కిరణజన్య సంయోగ క్రియ; 11) కార్బన్ స్థాపన (నిష్కాంతి చర్య); 12) అవి ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి; 13) ప్రత్యుత్పత్తి; 14) 400ఝ 700ఝ; 15) క్వాంటం శక్తి; 16) శ్వాసక్రియాధారాలు; 17) క్రిస్టే; 18) కిణ్వనం; 19) లాక్టిక్; 20) 300 సెంటీగ్రేడ్ నుంచి 400 సెంటీగ్రేడ్; 21) శ్వాసక్రియ; 22) 450 సెంటీగ్రేడ్; 23) గ్లైకాలసిస్; 24)ఆక్సాలో ఎసిటికామ్లం; 25) మూడో; 26) పాస్ఫోరిలేషన్; 27) 2 అఖ్కీలు; 28) ఎడినోసిన్ ట్రై పాస్ఫేట్; 29)గ్లూకోజ్; 30) కిరణజన్య సంయోగ క్రియ; 31) పైరువిక్ ఆమ్లం; 32) 0.03-0.04 శాతం; 33) శక్తి ఉత్పాదక కేంద్రాలు; 34) సూర్యకాంతి; 35) మైటోకాండ్రియా; 36) విసరణ/వ్యాపనం; 37) ఆస్యకుహరం; 38) ప్లాస్మా; 39) తెలుపు; 40) వానపాము/ కప్ప/ సాలమండర్; 41) పృష్ట రంధ్రాలు; 42) బొద్దింక (కీటకాలు); 43) అస్థి చేప; 44) శబ్దపేటిక; 45) వాయునాళం; 46) ‘ఇ’; 47) ఉపజిహ్వక/కొండ నాలుక; 48) పక్కటెముకలు; 49) ఉదర వితానం; 50) ఊపిరితిత్తులు; 51) చర్మం ద్వారా శ్వాసక్రియ జరపలేదు 52) 10 జతలు; 53) వాయునాళాలు; 54) చర్మం; 55) ఊపిరితిత్తులు. రవాణా వ్యవస్థలు, మానవ హృదయ నిర్మాణం 1ఏకకణ జీవుల్లో పదార్థాల రవాణా--------- ద్వారా జరుగుతుంది. 2.రక్త రవాణా వ్యవస్థలో --------- పంపు చేసే సాధనం. 3.కప్ప హృదయంలో కర్ణికలకు వెనుకగా --------- ఉంటుంది. 4.సరీసృపాల హృదయంలో --------- అసంపూర్ణంగా విభజన చెందిన గది. 5.ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే హృదయాన్ని --------- అంటారు. 6.ఏక ప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ---------లో కని పిస్తుంది. 7.శోష రసం --------- వ్యవస్థకి చెందుతుంది. 8.ఎర్రరక్త కణాలు లేని జీవి---------. 9.బొద్దింకలో --------- కండరాలు రక్తాన్ని హృదయంలోకి పంపడానికి సహాయపడతాయి. 10.ఉభయ జీవుల్లో మహాసిరలు కలిసి --------- ని ఏర్పాటు చేస్తాయి. 11.రక్త కోటరాలు ఉన్న జంతువు ---------. 12.13 గదుల హృదయం ఉన్న జంతువు ---------. 13.మెగాస్కోలెక్స్లో --------- ముఖ్య సిరగా పనిచేస్తుంది. 14.మెగాస్కోలెక్స్లో--------- ముఖ్య ధమనిగా పని చేస్తుంది. 15.స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ --------- లో ఉంటుంది. 16.నీలి రంగు రక్తం కలిగిన జంతువులు ---------. 17.పుపుస మహా ధమని --------- నుంచి బయలుదేరు తుంది. 18.మానవుడిలో సామాన్య రక్తపీడనం --------- ఉంటుంది. 19.మానవుడి సామాన్య రక్తపీడనం 120/80లో పై సంఖ్య --------- పీడనాన్ని తెలుపుతుంది. 20.హృదయానికి ఆమ్లజని సహిత రక్తాన్ని తెచ్చేవి ---------. 21.---------లో అడ్డంకులేర్పడితే గుండెపోటు సంభవిస్తుంది. 22.ఎడమ కర్ణిక, ఎడమ జఠరికలకు మధ్య కవాటం ---------. 23.బి.పి.ని కొలిచే పరికరం ---------. 24.శరీరంలో పైభాగాల నుంచి రక్తాన్ని---------సేకరిస్తుంది. 25.మానవ శరీరంలో --------- అతి పెద్ద ధమని. 26.గ్రద్వయ కవాటానికి మరోపేరు ---------. 27.హృదయంలోని కవాటాలను వాటి స్థానంలో ఉంచ డానికి తోడ్పడే బంధన కణ జాల తంతువులను --------- అంటారు. 28.ఊపిరితిత్తులకు, హృదయానికి మధ్య జరిగే రక్త ప్రసరణను --------- వలయం అంటారు. 29.హృదయానికి, శరీర అవయవాలకు మధ్య జరిగే రక్త ప్రసరణను ____ వలయం అంటారు. 30.రెండు వలయాల్లో రక్తాన్ని పంపు చేసే హృదయాన్ని ____ అంటారు. సమాధానాలు 1) విసరణ/ వ్యాపనం; 2) హృదయం; 3) జఠరిక; 4) జఠరిక; 5) పుపుస హృదయం; 6) చేపల; 7) రవాణా; 8) వానపాము; 9) పక్షాకార; 10) సిరాసరణి; 11) బొద్దింక (కీటకాలు); 12) బొద్దింక; 13) పృష్ట రక్త నాళం; 14) ఉదర రక్తనాళం; 15) కీటకాలు; 16) పీత, నత్త; 17) కుడి జఠరిక; 18) 120/80; 19) సిస్టోల్; 20) పుపుస సిరలు; 21) హృదయ ధమని; 22) అగ్రద్వయ కవాటం; 23) స్ఫిగ్మో మానోమీటరు; 24) పూర్వ మహాసిర; 25) దైహిక మహా ధమని; 26) మిట్రల్ కవాటం; 27) స్నాయు రజ్జువులు; 28) పుపుస; 29) దైహిక; 30) ద్వి వలయ ప్రసరణ హృదయం. రక్తం - దాని అంశాలు, రక్త వర్గాలు 1.శరీరంలో ------------- ద్రవరూపంలో ఉండే కణజాలం. 2.------------- రక్తంలోని మాతృక. 3.రక్తం గడ్డకట్టడంలో -------------ప్రముఖ పాత్ర వహిస్తాయి. 4.------------- ద్రావణాన్ని సెలైన్ అంటారు. 5.రక్తంలో ఉండే మొత్తం లవణాల శాతం-------------. 6.రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ------------- చూస్తుంది. 7.రక్తం గడ్డకట్టినప్పుడు, దానిమీద ఉండే స్పష్టమైన ద్రవాన్ని ------------- అంటారు. 8.రక్తంలోని హెమోగ్లోబిన్ ------------- ని------------- మోసుకు పోతుంది. 9.ఎర్రరక్త కణాల ఉత్పత్తిని ------------- అంటారు. 10.ఎర్రరక్త కణాలు ------------- కలిగి ఉండటం వల్ల ఎర్రగా ఉంటాయి. 11.చిచిచిలను శరీరంలోని సూక్ష్మ రక్షక భటులు అంటారు. 12.------------- తెల్ల రక్తకణాల అన్నింటిలోనూ అతి చిన్నవి. 13.కేంద్రకం లేని రక్తకణం -------------. 14.------------- వంటి క్షీరదాల ఎర్ర రక్తకణంలో కేంద్రకం ఉంటుంది. 15.ప్లాస్మాలో సుమారు ------------- శాతం కర్బన రసాయనా లుంటాయి. 16.అతిపెద్ద తెల్ల రక్తకణాలు -------------. 17.‘’ ఆకారంలో ఉండే కేంద్రకం ఉన్న రక్త కణం-------------. 18.రెండు తమ్మెల కేంద్రకం ఉన్న రక్తకణం-------------. 19.అనేక తమ్మెలు కలిగిఉన్న కేంద్రకం ఉన్న రక్తకణం-------------. 20.మూత్రపిండం ఆకారంలో ఉన్న కేంద్రకం ఉన్న రక్త కణం -------------. 21.ఎర్ర రక్తకణాల జీవితకాలం సుమారు -------------. 22.తెల్ల రక్తకణాల జీవిత కాలం-------------. 23.తెల్ల రక్తకణాలన్నింటి కంటే ------------- సంఖ్య చాలా తక్కువ. 24.తెల్ల రక్తకణాలన్నింటి కంటే ------------- సంఖ్య చాలా ఎక్కువ. 25.శరీరంలో ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గించేవి -------------. 26.’అఆ’ రక్త వర్గం ఉన్న వ్యక్తులను------------- అంటారు. 27.’ై’ రక్త వర్గం గల వ్యక్తులను------------- అంటారు. 28.ఒక వ్యక్తి రక్తం మరొక వ్యక్తికి అతని సిర ద్వారా ఎక్కించడాన్ని ------------- అంటారు. 29.అత్యవసర పరిస్థితుల్లో రక్త వర్గం తెలియనప్పుడు రక్త గ్రహీతకు ------------- రక్త వర్గాన్ని ఇవ్వొచ్చు. 30.’AB’ రక్త వర్గం ఉన్న వ్యక్తులను విశ్వ గ్రహీతలు అనడానికి కారణం -------------. 31.కారల్ లాండ్ స్టీనర్ ------------- కనిపెట్టారు. 32.ఒక వ్యక్తి రక్తాన్ని మరొక వ్యక్తికి ------------ ద్వారా ఎక్కిస్తారు. 33.ప్రతిజనకాలు ’అ’, ’ఆ’ రెండూ లేని రక్త వర్గం------------. 34.రక్త గుచ్ఛకరణానికి కారణమైన చర్య ------------. 35.రక్తంలో ప్రతిరక్షకాలుండే స్థానం ------------. 36.రక్తంలో ప్రతిజనకాలుండే స్థానం ____. సమాధానాలు 1) రక్తం; 2) ప్లాస్మా; 3) రక్త ఫలకికలు; 4) 0.9% సోడియం క్లోరైడ్; 5) 0.85-0.9%; 6) హిపారిన్; 7) సీరం; 8) ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్; 9) ఎరిత్రోపాయిసిస్; 10) హిమోగ్లోబిన్; 11) న్యూట్రోఫిల్స్; 12) లింఫోసైట్స్; 13) ఎరిత్రోసైట్స్; 14) ఒంటె; 15) 6-8; 16) మోనోసైట్స్; 17) బేసోఫిల్స్; 18) ఇస్నోఫిల్స్; 19) న్యూట్రోఫిల్స్) 20) మోనోసైట్స్; 21) 120 రోజులు; 22) 12-13 రోజులు; 23) బేసోఫిల్స్; 24) న్యూట్రోఫిల్స్; 25) ఇస్నోఫిల్స్; 26) విశ్వ గ్రహీతలు; 27) విశ్వదాతలు; 28) రక్త ప్రవేశనం; 29) ’ై’ రక్త; 30) అన్ని రకాల రక్త వర్గాల నుంచి రక్తాన్ని గ్రహించడం వల్ల; 31) రక్త వర్గాలను; 32) సిర; 33) ’ై’; 34) ప్రతిజనకం- ప్రతిరక్షకం చర్య; 35) ప్లాస్మా; 36) ఎర్ర రక్తకణాలు. ముఖ్య ప్రశ్నలు 1 మార్కు: 1.జీవక్రియ అంటే ఏమిటి? కొన్ని జీవక్రియల పేర్లు రాయండి? 2.శక్తిని విడుదల చేయడానికి ఏ జీవక్రియ ముఖ్యమైంది? 3.కిరణజన్య సంయోగక్రియకు అవసరమయ్యే కారకాలు ఏమిటి? 4.కిరణజన్య సంయోగక్రియకు అవసరమయ్యే కారకాలను, దాని తుది ఉత్పత్తులు చూపే సమీకరణాన్ని రాయండి? 5.చర్యా కేంద్రం అంటే ఏమిటి? 6.విద్యుదయస్కాంత వికిరణంలోని ఇతర భాగాలను పేర్కొనండి? 7.శ్వాసక్రియాధారాలు అంటే ఏమిటి? రెండు ఉదాహరణలివ్వండి? 8.శ్వాసక్రియను నిర్వచించండి లేదా శక్తిని విడుదల చేయడానికి ఏ జీవక్రియ ముఖ్యమైంది? 9.అత్యంత అనుకూల ఉష్ణోగ్రత అంటే ఏమిటి? 10.కిణ్వనం అంటే ఏమిటి? 11.శ్వాసక్రియ ఎన్ని రకాలు? అవి ఏవి? 12.ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియనేమంటారు? 13.జల శ్వాసక్రియ అంటే ఏమిటి? 14.కేంద్రక పూర్వ జీవులలో మైటోకాండ్రియా ఉండకపోయినా శక్తి ఏ విధంగా ఏర్పడుతుంది? 15.శక్తికి సంబంధించినంత వరకు కిరణజన్య సంయోగ క్రియకు, శ్వాసక్రియకు బేధం ఏమిటి? 16.రక్తం తెల్ల రంగులో ఉండే రెండు జంతువులను పేర్కొనండి? 17.బొద్దింకలో రక్తం రవాణాలో తోడ్పడదు? కారణ మేంటి? 18.సిరల్లో కంటే ధమనుల్లో ఎక్కువ పీడనం ఎందు కుంటుంది? 19.అగ్రద్వయ కవాటానికి మరో పేరు ఏమిటి? 20.మిట్రల్ కవాటం అంటే ఏమిటి? దాని పని ఏమిటి? 21.ఎక్కువ మొత్తాల్లో కొలెస్ట్రాల్ తీసుకున్నందు వల్ల కలిగే నష్టం ఏమిటి? 22.సీరం అంటే ఏమిటి? 23.హెమటాలజీ అంటే ఏమిటి? 24.ప్లాస్మా, సీరం కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? 25.సెలైన్ అంటే ఏమిటి? 26.ఎరిత్రోపాయిసిస్ అంటే ఏమిటి? 27.రక్త ప్రవేశనమంటే ఏమిటి? 28.విశ్వదాతలంటే ఎవరు? ఎందుకంటారు? 2 మార్కులు: 1.కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి? 2.ఆక్సీకరణ, క్షయకరణలలో భేదాల గురించి రాయండి? 3.ఎలక్ట్రాన్ గ్రహీత అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణ లివ్వండి? 4.మండుట లేదా దహనక్రియ, శ్వాసక్రియల మధ్య భేదాలు రాయండి? 5.రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచిన పండ్లు, కూరగాయలు, గుడ్లు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి? కారణమేమిటి? 6.గ్లైకాలసిస్ గురించి క్లుప్తంగా రాయండి? 7.వాయునాళం ముడుచుకుపోకుండా ఎలా ఉండగలు గుతుంది? 8.శక్తికి సంబంధించినంత వరకు కిరణజన్య సంయోగ క్రియకు, శ్వాసక్రియకు మధ్య భేదం ఏమిటి? 9.కాంతి భాస్వీకరణానికి, ఆక్సీకరణ పాస్ఫోరిలేషన్కు మధ్య భేదం ఏమిటి? 10.ఉభయ జీవుల్లో సిరాసరణి ఎలా ఏర్పడుతుంది? 11.గుండెపోటు అంటే ఏమిటి? దీనివల్ల కలిగే నష్టం ఏమిటి? 12.ఒక వ్యక్తి బి.పి 120/80 అని రాశారు. ఇది వేటిని తెలుపుతుంది? 13.హృదయ స్పందన గురించి క్లుప్తంగా రాయండి? 14.ఎర్ర రక్తకణాల స్మశాన వాటిక అని దేనినంటారు? 15.రక్త ప్రవేశనం ఎలా చేస్తారు? రక్తాన్ని ఎవరు దానం చేయొచ్చు? 16.రక్త గుచ్ఛకరణం గురించి క్లుప్తంగా రాయండి? 17.విశ్వదాతలు అని ఎవరినంటారు? విశ్వ గ్రహీతలు అని ఎవరినంటారు? 4 మార్కులు: 1.కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని ఎలా నిరూపిస్తావు? 2.కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ స్థాపన గురించి వివరించండి? 3.కిరణజన్య సంయోగక్రియకు కాంతి లేదా వెలుతురు అవసరమని ఎలా నిరూపిస్తావు? 4.కిరణజన్య సంయోగక్రియలో విడుదలైన వాయువు ఆక్సిజన్ అని నిరూపించే ప్రయోగం రాయండి? 5.శ్వాసక్రియలో వేడిమి విడుదలవుతుందని ఎలా చూపించగలం? 6.మైటోకాండ్రియా నిర్మాణాన్ని పట సహాయంతో వివరించండి? 7.అవాయు శ్వాసక్రియ, వాయు సహిత శ్వాసక్రియ మధ్య భేదాలను పట్టిక రూపంలో రాయండి? 8.కిరణజన్య సంయోగక్రియకు, శ్వాసక్రియకు మధ్య భేదాలను రాయండి? 9.కుడి, ఎడమ జఠరికల మధ్య భేదాలను రాయండి? 10.కుడి, ఎడమ కర్ణికల మధ్య భేదాలను రాయండి? 11.అధిక రక్త పీడనం అంటే ఏమిటి? అది ఎలా కలుగుతుంది? ఇది కలగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేవి? 12.ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల మధ్య తేడాలేవి? 13.మానవుడిలో వివిధ రక్త వర్గాలను వర్ణించండి? 5 మార్కులు (పటాలు): 1.ఆకు అడ్డుకోత పటం గీసి, భాగాలు గుర్తించండి? 2.కిరణజన్య సంయోగక్రియకు, ఆకు అనుకూలమైన నిర్మాణం పటం గీసి, భాగాలు గుర్తించండి? 3.మైటోకాండ్రియా నిర్మాణం చూపే పటం గీసి, భాగాలను గుర్తించండి? 4.మానవుడి ఊపిరితిత్తుల పటం గీసి, భాగాలను గుర్తించండి? 5.మానవ హృదయం కవాటాల స్థానాన్ని చూపే పటం గీసి, భాగాలను గుర్తించండి? 6.మానవ హృదయం అంతర్నిర్మాణం పటం గీసి, భాగాలు గుర్తించండి? నియంత్రణ- సమన్వయం మొక్కలు, జంతువులలో రసాయనిక సమన్వయం 1.పరిసరాల్లో కలిగే మార్పులకు ఒక జీవి అనుక్రియ చూపే లక్షణాన్ని ------------ అంటారు. 2.మొక్కలలో పెరుగుదల పదార్థాలుంటాయని మొదటి సారిగా ప్రతిపాదించింది ------------. 3.మొక్కల్లో ఆక్సిన్లు తయారయ్యే స్థలం ------------. 4.ఆక్సిన్లు వేర్ల ------------ ను ప్రోత్సహిస్తాయి. 5.ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేసే రసాయనం పేరు ------------. 6.జిబ్బరెల్లా ప్యూజికొరై వరి పంటలో ------------ వ్యాధిని కలిగిస్తుంది. 7.అనిషేక ఫలాలు అంటే ------------ ఫలాలు. 8.కొన మొగ్గ పార్శ్వపు మొగ్గలను అదుపు చేయడాన్ని ------------ అంటారు. 9.పత్రాలు, ఫలాలు రాలడం ------------ అనే హార్మోన్ వల్ల జరుగుతుంది. 10.వాయువుల మార్పిడి, ఆకు నుంచి ఆవిరి రూపంలో బయటకు పోయే నీటిని నియంత్రించేది ------------. 11.ప్రత్యేకంగా కణ విభజనను ప్రోత్సహించే హార్మోన్ పేరు ------------. 12.మొక్కల్లో నీరు నష్టపోకుండా సహకరించే హార్మోన్ ------------. 13.ఫలాలు ముందుగా పక్వానికి వచ్చేందుకు ------------ రసా యనం సహకరిస్తుంది. 14.పొట్టి మొక్కలను పొడవు చేయడంలో ------------ ప్రముఖ పాత్ర వహిస్తాయి. 15.ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం అనే రసాయన యౌగికాన్ని సాధారణంగా ------------ అని అంటారు. 16.వినాళ గ్రంథులు వాటి స్రావాలను ------------ లోకి విడుదల చేస్తాయి. 17.మెదడులో వాయునాళానికి దగ్గరగా ఉండే గ్రంథిని ------------ అంటారు. 18.రక్తంలో ------------ పరిమాణం తక్కువైనప్పుడు గ్లూకగా న్ స్రవిస్తుంది. 19.పిండ ప్రతిస్థాపనకు సహాయపడే హార్మోన్ ------------. 20.గ్లైకోజన్‌ను గ్లూకోజుగా మార్చే హార్మోన్ ------------. 21.------------ ని మిశ్రమ గ్రంథి అంటారు. 22.కార్టిసాల్ అనే హార్మోన్‌ను స్రవించేది ------------. 23.అవయవాలను సమన్వయపరిచే రసాయన పదార్థాల ను ------------ అంటారు. 24.తగినంత మొత్తాల్లో వాసోప్రెస్సిన్ ఉత్పత్తి కాకపోతే ------------ వ్యాధి కలుగుతుంది. 25.ఆహారంలో తగినంత అయోడిన్ లేకపోతే ------------ గ్రంథి పరిమాణంలో పెద్దదవుతుంది. 26.పారాథార్మోన్ అధికంగా ఉత్పత్తి అయితే అది ------------ అనే స్థితికి దారి తీస్తుంది. 27.జరాయువు ఏర్పడటంలో సహాయం చేసే హార్మోన్‌ను ------------ అంటారు. 28.శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథి ------------. 29.నాడీ మండలానికి, అంతస్రావీ గ్రంథి వ్యవస్థకు వారధిలా పని చేసే గ్రంథి ____. 30.____ లోపం వల్ల డయాబెటిస్ మిల్లిటస్ వ్యాధి కలుగుతుంది. 31.____ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం. 32.మానసిక ఉద్రేకాలను కలిగించే హార్మోన్ ____. సమాధానాలు 1) క్షోభ్యత; 2) చార్లెస్ డార్విన్; 3) విభాజ్య కణాలు; 4) పెరుగుదలను; 5) 2,4-ఈ; 6) తెలివి తక్కువ మొలక; 7) విత్తనాలు లేని ఫలాలు; 8) అగ్రాధిక్యత; 9) అబ్సిసిక్ ఆమ్లం; 10) అబ్సిసిక్ ఆమ్లం; 11) సైటోకైనిన్; 12) అబ్సిసిక్ ఆమ్లం; 13) ఇథైలిన్; 14) జిబ్బరెల్లిన్లు; 15) ఆక్సిన్; 16) రక్తం; 17) అవటు గ్రంథి; 18) గ్లూకోజ్; 19) ప్రోజెస్టిరాన్; 20) గ్లూకాగాన్, 21) క్లోమం; 22) అడ్రినల్ గ్రంథి; 23) హార్మోనులు; 24) డయాబిటస్ ఇన్సిపిడస్; 25) అవటు; 26) టిటాని; 27) ప్రోజెస్టిరాన్, 28) పీయూష గ్రంథి; 29) పీయూష గ్రంథి; 30) థైరాక్సిన్; 31) ఇన్సులిన్, 32) ఎడ్రినలిన్. మానవ నాడీ వ్యవస్థ 1.శరీరానికి లోపల, వెలుపల జరిగే మార్పులను గ్రహించే వ్యవస్థ -----------. 2.నాడీ మండలం, శరీరం లోపల, వెలుపల జరిగే మార్పులను ----------- ద్వారా గ్రహిస్తుంది. 3.నాడీ కణాలకు ----------- కణాలు, పోషక పదార్థాన్ని అందజేస్తాయి. 4.వార్తలను గ్రహించి, వాటిని సంశ్లేషించి, సమన్వయ పరిచే ముఖ్య కేంద్రం -----------. 5.నాడీ కణ దేహం నుంచి వార్తలను తీసుకొని పోయే భాగాన్ని ----------- అంటారు. 6.నాడీ కణదేహంలో ----------- అనే కణికలుంటాయి. 7.పోలియో వంటి వ్యాధుల్లో వైరస్‌తో నశించేవి ----------- నాడీ కణాలు. 8.నిస్సల్ కణికలు గల కణాలు -----------. 9.ఒక క్రమంలో మైలీన్ తొడుగులో ఉండే ఖాళీలను ----------- అంటారు. 10.-----------నాడులు, మెదడు, వెన్నుపాము నుంచి వార్తలను కండరాలకు తీసుకుపోతాయి. 11.జ్ఞానాంగాల నుంచి ప్రచోదనాలు మెదడు లేదా వెన్నుపాముకు----------- నాడుల ద్వారా చేరుతాయి. 12.శరీరంలో టెలిఫోన్ వైర్లలా పనిచేసే నిర్మాణాలు-----------. 13.నాడీకణం ఉద్దీపనాలకు గురైనప్పుడు ఉత్పత్తయ్యే విద్యుత్ -----------. 14.నాడీ కణ దేహానికి మరొక పేరు -----------. 15.శరీరంలో టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ లేదా రిలేస్టేషన్ మాదిరి పనిచేసే నిర్మాణం -----------. 16.మానవుడిలో మెదడు ఉండే అస్థికలతో తయారైన పెట్టెను ----------- అంటారు. 17.మెదడులోని కణాలకు ----------- పోషక పదార్థాలను అందజేస్తుంది. 18.హృదయ స్పందనలు ----------- కపాల నాడి ఆధీనంలో ఉంటాయి. 19.మెదడును కప్పి ఉంచే వెలుపలి, మధ్య పొరల మధ్య ఉండే ద్రవం -----------. 20.మెదడును కప్పి ఉంచే బయటి పొర -----------. 21.మెదడును కప్పి ఉంచే లోపలి పొర -----------. 22.మస్తిష్కం ఉపరితల వైశాల్యాన్ని వృద్ధి చేసేవి -----------. 23.మానవునిలో వెన్నునాడుల జతల సంఖ్య -----------. 24.మానవునిలోని కపాలనాడుల జతల సంఖ్య-----------. 25.మానవుడిలో పరిధీయ నాడుల జతల సంఖ్య-----------. 26.ముందు మెదడుని-----------అని కూడా అంటారు. 27.మెదడులో అతిపెద్ద భాగం-----------. 28.మస్తిష్కంలో వెలుపలి బూడిద రంగు భాగాన్ని----------- అంటారు. 29.మస్తిష్కార్థ గోళాలకు దిగువున ఉండే మెదడు భాగాన్ని ----------- అంటారు. 30.మెదడులో శరీరం, వివిధ చర్యలను నియంత్రించే ఉన్నత కేంద్రం -----------. 31.ముందు, మధ్య మెదడులను కలిపే మెదడు భాగం -----------. 32.వెన్నుపాము అడ్డుకోతలో ఏ ఆకారంలో ఉండే పదార్థం -----------. 33.వెన్నునాడులన్నీ ----------- నాడులు. 34.మెదడు ఉపరితలం మీద ఉండే గట్ల వంటి వాటిని ----------- అంటారు. 35.గైరీల మధ్య ఉండే గాడులను----------- అంటారు. 36.శరీరం సమతాస్థితిని, భూమి మీద శరీరం ఉండే స్థితులను నిర్వహించేది -----------. 37.శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్త పీడనం వంటి అతి ముఖ్య చర్యలను నియంత్రించే కేంద్రాలు ----------- లో ఉంటాయి. 38.ఆకస్మికంగా, మనకు తెలియకుండా జరిగి, ఆపద నుంచి రక్షించే చర్యలను ----------- చర్యలంటారు. 39.ఉద్దీపనాల సమాచారాన్ని వెన్నుపాములోని ----------- విశ్లేషిస్తాయి. 40.నిబంధన సహిత ప్రతిచర్యలపై ----------- అనే రష్యా శాస్త్రవేత్త పరిశీలన చేశారు. 41.మన జాతీయ గీతాన్ని వినగానే, మనం లేచి నిలబడటం ఒక ----------- చర్య. 42.1990 నుంచి 2000 సంవత్సరం వరకు గల దశాబ్దాన్ని ----------- అంటారు. 43.శరీరం మొత్తం బరువులో మెదడు బరువు సుమారు -----------. 44.అసంకల్పిత ప్రతీకార చర్య నిర్మాణాత్మక, క్రియాత్మక యూనిట్‌ని ----------- అంటారు. 45.అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలోని ____ ఆధీనంలో ఉంటాయి. 46.జంతురాజ్యంలో అతి క్లిష్టమైన నిర్మాణంగా పరిగ ణించేది ____. 47.మానవుని మెదడులో____ బిలియన్లకు పైగా నాడీ కణాలుంటాయి. 48.మానవుడు తీసుకొనే మొత్తం ఆక్సిజన్‌లో మెదడు ____ శాతం ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది. సమాధానాలు 1) నాడీ వ్యవస్థ; 2) గ్రాహకాలు; 3) గ్లీయల్; 4) మెదడు; 5) ఏగ్జాన్; 6) నిస్సల్ కణికలు; 7) చాలక; 8) నాడీ కణాలు; 9) రన్వీర్ కణుపులు; 10) చాలక; 11) జ్ఞాన; 12) నాడులు; 13) 55 మిల్లీ వోల్టులు; 14) సైటాన్/ పెరికార్యా; 15) వెన్నుపాము; 16) కపాలం; 17) మస్తిష్క మేరుద్రవం; 18) 10వ వేగస్; 19) మస్తిష్క మేరుద్రవం; 20) వరాశిక; 21) మృద్వి; 22) గైరి; 23) 31 జతలు; 24) 12 జతలు; 25) 43 జతలు; 26) మస్తిష్కం; 27) మస్తిష్కం; 28) మస్తిష్క వల్కలం; 29) ద్వారగోర్థం; 30) మస్తిష్కం; 31) ద్వారగోర్థం; 32) బూడిద రంగు పదార్థం; 33) మిశ్రమ; 34) గైరీ; 35) సల్సి; 36) అనుమస్తిష్కం; 37) మజ్జాముఖం; 38) అసంకల్పిత ప్రతీకార; 39) మధ్యస్థ నాడీకణాలు; 40) ఇవాన్పావ్లోవ్; 41) నిబంధన సహిత; 42) మెదడు; 43) రెండు శాతం; 44) ప్రతీకార చర్యాచాపం; 45) వెన్నుపాము; 46) మెదడు; 47) 10; 48) 2. ముఖ్య ప్రశ్నలు 1 మార్కు: 1.అగ్రాధిక్యం అంటే ఏమిటి? 2.ఒక మొక్క చివరి భాగాన్ని కత్తిరిస్తే ఏమవుతుంది? దానికి కారణమేమిటి? 3.విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి ఏ రసాయన పదార్థం ఉపయోగిస్తారు? 4.ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయడానికి ఉపయోగించే రసాయనం ఏది? 5.క్షోభ్యత అంటే ఏమిటి? 6.మిశ్రమ గ్రంథి అంటే ఏమిటి? ఉదాహరణనివ్వండి? 7.సింపుల్ గాయిటర్ ఎందుకు ఏర్పడుతుంది? 8.నిర్వాహక కణజాలం అంటే ఏమిటి? 9.డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటే ఏమిటి? 10.ఇన్సులిన్ నిర్వర్తించే పని ఏమిటి? 11.నిస్సల్ కణికలు అంటే ఏమిటి? ఇవి ఎక్కడుంటాయి? 12.సైనాప్స్ అంటే ఏమిటి? 13.మెదడును కప్పి ఉంచే పొరలేవి? 14.అసంకల్పిత ప్రతీకార చర్యలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి? 15.ప్రతీకార చర్యాచాపం అంటే ఏమిటి? 16.మెదడు దశాబ్దం అని దేన్ని అంటారు? 17.ప్రతీకార చర్యలు అంటే ఏమిటి? 2 మార్కులు: 1.మొక్కల్లో పెరుగుదల నియంత్రణ పదార్థాలంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి? 2.అగ్రాధిక్యం అంటే ఏమిటి? అది మొక్కలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? 3.టిటాని గురించి క్లుప్తంగా రాయండి? 4.వినాళ గ్రంథులు అంటే ఏమిటి? వివరించండి? 5.డయాబెటిస్ మిల్లిటస్ లేదా మధుమేహ వ్యాధి గురించి క్లుప్తంగా రాయండి? 6.ఈస్ట్రోజన్ చేసే పనులేవి? 7.ప్రొజెస్టిరాన్ చేసే పనులేవి? 8.ఏక్జాన్, డెండ్రైట్‌ల మధ్య భేదాలేవి? 9.అపవాహి, అభివాహి నాడుల మధ్య భేదాలేవి? 10.క్రియాత్మక కరెంట్ లేదా నాడీ ప్రచోదనం అంటే ఏమిటి? 11.ఏక్జాన్, డెండ్రైట్లను ఎలా గుర్తుపడతారు? 12.గెరీ, సల్సి అంటే ఏమిటి? వీటి వల్ల కలిగే ఉపయోగం ఏమిటి? 13.వెన్నుపాము విధులేవి? 14.మస్తిష్కమేరు ద్రవం ఎక్కడ ఉంది? దాని విధులేమిటి? 15.మానవుడి మెదడు ఏ విధంగా అఘాతాల నుంచి రక్షణ పొందుతుంది? 16.ఏదైనా వేడి వస్తువు మీ చేతిని తాకితే వెంటనే మీకు తెలియకుండానే చేతిని ఎలా వెనుకకు తీసుకుంటారో తెలియజేయండి? 17.ప్రతీకార చర్యా చాపం గురించి క్లుప్తంగా రాయండి? 4 మార్కులు: 1.మొక్కల్లో సైటోకైనిన్ల ప్రభావం ఏమిటి? 2.ఆక్సిన్లు అంటే ఏమిటి? అవి మొక్కల పెరుగుదలను ఎలా ప్రభావితం చేస్తాయి? 3.మొక్కల పెరుగుదల అభివృద్ధిలో జిబ్బరెల్లిన్‌ల పాత్ర ఏమిటి? 4.మొక్కల పెరుగుదల పదార్థాలు ఒకదానికొకటి సహకరిస్తాయి (లేదా) అవి ఒకదానికొకటి విరుద్ధంగా పనిచేస్తాయి. - ఈ వాక్యాన్ని సమర్థించడానికి కొన్ని ఉదాహరణలివ్వండి? 5.శరీరంలో పీయూష గ్రంథి ప్రాముఖ్యం ఏమిటి? ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్లను పేర్కొని, వాటి చర్యలను తెలపండి? 6.అధివృక్క గ్రంథుల గురించి రాయండి? 7.నాడీ కణాన్ని పటం సహాయంతో వర్ణించండి? 8.మానవ మస్తిష్క నిర్మాణాన్ని వివరించండి? 9.వెన్నుపాము నిర్మాణం గురించి క్లుప్తంగా రాయండి? 10.ప్రతీకార చర్యాచాపంలో భాగాలు, వాటి చర్యలను తెలపండి? 11.నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలకు భేదాలను రాయండి? ప్రత్యుత్పత్తి మొక్కల్లో అలైంగిక, లైంగిక ప్రత్యుత్పత్తి 1.అలంకరణకు, ఉద్యానవన మొక్కల అభివృద్ధికి ఉపయోగించే ప్రత్యుత్పత్తి విధానం ---------. 2.చామంతి మొక్క సాధారణంగా --------- ద్వారా వ్యాప్తి చెందుతుంది. 3.రణపాలాకు మీద ఉండే మొగ్గలను --------- అంటారు. 4.కాండం ఛేదనంలో కాండానికి ఏటవాలు గాయం చేసే స్థలం ---------. 5.ఈస్ట్‌లో సాధారణంగా జరిగే అలైంగికోత్పత్తి విధానం ---------. 6.కరివేప, వేప మొక్కల్లో శాఖీయోత్పత్తికి తోడ్పడేవి ---------. 7.మొక్క కణం నుంచి పూర్తిగా ఒక మొక్క ఏర్పడే శక్తిని --------- అంటారు. 8.--------- వర్థన యానంలో ఉపయోగించి సామాన్యంగా ఏకస్థితిక మొక్కలను తయారు చేస్తారు. 9.లైంగికోత్పత్తిలో తర్వాత తరం మొక్కల్లో కొత్త లక్షణాలు ఏర్పడటానికి కారణం ---------. 10.జాతి పరిణామక్రియలో ప్రకృతి వరణానికి ఎక్కువగా సహాయపడేది ---------. 11.బ్యాక్టీరియా, యూగ్లీనాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ---------. 12.ఆస్పర్ జిల్లస్లో --------- అనే నిర్మాణం చివర సిద్ధబీజాలు ఏర్పడతాయి. 13.కణజాల వర్థనంలో ఏ మొక్క నుంచి కణాలను వేరు చేసి తీస్తామో దానిని --------- అంటారు. 14.కణజాల వర్థనాల్లో ఎక్స్‌ప్లాంట్ కణాలు విభజన చెందడం వల్ల ఏర్పడిన నిర్దిష్ట ఆకారం లేని కణజాలాన్ని --------- అంటారు. 15.అండాశయంలో పెరగని పిండాలను వర్థన యానంలో పెంచడాన్ని --------- అంటారు. 16.కణజాల వర్థన విధానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త---------. 17.కణజాల వర్థనం ద్వారా మన దేశానికి చెందిన శాస్త్రజ్ఞులు --------- ఏకస్థితిక మొక్కల్ని పెంచవచ్చని నిరూపించారు. 18.పురుష సంయోగబీజం, స్త్రీ బీజంతో సంయోగం చెందిన తర్వాత ఏర్పడే కణాన్ని --------- అంటారు. 19.లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా అవసరమయ్యే పుష్పభాగాలు ---------. 20.పుష్పంలో మూడో వలయంలో---------అమరి ఉంటుంది. 21.3 కేంద్రకం --------- కేంద్రకంతో, పురుష కేంద్రకం పిండకోశంలో కలవడం వల్ల ఏర్పడుతుంది. 22.ఫలదళాలు --------- లో ఉంటాయి. 23.పరాగ మాతృకణంలో --------- విభజన జరుగుతుంది. 24.పురుష సంయోగ బీజం --------- తో సంయోగం చెందితే అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది. 25.ఫలదీకరణం చెందిన తర్వాత కూడా ఉపయోగపడే పుష్ప భాగం ---------. 26.బాగా ఏర్పడిన పిండంలో వేరుభాగాన్ని సూచించేది ---------. 27.పిల్లతరంలో జన్యువైవిధ్యం ఉండటానికి సాధార ణంగా --------- ప్రత్యుత్పత్తిని ఆచరిస్తారు. 28.--------- విభజన వల్ల రెండు జనకుల ఉత్పత్తి కణాల్లో ఉండే క్రోమోజోమ్‌ల సంఖ్య సగానికి తగ్గుతుంది. 29.పుప్పొడి రేణువుల అధ్యయనాన్ని --------- అంటారు. 30.అండంలోని కణజాలాన్ని --------- అంటారు. 31.అండాశయంలో ఉబ్బిన భాగం నుంచి అండాలు పెరిగే భాగం పేరు ---------. 32.పిండకోశంలో ఫలదీకరణం చెందే సమయంలో ద్వయస్థితికలో ఉండే భాగం---------. 33.ఫలదీకరణం చెందిన తర్వాత మొదటిసారిగా ఉండే ద్వయస్థితిక భాగం---------. 34.పిండకోశంలో పరాగనాళం స్త్రీ బీజకణం దగ్గరకు కదిలేటట్లు సహాయపడేవి---------. సమాధానాలు 1) శాఖీయోత్పత్తి; 2) పిలకమొక్కల; 3) పత్రోపరిస్థిత కోరకాలు; 4) కణుపు కింద భాగం; 5) కోరకీభవనం; 6) వేరుమొగ్గలు; 7) టోటిపొటెన్సీ; 8) పరాగ రేణువులను; 9) క్రోమోజోమ్‌లు; 10) లైంగికోత్పత్తి; 11) ద్విధావిచ్ఛిత్తి; 12) కొనిడియోఫోర్; 13) ఎక్స్‌ప్లాంట్; 14) కాల్లస్; 15) పిండసంరక్షణ; 16) హెబర్‌లాండ్; 17) షిప్రగుహ, సతీష్ మహేశ్వరి; 18) సంయుక్త బీజం; 19) కేశరావళి, అండకోశం; 20) కేసరావళి; 21) ద్వితీయ; 22) అండకోశం; 23) క్షయకరణ; 24) ద్వితీయ కేంద్రకం; 25) అండం; 26) ప్రథమ మూలం; 27) లైంగిక; 28) క్షయకరణ; 29) సిద్ధబీజ శాస్త్రం; 30) అండంతః కణజాలం; 31) అండన్యాసస్థానం; 32) ద్వితీయ కేంద్రకం; 33) సంయుక్త బీజం; 34) సినర్జీడ్లు. జంతువుల్లో లైంగిక ప్రత్యుత్పత్తి 1.పేరమీషియం --------- ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది. 2.వానపాములో ఫలదీకరణం --------- లో జరుగుతుంది. 3.ఈగలో --------- ఫలదీకరణం చెందిన అండాల విడుదలలో సహాయపడుతుంది. 4.కప్పలోని ఏంప్లక్సరీ మెత్తలు--------- లో తోడ్పడతాయి. 5.బాహ్య ఫలదీకరణం జరిపే జంతువులు---------. 6.సంయోగం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవి ---------. 7.సంయోగం ఒక ---------. 8.ద్విధావిచ్ఛితి వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదించడానికి పేరమీషియం జరిపే చర్య---------. 9.పేరమీషియంలో సూక్ష్మ కేంద్రకం ఆధీనంలో ఉండే చర్య ---------. 10.మెగాస్కోలెక్స్లో ముష్కాలు ఉండే ఖండితాలు---------. 11.వానపాములో శుక్రగ్రాహికలో నిల్వ చేసేవి ---------. 12.కప్పలో మూత్ర జననేంద్రియ నాళంగా పనిచేసే నాళం ---------. 13.కప్ప మిల్ట్లో ఉండేవి---------. 14.కప్ప స్పాన్‌లో ఉండేవి---------. 15.పురుష బీజకణాన్ని --------- అంటారు. 16.అంతర ఫలదీకరణంలో --------- స్త్రీ జీవి శరీరంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. 17.వానపాము వేరొక వానపాము నుంచి గ్రహించిన శుక్రకణాలను---------లో నిల్వచేస్తుంది. 18.స్వరకోశాలు --------- కప్పలో ఉంటాయి. 19.కప్ప అండంలో వర్ణక పదార్థంతో నల్లగా ఉండే భాగాన్ని --------- అంటారు. 20.కప్ప అండంలో పీతకం ఉండే తెల్లని భాగాన్ని --------- అంటారు. 21.సంయుక్త బీజం జరిపే విభజనలు ---------. 22.పేరమీషియంలో శారీరక చర్యలను నియంత్రించే కేంద్రకం ---------. 23.ఒక సంయోగకం ఉత్పత్తి చేసే పిల్ల జీవుల సంఖ్య ---------. 24.వానపాములో గుడ్లతిత్తిని ఏర్పాటు చేసేది---------. 25.సంపర్కంలో తోడ్పడే ఏంప్లక్సరీ మెత్తలు ఉన్న జంతువు ---------. 26.అండకణంలోనికి చొచ్చుకొని పోయేందుకు ఉపయోగపడే శుక్రకణ నిర్మాణం---------. 27.వానపాములో క్లైటెల్లమ్లో ఉబ్బి ఉన్న ఖండితాలు ____. 28.లైంగిక ద్విరూపకత చూపే జంతువులు ____. సమాధానాలు 1) సంయోగం; 2) గుడ్లకోశం; 3) అండశబిక; 4) సంపర్కం; 5) కప్ప, చేప; 6) పేరమీషియం; 7) లైంగిక ప్రత్యుత్పత్తి; 8) సంయోగం; 9) ప్రత్యుత్పత్తి; 10) 10, 11; 11) శుక్రకణాలు; 12) మూత్రనాళం; 13) శుక్ర కణాలు; 14) అండాలు; 15) శుక్రకణం; 16) శుక్రకణాలు; 17) శుక్రగ్రాహిక; 18) మగ; 19) జాంతవ ధృవం; 20) బృహత్ఖండ ధృవం; 21) సమ విభజనం; 22) స్థూల కేంద్రకం; 23) 4 24) క్లైటెల్లమ్; 25) మగ కప్ప; 26) ఏక్రోజోమ్, 27) 14 నుంచి 17 ఖండితాలు; 28) వానపాము, జలగ. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 1.మూడో నెల గర్బధారణ నుంచి పిండాన్ని ....... అంటారు. 2.ప్రతిస్థాపనంలో పిండం ....... కుడ్యానికి అంటిపెట్టుకుంటుంది. 3.పిండం కణ వృద్ధి కోసం అది ....... కణవిభజన పద్ధతిని అవలంబిస్తుంది. 4.శుక్రకణానికి ఉండే ....... ఫలదీకరణలో సహాయ పడుతుంది. 5.పౌరుష గ్రంథి మానవ ....... వ్యవస్థలో ఒక అనుబంధ గ్రంథి. 6........ నిర్మాణంలో గ్రాఫియన్ పుటికలు ఉంటాయి. 7.పుటిక నుంచి విడుదలయ్యే అండం....... లోకి ప్రవేశిస్తుంది. 8.స్త్రీలలో ఒకసారి విడుదలయ్యే అండాల సంఖ్య....... . 9.ముష్కాలను ఉత్పత్తి చేసే హార్మోన్ ....... . 10.భ్రూణం, గర్భాశయ కుడ్యానికి ....... ద్వారా అంటి పెట్టుకుంటుంది. 11.రుతు చక్రాన్ని అదుపుచేసే హార్మోన్లు ....... పూర్వ లంబిక నుంచి ఉత్పత్తి అవుతాయి. 12........ లో ఉండే గ్రాఫియన్ పుటికలు ....... విడుదల చేస్తాయి. 13.ముష్కం....... ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండే నిర్మాణం. 14.శుక్రోత్పాదిక నాళికలు ఉన్న అవయవం....... 15.శుక్రోత్పాదిక నాళికల నుంచి శుక్రకణాలు ....... లోకి ప్రవేశిస్తాయి. 16.ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉత్పత్తి చేసే నిర్మాణం....... 17.ల్యూటినైజింగ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే నిర్మాణం ....... . 18.శుక్ర కణాలు చలించడానికి అవసరమైన శక్తిని ....... ఉత్పత్తి చేస్తుంది. 19.పగిలిన పుటికను....... అంటారు. 20.పుటిక పగిలిన తర్వాత అది కార్పస్లూటియమ్గా మారడాన్ని ప్రోత్సహించేది....... 22.యాంత్రిక అఘాతాల నుంచి పిండానికి రక్షణనిచ్చేవి ....... . 23.మానవులలో గర్భావధి కాలం సుమారు ....... . 24.భారత ప్రభుత్వం బాల్య వివాహాల అదుపు చట్టాన్ని ....... సంవత్సరంలో ప్రవేశపెట్టింది. 25.స్త్రీ బీజ కోశంలో సంచిల్లాంటి నిర్మాణాలను ....... అంటారు. 26.గ్రాఫియన్ పుటిక నుంచి అండం విడుదలవడాన్ని ....... అంటారు. 27.స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే మార్పుల చక్రాన్ని ....... అంటారు. 28.గర్భధారణ జరిగిన 12వ వారానికి....... ఏర్పడుతుంది. 29.శుక్ర కణానికి ఉండే ఏక్రోజోమ్ శారీరక ....... చర్యల్లో తోడ్పడుతుంది. 30.స్త్రీలలో ఫలదీకరణ జరిగే భాగం ....... . సమాధానాలు 1) భ్రూణం; 2) గర్భాశయ; 3) సమ; 4) ఏక్రోజోమ్; 5) ప్రత్యుత్పత్తి; 6) అండాల; 7) ఫెల్లోపియన్ నాళం; 8) 1; 9) టెస్టోస్టిరాన్; 10) జరాయువు; 11) పీయూష గ్రంథి; 12) అండకోశాల, అండాన్ని; 13) పురుష; 14) ముష్కాలు; 15) శుక్ర నాళికల; 16)పీయూష గ్రంథి; 17) పీయూష గ్రంథి; 18) మైటోకాండ్రియా; 19) కార్పస్లూటియమ్; 20) పీయూష గ్రంథి; 21) ల్యూటినైజింగ్ హార్మోన్; 22) ఉల్బం, ఉల్బక ద్రవం; 23) 40 వారాలు; 24) 1978; 25) స్త్రీ బీజ కోశ పుటిక లేదా గ్రాఫియన్ పుటిక; 26) రుతు చక్రం; 27) కార్పస్లూటియమ్; 28) జరాయువు; 29) ప్రత్యుత్పత్తి; 30) ఫెల్లోపియన్ నాళాలు. ముఖ్య ప్రశ్నలు 1 మార్కు: 1.టోటిపొటెన్సీ అంటే ఏమిటి? 2.ఎక్స్‌ప్లాంట్ అంటే ఏమిటి? 3.కాల్లస్ ఎప్పుడు ఏర్పడుతుంది? 4.అంట్లు అంటే ఏమిటి? 5.సిద్ధబీజ శాస్త్రం అంటే ఏమిటి? 6.రక్షక పత్రాలకు,ఆకర్షణ పత్రాలకు తేడాలు రాయండి? 7.వానపాము ఉభయలైంగిక జీవి అయినప్పటికీ ఆత్మ ఫలదీకరణం ఎందుకు జరపదు? 8.ఎంప్లక్సరీ మెత్తలు కప్పకు ఎలా ఉపయోగపడతాయి? 9.మిల్ట్ అంటే ఏమిటి? 10.స్పాన్ అంటే ఏమిటి? 11.ఒక జంతువును ఉభయ లైంగిక జీవి అని ఎప్పుడు అంటారు? ఉదాహరణ ఇవ్వండి? 12.బాహ్య ఫలదీకరణం జరిపే రెండు జంతువుల పేర్లు రాయండి? 13.మానవులలో అండోత్సర్గం అంటే ఏమిటి? 2 మార్కులు: 1.శాఖీయోత్పత్తి వల్ల కలిగే రెండు ప్రయోజనాలు రాయండి? 2.అంటుకట్టడంలోని రకాలను పేర్కొనండి? 3.కాల్లస్ అంటే ఏమిటి? 4.ద్విధా విచ్ఛిత్తి అంటే ఏమిటి? ఈ పద్ధతి ఏ జీవిలో జరుగుతుంది? 5.శాఖీయ ప్రత్యుత్పత్తి లేదా శాఖీయ వ్యాప్తి అంటే ఏమిటి? 6.పిండ సంరక్షణ అంటే ఏమిటి? ఏ పరిస్థితుల్లో దీనిని అమలు పరుస్తారు? 7.లైంగిక ప్రత్యుత్పత్తి ప్రయోజనాలు తెల్పండి? 8.లైంగిక ద్విరూపకత అంటే ఏమిటి? లేదా జంతువులలో లైంగిక ద్విరూపకతను క్లుప్తంగా రాయండి? 9.శుక్రకణానికి, అండానికి మధ్య భేదాలను తెల్పండి? 10.కప్ప అండంలోని జాంతవ ధృవం, బృహత్ఖండ ధృవాలను ఎలా గుర్తిస్తారు? 11.మగకప్ప, ఆడకప్పలను ఎలా గుర్తు పడతారు? 12.కార్పస్ లూటియం అంటే ఏమిటి? దాని పని ఏమిటి? 13.మానవుని శుక్రకణ నిర్మాణాన్ని వర్ణించండి? 14.భ్రూణం అని దేనినంటారు? 4 మార్కులు: 1.లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తుల్లో ఉండే ముఖ్య తేడాలేమిటి? 2.శాఖీయోత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి? 3.మొక్కల కణాలు, కణజాల వర్థనం ద్వారా కలిగే ప్రయోజనాలు లేదా ఉపయోగాలు తెల్పండి? 4.మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను పేర్కొని, ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి? 5.అంటుకట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిం చండి? 6.పుష్పంలో ప్రధాన భాగాలను వివరించండి? లేదా పుష్ప నిర్మాణాన్ని తెల్పండి? 7.పిండకోశ నిర్మాణాన్ని పట సహాయంతో వివరించండి? 8.పేరమీషియంలో సంయోగం గురించి క్లుప్తంగా రాయండి? 9.మానవులలో రుతుచక్రాన్ని వర్ణించండి? 10.శుక్రకణానికి, అండకణానికి మధ్య భేదాలేవి? 11.వివిధ గర్భనిరోధక పద్ధతులు తెలపండి? 12.ప్రతిస్థాపన అంటే ఏమిటి? మానవులలో అది ఎలా జరుగుతుంది? 5 మార్కులు: 1.ఉమ్మెత్త పువ్వు నిలువుకోత పటం గీసి, భాగాలను గుర్తించండి? 2.పుష్పం అండ నిర్మాణం పటం గీసి, భాగాలను గుర్తించండి? 3.మొక్కలలో ఫలదీకరణ విధానం చూపే పటం గీసి, భాగాలను గుర్తించండి? 4.కప్ప పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీసి, భాగాలను గుర్తించండి? 5.కప్ప స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీసి, భాగాలు గుర్తించండి? 6.మానవ శుక్ర కణం పటం గీసి, భాగాలు గుర్తించండి? హెచ్ఐవీ- ఎయిడ్స్ 1.హెచ్ఐవీ సోకడం వల్ల కలిగే తర్వాత ఫలితం ....... . 2.సురక్షితం కాని లైంగిక సంబంధాలు అంటే ....... ఉపయోగించకపోవడం. 3.హెచ్ఐవీకి మందులేదు ....... ఒక్కటే మార్గం. 4.ఎయిడ్సను కలిగించే జీవి ....... . 5.ఎస్టీడీల వ్యాప్తి, ఎయిడ్సల మధ్య ....... . 6.సరైన నిర్ణయాన్ని తీసుకునే నైపుణ్యానికి అవసరం ....... . 7.హెచ్ఐవీ ఉత్పత్తి చేసే ముఖ్యమైన ఎంజైమ్....... . 8.ఇటీవల 3 మిలియన్లకు పైగా వ్యక్తులను బలిగొన్న వ్యాధి ....... . 9.హెచ్ఐవీ, ఎయిడ్స సోకిన పిల్లలు ....... జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఇవ్వాలి. 10.ఒక వ్యక్తికి ....... సోకినప్పటికీ అతనికి ఆ విషయం తెలియదు. 11.పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడమనేది....... జీవన నైపుణ్యం. 12.వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడగలగడానికి కావలసిన నైపు ణ్యం....... . 13.స్నేహితులు, బంధువులతో చక్కని సంబంధాలు నేర్ప రచే నైపుణ్యం....... . 14.సాధారణంగా హెచ్ఐవీ వ్యాప్తికి అనుకూలించే మార్గం....... . 15.హెచ్ఐవీకి వాహకం....... . 16........ సోకిన వ్యక్తి వెంటనే వ్యాధి చిహ్నాలను చూపలేడు. 17.హెచ్ఐవీ ఉనికిని తెలిపే పరీక్ష ....... . 18.హెచ్ఐవీ సోకిన పిల్లలను పాఠశాలలో చేర్చుకునే విధానం ....... . 19.ఎయిడ్స వ్యాధి వల్ల తగ్గే శరీర బరువు శాతం....... . 20.హెచ్ఐవీ వ్యాధి పొదుగు కాలాన్ని ....... అని కూడా అంటారు. 21.హెచ్ఐవీ తరచూ ఆకారాన్ని మార్చడానికి సహాయపడే ఎంజైమ్....... . 22.హెచ్ఐవీ....... కుటుంబంలో ....... తరగతికి చెందిన ఆర్ఎన్ఏ వైరస్. 23.హెచ్ఐవీ ....... పరిమాణంలో ఉంటుంది. 24.హెచ్ఐవీ ....... ఆకారంలో ఉంటుంది. 25.రక్తంలో వైరస్లు ఉన్నప్పటికీ ప్రతిరక్షకాలు కనిపించని దశను ....... అంటారు. సమాధానాలు 1) ఎయిడ్స దశకు చేరుకోవడం; 2) కండోమ్; 3) నివారణ; 4) హెచ్ఐవీ; 5. దగ్గరి సంబంధం ఉంది; 6) సంభాషణా నైపుణ్యం; 7) రివర్స ట్రాన్స్క్రిప్టేజ్; 8) ఎయిడ్స; 9) సాధారణ; 10) హెచ్ఐవీ; 11) సమస్యలను అధిగమించే; 12) సంభాషణా నైపుణ్యం; 13) వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించే నైపుణ్యం; 14) రక్తం; 15) మానవ రక్తం; 16) హెచ్ఐవీ; 17) రక్త పరీక్ష; 18) ఇతర మామూలు పిల్లలవలె; 19) 10 శాతం; 20) వ్యాధి చిహ్నాలు కనిపించని హెచ్ఐవీ+ దశ; 21) రివర్స ట్రాన్ స్క్రిప్టేజ్; 22) రిట్రో విరిడె, లెంటి వైరస్; 23) 120 నానో మీటర్(10-9 మీ); 24) ఐకోసా హెడ్రల్; 25) విండో పీరియడ్. ముఖ్య ప్రశ్నలు 1 మార్కు: 1.హెచ్ఐవీ ఏ కుటుంబానికి చెందుతుంది? 2.భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిడ్స సోకిన వ్యక్తిని ఎక్కడ, ఎప్పుడు గుర్తించారు? 3.హెచ్ఐవీని విస్తరించండి? 4.హెచ్ఐవీ ప్రత్యేకతకు కారణమైన ఎంజైమ్ ఏది? 6.నీ స్నేహితుడు/స్నేహితురాలు నిన్ను పొగతాగమని ప్రేరేపించినప్పుడు నీవు ఎలా ప్రతిస్పందిస్తావు? 7.ఒక వ్యక్తి బాహ్య లక్షణాలను చూసి అతనికి హెచ్ఐవీ సోకిందో లేదో చెప్పొచ్చా? 2 మార్కులు: 1.హెచ్ఐవీలో కనిపించే ఎంజైమ్లేవి? 2.హెచ్ఐవీ నిర్మాణాన్ని వర్ణించండి? 3.ఎయిడ్స వ్యాధి గురించి క్లుప్తంగా రాయండి? 4.హెచ్ఐవీ ప్రతిరక్షకాలను గుర్తించే పరీక్షలను పేర్కొ నండి? 4 మార్కులు: 1.హెచ్ఐవీ.. ఎయిడ్స వంటి సమస్యాత్మక పరిస్థితులను ఎదుర్కోవడంలో జీవన నైపుణ్యాలు ఎలా అవసరమ వుతాయి? ఏయే జీవన నైపుణ్యాలు కలిగి ఉండాలి? 2.హెచ్ఐవీ తనకు సోకకూడదని నిర్ణయం తీసుకున్న వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? 3.ఒక వ్యక్తికి హెచ్ఐవీ సోకిన తర్వాత అతడు ఎయిడ్స దశను ఏయే దశల ద్వారా చేరుకుంటాడు? 4.హెచ్ఐవీ ఏయే మార్గాల్లో వ్యాప్తి చెందుతుంది? 5.ప్రస్తుతం హెచ్ఐవీ వ్యాప్తి ఎందుకు తీవ్ర సమస్యగా పరిణమించింది? 6.హెచ్ఐవీ, ఎయిడ్స మధ్య భేదాలు తెలపండి? పోషణకు అవసరమయ్యే పదార్థాలు/ పోషకాహార లోపం 1.శక్తికి, పెరుగుదలకు, శరీర నిర్మాణానికి అవసరమయ్యే రసాయనిక పదార్థాలను ....... అంటారు. 2.పోషణ అంటే శరీరానికి అవసరమయ్యే అన్ని ....... ను తీసుకోవడం. 3.పాలలోని చక్కెరను ....... అంటారు. 4.చెరకులోని చక్కెరను ....... అంటారు. 5.జంతువుల్లోని స్టార్చని....... అంటారు. 6.కాలేయంలో నిల్వ ఉండే కార్బోహైడ్రేట్లను ....... అంటారు. 7.అమైనో ఆమ్లాలు ....... ల పరిమాణాలు 8.ఐరన్ లోపం వల్ల ....... కలుగుతుంది. 9.గ్రాము పిండిపదార్థం నుంచి ....... కిలో కేలరీల శక్తి వస్తుంది. 10.పొటాషియం అయాన్లు ....... లోపల ద్రవాభిసరణ తులస్థితిని క్రమపరుస్తాయి. 11.కణం లోపల కొత్త అణువులు తయారవడానికి ....... వంటి శక్తి అవసరం. 12.సెల్యులోజ్ ఒక ....... 13.ఒక గ్రాము గ్లూకోజ్ విడుదల చేసే శక్తి ....... . 14.జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రొటీన్లు ఉన్న పదార్థాల ....... 15.గాయిటర్ ....... లోపం వల్ల కలుగుతుంది. 16. ....... ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి. 17.పెద్దవారికి కాకుండా పిల్లలకు మాత్రమే ....... ఆవశ్యక ఎమైనో ఆమ్లం. 18. ....... వద్ద కొవ్వు ఘన రూపంలో ఉంటుంది. 19.అయోడిన్ లోపం వల్ల ....... కలుగుతుంది. 20.ఎక్కువ మొత్తాల్లో ఫ్లోరిన్ తీసుకోవడం వల్ల ....... ఏర్పడుతుంది. 21.మనకు ప్రతిదినం కావాల్సిన కాల్షియం సుమారుగా ....... . 22.ఒక గ్రాము కొవ్వు విడుదల చేసే కిలో కేలరీల శక్తి ....... 23.కణబాహ్య ద్రవాల్లో ....... ముఖ్యమైన కేటయాన్. 24.కణజీవ పదార్థంలో ....... ముఖ్యమైన కేటయాన్. 25.దంతాలపైన ఉండే పింగాణి ఏర్పడడానికి ....... అవసరం. 26.ప్రకృతిలో ఉన్న ఎమైనో ఆమ్లాల సంఖ్య ....... . 27.క్వాషియోర్కర్ వ్యాధి ....... లోపం వల్ల కలుగుతుంది. 28.అతిగా తినడం వల్ల, అదనపు శక్తి ....... గా మారుతుంది. 29.శరీరంలో అధికంగా ఉండే కొవ్వు ....... కణాల్లో నిల్వ ఉంటుంది. 30.శరీరం బరువులో 20 శాతం కంటే ఎక్కువ బరువు కొవ్వు వల్ల అయితే, ఆ వ్యక్తికి సంభవించే వ్యాధిని ....... అంటారు. 31.ఇటీవల జరిపిన పరిశోధనల వల్ల స్థూలకాయత్వాన్ని గురించి తెలిసిన విషయం, అది ....... కావచ్చు. 32.కేలరీల పోషకాహార లోపాన్నిచి ....... అని కూడా అంటారు. 33.కాళ్లు, చేతులు పుల్లలుగా ఉండి, పక్కటెముకలు ప్రస్ఫుటంగా కనిపించే శిశువ్యాధి ....... . 34.క్వాషియోర్కర్ అనే పదానికి అర్థం ....... . 35. ....... లోపం వల్ల శరీరం పెరుగుదల తక్కువగా ఉంటుంది. సమాధానాలు 1) పోషకాలు; 2) పోషక పదార్థాల; 3) లాక్టోజ్ ; 4) సుక్రోజ్; 5) గ్లైకోజన్; 6) గ్లైకోజన్; 7) ప్రొటీన్; 8) రక్తహీనత (ఎనీమియా); 9) 4; 10) కణం; 11) అఖ్కీ; 12) కార్బోహైడ్రేట్ (పిండి పదార్థం); 13) 4 కిలో కాలరీలు; 14) మాంసం, గుడ్లు, పాలు; 15) అయోడిన్; 16) ఫ్లోరిన్; 17) హిస్ట్టిడిన్; 18) 200ఇ; 19) సామాన్య గాయిటర్, 20) ఫ్లోరోసిస్; 21) 400-500 మి.గ్రా.; 22) 9.45 కిలో కేలరీలు; 23) సోడియం; 24) పొటాషియం; 25) ఫ్లోరిన్; 26) 24; 27) ప్రోటీనులు; 28) కొవ్వు; 29) ఎడిపోజ్; 30) స్థూలకాయత్వం; 31) వంశపారంపర్యం; 32) శక్తిపోషకాహార లోపం; 33) మెరాస్మస్; 34) నిర్లక్ష్యానికి గురైన శిశువు; 35) ప్రోటీనుల. విటమిన్లు- వనరులు- న్యూనతా వ్యాధులు 1.బియ్యాన్ని పాలిష్ చేసినా, ఎక్కువగా కడిగినా, దానిలో ....... విటమిన్ పోతుంది. 2.గ్లాసైటిస్లో ....... ఎర్రగా తళతళలాడుతుంది. 3.సూర్యరశ్మి శరీరంలోని ఆహారంలో ఉన్న ....... ను విటమిన్ ‘డి’గా మారుస్తుంది. 4.పురుషుల్లో వంధ్యత్వం రాకుండా చేసే విటమిన్ ....... . 5.బొప్పాయి పండులో ....... విటమిన్ అధికంగా ఉంటుంది. 6. ....... విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది. 7.థయమిన్ లోపం వల్ల ....... వ్యాధి కలుగుతుంది. 8.విటమిన్ ‘బి3’ లోపం వల్ల కలిగే వ్యాధి ....... . 9.పాంటోథినిక్ ఆమ్ల లోపం వల్ల మంటలు మండే భాగం ....... . 10.విటమిన్ల పుట్టు పూర్వోత్తరాలు ....... శతాబ్దానికి చెందినవి. 11.సర్ హెచ్.జి. హాప్కిన్స పెరుగుదలకు సంబంధించిన ఒక పదార్థం ....... ఉందని కనుక్కొన్నారు. 12.న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణానికి అవసరమయ్యే విటమిన్ ....... 13.వేడికి అతి త్వరితంగా నశించిపోయే విటమిన్ ....... . 14.రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ....... . 15.విటమిన్లు ....... . 16.విటమిన్ ‘బి1’ని ....... అని కూడా అంటారు. 17.రైబోఫ్లావిన్ అనేది ....... విటమిన్ రసాయన నామం. 18.హానికర రక్తహీనత ....... విటమిన్ న్యూనత వల్ల కలుగుతుంది. 19.సయనాకోబాలమైన్ అనేది ....... విటమిన్ పేరు. 20. ....... విటమిన్ లోపం వల్ల అలసట కలుగుతుంది. 21.విటమిన్ ‘సి’ లోపం వల్ల ....... అనే వ్యాధి కలుగుతుంది. 22.ఎస్కార్బిక్ ఆమ్లం అనేది ....... విటమిన్ పేరు. 23.ఫాంటోథినిక్ ఆమ్లం ....... లో కరిగే విటమిన్. 24.సయనాకోబాలమైన్ ....... లో కరిగే విటమిన్. 25.ఫోలిక్ ఆమ్లం రసాయనిక నామం ....... . 26.విటమిన్లను మొదటిసారిగా ....... అనే శాస్త్రవేత్త కనుక్కొన్నారు. 27.పురుషుల్లో వంధ్యత్వం ....... విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. 28.విటమిన్లు శరీరంలో సంశ్లేషణం కావు. అందువల్ల వాటిని ....... పోషకాలంటారు. 29.విటమిన్ ‘కె’ ....... కరిగే విటమిన్. 30.పైరిడాక్సిన్ అనేది ....... విటమిన్ పేరు. 31.న్యూక్లిక్ ఆమ్లాల జీవక్రియలో ....... ప్రముఖ పాత్ర వహిస్తుంది. 32.రోడాప్సిన్, ఇడాప్సిన్ అనే వర్ణకాలు ....... లోని ....... పొరలో ఉంటాయి. 33.నియాసిన్ అనేది విటమిన్ ....... . 34.గ్లాైసైటిస్ అనే వ్యాధి ....... విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. 35.పైరిడాక్సిన్ అనేది ....... విటమిన్ రసాయనిక నామం. 36.బయోటిన్ అనేది ....... . 37.విటమిన్ ‘సి’ లోపం వల్ల కలిగే వ్యాధి ....... . 38. ....... పదార్థం తింటే జపాన్ దేశ నావికుల్లో బెరిబెరి వ్యాధి కలిగిందని తెలిసింది. 39.కొల్లాజన్ ఏర్పడటానికి అవసరమయ్యే విటమిన్ ....... . 40.గాయాలు నయమవడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి తోడ్పడే విటమిన్ ....... . 41.విటమిన్ ‘సి’ ....... ఖనిజ లవణాన్ని శోషణం చేసుకుని, నిల్వ చేయడంలో తోడ్పడుతుంది. 42.జిరాఫ్థాల్మియా వ్యాధి చిచిచిచి కి సంబంధించింది. 43.విటమిన్ ‘ఎ’ రసాయనిక నామం ....... 44.విటమిన్ ‘డి’ రసాయనిక నామం ....... . 45.విటమిన్ ‘ఇ’ రసాయనిక నామంచి ....... 46.విటమిన్ అనే పేరును మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ....... . 47.నోటిమూలల్లో పగలడం, కళ్లనుంచి నీరు కారడం ....... విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. 48.విటమిన్ ‘బి3’ లోపం వల్ల కలిగే వ్యాధి ....... . 49.చిగుళ్లు వాచి, వాటి నుంచి రక్తస్రావం అవడం అనేది ....... వ్యాధి లక్షణం. 50.మన శరీరంలో కెరాటిన్ ....... గా మారుతుంది. సమాధానాలు 1) ఆ1(థయామిన్); 2) నాలుక; 3) కొలెస్ట్రాల్; 4) ’ఉ’ (టోకోఫెరాల్); 5) ’అ’; 6) ’ఈ’ (కాల్సిఫెరాల్); 7) గ్లాసైటిస్; 8) పెల్లాగ్రా; 9) కాళ్లు; 10) 18వ; 11) పాలలో; 12) ఫోలిక్ ఆమ్లం; 13) ’ఇ’ (ఎస్కార్బిక్ ఆమ్లం); 14) ’ఓ’; 15) సూక్ష్మపోషకాలు; 16) థయామిన్; 17) ఆ2; 18) ఆ12; 19) ఆ12; 20) బయోటిన్; 21) స్కర్వి; 22) ఇ; 23) నీటి; 24) నీటి; 25) ఫోలిక్ ఆమ్లం; 26) హెచ్.జి. హాప్కిన్స; 27) ఉ(టోకోఫెరాల్); 28) ఆవశ్యక; 29) కొవ్వులో; 30) ఆ6; 31) ఫోలిక్ ఆమ్లం; 32) కంటి, రెటీనా; 33) ఆ3; 34) ఆ2; 35) ఆ6; 36) విటమిన్; 37) స్కర్వి; 38) పాలిష్ చేసిన బియ్యం; 39) ఇ; 40) ఇ; 41) ఐరన్; 42) కంటి; 43) రెటినాల్; 44) కాల్సిఫెరాల్; 45) టోకోఫెరాల్; 46) ఫంక్; 47) ఆ2; 48) పెల్లాగ్రా; 49) స్కర్వి; 50) విటమిన్ ’అ’. ఉష్ణ మండల వ్యాధులు/ పథమ చికిత్స 1.రోగ జనక జీవులు శరీరంలో ప్రవేశించడాన్ని ....... అంటారు. 2.రోగజనక జీవులు అధిక సంఖ్యలో ఉన ్నప్పటికీ ....... జీవుల్లో అస్వస్థత కలిగించవు. 3.ఎయిడ్స వ్యాధి ....... వల్ల వ్యాప్తి చెందుతుంది. 4.మూత్రంలోని పసుపు రంగు ....... వర్ణద్రవ్యం వల్ల కలుగుతుంది. 5.గవదబిళ్లల వ్యాధి ....... వైరస్ ద్వారా కలుగుతుంది. 6.గవద బిళ్లల వ్యాధిలో ముఖ్యంగా ....... గ్రంథులు వ్యాధికి లోనవుతాయి. 7.పారామిక్సో వైరస్ (ఖూఅ) ....... వ్యాధిని కలిగిస్తుంది. 8.మెదడువాపు వ్యాధికి ....... వాహకాలుగా ఉంటాయి. 9.బోద వ్యాధి క్రిముల డింభకాల పేరు ....... . 10.గామిటోసైట్లు ....... దశ నుంచి అభివృద్ధి చెందుతాయి. 11.క్షయ, గవద బిళ్లలు, కోరింత దగ్గు వ్యాధుల్లో సంక్రమణ జరిగే పద్ధతి ....... . 12.ప్లేగు, మలేరియా ....... ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. 13.శోషరస నాళాలు, శోషరస గ్రంథుల వాపు వల్ల వచ్చే రోగం ....... . 14.హెపటైటిస్ వైరస్.. కణాలను నాశనం చేయడం వల్ల వచ్చే వ్యాధి ....... 15.ప్లేగు, మలేరియా వ్యాధులు, మరోప్రాణి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఆ ప్రాణిని ....... అంటారు. 16.దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త ....... . 17.మలేరియా పరాన్న జీవి జీవిత చరిత్రలో ప్రాథమిక అతిథేయి ....... 18.మలేరియా పరాన్న జీవి, జీవిత చరిత్రలో మానవునిలో గడిపే దశ పేరు ....... చక్రం. 19.మలేరియా పరాన్న జీవి జీవిత చక్రంలో మాధ్యమిక అతిథేయి ....... . 20.పశువులు కలుషితమైన మేత తినడం వల్ల ప్రబలే వ్యాధి ....... 21.ప్లేగు కలిగించే బ్యాక్టీరియాలకు ....... వాహకం. 22.ఎల్లో జ్వరం కలిగించే వాటికి వాహకాలు ....... 23.మలేరియా జ్వరానికి వాహకాలు ....... . 24.హెపటైటిస్ వంటి జ్వరానికి వాహకాలు ....... . 25.తట్టు లేదా దద్దు వ్యాధిని ....... అని కూడా అంటారు. 26.ుబెల్లా వ్యాధిని మొదటిసారిగా వర్ణించినవారు ....... . 27.మెదడువాపు వ్యాధి కారక వైరస్‌ను ....... వ్యాప్తి చెందిస్తుంది. 28. ....... అనే జర్మనీ దేశస్థుడు ప్రథమ చికిత్సకు ఆద్యుడు. 29.ప్రథమ చికిత్సను వ్యాప్తిలోకి తేవడానికి కృషి చేసిన సంస్థ ....... 30.ఎముకల సామాన్య విరుపును ....... ఎముకల విరుపు అంటారు. 31.చాలా చోట్ల ఎముకల విరుపును ....... ఎముకల విరుపు అంటారు. 32.విరిగిన ఎముక రెండు కొనలు ఒకదానిలోనికి మరొకటి దూసుకుపోయినప్పుడు ....... ఎముక విరుపు అంటారు. 33.సాధారణంగా పిల్లల్లో కనిపించే ఎముక విరుపు ....... . 34.అంగన్వాడీ అంటే ....... . 35. ....... గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. 36.ప్రతి ఏడాది మనదేశంలో ....... మంది పిల్లలు అంధత్వంతో బాధపడుతున్నారు. 37.చేప నూనెలో ఎక్కువగా ఉండే విటమిన్లు ....... 38.ప్రతి ఆరునెలలకు ఒకసారి నోటి ద్వారా పిల్లలకు ....... మైక్రోగ్రాముల విటమిన్ ‘ఎ’ ఇవ్వాలి. 39.అధిక మోతాదుల్లో విటమిన్ ‘ఎ’ ఇచ్చి పిల్లల్లో రేచీకటి రాకుండా చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టిన సంస్థ ....... . 40.అంధత్వానికి మూల కారణం ....... . సమాధానాలు 1) వ్యాధి సంక్రమణం; 2) వాహక; 3) ప్రత్యక్షంగా తాకిడి; 4) బిల్‌రుబిన్; 5) మిక్సోవైరస్ పరోటైడిస్(ఖూఅ); 6) పెరోటిడ్ (లాలాజలం); 7) తట్టు; 8) పందులు; 9) మైక్రో ఫైలేరియా; 10) ఎరిత్రోసైటిక్; 11) లాలాజల తుంపర; 12) వాహకం; 13) బోద; 14) పచ్చ కామెర్లు; 15) వాహకం; 16) సర్ రోనాల్డ్ రాస్; 17. ఆడ ఎనాఫిలిస్; 18) అలైంగిక; 19) మానవుడు; 20) మాడ్ కౌ; 21) ఎలుకలు; 22) కోతులు; 23) ఆడ ఎనాఫిలిస్; 24) మానవులు; 25) రుబెల్లా; 26) అబుబకర్; 27) క్యూలెక్స్ దోమలు; 28) ఇస్మార్క్; 29) జాన్ అంబులెన్స్; 30) మూసివేయబడిన; 31) ఓపెన్; 32) తాకిడి ప్రభావం వల్ల ఎముకల విరుపు; 33) లేత ఎముక విరుపు; 34) ప్రాంగణం; 35) 100; 36) 60,000; 37) ’అ’, ’ఈ’; 38) 60,000; 39) జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్); 40) విటమిన్ ’అ’ లోపం. ముఖ్య ప్రశ్నలు 1 మార్కు: 1.క్రీడాకారులు గ్లూకోజును ఎందుకు తీసుకుంటారు? 2.జీవశాస్త్రీయంగా సంపూర్ణ ప్రొటీన్లు అంటే ఏమిటి? రెండు ఉదాహరణలివ్వండి? 3.కాల్షియం శరీరానికి ఎలా సహాయపడుతుంది? 4.శరీరంలో కొవ్వులను నిల్వ చేసుకోవడం ఎందువల్ల సులభం? 5.రోగికి గ్లూకోజ్ ఇవ్వడానికి కారణం ఏమిటి? 6.పోషకాహార లోపం అంటే ఏమిటి? 7.స్థూలకాయత్వానికి ఉన్న ఒకే ఒక చికిత్స ఏది? 8.శరీరంలో ఏ కణాలు స్థూలకాయత్వానికి దోహదం చేస్తాయి? ఎందువల్ల? 9.ూఐూ అంటే ఏమిటి? విస్తరించి రాయండి? 10.విటమిన్ ‘ఎ’ రసాయనిక నామం రాయండి? 11.మెదడువాపు వ్యాధికి సకశేరుక అతిథేయులు ఎవరు? ఈ వ్యాధిని కలుగజేసే వైరస్ ఏది? 12.రుబెల్ల అని దేనినంటారు? 13.సంక్రమణ అంటే ఏమిటి? 14.ప్రథమ చికిత్స అంటే ఏమిటి? 15.గ్రామీణ కార్యకర్త ప్రథమ కర్తవ్యం ఏమిటి? 2 మార్కులు: 1.ఫ్లోరోసిస్ అంటే ఏమిటి? ఇది శరీరానికి ఎలా నష్టం కలిగిస్తుంది? 2.అయొడైజ్డ్ సాల్ట్ అంటే ఏమిటి? దీన్ని తీసుకోవడం వల్ల లాభమేంటి? 3.బియ్యం లేదా మాంసం మాత్రమే తింటే కలిగే నష్టం ఏమిటి? 4.స్థూలకాయులు తమ శరీర బరువు పరిమాణం తగ్గాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? 5.్వషియోర్కర్, మెరాస్మస్ వ్యాధుల మధ్య భేదాలు రాయండి? 6.ఏ పోషకలోపం వల్ల క్వాషియోర్కర్ వ్యాధి కలుగుతుంది? దాని గురించి రాయండి? 7.నియాసిన్ రసాయనిక నామం ఏమిటి? దీని అవసరం ఏమిటి? 8.మరపట్టిన బియ్యాన్ని వండి తిన్నా, వాటిని పలుమార్లు కడిగినా కలిగే నష్టం ఏమిటి? దీని వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? 9.విటమిన్లు ఎన్ని? వాటిని ఎన్ని రకాలుగా విభజించొ చ్చు? అవి ఏవి? 10.మలేరియా వ్యాధిలో ఉండే లక్షణాలు ఏమిటి? 11.మలేరియా వ్యాధి వ్యాప్తిని ఎలా అరికడతారు? 12.పచ్చ కామెర్లలో చర్మం ఎందువల్ల పచ్చగా ఉంటుంది? 13.గవద బిళ్లల వ్యాధి లక్షణాలు ఏమిటి? 14.శరీరంలోకి టెటనస్ క్రిములు ఎలా ప్రవేశిస్తాయి? 15.ప్రథమ చికిత్స అంటే ఏమిటి? ప్రథమ చికిత్స ఉద్దేశాలు ఏవి? 16.గ్రామీణ ఆరోగ్య కార్యకర్త విధులేవి? 17.ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుంచి ఏ విధమైన ఆరోగ్య సేవలు కోరుకుంటాం? 4 మార్కులు: 1.కాల్షియం గురించి రాయండి? 2.పిల్లల మీద క్వాషియోర్కర్ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుంది? 3.క్వాషియోర్కర్ గురించి క్లుప్తంగా రాయండి? 4.విటమిన్ ‘ఎ’ లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి రాయండి? 5.విటమిన్లను కనిపెట్టడానికి దోహదం చేసిన కారకాలను తెలపండి? 6.‘బి’ కాంప్లెక్స్ విటమిన్లను పేర్కొని, వాటి రసాయనిక నామాలను రాయండి? 7.మలేరియా పరాన్న జీవి దోమ శరీరంలో ఏయే మార్పులు చెందుతుంది? 8.గ వదబిళ్లల వ్యాధి గురించి వివరించండి? 9.కామెర్ల వ్యాధి కలగడానికి కారణాలు ఏమిటి? కామెర్ల రోగి తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలేమిటి? 10.మెదడువాపు వ్యాధి ఎందుకు ప్రాణాంతకమైన వ్యాధి? అది ఎందువల్ల వస్తుంది? 11.మలేరియా వ్యాధిని నియంత్రించడానికి తీసుకోవాల్సి న చర్యలను పేర్కొనండి? 12.ప్రథమ చికిత్స చేసేటప్పుడు మనిషి ప్రాణాలు కాపాడటానికి ఏయే నియమాలు పాటించాలి? 13.ఎముకల విరుపునకు నువ్వు చేసే ప్రథమ చికిత్స ఏమిటి? 14.ఒక వ్యక్తి శరీర భాగాల్లో జరిగే వివిధ రకాల ఎముకల విరుపు గురించి రాయండి? 15.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించే ముఖ్య కార్యకలాపాలు ఏమిటి? పర్యావరణ విద్య ఆవరణ వ్యవస్థ, సమతుల్యత 1.మొక్కలు పెరిగేందుకు ఉపయోగపడే పై మట్టిని ....... అంటారు. 2.వాన నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసే ప్రదేశాల్లో ....... ఒక్కటే మార్గం. 3.వాటర్షెడ్ల వల్ల నేలల్లో ....... పెంచొచ్చు. 4.ఎత్తైన ప్రాంతంలో కురిసిన వాన నీటిని పల్లపు ప్రదేశానికి మళ్లించి ఒకచోట చేర్చడాన్ని ....... అంటారు. 5.ఒక నిర్దిష్ట ప్రదేశంలో పడే వర్షాన్ని ....... తో కొలుస్తారు. 6.కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే కార్బన్ సింక్స్‌గా ....... ఉపయోగపడతాయి. 7.భూమి మీద ....... శాతం సముద్ర జలాలే. 8.సముద్ర జలాల్లో ....... శాతం ఉప్పు లవణాలుంటాయి. 9.సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే అడవుల్ని ....... లేదా ....... అంటారు. 10.సముద్ర ప్రవాళాలు ....... తో తయారవుతాయి. 11.భూమి మీద ఉన్న మొక్కలు, జంతువుల్లో అతి పురాతనమైన జాతులు ....... . 12. ....... తి పురాతనమైన అతి పెద్ద నీటి ఆవరణ వ్యవస్థ. 13.సముద్రంలో ....... మీటర్ల లోతున చీకటిగా ఉంటుంది. 14. ....... వల్ల ప్రవాళాల్లో ఉన్న పాలిప్‌లు నశించిపోతున్నాయి. 15.మట్టినీరు ఎరుపు లిట్మస్‌ను నీలి రంగులోకి మారిస్తే ఆ మట్టిలో ....... ఉన్నట్లు. 16.మట్టి నీరు నీలి లిట్మస్‌ను ఎరుపు రంగులోకి మారిస్తే ఆ మట్టిలో ....... ఉన్నట్లు. 17.చీడ పురుగులను తినే బ్యాక్టీరియాకు ఉదాహరణ ....... 18. ....... బయోఫర్టిలైజర్ కాయ ధాన్యాలకు సంబంధించిన మొక్కలకు పోషకాలు అందిస్తాయి. 19.అజోస్పైరిల్లం, అజటో బాక్టర్, అజొల్లా ....... మొక్కలకు పోషకాలు అందిస్తాయి. 20.థయో బెసిల్లస్, బాసిల్లస్, అస్పర్జిల్లస్లు నైట్రోజన్‌ను మొక్కకు కావలసిన ....... ను పోషకాల రూపంలో అందిస్తాయి. 21.పశుగ్రాసం కోసం రకరకాల గడ్డి జాతుల్ని పెంచే పద్ధతిని ....... అంటారు. 22.గట్ల వెంబడి పెంచే రకరకాల చెట్లను ....... అంటారు. 23.మనం ఉండే ప్రాంతంలో ఖాళీ స్థలాల్లో పెంచే అడవులను ....... అంటారు. 24.మొక్కలు, జంతువులు అవి సహజంగా బతికే చోట కాకుండా, క–{తిమంగా అటువంటి ప్రదేశాల్లో సంరక్షించే విధానాన్ని ....... అంటారు. 25.మొక్కలు, జంతువులు అవి సహజంగా బతికే చోటనే సంరక్షించే విధానాన్ని ....... అంటారు. 26. ....... పక్షిని మాంసం కోసం విపరీతంగా చంపి తినడంతో ఆ పక్షి జాతి పూర్తిగా అంతరించింది. 27.మిశ్రమ పంటలను ఒకేసారి పెంచడాన్ని ....... అంటారు. 28.అడవుల సంరక్షణ కోసం ఏర్పడిన గ్రూపులను ....... అంటారు. 29.మొక్కల్లో, జంతువుల్లో ఉపయోగకరమైన జన్యువుల్ని, జీవరసాయనాల్ని వెతికి వాటిపై ఆధిపత్యాన్ని దొంగచాటుగా దక్కించుకోవడాన్ని ....... అంటారు. 30.వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ....... సంవత్సరంలో రూపొందించారు. 31.బయోటెక్నాలజీ పదాన్ని మొదటిసారిగా ....... ఉపయోగించారు. సమాధానాలు 1) మృత్తిక; 2) వాటర్‌షెడ్; 3) తేమను; 4) వాటర్‌షెడ్; 5. రెయిన్‌గేజ్; 6) గడ్డినేలలు; 7) 70; 8) 3.5; 9) మాంగ్రూవ్స లేదా మడ అడవులు; 10) కాల్షియం కార్బొనేట్; 11) సముద్ర ప్రవాళాలు; 12) సముద్రాలు; 13) 200; 14) గ్లోబల్ వార్మింగ్; 15) క్షారత్వం; 16) ఆమ్లత్వం; 17) బెసిల్లస్ తురింజియెన్సిస్, బ్యువేరియా బాసియోనా; 18) రైజోబియం; 19) తృణధాన్యాల; 20) ఫాస్పరస్; 21) ఆగ్రోఫారెస్ట్రీ; 22) వ్యవసాయాధారిత అడవులు; 23) సామాజిక అడవులు; 24) ఎక్సిటు సంరక్షణ; 25) ఇన్‌సిటు సంరక్షణ; 26) డోడో; 27) వ్యవసాయాధారిత అడవులు; 28) వన సంరక్షణ సమితులు; 29) బయోపైరసీ; 30) 1972; 31) కారల్ ఎరికె. కాలుష్యం 1.ప్లాస్టిక్, టైర్లు కాల్చడం వల్ల ---------------- లాంటి క్యాన్సర్ కారకాలు పుడుతున్నాయి. 2.మనం పుట్టించే రకరకాల వ్యర్థాలు నేలలో మొక్కల్ని బతికించే ------------ ను నాశనం చేస్తాయి. 3.హోళిలో వాడే రసాయన రంగుల వల్ల కొందరు ------------ గా మారుతున్నారు. 4.------------- క్యాన్సర్ రోగాన్ని కలిగిస్తుంది. 5.కాస్మిక్ కిరణాల నుంచి -------------వస్తుంది. 6.అణు విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే ------------ చాలా ప్రమాదకరమైంది. 7.-------------- కాలుష్యం వల్ల జన్యు మార్పులు వస్తున్నాయి. 8.కంటికి కనిపించని కాలుష్యం -------------. 9.మనం ----------- డెసిబల్స్ వరకు శబ్దం వినగలం. 10.శబ్ద తీవ్రత------------- డెసిబల్స్ దాటితే మన కర్ణభేరి దెబ్బతింటుంది. 11.ప్రకృతిలోని సమతాస్థితిని ------------- కాపాడుతున్నాయి. 12.సునేర్ లాంటి రసాయనిక రంగుల వల్ల ------------ వ్యాధులు వస్తాయి. 13.ఎక్స్‌రేలు, సెల్యులార్ ఫోన్ల నుంచి ----------- విడుదల అవుతుంది. 14.సముద్రంలోకి ----------- చేరితే నీళ్లపై తెట్టులా ఆయిల్ స్లీక్ ఏర్పడుతుంది. 15.---------- శాతం రోగాలు మనకు నీటి నుంచి వస్తాయి. 16.నీళ్లలో ------------ వల్ల ఎముకలు వంగిపోతాయి. సమాధానాలు 1) డయాక్సిన్, ప్యూరా; 2) సూక్ష్మ పోషకాల; 3) అంధులు; 4) ధార్మికత; 5) రేడియేషన్; 6) అణుధార్మికత; 7) ధార్మిక; 8) శబ్ద కాలుష్యం; 9) 50-60; 10) 90; 11) మహాసముద్రాలు; 12) చర్మ; 13) రేడియేషన్ ; 14) నూనెలు; 15) 80; 16) ఫ్లోరైడ్ . పర్యావరణ అంశాలు 1.మన దేశంలో అటవీ భూముల విస్తీర్ణం ------------ శాతంగా ఉంది. 2.ప్రపంచంలో ------------ జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. 3.ప్రపంచ జనాభా ---------- కోట్లు దాటింది. 4.-------------- ప్రకృతి వనరులకు పుట్టిల్లు. 5.గాలిలో ------------- వాయువు పెరిగితే భూమి వేడెక్కుతుంది. 6.------------- నిల్వలు తగ్గడం వల్ల థర్మల్ విద్యుత్ తగ్గుతుంది. 7.గ్రీన్హౌస్ ఎఫెక్ట్ గురించి మొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్త -------------. 8.శిలాజ ఇంధనాన్ని మండిస్తే ----------- విడుదల అవుతుంది. 9.పునరుత్పత్తి చెందని వనరులకు ఉదాహరణలు ---------,-----------,-----------.. 10.పునరుత్పత్తి చెందని వనరులను -------- అని కూడా అంటారు. 11.ఎంత ఉపయోగించినా తరగని వనరులను -------- అంటారు.\u3102?్చట 12.కార్బన్ డై ఆకై ్సడ్, క్లోరో ఫ్లోరో కార్బన్లు, హైడ్రో కార్బన్లను----------- అంటారు. 13.ట్రోపో ఆవరణం భూమిపై --------- ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. 14.------------ ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది. 15.ఓజోన్ సంకేతం------------. 16.ఓజోన్ ---------- రంగులో ఉంటుంది. 17.ఓజోన్ ----------- కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది. 18.----------- ఓజోన్ పొరను పలుచన చేస్తాయి. 19.ఒక ప్రాంతంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్ని నమోదు చేసే పరికరం--------. 20.భూమిపై వ్యాపించి ఉన్న గాలి పొరను------------- అంటారు. 21.------------ భూమిపై 45 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 22.-------------- భూమిపై 80 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 23.------------- భూమిపై 400 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 24.శిలా విగ్రహాలు, చారిత్రక కట్టడాలు ------------ వర్షాలకు పాడైపోతాయి. 25.ఉష్ణ ప్రవాహాల దిశలో మార్పులు రావడం వల్ల వాతావరణంలో ఏర్పడే వేడిని --------- అంటారు. 26.సముద్రాలలో అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు ఏర్పడే అతి పెద్ద సముద్ర అలలను -------------- అంటారు. 27.----------- వల్ల ఒక్కసారిగా పెద్ద వర్షాలు పడి వరదలతో గ్రామాలు, నగరాలు మునిగి పోతాయి. 28.1872లో ఆమ్ల వర్షం గురించి చెప్పిన శాస్త్రవేత్త--------. 29.సముద్ర జలాల్లో అంతరించి పోతున్న చేపలు---------------. 30.సునామీ బారి నుంచి ------------అడవులు రక్షిస్తాయి. 31.ఆమ్ల వర్షపు ఞఏ విలువ----------. సమాధానాలు 1) 19; 2) సగం; 3) 600; 4) సముద్రాలు; 5) కార్బన్ డై ఆకై్సడ్; 6) బొగ్గు; 7) జీన్ బ్యాప్టిస్ట్ ఫోరియర్; 8) కార్బన్ డై ఆకై్సడ్; 9) బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు; 10) సంప్రదాయ ఇంధన వనరులు; 11) సంప్రదాయేతర ఇంధన వనరులు; 12) గ్రీన్హౌస్ వాయువులు/భూమిని వేడెక్కించే వాయువులు; 13) 12 కి.మీ.; 14) స్ట్రాటో; 15) ై3; 16) లేత నీలి; 17) అతి నీలలోహిత; 18) క్లోరోఫ్లోరో కార్బన్లు; 19) సిక్స్ కనిష్ట, గరిష్ట ఉష్ణమాపకం; 20) వాతావరణం; 21) స్ట్రాటో ఆవరణం; 22) మీసో ఆవరణం; 23) ఉష్ణావరణం; 24) ఆమ్ల; 25) ఎల్‌నినో; 26) సునామీ; 27) లానినా; 28) రాబర్ట ఎంజిస్; 29) హలిబల్; 30) మడ లేదా మాంగ్రూవ్స; 31) 1.5 నుంచి 5 మంచి పర్యావరణం కోసం ఏం చేద్దాం? 1.బడి మొత్తం స్థలంలో -------------- శాతం చెట్లు ఉండాలి. 2.తడి చెత్తను నేలలో కప్పేస్తే ------------- గా మారుతుంది. 3.చాక్లెట్లు, బిస్కెట్లు వంటి వాటిమీద ----------- లేబుల్ చూసి కొనాలి. 4.అప్పడాలు, వడియాలు, పండ్ల రసాలు, పచ్చళ్లు వంటి వాటి మీద------- ముద్ర చూసి కొనాలి. 5.పర్యావరణ అనుకూల ఇంధనం ------------. 6.------------- బల్బులు వాడటం వల్ల విద్యుత్ శక్తి వినియోగాన్ని తగ్గించొచ్చు. 7.నూనె, నెయ్యి వంటి వాటి మీద -------------- లేబుల్ చూసి కొనాలి. 8.నీటి కాలుష్య నియంత్రణ చట్టం -----------లో అమల్లోకి వచ్చింది. 9.వాయు కాలుష్య నియంత్రణ చట్టం------------లో అమల్లోకి వచ్చింది. 10.చిప్కో ఉద్యమ నాయకుడు -------------. 11.ప్రపంచంలో ఎక్కువ వాహనాలను సీఎన్జీతో నడుపుతున్న నగరం -------------. 12.అడవులను కాపాడటానికి చేసిన పోరాటాలను----------- ఉద్యమం అంటారు. 13.సీఎన్జీ (CNG)-------------ల మిశ్రమం. 14.సీఎన్జీ గాలి కంటే -----------బరువు ఉంటుంది. 15.సీఎన్జీ (CNG) పూర్తి పేరు ---------. సమాధానాలు 1) 33; 2) కంపోస్టు; 3) ఐఎస్ఐ (ఐఐ); 4) ఊ.్క.ై.; 5) ఇూఎ; 6) కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బ్- సీఎఫ్‌బీ; 7) అగ్మార్క; 8) 1974; 9) 1981; 10) సుందర్ లాల్ బహుగుణ; 11) ఢిల్లీ; 12) చిప్కో; 13) హైడ్రోకార్బన్; 14) తక్కువ; 15) కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ముఖ్య ప్రశ్నలు 1 మార్కు: 1.వాటర్‌షెడ్ అంటే ఏమిటి? 2.పార్కుల ఆవశ్యకత ఏమిటి? 3.సముద్ర ప్రవాళాలు అంటే ఏమిటి? ఇవి వేటితో తయారవుతాయి? 4.తీరప్రాంత చెట్లను ఎందుకు నరకకూడదు? 5.జీవ ఎరువులను ఎందుకు వాడాలి? 6.మొక్కలకు కావల్సిన నైట్రోజన్, ఫాస్ఫరస్‌ను పోషకాల రూపంలో అందించే బయోఫర్టిలైజర్సను పేర్కొనండి? 7.అడవుల వల్ల ప్రయోజనాలేవి? 8.వన సంరక్షణ సమితులు అంటే ఏమిటి? 9.సామాజిక అడవులు అంటే ఏమిటి? 10.అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏమిటి? 11.బయోపైరసీ అంటే ఏమిటి? 12.ైవె ల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 13.బయోటెక్నాలజీ అంటే ఏమిటి? 14.కాలుష్యం అంటే ఏమిటి? 15.రేడియేషన్ జనకాలను పేర్కొనండి? 16.ఏవైనా రెండు ప్రకృతి వైపరీత్యాలను పేర్కొనండి? 17.నూనెలు, ఇంధనాలు సముద్రాల్లో చేరితే ఏమవు తుంది? 18.సంప్రదాయ ఇంధన వనరులు అంటే ఏమిటి? ఉదాహరణలివ్వండి? 19.సంప్రదాయేతర ఇంధన వనరులు అంటే ఏమిటి? ఉదాహరణలివ్వండి? 20.గ్రీన్హౌస్ వాయువులను పేర్కొనండి? 21.గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? ఇది ఏ విధంగా జరుగుతుంది? 22.గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? 23.వాతావరణం అంటే ఏమిటి? దీన్ని ఎన్ని పొరలుగా విభజించారు? 24.ఓజోన్ పొర ప్రాముఖ్యతను రాయండి? 25.ఆమ్ల వర్షాలు అంటే ఏమిటి? 26.ఎల్‌నినో అంటే ఏమిటి? 27.లానినా అంటే ఏమిటి? 28.సునామీ అంటే ఏమిటి? 29.పాఠశాలలో చెత్తను తగ్గించేందుకు పాటించే పద్ధతు లను రాయండి? 30.మన చుట్ట్టూ ఉన్న జీవన చక్రాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? 31.ఎక్సిటు, ఇన్‌సిటు సంరక్షణ అంటే ఏంటి? 32.కార్బన్ సింకులు అని వేటిని అంటారు? 2 మార్కులు: 1.మొక్కలు పెరిగేందుకు మృత్తిక ఏ విధంగా తోడ్పడు తుంది? 2.వర్షాన్ని ఏ విధంగా రీచార్జ చేయొచ్చో వివరించండి? 3.వాటర్షెడ్ల వల్ల లాభాలు రాయండి? 4.మాంగ్రూవ్స అంటే ఏమిటి? వీటి వల్ల ప్రయోజనా లను రాయండి? 5.జీవ ఎరువులను ఎలా తయారు చేస్తారు? వీటి వల్ల ప్రయోజనాలను రాయండి? 6.నైట్రోజన్ స్థాపక బయోఫర్టిలైజర్సను పేర్కొనండి? 7.సామాజిక అడవుల వల్ల లాభాలేమిటి? 8.బయోటెక్నాలజీ ఉపయోగాలు రాయండి? 9.ఆగ్రోఫారెస్ట్రీ పద్ధతులను తెలియజేయండి? 10.కాలుష్యం వల్ల కలుగుతున్న దుష్ఫలితాలేవి? 11.కాలుష్యాన్ని నివారించేందుకు మనం ఏ చర్యలు చేపట్టాలి? 12.సంప్రదాయ ఇంధన వనరుల వాడకం విషయంలో పొదుపు ఎందుకు పాటించాలి? 13.గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం) వల్ల ప్రమాదా లను వివరించండి? 14.ఓజోన్ పొర పలుచనవడానికి కారణాలు రాయండి? 15.మొక్కలపై, ఇతర కట్టడాలపై ఆమ్ల వర్షాల ప్రభావాన్ని వివరించండి? 16.పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏమిటి? దీని కోసం మనం ఏమి చేయాలి? 17.చిప్కో ఉద్యమం అంటే ఏమిటి?\u3102?్చట18.CNG అంటే ఏమిటి? దీని వాడకం వల్ల ప్రయోజనా లను వివరించండి? 19.ఓజోన్ పొర పలుచనైతే కలిగే నష్టాలేవి? 20.ఉమ్మడి అటవీ యాజమాన్యం అంటే ఏమిటి? 1900 సంవత్సరంలో ఆస్ట్రియా బయాలజిస్టు, ఫిజీషియన్ కారల్ లాండ్ స్టీనర్ .. రక్త కణాల చర్యల ఆధారంగా రక్తాన్ని మూడు వర్గాలుగా విభజించారు. తర్వాత 4వ వర్గాన్ని కనుగొన్నారు. ఒకే వర్గానికి చెందిన రక్తం నమూనాలలో గుచ్ఛకరణం జరగదు. గుర్తుంచుకోండి: ప్రయోగానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఈ కింది విధంగా సైడ్ హెడ్డింగ్స్‌లో రాయాలి. 1. ఉద్దేశం; 2. కావాల్సిన పరికరాలు; 3. ప్రయోగ విధానం; 4. పరిశీలన; 5. నిర్ధారణ; 6. పటం. గుర్తుంచుకోండి: ఒక మార్కు ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు జవాబులను సూటిగా స్పష్టంగా అవసరమైనమేర మాత్రమే రాయాలి. రెండు మార్కుల ప్రశ్నలకు రెండు పాయింట్లు రాయాలి. ప్రశ్నను బట్టి ఒక్కోసారి నాలుగు పాయింట్లు కూడా రాయాల్సి ఉంటుంది. హరితరేణువులలోని అవర్ణికలో జరిగే చర్యల పరంపరగా, కార్బన్ డై ఆక్సైడ్ వినియోగమై గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. అమెరికా శాస్త్రజ్ఞుడైన మెల్విన్ కాల్విన్ కార్బన్ డై ఆక్సైడ్ గ్లూకోజ్‌గా మారే చర్యల్ని గుర్తించాడు. ఈ పరిశోధనకు కాల్విన్కు నోబెల్ బహుమతి లభించింది. Prepared by: సూర సత్యనారాయణ సబ్జెక్ట్ ఎక్స్పర్ట, హైదరాబాద్ -
ఇస్రోకి ఎంపికైన తెలుగు తేజం!
ఆత్మవిశ్వాసం ఆసరాగా నిజాయితీగా కష్టపడే వ్యక్తి ముందు కొలువులు క్యూ కడతాయనే దానికి నిలువుటద్దం ఆ కుర్రాడు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక మంచి ఉద్యోగం చేజిక్కడమే గగనం. అలాంటిది ఇప్పటికే నాలుగైదు ఉద్యోగాలకు పిలుపొచ్చింది.. మరిన్ని ఉద్యోగాలు కూతవేటు దూరంలో కాచుకు కూర్చున్నాయి. లక్ష మందితో తలపడి, పరిశోధనలలో ప్రగతి పథాన పయనిస్తున్న ఇస్రో గ్రూప్-ఏ శాస్త్రవేత్తగా అవకాశం దక్కించుకున్నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి దూలం రవితేజ. అతని విజయ ప్రస్థానం.. ఇస్రో శాస్త్రవేత్తగా అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మాది వరంగల్ జిల్లాలోని నర్సంపేట. నాన్న రాజేంద్ర, అమ్మ జ్యోతి. ఇద్దరూ ఉపాధ్యాయులు. పదో తరగతి వరకు వరంగల్‌లో చదువుకున్నా. నేనేమీ పుస్తకాల పురుగును కాదు.. చదివినంతసేపూ ఏకాగ్రతతో చదివేవాణ్ని. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో ఓయూ క్యాంపస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ సీటొచ్చింది. నాన్నకు ఓయూలో చదవాలనే కోరిక ఉండేది. ఆర్థిక పరిస్థితులు సహక రించక అది సాధ్యపడలేదు. నేను, అన్నయ్య నటరాజ్ ఓయూలో ఇంజనీరింగ్ చదవటం ద్వారా ఆయన కలను నిజం చేశామనిపిస్తోంది. కార్పొరేట్ ఉద్యోగం వదిలి: ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ప్రాంగణ నియామకాలు జరిగాయి. రాతపరీక్షలో తక్కువ మార్కులు రావడంతో, ఇంటర్వ్యూ జాబితాలో నా పేరు చివర్లో ఉంది. నియామకాలు జరుపుతున్న వారు ఫ్లయిట్‌కు సమయం అవుతుండటంతో హడావిడిగా ఉన్నారు. అయితే ఇంటర్వ్యూలో నా సమాధానాలు వారిని సంతృప్తి పరచడంతో తమ ప్రముఖ విదేశీ కార్ల కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా అవకాశమిచ్చారు. ఉద్యోగం ఢిల్లీలో. వేతనం నెలకు రూ.50 వేలు. అయితే ఆ కంపెనీలో భారతీయుల తెలివితేటలను అపహేళన చేస్తూ కొందరు మాట్లాడుతుండేవారు. అలాంటప్పుడు చాలా భాదేసేది. ఉద్యోగాన్ని వదిలేసి, ఉన్నత చదువుల కోసం మళ్లీ హైదరాబాద్ వచ్చి ఓయూలో ఎంటెక్ కోర్సులో చేరా. నాన్న.. కొండంత అండగా: ఉద్యోగాన్ని విడిచిపెట్టిన సమయంలో అనవసరంగా రిస్క్ చేస్తున్నావేమో ఆలోచించుకో అని కొందరన్నారు. నాన్న మాత్రం.. నీకేది నచ్చితే అది చెయ్యంటూ కొండంత అండగా నిలిచారు. ఆ కంపెనీకి బాండ్ ప్రకారం చెల్లించాల్సిన రూ.రెండు లక్షలు ఇచ్చేందుకూ సిద్ధపడ్డారు. ఒకవైపు ఎంటెక్ చేస్తూనే బీహెచ్ఈఎల్, ఎస్ఏఐఎల్ వంటి ప్రముఖ ప్రభుత్వ సంస్థల పరీక్షలకు సిద్ధమయ్యాను. వీటి నుంచి ఇప్పటికే కొన్ని జాబ్ ఆఫర్స్ వచ్చాయి. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) ఇంటర్వ్యూ బాగా చేశా. త్వరలోనే ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఇస్రో ఫలితాల్లో టాపర్‌గా నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఒకవేళ ఐఈఎస్‌కు ఎంపికైనా, ఇస్రోకే ప్రాధాన్యం ఇస్తా. అది కఠిన పరీక్ష: చెప్పుకోదగ్గ విజయాలతో ప్రగతి బాటలో నడుస్తున్న ఇస్రో నుంచి చాలా తక్కువ నోటిఫికేషన్లు వస్తుంటాయి. శాస్త్రవేత్తల నియామకాలకు 2013 జనవరిలో ఇస్రో నిర్వహించిన పరీక్షలకు దాదాపు లక్ష మంది హాజరయ్యారు. ప్రశ్నపత్రంలో 80 ప్రశ్నలు ఇచ్చారు. వీటికి 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు లోతుగా వచ్చాయి. రాత పరీక్ష గట్టెక్కాక ఈ ఏడాది జనవరి 28న హైదరాబాద్‌లోని బాలానగర్ ఇస్రో కార్యాలయంలో ఇంటర్వ్యూ జరిగింది. మిట్టల్ సారథ్యంలో 11 మంది సభ్యుల బోర్డు ఇంటర్వ్యూ చేసింది. దాదాపు 35 నిమిషాల పాటు ఇంటర్వ్యూ జరిగింది. మొత్తం 40 ప్రశ్నలను ఎదుర్కొన్నాను. సమాధానాలు బోర్డుపై అవసరమైన పటాలు వేసి, విశ్లేషిస్తూ ఇవ్వాల్సి వచ్చింది. కొరియాలిస్ కాంపొనెంట్ ఆఫ్ యాక్సిలిరేషన్పై మొదటి ప్రశ్న అడిగారు. ఇంజనీరింగ్‌లో ఇష్టమైన సబ్జెక్టులు ఏంటని అడిగారు. -
పాలిమర్ సైన్స్‌లో బీటెక్ కోర్సు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ విజువల్ కమ్యూనికేషన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి? - అనుపమ, నల్గొండ దృశ్య సాధనాల సహాయంతో జరిపే కమ్యూనికేషన్‌ను వివరించేదే విజువల్ కమ్యూనికేషన్. దీనికి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు కరిక్యులంలో ఇన్ఫర్మేషన్ డిజైన్, టైపోగ్రఫీ, పబ్లికేషన్ అండ్ బుక్ డిజైన్, కార్పొరేట్ ఐడెంటిటీ అండ్ బ్రాండింగ్, మాస్ కమ్యూనికేషన్ థియరీ, ఇలుస్ట్రేషన్స్ అండ్ ఎగ్జిబిషన్ డిజైన్. కోర్సులు అందిస్తున్న సంస్థలు: జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్, హైదరాబాద్.. బీఎస్సీ (విజువల్ కమ్యూనికేషన్) కోర్సును అందిస్తోంది. ఇది కార్పొరేట్ కమ్యూనికేషన్ డిజైనింగ్‌పై దృష్టిసారిస్తుంది. వెబ్సైట్: www.zica.org ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, తమిళనాడు.. బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్ కోర్సు అందిస్తోంది. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో +2 పూర్తిచేయాలి. అర్హత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.srmuniv.ac.in లయోలా కాలేజీ, చెన్నై.. బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్ కోర్సును అందిస్తోంది. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో +2 పూర్తిచేయాలి. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.loyolacollege.edu అన్నామలై యూనివర్సిటీ, అన్నామలై నగర్.. దూరవిద్యలో బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: +2. వెబ్సైట్: www.annamalaiuniversity.ac.in సెయింట్ పీటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, చెన్నై.. బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: +2. వెబ్సైట్: www.stpetersuniversity.org కెరీర్: విజువల్ కమ్యూనికేషన్స్ కోర్సు పూర్తిచేసిన వారు మీడియా సంస్థలు, అడ్వర్టైజింగ్ కంపెనీలు, ప్రచురణ సంస్థలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల వంటి వాటిలో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. పాలిమర్ సైన్స్‌లో బీటెక్ కోర్సు వివరాలు తెలియజేయగలరు? - వేణు, హైదరాబాద్ పాలిమర్ సైన్స్.. పాలిమర్ల ఉత్పత్తి, వినియోగానికి సంబంధించిన అంశాలను వివరిస్తుంది. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో దీని అనువర్తనాలు చాలా రంగాల్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాలు, టెక్స్టైల్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉపయోగపడుతున్నాయి. పాలిమర్ సైన్స్‌తో కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్‌కు చాలా దగ్గర సంబంధం ఉంది. కోర్సులు: ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ.. పాలిమర్ సైన్స్, కెమికల్ టెక్నాలజీలో బీటెక్‌ను అందిస్తోంది. ఈ కోర్సు కరిక్యులంలో కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ డ్రాయింగ్, మ్యాథమెటిక్స్, పాలిమర్ కెమిస్ట్రీ, రబ్బర్ టెక్నాలజీ, పాలిమర్స్ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ వంటి అంశాలు ఉంటాయి. వెబ్సైట్: www.du.ac.in కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కొచ్చిన్.. బీటెక్ (పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్)ను ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: ఠీఠీఠీ.ఛిఠట్చ్ట.్చఛి.జీ యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, కోల్‌కత.. పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.caluniv.ac.in ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయగలరు? - వెంకట్, గుంటూరు. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ.. ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి ప్రక్రియలను వివరిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఔషధాల తయారీ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్, బయో టెక్నాలజీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి. కోర్సులు: జి.పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎం.ఫార్మసీ కోర్సు ను ఆఫర్ చేస్తోంది. అర్హత: బి.ఫార్మసీ. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.gprcp.ac.in కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎం.ఫార్మసీని అందిస్తోంది. అర్హత: బి.ఫార్మసీ. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.andhrauniversity.edu.in విట్ యూనివర్సిటీ, వెల్లూరు.. ఎంఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.vit.ac.in బిట్స్ పిలానీ, హైదరాబాద్.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎం.ఫార్మసీని ఆఫర్ చేస్తోంది. అర్హత: బి.ఫార్మసీ. ఎంట్రెన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.bitspilani.ac.in/hyderabad -
అతిథి దేవోభవ...
నేటి యువత ఎన్నో ఉన్నత చదువులు చదువుతున్నా.. టెక్నాలజీని ఎంతో వేగంగా ఒడిసి పట్టుకుంటున్నా.. కార్పొరేట్ కంపెనీల్లో అత్యున్నత కొలువులు కైవసం చేసుకుంటున్నా.. ఎన్నో ఉపకరణాల ద్వారా ప్రపంచంతో అనుసంధానమవుతున్నా.. ఒంటరితనం, ఒత్తిడి పట్టిపీడిస్తోంది. మానవ సంబంధాల్లో సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్న నవతరం వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దీనికి పరిష్కార మార్గంగా- అతిథులు ఇంటికి రావడం, వారితో గడపడం వల్ల ఒంట రితనం, మానసిక ఒత్తిడి తగ్గి, జీవన గమనం ఒక సమన్వయ స్థితిని పొందగలుగుతుందన్నది మానసిక నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో.. హింసను, ద్వేషాన్ని.. భయాలు, బాధలు, బలహీనతల్ని అధిగమించి ఆశావహ దృక్పథంతో నేటి యువత ఒక బలమైన జాతిగా ఎదగాలంటే.. అందరూ కలవాలి.. పరస్పరం సంభాషించుకో కోవాలి.. ఆహ్వానించుకోవాలి.. ఆతిథ్యమిచ్చుకోవాలి.. ఆదరించుకోవాలి.. ఆనందించాలి.. అతిథి దేవోభవ!! అంటున్న కలెక్టర్ ఎ.వి.రాజమౌళి వ్యాసం.. ఎ.వి.రాజమౌళి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్, గౌతమ్‌బుద్ధ నగర్, యూపీ. ఆయన పేరు జోస్ ముజికా. దక్షిణ అమెరికాలోని ఉరుగ్వే దేశాధ్యక్షుడు. దేశాధ్యక్షుడంటే రాజసౌధాల్లో నివసిస్తాడని, బెంజికార్ల అంబారీతో ప్రయాణం చేస్తుంటాడని భ్రమ పడతాం. కానీ, ఆయన రాజభవనాలలో నివసించరు.. తనకున్న పొలంలోనే ఒక చిన్న నివాసం (పూరిగుడిసె లాంటిది) లో జీవనం. ఆ పొలంలోనూ కొంత నిరుపేదలకు పంచి, తన అవసరాలకు సరిపడినంత మాత్రమే ఉంచుకున్నారు. పొలాన్ని దున్ని.. ధాన్యం, కూరగాయలు, పండ్లు పండిస్తారు. అతని బట్టలు అతనే ఉతుక్కుంటారు. జీతం నెలకు 12,500 డాలర్లు. దాంట్లో 10 శాతాన్ని తన ఖర్చులకు ఉంచుకొని, మిగిలిన 90 శాతాన్ని పేదలకు పంచేస్తారు. తనను ఎవరైనా పొగడబోతే తన జీతంలో 10 శాతం కంటే తక్కువ ఆదాయంతో జీవించే ఎందరో నిరుపేద ఉరుగ్వే ప్రజలను చూసి తాను సిగ్గు పడుతుంటానని నమ్రతతో నొచ్చుకుంటారు. భార్య కూడా ప్రజాప్రతినిధేగానీ ఆమె కూడా భర్త అడుగు జాడల్లోనే జీవిస్తున్నారు. ఒక పాతకారు, స్కూటర్ అతని చరాస్తులు. ప్రపంచంలోనే అతి నిరుపేద దేశాధ్యక్షుడిగా వార్తల్లో నిలిచిన ఆయన తనను నిరుపేద అంటే అంగీకరించరు. ఎవరైతే జీవించేందుకు ఎక్కువ సదుపాయాలు, సౌకర్యాలు కావాలనుకుంటారో వారే అతి నిరుపేదలని ఆయన అభిప్రాయం. విప్లవమంటే హింస, ప్రతిహింస కాదు.. మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడమే అసలైన విప్లవం. ఇంటికొచ్చిన వారికి, ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టకుండా అనవసరంగా మితిమీరి ఖర్చుచేసే నాగరిక సమాజమే ప్రపంచానికి, పర్యావరణానికి పెద్ద సవాలు అంటారాయన. భోజన సమయానికి ఆయన్ను కలవడానికి ఎవరొచ్చినా వారిని అతిథిలా ఆహ్వానిస్తారు. తన పొలంలో పండించిన వాటితో చేసిన, తాను తింటున్న ఆహారాన్ని వారికీ వడ్డించి, వారి ఆనందాన్ని చూసి పరమానంద భరితుడవుతారు. ఆయన పెట్టిన ఆహారం కంటే ఆయన వడ్డించే తీరు, నిర్మల మనస్తత్వం, నిష్కపటపు మాటలు, నిశ్చల ముఖ కవళికలు.. ఆయన వడ్డించే సాధారణ కాయగూరల ఆహారానికి అద్భుత స్వాదాన్నిచ్చి ఆస్వాదయోగ్యంగా మార్చి అమితానందాన్ని కలుగజేస్తాయని సందర్శకుడొకరు తన అనుభవాన్ని పంచుకున్నాడు. ‘‘ఆతిథ్యంలో ఆనందాన్ని మిగిల్చేది ఆహార పదార్థాల వైవిధ్యం కాదనీ, ఆతిథ్యమిచ్చే వారి అవ్యక్తీకృత ఆహార్యం, ఆత్మీయత, అనిర్వచనీయ ఆర్తి, అతి సహజంగా కనిపించే అభిమానం’’ అంటూ అతను చెప్పిన మాటలు.. అతిథి ఆకలి తీర్చేందుకు ఉపక్రమించే ప్రతి ఒక్కరికీ ఆచరణీయాలే! ఈ సందర్భంలో మహా భారతంలోని... భుక్తిం పృచ్ఛసి రాజేంద్ర ఆదరం కిం న పృచ్ఛాసి భోజనం గత జీర్ణంచ ఆదరస్త్వ జరామరః ‘‘భోజన విషయమే అడుగుతున్నావు కానీ ఆదరణ మాట అడగవేమి దుర్యోధనా! భోజనము జీర్ణమైన పిమ్మట ఏమీ కనపడదు కానీ ఆదరణ అయితే శాశ్వతంగా గుర్తుండేదే కదా! ఆదరణ లేనిచోట భోజన ప్రసక్తి ఏల’’ అని రాయబార సందర్భంలో శ్రీకృష్ణుడన్న మాటలు స్మరణీయం. ఆతిథ్యం ఇవ్వడం వల్ల కలిగే ఆత్మ సంతృప్తి అనే శాశ్వత సంపదను మరచి, ఎదుటివారి భౌతిక సంపదలపై దృష్టిసారించి ఈర్ష్యాసూయలతో ఇబ్బందిపెడుతూ, పడుతూ ఉండేవారు దుర్యోధనుడిలా అతిథుల ఆదరణపై కాక అహంకార, ఆడంబర ప్రదర్శనతో అసహనంతో కూడిన అలజడికిలోనై ఆతిథ్యానందాన్ని సంపూర్ణంగా పొందలేకపోతారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ అన్నట్లు అతిథులు వచ్చినప్పుడు ఎంతో ఆశావాదంతో కూడిన ఆనందం కలగాలి. వారు నిష్ర్కమించేటప్పుడు వారిదీ, మనదీ ఇద్దరి మానసిక స్థితిలోనూ అనిర్వచనీయమైన ఆనందభరిత అవ్యక్తానుభూతి కలగాలి. వారి మధ్య ఆత్మీయత ఉంటే వారి వారి కలిమికానీ లేమికానీ ఇద్దరినీ బాధించవు. అలా కాకుండా యాంత్రికంగా ఆతిథ్య తంతు పూర్తి కానిస్తే వడ్డించిన ఆహారంలో రుచి లేమితోపాటు, తిన్నవారికి ఆకలి తీరకపోవడమో.. అజీర్ణమో సంభవిస్తుంది. హృదయ పూర్వకమైన ప్రేమానురాగాలతో పెట్టని ఆహారం వెగటుదనం కలిగిస్తుంది. అతిథికి వడ్డించే ఆహారంతో పాటు అది తయారు చేసి, వడ్డించే వారి సత్వ, రజో, తమో గుణాలు ఆహారాన్ని ఆరగించే వారిపై అమిత ప్రభావం చూపుతాయి. వడ్డించే వంటకాల విలువల కంటే, వారి విలువల ప్రభావం ఆహారపు ఆనందపు సూచీ (Happiness Index) పై అధికంగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం కూడా! వంట గదిని పవిత్ర ప్రదేశమన్నదందుకే! అయిదు నక్షత్రాల హోటళ్లలో వడ్డించే యాంత్రిక విందు కంటే అమ్మ చిన్నప్పుడు చేసిపెట్టిన పచ్చడి అమృత తుల్యంగా ఆనందింప చేయడానికి కారణమదే. ఆహారం వండి, వడ్డించే వారు ఆప్తులయితే ఆ అమృతత్వం తినే వారిలో పెరిగి, వారి ఆయురారోగ్య ఆనందాభివృద్ధికి హేతువులవుతారని, తద్వారా తిన్నవారి రోగ నిరోధక శక్తి పెరిగి,వ్యాధుల బారిన పడకుండా ఉంటారని మన రుషులు ఎప్పుడో చెప్పారు. మహా భారతంలో పాండవుల రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు దుర్యోధుని ఆతిథ్యాన్ని కాదని, విధురుని ఆతిథ్యం స్వీకరించారు. ఆ సందర్భంలో విధురుడు అరటిపండు పారవేసి, తొక్క ఇవ్వగా శ్రీకృష్ణుడు తిన్నట్లు ఒక కథ. రాముడు.. శబరి ఆతిథ్యంలో తాదాత్మ్యం పొందడానికి కూడా కారణమిదే! అందుకే.. గృహోగతం క్షుద్రమపి యధార్హం పూజయేత్ సదా తదీయ కుశల ప్రశ్నైః శక్త్యాదానైః జలాదిభిః ‘‘తన ఇంటికొచ్చిన వ్యక్తి ఎలాంటి వారైనా తనకున్న దానిలో, తగిన రీతిగా ఆదరించాలి. కుశల ప్రశ్నాదులచే సంభావించి శక్త్యానుసారం జలం, అన్న పానాదులిచ్చి సంతోషపెట్టాలి’’. మహాభారత యుద్ధం ముగిసింది. ధర్మరాజు రాజ్యాన్ని అధిష్ఠించాడు. యుద్ధం వల్ల సంభవించిన అశాంతిని, అలజడిని పోగొట్టి ఉత్సాహవర్ధనం కోసం అశ్వమేధ యాగం చేశాడు ధర్మరాజు. యాగానంతరం బ్రహ్మాండమైన సంతర్పణ చేసి ఆర్తులకు, పేదలకు దానధర్మాలు, సంతర్పణలు గావించాడు. ఎంత గొప్ప సంతర్పణ జరిగింది? ఇంత ఘనంగా ఎవరు చేయగలరు? అతిథి అభ్యాగతులను ఇంతకంటే గొప్పగా ఎవరు సంతృప్తి పర్చగలరని ధర్మరాజు స్వగతంలో అనుకొంటుండగా ఒక చిత్రమైన సంఘటన జరిగింది. ఒక ముంగిస నేలపై అన్నం మెతుకులు పడ్డచోట దొర్లుతూ, తన శరీరాన్ని పరీక్షించుకుంటోంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దాని శరీరం సగభాగం బంగారంగా ఉంది. ధర్మరాజు కుతూహలంతో దాన్నే చూడసాగాడు. ముంగిస మాత్రం అసహనంగా తిరుగుతూ, అన్నం పడిన చోట దొర్లుతూనే ఉంది. ఇలా అసహనంతో అటూఇటూ తిరుగుతున్న ముంగిస దగ్గరకు ధర్మరాజు వచ్చి.. ‘‘ఎందుకంత అసహనంతో ఉన్నావు? నీకేం కావాలి?’’ అని ప్రశ్నించగా ముంగిస తన కథను వివరించింది... ‘‘ఒకానొక సమయంలో రాజ్యంలోని ఆ ప్రాంతాన్ని తీవ్ర క్షామం పీడించింది. మనుషులతోపాటు అన్య జంతు జీవాలకు కూడా తినటానికి తిండి లేదు. కనీసం ప్రాణం నిలుపుకోవడానికైనా ఆహారం లేదు. నేను ఆహారం కోసం వెతుక్కుంటూ ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికెళ్లాను. ఆ ఇంటి వారంతా ఎన్నో రోజులు పస్తులున్న తర్వాత కాసిన్ని గింజలు దొరికితే వాటిని వండుకుని తినటానికి సిద్ధమవుతున్నారు. బ్రాహ్మణుడు.. అతని భార్య, కొడుకు, కోడలు నలుగురికీ నాలుగు భాగాలుగా చేసి, తినబోతున్న సమయంలో చాలా ఆకలిగా ఉంది.. అన్నం పెడతారా? అంటూ ఒక అతిథి వచ్చాడు. అన్నం తిని వారాలైంది.. ప్రాణాలు పోతున్నాయంటూ అభ్యర్థించాడు.. నాస్తి క్షుధా సమం దుఃఖం నాస్తి రోగ క్షుధా సమః నాస్త్యాహార సమం సౌఖ్యం నాస్తి క్షుదా సమోరిపుః ‘‘ఆకలి వంటి దుఃఖం లేదు. ఆకలి వంటి రోగం లేదు. ఆకలి వంటి శత్రువు లేడు. తిండికి సమమైన సౌఖ్యం లేదు’’. కుటుంబ సభ్యులెవరూ మరోమారు ఆలోచించక ఎవరి వాటాను వారు అతిథికి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ, యజమాని ధర్మం ప్రకారం మొదట తన వాటాను అతిథికి సమర్పించాడు. అది ఆరగించి అయ్యా ఆకలి తీరలేదు ఇంకాస్త పెడతారా అని అడిగాడు. ఆ యజమాని భార్య, కొడుకు, కోడలు ఇలా అందరి వాటాలూ నిస్సంకోచంగా అతిథికి సమర్పించారు. ఆయన తృప్తిగా భోంచేసి, ఇంటివారిని ఆశీర్వదించి వెళ్లాడు. నేనూ (ముంగిస) ఆకలితో అలమటిస్తూ ఆయన వదిలేసిన ఎంగిలి మెతుకులు తినడానికి తాకిన వెంటనే నా శరీరం అర్ధ భాగం బంగారమైపోయింది. అప్పటి నుంచి నాకు కనపడ్డ, వినపడ్డ ప్రతి సంతర్పణకూ హాజరవుతూనే ఉన్నాను. ఏ మహాత్ముడైనా ఆతిథ్యమిచ్చిన చోట మిగిలిన శరీర అర్ధభాగం కూడా బంగారు వర్ణంగా మారదా అని ఎదురుచూస్తున్నాను. నీవు అశ్వమేధ యాగం చేసి, కనీవినీ ఎరుగని రీతిలో సంతర్పణ, దానాలూ చేస్తున్నావని తెలిసి ఇక్కడికి వచ్చాను. కానీ, ఇక్కడ కూడా అర్ధ శరీరం బంగారు వర్ణంలోకి మారలేదు. ఆ బ్రాహ్మణోత్తముడి ఆతిథ్యం ముందు నీ ఆతిథ్యం వెలవెలబోయింది’’ అని ముంగిస తన కథను వివరించింది. అప్పుడు ధర్మరాజుకి అర్థమైంది.. తాను తనకున్న సంపదలో కొంత దానం చేస్తూ, అతిథులకు సంతర్పణ చేస్తూ తనంత గొప్పగా ఎవరూ చేసుండరని భావిస్తుంటే.. రోజులు తరబడి పస్తులుండి కష్టపడి తెచ్చుకున్న ఆహారంతో తమ ప్రాణాలు నిలబెట్టుకోకుండా అతిథికి వడ్డించిన ఆ నిరుపేద బ్రాహ్మణుడి కుటుంబం ఎంత ఉన్నతమైందో.. ముంగిస మాటల వెనుక పరమార్థం ఏమిటో! ఈ కథ వింటుంటే రామదాసు చరిత్రలోని.. అతిథి వచ్చి ఆకలన్న అన్నమిడినదే చాలు క్రతువు సేయ వలయుననెడి కాంక్షలేటికే అనే మాటలు గుర్తుకొస్తాయి. అంతా వింటున్న కృష్ణుడు ముంగిసతో ఇలా అన్నాడు. ‘‘నీ శరీరాన్ని సగం బంగారంగా మార్చింది ఆహారం కాదు. తాము చనిపోతామని తెలిసి కూడా తమ ఆహారాన్ని ముక్కూమొహం తెలియని అతిథికి ఆనందంగా సమర్పించిన ఆ కుటుంబ సభ్యుల నిస్వార్థ నిరహంకార ఆత్మబలం, ఆత్మ సంతృప్తి వల్ల నీ శరీరం బంగారమైంది’’. ధర్మజా! ఇంత గొప్ప సంతర్పణ చేసిన తర్వాత, ఆ పేద బ్రాహ్మణుడి కుటుంబ సభ్యులకు కలిగిన నిరహంకార ఆత్మసంతృప్తి నీకూ, నీ తమ్ముళ్లకు కలిగిందా? ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ధర్మరాజుకి తనలో ప్రవేశించిన ఆత్మ ప్రశంసాతత్వానికి కారణం బోధపడింది. పరిష్కారం అవగతమైంది. తన వద్ద ఉన్న ఆహారాన్నంతా క్షుధార్తులకు ఇచ్చి, మంచినీటితో క్షుధాగ్నిని సంతృప్తి పర్చుకోవాలనుకున్న రంతిదేవుడు.. మరికొంతమంది క్షుధార్తులు తనకంటే ఎక్కువగా అలమటిస్తున్నారని తెలిసి.. అన్నములేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న రావన్న శరీరధారులకు నాపద వ చ్చిన వారి యాపదల్ గ్నన్నన మాన్పి వారికి సుఖంబులు సేయుట కన్న నొండుమేలున్నదె అంటూ తోటి ప్రాణులకు కష్టమొస్తే, అది తనకొచ్చినట్లేనని వారికష్టాన్ని తీర్చడం కంటే మరో గొప్ప కార్యం లేదని తన వద్ద ఉన్న మంచినీటిని కూడా ఆ అతిథులకు అర్పించాడు. అతిథులను ఆదరించడంలో వారి ఆకలిని తన ఆకలిగా భావించాలని అర్థమయ్యేలా ఆదర్శప్రాయమైన ఉదాహరణగా నిలిచాడు. ‘‘నీ దగ్గరికి ఎవరొచ్చినా, వారెంతటి తక్కువ స్థితిలో ఉన్నవారైనా సరే.. ఉన్నత స్థితిలోని వారితో ఎంత మర్యాదగా, ఆదరంగా ప్రవర్తిస్తావో పేదవారితోనూ అలాగే ప్రవర్తించు. ఏ దేవతలు.. ఎప్పుడు ఏ రూపంలో నీ వద్దకొస్తారో నీకేం తెలుసు’’ అంటుంది బైబిల్. అతిథిగా ఇంటికొచ్చిన వారిని ఆర్థిక, సామాజిక, రాజకీయ విజ్ఞాన స్థితిగతులను విచారించకుండా తాను వారి స్థానంలో నిలబడి, తనను ఇతరులు ఎలా ఆదరించాలనుకుంటాడో అలాగే ఇతరులను ఆదరించాలి. చివరకు శత్రువు వచ్చినా సరే సాదరంగా గౌరవించాలంటుంది మహాభారతం. నీడనిచ్చే చెట్టు తనను నరకటానికి వచ్చిన వాడికి కూడా నీడనిస్తుంది గదా అంటుంది భారతం. వచ్చిన వారి వల్ల మనకేంటి లాభం? అన్ని విధాలా మనతో సరితూగుతారా? ఇంతకుముందు మనం వారి వద్దకెళ్లినపుడు మనల్ని ఎలా ఆదరించారు? వంటి రకరకాల ఆలోచనలతో సతమతమవకుండా ప్రేమతో, ఆప్యాయతతో మనం మంచినీళ్లు ఇచ్చినా చాలు. వచ్చిన వారిని మన పడికట్టు రాళ్లతో పరీక్షించడం ప్రారంభిస్తే స్వచ్ఛంగా అభిమానించలేం. ‘‘ప్రతి వ్యక్తి తనకు తాను ఒక జీనియస్సే. ఒక చేపను దానికి చెట్టు ఎక్కగలిగే నేర్పుందా? లేదా? అని పరీక్షించడం ప్రారంభిస్తే అది జీవితాంతం తాను ఎందుకూ పనికిరాననే భావనలో బతుకుతుంది. అలాగే పక్షిని ఈదగలిగే సామర్థ్యం ఆధారంగా పరీక్షిస్తే.. మనం సృష్టిలోని రమణీయతను, కమనీయతను సహజంగా ఆస్వాదించలేం’’ అంటారు ఐన్ స్టీన్. కొంచెమైనా పంచుకోవడం, ప్రేమతో నిండిన స్పర్శ, ఆత్మీయమైన చిరునవ్వు, దయతో నిండిన చూపు, సాటివారి కోసం స్పందించే గుణం ఇవన్నీ భగవంతుడి రూపాలే. చూడగలిగే వారికీ, చూపగలిగే వారికీ, అతిథిగా వెళ్లేవారికీ, అతిథులను ఆహ్వానించే వారికీ, అతిథులుగా ఈ భూమ్మీదకు వచ్చిన వారందరికీ! అయితే, ఈ గుణాలన్నీ అప్పటికప్పుడు అప్రయత్నంగా, అచేతనంగా అందరికీ అలవడవు. వ్యక్తి స్థాయిలో, కుటుంబ స్థాయిలో, సంఘ స్థాయిలో కొన్ని తరాల పాటు వెలకట్టలేని ఆస్తులుగా తర్వాతి తరాలకు అందజేస్తూ పోతే చిన్నప్పటి నుంచి అలవోకగా అలవడతాయి. భాగవతంలో దుర్భర దారిద్య్రంలో మగ్గుతూ భార్య కోరిక మేరకు కృష్ణుని కరుణ కోసం వచ్చిన బాల్యమిత్రుడు సుదాముడిని కుశల ప్రశ్నలు వేసి, తన ఆసనంపై కూర్చోబెట్టి అతణ్ని సేదతీర్చి బాల్యంనాటి విద్యార్జన విశేషాలను, గురువు సాందీపుని అపార వాత్సల్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.. తన కోసం ఆ పేద బ్రాహ్మణుడు తెచ్చిన అటుకులను ఆత్రంగా ఆస్వాదిస్తూ చెప్పకుండానే అతని ఆకలిని, కష్టాలను తీర్చిన శ్రీకృష్ణుని అతిథి సత్కార తత్పరత, ఔదార్యం ఆతిథ్యమిచ్చే వారందరికీ ఆదర్శప్రాయం. అందుకే పంచతంత్రంలో ఇలా చెప్పారు.. అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ ప్రతినివర్తతే తస్మై దుష్కృతం దత్వా పుణ్యమాదాయ గచ్ఛాతి. ‘‘ఏ గృహస్థుని ఇంటి నుంచి అతిథిైయెున వాడు ఆకలితో వెనుదిరిగి పోవునో అట్టివాడు ఆ గృహస్థు చేసిన మంచి కర్మల ఫలితాన్ని కొనిపోతూ తాను కావించిన దుష్కర్మల ఫలాన్ని ఆ గృహస్థునికిచ్చి పోవుచున్నాడు’’. ఇంటికొచ్చిన అతిథులను ఆదరిస్తే నవతేజం ప్రాప్తిస్తుంది. అతిథి సేవ చేయని వానికి అకాల ఆపదలు ఆవరిస్తాయని విధురుడు దృతరాష్ట్రునితో అంటాడు. అతిథి అభ్యాగత సేవా పాఠాలు: కొన్ని విషయాలు పాఠశాలల్లో బోధిస్తారు. చాలా విషయాలు కుటుంబమనే పాఠశాలల్లోనే నేర్చుకోవడం జరుగుతుంది. తోటివారిని ఎలా ఆదరించాలి? ఎదుటివారు బాధ పెట్టేట్లు ప్రవర్తించినా మనమెలా సంయమనం పాటించా లి? మనకు ఆదరంగా అతిథ్యమివ్వని అతిథి వచ్చినప్పుడు మనం దాన్ని మరచిపోయి ఎలా హుందాగా వారిని ఆహ్వానించాలి? ఇంటికొచ్చిన వారు కష్టంలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉండి ఎవరింటికైనా వెళ్లినప్పుడు, కష్టాల్లో ఉన్నవారిని సందర్శించడానికి వెళ్లినప్పుడు ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి?ఎలా మాట్లాడకూడదు? సాంత్వన ఎలా చేకూర్చాలి? వంటి విషయాలను అతిథి అభ్యాగత సేవ ద్వారానే నేర్వ గలుగుతాం. అతిథులతో సంభాషించేప్పుడు పాటించాల్సిన కనీస నియమాలు.. ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం, వారికి అవగాహన ఉన్న అంశాలపై అర్థమయ్యే భాషలో మాట్లాడటం,వారు తమ సమస్యను చెబితే సావధానంగా వినడం, వారు అడిగితే దానికి మనవద్ద ఉన్న/తెలిసిన పరిష్కారాన్ని సూచించడం, మన సమస్యలు ఏకరువు పెట్టకుండా ఉండటం. మన అలవాట్లు, నియమాలు, సిద్ధాంతాలు, విధానాలు, అభిరుచులు వంటి విషయాలపై అడిగితేనే క్లుప్తంగా, ఆత్మీయంగా, నిరాడంబరం గా, వారిని కించపరచకుండా, వారు ఎలాంటి అభద్రతాభావానికి గురికాకుండా, చిన్నబుచ్చుకోకుండా మాట్లాడాలి. మన ఆతిథ్యం స్వీకరించి, మనతో మాట్లాడిన వారికి సేదతీరినట్లుండేలా ప్రవర్తించడం ముఖ్యం. ఎవరైనా చివరకు మనం ఏ మాట్లాడాం, వారికి ఏం చేశామనే దానికంటే మన సాన్నిధ్యంలో వారు ఎలాంటి అనుభూతికి లోనయ్యారు అనేదాన్నే (తీపి/చేదు) గుర్తుగా ఉంచుకుంటారు. ఎందుకంటే జీవితంలో ఎవరినైనా వారి దృక్పథం, పరిస్థితుల కనుగుణంగా ఆలోచిస్తేనే అర్థం చేసుకోగలం. మహా నిర్వాణ తంత్రంలో ఇలా చెబుతారు.. స్వీయం యశః పౌరుషం చ గుప్తయే కథితం చయత్ కృతం యదుపకారాయ ధర్మజ్ఞోన ప్రకాశయేత్ ‘‘మొదటిది తన ప్రఖ్యాతిని,శక్తియుక్తుల్ని గురించి ఇతరుల ముందు ప్రగల్భాలు పలకకూడదు. రెండోది తాను ఇతరులకు చేసిన ఉపకారాలను ప్రకటించకూడదు. మూడోది రహస్యంగా తనకు తెలిసిన విషయాలను ఇతరులకు చేరవేయకూడదు’’. ఈ మూడు గుణాలను అతిథి సత్కారాలు చేసే సమయంలోనూ తప్పనిసరిగా పాటించాలి. అతని కుల శీల విద్యా స్థితులడగక యెంత వికృత దేహుండైనన్ మతి విష్ణునిగా తలచుచు నతి ముదమున సేవ సేయునది నిజ శక్తిన్... అంటాడు మారన తన మార్కండేయ పురాణంలో. అంటే అతిథి కులం, గుణం, విద్య, ఉద్యోగం వంటి విషయాలపై దృష్టిసారించక అతణ్ని విష్ణుమూర్తి అవతారంగా తలచి, సంతోషంతో మనకున్నంతలో సేవ చేయాలి. ఆతిథ్యం.. దైవానికి సేవ: చక్కబాటు, సర్దుబాటు, దిద్దుబాటు- ఈ మూడూ కలిసి ఉండటమే ఒక కళ. మనం ఎవరిపట్లయినా, వారు పరిచితులైనా, అపరిచితులైనా అతిథి మర్యాదలు చేస్తున్నామంటే అది అతిథులకే కాక, మనకూ తాదాత్మ్యాన్ని కలిగించాలి. ఆతిథ్యం ఇవ్వడాన్ని ఒక బాధ్యతగానో, కర్తవ్యంగానో లేదంటే మెప్పుకోసమో కాకుండా ఈ ప్రపంచంలోకి అతిథులుగా మనల్ని తీసుకొచ్చిన దైవానికి ప్రేమతో, కృతజ్ఞతా భావంతో చేసే సేవగా ఉండాలి. చిరునవ్వుతో హృదయ పూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించే కుటుంబ సభ్యులే ఆ గృహానికి అలంకరణాలుగానీ ప్రాణం లేని ప్రధాన ద్వారాలు, అబ్బురపరిచే ఆధునిక ఆసనాలు, అచేతనంగా ఉండే అలంకరణ గోడ చిత్రాలు, ఖర్చును ప్రతిబింబించే ఖరీదైన ఉపకరణాలు కాదుకదా! మన ఆదరణ చూసి, వచ్చిన వారు హర్షించాలేగానీ, మన ఆవరణ చూసి ఈర్ష్యించకూడదు. మనం కూడా వారి ముందు మన అంతరంగాన్ని ఆవిష్కరించాలిగానీ, అంతస్తుల్ని కాదు! జీవితంలో ప్రేమను కోరుకునే వారు ప్రేమించాలి. ప్రేమించాలంటే సహనం కావాలి. సహనం పెరగాలంటే వ్యామోహం, ఈర్ష్య, గర్వం, క్రోధం, తప్పులెన్నుగుణం తగ్గాలి. అప్పుడు వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, రాకపోకలు, ఆతిథ్యాలు, ఆత్మీయతానురాగాలు పెరిగి అనుభవాలు పంచుకొంటూ పరస్పర సహకారంతో పురోగతి వైపు పయనిస్తాం. సమస్య ఏమిటంటే.. టాల్‌స్టాయ్ మాటల్లో చెప్పాలంటే.. ప్రతివారూ ప్రపంచాన్ని మారుద్దామనుకుంటారేగానీ వారిలో రావాల్సిన మార్పు గురించి ఆలోచించరు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన వినాశనాన్ని చూసి కలత చెందిన ఐన్‌స్టీన్‌ను ఒక పాత్రికేయుడు ఇలా అడిగాడు. హింస, ద్వేషం మానవ ప్రవృత్తిలో సహజ భాగమా? దాని పర్యవసానమే ఇంత వినాశనానికి దారితీసిందా? దీన్నుంచి తప్పించుకునే మార్గమే లేదా? అని. దానికి సమాధానంగా ఐన్‌స్టీన్.. ‘‘హింస, ద్వేషం మానవ ప్రవృత్తిలో సహజ భాగం కాకుండా ఉండాలంటే సమాజం నుంచి, మానవ నైజం నుంచి వాటి మోతాదును తగ్గిస్తూ పోవాలి. పరిణామక్రమంలో హింసాద్వేషాలు సమాజంలో తగ్గి, వాటి ప్రకటనా సామర్థ్యం తర్వాతి తరాల్లో తగ్గుతుంది. మానవ ప్రవృత్తి హింస, ద్వేషం వైపు మళ్లకుండా కళ్లెం వేసి, నియంత్రించడానికి సమాజంలో కుటుంబం, పాఠశాల వంటి వ్యవస్థలు (Institutions) తమ దైనందిన కార్యకలాపాల్లో కరుణ, మైత్రి, ప్రేమ లాంటి ఉన్నత భావాలతో హింస, ద్వేషం వంటి ఉన్మాద భావాలను అణగదొక్కాలి. మానవులు మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఆహ్వానించుకోగలిగే, ఆమోదించుకోగలిగే సందర్భాలు పెరగాలి. తమకున్న (ధన, జ్ఞాన, గుణ) సంపదను ఆహ్లాదంగా తోటి వారితో పంచుకోవడానికి అవకాశాలను అభివృద్ధి చేసుకోవాలి. వీటిలో ముఖ్యమైంది సాటి మానవులకు ఆతిథ్యమివ్వడం. ఆతిథ్యమిచ్చే సందర్భంలో అతిథి కోసం కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంతో కలసి పనిచేయడం. సహృదయంతో ప్రవర్తిస్తూ, ప్రేమతో అతిథి అవసరాలు తీర్చడం.. తద్వారా అతిథిలో ఆ కుటుంబ సభ్యులపై ప్రేమానురాగాలు పెరగడం, ఆ ప్రేమను అద్భుతమైన అనుభూతిగా గుర్తుంచుకొని వారందరూ దాన్ని వీలైన చోటల్లా పంచడం ఇలా ప్రేమ, మైత్రి, కరుణ లాంటి ఉన్నత గుణాలు పరమాణు విస్ఫోటనం కంటే శక్తిమంతంగా మారి ప్రపంచాన్ని శాంతి మేఘాలతో కప్పేసే లక్ష్యం సాకారమవుతుందన్నారు. ఇంకా ఐన్‌స్టీన్ తన స్వీయ అనుభవాన్ని వివరిస్తూ.. ‘‘నేనొకసారి ఒకరికి అతిథిగా వెళ్లాను. ఆయన నాకు తేనీటి విందు ఇచ్చాక, లోపలికి వెళ్లి పాత్రలను కడుగుతున్నాడు. నేనూ లోపలికెళ్లి సాయం చేసేందుకు సిద్ధపడగా అతను వారించాడు. అయినా ఒక కప్పును తీసుకొని, దానిపైన సబ్బుతో శుభ్రం చేయడం ప్రారంభించాను. దాన్నిచూసి ఆయన చిరునవ్వుతో.. మొదట లోపలివైపు శుభ్రంచేసి, తర్వాత బయటవైపు శుభ్రం చేయండి. లోపలి శుభ్రత బయటి శుభ్రతకు ఆరంభం, అవసరం అనివార్యం అని చెప్పాడు. అతిథిగా వెళ్లి ఆయన దగ్గర నేర్చుకున్న పాఠం నా వ్యక్తిగత, సామాజిక జీవన దృక్పథాన్ని పునర్నిర్వచించిందని ఆయన ఆనందంగా చెప్పారు. ద్వేషమైనా, అనురాగమైనా దీపం లాంటివి. కాల్చగలవు.. కాంతిని నింపగలవు. అందుకే అ merry heart does good like a medicine but a broken spirit dries the bones. ఆనందమైన హృదయం ఉపశమనం కలిగించే మందులా పనిచేస్తుంది. అదే ఛిద్రమైన అంతరంగం ఎముకలను కూడా ఇగిర్చివేస్తుందని చెబుతుంది బైబిల్. ఆతిథ్యానికి ఆదరం.. సార్థక సంభాషణ: విశ్రాంతి అంటే పడుకొని నిద్రపోవడమో, సముద్రాల దగ్గరకో, కొండలపైకో వెళ్లడం మాత్రమే కాదు! నచ్చిన వారితో, అతిథిగా వచ్చిన వారితో హృదయపూర్వకంగా మాట్లాడటం కూడా. నాణ్యమైన సంభాషణతో గడిపిన విశ్రాంతి సమయం ఆత్మకు సాంత్వన చేకూర్చి కార్యనిర్వహణ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అయితే సంభాషించేటప్పుడు కొన్ని ప్రాథమిక అంశాలను పాటిస్తే సంభాషణా సార్థకత పెరుగుతుంది. ఎదుటివారు చెప్పింది వినడం, విన్నదానిలో మనకు అవసరమైంది గ్రహించడం, నచ్చకుంటే విభేదించకుండా మౌనంగా ఉండటం, రెండో వ్యక్తి గురించి చెడుగా మూడో వ్యక్తి దగ్గర మాట్లాడకుండటం, ఏ మాటనైనా శాంతంగా చెప్పడం, సందర్భోచితంగా మనస్ఫూర్తిగా అభినందించగలగడం, ఎదుటివారి సమయాన్ని గౌరవించడం, ఆడంబరం, అహంకారం తొంగి చూడకుండా వినయంతో భాషించడం, అలాగే సంభాషణలో హాస్య చతురోక్తి ప్రయోగించాలనుకున్నపుడు అక్కడున్న స్త్రీలు సిగ్గుపడేలా ఉండకూడదు, ఏ హృదయమూ బాధపడకూడదు. పవిత్రమైన వాటిని అపహాస్యం చేయకూడదు. హాస్యం కోసం అసభ్యతను ఎంచుకోరాదు. మన మాటలు ఎదుటివారి బలహీనతలను గేలిచేసేలా, పిల్లలు బాధపడి కన్నీళ్లు పెట్టుకునేలా ఉండకూడదు. సంభాషణలో కొందరిని నవ్వించడానికి ఏ ఒక్కరిని బాధ పెట్టినా అది వర్జితమే. అతిథి పట్ల అమర్యాదే! వ్యక్తిస్వామ్యం పెరుగుతున్న ప్రస్తుత ఆధునిక విజ్ఞాన యుగంలో కుటుంబాల మధ్య రాకపోకలు, అతిథి మర్యాదలు, అపరిచితులతో కనీస మర్యాదతో మాట్లాడటం, కుటుంబంలోనూ సభ్యులు పరస్పరం ప్రేమతో సంభాషించుకోవటం తగ్గుముఖం పట్టింది. పిల్లలు టీవీ ద్వారానో, ఇంటర్నెట్ ద్వారానో తమకు కావాల్సిన జ్ఞానమంతా లభిస్తుందని భావిస్తూ యాంత్రిక నాగరికతా ప్రవాహంలో మునిగిపోతూ తోటి మనుషుల కంటే యాంత్రిక ఉపకరణాలపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో తల్లిదండ్రులతో, బంధువులతో, మిత్రులతో, అతిథులతో పిల్లలు గడుపుతున్న సమయం 55 శాతం తగ్గిందని, దీని ప్రభావం పిల్లల పరిపూర్ణ మానసిక శారీరక వికాసంపై ప్రతికూలతను చూపుతోందని యునిసెఫ్ నివేదికలో పేర్కొంది. దీని ఫలితంగా పిల్లల్లో దుందుడుకు వ్యక్తిత్వం, ఊబకాయం, మానసిక అసమతౌల్యత, అసహనం పెరిగిపోతున్నాయని.. ఇది పరోక్షంగా సామాజిక అశాంతికి దారితీస్తోందని హెచ్చరించింది. పిల్లల భావ వ్యక్తీకరణకు మార్గాలు, అవకాశాలు కుటుంబంలో సన్నగిల్లుతుండటంతో ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటూ వాటి మంచి చెడులను నిర్ణయించుకొనే అనుభవం లేక మాదక ద్రవ్యాలు, ఇతర కృత్రిమ శారీరక, మానసిక ఉత్ప్రేరకాలకు అలవాటు పడుతున్నారని పేర్కొనటం ఆందోళనకరం. ఇప్పటి పిల్లలకు గుర్రాన్ని ఎనిమిది భాషల్లో ఏమని పిలుస్తారో తెలుసుకునేందుకు వీలవుతుందనిగానీ, గుర్రపు స్వారీ చేయడానికి అభిరుచి, అవకాశం రెండూ కలగడం లేదని ఒక బాలల మానసిక శాస్త్రవేత్త అభిప్రాయపడటంలో ఆశ్చర్యమేముంది? సోమరితనానికి, విశ్రాంతికి; సమాచారానికి, జ్ఞానానికి తేడా తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఈతరం పసి హృదయాలకు స్థైర్యాన్ని, స్ఫూర్తిని ఇవ్వాలంటే ఆ దిశగా సార్థక ప్రయత్నాలు సాగించాలంటే కింది పంక్తుల్ని గుర్తుంచుకోవాలి... ఏక ఏవన భుంజీయాత్ యదీచ్ఛేత్ శుభమాత్మనః ద్విత్రభిః బహుభిః సార్థం భోజనం కారయేన్నరః ‘‘శుభం జరగాలని కోరుకునే వారు ఒంటరిగా తినకూడదు. ఇద్దరుకానీ ముగ్గురుకానీ కలిసి భుజించాలి. వారిలో ఒకరు అతిథి అయితే మరీ శ్రేష్టం’’. గాంధీజీ ఆశయాలకు, ఆచరణకు ప్రభావితుడైన మార్టిన్ లూథర్‌కింగ్ 1959లో భారత్ వచ్చినప్పుడు ఆయన అనుభవం గురించి అడగ్గా.. ‘‘మిగిలిన దేశాలకు నేను యాత్రికునిగానే వెళ్లానుగానీ, భారత్‌లో మాత్రం అత్యంత సన్నిహితమైన అతిథిననే భావం కలిగింది. గాంధీకి జన్మనిచ్చిన దేశం నాకు పరాయి దేశంగా అనిపించడం లేదు. ఇక్కడి జీవన విధానంలో, ఆతిథ్యంలో ఏదో తెలియని సంతృప్తి నాకు సాంత్వన కలిగిస్తోంది’’ అంటూ తన మనసులోని మాట చెప్పారు. భారత దేశ సంప్రదాయాల్లో ముఖ్యమైన అంశం ఆతిథ్యం.. తద్వారా చర్చ, వాదోపవాదాలను ప్రోత్సహించడం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, మనుగడకు అతి ముఖ్యమైనవంటారు అమర్త్యసేన్. హింసను, ద్వేషాన్ని, మన భయాలు, బాధలు, బలహీనతల్ని అధిగమించి ఆశావహ దృక్పథంతో ఒక బలమైన జాతిగా ఎదగాలంటే అందరూ కలవాలి.. పరస్పరం సంభాషించుకోవాలి.. ఆహ్వానించుకోవాలి.. ఆతిథ్యమిచ్చుకోవాలి.. ఆదరించుకోవాలి.. ఆనందించాలి. ఈ ప్రపంచంలో ఆకలితో అలమటించేవారు ఎందరో ఉన్నారు. భగవంతుడు వారికి అన్నం రూపంలోనే కనిపిస్తాడు అంటారు గాంధీ. Generosity to others is as necessary as strictness with oneself. తిథి లేకుం డా వచ్చే వాడే అతిథి అయినా, అతిథులు కూడా కొన్ని పరిమితులు పాటించాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఆతిథ్యమిచ్చే వారికి తెలియజేసి, వారికనువైన సమయంలో వెళ్లడానికి ప్రయత్నించాలి. అతిథిగా మనం వారింట్లో ఏమైనా సాయపడగలమేమో చూడాలి. పాత్రలు, మంచాలు, ఇతర సౌకర్యాలు మనం ఉపయోగించిన తర్వాత శుభ్రంగా ఉంచుతూ, వారికి పని పెంచకుండా ఉండటం, వారేమీ అడగకపోయినా మన అభిప్రాయాలు చెప్పకుండటం, వారి ఆర్థిక పరిస్థితికి అనువుగా మనం మనల్ని మల్చుకోవడం అతిథి కనీస ధర్మాలు. అతిథి సత్కారాన్ని పొందకోరిన అతిథికి సహన సద్భావాలు ఎంత అవసరమో ఈ ఉదంతంతో అవగతమవుతుంది. దక్షిణ కొరియాలోని గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఒక అతిథి గది ఉంటుంది. అవసరంపై ఆ ఊరుకొచ్చిన పొరుగూరి వారికి మనస్ఫూర్తిగా ఆతిథ్యమిచ్చే ఘన సంప్రదాయం వారి సంస్కృతిలో భాగం. అలాగే అతిథిని అనాలోచితంగానైనా అన్నం పెట్టకుండా నిరీక్షింపజేయటం అతి పాపకరం. నచికేతుడు యముని దగ్గరకొచ్చి మూడు రోజులు ఆహారం లేకుండా నిరీక్షించడం వల్ల ఆ పాప పరిహారానికి మూడు వరాలు కోరుకొమ్మంటూ యముడు ఇలా అంటాడు.. ఆశా ప్రతీక్షే సంగతం సూనృతం చేష్టా పూర్తే పుత్ర పశూచ్చ సర్వాణ ఏతద్రవృం క్తే పురుషస్యాల్పి మేధసో యస్యా నశ్న న్వసతి గృహే ‘‘ఎవరి ఇంట అతిథి నిరీక్షిస్తూ, భోజనం చేయకుండా ఉంటాడో ఆ ఇంట ఆశ, ఎదురు చూడటం, సజ్జన సాంగత్యం, యజ్ఞయాగాదులు, పుత్రులు, పశువులు అన్నీ నశిస్తాయి’’. ఆతిథ్యం.. మార్గనిర్దేశం: ఏదైనా మంచి మార్పు మనలో రావాలనుకున్నప్పుడు ప్రథమంగా ఉదయించే ప్రశ్న అందరూ అలా లేరు కదా నేనే ఎందుకు అలా మారాలని.. కానీ, మన నుంచి ఒకసారి మనస్ఫూర్తిగా ఆతిథ్యం తీసుకున్న వారు, దానివల్ల అనుభవించే ఆత్మానందాన్ని మరచిపోలేరు. ఎవరినైనా ఆదరిస్తున్నప్పుడు లేదా నిరాదరిస్తున్నప్పుడు మన అంతరాత్మను ఆ అనుభవం మార్గనిర్దేశనం చేస్తూ ఉంటుంది. ఆచరించే మార్గం, నమ్మిన విధానం మంచిదైనప్పుడు ఒంటరివాడివైనా ముందుకు సాగిపో..! సమాజం ఏదో ఒకరోజు అర్థం చేసుకొని, అభినందించి నీ మార్గంలో నడుస్తుందన్న విశ్వకవి ఠాగూర్ మాటలు ఆలోచనీయం. కుటుంబంలో అసూయ, అనాదరణ, అహంకారం, ఆడంబరం, అభిజాత్యం వ్యక్తిస్థాయిలో ఎప్పుడు నాటుకు పోతాయో ఆపదలు వారితో పాటు వారి కుటుంబాన్ని కబళించటానికి ఎదురు చూస్తుంటాయి. సౌజన్యం, సౌశీల్యం, సానుభూతి, ప్రేమలతోనే మనిషి మనిషికి స్నేహపాత్రుడు కాగలుగుతాడు. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఏ గృహస్తు అయినా అతిథి పట్ల చూపాల్సిన కనీస గుణాలివి. భావస్ఫూర్తి, వాక్శుద్ధి ఎవరికైనా సహజాభరణాలు. వీటిని మనస్ఫూర్తిగా వినియోగించడం వల్ల ఖర్చేమీ కాదు. పైగా ఆ సద్భావ సంపన్నత, సహృదయత ఎదుటివారిలో కూడా ప్రశాంతతను నెలకొల్పి, ఆలోచింపచేసే శక్తిని కలిగి ఉంటుంది. ఒకరికొకరు ఆతిథ్యమిచ్చుకోవడం, భౌతిక, మానసిక ఆధ్యాత్మిక వనరులను పరస్పరం పంచుకోవడం, తద్వారా అనాదరం, అహంకారం, అజ్ఞానం, అభిజాత్యం లాంటి అసుర గుణాలను అంతం చేయడం.. అనురాగం, ఆక్రోధం, ఆదరణ, ఆత్మీయత, ఆర్తి, ఆర్ద్రత లాంటి దైవ గుణాలను అభివృద్ధి చేయడం దాని ఫలితంగా విశ్వశ్రేయస్సుకు తోడ్పడడం.. ఇవి నిష్కల్మష ఆతిథ్య ఫలాలు. ఎన్నో ఉపకరణాల ద్వారా ప్రపంచంతో అనుసంధానమవుతున్నా ఒంటరితనం, ఒత్తిడి నవతరాన్ని పట్టి పీడిస్తుందంటే వ్యక్తుల మధ్యా తక్షణ అవసరాలు తీర్చుకునే (Instant Utility) సంస్కృతి పెరగడం కారణమేమో! అతిథులు ఇంటికి రావడం, వారితో గడపడం వల్ల ఒంటరితనం, మానసిక ఒత్తిడి తగ్గి, జీవన గమనం ఒక సమన్వయ స్థితిని పొందగలుగుతుందన్నది మానసిక నిపుణుల అభిప్రాయం కూడా.. తదేవ లభతే భద్రే కర్తా కర్మజ మాత్మనః ‘‘పుణ్యమైనా, పాపమైనా మానవుడు ఏ కర్మ చేస్తాడో దాని ఫలితాన్ని తప్పకుండా పొందుతాడు’’. ఎవరికి వారు తమకు తాము జీవితపు లోతుల్లోకి వెళ్లి, వారి జీవితం ఎక్కడ ప్రారంభమైందో.. ఎక్కడికి చేరాలనుకుంటున్నారో.. ఎలా చేరాలనుకుంటున్నారో.. ఆత్మాన్వేషణ చేసుకుంటే కృత్రిమ పోకడల కంటే సహజ సహృదయతే వారిని అక్కడికి క్షేమంగా చేర్చగలుగుతుందని అర్థం చేసుకోగలుగుతారు. ‘‘ధన రాశుల కంటే ఘనమైన గుణరాశులు మానవ సమాజ మనుగడకు అత్యవసరం. ధనరాశులు పెరిగి, దాగిన చోట పాపపు రాశులు మరిగి ఆవిరిగా బయట పడతాయి. తనను, తనతోటి వారిని భక్షిస్తాయి. గుణరాశులు పెరిగిన చోట, పుణ్యపు రాశులు సుగంధంలా వ్యాప్తి చెంది తనను, తన సమాజాన్ని రక్షిస్తాయి అంటారు’’ ఆలివర్ గోల్డ్‌స్మిత్. వ్యక్తి మనుగడకూ, కుటుంబ శాంతికీ, సమాజ సాఫల్యానికి, ప్రజాస్వామ్య పరిపక్వతకు అతిథి సేవనం ఒక ఉత్ప్రేరకం వంటిది. మరణానంతరం దైవం మన జీవితంపై తీర్పు చెప్పేటప్పుడు ఎంతమంది ఆకలిని మనం ప్రేమతో నింపిన ఆహారంతో తీర్చామన్న దాని ఆధారంగానే తీర్పు ఇస్తాడంటారు మదర్ థెరీసా. పెద్దలను గౌరవించడం, అనాథలను ఆదరించడం, వృద్ధులను దయతో పలకరించడం, అతిథులను మర్యాదతో సత్కరించడం, సన్మార్గ ఆచరణ.. సామాజిక జీవనం లో సంక్షోభాన్ని నివారిస్తాయని భరతునికి రాజధర్మం ఉపదేశిస్తూ రాముడు చిత్రకూటంలో చెబుతాడు. సమాజానికి గృహస్థాశ్రమం పునాది. పునాది గట్టిగా ఉంటేనే సమాజమనే భవనం దృఢంగా ఉంటుంది. సమాజం పటిష్టంగా తయారైనప్పుడు దేశంలో విభేదాలు, విద్వేష్వాలు, వికృతులు,వ్యష్టివాదం సమసి శాంతియుత సహజీవనం సాధ్యమవుతుంది. అతిథుల్ని ఆదరించడం భవన రక్షణకు చేసే మరమ్మతులాంటిది. అది పునాదిని, భవనాన్ని రెంటినీ దృఢపరుస్తుంది. అది పునాదిని, భవనాన్ని రెంటినీ దృఢపరుస్తుంది. అందుకే తైత్తిరీయ ఉపనిషత్తులో ఇలా చెప్పారు.... మాతృదేవో భవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ తల్లి, తండ్రి, గురువు, అతిథి దైవంతో సమానం... -
అటవీ కొలువులను అందుకోండి..
జ్ఞానేశ్వర్ గుమ్మళ్ల, హైదరాబాద్. పర్యావరణాన్ని, ఆర్థికాభివృద్ధిని పది కాలాల పాటు పచ్చగా ఉంచే అడవి.. కొత్త కొలువులతో యువతకు ఆహ్వానం పలుకుతోంది. సుస్థిర కెరీర్‌కు వేదికగా నిలిచేందుకు సరికొత్త నోటిఫికేషన్‌తో సిద్ధమైంది. రాష్ట్ర అటవీ శాఖ మొత్తం 2,167 ఉద్యోగాలతో ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు, ప్రిపరేషన్ వ్యూహాలు.. ఉద్యోగాల వివరాలు నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఆరు విభాగాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగం పే స్కేల్ ఖాళీలు 1. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 10,020- 29,200 151 2. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 7,960- 23,650 751 3. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 7,520- 22,430 1,224 4. తానాదార్ 7,100- 21,250 16 5. బంగళా వాచర్ 6,700- 20,110 11 6. టెక్నికల్ అసిస్టెంట్ 9,460- 27,700 14 అర్హతలు: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: బ్యాచిలర్ డిగ్రీ (బోటనీ, కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్). లేదా ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (కెమికల్, మెకానికల్, సివిల్). ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన అర్హత. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బంగళా వాచర్, తానాదార్: పదో తరగతి లేదా తత్సమాన అర్హత. వయసు: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బంగళా వాచర్, తానాదార్లకు 18-30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. శారీరక ప్రమాణాలు: పురుషులు-ఎత్తు: 163 సెం.మీ; ఛాతీ-79 సెం.మీ. గాలి పీల్చినప్పుడు ఛాతీ చుట్టుకొలత 84 సెం.మీ. ఉండాలి. వుహిళలు ఎత్తు:150 సెం.మీ. రాత పరీక్ష: టెక్నికల్ అసిస్టెంట్ మినహా మిగిలిన అన్ని ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షల సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వేర్వేరు ప్రశ్నపత్రాలుంటాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానాదార్, బంగళా వాచర్ ఉద్యోగాలకు ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. ఉద్యోగాలను బట్టి ప్రశ్నల కాఠిన్యత స్థాయిలో తేడా ఉంటుంది. రాత పరీక్షలో మూడు పేపర్లుంటాయి. పేపర్ {పశ్నల సంఖ్య మార్కులు సమయం 1. ఎస్సే రైటింగ్ 1 20 60 ని. 2. జీకే 50 100 90 ని. 3. జనరల్ మ్యాథమెటిక్స్ 50 100 90 ని. ఎస్సే తెలుగు లేదా ఇంగ్లిష్ లేదా ఉర్దూలో రాయొచ్చు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షలో ఎస్సే 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. మిగిలిన పరీక్షలలో ఎస్సే 250 పదాలకు మించకుండా రాయాలి. ఎంపిక విధానం: రాత పరీక్షకు హాజరైన అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో తర్వాతి దశకు అర్హత సాధించాలంటే ప్రతి పేపర్లో కనీసం 35 శాతం మార్కులు, మొత్తంమీద కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారి నుంచి 1:2 నిష్పత్తి లో అభ్యర్థులను ఎంపిక చేసి, ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. దీని తర్వాత అభ్యర్థులకు ‘నడక పరీక్ష’ నిర్వహిస్తారు. 4 గంటల సమయంలో పురుష అభ్యర్థులు 25 కి.మీ., మహిళా అభ్యర్థులు 16 కి.మీ., నడక పూర్తిచేయాలి. నడక పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థుల రాత పరీక్ష మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. రాత పరీక్ష- సన్నద్ధత పేపర్ 1 (జనరల్ ఎస్సే): మూడు ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకొని, గంట వ్యవధిలో వ్యాసం రాయాలి. అవసరమైన మేరకు భావాన్ని స్పష్టంగా చెప్పగలిగేలా రాయాలి. మంచి ప్రారంభం, ముగింపు అవసరం. 8, 9, 10 తరగతి పాఠ్యపుస్తకాల్లోని చరిత్ర, ఆర్థిక, పౌర, భౌగోళిక శాస్త్ర అంశాలను అవగాహన చేసుకోగల స్థాయిలో వివిధ అంశాలను అధ్యయనం చేయాలి. సామాజిక అంశాలు: కులం- రాజకీయాలు; నిరుద్యోగం; సంస్కృతి- ఆధునిక మార్పులు; స్త్రీలు- సమాజం వంటివి. పర్యావరణం- అడవులు: కాలుష్యం; గ్లోబల్ వార్మింగ్; అడవుల ప్రాధాన్యత; అడవుల రక్షణ- సమస్యలు వంటివి. వీటితో పాటు సమకాలీన పరిణామాలను అధ్యయనం చేయాలి. ఉదా: గ్లోబల్ వార్మింగ్(భూతాపం)కు కారణాలు వివరించండి? పేపర్ 2 (జనరల్ నాలెడ్జ్): గత తొమ్మిది నెలల నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న ముఖ్యమైన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను అధ్యయనం చేస్తే కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌కు దోహదపడుతుంది. ఈ పేపర్లో జనరల్ సైన్స్, చరిత్ర, పాలిటీ, ఎకనామిక్స్, జాగ్రఫీ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే మానవ శరీర ధర్మశాస్త్రం, వృక్ష, జంతు జాతులు, భారతదేశ చరిత్ర, రాజవంశాలు, కళలు, జాతీయోద్యమం, దేశాలు, సరిహద్దులు, సరస్సులు, పీఠభూములు, పర్వతాలు, ఎడారులు, భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పార్లమెంట్, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, స్థానిక స్వపరిపాలన, గ్రామీణాభివృద్ధి, ప్రణాళికలు, జాతీయాదాయం, జనాభా.. ఇలా వివిధ అంశాలపై అవగాహనను పెంపొందించుకోవాలి. జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీకి సంబంధించి ఏడు నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. పేపర్-3 (జనరల్ మ్యాథమెటిక్స్): ఈ పేపర్ అభ్యర్థుల్లోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించింది. ఇందులోని ప్రశ్నల క్లిష్టత పాఠశాల స్థాయిలో ఉంటుంది. ఇందుకోసం సంఖ్యలు-వాటి ధర్మాలు; కసాగు; గసాభా; వడ్డీ-రకాలు; కాలం-పని; కాలం-దూరం; లాభనష్టాలు; రేఖా గణితం; వైశాల్యాలు; ఘనపరిమాణం తదితర అంశాలను చదవాలి. మానసిక దృఢత్వమూ అవసరం అటవీ శాఖ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే 4 గంటల వ్యవధిలో పురుష అభ్యర్థులు 25 కి.మీ. దూరాన్ని, మహిళా అభ్యర్థులు 16 కి.మీ. దూరాన్ని అధిగమించాలి. వాకింగ్ టెస్ట్‌లో విజయం సాధించాలంటే అభ్యర్థులు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి. దూరపు నడకకు సిద్ధమయ్యే వారు బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 30 కంటే ఎక్కువ ఉంటే కొవ్వు శాతం తగ్గించుకుని సాధనకు ఉపక్రమించాలి. శారీరక పరిస్థితులకు అనుగుణంగా వ్యాయామాలను ఎంపిక చేసుకోవాలి. మొదటిరోజే వేగంగా నడవాలన్న తాపత్రయం వద్దు. నెమ్మదినెమ్మదిగా వేగాన్ని, దూరాన్ని పెంచుకుంటూ పోవాలి. నడకకు సౌకర్యవంతమైన షూ ఉపయోగించాలి. సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి కూడా ఫిట్నెస్ను పెంచుతాయి. వాకింగ్ టెస్ట్‌లో విజయానికి శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢతాన్ని పెంపొందించుకోవడం అవసరం. - డాక్టర్ ఎస్.భక్తియార్ చౌదరి, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు. టెక్నికల్ అసిస్టెంట్ అర్హత: ఐటీఐ (సివిల్) లేదా తత్సమాన అర్హత. వయసు: 18-36 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. నిర్దేశ శారీరక ప్రమాణాలు అవసరం లేదు. రాత పరీక్ష: మూడు పేపర్లుంటాయి. పేపర్ 1 (టెక్నికల్ సబ్జెక్టు-100 మార్కులు- 3 గంటలు); పేపర్ 2 (జీకే- 50 మార్కులు- 90 నిమిషాలు); పేపర్ 3 (జనరల్ మ్యాథమెటిక్స్- 50 మార్కులు- 90 నిమిషాలు). రాత పరీక్షకు హాజరైన అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో తర్వాతి దశకు అర్హత సాధించాలంటే ప్రతి పేపర్లో కనీసం 35 శాతం మార్కులు, మొత్తంమీద కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ గతంలో అటవీశాఖ సొంతంగా పరీక్షలు నిర్వహించింది. ఈ విడత పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున లక్షల్లో దరఖాస్తులు వచ్చే అవకాశముంది. అందువల్ల ప్రణాళికాబద్ధంగా పరీక్షలను నిర్వహించగల సామర్థ్యమున్న జేఎన్టీయూకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాం. ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేస్తాం. ఎంపిక విధానంలో ఇంటర్వ్యూను తొలగించాం. అభ్యర్థులు పైరవీకారుల మాటలను నమ్మి, మోసపోవొద్దు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే నెలాఖరు కల్లా ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. అటవీ శాఖలో రాణించాలంటే కష్టపడేతత్వం అవసరం. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. అం దువల్ల మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. - బి.సోమశేఖరరరెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్. ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఫిబ్రవరి 17, 2014. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మార్చి 2, 2014. దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 3, 2014. దరఖాస్తుతో పాటు ఫొటో, సంతకం, పదో తరగతి మార్కుల మెమో, కుల ధ్రువీకరణ పత్రం (ఓబీసీ/ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు), శారీరక ప్రమాణాల ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. పూర్తి వివరాలకు apfdrt.org -
ప‘వన’విజయం..
‘‘జీవితమంటే కేవలం డబ్బు సంపాదన ఒక్కటే కాదు.. చుట్టూ ఉన్న నిస్సహాయుల్లో కొందరికైనా సాయపడినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుంది..’’ అంటూ తరచూ నాన్న చెప్పే మాటలే అతడి ఆచరణకు మార్గదర్శకాలయ్యాయి. ఇప్పుడు ఆ ఆశయ సాధనకు మార్గం సుగమం చేసే ఆలిండియా సర్వీసుకు ఎంపికయ్యాడు వైఎస్సార్ కడప జిల్లా యువకుడు గడికోట పవన్‌కుమార్‌రెడ్డి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు పరీక్షలో 26వ ర్యాంకు సాధించిన పవన్ సక్సెస్ స్పీక్స్ ఆయన మాటల్లోనే.. మాది వైఎస్సార్ కడప జిల్లాలోని సుద్దమల్ల గ్రామం. నాన్న బాలకృష్ణారెడ్డి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అమ్మ రాజేశ్వరి గృహిణి. తమ్ముడు యోగానందరెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాన్నకు ఇంజనీరింగ్ చదవాలనే కోరిక ఉండేదట. కానీ, ఆర్థిక పరిస్థితులు ఆ ఆశకు అడ్డుతగిలాయి. అలాంటి పరిస్థితి మాకు రాకూడదనే ఉద్దేశం తో కష్టపడి చదివించారు.ఉన్నదాంట్లో తోటివారికి సాయపడాలని ఎప్పుడూ చెబుతుండేవారు. చెప్పడమే కాదు తాను స్వయంగా ఆచరించేవారు. ఇలా నాన్న నింపిన స్ఫూర్తి.. ఐఎఫ్ఎస్ దిశగా అడుగులు వేయించింది. సివిల్స్ దిశగా: పాఠశాల స్థాయి నుంచి బాగానే చదివేవాణ్ని. తిరుపతిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఇందులో 84 శాతం మార్కులు సాధించా. గేట్లో 38వ ర్యాంకు వచ్చింది. ముంబై ఐఐటీ నుంచి 9.1 పర్సంటైల్‌తో ఎంటెక్ పూర్తిచేశా. 2008లో క్యాంపస్‌లో ఉన్నప్పుడే టాటా టెక్నాలజీస్‌లో సీఏఈ అనలిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. మూడేళ్ల తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి, సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా. అపజయమే తొలిమెట్టు: ఢిల్లీలో సివిల్స్‌కు సిద్ధమయ్యాను. తొలి ప్రయత్నంలో అపజయం ఎదురైంది. రెండోసారి మెయిన్స్‌కు ఎంపికయ్యాను. ప్రస్తుతం వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాను. సివిల్స్, ఐఎఫ్ఎస్కు ప్రిలిమ్స్ ఉమ్మడిగా ఉంటుంది. వేర్వేరు కటాఫ్ మార్కులతో వీటి మెయిన్స్ రాసేందుకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సివిల్స్‌లో నా ఆప్షనల్ ఫిలాసఫీ. ఐఎఫ్ఎస్కు ఫారెస్ట్రీ, జియాలజీ సబ్జెక్టులు ఆప్షనల్స్. ఒక్కో ఆప్షనల్‌కు రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. ఐఎఫ్ఎస్కు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యాను. మార్కెట్లో దొరికే మెటీరియల్‌ను సేకరించి, సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాను. మెయిన్స్ పరీక్షలలో ప్రశ్నకు కిందే సమాధానం రాసేందుకు కొంత స్థలాన్ని కేటాయిస్తారు. దీనివల్ల క్షుణ్నంగా, క్లుప్తంగా సమాధానం రాయడంతో సమయం కలిసొచ్చింది. అటవీ రంగానికి అన్వయిస్తూ.. చివరి ఘట్టమైన ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తిచేయడానికి మాక్ ఇంటర్వ్యూలు ఉపయోగపడ్డాయి. స్నేహితులతో ప్రాక్టీస్ చేసిన మాక్ ఇంటర్వ్యూ భయాన్ని, ఒత్తిడిని అధిగమించేందుకు తోడ్పడింది. నలుగురు సభ్యులున్న బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేసింది. ప్రశాంత వాతావరణంలో ఇంటర్వ్యూ సాగింది. నా ప్రొఫైల్‌లోని అంశాలను, అటవీ రంగానికి అన్వయిస్తూ ప్రశ్నలు అడిగారు. ఆదివాసీలు-వారిలో వెనుకబాటుకు సంబంధించి ప్రశ్న లు అడిగారు. ప్రాంతాల వారీగా లభించే సహజ సంపదపై ప్రశ్నించారు. ఆప్షనల్స్ ప్రిపరేషన్.. ఇంటర్వ్యూకు కూడా బాగా ఉపయోగపడింది. చాలామంది ఇంటర్వ్యూ అనగానే భయపడతారు. రకరకాల అనుమానాలతో సతమతమవుతుంటారు. ఇలా భయంతో ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెడితే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. బోర్డు సభ్యులెప్పుడూ అభ్యర్థి భయాన్ని దూరం చేసేలా వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రశ్నలడుగుతారు. లక్ష్య నిర్దేశనం అవసరం: ఇంటర్ వరకు తెలుగు మీడియంలోనే చదివాను. తర్వాత రోజువారీ సాధనతో ఇంగ్లిష్‌పై పట్టు చిక్కింది. ఆలిండియా సర్వీసు పరీక్షల్లో విజయం సాధించాలంటే పటిష్ట ప్రణాళిక, కష్టపడే తత్వం అవసరం. వీటికంటే ముందు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ప్రధానం. సివిల్స్‌కు సిద్ధమవుతున్న వారిలో చాలా మంది సరైన చేతిరాత లేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక అంశానికి సంబంధించి విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోదు.. ఆ పరిజ్ఞానాన్ని ఎగ్జామినర్‌కు అర్థమయ్యేలా స్పష్టంగా రాయడమూ ప్రధానం. దీనికోసం రోజూ ప్రాక్టీస్ చేయాలి. ఎస్సే పేపర్ కోసం సొంత నోట్స్ బాగా ఉపయోగపడుతుంది. పక్కా వ్యూహంతో కష్టపడితే ఆలిండియా సర్వీస్‌ను చేజిక్కించుకోవడం కష్టమేమీ కాదు. -
ఎన్ఐబీఎం అందించే కోర్సుల వివరాలు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ VLSI డిజైన్ అంటే ఏమిటి? దీనికి సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి? - రమ, విజయనగరం. లక్షలాది ట్రాన్సిస్టర్లను చిప్‌తో అనుసంధానం చేసి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను రూపొందించే మొత్తం ప్రక్రియ.. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (VLSI) టెక్నాలజీ. దీనికి సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల వివరాలు: జేఎన్టీయూ, హైదరాబాద్.. ఎంఎస్-వీఎల్ఎస్ఐ ప్రోగ్రాంను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కమ్యూనికేషన్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఐటీలో బీటెక్ (ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత). వెబ్సైట్: www.jntuh.ac.in మణిపాల్ యూనివర్సిటీ, మణిపాల్.. ఎంఎస్సీ-టెక్ (వీఎల్ఎస్ఐ డిజైన్, వెరిఫికేషన్) కోర్సును అందిస్తోంది. అర్హత: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్‌లో బీఎస్సీ లేదా బీసీఏను కనీసం 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.manipal.edu ఐఐఐటీ, హైదరాబాద్.. ఎంటెక్ (వీఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్) కోర్సును అందిస్తోంది. అర్హత: బీటెక్/ బీఈ (ఈసీఈ). ఎంట్రన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.iiit.ac.in విట్ యూనివర్సిటీ, వెల్లూరు.. ఎంటెక్ (వీఎల్ఎస్ఐ డిజైన్)ను ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. గేట్ స్కోర్‌కు ప్రాధాన్యం ఉంటుంది. వెబ్సైట్: www.vit.ac.in కెరీర్: వీఎల్ఎస్ఐ కోర్సు పూర్తిచేసిన వారు చిప్ డిజైన్ అండ్ డెవలప్మెంట్; ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్ డెవలప్మెంట్; కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్; స్మార్ట్ ఎనర్జీ ప్రొడక్ట్ డెవలప్మెంట్, మెడికల్ టెలీమెట్రీ అప్లికేషన్ వంటి విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. టెస్ట్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్- ఎంబీఏ కోర్సు వివరాలు తెలపగలరు? - అనిత, కోదాడ. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ఒకటి. దీనికి సంబంధించిన క్లినికల్ రీసెర్చ్, ఆర్ అండ్ డీ, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ తదితర విభాగాల నిర్వహణకు మేనేజర్ స్థాయి మానవ వనరుల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ కోర్సును విద్యా సంస్థలు అందుబాటులో ఉంచుతున్నాయి. కోర్సుల వివరాలు: నర్సీమోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ముంబై.. ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్లో ఎంబీఏను అందిస్తోంది. వెబ్సైట్: www.nmims.edu నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ రీసెర్చ్, పంజాబ్.. ఎంబీఏ (ఫార్మా) కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.niper.nic.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్, లక్నో.. ఫార్మా మార్కెటింగ్‌లో మాస్టర్ డిప్లొమా కోర్సును అందిస్తోంది. వెబ్సైట్: www.iipmindia.com కెరీర్: కోర్సు పూర్తిచేసిన వారికి డ్రగ్ డెవలప్మెంట్, బయోటెక్నాలజీ, క్లినికల్ రీసెర్చ్, డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో అవకాశాలుంటాయి. కమర్షియల్ అగ్రికల్చర్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు వివరాలు తెలియజేయండి? - శివ, కర్నూలు. బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సును కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్ ఆఫర్ చేస్తోంది. ఫిజికల్ సెన్సైస్; బయలాజికల్/నేచురల్ సెన్సైస్/మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సును పూర్తిచేసుండాలి. ఎంసెట్ ర్యాంకు ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. కెరీర్: కోర్సు పూర్తిచేసిన వారికి వ్యవసాయ పరిశ్రమలు, బ్యాంకులు, ఆహార శుద్ధి పరిశ్రమలు, నీటిపారుదల సంస్థలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, అక్వాకల్చర్ పరిశ్రమల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వెబ్సైట్: www.angrau.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్, పుణె.. వివరాలు తెలియజేయండి? - శరత్, కరీంనగర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ (ఎన్ఐబీఎం)ను భారతీయ రిజర్వ్ బ్యాంకు నెలకొల్పింది. ఇది బ్యాంకింగ్, పైనాన్షియల్కు సంబంధించి వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇందులో ముఖ్యమైంది పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్). కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసిన వారు అర్హులు. క్యాట్/ఏటీఎంఏ/ సీమ్యాట్; జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. కెరీర్: బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ స్పెషలైజేషన్‌తో పీజీ డిప్లొమా పూర్తిచేసిన వారికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో మేనేజర్ స్థాయి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వెబ్సైట్: nibmindia.org -
క్విక్ రివ్యూ
ఉపయోగాలు స్క్రూగేజీ: సన్నని తీగ వ్యాసాన్ని, గోళం వ్యాసాన్ని, పలుచటి గాజుపలక మందాన్ని కనుగొనేందుకు ఉపయోగిస్తారు. గురుత్వ మాపకం: గురుత్వ త్వరణం (జ) విలువలో కలిగే స్వల్ప మార్పులను కనుగొనేందుకు ఉపయోగిస్తారు. అపకేంద్రయంత్రం: ఇచ్చిన మిశ్రమం నుంచి ఎక్కువ భారం ఉన్న పదార్థాలను, తక్కువ భారం ఉన్న పదార్థాలను వేరు చేసేందుకు ఉపయోగిస్తారు. పరారుణ వికిరణాలు: చీకటిలో ఫొటోలు తీసేందుకు, శారీరక మర్ధనకు ఉపయోగిస్తారు. థర్మోఫైల్, బొలోమీటర్: పరారుణ వికిరణాల ఉనికిని తెలుసుకోవడానికి. మైక్రో తరంగాలు: రాడార్, టెలిమెట్రి, మైక్రో ఓవెన్లలో ఉపయోగిస్తారు. రేడియో తరంగాలు: రేడియో ఖగోళశాస్త్రంలో ఉపయోగిస్తారు. కఠిన గీ-కిరణాలు: పరిశ్రమల్లోని వస్తువులను శోధించడానికి, పదార్థాల నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. మృదు గీ-కిరణాలు: రేడియోగ్రఫీ, రేడియో థెరపీలలో ఉపయోగిస్తారు. రిఫిల్ ట్యాంక్: కాంతి పరావర్తనాన్ని, కాంతి వక్రీభవనం అర్థం చేసుకొనేందుకు. ఏూ్ఛ్ఛ లేసర్: భూభ్రమణం రేటును నిర్థారించేందుకు, కాంతి వేగం అన్ని దిశల్లో సమానం అని రుజువు చేసేందుకు ఉపయోగిస్తారు. లేసర్: హాలోగ్రఫీ, వాతావరణ దృశ్య శాస్త్రంలో ఉపయోగిస్తారు. రక్తం కారకుండా చేసే శస్త్ర చికిత్సలో, పేగులోని అల్సర్లను గుర్తించేందుకు, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధుల నివారణలో. అమ్మీటర్: కరెంట్‌ను కొలిచేందుకు ఉపయోగిస్తారు. వోల్ట్‌మీటర్: పొటెన్షియల్ బేధాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తారు. టాప్-కీ: విద్యుత్ వలయాన్ని జత చేయడానికి, విడదీయటానికి ఉపయోగిస్తారు. విద్యుత్ విశ్లేషణ నియమం: లోహ సంగ్రహణకు, ఎలక్ట్రో ప్లేటింగ్, ఎలక్ట్రో టైపింగ్‌లో ఉపయోగిస్తారు. ట్రాన్సఫార్మర్: ఏసీ వోల్టేజీ పరిమాణాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి. సోడియం ఐసోటోప్: రక్తం గడ్డ కట్టివున్న భాగాన్ని గుర్తించేందుకు. కోబాల్ట్ ఐసోటోప్: క్యాన్సర్ కణాల్ని నిర్మూలించేందుకు ఉపయోగిస్తారు. అయోడిన్ ఐసోటోప్: థైరాయిడ్ గ్రంథి పనితీరుని పరిశీలించేందుకు కార్బన్ ఐసోటోప్: శిలాజాలు, వృక్షాల వయసును లెక్కించేందుకు యురేనియం ఐసోటోపు: శిలల వయసును నిర్ధారించేందుకు. మితకారి: న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు. డయోడ్: రెక్టిఫైయర్గా, ఎలక్ట్రానిక్ స్విచ్‌గా, కాంతి ఉద్గార డయోడ్గా. జంక్షన్ ట్రాన్సిస్టర్: ఆంప్లిఫైయర్గా, స్టెబిలైజర్‌గా, డోలకాలుగా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లలో ఉపయోగిస్తారు. కంపైలర్: ఉన్నతస్థాయి భాషను యంత్రభాషలో మార్చేందుకు ఉపయోగిస్తారు. పౌలింగ్ స్కేలు: రుణ విద్యుదాత్మకతను కొలిచేందుకు ఉపయోగిస్తారు. ప్రమాణ కుప్పె: ప్రమాణ ద్రావణాలను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. కార్బన్ డై ఆక్సైడ్: సోడా, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా తయారీకి, అగ్నిమాపక యంత్రాల్లో ఉపయోగిస్తారు. ఎసిటిలిన్: వెల్డింగ్‌లో, కాయలను కృత్రిమంగా పండించేందుకు ఉపయోగిస్తారు. ఎథిలిన్: పాలిమర్లు, ఆల్కహాల్, మత్తు మందు తయారీకి ఉపయోగిస్తారు. బగాసే: కాగితం తయారీలో, విద్యుత్ తయారీకి ఉపయోగిస్తారు. ప్రెస్‌మడ్: ఎరువుగా ఉపయోగిస్తారు. మొలాసిస్: ఆల్కహాల్ తయారీకి ఉపయోగిస్తారు. ఆల్కహాల్: ద్రావణిగా, మందుల పరిశ్రమల్లో, మత్తు పానీయాల్లో, థర్మామీటర్లో. పొటాషియం లవణం: శరీర శుభ్రతకు ఉపయోగించే సబ్బు తయారీకి. సోడియం లవణం: బట్టలు ఉతికే సబ్బు తయారీకి. కాల్షియం, అల్యూమినియం లవణం: నీటిలో తడవని గుడ్డ తయారీ. మెగ్నీషియం లవణం: ముఖానికి వాడే పౌడర్ల తయారీ. ట్రై ఇథనాల్ అమ్మోనియం లవణం: డ్రై క్లీనింగ్‌లో వాడే సబ్బు తయారీ. లిథియం లవణం: గ్రీజులు 3,4,5 - ట్రై బ్రోమోసాలిసిలేనిలైడ్: దుర్వాసన తొలగించే సబ్బుల తయారీకి. స్వేచ్ఛా స్టియరిక్ ఆమ్లం: గడ్డం గీసుకునేందుకు వాడే సబ్బుల తయారీకి. గ్లిసరాల్: పారదర్శక సబ్బుల తయారీకి. సోడాగాజు: కిటికీ అద్దాలు, గాజు సీసాల తయారీకి. పెరైక్స్ గాజు: ప్రయోగశాల గాజు పరికరాల తయారీకి క్వార్ట్జ్ట్జగాజు: విద్యుత్ పరికరాలు, దృశ్య పరికరాల తయారీకి ఫ్లింట్గాజు: దృశ్య పరికరాల తయారీకి ఉపయోగిస్తారు. బోరోసిలికేట్ గాజు: ప్రయోగశాల గాజు పరికరాల తయారీకి పాలిథీన్ అల్పసాంద్రత: పాలప్యాకెట్లు, ప్లాస్టిక్ సంచులు, వర్షపు కోట్ల తయారీకి. పాలిథీన్ అధిక సాంద్రత: బొమ్మలు, విద్యుత్ బంధకాల తయారీ. పాలిస్టెరీన్: దువ్వెనలు, టీవీ, రిఫ్రిజిరేటర్లకు అస్తరు ప్యాకింగ్‌కు. పాలివినైల్ క్లోరైడ్: గొట్టాలు, చేతి సంచులు, గ్రామ్‌ఫోన్ రికార్డుల తయారీకి. పాలి ఎస్టర్స: ఫిల్ములు, టేపుల తయారీకి. నైలాన్ 6, 61: బ్రష్‌లు, తివాచీలు, దారాల తయారీకి. బ్యూటెన్, ఐసో బ్యూటెన్: వంటగ్యాస్ తయారీకి. సూక్ష్మ ఎరువులు: ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలకు. తుమ్మ జిగురు: కాగితాలు అతికించేందుకు. యూరియా ఫార్మాల్డిహైడ్ రెసీన్: చెక్క సామాగ్రికి ఫ్లైవుడ్ లామినేషన్‌కు. ముఖ్య నిర్వచనాలు స్వేచ్ఛా పతన వస్తువుకు గురుత్వాకర్షణ బలం వల్ల ఏర్పడే త్వరణాన్నే గురుత్వ త్వరణం అంటాం. వస్తువు గాలిలో ఉండే కాలాన్ని గమన కాలం అంటారు. మృదు గీ-కిరణాలను ఉపయోగించి వైద్యరంగంలో రోగనిర్ధారణ చేయడాన్ని రేడియోగ్రఫీ అంటారు. మృదు గీ-కిరణాలను ఉపయోగించి వైద్యరంగంలో రోగ నివారణ చేయడాన్ని రేడియో థెరపీ అంటారు. కాలంతో తగ్గిపోయే కంపన పరిమితులున్న ఆవర్తన చలనాన్ని అవరుద్ధ కంపనాలు అంటారు. ఒకే సహజ పౌనఃపున్యాలున్న రెండు వస్తువులు, ఒకదాని ప్రభావంతో మరొక అత్యధిక డోలనా పరిమితితో కంపనాలు చేసే దృగ్విషయాన్ని అనునాదం అంటారు. జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియను పంపింగ్ అంటారు. ఒక విద్యుత్ సాధనం విద్యుచ్ఛక్తిని వినియోగించుకొనే రేటును దాని వాటేజ్గా నిర్వచిస్తారు. జౌల్ నియమం- ఒక పనిని ఏ విధంగా చేసినా ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశి మాత్రం ఒకటే. సందేశాన్ని ట.జ వాహక తరంగాల్లో కలపడాన్ని మాడ్యులేషన్ అంటారు. కేథోడ్ కిరణాలు, కాంతి ఘటాలు ఉన్న కెమెరాను ఐకనో స్కోప్ అంటారు. సమానశక్తి గల ఆర్బిటాళ్లను సమశక్తి ఆర్బిటాళ్లు అంటారు. సాధారణ టీవీని కినీస్కోప్ అంటారు. మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు - మెండలీఫ్ ఆవర్తన నియమం. గాఢత తెలిసిన ద్రావణాన్ని ప్రమాణ ద్రావణం అంటారు. హైడ్రోజన్ అయాన్ గాఢత రుణ సంవర్గ మానాన్ని ్కఏ అంటారు. ఒకే మూలకం రెండు లేదా అంతకంటే ఎక్కువ రూపాల్ని కలిగి ఉండటాన్ని రూపాంతరత అంటారు. ఒకే మూలకంలోని పరమాణువులు ఒకదానితో ఒకటి కలసి పొడవైన గొలుసులను ఏర్పర్చడాన్ని కాటనేషన్ అంటారు. అమ్మోనికల్ సిల్వర్ నైట్రెట్ ద్రావణాన్ని టోలెన్స కారకం అంటారు. రూపంలో మార్పు చెంది, రోగికి ఇచ్చే మందును ఔషధం అంటారు. మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు - మోస్లే ఆవర్తన నియమం. ఏ రెండు ఎలక్ట్రాన్లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానం కావు- పౌలివర్జన నియమం ఒక కాండెలా ప్రమాణమున్న కాంతి జనకం, ఒక ఘనకోణంలో ఒక సెకను కాలంలో ఉద్గారించే కాంతిశక్తిని ల్యూమెన్ (ఎల్ఎం) అంటారు. ఏదైనా ఒక దిశలో కాంతి జనకం కాంతి తీవ్రతని కాండెలాలో చెప్పినప్పుడు దాన్ని కాండిల్ సామర్థ్యం అంటారు. ఓమ్ నియమాన్ని పాటించే వాహకాలను ఓమీయి వాహకాలు లేదా రేఖీయ వాహకాలు అంటారు. ఓమ్ నియమాన్ని పాటించని వాహకాన్ని అఓమీయ వాహకాలు అంటారు. విద్యుద్విశ్లేష్యం గుండా ఒక కూలుమ్ విద్యుత్ ఆవేశం ప్రవహించినప్పుడు విడుదలయ్యే అయాన్ల ద్రవ్యరాశిని, ఆ పదార్థపు విద్యుత్ రసాయన తుల్యానికి (్ఛ.ఛి.్ఛ) అంటారు. ఒకే పరమాణు సంఖ్య వేర్వేరు పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలున్న ఒకే మూలకం పరమాణువులను ఐసోటోపులు అంటారు. ఒకే పరమాణు ద్రవ్యరాశి వేర్వేరు పరమాణు సంఖ్యలున్న వివిధ మూలకాల పరమాణువులను ఐసోబార్లు అంటారు. ఒకే న్యూట్రాన్ల సంఖ్య, వేర్వేరు పరమాణు సంఖ్యలున్న మూలకాల పరమాణువులను ఐసోటోన్లు అంటారు. ఒక రేడియోధార్మిక పదార్థంలోని సగం పరమాణువులు విఘటనం కావటానికి పట్టే కాలాన్ని దాని అర్ధ జీవితకాలం అంటారు. చాలా తక్కువ మోతాదులో మలిన పదార్థాలను స్వచ్ఛమైన పదార్థాల్లో ప్రవేశపెట్టడాన్ని మాదీకరణం అంటారు. 1 లేదా 0 బైనరీ డిజిట్‌ను బిట్ అంటారు. 8 బిట్ల సముదాయాన్ని బైట్ అంటారు. కర్బన పదార్థాల పాలిమర్లను రెసిన్లు అంటారు. ఆల్కహాల్‌కు పిరిడిన్ కలిపిన దాన్ని అసహజ స్పిరిట్ అంటారు. అత్యధికం - అత్యల్పం గురుత్వ త్వరణం అత్యధికంగా ఉండే చోటు? ధృవాలు గురుత్వ త్వరణం అత్యల్పంగా ఉండేచోటు? భూమధ్యరేఖ స్థిర తరంగాల్లో అత్యధిక స్థానభ్రంశం గల బిందువు? ప్రస్పందన బిందువు స్థిర తరంగాల్లో అత్యల్ప స్థానభ్రంశం గల బిందువు? అస్పందన బిందువు అత్యధిక అయనీకరణ సామర్థ్యం గల కిరణాలు? ఆల్ఫా కిరణం అత్యల్ప అయనీకరణ సామర్థ్యం గల కిరణాలు? గామా కిరణాలు అత్యధిక చొచ్చుకొనిపోయే సామర్థ్యం గల కిరణాలు? గామా కిరణాలు అత్యల్ప చొచ్చుకొనిపోయే సామర్థ్యం గల కిరణాలు? ఆల్ఫా కిరణాలు అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం? ఫ్లోరిన్ అత్యల్ప శక్తి గల కర్పరం? జు అత్యధిక ఎలక్ట్రాన్ అఫినిటీ గల మూలకం? క్లోరిన్ అత్యంత తీయనైన చక్కెర? ఫ్రక్టోజ్ అత్యంత శ్రేష్టమైన బొగ్గు? ఆంథ్రసైట్ అత్యధిక ఆక్సీకరణ సామర్థ్యం గల మూలకాలు? హాలోజన్లు అత్యధిక క్షయకరణ సామర్థ్యం గల మూలకాలు? క్షారలోహాలు ఆకృతులు అణువులు/ఆర్బిటాల్ ఆకృతులు నీరు కోణీయం, v ఆకృతి అమ్మోనియా పిరమిడల్ ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ పిరమిడల్ ఫాస్ఫరస్ {Osె గోనల్ బై పెంటాక్లోరైడ్ పిరమిడ్ కార్బన్ డై ఆక్సైడ్ రేఖీయం వజ్రం చతుర్ముఖీయం గ్రాఫైట్ షట్కోణాకృతి బక్ మినిస్టర్ పుల్లరిన్ ఫుట్‌బాల్ s-ఆర్బిటాల్ గోళాకృతి P- ఆర్బిటాల్, డంబెల్ d- ఆర్బిటాల్ డబుల్ డంబెల్ ఉపయోగాలు డోలాయమాన చలనం: గోడ గడియారానికి ఉండే లోలకం చేసే చలనం, సంగీత వాయిద్యాల తీగలు చేసే చలనం, స్ప్రింగ్ ద్రవ్యరాశి వ్యవస్థలోని చలనం. తిర్యక్ తరంగాలు: నీటి తరంగాలు, కాంతి తరంగాలు. అనుధైర్ఘ్య తరంగాలు: ధ్వనితరంగాలు, స్ప్రింగ్ ద్రవ్యరాశి వ్యవస్థలోని తరంగాలు. ఘనస్థితి లేసర్: రూబి లేసర్ వాయుస్థితి లేసర్: హీలియం - నియాన్ లేసర్ డయా అయస్కాంత పదార్థాలు: గాలి, నీరు, బిస్మత్, బంగారం, ఆల్కహాల్, పాదరసం. పారా అయస్కాంత పదార్థాలు: ఆక్సిజన్, అల్యూమి నియం, క్రోమియం, ప్లాటినం. ఫెర్రో అయస్కాంత పదార్థాలు: ఇనుము, కోబాల్డ్, నికెల్, గడోలినియమ్ ఓమీయ వాహకాలు: లోహవాహకాలు. అఓమీయ వాహకాలు:అర్ధ వాహకాలు, విద్యుద్విశ్లేష్యాలు ఐసోటోపులు:1H1,1H2, 1H3; 10Ne20, 10Ne21, 10Ne22 ఐసోబార్లు: 19K40, 20Ca40 ఐసోటోన్లు: 14Si31, 15P32 మితకారి: భారజలం విద్యుత్ బంధకాలు: ప్లాస్టిక్, చెక్క, వజ్రం, రబ్బరు. అర్ధవాహకాలు: స్వచ్ఛమైన జర్మేనియం, సిలికాన్. యంత్రభాష: అసెంబ్లెర్ ఉన్నతస్థాయి భాష: బేసిక్, కోబాల్, ఫోర్ట్రాన్, జావా. నివేశ సాధనం: మౌస్, కీ-బోర్ నిర్గమ సాధనం: ప్రింటర్, మానిటర్ అతిపాతం: హైడ్రోజన్ అణువు P-P అతిపాతం: ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అణువులు S-P అతిపాతం: HCl, HI, (HBr) సిగ్మాబంధ…: HCl, H2, Cl2 -
ఫిజిక్స్ బిట్ బ్యాంక్
ఎ.వి. సుధాకర్, జెడ్పీహెచ్ఎస్- ఇన్కుర్తి, నెల్లూరు జిల్లా. ఫిజిక్స్ ధైర్ఘ్యమానం 1.స్క్రూగేజీ కనీసపు కొలత ------- Cm. 2.స్క్రూగేజీ కనీసపు కొలత -------mm. 3.స్క్రూగేజీ____ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. 4.ఒక పరికరాన్ని ఉపయోగించి కనుక్కునే అతి తక్కువ కొలతను ఆ పరికరం------- అంటారు. 5.మర భ్రమణాంతరం = ____ /మర చేసిన భ్రమణాల సంఖ్య (n). 6.స్క్రూగేజీలో ------- స్కేల్, ____ స్కేల్ ఉంటాయి. 7.తలస్కేలు శూన్య విభాగం పిచ్ స్కేలు సూచీరేఖకు ఎగువన ఉంటే ఆ దోషాన్ని ------- అని, సవరణను ____ అని అంటారు. 8.తలస్కేలు శూన్య విభాగం పిచ్ స్కేలు సూచీరేఖకు దిగువన ఉంటే ఆ దోషాన్ని ------- అని, సవరణను ____ అని అంటారు. 9.ఒక స్క్రూగేజీ మరభ్రమణాంతరం 0.5 ఝఝ. దాని తలస్కేలును 100 విభాగాలుగా విభజిస్తే స్క్రూగేజీ కనీసపు కొలత-------. 10.స్క్రూగేజీని ఉపయోగించి తీగ వ్యాసం కనుక్కోవడానికి ఉపయోగించే సూత్రం ____. సమాధానాలు 1) 0.001; 2) 0.01; 3) మరసీల; 4) కనీసపు కొలత; 5) మరసీల ప్రయాణించిన దూరం; 6) పిచ్, తల; 7) రుణ శూన్యాంశ దోషం, ధనాత్మకం; 8) ధన శూన్యాంశ దోషం, రుణాత్మకం; 9) 0.05 mm; 10) d= పిచ్‌స్కేలు రీడింగ్+(సవరించిన తలస్కేలు రీడింగ్ప కనీసపు కొలత). ముఖ్య ప్రశ్నలు ఒకమార్కు 1)స్క్రూగేజీ ఏ సూత్రంపై ఆధారపడి పని చేస్తుంది? 2)స్క్రూగేజీ కనీసపు కొలత అంటే ఏమిటి? 3)మరభ్రమణాంతరం అంటే ఏమిటి? నాలుగు మార్కులు 1)స్క్రూగేజీని ఉపయోగించి తీగ వ్యాసాన్ని కనుక్కొనే విధానాన్ని వివరించండి? 2)స్క్రూగేజీలోని ధన, రుణ శూన్యాంశ దోషాలు అంటే ఏమిటి? వాటిని ఎలా నిర్ధారిస్తారు? ఐదు మార్కులు 1)స్క్రూగేజీ పటం గీసి, భాగాలను గుర్తించండి? 2)స్క్రూగేజీలోని ధన, రుణ శూన్యాంశ దోషాలను సూచించే పటం గీయండి? మనవిశ్వం - గురుత్వాకర్షణ 1.భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది -------. 2.కోపర్నికస్ ____ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 3.విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం (ఎ)కు ప్రమాణాలు -------. 4.విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం (ఎ) విలువ____. 5.స్వేచ్ఛా పతన వస్తువుకు గురుత్వాకర్షణ బలం వల్ల ఏర్పడే త్వరణాన్ని-------అంటారు. 6.గురుత్వ త్వరణం (g)కు ప్రమాణాలు____. 7.జ,ఎల మధ్య సంబంధం-------. 8.భూ కేంద్రం వద్ద గురుత్వ త్వరణం విలువ____. 9. భూమధ్య రేఖ వద్దగురుత్వ త్వరణం -------. 10.ఒక ప్రాంతంలో జ విలువలో కలిగే మార్పులను కనుక్కోవడానికి____ ని ఉపయోగిస్తారు. 11.విశ్వంలో ఎక్కడైనా ఒక వస్తువు------- మారదు. 12.400 గ్రాముల ద్రవ్యరాశి గల రాయి బరువు____. 13.ఒక వస్తువు భారం తెలుసుకోవడానికి -------ఉపయోగిస్తారు. 14.కెప్లర్ నియమం ఆధారంగా గ్రహాలు సూర్యుని చుట్టూ ____కక్ష్యలో తిరుగుతాయి. 15.ఒక వ్యక్తి భూమిపై 60 కిలోల బరువు ఉంటే, అదే వ్యక్తి చంద్రుడిపై ఉండే బరువు-------. 16. ధృవాల వద్ద g విలువ____. సమాధానాలు 1) టాలెమి; 2) సూర్యకేంద్ర; 3) న్యూ.మీ2/కి.గ్రా2; 4) 6.67ప10-11 Nm2kg-2; 5) గురుత్వ త్వరణం; 6) మీ/సె2; 7) 8) శూన్యం; 9) అత్యల్పం; 10) గురుత్వ మాపకం; 11) ద్రవ్యరాశి; 12) 3.92 ూ; 13) హుక్ సూత్రం; 14) దీర్ఘ వృత్తాకార; 15) 10 కిలోలు; 16) అత్యధికం. ముఖ్య ప్రశ్నలు ఒకమార్కు 1)గురుత్వ త్వరణం అంటే ఏమిటి? 2)వస్తువు భారాన్ని నిర్వచించండి? 3)హుక్ సూత్రాన్ని పేర్కొనండి? రెండు మార్కులు 1)విశ్వగురుత్వాకర్షణ నియమం రాయండి? 10 కి.గ్రా. ద్రవ్యరాశిగల వస్తువు మీద పనిచేసే గురుత్వాకర్షణ బలాన్ని లెక్కించండి? 2)వస్తువు ద్రవ్యరాశికి, భారానికి మధ్య భేదాలు రాయండి? 3)G, g కి మధ్య సంబంధాన్ని రాబట్టండి? 4)జ విలువను ప్రభావితం చేసే అంశాలేవి? 5)భూకేంద్ర, సూర్యకేంద్ర సిద్ధాంతాల మధ్య భేదాలు రాయండి? శుద్ధ గతిక శాస్త్రం 1.స్వేచ్ఛా పతన వస్తువుకు తొలివేగం-------. 2.స్వేచ్ఛా పతన వస్తువుకు జ విలువ____. 3.పైకి విసిరిన వస్తువుకు జ విలువ-------. 4.తొలి వేగం ఠ తో పైకి విసిరిన వస్తువు చేరే గరిష్ట ఎత్తు ____. 5.కొంత ఎత్తు జి నుంచి పడే వస్తువు భూమిని తాకినప్పుడు దానికి ఉండే వేగం-------. 6.ఆరోహణ కాలం____కు అనులోమానుపాతంలో ఉంటుంది. 7.గురుత్వాకర్షణ ప్రభావంతో ప్రయాణించే వస్తువుల ఆరోహణ కాలం-------కి సమానం. 8.20 మీ./సె. తొలివేగంతో ఒక వస్తువుని పైకి విసిరితే ఆ వస్తువు చేరే గరిష్ట ఎత్తు____. 9.ఒక బంతిని పైకి విసిరినప్పుడు ఆ బంతి చేరిన గరిష్ట ఎత్తు 80 మీ. దాని తొలివేగం-------. 10.వస్తువు గాలిలో ఉండే కాలాన్ని____అంటారు. సమాధానాలు 1) 0; 2) ధనాత్మకం; 3) రుణాత్మకం; 4) 5) 6) తొలివేగం; 7) అవరోహణ కాలానికి; 8) 20 మీ.; 9) 40 మీ./సె.; 10) గమనకాలం. ముఖ్య ప్రశ్నలు ఒక మార్కు 1)గమనకాలం అంటే ఏమిటి? 2)10 మీ./సె. తొలి వేగంతో ఒక రాయిని పైకి విసిరితే అది చేరిన గరిష్ట ఎత్తును, ఆరోహణ కాలాన్ని కనుక్కోండి? (జ = 10 మీ./సె2.) 3)ఒక బంతిని పైకి విసిరినప్పుడు, అది చేరిన గరిష్ట ఎత్తు 80 మీ. అయితే దాని తొలివేగం ఎంత? 4)20 మీ./సె. తొలివేగంతో ఒక వస్తువును పైకి విసిరితే అది చేరే గరిష్ట ఎత్తును తెలుసుకోండి? గతిశాస్త్రం 1.వృత్తాకార చలనం-------చలనంలో ఒక ప్రత్యేక తరహా కలది. 2.గుండ్రంగా తిరుగుతున్న రాయికి కట్టిన తీగని తెంపితే ఆ రాయి____దిశగా ప్రయాణిస్తుంది. 3.సమవృత్తాకార చలనంలో-------స్థిరరాశి. 4.కేంద్రం వైపు పనిచేసే బలాన్ని____అంటారు. 5.న్యూటన్ గమన సూత్రాలు------- చట్రంలో పాటించవచ్చును. 6.అపకేంద్ర బలమంటే____బలం. 7.1200 కి. గ్రా. కారు, 6 మీ./సె. వేగంతో 180 మీ. వృత్త వ్యాసార్థం గల రోడ్డులో మరలుతుంది. అయితే కారుపై పని చేసే అభికేంద్ర బలం విలువ-------. 8.గట్టుకట్టని వక్రంగా ఉండే రోడ్డుపై ఒక కారు ప్రయాణిస్తుంది. దానికి కావాల్సిన అభికేంద్ర బలం____ నుంచి లభిస్తుంది. 9.-------ను ఉపయోగించి మొలాసిస్ నుంచి చక్కెర స్ఫటికాలను వేరు చేస్తారు. 10.సమాన కాలవ్యవధులలో ఒక పథాన్ని పునశ్చరించే ఏ చలనాన్ని అయినా____అంటారు. 11.ఆవర్తన చలనాన్ని-------అని కూడా అంటారు. 12.ఆవర్తన చలనంలోని వస్తువు ఒకే పథంలో ముందుకు వెనక్కు కదులుతుంటే దాని చలనాన్ని ____అంటారు. 13.డోలాయమాన చలనంలో ఉన్న వస్తువు-------వద్ద నిశ్చల స్థితిలోకి వస్తుంది. 14.సరళహరాత్మక చలనంలోని వస్తువు త్వరణం____కి అనులోమానుపాతంలో ఉంటుంది. 15.కోణీయ వేగానికి ప్రమాణం-------. 16.గట్టు కోణ = ____. 17.కోణీయ స్థానభ్రంశం మారే రేటును-------అంటారు. 18.కేంద్రకం నుంచి దూరంగా నెట్టివేయడానికి కావాల్సిన బలం ____. 19.రేఖీయ వేగం (ఠి), కోణీయ వేగం (ఠీ)ల మధ్య సంబంధం -------. 20.1 రేడియన్ =____. సమాధానాలు 1) భ్రమణ; 2) స్పర్శరేఖ; 3) కోణీయవేగం; 4) అభికేంద్రబలం; 5) జడత్వ నిర్దేశ; 6) మిథ్యా; 7) 240 న్యూటన్లు; 8) కారు టైర్లకు, రోడ్డుకి మధ్య ఘర్షణ; 9) అపకేంద్ర యంత్రం; 10) ఆవర్తన చలనం; 11) డోలాయమాన చలనం లేదా కంపన చలనం; 12) డోలాయమాన చలనం; 13) సమతాస్థితి (విరామస్థితి); 14) స్థానభ్రంశం; 15) రేడియన్/సెకన్; 16) ; 17) కోణీయ వేగం; 18) అపకేంద్రబలం; 19) ఠి = టఠీ; 20) 57ని181. ముఖ్య ప్రశ్నలు ఒక మార్కు 1)తిరిగే ఆకురాయితో కత్తిని పదును పెట్టేటప్పుడు ఎగిరే నిప్పురవ్వలు ఏ దిశలో ప్రయాణిస్తాయి? 2)ఉపగ్రహాన్ని, నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడానికి కావాల్సిన నియమాలేమిటి? రెండు మార్కులు 1)లాండ్రీ డ్రైయర్ పనిచేసే విధానాన్ని వివరించండి? 2)అపకేంద్ర యంత్రం అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? 3)రోడ్డుకు గట్టు కట్టాల్సిన అవసరం ఏమిటి? 4)భ్రమణ చలనం, వృత్తాకార చలనానికి మధ్య భేదాలను రాయండి? 5)జడత్వ, అజడత్వ నిర్దేశ చట్రాల మధ్య భేదాలను వర్ణించండి? 6)అభికేంద్ర, అపకేంద్ర బలాల మధ్య భేదాలను వివరించండి? నాలుగు మార్కులు 1)అభికేంద్ర, అపకేంద్ర బలాల మధ్య భేదాలు రాయండి? 2)లఘులోలకంతో ఒక ప్రాంత పు జ విలువను నిర్ధారించే ప్రయోగాన్ని వివరించండి? విద్యుదయస్కాంత వర్ణపటం 1.తరంగధైర్ఘ్యం లేదా పౌనఃపున్యాల సముదాయాన్ని -------అంటారు. 2.కాంతివేగం = ____. 3.విద్యుదయస్కాంత తరంగాలన్నింటికి -------లక్షణాలు ఉంటాయి. 4.____ను ఉపయోగించి చీకటిలో ఫొటోలు తీయవచ్చు. 5.శారీరక మర్ధనలో ఉపయోగించే వికిరణాలు -------. 6.గ్రహాంతర రేడియో ఉద్గారాలను ఉపయోగించి పటచిత్రం చేయడాన్ని ____అంటారు. 7.RADఅఖ విస్తరణ రూపం -------. 8.రేడియోధార్మికతలో వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ____. 9.అత్యధిక శక్తి ఉన్న విద్యుదయస్కాంత తరంగాలు -------. 10.తక్కువ పౌనఃపున్యం ఉన్న విద్యుదయస్కాంత డోలకాల నుంచి ఉత్పత్తి అయ్యే తరంగాలు ____. 11.పరారుణ వికిరణాల ఉనికిని -------ద్వారా పరిశీలించవచ్చు. 12.____గాజు పరారుణ వికిరణాలను శోషణ చేసుకోదు. 13.రాడార్, టెలిమెట్రీ, మైక్రోఓవెన్లలో ఉపయోగించే తరంగాలు -------. 14.మృదు ్ఠ-కిరణాలను ఉపయోగించి రోగ నిర్ధారణ చేయడాన్ని ____అంటారు. 15.మృదు ్ఠ-కిరణాలను ఉపయోగించి రోగ నివారణ చేయడాన్ని -------అంటారు. 16.ఓజోన్ పొర ____వల్ల క్షీణిస్తుంది. 17.పరిశ్రమలలోని వస్తువులను శోధించేందుకు ------- ఉపయోగిస్తారు. 18.వర్ణపటంలోని ఊదా రంగుకు ఆవల ఉండే ____ కిరణాలు. 19.సూర్యుని నుంచి విడుదలయ్యే అతినీలలోహిత వికిరణాల నుంచి మనల్ని ------- రక్షిస్తుంది. 20.వర్ణపటంలోని ఎరుపు రంగుకు కుడివైపు ఉన్న వికిరణాలను ____అంటారు. సమాధానాలు 1) వర్ణపటం; 2) 3ప108 ఝ/ట్ఛఛి; 3) తిర్యక్ తరంగాలు; 4) పరారుణ వికిరణాలు; 5) పరారుణ వికిరణాలు; 6) రేడియో ఖగోళశాస్త్రం; 7) రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్; 8) గామా కిరణాలు; 9) గామా కిరణాలు; 10) రేడియో తరంగాలు; 11) థర్మోఫైల్; 12) రాక్‌సాల్ట్; 13) మైక్రో తరంగాలు; 14) రేడియోగ్రఫీ; 15) రేడియోథెరపీ; 16) క్లోరోఫ్లోరో కార్బన్లు; 17) కఠిన ్ఠ-కిరణాలు; 18) అతినీలలోహిత కిరణాలు; 19) ఓజోన్ పొర; 20) పరారుణ వికిరణాలు. ముఖ్య ప్రశ్నలు ఒక మార్కు 1)రేడియోగ్రఫీ అంటే ఏమిటి? 2)రేడియో థెరిపీ అంటే ఏమిటి? 3)వాతావరణంలో ఓజోన్ పొర క్షీణించడానికి గల కారణాలేమిటి? 4)కఠిన ్ఠ-కిరణాల ఉపయోగమేమిటి? రెండు మార్కులు 1)విద్యుదయస్కాంత తరంగాలన్నింటికీ ఉన్న ఉమ్మడి లక్షణాలేమిటి? 2)విద్యుదయస్కాంత తరంగం పటం గీయండి? ధ్వని 1.ప్రతి వ్యవస్థకూ ఉండే సొంత పౌనఃపున్యాన్ని ------- అంటారు. 2.బాహ్య ఆవర్తన బల కంపనాల ప్రభావంతో కంపించడాన్ని ____ అంటారు. 3.సమాన పౌనఃపున్యాలు, కంపన పరిమితులున్న తరంగాలు ఒకే పథంలో వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తే ఏర్పడే తరంగాలను ------- అంటారు. 4. పరావర్తనమైన తరంగంలోని ప్రావస్థ ____ మారుతుంది. 5. రెండు అస్పందనాల మధ్య దూరం -------. 6. రెండు వరుస అస్పందన, ప్రస్పందన బిందువుల మధ్య దూరం ----------. 7. స్థిరతరంగాల్లోని కణాలు ____ వద్ద అత్యధిక స్థానభ్రంశం చెందుతాయి. 8. స్థిర తరంగాల్లోని కణాలు ------- వద్ద అత్యల్ప స్థానభ్రంశం చెందుతాయి. 9. పౌనఃపున్యం, తరంగధైర్ఘ్యం ఉన్నప్పుడు ధ్వనివేగం (ఠి)ని ----- ద్వారా సూచిస్తాం. 10. గాలిలో ధ్వనివేగం ఠి= -------. 11. అనునాదం చెందిన గాలి స్తంభాల ప్రయోగంలో మొదటి అనునాదం గాలిస్తంభం పొడవు 10 సెం.మీ. ఉంటే రెండో అనునాదం ఏర్పడినప్పుడు గాలి స్తంభం పొడవు -----. 12. ఒక యానకంలో ధ్వని ప్రసరణ ఉండాలంటే దానికి ------- ఉండాలి. 13. వరుస అస్పందన, ప్రస్పందనల మధ్య దూరం 10 సెం.మీ. అయితే తరంగధైర్ఘ్యం ____. 14. స్థిరతరంగాల్లో అత్యధిక స్థానభ్రంశం గల బిందువు -------. 15. శృతిదండ పౌనఃపున్యం దాని ____ పై ఆధారపడి ఉంటుంది. 16. ఒకే ప్రావస్థలో ఉన్న రెండు అనుక్రమ కణాల మధ్య దూరాన్ని ------- అంటారు. 17. తరంగ ప్రసారం చేసే శక్తి ఆ తరంగంలోని కణాల ____ , ____ శక్తుల మొత్తానికి సమానం. 18. యానకంలోని కణాలు కేవలం -------ని మాత్రమే ప్రసారం చేస్తాయి. 19. కాలంతో తగ్గిపోయే కంపనపరిమితులున్న ఆవర్తన చలనాన్ని ____ అంటారు. 20. అనునాద గాలి స్తంభాల్లో ------- తరంగాలు ఏర్పడతాయి. సమాధానాలు 1) సహజ పౌనఃపున్యం; 2) బలాత్కృత కంపనాలు; 3) స్థిర తరంగాలు; 4) p లేదా 180ని; 5) /2; 6) /4; 7) ప్రస్పందన బిందువు; 8) అస్పందన బిందువు; 9) v=ul; 10) ; 11) 30 cm; 12) స్థితి స్థాపకత, జడత్వం; 13) 40 cm; 14) ప్రస్పందన బిందువు; 15) పరిమాణాల; 16) తరంగ ధైర్ఘ్యం; 17) గతిజ, స్థితిజ; 18) శక్తి; 19) అవరుద్ధ కంపనాలు; 20) స్థిర. ముఖ్య ప్రశ్నలు ఒక మార్కు 1)అవరుద్ధ కంపనాలు అంటే ఏమిటి? 2)స్థావర తరంగాలు ఏర్పడటాన్ని సూచించే పటం గీయండి? 3)అనునాదంను నిర్వచించండి? 4)అనునాదం చెందే గాలి స్తంభాల ప్రయోగంలో మొదటి అనునాద గాలి స్తంభం పొడవు 10 సెం.మీ ఉన్నప్పుడు ఏర్పడిన రెండో అనునాదం గాలిస్తంభం పొడవు ఎంత? 5)ఒక స్థిర తరంగంలో వరుస అస్పందన, ప్రస్పందనల మధ్య దూరం 10 సెం.మీ, అయితే దాని తరంగ దైర్ఘ్యం విలువ ఎంత? రెండు మార్కులు 1)నిత్యజీవితంలో అనునాదాన్ని సూచించే రెండు ఉదాహరణలను పేర్కొనండి? నాలుగు మార్కులు 1)పురోగామి, స్థిరతరంగాల మధ్య భేదాలు రాయండి? 2)గాలిలో ధ్వనివేగం కనుక్కోవడానికి ఒక ప్రయోగాన్ని వివరించండి? కాంతి-కాంతి స్వభావం- కాంతి జనకాలు 1.కాంతి తీవ్రతకు ప్రమాణం -------. 2.LASER ను విస్తరించగా ------ 3.ఘన కోణానికి ప్రమాణాలు ____. 4.జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియను ____ అంటారు. 5.కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ____. 6.కాంతి స్వభావాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్త్రవేత్త ----. 7.కాంతి రంగుకు కారణం కాంతి కణాలు వేర్వేరు పరిమాణాల్లో ఉండటమని చెప్పింది ----. 8.వికిరణ క్వాంటం పేరు -----. 9.న్యూటన్ సిద్ధాంతం ప్రకారం సాంద్రతర యానకంలో కాంతివేగం ____. 10.కాంతి కణ సిద్ధాంతం వివరించిన దృగ్విషయం ____. 11.విశ్వమంతా ఈథర్ యానకం ఉందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ____. 12.మొదటిసారి లేజర్ నియమాన్ని ప్రతిపాదించింది ____. 13.కాండిలా ____ కు ప్రమాణం. 14.లేజర్‌ను ఉపయోగించి తీసే ప్రత్యేక త్రిమితీయ ఫొటోగ్రఫీని ____ అంటారు. 15.భూ పరిభ్రమణ రేటును ____ సహాయంతో నిర్ణయించవచ్చు. 16.వాయు లేసర్‌కు ఉదాహరణ ____ . 17.రూబీ లేసర్‌లో పంపింగ్‌ను ____ద్వారా పొందొచ్చు. 18.నాణ్యమైన లేసర్‌లో పట్టిక వెడల్పు ____ . 19.శూన్యంలో కాంతి వేగం ____. 20.ఘనస్థితి లేసర్‌కి ఉదాహరణ ____. 21.లేసర్‌కి గల సంబద్ధత కారణంగా____ఏర్పడుతుంది. 22.సాధారణ కాంతిలో అసంబద్ధత వల్ల ____ ఏర్పడుతుంది. 23.ఐఇఆక అంటే ____. 24.అవరోధాల అంచులను తాకిన తరంగాలు వంగి ప్రయాణించడాన్ని ____ అంటారు. 25.రెండు కాంతి జనకాల కాంతి తీవ్రతలను కొలిచే శాస్త్రాన్ని ____ అంటారు. సమాధానాలు 1) కాండెలా; 2) Light Amplification by Stimulation Emission of Radiation; 3) స్టెరేడియన్; 4) పంపింగ్; 5) హైగెన్‌స; 6) న్యూటన్; 7) న్యూటన్; 8) ఫోటాన్; 9) ఎక్కువ; 10) ధృవణం; 11) హైగెన్‌స; 12) ఛార్లెస్ హెచ్.టౌన్‌స; 13) కాంతి తీవ్రత; 14) హాలోగ్రఫీ; 15) He-Ne Laser; 16) He-Ne; 17) జీనాన్ ఉత్సర్గనాళం; 18) 10-8అని; 19) 3´108 ఝ/ట్ఛఛి; 20) రూబీలేజర్; 21) దృక్సంగీతం; 22) దృక్రొద; 23) ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్; 24) తరంగాల వివర్తనం; 25) దృగ్గోచర కాంతిమితి. ముఖ్య ప్రశ్నలు ఒక మార్కు 1) LASER (లేసర్)ను విస్తరించండి? 2)వ్యతికిరణం అంటే ఏమిటి? రెండు మార్కులు 1)లేసర్ ప్రత్యేక లక్షణాలేమిటి? 2) వైద్య రంగంలో లేసర్ అనువర్తనాలే వి? 3)లేసర్ పనిచేసే విధానంలో ప్రధాన ప్రక్రియలేవి? నాలుగు మార్కులు 1)న్యూటన్ కాంతికణ సిద్ధాంతాన్ని, హైగెన్స్ కాంతి తరంగ సిద్ధాంతాన్ని పోల్చండి? 2)రిపుల్టాంక్ను వర్ణించండి? కాంతి వక్రీభవనాన్ని, పరావర్తనములను వివరించటంలో ఇది ఎలా ఉపయోగపడుతుందో వివరించండి? 3)విజ్ఞానపరంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో లేసర్ అనువర్తనాలు ఏవి? అయస్కాంతత్వం 1.గెడలోనియం అనేది ____ అయస్కాంత పదార్థం. 2.అ, ఏజ, ఇౌ, అఠలలో పారా అయస్కాంత పదార్థం ____. 3.మధ్య లంబరేఖపై అయస్కాంత క్షేత్ర ప్రేరణ B=____ న్యూటాన్స/ఆంపియర్-మీ. 4.శూన్యంలో అయస్కాంత ప్రవేశ శీలత విలువ ____. 5.5 సెం.మీ. పొడవు, 2ప10-3 ఆంపియర్ మీటర్ ధ్రువసత్వం ఉన్న దండయస్కాంత అయస్కాంత భ్రామకం ____. 6.ఐ యూనిట్లలో ధ్రువసత్వానికి ప్రమాణం ____. 7.గాలి, నీరు, బిస్మత్ పదార్థాలు ____ అయస్కాంత పదార్థాలకు ఉదాహరణ. 8.పదార్థాల పరమాణువుల అయస్కాంత భ్రామకం శూన్యం కాని వాటిని ____ అంటారు. 9.అయస్కాంత ప్రేరణ లేదా అయస్కాంత అభివాహ సాంద్రత (ఆ), అయస్కాంత క్షేత్ర తీవ్రత ఏల మధ్య సంబంధం ____. 10.బిస్మత్, ఇనుము, ఆక్సిజన్‌లలో డయా అయస్కాంత పదార్థం ____. 11. MK పద్ధతిలో ధ్రువసత్వానికి ప్రమాణం ____. 12.డయా అయస్కాంత పదార్థాలకు mr విలువ ____. 13.డయా అయస్కాంత పదార్థాల సాపేక్ష ప్రవేశ్యశీలత ____. 14.అయస్కాంతీకరణ తీవ్రతకు ప్రమాణం ____. 15.డయా అయస్కాంత పదార్థం ససెప్టిబిలిటి (c) విలువ ____. 16.పరమ ప్రవేశ్యశీలత m, సాపేక్ష ప్రవేశ్యశీలత ఝట కు మధ్యగల సంబంధం ____. 17.Hకు I ప్రమాణం ____. 18.అయస్కాంత అభివాహం జ, వైశాల్యం అ, అయస్కాంత అభివాహ సాంద్రత ఆల మధ్య సంబంధం ____. 19.1 వెబర్ = ____ . 20.శూన్యానికి mr= ____. 21.అయస్కాంతం పొడవు (2), ధృవసత్వం(m) అయిన అయస్కాంత భ్రామకం(m)____. 22.దండయస్కాంతానికి ____ బిందువుల వద్ద ఆ0ని పరిగణించం. 23.దండయస్కాంతం పరిసరాల్లో ఏ బిందువుల వద్ద B, B0లు ఒకదానికొకటి రద్దు చేసుకొంటాయో ఆ బిందువులను ____ అంటారు. 24.ఆంధ్రప్రదేశ్‌లో B0విలువ ____. 25.పదార్థంలో ప్రమాణ ఘన పరిమాణంలోని అయస్కాంత భ్రామకాన్ని ____ అంటారు. సమాధానాలు 1) ఫెర్రో; 2) Al; 3) m0/4p M/d3; 4)4p´10-7 Henry/mt; 5) 104 Amp-mt2; 6) ఆంపియర్-మీటర్; 7) డయా; 8) పారా అయస్కాంత పదార్థాలు; 9) B=m0H; 10) బిస్మత్; 11) వెబర్; 12) mr£1; 13) సుమారు 1కి సమానం; 14) ఆంపియర్ /మీటర్; 15) చాలా తక్కువ; 16) ఝ=ఝటఝ0; 17) ఆంపియర్/మీటర్; 18) f=AB; 19) ఝ0ఆంపియర్ మీటర్; 20) 1; 21) 2ఝ; 22) దగ్గర; 23) తటస్థ బిందువులు; 24) 0.39ప10-4 టెస్లా; 25) అయస్కాంతీకరణ తీవ్రత. ముఖ్య ప్రశ్నలు ఒక మార్కు 1)అయస్కాంత భ్రామకం అంటే ఏమిటి? 2)ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి? రెండు మార్కులు 1)అయస్కాంత విలోమవర్గ నియమాన్ని ప్రవచించండి? 2)ఒక దండయస్కాంతం అక్షీయ రేఖపై, మధ్యలంబ రేఖపై ‘d’ దూరంలో ఉన్న ఒక బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర ప్రేరణ విలువలేవి? 3)అయస్కాంత ప్రవేశ్యశీలత , ససెిప్ట్టిబిలిటీలను నిర్వచించండి? నాలుగు మార్కులు 1)ఈవింగ్ అణు అయస్కాంత సిద్ధాంతం మౌలిక భావనలేవి? ఈ సిద్ధాంత వైఫల్యాలను తెలపండి? 2)డయా, పారా, ఫెర్రో అయస్కాంత పదార్థాల ప్రవేశ్యశీలత, ససెిప్ట్టిబిలిటీలను పోల్చండి? ఐదు మార్కులు 1)అయస్కాంత ఉత్తర ధృవం, భౌగోళిక ఉత్తర ధృవాన్ని చూస్తున్నప్పుడు అయస్కాంత బలరేఖల అమరిక చూపే పటాన్ని గీసి, తటస్థ బిందువులను గుర్తించండి? 2)అయస్కాంత దక్షిణ ధృవం, భౌగోళిక ఉత్తర ధృవాన్ని చూస్తున్నప్పుడు అయస్కాంత బలరేఖల అమరికను చూపే పటం గీసి, తటస్థ బిందువులను గుర్తించండి? ప్రవాహ విద్యుత్ 1.విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలు ____. 2.పొటెన్షియల్ భేదానికి ప్రమాణాలు ____. 3.విద్యుత్ ప్రవాహాన్ని ____ సాధనంతో కొలుస్తారు. 4.సాధారణ బ్యాటరీకి గుర్తు ____. 5.చిచిచిచిలో ప్రవహించే దిశని సంప్రదాయక విద్యుత్ ప్రవాహం దిశగా పరిగణిస్తారు. 6.టాప్ కీని వలయంలో ____, ____కు ఉపయోగి స్తారు. 7.____ని పొటెన్షియల్ భేదాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తారు. 8.విద్యుత్ ఆవేశానికి ప్రమాణాలు ____. 9.విద్యుత్ జనకం పొటెన్షియల్ భేదాన్ని ____అంటారు. 10.విద్యుచ్ఛాలక బలం (emf)కు ప్రమాణాలు ____. 11.విద్యుత్ ఘటం రసాయన శక్తిని ____ గా మార్చుతుంది. 12.విద్యుత్ శక్తిని సరఫరా చేసే రేటు లేదా వినియోగించని రేటుని ____ అంటారు. 13.విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణాలు ____. 14.టాప్ కీ ____ గుర్తుతో సూచిస్తారు. 15.శ్రేణి సంధానంలో ఒక బల్బు పని చేయకపోతే మిగిలిన బల్బులు ____. 16.లోహాల్లో ఉన్న ____ లోహాలను ఉత్తమ విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. 17.వాహకంలోని ఎలక్ట్రాన్ల వేగాన్ని ____ అంటారు. 18.నిరోధాన్ని ____ అనే సంకేతంతో సూచిస్తారు. 19.నిరోధానికి ప్రమాణాలు ____. 20.నిరోధం పెరిగితే కరెంటు ____. 21.పొటెన్షియల్ భేదం పెరిగితే కరెంటు ____. 22.____ తీగను ప్రామాణిక నిరోధంగా వాడతారు. 23.తమాషా త్రిభుజం ____. 24.విద్యుత్ వలయంలోని విద్యుత్‌ను పెంచేందుకు, తగ్గించేందుకు ____ ని ఉపయోగిస్తారు. 25.రియోస్టాట్ సంకేతం ____. 26.వాహక నిరోధం దాని పొడవుకు ____ లో ఉంటుంది. 27.నిరోధం మధ్యచ్ఛేద వైశాల్యానికి ____ లో ఉంటుంది. 28.నిరోధం ఉష్ణోగ్రతకు ____ లో ఉంటుంది. 29.విశిష్ట నిరోధం ____ పై ఆధారపడి ఉంటుంది. 30.నిరోధం విలోమాన్ని ____ అంటారు. 31.వాహకత్వానికి ప్రమాణం ____. 32.నిరోధాలను ____ లో కలిపితే మొత్తం పొటెన్షియల్ బేధం వాటి మధ్య విభజితమవుతుంది. 33.నిరోధాలను ____లో కలిపితే ఫలిత నిరోధం ఏదైనా విడి నిరోధం కంటే తక్కువ ఉంటుంది. 34.1 కిలోవాట్ ____ వాట్లు. 35.1 మెగావాట్ (M.W.)____ వాట్లు. 36.ఉష్ణ యాంత్రిక తుల్యాంకం J విలువ ____. 37.కెలోరిమీటర్ ద్వారా కచ్చితంగా J విలువ ____. 38.ఇంటిలోకి ప్రవేశించే విద్యుత్ పొటెన్షియల్ ____. 39.బ్యాటరీలు ఉత్పత్తి చేసే విద్యుత్ ____. 40.ఇంటిలో వినియోగించే విద్యు చ్ఛక్తికి ప్రమాణాలు ____. 41.విద్యుద్విశ్లేష్యాన్ని కలిగి ఉండి విద్యుద్విశ్లేషణ చేయడానికి వీలున్న పాత్రను ____ అంటారు. 42.రాగి విద్యుత్ రసాయన తుల్యాంకం ____. 43.పరమాణు భారం, దాని వేలన్సీల నిష్పత్తిని ____ అంటారు. 44.కాపర్ లోహాన్ని శుద్ధి చేసేటప్పుడు ఇఠౌ4 ద్రావణాన్ని ____ గా వాడతారు. 45.విద్యుద్విశ్లేషణానికి వాడే ద్రావణాన్ని ____ అంటారు. 46.ఒక లోహంపై వేరొక లోహం పూత పూయడానికి ____ విధానాన్ని అవలంబిస్తారు. 47.విద్యుద్విశ్లేషణ పద్ధతిలో అక్షరాలున్న దిమ్మెను తయారు చేసేందుకు ____ పద్ధతిని ఉపయోగిస్తారు. 48.అయస్కాంత ప్రేరణ (B)= ____ . 49.ఫ్లెమింగ్ ఎడమ చేయి నిబంధన ప్రకారం, వాహకంపై ____ వేలు బలదిశను సూచిస్తుంది. 50.విద్యుత్ మోటారు ____శక్తిని____శక్తిగా మారుస్తుంది. 51.ఖ్కక పూర్తి రూపం ____. 52.విద్యుత్ మోటారులోని దీర్ఘచతురస్రాకార బంధక కవచాన్ని ____ అంటారు. 53.విద్యుచ్ఛక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది ____. 54.మోటారు పనిచేసే నిబంధన ____. 55.ఏకాంతర విద్యుత్ మోటారులో ____ ఉండదు. 56.యాంత్రిక (or) ఉష్ణశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చేది ____. 57.స్వయం ప్రేరకత్వానికి ప్రమాణం ____. 58.అన్యోన్య ప్రేరకత్వానికి ప్రమాణం ____. 59.అఇ వోల్టేజీని పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగించేది ____. 60.గౌణ వేష్టణం చుట్ల సంఖ్య ప్రధాన వేష్టణంలోని చుట్ల సంఖ్య కంటే ఎక్కువ ఉంటే ఆ ట్రాన్సఫార్మర్ను ____ అంటారు. 61.పైలాన్ల సముదాయాన్ని ____ అంటారు. 62.ఒక ప్రదేశంలో అధిక వోల్టేజీ సరఫరా చేసే విద్యుత్ వ్యవస్థను ____ అంటారు. 63.ట్రాన్సఫార్మర్లో ____ని ఉపయోగించడం ద్వారా విద్యుత్ సామర్థ్య దుర్వ్యయాలను తగ్గించవచ్చు. 64.విశిష్ట నిరోధానికి ప్రమాణాలు ____. 65.అఓమీయ వాహకాలకు ఉదాహరణ ____. 66.ఓమీయ వాహకాలకు ఉదాహరణ ____. 67.6గి, 12గిలను సమాంతర సంధానం చేస్తే ఫలిత నిరోధం ____. 68.____ నియమంతో ట్రాన్సఫార్మర్ పని చేస్తుంది. 69.త్వరగా క్షయం కాని లోహాలను వేరొక లోహాలపై పల్చగా పూత పూయడాన్ని ____ అంటారు. 70.ఒక కిలోవాట్-అవర్= ____ వాట్ - సెకన్లు. సమాధానాలు 1) ఆంపియర్; 2)ఓల్ట్; 3)అమ్మీటర్; 4) ; 5) ధనావేశం; 6) కరెంట్‌ను పంపేందుకు, తీసివేసేందుకు; 7) ఓల్ట్‌మీటర్; 8) కులూంబ్‌లు; 9) ఓల్టేజ్; 10) ఓల్ట్‌లు; 11) విద్యుచ్ఛక్తిగా; 12) విద్యుత్ సామర్థ్యం; 13) వాట్లు; 14) ; 15) వెలగవు; 16) స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు; 17) అపసరవడి; 18) ; 19) ఓమ్; 20) తగ్గుతుంది; 21) పెరుగుతుంది; 22) మాంగనీస్; 23); 24) రియోస్టాట్; 25) ; 26) అనులోమానుపాతం; 27) విలోమానుపాతం; 28) అనులోమానుపాతం; 29) వాహకం తయారైన పదార్థం; 30) వాహకత్వం; 31) మో/మీటర్; 32) శ్రేణి; 33) సమాంతర; 34) 1000; 35) 106; 36) 4.2 జౌల్/కెలోరి; 37) 4.18 జౌల్/కెలోరి; 38) 220 వోల్ట్స్; 39) ఏకముఖ విద్యుత్; 40) కిలోవాట్ అవర్ (KWH); 41) వోల్టామీటర్; 42) 0.0003294 గ్రా/కులూంబ్; 43) విద్యుత్ రసాయన తుల్యాంకం; 44) విద్యుద్విశ్లేష్యం; 45) ఎలక్ట్రోలైట్; 46) ఎలక్ట్రోప్లేటింగ్; 47) ఎలక్ట్రోటైపింగ్; 48) 49) బొటన; 50) విద్యుత్, యాంత్రిక; 51) రొటేషన్ పర్ మినిట్; 52) ఆర్మేచర్; 53) మోటార్; 54) ఫ్లెమింగ్ ఎడమచేయి నిబంధన; 55) కమ్యుటేటర్; 56) డైనమో(ౌట) జనరేటర్; 57)హెన్రీ; 58) హెన్రీ; 59) ట్రాన్సఫార్మర్; 60) స్టెప్ అప్ ట్రాన్సఫార్మర్; 61) ఇంటిగ్రేటెడ్; 62) పవర్ గ్రిడ్; 63) ఇనుప కోర్; 64) ఓమ్-మీటర్; 65) అర్ధవాహకాలు, విద్యుద్విశ్లే ష్యాలు; 66) లోహాలు; 67) 4గి; 68) అన్యోన్య ప్రేరకత్వం; 69) ఎలక్ట్రో ప్లేటింగ్; 70) 36ప105. ముఖ్య ప్రశ్నలు ఒక మార్కు 1)ఒక సాధారణ విద్యుత్ వలయం గీసి అందులోని భాగాలను గుర్తించండి? 2)ట్రాన్స్ఫార్మర్ ఏ నియమంతో పనిచేస్తుంది? 3)ట్రాన్స్ఫార్మర్లోని ఇనుపకోర్ వల్ల ప్రయోజనం ఏమిటి? 4)విశిష్టనిరోధం అంటే ఏమిటి? 5)1v, 1.5v, 2v emfలు గల బ్యాటరీలను శ్రేణి సంధానం చేస్తే ఫలిత emf ఎంత? రెండు మార్కులు 1)నిరోధ నియమాలను పేర్కొనండి? 2)లెంజ్ నియమాన్ని పేర్కొని, వివరించండి? 3)100W, 1Wలు గల నిరోధాలను సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధాన్ని తెల్పండి? 4)విద్యుత్ విశ్లేషణం అనువర్తనాలు తెల్పండి? 5)ఓమీయ, అఓమీయ వాహకాలు అంటే ఏమిటి? నాలుగు మార్కులు 1)జౌల్ నియమాన్ని నిర్వచించండి? Q = i2RT/J సూత్రాన్ని ఉత్పాదించండి? 2)శ్రేణి సంధానంలో ఫలిత నిరోధం, విడి నిరోధాల మొత్తానికి సమానం అని చూపండి? లేదా C=R1+R2+R3 ను ఉత్పాదించండి? 3)సమాంతర సంధానంలో ఫలిత నిరోధ వ్యుత్క్రమ రాశి, దాని విడి నిరోధ వ్యుత్క్రమ రాశుల మొత్తానికి సమానం అని చూపండి? లేదా 1/R= 1/R1+ 1/R2+....... ను ఉత్పాదించండి? 4)ఫారడే రెండో విద్యుత్ విశ్లేషణ నియమాన్ని నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని వివరించండి? 5)ఓమ్ నియమాన్ని ప్రవచించండి? ఓమ్ నియమాన్ని రుజువుచేయడానికి ఒక ప్రయాగాన్ని వర్ణించండి? ఐదు మార్కులు 1)విద్యుత్ మోటార్ పటం గీసి భాగాల్ని గుర్తించండి? ఆధునిక భౌతిక శాస్త్రం 1.ఒక మూలకపు పరమాణువు విద్యుత్ పరంగా ____. 2.రూథర్‌ఫర్‌డ బంగారు రేకు ప్రయోగం ____ని కనుక్కోవడానికి దారితీసింది. 3.____ కక్ష్యల్లో ఎలక్ట్రాన్లు శక్తిని ఉద్గారించవు. 4.____ పరమాణు నమూనా, వివిధ మూలకాలు ఉద్గరించే వర్ణపటాలను వివరించింది. 5.పరమాణువులో చాలాభాగం ఖాళీ అని తెలిపిన శాస్త్రవేత్త ____. 6.ఒక మూలక పరమాణు సంఖ్య, ఆ పరమాణువులోని ____ సంఖ్యని సూచిస్తుంది. 7.amu ____కు సంక్షిప్త పదం. 8.ఒక పరమాణువులోని____సంఖ్య ____ సంఖ్యల మొత్తం ద్రవ్యరాశి సంఖ్యకి సమానం. 9.ఎలక్ట్రాన్ వోల్ట్ ____కు ప్రమాణం. 10.ఒక amu ____కు సమానం. 11.µ కణం ఒక ____ ఆవేశ కణం. 12.కణం ద్రవ్యరాశి చిచిచిచి ద్రవ్యరాశికి సమానం. 13.ఛ-కణం విద్యుత్ క్షేత్రంలోచిచిచిచి ఆవేశ ఫలకం వైపునకు ఆవర్తనమవుతుంది. 14.్ప- విఘటనం ద్రవ్యరాశి సంఖ్యను చిచిచిచి ప్రమాణాలు చిచిచిచి. 15.ఛ- కణం ఉద్గారమైనప్పుడు పరమాణు సంఖ్యచిచిచిచి. 16.1H1, 1H2, 1H3లు ____కి ఉదాహరణలు. 17.19K40, 20Ca40లు ____కి ఉదాహరణలు. 18.ఒకే న్యూట్రాన్ సంఖ్య గల రెండు పరమాణువులను ____ అంటారు. 19.అత్యధిక అయనీకరణ సామర్థ్యం ఉన్నవి ____. 20.అత్యధికంగా చొచ్చుకొని పోయేవి ____. 21.రేడియోధార్మికతలో వెలువడే విద్యుదయస్కాంత వికిరణాలు ____. 22.అయస్కాంతక్షేత్రంలో అపవర్తనం కాని వికిరణాలు ____. 23.ఒక పరమాణువు నుంచి ఛ-కణం ఉద్గారమైతే దాని ద్రవ్యరాశి ____. 24.ఒక పరమాణువు నుంచి ్ప-కణం ఉద్గారమైతే దాని ద్రవ్యరాశి సంఖ్య తగ్గే పరిమాణం ____. 25.ఐసోబార్లు ____పరమాణువులను కలిగి ఉంటాయి. 26.అస్థిర పరమాణువు నుంచి జ-కిరణం ఉద్గారమైనప్పుడు దాని ____. 27.థోరియం శ్రేణి ____. 28.న్యూక్లియర్ రియాక్టర్లో మితకారి న్యూట్రాన్ల ____ తగ్గిస్తుంది. 29.____ చర్యలు నక్షత్రాల్లో జరుగుతాయి. 30.____ ఐసోటోపును శిలల వయసును నిర్ధారించేందుకు ఉపయోగిస్తారు. 31.ఐన్‌స్టీన్ ద్రవ్యరాశి శక్తి తుల్యతా నియమం ____. 32.కృత్రిమ రేడియో ధార్మికతను ఆవిష్కరించింది ____. 33.ఒక మూలకం రేడియోధార్మికతను ____ అనే సంకేతం ద్వారా తెలియజేస్తారు. 34.క్యాన్సర్ కణాలను నిర్మూలించేందుకు ____ ను వాడతారు. 35.శిలాజాల వయసుని తెలుసుకొనేందుకు ____ను వాడతారు. 36.న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా ____ని ఉపయోగిస్తారు. 37.న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా ____ని ఉపయోగిస్తారు. 38.న్యూక్లియర్ రియాక్టర్లో నియంత్రణకడ్డీలుగా ____ని ఉపయోగిస్తారు. 39.హైడ్రోజన్ బాంబు ____ చర్యల నియమంతో తయారైంది. 40.సహజ రేడియో ధార్మికతను ఆవిష్కరించిన శాస్త్రవేత్త ____. 41.____శ్రేణిని కృత్రిమ రేడియో ధార్మిక శ్రేణి అంటారు. 42.ద్రవ్యరాశి, శక్తితుల్యతా నియమాన్ని ప్రతిపాదించింది ____. 43.యురేనియం శ్రేణిలో చివరగా ఏర్పడే స్థిర మూలకం ____. 44.థైరాయిడ్ గ్రంథి పనితీరును ____ద్వారా పరీక్షిస్తారు. 45.0.04్ఛఠి అంతకంటే తక్కువ శక్తి ఉన్న న్యూట్రాన్లను ____ అంటారు. 46.కార్బన్ ఐసోటోపును ఉపయోగించి శిలాజాల వయస్సుని కనుక్కొనే పద్ధతిని ____ అంటారు. 47.శక్తికి ప్రమాణం ____. 48.కేంద్రక విచ్ఛితిని ఆవిష్కరించింది ____. 49.____ అనే నియమంపై న్యూక్లియర్ రియాక్టర్ పనిచేస్తుంది. సమాధానాలు 1) తటస్థం; 2) కేంద్రకం; 3) స్థిర; 4) బోర్; 5) లీనార్డ; 6) ప్రోటాన్ల (ౌట) ఎలక్ట్రాన్; 7) అటామిక్ మాస్ యూనిట్; 8) ప్రోటాన్, న్యూట్రాన్; 9) శక్తి; 10) 931.5 ఝ్ఛఠి; 11) ధన; 12) ఎలక్ట్రాన్; 13) ధన; 14) 4 యూనిట్లు, తగ్గిస్తుంది; 15) 1 ప్రమాణం పెరుగుతుంది; 16) ఐసోటోపులు; 17) ఐసోబార్లు; 18) ఐసోటోన్లు; 19) ్ప-కణాలు; 20) జ-కిరణాలు; 21) జ-కిరణాలు; 22) జ-కిరణాలు; 23) మారదు; 24) 4 ప్రమాణాలు; 25) ఒకే ద్రవ్యరాశి సంఖ్య; 26) ో, అ మారవు; 27) 4 శ్రేణి; 28) వేగాన్ని; 29) ఉష్ణ కేంద్రక; 30) యురేనియం (92్ఖ235); 31) E=Dmc2; 32) మేడం క్యూరీ, జూలియట్లు; 33) నక్షత్రం(అ); 34) రేడియో కోబాల్ ్ట(27Co60); 35) కార్బన్ (27ఇౌ60); 36) 92్ఖ235(or)92్ఖ238; 37) భారజలం; 38) బోరాన్, కాడ్మియం కడ్డీలు; 39) అనియంత్రిత కేంద్రక సంలీన; 40) అ.ఏ బెకెర్వెల్; 41) నెప్ట్యూనియం; 42) ఐన్‌స్టీన్; 43) సీసం (ఞఛ); 44) 53ఐ131; 45) థర్మల్ న్యూట్రాన్లు; 46) కార్బన్ డేటింగ్; 47) ఎలక్ట్రాన్ వోల్ట్ (ev); 48) అట్టహాన్, స్ట్రాన్సమన్; 49) నియంత్రిత శృంఖల చర్య. ముఖ్య ప్రశ్నలు ఒక మార్కు 1)ద్రవ్యరాశి లోపాన్ని నిర్వచించండి? 2)బంధనశక్తి అంటే ఏమిటి? 3)ఐసోటోన్లు అంటే ఏమిటి? ఉదాహరణనిమ్ము? 4)ఐసోబార్లు అంటే ఏమిటి? ఉదాహరణనిమ్ము? 5)ఐసోటోప్లు అంటే ఏమిటి?ఉదాహరణనిమ్ము? 6)ఐన్‌స్టీన్ ద్రవ్యరాశి-శక్తి తుల్యతా నియమాన్ని పేర్కొనండి? 7)అర్ధాయువును నిర్వచించండి? 8)రేడియోధార్మిక విఘటన నియమాన్ని పేర్కొనండి? రెండు మార్కులు 1)వైద్యరంగంలో రేడియో ఐసోటోపుల ఉపయోగమేమిటి? 2)న్యూక్లియర్ రియాక్టర్లో మితకారి ప్రయోజనమేమిటి? 3)ఛ విఘటనం గురించి ఉదాహరణతో వివరించండి? 4)కేంద్రక విచ్ఛిత్తి-కేంద్రక సంలీనం మధ్య భేదాలు రాయండి? నాలుగు మార్కులు 1)్చ, ఛ, జ వికిరణాల ధర్మాలను పోల్చండి? 2)న్యూక్లియర్ రియాక్టర్ పనిచేసే నియమమేమిటి? న్యూక్లియర్ రియాక్టర్లో శృంఖల చర్యను ఎలా నియంత్రిస్తారు? 3)8ై16 ఆక్సిజన్ కేంద్రక ద్రవ్యరాశి 15.995 amu అయితే (ఎ) ద్రవ్యరాశి తరుగు ఎంత? (బి) బంధన శక్తి ఎంత? ఐదు మార్కులు 1)న్యూక్లియర్ రియాక్టర్ పటం గీసి భాగాల్ని గుర్తించండి? ఎలక్ట్రానిక్స్ 1.0°K వద్ద సంయోజక పట్టీ పూర్తిగా ____ఉంటుంది. 2.0°K వద్ద వాహక పట్టీ పూర్తిగా ____ఉంటుంది. 3.రబ్బరు ఒక ____. 4.సంయోజక పట్టీ, వాహక పట్టీల మధ్య ఉన్న అంతరాన్ని ____అంటారు. 5.అర్ధ వాహకపు ఉష్ణోగ్రతను పెంచితే, దాని శక్తి అంతరం ____. 6.అత్యధిక శక్తి అంతరం ఉన్నది ____. 7.స్వచ్ఛమైన అర్ధవాహకాన్ని ____అంటారు. 8.-రకం అర్ధవాహకంలో ____అధిక సంఖ్య వాహక కణాలు. 9.అస్వభావజ అర్ధ వాహకాల్లో, పంచ సంయోజనీయ పదార్థాలని ____అంటారు. 10.సిలికాన్ పరమాణువు ____సమయోజనీయ బంధా లను ఏర్పరుస్తాయి. 11.అర్ధవాహకాలలో ఆవేశ వాహకణాలు ____. 12.స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సాంద్రత దేనిలో ఎక్కువ ____. 13.ఞ-రకం అర్ధవాహకంలో అధిక సంఖ్య వాహక కణాలు ____. 14.సిలికాన్‌ను ____ మాలిన్యంతో మాదీకరణం చేస్తే ఞ- రకం అర్ధ వాహకంగా మారుతుంది . 15.ట్రాన్సిస్టర్‌లోని మూడు టెర్మినల్లు ____. -
కాన్సెప్ట్స్‌ను అవగాహన చేసుకుంటూ..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్)/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్ఎస్) లో వివిధ పోస్టుల భర్తీ కోసం ఐఈఎస్/ఐఎస్ఎస్-2014 నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ పరీక్షలో విజయం సాధిస్తే.. కేంద్ర ప్రభుత్వ కొలువును దక్కించుకోవడంతోపాటు.. ప్రభుత్వ పాలన విభాగంలో ఉన్నత కెరీర్ దిశగా మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు.. ఈ నేపథ్యంలో ఐఈఎస్/ ఐఎస్ఎస్ ప్రిపరేషన్ ప్లాన్ తదితర అంశాలపై విశ్లేషణ.. ఐఈఎస్/ఐఎస్ఎస్ ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనే దశల్లో 1200 మార్కులకు జరుగుతుంది. రాత పరీక్ష మొత్తం 1000 మార్కులకు ఉంటుంది. దీన్ని ఆరు పేపర్లుగా నిర్వహిస్తారు. ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లిష్ పేపర్లు మాత్రమే ఐఈఎస్, ఐఎస్ఎస్ రెండు సర్వీసులకు ఉమ్మడిగా ఉంటాయి. మిగిలినవి సబ్జెక్ట్ పేపర్లు. ప్రతి సబ్జెక్ట్‌కు నాలుగు పేపర్లు ఉంటాయి. రాత పరీక్ష పూర్తిగా కన్వెషనల్ (ఎస్సే) రూపంలో ఉంటుంది. సమాధానాలను పూర్తిగా ఇంగ్లిష్‌లోనే రాయాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనికి 200 మార్కులు కేటాయించారు. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే..స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌లోని కాన్సెప్ట్స్‌ను (ప్రాథమిక భావనలు) అవగాహన చేసుకోవడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. సిలబస్ పరంగా చూస్తే స్టాటిస్టిక్స్‌లో పేపర్-1, 2 మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పేపర్-1,2 మీద దృష్టి సారించడం మంచిది. నాలుగు సబ్జెక్ట్ పేపర్లలో పేపర్-4 క్లిష్టంగా ఉంటుంది. ఇందులోని ప్రశ్నలు అభ్యర్థులను తికమక పెట్టే విధంగా ఉంటాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ.. సిలబస్‌లోని అంశాలను బేరీజువేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఉపయుక్తం. జనరల్ అభ్యర్థులు 400 మార్కులు (1000 మార్కులకు) సాధిస్తే ఇంటర్వ్యూ కాల్ ఆశించవచ్చు. గత ప్రశ్నపత్రాలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. -రంగా శ్రీనివాసులు, ఐఎస్ఎస్ (ప్రొబేషనరీ ఆఫీసర్), నేషనల్ అకడమీ ఆఫ్ స్టాటిస్టికల్ అడ్మినిస్ట్రేషన్ (గ్రేటర్ నోయిడా). కెరీర్‌గ్రోత్-విధులు: ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన విభాగాన్ని బట్టి ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, విధానాల రూపకల్పన, సలహాలు, సూచనలు ఇవ్వడం, వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాలపై పని చేస్తుంటారు. వీరి కెరీర్ ఆర్థిక వ్యవహారాల సంబంధ శాఖల్లో అసిస్టెంట్ డెరైక్టర్, రీసెర్చ్ ఆఫీసర్ హోదాలో (జూనియర్ టైం స్కేల్) ప్రారంభమవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్, ప్లానింగ్ కమిషన్, ప్లానింగ్ బోర్డ్స్, నేషనల్ శాంపుల్ సర్వే, లేబర్ బ్యూరో తదితర విభాగాల్లో వీరిని నియమిస్తారు. అనుభవం, పనితీరు ఆధారంగా ప్రిన్సిపల్ అడ్వైజర్ లేదా చీఫ్ అడ్వైజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అధికశాతం మందికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పోస్టింగ్స్ లభిస్తున్నాయి. నోటిఫికేషన్ సమాచారం: ఇండియన్ ఎకనమిక్ సర్వీస్: 15 ఖాళీలు అర్హత: పీజీ ఇన్ ఎకనామిక్స్/అప్లయిడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ఎకనోమెట్రిక్స్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్: 23 ఖాళీలు అర్హత: పీజీ స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లయిడ్ స్టాటిస్టిక్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లయిడ్ స్టాటిస్టిక్స్ (ఏదైనా ఒక పేపర్‌గా) వయసు: 30 ఏళ్లు (ఆగస్ట్ 1, 2014 నాటికి) దరఖాస్తు విధానం: ఆన్లైన్లోదరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 10, 2014. రాత పరీక్షలు ప్రారంభం: మే 24, 2014 నుంచి. వెబ్సైట్: www.upsc.gov.in జనరల్ ఇంగ్లిష్ ఈ విభాగంలో ప్రశ్నల క్లిష్టత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇందులో ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. మిగిలిన ప్రశ్నలు మాత్రం అభ్యర్థుల ఇంగ్లిష్ భాష పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ప్రెసిస్ పేరాగ్రాఫ్ ప్రశ్నలు కూడా ఇస్తారు. ఈ విభాగంలో ఇంగ్లిష్‌లో కేవలం భావ వ్యక్తీకరణే కాకుండా వాక్య నిర్మాణ శైలిని పరిశీలిస్తారు. కాబట్టి వొకాబ్యులరీని, రీడింగ్ కాంప్రహెన్షన్ టెక్నిక్స్‌ను పెంచుకోవాలి. ఇంగ్లిష్‌లో ఎక్కువగా ప్యాసేజ్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. వీటిలో పట్టు సాధిస్తే ఈ పేపర్లో 60 శాతం మార్కులు పొందినట్లే. జనరల్ స్టడీస్ ఈ విభాగంలో ప్రశ్నల క్లిష్టత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇందులో మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు(కరెంట్ ఈవెంట్స్), జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్న లు ఇస్తారు. ఈ క్రమంలో శాస్త్రసాంకేతిక రంగం, భారత రాజ్యాంగం, భారతదేశ చరిత్ర, జాగ్రఫి నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ స్టడీస్‌కు సంబంధించి.. సివిల్స్ స్థాయి లో కాకున్నా.. అంతకు కొద్దిగా తక్కువ స్థాయిలో అదే సిలబస్‌ను అనుసరించి చదవాలి. ప్రశ్నలు 2మార్కులకు, 3 మార్కులకు, పది మార్కులకు అడుగుతారు. ఈ నేపథ్యంలో ఏ ప్రశ్నను ఎన్ని మార్కులకు అడిగారో ఆ స్థాయి లోనే సమాధానం ఇచ్చే నైపుణ్యం అలవర్చుకోవాలి. రిఫరెన్స్ బుక్స్: General English: Hindu News Paper; General English for Competitive Examinations by Tata McGraw Hill General Studies: Lucent's General Knowledge ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ పేపర్ సబ్జెక్ట్ మార్కులు పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 100 పేపర్-2 జనరల్ స్టడీస్ 100 పేపర్-3 జనరల్‌ఎకనామిక్స్-1 200 పేపర్-4 జనరల్ ఎకనామిక్స్-2 200 పేపర్-5 జనరల్ ఎకనామిక్స్-3 200 పేపర్-6 ఇండియన్ ఎకనామిక్స్ 200 మొత్తం 1,000 (ప్రతి పేపర్‌కు: సమయం 3 గంటలు) జనరల్ ఎకనామిక్స్-1: ఇందులో సిలబస్‌ను సూక్ష్మ అర్థశాస్త్రం, మ్యాథమెటిక్స్, స్టాటిస్టికల్ ఎకనోమెట్రిక్ మెథడ్స్ ఆధారంగా రూపొందించారు. సూక్ష్మ అర్ధశాస్త్రానికి సంబంధించి వినియోగదారుని డిమాండ్ సిద్ధాంతం, ఉత్పత్తి సిద్ధాంతం, విలువ, పంపిణీ అంశాలను పొందుపరిచారు. ఇందులోని పార్ట్-బిలో మ్యాథమెటికల్ మెథడ్స్, స్టాటిస్టికల్ మెథడ్స్ అంశాలకు చోటుకల్పించారు. ఈ విభాగంలో ప్రశ్నపత్రాన్ని మూడు సెక్షన్లుగా విభజించారు. సెక్షన్-1లో ఇచ్చే ప్రశ్నలు కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి. మిగిలిన రెండు సెక్షన్లలో ఇచ్చే ప్రశ్నలు అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. ఈ పేపర్‌కు సంబంధించి అవగాహన పెంచుకోవాల్సినవి: లారెంజ్ వక్ర రేఖ, ఏంజెల్ సూత్రం, షాడో ప్రైస్, పారెటో పంపిణీ సిద్ధాంతం,స్వలకాల-దీర్ఘకాల వ్యయ రేఖలు, తదితరాలు. జనరల్ ఎకనామిక్స్-2: ఈ పేపర్ సిలబస్ స్థూల అర్థశాస్త్రం, ఎకనామిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్, అంతర్జాతీయ అర్థశాస్త్రం వంటి అనేక అంశాల కలయికగా ఉంటుంది. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే ప్రతి అంశాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ చదువుకోవాలి. సాంప్రదాయ, కీన్స్, జాతీయాదాయం కొలమానం, గ్రీన్ నేషనల్ ఇన్కమ్, సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం, ఫిలిప్స్ రేఖ, ద్రవ్యరాశి సిద్ధాంతం వంటివి కీలకమైనవి. ఆర్థికవృద్ధి, అర్థికాభివృద్ధి అంశంలో పలువురు ఆర్థిక వేత్తల వృద్ధి నమూనాలను పొందుపరిచారు. ప్రపంచ వాణిజ్య సంక్షోభం కారణాలు, యూరోజోన్ సంక్షోభం, ప్రపంచ వాణిజ్య సంస్థ, జీ-20 దేశాల ఆర్థిక అంశాలను పరిశీలించాలి. జనరల్ ఎకనామిక్స్-3: ప్రభుత్వ విత్త శాస్త్రం, పర్యావరణ అర్థశాస్త్రం, ఇండస్ట్రియల్ ఎకనమిక్స్ అంశాల సమ్మిళితంగా ఈ పేపర్ సిలబస్ ఉంది. ఈ విభాగంలో అధికంగా దృష్టిసారించాల్సినవి: పన్ను సంస్కరణలు, గరిష్ట సాంఘిక ప్రయోజన సిద్ధాంతం, ప్రభుత్వ వ్యయ సిద్ధాంతం, గ్రీన్ జీడీపీ, క్యోటో ప్రోటోకాల్, బాలి యాక్షన్ ప్లాన్, ఇండస్ట్రియల్ ఎకనమిక్స్. ఇండియన్ ఎకానమీ: ఈ పేపర్లో మెరుగైన మార్కులు సాధించాలంటే..సిలబస్‌లోని ముఖ్యాంశాలను వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ నోట్స్ రూపొందించుకోవాలి. ఇందులో కీలకమైన అంశాలు: స్థిరీకరణ-నిర్మాణాత్మక సర్దుబాటు ప్యాకేజీ, విత్తరంగ సంస్కరణలు, ఆర్థిక సంఘం సిఫార్సులు-13వ ఆర్థిక సంఘం, ఎఫ్ఆర్బీఎం యాక్ట్, టోకు ధరల సూచీ-రిటైల్ ధరల సూచీ, భారత ద్రవ్య మార్కెట్, ఎఫ్‌డీఐ,పట్టణాభివృద్ధి వ్యూహాలు తదితర అంశాలపై దృష్టిసారించాలి. కీలకం: పోస్ట్ గ్రాడ్యుయేట్లను మాత్రమే అర్హులిగా పేర్కొన్న పరీక్షలో సిలబస్ పీజీ ఆపై స్థాయిలో ఉంటోంది. దాంతో విజయం సాధించాలంటే కేవలం సబ్జెక్టు పరిజ్ఞానమే కాకుండా విశ్లేషణాత్మక సామర్థ్యం, ప్రపంచ తాజా ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఎంతో అవసరం. రిఫరెన్స్ బుక్స్: Microeconomics: Pindyck; Microeconomics: Errol D'Souza; Public Finance:H L Bhatia; International Economics: Joseph Cherunilam; nIndustrial Economics: R.R.Barthwal; n The Economics of Development and Planning: M.L.Jhingan; Indian Economy: Misra & Puri; Environmental Economics: U.Shankar; n Business Mathematics & Statistics:Agarwal B.M; n Yojana; n Kurukshetra; Economic and Political Weekly. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పేపర్ సబ్జెక్ట్ మార్కులు పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 100 పేపర్-2 జనరల్ స్టడీస్ 100 పేపర్-3 స్టాటిస్టిక్స్-1 200 పేపర్-4 స్టాటిస్టిక్స్-2 200 పేపర్-5 స్టాటిస్టిక్స్-3 200 పేపర్-6 స్టాటిస్టిక్స్-4 200 మొత్తం 1,000 (ప్రతి పేపర్‌కు: సమయం 3 గంటలు) స్టాటిస్టిక్స్-1 పేపర్లో రాణించాలంటే పలు సిద్ధాంతాలపై పట్టు సాధించాలి. స్టాటిస్టికల్ మెథడ్స్, న్యూమరికల్ అనాలిసిస్ వంటి అంశాలపై అవగాహన పొందాలి. స్టాటిస్టిక్స్-2 పేపర్లో లీనియర్ మోడల్స్, ఎస్టిమేషన్, హైపోథిసిస్ టెస్టింగ్, మల్టీవెరైటీ అనాలిసిస్ (ఎస్టిమేషన్ ఆఫ్ మీన్ వెక్టార్ అండ్ కో వేరియన్స్ మ్యాట్రిక్స్, తదితర అంశాలపై దృష్టిసారించాలి. స్టాటిస్టిక్స్-3 పేపర్లో శాంప్లింగ్ టెక్నిక్స్, ఎకనామిక్ సాటిస్టిక్స్, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, ఎకనోమెట్రిక్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. స్టాటిస్టిక్స్-4 పేపర్లో స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ ,డెమోగ్రఫీ అండ్ వైటల్ ఛార్ట్స్, కంప్యూటర్ సిస్టమ్- సాఫ్ట్వేర్ కాన్సెప్ట్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ వంటి కంప్యూటర్ సంబంధ ప్రశ్నలు అడుగుతారు. స్ట్రాటజీ: డేటా ఆధారిత అంశాలు అధికంగా ఉండే ఈ పేపర్లలో చక్కని స్కోర్ చేయాలంటే వేగంతోపాటు కచ్చితత్వం, సునిశిత పరిశీలన అవసరం. ప్రిపరేషన్ సమయంలోనే ప్రతి అంశాన్ని నిర్దిష్ట కాలపరిమితి విధించుకుని చదవాలి. ముఖ్యంగా స్టాటిస్టిక్స్ విషయంలో ఆయా సిద్ధాంతాలు వాటిని వినియోగించి డేటా రూపకల్పన, ఛార్ట్స్, గ్రాఫ్స్ రూకల్పన వంటి అంశాలపై పట్టు సాధించాలి. మరో కీలక అంశం..సిలబస్‌పై సంపూర్ణ అవగాహన పొందాలి. కారణం.. పరీక్ష ఒకే రోజు రెండు పేపర్లు చొప్పున జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు ఏ పేపర్లో ఏ సిలబస్ ఉందో అవగాహన లేక చివరి నిమిషంలో ఆందోళనకు, ఒత్తిడికి గురవుతారు. దీనికి పరిష్కారం సిలబస్‌పై అవగాహన ఏర్పరచుకోవడమే. సిలబస్‌లోని అన్ని అంశాలను చదవడం కంటే పట్టున్న అంశాలనే వీలైనంత ఎక్కువసార్లు పునశ్చరణ చేసుకోవడం ఉపయుక్తం. రిఫరెన్స్ బుక్స్: Statistics Paper - I: Fundamentals of Mathematical Statistics by S.C.Gupta & V.K. Kapoor; Applied statistics by S.C.Gupta & V.K.Kapoor; An Introduction to Probability and Statistics (Wiley Series in Probability & Statistics) By Vijay K.Rohatgi & A.K.Md. Ehsanes Saleh. Statistics Paper - II: Statistical Inference by Vijay Rohatgi; Kshirsagar A.M.(1972): Multivariate Analysis. Maral Dekker; Johnosn, R.A. and Wichern . D.W (2002): Applied multivariate Analysis- 5th Ad. Prentice Hall; Kshirsagar A.M.(1983): Course in Linear Modelss- Marcel dekker. Statistics Paper - III: William G.Cochran (1977): Sampling Techniques IIIrd edition - John and Wieley sons Inc; Theory And Analysis Of Sample Survey Designs by Daroga Singh; Chakravarti. M.C.(1962): Mathematics of Design of Experiments Asia Publishing House, Bombay; Gujarati, Damodar N. Basic Econometrics. New York: McGrawHill,1978. Statistics Paper - IV: Medhi J. (1982): Stochastic Process Wiley Eastern; Stochastic Processes by Sheldon Ross; Kanti Swaroop & Gupta M. M.(1985): Operations Research, Sultan Chand & Co; Operation Research theory and Applications. (2003) IInd edition J.K.Sharma Macmillan India ltd; Applied statistics by S.C.Gupta & V.K.Kapoor; Computer Fundamentals by P.K.Sinha. డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. -
10వ తరగతి సోషల్ స్టడీస్ బిట్ బ్యాంక్
1 చరిత్ర జాతీయ ఉద్యమాలు 1.---------- కాలంలో ఫ్రాన్‌సలో క్రీ.శ. 1830 విప్లవం చెలరేగింది. 2.క్రీ.శ. 1830 విప్లవం జర్మనీ, పోలెండ్, స్పెయిన్, పోర్చగల్, ---------- లలో జాతీయ స్ఫూర్తిని ప్రేరేపించింది. 3.క్రీ.శ. 1830 తిరుగుబాటు ----------- దేశాల్లోని విప్లవకారులు విజయం సాధించడానికి దోహదపడింది. 4.--------- కాలంలో ఫ్రాన్‌సలో క్రీ.శ. 1848 తిరుగుబాటు జరిగింది. 5.లూయీ ఫిలిప్ మంత్రి అయిన -------- తన సంప్రదాయ, ప్రతిచర్యాత్మక, అవినీతి చర్యల ద్వారా ప్రజలను విసిగించాడు. 6.నెపోలియన్ బొనపార్టీ ----------- దీవిలోని అజాసియోలో క్రీ.శ. 1769లో జన్మించాడు. 7.నెపోలియన్పై అధిక ప్రభావం చూపిన తత్వవేత్త ------------ 8.నాకు పుస్తకాలు తప్ప మరే స్నేహితుడూ లేడని తన గురించి చెప్పుకున్నవాడు --------- 9.ఇటలీలో జాతీయవాద బీజాలను నాటినవాడు-------- 10.ఫ్రాన్స తుమ్మినపుడల్లా ----------- కు జలుబు చేస్తుందని ఒక నానుడి. 11.నెపోలియన్ సెయింట్ హెలీనాలోని ---------- దీవిలో క్రీ.శ. 1821లో మరణించాడు. 12.లీప్జిగ్లో జరిగిన క్రీ.శ. 1813 యుద్ధాన్ని ------- గా పేర్కొంటారు. 13.ఇంగ్లండ్‌ను ఓడించడానికి నెపోలియన్ ------- వ్యవస్థను ప్రవేశపెట్టాడు. 14.లీప్జీగ్ యుద్ధంలో యూరప్ దేశాల కూటమికి ---------- నాయకత్వం వహించాడు. 15.లీప్జీగ్ యుద్ధంలో ఓటమి తర్వాత నెపోలియన్‌ను -------- దీవిలో నిర్బంధించారు. 16.నెపోలియన్ భవితవ్యానికి తెరదించిన యుద్ధం -----. 17.వియన్నా సమావేశం (క్రీ.శ. 1815) కన్వీనర్ ---------. 18.రైన్ సమాఖ్యను ఏర్పాటు చేసినవాడు --------. 19.తనను తాను ప్రజల రాజుగా అభివర్ణించుకున్న రాజు చిచిచిచి. 20.హంగరీ ప్రజల తిరుగుబాటుకు ---------- నాయకత్వం వహించాడు. 21.ప్రప్రథమ ఐక్య జర్మనీ చక్రవర్తి ---------. 22.పనిహక్కు సూత్రాన్ని, సామాజిక వర్కషాప్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినవారు ---------. 23.సంపద సమానత్వం గురించి వివరించిన వారు ----------. 24.చరిత్ర అంటే వర్గపోరాటానికి చెందిన రికార్డ తప్ప మరేమీ కాదని చెప్పిన వాడు ------. 25.అఖిల జర్మనీ భావన వ్యాప్తికి కృషి చేసిన మేధావి---------. 26.సంస్కరణ పార్టీకి చెందిన ప్రముఖ ఫ్రాన్స చరిత్రకారుడు ---------. సమాధానాలు 1. చార్లెస్-గీ ; 2. ఇటలీ; 3. ఫ్రాన్స, బెల్జియం; 4. లూయీ ఫిలిప్; 5. గుయిజోట్; 6. కోర్సికా; 7. రూసో; 8. నెపోలియన్; 9. నెపోలియన్; 10. యూరప్; 11. రాఖీ; 12. బ్యాటిల్ ఆఫ్ నేషన్స; 13. ఖండాతర; 14. మెటర్నిక్; 15. ఎల్బా; 16. వాటర్లూ యుద్ధం; 17. మెటర్నిక్, ఆస్ట్రియా చాన్సలర్; 18. నెపోలియన్; 19. లూయీ ఫిలిప్; 20. కొస్సుత్; 21. విలియం-1; 22. లూయీబ్లాంక్; 23. ప్లేటో; 24. కార్ల మార్క్స; 25. హెగెల్; 26. థీర్స. ముఖ్య ప్రశ్నలు 4 మార్కులు 1.సార్డీనియా నాయకత్వంలో ఇటలీ ఏ విధంగా ఏకీకరణ సాధించిందో వివరించండి? 2.ఫ్రాన్‌సలో క్రీ.శ. 1830 తిరుగుబాటు చెలరేగడానికి చార్లెస్-గీ ఎంతవరకు బాధ్యుడని మీరు భావిస్తున్నారు? 3.ఫ్రాన్‌సలో క్రీ.శ. 1848 తిరుగుబాటు చెలరేగడానికి కారణాలేవి? 2 మార్కులు 1.కార్ల మార్క్స గురించి రాయండి? 2.వియన్నా సమావేశ మార్గదర్శక సూత్రాలేవి? 3.యంగ్ ఇటలీ గురించి రాయండి? 4.ప్రథమ ఇంటర్నేషనల్ అంటే ఏమిటి? 1 మార్కు 1.రెడ్‌షర్‌ట్స అంటే ఏమిటి? 2.రిసోర్జిమెంట్ అంటే ఏమిటి? 3.జోల్లో వెరీన్ అంటే ఏమిటి? సామ్రాజ్యవాదం 1.క్రీ.శ. 1840లో ఆఫ్రికాను అన్వేషించిన స్కాటీష్ మిషనరీ ----------. 2.కాంగోను ------------ ఆవిష్కరించాడు. 3.-------- అనే రాజు ఆఫ్రికా అన్వేషణకు సంబంధించిన సమస్యను చర్చించడానికి క్రీ.శ. 1879లో అన్ని యూరప్ రాజ్యాలను సమావేశపరిచాడు. 4.ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా బోయెర్‌స చేసిన తిరుగుబాటులో ---------- అనే మరో యూరోపియన్ రాజ్యం బోయెర్‌స పట్ల సానుభూతి వైఖరిని ప్రదర్శించింది. 5.----------- అనే యూరోప్ రాజ్యం ఇండోనేషియా మీద తుది నియంత్రణ సాధించింది. 6.పెట్టుబడిదారీ విధానానికి చెందిన అత్యున్నత దశ------ అని లెనిన్ అభివర్ణించాడు. 7.కాంగో సార్వభౌముడనే బిరుదును పొందినవారు -------. 8.సూయజ్ కాలువ వాటాలను ఇంగ్ల్లండ్కు అమ్మిన ఈజిప్ట్ పాలకుడు ---------. 9.శ్రీలంక ప్రాచీన పేరు -------. 10.యూరప్ దేశాల దోపిడీకి గురైన మొదటి దేశం -----------. 11.బక్సార్ యుద్ధం ----------- సంవత్సరంలో జరిగింది. 12.భారతదేశ వర్తకంపై గుత్తాధిపత్యం సంపాదించిన తొలి యూరోపియన్లు ---------. 13.---------- ఖండాన్ని చీకటి ఖండంగా పిలుస్తారు. 14.దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ---------- భావించాడు. 15.పూర్వం దక్షిణాఫ్రికా --------- పేరుతో ప్రసిద్ధి చెందింది. సమాధానాలు 1. లివింగ్స్టన్; 2. కామెరాన్; 3. లియోపాల్డ్-2; 4. జర్మనీ; 5. నెదర్లాండ్స; 6. సామ్రాజ్యవాదం; 7. లియోపాల్డ్-2; 8. ఇస్మాయిల్ పాషా; 9. సిలోన్; 10. భారతదేశం; 11. క్రీ.శ.1764; 12. పోర్చగీస్; 13. ఆఫ్రికా; 14. సెసిల్ రోడ్స; 15. రోడీషియా. ముఖ్య ప్రశ్నలు 4 మార్కులు 1.సామ్రాజ్యవాదం తలెత్తడానికి కారణాలు? 2.సామ్రాజ్యవాద రూపాలు, పద్ధతులు ఏమిటి? 2 మార్కులు 1.చైనాను వలసీకరించడంలో యూరోపియన్లు ఏ విధంగా విజయవంతమయ్యారు? 2.నల్లమందు యుద్ధాల గురించి రాయండి. 3.యూరోపియన్లను ఆకర్షించిన ఇండోనేషియాలోని వనరులు ఏవి? 1 మార్కు 1.‘శ్వేతజాతి బాధ్యత’ అంటే ఏమిటి? 2.సామ్రాజ్యవాదం అంటే ఏమిటి? సమకాలీన ప్రపంచం 1.క్రీ.శ. 1894లో విధ్వంసవాదులు జార్------------ ను హత్య చేశారు. 2.జార్లలో చివరి జార్ అయిన -------- సింహాసనాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది 3.----------- అనే రష్యన్ నాయకుడు త్వరితమైన, గౌరవప్రదమైన పరిష్కారం కోసం రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తుందని ప్రచారం చేశాడు. 4.నానాజాతి సమితి రూపశిల్పి -------- . 5.మొదటి ప్రపంచ యుద్ధానికి (1914-18) తక్షణ కారణం ------- హత్య. 6.మొదటి ప్రపంచయుద్ధం తర్వాత 1919లో మిత్ర రాజ్యాలకు, ---------కు మధ్య వర్సయిల్స్ సంధి కుదిరింది. 7.లెనిన్ అసలు పేరు--------. 8.లెనిన్చి--------అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. 9.వర్సయిల్స్ సంధి షరతుల ద్వారా -------- దేశం అవమానాలపాలైంది. 10.మొదటి ప్రపంచ యుద్ధం -------------- శాంతి సంధితో 1919లో ముగిసింది. 11.నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం -------- నగరంలో ఉండేది. 12.1905 రష్యా తిరుగుబాటు నాయకుడు ---- . 13.రష్యాలో మార్క్స బోధనలను ----------ప్రచారం చేశాడు. 14.రష్యాను ఆధునీకరించడానికి -------- ప్రయత్నించాడు. 15.నానాజాతి సమితిని క్రీ.శ.--------- సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సమాధానాలు 1. అలెగ్జాండర్ ఐఐఐ; 2. నికోలస్ ఐఐ; 3. కెరెన్స్కీ; 4. ఉడ్రోవిల్సన్; 5. ఫెర్డినాండ్; 6. జర్మనీ; 7. వ్లాదిమిర్ ఇల్లీచ్ ఉలియన్నోవ్; 8. ఇస్క్రా; 9. జర్మనీ; 10. పారిస్; 11. జెనీవా; 12. ఫాదర్ గోఫోన్; 13. మాక్సిమ్‌గోర్కి; 14. పీటర్ ది గ్రేట్; 15. 1920 ముఖ్య ప్రశ్నలు 4 మార్కులు 1.వర్సయిల్స్ సంధి షరతులు ఏమిటి? 2.మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలేమిటి? 3.నానాజాతి సమితి విజయాలు, వైఫల్యాలను చర్చించండి? 2 మార్కుల పశ్నలు 1.రహస్య కూటములు/ఒప్పందాల గురించి రాయండి? 2.దురాక్రమణ పూర్వక జాతీయ వాదం అంటే ఏమిటి? 3.నానాజాతి సమితి లక్ష్యాలు, నిర్వహణ ఏమిటి? 1 మార్కు 1.బాల్కన్ సమస్య ఏమిటి? 2.అక్టోబరిస్ట్లు అంటే ఎవరు? రెండో ప్రపంచ యుద్ధం వరకూ ప్రపంచం 1.‘స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి యుద్ధం అలాంటిదనే నినాదాన్ని -------- ప్రచారం చేశాడు. 2.‘మెయిన్‌కాంఫ్’ గ్రంథ రచయిత--------- . 3.-------- ప్రాంతంలోని ప్రయోజనాల కోసం రష్యా - జపాన్ యుద్ధం జరిగింది. 4.రాబర్ట ముగాబే, 1980లో -------- కి మొదటి అధ్యక్షుడయ్యాడు. 5.లాండ్-లీజ్ బిల్లు ద్వారా అమెరికా ---------- కు అన్ని రకాల సహాయం చేయడానికి అంగీకరించింది. 6.హిట్లర్‌పై -------- తత్వవేత్త బోధనలు ప్రభావితం చూపాయి. 7.-------- అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త ిహిట్లర్ నియంతృత్వ పాలనలో జీవించలేక జర్మనీని వదిలి వెళ్లాడు. 8.మంచురియాను ------- ధాన్యాగారంగా పేర్కొంటారు. 9.పెర్లహార్బర్పై దాడిచేస్తూ -------- దేశం రెండో ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించింది. 10.న్యూడీల్ను వాగ్దానం చేసింది-----. 11.రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది ---------- . 12.‘టర్కీ టర్కల కోసమే’ అని నినదించిన వ్యక్తి ------. 13.-------- యుద్ధాన్ని విశాలమైన రంగస్థలంపై త్వరలో ప్రదర్శించే గొప్పనాటకానికి డ్రెస్ రిహార్సల్‌గా వ్యాఖ్యానించారు. 14.రెండో ప్రపంచయుద్ధంలో -------- రాజ్యాలు విజయం సాధించాయి. 15.నైరుతి ఆఫ్రికా ప్రస్తుత పేరు ------. 16.‘జాంబియా’ పూర్వ నామం --------. 17.------- దేశాన్ని ఇంతకుముందు దక్షిణ రోడీషియా అని పిలిచేవారు. 18.--------- అనే గ్రంథం నాజీయిజానికి వేదంగా గుర్తింపు పొందింది. 19.డాన్పెడ్రో దేశానికి స్వాతంత్య్రం సాధించాడు. 20.మెక్సికో జాతీయోద్యమానికి నాయకత్వం వహించింది ------. 21.లాటిన్ అమెరికా విముక్తి కోసం పోరాడిన నాయకుడు --------. సమాధానాలు 1. ముస్సోలిని; 2. హిట్లర్; 3. మంచూరియా; 4. జింబాబ్వే; 5. ఇంగ్లండ్; 6. నైషి; 7. ఆల్బర్ట ఐన్‌స్టీన్; 8. దూరప్రాచ్య; 9. జపాన్; 10. ఎఫ్డీ రూజ్వెల్ట్; 11. స్టాలిన్; 12. ముస్తఫా కెమల్ పాషా; 13. స్పాని ష్ అంతర్; 14. మిత్ర; 15. నమీబియా; 16. ఉత్తర రోడీషియా; 17. జింబాబ్వే; 18. మెయిన్‌కాంఫ్; 19. బ్రెజిల్; 20. బుటోజరేజ్; 21. సైమన్ బోలీవర్. ముఖ్య ప్రశ్నలు 4 మార్కులు 1.రెండో ప్రపంచ యుద్ధం తలెత్తడానికి కారణాలేమిటి? 2.జర్మనీలో నాజీయిజం, హిట్లర్ ఉన్నతి గురించి వివరించండి? 3.రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక పరిణామాలేమిటి? 2 మార్కులు 1.ఇటలీలో ఫాసిస్ట్ ప్రభుత్వం అనుసరించిన విధానాలేంటి? 2.స్పానిష్ అంతర్యుద్ధం అంటే ఏమిటి? 3.నానాజాతి సమితి వైఫల్యానికి గల కారణాలు ఏమిటి? 1 మార్కు 1.SWAPO ను విస్తరించండి? 2.మీజి పునరుద్ధరణ అంటే ఏమిటి? 3.దక్షిణాఫ్రికాలోని జాతి వివక్షత విధానాన్ని ఎలా పిలుస్తారు? రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం 1.------- దేశం వార్సా ఒప్పందాన్ని ఏర్పాటు చేసింది. 2.అలీనోద్యమ రూపశిల్పి---------. 3.అరబ్బులు, --------కూ మధ్య ఏర్పడిన సమస్యే పాలస్తీనా సమస్య. 4.జావా, సుమాత్రా అనే ఇండోనేషియా దేశాలు -------- కు చెందిన వలస రాజ్యాలు. 5.రెండో ప్రపంచయుద్ధంలో మిత్ర రాజ్యాల సైన్యాలకు సుప్రీం కమాండర్ వ్యవహరించింది---------. 6.నాటో అంటే--------. 7.అమెరికాను సందర్శించిన మొదటి సోవియట్ పాలకుడు----------. 8.కార్ల మార్క్స రచనలు---------అనే చైనా నాయకునిపై చాలా ప్రభావం చూపాయి. 9.చైనాలో లాంగ్‌మార్‌చ నిర్వహించింది--------. 10.యూదులకు ప్రత్యేకంగా ఏర్పడిన స్వతంత్ర దేశం--------. 11.మావో రచించిన ప్రసిద్ధ వ్యాసం-------. 12.కాంగో------------సంవత్సరంలో స్వాతంత్య్రం పొందింది. 13.బాండుంగ్ సదస్సుకు అధ్యక్షుడిగా వ్యవహరించినవారు ------. 14.సూయజ్ కాలువ జాతీయీకరణను ప్రకటించిన వారు------. 15.స్టాలిన్ మృతదేహాన్ని లెనిన్ సమాధి పక్క నుంచి తీయించి వేరేచోట పూడ్పించిన రష్యా అధ్యక్షుడు -----. 16.స్వతంత్ర ఇండోనేషియా ప్రథమ అధ్యక్షుడు------. 17.1921లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను -------- స్థాపించినవాడు. సమాధానాలు 1. రష్యా; 2. జవహర్లాల్ నెహ్రూ; 3. యూదుల; 4. డచ్; 5. ఐసెన్‌హోవర్; 6. నార్త అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్; 7. కృశ్చేవ్; 8. మావో; 9. మావో; 10. ఇజ్రాయెల్; 11. ఏ స్టడీ ఆఫ్ ఫిజికల్ కల్చర్; 12. 1960; 13. అలీసస్తో అమిద్జోజో; 14. నాజర్; 15. కృశ్చేవ్; 16. సుకర్నో; 17. మావోట్సే టుంగ్. ముఖ్య ప్రశ్నలు 4 మార్కులు 1.ప్రపంచ శాంతి పరిరక్షణలో ఐక్యరాజ్యసమితి పాత్రను అంచనా వేయండి? 2.నిరాయుధీకరణ ఉద్యమానికి సంబంధించిన సమస్యలేమిటి? 2 మార్కులు 1.బాండుంగ్ సదస్సు గురించి రాయండి? 2.మార్షల్ ప్రణాళిక అంటే ఏమిటి? 3.మాల్తోవ్ ప్రణాళిక గురించి రాయండి? 4.క్యూబన్ సంక్షోభం అంటే ఏమిటి? 1 మార్కు 1.ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఏమిటి? 2.నాటోను విస్తరించండి? 3.అలీనోద్యమం అంటే ఏమిటి? 4.ట్రూమన్ సిద్ధాంతం అంటే ఏమిటి? భారతదేశ సాంస్కృతిక వారసత్వం-మేధాపరమైన జాగృతి 1.సింధునాగరికత తవ్వకాలు మొట్టమొదట ప్రారంభించింది-----. 2.మహాబలిపురం మందిరాలను నిర్మించింది---------. 3.సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం---------. 4.భారతదేశంలో సతీసహగమనాన్ని రూపుమాపిన బ్రిటిష్ వ్యక్తి---------. 5.16వ శతాబ్దంలో భారతదేశంలో వాణిజ్యంపై గుత్తాధిపత్యం వహించిన యూరప్ దేశం-----------. 6.చికాగో మత సమ్మేళనంలో (1894) ప్రసంగించిన ప్రముఖ భారతీయుడు --------. 7.ప్రాచీన భారతీయ వైద్యశాస్త్త్ర పిత----. 8.జైనమతం నుంచి ప్రేరణ పొందిన కళ------. 9.గాంధారకళను-------- కళగా కూడా పిలుస్తారు. 10.గంగైకొండ చోళపురాన్ని నిర్మించింది------. 11.ఆర్య సమాజ్ను----------ప్రారంభించాడు. 12.ప్లాసీ యుద్ధం-----సంవత్సరంలో జరిగింది. 13.రామకృష్ణ మిషన్‌ను ప్రారంభించినవారు-------. 14.చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలో ----------అనే కవులుండేవారు. 15.సతీసహగమన దురాచారాన్ని రద్దు చేయడానికి కృషి చేసింది ----------. 16.గొప్ప మహాస్నాన వాటిక---------ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. 17.వేద సాహిత్యాన్ని---------సృష్టించారు. 18.కనిష్కుడి కాలంలో అభివృద్ధి చెందిన కళ -------- . 19.బృహదీశ్వరాలయాన్ని--------నిర్మించాడు. 20.కుతుబ్మీనార్ నిర్మాణాన్ని ---- ప్రారంభించగా -------పూర్తి చేశాడు. 21.బులంద్ దర్వాజాను-------- నిర్మించాడు. 22.ఢిల్లీలో ఎర్రకోటను -------- చక్రవర్తి నిర్మించాడు. 23.మహారాష్ర్టలో శివాజీ, గణపతి ఉత్సవాలను--------- నిర్వహించారు. 24.1857 సిపాయిల తిరుగుబాటు మొదలైన ప్రదేశం ------- 25.శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవులను ----------- అని పిలుస్తారు. 26.బెంగాల్లో వార్షిక హిందూ మేళాను ప్రారంభించింది--------. 27.తాజ్‌మహల్‌ను నిర్మించిన మొఘల్ చక్రవర్తి-------. సమాధానాలు 1. సర్జాన్ మార్షల్; 2. నరసింహవర్మ; 3. ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టడం; 4. విలియం బెంటింక్; 5. పోర్చగల్; 6. వివేకానందుడు; 7. చరకుడు; 8. మధుర కళా సంప్రదాయం; 9. గ్రీకు-బౌద్ధమత; 10. రాజేంద్రచోళుడు; 11. స్వామి దయానంద సరస్వతి; 12. 1757; 13. స్వామి వివేకానంద; 14. నవరత్నాలు; 15. రాజా రామ్మోహన్రాయ్; 16. మొహెంజోదారో; 17. ఆర్యులు; 18. గాంధార; 19. రాజరాజచోళుడు; 20. కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్; 21. అక్బర్; 22. షాజహాన్; 23. బాల గంగాధర్ తిలక్; 24. మీరట్; 25. అష్టదిగ్గజాలు; 26. గోపాల్‌మిత్ర; 27. షాజహాన్. ముఖ్య ప్రశ్నలు 4 మార్కులు 1.భారతదేశంలో సాంస్కృతిక ఐక్యతకు దోహదపడిన అంశాల గురించి రాయండి? 2.సింధు నాగరికత గురించి క్లుప్తంగా రాయండి? 3.భారతదేశ చరిత్ర లక్షణాలను వివరించండి? 4.1857 సిపాయిల తిరుగుబాటు గురించి రాయండి? 2 మార్కులు 1.ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు తాత్విక చింతనా విధానాలను తెలపండి? 2.భక్తి ఉద్యమం గురించి రాయండి? 3.దక్షిణ భారత దేవాలయాల గురించి రాయండి? 4.అమరావతి శిల్పకళా సాంప్రదాయం గురించి రాయండి? 5.భారతీయ శిల్పకళకు మొగలులు చేసిన సేవలను తెలపండి? 1 మార్కు 1.వేదకాల నాగరికత అంటే ఏమిటి? 2.ఇస్లామిక్ వాస్తు శిల్ప శైలితో కూడిన ఏవైనా మూడు నిర్మాణాలను తెలపండి? 3.1857 సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది? 4.భారత జాతీయ చైతన్యానికి ప్రేరణనిచ్చిన నాయకుల్లో ముఖ్యులెవరు? భారతదేశంలో స్వాతంత్య్రోద్యమం 1.----------- చట్టం ద్వారా ప్రావిన్సలలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. 2.------- చట్టం ద్వారా ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టారు. 3.భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు-----. 4.ప్రత్యేక ఆంధ్ర రాష్ర్టం కోసం సాగిన పోరాటంలో --------- ప్రాణాలు కోల్పోయారు. 5.పోలీసు చర్య ద్వారా భారత యూనియన్‌లో విలీనమైన రాజ్యం ------. 6.చేయండి లేదా చావండి (డూ ఆర్ డై) అని నినదించినవారు ----. 7.అమృతబజార్ పత్రిక సంపాదకులు --------. 8.బాల గంగాధర్ తిలక్ నడిపిన పత్రికలు -----------. 9.జలియన్‌వాలా బాగ్ మారణకాండ (1919)కు కారణమైన బ్రిటిష్ అధికారి -------. 10.భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు కృషి చేసిన ఆంగ్లేయుడు--------. 11.డ్రైన్ సిద్ధాంతాన్ని రూపొందించినవారు -------. 12.క్విట్ ఇండియా ఉద్యమం-------- సంవత్సరంలో పారంభమైంది. 13.రక్షక కవాట సిద్ధాంతకర్త ---------. 14.ఐఎన్ఏ అనగా -------. 15.హోమ్‌రూల్ ఉద్యమం (1915-16)ను ప్రారంభించిన వారు ----------. 16.జలియన్‌వాలాబాగ్ మారణకాండ ------- నగరంలో జరిగింది. 17.బెంగాల్ విభజనకు (1905) కారణమైన బ్రిటిష్ అధికారి------. 18.వందేమాతర ఉద్యమం ------ సంవత్సరంలో ప్రారంభమైంది. 19.వందేమాతర గేయం బంకించంద్ర చటర్జీ రాసిన ------ గ్రంథంలోనిది. 20.పూనా సార్వజనిక సభను (1870) నిర్వహించిన వారు------. 21.భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన సంవత్సరం ------. 22.దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయం ------ లో ఉంది. 23.ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ అధ్యక్షుడు --------. 24.గాంధీ ____ యాత్ర చేసి శాసనోల్లంఘనోద్యమాన్ని 1930లో ప్రారంభించాడు. 25.మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930లో ____ నగరంలో జరిగింది. 26.గాంధీ ఇర్వీన్ ఒడంబడిక ____ సంవత్సరంలో జరిగింది. 27.గాంధీ, అంబేద్కర్ల మధ్య ____ ఒడంబడిక జరిగింది. 28.ముస్లింలీగ్ ఏర్పడిన సంవత్సరం ____. 29.అనిబిసెంట్____ దేశానికి చెందిన వారు. 30.____ ప్రణాళిక ప్రకారం భారతదేశ విభజన జరిగింది. 31.మితవాదుల నాయకుడు ____. 32.బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ____ ఉద్యమం ప్రారంభమైంది. 33.‘ది హిందూ’, ‘స్వదేశీ’ పత్రికల సంపాదకుడు ____. 34.భారతదేశానికి వచ్చిన యూరోపియన్లలో మొదటివారు, చివరగా వెళ్లిన వారు____. 35.1956లో____ పుదుచ్చేరిని, 1961లో____లు గోవాను విడిచివెళ్లారు. 36.బెంగాల్లో స్వదేశీ కెమికల్ స్టోర్సను ____ ఏర్పాటు చేశాడు. 37.అజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసినవారు____. 38.కమ్యూనల్ అవార్డను ____ ప్రకటించాడు. 39.రౌలత్ చట్టాన్ని ____ సంవత్సరంలో తీసుకొచ్చారు. 40.భారతదేశం ____ సంవత్సరంలో గణతంత్ర దేశంగా రూపొందింది. సమాధానాలు 1. 1919; 2. 1935; 3. అంబేద్కర్; 4. పొట్టిశ్రీరాములు; 5. హైదరాబాద్; 6. గాంధీ; 7. శిశిర్‌కుమార్ ఘోష్; 8. కేసరి, మరాఠా; 9. జనరల్ ఓ డయ్యర్; 10. ఎ.ఓ.హ్యూమ్; 11. దాదాభాయ్ నౌరోజీ; 12. 1942; 13. ఎ.ఓ.హ్యూమ్; 14. ఇండియన్ నేషనల్ ఆర్మీ (భారతీయ సైన్యం); 15. తిలక్, అనిబిసెంట్; 16. అమృత్సర్; 17. లార్డకర్జన్; 18. 1905; 19. మదర్ లాండ్; 20. మహదేవ్ గోవింద రనడే; 21. 1885; 22. అడయార్; 23. చిత్తరంజన్‌దాస్; 24. దండి; 25. లండన్; 26. 1931; 27. పూనా; 28. 1906; 29. ఐర్లాండ్; 30. మౌంట్‌బాటన్; 31. గోపాల కృష్ణ గోఖలే; 32. వందేమాతరం; 33. సుబ్రమణ్య అయ్యర్; 34. పోర్చగీస్; 35. ఫ్రెంచివారు, పోర్చగీస్; 36. పీసీ రాయ్; 37. సుభాష్ చంద్రబోస్; 38. మెక్‌డోనాల్డ్; 39. 1919; 40. 1950. ముఖ్య ప్రశ్నలు 4 మార్కులు 1.భారతదేశ స్వాతంత్య్రోదమ్యంలో గాంధీ పాత్రను వివరించండి? 2.వందేమాతరం ఉద్యమం ప్రాముఖ్యతను తెలపండి? 3.సహాయ నిరాకరణోద్యమం గురించి రాయండి? 4.భారతదేశంలో జాతీయ చైతన్యం పెంపొందడానికి దోహదం చేసిన అంశాలను పేర్కొనండి? 2 మార్కులు 1.క్విట్ ఇండియా ఉద్యమం గురించి రాయండి? 2.సైమన్ కమిషన్ అంటే ఏమిటి? 3.ఉప్పుసత్యాగ్రహం గురించి రాయండి? 4.డ్రైన్ సిద్ధాంతం అంటే ఏమిటి? 1 మార్కు 1.తీన్‌కథియా పద్ధతి అంటే ఏమిటి? 2.రక్షక కవాట సిద్ధాంతం అంటే ఏమిటి? 3.మితవాదుల విధానం ఏమిటి? 4.రౌలత్ చట్టం గురించి తెలపండి? 5.బెంగాల్ విభజన ఎందుకు జరిగింది? పౌరశాస్త్రం ఒక జాతిగా భారతదేశం 1.ప్రపంచంలోని పెద్ద భాషల్లో తెలుగు భాష ____ స్థానంలో ఉంది. 2.మన దేశంలో 22 భాషలను____ భాషలుగా గుర్తించారు. 3.ప్రస్తుతం మనదేశంలో____రాష్ట్రాలున్నాయి. 4.భారత రాజ్యాంగాన్ని____ సంవత్సరంలో రూపొందించారు. 5.ప్రాథమిక హక్కులను రక్షించే హక్కు ____. 6.భారతీయుడు తన ఓటుహక్కును ____ వయసు నుంచి పొందుతాడు. 7.చట్టం ముందు ప్రతివ్యక్తిని సమానంగా చూస్తే ఆ పరిపాలనను ____ పాలన అంటారు. 8.మత వ్యవహారాల నుంచి రాజ్యాన్ని వేరు చేయడాన్ని____ అంటారు. 9.సామాజిక న్యాయం పెంపొందించడానికి ____ తోడ్పడతాయి. 10.భారతదేశంలో జాతీయ సమైక్యతా ప్రక్రియను ప్రతిబింబించే నినాదం____. 11.ప్రాచీన భారతదేశంలో ప్రజలంతా సమానులనే భావనను ప్రబోధించిన మతం____. 12.ఐఏఎస్ అంటే____. 13.ఐపీఎస్ అంటే ____. 14.భారత రాజ్యాంగం ____ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. 15.మన జాతీయ అధికార భాష____. 16.మన దేశంలో సుమారుగా ____ కులాలున్నాయి. 17.మనదేశంలో____ భాషలు మాట్లాడతారు. 18.అస్పృశ్యతను ఆచరించడం____. సమాధానాలు 1. 16వ; 2. శాసనబద్ధమైన; 3. 28; 4. 1949; 5. రాజ్యాంగ పరిహార హక్కు; 6. 18 ఏళ్లు; 7. సమన్యాయ; 8. లౌకిక వాదం; 9. రిజర్వేషన్లు; 10. భిన్నత్వంలో ఏకత్వం; 11. బౌద్ధమతం; 12. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్; 13. ఇండియన్ పోలీస్ సర్వీస్; 14. 1950; 15. హిందీ; 16. 6,748; 17. 1,652; 18. నేరం. ముఖ్య ప్రశ్నలు 4 మార్కులు 1.భారతదేశం వివిధ సంస్కృతుల సమాజం అని నీవెట్లా చెప్పగలవు? 2.లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికత్వ భావనలోని ముఖ్య భావనలను తెలపండి? 3.సామాజిక న్యాయం అంటే ఏమిటి? సామాజిక న్యాయసాధనకు మనదేశం చేపట్టిన చర్యలేవి? 2 మార్కులు 1.భారత రాజ్యాంగం గుర్తించిన భాషలేవి? 2.సమాఖ్యవాదం అంటే ఏమిటి? 3.రాజకీయ పక్షాలు జాతీయ సమైక్యతను ఎలా పెంపొందిస్తాయి? 1 మార్కు 1.ఐఏఎస్ అంటే ఏమిటి? 2.గణతంత్ర దేశం అంటే ఏమిటి? 3.భారతదేశం విశ్వసించిన ఆదర్శాలేవి? భారతీయ ప్రజాస్వామ్యం 1.డెమోక్రసీ అనే పదం ____ పదం నుంచి వచ్చింది. 2.ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం గలవారు____. 3.ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వ రూపం ____. 4.‘ప్రజలచేత, ప్రజల యొక్క, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం’ అన్న మహానీయుడు____. 5.ఎలక్టోరేట్ అంటే ____. 6.వయోజన ఓటింగ్ హక్కు అంటే ____ హక్కు. 7.ఓటర్ల జాబితా అంటే ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులైన పట్టిక____. 8.ప్రజాప్రతినిధులు ఏదైనా అధికార పదవికి ఒక వ్యక్తిని ఎంపిక చేస్తే ఆ ఎన్నికను ____ఎన్నిక అంటారు. 9.లోక్‌సభకు పోటీచేయడానికి అభ్యర్థులకు ఉండాల్సిన కనీస వయసు____. 10.ఒక నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించే అధికారి____. 11.పోలింగ్ కేంద్రాన్ని____ అధికారి నిర్వహిస్తాడు. 12.మనదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం-____. 13.అనుచిత ప్రవర్తనల ద్వారా ఓట్లను సంపాదించడాన్ని ____ నేరంగా పరిగణిస్తారు. 14.భారతదేశంలో____ప్రభుత్వ వ్యవస్థ ఉంది. 15.రాజ్యాంగంలోని ____ అధికరణ వయోజన ఓటుహక్కు గురించి తెలుపుతుంది. 16.పార్లమెంట్ ఎగువసభను ____ అని కూడా పిలుస్తారు. 17.గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీలను ____ సంస్థలు అని అంటారు. 18.లోక్‌సభ సభ్యుల పదవీకాలం____-. 19.మనదేశంలో ఎన్నికలు నిర్వహించే సంస్థ____. 20.రాజ్యసభ సభ్యులు ____ పద్ధతిలో ఎన్నికవుతారు. 21.ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్-____. 22.భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం____ లో ఉంది. 23.లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య ____. 24.లోక్‌సభకు సాధారణంగా ____ ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. 25.మనదేశంలో మొదటిసారిగా ____ సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. సమాధానాలు 1. గ్రీకు; 2. ప్రజలు; 3. ప్రాతినిధ్య ప్రభుత్వం; 4. అబ్రహాం లింకన్; 5. ఓటర్ల సముదాయం; 6. ఓటు; 7. ఓటర్ల; 8. పరోక్ష; 9. 25; 10. రిటర్నింగ్ అధికారి; 11. ప్రిసైడింగ్; 12. 1952; 13. ఎన్నికల; 14. పార్లమెంటరీ; 15. 326; 16. రాజ్యసభ; 17. స్థానిక; 18. ఐదేళ్లు; 19. ఎన్నికల సంఘం; 20. పరోక్ష; 21. వి.ఎస్.సంపత్; 22. ఢిల్లీ; 23. 545; 24. ఐదేళ్లకు; 25. 1884 ముఖ్య ప్రశ్నలు 4 మార్కులు 1.ప్రజాస్వామ్య ప్రాతిపదిక సూత్రాలు తెలపండి? 2.భారతదేశంలో సాధారణ ఎన్నికల గురించి రాయండి? 3.భారత ఎన్నికల సంఘం నిర్వహించే విధులను వివరించండి? 2 మార్కులు 1.సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు అంటే ఏమిటి? 2.ప్రజాస్వామ్యం అంటే ఏమిటో వివరించండి? 3.ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల మధ్య భేదాలు రాయండి? 4.ఎన్నికల్లో అనుచిత ప్రవర్తనలేవి? 5.సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికల మధ్య భేదాలేవి? 1 మార్కు 1.ప్రజాస్వామ్యానికి అబ్రహం లింకన్ చెప్పిన నిర్వచనమేమిటి? 2.రాజకీయ పార్టీ అంటే ఏమిటి? 3.మన రాష్ర్టంలోని ప్రాంతీయ పార్టీలను తెలపండి? 4.లోక్‌సభ అంటే ఏమిటి? నేడు మనదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు 1.జాతీయ అక్షరాస్యతా ప్రచార దళాన్ని స్థాపించిన సంవత్సరం ____. 2.ఆంధ్రరాష్ర్టం అవతరించిన సంవత్సరం____. 3.వరకట్న నిషేధ చట్టం చేసిన సంవత్సరం____. 4.బాలికల కనీస వివాహ వయసు ____. 5.రాజ్యాంగంలోని ____ అధికరణం చిన్న పిల్లలను కఠినమైన పనుల నుంచి రక్షించమని నిర్దేశించింది. 6.జీవించే హక్కును ఇచ్చిన ప్రాథమిక హక్కు____. 7.అకారణంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయించడానికి అవకాశం కల్పించే రిట్ ____. 8.అత్యధిక అక్షరాస్యత గల రాష్ర్టం ____, అత్యల్ప అక్షరాస్యత గల రాష్ర్టం ____. 9.రాజ్యాంగంలోని ____ ప్రకరణ అల్ప సంఖ్యాక వర్గాలవారు తమ భాషను, మత సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును ప్రసాదించింది. 10.రాజ్యాంగంలోని 30వ అధికరణ ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాలు తమ మతం, భాషల ప్రాతిపదికపై ____ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. 11.____చట్టంలో మొదటి సారిగా షెడ్యూల్డ్ కులాలు అనే పదాన్ని ఉపయోగించారు. 12.గాంధీజీ అస్పృశ్యతను ఒక____గా అభివర్ణించారు. 13.మన రాజ్యాంగంలోని ____ అధికరణ అస్పృశ్యతను నిషేధించింది. 14.తప్పుడు పద్ధతుల ద్వారా డబ్బు సంపాదించడాన్ని ____ అంటారు. 15.రాజ్యాంగంలోని ____ అధికరణ జీవించే హక్కును ప్రజలకు ప్రసాదించింది. 16.____ -సంవత్సరంలో జాతీయ బాలల విధానాన్ని రూపొందించారు. 17.‘అందరికీ విద్య’ అనే ప్రభుత్వ పత్రాన్ని ____ సంవత్సరంలో ప్రకటించారు. 18.పౌరులహక్కుల్లో అతి ప్రధానమైన హక్కు ____. 19.అవినీతి నిరోధక చట్టం ____ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. 20.ఆంధ్రప్రదేశ్ అవతరించిన సంవత్సరం ____. సమాధానాలు 1. 1988; 2. 1953; 3. 1961; 4. 18సంవత్సరాలు; 5. 24వ; 6. స్వేచ్ఛాహక్కు; 7. హెబియస్ కార్పస్ రిట్; 8. కేరళ, బీహార్; 9. 29వ; 10. విద్యా; 11. 1935; 12. పాపం; 13. 17వ; 14. లంచగొండితనం; 15. 21వ; 16. 1974; 17. 1990; 18. జీవించే హక్కు; 19. 1988; 20. 1956. ముఖ్య ప్రశ్నలు 4 మార్కులు 1.షెడ్యూల్డ్ జాతులు, తెగల వారి స్థితిగతులు మెరుగుపర్చుకోవడానికి తీసుకోవాల్సిన చర్య లేవి? 2.బాలల సంక్షేమం కోసం చేసిన చట్టాలు, వారి హక్కులు, సంక్షేమ చర్యల గురించి తెలపండి? 3.మనదేశంలో స్త్రీల భవిష్యత్ చిత్రాన్ని వివరించండి? 2 మార్కులు 1.స్వేచ్ఛా హక్కులోని ఆరు ప్రధాన హక్కులేవి? 2.మాదకద్రవ్యాలకు బానిస కావడం వల్ల కలిగే ప్రమాదాలేవి? 3.జీవించేహక్కు అంటే ఏమిటి? 1 మార్కు 1.మతతత్వం అంటే ఏమిటి? 2.కులతత్వం అంటే ఏమిటి? 3.నేరతత్వం వల్ల కలిగే సమస్యలు తెలపండి? 4.పనిచేసే స్త్రీలు అనగా ఎవరు? 5.అస్పృశ్యత అంటే ఏమిటి? భారతదేశం - ఐక్యరాజ్యసమితి - ప్రపంచ సమస్యలు 1.బంగ్లాదేశ్ ఏర్పడిన సంవత్సరం____. 2.భారతదేశం ఇండో-సోవియట్ ఒప్పందంపై సంతకాలు చేసిన సంవత్సరం____. 3.ఎన్పీటీ అంటే ____. 4.సీటీబీటీ అంటే -____. 5.కొంతకాలం జాతి వివక్షతను అనుసరించిన ఆఫ్రికన్ దేశం____. 6.భారత్, చైనాల మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం____. 7.సార్‌కకు రూపకల్పనకు సమావేశం జరిగిన స్థలం____. 8.సార్క అంటే____. 9.ఐక్యరాజ్యసమితి ప్రకటన పత్రాన్ని రూపొందించిన నగరం____. 10.ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించిన తేదీ-____. 11.అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీకాలం ____. 12.భారతదేశంలోని అడవులు, ప్రపంచంలోని అడవుల వైశాల్యంలో ____ మాత్రమే. 13.క్రీ.శ. 1997లో ఐక్యరాజ్యసమితి ఉన్నత ప్రధాన కార్యదర్శి ____. 14.ప్రస్తుత యూఎన్వో ప్రధాన కార్యదర్శి ____. 15.ఐబీఆర్డీ అంటే ____. 16.ఐఎంఎఫ్ అంటే ____. 17.ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలు ____. 18.ూ్ఖఇఖీఅఈ అంటే ____. 19.నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రతిపాదించిన సమావేశం____ నగరంలో జరిగింది. 20.విల్లీ బ్రాంటో కమిుషన్ నివేదిక వెలువడిన సంవత్సరం ____. 21.అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటన జరిగిన సంవత్సరం____. 22.టిబెట్ బౌద్ధమత నాయకుడు ____. 23.సార్కదేశాలు తమ ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని ____ దేశంలో ఏర్పాటు చేశాయి. 24.అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్య____. 25.____ వాయువులు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. 26.ఐక్యరాజ్యసమితి ప్రధాన అంశాల్లో ఒక్కటైన ____కి వీటో అధికారం ఉంది. 27.ఐబీఆర్డీని ____ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. 28.భారత మొదటి ప్రధానమంత్రి ____. 29.యూఎన్వో ప్రధాన కార్యాలయం ____ నగరంలో ఉంది. 30.బ్రిటిష్ పాలనలోని వలస రాజ్యాల కూటమిని ____ అని పిలుస్తారు. 31.సార్క ఏర్పడిన సంవత్సరం ____. 32.సార్క దేశాల వ్యవసాయ సమాచార కేంద్రం ____ దేశంలో ఉంది. 33.అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ____ నగరంలో ఉంది. 34.యూఎన్వో భద్రతామండలిలోని సభ్య దేశాల సంఖ్య____. 35.అంతర్జాతీయ మానవ హక్కుల దినాన్ని____ తేదీన జరుపుకుంటారు. 36.ప్రస్తుతం యూఎన్వో సభ్యదేశాల సంఖ్య ____. 37.యూఎన్వోలో జాతి వివక్ష (అపార్థీడ్) విధానానికి వ్యతిరేకంగా గళం విప్పిన మొదటి దేశం ____. 38.ఎన్ఐఈవో అంటే____. సమాధానాలు 1. 1971; 2. 1971; 3. (నాన్-ప్రోలిఫిరేషన్ ట్రీటీ/అణ్వస్త్ర నిర్మూలన ఒప్పందం; 4. కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ/ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం; 5. దక్షిణాఫ్రికా; 6. 1962; 7. ఢాకా; 8. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి; 9. శాన్ఫ్రాన్సిస్కో; 10. 24.10.1945; 11. 9 సంవత్సరాలు; 12. 1 శాతం; 13. కోఫీ అన్నన్; 14. బాన్ -కీ-మూన్; 15. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్; 16. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్/అంతర్జాతీయ ద్రవ్య నిధి; 17. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స, చైనా; 18. ఐక్యరాజ్యసమితి వాణిజ్యాభివృద్ధి మండలి; 19. అల్జీర్స; 20. 1980; 21. 1948; 22. దలైలామా; 23. భారతదేశం; 24. 15; 25.గ్రీన్హౌస్; 26. భద్రతామండలి; 27. ప్రపంచ; 28. జవహర్లాల్ నెహ్రూ; 29. న్యూయార్క; 30. కామన్వెల్త్ దేశాలు; 31. 1985; 32. బంగ్లాదేశ్; 33. దిహేగ్; 34. 15; 35. డిసెంబర్, 10వ; 36. 193; 37. భారత్; 38. నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ముఖ్య ప్రశ్నలు 4 మార్కులు 1.నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి? 2.పర్యావరణ కాలుష్యం, సమతౌల్యతా క్షీణతల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలేవి? 3.భారతదేశం అలీన విధానాన్ని ఎందుకు ఎంపిక చేసుకుందో వివరించండి? 2 మార్కులు 1.భారత విదేశాంగ విధాన మూల సూత్రాలేవి? 2.సార్క ఉద్దేశాలు ఏమిటి? 3.యూఎన్వోలోని ప్రధాన అంగాలేవి? 4.యూఎన్వో సాధారణ సభ విధులను తెలపండి? 5.యుఎన్వో అశయాలేమిటి? 6.పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలేమిటి? 1 మార్కు 1.పంచశీల అంటే ఏమిటి? 2.కామన్వెల్త్ అంటే ఏమిటి? 3.వీటో అధికారం అంటే ఏమిటి? 4.మూడో ప్రపంచ దేశాలు అంటే ఏమిటి? 5.అలీన విధానం అంటే -
సృజనాత్మకత, నవకల్పన.. ఉజ్వల కెరీర్‌కు సోపానాలు
ఇంజనీరింగ్‌లో చేరిన ప్రతి విద్యార్థి ‘ఐ యామ్ ఇంజనీర్’ అనే ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. పుస్తక పరిజ్ఞానంతో పాటు అనుభవాల సారం ద్వారా నేర్చుకున్న వారే నిజమైన ఇంజనీర్లు.. నవకల్పన ( Innovation ), సృజనాత్మకత (Creativity).. ఈ రెండూ కెరీర్లోనూ, జీవిత గమనంలోనూ ముందుకు నడిపించే అద్భుత సాధనాలని, వాటిని సొంతం చేసుకునే దిశగా ఆలోచనలు సాగాలంటున్నారు ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) అసోసియేట్ డెరైక్టర్ జి.పద్మనాభం... ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించడం నా వల్ల కాదనే తత్వం ఇంజనీర్లలో ఉండకూడదు. తమదైన ఆలోచనతో ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనే దిశగా ఆలోచనలు సాగాలి. ప్రపంచ స్థితిగతులను మార్చగల మేధా సంపత్తిని తరగతి గదిలోనే సముపార్జించుకునేందుకు ప్రయత్నించాలి. కేవలం మెదడుకే కాదు.. చేతులకూ పనిచెప్పాలి. ఆలోచనల్ని, ఆచరణలకు చేరువచేయాలి. ఉదాహరణకు ఇంట్లో తిరిగే ఫ్యాన్‌ను గమనించండి.. అది తిరగాలంటే ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి.. పైన ఉన్న గాలిని కిందకు దింపాలి. దీనికి ఏరో డైనమిక్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. రెక్కలు తేలిగ్గా ఉండాలి కాబట్టి వీటి రూపకల్పనకు తగిన మెటీరియల్ వాడుతారు. అది అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండాలి. ఫ్యాన్ తిరిగేందుకు మోటార్, బిగించేందుకు హుక్ కావాలి. ఇలా ఇప్పుడున్న ఫ్యాన్లలో ఉపయోగించిన పరిజ్ఞానాన్ని పరిశీలించి, కొత్త ఆలోచనల దిశగా వెళ్తే మరింత మెరుగైన సామర్థ్యం గల ఫ్యాన్లను ఆవిష్కరించిన వారవుతారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం: విద్యార్జన అంటే కేవలం పుస్తక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవడమే కాదు.. అనుభవాల ద్వారా నేర్చుకున్న వారే నిజమైన ఇంజనీర్లు.. ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థులు అధిక సమయాన్ని తరగతిగదికే కేటాయిస్తున్నారు. ప్రాక్టికల్స్ తక్కువగా ఉంటున్నాయి. జర్మనీలో ఇంజనీరింగ్ కోర్సు ఐదున్నరేళ్లు ఉంటుంది. కోర్సు పూర్తయ్యే సరికి ఒక్కో విద్యార్థి ఒక్కో ప్రాజెక్టుతో కళాశాల నుంచి బయటకొస్తాడు. ఇంజనీరింగ్ విద్యార్థులకు తరగతి గది పరిజ్ఞానంతో పాటు అక్కడ నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్స్‌గా చేసి, నేర్చుకోవడం చాలా అవసరం. విద్యార్థులు విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. నవకల్పన, సృజనాత్మకత.. ఈ రెండూ కెరీర్లో, జీవితంలో మిమ్మల్ని ముందుకు నడిపించే అద్భుత సాధనాలు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని తెలుసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించొచ్చు. రాబోయేది ‘టెక్’ యుగం: రాబోయే రోజుల్లో అపారమైన అవకాశాలున్న విభాగం మెకానికల్ ఇంజనీరింగ్. ఏ పరిశ్రమ నడవాలన్నా యంత్రాలు కావాల్సిందే. మెషిన్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, థర్మల్ ఇంజనీరింగ్‌తోపాటు ఐటీ రంగంలోనూ మెకానికల్ ఇంజనీర్లకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. పరిశోధనల్లోనూ పెద్దపీట: ఇంజనీరింగ్ పూర్త్తిచేయాలి.. అధిక వేతనాలు వచ్చే కొలువుల్లో కుదురుకోవాలి.. అనే ఒక్క కోణం నుంచే కాకుండా ఔత్సాహికులు పరిశోధన రంగం వైపు కూడా వెళ్లొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులు చదివిన వారితో పాటు వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఖ-ఈ) దిశగా అడుగులు వేయొచ్చు. దీనికి కావాల్సింది ఓర్పు. సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు సాధించాలన్న తపన ఉండాలి. కొత్తగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఓ విద్యార్థి కొన్ని నెలల పాటు కష్టపడి పనిచేసిన ప్రాజెక్టు విఫలమవొచ్చు. అలాంటి పరిస్థితిలో కుంగిపోకూడదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ఒత్తిడిని తట్టుకొని నిలబడగలగాలి. ఇంటర్న్‌షిప్ అవకాశం: ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ).. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వేసవి ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పిస్తోంది. ప్రాజెక్టు అవసరాలకు తగినట్లు మెటీరియల్ రీసెర్చ్‌కు సహాయపడుతున్నాం. విద్యార్థుల మినీ ప్రాజెక్టులకు సంస్థ శాస్త్రవేత్తలు సహాయసహకారాలు అందిస్తున్నారు. మెటీరియల్ ప్రాసెస్, కోటింగ్, షేపింగ్ తదితర అంశాల్లో వేసవి సెలవుల్లో ఆరు వారాల పాటు ఇంటర్న్‌షిప్ అందిస్తున్నాం. ఇంజనీరింగ్‌లో 70 శాతం మార్కులుంటే రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
కస్టమ్స్ ఆఫీసర్ కావాలంటే?
టెక్నాలజీ సంబంధిత మేనేజ్మెంట్ కోర్సుల వివరాలు తెలియజేయండి? - శ్రావణ్, తెనాలి. ఐఐఎం అహ్మదాబాద్.. కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గ్రూప్ ఎలక్టివ్‌గా పీజీపీ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.iimahd.ernet.in ఐఐఎం, బెంగళూరు.. సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్లో పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను అందిస్తోంది. వెబ్సైట్: www.iimb.ernet.in ఐఐఎం, కోజికోడ్.. ఐటీ అండ్ సిస్టమ్స్ ఎలక్టివ్‌గా ఎంజీపీ ప్రోగ్రాంను అందిస్తోంది. వెబ్సైట్:www.iimk.ac.in ఐఐఎం, కోల్‌కతా.. కంప్యూటర్ ఎయిడెడ్ మేనేజ్మెంట్లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్:www.iimcal.ac.in ఐఐఎం, లక్నో.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ ఎలక్టివ్‌గా పీజీపీ మేనేజ్మెంట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.iiml.ac.in అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుండాలి. క్యాట్ స్కోర్, జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. శైలేష్ జె.మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐటీ బాంబే.. ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్టివ్స్తో మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఇంజనీరింగ్ లేదా సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ. వెబ్సైట్: www.som.iitb.ac.in ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. టెక్నాలజీ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత: కనీసం 45 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. ఐసెట్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్:www.osmania.ac.in ఎంఎస్ రామయ్య స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్, బెంగళూరు.. ఇంజనీరింగ్ ఆపరేషన్స్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఈ, ఎంకామ్, ఎంఎస్సీ, బీబీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ. అకడమిక్ మెరిట్, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.msrsas.org ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.fms.edu మైనింగ్ అండ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సు వివరాలు తెలియజేయండి? - రఘు, ఖమ్మం. మైనింగ్ అండ్ మెషినరీ ఇంజనీరింగ్‌ను ఇంజనీరింగ్‌లో ఉన్నత స్పెషలైజేషన్‌గా చెప్పుకోవచ్చు. ఇది గనుల్లో ఉపయోగించే యంత్రాలకు సంబంధించిన మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంశాలను వివరిస్తుంది. ఖనిజాల వెలికితీత, శుద్ధి ప్రక్రియలలో ఉపయోగపడే యంత్ర సామగ్రికి సంబంధించిన అంశాలను కోర్సులో భాగంగా బోధిస్తారు. ఈ కోర్సు కరిక్యులంలో మైనింగ్ మెథడ్స్ అండ్ మెషినరీ; మెకానిక్స్; ప్లానింగ్; మైన్ డెవలప్మెంట్; జియో మెకానిక్స్ అండ్ గ్రౌండ్ కంట్రోల్; అండర్‌గ్రౌండ్ హజార్డ్స్ అండ్ సర్ఫేస్ ఎన్విరాన్మెంట్; సర్వేయింగ్; మైన్ ప్లానింగ్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ అంశాలుంటాయి. కోర్సు వివరాలు: ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం), ధన్‌బాద్.. మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్ కోర్సులను అందిస్తోంది. బీటెక్ కోర్సుకు అర్హత 10+2. ఐఐటీ-జేఈఈలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. సంబంధిత అంశంలో బీటెక్ పూర్తిచేసినవారు ఎంటెక్ కోర్సులో చేరేందుకు అర్హులు. ఎంట్రన్స్/ గేట్లో ప్రతిభ ఆధారంగా ఎంటెక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వెబ్సైట్: www.ismdhanbad.ac.in కెరీర్: కోర్సు పూర్తిచేసినవారు మైనింగ్ ఇంజనీర్, జియోలాజికల్ ఇంజనీర్, మైనింగ్ మెషీన్ ఆపరేటర్, మైనింగ్ సూపర్వైజర్, ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ సేఫ్టీ మేనేజర్, మినరల్ సేల్స్ ఆఫీసర్ వంటి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. మైనింగ్‌తో సంబంధమున్న ప్రభు త్వ, ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, ఆర్సిలర్ మిట్టల్, కెయిర్న్ ఎనర్జీ,ఆదాని మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను టాప్ రిక్రూటర్లుగా చెప్పుకోవచ్చు. కస్టమ్స్ ఆఫీసర్‌గా కెరీర్‌ను ప్రారంభించాలనుకుంటున్నాను. దీనికి ఏం చేయాలి? -మధు, హైదరాబాద్. కస్టమ్స్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)కు ఎంపిక కావాలి. ఈ సర్వీస్‌లో ఇన్‌కం ట్యాక్స్, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ విభాగాలుంటాయి. దేశంలోకి వచ్చే వస్తువులపై పన్ను అంశాలు కస్టమ్స్ కిందకు వస్తాయి. దేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల పన్ను అంశాలు ఎక్సైజ్‌కు సంబంధించినవి. ఐఆర్ఎస్కు ఎంపిక కావాలంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాయాలి. సివిల్స్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తుంది. గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు ఈ పరీక్ష రాయొచ్చు. ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసులతో పాటు ఐఆర్ఎస్ సర్వీస్‌కు కూడా అధికారులను ఎంపిక చేస్తారు. సివిల్స్ పరీక్ష మూడు దశలుగా ఉంటుంది. 1. సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CSAT). 2. మెయిన్స్ ఎగ్జామినేషన్ 3. పర్సనాలిటీ టెస్ట్. వెబ్సైట్: www.upsc.gov.in -
క్విక్ రివ్యూ..
భూగోళ శాస్త్రం మెక్‌మోహన్ రేఖ: భారత్, చైనాల మధ్య గల సరిహద్దు రేఖ. భారతదేశం.. ఉత్తరం నుంచి దక్షిణంగా 3,200 కి.మీ. పొడవు; తూర్పు నుంచి పశ్చిమగా 3,000 కి.మీ. వెడల్పుతో వ్యాపించి ఉంది. ఉపఖండం: సాధారణ ఖండానికి ఉండే విశిష్ట లక్షణాలున్న ప్రాంతం. భారత సరిహద్దు ప్రాంతంలోని చిట్టచివరి ప్రదేశాలు: ఉత్తరం: హిమాలయ పర్వతాలు దక్షిణం: కన్యాకుమారి (తమిళనాడు) పశ్చిమం: రాణ్ఆఫ్కచ్ (గుజరాత్) తూర్పు: మయన్మార్, చైనా కనుమ: పర్వతశ్రేణుల్లో రాకపోకలకు వీలుగా ఏర్పడిన సన్నని సహజ మార్గం. ఉదా: కైబర్, కారకోరం, షిప్కిలో. డూన్: హిమాచల్ పర్వతాలను, శివాలిక్ కొండలను వేరుచేస్తూ వరుసగా ఉన్న సన్నని, సమతలం ఉన్న దైర్ఘ్యలోయ. ఉదా: డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లిడూన్. భాబర్: గులకరాళ్లతో ఏర్పడిన సచ్ఛిద్ర మండలం. రే/ కల్లార్: శుష్క ప్రదేశాల్లోని చవుడు, లవణీయ, స్ఫటికీయ భూభాగం. బృహత్ మైదానాల్లో గల ప్రధాన నదీ వ్యవస్థలు: 1. గంగానదీ వ్యవస్థ. 2. సింధు నదీ వ్యవస్థ. 3. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. టెరాయి: గులకరాళ్లతో కూడిన భాబర్ మండలం కిందుగా ప్రవహించే హిమాలయ నదులు తిరిగి ఉపరితలానికి వచ్చి, ప్రవహించడం వల్ల ఏర్పడే చిత్తడి ప్రదేశం. రుతుపవనాలు: భారత ఉపఖండం, హిందూ మహాసముద్రాల మధ్య రుతువులను అనుసరించి పవనాలు వీయడాన్ని, వెనుకకు మరలడాన్ని రుతుపవనాలు అంటారు. ఖండాంతర్గత శీతోష్ణస్థితి: తీర ప్రాంతం నుంచి భూబాగానికి ఎక్కువ దూరం వెళ్తే తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉండే స్థితి. మృత్తికలు 6 రకాలు: 1. ఒండ్రు 2. నల్లరేగడి 3. ఎర్ర 4. లాటరైట్ 5. పర్వత 6. ఎడారి మృత్తికలు. జనసాంద్రత: సగటున ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో నివసించే జనసంఖ్య అధిక గ్రామీణ జనాభా: అధిక గ్రామీణ జనాభా హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంటే, అధిక నగర జనాభా మహారాష్ట్రలో ఉంది. బహుళార్థ సాధక పథకం: నీటిపారుదల, విద్యుదుత్పాదన,వరద నియంత్రణం,నౌకాయానాభివృద్ధి, మత్స్య అభివృద్ధి వంటి బహుళ ప్రయోజనాలను ఆశించి, నదులపై నిర్మించిన ఆనకట్టలతో కూడిన నదీలోయ పథకం. జీవకాలువలు: నదికి అడ్డంగా ఆనకట్టను నిర్మించడం వల్ల ఆ నది నీరు సంవత్సరమంతా ప్రవహించడానికి వీలున్న కాలువలు. వరద కాలువలు: వర్షాకాలపు వరదనీటిపై పూర్తిగా ఆధారపడి ఉండే కాలువలు. జల విద్యుచ్ఛక్తి: ఆనకట్టలపై నుంచి వేగంగా జాలువారే నీటి శక్తిద్వారా టర్బైన్లను తిప్పడం వల్ల విడుదలయ్యే విద్యుత్. వాణిజ్య పంటలు: జీవనానికే కాక అధిక లాభార్జనకై పండించే పంటలు. ముఖ్యమైన వాణిజ్య పంటలు: పత్తి, జనుము, తేయాకు, కాఫీ, చెరకు, రబ్బరు, పొగాకు మొదలైనవి. వివిధ వ్యవసాయ అభివృద్ధి పథకాలు: 1.కమ్యూనిటీ అభివృద్ధి పథకం (కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ -ఇఈ్క) 2.చిన్నరైతుల అభివృద్ధి సంస్థ (స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ -ఎస్.ఎఫ్.డి.ఎ) 3.సాంద్ర వ్యవసాయ అభివృద్ధి పథకం (ఐఅఈ్క) 4.సాంద్ర వ్యవసాయ ప్రాంత పథకం (ఐఅఅ్క) హరిత విప్లవం: పంటల ఉత్పత్తుల పెరుగుదలకు అవసరమైన అధిక దిగుబడినిచ్చే పంట రకాలను అభివృద్ధి చేయటం కోసం నిర్దిష్టమైన పంట మొక్కలను పెంచడం. ఖనిజాలు నాలుగు రకాలు: లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఖనిజాలు. సంప్రదాయ శక్తివనరులకు భిన్నమైన మార్గాల ద్వారా శక్తి సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రతిస్థాపక యోగ్యశక్తి అభివృద్ధి సంస్థ (IREDA)ను 1987లో స్థాపించారు. దేశంలో ఉపయోగించినా, ఎగుమతి చేసేందుకు మిగులుగా ఉన్న ఖనిజాలు: ఇనుప ధాతువు, మాంగనీస్, అభ్రకం మొదలైనవి. దేశంలో స్వయం సమృద్ధికి సరిపడు ఖనిజాలు: బొగ్గు, అల్యూమినియం, పాలరాయి, సున్నపురాయి. దేశంలో కొరతగా ఉన్న, ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న ఖనిజాలు: పెట్రోలియం, రాగి, వెండి, జింక్ మొదలైనవి. పారిశ్రామిక ప్రాంతం: ఒక పరిశ్రమ భారీగా లేదా వివిధ రకాల పరిశ్రమలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైన ప్రాంతం. ఇనుము, ఉక్కు పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలు: ఇనుప ఖనిజం, మాంగనీస్, క్రోమైట్, కోకింగ్ బొగ్గు, సున్నపురాయి లేదా డోలమైట్. రోడ్డు మార్గాలు 4 రకాలు: జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామ పంచాయతీ రహదారులు. మన దేశంలోని ముఖ్యమైన ప్రసార సాధనాలు: తపాలా, టెలిగ్రాఫ్, టెలిఫోన్, వైర్లెస్ ఫోన్, ఫ్యాక్స్, ఎలక్ట్రానిక్ మెయిల్. భారతీయ రైల్వేలు ఎదుర్కొంటున్న సవాళ్లు: విద్యుదీకరణ, గేజ్ మార్పిడి. అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాలు: ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, తిరువనంతపురం, హైదరాబాద్. నౌకాశ్రయం: ఎగుమతులు, దిగుమతులకు వీల్లేకుండా నౌకలు వచ్చి ఆగడానికి మాత్రమే సౌకర్యం ఉండే ప్రదేశం. ఓడరేవు: సముద్రాల నుంచి భూభాగాన్ని, భూభాగం నుంచి సముద్రాలను కలిపే ముఖద్వారం. ఇది సరుకుల ఎగుమతి, దిగుమతులకు వీలుగా ఉంటుంది. విదేశీ వాణిజ్యం: ఒక దేశం ఇతర దేశాలతో చేసే వాణిజ్యం. విదేశీ వాణిజ్య సరళి: విదేశీ వాణిజ్యంలో ఎగుమతుల గమ్యాన్ని, దిగుమతుల ఆరంభాన్ని తెలియజేసే విధానం. అటవీ ఆధార పరిశ్రమలు: అటవీ ఉత్పత్తులపై ఆధారపడి పనిచేసే పరిశ్రమలు. ఉదా: కాగితం, బీడీలు,అగ్గిపెట్టెలు, రంగులు. చరిత్ర రెడ్‌షర్‌ట్స దళం: ఇటలీ ఏకీకరణకు గారిబాల్డి 1000 మంది విప్లవ సైనికులతో ఏర్పాటు చేసిన దళం. కార్బోనరీ: నేపుల్స్(ఇటలీ)లో ప్రారంభమై, ఇటలీ అంతటా వ్యాపించిన మొట్టమొదటి రహస్య విప్లవ సంఘం. యంగ్ ఇటలీ: ఇటలీలో జోసెఫ్ మజ్జీని ఏర్పాటు చేసిన రహస్య విప్లవ సంఘం. రిసోర్జిమెంట్: ఇటలీలో కౌంట్కవూర్ ప్రారంభించిన వార్తాపత్రిక. బిస్మార్‌క విధానం: క్రూరమైన బలప్రయోగం (బ్లడ్ అండ్ ఐరన్). పారిస్ కమ్యూన్ ఫ్రాన్స (క్రీ.శ. 1871): ప్రపంచంలో ఏర్పాటైన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం. దీన్ని ఫ్రెంచ్ సైన్యం తీవ్రంగా అణిచివేసింది. ప్రథమ ఇంటర్నేషనల్ క్రీ.శ. 1864: ప్రపంచ కార్మికులను ఏకం చేయడానికి కారల్ మార్క్స లండన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ శ్రామికుల సమావేశం. కారల్ మార్క్స రచనలు: కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ కాపిటల్. ఏమ్స్ టెలిగ్రామ్: బిస్మార్‌క (ప్రష్యా ప్రధానమంత్రి) తమ రాజు ఏమ్స్ నగరం నుంచి పంపిన ఈ టెలిగ్రామ్‌ను ఉద్దేశపూర్వకంగానే మార్చి నెపోలియన్-3 (ఫ్రాన్స)పై యుద్ధం ప్రకటించాడు. ప్రష్యా గెలవడంతో జర్మనీ ఏకీకరణ (క్రీ.శ. 1871) పరిసమాప్తమైంది. నల్లమందు యుద్ధాలు (క్రీ.శ. 1839-42, క్రీ.శ. 1857-58): భారత్‌లో పండించిన నల్లమందును ఇంగ్లండ్, చైనాకు దొంగతనంగా రవాణా చేసి, వ్యాపారం చేసేది. ఈ విషయంలో చైనా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన సంఘర్షణల ఫలితమే నల్లమందు యుద్ధాలు. సామ్రాజ్యవాదం: బలమైన రాజ్యాలు తమ రాజకీయ, ఆర్థిక అవసరాలను తీర్చుకోవడంలో భాగంగా బలహీన దేశాల్లో వలసలను ఏర్పర్చుకోవడానికి పోటీపడుతూ పెంచుకునే శత్రుత్వం. ఇండోనేషియాలోని దీవులు: జావా, సుమత్రా, బాలి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన డచ్‌వారిని బోయెర్‌స అని, ఆంగ్లేయులను ఔట్లాండర్స అని పిలుస్తారు. బోల్షివిక్ పార్టీ స్థాపకుడు (1903): లెనిన్ రస్పుటిన్: అధముడైన రష్యన్ సన్యాసి. ఈయన రష్యా జార్ (రాజు) నికోలస్- ఐఐపై చూపిన దుష్ర్పభావాల వల్ల 1905లో రష్యన్ విప్లవం చెలరేగింది రష్యా జాతీయ అసెంబ్లీని ‘డ్యూమా’ అని పిలుస్తారు బాల్కన్ రాజ్యాలు: బోస్నియా, సెర్బియా, రుమేనియా, ఆల్బేనియా, మాంటేనెగ్రో. ఈ దేశాల్లో నివసిస్తున్న క్రైస్తవులు తమ రాజు టర్కీసుల్తాన్ పాలనపై తిరుగుబాటు చేయడం వల్ల ముస్లిం పాలన అస్తవ్యస్తమైంది. ఈ బాల్కన్ సమస్య కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైంది. రెండో ప్రపంచయుద్ధ కాలం: సెప్టెంబర్ 1, 1939 నుంచి ఆగస్ట 14, 1945 వరకు రెండో ప్రపంచయుద్ధ తక్షణ కారణం: హిట్లర్ (జర్మనీ) పోలెండ్‌పై దాడి. ఫాసిస్ట్పార్టీ: ఇటలీలో ముస్సోలినీ స్థాపించాడు. స్పానిష్ అంతర్యుద్ధం (1937): స్పెయిన్‌లో కమ్యూనిస్ట్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనరల్ ఫ్రాంకో నాయకత్వంలో ఫాసిస్ట్ శక్తులు తిరుగుబాటు చేశాయి. పునరుద్ధరణ: జపాన్‌లో భూస్వామ్య పాలనను గద్దె దింపిన విప్లవకారులు చక్రవర్తి మీజీ అధికారాన్ని పునరుద్ధరించారు. ప్రచ్ఛన్న యుద్ధం: రెండు విరుద్ధ అగ్రరాజ్యాల కూటముల (అమెరికా, రష్యా) మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం. ట్రూమన్ సిద్ధాంతం(1947): యూరప్‌లో కమ్యూనిజం విస్తరణను అడ్డుకోవడానికి ట్రూమన్ (అమెరికా అధ్యక్షుడు) రూపొందించిన ప్రతిపాదన. దీన్ని గ్రీస్, టర్కీలకు సైనిక, ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రతిపాదించాడు. బ్రస్సెల్స్ సంధి(1948): రష్యా ఆధిపత్యాన్ని యూరప్‌లో నిరోధించడానికి యూరప్ దేశాలు చేసుకున్న ఒప్పందం. అలీన విధానం: రెండు అగ్రరాజ్య కూటములకు దూరంగా ఉంటూ ప్రపంచ శాంతిని కాంక్షించే దేశాల విధానం, వీటిని మూడో ప్రపంచ దేశాలుగా పిలుస్తారు. ఈ విధానం భారత విదేశాంగ విధానం ప్రధాన లక్ష్యం. బాండుంగ్ సదస్సు-1955: ఆసియా, ఆఫ్రికా దేశాల మొదటి సదస్సు. ఇది ఇండోనేషియాలోని బాండుంగ్‌లో జరిగింది. సింధూ నాగరికత విలసిల్లిన కాలం: క్రీ.పూ. 3000 నుంచి క్రీ.పూ. 1500 వరకు. వేదాలు: నాలుగు. అవి.. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. గుప్తుల కాలంనాటి దేవాలయాలు: దేవ్‌గఢ్ రాతి ఆలయం (ఝాన్సీ), భితర్‌గావ్ ఇటుకల ఆలయం (ఉత్తరప్రదేశ్), సారనాథ్ రాతి ఆలయం. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ఆలయాలు: విఠలస్వామి ఆలయం, హజరారామస్వామి ఆలయం. భక్తి ఉద్యమం: హిందూ మతంలోని మూఢ విశ్వాసాలను సంస్కరించడమే భక్తి ఉద్యమకారుల ప్రధాన ధ్యేయం. వారు ముస్లిం మతంలోని ఆదర్శనీయమైన, ఆచరణీయమైన అంశాలకు ప్రభావితులయ్యారు. సైమన్ కమిషన్ (1927): 1919 మింటో-మార్లే చట్టంలోని సంస్కరణల పనితీరును పరిశీలించి సూచనలు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషన్. దీనిలో తమకు సభ్యత్వం లేకపోవడంతో భారతీయులు బహిష్కరించారు. రౌలత్ చట్టం (1919): ఈ చట్టం ఏ వ్యక్తినైనా ఎలాంటి విచారణ చేయకుండానే వారిని జైల్లో పెట్టే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. ఇది భారతీయుల హక్కులను కాలరాసింది. రక్షక కవాట సిద్ధాంతం: వ్యతిరేకుల భావాలను సానుకూలంగా నియంత్రించి వారిని సంతృప్తి పర్చడం ఈ సిద్ధాంతం లక్ష్యం. డ్రైన్ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం బ్రిటిష్ వలస ప్రభుత్వం, భారతదేశ సంపదను ఎలా ఆర్థిక దోపిడిని చేస్తుందో తెలుపుతుంది. తీన్‌కథియా పద్ధతి: చంపారన్ (బీహార్) రైతులు నీలి మందు పంటను పండించి బ్రిటిష్ తోటల యజమానులు నిర్ణయించిన ధరకు వారికే అమ్మే దోపిడీ విధానం. గాంధీజీ కృషి వల్ల ఈ పద్ధతి రద్దయింది. అర్థశాస్త్రం ఒక నిర్వచనీయ పద్ధతిలో ఉత్పత్తి, ఉపాధి, సదుపాయాలున్న భారీ పరిశ్రమలు, వ్యవసాయరంగాలను వ్యవస్థీకృత రంగంగా పిలుస్తారు. ఉదా: వాహనాలు, రసాయనాలు, యంత్ర పరికరాలు, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, వస్త్రాల పరిశ్రమలు. అవ్యవస్థీకృత రంగం: ఉద్యోగాలు, జీతాల స్థాయిలో ఒక నియమిత పద్ధతిలేని కుటీర, చిన్న తరహా, అల్ప పరిశ్రమలను అవ్యవస్థీకృత రంగంగా పిలుస్తారు. ఉదా: కుటీర, అల్ప, చిన్న తరహా పరిశ్రమలయిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, చేనేత, బీడీ, అగర్బత్తిల తయారీ, చేతిపనులు, కళాకారులు తదితర వృత్తులు. ఆర్థిక వ్యవస్థలు 3 రకాలు. అవి 1. పెట్టుబడి దారీ ఆర్థిక వ్యవస్థ: ఇందులో ప్రైవేటు ఆర్థిక వ్యవస్థలుంటాయి. అత్యధిక లాభాలను ఆర్జిస్తాయి. 2. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ: ప్రభుత్వమే ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు అవసరమైన వస్తుసరఫరా చేస్తుంది. 3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండూ కలిసుంటాయి. భూమి ఒడంబడిక పద్ధతులు: 1. జమిందారీ పద్ధతి: జమిందార్లు కౌలుదార్ల నుంచి తమ ఇష్టం వచ్చినంత శిస్తువసూలు చేయడం. 2. మహల్వారీ పద్ధతి: శక్తిమంతమైన చిన్న కుటుంబాల సమూహం ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం. 3. రైత్వారీ పద్ధతి: రైతులే నేరుగా ప్రభుత్వానికి పన్ను కట్టడం. పేదరికం: ప్రజలు తమ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితి. ద్రవ్యోల్బణం: డబ్బు విలువ తగ్గుతూ, సాధారణ ధరల స్థాయిలో నిరంతర పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. దారిద్య్రరేఖ: కనీస అవసరాలను తీర్చే వస్తువులను, కనీస భౌతిక పరిమాణాన్ని వాటి ధరలతో గుణించి కనీస తలసరి వినియోగ వ్యయాన్ని నిర్ణయించడం. నిరుద్యోగం: వాడుకలో ఉన్న వేతనాలతో అవసరమైనన్ని ఉద్యోగాలు ప్రజలకు లభించని స్థితి. సంపూర్ణ పేదరికం: కనీస అవసరాలను తీర్చే వస్తువులను కూడా కనీస మొత్తాలలో ధర చెల్లించి కొనుగోలు చేయలేకపోవడం. సాపేక్ష పేదరికం: జనాభాలో అత్యధిక ఆదాయం ఉన్న 5 నుంచి 10 శాతం ప్రజల ఆదాయ స్థాయిలను, చాలా అల్ప ఆదాయం ఉన్న 5 నుంచి 10 శాతం ప్రజల ఆదాయ స్థాయిలను పోల్చే విధానం. మానవాభివృద్ధి సూచిక: ప్రజల జీవన ప్రమాణం, సాధారణ ఆరోగ్య స్థాయి, అక్షరాస్యతరేటు, విద్య, పారిశుద్ధ్య సదుపాయాలతో పాటు తలసరి ఆదాయంతో కూడిన మిశ్రమ అభివృద్ధి సూచిక. ఆర్థిక వ్యవస్థలోని 3 ముఖ్యాంశాలు 1.ప్రాథమిక రంగం (వ్యవసాయరంగం): వ్యవసాయం, తోటల పెంపకం, గనుల తవ్వకం, చేపలు పట్టడం మొదలైనవి. 2.ద్వితీయ రంగం(పారిశ్రామిక రంగం): చిన్నతరహా, భారీ పరిశ్రమలు, నిర్మాణ రంగం మొదలైనవి. 3.తృతీయరంగం(సేవల రంగం): బ్యాంకింగ్, వాణిజ్యం, సమాచార, ప్రసార సాధనాలు, కంప్యూటర్ సేవలు మొదలైనవి. యాజమాన్య విధానం ఆధారంగా భారతీయ పరిశ్రమలను 3 రంగాలలో విభజించారు. 1. ప్రభుత్వరంగం 2. ప్రైవేట్ రంగం 3. విదేశీరంగం పెట్టుబడి పరిమాణాన్ని అనుసరించి పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించారు. 1. భారీతరహా పరిశ్రమలు 2. చిన్న తరహా పరిశ్రమలు 3. అల్ప లేదా మరీ చిన్న తరహా పరిశ్రమలు ఉత్పాదకత ఆధారంగా పరిశ్రమలను నాలుగు విభాగాలుగా వర్గీకరిస్తారు. 1. మౌలిక పరిశ్రమలు 2. ఉత్పాదక వస్తు పరిశ్రమలు 3. మధ్య తరహా పరిశ్రమలు 4. వినియోగదారుల వస్తు పరిశ్రమలు. ఆర్థిక ప్రణాళిక: నిర్దిష్ట కాలపరిమితితో నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించేందుకు హేతుబద్ధంగా, కేంద్రీకృత, ఆర్థిక నిర్ణయాధికారం ద్వారా సమన్వయం చేసే వ్యూహాలను ఆర్థిక ప్రణాళిక అంటారు. భారత ప్రణాళికల విజయాలు: నికర దేశీయోత్పత్తిలో పెరుగుదల-ఆహార ధాన్యాల ఉత్పాదకతలోనూ, మౌలిక ఉత్పాదక వస్తు పరిశ్రమల వృద్ధిలో స్వయం సమృద్ధి సాధన-అవస్థాపన సౌకర్యాల వృద్ధి- పారిశ్రామిక రంగం బలపడటం. భారత ప్రణాళికల వైఫల్యాలు: ఆదాయ అసమానతలు పెరగడం-పేదరికం, నిరుద్యోగ నియంత్రణలో వెనుకంజ-అసంపూర్ణ భూసంస్కరణలు. భారత ప్రణాళికల సాధారణ లక్ష్యాలు: జాతీయాదాయం పెంచుట- ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుట-పారిశ్రామికీకరణను వేగవంతం చేయుట-ఉపాధిని పెంచుట-ఆదాయ అసమానతలు తగ్గించుట. పౌరశాస్త్రం గణతంత్ర రాజ్యం: ప్రజలతో ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గానీ ఎన్నికై దేశాధ్యక్షుడిగా (రాష్ర్టపతి) ఉన్నదేశం. సమాఖ్యవాదం: రాజ్యాంగం ద్వారా కేంద్ర, రాష్ట్రాలకు అధికారాలను స్పష్టంగా విభజించి, పంపిణీ చేయడం. సామాజిక న్యాయం: దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రజలందరికీ సమాన పంపిణీ చేసి సమాజ సంక్షేమానికి తోడ్పడడం. జాతీయ సమైక్యత: దేశంలోని ప్రజలంతా ఒకటే అనే భావన. ప్రజాస్వామ్యం: ప్రజలే తమను తాము పరిపాలించుకోవడం. ఎన్నికల సంఘం: దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ. డెమోక్రసీ: డెమోస్ (ప్రజలు), క్రేషియా (పరిపాలనా) అనే గ్రీకు పదాల సమ్మేళనం. ప్రత్యక్ష ఎన్నికలు: ప్రజలు ఓటువేసి ప్రత్యక్షంగా తమ ప్రతినిధులను ఎన్నుకోవడం. పరోక్ష ఎన్నికలు: ప్రజలతో ఎన్నికైన ప్రతినిధులు మరో అధికార పదవికి ప్రతినిధిని ఎన్నుకోవడం. సాధారణ ఎన్నికలు: ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి నియత కాలికంగా జరిగే ఎన్నికలు. మధ్యంతర ఎన్నికలు: అయిదు సంవత్సరాలు నిండకముందే మధ్యంతరంగా జరిగే ఎన్నికలు. సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు: 18 సంవత్సరాలు నిండిన ప్రతివారికి ఓటు వేసే హక్కు. రాజకీయ పార్టీలు: ఉమ్మడి రాజకీయ విశ్వాసాలు, ఆసక్తులు కలిగి రాజకీయాధికారాన్ని సంపాదించడానికి సంఘంగా ఏర్పడిన వ్యక్తుల సమూహం. బాలల హక్కులు: జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు. హెబియస్ కార్పస్ రిట్: అకారణంగా అరెస్ట్ అయిన వారిని రక్షించడానికి అత్యున్నత న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశం. జీవించే హక్కు: అమల్లో వున్న చట్టాల నుంచి ఒక వ్యక్తి రక్షణ పొంది, స్వేచ్ఛగా జీవించే హక్కు. కులతత్వం: ఒక కులంవారు మరో కులం వారిని వివక్షతతో చూడడం. మతతత్వం: ఒక మతం వారు మరో మతం వారిని అవమానిస్తూ, అసహ్యించుకుంటూ సంకుచితత్వం కలిగి వుండడం. ప్రాంతీయతత్వం: ఒక ప్రత్యేక ప్రాంతం తన భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, ఆర్థికాంశాలు, జీవన విధానాలను పరిరక్షించుకోవాలనే తీవ్రమైన ఆకాంక్షను వెల్లడించడం. సార్క దేశాలు (8): ఇండియా, నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్థాన్. నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ (1973): పేద (అలీన) దేశాల డిమాండ్‌ను గౌరవించి యూఎన్ఓ ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థ. విల్లీబ్రాంట్ కమిషన్ 1980: పేద, ధనిక దేశాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించడానికి వ్యూహాలను రూపొందించింది. వీటో అధికారం: వ్యతిరేకించే అధికారం. భద్రతామండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలకు ఈ అధికారం ఉంది. పర్యావరణం: మానవాభివృద్ధి, పరిసరాలను ప్రభావితం చేసే అంశాలతో కూడిన ఆవరణం. ముఖ్యమైన మానవహక్కులు: జీవించే హక్కు, పనిహక్కు, విద్యాహక్కు, మత స్వాతంత్య్రపు హక్కు. పంచశీల ఒప్పందం (1954): భారత్- చైనాల మధ్య జరిగింది. యూఎన్ఓ ప్రధాన అంగాలు (6): సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక, సామాజిక మండలి, ధర్మకర్తృత్వమండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, కార్యదర్శి వర్గం. యూఎన్ఓ ప్రత్యేక అనుబంధ విభాగాలు: ఐఎల్ఓ, ఎఫ్ఏఓ, యునెస్కో, ఐబీఆర్డీ, డబ్ల్యూటీఓ, యునిసెఫ్. మ్యాప్ పాయింటింగ్ పేపర్-1: చరిత్ర పాఠ్యాంశాలలోని ప్రదేశాలను ప్రపంచ పటంలో గుర్తించాలి. ఇచ్చిన ఐదు ప్రదేశాలలో.. ఒకటి మహాసముద్రం/సముద్రం/సరస్సు/నది. రెండోది ఆసియాలోని దేశం/ రాజధాని. మూడోది యూరప్‌లోని దేశం/రాజధాని. నాలుగోది ఆఫ్రికాలోని దేశం. ఐదవది అమెరికా ఖండంలోని దేశం/ ముఖ్యపట్టణం/దేశ రాజధాని. పేపర్-2: భూగోళశాస్త్ర పాఠ్యాంశంలోని ప్రదేశాలను, భారతదేశ పటంలో గుర్తించాలి. భౌగోళిక సరిహద్దులు, నదులు, శిఖరాలు, ఓడరేవులు, రాష్ట్రాలు, రాజధానులు, ముఖ్య పట్టణాలు, సరస్సులు, సముద్రాలు, దీవులు, జాతీయ రహదారులు, రైలు మార్గాలు, ప్రాజెక్టులు, ఖనిజ నిక్షేపాలున్న ప్రదేశాలను అడుగుతారు. గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు: మ్యాప్‌లో పాయింటింగ్ చేసేటప్పుడు మొదట పెన్సిల్‌తో ఆయా ప్రదేశాలను గుర్తించాలి. తర్వాత అదే సరైన జవాబుగా నిర్ధారించుకొని పెన్నుతో గుర్తించండి. అలా చేయడం వల్ల కొట్టివేతలతో ఆ ప్రదేశం స్థానం మారకుండా ఉంటుంది. గుర్తించిన ప్రదేశంలో డాట్ (చుక్క)ను కొద్దిగా పెద్దగా పెట్టి, అక్కడే కాకుండా బాణం గుర్తుతో సూచించి ఆ ప్రదేశం పేరును స్పష్టంగా విడివిడిగా రాయాలి. చివరగా మ్యాప్‌ను, ఆబ్జెక్టివ్ పేపర్‌ను (పార్ట్-బి) ప్రధాన సమాధాన పత్రంతో (పార్ట్-ఎ) కలిపి దారంతో జాగ్రత్తగా ముడి వేయాలి. ఇలా రాయాలి 1 మార్కు ప్రశ్నలు ప్రతి పాఠ్యాంశం చివరన ఇచ్చిన ప్రశ్నల నుంచే కాక జనరల్‌గా పాఠ్య విషయం నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యాంశాలను ప్రశ్నలుగా మార్చి ఇస్తారు. అందుకోసం ముఖ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకరకంగా ముఖ్యాంశాలన్నీ చదివితే పాఠాన్ని అవగాహన చేసుకున్నట్లే. అంతేకాకుండా ప్రతి పాఠ్యంశంలోని పాఠంలో అపాస్ట్రాఫ్ (‘’) కామాలున్న నూతన పదాలను, నిర్వచనాలను ఒక మార్కు ప్రశ్నలుగా మార్చి పరీక్షల్లో అడుగుతారు. ఉదా: కల్లార్ అంటే ఏమిటి? వీటికి రెండు లేదా మూడు పాయింట్లు సమాధానం రాయాలి. చాలా మంది విద్యార్థులు పరీక్షల్లో సమాధానాలు రాసేటప్పుడు ప్రశ్నలు రాయరు. అలాంటప్పుడు పై ప్రశ్నను ఉదాహరణగా తీసుకుంటే: ్ధ కల్లార్ అంటే (అంటూ సమాధానం రాయాలి) అలాగే ఆంగ్ల అక్షరాలతో కూడిన అబ్రివియేషన్ పదాలను విస్తరించండి అని ప్రశ్నలు అడుగుతారు. ఉదా: SWAPO (స్వాపో)ను విస్తరించండి? NATO (నాటో) అంటే? 2 మార్కుల ప్రశ్నలు: దాదాపు పుస్తకంలోని ప్రశ్నలనే పరీక్షల్లో అడుగుతారు. వీటికి 4 లేదా 5 పాయింట్లతో సమాధానాలు రాయాలి. ఉదా: భారత ప్రణాళికల సాధారణ లక్ష్యాలను తెలపండి? జ. భారత ప్రణాళికల సాధారణ లక్ష్యాలు: జాతీయాదాయం పెంచడం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం ఉపాధిని పెంచడం ఆదాయ, అసమానతలను తగ్గించడం 4 మార్కుల ప్రశ్నలు: ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని సైడ్ హెడ్డింగ్‌తో ప్రారం భించి, పాయింట్ల రూపంలో విడివిడిగా రాస్తే ఎక్కువ మార్కులు పొందొచ్చు. రెండు చిన్న ప్రశ్నలను కలిపి 4 మార్కుల ప్రశ్నగా కూడా అడగవచ్చు. అదేవిధంగా పెద్ద ప్రశ్నను విడదీసి 2 మార్కుల ప్రశ్నలుగా కూడా అడిగే అవకాశం ఉంది. సమాధానాలను పాయింట్ల వారీగా ఇలా రాయాలి. 4 మార్కుల ప్రశ్నలకు 8 నుంచి 10 పాయింట్ల సమాధానం రాయాలి. 2 మార్కుల ప్రశ్నలకు 4లేదా 5 పాయింట్ల సమాధానం రాయాలి. 1 మార్కు ప్రశ్నలకు 2 లేదా 3 పాయింట్ల సమాధానాన్ని రాయాలి. రాసిన సమాధానంలోని ముఖ్యాంశాలను అండర్లైన్ చేయండి. అలాగే సమాధానంలో ఏదైనా సంస్థ, పుస్తకం, పార్టీ, పత్రిక, వ్యక్తుల పేర్లు ఉన్నట్లయితే వాటికి రెండు వైపులా ‘’అపాస్ట్రాఫ్ ‘’కామా (‘’)లను పెట్టి రాయండి. ఎరుపు రంగు పెన్ను ఉపయోగించకండి. బ్లాక్/బ్లూ పెన్నులను మాత్రమే వాడండి. పూర్తి సమాధానాన్ని ఒక రంగు పెన్నుతో రాసి, సైడ్హెడ్డింగ్ను ఇంకో రంగుపెన్నుతో రాయాలి. జవాబులను రాసేముందు ప్రశ్నల సంఖ్యను కరెక్ట్‌గా రాయాలి. చివరి 30 నిమిషాల ముందు ఇచ్చే ఆబ్జెక్టివ్ బిట్స్ పేపర్లో ప్రతి బిట్ (ప్రశ్న)కు ఏదైనా ఒక్క సమాధానమే రాయాలి. ఒకవేళ రాసిన దానిని కొట్టివేయాల్సి వస్తే ణ గుర్తు ఆ సమాధానంపై రాసి, కరెక్ట్ సమాధానాన్ని దాని పక్కన రాయాలి. బిట్ పేపర్‌కు సమాధానాలు రాస్తున్నప్పుడు ప్రధాన ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు సంబంధించి కొన్ని పాయింట్స్ గుర్తుకు రావొచ్చు. ఆ సందర్భంలో వాటిని వెంటనే ప్రధాన సమాధాన పత్రంలో వాటికి సంబంధించిన జవాబులకు జత చేయాలి. చివరగా బిట్ పేపర్ సమాధానాలు రాసిన తర్వాత, ప్రధాన సమాధాన పత్రాన్ని, తర్వాత మ్యాప్ పాయింటింగ్ పేపర్‌ను, ఆ తర్వాత ఆబ్జెక్టివ్ పేపర్‌ను జతచేసి దారంతో జాగ్రత్తగా, గట్టిగా ముడివేయాలి. ఆల్ ద బెస్ట్.. ఈ వారం భవిత ‘కరెంట్ అఫైర్స్’ శీర్షిక నేటి సాక్షి ‘విద్య’ పేజీలో... -
ఇంజనీరింగ లో ఈ విధంగా సెట్ కావాలంటే...!
ఇంజనీరింగ్ కలను తీర్చే మరో మార్గం.. ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్).. ఈ పరీక్ష ద్వారా లేటరల్ ఎంట్రీ విధానంలో పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు.. ఇటీవల చేసిన మార్పుల కారణంగా బీఎస్సీ (మ్యాథమెటిక్స్) విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ కోర్సులో చేరే అవకాశం కలుగుతోంది.. ఈసెట్-2014కు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ప్రిపరేషన్ ప్లాన్, సంబంధిత వివరాలు.. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)-కాకినాడ, ఈ ఏడాది ఈసెట్‌ను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా నిర్దేశించిన అర్హతలాధారంగా డిప్లొమా విద్యార్థులు బీఈ, బీటెక్ విభాగంలో 35కి పైగా బ్రాంచ్‌ల్లో ప్రవేశం పొందొచ్చు. బయోమెడికల్ విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ఈసీఈ) బ్రాంచ్ పరీక్షకు హాజరు కావచ్చు. బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అభ్యర్థులు ఫార్మసీ మినహా మిగతా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో చేరడానికి అర్హులు. ప్రశ్నల క్లిష్టత సంబంధిత సబ్జెక్ట్‌లలో ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి 10+2. బ్రాంచ్ సబ్జెక్ట్ మాత్రం డిప్లొమా స్థాయిలో ఉంటుంది. సీట్ల కేటాయింపు ఈసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు 2013లో యూనివర్సిటీ కాలేజీల్లో 5 శాతం సీట్లను, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 20శాతం సీట్లను కేటాయించారు. డిప్లొమా విద్యా ర్థులు చదివిన బ్రాంచ్‌లో మాత్రమే ఇంజనీరింగ్ కోర్సులో చేరొచ్చు. అన్ని బ్రాంచ్‌ల వారికి..సంబంధిత బ్రాంచ్ ర్యాంకుతోపాటు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఇస్తారు. ఈ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్‌తో బ్రాంచ్‌తో నిమిత్తం లేకుండా ఎవరైనా ఐటీ బ్రాంచ్‌లో ప్రవేశం పొందొచ్చు. మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు రావాలంటే 200లోపు ర్యాంకు సాధించాలి. బీఎస్సీ విద్యార్థులు ఇలా మ్యాథమెటిక్స్‌కు అత్యధిక వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్‌పై ఎక్కువగా దృష్టి సారించడం మంచిది. అంతేకాకుండా ఇందులోని ప్రశ్నల క్లిష్టత డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే డిగ్రీ పరీక్షల కోసం మ్యాథమెటిక్స్ను ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి మరోసారి మాదిరి ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ పునశ్చరణ చేసుకుంటూ పోతే ఇందులో మెరుగైన మార్కులు సాధించవచ్చు. ఇంగ్లిష్ విషయానికొస్తే.. విద్యార్థుల్లోని ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ క్రమంలో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, వర్డ్ రీప్లేస్-సబ్‌స్టిట్యూట్ తరహా ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్మీడియెట్ స్థాయి వరకే ఉండే గ్రామర్ అంశాలను చదివితే ఇందులో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. అనలిటికల్ ఎబిలిటీలో విద్యార్థి విశ్లేషణ, తార్కిక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. డేటా సఫిషియన్సీ, కాలం, వేగం, నిష్పత్తి, వడ్డీ, వయసు, కోడింగ్- డీకోడింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇటువంటి ప్రశ్నలు ఇంటర్మీడియెట్, డిగ్రీలోకాని ఎదురు కావు. కాబట్టి సాధ్యమైనన్నీ మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. నోటిఫికేషన్ సమాచారం అర్హత: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గుర్తింపు పొందిన కళాశాల నుంచి 45 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 45 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 29, 2014 రూ. 500 ఫైన్‌తో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2014 రూ. 1000 ఫైన్‌తో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 22, 2014 రూ. 5000 ఫైన్‌తో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 29, 2014 పరీక్ష తేదీ: మే 10, 2014 వివరాలకు: http://apecet.org జనరల్ టిప్స్ సాధ్యమైనన్నీ మాక్‌టెస్ట్‌లు రాయాలి. దీని వల్ల లోపాలను విశ్లేషించుకోవడంతోపాటు తక్కువ సమయంలోనే సమాధానాన్ని గుర్తించే సామర్ధ్యం అలవడుతుంది. ప్రామాణిక అకడమిక్ పుస్తకాలను చదువుతూ.. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే లక్ష్యంతో ప్రిపేర్ కావడం మంచిది. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. కనీసం రోజుకు 8 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఈ సమయాన్ని సబ్జెక్ట్ వారీగా విభజించుకోవాలి. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లకు నాలుగు గంటలు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌కు నాలుగు గంటల సమయం కేటాయించాలి. ప్రతి రోజూ ప్రిపరేషన్ తర్వాత సినాప్సిస్ తయారు చేసుకోవాలి. పరీక్షకు ముందు వీటిని పునశ్చరణ చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. కష్టంగా భావించే అంశాలను స్నేహితులతో చర్చించుకుంటూ ప్రిపేర్ కావడం లాభిస్తుంది. పరీక్ష విధానం ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్ మాధ్యమంలో 200 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో సమాధానాలను మూడు గంటల్లో గుర్తించాలి. ప్రశ్నపత్రాన్ని కూడా ఎంచుకున్న స్ట్రీమ్ ఆధారంగా భిన్నంగా రూపొందిస్తారు. ఈ క్రమంలో డిప్లొమా హోల్డర్లకు ఒక విధంగా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్), ఫార్మసీ విద్యార్థులకు మరో విధంగా ఉంటుంది. వివరాలు.. డిప్లొమా విద్యార్థులకు: నాలుగు విభాగాల్లో పరీక్ష ఉంటుంది. అవి.. అంశం మార్కులు మ్యాథమెటిక్స్ 50 ఫిజిక్స్ 25 కెమిస్ట్రీ 25 పాలిటెక్నిక్‌లో సంబంధిత బ్రాంచ్ 100 మొత్తం 200 బీఎస్సీ మ్యాథమెటిక్స్: అంశం మార్కులు మ్యాథమెటిక్స్ 100 అనలిటికల్ ఎబిలిటీ 50 కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ 50 మొత్తం 200 ఫార్మసీ కోర్సులకు: నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. అంశం మార్కులు ఫార్మాస్యూటిక్స్ 50 ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 50 ఫార్మకాగ్నసీ 50 ఫార్మకాలజీ 50 మొత్తం 200 ప్రిపరేషన్ ప్లాన్.. మ్యాథమెటిక్స్: మ్యాథమెటిక్స్‌లో క్యాలికులస్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, కో-ఆర్డినేట్ జామెట్రీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిల్లో క్యాలికులస్, ట్రిగ్నోమెట్రీ అంశాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ను ప్రిపేర్ కావడంతో ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లను సులభంగా అవగాహన చేసుకునేందుకు వీలు చిక్కుతుంది. ఇందులో ప్రశ్నల సరళిని గమనిస్తే.. In a triangle ABC if a/cosA = b/cosB = c/cosC, then the triangle is 1) Isosccles 2) Equilateral 3) Right angled 4) Left angled Ans: 2 ఫిజిక్స్: ఫిజిక్స్‌లో యూనిట్స్, డెమైన్షన్స్, వెక్టార్స్, కైనమెటిక్స్, ఫ్రిక్షన్, వర్క్, పవర్, ఎనర్జీ, హీట్, సౌండ్ మోడ్రన్ ఫిజిక్స్ వంటి అంశాలు కీలకమైనవి. ఇందులో ప్రశ్నల సరళిని గమనిస్తే.. The acceleration of a moving body can be found from 1) Area under velocity time graph 2) Area under distance time graph 3) Slope of the velocity time graph 4) Slope of distance time graph Ans:3 కెమిస్ట్రీ: ఇంజనీరింగ్‌లో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలో వాటర్ ట్రీట్మెంట్, కరోజన్, సొల్యూషన్స్, ఫ్యూయల్స్, పొల్యూషన్, పాలిమర్స్ అంశాలను క్షుణ్నంగా చదవాలి. ఇందులో ప్రశ్నల సరళిని గమనిస్తే.. A zinc rod half immersed in a beaker containing water 1) Corrods fastest at the top 2) Does not corrods at all 3) Corrod fastest at the water metal 4) Corrod fastest at the bottom Ans: 3, 4 ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లకు సంబంధించి చదివిన డిప్లొమా ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ప్రతి అంశం నుంచి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రామాణిక పుస్తకాలను చదువుతూ.. ప్రాథమిక భావనలను అవగాహన చేసుకుంటూ ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. బ్రాంచ్‌ల వారీగా ఇందులోని ప్రశ్నల సరళిని గమనిస్తే.. సివిల్: Change in the length of material with time under constant load is called 1) Homo-gin-ity 2) Defo-r-matio 3) Creep 4) Strain Ans: 3 సీఎస్ఈ In ER diagrams relationship is represented with symbol 1) Diamond 2) Rectangle 3) Double lines 4) Circle Ans: 1 మెకానికల్: Which of the following is not an air breathing engine? 1) Liquid propellant rocket 2) Solid propellant rocket 3) Mano propellant rocket 4) Turbo propellant rocket Ans: 1, 2, 3 ఈసెట్‌లో ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లు కీలకం. కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టి సారించడం మంచిది. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉండవు. ఈ నేపథ్యంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం ఉత్తమం. ప్రస్తుత ఏడాది డిప్లొమా పూర్తి చేస్తున్న విద్యార్థులకు ఈ-సెట్ ప్రిపరేషన్ కోసం తక్కువ వ్యవధి మాత్రమే లభిస్తుంది. కాబట్టి వీలైనన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఈ క్రమంలో సాధ్యమైనన్నీ షార్ట్‌కట్ మెథడ్స్ తెలుసుకోవాలి. జి. రమణ, డెరైక్టర్, సాయిమేధ విద్యా సంస్థలు, హైదరాబాద్. -
ఆర్థిక అసమానతలు.. ఆకలి కేకలు
డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యంగా ఆరోగ్యం, పర్యావరణానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జెనీవా కేంద్రంగా ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) ఏర్పాైటైంది. వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ రాజకీయ నేతలు, ఎంపిక చేసిన మేధావులు, ఆర్థిక నిపుణులు, పాత్రికేయులు ఈ వేదిక నిర్వహించే శీతాకాల సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. ఏటా లాటిన్ అమెరికా, తూర్పు ఆసియా దేశాల్లో ఆరు నుంచి ఎనిమిది ప్రాంతీయ సమావేశాలు.. చైనా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో రెండు వార్షిక సమావేశాలను ఈ వేదిక నిర్వహిస్తుంది. 2014, జనవరి 22-25 మధ్య దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక 44వ వార్షిక సదస్సు జరిగింది. ప్రపంచ పునర్నిర్మాణం- సమాజం, రాజకీయం, వ్యాపారం (The Reshaping of the world consequences for society, politics, and business) ఇతివృత్తంతో సమావేశం జరిగింది. ఆర్థిక అసమానతల నేపథ్యంలో పెరుగుతున్న పేదరిక సమస్యకు పరిష్కారం చూపించే విషయంలో వేదిక విఫలమైందని చెప్పొచ్చు. ఈ సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలు... ఆర్థిక ప్రగతి - ఆశావాదం: అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి ప్రగతిపట్ల జాగరూకతతో కూడిన ఆశావాదాన్ని ప్రపంచ ఆర్థిక వేదిక వ్యక్తపరుస్తుంది. స్వల్ప కాలంలో అంతర్జాతీయ వృద్ధి ప్రగతికి అనువైన వాతావరణం ఏర్పడుతున్నప్పటికీ దీర్ఘకాలంలో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా వృద్ధిరేటులో ఒడుదుడుకులు సంభవిస్తున్నా యి. ప్రస్తుతం కొన్ని ఆర్థిక వ్యవస్థలలో ప్రోత్సాహకర వృద్ధి సంకేతాలున్నాయి. ఆయా ఆర్థిక వ్యవస్థలు అవలంబించిన విస్తరణ, ఆర్థిక విధానాలు దీనికి కారణమయ్యాయి. మరోవైపు వృద్ధితోపాటు ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా ఆయా ఆర్థిక వ్యవస్థలు పురోగమనాన్ని ప్రోత్సహించే విస్తరణ, ఆర్థిక విధానాలను విడనాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో ఆర్థిక వృద్ధిరేటు ప్రపంచ వ్యాప్తంగా సంతృప్తికరంగా లేదు. వేగవంతమైన మార్కెట్లలోనూ వృద్ధి క్షీణతను గమనించవచ్చు. అర్జెంటీనాలో పెసో (అర్జెంటీనా కరెన్సీ) సంక్షోభం కారణంగా 1997 నుంచి 2000 మధ్య కాలంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. వేతనాల పెరుగుదల, పతనమైన కరెన్సీ విలువ కారణంగా ైచె నా వృద్ధిరేటు మందగించింది. యూరోజోన్‌లో ముఖ్య దేశమైన ఫ్రాన్స్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. మరోవైపు జర్మనీ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. యునెటైడ్ కింగ్డమ్ వృద్ధి అంచనాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక అసమానతలు.. అభివృద్ధి చెందిన దేశాలలో ముఖ్యంగా అమెరికా, యుైనె టెడ్ కింగ్డమ్లో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఇవి ఆయా ఆర్థిక వ్యవస్థలలో సామాజికరంగ అభివృద్ధితో పాటు ఆర్థిక సుస్థిరతకు అవరోధాన్ని కల్పించగలవు. అసమానతలు సమాజంలో నిరాశా నిస్పృహలను పెంచడం ద్వారా ఆర్థికవృద్ధి క్షీణతకు గురిచేస్తాయి. యువత తమకు భవిష్యత్ లేదని భావించినపుడు ఆయా దేశాలలో అశాంతి పెరిగి దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లగలదు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రధాన ఆర్థిక వేత్త జెన్నిఫర్ బ్లాంకే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మధ్య తరగతి ప్రజల ఆదాయం పెరుగుదలలో పాటు ధనిక, పేదల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు వేగంగా పెరిగాయి. అభివృద్ధి చెందిన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో సాంఘిక అభద్రతా భావం (టౌఛిజ్చీ ఠట్ఛట్ట)పెరిగింది. దీనికి కారణం ఆర్థిక అసమానతలే. ఈ ఆర్థిక అసమానతలపై అవగాహన పెరగడం, పరపతి మార్కెట్ల వల్ల కొన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందడం; అధిక వ్యయంతో కూడిన విద్య అనేక దేశాల్లో సాంఘిక అభద్రతా భావం పెరగడానికి కారణాలుగా చెప్పొచ్చు. ఆర్థిక అసమానతల కారణంగా పెరుగుతున్న పేదరిక తీవ్రతను వేదిక గుర్తించింది. 44వ సమావేశం- ముఖ్యాంశాలు: గుడ్ గవర్నెన్స్ ద్వారా లభించిన ప్రతిఫలంలో (డివిడెండ్) ఆఫ్రికా దేశాలు సాధించిన ప్రగతి, ఆర్థికాభివృద్ధి ముఖ్యమైనదని ఘనా అధ్యక్షుడు జాన్ మహమా అభివర్ణించారు. ఈ స్థితి ఘనాలో విదేశీ పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడుల పెరుగుదలకు దారి తీసిందన్నారు. అనేక ఆఫ్రికా దేశాలు సుస్థిరమైన గవర్నెన్స్ సాధించాయని ఆర్థిక వృద్ధి గురించి ఆలోచించే క్రమంలో రాజకీయ సుస్థిరత సాధించ డం ప్రధానమని నైజీరియా అధ్యక్షుడు గుడ్‌లక్ జోనాథన్ అన్నారు. యువతలో నిరుద్యోగితను తగ్గించే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్య ఆవశ్యకతను రిపబ్లిక్ ఆఫ్ లైబీరియా అధ్యక్షురాలు ఎలీన్ జాన్సన్ షర్లీఫ్ నొక్కి వక్కాణించారు. నైజీరియా ప్రభుత్వం ప్రారంభించిన ’్గ్ఖై గిఐూ’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. స్వయం ఉపాధి పెంపుగా నైజీరియా ఆర్థికమంత్రి గోజీ యొకంజో ఇవియాలా పేర్కొన్నారు. యువత ఉపాధి కొరకు వేచిచూడకుండా వారే స్వతహాగా అవకాశాలను సృష్టించుకొని, ఇతరులకు కొలువులు చూపే దిశగా ప్రయత్నించాలని ఆయన ఉద్బోధించారు. పౌష్టికాహార లోపాన్ని నివారించే క్రమంలో 40 ప్రపంచ కంపెనీలు కలిసి పనిచేస్తాయని సదస్సులో ప్రకటించారు. 2020 నాటికి 127 మిలియన్ల మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోప నివారణకు కృషిచేస్తాయని ప్రకటించింది. ఆకలి నిర్మూలన (జీరో హంగర్) సాధించే క్రమంలో ప్రైవేటు రంగ పాత్రను వేదిక గుర్తించింది. ప్రపంచ ఆహార కార్యక్రమం అమల్లో ముఖ్య ప్రైవేటు రంగ భాగస్వాములైన రాయల్ డీఎస్ఎం, యునీలీవర్ సంస్థలు ఆకలి నిర్మూలనకు కట్టుబడి ఉండాలని వేదిక స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కొత్త విధానపరమైన సవాళ్లను ఎదుర్కోనున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టిన్ లగార్డే అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలన: 90వ దశకం తొలి భాగంలో మధ్య, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో ఆదాయస్థాయిలో తగ్గుదల కనిపించింది. సోవియట్ పతనం కారణంగా తలసరి స్థూల దేశీయోత్పత్తిలో క్షీణత ఏర్పడింది. ఫలితంగా పేదరిక తీవ్రత పెరిగింది. 2008లో 1.29 బిలియన్ ప్రజలు నిరపేక్ష పేదరికంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. వీరిలో 400 మిలియన్ల ప్రజలు భారత్‌లోనూ, 173 మిలియన్ ప్రజలు చైనాలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నట్లుగా పేర్కొంది. సబ్ సహారన్ ఆఫ్రికాలో 2008లో 47 శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం తీవ్ర పేదికరం ప్రపంచ సవాల్‌గా నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో తీవ్ర పేదరికాన్ని గమనించవచ్చు. డెలాయిట్ సర్వే- 2014: రాబోయే దశాబ్దంలో ప్రపంచ శ్రామిక శక్తిలో అధిక వాటా ను కలిగియుండే యువత.. నిరుద్యోగం, ఆర్థిక అసమానతలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రభుత్వ సామర్థ్యంపై నమ్మకం కోల్పోయినట్లు డెలాయిట్ సర్వే అభిప్రాయపడింది. 28 దేశాలకు చెందిన 18-35 ఏళ్ల వయసున్న 8 వేల మంది అభిప్రాయాలను సర్వే కోసం క్రోడీకరించారు. అనేక దేశాల్లో వయోజనులతో పోలిస్తే యువ శ్రామికశక్తిలో నిరుద్యోగం రెండు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉంటుందని సర్వే పేర్కొంది. 2025 నాటికి ప్రపంచ శ్రామికశక్తిలో యువ శ్రామికశక్తి వాటా 75 శాతంగా ఉండగలదు. ఉపాధి, సంపదను పెంపొందించడం ద్వారా వ్యాపా రం సమాజంపై ధనాత్మక ప్రభావం చూపగలదని సర్వేలో పాల్గొన్న వారిలో 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రపంచ సంపద పంపిణీ- 1500 సంవత్సరం: తలసరి స్థూల దేశీయోత్పత్తి అంచనాల ప్రకారం ప్రపంచంలో 1500 సంవత్సరంలో ఐరోపా ప్రాంతాలు అత్యంత ధనిక దేశాలు. తూర్పు ఆసియా, దక్షిణాసియా దేశాలలో స్థూల దేశీయోత్పత్తి ఎక్కువగా నమోదైంది. 1500 సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మధ్య ఆఫ్రికా, ఆగ్నేయ ఆఫ్రికా ప్రాంతాల్లో తక్కువగా నమోదైంది. ఈ ప్రాంతాలు 2000 తర్వాతి కాలంలోనూ తక్కువ స్థూల దేశీయోత్పత్తినే నమోదు చేసుకున్నాయి. ప్రపంచ జీడీపీలో ఆయా ప్రాంతాల వాటా ఇప్పటికీ తక్కువగానే ఉంది. ప్రపంచ ఆదాయ అసమానతలు: ప్రపంచ బ్యాంకు దత్తాంశం ఆధారంగా చేసుకొని, ‘ది కాన్ఫరెన్స్ బోర్డ్ ఆఫ్ కెనడా’ ప్రపంచ ఆదాయ అసమానతలను అంచనా వేసింది. ప్రపంచ ఆదాయంలో 42 శాతం ప్రపంచ జనాభాలో ధనికులైన 10 శాతం మంది చేతుల్లో కేంద్రీకృతమవుతున్నది. ప్రపంచ జనాభాలో 10 శాతం పేద ప్రజల వాటా ప్రపంచ ఆదాయంలో ఒక శాతం మాత్రమే. 80వ దశకం, 90వ దశకం మధ్య భాగంలో అనేక దేశాల్లో ఆదాయ అసమానతలు పెరగగా, 2000 తర్వాత ఈ అసమానతలు కొంతమేర తగ్గాయి. దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా దేశాలలో ఆదాయ అసమానతలు తక్కువ ఉండగా, అమెరికా, కెనడాలలో ఆదాయ అసమానతలు మధ్యస్థంగా ఉన్నాయి. 2011లో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలోనూ ఆదాయ అసమానతలు, అవినీతిని ప్రపంచ సవాళ్లుగా పేర్కొన్నారు. ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ మార్కెట్ వ్యవస్థల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అసమానతలు తగ్గినప్పటికీ అనేక దేశాల్లో వివిధ వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగినట్లు హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ రిచర్డ్ ఫ్రీమన్ 2011 దావోస్ సమావేశంలో పేర్కొన్నారు. ఫోర్బ్స్ మేగజీన్ 2011లో ప్రపంచంలో 1210 మంది బిలియనీర్ల ఉమ్మడి సంపదను 4.5 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. 2012తో పోల్చినప్పుడు 2013లో ధనికులైన 400 మంది అమెరికన్ల సంపదలో 19 శాతం పెరుగుదల నమోదైనట్లు ‘ఫోర్బ్స్’ తెలిపింది. 2012లో వీరి ఉమ్మడి సంపద 1.7 ట్రిలియన్ డాలర్లు కాగా, 2013లో 2.02 ట్రిలియన్ డాలర్లకు పెరిగిం ది. 2012లో ప్రతి వ్యక్తి సగటు నికర సంపద 4.2 బిలియన్ డాలర్లు కాగా 2013లో 5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచంలో పురుషుల ఆదాయం మహిళల ఆదాయం కంటే రెండు రెట్లు మించి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ పురుషుల సంపాదన మహిళల కంటే ఎక్కువగా ఉంది. మహిళలు, పురుషుల మధ్య ఆదాయ అసమానతలు దక్షిణాసియాలో అధికం. ఈ ప్రాంతంలో పురుషుల సంపాదన మహిళల సంపాదన కంటే దాదాపు అయిదు రెట్లు ఎక్కువ. దక్షిణాసియాలో ఆదాయం పరంగా వీరి మధ్య వ్యత్యాసం తక్కువ. ఈ ప్రాంతంలో పురుషుల సంపాదన, మహిళల కంటే రెట్టింపు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళల ఆదాయంలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, చైనా రెండో స్థానంలో ఉంది. జనాభాలో అధిక వార్షిక ఆదాయం మహిళలకు సంబంధించి నార్వే, డెన్మార్క్‌లలో ఎక్కువ. ప్రపంచ బ్యాంకు 2008 నివేదిక ప్రకారం 1.29 బిలియన్ ప్రజలు నిరపేక్ష పేదరికంలో ఉన్నారు. వీరిలో 400 మిలియన్ల ప్రజలు భారత్‌లోనూ, 173 మిలియన్ ప్రజలు చైనాలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళల ఆదాయంలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, చైనా రెండో స్థానంలో ఉంది. జనాభాలో అధిక వార్షిక ఆదాయం మహిళలకు సంబంధించి నార్వే, డెన్మార్క్‌లలో ఎక్కువ. -
ప్రొనౌన్ మస్ట్ బి ఇన్ సబ్జక్ట్
K. LALITHA BAI Associate Professor in English, Hyderabad. Sentence correction section is one of the important areas in many competitive examinations. Eight types of errors pertaining to the following broad areas are generally given. Candidates who wish to secure good scores need to enhance their knowledge on these areas. They are: 1. Collocation 2. Idioms and Phrases 3. Pronoun agreement 4. Concord 5. Modifiers 6. Verb sequences 7. Comparisons 8. Parts of speech Out of these we have studied the first two topics collocation and idioms and phrases in the last sessions. Let us learn about pronoun agreement in this session. Pronouns stand in for nouns in a sentence. Pronouns follow the same agreement rules as nouns, so when using a pronoun, it is important to be clear about what noun it is replacing. Take a look at the following tips: 1. A pronoun in the nominative form should be compared with the same form of the pronoun. 2. When two singular nouns are joined by and refer to the same person the pronoun used in their place should be singular in form. 3. A singular pronoun should be used when two singular nouns are joined by either or neither nor. 4. A pronoun in the plural form should be used when two nouns of different members are joined by 'or' or 'nor'. 5. The distributive pronouns 'either, neither, none, any, no one are used with singular verbs. 6. The indefinite pronoun 'one' should be used as 'one's for its possessive case. 7. The verbs such as cheat, prostrate, introduce, present, absent, satisfy, prepare, enjoy, hurt, avail of are followed by either an object or a reflexive pronoun. 8. The word 'who' as a relative pronoun in the nominative case takes a verb. 9. If a pronoun is to be placed after 'to be', the pronoun in the subjective case is used. A very important point to be noted is that we should use the personal pronouns in the order of second person, third person and first person. The order first person, second person and third person is possible when we admit guilt. Pronoun Subject Vs Pronoun Object Once you've found a pronoun in a Sentence Correction question, check whether it's acting as the SUBJECT or the OBJECT of the sentence or phrase. Is the following sentence correct or incorrect? How could she blame you and he for the accident? The first step is to identify the pronoun(s). There are three in this sentence: "she," "you," and "he". Next, try to define whether each pronoun is acting as a subject or object. Here, "she" is the subject, and the pronouns "you" and "he" are acting as the objects of the sentence. How do we know this? Because "she" is doing the action (blaming) and "you" and "he" are receiving it (getting blamed). However, "he" does not seem to be in the correct form. "Who did she blame?", which is "him" not "he." ("Who did she blame? She blamed him") The pronouns acting as objects must be in the objective case; "him" is objective - while "he," used in the sentence, is subjective, and therefore incorrect. Incorrect: How could she blame you and he for the accident? Correct: How could she blame you and him for the accident? Who Vs Whom If the pronoun is acting as a subject, use who. If it is acting as an object, use whom. I don't know whom Kavitha married. Why is "whom" correct? Because Kavitha is the subject of this sentence - not the person she married. Singular and Plural Pronouns Pronouns also act like nouns in the realm of verb agreement. For some pronoun questions, you also need to check if the pronoun and its verb agree in number. Here's an example: Incorrect: Everyone on the project have to come to the meeting. Correct: Everyone on the project has to come to the meeting. The pronoun "everyone" is singular. Its verb must therefore be singular as well: "has" is correct, not "have". Possessive Pronoun Agreement When you come across possessive pronouns such as your, their, his, and hers, check to see whether they agree with other pronouns in the sentence. Most possessive pronouns are used messily in spoken language, so be careful to take special note when you see two pronouns in a sentence. Incorrect: Some of you will have to bring their own bags. Correct: Some of you will have to bring your own bags. In this sentence, the possessive pronoun towards the end of the sentence should match the pronoun following "Some of". Because the first pronoun is "you", the possessive pronoun must be your, not their. Objects of to be verbs are in the subject form. Watch for pronouns following "to be" verbs such "It should have been," "It is," "It could have been," "It was", and make sure they are in subject form. Incorrect: It must have been her who called. Correct: It must have been she who called. "It must have been" is a "to be" verb, so the pronoun must be in subject form: "she," not "her". Relative Pronouns Which, that and who are relative pronouns. A relative pronoun must refer to the word immediately preceding it. If the meaning of the sentence is unclear, the pronoun is in the wrong position. Which introduces non-essential clauses; that introduces essential clauses. Who refers to individuals; that refers to a group of persons, class, type, or species. Incorrect: The person whom draws the winning number hits the jackpot. Correct: The person who draws the winning number hits the jackpot. Here the relative pronoun 'who' is the correct form as it is the subject of the verb draws and also introduces the clause draws twinning number. Impersonal Pronouns We can use impersonal pronouns to talk about people in general or unspecified objects. The pronouns "one" and "you," which are included in a class of pronouns called "impersonal pronouns," are often improperly matched with their respective possessive pronouns. Incorrect: One should have their teeth checked every six months. Correct: One should have one's teeth checked every six months. Practice test 1. Her was better suited for the job. 2. Johnny and me drank a bottle of champagne. 3. The dinner was eaten by Smith and I. 4. Whom took out the trash? 5. Neither his bodyguards nor he were there. 6. Neither he nor his bodyguards was there. 7. If anyone comes over, take their name. 8. One should take your responsibilities seriously. 9. This test is for students which native language is not English. 10. My pencil is broken. Can I borrow its? Answers and explanation: 1. She was better suited for the job. Here, the pronoun is the subject of the sentence, as "the job" is clearly not the subject, and there are no other nouns in the sentence. Because the pronoun stands in for "the woman", the pronoun should be the subject form of the her/she pronoun meaning, "she". 2. Johnny and I drank a bottle of champagne. Because it's confused so often in spoken language, it can be difficult to tell when the pronoun in the phrase "someone else and me/I" is used incorrectly. But it's actually quite easy to remember when to use "me" and when to use "I": cross out everything in the "someone else and me/I" phrase except the pronoun - and then read it aloud. How does it sound? If it sounds fine, the pronoun is correct; if it sounds really odd, the pronoun is incorrect. "Me drank a bottle of wine" sounds odd, so the proper pronoun is clearly "I". 3. The dinner was eaten by Smith and me. "I/me" is acting as the object, so the proper pronoun is "me." 4. Who took out the trash? You wouldn't say "him took out the trash," so the pronoun in the original sentence must match the form of the pronoun "he," which is a subject pronoun: who is correct. 5. Neither his bodyguards nor he was there. 6. Neither he nor his bodyguards were there. The constructions "either... or" and "neither... nor" always take the verb form that matches the noun that is closer to the verb. Thus, "were" is incorrect in the fifth sentence because "he," a singular pronoun, is closer to the verb than "bodyguards," a plural noun; but "were" is correct in the sixth sentence because the order of the subjects is reversed, so that the plural noun "bodyguards" is closer to the verb. 7. If anyone comes over, take his or her name. The subject is anyone, which is singular, and therefore requires a singular pronoun such as "his" or "her". 8. One should take one's responsibilities seriously. The subject is one, which is singular, and therefore requires a singular pronoun. 9. This test is for students whose native language is not English. The correct relative pronoun to be used in this sentence is 'whose'. 10. My pencil is broken, can I borrow yours? The correct possessive pronoun is 'yours'. -
అభ్యసనంలో అతిముఖ్యమైన కారకం?
చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ 1.సిలబస్ రచనా పద్ధతుల్లోని సర్ఫిలాకార పద్ధతిని సమర్థించే వికాస నియమం? 1)వికాసం నిరంతరం జరుగుతుంది 2)వికాసం క్రమానుగతమైంది 3)వికాసం సంచితమైంది 4)వికాసం సాధారణం నుంచి నిర్దిష్టతకు దారితీస్తుంది 2.కింది వాటిలో సరికాని జత? 1)శారీరక పెరుగుదల వేగంగా జరిగే దశ - శైశవదశ 2)ఉద్వేగాలు ధారాపాతంగా ఏర్పడేదశ - పూర్వ బాల్యదశ 3)భిన్న లింగీయులతో జట్టు క్రీడల్లో పాల్గొనే దశ- ఉత్తర బాల్యదశ 4)ఒత్తిడి, ఒడిదుడుకుల దశ - కౌమారదశ 3.పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలోని దశలకు సంబంధించి సరి కానిది? 1)వస్తు స్థిరత్వ భావన పొందని దశ - సంవేదన చాలక దశ 2)మేక్ బిలీవ్ ప్లేకు సంబంధించిన దశ - పూర్వ ప్రచాలక దశ 3)నిగమన వివేచనం కనిపించే దశ - మూర్త ప్రచాలక దశ 4)సమస్యా పరిష్కారంలో పరికల్పనను రూపొందించుకునే దశ - అమూర్త ప్రచాలక దశ 4.కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికానిది? 1)బడికి వెళ్లడానికి అవసరాలు తీర్చుకోవడం - పూర్వ నైతిక స్థాయిలోని ఒకటో దశ 2)బడికి వెళ్లడానికి బహుమతులు తీసుకోవడం - పూర్వ నైతిక స్థాయిలోని రెండోదశ 3)ఉపాధ్యాయుల సంతృప్తి కోసం బడికి వెళ్లడం - సాంప్రదాయక నైతిక స్థాయిలోని మూడోదశ 4)ప్రధానోపాధ్యాయుని అధికారానికి లోబడి బడికి వెళ్లడం-సంప్రదాయ నైతికస్థాయిలోని నాలుగోదశ 5.కింది వాటిలో వ్యక్త్యంతర్గత భేదాన్ని సూచించనిది? 1)రాణి గణితంలో కంటే సాహిత్యంలో మిన్న 2)రాజు సాహిత్యంలో కంటే గణితంలో మిన్న 3)రాజు తరగతి విద్యార్థులలో దక్షత గలవాడు 4)విశాల్ శారీరకంగా బలవంతుడు- మానసికంగా బలహీనుడు 6.ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి సరికానిది? 1)శాబ్దిక పరీక్షలన్నీపేపర్ పెన్సిల్ పరీక్షలు. 2)అశాబ్దిక పరీక్షలన్నీ నిష్పాదన పరీక్షలు. 3)సంస్కృతి సహిత పరీక్షలన్నీ సంస్కృతి రహిత పరీక్షలో ప్రామాణికమైనవి. 4)వేగ పరీక్షలలో సులభత నుంచి క్లిష్టతకు ప్రశ్నలు ఉండవు. 7.కింది వాటిలో సహజసామర్థ్యం గల విద్యార్థి? 1)గౌతమ్ విభిన్న ఆలోచనలు గల విద్యార్థి 2)దేవీ సౌమ్య ఉద్వేగ పరిపక్వతగల విద్యార్థిని 3)చాణక్య కార్టూన్స్, కామిక్స్ అమితంగా ఇష్టపడే విద్యార్థి 4)రేష్మా చిత్రలేఖనంలో ప్రతిభ చూపే విద్యార్థిని 8.మూర్తిమత్వ పరీక్షల్లో ప్రక్షేపక పరీక్షకానిది? 1) బెల్స్ అడ్జెస్ట్మెంట్ ఇన్వెంటరీ 2) రోషాక్ సిరామరకల పరీక్ష 3) ఇతివృత్త గ్రాహ్య పరీక్ష 4) చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్ 9.తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు మూడు సమూహాలుగా విభజించాడు. అందులో మొదటి సమూహం వారికి ఇంటిపని చేస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. రెండో సమూహం వారికి ఇంటిపని ఇచ్చాడు. కానీ దండన, బహుమతి ప్రకటించలేదు. మూడో సమూహం వారికి ఇంటిపని చేయకపోతే దండన తప్పదని తెలిపాడు. ఇందులో నియంత్రిత సమూహం ఏది? 1) 1 2) 2 3) 3 4) 1,3 10.ఆరో తరగతి చదువుతున్న సాయి పాఠశాలలోని ఆటలు, స్నేహితులు ఆకర్షణగా ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులు ఆకర్షణగా లేకపోవడంతో చదువు కొనసాగించడమా లేదా వదిలివేయడమా అనేది నిర్ణయించుకోలేక పోతున్నాడు. ఆ విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ? 1) ఉపగమ-ఉపగమ 2) ఉపగమ-పరిహార 3) పరిహార-పరిహార 4) అనుమతి- నిరాకరణ 11.రక్షకతంత్రాలకు సంబంధించి సరి కానిది? 1)వెంకీ చిన్న పిల్లవానివలె ఏడవడం - ప్రతిగమనం 2)వెంకీ పరీక్ష తప్పటానికి ఉపాధ్యాయుడు కారణం అని చెప్పడం - హేతుకీకరణ 3)ప్రేమలేఖలు రాసే వెంకీ ప్రేమకథలు రాసి రచయితగా గుర్తింపుపొందడం- ఉదాత్తీకరణ 4)అవుట్డోర్ గేమ్స్ ఆడలేని వెంకీ ఇండోర్ గేమ్స్‌లో రాణించడం - పరిహారం 12.పిల్లల్లో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంత కర్త? 1) వైగాట్స్కీ 2) ఛామ్స్కీ 3) పియాజె 4) కోఫ్కా 13.కార్ల్ రోజర్స్ వికాస సిద్ధాంతం దృష్టి కేంద్రీకరించనది? 1) ఆత్మాశ్రయ వాస్తవికత 2) ైచైతన్యవంతమైన అనుభవాలు 3) సంజ్ఞానాత్మక అనుభవాలు 4) స్వీయభావన 14.కింది వాటిలో బోధన- అభ్యసన ప్రక్రియలో అభ్యాసకుని ప్రాధాన్య ఉపగమం? 1)నేను ఒక సబ్జెక్టును ఎలా బోధించాలి? 2)నేను బోధించే అంశాన్ని విద్యార్థులు ఎంత చక్కగా నేర్చుకుంటారు? 3)నేను తరగతిలో బోధించడానికి సామగ్రిని ఎంత సక్రమంగా నిర్వహిస్తాను? 4)విద్యార్థులు అర్థం చేసుకునే విధంగా ఎంత సమర్థంగా భావనను వివరించగలను? 15.విద్యార్థి అవుట్‌లైన్ పటం గీయాలంటే కింది అభ్యసనా సిద్ధాంతం ఆధారంగా నేర్చుకోవాలి? 1) పావ్లోవ్ ఎస్ టైప్ అభ్యసనం 2) స్కిన్నర్ ఆర్ టైప్ అభ్యసనం 3) థార్నడెక్ ఆర్- ఎస్ అభ్యసనం 4) బండూరా పరిశీలనా అభ్యసనం 16.ప్రయోగశాలలో పరికరం సరిగా ఉపయోగించిన విద్యార్థికి ఉపాధ్యాయుడు బహుమతిచ్చాడు. ఆ బహుమతి వల్ల ప్రేరణ పొందిన విద్యార్థి ప్రయోగం నిర్వహణను అభ్యసించాడు. ఇందులో ఇమిడి ఉన్న మనోవైజ్ఞానిక భావన? 1) పావ్లోవ్ ఎస్ టైప్ అభ్యసనం 2) స్కిన్నర్ ఆర్ టైప్ అభ్యసనం 3) థార్నడైక్ ఆర్- ఎస్ అభ్యసనం 4) బండూరా పరిశీలనా అభ్యసనం 17.నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, వర్షపాతం, అడవులు, మృత్తికలు, నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, పరిశ్రమలు, రవాణా, ఎగుమతులు, దిగుమతులు అనే భౌగోళిక శాస్త్ర భావనలు విడివిడిగా అభ్యసించడం కంటే మొ త్తంగా అభ్యసించడంలోని మనో వైజ్ఞానిక భావన? 1) పావ్లోవ్ ఎస్ టైప్ అభ్యసనం 2) కోహ్లెర్ అంతర్దృష్టి అభ్యసనం 3) థార్నడైక్ ఆర్- ఎస్ అభ్యసనం 4) బండూరా పరిశీలనా అభ్యసనం 18.కుడిచేతితో బొమ్మలు గీసే వ్యక్తి ఎడమచేతితో బంతిని విసిరే నైపుణ్యాన్ని సాధించడం? 1) అనుకూల బదలాయింపు 2) ప్రతికూల బదలాయింపు 3) శూన్యబదలాయింపు 4) ద్విపార్శ్వ బదలాయింపు 19.9989328365 అనే నంబర్ నేర్చుకొన్న విద్యార్థి కింది ఏ స్మృతి టెక్నిక్ ఉపయోగించి 9014143632 అనే నంబర్ నేర్చుకోవడం జరుగుతుంది? 1) రిహార్సల్ 2) నెమోనెక్స్ 3) ఆక్రానిక్స్ 4) ఛంకింగ్ 20.కింది వాటిలో అంతర్గత ప్రేరణ సందర్భం? 1)ఇతరుల నుంచి ప్రశంసలందుకోవాలనే ఉద్దేశంతో పనిచేయడం 2)గమ్యాన్ని సాధించాలనే వాంఛ 3)పరీక్షలో ర్యాంక్ సాధించడానికి అధ్యయనం చేయడం 4)ఇతరులను ఆనందపరచడానికి పనిచేయడం 21.చాలక వికాసానికి ఉదాహరణ కానిది? 1) ఆట సామగ్రిని ఉపాయంగా వినియోగించడం 2) వస్తువులను విసరడం 3) ఒక పాదం మీద స్కిప్పింగ్ చేయడం 4) ఎత్తుపెరగడం 22.అభ్యసనంలో అతిముఖ్యమైన కారకం? 1)ఉపాధ్యాయుడు-శిక్షణ 2)బోధన పద్ధతులు -శిక్షణ 3)అభ్యాసకుడు, ఉపాధ్యాయుడు, అభ్యసన సామగ్రి 4)గ్రంథాలయం, ప్రయోగశాల 23.పాఠశాలలో మార్గదర్శకత్వం వహించే వారికి సంబంధించి కింది వాటిలో సరైంది? 1)వారు పిల్లల సమస్యలను పరిష్కరిస్తారు 2)వారి భావాలను పిల్లలపై మోపి వారిని ఆ ప్రకారం నడుచుకోమంటారు 3)పిల్లల సమస్యలను పరిష్కరించడంలో వారికి సహాయ పడతారు 4)పిల్లల తరపున నిర్ణయాలు తీసుకొని పరిష్కారాలను ఆదేశిస్తారు 24.కౌన్సిలీకి మంచి మార్గదర్శకత్వం అందించడానికి కౌన్సిలర్ చేపట్టవలసిన మొదటి చర్య? 1)కౌన్సిలీతో మంచి సామరస్యతను ఏర్పరచుకోవడం 2)ఉపయోగించడానికి సరైన సాధనాలను ఎన్నుకోవడం 3)ఉపాయాత్మక ప్రశ్నల ద్వారా సమాచారాన్ని రాబట్టడం 4)సేకరించిన సమాచారం, కౌన్సిలీ భావసూచనల ద్వారా సమస్యను విశ్లేషించడం 25.సమ్మిళిత విద్య లక్ష్యం? 1)అంగవైకల్యత కలిగిన పిల్లలను రక్షించడం 2)బుద్ధిమాంద్యం కలిగిన పిల్లల అవసరాలను తీర్చడం 3)ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అందరి అవసరాలు తీర్చడం 4)పిల్లలందరి అవసరాలు తీర్చడం 26.బెదిరింపులుండని అభ్యసనా వాతావరణాన్ని సృష్టించడానికి ఉపాధ్యాయునికి ఇటువంటి నాయకత్వ శైలి అవసరం? 1) జోక్యరహిత 2) భాగస్వామ్య 3) ఆకర్షణీయ 4) నియంతృత్వ 27.మూల్యాంకనానికి సంబంధించి సరి కానిది? 1)అభ్యసనం కోసం అంచనా- లోపనిర్ధారణ మూల్యాంకనం 2)అభ్యసనా ప్రక్రియలో అంచనా - సమగ్ర మూల్యాంకనం 3)అభ్యసనాన్ని అంచనా వేయడం - సంకలన మూల్యాంకనం 4)అభ్యసనాన్ని అంచనావేస్తూ ఉండడం- నిరంతర సమగ్ర మూల్యాంకనం 28.ఒక్కొక్క జ్ఞానేంద్రియానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి బోధించాలని పేర్కొన్న విద్యా విధానం? 1) ప్రోబెల్ -కిండర్‌గార్డెన్ 2) మాంటిస్సోరి - చిల్డ్రన్హౌస్ 3) పెస్టాలజీ- యార్డన్బోర్డింగ్ 4) ప్లేటో- జిమ్నాషియా 29.విద్యాహక్కుచట్టం - 2009 ప్రకారం సరి కానిది? 1)మొత్తం ఉపాధ్యాయుల సంఖ్యలో ఖాళీల సంఖ్య 10 శాతానికి మించ కూడదు. 2)విద్యార్థికి అతని వయసుకు తగిన తరగతిలో ప్రవేశాన్ని కల్పించాలి. 3)నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని చట్టంలో ప్రస్తావించడం 4)8వ తరగతిలోపు బోర్డు పరీక్షలు నిర్వహించడం 30.జాతీయ పాఠ్యప్రణాళిక చట్రంప్రకారం సరి కానిది? 1)ఇంగ్లిష్‌ను బోధనామాధ్యమంగా ఉపయోగించడం 2)నిరంతర సమగ్రమూల్యాంకనం 3)బహుభాషా విధానాన్ని తెలియజేయడం 4)అభ్యసనంలో నిర్మాణాత్మక ఉపగమం ఉపయోగం తెలుగు కింది గద్య భాగాన్ని చదివి 31నుంచి 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. సాంస్కృతిక పునరుజ్జీవనం రెండు చేతులా పెంపొందించిన మహానుభావులు ముగ్గురూ వెనువెంటనేరావడం మన మహా భాగ్యం. వారు పదితరాలలో పదివందల మందితో జరిగే పనిని ఒక్క చేతి మీదిగా నడపగలిగారు. వారిలో ఒకరు కందుకూరి వీరేశలింగం (1848-1919). ఆయన తెలుగు దృక్పథంలోనే వినూత్నమైన మార్పు తేగలిగారు. బ్రహ్మ సమాజ స్థాపన ద్వారా సాంఘిక సంస్కరణలకు బీజావాపనం చేశారు. అనేక మూఢాచారాలను వెక్కిరించి వేళాకోళం చేసి తప్పుకోకుండా వాటి సమూల నిర్మూలనకు తెగించి పోరాడారు. తొలి నవల రాశారు. తొలి కవుల చరిత్ర, తొలి నాటకం, తొలి స్వీయ చరిత్ర.. ఇలా చాలా ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే సృజనాత్మక సాహిత్యంలో ఒక వినూత్న ప్రయోగం చేసి చిన్నకథకు ప్రాణం పోసి, వచన వ్యావహారిక సాంఘిక నాటకానికి ప్రాణప్రతిష్ఠ చేసి దేశమును ప్రేమించమనీ, మంచిని పెంచుకోమనీ ప్రబోధించి అజరామరుడైన గురజాడ అప్పారావు (1861-1915) రెండోవారు. సాహిత్యంలో వ్యావహారిక భాషకు పట్టం కట్టి వచనం విస్తరించేందుకు కృషిచేసి, తన జీవితంలోనే ఉద్యమ సాఫల్యాన్ని చవిచూసి సంతృప్తుడైన గిడుగు రామ్మూర్తిపంతులు (1862-1963) మూడోవారు. 31.సాంస్కృతిక పునరుజ్జీవనానికి ముగ్గురు మహానుభావులు చేసిన కృషి ఎలాంటిది? 1)వందలాది మందితో జరిగే పనిని ఒక్కరే చేశారు. 2)పది తరాల్లో పదివందల మందితో జరిగే పనిని ఒక్క చేతి మీదిగా నడిపించారు. 3)పది వందల మందితో జరిగే పనిని ఒక్కరే చేశారు 4)పది తరాల్లో జరిగే పనిని ఒక్కరే చేయగలిగారు 32.మూఢాచారాల నిర్మూలన కోసం పోరాడింది? 1) కందుకూరి వీరేశలింగం 2) చిలకమర్తి 3) గురజాడ 4) గిడుగు రామ్మూర్తి 33.వ్యావహారిక సాంఘికనాటకానికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది? 1) పానుగంటి 2) కందుకూరి 3) గురజాడ 4) గిడుగు 34.సాహిత్యంలో వచనం విస్తరణకు కృషి చేసింది? 1) రాయప్రోలు 2) గురజాడ 3) కందుకూరి 4) గిడుగు 35.తెలుగు సాహిత్యంలో ప్రక్రియలన్నింటికీ శ్రీకారం చుట్టిన రచయిత? 1) చిలకమర్తి 2) కందుకూరి 3) గురజాడ 4) గిడుగు అపరిచిత పద్య భాగం కింది అపరిచిత పద్యాన్ని చదివి 36 నుంచి 40 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. సిరిగలవాడు మైమరిచి చిక్కిననాడు, తలంచి పుణ్యముల్ పొరిపొరి చేయనైతినేనని పొక్కిన గల్గునే? గాలిచిచ్చుపై కెరలిన వేళడప్పిగొని కీడ్పడువేళ జలంబుగోరి త త్తరమున ద్రవ్వినంగలదే? దాశరథీ కరుణాపయోనిధీ! 36.ఈ శతక పద్య రచయిత? 1) బద్దెన 2) మారద వెంకయ్య 3) కంచర్ల గోపన్న 4) ధూర్జటి 37. ఈ పద్యం ఏ వృత్తానికి సంబంధించింది? 1) ఉత్పలమాల 2) చంపకమాల 3) శార్దూలం 4) మత్తేభం 38.‘పొక్కిన’ పదానికి అర్థం? 1) కమలిన 2) సంతోషించిన 3) తినిన 4) కుమిలిన 39.ధనమున్నప్పుడు పుణ్యకార్యాలు చేయకుండా చివరలో చింతించే వ్యక్తికి కవి చెప్పిన దృష్టాంతం? 1) గాలి నిప్పుపై విజృంభించేటప్పుడు నీటిపై ప్రయత్నించడం 2) దాహం వేసినప్పుడు బావిని తవ్వేందుకు ప్రయత్నించడం 3) సమయం మించిన తర్వాత కుమిలిపోవడం 4) ైపైవన్నీ 40.‘త్రవ్వినంగలదే!’ పదాన్ని విడదీస్తే...? 1) త్ర వ్వినం+గలదె 2) త్రవ్వినన్+కలదె 3) త్రవ్వినం+కలదె 4) త్రవ్వినన్+గలదె 41.ఉభయ కవి మిత్రుడు అనే బిరుదున్న కవి? 1) నన్నయ 2) తిక్కన 3) పోతన 4) ఎర్రన 42.జాషువా ‘గబ్బిలం’,‘ నాకథ’ ఏ ప్రక్రియకు చెందిన రచనలు? 1) పద్యకావ్యం-ఖండకావ్యం 2) ఖండకావ్యం-స్వీయ చరిత్ర 3) సందేశ కావ్యం -స్వీయ చరిత్ర 4) పద్యకావ్యం- ఆత్మకథ 43.రాయప్రోలు వారి ‘లలిత’, ‘ఆంధ్రావళి’ ఏ ప్రక్రియకు చెందిన రచనలు? 1) పద్యకావ్యం-వచన కావ్యం 2) అనువాదకావ్యం-ఖండకావ్యం 3) గేయకావ్యం-ఖండకావ్యం 4) వచన కావ్యం-ఖండకావ్యం 44.‘మాధవి తనపనేదో తానుచేసుకుంటానన్నది’.. ఇది ఏ వాక్యం? 1) కర్మణి వాక్యం 2) ప్రత్యక్ష వాక్యం 3) క్రియారహిత వాక్యం 4) పరోక్షవాక్యం 45.‘రేపు పరీక్ష జరగవచ్చు’ అనే వాక్యం? 1) అనుమత్యర్థకం 2) సంభావనార్థకం 3) నిశ్చయార్థక వాక్యం 4) నిషేధార్థక వాక్యం 46.వర్ణమాల ప్రకారం సరైన వరుసక్రమం? 1) గ-డ-జ-వ-ద 2) గ-జ-డ-ద-బ 3) గ-డ-ద-బ-జ 4) గ-బ-డ-జ-ద 47.‘దేశాభివృద్ధికి ప్రణాళికలెన్ని వచ్చినా చాలా మందికి పేదరికం పోలేదు’ అనే వాక్యంలో అసమాపక క్రియ? 1) క్త్వార్థకం 2) ఛేదర్థకం 3) అప్యర్థకం 4) ప్రశ్నార్థకం 48.‘అత్యంత’ పదంలో ఉన్న సంధి? 1) యణాదేశ సంధి 2) వృద్ధి సంధి 3)సవర్ణదీర్ఘ సంధి 4) గుణ సంధి 49.‘బాపురే’ పదం ఏ భాషాభాగానికి చెందింది? 1) క్రియ 2) విశేషణం 3) సర్వనామం 4) అవ్యయం 50.బహువ్రీహి సమాసానికి ఉదాహరణలు? 1) చక్రపాణి, కుంభాకారుడు, నెలతాల్పు 2) నలువ, చక్రపాణి, కమలాక్షుడు 3) శీతాద్రి, చక్రపాణి, పీతాంబరుడు 4) ముక్కంటి, సంసారసాగరం, పూబోడి 51.‘శశవిషాణం’ అనే జాతీయానికి అర్థం? 1) చంద్రుని వెన్నెల 2) చంద్రునిలో మచ్చ 3) కుందేటికొమ్ము 4) చంద్రునిమీద పాషాణం 52.‘‘కార్యము’’ అనే పదానికి వికృతి? 1) కారము 2) కర్జము 3) కోరము 4) కరణం 53.‘నోట్లో వేలు- నెత్తి మీదరాయి’ పొడుపు కథకు అర్థం? 1) గడియారం 2) వడ్డాణం 3) కడియం 4) ఉంగరం 54.‘సన్యాసి’ పదంలో జరిగిన అర్థ విపరిణామం? 1) అర్థసంకోచం 2) అర్థవ్యాకోచం 3) అర్థాపకర్ష 4) అర్థగౌరవం 55.‘మాతృభాష తల్లిపాల వంటిది’ అని పేర్కొన్నది? 1) గాంధీ 2) కొమర్రాజు లక్ష్మణరావు 3) ఠాగూర్ 4) వావిలాలగోపాలకృష్ణయ్య 56.సాధారణంగా ఉక్తలేఖనాన్ని మూడుసార్లు చెప్పాలి. మొదటిసారి చెప్పినప్పుడు విద్యార్థి చేయాల్సిన పని? 1) వినాలి- రాయాలి 2) తప్పులు సరిచూసుకోవాలి 3) ఏకాగ్రతతో వినాలి 4) రాయాలి 57.గద్యబోధన సందర్భంలో ఉపాధ్యాయుడు వ్యాకరణాంశాలు బోధించాల్సిన సమయం? 1) చర్చ అనంతరం 2) బాహ్యపఠనం తర్వాత 3) విద్యార్థుల మౌనపఠనానికి ముందు 4) ఉపాధ్యాయుడి ఆదర్శ పఠనం కంటే ముందు 58.లఘుతర ప్రశ్నలు సిద్ధం చేసేటప్పుడు ఉపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం? 1)మాదిరి సమాధానాలను ముందే రాసుకోవాలి. 2)ప్రతి ప్రశ్నను ఫలితాలను బట్టి రూపొందించాలి 3)ప్రతి ప్రశ్నకు స్పష్టమైన ఒకే సమాధానం రావాలి 4)కాదు, లేదు వంటి ప్రశ్నలు అడగాలి 59.బోధనా లక్ష్యాలను ‘టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్’లో వివరించిన విద్యావేత్త? 1) గ్విన్ 2) బెంజమిన్ బ్లూమ్స్ 3) సిసిరో 4) లివింగ్స్టన్ 60.కృత్యాధారపద్ధతికి (అపెప్) మరో పేరు? 1) డాల్టన్ పద్ధతి 2) నాటకీకరణ పద్ధతి 3) మనోవైజ్ఞానిక పద్ధతి 4) చర్చా పద్ధతి ENGLISH 61.In letter writing subscription is ____ and it terminated with____. 1) The beginning of the letter; a comma 2) The end of the letter; a comma 3) The beginning of the letter; a full stop 4) The end of the letter; a full stop 62.If pronouns of different persons are to be used together in a sentence, the serial order of persons should be as follows: 1)first person, second person, third person 2)second person, first person, third person 3)second person, third person, first person 4) third person,second person, first person 63.The following sentence has been divided into four parts 1, 2, 3 and 4. There is an error in these parts. Detect the error and identify the part. The Renaissance is one of the most (1)/ interesting (2)/period in the history of architecture (3)/and indeed, of art in general (4). 64.Which of the sentence is correctly punctuated. 1)High and low, rich and poor must die! 2)High and low, rich and poor, must die. 3)High and Low, Rich and Poor must die. 4)High and low, rich and poor must die. 65.He was so learned that he seemed to know everything. Choose the correct compound form. 1)He was very learned and so seemed to know everything. 2)He was too learned to know everything. 3)He was very learned but did not know anything. 4)He was very learned and knows everything. 66.The following sentence is in positive form. Very few companies in the world are as famous as the Reliance. Select the superlative form. 1)The Reliance is not the most famous of all the companies in the world.. 2)The Reliance is one of the most famous companies in the world. 3)The Reliance is the most famous of all the companies. 4)The Reliance is famous than many other companies in the world. 67.Material (Choose the correct antonym.) 1) aerial 2) watery 3) hollow 4) spiritual 68.He is a good poet but not _____ Shakespeare. Fill in the suitable article. 1) a 2) an 3) the 4) no article 69. The arrow pierced _______ the villain's heart. Fill in the suitable preposition. 1) from 2) beside 3) into 4) through 70. Past perfect continuous tense is used for an action that was in progress over a period of time in the past. Select the best example from the given sentences. 1) I had been working in this office for five years by 2000. 2) He had been working in this office since 2000. 3) He had worked in this office for five years. 4) He had working this office for five years. Choose the passive form of the sentence . 71."He writes a novel." (Convert the given sentence into past perfect tense.) 1) He wrote a novel. 2) He was writing a novel 3) He had written a novel 4) He had been writing a novel 72.One must do one's duty. 1) One's duty must be done by one. 2) One must be done his duty. 3) One must be done with one's duty. 4) Duty must be done. 73.She said to him,"Are you not happy with what you have got?" The indirect form is: 1) She told him whether he is not happy with what he had got, 2) She asked him if he was not happy with what he got. 3) She asked him whether he was not happy with what he has got. 4) She asked him if he was not happy with what he had got 74.Choose the most appropriate one word substitute. A player who acts not by speaking, but wholly by gesticulations. 1) Pantomine 2) Patricide 3) Patent 4) Paronyms 75.A Necromaneer is: 1) Doctor 2) Magician 3) Neurologist 4) Agriculturist Read the following passage carefully and choose the best answer out of the four alternative. The chief condition of happiness bearing certain physical prerequisites, is the life of reason the specific carry and power of man. Virtue or rather excellence, will depend on clear judgement , selfcontrol, symmetry of desire, artistry of means, it is not the possession of the simple man, nor the gift of innocent extent, but the achievement of experience in the fully developed man. Yet there is a road to it, a guide to excellence, which may save many detours and delays; it is the middle way the golden mean. The qualities of character can be arranged in triads in each of which the first and the last qualities will be extremes and vices, and the middle quality a virtue or an excellence. So between cowardice and reshness is courage: between stinginess and extravagance is liberally; between sloth and greed is ambition between humility and pride is modesty; between secrecy and loquacity is honesty; between moroseness and buffoonery is good humour between quarrelsomeness and flattery is friendship between Hamlet's indecisiveness and Quixote's impulsiveness is self control 'Right' in ethics or conduct is not different from right in mathematics or engineering; it man correct and fit what works best to the best results. 76.What is the main idea of passage? 1) The qualities of character are there -extremes and middle. 2) In some respects ethics and mathematics resemble. 3) Happiness can be achieved by following the middle path. 4) None of there. 77. What is the implied meaning of the passage? 1) Happiness depends upon physical and mental qualities. 2) Self control is necessary. 3) Excellence should be achieved. 4) Rational approach lies in following the middle path. 78.synonym of excellence? 1) Inferiority 2) Failure 3) Imperfection 4) Eminence 79.Which of the following is not the middle path of different qualities? 1) Liberality 2) Ambition 3) Friendship 4) Secrecy 80.who among the following is not the writer of either Hamlet or Don Quixote? 1) Benjonson 2) Shakespeare 3) Cerventes 4) None of these 81.Which of the following is the suitable title for the passage? 1) Qualities of character 2) Chief condition of happiness 3) Golden mean 4) None of this 82.She cooks well, ________ ? Add the question tag. 1) Didn't she 2) Did she 3) Doesn't she 4) isn't she Choose the correct meaning of the idioms and phrases 83.'At arms length" 1) length of arm 2) At a distance 3) insult 4) very near 84.On the spur of the moment 1) at once 2) get delayed 3) give justice 4) practically 85.Eliciting the grammar rules from the student rather than telling them is: 1) inductive method 2) bilingual method 3) deductive method 4) none 86.In learning language every student besides acquiring L, S, R, and W skills, should also develop Reference skill . Which reference material is preferred by the student if he has to look for synonyms and antonyms 1) Thesaurus 2) Dictionary 3) Encyclopedia 4) atlas 87.Reading for information is: 1) Intensive reading 2) Extensive reading 3) Reading Aloud 4) none 88. _____test will help to find out a set of qualities of an individual to solve specified problems. 1) aptitude test 2) Diagnostic 3) Achievment 4) unit test 89. which of the following letters are written in the same technique. 1) b f a s t 2) l t g d e 3) a e d g 4) b f a l 90. in language learning speaking is primary and help in interaction and communication. As an ELT how would you promote speaking skills. 1) use translation method 2) introduce dialogue technique 3) Make them write a composition 4) Introduce word stress పరిసరాల విజ్ఞానం 91.వర్మీ కంపోస్ట్ తయారీకి తవ్విన గుంటలో అడుగు భా గం నుంచి పై భాగం వరకు వరుసగా వీటిని వేస్తారు? 1) పేడ, వానపాములు ్ధ పీచు, చెత్త ్ధ గడ్డి 2) చెత్త, గడ్డి ్ధ పీచు, పేడ ్ధ వానపాములు 3) పీచు ్ధ చెత్త, గడ్డి ్ధ పేడ, వానపాములు 4) వానపాము, పేడ ్ధ చెత్త, పీచు ్ధ గడ్డి 92.మొట్టమొదటిసారిగా ఎవరి కాలంలో ‘రాజ్యం’ అవతరించింది? 1) సింధు నాగరికత 2) ఆర్య నాగరిక త 3) మగధ వంశం 4) సింధు ప్రజల పూర్వీకులు 93. రామయ్య ఏకైక కుమారుడు వేణు, రంగయ్య కుమారుడు రామ్. రామ్, లక్ష్మణులు సోదరులు. లక్ష్మణ్ సోదరి వేణుకు భార్య, రామయ్య భార్య రామ్ భార్యకు ఏమవుతుంది? 1) అత్త 2) పిన్ని 3) అక్క 4) కూతురు 94. ‘జలుబు’ వ్యాధికారకం? 1) రినో వైరస్ 2) వెరిసెల్లా వైరస్ 3) ఆర్థోమిక్సో వైరస్ 4) పారా వైరస్ 95. కింది వాటిలో తప్పుగా జతపరచింది? 1) ఏకవార్షికాలు-వరి, గోధుమ, చిక్కుడు 2) ద్వివార్షికాలు -క్యారెట్, బీట్రూట్, ముల్లంగి 3) బహువార్షికాలు-మామిడి, వేప, చింత 4) పైవేవీకావు 96. మానవుని దంతసూత్రం? 1) 2/2, 1/1 , 2/2, 3/3 2) 1/2, 2/1, 3/2, 3/3 3)1/1, 2/2, 3/3, 2/2, 4) 3/2, 3/3 ,1/2, 2/1 97. కింది వాటిలో ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవి? 1) నత్త 2) అమీబా 3) కప్ప 4) బల్లి 98. బాత్రూమ్లను శుభ్రం చేయడానికి ఉపయోగించేది? 1) వెనిగార్ 2) ఎసిటికామ్లం 3) హైడ్రోక్లోరిక్ ఆమ్లం 4) కార్బోనికామ్లం 99. మనశరీరానికి తక్షణ శక్తిని అందించేవి? 1) చక్కెరలు 2) ప్రోటీన్లు 3) కొవ్వులు 4) విటమిన్లు 100. జైపూర్‌లో నివసించే వారికి ఏ రకమైన ఇళ్ల్లు సౌకర్యం? 1) వెదురుకర్ర ఇళ్లు 2) మట్టి ఇళ్లు 3) చెక్క ఇళ్లు 4) గుడారాలు 101. ఓజోన్‌పొర దెబ్బతినడానికి కారణమవుతున్న క్లోరోఫ్లోరోకార్బన్ల విడుదలను నిలువరించాలంటే? 1) రిఫ్రిజిరేటర్, ఏసీల వినియోగం తగ్గించాలి 2) మోటారు వాహనాల వాడకం నియంత్రించాలి 3) శబ్ద కాలుష్య తీవ్రతను తగ్గించాలి 4) శబ్ద, వాయు కాలుష్య కార కాల వాడకం తగ్గించాలి. 102. వర్షాకాలంలో కలుషిత నీరు తాగడంతో వచ్చే వ్యాధి? 1) కలరా 2) మలేరియా 3) డయేరియా 4) కోరింతదగ్గు 103. 82బీని డిగ్రీల తూర్పు రేఖాంశంపై గల ఒక పట్టణంలో స్థానిక సమయం మధ్యాహ్నం 12బీ గంటలు అయితే లండన్‌లో ఎంత సమయం అవుతుంది? 1) సాయంత్రం 6 గంటలు 2) ఉదయం 7 గంటలు 3) సాయంత్రం 7 గంటలు 4) ఉదయం 6 గంటలు 104. వీటిలో ‘సర్వభక్షకి’ 1) తొండ 2) కోడి 3) బల్లి 4) సాలెపురుగు 105. ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే అంతర్జాతీయ కొలమానం? 1) కెలోరీమీటర్ 2) కాండిలా 3) సెల్సియస్ 4) కెల్విన్ 106. ఏ నేలల్లో పొటాష్, ఫాస్ఫారికామ్లాలు ఎక్కువ? 1) నల్లరేగడి 2) ఎర్రనేలలు 3) ఒండ్రునేలలు 4) లాటరైట్ 107. వైరస్ వల్ల వచ్చే ట్రిస్టిజ అనే వ్యాధి వేటికి వస్తుంది? 1) పాడి పశువులు 2) గొర్రెలు 3) నిమ్మ, కొబ్బరి 4) చీనీ, బత్తాయి 108. భూమి తన చుట్టు తాను తిరగడానికి పట్టే కాలం? 1) 23 గంటల 56 నిమిషాల 6 సెకన్లు 2) 23 గంటల 56 నిమిషాల 8.05 సెకన్లు 3) 23 గంటల 56 నిమిషాల 7 సెకన్లు 4) 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు 109. బీఆర్ అంబేద్కర్ జన్మించిన సంవత్సరం? 1) 1889 2) 1890 3) 1891 4) 1892 110. కింది వాటిని జతపరచండి? 1. భరతనాట్యం ్చ. ఆంధ్రప్రదేశ్ 2. కూచిపూడి ఛ. తమిళనాడు 3. కథక్ ఛి. ఉత్తరప్రదేశ్ 4. కథాకళి ఛీ. కేరళ 1) 1-ఛ, 2-్చ, 3-ఛి, 4-ఛీ 2) 1-్చ, 2-ఛ, 3-ఛీ, 4-ఛి 3) 1-ఛి, 2-ఛ, 3-ఛీ, 4-్చ 4) 1-ఛీ, 2-ఛ, 3-్చ, 4-ఛి 111. రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఉప రాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఆ సమయంలో ఈ విధంగా జరుగుతుంది? 1) ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేస్తాడు 2) ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షుడుగా కూడా వ్యవహరిస్తాడు 3) ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి హోదాలోనే జీతభత్యాలను స్వీకరిస్తాడు 4) పైవన్నీ 112. శక్తిమంతమైన హక్కు? 1) స్వాతంత్య్రపు హక్కు 2) రాజ్యాంగపరిహారపు హక్కు 3)వాక్ స్వాతంత్య్రపు హక్కు 4) ఆస్తిహక్కు 113. ఐక్యరాజ్యసమితి దినోత్సవం? 1) అక్టోబర్ 10 2) అక్టోబర్ 14 3) అక్టోబర్ 20 4) అక్టోబర్ 24 114. సమాచారహక్కు చట్టం కింది వారికి వర్తించదు? 1) ఏపీ వక్ఫ్‌బోర్డు 2) ఎన్సీఈఆర్టీ 3) రాజకీయ పార్టీలు 4) పైవన్నీ 115. ‘సబిత’కు విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన వార్తలు మ్యాగజైన్స్ నుంచి కత్తిరించి దాచే అలవాటు ఉంది. దీన్ని బట్టి ఆమె ఏ లక్ష్యం సాధించినట్టు? 1) అవగాహన 2) వినియోగం 3) అభిరుచి 4) నైపుణ్యం 116. ఉపాధ్యాయుడు యూనిట్టెస్ట్లో ఇచ్చిన ప్రశ్న ఇలా ఉంది. బొద్దింక ఆర్థ్రోపొడా జీవి. వానపాము______ అనేది ఏ రకమైన ప్రశ్న? 1) పూరక ప్రశ్న 2) సాదృశ్య ప్రశ్న 3) వర్గీకరణ ప్రశ్న 4) ఏకాంతర ప్రశ్న 117. జశ్వంత్ విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు. అతను విద్యార్థులకు మిత్రుడిగా, సలహాదారుడిగా, మార్గదర్శిగా, పర్యవేక్షకుడిగా ఉండాలనుకుంటే ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి? 1) ఉపన్యాస పద్ధతి 2) ప్రదర్శనా పద్ధతి 3) చారిత్రక పద్ధతి 4) ప్రాజెక్ట్ పద్ధతి 118. లక్ష్యాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది? 1)ధరకు, డిమాండ్‌కు మధ్య విలోమ సంబంధాన్ని బాలు గుర్తించాడు - అవ గాహన 2)ఉష్ణోగ్రతకు ఎత్తై ప్రాంతాలకు మధ్య పరస్పర సంబంధాన్ని అఖిల స్థాపించింది-వినియోగం 3)సూర్య కుటుంబం నమూనాను తయారు చేసి గ్రహాలు, ఉపగ్రహాలను రాధ విశ్లేషించింది-నైపుణ్యం,వినియోగం 4)నవనీత తప్పు, ఒప్పు ప్రశ్నలలో ఒప్పు అనే సమాధానాన్ని సత్యమని గుర్తించింది-అవగాహన 119. బోధనోపకరణాలకు సంబంధించి సరికానిది? 1)విజయనగర సామ్రాజ్యంలో వంశాల క్రమాన్ని చూపే చార్టు- ఫ్లో చార్టు 2)భారత స్వాతంత్య్ర ఉద్యమంలోని సంఘటనలను తెలిపే చార్టు- టైంలైన్ చార్టు 3)హిమాలయాలు ఈశాన్యంలో పెట్టనికోట వలె ఉన్నాయి అని తెలిపే మ్యాప్ - రిలీఫ్ మ్యాప్ 4)భారతదేశంలో1951-2011 వరకు అక్షరాస్యత అభివృద్ధిని సూచించే గ్రాఫ్-సచిత్రగ్రాఫ్ 120. కింది బోధనా పద్ధతులలో సరి కానిది? 1)శివాజీ జీవిత చరిత్రను బోధించడానికి అనువైన పద్ధతి- కథన పద్ధతి 2)సూర్య కుటుంబం పాఠ్యాంశం బోధించడానికి అనువైన పద్ధతి - ప్రాజెక్ట్ పద్ధతి 3)ఎత్తై ప్రాంతాలు చల్లగా ఉంటాయా? అనే సమస్యను బోధించడానికి అనువైన పద్ధతి- ఆగమన పద్ధతి 4)భారతదేశంలోని శాసనాలు, చిరస్మారకాలు అనే పాఠ్యాంశం బోధించడానికి అనువైన పద్ధతి - మూలాధార పద్ధతి మ్యాథమెటిక్స్ 121. 3, 4ల మధ్యలేని అకరణీయ సంఖ్య? 1) 29/9 2) 28/9 3) 15/4 4) 5/3 122. 360 చ.మీ. వైశాల్యం కలిగిన సమాంతర చతుర్భుజం భూమి, ఎత్తుల నిష్పత్తి 5:2. అయితే ఆ సమాంతర చతుర్భుజం ఎత్తు ఎంత? 1) 30 మీ. 2) 9 మీ. 3) 12 మీ. 4) 10 మీ. 123. రెండు వృత్తాల వ్యాసాల నిష్పత్తి 2:3 అయితే వాటి చుట్టుకొలతల నిష్పత్తి? 1) 2:3 2) 3:2 3) 4:9 4) 9:4 124. సమబాహు త్రిభుజం భ్రమణ సౌష్టవ కోణం? 1) 60ని 2) 90ని 3) 120ని 4) 180ని 125. పూర్ణ సంఖ్యలు భాగహారం దృష్ట్యా పాటించే ధర్మం? 1) సంవృత 2) స్థిత్యంతర 3) సహచర 4) ఏదీకాదు 126. ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకు +3 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కు లు, జవాబు రాయకుంటే 0 మార్కులు కేటాయించారు. రాణి రాసిన జవాబుల్లో 12 సరైనవి. అప్పుడు ఆమె పొందిన మార్కులు 20. అయితే ఆమె రాసిన తప్పు జవాబులెన్ని? 1) 10 2) 8 3) 12 4) 4 127. వీటిలో సరికాని దాన్ని గుర్తించండి? 1) 2) 3) 4) 128. 0.5 ొ 0.05=? 1) 0.1 2) 10 3) 0.01 4) 100 129. కింది వాక్యాల్లో అసత్యాన్ని గుర్తించండి? 1) ధన అకరణీయ సంఖ్య సమాన అకరణీయ సంఖ్యలన్నీ ధనరాశులే 2) {పతిపూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య 3) 7/8, 9/8, 8/8 లు సమాన అకరణీయ సంఖ్యలను సూచిస్తాయి 4) {పతిదశాంశ సంఖ్యను అకరణీయ సంఖ్యారూపం లో రాయొచ్చు 130. రాము తండ్రి ప్రస్తుత వయసు, రాము ప్రస్తుత వయసుకు మూడు రెట్లు ఎక్కువ. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం 70 సంవత్సరాలు. అయితే రాము తండ్రి ప్రస్తుత వయసు ఎంత? 1) 60 సం॥ 2) 50 సం॥ 3) 40 సం॥ 4) 45 సం॥ 131. 30ని పూరక కోణం ఎంత? 1) 150ని 2) 60ని 3) 330ని 4) 240ని 132. పటంలో //ఆఇ అయితే కోణం గీ ఎంత? 1) 75ని 2) 45ని 3) 90ని 4) 60ని 133. ఒక సంఖ్యలో 40శాతం 800కి సమానమైన ఆ సంఖ్య? 1) 3200 2) 3000 3) 2000 4) 2400 134. 42 ్ఠడ్డ2 పరిమాణం? 1) 42 2) 2 3) 4 4) 42 135. 1+2్ఠ3్ఠ2కు ఎంత కలిపినా ్ఠ2-్ఠ-1 వస్తుంది? 1) 4్ఠ23్ఠ+2 2) 4్ఠ2+3్ఠ2 3) 4్ఠ23్ఠ+1 4) 4్ఠ23్ఠ2 136. 42ని2ని+3ని విలువ? 1) 45ని 2) 43ని 3) 1 4) 0 137. 11తో నిశ్శేషంగా భాగించబడని సంఖ్య? 1) 20801 2) 10824 3 138. వీటిలో కాప్రేకర్ స్థిరాంకం? 1) 6714 2) 6174 3) 7614 4) 7416 139. 12+4272ను సూక్ష్మీకరిస్తే ? 1) 21 2) 21 3) 37 4) 45 140. వీటిలో సరైంది? 1) క్రమభిన్నం వ్యుత్క్రమం క్రమభిన్నం 2) అపక్రమభిన్నం వ్యుత్క్రమం అపక్రమ భిన్నం 3) మిశ్రమ భిన్నం వ్యుత్క్రమం మిశ్రమ భిన్నం 4) ప్రతి సహజసంఖ్య వ్యుత్క్రమం క్రమభిన్నం 141. 68 మి.మీ.లను కి.మీ.లలో పేర్కొంటే? 1) 0.68 కి.మీ. 2) 0.0068 కి.మీ. 3) 0.00068 కి.మీ. 4) 0.000068 కి.మీ. 142. 9 అనేది? 1) సంయుక్త సంఖ్య 2) సహజ సంఖ్య 3) పూర్ణసంఖ్య 4) అన్నీ 143. భావన ఒక నవల్లో 1/4 భాగాన్ని ఒక గంటలో చదువుతుంది. అయితే ఆమె రెండున్నర గంటల్లో చదవగలిగే భాగం ఎంత? 1) పూర్తిభాగం 2) 5/8 భాగం 3) సగభాగం 4) 8/5 భాగం 144. 18,453ను సమీప వందలకు సవరించి రాయగా? 1) 18,000 2) 18,400 3) 18,500 4) 19,000 145. సంశ్లేషణ పద్ధతి దోషం కానిది? 1) నూతన ఆవిష్కరణకు అవకాశం 2) సుదీర్ఘమైన పద్ధతి 3) సోపానాలు గుర్తురాక మధ్యలోనే వదిలేస్తారు 4) సంపూర్ణ అవగాహనకు తావుండదు 146. కష్టమైన సమస్యను సాధించడానికి ముందు తేలికైన సమస్యను తీసుకొని సాధన చేసి ఆ సాధనా విధానాన్ని క్లిష్టమైన సమస్యను సాధించడానికి ఉపయోగించేది? 1) ఆధారిత పద్ధతి 2) చిత్రీకరణ పద్ధతి 3) పునఃప్రవచన పద్ధతి 4) సాదృశ్యాల పద్ధతి 147. విద్యార్థి భిన్నాలకు సంబంధించిన నిత్య జీవిత సమస్యలను విశ్లేషణ చేస్తాడు. ఇది ఏ లక్ష్యానికి చెందింది? 1) అవగాహన 2) అభిరుచి 3) వినియోగం 4) సహజీకరణం 148. బాహ్యప్రేరణ కంటే అంతఃప్రేరణకు ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచించే బోధనా పద్ధతి? 1) మాంటిస్సోరి పద్ధతి 2) కిండర్ గార్డెన్ పద్ధతి 3) సమస్యా పరిష్కార పద్ధతి 4) ప్రయోగశాల పద్ధతి 149. ప్రత్యామ్నాయ ప్రతిస్పందనల రకానికి చెందిన ప్రశ్నలకు సంబంధించి సరికానిది? 1)అనిశ్చిత వాక్యాలు ఇవ్వరాదు 2)విద్యార్థికి జవాబులు రాయడంలో స్వేచ్ఛ ఉండదు 3)బోధనా లక్ష్యాల్లో నైపుణ్యాన్ని మాత్రమే పరీక్షిస్తుంది 4)ఇచ్చిన వాక్యం నిర్దిష్టంగా ఉండాలి 150. చతురస్రంలోని కర్ణం దానికి రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజానికి సమానం అని తెలిపింది? 1) పైథాగరస్ 2) యూక్లిడ్ 3) ఆర్యభట్ట 4) మహావీర సమాధానాలు 1) 2; 2) 3; 3) 3; 4) 1; 5) 3; 6) 2; 7) 4; 8) 1; 9) 2; 10) 2; 11) 2; 12) 2; 13) 3; 14) 2; 15) 3; 16) 2; 17) 2; 18) 3; 19) 4; 20) 2; 21) 4; 22) 3; 23) 3; 24) 1; 25) 4; 26) 2; 27) 2; 28) 2; 29) 4; 30) 1; 31) 2; 32) 1; 33) 3; 34) 4; 35) 2; 36) 3; 37) 2; 38) 4; 39) 4; 40) 2; 41) 2; 42) 3; 43) 2; 44) 4; 45) 2; 46) 2; 47) 3; 48) 1; 49) 4; 50) 2; 51) 3; 52) 2; 53) 4; 54) 3; 55) 2; 56) 3; 57) 3; 58) 1; 59) 2; 60) 3; 61) 2; 62) 2; 63) 3; 64) 4; 65) 1; 66) 2; 67) 4; 68) 3; 69) 4; 70) 1; 71) 3; 72) 4; 73) 4; 74) 1; 75) 2; 76) 3; 77) 4; 78) 4; 79) 4; 80) 1; 81) 2; 82) 3; 83) 2; 84) 1; 85) 3; 86) 1; 87) 2; 88) 1; 89) 3; 90) 2; 91) 3; 92) 2; 93) 2; 94) 1; 95) 4; 96) 1; 97) 2; 98) 3; 99) 1; 100) 2; 101) 1; 102) 3; 103) 2; 104) 2; 105) 4; 106) 3; 107) 4; 108) 4; 109) 3; 110) 1; 111) 3; 112) 2; 113) 4; 114) 3; 115) 3; 116) 2; 117) 4; 118) 4; 119) 4; 120) 2; 121) 4; 122) 3; 123) 1; 124) 3; 125) 4; 126) 2; 127) 2; 128) 2; 129) 3; 130) 4; 131) 2; 132) 4; 133) 3; 134) 3; 135) 4; 136) 3; 137) 4; 138) 2; 139) 1; 140) 4; 141) 4; 142) 4; 143) 2; 144) 3; 145) 2; 146) 4; 147) 3; 148) 1; 149) 3; 150) 1. రూపొందించినవారు మోజెస్, (చైల్డ్డెవలప్మెంట్ అండ్ పెడగాగీ) డా॥పి.వి. సుబ్బారావు, (తెలుగు) బి. శ్రీనివాస్, (పరిసరాల విజ్ఞానం) ఎన్. వాసుదేవ రెడ్డి, (మ్యాథమెటిక్స్) అమీనా ఆజమ్, (ఇంగ్లిష్) -
మురళి మెడలో విజయ హారం!
ఎంచుకున్న లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు.. దాన్ని అందుకునేందుకు పయనించే మార్గం అత్యున్నతంగా ఉండాలి. కసితో కూడిన సాధన ఎంతటి కఠిన లక్ష్యాన్నయినా ఛేదిస్తుంది.. విజయ గమ్యాన్ని చేరుకునే మార్గంలో అపజయాలు ఎదురైనా, వాటినే గెలుపు సోపానాలుగా మార్చుకునే వారు కొందరే ఉంటారు. ఇలా సక్సెస్ బాటలో నడిచి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)లో జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించారు తెలుగు తేజం కొమ్మిశెట్టి మురళీధర్. ఆయన గెలుపు ప్రస్థానం ‘భవిత’ పాఠకుల కోసం.. మాది వైఎస్సార్ కడప జిల్లా. నాన్న రామప్రసాద్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో శానిటరీ సూపర్వైజర్. అమ్మ గోపాలమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తమ్ముడు గిరిధర్ అమెరికాలో సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. జీవి త భాగస్వామి హరిప్రియ సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. ఆ సంకల్పం బడిలోనే: నాన్న ప్రోత్సాహంతో 6-8 తరగతి వరకు కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివా. విజయవాడ శ్రీచైతన్యలో ఇంటర్ పూర్తిచేశా. సైనిక్ స్కూల్లో చదివినప్పటికీ అప్పట్లో సైన్యంలో చేరాలన్న ఆలోచన లేదు. అయితే సమాజానికి ఏదో ఒక విధంగా సేవచేయాలని అప్పట్లోనే మనసులో నాటుకుపోయింది. ఐఐటీ మద్రాస్‌లో డ్యూయల్ డిగ్రీ (బీటెక్+ఎంటెక్) పూర్తిచేశా. పుణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నప్పుడు సివిల్స్ దిశగా ఆలోచనలు సాగాయి. అందుకే ఐదంకెల వేతనం వస్తున్న కొలువును వదులుకొని, ఐఏఎస్ అధికారి అయిన మామయ్య రామాంజనేయులు సలహాతో ఢిల్లీ వెళ్లి, ఓ కోచింగ్ సెంటర్లో చేరాను. ఓటమి నుంచి ఆత్మవిశ్వాసం: సివిల్స్ సాధించే క్రమంలో మొదటిసారి అపజయం ఎదురైంది. అయితే ఆ ప్రయత్నంలో సాధించిన మార్కులు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. రెండోసారి మెయిన్స్ వరకు వెళ్లి, ఫలితం కోసం ఎదురుచూస్తున్న సమయంలో నువ్వు ఐఎఫ్ఎస్కు ఎందుకు ప్రయత్నించకూడదనే ఫ్యాకల్టీ సలహాతో ఆ దిశగా ప్రయత్నం ప్రారంభించాను. 2013లో సివిల్స్, ఐఎఫ్ఎస్ రెండింటిలోనూ ప్రిలిమ్స్ దశను దాటాను. ఐఎఫ్ఎస్ మెయిన్స్‌కు ఫారెస్ట్రీ, జియాలజీలు ఆప్షనల్ సబ్జెక్టులు. సివిల్స్ ప్రిపరేషన్ ఐఎఫ్ఎస్ జనరల్ స్టడీస్ పేపర్‌కు బాగా ఉపయోగపడింది. ఫారెస్ట్రీ మెటీరియల్ కోసం ఢిల్లీలో నేను ఉన్నచోటకు దగ్గర్లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీకి వెళ్లేవాణ్ని. ఇక జియాలజీ సబ్జెక్టుకు కోచింగ్ మెటీరియల్ చాలా వరకు ఉపయోగపడింది. గత పరీక్షల సమయంలో చేసిన తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్దుకున్నాను. రోజుకు ఎనిమిది గంటలు: ప్రిపరేషన్‌కు రోజుకు ఎనిమిది గంటలు కేటాయించాను. పరీక్షకు రెండు నెలల ముందు 10 గంటలు చదివా. ఉదయం తప్పనిసరిగా ఇంగ్లిష్ దినపత్రికలు చదివేవాణ్ని. రోజులో జనరల్ స్టడీస్‌కు రెండు గంటలు, ఆప్షనల్స్‌కు రెండు గంటలు కేటాయించాను. సొంతంగా నోట్స్ రూపొందించుకున్నాను. సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్‌ను ప్రణాళికను రూపొందించుకొని, ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే చదివాను. చదవడం వల్ల వచ్చిన అలసటను దూరం చేసుకునేందుకు బ్లాగులు రాసేవాణ్ని. ఇంటర్వ్యూ కొత్త అనుభవం: గతంలో రైల్వేస్ చైర్మన్‌గా పనిచేసిన వినయ్ మిట్టల్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం నన్ను ఇంటర్వ్యూ చేసింది. ‘‘మీరు ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగం నుంచి ఆశిస్తున్నదేమిటి?’’- ఇంటర్వ్యూలో ఎదురైన మొదటి ప్రశ్న ఇది. తొలి రోజు మొదటి అభ్యర్థిగా ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టడంతో ఒత్తిడికి గురయ్యా. అయితే బోర్డు సభ్యులు స్నేహపూర్వకంగా వ్యవహరించడంతో ఆ ఒత్తిడి దూరమైంది. బయోడేటా నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. నా హాబీలైన జాగింగ్, వీధి బాలలకు చదువుచెప్పడంపై ప్రశ్నలు అడిగారు. నీకు తెలిసిన టైగర్ రిజర్వ్ ఏంటని ప్రశ్నించగా శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ అని సమాధానం చెప్పాను. అక్కడ ఎన్ని పులులుంటాయో చెప్పండంటూ మరో ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం తెలియదని చెప్పాను. దాదాపు 25 ప్రశ్నలు అడిగారు. మొత్తంమీద ఇంటర్వ్యూను బాగా చేశాను. తప్పకుండా విజయం సాధిస్తానని ఆ రోజే నమ్మకం కలిగింది. అది నిజమైంది. నిజాయితీగా శ్రమిస్తే విజయం! భారత ఆర్థిక వ్యవస్థలో అటవీ ప్రాంతానికి కీలక స్థానముంది. ఈ క్రమంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌పై యువతలో క్రేజ్ పెరిగింది. లక్ష్యాన్ని సాధించాలన్న తపనతో పాటు కష్టపడే తత్వం ఉంటే అవి విజయానికి చేరువ చేస్తాయి. భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో పట్టుసాధిస్తే విజయం చేజిక్కినట్లే. మార్కెట్లో సులువుగా మెటీరియల్ లభించే సబ్జెక్టులను ఆప్షన్స్‌గా ఎంపిక చేసుకోవాలి. ఇంటర్వ్యూ సందర్భంగా బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పడం ప్రధానం. మనం ఇచ్చే సమాధానం ఎంత నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఇస్తున్నామన్నదాన్ని బోర్డు చూస్తుంది. జవాబు తెలియనపుడు ‘తెలియదు’ అనే సమాధానం చెప్పగలిగే ధైర్యం కావాలి. '‘కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహం, ఐఏఎస్ అధికారి అయిన మామయ్య రామాంజనేయులు స్ఫూర్తితో కొనసాగించిన ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్ నాకు విజయాన్ని చేజిక్కేలా చేసింది’’ కొమ్మిశెట్టి మురళీధర్ -
ఎంబీఏ పెట్రోలియం మేనేజ్మెంట్ కోర్సు...
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి? - శ్రీధర్, నిర్మల్ విమానాలు, హెలికాప్టర్లు, అంతరిక్ష నౌకలు, క్షిపణులు మొదలైన వాటి తయారీ, నిర్వహణ గురించి తెలియజేసేదే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సు. ఇది విమాన రంగం, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ వ్యవస్థకు వెన్నెముక. సంస్థల వివరాలు: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.jntuh.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. గేట్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పుణే.. ఎంటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.diat.ac.in అవకాశాలు: కోర్సు పూర్తయిన తర్వాత పౌర విమానయాన రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు ప్రభుత్వ విభాగాలు, పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, భారత వైమానిక దళం, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), నేషనల్ ఏరోనాటిక్స్ లేబొరేటరీలకు ప్రస్తుతం ఏరోస్పేస్ ఇంజనీర్ల అవసరం ఎంతో ఉంది. ఎయిర్‌హోస్టెస్ కావాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? కోర్సుల వివరాలు తెలియజేయండి? - శరత్, నిజామాబాద్. ఎయిర్‌హోస్టెస్ కెరీర్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఈ కెరీర్ సవాళ్లతో కూడుకున్నది. విమానంలో ప్రయాణించే వారికి అవసరమైన సేవలందించడమే ఎయిర్‌హోస్టెస్ విధి. ఎయిర్‌హోస్టెస్ కావాలంటే ప్రాథమికంగా కొన్ని అర్హతలు ఉండాలి. అభ్యర్థులకు ఎలాంటి దృష్టిలోపాలు ఉండకూడదు. ఇంగ్లిష్, హిందీ భాషలలో స్పష్టంగా మాట్లాడగలగాలి. విదేశీ భాషలు తెలిసుంటే అదనపు అర్హత అవుతుంది. ఎంపికకు అవసరమయ్యే అర్హతలు: అభ్యర్థి వయసు 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎత్తు 160 సెం.మీపైన ఉండాలి. 10+2 ఉత్తీర్ణత అవసరం. రాతపరీక్ష, ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరచాలి. కోర్సులు అందిస్తున్న సంస్థలు: ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్‌హోస్టెస్, సికింద్రాబాద్. వెబ్సైట్: www.frankfinn.com కేతన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్. వెబ్సైట్: www.ketansinstitute.com ఏపీ టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అకాడమీ, హైదరాబాద్. వెబ్సైట్: www.aptechaviationacademy.com సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న కోర్సులేవి? - సతీష్, కరీంనగర్. కోల్‌కతాలోని సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్..కేంద్ర ప్రభుత్వ ప్రసార మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పని చేస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్ మూడేళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ సినిమా కోర్సును అందిస్తోంది. స్పెషలైజేషన్స: డెరైక్షన్ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ప్రొడ్యూసింగ్ ఫర్ సినిమా అండ్ టీవీ, సౌండ్ రికార్డింగ్ అండ్ డిజైన్. ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్. దేశ వ్యాప్త నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. రాత పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలోని మెంటల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంద రికీ కామన్‌గా ఉంటుంది. అభ్యర్థులు ఎంచుకున్న స్పెషలైజేషన్స ఆధారంగా రెండో విభాగంలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కులు ఉండవు. వెబ్సైట్: www.srfti.gov.in పెట్రోలియం, గ్యాస్, చమురు రంగాలకు సంబంధించి ఎంబీఏ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయగలరు? - అనిత, మహబూబ్‌నగర్ ఎంబీఏ- పెట్రోలియం మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థలు భారతదేశంలో తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్).. పెట్రోలియం అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత-ఎంపిక విధానం: ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.rgipt.ac.in యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్).. ఆయిల్ అండ్ గ్యాస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. వెబ్సైట్: www.upesindia.org స్కూల్ ఆఫ్ పెట్రోలియం మేనేజ్మెంట్, గాంధీనగర్ (గుజరాత్).. చమురు, గ్యాస్ రంగానికి సంబంధించి ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. క్యాట్ స్కోర్, జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభకు ప్రాధాన్యం. -
అమెరికా సదస్సుకు ఒడిశా మహిళా సర్పంచ్
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం జపాన్ ప్రధాని భారత పర్యటన జపాన్ ప్రధానమంత్రి షింజో అబే జనవరి 25-27 తేదీల్లో భారత్‌లో పర్యటించారు. భారత్ 65వ గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. భద్రత, రాజకీయ, రక్షణ సంబంధాలను మరింత విస్తరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో సగం జపాన్ సహాయానికి సంబంధించినవి ఉన్నాయి. భారత్-ఫిజిల మధ్య ద్వంద్వ పన్నుల ఒప్పందం ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంపై (డిటిఎఎ) భారత్- ఫిజిలు జనవరి 30న సంతకాలు చేశాయి. భారత్ తరపున ఆర్థికమంత్రి పి.చిదంబరం, ఫిజి తరపున ఆ దేశ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి అయియజ్ ఖయూమ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద డివిడెండ్లు, వడ్డీ, రాయల్టీ, నిపుణుల సేవలందించినందుకు వసూలు చేసే రుసుములపై ఇరుదేశాల్లో పన్ను విధిస్తారు. అఖిల భారత సర్వీసులకు రెండేళ్ల తర్వాతే బదిలీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కనీసం రెండేళ్లు ఒకచోట పనిచేసేటట్లు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇందుకు సంబంధించిన మార్గ దర్శకాలను కేంద్ర సిబ్బంది శిక్షణా మంత్రిత్వశాఖ జనవరి 31న విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగోన్నతి, డెప్యుటేషన్‌పై ఇతర రాష్ట్రాలకు బదిలీ, పదవీ విరమణ, రెండు నెలలకు మించి శిక్షణ లాంటి పరిస్థితులలో తప్ప వారిని బదిలీ చేసేందుకు వీలులేదు. ఒకవేళ రెండేళ్లలోపు బదిలీ చేయాల్సి వస్తే రాష్ట్ర పరిధిలో ఏర్పాటయ్యే సివిల్ సర్వీసెస్ బోర్డు ద్వారా చేయాల్సి ఉంటుంది. మూడు నెలల క్రితం సివిల్ సర్వెంట్ల కనీస ఉద్యోగ కాలం రెండేళ్లు ఉండాలని, రాజకీయ ఒత్తిడి నుంచి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్డు సూచించడంతో కొత్త మార్గదర్శకాలను కేంద్రం రూపొందించింది. రాజస్థాన్‌లో అతిపెద్ద సౌరవిద్యుత్ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్ కేంద్రాన్ని రాజస్థాన్‌లో ఏర్పాటు చేయడానికి భెల్, పవర్‌గ్రిడ్ కార్పోరేషన్ సహా ఆరు ప్రభుత్వ రంగసంస్థలు సంకల్పించాయి. 4 వేల మెగావాట్ల సామర్థ్యం ఉండే ఈ కేంద్రం ఏర్పాటుకు మొదటి దశలో రూ.7,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు భెల్ సంస్థ తెలిపింది. న్యూఢిల్లీలో జాతీయ వక్ఫ్ అభివృద్ధి సంస్థ కొత్త ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ (జాతీయ వక్ఫ్ అభివద్ధి కార్పోరేషన్ -నవాడ్కో)ను ప్రధాని మన్మోహన్సింగ్ జనవరి 29న న్యూఢిల్లీలో ప్రారంభించారు. వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి, వనరుల సమీకరణకు రూ. 500 కోట్ల మూలధనంతో 2013, డిసెంబర్ 31న ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 4.9 లక్షల రిజిస్టర్డ ఆస్తులతో భారత్ ప్రపంచంలోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు కలిగి ఉందని ప్రధాని మన్మోహన్ తెలిపారు. వీటిని సక్రమంగా అభివృద్ధి చేస్తే ఏటా రూ.1,200 కోట్ల ఆదాయం వస్తుందని మన్మోహన్ పేర్కొన్నారు. భారత్‌లోనే నిరక్షరాస్యత: ఐరాస భారత్‌లో నిరక్షరాస్యులైన వయోజనుల సంఖ్య అధికంగా ఉందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వెల్లడించింది. 28.7 కోట్ల మందికి అక్షరం పట్ల అవగాహన లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి దేశంలో అక్షరాస్యుల సంఖ్య పెరిగినా జనాభా సంఖ్య పోటీగా ఎగబాకటంతో నిరక్షరాస్యుల శాతంలో మార్పులేదని పేర్కొంది. అంతర్జాతీయ నిరక్షరాస్యుల్లో 37 శాతం మంది భారతీయులే ఉన్నారని తెలిపింది. ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రచురించిన ‘అందరికీ విద్య-అంతర్జాతీయ పర్యవేక్షణ -2013-14’ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. బెంగళూరులో మెదడు పరిశోధనా కేంద్రం బెంగళూరులో మెదడు పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటీ మద్రాస్ సహకారంతో రూ. 225 కోట్లతో ఈ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించనున్నట్లు ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు క్రిస్ గోపాలకృష్ణన్ జనవరి 30న ప్రకటించారు. అమెరికా సదస్సుకు ఒడిశా మహిళా సర్పంచ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళా సర్పంచ్ ఆరతీదేవీ (28) కి అమెరికాలో జరిగే ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ నాయకత్వ సదస్సులో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇల్లినాయీ రాష్ట్రం స్ప్రింగ్ఫీల్డ్లో ఫిబ్రవరిలో మూడు వారాల పాటు నిర్వహించే ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రాం (ఐవీఎల్పీ)కి భారత్ నుంచి ఆరతీదేవి ఒక్కరే ఎంపికవడం విశేషం. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తదితరాలపై ఆమె మాట్లాడతారు. గంజాం జిల్లాలోని ధుంకపరా అనే మారుమూల గ్రామ సర్పంచ్ అయిన ఆరతి, ఎంబీఏలో పట్టభద్రురాలు. సర్పంచ్‌గా ఎన్నికవడం కోసం ఐడీబీఐలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఉద్యోగాన్ని వదులుకోవడం విశేషం. ఇప్పటిదాకా ఈ సదస్సుకు మన దేశం నుంచి మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, అటల్‌బీహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, ప్రతిభాపాటిల్ మాత్రమే గతంలో పాల్గొన్నారు. ముంబైలో మోనోరైలు సేవలు దేశంలోనే మొట్టమొదటి మోనోరైలు సేవలు ముంబైలో ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ మొదటిదశను ఫిబ్రవరి 1న ప్రారంభించారు. వడాలా-చెంబూర్‌ల మధ్య 8.93 కిలోమీటర్ల మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ముంబైలో మొత్తం 19.17 కి.మీ మోనోకారిడార్ నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద మోనోకారిడార్. జపాన్‌లోని ఒసాకా నగరంలోని 23.8 కి.మీ. పొడవైన మోనోరైలు మార్గం ప్రపంచంలో అతి పొడవైనది. దక్షిణ ముంబైలోని జాకోబ్ సర్కిల్ నుంచి తూర్పు ముంబైలోని చెంబూర్‌కు మోనోరైలు రవాణామార్గం అనుసంధానమవుతుంది. ఈ 19.17 కి.మీ మోనోరైలు మార్గాన్ని రూ. 3వేల కోట్లతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మిస్తోంది. 101వ సైన్స కాంగ్రెస్ జమ్మూలో 101వ సైన్స కాంగ్రెస్‌ను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి 3న ప్రారంభించారు. ‘ఇన్నోవేషన్స ఇన్ సైన్స అండ్ టెక్నాలజీ ఫర్ ఇన్‌క్లూజివ్ డెవలప్మెంట్’ ఇతివృత్తంతో ఈ సైన్స కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎంగా హరీష్‌రావత్ ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హరీష్‌రావత్ ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పడ్డాక రావత్ఎనిమిదో ముఖ్యమంత్రి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ బహుగుణ జనవరి 30న తన పదవికీ రాజీనామా చేశారు. గతేడాది ఉత్తరాఖండ్‌కు వరదలు వచ్చినప్పుడు బహుగుణ పనితీరుపై సొంతపార్టీలోనే విమర్శలు తలెత్తడంతో బహుగుణ రాజీనామా చేశారు. వృద్ధి రేటును తగ్గించిన కేంద్రం 2012-13లో జీడీపీ వృద్ధి 4.5 శాతంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇది దశాబ్దంలో అతి తక్కువ. గతంలో దీన్ని 5 శాతంగా అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన అంచనాలను సీఎస్ఓ జనవరి 31న విడుదల చేసింది. వీటి మేరకు 2011-12లో జీడీపీ వృద్ధిని 6.7 శాతంగా సవరించింది. 2012-13లో జీడీపీ విలువ రూ.54.80 లక్ష కోట్లు కాగా 2011-12లో రూ. 52.50 కోట్లుగా తెలిపింది. అంతర్జాతీయం టునీషియా కొత్త ప్రధాని మెహ్దీ జోమా టునీషియాలో మెహ్దీజోమా ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం జనవరి 29న కొలువు దీరింది. రాజకీయ అనిశ్చితి తొలగించేందుకు కుదిరిన ఒప్పందం ప్రకారం ఇస్లామిస్టుల నాయకత్వాన గల ప్రభుత్వ స్థానంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 2014 చివరి నాటికి పార్లమెంట్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పర్యావరణ జాబితాలో భారత్‌కు 155వ స్థానం అత్యంత ప్రాధాన్యతనివ్వవలసిన పర్యావరణ అంశాల పనితీరు ఆధారంగా రూపొందించిన ప్రపంచ పర్యావరణ జాబితా (గ్లోబల్ గ్రీన్ లిస్)లో భారత్‌కు 155వ స్థానం దక్కింది. ‘2014 పర్యావరణ పనితీరు సూచి’లో 178 దేశాలకు ర్యాంకులు కేటాయించగా.. ఈ సూచిలో 31.23 పాయింట్లతో భారత్ 155 వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్ మొదటి స్థానం, తరువాత స్థానాల్లో లగ్జమ్‌బర్గ్, ఆస్ట్రేలియా, సింగపూర్, చెక్ రిపబ్లిక్లు ఉన్నాయి. ఈ సూచీని ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌తో కలిసి యేల్,కొలంబియా విశ్వవిద్యాలయాలు రూపొందించాయి. ఫేస్‌బుక్‌కు పది వసంతాలు సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్‌బుక్‌కు 2014, ఫిబ్రవరి 4వ తేదీ నాటికి పదేళ్లు పూర్తయ్యాయి. ఇంటర్నెట్ తెచ్చిన సమాచార విప్లవంలో సోషల్ మీడియా మరింత విప్లవాత్మక మార్పులు తెచ్చింది. హార్వర్డ్ వర్సిటీ విద్యార్థిగా మార్క్ జుకర్‌బర్గ్ రూపొందించిన ప్రాజెక్టు ఫేస్‌బుక్‌గా రూపుదిద్దుకుని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల మందిని అనుసంధానిస్తోంది. నాసా డెరైక్టర్‌గా మైఖల్ రోజర్స్ అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ (నాసా) డెరైక్టర్‌గా మైఖల్ రోజర్స్‌ను అధ్యక్షుడు బరాక్ ఒబామా జనవరి 30న నియమించారు. వైస్ అడ్మిరల్ రోజర్స్ నౌకారంగం సైబర్-వార్ఫేర్ నిపుణుడు. మార్చిలో పదవీవిరమణ చేస్తున్న ప్రస్తుత డెరైక్టర్ కీత్ అలెగ్జాండర్ స్థానంలో రోజర్స్ నాసా బాధ్యతలు చేపడతారు. ఐరాసలో ప్రత్యేక సలహాదారుగా వివేక్‌లాల్ ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సలహాదారుడిగా ప్రముఖ ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు వివేక్‌లాల్ జనవరి 30న నియమితులయ్యారు. ఈయన ఐక్యరాజ్యసమితికి బ్రాడ్ బాండ్, ఇతర సైబర్ భద్రత అంశాలకు సంబంధించి విధాన రూపక ల్పన, అమలులో తోడ్పడతారు. జింబాబ్వేలో చలామణిలోకి రుపాయి జింబాబ్వేలో చలామణి అవుతున్న కరెన్సీ జాబితాలో భారత రూపాయికి చోటు దక్కింది. ఈ మేరకు రిజర్వ బ్యాంక్ ఆఫ్ జింబాంబ్వే జనవరి 29న ప్రకటించింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్యాన్ని ఇందుకు కారణంగా పేర్కొంది. ఇప్పటికే బొట్సవానా పౌలా, బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్, యూరో, సౌత్ ఆఫ్రికన్ రాండ్, యూఎస్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, చైనీస్ యూవాన్, జపాన్ యెన్ చలామణిలో ఉన్నాయి. క్రీడలు వన్డేల్లో 8 వేల పరుగులు చేసిన ధోనీ ఎంఎస్ ధోనీ వన్డేల్లో 8 వేల పరుగుల మైలురాయిని దాటిన ఏడో భారత ఆటగాడుగా గుర్తింపు పొందాడు. న్యూజిలాండ్‌తో జనవరి 31న ముగిసిన ఐదో వన్డేలో ధోనీ 8,046 పరుగులకు చేరుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా 8వేల పరుగులు చేసిన నాలుగో క్రికెటర్‌గా కూడా ధోనీ గుర్తింపు పొందాడు. ఐసీసీ ప్యానల్లో తొలి మహిళా అంపైర్ న్యూజిలాండ్‌కు చెందిన కేథీక్రాస్ ఐసీసీ అంపైర్ ప్యానల్‌కు ఎంపికైన తొలిమహిళగా చరిత్ర పుటలకెక్కింది. 2014 సంవత్సరానికి అసోసియేట్, అఫిలియేట్ ఇంటర్నేషనల్ అధికారిణిగా ఆమెను ఐసీసీ ప్యానల్లోకి తీసుకోనున్నారు. కింగ్‌కౌంటీలోని టౌమరునీలో పుట్టిన 56 ఏళ్ల క్రాస్ ఇప్పుడు ఐసీసీ ప్రపంచ లీగ్ డివిజన్స్‌లో నియామకానికి అర్హత సాధించింది. రంజీ విజేత కర్ణాటక రంజీ ట్రోఫీ విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. ఈ టైటిల్ నెగ్గడం కర్ణాటకకు ఇది ఏడోసారి. హైదరాబాద్ లో ఫిబ్రవరి 2న ముగిసిన ైఫైనల్లో మహారాష్ట్రను ఓడించి 1998-99 తర్వాత ఈ టైటిల్‌ను నెగ్గింది. విజేతకు రూ. 2 కోట్లు, రన్నరప్‌కు రూ. కోటి ప్రైజ్‌మనీ లభించింది. సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ విజేత సింధు ఆంధ్రప్రదేశ్ స్టార్‌షట్లర్ పి.వి. సింధు అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. కొచ్చిలో ఫిబ్రవరి 2న జరిగిన ఫైనల్లో పి.సి.తులసి (కేరళ)పై సింధు విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లోనూ రాష్ట్రానికి చెందిన సిక్కిరెడ్డి జోడి టైటిల్ నెగ్గింది. అపర్ణ బాలన్‌తో జతగా బరిలోకి దిగిన సిక్కిరెడ్డి జోడి ప్రజక్తా సావన్, ఆరతి సారా జంటను ఓడించింది. కాగా పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హెచ్. ఎస్. ప్రణయ్ కైవసం చేసుకున్నాడు. అమృత్‌రాజ్‌కు డేవిస్‌కప్ అవార్డు భారత మాజీ టెన్నిస్ ఆటగాడు విజయ్ అమృత్‌రాజ్‌కు డేవిస్‌కప్ కమిట్మెంట్ అవార్డు లభించింది. ఈ పురస్కారం గతంలో రామనాథన్ కృష్ణన్, జైదీప్ ముఖర్జీ, ఆనంద్ అమృత్‌రాజ్, రమేశ్ కృష్ణన్, లియాండర్ పేస్ , మహేశ్ భూపతిలకు దక్కింది. రాష్ట్రీయం జీవ వైవిధ్యమండలి చైర్మన్‌గా హంపయ్య రాష్ట్ర జీవ వైవిధ్య మండలి చైర్మన్‌గా డాక్టర్ హంపయ్య మరో ఏడాది కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ జనవరి 30న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఓటర్లు... 6.23 కోట్లు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 6.23 కోట్లకు చేరిందని ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 1న ప్రకటించింది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఓటర్లున్నారని తెలిపింది. 2013 జనవరి 15న సవరించిన జాబితా ప్రకారం 5.81 కోట్ల మంది ఓటర్లు కాగా తాజాగా ఈ సంఖ్య 6.23 కోట్లకు పెరిగింది. చక్రపాణికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ పురస్కారం శాసనమండలి ైచైర్మన్ ఎ.చక్రపాణిని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ (జీజీఎఫ్) గౌరవ మెడల్‌తో సత్కరించింది. ఫిబ్రవరి 2న శాసనమండలి ఆవరణలోని కమిటీ హాల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్పీ వర్మ చేతులమీదుగా చక్రపాణికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. -
గొడవల గుట్టు.. బడుగుల బతుకులు..
2,677 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు కేటాయించారు. రెండో పేపర్ (గ్రామీణాభివృద్ధి- సమస్యలు) సిలబస్‌లో మొత్తం అయిదు అంశాలున్నాయి. వీటిలో రెండో అంశంగా ‘సమకాలీన సమాజంలో సామాజిక ఉద్రిక్తతలు, ఘర్షణలు- అణగారిన వర్గాలవారి సమస్యలు’ ఉన్నాయి. ఈ విభాగం నుంచి గరిష్టంగా 30 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఇందులోని అన్ని అంశాలను ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు అనువర్తింపజేసుకుంటూ చదివినప్పుడే ప్రిపరేషన్ పూర్తిస్థాయిలో ముగిసినట్లవుతుంది. మూలాలు ఎక్కడ? హిమగిరి శ్రేణులు మకుటంగా విరాజిల్లుతున్న భారత దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. భిన్న మతాలు, భాషలు, సంస్కృతుల సంగమమైన భారతీయ సమాజాన్ని పోలిన సమాజం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఇది ఎన్నో వేల సంవత్సరాలుగా మార్పులకు గురవుతూనే ఉంది. ఒక మనిషి తన అవసరాల కోసం ఇతరులపై ఆధారపడే క్రమంలో వివిధ సామాజిక సంస్థలకు పునాదులుపడ్డాయి. ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు ఏర్పడ్డాయి. అయితే ఇలాంటి సామాజిక ఏర్పాట్ల మధ్య మనుగడ సాగించే మనుషుల్లో విలువల పతనం సామాజిక ఘర్షణలకు, ఉద్రిక్తతలకు కారణమవుతోంది. సామాజిక ఉద్రిక్తతలకు కారణాలు వర్గ పోరాటాలు రాజకీయ అవినీతి నేరాలు పోటీతత్వం నిరుద్యోగం జాత్యహంకారం మత, కులపరమైన అసహనం భాషా విభేదాలు తీవ్ర సామాజిక మార్పులు సంపద పంపిణీలో అసమానతలు వీటికి సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో చోటుచేసుకున్న సమకాలీన సంఘటనలు, కారణాలు, ఫలితాలను అధ్యయనం చేయాలి ఉదాహరణ: శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న లక్ష్మింపేట దళితుల ఊచకోత ఘటనకు కారణం? ఎ) నీటి వివాదం బి) భూ వివాదం సి) కులాంతర వివాహం డి) మత కలహాలు జవాబు : బి అభ్యర్థులు దృష్టిసారించాల్సిన అంశాలు: సామాజిక ఉద్రిక్తతలు, ఘర్షణలు- కారణాలు, వివిధ రూపాలు మతమౌఢ్యం, దేశంలో చోటుచేసుకున్న మతపర హింస, పరిణామాలు, దాని కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఉగ్రవాదం, ప్రాంతీయ తత్వం, భాషాతత్వం, నక్సలైట్ ఉద్యమం వ్యభిచారం, భిక్షాటన వంటి అనైతిక ప్రవర్తనా రీతులు. వాటిని రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశంలో కుల ఘర్షణలు- సమాజంపై వాటి ప్రభావం. కుటుంబ వ్యవస్థలో రుణాత్మక మార్పులు (విడాకులు, గృహ హింస) సామాజిక నిర్మాణంలో లోపాలు, ఇతర కారణాల వల్ల ఎక్కువగా నష్టపోతున్న బలహీన వర్గాల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలు ఉగ్రవాదం: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశాయి. దురదృష్టవశాత్తు వీటి ఫలాలు అర్హులైన వారికి అందలేదు. దళితులు, ఆదివాసులు, మహిళల జీవితం మరింత దుర్భరమైంది. ఈ నేపథ్యంలో నక్సలిజం ఆవిర్భవించింది. దీన్ని అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించే క్రమంలో బలహీనవర్గాలు సమిధలవుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశం స్థాయి నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ప్రయత్నిస్తున్న భారత్‌కు ప్రస్తుతం ఉగ్రవాదం పెనుసవాలుగా మారింది. కేంద్ర హోంశాఖ వివరణ ప్రకారం నేడు దేశాన్ని రెండు రకాల ఉగ్రవాదం కలవరపరుస్తోంది. అవి.. 1. బహిర్గత ఉగ్రవాదం (పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల నుంచి). 2. అంతర్గత ఉగ్రవాదం (మత హింస, నక్సలిజం..). అభ్యర్థులు దేశంలో ఉగ్రవాదం పెచ్చుమీరుతుండటానికి కారణాలు, ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న సంఘటనలు (2013, ఫిబ్రవరి 21- దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు), ప్రభుత్వ చర్యలు, చట్టాలు వంటి వాటిని అధ్యయనం చేయాలి. ఇటీవల కాలంలో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ప్రముఖ రాజకీయ నాయకులను చంపడాన్ని చూస్తుంటే మధ్య, తూర్పు భారతదేశంలో అంతర్గత భద్రత ఎంత పేలవంగా తయారైందో చెప్పొచ్చు. దేశంలో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల్లో యువత కోసం రోష్నీ పేరిట కొత్తగా నైపుణ్య అభివృద్ధి పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ 2013, జూన్ 7న ఢిల్లీలో ప్రారంభించారు. దేశంలోని అత్యంత సమస్యాత్మకమైన 24 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో ఈ పథకాన్ని అమలుచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విశాఖపట్నం జిల్లా ఇందుకు ఎంపికైం ది. ఇలాంటి సమకాలీన పరిణామాలను తెలుసుకోవాలి. అవినీతి అవినీతి సూచీలో భారత్ స్థానం 94. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 177 దేశాలతో విడుదల చేసిన జాబితాలో అత్యంత తక్కువ అవినీతి దేశాలుగా డెన్మార్క్, న్యూజిలాండ్‌లు గుర్తింపు సాధించాయి. భారత ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై అవినీతి తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశ ప్రగతికి పెద్ద అవరోధంగా పరిణమిస్తోంది. 2జీ స్పెక్ట్రం కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం వంటి భారీ అవినీతి కార్యకలాపాలు ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి. ప్రభుత్వ విభాగాల్లో పెచ్చుమీరిన అవినీతి వల్ల సామాన్య జనం ఇబ్బందిపడుతున్నారు. అవినీతికి అడ్డుకట్ట వేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం లోక్‌పాల్ చట్టాన్ని తెచ్చింది. అన్ని రకాల అవినీతిని ముఖ్యంగా ఉన్నత స్థాయిలోని అవినీతిని అరికట్టేందుకు చేసిన ప్రజా పోరాటంలో దీన్ని ఒక కీలక ఘట్టంగా చెప్పొచ్చు. అభ్యర్థులు లోక్‌పాల్, లోకాయుక్తల చట్టం- 2013లోని అంశాలపై దృష్టిసారించాలి. దీనికి సంబంధించిన బిల్లును గతేడాది డిసెంబర్ 17న రాజ్యసభ, డిసెంబర్ 18న లోక్‌సభ ఆమోదించింది. అభ్యర్థులు ఈ చట్టానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను తప్పనిసరిగా చదవాలి. ఉదాహరణ: లోక్‌పాల్‌లో చైర్‌పర్సన్‌తో పాటు గరిష్టంగా ఎందరు సభ్యులుంటారు? ఎ) 6 బి) 7 సి) 8 డి) 9 జవాబు: సి మత ఘర్షణలు: భిన్న మతాల ప్రజలున్న భారత్‌లో తరచూ ఎక్కడో చోట మత విద్వేషాల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఘటనల సమయంలో ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 నాటి గోద్రా అల్లర్లు దేశంలో సంచలనం సృష్టించాయి. 2013లో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అనేక మంది మరణించారు. మతపర హింసను నిరోధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అభ్యర్థులు మత ఘర్షణలకు సంబంధించిన సమకాలీన పరిణామాలను తెలుసుకోవాలి. కమిషన్లపై పట్టు సాధించాలి: జాతీయ మానవ హక్కుల కమిషన్, ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ల కూర్పు, విధులు, చైర్మన్లు తదితర అంశాలపై దృష్టిసారించాలి. మహిళా కమిషన్లు; ఎస్సీ- ఎస్టీ కమిషన్లు; బీసీ కమిషన్, మైనార్టీ కమిషన్లు వంటి వివిధ సంఘాల ప్రాథమిక అంశాలను తప్పనిసరిగా చదవాలి. ఉదాహరణ:జాతీయ ఎస్సీ కమిషన్ (ఎన్సీఎస్సీ) విధులను నిర్దేశించే రాజ్యాంగ అధికరణ? ఎ) 332 బి) 338 సి) 339 డి) 238 జవాబు: బి నమూనా ప్రశ్నలు 1.2013, డిసెంబర్ 3న ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ అవినీతికి సంబంధించి విడుదల చేసిన జాబితాలో భారత్ ర్యాంకు? ఎ) 91 బి) 92 సి) 93 డి) 94 2.జాతీయ ఎస్టీ కమిషన్ ప్రస్తుత చైర్మన్? ఎ) రామేశ్వర్ ఓరాన్ బి) పి.ఎల్.పునియా సి) రాజ్‌కుమార్ వెర్కా డి) పీఎస్ మెహతా 3.నేషనల్ సఫాయి కర్మచారీస్ ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఎ) 1996 బి) 1997 సి) 1998 డి) 2000 4.వెట్టిచాకిరి, మనుషుల అక్రమ రవాణాను నిషేధించిన రాజ్యాంగ అధికరణ? ఎ) ఆర్టికల్ 26 బి) ఆర్టికల్ 33 సి) ఆర్టికల్ 36 డి) ఆర్టికల్ 23 5.దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన మహిళా బ్యాంకు నినాదం? ఎ) ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ఇండియా బి) ఎంపవరింగ్ ఇండియా, ఎంపవరింగ్ ఉమెన్ సి) ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ భారత్ డి) ఎంపవరింగ్ భారత్, ఎంపవరింగ్ ఉమెన్ 6.మైనారిటీల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ? ఎ) రాజేంద్ర సచార్ బి) మోహన్ చంద్ర సి) రెహమత్ అలీ డి) బి.పి.మండల్ 7.అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగ అధికరణ? ఎ) 14 బి) 15 సి) 16 డి) 17 8.భూమి లేని ఎస్సీ, ఎస్టీల కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2013 ఏప్రిల్‌లో ప్రకటించిన పథకం? ఎ) మన భూమి బి) భూ తోరణం సి) పచ్చ తోరణం డి) మీ భూమి 9.ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ) పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం? ఎ) జూన్, 2001 బి) మే, 2002 సి) ఆగస్టు, 2003 డి) జూలై, 2004 10.2002లో అక్షరధామ్ ఆలయంపై దాడి జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఎ) మహారాష్ట్ర బి) గుజరాత్ సి) బీహార్ డి) మధ్యప్రదేశ్ 11.ప్రస్తుతం భారతదేశంలో అంతర్రాష్ట్ర వివాదాలకు ప్రధాన కారణం? ఎ) ఖనిజ వనరులు బి) జలవనరులు సి) అటవీ సంపద డి) సరిహద్దు అంశాలు సమాధానాలు: 1) డి 2) ఎ 3) బి 4) డి 5) ఎ 6) ఎ 7) డి 8) సి 9) డి 10) బి 11) బి బలహీన వర్గాలు- సంక్షేమం పేదలు, మహిళలు, పిల్లలు, అనాథలు, రోగులు తదితరుల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి. పథకాలు అమలవుతున్న తీరు గురించి కూడా చదవాలి. గ్రామీణ గృహ పథకం; వృద్ధాప్య పింఛను పథకం; పేద విద్యార్థులకు ఫీజుల తిరిగి చెల్లింపు పథకం; ఆహార భద్రత చట్టం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. దేశంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలను నిరోధించే ఉద్దేశంతో తెచ్చిన ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం (1989) నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఇన్పుట్స్:Prof. K. Ramanuja Rao Department of Sociology, Kakatiya university. -
సరైన సాధనతోనే సక్సెస్ సాధ్యం..
ఇంటర్ సెకండియర్ సీఈసీలో అధిక మార్కుల సాధనకు వ్యూహాలు, ముఖ్యమైన దీర్ఘ సమాధాన ప్రశ్నలపై ఫోకస్.. ఆర్థి శాస్త్రం, పౌర శాస్త్రం, వాణిజ్యం సివిక్స్ సీనియర్ ఇంటర్ సివిక్స్ పాఠ్య ప్రణాళికలో భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం, పరిపాలన అంశాలు ఉన్నాయి. సిలబస్‌లో మొత్తం ఎనిమిది యూనిట్లు ఉన్నాయి. ప్రశ్నపత్రం- తీరుతెన్నులు: సివిక్స్‌కు 100 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రం మూడు సెకన్ల్లుగా ఉంటుంది. సెక్షన్-ఎలో అయిదు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రా యాలి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు కేటాయించారు. సెక్షన్-బిలో 12 ప్రశ్నలుంటాయి. వాటిలో 8 ప్రశ్నలకు కనీసం 20 పంక్తుల్లో సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. సెక్షన్-సిలో 20 ప్రశ్నలు ఇస్తారు. వాటిలో 15 ప్రశ్నలకు కనీసం 5 పంక్తుల్లో సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. వ్యాసరూప ప్రశ్నలు- ముఖ్యమైన చాప్టర్లు: 1. భారత రాజ్యాంగం-ముఖ్య లక్షణాలు. 2. ప్రాథమిక హక్కులు. 3. భారత రాష్ట్రపతి. 4. భారత ప్రధానమంత్రి. 5. భారత పార్లమెంటు. 6. రాష్ట్ర గవర్నర్. 7. గ్రామీణ- పట్టణ స్థానిక ప్రభుత్వాలు. 8. జిల్లా కలెక్టర్ తదితర అంశాలు. ఐదు మార్కుల ప్రశ్నలకు: భారత జాతీయోద్యమం ఆవిర్భావానికి కారణాలు, వివిధ జాతీయోద్యమాలు, భారత ప్రభుత్వ చట్టాలు. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు- ఆదేశిక సూత్రాల మధ్య భేదాలు. ఉప రాష్ట్రపతి- మంత్రిమండలి. శాసన తయారీ విధానం- వివిధ బిల్లులు, పార్లమెంటరీ కమిటీలు. సుప్రీంకోర్టు అధికారాలు; రాష్ట్ర ప్రభుత్వం- రాష్ట్ర శాసనశాఖ- రాష్ట్ర న్యాయశాఖ. కేంద్ర- రాష్ట్ర సంబంధాలు- సర్కారియా కమిషన్ సూచనలు. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు, వివిధ స్థానిక ప్రభుత్వాల విధులు. భారత విదేశాంగ విధానం, ఐక్యరాజ్యసమితి, సమకాలీన ధోరణులు- అంశాలు. రెండు మార్కుల ప్రశ్నలకు: ప్రతి యూనిట్‌లోనూ ఏ అంశం నుంచైనా రెండు మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అయితే ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశమున్న ముఖ్యమైన అంశాలు: భారత రాజ్యాంగం (యూనిట్ 1); కేంద్ర ప్రభుత్వం (యూనిట్ 3); భారత పార్లమెంటు (యూనిట్ 4); రాష్ట్ర శాసనశాఖ (యూనిట్ 7); కేంద్ర- రాష్ట్ర సంబంధాలు (యూనిట్ 9); స్థానిక ప్రభుత్వాలు (యూనిట్ 10); ఐక్యరాజ్య సమితి (యూనిట్ 12); సమకాలీన ధోరణులు- అంశాలు (యూనిట్ 13). సూచనలు: ప్రశ్నపత్రాన్ని ఒకటికి రెండుసార్లు చదవాలి. పూర్తిగా అవగాహన ఉన్న ప్రశ్నలనే సమాధానాలు రాసేందుకు ఎంపిక చేసుకోవాలి. మొదట రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ విభాగంలో 15 ప్రశ్నలకే సమాధానాలు రాయాల్సి ఉన్నా అదనంగా మరో రెండింటికి సమాధానాలు రాస్తే మంచిది. సీనియర్ ఇంటర్ సిలబస్‌లో రాజ్యాంగ అధికరణలు (ఆర్టికల్స్) ఉన్నాయి. అందువల్ల అవసరమైన చోట ఆర్టికల్స్‌ను, సమకాలీన ఉదాహరణలు రాయవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ మార్కులు వచ్చేందుకు అవకాశముంటుంది. ముఖ్యమైన దీర్ఘ సమాధాన ప్రశ్నలు: 1.భారత రాజ్యాంగ మౌలిక లక్షణాల్ని వివరించండి? 2.భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులు రాయండి? 3.కేబినెట్ భవనానికి ప్రధాని మూలస్తంభం- చర్చించండి? 4.భారత పార్లమెంటు అధికారాలు- విధులను చర్చించండి? 5.జిల్లా కలెక్టర్ అధికారాలు- విధులను చర్చించండి? 6.భారత రాష్ట్రపతి అధికారాలను వివరించండి? 7.రాష్ట్ర గవర్నర్ అధికారాలు- విధులను వివరించండి? 8.పట్టణ ప్రాంత స్థానిక ప్రభుత్వాల నిర్మాణం, విధులను వివరించండి? ఎకనామిక్స్ ఇంటర్ సెకండియర్ అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే భారత దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలు, ఆర్థిక సమస్యలు- కారణాలు, నివారణ చర్యలు, గణాంక వివరాలను కూలంకషంగా చదివి, అర్థం చేసుకుంటే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సిలబస్: ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి; నూతన ఆర్థిక సంస్కరణలు; జనాభా, మానవ వనరుల అభివృద్ధి; జాతీయాదాయం; వ్యవసాయ రంగం; పారిశ్రామిక రంగం; తృతీయ రంగం; ప్రణాళికలు; పర్యావరణం, ఆర్థికాభివృద్ధి; ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ- విహంగ వీక్షణం. ప్రశ్నపత్రం: సెక్షన్- ఎలోని ఐదు ప్రశ్నల్లో మూడింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు. సెక్షన్- బిలోని 12 ప్రశ్నల్లో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. సెక్షన్- సిలోని 20 ప్రశ్నల్లో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. పది మార్కుల ప్రశ్నకు 20 నిమిషాలు, ఐదు మా ర్కుల ప్రశ్నకు 10 నిమిషాలు, రెండు మార్కుల ప్రశ్నకు రెండు నిమిషాలు కేటాయించాలి. పునఃపరిశీలనకు 10 నిమిషాలు కేటాయించాలి. సూచనలు: ద్వితీయ సంవత్సరం అర్థశాస్త్రం సిలబస్‌లో ముఖ్యంగా నాలుగు యూనిట్లపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అవి: జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నూతన ఆర్థిక సంస్కరణలు. వీటి నుంచి దాదాపు 80 నుంచి 90 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయి. ప్రతి సమాధానంలో సబ్ హెడ్డింగ్స్, గణాంకాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశముంటుంది. 10 మార్కుల ప్రశ్నకు కనీసం 8 కారణాలు, ఆరు నివారణ చర్యలు రాయాలి. 5 మార్కుల ప్రశ్నకు అయిదారు అంశాలు రాయాలి. పరీక్షలో తొలుత రెండు మార్కుల ప్రశ్నలకు, తర్వాత ఐదు మార్కుల ప్రశ్నలకు, చివరగా 10 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ముఖ్యమైన దీర్ఘ సమాధాన ప్రశ్నలు: 1.భారతదేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని, అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను వివరించండి? 2.పేదరికాన్ని నిర్వచించి, పేదరికానికి కారణాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలను రాయండి? 3.ఆదాయ సంపదలలో వ్యత్యాసాలకు కారణాలు, నివారణ చర్యలను వివరించండి? 4.నిరుద్యోగితకు కారణాలు, నిర్మూలన మార్గాలను వివరించండి? 5.భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ప్రాధాన్యతను వివరించండి? 6.వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు కారణాలు, నివారణ చర్యలను వివరించండి? 7.భారత వ్యవసాయ మార్కెటింగ్‌లో లోపాలను, నివారణ చర్యలను రాయండి? 8.భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావాన్ని రాయండి? 9.1991 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని విమర్శనాత్మకంగా వివరించండి? 10.భారత్‌లో జనాభా విజృంభణకు కారణాలు, జనాభా పెరుగుదల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను రాయండి? కామర్స్ పార్ట్-1 వాణిజ్య శాస్త్రం సిలబస్: అంతర్జాతీయ వర్తకం; మార్కెటింగ్ వ్యవస్థలు, వ్యాపార ప్రకటనలు, వినియోగదారిత్వం; వ్యాపార సేవలు; స్టాక్ ఎక్స్చేంజ్లు; కంప్యూటర్ అవగాహన. పార్ట్- 2 వ్యాపార గణక శాస్త్రం సిలబస్: వర్తకం బిల్లులు, తరుగుదల; కన్సైన్మెంట్ ఖాతాలు; వ్యాపారేతర సంస్థ ల ఖాతాలు; ఒంటిపద్దు విధానం; భాగస్వామ్య వ్యాపార ఖాతాలు, భాగస్తుని ప్రదేశం, భాగస్తుని విరమణ. ప్రశ్నపత్రం: పార్ట్- 1 థియరీ- 50 మార్కులు విభాగం మార్కులు సమయం సెక్షన్-ఎ 10 ణ 2 = 20 35 నిమిషాలు సెక్షన్-బి 4 ణ 5 = 20 35 నిమిషాలు సెక్షన్-సి 5 ణ 2 = 10 20 నిమిషాలు సెక్షన్-ఎ విభాగంలో వ్యాసరూప ప్రశ్నలు.. ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్, మార్కెటింగ్ వ్యవస్థ, వ్యాపార సేవలు, వినియోగదారిత్వం యూనిట్ల నుంచి వస్తాయి. అధిక మార్కులు సాధించేందుకు నిర్వచనం, ముఖ్యాంశాలను అండర్లైన్ చేస్తూ ముగింపు రాయాలి. సెక్షన్-బిలోని లఘు సమాధాన ప్రశ్నలు.. ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్, అంతర్జాతీయ వర్తకం, వ్యాపార ప్రకటనలు, కంప్యూటర్ అవగాహన లేదా వ్యాపార సేవల యూనిట్ల నుంచి వస్తాయి. ఈ సెక్షన్లో పూర్తి మార్కులు పొందేందుకు ఎక్కువ అవకాశం ఉన్నందున నిర్వచనంతో పాటు ప్రశ్నకు సంబంధించిన ప్రత్యక్ష సమాధానాలను విపులంగా రాయాలి. సెక్షన్-సిలో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు క్లుప్తంగా, వివరంగా సమాధానాలు రాస్తే పూర్తి మార్కులు వస్తాయి. పార్ట్- 2 అకౌంట్స్- 50 మార్కులు విభాగం మార్కులు సమయం సెక్షన్-డి 1 ణ 20 = 20 30 నిమిషాలు సెక్షన్-ఇ 1 ణ 10 = 10 20 నిమిషాలు సెక్షన్-ఎఫ్ 2 ణ 5 = 10 20 నిమిషాలు సెక్షన్-జి 5 ణ 2 = 10 20 నిమిషాలు సెక్షన్-డి లో భాగస్వామ్య వ్యాపార సంస్థకు సంబంధించి 20 మార్కుల ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం సుదీర్ఘంగా ఉండటం వల్ల సంబంధిత పట్టికల్లో జాగ్రత్తగా వ్యవహారాలను నమోదు చేస్తూ సరైన పద్ధతిలో ఖాతాల నిల్వల్ని తేల్చాలి. సమయం వృథా కాకుండా చూసుకోవాలి. సెక్షన్-ఇ లో కన్సైన్మెంట్ ఖాతాలు, వ్యాపారేతర సంస్థల ఖాతాల నుంచి 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటిని బాగా చదివి, అర్థం చేసుకొని ఒక ప్రశ్నను ఎంపిక చేసుకొని అవసరమైన మేరకు మాత్రమే సమాధానం రాయాలి. సెక్షన్-ఎఫ్ లోని నాలుగు ప్రశ్నల్లో 3 అకౌంట్స్ ప్రశ్నలు, 1 థియరీ ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. విద్యార్థులు వారికి అనువైన ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. సెక్షన్-జి లో అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు క్లుప్తంగా, సవివరంగా సమాధానాలు రాయాలి. సూచనలు: అకౌంట్స్ విభాగంలో అధిక శాతం సుదీర్ఘ సమాధాన ప్రశ్నలు, ఛ్చిఛిఠ్చ్టజీౌట ఉన్నందున సమాధానాలు రాయటంలో వేగం, కచ్చితత్వం ప్రధానం. అకౌంట్స్‌లో నియమాలు, సూత్రాలను అనుసరిస్తూ సమాధానాలు రాయాలి. అవసరమైన చోట తప్పనిసరిగా స్కేలు, పెన్సిల్ ఉపయోగించాలి. ముఖ్యమైన దీర్ఘ సమాధాన ప్రశ్నలు: 1.స్టాక్ ఎక్స్చేంజ్ను నిర్వచించి, దాని విధులను రాయండి? 2.సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం అంటే ఏమిటి? చేర్చడానికి గల ఆవశ్యకాలు, ప్రయోజనాలను రాయండి? 3.మార్కెటింగ్‌ను నిర్వచించి, మార్కెటింగ్ విధులను రాయండి? 4.టోకు వర్తకుడు అంటే ఏమిటి? టోకు వర్తకుడు ఉత్పత్తిదారులకు అందించే సేవల గురించి రాయండి? 5.జిల్లా ఫోరం అంటే ఏమిటి? అధికారాలను రాయండి? 6.బ్యాంకు అంటే ఏమిటి? బ్యాంకు విధులను రాయండి? 7.ఈ-బ్యాంకింగ్ అంటే ఏమిటి? ఈ-బ్యాంకింగ్ రకాలను రాయండి? 8.బీమాను నిర్వచించి, బీమా సూత్రాలను రాయండి? prepared by K. Janardhan Reddy (Economics) Kuruhuri Ramesh (Commerce) G.W. Stevenson (Civics) Royal Educational Institutions, Hyderabad. -
ఐటీ నవ్య పథాలు.. భవ్య కెరీర్లు..
ఐటీ రంగంలో ఉద్యోగాలు అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్ జాబ్స్ అనే భావన నెలకొని ఉంది.. కానీ నైపుణ్యం ఉంటే చాలు అందలం ఎక్కించేందుకు కన్సల్టింగ్, రీసెర్చ, అనలిటిక్స్ వంటి ఎన్నో కెరీర్ మార్గాలు ఉన్నాయి. వాటిపై ఈ వారం ఫోకస్... రమేష్ సిద్ధవటం, ప్లేస్మెంట్ మేనేజర్, బిట్స్ పిలానీ-హైదరాబాద్ క్యాంపస్. ఐటీ జాబ్స్ అంటే కేవలం డెవలప్మెంట్/ టెస్టింగ్ ఉద్యోగాలు అనే భావన నెలకొని ఉంది. కానీ అన్వేషిస్తే డెవలప్మెంట్/టెస్టింగ్ కాకుండా ఎన్నో విభిన్న అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులను తీసుకుంటే కోడింగ్‌లో కాస్త నైపుణ్యం, డేటాస్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌లో అంతగా ప్రావీణ్యం లేకున్నా ఐటీ డెవలప్మెంట్లో వచ్చిన మార్పుల కారణంగా ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా అనాలిసిస్ నైపుణ్యాలు ఉంటే.. కన్సల్టింగ్, రీసెర్చ్, అనలిటిక్స్ కంపెనీల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను అందుకోవచ్చు. ఆయా రంగాలకు సంబంధించి బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, కన్సల్టింగ్ అనే పదాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆ అవకాశాలను కల్పిస్తున్న వివిధ రంగాలు.. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్/కోడింగ్ జాబ్స్: కోడింగ్, అల్గారిథమ్స్ వంటి అంశాల్లో మెరుగ్గా ఉంటే ఐటీ సర్వీసెస్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీల్లో డెవలప్మెంట్ విభాగాల్లో అవకాశాలను అందుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏ లాంగ్వేజ్‌ను నేర్చుకున్నామనేది కాదు.. ప్రాబ్లమ్ సాల్వింగ్ డేటాస్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌ను ఏవిధంగా అన్వయించగలుగుతున్నామనేది కీలకం. కేవలం డేటాస్ట్రక్చర్స్పై అవగాహన ఉంటే సరిపోదు. ఏ ప్రాబ్లమ్‌కు ఎటువంటి డేటాస్ట్రక్చర్ను ఉపయోగించాలి అనే విషయంలో స్పష్టత ఉండాలి. ఎందుకంటే కంపెనీలు కోడింగ్‌లో అత్యున్నత నైపుణ్యం ఉన్న వారి కోసం చూస్తుంటాయి. రిక్రూట్మెంట్ సమయంలో టెక్నికల్/కోడింగ్ అంశాల్లో మిగతా వారి కంటే మీరు ఎంత సమర్థులు అనే అంశాన్ని కంపెనీలు పరిశీలిస్తుంటాయి. కాబట్టి కేవలం ప్రోగ్రామ్ రాయడంపై అవగాహన ఉంటే సరిపోదు. వినియోగదారులను సంతృప్తి పరిచేవిధంగా ప్రోగ్రామ్ రాసేందుకు సరైన అల్గారిథమ్స్ తెలిసి ఉండడం అవసరం అని గుర్తించాలి. మరో కీలకాంశం అందరూ సాఫ్ట్వేర్ కంపెనీల్లో పని చేస్తుంటారు. కానీ వేతనాల్లో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం.. ఆయా కంపెనీల్లో అభ్యర్థులు పని చేస్తున్న విభాగాలను బట్టి వేతనాల్లో తేడా ఉంటుంది. ఉదాహరణకు అప్లికేషన్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగాల్లో ఎక్కువ కోడింగ్ అవసరం. కాబట్టి ఈ విభాగాల్లో పని చేసే వారికి అధిక వేతనాలు ఉంటాయి. అదే సపోర్టింగ్, మెయింటనెన్స విభాగాల్లో కోడింగ్‌తో అంత అవసరం ఉండదు. కాబట్టి వేతనాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి కోడింగ్‌లో ప్రావీణ్యం సంపాదించడం ఉన్నత కెరీర్‌కు మార్గం వేస్తుంది. కన్సల్టింగ్ జాబ్స్: సాధారణంగా కన్సల్టింగ్‌కు సంబంధించి బిజినెస్ కన్సల్టింగ్ కంపెనీలు, టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీలు ఉంటాయి. బిజినెస్/మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీల్లో కేవలం ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు మాత్రమే అవకాశాలు ఉంటాయనే భావన ఉంది. కానీ అది సరికాదు. ఎందుకంటే ప్రముఖ బిజినెస్ కన్సల్టింగ్ కంపెనీలు ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పిస్తున్న సందర్భాలు ఎన్నో. టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ప్రతి ఏడాది టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థలు ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. మొదట టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీలో చేరి తగిన అనుభవం సంపాదించిన తర్వాత బిజినెస్ కన్సల్టింగ్ కంపెనీలోకి మారొచ్చు. కన్సల్టింగ్ కంపెనీలు రిక్రూట్మెంట్ కోసం నిర్వహించే ఇంటర్వ్యూలు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ ఇంటర్వ్యూల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, కేస్ ఆధారిత ప్రశ్నలు ఎదురవుతాయి. ఇక్కడ సమాధానం కంటే దాన్ని సాధించేందుకు అనుసరించిన లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. భవిష్యత్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్థిరపడాలనే ఆస్తకి ఉంటే కన్సల్టింగ్ను కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. టాప్ రిక్రూటర్స్: బెయిన్ అండ్ కంపెనీ, అసెంచర్, డెలాయిట్, కేపీఎంజీ, ఎ.టి.కర్నీ.. ఇంకా మరెన్నో. బిజినెస్ ఇంటెలిజెన్స జాబ్స్: కొన్ని కన్సల్టింగ్ కంపెనీల్లో బిజినెస్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఉంటుంది. ఒక డేటాను విశ్లేషించి అర్థవంతమైన డేటాను రూపొందించే పనిని ఈ విభాగం నిర్వహిస్తుంది. ఇందులో డెవలప్‌మెంట్‌తోపాటు అనలిటిక్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే వివిధ రకాల బిజినెస్ మోడల్స్‌ను రూపొందించడానికి కోడింగ్, మార్కెట్‌ను విశ్లేషించడానికి అనలిటిక్స్ అవసరం. కాబట్టి డెవలప్మెంట్, అనలిటిక్స్‌పై అవగాహన ఉంటే ఈ రంగంలో మరింత రాణించవచ్చు. సర్వేలు నిర్వహించడం, సేకరించిన డేటాను విశ్లేషించడం వంటి లక్షణాలు ఉంటే ఈ తరహా కంపెనీల్లో అవకాశాలను అందుకోవచ్చు. ప్రతి ఏడాది రీసెర్చ్ అనలిటిక్స్ కంపెనీలు ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. టాప్ రిక్రూటర్స్: టెరాడేటా, థరోగుడ్, ఇన్ఫర్మేటికా, వరల్డ్‌క్వాంట్ రీసెర్చ్ మరెన్నో. అనలిటిక్స్ జాబ్స్: కొన్ని టెక్నాలజీ కంపెనీలకు సొంతంగా అనలిటిక్స్ విభాగం ఉంటోంది. వీరు కేవలం కంపెనీ వ్యవహారాలకే పరిమితం కాకుండా వారి క్లయింట్స్‌కు కావల్సినప్పుడు తమ సేవలను కూడా అందిస్తుంటారు. ఇటువంటి కంపెనీల్లో ప్రవేశించాలంటే కోడింగ్ తప్పనిసరిగా తెలిసి ఉండాలి. దీంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ నైపుణ్యాలు ఉంటే మెరుగైన అవకాశాలను అందుకోవచ్చు. కోడింగ్/ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంతగా లేకున్నా కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులను రిక్రూట్ చేసుకుని కంపెనీలు టెక్నాలజీ, కోడింగ్ అంశాల్లో శిక్షణనిస్తాయి. కేపీవో (నాలెడ్‌జ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్) ఈ కంపెనీలు తమ క్లయింట్స్‌కు సంబంధించిన వ్యాపార సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతాయి. ఇటువంటి కంపెనీల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి కొన్ని కంపెనీలు ఏదో ఒక ప్రత్యేక (స్పెషలైజ్డ్) విభాగానికి మాత్రమే పరిమితమవుతాయి. ఉదాహరణకు మార్కెటింగ్ అనలిటిక్స్ కంపెనీలు. ఇటువంటి కంపెనీలు కేవలం విశ్లేషణకు మాత్రమే పరిమితమవుతాయి. ఇటువంటి కంపెనీల్లో పని చేయడం ద్వారా వ్యాపార, మార్కెట్ రంగాలను విశ్లేషణాత్మక దృక్పథంతో అవగాహన చేసుకోవచ్చు. టాప్ రిక్రూటర్స్: మ్యూసిగ్మా, లేటెంట్వ్యూ, జెన్‌ప్యాక్ట్ అనలిటిక్స్, టీసీఎస్ అనలిటిక్స్, గ్లోబల్ అనలిటిక్స్.. ఇంకా మరెన్నో. ఫైనాన్షియల్ రీసెర్చ్/ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్: ఈ రంగంలో అవకాశాలను దక్కించుకోవాలంటే కోడింగ్, మ్యాథమెటికల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ నైపుణ్యాలు అవసరం. మ్యాథమెటికల్ మోడల్స్ రూపొందించడానికి కోడింగ్, మార్కెట్‌ను విశ్లేషించేందుకు అనలిటిక్స్ అవసరం. కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అర్హతలు ఉన్న వారికి ఈ రంగం సరిగ్గా సరిపోతుంది. క్లౌడ్ కంప్యూటింగ్: క్లౌడ్ కంప్యూటింగ్‌లో అప్లికేషన్స ఏవిధంగా రాయాలి, అప్లికేషన్స రకాలు, వాటి వల్ల ప్రయోజనాలు అనే అంశాలను అవగాహన చేసుకోవడం ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్‌లో కెరీర్‌పై అవగాహన పొందొచ్చు. ఉదాహరణకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, తదితర సంస్థలు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందిస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌ను ఒక రకమైన టెక్నాలజీ షిఫ్ట్‌గా పేర్కొనవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌సగా స్థిరపడాలనుకునే వారికి క్లౌడ్ కంప్యూటింగ్ చక్కగా సరిపోతుంది. ఈ రంగానికి కూడా కోడింగ్ అవసరం. ఈ రంగంలో పని చేసే వారిని డెవలపర్ హోదాలో రిక్రూట్ చేసుకుంటారు. వీరు క్లౌడ్‌కు సంబంధించిన కోడ్ రాయాలి. క్లౌడ్‌కు సంబంధించి అప్లికేషన్స రాయడం, కోడింగ్, టెక్నాలజీపై ఆస్తకి ఉంటే ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. కొన్ని కాలేజీలు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ ఆప్షన్‌తో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాధాన్యం ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్/ఐటీ విద్యార్థులు ప్రస్తుత తరుణంలో ప్లేస్మెంట్ విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కంపెనీలు గతంతో పోల్చినప్పుడు రిక్రూట్‌మెంట్‌ను పరిమితం చేసుకోవడంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా ఈ విషయంలో మినహాయింపు లభించటం లేదు. ఈ సమయంలో నూతనంగా ప్రాచుర్యంలోకి వస్తున్న అనలిటిక్స్, కన్సల్టింగ్ అవకాశాలపై అవగాహన ఉండడం విద్యార్థులకు కెరీర్ పరంగా ఇతోధిక సహాయం చేస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌తోపాటు మ్యాథమెటిక్స్ పరంగా మంచి అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి అనలిటిక్స్, కన్సల్టింగ్ కంపెనీలు ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తాయి. ఉదాహరణకు ఇంజనీరింగ్/టెక్నాలజీ నేపథ్యం ఉన్న విద్యార్థి అనలిస్ట్/కన్సల్టింగ్ ఉద్యోగానికి సరిగ్గా సరిపోతాడు. ఎందుకంటే డేటా అనలిస్ట్, రీసెర్చ్ అనలిస్ట్/కన్సల్టింగ్ ఉద్యోగాలకు కంప్యుటేషనల్తోపాటు అనలిటికల్ నైపుణ్యాలు అవసరం. ఇటువంటి నైపుణ్యాలు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని వ్యాపార నమూనాల (బిజినెస్ మోడల్స్) నిర్వహణలో తార్కిక వివేచనతోపాటు మ్యాథమెటికల్ నైపుణ్యాలు అవసరం. ఈ నేపథ్యంలో కావల్సిన కోడింగ్, అనలిటిక్స్, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ నైపుణ్యాలు ఇంజనీరింగ్ విద్యార్థిలో ఉంటాయని సంబంధిత కంపెనీలు భావిస్తాయి. కాబట్టి కంపెనీలు ఫ్రెష్ ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి. అర్హతలు - నైపుణ్యాలు బ్రాంచ్‌తో నిమిత్తం లేకుండా కోడింగ్‌లో ప్రావీణ్యంగల ఇంజనీరింగ్ విద్యార్థులను అనలిటిక్స్, కన్సల్టింగ్ కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. వారికి ప్రాధాన్యతతో కూడిన బాధ్యతలను అప్పగిస్తున్నాయి. ఇక్కడ ప్రస్తావించిన కంపెనీల్లో కోడ్ రాయడంతోపాటు వ్యాపార అవసరాలకనుగుణంగా నమూనాలను రూపొందిస్తుంటారు. కాబట్టి ఇటువంటి కంపెనీల్లో ప్రవేశించాలంటే కోడింగ్‌తోపాటు, వ్యాపార వ్యవహారాలను అవగాహన చేసుకునే నైపుణ్యత ఉండాలి. మ్యాథమెటిక్స్‌లో నైపుణ్యం, విశ్లేషణాత్మకంగా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం, స్టాటిస్టిక్స్‌లో ప్రావీణ్యం, వివిధ వ్యాపారాల నిర్వహణ సంబంధిత అంశాలను అవగాహన చేసుకునే చాతుర్యం. కోడింగ్, అనలిటిక్స్ రెండు అంశాల్లో ప్రావీణ్యం ఉండడం అదనపు అర్హతగా ప్రయోజనం చేకూరుస్తుంది. క్లయింట్స్ నుంచి వచ్చే ఒత్తిడిని సమర్థంగా తట్టుకునే స్వభావం, ప్రయాణాల పట్ల ఆసక్తి, ఉద్యోగులను జట్టుగా నడిపే సామర్థ్యం. అనలిటిక్స్, కన్సల్టింగ్ కంపెనీలు ఫ్రెషర్స్‌కు ఆఫర్ చేసే వేతనాలు కంపెనీలను బట్టి మారుతుంటాయి. కొన్ని కన్సల్టింగ్ కంపెనీల్లో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే ఉత్సాహం, దీర్ఘకాల సర్వీస్, పనిచేస్తున్న కంపెనీలో భాగస్వామి(పార్టనర్)గా చేరే అవకాశం కూడా లభిస్తుంది. నాస్కామ్ అంచనా ప్రకారం బిగ్‌డేటా రంగం 2015 నాటికి ఒక యూఎస్ బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అనలిటిక్స్ విభాగంలో కొత్తగా 2.5 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా బిగ్‌డేటా రంగంలో 4.4 మిలియన్ ఉద్యోగాలు అందుబాటులోకి రావచ్చు. నౌకరీ డాట్‌కామ్ ప్రకారం 2014లో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో రిక్రూట్మెంట్ ఎక్కువగా ఉండొచ్చు. -
జేఈఈ అడ్వాన్స్డ్.. ప్రతిభావంతుల పరీక్ష
జేఈఈ అడ్వాన్స్డ్.. చక్కటి ఇంజనీరింగ్ కెరీర్ దిశగా కీలక ఘట్టం.. ఎంసెట్, జేఈఈ-మెయిన్ తదితర ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తర్వాత నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధిస్తేనే ఐఐటీ కల సాకారమవుతుంది.. దేశంలోని లక్షా యాభై వేల మంది ప్రతిభావంతులు మాత్రమే హాజరయ్యే ఈ పరీక్షలో నెగ్గాలంటే.. ప్రతి ఎత్తును ఎంతో చాకచక్యంగా వేయాలి.. అప్పుడే ప్రతిభావంతుల సమరంలో విజేతగా నిలవడంతోపాటు ఐఐటీ లక్ష్యాన్ని ఛేదించడం సులభమవుతుంది.. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్‌కు అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణుల సలహాలు, సూచనలు.. 1,50,000 జేఈఈ-మెయిన్ ద్వారా 1,50,000 మంది విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. 20,000 అడ్వాన్స్‌డ్‌కు హాజరైన 1,50,000 మందిలో 20,000 మంది విద్యార్థులకు ర్యాంక్ కేటాయిస్తారు 20 అడ్వాన్స్డ్ ర్యాంక్‌తోపాటు ఇంటర్లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉంటే ఐఐటీలు, ఐఎస్‌ఎంలో సీటు కేటాయిస్తారు. జేఈఈ-అడ్వాన్స్డ్ 2014 కూడా గతేడాది మాదిరిగానే ఉండొచ్చు. కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. కాబట్టి విద్యార్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఆఫ్‌లైన్ (పేపర్-పెన్సిల్) విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు.. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. వీటిల్లో నాలుగు రకాల ప్రశ్నలిస్తారు. ప్రతి పేపర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి పేపర్‌కు సమయం మూడు గంటలు. ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. మ్యాథమెటిక్స్! గత నాలుగు-ఐదేళ్ల ప్రశ్నపత్రాలను గమనిస్తే ఎక్కువ శాతం ప్రశ్నలు అల్జీబ్రా, కాలిక్యులస్ నుంచి వచ్చాయని చెప్పొచ్చు. వీటిల్లో అధిక శాతం ప్రశ్నలు మిక్స్డ్ కాన్సెప్ట్ ఆధారితం. గతేడాది అడ్వాన్స్‌డ్‌లో పేపర్-1, పేపర్-2లలో అల్జీబ్రా నుంచి అత్యధిక ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నల క్లిష్టత విషయానికొస్తే.. పేపర్-1లో 25 శాతం ప్రశ్నలు సులభంగా, 50 శాతం ప్రశ్నలు మధ్యస్తంగా, 25 కష్టమైనవిగా ఉన్నాయి. పేపర్-2లో 50 నుంచి 60 శాతం ప్రశ్నలు సులభంగా ఇచ్చారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావాలంటే.. జేఈఈ-మెయిన్‌లో అర్హత సాధించాలి. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు నెలల సమయాన్ని ఇంటర్మీడియెట్ పరీక్షలతోపాటు జేఈఈ-మెయిన్ ప్రిపరేషన్‌కు వెచ్చించాలి. ఆ తర్వాత ఉండే 40 నుంచి 50 రోజుల సమయాన్ని అడ్వాన్స్డ్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. పేపర్-1,పేపర్-2లలో కలిపి ప్రొబబిలిటీ, కాంప్లెక్స్ నంబర్స్, లిమిట్స్ అండ్ డిఫరెన్షియన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టర్ అల్జీబ్రా, 3డీ జ్యామెట్రీ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని చెప్పొచ్చు. డిఫరెన్షియల్ ఇంటిగ్రల్, సర్కిల్స్, 3డి స్ట్రైట్ లైన్స్, మాక్సిమ-మినిమ, ఏరియాస్ నుంచి కూడా ప్రశ్నలు రావచ్చు. ప్లేన్, వెక్టర్ అల్జీబ్రా, పారాబొలా, సర్కిల్స్ నుంచి అడుగుతున్న ప్రశ్నలు సులభంగా ఉంటున్నాయి. డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్, ప్రొబబిలిటీ, కాంప్లెక్స్ నంబర్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి అడిగే ప్రశ్నలను క్లిష్టంగా రూపొందిస్తున్నారు. 11,12వ తరగతుల నుంచి సమాన వెయిటేజీలో ప్రశ్నలు ఇస్తున్నారు. ఇటువంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కాన్సెప్ట్స్ (మూల భావనలు)పై పట్టు ఏర్పర్చుకోవాలి. ఇప్పటికే మొదటి, రెండో సంవత్సరానికి పునశ్చరణ (రివిజన్) పూర్తి చేసి ఉంటారు. కాబట్టి ఫిబ్రవరి 20 వరకు ఇంటర్ సెకండియర్ టాపిక్స్‌పై దృష్టి పెట్టాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి వివిధ ఫార్ములాలు-ఉపయోగాలపై అవగాహన పెంచుకోవాలి. జేఈఈ-మెయిన్ గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావాలి. మరో కీలక విషయం అన్ని చాప్టర్లను ప్రిపేర్ కావడం కంటే 80 శాతం చాప్టర్లను 100 శాతం (సంపూర్ణంగా) ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. చాలా మంది విద్యార్థులు చాప్టర్, యూనిట్ల వారీగా వివిధ రకాల పుస్తకాలను చదువుతుంటారు. దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. కాబట్టి ఏదో ఒక ప్రామాణిక పుస్తకాన్ని సంపూర్ణంగా చదవడమే ప్రయోజనం. -ఎం.ఎన్.రావు, శ్రీచైతన్య విద్యాసంస్థలు. ఫిజిక్స్ జేఈఈ-అడ్వాన్స్డ్ ర్యాంక్ సాధనలో ఫిజిక్స్ సబ్జెక్ట్ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. మ్యాథమెటిక్స్‌లో చురుగ్గా ఉన్న విద్యార్థులు ఫిజిక్స్‌లో రాణించడానికి మంచి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఫిజిక్స్‌లో అడిగే ప్రశ్నలు నేరుగా, మెమొరీ బేస్డ్ కాకుండా వివిధ కాన్సెప్ట్‌ల ఆధారంగా ఉంటాయి. అదే సమయంలో కొంచెం తికమక(ట్విస్ట్) పెట్టేలా అడుగుతా రు. కాబట్టి సిలబస్‌లో ఒక్క చిన్న అంశాన్ని కూడా వదిలివేయకుండా కాన్సెప్ట్ బేస్డ్గా ప్రిపరేషన్ సాగించినప్పుడే ఈ తరహా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం సాధ్యమవుతుంది. సాధారణంగా విద్యార్థులు ఫిజిక్స్‌లో మోడ్రన్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్ అంశాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ అంశాలకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంటారు. కానీ గతేడాది అడ్వాన్స్‌డ్‌లో మోడ్రన్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్ అంశాలకు అధిక ప్రాధాన్యత లభించింది. జేఈఈ సిలబస్‌ను పూర్తి చేయడానికి చక్కని మార్గం.. ఉమ్మడి భావనలు (కామన్ కాన్సెప్ట్) ఉన్న అంశాలను ఒకే సమయంలో ప్రిపేర్ కావడం. ఉదాహరణకు గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నో స్టాటిస్టిక్స్; కరెంట్ ఎలక్ట్రిసిటీ, హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్ డైనమిక్స్; సౌండ్ వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, సూపర్ పొజీషన్ ప్రిన్సిపల్, సింపుల్ హార్మోనిక్ మోషన్; మెకానిక్స్; మోడ్రన్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్; థర్మోడైనమిక్స్; ఎలాస్టిసిటీ అండ్ సర్ఫేస్ టెన్షన్; ఎలక్ట్రోమాగ్నటిజం. ఫిజిక్స్‌లో క్లిష్టంగా భావించే అంశాలను సులభంగా ప్రిపేర్ కావడానికి: థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్‌లలో కొన్ని అంశాలు ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కామన్‌గా ఉంటాయి. కాబట్టి ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌ను దృష్టిలోని ఉంచుకుని ఈ అంశాలను ప్రిపేర్ కావడం ఉత్తమం. ఆప్టిక్స్ విషయానికొస్తే.. ముందుగా వేవ్ టాపిక్స్‌ను పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే దీని పరిధి స్వల్పంగా ఉండడంతోపాటు త్వరగా పూర్తి చేయవచ్చు. తర్వాత జీయోమెట్రికల్ ఆప్టిక్స్‌ను ప్రిపేర్ కావాలి. వేవ్స్‌లో ట్రాన్స్వర్స్ వేవ్స్, సౌండ్ వేవ్స్‌కు వెయిటేజీ సమంగా ఉంటుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్, ఫిజికల్ ఆప్టిక్స్, ఎల్సీ ఆసిలేషన్స్, ఏసీ సర్క్యూట్స్లలోని మ్యాథమెటికల్ పార్ట్ ప్రిపేర్ కావడం ఉపయుక్తం. గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నటిజంలలో కూడా టాపిక్స్ కామన్‌గా ఉంటాయి. ప్రిన్సిపల్స్, అప్లికేషన్స్‌లో కొద్దిపాటి తేడా ఉంటుంది. కూలుంబ్స్ లా.. న్యూటన్స్ గ్రా విటేషన్ లాగా మారుతుంది. గాస్ లాను గ్రావిటేషన్ ఫీల్డ్ ఎవల్యూషన్లోనూ ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, మాగ్నటిజం అంశాలను ఒక్కటిగా చదువుకోవచ్చు. ఫిజిక్స్‌లో సాధారణంగా ఒక అంశానికి మరొక అంశానికి సంబంధం ఉండే మిక్స్డ్ కాన్సెప్ట్ ప్రశ్నలను ఎక్కువగా అడుగుతుంటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఒక అంశంతో సంబంధం ఉండే అన్ని అంశాలను ప్రిపేర్ కావాలి. ఇందుకు అన్ని అంశాలకు ఆధారంగా ఉండే ఒక మూలాధార సూత్రాన్ని రూపొందించుకోవాలి. దీన్ని అవసరమైన చోట్ల అన్వయం చేసుకుంటూపోవడం ప్రిపరేషన్లో ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు మెకానిక్స్‌లో అధిక శాతం సమస్యలు లీనియర్ మూవ్‌మెంటమ్, ఎనర్జీ, యాంగ్యులర్ మూవ్‌మెంటమ్, న్యూటన్ సెకండ్ లాకు సంబంధించినవై ఉంటాయి. -డా॥సి.హెచ్. రామకృష్ణ, డాక్టర్ ఆర్కేస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాద్. కెమిస్ట్రీ కెమిస్ట్రీకి సంబంధించి సిలబస్‌ను స్థూలంగా మూడు విభాగాలుగా వర్గీకరించవచ్చు. అవి.. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. సిలబస్‌ను మూడు విభాగాలకు పేర్కొన్నా.. ఆ మూడు విభాగాలకు అంతర్గత సంబంధం (ఇంటర్ కనెక్టెడ్) ఉంటుంది. ఉదాహరణకు రిడాక్స్ రియాక్షన్స్ మీద పట్టు.. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ప్రిపరేషన్, ప్రాపర్టీస్‌లో ఉపయోగపడుతుంది. గత పోటీ పరీక్షలను పరిశీలిస్తే.. ఈ మూడు విభాగాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక అంశంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం సహేతుకం కాదు. కీలక చాప్టర్లు: పీరియాడిక్ టేబుల్; కెమికల్ బాండింగ్; మోల్ కాన్సెప్ట్ (కాన్సన్ట్రేషన్స్ కలిపి); రిడాక్స్ రియాక్షన్స్; క్వాలిటేటివ్ అనాలిసిస్; జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ చాపర్ట్లపై పట్టు.. మిగతా చాప్టర్లను కూలంకశంగా ప్రిపేరయ్యేందుకు దోహదపడుతుంది. కీలకమైన చాప్టర్.. పీరియాడిక్ టేబుల్. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ఈ అధ్యాయం లేనప్పటికీ.. దీన్ని అవగాహన చేసుకోకుండా కెమిస్ట్రీలోని మిగతా అంశాలను అర్థం చేసుకోవడం కష్టం. ఫిజికల్ కెమిస్ట్రీ: ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే ప్రాథమిక భావనలపై పట్టు, ఇచ్చిన సమస్య ప్రకారం సూత్రాన్ని అన్వయించుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. విశ్లేషణాత్మకంగా ప్రిపరేషన్ సాగించాలి. నేర్చుకున్న సూత్రాలను నోట్స్ రూపంలో పొందుపరుచుకోవాలి. వీటిని విభిన్న పద్ధతుల్లో ఏవిధంగా అన్వయం చేసుకోవచ్చో పరిశీలించాలి. ఒక టాపిక్ పూర్తయిన వెంటనే.. దానికి సంబంధించి వివిధ పుస్తకాల్లో ఉన్న విభిన్న రకాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ప్రతి టాపిక్కు సంబంధించి కనీసం మూడు ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ: గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగానికి సంబంధించి సులువుగా సమాధానం గుర్తించగల స్టీరియో ఐసోమరిజమ్ తరహా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విభాగానికి సంబంధించి ప్రాథమిక భావనలపై పట్టుతోపాటు విస్తృత స్థాయిలో ప్రిపేర్ కావడం అనే ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. ఇందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్ చాలా కీలకమైంది. ఈ అంశంపై పట్టు సాధిస్తే.. మిగతా అంశాలను అవగాహన చేసుకోవడం ఏమంత కష్టం కాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి కీలక అంశం.. చదవడమేకాకుండా ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇందులో మెరుగైన స్కోర్‌కు: చాప్టర్ల వారీగా రియాక్షన్స్‌ను నోట్ చేసుకోవాలి. ప్రతి రియాక్షన్‌కు సంబంధించి దాని విశ్లేషణ, వ్యవస్థ, ఉత్పత్తులు, కావల్సిన నిబంధలను ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి. రోజూ ఒక టాపిక్‌లోని కన్జర్వేషన్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్లో సబ్జెక్టివ్ వ ర్క్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యతనివ్వాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ: కెమిస్ట్రీలో.. ఇనార్గానిక్ కెమిస్ట్రీ పరిధి విస్తృతం. కాబట్టి అధిక శాతం మంది విద్యార్థులు ఈ అంశాన్ని కష్టమైందిగా భావిస్తారు. వాస్తవానికి పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రిడాక్స్ రియాక్షన్స్, ఈక్విలిబ్రియం, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంశాలపై పట్టుతో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగం నుంచి కాన్సెప్ట్ బేస్డ్ (ప్రాథమిక భావనల ఆధారంగా), స్ట్రక్చర్స్ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాకుండా కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి ప్రాధాన్యత పెరిగింది. ఈ అంశంపై తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవన్నీ నేరుగా (స్ట్రయిట్ ఫార్వర్డ్ కొశ్చన్స్)నే ఉండడం గమనించాల్సిన అంశం. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి మెటలర్జీ, ట్రాన్సిస్టన్ ఎలిమెంట్స్, ఎస్-బ్లాక్ ఎలిమెంట్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కీలక అంశాలు. ఇందులో మెరుగైన స్కోర్‌కు చేయాల్సినవి: నిర్దేశించిన సిలబస్‌ను అనుసరిస్తూ.. రిప్రెజెంటేటివ్ ఎలిమెంట్స్‌కు సంబంధించి నోట్స్ రూపొందించుకోవాలి. కోఆర్డినేట్ కాంపౌండ్స్‌కు ఎక్కువ సమయం వెచ్చించాలి. మెటలర్జీ, క్వాంటిటేటివ్ అనాలిసిస్‌కు సంబంధించి ఫ్లో చార్ట్స్ రూపొందించుకోవడం మంచిది. ప్రిపరేషన్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి కనీసం రోజుకు ఒక గంటైనా కేటాయించాలి. -పి. విజయ కిశోర్, డాక్టర్ ఆర్కేస్ ఐఐటీ అకాడెమీ, హైదరాబాద్. -
సరైన సమయపాలనతో 100 పర్సంటైల్!
ఎవరికైనా రోజుకు ఉంది 24 గంటలే! కానీ, ఒకరు అందలంపై ఉంటే మరొకరు అట్టడుగున ఉంటారు. చక్కటి సమయ పాలన ఉన్నవాళ్లు శిఖర గమ్యానికి చేరితే, అది లేనివాళ్లు పాతాళానికి పడిపోతారు. కాలం కత్తి లాంటిది.. దానికి పదునుపెడితే ఎంతటి లక్ష్యాన్నయినా సాధిస్తుంది. అంతటి విలువైన సమయాన్ని ఒడిసిపట్టి, సద్వినియోగం చేసుకోవడం వల్లే క్యాట్‌లో 100 పర్సంటైల్ సాధించానంటున్నారు పి.కృష్ణ కౌండిన్య... అమ్మానాన్న ఇద్దరూ విద్యావంతులు. నాన్న ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. సోదరి ఇంజనీరింగ్ చదువుతోంది. నా చదువు హైదరాబాద్‌లోనే సాగింది. ప్రస్తుతం ముంబై ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా. ఎవరికైనా సాధ్యమే! ప్రణాళిక ప్రకారం కృషిచేస్తే క్యాట్‌లో 100 పర్సంటైల్ సాధించడం కష్టమేమీ కాదు. ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవడం అవసరం లేదన్నది నా అభిప్రాయం. ఎవరికి వారు తమ బలాలు, బలహీనతలను గుర్తించి, లోపాలను సరిదిద్దుకుంటే విజయం తథ్యం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ.. ఎందులో రాణించాలన్నా ఇంగ్లిష్ అవసరం. కొత్త పదాలను తెలుసుకోవడం, వ్యాకరణంపై పట్టు సాధించడం క్యాట్ ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడింది. కాలమే కీలకం! కాలేజీలో చదువుతూనో లేదంటే ఉద్యోగం చేస్తూనో ఉన్నత చదువులకు సిద్ధమయ్యే సందర్భంలో టైం మేనేజ్మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది. చాలా మంది తమకు తెలియకుండానే కాలాన్ని వృథా చేస్తారు. గంటలో పూర్తయ్యే పనికి రెండు, మూడు గంటలు తీసుకుంటారు. రేపు మాపంటూ వాయిదా వేస్తుంటారు. అలా కాకుండా దేనికెంత సమయం అవసరమో చూసుకుని ప్రణాళికను సిద్ధం చేసుకొని, దాన్ని పక్కాగా అమలు చేస్తే ఇంకా చాలా సమయం చేతిలో ఉంటుంది. నేను కాలేజీ తరఫున బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లకు వెళ్తుంటా. గిటారు వాయిస్తుంటా. పాటలు కూడా కంపోజ్ చేస్తుంటాను. అప్పుడప్పుడు స్టేజ్ షోలు ఇస్తుంటాను. అయినా చదువుకు ఆటంకం కలగకుండా సమయాన్ని మేనేజ్ చేసుకుంటున్నాను. క్యాట్ ఔత్సాహికులు తమ ప్రిపరేషన్లో ఏ సబ్జెక్టుకు ఎంత సమయం అవసరమో గుర్తించి, రోజూ సాధన చేస్తే మంచి స్కోర్ సాధించడం సులువే! ప్రశ్నల ఎంపికలో జాగ్రత్త: క్యాట్ పరీక్ష సమయంలో ముందుగా తేలికైన ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేదంటే మొదటే క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ప్రయత్నిస్తే ఒత్తిడి పెరిగే ప్రమాదముంది. నా వరకూ నేను క్యాట్ బాగానే రాసినా, 100 పర్సంటైల్ వస్తుందని ఊహించలేదు. అయితే మంచి స్కోర్ వస్తుందని మాత్రం తెలుసు. ఎంతబాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. దీనికి మించిన మార్గం మరొకటి లేదు. దినపత్రికలు, నవళ్లు చదవడం వల్ల ఇంగ్లిష్ భాషపై అవగాహన పెరిగింది. ఇది ఉన్నతమైన క్యాట్ స్కోర్ సాధనకు సహకరించింది. వారి కష్టమే నాకు స్ఫూర్తి: అమ్మానాన్న కష్టపడే తత్వం నాకు స్ఫూర్తి. ఇదే నన్ను విజయానికి దగ్గర చేసింది. అత్యుత్తమ మేనేజ్మెంట్ విద్యకు వేదికైన అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీయే చేయాలన్నది నా కోరిక. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ పరిజ్ఞానం మధ్య సమన్వయం బాగుంటుంది. కెరీర్లో పైకి ఎదిగేందుకు ఈ రెండూ అవసరమన్నది నా భావన. ‘‘నాకు క్యాట్‌లో 100 పర్సంటైల్ వస్తుందని ఊహించలేదు. అయితే మంచి స్కోర్ వస్తుందని మాత్రం తెలుసు. మంచి స్కోర్ సాధించాలంటే ప్రాక్టీస్‌కు మించిన మార్గం మరొకటి లేదు. దినపత్రికలు, నవలలు చదవడం వల్ల ఇంగ్లిష్ భాషపై అవగాహన పెరిగింది. ఇది చక్కటి క్యాట్ స్కోర్‌కు సహకరించింది’’. -పి.కృష్ణ కౌండిన్య -
ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సుల వివరాలు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ పీఎంఆర్‌డీఎఫ్ ఫెలోషిప్ వివరాలు తెలియజేయండి? - సుశాంత్, షాద్‌నగర్. పేదరిక నిర్మూలన, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్డీ) ప్రారంభించిన కార్యక్రమమే పీఎంఆర్‌డీఎఫ్ (ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలోషిప్స్). ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ఫెలోషిప్స్‌ను నిర్వహిస్తోంది. ఈ ఫెలోషిప్స్నకు ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వ పథకాల అమలు, వాటి నిర్వహణ తదితర అంశాలపై వెనుకబడిన జిల్లా కలెక్టర్లు, అధికారులతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్) నుంచి ఎంఎస్సీ/ఎంఫిల్ (డెవలప్మెంట్ ప్రాక్టీస్) కోర్సులో చేరే అవకాశం ఉంటుంది. ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం పూర్తిగా నిర్దేశించిన రాష్ట్రంలో ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరికి స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్‌లో పూర్తిస్థాయి ఉద్యోగికి ఇచ్చే వేతనంతో సమానమైన జీతాన్ని అందజేస్తారు. వీరు ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఎన్ఆర్ఎల్ఎం, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్, ఎన్బీఏ, ఎన్ఎస్ఏపీ, ఐఏపీ, ఐసీడీఎస్, ఎన్ఆర్హెచ్ఎం వంటి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి తగిన సూచనలు ఇస్తారు. ఎంపిక విధానంలో మూడు దశలు ఉంటాయి. అవి.. ఆలిండియా కాంపిటెన్సీ అసెస్మెంట్ టెస్ట్ (ఏఐసీఏటీ), రిటెన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ మూడు దశలకు కలిపి 200 మార్కులు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరంలో నెలకు రూ. 75 వేల ఫెలోషిప్ లభిస్తుంది. రెండో సంవత్సరంలో ఫెలోషిప్ మొత్తంలో 10 శాతం పెరుగుతుంది. ఓరియంటేషన్ సమయంలో నెలకు రూ.50 వేల స్టైపెండ్ ఇస్తారు. విద్యార్హత: 50 శాతం మార్కులతో నాలుగేళ్ల వ్యవధి ఉన్న గ్రాడ్యుయేషన్ (అగ్రికల్చర్/ఇంజనీరింగ్/లా/మెడిసిన్/ యానిమల్ హజ్బెండరీ తదితర) లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్. స్థానిక భాషపై పట్టు, సంబంధిత రంగంలో అనుభవం, కాలేజీ/పాఠశాల స్థాయిలో ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు: 22-27 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీ- 32 ఏళ్లు). వెబ్సైట్: pmrdfs.tiss.edu ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు వివరాలు తెలపండి? - వెంకట్, జడ్చర్ల. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం హవా నడుస్తోంది. మన దేశంలో పరిస్థితులు కూడా దీనికి భిన్నంగా లేవు. ఈ నేపథ్యంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. విజ్‌క్రాఫ్ట్ వంటి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, వివిధ టీవీ చానళ్లలో ఈవెంట్ మేనేజర్‌గా, లాక్మే వంటి సంస్థలు నిర్వహించే ఫ్యాషన్‌షోలకు కో-ఆర్డినేటర్లుగా అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఫిల్మ్‌ఫేర్ వంటి వివిధ మీడియా హౌస్‌లు, టూరిజం, అడ్వర్టైజ్మెంట్ హౌస్‌ల్లో కూడా స్థిరపడొచ్చు. విదేశాల్లోనూ, పర్సెప్ట్ డీ మార్క్, సీఎన్‌బీసీ, డీఎన్ఏ నెట్వర్క్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది. ఈ రంగంలో రాణించాలంటే కొన్ని ప్రత్యేక స్కిల్స్ తప్పనిసరి. విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులు, చర్చలు సాగించాల్సి ఉంటుంది కాబట్టి ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. అందిస్తున్న సంస్థలు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్- ముంబై. వెబ్సైట్: www.niemindia.com ఈఎండీఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్- హైదరాబాద్. వెబ్సైట్: www.emdiworld.com అమిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ (అమిటీ యూనివర్సిటీ)- న్యూఢిల్లీ. వెబ్సైట్: www.amity.edu/aiem అపేజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్- ద్వారక. వెబ్సైట్: www.apeejay.edu హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోర్సు వివరాలు తెలియజేయగలరు? - సంతోష్, నల్లగొండ. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హ్యూమన్ రిసోర్స్ సబ్జెక్టుకు సంబంధించి డిప్లొమా నుంచి పీజీ స్థాయి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో హెచ్ఆర్ను ఓ స్పెషలైజేషన్‌గా దాదాపు అన్ని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు అంది స్తున్నాయి. ఇంకా... రెండేళ్ల వ్యవధితో పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంఏ- హెచ్ఆర్ఎం/ ఐఆర్‌పీఎం కోర్సులు కూడా చదవొచ్చు. ఎంఏ.. ఎంబీఏ.. పీజీ డిప్లొమా.. కోర్సు ఏదైనా హెచ్ఆర్కు సంబంధించి బోధనాంశాలు ఒకే తీరుగా ఉంటాయి. మానవ వనరులు, మేనేజ్మెంట్కు సంబంధించిన అంశాలతో కరిక్యులం రూపొందిస్తున్నారు. ఉత్పత్తి రంగమైనా, సేవా రంగమైనా చిన్న తరహా సంస్థ అయినా, బహుళజాతి కంపెనీ అయినా హెచ్ఆర్ సిబ్బంది కావాల్సిందే. కాబట్టి సంబంధిత కోర్సులను పూర్తిచేసిన వారికి అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. హెచ్ఆర్ స్పెషలైజేషన్‌ను ఆఫర్ చేస్తున్న కొన్ని ఇన్స్టిట్యూట్లు: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్:www.uohyd.ernet.ac.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్- హైదరాబాద్ వెబ్సైట్: www.ipeindia.org ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్ వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం వెబ్సైట్: www.andhraunivercity.edu.in కాకతీయ యూనివర్సిటీ- వరంగల్ వెబ్సైట్: www.kakatiya.ac.in -
గోపీచంద్, అనుమోలుకు పద్మభూషణ్
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం గణతంత్ర అతిథి షింజో భారత 65వ గణతంత్ర దినోత్సవాలకు జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జపాన్‌కు చెందిన ఓ ప్రధాని భారత గణతంత్ర ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం ఇదే ప్రథమం. క్షమాభిక్ష జాప్యమైతే మరణశిక్షను తగ్గించొచ్చు: సుప్రీం మరణశిక్ష పడిన నేరస్తుడికి క్షమాభిక్ష ప్రసాదించడంలో కారణాల్లేని జాప్యాన్ని ప్రదర్శిస్తే వారి శిక్షను జీవితఖైదుగా తగ్గించేందుకు ప్రాతిపదికగా తీసుకోవచ్చని సుప్రీంకోర్టు జనవరి 21న పేర్కొంది. మరణశిక్ష పడిన 15 మంది ఖైదీల పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సదాశివం నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న నేరస్తుల మరణశిక్షను కూడా వారి పరిస్థితి ఆధారంగా జీవిత ఖైదుకు తగ్గించవచ్చని కోర్టు పేర్కొంది. మరణశిక్ష అమలు, క్షమాభిక్ష పిటిషన్ల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వాధికారులకు మార్గదర్శకాలను కూడా సుప్రీంకోర్టు జారీ చేసింది. జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ ప్రారంభం జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్- ఎన్యూహెచ్ఎం) పథకాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ బెంగళూర్‌లో జనవరి 20న ప్రారంభించారు. పట్టణ పేద ప్రజలకు సమర్థంగా ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2015 మార్చి నాటికి 50 వేలకు పైగా జనాభా ఉండే 779 పట్టణాలకు పథకాన్ని వర్తింపజేస్తారు. ఈ పథకం ద్వారా మొత్తం 220 మిలియన్ల మందికి ఆరోగ్య సేవలు అందుతాయి. 2005 ముందునాటి నోట్లు ఉపసంహరణ 2005 సంవత్సరానికి ముందు ముద్రించిన అన్ని కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు భారత రిజర్వ్‌బ్యాంక్ (ఆర్బీఐ) జనవరి 22న ప్రకటించింది. రూ. 500, రూ. 1000 నోట్లతోపాటు అన్ని పాతనోట్లను ఏప్రిల్ 1 నుంచి ఉపసంహరిస్తారు. ప్రజలు పాతనోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చు. 2005 నుంచి నోట్ల వెనుకవైపు మధ్యలో, కింది భాగంలో సంవత్సరాన్ని ముద్రిస్తున్నారు. దీని ఆధారంగా 2005కు ముందున్న నోట్లను సులువుగా గుర్తించవచ్చు. నల్లధనం, నకిలీనోట్లను అరికట్టే చర్యల్లో భాగంగా ఈ పాతనోట్లను తొలగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఖనిజ వనరులను గుర్తించే గరుడ వసుధ భూగర్భ ఖనిజ వనరులను గుర్తించే హెలికాప్టర్ గరుడ వసుధను బెంగళూరులో జనవరి 22న కేంద్ర గనుల శాఖమంత్రి దిన్హా పటేల్ జాతికి అంకితం చేశారు. ఇది అత్యాధునిక సెన్సార్లతో పనిచేస్తుంది. ఈ హెలికాప్టర్‌ను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వినియోగిస్తుంది. ధృవ్ తరహాకు చెందిన ఈ హెలికాప్టర్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) రూపొందించింది. ఢిల్లీలో నవకల్పన కేంద్రం జాతీయ నవకల్పన మండలి (నేషనల్ ఇన్నోవేటివ్ కౌన్సిల్- ఎన్ఐసీ)ని జనవరి 23న ఎన్ఐసీ అధ్యక్షుడు, ప్రధానమంత్రి సలహాదారుడు శ్యామ్ పిట్రోడా ప్రారంభించారు. దేశంలో ఇది మూడో ఎన్ఐసీ కేంద్రం. ఇప్పటికే బెంగళూరు, కోల్‌కతాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. అండమాన్‌లో పడవ మునక అండమాన్ తీరం వద్ద పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ 2014, జనవరి 26న ప్రమాదవశాత్తు బంగాళాఖాతంలో మునిగిపోయింది. రోస్ దీవి నుంచి ఉత్తర అఖాతంవైపు ప్రయాణిస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనలో 21 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. ఆక్వా మెరైన్ అనే ఈ పడవలో 25 మంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుండగా, మితిమీరిన సంఖ్యలో ప్రయాణికులను ఓవర్‌లోడ్ చేసిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. అంతర్జాతీయం సీఏఆర్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ‘సాంబా’ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సీఏఆర్) తాత్కాలిక అధ్యక్షురాలిగా కేథరిన్ సాంబా పాంజా జనవరి 20 న ఎన్నికయ్యారు. ఆమె 2011లో ఆ దేశ రాజధాని నగరం బాంగ్యుకు మేయర్‌గా వ్యవహరించారు. మరుగుజ్జు ఆస్టరాయిడ్ సిరీస్‌పై నీటిఆవిరి ఆస్టరాయిడ్ బెల్ట్‌లోని సిరీస్ అనే మరుగుజ్జు గ్రహం నుంచి నీటి ఆవిరి విడుదవులతోన్నట్లు ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) శాస్త్రవేత్తలు జనవరి 23న ప్రకటించారు. సిరీస్ సూర్యుడికి దగ్గరవుతున్నప్పుడు వేడెక్కి నీటి ఆవిరి విడుదలకావడాన్ని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు హెర్షెల్ స్పేస్ టెలి స్కోప్ సహాయంతో కనుగొన్నారు. అంగారక, గురు గ్రహాల మధ్య గ్రహశకలాలు తిరిగే ఆస్టరాయిడ్ బెల్ట్‌లో అతిపెద్ద వస్తువు సిరీస్. దీని పరిమాణం 950 కి.మీ. ఆస్టరాయిడ్కు ఎక్కువ, గ్రహానికి తక్కువ కావడంతో దీన్ని మరుగుజ్జు గ్రహంగా వ్యవహరిస్తున్నారు. ఆస్టరాయిడ్ బెల్టులో వస్తువుపై నీటిని కనుగొనడం ఇదే తొలిసారి. ఈ ఏడాది భారత వృద్ధి 5.3 శాతం: ఐరాస భారత్ వృద్ధి 2014లో 5.35 శాతంగా నమోదుకాగలదని ఐక్యరాజ్యసమితి-2014 ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు పేరుతో వెల్లడైన నివేదిక పేర్కొంది. 2015లో ఈ వృద్ధిరేటు 5.7 శాతానికి చేరుకోవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది. దావోస్‌లో 44వ ప్రపంచ ఆర్థిక ఫోరమ్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనమిక్ ఫోరం- డబ్ల్యూఈఎఫ్) 44వ ప్రపంచ ఆర్థిక సదస్సు జనవరి 21 నుంచి 25 వరకు ఐదురోజుల పాటు జరిగింది. మారుతున్న ప్రపంచం, సమాజం, రాజకీయాలు, వ్యాపా రం ప్రధాన అంశంగా ఈ సదస్సు సాగింది. ఇందులో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) డెరైక్టర్ జనరల్ రొబర్టో అజవెడో హాజరయ్యారు. మన దేశం నుంచి ఆర్థికమంత్రి చిదంబరం, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరణ(ట్యాపరింగ్) ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. అవార్డులు పద్మ అవార్డులు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను జనవరి 25న ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలు చేసిన 127 మందికి ఈ అవార్డులను అందించనున్నారు. ఈ పురస్కారాల్లో రెండు పద్మవిభూషణ్, 24 పద్మ భూషణ్, 101 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. భారతరత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌కు ఎంపికైన వారు.. డాక్టర్ రఘునాథ్ ఎ.మషేల్కర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్-మహారాష్ట్ర), బి.కె.ఎస్. అయ్యంగార్ (యోగా-మహారాష్ట్ర). ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికీ పద్మభూషణ్, ఏడుగురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. వివరాలు: పద్మభూషణ్- దివంగత అనుమోలు రామకృష్ణ (సైన్స్, ఇంజనీరింగ్), పుల్లెల గోపీచంద్ (క్రీడలు- బ్యాడ్మింటన్). పద్మశ్రీ- మొహ్మద్ అలీ బేగ్ (ఆర్ట్-థియేటర్), డాక్టర్ రామారావు అనుమోలు (సోషల్ వర్క్) డాక్టర్ మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్ (సైన్స్, ఇంజనీరింగ్), డాక్టర్ గోవిందన్ సుందరరాజన్ (సైన్స్, ఇంజనీరింగ్) , రవికుమార్ నర్ర (ట్రేడ్ ఇండస్ట్రీ), డాక్టర్ సరబేశ్వర్ సహార్య (వైద్యం, సర్జరీ), ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ (సాహిత్యం, విద్య). పద్మభూషణ్ అవార్డు లభించిన ఇతర ప్రముఖుల్లో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్, దివంగత న్యాయమూర్తి జె.ఎస్.వర్మ, ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయని బేగం పర్వీన్ సుల్తానా, సాహితీవేత్త రస్కిన్ బాండ్, తమిళ రచయిత వైరముత్తు తదితరులున్నారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్, సీనియర్ నటుడు పరేశ్‌రావల్, క్రికెటర్ యువరాజ్ సింగ్, సినీ రంగానికి చెందిన సంతోష్ శివన్, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ .. తదితరులను పద్మశ్రీ వరించింది. ప్రవాసాంధ్రుడు డాక్టర్ వంశీ మూట (మెడిసిన్- బయోమెడికల్ రీసెర్చ్)కు ఎన్ఆర్ఐ విభాగంలో పద్మశ్రీ లభించింది. 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (2013) విజేతల వివరాలు: ఉత్తమ నటుడు: ఫర్హాన్ అక్తర్ (భాగ్ మిల్కా భాగ్); ఉత్తమ నటి: దీపికా పదుకొణే (గలియోంకా రాస్లీలా రామ్‌లీలా); ఉత్తమ దర్శకుడు: రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా (భాగ్ మిల్కా భాగ్); జీవితసాఫల్య అవార్డు: తనూజ; ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ (తుమ్హీ హో-ఆషిఖీ-2); ఉత్తమ గాయని: మోనాలీ ఠాకూర్ (సావర్‌లూన్- లుటేరా); ఉత్తమ గీతం: ప్రశూన్ జోషి (జిందా- భాగ్ మిల్కా భాగ్) ఇన్స్పెక్టర్ ప్రసాద్‌బాబుకు అశోకచక్ర ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రేహౌండ్స్ ఇన్స్పెక్టర్ కె.ప్రసాద్‌బాబుకు 65వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరణానంతరం అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అశోకచక్రతో భారత ప్రభుత్వం గౌరవించింది. ఈ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసాద్‌బాబు తండ్రి కె.వెంకటరమణకు అందించారు. 2013 ఏప్రిల్ 16న ఆంధ్ర-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు లో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రసాద్‌బాబుతో పాటు 9 మంది మావోయిస్టులు మరణించారు. బయోకాన్ ఎండీ కిరణ్ షాకు ఆథ్‌మర్ గోల్డ్ మెడల్ బయోకాన్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ కిరణ్ మజుందార్‌షా 2014 ఆథ్‌మర్ గోల్డ్‌మెడల్ పురస్కారానికి ఎంపిక య్యారు. అమెరికాకు చెందిన కెమికల్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ అత్యున్నత అవార్డును అందజేస్తుంది. సి.ఎస్.ఎస్.ఎస్‌కు జాతీయ మత సామరస్య అవార్డు ముంబైలోని ‘ సెంటర్ ఫర్‌స్టడీ ఆఫ్ సొసైటీఅండ్ సెక్యులరిజమ్’ (సి.ఎస్.ఎస్.ఎస్) సంస్థల కేటగిరీలో 2013 సంవత్సరానికి జాతీయ మత సామరస్యఅవార్డుకు ఎంపికైంది. వ్యక్తులకేటగిరీలో ఢిల్లీకి చెందిన మొహిందర్ సింగ్, కేరళకు చెందిన ఎన్.రాధాకృష్ణన్ ఎంపికయ్యారు. డాక్టర్ మొహిందర్‌సింగ్ మైనారిటీ విద్యాసంస్థల జాతీయకమిషన్ సభ్యులు. డాక్టర్ రాధాకృష్ణన్ ప్రముఖ విద్యావేత్త, గాంధేయవాది. కేంద్ర హోమ్‌మంత్రిత్వశాఖకు చెందిన మతసామరస్య జాతీయ ఫౌండేషన్ 1996లో జాతీయ మతసామరస్య అవార్డులనుఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రంతోపాటు వ్యక్తులకైతే రూ. 5లక్షలు, సంస్థలకైతే రూ. 10 లక్షలు బహుకరిస్తారు. సి.ఎస్.ఎస్.ఎస్.ను ముంబేలో 1996లో ఏర్పాటు చేశారు. క్రీడలు 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్:స్టానిస్లాస్ వావ్రింకా(స్విట్జర్లాండ్) రన్న రప్: రఫెల్ నాదల్, ఇది వావ్రింకాకు తొలి గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్: నాలీ (చైనా), రన్నరప్: డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా), నాలికి ఇది రెండో గ్రాండ్‌స్లామ్ పురుషుల డబుల్స్: లుకాష్కుబోట్ (పోలెండ్), రొబర్డ్ లిండ్ స్టెడ్ (స్వీడన్) మహిళల డబుల్స్: సారా ఎర్రాని,రాబెర్టా విన్నీ (ఇటలీ) మిక్స్డ్ డబుల్స్: క్రిస్టినా మ్లడోవిక్, డానియల్ నెస్టర్ రన్నరప్: సానియామీర్జా,హోరియా టెకావ్ సైనాకు ఇండియా గ్రాండ్ ప్రి గోల్డ్టోర్నీ లక్నోలో జరిగిన సయ్యద్మోడీ ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను భారత నంబర్ వన్ షట్లర్ సైనానె హ్వాల్ గెలుచుకుంది. 2014, జనవరి 26న తలపడిన తుది పోరులో సహచర హైదరాబాద్ క్రీడాకారిణి పీవీ సింధుపై ఆమె గెలిచి ైటె టిల్ సొంతం చేసుకుంది. కాగా పురుషుల విభాగంలో చైనా ఆటగాడు జు సంగ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కి డాంబి శ్రీకాంత్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్నారు. వార్తల్లో వ్యక్తులు అక్కినేని అస్తమయం ప్రముఖ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు (91) హైదరాబాద్‌లో జనవరి 22న మరణించారు. దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు సాగిన ఆయన సినీరంగ జీవితంలో 256 చిత్రాల్లో నటించారు. అక్కినేని 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. కళారంగంలో చేసిన కృషికిగాను 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్‌లతో కేంద్ర ప్రభుత్వం అక్కినేనిని సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1989లో రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది. 1991లో దాదాసాహెబ్ఫాల్కే పురస్కారం ఆయనకు దక్కింది. 1996లో ఎన్టీరామారావు పేరిట ఏర్పాటు చేసిన అవార్డు మొదట నాగేశ్వరరావుకే ప్రదానం చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్, తమిళనాడు ప్రభుత్వం నుంచి అన్నా, కలైమామిణి పురస్కారాలు అందుకున్నారు. తన పేరుమీద 2005లో జాతీయ స్థాయి అవార్డును ఏర్పాటు చేశారు. -
లోక్‌పాల్.. అవినీతికి చెక్ పెడుతుందా?
దేశంలో అత్యున్నత స్థాయిలో అవినీతికి చెక్ పెడుతుందని భావిస్తున్న లోక్‌పాల్ చట్టం.. అనేక మార్పులు చే ర్పులు, సవరణల తర్వాత పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందింది. అన్ని రకాల అవినీతిని ముఖ్యంగా ఉన్నత స్థాయిలోని అవినీతిని అరికట్టేందుకు చేసిన ప్రజా పోరాటంలో దీన్ని ఒక కీలక ఘట్టంగా చెప్పొచ్చు. పెరుగుతున్న అవినీతిని అరికట్టడానికి లోక్‌పాల్ వ్యవస్థ పటిష్టంగా పని చేయగలదా? మిగతా చట్టాల మాదిరిగానే లోక్‌పాల్ కూడా కాగితాలకే పరిమితం అవుతుందా? దీని నిర్మాణం-పరిధి, ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై విశ్లేషణ.. ప్రభుత్వ పాలనలోని అవినీతిని అరికట్టేందుకు స్కాండేనేవియన్ (ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే) దేశాలు ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల అంబుడ్స్‌మన్ ( Ombudsman ) నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. భారతదేశంలో 1966లో మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ లోక్‌పాల్ వంటి వ్యవస్థ అవశ్యకతను సూచించింది. అప్పటి నుంచి అనేక కమిటీలు ఇటువంటి ప్రతిపాదనలనే చేశాయి. అయితే లోక్‌పాల్ వ్యవస్థ పటిష్టంగా పని చేస్తుందా? లేదా? అనే సంశయంతో ఇప్పటికీ ఎన్నో చట్టాలు తెచ్చారు. లోక్‌పాల్ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించడానికి మొట్టమొదట సారిగా 1968లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి తొమ్మిది సార్లు ఈ బిల్లు పార్లమెంట్ తలుపు తడుతూ వచ్చింది. బలమైన లోక్‌పాల్ వ్యవస్థ కోసం సామాజిక ఉద్యమ నేతలు, ప్రజానీకం ఉధృతంగా ఉద్యమించటంతో ఒత్తిడికి తలొగ్గి కేంద్రప్రభుత్వం 2011లో పదో సారి ప్రవేశపెట్టిన బిల్లు చట్టంగా రూపుదాల్చుకుంది. ఇందుకు సంబంధించి లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటు బిల్లు-2011కు పార్లమెంట్ గతేడాది డిసెంబర్ 18న ఆమోదం తెలిపింది. నిర్మాణం: పార్లమెంట్ ఆమెదించిన బిల్లు ప్రకారం లోక్‌పాల్.. కేంద్ర స్థాయిలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ. లోక్‌పాల్‌లో చైర్‌పర్సన్‌తోపాటు గరిష్టంగా ఎనిమిదిమంది సభ్యులు ఉంటారు. వీరిలో సగం మంది సభ్యులు న్యాయ వ్యవ స్థ నేపథ్యం కలిగిన వారై ఉంటారు. మొత్తం సభ్యులలో సగం మంది సభ్యులను షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనారిటీ వర్గాల నుంచి నియమిస్తారు. లోక్‌పాల్‌కు సొంత దర్యాప్తు విభాగంతోపాటు విచారణ (ప్రాసిక్యూషన్) వ్యవస్థ ఉంటుంది. లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల నియామకం కోసం చట్టంలో స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించారు. వీరి నియామకానికి ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి లేదా ఆయన సూచించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి సభ్యులుగా వ్యవహరిస్తారు. మొదటి నలుగురు సభ్యులు చేసిన సూచనలాధారంగా రాష్ట్రపతి ప్రతిపాదించిన ప్రముఖ న్యాయవేత్త కూడా ఎంపిక కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తాడు. ఇలా మొత్తం ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తనకు సాయంగా ఏడుగురు నిపుణులతో ఒక సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసుకుంటుంది. లోక్‌పాల్ నిర్వహణకు అయ్యే వ్యయాన్ని కేంద్రప్రభుత్వమే సమకూరుస్తుంది. పరిధి: దేశ ప్రధానమంత్రి (కొన్ని పరిమితులు మినహా) కూడా లోక్‌పాల్ పరిధిలో ఉంటారు. అయితే ప్రధానిపై దర్యాప్తు చేపట్టేందుకు లోక్‌పాల్ ఫుల్ బెంచ్ (సభ్యులందరూ) కానీ, మూడింట రెండో వంతు మంది కానీ ఆమోదం తెలపాలి. ప్రధానిపై విచారణను రహస్యంగా (ఇన్ కెమెరా) నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ మంత్రులు, ప్రస్తుత, మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా పార్లమెంట్ పరిధిలోకి వస్తారు. అయితే పార్లమెంట్లో చెప్పిన అంశాలపై కానీ, అక్కడ జరిగిన ఓటింగ్ అంశాలపై కానీ లోక్‌పాల్ ప్రమేయం ఉండదు. అవినీతి నిరోధక చట్టం-1988 కింద భాష్యం చెప్పిన గ్రూప్-ఏ,బీ,సీ, డీ తరగతుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ నిధులతో నడుస్తున్న, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థల ఉద్యోగులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ నిధులు అందించే సొసైటీలు, ట్రస్టులు, సంఘాలు, విదేశాల నుంచి ఏటా రూ. 10 లక్షలకు మించి నిధులు అందుకునే అన్ని సంస్థలూ లోక్‌పాల్ పరిధిలో ఉంటాయి. ప్రార్ధనాస్థలాల నిర్మాణాలకు, మతపరమైన కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి రావు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి. సీబీఐతోపాటు అన్ని రకాల విచారణ సంస్థలపై పర్యవేక్షణాధికారం కూడా లోక్‌పాల్‌కు ఉంటుంది. విచారణ జరుగుతున్న సమయాల్లో కూడా అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోమని ఆదేశించే అధికారం కూడా లోక్‌పాల్‌కు ఉంటుంది. రాష్ట్రాలలో: లోక్‌పాల్, లోకాయుక్త చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి 365 రోజుల్లోగా (ఏడాదిలోగా) ఆయా రాష్ట్రాలు తమ శాసనసభల్లో చట్ట చేయడం ద్వారా లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లోకాయుక్త స్వరూప, స్వభావాలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయా రాష్ట్రాలకు ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో అవినీతిని లోకాయుక్త దర్యాప్తు చేస్తుంది. మహారాష్ట్రలో మొదటి సారిగా 1977లో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 1983లో లోకాయుక్త వ్యవస్థ చట్టబద్ధంగా ఏర్పాటైంది. మంత్రదండం కాదు: అవినీతిని అరికట్టాడానికి లోక్‌పాల్ వ్యవస్థ ఒక్కటే ప్రత్యామ్నాయం కాదు. ఎందుకంటే అవినీతిని నిరోధించేందుకు గ డచిన ఐదు దశాబ్దాల్లో డజను చట్టాలు, అంతే సంఖ్యలో సంస్థలను కూడా ఏర్పాటు చేశారు. చట్టాలు, సంస్థలు కేవలం మార్గ నిర్దేశకంగా మాత్రమే ఉంటాయనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. వాటిని పటిష్టంగా, చిత్తశుద్ధితో అమలు చేసినపుడే ఆశించిన ఫలితం ఉంటుంది. ఈ విషయంలో ప్రజల్లో కూడా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. జనలోక్‌పాల్ - లోక్‌పాల్: ఒక ఆదర్శవంతమైన లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పౌర సమాజంలోని కొందరు ప్రముఖులు ముఖ్యంగా అన్నాహాజారే, అరవింద్ కేజ్రీవాల్, సంతోష్ హెగ్డే, శాంతి భూషణ్ మొదలైన వారు ఒక బిల్లును రూపొందించారు. దీన్నే జనలోక్‌పాల్ బిల్లు అంటారు. వీరు సూచించిన చాలా అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ప్రస్తుత లోక్‌పాల్ బిల్లును రూపొందించింది. అర్హతలు-పదవీకాలం లోక్‌పాల్ చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా గొప్ప న్యాయ కోవిధుడై ఉండాలి. కమిటీలోని న్యాయ సంబంధిత సభ్యులు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేదా హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా పని చేసి ఉండాలి. వీరు పార్లమెంట్/ శాసనసభ.. సభ్యులుగా ఉండరాదు. వీరి పదవీకాలం ఐదు సంవత్సరాలు లేదా పదవీ విరమణ వయసు 75 ఏళ్లు. ఇందులో ఏదీ ముందు అయితే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పదవీ విరమణ తర్వాత వీరు ఎటువంటి ప్రభుత్వ పదవులను చేపట్టడానికి అర్హులు కారు. సభ్యులను మాత్రం లోక్‌పాల్ చైర్మన్‌గా నియమించవచ్చు. ఎవరైనా లోక్‌పాల్ సభ్యుడు/సభ్యురాలిపై కనీసం 100 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు చేసి పిటిషన్ సమర్పించినట్లయితే.. రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు సదరు సభ్యుడు/సభ్యురాలిపై విచారణ చేపట్టవచ్చు. లోక్‌పాల్ సభ్యుడిని/సభ్యురాలిని సుప్రీంకోర్టు సిఫారసు లేదా మధ్యంతర ఉత్తర్వు మేరకు రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు. ఎవరైనా లోక్‌పాల్ సభ్యుడు/సభ్యురాలిపై సుప్రీంకోర్టు విచారణ అనంతరం.. సదరు సభ్యుడు/సభ్యురాలిని రాష్ట్రపతి తొలగించవచ్చు. పెనుసవాలు అవినీతిని నిర్మూలించడం ప్రస్తుత పరిస్థితుల్లో పెనుసవాలుగా మారింది. దేశప్రగతిని ఆర్థిక వ్యవస్థను, రాజకీయ, సామాజిక ఇలా అన్నీ రంగాల అస్థిరతకు అవాంఛనీయ పరిస్థితులకు మొదటి కారణం అవినీతి. దీన్ని ప్రస్తుత పరిస్థితుల్లో అరికట్టాలంటే సమగ్ర చర్యలు అవసరం. ఈ దిశలో తీసుకోవాల్సిన చర్యలు: అవినీతికి పాల్పడుతున్న వారిని గుర్తించి తెలియజేసేవారు ఉండాలి. వీరిని ‘విజిల్ బ్లోయర్స్’ అంటారు. ఈ మధ్య కాలంలో వీరిపై భౌతిక దాడులు అధికమయ్యాయి. అలాంటి వారికి ప్రభుత్వ రక్షణతోపాటు సమాజం అండ కూడా ఉండాలి. పరిపాలనా నిర్ణయాల్లో మరింత పారదర్శకత పెరగాలి. సీబీఐతోపాటు ఇతర విచారణ సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలి. పౌరుల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు సిటిజన్స చార్టర్ వంటి వ్యవస్థలకు చట్టబద్ధత కల్పించాలి. అవినీతి వ్యతిరేక పోరాటంలో పౌరులకు మరింత ప్రోత్సాహాన్ని కల్పించేందుకు అవినీతి సొమ్ములో వారికి 50 శాతం నగదును రివార్డుగా అందించాలి. ఎన్నికల్లో ధనప్రభావాన్ని అరికట్టేందుకు సమగ్ర ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలి. అధికార కేంద్రీకరణ కూడా అవినీతిని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రజాతంత్ర వికేంద్రీకరణ ద్వారా అవినీతి నిర్మూలనకు బాటలు వేయవచ్చు. సరళమైన, పారదర్శకమైన స్పందించే స్వభావం కలిగిన జవాబుదారీతనంతో కూడిన పాలనా వ్యవస్థను నిర్మించాలి. ఈ దిశలో ఈ-గవర్నెన్స వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. ఆర్థిక సరళీకరణల అనంతరం భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారులకు విచక్షణాధికారాలను కట్టబెట్టుతున్నారు. ఇది అవినీతికి అవకాశం కల్పిస్తుంది. ఈ తరుణంలో సంబంధిత ప్రభుత్వాధికారుల విచక్షణాధికారాలను సమీక్షించాలి. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అవినీతి నిర్మూలనకు చేసిన చట్టాలు పబ్లిక్ సర్వెంట్స్ (ఎన్క్వైరీస్) యాక్ట్, 1850 ఇండియన్ కోడ్, 1860 స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1941 ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1946 కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1964 స్టేట్ విజిలెన్స్ కమిషన్, 1964 రైల్వే సర్వీసెస్ రూల్స్, 1966 ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1968 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 1988 బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
విపత్తు నిర్వహణ - విజయ సూత్రాలు
ఓ విపత్తు.. పచ్చని పల్లెను ఆబగా కబళిస్తుంది! నింగికేసే నిచ్చెనలా ఠీవిగా నిలబడిన నిలువెత్తు భవనాన్ని నేలకూలుస్తుంది! భూకంపం రూపంలో బతుకులను బుగ్గి చేసేవి కొన్నయితే.. వరదల రూపంలో విరుచుకుపడి, ప్రళయం సృష్టించేవి మరికొన్ని.. ఈ నేపథ్యంలో ప్రజల బాగోగులతో ముడిపడిన విపత్తుల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శికి అవగాహన అవసరం. అందుకే ఈ ఉద్యోగాల నియామకాలకు జరిగే పరీక్ష సిలబస్‌లో విపత్తుల నిర్వహణ (Disaster Managemen్ట)ను చేర్చారు. ఇందులో అధిక మార్కుల సాధనకు వ్యూహాలు.. ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. మొత్తం 2,677 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. 150 మార్కులకుండే పేపర్-1 జనరల్ స్టడీస్ సిలబస్‌లో ఏడు అంశాలను పేర్కొన్నారు. దీంట్లో ఏడో అంశంగా విపత్తుల నిర్వహణ ఉంది. ఈ విభాగం నుంచి 15-20 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 తదితర పరీక్షల జనరల్ స్టడీస్ పేపర్లలో విపత్తుల నిర్వహణపై ప్రశ్నలు వస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శి పరీక్షలో వచ్చే ప్రశ్నలు కూడా ఇదే తరహాలో ఉంటాయని భావించవచ్చు. ఏ విభాగాల నుంచి వస్తాయి? విపత్తులు ఎలా సంభవిస్తాయి? విపత్తులు- రకాలు. విపత్తులు సంభవించినప్పుడు స్పందించాల్సిన విధానం. విపత్తులు- నివారణ. నివారణ సాధ్యం కానప్పుడు వాటి ప్రభావాన్ని ఎలా తగ్గించాలి? పునర్నిర్మాణ, పునరావాస కార్యక్రమాలు. ఆస్తి, ప్రాణ నష్టం నివారణ తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. పాత ప్రశ్నపత్రాలు కీలకం: వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే చాలా ప్రశ్నలు వచ్చినవే వస్తున్నాయి. అందువల్ల అభ్యర్థులు తప్పనిసరిగా పాత ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ప్రశ్నల క్లిష్టత, ప్రశ్నలు అడిగే విధానం అవగతమవుతుంది. ఉ్ఠ: 1.సునామి అనే మాట ఏ భాష నుంచి వచ్చింది? జవాబు: జపనీస్ 2:జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది? జవాబు: న్యూఢిల్లీ 3:జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ చైర్మన్ ఎవరు? జవాబు: ప్రధానమంత్రి సహజసిద్ధ విపత్తులు: సహజసిద్ధమైన విపత్తులలో వరదలు, హరికేన్లు, తుపానులు, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం, కరువు, సునామీ తదితరాల గురించి తెలుసుకోవాలి. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి క్షుణ్నంగా చదవాలి. దాదాపు అన్ని ప్రశ్నలు వీటి కేంద్రంగానే వస్తున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ), దాని చైర్మన్, బాధ్యతలు, విధుల గురించి ప్రశ్నలు వస్తాయి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా విపత్తు నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేశారు. ఈ యంత్రాంగాల నిర్మాణం, బాధ్యతలు తదితరాల గురించి తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో సంభవించిన విపత్తులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. 2004, డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ, దాని ప్రభావం వల్ల నష్టపోయిన దేశాలు (ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా, థాయిలాండ్, మాల్దీవులు మొదలైనవి..), ప్రాణ నష్టం (2,30,000) వంటి విషయాలను చదవాలి. 2013లో సంభవించిన ఫైలిన్, హెలెన్, లెహర్ వంటి తుపానులు, ఉత్తరాఖండ్ వరదలపై దృష్టిసారించాలి. వివిధ విపత్తుల గురించి చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేయాలి. విపత్తులు- ఉపశమన చర్యలు: విపత్తు నిర్వహణ అనేది వివిధ కార్యక్రమాల సమాహారం. విపత్తుకు ముందు, విపత్తు సమయంలో, విపత్తు అనంతరం చేపట్టే కార్యక్రమాలను కలిపి సంయుక్తంగా విపత్తు నిర్వహణ అనొచ్చు. విపత్తు తీవ్రతను తగ్గించేందుకు చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. ఈ చర్యల్లో ప్రజలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలకూ భాగస్వామ్యం ఉంటుంది. వీటికి సంబంధించి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఒక విపత్తు కచ్చితంగా ఏ తేదీన సంభవించింది? ఎంతమంది మరణించారు? వంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. విద్యార్థులు వివిధ విపత్తులను గురించి అధ్యయనం చేసేటప్పుడు ఈ దిశగా కూడా ప్రిపరేషన్ కొనసాగించాలి. దేశంలో రకరకాల విపత్తులకు ప్రత్యేకంగా నోడల్ మంత్రిత్వశాఖలు ఉన్నాయి. ఈ విభాగం నుంచి ఒకట్రెండు ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ఈ విభాగాన్ని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు జీవ విపత్తులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తోంది. పెద్ద ఎత్తున సంభవించే ప్రకృతి సిద్ధ విపత్తులు: భూకంపాలు, సునామీలు, వరదలు, తుపానులు, కరువులు. ........................................................ భారీ ఎత్తున సంభవించే మానవపూరిత విపత్తులు: యుద్ధాలు, రసాయన విస్ఫోటనాలు, కాలుష్యం, అణు ప్రమాదం, అడవుల నిర్మూలన (Deforestation). ........................................................ స్వల్ప ప్రకృతి సిద్ధ విపత్తులు: చలిగాలులు (Cold wave) ఉరుములతో కూడిన తుపానులు, వడగాలులు (Heat wave). ........................................................ స్వల్ప మానవ పూరిత విపత్తులు: రోడ్డు, రైలు ప్రమాదాలు, కొట్లాటలు, విషపూరిత ఆహారం (Food poisoning), పారిశ్రామిక విస్ఫోటనం, అగ్నిప్రమాదాలు. రిఫరెన్స బుక్స్ సీబీఎస్ఈ 8, 9 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని విపత్త నిర్వహణ అంశాలు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) అధికారిక వెబ్సైట్:www.ndma.gov.in కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్: www.mha.nic.in నమూనా ప్రశ్నలు 1.ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు? ఎ) ప్రపంచ బ్యాంకు బి) అంతర్జాతీయ రెడ్‌క్రాస్, రెడ్ క్రిసెంట్ సి) ఐఎంఎఫ్ డి) యునెటైడ్ నేషన్స్ 2.ఆంధ్రప్రదేశ్‌లో విపత్తు నిర్వహణ కేంద్రమేది? ఎ)ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బి)ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ సి)నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డి)మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ 3.భూకంపాలకు సంబంధించిన పరిశోధనలు, వనరులు, నెట్వర్క్ ఉన్న సంస్థ ఏది? ఎ)అస్సాం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ, గువహటి బి)యశ్వంత్రావ్ చవాన్ అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్- పుణె సి)అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ సెంటర్, కోల్‌కతా డి)డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్- భోపాల్ 4.ఆసియా విపత్తు తగ్గింపు కేంద్రం ఎక్కడుంది? ఎ) బ్యాంకాక్ బి) మనీలా సి) జకార్తా డి) కోబ్ (జపాన్) 5.భారత వాతావరణ శాఖ ప్రకారం కరువు అంటే? ఎ)సామాన్య వర్షపాతంలో 75 శాతం కంటే తక్కువగా ఉంటే బి)50శాతం కంటే వర్షపాతం తగ్గితే తీవ్రమైన కరువు సి)1 అండ్ 2 డి)ఏదీకాదు 6.విపత్తు నిర్వహణ ప్రక్రియ ఏది? ఎ) నిర్మూలన, రక్షిత చర్యలు బి) సమాయత్తత సి) ఉపశమన చర్యలు డి) పైవన్నీ 7.ఐఎస్‌డీఆర్ అంటే ఏమిటి? ఎ) ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ రీసెర్చ్ బి) ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ సి) ఇండియన్ స్పేస్ డెవలప్మెంట్ రీసెర్చ్ డి) ఇండియన్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ 8.విపత్తు నిర్వహణ ఖర్చుకోసం ఏ నిధి నుంచి గ్రహిస్తారు? ఎ) ప్రణాళికా వ్యయం బి) సంఘటిత నిధి సి) ప్రణాళికేతర ఖర్చులు డి) ఇతర నిధులు 9.ఎపి సెంటర్ అనే పదం దేనికి సంబంధించిది? ఎ) భూకంపాలు బి) తుఫాన్లు సి) వరదలు డి) రసాయన ప్రమాదాలు 10.జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఉపాధ్యక్షుడు? ఎ) చిదంబరం బి) శశిధర్‌రెడ్డి సి) శరద్‌పవార్ డి) ఫరూక్ అబ్దుల్లా 11.కింది వాటిలో జీవ సంబంధ విపత్తు ఏది? ఎ) వడగండ్ల వాన బి) ఖనిజ సంబంధ మంటలు సి) అంటు వ్యాధులు డి) చమురు సంబంధ విపత్తులు 12.పదో పంచవర్ష ప్రణాళిక ప్రకారం ఏ విపత్తుల వల్ల అధిక మరణాలు సంభవించాయి? ఎ) వరదలు, వేగవంతమైన గాలులు బి) భూకంపాలు సి) కరువులు డి) భూపాతాలు సమాధానాలు: 1) బి 2) ఎ 3) ఎ 4) డి 5) సి 6) డి 7) బి 8) బి 9) ఎ 10) బి 11) సి 12) ఎ -
ఇంజనీరింగ్.. కొలువులకు కొదవలేదు
ఎన్.ఎల్.ఎన్.రెడ్డి, హెడ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్, సీబీఐటీ. మన దేశంలో ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటికి వస్తున్నారు.. అభివృద్ధి చెందుతోన్న మనలాంటి దేశంలో ఈ పరిణామం స్వాగతించదగిందే.. ఇంతటి భారీ స్థాయి మానవ వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా మన పరిశ్రమలు పయనిస్తున్నాయా.. భవిష్యత్‌లో బ్రాంచ్‌ల వారీగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉన్న డిమాండ్.. ఏయే రంగాలు అవకాశాల గమ్యాలుగా మారనున్నాయి.. ప్రాచుర్యంలోకి వస్తున్న బ్రాంచ్‌లు.. తదితర అంశాలపై విశ్లేషణ.. ఐటీ రంగం ఆర్థిక సరళీకృత విధానాలను ప్రవేశపెట్టిన తర్వాత ఐటీ- ఐటీ ఆధారిత పరిశ్రమకు భారత్ పర్యాయ పదంగా నిలిచింది. రెండు దశాబ్దాలలో ఈ రంగంలో 22 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది. ఈ రంగంలో ప్రస్తుతం 108 అమెరికన్ బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఇది 2020 నాటికి 220 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. తద్వారా మరో 80 లక్షల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. టాప్ రిక్రూటర్స్: డీఆర్డీఓ, ఇస్రో, భెల్, డీఎంఆర్ఓ, సీమెన్స్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంటెల్, ఫిలిప్స్, మోటోరోలా, శాంసంగ్, ఫ్లెక్సోట్రోనిక్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, యాక్సెంచర్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అత్యధిక మంది ఎంచుకునే బ్రాంచ్. ఇందులో చక్కని భవిష్యత్‌ను సొంతం చేసుకోవాలంటే అప్లికేషన్లను డిజైన్ చేయడం, విద్యుత్ శక్తి సృష్టి, వినియోగం వంటి అంశాలను ఇంజనీరింగ్‌లోని మిగతా బ్రాంచ్‌లకు కూడా అన్వయించే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవాలి. టాప్ రిక్రూటర్స్: భెల్, డీఎంఆర్సీ, ఎన్‌హెచ్‌పీసీ, పవర్‌గ్రిడ్, రాష్ట్ర విద్యుత్ సంస్థలు, క్రాంప్టన్ గ్రీవ్స్, సీమెన్స్, హిటాచీ, జిందాల్ స్టీల్-పవర్, రిలయన్స్, ఎల్ అండ్ టీ, టాటా, శాంసంగ్. అవస్థాపన రంగం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యతను పొందుతోన్న రంగం.. అవస్థాపన రంగం. ఈ క్రమంలో అవస్థాపన రంగంలో 2020 నాటికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. దాంతో 103 మిలియన్ ఉద్యోగ అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. అంతేకాకుండా దీని అనుబంధ రంగాల ద్వారా 22 మిలియన్ల ఉద్యోగుల అవసరం ఏర్పడనుంది. రసాయన పరిశ్రమ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రసాయన అమ్మకాలు 3.4 ట్రిలియన్ డాలర్లు. ఇందులో భారత్ వాటా108 బిలియన్ డాలర్లు. ఇది 2017 నాటికి 224 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. పెట్రోల్, రసాయన, పెట్రోకెమ్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండళ్లకు రూపకల్పన జరుగుతున్న తరుణంలో వచ్చే పదేళ్లలో భారతదేశానికి 14 వేల మంది కెమికల్ ఇంజనీర్లు అవసరం. దీని అనుబంధ రంగాలను కలుపుకుంటే వచ్చే ఎనిమిదేళ్లలో 1.9 మిలియన్ల ఉద్యోగుల అవసరం ఏర్పడనుంది. బయోటెక్నాలజీ పరిశ్రమ జీవ, సాంకేతికరంగాల సమన్వయమే బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచంలో మన దేశం 12వస్థానంలోనూ, ఆసియా పసిఫిక్ ప్రాంతం పరిధిలో మూడోస్థానంలోనూ ఉంది. ఈ రంగంలో 2012లో జరిగిన వాణిజ్యం 4.3 బిలియన్ డాలర్లు. ఇది 2017లో 11.6 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఫలితంగా అంతేస్థాయిలో మానవ వనరుల అవసరం ఏర్పడనుంది. టాప్ రిక్రూటర్స్: బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్, గెయిల్, పిరమిల్ హెల్త్‌కేర్, ర్యాన్‌బాక్సీ, హెచ్ఎల్ఎల్, నిర్మా. ఆటోమొబైల్-మెకానికల్ దేశంలో ప్రతి ఏటా వృద్ధి కనబరుస్తున్న రంగాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ ఒకటి. నూతన సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త డిజైన్లతో మార్కెట్లోకి శరవేగంగా దూసుకొస్తున్న వాహనాలు.. అంతేస్థాయిలో ఉద్యోగాల కల్పనను లిఫ్ట్ చేస్తున్నాయి. టాప్ రిక్రూటర్స్: మారుతి సుజుకి, అశోక్ లేలాండ్, టాటా, బజాజ్, హీరో గ్రూప్, హ్యుందయ్, క్యాటర్ పిల్లర్, టొయోటా, జీఎం, ఎస్కార్ట్స్, యమహా. మెకానికల్ ఇంజనీరింగ్ పారిశ్రామిక విప్లవంలో మెకానికల్ ఇంజనీర్ల పాత్ర వెలకట్టలేనిది. అన్ని రంగాలకు సంబంధించిన ఇంజన్ల డిజైనింగ్, తయారీ, నిర్వహణ వంటివి ఈ విభాగం కిందకు వస్తాయి. అలాగే రోబోటిక్స్, శీత లీకరణ కూడా ఇందులోని అంశాలే. టాప్ రిక్రూటర్స్: భెల్, బీపీసీఎల్, డీఆర్డీఓ, ఇండియన్ఆయిల్, గెయిల్, ఎన్టీపీసీ, అశోక్‌లేలాండ్ హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, టాటామోటార్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్‌మహీంద్రా, ఎల్అండ్టీ. ఎన్ఎస్డీసీ ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో ఆటోమోటివ్ రంగంలో 35 మిలియన్ల మంది మానవ వనరులు అవసరం. సివిల్ ఇంజనీరింగ్ మానవ నిర్మిత పరిసరాలను సృష్టించడంలోనూ, దాన్ని కాపాడటంలోనూ సివిల్ ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమైనది. దేశంలో అవస్థాపన, మౌలిక రంగాలకు పెద్ద పీట వేస్తున్న తరుణంలో..సంబంధిత విధుల పర్యవేక్షణకు భారీ సంఖ్యలో సివిల్ ఇంజనీర్లు అవసరం. ఎన్ఎస్డీసీ అంచనా ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో నిర్మాణ రంగంలో 33 మిలియన్ల మంది, అవస్థాపనా రంగంలో 103 మిలియన్ల మంది, రియల్ ఎస్టేట్ రంగంలో 4.6 మిలియన్ల మంది మానవ వనరులు కావాలి. టాప్ రిక్రూటర్స్: డీఎంఆర్సీ, ఆర్ఐటీఈఎస్, జేపీ, జయప్రకాశ్ అసోసియేట్స్, రిలయన్స్ ఇన్ఫ్రా, ఎల్అండ్టీ లాంటి ఇన్ ఫ్రాస్ట్రక్చర్. ప్రాచుర్యం పొందుతున్న బ్రాంచ్‌లు ఏరోనాటికల్ /ఏరో స్పేస్ ఇంజనీరింగ్: టాప్ రిక్రూటర్స్: హెచ్ఏఎల్, ఎన్ఏఎల్, పౌరవిమానయాన విభాగం, డీఆర్డీఓ, ఇస్రో, ఎయిర్ ఇండియా, జెట్. వ్యవసాయ ఇంజనీరింగ్: టాప్ రిక్రూటర్స్: అమూల్ డెయిరీ, ఐటీసీ, ఎస్కార్ట్స్, శ్రీరామ్ హోండా, నెస్లే ఇండియా, ప్రోయాగ్రో సీడ్స్, ఫ్రిగోరిఫిక్ అల్లాన. ఆర్కిటెక్చర్: టాప్ రిక్రూటర్స్: డీఎల్ఎఫ్, ఓమెక్స్, పార్శ్వనాథ్ డెవలపర్స్, యూనిటెక్, మార్ఫోజెనెసిస్, హఫీజ్ కాంట్రాక్టర్, జేపీ, సూపర్‌టెక్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్: టాప్ రిక్రూటర్స్: ఇండియన్ ఆయిల్ , ఓఎన్జీసీ, గెయిల్, ఎన్టీపీసీ, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, బీపీసీఎల్, ఆదిత్య బిర్లా గ్రూప్, అబన్ ఆఫ్‌షోర్ లిమిటెడ్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సెరిలైట్ ఇండస్ట్రీస్. మైనింగ్ ఇంజనీరింగ్: టాప్ రిక్రూటర్స్: ఎన్ఎండీసీ, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్, గెయిల్, హెచ్‌పీసీఎల్, కోల్ ఇండియా, ఆర్సెలార్ మిట్టల్, వేదాంత, జిందాల్ స్టీల్, బేకర్ హ్యూగ్స్. టెక్స్టైల్ ఇంజనీరింగ్: టాప్ రిక్రూటర్స్: ఎల్ఎన్జే భిల్వారా గ్రూప్, రిలయన్స్ టెక్స్టైల్స్, అరవింద్ మిల్స్, రేమండ్స్, బాంబే డైయింగ్ లిమిటెడ్, రాజస్థాన్ పెట్రో సింథటిక్స్. అవకాశాలను దక్కించుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, బృందంగా పనిచేసే సామర్థ్యం, ఇంగ్లిష్ భాషపై పట్టు, నాయకత్వ లక్షణాలు, సంబంధిత రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని పరిస్థితులకనుగుణంగా మలుచుకోవడం వంటి నైపుణ్యాలు ఉంటేనే చక్కని కెరీర్‌ను అందుకోవచ్చు. -
అవగాహనతో చదివితేనే ఆశించిన మార్కులు
వైద్య వృత్తిలో చేరి సమాజంలో ప్రత్యేక గౌరవం పొందాలని ఎందరో విద్యార్థులు కలలు కంటారు. వీరు తమ కలలను నెరవేర్చుకునేందుకు ఇంటర్మీడియెట్ బైపీసీ తొలి మెట్టు. ఇందులో అధిక మార్కులు సాధించి వైద్యంతో పాటు విభిన్న రంగాల్లో సుస్థిర భవితను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయొచ్చు. ఈ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ బైపీసీలో ఎక్కువ మార్కుల సాధనకు గెడైన్స్.. బోటనీ ఇంటర్మీడియెట్ బైపీసీ రెండో సంవత్సరం విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ప్రిపరేషన్‌కు సంబంధించి ఫస్టియర్ వార్షిక పరీక్షలు ఎలా రాశారో.. ఏయే తప్పులు చేశారో విశ్లేషించుకోవాలి. ఆ పరీక్షల్లో ఏవైనా పొరపాట్లు చేస్తే, అలాంటివి తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే ద్వితీయ సంవత్సరంలో మంచి మార్కులు సొంతం చేసుకునేందుకు అవకాశముంటుంది. విద్యార్థులు ఇప్పటి వరకు ఒకవైపు అకడమిక్ పరీక్షలకు సిద్ధమవుతూ, మరోవైపు ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు చదువుతూ ఉంటారు. ఇప్పటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలపై పూర్తిగా దృష్టిసారించాలి. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే లక్ష్యంగా కాకుండా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలన్న తపనతో చదివినప్పుడే మంచి ఫలితం ఉంటుంది. మొదటి సంవత్సరంతో పోల్చితే రెండో సంవత్సరం పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి. తెలుగు అకాడమీ బోటనీ పుస్తకాల్లో కొన్ని అంశాలు సవివరంగా, స్పష్టంగా లేవు. ఇలాంటి అంశాలు మొక్కల శరీర ధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీలో ఉన్నాయి. వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. వెయిటేజీ కీలకం: విద్యార్థులు వెయిటేజీని దృష్టిలో ఉంచుకొని పరీక్షలకు సిద్ధంకావాలి. అధిక వెయిటేజీ పాఠ్యాంశాలైన మొక్కల శరీర ధర్మ శాస్త్రం (28 మార్కులు), బయోటెక్నాలజీ (16 మార్కులు), ప్లాంట్స్, మైక్రోబ్స్, హ్యూమన్ వెల్ఫేర్ (12 మార్కులు)కు అధిక సమయం కేటాయించాలి. మొక్కల శరీరధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీ యూనిట్ల పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని ఒకటికి రెండుసార్లు అవగాహన పెంపొందించుకుంటూ చదవాల్సి ఉంటుంది. విద్యార్థులు 60 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలకు రాసే సమాధానాల్లో స్పష్టత అధికంగా ఉండాలి. ఫ్లో చార్టులు అవసరమైన చోట వాటినే చిత్రపటాలుగా భావించాలి. - బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. ......................................................................... జువాలజీ విద్యార్థులు మొత్తం 60 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సెక్షన్-ఏలో 10 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటన్నింటికీ సమాధానాలు రాయాలి. సెక్షన్-బీలో 8 స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సెక్షన్-సీలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. రెండింటికి సమాధానాలు రాయాలి. ప్రశ్నపత్రం దాదాపు ఇంటర్‌బోర్డు మాదిరి ప్రశ్నపత్రం తరహాలోనే ఉంటుంది. పాఠ్యాంశాలు-వెయిటేజీ: యూనిట్ 1: 8 మార్కులు; యూనిట్ 2: 10 మార్కులు; యూనిట్ 3: 8 మార్కులు; యూనిట్ 4: 10 మార్కులు; యూనిట్ 5: 12 మార్కులు; యూనిట్ 6: 12 మార్కులు; యూనిట్ 7: 8 మార్కులు; యూనిట్ 8: 8 మార్కులు. ప్రిపరేషన్ వ్యూహం: 2, 5, 6 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఈ ప్రశ్నల్లో పటాలు కీలకంగా ఉంటాయి. అందువల్ల విద్యార్థులు వీలైనన్ని సార్లు పటాలను సాధన చేయాలి. రంగు పెన్సిళ్లు ఉపయోగించి పటాలను గీస్తే భాగాలను స్పష్టంగా గుర్తించేందుకు అవకాశముంటుంది. ప్రతి యూనిట్‌లోనూ అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు సమాధానాలను స్పష్టంగా నేర్చుకోవాలి. ఎక్కువ మార్కులు సాధించేందుకు ఈ విభాగం చాలా ముఖ్యం. ప్రతి యూనిట్ చివర్లో ఇచ్చిన పారిభాషిక పదకోశాన్ని సాధన చేయాలి. దీనివల్ల వివిధ విషయాలపై విద్యార్థులకు స్పష్టత ఏర్పడుతుంది. పాఠ్యపుస్తకాల్లో నేరుగా సమాధానాలు లేని ప్రశ్నలకు అధ్యాపకులను సంప్రదించి సమాధానాలు రాసుకోవాలి. తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకంలో ప్రతి యూనిట్ చివర్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను సాధన చేయాలి. కళాశాలలో ఏ రోజు విన్న పాఠాన్ని ఆ రోజే ఇంటి దగ్గర సమీక్షించుకోవాలి. తోటి విద్యార్థులతో క్లిష్టమైన పాఠ్యాంశాలపై చర్చించడం వల్ల పరోక్షంగా పునశ్చరణకు వీలవుతుంది. -కె. శ్రీనివాసులు, శ్రీచైతన్య విద్యాసంస్థలు. ......................................................................... ఫిజిక్స్ ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పేపర్‌కు 60 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థులు రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాలి. సెకండియర్ విద్యార్థులు ఫిజిక్స్‌లోని ఎలక్ట్రో స్టాటిక్, వేవ్ మోషన్, ఆప్టిక్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. డా ప్లర్ ఎఫెక్ట్ చాలా ముఖ్యమైనది. విద్యార్థులు స్థిర, అనుదైర్ఘ్య తరంగాల ధర్మాలు, వాటి భేదాలను నేర్చుకోవాలి. మారిన సిలబస్ ప్రకారం ప్రతి చాప్టర్‌లోనూ విశ్లేషణాత్మక ప్రశ్నలు, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు తెలుగు అకాడమీ ఫిజిక్స్ పుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి. ప్రతి చాప్టర్‌కు వెనకున్న ప్రశ్నలన్నింటినీ సాధించాలి. వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మాగ్నటిక్స్ నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ................................................................... కెమిస్ట్రీ సెకండియర్ కెమిస్ట్రీకి 60 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. విద్యార్థులు అన్నింటికీ సమాధానాలు రాయాలి. విద్యార్థులు సెకండియర్ కెమిస్ట్రీ సిలబస్‌లోని సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. కొత్త సిలబస్ ప్రకారం ఆర్గానిక్‌లో చాలా రీజనింగ్ ప్రశ్నలున్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ.. ఈ మూడింటిలో మూడు వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. వీటిలో అధిక ప్రాధాన్యం గల చాప్టర్లు.. ఆల్కహాల్స్, అమైన్స్, సాలిడ్ స్టేట్, కార్బొనిల్ కాంపౌండ్‌స, ఎలక్ట్రో కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్. కెమిస్ట్రీలో ఏదైనా చాప్టర్ చదివేటప్పుడు తెలుగు అకాడమీ బుక్‌లోని ప్రతి ముఖ్యమైన పాయింట్‌ను అండర్లైన్ చేసుకోవాలి. వాటిని రివిజన్ చేయాలి. దీనివల్ల విద్యార్థులు లఘు సమాధాన ప్రశ్నలన్నింటికీ తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారు. -ఎం.ఎన్.రావు, శ్రీచైతన్య విద్యాసంస్థలు. ......................................................................... సక్సెస్ సోపానాలు పబ్లిక్ పరీక్షల కోణంలో అతి ముఖ్యమైన చాప్టర్లను, కాన్సెప్ట్‌లను గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి ప్రధాన కాన్సెప్ట్‌ను చదవడంతోపాటు సంబంధిత కాన్సెప్ట్‌నకు సంబంధించిన లెక్చర్ నోట్స్‌ను, మెటీరియల్‌ను బాగా అధ్యయనం చేయాలి. ప్రతి కాన్సెప్ట్‌ను నిర్వచించడం-విశ్లేషించడం-అనువర్తించడం విధానంలో చదవాలి. ఏ అంశాన్ని చదువుతున్నా సమయ పాలన, కచ్చితత్వం ప్రధానం. వీటిని తప్పకుండా పాటించాలి. ప్రతి సబ్జెక్టుకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి తగినట్లు ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే పూర్తిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ముఖ్యమైన సినాప్సిస్‌ను నోట్ బుక్‌లో రాసుకొని బాగా చదవాలి. అకాడమీ అసలైన ఆయుధం పబ్లిక్ పరీక్షలకు ఇంకా చాలా కొద్ది సమయమే ఉంది కాబట్టి ఈ సమయంలో ఐదారు పుస్తకాలను పోగేసుకొని చదవకుండా అకాడమీ పుస్తకాలు, కాలేజీ మెటీరియల్‌కి పరిమితమై వాటిలోని అంశాలపై పూర్తిగా అవగాహన పెంపొందించుకోవాలి. సిలబస్‌ను పూర్తిగా చదవడం పూర్తయిన తర్వాత మొదటి, రెండో రివిజన్ సమయంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, ఉదాహరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థులు తొలుత తేలికైన టాపిక్స్‌ను చదవడం దిగ్విజయంగా పూర్తిచేస్తే తర్వాత కష్టమైన అంశాలను పూర్తిచేసేందుకు తగిన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. చాప్టర్లను విడిచిపెట్టొద్దు సాధారణంగా కొందరు విద్యార్థులు కష్టంగా ఉన్నాయనే భావనతోనో లేదంటే సరైన టైమ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లో కొన్ని చాప్టర్లను చదవకుండా వదిలేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. ప్రతి చాప్టర్‌కు దానికి ముందున్న చాప్టర్‌తో సంబంధముంటుంది. ప్రస్తుతం ఇంటర్మీ డియెట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఒకవేళ మొదటి సంవత్సరంలో ఏవైనా చాప్టర్లను వదిలేస్తే వాటిని ఒకసారి చదివి, తర్వాత వాటితో సంబంధమున్న ద్వితీయ సంవత్సరం టాపిక్స్‌ను చదవాలి. -
అందుకో ఉద్యోగం... ఇదిగో వ్యూహం
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్ఈ) కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. పరీక్షకు దాదాపుగా మూడు నెలల సమయం మిగిలి ఉంది. అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రభావవంతంగా వినియోగించుకుంటే ఐదంకెల జీతంతో కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌ను దక్కించుకునే చక్కని అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో సీజీఎల్ఈ ప్రిపరేషన్ ప్లాన్, తదితర అంశాలపై విశ్లేషణ.. సీజీఎల్ఈ ద్వారా ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. అవి.. మొదటి, రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్ష. చివరి దశ పర్సనాలిటీ టెస్ట్. ఈ మూడు దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాన్ని ఖరారు చేస్తారు. రాత పరీక్షను టైర్-1, టైర్-2 అనే రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది. టైర్-1 పరీక్షా విధానం: సమయం: రెండు గంటలు అంశం ప్రశ్నలు మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్+రీజనింగ్ 50 50 జనరల్ అవేర్నెస్ 50 50 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ 50 50 మొత్తం 200 200 టైర్-2 పరీక్షా విధానం: అంశం ప్రశ్నలు మార్కులు సమయం క్వాంటిటేటివ్ ఎబిలిటీ 100 200 2 గం. ఇంగ్లిష్ లాంగ్వేజ్- కాంప్రెహెన్షన్ 200 200 2 గం. స్టాటిస్టిక్స్ 100 200 2 గం. (స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అభ్యర్థులకు మాత్రమే) టైర్-1లో నెగిటివ్ మార్కింగ్ 0.25. టైర్-2లో ఇంగ్లిష్, స్టాటిస్టిక్స్ విభాగాలకు 0.50, క్వాంటిటేటివ్ ఎబిలిటీకి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. చివరి దశ: చివరి పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థి విద్యార్హతలు, సొంత రాష్ట్రం, ఆసక్తి, కరెంట్ అఫైర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలాధారంగా ప్రశ్నలు ఉంటాయి. కొన్ని పోస్టుల నేపథ్యాన్ని బట్టి ఎంపికైన అభ్యర్థులకు నైపుణ్య పరీక్షను కూడా నిర్వహిస్తారు. ఈ క్రమంలో అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల డేటా ఎంట్రీ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఇందులో భాగంగా గంటకు 8 వేల పదాలను టైప్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన పోస్టులకు శారీరక సామర్థ్య పరీక్షలను కూడా నిర్వహిస్తారు. అవి..ఇన్స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్/ ఎగ్జామినర్/ప్రివెంటివ్ ఆఫీసర్/ఇన్స్పెక్టర్-సబ్ఇన్స్పెక్టర్-సీబీఎస్). నిర్వహించే ఈవెంట్స్: వాకింగ్ టెస్ట్: 1600 మీటర్లు-15 నిమిషాలు (మహిళలు 1 కిలోమీటర్-20 నిమిషాలు) సైక్లింగ్: 8 కిలోమీటర్లు-30 నిమిషాలు (మహిళలు-3 కిలోమీటర్లు-25 నిమిషాలు) నోటిఫికేషన్ సమాచారం అర్హత: ఏదైనా డిగ్రీ. కంపైలర్ పోస్టులకు మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ ఎకనామిక్స్‌లతో డిగ్రీ. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 -స్టాటిస్టిక్స్‌తో డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ మ్యాథమెటిక్స్/ఎకనామిక్స్/కామర్స్ (స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా ఏడాది/రెండేళ్లు/మూడేళ్లు చదివి ఉండాలి). అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. నిర్దేశించిన పోస్టులకు శారీరక ప్రమాణాలు ఉండాలి. అవి.. ఇన్స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్/ఎగ్జామినర్/ప్రివెంటివ్ ఆఫీసర్/ఇన్స్పెక్టర్- సబ్ఇన్స్పెక్టర్-సీబీఎస్): ఎత్తు: 157.5 సెం.మీ., ఛాతీ: 81 సెం.మీ. (గాలి పీలిస్తే 5 సెం.మీ. పెరగాలి). మహిళలు-152 సెం.మీ. బరువు: 48 కిలోలు సీబీఐ-సబ్ఇన్స్పెక్టర్స్: ఎత్తు: పురుషులు -165 సెం.మీ. మహిళలు-150 సెం.మీ. ఛాతీ: 76 సెం.మీ. వయసు: జనవరి 1, 2014 నాటికి 18 నుంచి 27 ఏళ్లు. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్‌కు 26 ఏళ్లు. సబ్ఇన్స్పెక్టర్ (సీబీఐ)-20 నుంచి 27 ఏళ్లు. నిబంధనల మేరకు నిర్దేశిత అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ. 100 (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/ఎక్స్-సర్వీస్‌మెన్‌కు మినహాయింపునిచ్చారు) దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా పార్ట్-1 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 12, 2014. పార్ట్-2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2014. రాత పరీక్ష తేదీలు: ఏప్రిల్ 27, 2014. మే 4, 2014. వెబ్సైట్: http://ssc.nic.in ప్రిపరేషన్ ఇలా... జనరల్ ఇంటెలిజెన్స్+రీజనింగ్: ఈ విభాగంలో వెర్బల్-నాన్ వెర్బల్ ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే తార్కిక విశ్లేషణ అవసరం. డెరైక్షన్స్, అనాలజీస్, ర్యాంకింగ్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, వెన్‌డయాగ్రమ్స్ తదితరాలాధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే ప్రశ్నలు క్లిష్టంగా కాకుండా మధ్యస్తంగా ఉంటాయి. కాబట్టి ప్రశ్నను సరిగ్గా అవగాహన చేసుకుంటే సులభంగానే సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇంగ్లిష్: ఎంపికైన అభ్యర్థులు విధుల్లో భాగంగా ఇంగ్లిష్ భాషను తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఆంగ్ల భాషలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ స్కోరింగ్ విభాగం కూడా ఇదే. అంతేకాకుండా టైర్-1, 2 రెండు పేపర్లలోనూ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ సాగించాలి. అంతేకాకుండా ఈ విభాగానికి వెయిటేజీ కూడా ఎక్కువ. కాబట్టి అభ్యర్థులు ఇందులో సాధ్యమైనంత ఎక్కువగా స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి. ఇందులో 160 నుంచి 225 మార్కులు స్కోర్ చేసే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. ఈవిభాగంలో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు, కామన్ ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్, యాంటోనిమ్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. వొక్యాబ్యులరీని మెరుగుపరుచుకోవడం, రోజూ ఇంగ్లిష్ దిన పత్రికలను చదవడంతో ఇందులో మెరుగైన మార్కులు సాధించవచ్చు. రోజూ ఆంగ్ల దినపత్రికలు చదవడం జనరల్అవేర్నెస్ పరంగా కూడా ఉపకరిస్తుంది. జనరల్ అవేర్నెస్: జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమకాలీనంగా చోటు చేసుకుంటున్న అంశాలను నిశితంగా పరిశీలించాలి. అదే సమయంలో చరిత్ర, జనరల్ సైన్స్, ఆర్థిక రంగం, జాగ్రఫీ, పాలిటీ, శాస్త్ర పరిశోధనలు, స్టాండర్డ్ జీకే నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థులందరూ కనీసం 15 మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 25 నుంచి 30 మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ: ఈ విభాగం టైర్-1,2 రెండు పేపర్లలోనూ ఉంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రిపరేషన్ సాగించాలి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే గణితంలోని ప్రాథమిక భావనలపై అవగాహన అవసరం. సమాధానాన్ని వేగంగా, కచ్చితత్వంతో గుర్తించే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవాలి. ఈ విభాగంలో సంఖ్యామానం, ప్రొబబిలిటీ, వ్యాపార గణితం, లాభం-నష్టం, శాతం, సూక్ష్మీకరణ, కాలం-దూరం, నిష్పత్తి, సగటు, ఎత్తు-దూరాలు, రేఖా గణితం, ట్రిగ్నోమెట్రీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. టైర్-1, 2లలో క్వాంటిటేటివ్ విభాగం 250 మార్కులకు ఉంటుంది. ఇందులో కనీసం 170 మార్కులు సాధిస్తేనే చివరి దశకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. మ్యాథ్స్‌లో బలహీనంగా ఉన్న అభ్యర్థులు కనీసం 150 మార్కులు సాధించే విధంగా కృషి చేయాలి. జనరల్ టిప్స్ క్వాంటిటేటివ్-ఇంగ్లిష్ విభాగాలు టైర్-1, 2 పేపర్లలో ఉన్నాయి. కాబట్టి వీటికి ఎక్కువ వెయిటే జీ ఉంది. కాబట్టి ప్రిపరేషన్లో ఈ విభాగాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. టైర్-1, 2 పేపర్లలో క్వాంటిటేటివ్, ఇంగ్లిష్ విభాగాలు ఒకటే అయినా.. వాటిల్లో అడిగే ప్రశ్నలు క్లిష్టతలో తేడా ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించి ప్రిపరేషన్ సాగించాలి. టైర్-1లో ఇంగ్లిష్ మినహా (పదో తరగతి స్థాయి) మిగతా విభాగాల ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి. టైర్-2లోని క్వాంటిటేటివ్ విభాగంలోని ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో, ఇంగ్లిష్ విభాగంలోని ప్రశ్నలు 10+2 స్థాయిలో, స్టాటిస్టిక్స్ ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి. గత ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. రిఫరెన్స బుక్స్ క్వికర్ మ్యాథ్స్- ఎం. థైరా ఆబ్జెక్టివ్ మ్యాథ్స్-ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్-ఆర్ఎస్ అగర్వాల్, కిరణ్ ప్రకాషణ్ ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్-ఎస్ చాంద్ పబ్లికేషన్స్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ జీకే-మనోరమ ఇయర్‌బుక్,అరిహంత్ పబ్లికేషన్స్,ప్రతియోగితా దర్పణ్ -
భారతీయ రైల్వే.. భారీ కొలువులు
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డులు ఎప్పటికప్పుడు భారీ నోటిఫికేషన్లతో యువత ముందుకొచ్చి, క్రేజీ కొలువులకు రాచబాట వేస్తున్నాయి. తాజాగా 26,570 అసిస్టెంట లోకో పైలట్ టెక్నీషియన్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో విజయ వ్యూహాలపై స్పెషల్ ఫోకస్... ఆర్ఆర్బీ సంయుక్త నోటిఫికేషన్ ద్వారా 15,059 అసిస్టెంట్ లోకో పైలట్, 11,511 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు- సికింద్రాబాద్ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్ రైల్వేకు చెందిన పోస్టులున్నాయి. అర్హత: అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు పదో తరగతితో పాటు ఐటీఐ. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఉన్నత స్థాయి కోర్సులు పూర్తిచేసిన వారు కూడా అర్హులు. టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్-3, టెలీకమ్యూనికేషన్ మెయింటైనర్ గ్రేడ్-3 పోస్టులకు పదో తరగతితో పాటు ఐటీఐ ఉండాలి. లేదా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత అవసరం. లేదా డిప్లొమా ఉండాలి. ఇతర టెక్నీషియన్ పోస్టులకు పదో తరగతితో పాటు ఆయా విభాగాల్లో ఐటీఐ పూర్తిచేసుండాలి. వయసు: 2014, జూలై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులకు ఉమ్మడి రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. అన్ని ఆర్ఆర్బీలు ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తాయి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న బోర్డు పరిధిలో పరీక్ష రాయొచ్చు. పరీక్షలో 100 నుంచి 120 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రంలో జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ టెక్నికల్ ఎబిలిటీకి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, స్థానిక భాషలో ఉంటుంది. ఎంపిక విధానం: అసిస్టెంట్ లోకో పైలట్‌కు మొత్తం మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష, తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్, చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. టెక్నీషియన్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు జరుపుతారు. ప్రిపరేషన్ ప్రణాళిక అర్థమెటిక్: ఈ విభాగంలోని ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలను వేగంగా చేయగల నేర్పును సాధించాలి. కసాగు, గసాభా, శాతాలు, లాభ- నష్టాలు, సగటు, కాలం-పని, కాలం-వేగం-దూరం, నిష్పత్తులు, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, వైశాల్యం-చుట్టుకొలత, క్యాలెండర్, గడియారం వంటి అంశాలకు సంబంధించిన సమస్యలపై పట్టు సాధించాలి. బీజ గణితం, సమితులు, త్రికోణమితి, ప్రమేయాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలి. రీజనింగ్: అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగమిది. సాధారణంగా ఆర్ఆర్బీ పరీక్షలలో వెర్బల్ సెక్షన్ నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. నాన్ వెర్బల్ నుంచి తక్కువగా వస్తున్నాయి. రీజనింగ్ విభాగంలో సిరీస్(లెటర్/నెంబర్/సింబల్), అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్-డీకోడింగ్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, పజిల్ టెస్ట్, ర్యాంకింగ్ అండ్ అరేంజ్మెంట్, లాజికల్ డయాగ్రామ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, మిస్సింగ్ నెంబర్స్, అర్థమెటికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. చిట్కాల ద్వారా ప్రతిరోజూ సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేయడం అవసరం. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. A నుంచి Z వరకు, Z నుంచి A వరకు వేగంగా చదవగలగాలి. A నుంచి Z వరకు వాటి స్థాన విలువలు (A-1, B-2, C-3, ......, Z-26) తెలిసుండాలి. A నుంచి Z వరకు తిరోగమన స్థాన విలువలు (A-26, B-25,....., Z-1) నేర్చుకోవాలి. జనరల్ అవేర్నెస్: హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. చరిత్రలో భారతదేశ చరిత్ర (ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగం).. ముఖ్యంగా స్వాతంత్య్రోద్యమంపై ప్రశ్నలు వస్తాయి. జాగ్రఫీకి సంబంధించి విశ్వం, భూమి, ఖండాలు, మహాసముద్రాలు, నదులు, ఖనిజాలు, రవాణా వ్యవస్థ, జనాభా, వ్యవసాయం తదితర అంశాలపై పట్టు సాధించాలి. పాలిటీ విభాగంలో భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, వివిధ కమిషన్ల చైర్మన్ల పేర్లను తెలుసుకోవాలి. జనరల్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంశాలను చదవాలి. రక్షణ, అంతరిక్ష, అణుశక్తి వంటి విభాగాలపైనా దృష్టి సారించడం మంచిది. ఎకానమీలో.. జాతీయాదాయం, నిరుద్యోగం, పేదరికం, ప్రభుత్వ పథకాలు, పన్నుల వ్యవస్థ, ఫైనాన్స్ కమిషన్ వంటి అంశాలను చదవాలి. స్టాక్ జనరల్ నాలెడ్జ్: ఈ విభాగంలో రైల్వే వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలతోపాటు.. జాతీయ చిహ్నాలు, అంతర్జాతీయ సరిహద్దులు, ఐక్యరాజ్యసమితి, పరిశోధన సంస్థలు, క్రీడలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు, ప్రపంచం/ఇండియాలో తొలి, ఎత్తై, పొడవైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. కరెంట్ అఫైర్స్: పరీక్ష జరిగే తేదీకి ముందు ఏడాది కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలను (సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు, వ్యక్తులు, విజయాలు, అవార్డులు వంటివి) తెలుసుకోవాలి. దీనికోసం రోజూ దినపత్రికలు, మేగజీన్లను చదవాలి. టెక్నికల్ సబ్జెక్ట్: ఈ విభాగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. మెకానికల్ ఇంజనీరింగ్‌లో మెకానిక్స్, డిజైన్, ప్రొడక్షన్ టెక్నాలజీ, థర్మోడైనమిక్స్, ఐ.సి.ఇంజిన్స్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెషినరీ వంటి అంశాలు ముఖ్యమైనవి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: అటామిక్ స్ట్రక్చర్, కరెంట్, రెసిస్టెన్స్, ఓమ్ నియమం, కెపాసిటర్స్, సిరీస్-ప్యారలల్ కనెక్షన్స్, మ్యాగ్నటిజం, ప్రిన్సిపుల్స్ ఆఫ్ మోటార్, ట్రాన్స్ఫార్మర్స్, జనరేటర్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎలక్ట్రానిక్స్: ఈ విభాగంలో రాణించడానికి.. కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రాన్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. రిఫరెన్స్: అర్థమెటిక్, రీజనింగ్- ఆర్ఎస్ అగర్వాల్. లూసెంట్ పబ్లికేషన్స్. ప్రాక్టీస్‌తోనే సక్సెస్ మెరుగైన ప్రాక్టీస్‌తోనే రాత పరీక్షలో విజయం సాధించగలం. వీలైనన్ని మోడల్, ప్రీవియస్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. నిపుణులైన ఫ్యాకల్టీ సహాయంతో తప్పులను సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఏఎల్పీ, టెక్నీషియన్స్ పోస్టులకు ఉమ్మడిగా నిర్వహించే రాతపరీక్షలో టెక్నికల్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు బేసిక్ స్థాయిలో ఉన్నప్పటికీ, స్టాండర్డ్‌గా ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. ఉద్యోగంలో చేరుతూనే ఆకర్షణీయ జీతభత్యాలతో అసిస్టెంట్ లోకో పైలట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వారు తర్వాత సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా, లోకో పైలట్ స్థాయికి చేరుకోవచ్చు. - ఎ.సత్యనారాయణరెడ్డి, డెరైక్టర్, గ్రేట్ ఇన్స్టిట్యూట్,సికింద్రాబాద్. నోటిఫికేషన్ వివరాలు ఫీజు వివరాలు: జనరల్/ఓబీసీ పురుష అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.40 డీడీ లేదా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా ఫీజు చెల్లించాలి. దరఖాస్తు విధానం: దరఖాస్తులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా నిర్దేశిత నమూనాలో అ4 సైజు పేపర్‌పై పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను, డీడీ/ఐపీఓ జతచేయాలి. డీడీ/ఐపీఓ వెనుక నోటిఫికేషన్ నెంబర్, దరఖాస్తు చేసిన పోస్టు, పేరు, చిరునామా వివరాలను పొందుపరచాలి. అభ్యర్థులు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్య తేదీలు: దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 17, 2014. పరీక్ష తేదీ: జూన్ 15, 2014. వెబ్సైట్: www.rrbsecunderabad.nic.in -
జాబ్ రిమైండర్స్
దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులు: 1443 టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులు: 542 దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2014 వివరాలకు: http://rrbsecunderabad.nic.in ........................................................ ఇండియన్ కోస్ట్‌గార్డ్ 10+2 ఎంట్రీ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 29, 2014 వెబ్సైట్: www.joinindiancoastguard.gov.in ........................................................ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ ట్రైనీ 24 పోస్టులు రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 30, 2014 వెబ్సైట్: www.belindia.com ........................................................ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ పార్ట్-1 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:ఫిబ్రవరి 12, 2014 పార్ట్-2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:ఫిబ్రవరి 14, 2014 వెబ్సైట్: http://ssc.nic.in ........................................................ నావెల్ డాక్‌యార్డ్ ట్రేడ్స్‌మెన్ (స్కిల్డ్) 349 పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2014 వెబ్సైట్: www.godiwadabhartee.com ........................................................ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సబ్-ఇన్స్పెక్టర్ పోస్టులు: 58 దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2014 వెబ్సైట్: http://bsf.nic.in -
వంద శాతం శ్రమతో 100 పర్సంటైల్
దండిగా మార్కులు సంపాదించి, కాసులకు కరువులేని కార్పొరేట్ కొలువులో కుదురుకొని, దర్జాగా బతికేద్దామను కుంటారు కొందరు! స్వీయ ఉన్నతితో పాటు, మరో పదిమంది బతుకుకు భరోసా ఇచ్చేలా సొంతంగా వ్యాపార సంస్థను ప్రారంభించాలనుకుంటారు మరికొందరు! ఈ రెండో మార్గాన్ని ఎంచుకునే క్రమంలోనే మేనేజ్‌మెంట్‌వైపు అడుగులు వేస్తున్నానంటున్నారు క్యాట్-2013 టాపర్ ఇమ్మనేని కుమార్ కార్తీక్.. మాది విజయవాడ. పదో తరగతి వరకు వి.పి.సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో చదివా. ఇంటర్ డీఏవీ సీనియర్ సెకండరీ స్కూల్లో పూర్తిచేశా. ఖరగ్‌పూర్ ఐఐటీలో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ చదివా. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాన్న ఈశ్వరరావు చార్టర్డ్ అకౌంటెంట్. అమ్మ నందన గృహిణి. అన్నయ్య చైతన్య కిరణ్ కూడా సీఏ పూర్తిచేసి, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు. నాన్న వ్యక్తిత్వం, కష్టపడి పనిచేసే తత్వం నాకు స్ఫూర్తిగా నిలిచాయి. పది మందికి తోడుగా: ఇంజనీరింగ్ డిగ్రీ ద్వారా సబ్జెక్టు పరిజ్ఞానం సొంతమవుతుంది. అయితే ఓ సంస్థను నడిపించేందుకు కావాల్సిన నైపుణ్యాలు బిజినెస్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. మేనేజ్మెంట్ కోర్సును పూర్తిచేసి, కొందరికి ఉపాధి చూపించాలన్న ఉద్దేశంతోనే ఎంబీఏ దిశగా పయనిస్తున్నా. ప్రాక్టీస్‌తోనే విజయం: క్యాట్‌కు సంబంధించి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీలపై పట్టుసాధించాలంటే ప్రాక్టీస్‌కు మించిన మార్గం లేదు. ఇంగ్లిష్ దినపత్రికలు, మేగజీన్లు చదవడం వల్ల భాషపై పట్టు చిక్కింది. వేగంగా చదవడం, కొత్త పదాలకు అర్థాలు తెలుసుకునేందుకు వీలైంది. సబ్జెక్టుల మధ్య సారూప్యతను అర్థం చేసుకొని ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకున్నాను. వీలైనన్ని ఎక్కువ మోడల్ పేపర్లు సాధన చేయడం కూడా నాకు లాభించింది. సమయ పాలన ముఖ్యం: పక్కా టైం మేనేజ్మెంట్తో ముందుకెళ్తే మంచి స్కోర్ సాధించేందుకు ఏదీ అడ్డంకి కాదనే విషయాన్ని గుర్తించాలి. మన చేతిలో అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. మొదటిసారి ఒకవైపు కాలేజీకి వెళ్తూనే, మరోవైపు క్యాట్‌కు సిద్ధమయ్యాను. రెండోసారి ఉద్యోగం చేస్తూ, పరీక్షకు ప్రిపేర్ అయ్యాను. రోజూ సాయంత్రం కోచింగ్‌కు వెళ్లేవాడిని. వారాంతపు రోజుల్లో అయితే పూర్తిసమయాన్ని కోచింగ్ సెంటర్‌కే కేటాయించాను. రోజూ రాత్రి 7 నుంచి 11 గంటల వరకు ప్రాక్టీస్ చేసేవాణ్ని. కోచింగ్ తప్పనిసరి కాదు. మెటీరియల్ సరిపోతుంది. ఈ స్కోర్‌ను ఊహించలేదు: క్యాట్ 2013లో 100 పర్సంటైల్ వస్తుందని ఊహించలేదు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించడం వల్లే ఈ స్కోర్ సాధించగలిగాను. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరులలో ఎక్కడ సీటు వచ్చినా మంచిదే. నిత్యం సవాళ్లతో కూడుకున్న మార్కెటింగ్ విభాగమంటే చాలా ఇష్టం. మేనేజ్మెంట్ కోర్సును పూర్తిచేసిన తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగం చేయడం, తర్వాత సొంతంగా వ్యాపార సంస్థను నెలకొల్పడం నా జీవిత లక్ష్యం. వేగం+ స్పష్టత= 100 పర్సంటైల్ ప్రాక్టీసు చేసేటప్పుడు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నామో గుర్తించాలి. ఆయా అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఎప్పటికప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. మోడల్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీసు చేసేటప్పుడు వేగం, కచ్చితత్వం ప్రధానం. అదే విధంగా పరీక్ష సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ముఖ్యం. మొదట తేలికైన ప్రశ్నలను పూర్తిచేసి, తర్వాత కష్టమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలం. 100 శాతం శ్రమించాలి: సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లు.. ప్రాక్టీసు ఒక్కటే విజయానికి దగ్గరి మార్గం. వందశాతం నిజాయితీగా కష్టపడితే క్యాట్‌లో 100 పర్సంటైల్ సాధించడం కష్టమేమీ కాదు. -
ఎన్ఐడీ ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు తెలపండి? - చరణ్, గద్వాల్. దేశంలోని ప్రముఖ డిజైనింగ్ స్కూళ్లలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) ఒకటి. ఈ సంస్థకు అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరులలో క్యాంపస్‌లు ఉన్నాయి. కోర్సుల వివరాలు: గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైనింగ్ (జీడీపీడీ). స్పెషలైజేషన్లు: ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, టెక్స్టైల్స్ డిజైన్. అర్హత : ఇంటర్ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత. వ్యవధి: నాలుగేళ్లు ప్రవేశాలు: డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ) ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైనింగ్ (పీజీడీపీడీ). ఈ కోర్సు అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు క్యాంపస్‌లలో ఉంది. స్పెషలైజేషన్లు: ప్రొడక్ట్ డిజైన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, టెక్స్టైల్స్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఆటోమొబైల్, టాయ్ అండ్ గేమ్, ఫొటోగ్రఫీ, అపెరల్, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్, న్యూమీడియా. అర్హత: ఎంపిక చేసుకున్న ప్రోగ్రాంను బట్టి ఆయా ప్రోగ్రాంలో నాలుగేళ్ల డిగ్రీ లేదా డిప్ల్లొమా (10+2+4) కోర్సు చేసి ఉండాలి. వ్యవధి: మూడేళ్లు ప్రవేశం: డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ) ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. డిజైనింగ్‌లో యూజీ కోర్సులను అహ్మదాబాద్ క్యాంపస్ మాత్రమే ఆఫర్ చేస్తుంది. వివరాలకు: www.nid.edu కెరీర్: డిజైనింగ్ కోర్సులు పూర్తిచేసిన తర్వాత ఎంచుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా వివిధ రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్, ఫ్యాషన్, ఆర్కిటెక్చర్, ఎంటర్టైన్మెంట్, ఇంటీరియర్ డిజైన్, అడ్వర్టైజింగ్, ఐటీ వంటి నిత్య నూతన వస్తువులను ఉత్పత్తి చేసే రంగంలో అవకాశాలను దక్కించుకోవచ్చు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ప్రవేశ ప్రక్రియ వివరాలను తెలపండి? -మధు, మెదక్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న ఆసియా ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాల దిశగా నడిపించడానికి అవసరమైన, సమర్థవంతమైన బిజినెస్ లీడర్సను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఏర్పాటైంది. ఈ ఇన్స్టిట్యూట్కు హైదరాబాద్, మొహాలీ (పంజాబ్)లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఐఎస్బీ.. షార్ట్ టర్మ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (పీజీపీ) ఇన్ మేనేజ్మెంట్, డాక్టోరల్ డిగ్రీతో సమానమైన ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోషిప్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల కోసం ఐఎస్బీ యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తుంది. పీజీపీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, స్ట్రాటజీ అండ్ లీడర్షిప్ వంటి ఎలక్టివ్స్ ఉన్నాయి. ప్రతి కోర్సుకు భిన్నమైన ప్రవేశార్హతలను ఐఎస్బీ నిర్దేశించింది. సాధారణంగా జీమ్యాట్ స్కోర్, మేనేజీరియల్ అనుభవం, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలాధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వివరాలకు: www.isb.edu రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆఫర్ చేసే పీహెచ్డీ కోర్సు వివరాలను తెలపండి? - శ్రీధర్, నిజామాబాద్. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగం ఏర్పాటు చేసిన ప్రధాన పరిశోధన సంస్థల్లో రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ-ఇండోర్ ఒకటి. ఈ ఇన్స్టిట్యూట్ యాక్సిలేటర్స్, లేజర్స్ సంబంధిత అంశాల్లో పీహెచ్డీ కోర్సును అందిస్తుంది. ఈ కోర్సులో ఏడాది కోర్సు వర్క్, నాలుగేళ్ల రీసెర్చ్ వర్క్ ఉంటుంది. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ లైఫ్ సెన్సైస్). సీఎస్ఐఆర్-యూజీసీ నెట్లో నిర్దేశిత అర్హత సాధించిన విద్యార్థులకు నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు: www.cat.ernet.in ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం)-ధన్‌బాద్ అందించే ఎంబీఏ కోర్సులో చేరేందుకు అర్హత, ప్రవేశ ప్రక్రియ విధానాన్ని తెలపండి? - శేఖర్, సంగారెడ్డి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం)-ధన్‌బాద్, రెండేళ్ల ఎంబీఏ, మూడేళ్ల ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను అందిస్తుంది. ఎంబీఏ (రెండేళ్ల కోర్సు): 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు కోర్సులో చేరేందుకు అర్హులు. ప్రవేశాలు: క్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (మూడేళ్ల కోర్సు): 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. పేరున్న ప్రభుత్వ, ప్రైవేటు, సెమీ గవర్నమెంట్ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్/సూపర్వైజర్గా ఏడాది అనుభవం అవసరం. ప్రవేశం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వివరాలకు: www.ismdhanbad.ac.in -
పోలియో రహిత దేశంగా భారత్
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం అగ్ని-4 విజయవంతం అణ్వాయుధాలను మోసుకుపోయే సామర్థ్యం గల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ జనవరి 20న ఒడిశా వీలర్ ఐలాండ్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని ఈ క్షిపణి ప్రయోగించిన 20 నిమిషాల్లోనే విజయవంతంగా ఛేదించింది. దీంతో సైన్యానికి అప్పగించేందుకు వీలుగా క్షిపణి పూర్తిస్థాయిలో సిద్ధమైందని డీఆర్డీఓ ప్రకటించింది. ఈ క్షిపణి 4వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అలాగే 850 కిలోమీటర్లు పైకి వెళ్లి తిరిగి వాతావర ణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రాజెక్టుగా చిలక సరస్సు ఒడిశాలోని చిలక సరస్సును సుస్థిర పర్యాటక రంగం, జీవనోపాధి వనరుల అభివృద్ధి, పక్షుల వలస కొనసాగింపునకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యునెటైడ్ నేషన్స్ ఆఫ్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఎంపిక చేసింది. చిలక సరస్సుతో కలిపి ఎనిమిది ప్రాంతాలను ఈ సంస్థ ఎంపిక చేసింది. ఆసియాలో చిలక ప్రాంతం ఒక్కటే యూఎన్ ప్రాజెక్టుకు ఎంపికవడం విశేషం. ఈ ప్రాజెక్టు కింద చిలక అభివృద్ధి ప్రాజెక్టుకు సహాయం చేస్తారు. సరికొత్త పర్యాటక కార్యక్రమాలు, జీవనోపాధి చర్యలు చేపట్టడం ద్వారా వలస పక్షుల పరిరక్షణకు అభివృద్ధి వ్యూహాలు చేపడతారు. జైనులకు మైనారిటీ హోదా జైనులకు మైనారిటీ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ 2014 జనవరి 20న నిర్ణయం తీసుకుంది. దేశంలో వీరి జనాభా 50 లక్షల వరకు ఉంటుంది. వీరిలో అత్యధికంగా 10 శాతం మంది ముంబైలోనే ఉన్నారు. ఇప్పటివరకు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మైనారిటీ హోదాను కలిగి ఉన్నారు. బెంగళూరులో ద్విచక్ర అంబులెన్సు సేవలు క్షతగాత్రులు, అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించాల్సిన రోగుల కోసం బెంగళూరులో సరికొత్త అంబులెన్సులు అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ సమస్యను అధిగమించి సకాలంలో ఆసుపత్రులకు చేరేలా కర్ణాటక ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. బెంగళూరులో ఓ వైద్యుడు తన ద్విచక్ర వాహనానికి ప్రాథమిక చికిత్స సామాగ్రి పెట్టెతో ప్రమాదాలు జరిగిన చోటుకే వెళ్లి వైద్యం చేసేవారు. ఆ వైద్యుని స్ఫూర్తితోనే ద్విచక్ర అంబులెన్సులు ప్రవేశపెట్టడానికి నిర్ణయించామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి యు.టి.ఖాదర్ తెలిపారు. అంతర్జాతీయం దక్షిణకొరియా అధ్యక్షురాలు భారత పర్యటన దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలు పార్క్ గున్ హే భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా 2014, జనవరి 16న ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణరంగం వంటి అంశాలపై ఆమె చర్చలు జరిపారు. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లతో గున్ హే సమావేశ మయ్యారు. రాజస్థాన్‌లో కొరియా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు అవకాశాలను ఆమె స్వాగతించారు. కొరియన్ జాతీయులకు టూరిస్ట్ వీసా జారీచేసే భారత నిర్ణయాన్ని ప్రధాని మన్మోహన్ ప్రకటించారు. ఒడిశాలో రూ.52,000 కోట్లతో దక్షిణ కొరియా నిర్మించే పోస్కో ఉక్కుకర్మాగారానికి పర్యావరణ అనుమతి లభించడం పట్ల గున్ హే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో వర్గీకృత సైనిక సమాచార రక్షణ, సైబర్‌స్పేస్ అంశాలున్నాయి. మడగాస్కర్ అధ్యక్షుడిగా హెరీ రాజోనారి మాంపియానినా మడగాస్కర్ దేశ అధ్యక్షునిగా ఆ దేశ మాజీ ఆర్థిక మంత్రి హెరీ రాజోనారి మాంపియానినా ఎన్నికయ్యారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే క్రమంలో జరిగిన ఎన్నికల అనంతరం హెరీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. 2009లో రాజోయిలీనా అధికారం చేజిక్కించుకున్నాక నాలుగేళ్లకు గత డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. నాటి అధికార మార్పిడిలో రాజోయిలీనా ప్రత్యర్థి మార్క్ రాలో మనన దేశం విడిచి పారి పోయి దక్షిణాఫ్రికాలో ఆశ్రయం పొందారు. పోలియో రహిత దేశంగా భారత్ భారత్‌ను పోలియో రహిత దేశంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ 2014, జనవరి 13న ప్రకటించారు. దేశంలో గత మూడేళ్లలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని ఆయన తెలిపారు. చివరిగా 2011, జనవరి 13న పశ్చిమబెంగాల్లో ఓ కేసు నమోదైంది. 2009లో 741గా ఉన్న కేసుల సంఖ్య 210 నాటికి 42కు, 2011లో ఒక్క కేసుకి తగ్గాయి. తులసిలో జన్యుమార్పిడి తులసిలో ఔషధ గుణాలను మరింతగా పెంచేందుకు అమెరికా పరిశోధకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆ మొక్కలో జన్యుమార్పిడికి శ్రీకారం చుట్టారు. ఈ బృందానికి భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త మన తెలుగు వాడైన చంద్రకాంత్ ఈమని నేతృత్వం వహిస్తున్నారు. ఈయన తన విద్యార్థులతో కలిసి తులసిలో యూజెనాల్ అనే పదార్థం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను నియంత్రించడంలో యూజెనాల్ పాత్ర ఎంతో కీలకం. దాతల సదస్సులో సిరియాకు 2.4 బిలియన్ డాలర్ల సాయం అంతర్యుద్ధంతో నలిగిపోతున్న సిరియాకు కువైట్‌లో 2014, జనవరి 17న జరిగిన దాతల సదస్సులో వివిధ దేశాలు 2.4 బిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించాయి. మానవతా దృక్పథంతో 6.5 బిలియన్ డాలర్లు సమకూర్చాలని ఐక్యరాజ్యసమితి ఈ సదస్సు నిర్వహించింది. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్-కీ-మూన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు లో 70 దేశాలు, 24 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సుకు ఆతిథ్యమిచ్చిన కువైట్ అత్యధికం గా 5 వందల మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ద్వైపాక్షిక వాణిజ్యంపై భారత్-పాక్ అంగీకారం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకువచ్చి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచుకోవడానికి భారత్,పాకిస్థాన్‌ల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. న్యూస్‌మేకర్స్ నటి సుచిత్రా సేన్ మృతి అలనాటి అందాల నటి సుచిత్రా సేన్ (82) కోల్‌కతాలో 2014, జనవరి 17న మరణించారు. ఆమె బెంగాలీ, హిందీ భాషల్లో 60 సినిమాల్లో నటించారు. అగ్ని పరీక్ష, ఆంధీ, సాత్‌పాకే బంధా, మసాఫిర్, బొంబాయ్ కాబబా, దేవదాస్ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దేవదాస్‌లో నటనకు ఉత్తమ జాతీయ నటి అవార్డు ఆమెకు లభించింది. 1963లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 1972లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం, 2005లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సుచిత్రాసేన్ అందుకున్నారు. కేంద్రమంత్రి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ (52) న్యూఢిల్లీలో 2014 జనవరి 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సునంద పుష్కర్‌ను థరూర్ 2010 ఆగస్టులో వివాహమాడారు. ఆధ్యాత్మిక గురువు బుర్హానుద్దీన్ మృతి దావూద్ బోహ్రా ముస్లిమ్మతపెద్ద సేడ్నా బుర్హానుద్దీన్ (99) ముంబాయిలో 2014 జనవరి 17న మరణించారు. ఈయన ప్రపంచ వ్యాప్త దావూదీ బోహ్రా మతానికి 52వ దాయ్ అల్-మల్తక్. జోర్డాన్ ప్రభుత్వం స్టార్ ఆఫ్ జోర్డాన్, ఈజిప్ట్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ది నైలీ వంటి అత్యున్నత పౌరపురస్కారాలతో ఆయనను సత్కరించాయి. అనేక సంస్థలు డాక్టరేట్ బహుకరించాయి. ఇదిలా ఉండగా ఇయన అంత్యక్రియల సందర్భంగా జనవరి 18న ముంబైలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృత్యు వాతపడ్డారు. కవి నామ్‌దేవ్ ఢసాల్ మృతి ప్రముఖ మరాఠి కవి, దళిత ఉద్యమనేత పద్మశ్రీ నామ్‌దేవ్ ఢసాల్ (64) ముంబయిలో 2014, జనవరి 16న కన్నుమూశారు. నామ్‌దేవ్ తొలి కవితా సంకలనం గోల్పెథా 1973లో ప్రచురితమయింది. ఆయన 1972లో దళిత్ పాంథర్స్అనే ర్యాడికల్ సంస్థను స్థాపించారు. దళిత్ పాంథర్స్ ముంబయిలో శివసేనను సిద్ధాంత పరంగాను, బహిరంగం గాను విభేదించింది. మహిళలతో పాటు కులాలకు అతీతంగా దోపిడికి గురైన వారందరూ దళితులేనంటూ దళిత్ పాంథర్స్ నిర్వచించింది. రాష్ట్రీయం అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో భవనానికి ఎదురుగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జనవరి 20న ఆవిష్కరించారు. ఎన్పీఏ తొలి మహిళా డెరైక్టర్‌గా అరుణా బహుగుణ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ) 28వ డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అరుణా బహుగుణ (56)ను కేంద్ర ప్రభుత్వం 2014, జనవరి 20న నియమించింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎన్ిపీఏలో ఐపీఎస్‌కు ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు. 68 ఏళ్ల చరిత్ర గల ఎన్‌పీఏకి తొలి మహిళా డెరైక్టర్ బహుగుణ కావడం విశేషం. ఈమె 1979 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారిణి. అవార్డులు ఓల్గాకు లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారం ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పోపూరి. లలిత కుమారి (ఓల్గా) లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్టీరామారావు, హరివంశరాయ్ బచ్చన్ వర్ధంతి రోజున తెలుగు సాహిత్య రంగంలో విశేష సేవలందించిన వారికి ఈ పురస్కారాలను అందిస్తారు. రాష్ట్ర వ్యవసాయశాఖకు కృషికర్మాన్ అవార్డు కేంద్ర వ్యవసాయశాఖ అందించే కృషికర్మాన్ అవార్డు 2012-2013 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖకు లభించింది. చిరు ధాన్యాల పంటల సాగును ప్రోత్సహించినందుకు ఈ అవార్డు రాష్ట్ర వ్యవసాయశాఖకు దక్కింది. ఈ అవార్డు కింద కోటి రూపాయల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. రాష్ట్రంలో రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్క జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల పంటల సాగు, దిగుబడి పెంచి నందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ అవార్డుకు ఎంపికైంది. గత ఏడాది రాష్ట్రంలో చిరుధాన్యాల పంటలు 13.39 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. 53.69 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. 71వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 71వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను లాస్ ఏంజిలిస్‌లో 2014 జనవరి 12న ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రం (డ్రామా): 12 ఇయర్స్ ఆఫ్ స్లేవ్ ఉత్తమ చిత్రం(మ్యూజికల్ కామెడీ): అమెరికన్ హజిల్ ఉత్తమ దర్శకుడు: ఆల్ఫోన్సో క్యూరోన్ (చిత్రం-గ్రావిటీ) ఉత్తమ నటుడు (డ్రామా): మ్యూథ్యూస్ మ్యాక్ కొనాగే (చిత్రం-డల్లాస్ బయ్యర్స్ క్లబ్ ఉత్తమ నటి (డ్రామా): కేట్ బ్లాంచెట్ (చిత్రం: బ్లూ జాన్) ఉత్తమ నటుడు (మ్యూజికల్ కామెడీ): లియోనార్డో డి క్యాప్రియో (చిత్రం-డి వోల్పో ఆఫ్ వాల్‌స్ట్రీట్) ఉత్తమ నటి (మ్యూజికల్ కామెడీ): అమీ ఆడమ్స్ (చిత్రం-అమెరికన్ హజిల్) ఉత్తమ విదేశీ భాషాచిత్రం: దిగ్రేట్ బ్యూటీ (ఇటలీ ) జైపూర్ సాహిత్య ఉత్సవాలు ఏడో జైపూర్ సాహిత్య ఉత్సవాలు జైపూర్‌లో 2014 జనవరి 17నుంచి 21 వరకు జరిగాయి. ఇది ఆసియాలో కెల్లా అతిపెద్ద వార్షిక సాహితీ ఉత్సవం. ఈ ఉత్సవాల్లో 14 భాషలకు చెందిన రెండు లక్షల మంది సాహితీ ప్రియులు పాల్గొన్నారు. నోబెల్ అవార్డు గ్రహీతలు అమర్త్యసేన్, హారోల్డ్ వార్ముస్తో పాటు 240 మంది ప్రసంగించారు. క్రీడలు అంజూజార్జికి ఎనిమిదేళ్ల తర్వాత స్వర్ణం 2005 మొనాకో ప్రపంచ అథ్లెటిక్స్ పైనల్లో లాంగ్ జంపర్ అంజూబాబి జార్జికి ఎనిమిదేళ్ల తర్వాత స్వర్ణం దక్కింది. అప్పట్లో తొలి స్థానంలో నిలిచిన రష్యాకు చెందిన అథ్లెట్ తత్యానా కొటోవా డోపింగ్ పరీక్షలో పట్టుబడటంతో రెండో స్థానంలో నిలిచిన అంజూబాబి జార్జికి అంతర్జాతీయ అథ్లెటిక్ సంఘాల సమాఖ్య స్వర్ణం ప్రకటించింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్ పోటీల్లో తొలి స్వర్ణం సాధించిన మహిళగా అంజూ ఘనత సాధించింది. అభిజిత్‌కు గ్రాండ్‌మాస్టర్స్ ఇంటర్నేషనల్ చెస్ టైటిల్ పార్శ్వనాథ్ గ్రాండ్‌మాస్టర్స్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెం ట్ టైటిల్‌ను అభిజిత్‌గుప్తా గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో 2014 జనవరి16న ముగిసిన పోటీలో ఉక్రెయిన్‌కు చెందిన ఎల్డర్ గాసనోవ్ను ఓడించి అభిజిత్ విజేతగా నిలిచాడు. హాకీ వరల్డ్ లీగ్ విజేత నెదర్లాండ్ న్యూఢిల్లీ వేదికగా జరిగిన హాకీ వరల్డ్ లీగ్ పోటీల్లో నెదర్లాండ్స్ జట్టు విజేతగా నిలిచింది. జనవరి 18న ఏకపక్షంగా సాగిన అంతిమపోరులో ఈ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో భారత్ ఆరో స్థాన ంలో నిలిచింది. -
ఐ థింక్ ఐ అండర్ స్టాండ్ ద నట్స్ అండ్
K. LALITHA BAI Associate Professor in English, Hyderabad. Idioms and phrases refer to commonly used group of words in English. They carry a specific meaning and are used in specific situations. Phrases are usually made up of a few words and are used as a grammatical unit in a sentence; on the other hand idioms are full sentences. It is an important category in all competitive exams. Candidates preparing for competitive examinations must practice idioms and phrases in their writing as well as speech. By listening to native speakers one will get acquainted with the nuances of the language. It will make them proficient while practicing. For attempting the questions in this section the candidates should know the rules of grammar. They should also pay attention to various exceptions to the grammatical rules. Good command over grammar is necessary to solve these questions. List of important Idioms and Phrases A bird in the hand is worth two in the bush Meaning: Having something that is certain is much better than taking a risk for more, because chances are you might lose everything A bitter pill Meaning: A situation or information that is unpleasant but must be accepted A blessing in disguise Meaning: Something good that isn't recognized at first A man of action Meaning: A man who is inclined to act first rather than think about things and discuss them. Add fuel to the fire Meaning: To make a problem worse Every cloud has a silver lining Meaning: Be optimistic From scratch / to start from scratch Meaning: Start from the beginning with no prior preparation Face the music Meaning: Said when someone accepts to confront the unpleasant consequences of one's actions. Gain ground Meaning: To become popular, to make progress, to advance. Cross your fingers Meaning: To hope that something happens the way you want it to. Couch potato Meaning: Lazy person. Cost an arm and a leg Meaning: Extremely expensive. Cry over spilt milk Meaning: When you complain about a loss from the past. Don't put all your eggs in one basket Meaning: Do not put all your resources in one possibility. Lend me your ear meaning: To politely ask for someone's full attention. Picture paints a thousand words Meaning: A picture will be far more descriptive of something than words can ever be. Raw deal Meaning: Said when someone is ill treated. Red handed Meaning: Be discovered in or just after the act of doing something wrong or illegal Spill the beans Meaning: To reveal a secret. Turn a blind eye Meaning: Refuse to acknowledge something you know is real. Until one is blue in the face Meaning: Pointless efforts while trying to convince someone or change his mind. Walk on air Meaning: Very excited or happy. You can't judge a book by its cover Meaning: Decisions shouldn't be made primarily on appearance. Zero tolerance Meaning: No crime or law breaking big or small will be overlooked. Directions: which of the phrases (a), (b), (c) and (d) given below each sentence should replace the phrase printed in bold type to make the sentence grammatically correct? If the sentence is correct as it is, mark (e) i.e. No correction required as the answer. 1. Why do you wish to tread on the toes? a) To give offence to them b) To treat them indifferently c) To follow them grudgingly d) To be kicked by them e) No correction required 2. To keep one's temper a) To be in good mood b) To preserve ones energy c) To be angry d) To be aloof from e) No correction required 3. To play second fiddle a) To be happy b) To reduce importance of one's senior c) To support the role and view of another person d) To do back seat driving e) No correction required 4. Action is the glorious principle of life and the one that saves man from _____. a) The use of faculties, physical or mental b) Stagnation and unhappiness c) The sorrow of fellow beings d) The prerequisites of happiness e) No correction required 5. Being the head of a large family it difficult to keep his head above water. a) To take rest b) To work properly c) To avoid quarrel d) To keep out of debt e) No correction required 6. To leave someone in the lurch a) To come to compromise with someone b) Constant source of annoyance to someone c) To put someone at ease d) to leave someone at a time when they need you to stay and help them e) No correction required 7. And really the only reason you were there was because you had a bone to pick with him. a) You wanted to have a discussion with him b) You wanted to chat c) You wanted to talk d) You wanted to have an argument with him e) No correction required 8. He doesn't really go around with many people because he is a bit a lone wolf. a) Single person b) Lonely person c) Unhappy person d) Simple person e) No correction required 9. I don't honestly think he is capable of being polite as the leopard never changes his spots. a) Always complain b) Differ in opinion c) Never change d) Shout e) No correction required 10. The issue was taken before the Municipal Corporation meeting last week. a) Taking place at b) Taken after c) Being taken up d) Taken up at e) No correction required 11. As the maestro lifted his baton the theatre was so still you could hear _____. a) His heartbeat b) A pin drop c) Bird wings d) Drum beating e) No correction required 12. I don't agree with you, but your idea certainly gives me food _____. a) For fun b) For consideration c) For thought d) For thinking e) No correction required 13. Look, I will pay you back. Would you please call the _____. a) Hunters off b) Tigers off c) Dogs off d) Apes off e) No correction required 14. Just a moment... I've got the answer on the _____ of my tongue. a) Top b) back c) Tip d) Front e) No correction required 15. I'm afraid Chess isn't my cup of _____. a) Tea b) Coffee c) Wine d) Java e) Milk 16. I think I understand the nuts and _____ of the operation. a) Screws b) Hammer c) Nails d) Bolts e) No correction required 17. Oh, I'm sorry. I shouldn't have said that. I guess I really put my_____ in my mouth. a) Foot b) Hand c) Elbow d) Knee e) No correction required 18. I'll be back in the twinkling of _____. a) An eye b) A Lighting bolt c) A smile d) A laugh e) No correction required 19.He is plain, simple and sincere man. He will always call a spade a spade. a) Find meaning or purpose in your action b) Avoid controversial situations c) Be outspoken d) Resist from making controversial statement e) No correction required 20.He has rejoined after a week and looks run down. a) Cheerful and bubbly b) Weak and tired c) Active and energetic d) Busy and preoccupied e) No correction required 21.To hit the nail on the head a) To do the right thing b) To destroy one's reputation c) Announce one's fixed views d) To teach someone a lesson e) None of these 22.All these promises these politicians make are just _____ in the sky. a) Pie b) Ocean c) Music d) Rags e) No correction required 23.The small amount of money donated is just a _____ in the ocean compared to the large sum of money needed. a) Spot b) Drop c) Speck d) Sea e) None of the above 24.They had had a dispute yesterday. That's why she gave him the cold _____. a) Arm b) Hand c) Shoulder d) Music e) None of the above 25.He has been successful in his life. He went from _____ to riches. a) Rags b) Shoulder c) Colours d) Poor e) None of the above Answers: 1) a 2) a 3) c 4) b 5) d 6) d 7) d 8) b 9) c 10) d 11) b 12) c 13) c 14) c 15) a 16) d 17) a 18) a 19) c 20) b 21) a 22) a 23) b 24) c 25) a -
పద్దుల పని పడితే అకౌంటింగ్ తేలికే!
పంచాయతీ కార్యదర్శి 2,677 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 23న నిర్వహించే పరీక్షకు లక్షల మంది హాజరు కానున్నారు. పరీక్షకు సంబంధించిన పేపర్-2లో నిర్దేశించిన అకౌంటింగ్ సిలబస్ పూర్తిగా కొత్తది. దీంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో అకౌంటింగ్‌లోని ప్రాథమిక అంశాలపై స్పెషల్ ఫోకస్.. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో నిర్దేశించిన విధులను పంచాయతీ కార్యదర్శి నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ విధుల్లో గ్రామ పంచాయతీ తీర్మానాలను అమలు చేయడం, పంచాయతీ విధించే పన్నులను వసూలు చేయడం వంటివి ఉన్నాయి. ఈ తరుణంలో పంచాయతీ కార్యదర్శికి ఖాతాల నిర్వహణపై అవగాహన ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే సిలబస్‌లో అకౌంటింగ్ విభాగాన్ని చేర్చారు. 150 మార్కులకున్న పేపర్-2 సిలబస్‌లో ఐదు విభాగాలున్నాయి. వీటిలో ఐదో విభాగం ‘అకౌంటింగ్తో సంబంధమున్న ప్రాథమిక అంశాలు’. దీన్నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో కచ్చితంగా చెప్పలేంగానీ గరిష్టంగా 30 ప్రశ్నలు రావొచ్చు. ఆ.ఇౌఝ, క.ఇౌఝ పూర్తిచేసిన వారికి ఈ విభాగం అనుకూలం. అయితే మిగిలిన వారు కొంత కష్టపడితే పూర్తిస్థాయి మార్కులు పొందొచ్చు. ఈ కింది అంశాలను అర్థం చేసుకుంటే అకౌంటింగ్‌కు సంబంధించిన విషయాలు తేలిగ్గా అర్థమవుతాయి. అకౌంటింగ్- ప్రాథమిక అంశాలు అకౌంటింగ్: అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ ప్రకారం.. ‘‘వ్యవహారాలను గుర్తించి, కొలచి, ఆర్థికపరమైన సమాచారం అందజేయడం ద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి సహకరించే ప్రక్రియే అకౌంటింగ్. బుక్ కీపింగ్: బుక్ కీపింగ్.. అకౌంటింగ్లో అంతర్భాగం. ఇది వ్యవహారాలను పుస్తకాల్లో నమోదుచేసి, వాటిని నిర్వహించేందుకు సంబంధించినది. బుక్ కీపింగ్‌లో చేసే పనులు: వ్యవహారాలను, సంఘటనలను గుర్తించడం. గుర్తించిన వ్యవహారాలను, సంఘటనలను సాధారణంగా ఉపయోగించే కొలమానంలో కొలవడం. గుర్తించిన, కొలచిన వ్యవహారాలను వాటి అనుబంధ ఖాతా పుస్తకాల్లో కాలక్రమంలో నమోదు చేయడం. నమోదు చేసిన వ్యవహారాలను, సంఘటనలను ఆవర్జాలో వర్గీకరించడం. అకౌంటింగ్ లాభాలు: ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం లేదా నష్టాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. సంస్థ ఆర్థిక స్థితిని తెలుసుకోవచ్చు. సంస్థ ఖాతా పుస్తకాల నిర్వహణ ద్వారా చట్టపరమైన నిబంధనను అమలు చేయొచ్చు. వ్యాపార కార్యక్రమాల ప్రణాళికల తయారీకి, నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. అకౌంటింగ్ విభాగాలు: 1. ఆర్థిక అకౌంటింగ్. 2. కాస్ట్ అకౌంటింగ్. 3. యాజమాన్య అకౌంటింగ్. అకౌంటింగ్ భావనలు: అందరికీ ఆమోదయోగ్యమైన అకౌంటింగ్ ప్రమేయాలను అకౌంటింగ్ భావనలుగా చెప్పొచ్చు. అవి: వ్యాపార అస్తిత్వ భావన, ద్రవ్య కొలమాన భావన, వ్యయ భావన, గతిశీల సంస్థ భావన, ద్వంద్వ భావన, అంశాల భావన, వసూలు భావన. వ్యాపార వ్యవహారాలను రెండు విధాలుగా నమోదు చేస్తారు. అవి.. ఒంటి పద్దు విధానం, జంట పద్దు. ఒంటి పద్దు విధానం: వ్యవహారాల నమోదు అశాస్త్రీయంగా, అసంపూర్తిగా ఉంటుంది. ఇందులో ఓ వ్యవహారానికి సంబంధించి రెండు అంశాలకు బదులు ఒక అం శం మాత్రమే (డెబిట్ లేదా క్రెడిట్) నమోదు చేస్తారు. జంట పద్దు విధానం: ఈ విధానాన్ని ఇటలీకి చెందిన లుకాపాసియాలో కనుగొన్నారు. ప్రతి వ్యవహారంలోనూ ఒక ఖాతాకు డెబిట్, మరో ఖాతాకు క్రెడిట్ చేస్తారు. ఇదే జంట పద్దు సూత్రం. ఖాతాలు- రకాలు: జంట పద్దు విధానంలోని వ్యవహారాలన్నింటినీ మూడు ఖాతాలుగా విభజించవచ్చు. అవి.. 1. వ్యక్తిగత ఖాతాలు. 2. వాస్తవ ఖాతాలు. 3. నామమాత్రపు ఖాతాలు. చిట్టా: ఇదొక పుస్తకం. ఇందులో వ్యాపార వ్యవహారాలను వాటి కాలానుగుణంగా నమోదు చేస్తారు. అన్ని వ్యవహారాలను తొలుత చిట్టాలో రాస్తారు. అందుకే దీన్ని తొలి పద్దు పుస్తకంగా పేర్కొంటారు. ఆవర్జా (లెడ్జర్): అకౌంటింగ్ చక్రంలోని రెండో దశ ఆవర్జా. ఇది వ్యక్తిగత, వాస్తవిక, నామమాత్రపు ఖాతాలకు సంబంధించిన వ్యవహారాల ఖాతాలను రాసే పుస్తకం. చిట్టాలో రాసిన అన్ని డెబిట్, క్రెడిట్ అంశాలన్నీ ఆవర్జాలో సంబంధిత ఖాతాలకు బదిలీ అవుతాయి. ఈ బదిలీ ప్రక్రియనే ఆవర్జా నమోదని అంటారు. ఆవర్జాను తుది పుస్తకమని పేర్కొంటారు. సహాయక చిట్టాలు: వ్యాపార వ్యవహారాలను, వాటి స్వభావాన్ని బట్టి వేర్వేరు పుస్తకాల్లో రాస్తారు. ఈ ప్రత్యేక పుస్తకాలనే సహాయక చిట్టాలంటారు. వీటిలో వివిధ రకాలున్నాయి. అవి.. కొనుగోలు చిట్టా, అమ్మకాల చిట్టా, కొనుగోలు వాపసుల చిట్టా, అమ్మకాల వాపుసుల చిట్టా, నగదు చిట్టా, వసూలు హుండీల చిట్టా, చెల్లింపు హుండీల చిట్టా, అసలు చిట్టా. బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక సాధారణంగా వ్యాపార సంస్థలు ఈ కింద పేర్కొన్న వాటి కోసం బ్యాంకులో ఖాతాను తెరుస్తాయి. అవి.. దొంగతనం అరికట్టడం, ఉద్యోగులు నిధులను దుర్వినియోగం చేయకుండా చూసేందుకు, చెల్లింపులు జరిపినట్లు సాక్ష్యాల కోసం, దూరప్రాంతాల్లో ఉన్నవారికి చెల్లింపులకు, వారి నుంచి వసూలుకు ఖాతాలు ఉపయోగపడతాయి. ఓవర్ డ్రాఫ్ట్: కొన్నిసార్లు వ్యాపార సంస్థకు తన బ్యాంకు ఖాతాలో ఉన్న నిల్వ కంటే ఎక్కువ మొత్తం అవసరమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఓవర్‌డ్రాఫ్ట్ రూపంలో బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటుంది. ఈ పరిస్థితిలో సంస్థకు బ్యాంకు రుణదాత అవుతుంది. ఈ రుణంపై సంస్థ వడ్డీ చెల్లించాలి. ఓవర్‌డ్రాఫ్ట్ అంటే వసూళ్ల కంటే చెల్లింపులు ఎక్కువగా ఉండటం. ముగింపు లెక్కలు: ఏడాది చివర్లో సంస్థ.. తన ఆర్థిక పరిస్థితిని ఆస్తి, అప్పుల పరంగా తెలుసుకునేందుకు ముగింపు లెక్కల్ని తయారు చేస్తుంది. లాభనష్టాలను తెలుసుకునేందుకు వర్తకపు, లాభనష్టాల ఖాతాను, ఆస్తి, అప్పుల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆస్తి, అప్పుల పట్టీని తయారు చేస్తుంది. వ్యాపార ఫలితాలు అంటే ఒక సంవత్సర కాలంలోని లాభాలు లేదా నష్టాలు. వీటిని లాభనష్టాల ఖాతాను తయారు చేసి తెలుసుకుంటారు. వాటినే ఆదాయపు పట్టిక అంటారు. ముగింపు లెక్కల వల్ల లాభాలు: 1.వ్యాపారపు ఆర్థిక ఫలితం (లాభమా? నష్టమా?) తెలుస్తుంది. 2.వ్యాపారపు ఆర్థిక పరిస్థితి (ఆస్తులు, అప్పులు) తెలుస్తుంది. 3.వ్యాపార ద్రవ్యత్వ పరిస్థితిని, ఆర్థిక పటిష్టతను గుర్తించవచ్చు. 4.పన్నులను లెక్కించేందుకు ఉపయోగపడుతుంది. తరుగుదల ఓ సంస్థ తాను దీర్ఘకాలం మనుగడలో ఉంటుందని భావిం చి తన వ్యవహారాలను నమోదు చేస్తుంది. దీన్నే గతిశీల సంస్థ భావన అంటారు. దీన్ని అనుసరించి సంస్థ ఆస్తులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. 1. స్థిరాస్తులు (భవనాలు, యంత్రాలు, ఫర్నిచర్ తదితరాలు). 2. చరాస్తులు (రుణగ్రస్తులు, సరుకు, వసూలు హుండీలు తదితరాలు). ఆస్తి విలువ క్రమేపీ తగ్గడాన్ని తరుగుదల అని అంటాం. తరుగుదల స్థిరాస్తులలోనే ఉంటుంది. అందువల్ల తరుగుదల అనే పదాన్ని స్థిరాస్తులకు సంబంధించి మాత్రమే ఉపయోగించాలి. తరుగుదలకు కారణాలు: అరుగు, తరుగు; లుప్తత; భౌతిక శక్తులు; కాలగమనం; ఉద్గ్రహణ. ఆస్తుల తరుగుదలను ఏర్పరిచేందుకు వివిధ పద్ధతులు అమల్లో ఉన్నాయి. కానీ, వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు తరుగుదలను ఏర్పరిచేందుకు సాధరణంగా రెండు ముఖ్యమైన పద్ధతులను ఉపయోగిస్తాయి. అవి.. 1. స్థిర వాయిదా పద్ధతి. 2. తగ్గుతున్న నిల్వల పద్ధతి. స్థిర వాయిదాల పద్ధతి: ఈ పద్ధతిలో ప్రతి సంవత్సరం ఆస్తి కొన్న ఖరీదుపై ఒక స్థిరమొత్తం లేదా కొంత శాతాన్ని ఆస్తి విలువ నుంచి తగ్గిస్తారు. ఆస్తి కొన్న ఖరీదుపై తరుగుదలను ఏటా లెక్కించడం వల్ల, అన్ని సంవత్సరాలకు తరుగుదల, మొత్తాలు స్థిరంగా ఉంటాయి. అందుకే దీన్ని స్థిరవాయిదాల పద్ధతి అంటారు. తగ్గుతున్న నిల్వల పద్ధతి: ఈ పద్ధతిలో మొదటి ఏడాది ఆస్తి కొన్న ఖరీదుపై తరుగుదలను లెక్కిస్తారు. మిగిలిన సంవత్సరాల్లో ఆస్తి తగ్గుతున్న నిల్వలపై మాత్రమే తరుగుదలను లెక్కిస్తారు. అందుకే దీన్ని నిల్వల పద్ధతిగా పేర్కొంటారు. కన్సైన్మెంట్ ఖాతాలు: టోకు వర్తకుడు, ఉత్పత్తిదారులు తమ వస్తువులను సౌకర్యవంతంగా, లాభదాయకంగా అమ్మాలంటే ఓ ప్రతినిధి అవసరం. ప్రతినిధి.. వర్తకుడు పంపిన సరుకును అమ్మి, తన సేవలకుగాను కొంత కమిషన్ పొందుతాడు. ఇలా ఒక ప్రాంతంలో ఉన్న వర్తకుడు తన సరుకులను వేరొక ప్రాంతంలో ఉన్న ప్రతినిధికి కమిషన్ మీద అమ్మకానికి పంపడాన్ని కన్సైన్మెంట్ అంటారు. సరుకు పంపే వ్యక్తిని కన్సైనర్ అని, సరుకు పొందిన వ్యక్తిని కన్సైనీ అని అంటారు. ఏజెంట్ ద్వారా సరుకులను అమ్మే విధానాన్ని కన్సైన్మెంట్ వ్యాపారంగా పేర్కొనవచ్చు. కమిషన్: కన్సైనర్.. తన సరుకులను అమ్మినందుకుగాను కన్సైనీకి చెల్లించిన ప్రతిఫలమే కమిషన్. ఇది ప్రధానంగా మూడు రకాలు. 1. సాధారణ కమిషన్. 2. అదనపు కమిషన్. 3. డెల్ క్రెడరీ కమిషన్. ముఖ్యాంశాలు వ్యాపారంలో వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టిన మొత్తం మూలధనం. నగదు లేదా సరుకులను యజమాని సొంతానికి వాడుకుంటే వాటిని సొంతవాడకాలు అంటారు. తొలి పద్దు పుస్తకాన్ని చిట్టా అంటారు. ఖాతాల సంపుటిని ఆవర్జాగా పేర్కొంటారు. వ్యాపార వ్యవహారాలను చిట్టా నుంచి ఆవర్జాకు బదిలీ చేయడాన్ని నమోదు అంటారు. మూలధనం, అప్పులను కలిపి ఆస్తులుగా వ్యవహరిస్తారు. ఆస్తులు, అప్పులకు మధ్యగల తేడా మూలధనం. మూలధనం వ్యక్తిగత ఖాతాకు చెందినది. నగదు వాస్తవిక ఖాతాకు చెందినది. జీతాలు నామమాత్రపు ఖాతాకు చెందినది. సహాయక చిట్టాలు ఎనిమిది రకాలు. రుణదాత రుణగ్రస్థునికి ఇచ్చే డిస్కౌంట్ నగదు డిస్కౌంట్. వర్తకుడు, కొనుగోలుదారునికి అమ్మకపు ధరపై ఇచ్చే తగ్గింపును వర్తకపు డిస్కౌంట్లు అంటారు. వర్తకపు డిస్కౌంటును ఖాతాపుస్తకాల్లో నమోదు చేయకూడదు. చిట్టా, ఆవర్జాగా ఉపయోగపడే పుస్తకాన్ని నగదు పుస్తకమని అంటారు. ఓవర్ డ్రాఫ్టు పద్ధతిలో నగదు పుస్తకంలో క్రెడిట్ నిల్వ చూపుతుంది. పాస్‌బుక్ క్రెడిట్ నిల్వ చూపే పద్ధతి అనుకూల నిల్వ పద్ధతి. మూలధన అంశాలను ఆస్తి, అప్పుల పట్టీలో నమోదు చేస్తారు. రాబడి అంశాలను లాభనష్టాల ఖాతాలో నమోదు చేస్తారు. ఫర్నిచర్ కొనుగోలును సాధారణ ఖర్చుల ఖాతాకు డెబిట్ చేయడాన్ని సిద్ధాంతపరమైన తప్పులు అంటారు. కన్సైనీ, కన్సైనర్కు పంపే నివేదికను అకౌంట్ సేల్స్ అంటారు. కన్సైన్మెంట్ ఖాతా నామమాత్రపు ఖాతాకు చెందినది. అకౌంటింగ్ సూత్రం ప్రకారం నమోదు చేయని వ్యవహారాలను సిద్ధాంతరపరమైన తప్పులుగా పేర్కొంటారు. వ్యవహారాలను పూర్తిగా నమోదు చేయకుండా వదిలేసిన తప్పులు ఆకృతి తప్పులు. కన్సైనీ ఖాతా వ్యక్తిగత ఖాతాకు చెందినది. ఆస్తి జీవితకాలం పూర్తయిన తర్వాత మిగులు విలువను తుక్కు విలువ లేదా అవశేషపు విలువ అని అంటారు. అసాధారణ నష్టాన్ని కన్సైన్మెంట్ ఖాతాలో క్రెడిట్ వైపున వేస్తారు. ఆస్తి విలువ మాత్రమే కాకుండా ఆస్తి ధరపై వడ్డీని కూడా పరిగణనలోకి తీసుకునే పద్ధతిని వార్షిక పద్ధతి అంటారు. కురుహూరి రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ హైదరాబాద్. -
భారత్‌లో ద్రవ్యోల్బణం.. సమగ్ర విశ్లేషణ
యునెటైడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) అధికారంలోకి వచ్చాక.. దేశంలో ద్రవ్యోల్బణం పరంగా నెలకొన్న పరిస్థితులు.. కారణాలు.. ప్రభుత్వం అనుసరించిన స్థూల ఆర్థిక దృక్పథం.. వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి, ఆర్థిక రంగంలో ప్రభావం చూపిన అంశాలపై విశ్లేషణ.. యూపీఏ ప్రభుత్వం 2004లో అధికారంలోకి రావడానికి ముందు ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 నుంచి 7 శాతంగా ఉండగలదని ముందస్తు అంచనాలు వెల్లడయ్యాయి. అయితే వాస్తవానికి 8 శాతానికిపైగా వృద్ధి నమోదైంది. 1979 నుంచి 2003-04 మధ్య సగటు వృద్ధి 5.7 శాతం. అదే సమయంలో తూర్పు ఆసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియాలతో పోల్చితే భారత్ వృద్ధి సాధనలో వెనుకంజలో నిలిచింది. 2003-04లో మొత్తం దేశ జనాభాలో 58 శాతం మందికి వ్యవసాయ రంగమే ఆధారంగా నిలిచింది. అదే సమయంలో జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 22 శాతంగా నమోదైంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధి 9.1 శాతంగా నమోదు కాగా, అది 2004-05లో 1.1 శాతానికి తగ్గడం గమనార్హం. నైరుతి రుతుపవనాలు తక్కువ వర్షపాతాన్ని కురిపించడంతో ఆ సమయంలో ఖరీఫ్ పంట ఉత్పత్తి క్షీణించింది. అక్టోబర్ 2003లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 6.2 శాతం వృద్ధి నమోదుకాగా, ఈ వృద్ధి అక్టోబర్ 2004లో 10.1 శాతానికి చేరింది. డిసెంబర్ 2004లో ఈ వృద్ధి క్షీణించడంతో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 8 శాతానికి తగ్గింది. 1996-97 తర్వాత 2000-01 మినహా మిగిలిన కాలంలో సేవారంగం స్థిరమైన వృద్ధిని సాధించింది. సేవా రంగానికి సంబంధించి 2004లో వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచార రంగంలో అధిక శాతం వృద్ధి నమోదైంది. మొత్తంగా యూపీఏ ప్రభుత్వం అధికారం చేపట్టడానికి ముందు సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ ఆశాజనకంగా ఉందని చెప్పొచ్చు. స్థూల ఆర్థిక దృక్పథం: యూపీఏ పాలన ప్రారంభానికి ముందు సంవత్సరంలో స్థిరధరల వద్ద (1993-94) స్థూల దేశీయోత్పత్తి 2003-04లో రూ.14,24,500 కోట్లుగా నమోదైతే, యూపీఏ ప్రభుత్వ హయాంలో జీడీపీ గణనీయంగా పెరిగింది. స్థిరధరల వద్ద (2004-05) 2007-08లో రూ. 38,96,636గా నమోదైన జీడీపీ.. 2012-13లో రూ. 55,03,476కు పెరిగింది. ప్రజల తలసరి ఆదాయంలోనూ గణనీయమైన పెరుగుదల సంభవించింది. స్థిరధరల వద్ద 2003-04లో తలసరి ఆదాయం రూ. 18,317 కాగా, 2011-12లో స్థిర ధరల వద్ద రూ. 38,037కు పెరిగింది. పెరిగిన తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణస్థాయిలో పెరుగుదలను సూచిస్తుంది. తలసరి ఆదాయంలో మెరుగుదల వినియోగ వ్యయం పెరగడానికి కారణమైంది. తద్వారా వస్తు, సేవల డిమాండ్‌లో పెరుగుదల నమోదైంది. సమష్టి డిమాండ్ కంటే సమష్టి సప్లయ్‌లో తగ్గుదల కారణంగా గత దశాబ్దంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు సంభవించాయి. 2003-04లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 210.8 మిలియన్ టన్నులు కాగా, తదుపరి కాలంలో ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. 2007-08లో 230.8 మిలియన్ టన్నులకు, 2012-13లో 250.1 మిలియన్ టన్నులకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఇదే కాలానికి సంబంధించి జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండటంతో డిమాండ్ కూడా పెరిగింది. ఈ అంశం ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడడానికి కారణమైంది. ద్రవ్య సరఫరా పెరుగుదలను ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడడానికి ముఖ్య కారణంగా పేర్కొనవచ్చు. విశాల ద్రవ్యంగా పరిగణించే ఎం-3లో గణనీయమైన వృద్ధి సంభవించింది. ఎం-3 వృద్ధి 2003-04లో 16.4 శాతంగా నమోదు కాగా, అది 2007-08లో 21.4 శాతానికి చేరుకుంది. 2009-10లో 16.8 శాతంగానూ నమోదైంది. ద్రవ్య సరఫరాలో పెరుగుదలకు అనుపాతంగా ఉత్పత్తిలో వృద్ధి నమోదుకాకుంటే ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విధమైన పరిస్థితిని యూపీఏ ప్రభుత్వ హయాంలో నిశితంగా గమనించవచ్చు. భారత్‌లో ద్రవ్యోల్బణ కొలమానమైన టోకుధరల సూచీ (డబ్ల్యూపీఐ) 2003-04లో 4.6శాతంగా నమోదు కాగా, ఆర్థిక సంక్షోభం తదుపరి కాలంలో ఈ సూచీలో పెరుగుదల సంభవించింది. 2008-09లో డబ్ల్యూపీఐ 8.1 శా తం, 2010-11లో 9.6శాతం, 2011-12లో 8.9 శాతం, 2012-13లో 7.6 శాతంగా నమోదైంది. ఇదే కాలానికి పారిశ్రామిక కార్మికులకు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీలోనూ పెరుగుదల సంభవించింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల పరపతిలోనూ గత పది సంవత్సరాలలో పెరుగుదల రేటు అధికంగా ఉంది. తద్వారా ద్రవ్య సరఫరా అధికమై ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ఎగుమతుల కంటే దిగుమతుల వృద్ధి అధికంగా ఉండటం కరెంట్ అకౌంట్ లోటు (current account deficit - CAD) పెరుగుదలకు దారితీసింది. ఇది రూపాయి విలువలో ఒడిదుడుకులకు కారణమైంది. ఈ స్థితి దిగుమతుల ధరల పెరుగుదలకు దారితీసింది. తద్వారా ఉత్పత్తి వ్యయాలు అధికమై ధరల పెరుగుదల అనివార్యమైంది. వేతన ఉపాధి పథకాల అమలు గ్రామీణ ప్రజల ఆర్థికస్థితిగతులను మెరుగుపరిచింది. దాంతో ఈ స్థితి సమష్టి డిమాండ్ పెరుగుదలకు దారితీసింది. వ్యవసాయరంగ అభివృద్ధి: 1990వ దశకం రెండో అర్ధభాగం నుంచి వ్యవసాయ రంగంలో వృద్ధి క్షీణించింది. 1987-88 నుంచి 1996-97 మధ్యలో వ్యవసాయ రంగం సగటు సాంవత్సరిక వృద్ధి 3.61శాతం కాగా, తదుపరి కాలంలో వృద్ధి మందగించింది. 1996-97 నుంచి 2005-06 మధ్య సగటు వృద్ధి 2.2 శాతానికి తగ్గింది. 2006-07 తర్వాత వ్యవసాయ రంగం కొంతమేర పురోగమించింది. 11వ ప్రణాళికలో పంట ఉత్పత్తి వృద్ధిలో కొంతమేర పెరుగుదల సంభవించింది. 2009-10లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు కాటకాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా గత దశాబ్దంలో అనేక పంటల ఉత్పత్తి వృద్ధిలో తేడా కంటే ఉత్పాదకత వృద్ధిలో తేడా (వేరియేషన్స) ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. కొన్ని పంటల కింద ఉన్న భూ విస్తీర్ణంలో పెరుగుదల సంభవిస్తే మరికొన్ని పంటల విస్తీర్ణంలో తగ్గుదల ఏర్పడింది. పప్పుధాన్యాల ఉత్పాదక పెరుగుదల సంతృప్తికరంగా లేదు. చెరుకు ఉత్పాదకత స్తంభించింది. వివిధ రాష్ట్రాల మధ్య వ్యవసాయరంగ ప్రగతిలోనూ తేడాలు గత దశాబ్దంలో అధికమయ్యాయి. 2004-05 ధరల వద్ద వ్యవసాయరంగంలో వార్షిక వృద్ధి సగటు గుజరాత్లో అత్యధికంగా 15 శాతంగా నమోదైంది. 2002-03 తర్వాత గుజరాత్ వ్యవసాయ రంగంలో అధిక వృద్ధి సాధించింది. తర్వాతి స్థానంలో ఛత్తీస్‌గఢ్ నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయరంగ సగటు సాంవత్సరిక వృద్ధి గత దశాబ్దంలో 6.1 శాతంగా నమోదైంది. వ్యవసాయ ఉత్పత్తిలో 4 శాతానికిపైగా వృద్ధి సాధించిన రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు నిలిచాయి. ఒడిశాలో వ్యవసాయ రంగ ఉత్పత్తి వృద్ధి 3 శాతానికి పరిమితం కాగా, గత దశాబ్దంలో జార్ఖండ్‌లో రుణాత్మక వృద్ధి నమోదైంది. ఉత్పాదకస్థాయి తక్కువగా ఉన్న కర్ణాటక, అసోంలలో వ్యవసాయ ఉత్పత్తిలో వృద్ధి 1 శాతంలోపు మాత్రమే నమోదైంది. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంపై ప్రభుత్వ రంగ పెట్టుబడులు జీడీపీలో 4 శాతానికి పెంచడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. 2004-05 నుంచి 2006-07 మధ్యలో వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరిగినప్పటికీ.. తదుపరి కాలంలో తగ్గుదల సంభవించింది. ఇటీవల కాలంలో ప్రైవేటు రంగ పెట్టుబడులు పెరిగిన కారణంగా మొత్తం వ్యవసాయ రంగంలో పెట్టుబడుల పెరుగుదలలో ప్రగతి సంభవించింది. పారిశ్రామిక వృద్ధిలో ఒడిదుడుకులు: 2002-03లో పారిశ్రామిక రంగంలో వృద్ధి 7 శాతంగా నమోదు కాగా, తొమ్మిదో ప్రణాళికలో సగటు వృద్ధి 5 శాతానికి తగ్గింది. 10వ ప్రణాళికలో సగటున 8.2 శాతం వృద్ధి సాధించిన పారిశ్రామిక రంగం 2008-09లో 2.7 శాతానికి పరిమితమైంది. గత రెండు సంవత్సరాలలో (2011-12, 2012-13) జీడీపీ వృద్ధి క్షీణించడానికి పారిశ్రామిక వృద్ధిరేటు తగ్గుదల కారణమైంది. 2011-12లో 3.5 శాతం, 2012-13లో 3.1 శాతం వృద్ధినే పారిశ్రామిక రంగం నమోదు చేసుకొంది. విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం వృద్ధిలోనూ ఇటీవల కాలంలో తగ్గుదల సంభవించింది. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి తగ్గిన కారణంగా వినియోగ వస్తువుల ఉత్పత్తి తగ్గడంతో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానమంత్రి అభిప్రాయం ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విజయవంతం కాలేకపోయిందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇటీవల అభిప్రాయపడ్డారు. సమ్మిళిత వృద్ధి సాధనలో భాగంగా ప్రభుత్వం అవలంబించిన విధానాల కారణంగా బలహీన వర్గాల ప్రజల వద్ద లభ్యమయ్యే ద్రవ్య పరిమాణం పెరగడం ద్రవ్యోల్బణం ఏర్పడడానికి ముఖ్య కారణంగా ఆయన పేర్కొన్నారు. ఆహార ద్రవ్యోల్బణంలో ఏర్పడిన నిరంతర పెరుగుదల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)లో పెరుగుదలకు కారణమైంది. ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ శాతం మంది ప్రజల ఆదాయంలో పెరుగుదల రేటు అధికమని ప్రధాని అభిప్రాయపడ్డారు. కూరగాయలు, పండ్లు వంటి ఉత్పత్తుల సరఫరా, మార్కెటింగ్‌ను మెరుగుపరిచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత మెరుగ్గా పని చేయాల్సి ఉందన్నారు. 2012-13లో వృద్ధి రేటు 5 శాతానికి పరిమితమైనప్పటికీ రాబోయే సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధి రేటు మెరుగుపడే అవకాశం ఉందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థికవృద్ధి మెరుగయ్యే సూచనల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్వదేశంలోని అవరోధాలను అధిగమించగలవని, తద్వారా వృద్ధిరేటు మెరుగుపడగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో భారత్‌తోపాటు వర్ధమాన దేశాల్లోనూ వృద్ధి మందగించిందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి తగిన చర్యలు తీసుకోవాలి. శ్రామిక శక్తికి అదనంగా తోడయ్యే అసంఖ్యాకమైన ప్రజలకు ఉత్పాదక ఉపాధి అందించి పేదరిక తగ్గుదలకు చర్యలు చేపట్టాలి. భారత్ ప్రస్తుతం వినియోగం నుంచి పెట్టుబడి వైపు తన దృష్టిని మరల్చాలి. ప్రభుత్వ రంగం పొదుపు, కుటుంబ రంగ పొదుపును పెంచడానికి తగిన చర్యలు అవసరం. స్థూల ఆర్థిక స్థిరీకరణ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలి. ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్‌లోటు, ద్రవ్యలోటు తగ్గించే చర్యలకు ప్రాధాన్యమివ్వాలి. వ్యవసాయ రంగానికి సంబంధించి వర్తక నిబంధనలను మెరుగుపరచడం, ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడుల పెంపు, సకాలంలో ఉత్పాదితాల సరఫరా, ఇతర సంస్థాపరమైన చర్యలు అవసరం. తయారీ రంగ వృద్ధి క్షీణత నివారణకు చర్యలు చేపట్టడం ద్వారా వినియోగ వస్తు ఉత్పత్తి వృద్ధిని ప్రోత్సహించాలి. డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. -
గ్రామాలను చిన్న గణతంత్ర దేశాలుగా అభివర్ణించింది?
1.చెన్నైలో గతేడాది డిసెంబర్లో ముగిసిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిందెవరు? 1) విశ్వనాథన్ ఆనంద్ 2) మాగ్నస్ కార్ల్సన్ 3) గ్యారీ కాస్పరోవ్ 4) క్రామ్నిక్ 2.ఏ నవలకుగాను 2012 సంవత్సరానికి రావూరి భరద్వాజకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు లభించింది? 1) పాకుడు రాళ్లు 2) వివుల 3) నా గొడవ 4) సొంత ఊరు 3.ఇటీవల భారత పోస్టల్ డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టుకు కేటాయించిన ప్రత్యేక పిన్‌కోడ్? 1) 110202 2) 202110 3) 110201 4) 110211 4.ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీగా నిలిచి అరవింద్ కేజ్రివాల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల గుర్తు? 1) కాగడా 2) చీపురు 3) తుపాకీ 4) బాణం 5.సచిన్ టెండూల్కర్‌తోపాటు భారతరత్నకు ఎంపికైన శాస్త్రవేత్త ? 1) ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు 2) ఎం.ఎస్.స్వామినాథన్ 3) యు.ఆర్.రావు 4) రాధాకృష్ణన్ 6.2013 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని ఎవరికి ప్రదానం చేశారు? 1) షేక్ హసీనా 2) జాన్సన్ సర్లీఫ్ 3) ఏంజెలా మెర్కల్ 4) హిల్లరీ క్లింటన్ 7.కబడ్డీ వరల్డ్ క ప్ పురుషుల, మహిళల టైటిల్స్‌ను గెలుచుకున్న జట్టు? 1) పాకిస్థాన్ 2) భారత్ 3) న్యూజిలాండ్ 4) ఆస్ట్రేలియా 8.లాల్తన్ హవ్లా 2013, డిసెంబర్ 14న ఏ రాష్ట్రానికి ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు? 1) ఛత్తీస్‌గఢ్ 2) త్రిపుర 3) అరుణాచల్‌ప్రదేశ్ 4) మిజోరాం 9.ఏ జిల్లాలో ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీసిటీ ఉంది? 1) మెదక్ 2) చిత్తూరు 3) రంగారెడ్డి 4) విశాఖపట్నం 10.వేర్వేరు సంగీత పరికరాల నుంచి వెలువడే ధ్వనిని వినడానికి ఉపయోగపడే ధ్వని లక్షణం? 1) తీవ్రత 2) పిచ్ 3) నాణ్యత 4) 1, 2 11.సాధారణ వాతావరణ పీడనం వద్ద పాదరస స్తంభం ఎత్తు? 1) 76 సెం.మీ. 2) 7.6 సెం.మీ. 3) 76 మీ.మీ. 4) 100 సెం.మీ. 12.రెండు నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం 18 గి, సమాంతరంగా తెలిపితే 4 గి అయితే ఆ నిరోధ విలువలు? 1) 9 W, 9 W 2) 6 W, 12 W 3) 4 W, 14 W 4) 3 W, 6 W 13.వేగుచుక్క, సాయంకాలం చుక్క అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? 1) బుధుడు 2) శుక్రుడు 3) కుజుడు 4) శని 14.న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం పనిచేసే సందర్భం? 1) సౌర వ్యవస్థలో మాత్రమే 2) భూమిపై వస్తువుల మధ్య 3) గ్రహాలలో మాత్రమే 4) విశ్వం మొత్తం 15.22 గ్రాముల కార్బన్డయాక్సైడ్ ఎన్ని మోల్లకు సమానం? 1) 1 మోల్ 2) 0.5 మోల్ 3) 2 మోల్స్ 4) 4 మోల్స్ 16.క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఐసోటోపు? 1) పాస్ఫరస్ 2) యురేనియం 3) సోడియం 4) కోబాల్ట్ 17.పాశ్చరైజేషన్ వల్ల దేన్ని ఎక్కువ కాలం నిల్వచేయవచ్చు? 1) పెరుగు 2) వెన్న 3) పాలు 4) నెయ్యి 18.గ్రీన్హౌస్ ఎఫెక్ట్ కలిగించే ప్రధాన వాయువు? 1) కార్బన్‌మోనాక్సైడ్ 2) కార్బన్డయాక్సైడ్ 3) సల్ఫర్‌డయాక్సైడ్ 4) నైట్రస్ ఆక్సైడ్ 19.శరీరంలో అతి ముఖ్య గ్రంథి? 1) అధివృక్కగ్రంధి 2) పిట్యుటరీ (పీయూష) 3) థైరాయిడ్ 4) పైవన్నీ 20.ఆర్నిథాలజీ దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం? 1) క్షీరదాలు 2) పాములు 3) మొసళ్లు 4) పక్షులు 21.PMR (ఆధార జీవక్రియరేటు)ను కొలిచే పరికరం ఏది? 1) స్పైరోమీటర్ 2) సూడోమీటర్ 3) నానోమీటర్ 4) ఏదీకాదు 22.మూడో నెల గర్భధారణ నుంచి ఎదిగే పిండాన్ని ఏమంటారు? 1) ఎంబ్రియో 2) భ్రూణం 3) జరాయువు 4) గర్భస్థశిశువు 23.మానవుడి కంటిలో శంఖువులు (కోన్స్), దండకణాల (రాడ్స్) నిష్పత్తి? 1) 15:1 2) 1:15 3) 1:4 4) 4:1 24.జ్వాలా కణం కలిగిన జీవి? 1) ప్లనేరియా 2) బొద్దింక 3) తేలు 4) సీ ఎనిమోన్స్ 25.భారతదేశ నదీ జలాల్లో ఎంత శాతం వున రాష్ట్రంలో ప్రవహిస్తున్నారుు? 1) 10 శాతం 2)15 శాతం 3) 20 శాతం 4) 25 శాతం 26.లక్షల సంవత్సరాల పూర్వం భూమి భౌగోళిక పరిస్థితిలో పరిణావు వరుస క్రవుం? 1)సవుుద్రాలు ఏర్పడడం-వుండుతున్న వాయుుగోళం-చల్లబడటం-వర్షం కురవడం 2)వర్షం కురవడం-చల్లబడటం-వుండుతున్న వాయుుగోళం-సవుుద్రాలు ఏర్పడటం 3)వుండుతున్న వాయుుగోళం- చల్లబడటం- వర్షం కురవడం- సవుుద్రాలు ఏర్పడటం 4)చల్లబడటం-వుండుతున్న వాయుుగోళం- వర్షం కురవడం- సవుుద్రాలు ఏర్పడటం 27.భారతదేశంలో జాతీయు చైతన్యం వృద్ధి చెందడానికి తగిన రాజకీయుపరమైన వేదికను సిద్ధం చేసినవి? 1) సావూజిక వుత సంస్కరణ ఉద్యవూలు 2) ఆర్థికపరమైన కారణాలు 3) రాజకీయు పరమైన సంస్కరణలు 4) విదేశీ విధానాలు 28.గ్రావు పంచాయుతీలకు ఏ పన్ను ప్రధాన ఆదాయుం? 1) వాహన పన్ను 2) ఇంటి పన్ను 3)ఎక్సైజ్ పన్ను 4) భూమి శిస్తు 29.స్థానిక సంస్థల ఏర్పాటు ప్రధాన లక్ష్యం? 1) పరిపాలన వ్యవహారాల్లో ప్రజల భాగస్వావ్యుం 2) రాజకీయు చైతన్యం 3) ప్రభుత్వ పథకాలపై అవగాహన 4) పైవేవీ కావు 30.ఒక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అరుున అంతివు వస్తుసేవల సవుుదాయూన్ని ఏవుంటారు? 1) జాతీయు ఉత్పత్తి 2) జాతీయాదాయుం 3) జాతీయు అభివృద్ధి 4) జాతీయు సరఫరా 31.మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని (2013) ఎప్పుడు నిర్వహించారు? 1) నవంబర్ 1-14 2) నవంబర్ 15-21 3) నవంబర్ 11-26 4) నవంబర్ 14-26 32.ఏ తేదీ తర్వాత జన్మించిన ఆడపిల్లలకు బంగారుతల్లి పథకం వర్తిస్తుంది? 1) జనవరి 1, 2013 2) మార్చి 1, 2013 3) మే 1, 2013 4) నవంబర్ 1, 2013 33. ఏడో విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2013, డిసెంబర్ 6న ఎక్కడ ప్రారంభించారు? 1) హైదరాబాద్ 2) మహబూబ్‌నగర్ 3) గుంటూరు 4) శ్రీకాకుళం 34.వందశాతం వైకల్యంగల పిల్లలకు పింఛన్ ను రూ. 500 లనుంచి ఎంతకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది? 1) రూ.700 2) రూ. 800 3) రూ. 900 4) రూ. 1000 35.భారతదేశ గ్రామాలను చిన్న గణతంత్రదేశాలు (రిపబ్లిక్లు)గా అభివర్ణించిందెవరు? 1) లార్డ్ రిప్పన్ 2) సర్ ఛార్లెస్ మెట్కాఫ్ 3) లార్డ్ మేయో 4) బెంటింక్ 36.గిరిజన ప్రాంతాల్లో స్వపరిపాలన కోసం మూడంచెల పాలన నిర్మాణాన్ని సిఫారసు చేసిన కమిటీ? 1) బల్వంత్రాయ్ మెహతా కమిటీ 2) అశోక్‌మెహతా కమిటీ 3) భూరియా కమిటీ 4) రాయల్ కమిటీ 37.స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు శిక్షణ పథకం (ట్రైజమ్)ను భారత ప్రభుత్వం 1979లో ప్రారంభించింది. ఇది ఏ వయసు వారికి వర్తిస్తుంది? 1) 15-35 2) 18-35 3) 18-50 4) అన్ని వయసుల వారికి 38.జనపనార మిల్లులు అధికంగా ఏ జిల్లాలో ఉన్నాయి? 1) మహబూబ్‌నగర్ 2) విజయనగరం 3) కృష్ణా 4) విశాఖపట్టణం 39.ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను సూచించిన కమిటీ? 1) మల్హోత్రా కమిటీ 2) ఎల్.కె.ఝా కమిటీ 3) నరసింహం కమిటీ 4) టెండూల్కర్ కమిటీ 40.8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వృత్తి విద్యా శిక్షణను ఇచ్చే పథ కం పేరేమిటి? 1) బాలకిరణాలు 2) రాజీవ్‌గాంధీ విద్యా యోజన 3) కిశోర బాలిక పథకం 4) అక్షర భారతి 41.అమ్మహస్తం పథకంలో లబ్ధి పొందేవారు సుమారుగా? 1) 1.25 కోటు 2) 1.50 కోట్లు 3) 1.75 కోట్లు 4) 2.25 కోట్లు 42.యువతను అసాంఘిక శక్తుల నుంచి, అప్రజాస్వామిక విధానాల నుంచి మళ్లించి సమాజ నిర్మాణంలో ప్రముఖపాత్ర వహించేలా చేయడానికి ఏర్పాటు చేసిన పథకం ఏమిటి? 1) యువశక్తి 2) యువకిరణాలు 3) అభయహస్తం 4) ఉద్యోగశ్రీ 43.కిందివాటిలో స్వచ్ఛమైన ఉచిత వస్తువు? 1) ఉద్యానవనాలు 2) సూర్యరశ్మి 3) గాలి 4) నీరు 44.నవజాత శిశువులకు పోషక విలువలుగల ఆహారం అందించే లక్ష్యంతో 2013 నవంబర్ 14న ప్రారంభించిన పథకం? 1) బంగారు తల్లి 2) బాల అమృతం 3) బాలకిరణాలు 4) కిశోర బాలిక 45.భూకమతాలకు సంబంధించిన సమాచారాన్ని ఏ సంవత్సరం నుంచి సేకరిస్తున్నారు? 1) 1951-52 2) 1956-57 3) 1960-61 4) 1970-71 46.ఆంధ్ర ప్రాంతంలో రబీ సీజన్‌ను ఏమని పిలుస్తారు? 1) దాళ్వా 2) సార్వా 3) అభి 4) తభి 47.విస్తరాకుల తయారీలో ఉపయోగించే మోదుగాకు అత్యధికంగా లభించే జిల్లా? 1) ఖమ్మం 2) ఆదిలాబాద్ 3) శ్రీకాకుళం 4) వరంగల్ 48.నిజాం తన సొంత ఖర్చులకు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్న భూములను ఏమని పిలుస్తారు? 1) జాగీర్ 2) దివాన్ 3) ఈనామ్ 4) సర్ఫేఖాస్ 49.ఆసియా ఖండంలో మొదటి రబ్బర్ డ్యామ్‌ను జంఝావతి నదిపై నిర్మించారు. ఇది ఏజిల్లాలో ఉంది? 1) విజయనగరం 2) కడప 3) శ్రీకాకుళం 4) చిత్తూరు 50.20 సూత్రాల పథకాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారు? 1) నాలుగు 2) ఐదు 3) ఆరు 4) ఏడు 51.మొక్కజొన్న పంట ప్రధానంగా ఏ ప్రాంతంలో పండుతుంది? 1) ఉత్తర తెలంగాణ 2) దక్షిణ తెలంగాణ 3) కోస్తా 4) రాయలసీమ 52.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏది? 1) సీఎస్ఓ 2) ఎన్ఎస్ఎస్ 3) ప్రణాళికాసంఘం 4) డీఈఎస్ 53.ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి ఐఐటీని ఎక్కడ ప్రారంభించారు? 1) నూజివీడు-కృష్ణా జిల్లా 2) ఇడుపులపాయ- వైఎస్ఆర్ జిల్లా 3)బాసర- ఆదిలాబాద్ జిల్లా 4) కంది-మెదక్ జిల్లా 54.కిసాన్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్? 1) 1090 2) 1050 3) 1551 4) 1881 55.చౌక ధరల దుకాణాలకు ప్రభుత్వం సరఫరా చేసే ఆహార ధాన్యాల ధరను ఏమని పిలుస్తారు? 1) కనీస మద్దతుధర (ఎమ్ఎస్పీ) 2) సేకరణధర 3) జారీ ధర 4) సబ్సిడీధర 56.వాన్‌పిక్ ప్రాజెక్టు ఏజిల్లాలకు సంబంధించింది? 1) కృష్ణా-గుంటూరు 2) గుంటూరు- ప్రకాశం 3) తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి 4) అనంతపురం-కర్నూలు 57.భారతదేశంలో వ్యవసాయ రాయితీలో అతిపెద్ద విభాగం ఏది? 1) విత్తనాల రాయితీ 2) ఎరువుల రాయితీ 3) పురుగుమందుల రాయితీ 4) ఆహార పదార్థాల రాయితీ 58.2013, ఏప్రిల్ 11న హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రారంభించిన ‘అమ్మహస్తం’ పథకంలో ఎన్ని నిత్యా వసర వస్తువులను తెల్లకార్డుదారులు పొందవచ్చు? 1) 9 2) 10 3) 11 4) 12 59.ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ను ప్రవేశపెట్టినపుడు అప్పటి ముఖ్యమంత్రి? 1) బూర్గుల రామకృష్ణ 2) బెజవాడ గోపాలరెడ్డి 3) నీలం సంజీవరెడ్డి 4) ఎన్టీ రామారావు 60.కృష్ణానదీ జలాల వివాదం ఏఏ రాష్ట్రాల మధ్య సాగుతుంది? 1) ఆంధ్రప్రదేశ్-ఒడిశా 2) ఆంధ్రప్రదేశ్-తమిళనాడు 3) ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ 4) ఆంధ్రప్రదేశ్- కర్ణాటక 61.ప్రస్తుతం తండ్రి వయసు, కొడుకు వయసుకు ఐదు రెట్లు. మూడు సంవత్సరాల క్రితం తండ్రి వయసు, కొడుకు వయసుకు 8 రెట్లు. అయితే ప్రస్తుతం తండ్రి, కొడుకుల వయసులు ఎంతెంత? 1) 30 సంవత్సరాలు, 6 సంవత్సరాలు 2) 35 సం, 7 సంవత్సరాలు. 3) 40 సంవత్సరాలు, 8 సంవత్సరాలు 4) 50 సంవత్సరాలు, 9 సంవత్సరాలు 62.అ/3 = ఆ/4 = ఇ/5 అయితే అ:ఆ:ఇ నిష్పత్తి ఎంత? 1) 3:4:5 2) 5:4:3 3) 4:15:12 4) ఏదీకాదు 63.40 లీటర్ల మిశ్రమంలో పాలు, నీళ్లు 3:1 నిష్పత్తిలో కలవు. అందులో ఎన్ని లీటర్ల నీరు పోస్తే వాటి నిష్పత్తి 1:1 అవుతుంది? 1) 10 లీ. 2) 20 లీ 3) 30 లీ 4) 40లీ 64.‘ఎ’ అనేవాడు ఒక పనిని 20 రోజుల్లో , ‘బి’ అనేవాడు అదే పనిని 24 రోజులలో పూర్తి చేస్తారు. ఇద్దరు కలిసి పని ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత ‘ఎ’ పని నుంచి తప్పుకున్నాడు. మిగిలిన పనిని ‘బి’ ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు? 1) 10 రోజులు 2) 11 రోజులు 3) 12 రోజులు 4) 13 రోజులు 65.ఒక నీటి ట్యాంకును మొదటి కుళాయి 20 నిమిషాలలో, రెండో కుళాయి 40 నిమిషాలలో నింపగలవు. ట్యాంకు కింద చిన్న రంధ్రం ఉండటం వల్ల పూర్తిగా నిండి ఉన్న ట్యాంకు 60 నిమిషాలలో ఖాళీ అవుతుంది. అయితే రెండు కుళాయిలు ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది? 1) 17 1/7 నిమిషాలు 2) 19 2/7 నిమిషాలు 3) 20 నిమిషాలు 4) ఎప్పటికీ నిండవు 66.6 మొదటి 12 గుణిజాల సరాసరి ఎంత? 1) 6 2) 12 3) 26 4) 39 67.క్రికెట్బ్యాట్స్మన్ తను ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు వరుసగా 72, 64ూ, 58, 80ూ, 76, 90, 80. అయితే అతని సరాసరి పరుగులెన్ని? (ూ అంటే ఔట్ కాలేదు) 1) 74.28 2) 104 3) 118 4) 84 68.400 మీ. పొడవున్న రైలు గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే, వ్యతిరేకదిశలో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక బాలుడ్ని, ఆ రైలు ఎంత సమయంలో దాటుతుంది? 1) 8 సెకన్లు 2) 10 సెకన్లు 3) 12 సెకన్లు 4) 16 సెకన్లు 69.ఒక వ్యక్తి 25 మీటర్/సెకన్ వేగంతో ప్రయాణిస్తూ తన గమ్యాన్ని రెండు గంటలలో చేరుకున్నాడు. అయితే అతను ప్రయాణించిన దూరం ఎంత? 1) 50 మీటర్లు 2) 50 కి.మీ 3) 180 మీటర్లు 4) 180 కి.మీ 70.ఒక వ్యక్తి తన ఇంటినుంచి ఆఫీస్‌కు 30 కి.మీ./గంట వేగంతో ఆఫీస్ నుంచి ఇంటికి 60 కి.మీ./గంట గంట వేగంతో ప్రయాణిస్తే అతని సరాసరి వేగం ఎంత? 1) 40 కి.మీ./గంట 2) 45 కి.మీ./గంట 3) 30 కి.మీ./గంట 4) 35 కి.మీ./గంట 71.ఒక వ్యాపారి 10 వస్తువులు అమ్మడం వల్ల రెండు వస్తువుల అమ్మకపు వెలకు సమానమైన లాభాన్ని పొందాడు. అయితే లాభశాతమెంత? 1) 10 శాతం 2) 20 శాతం 3) 25 శాతం 4) 30 శాతం 72.ఒక వ్యాపారి వస్తువు కొన్న వెల కంటే 30 శాతం అధికంగా ధర ముద్రించి 10 శాతం డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే అతనికి ఎంత శాతం లాభం వస్తుంది? 1) 20 శాతం 2) 17 శాతం 3) 15 శాతం 4) 40 శాతం 73.50, 80ల మధ్యలో 9తో భాగించబడుతూ, 3తో భాగించబడని సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 1) 1 2) 2 3) 3 4) ఏమీలేవు 74.902కు ఏ కనిష్టసంఖ్యను కలిపితే అది 9తో నిశ్శేషంగా భాగిస్తుంది? 1) 4 2) 5 3) 6 4) 7 75.40 మీ., 30 మీ. పొడవు, వెడల్పులు గల ఒక దీర్ఘచతురస్రాకారపు పొలం చుట్టూ 5 మీ. వెడల్పుతో బయట వైపు రోడ్డు వేస్తే ఆ రోడ్డు వైశాల్యం ఎంత? 1) 375 చ.మీ 2) 400 చ.మీ 3) 600 చ.మీ 4) 800 చ .మీ 76.ఒక ట్రెపీజియమ్ (సమలంబ చతుర్భుజం) రెండు సమాంతర భుజాలు వరుసగా 22 మీటర్లు, 33మీటర్లు. దాని వైశాల్యం 1210 చ.మీ. అయితే రెండు సమాంతర భుజాల మధ్యదూరం ఎంత? 1) 44 మీ. 2) 33 మీ. 3) 22 మీ. 4) 11 మీ. 77.సమబాహు చతుర్భుజం రెండు కర్ణాలు వరుసగా 6మీ, 8మీ. దాని చుట్టుకొలత ఎంత? 1) 48మీ 2) 40 మీ 3) 20మీ 4) 28మీ 78.కొంత అసలు బారువడ్డీ ప్రకారం నాలుగు సంవత్సరాలలో రెట్టింపు అయింది. ఆవడ్డీ రేటు ఎంత? 1) 10 శాతం 2) 20 శాతం 3) 25 శాతం 4) 35 శాతం 79.రఘు ఒక వ్యక్తి నుంచి రూ.6 వేలను బారువడ్డీ ప్రకారం సంవత్సరానికి 10 శాతం చొప్పున తీసుకొని, వెంటనే ఆ మొత్తాన్ని తన మిత్రునికి 13 శాతం వడ్డీ రేటు చొప్పున బారువడ్డీ ప్రకారం ఇచ్చాడు. అయితే రెండు సంవత్సరాలలో రఘుకు ఎంత లాభం వస్తుంది? 1) రూ. 400 2) రూ. 360 3) రూ. 1,200 4) రూ. 1,560 80. రూ. 1,250 సంవత్సరానికి 20 శాతం వడ్డీరేటు చొప్పున మూడేళ్లకు ఎంత చక్రవడ్డీ అవుతుంది? 1) రూ. 1,000 2) రూ. 960 3) రూ. 910 4) రూ. 600 81.6, 8, 10 లచే నిశ్శేషంగా భాగించబడే నాలుగు అంకెల గరిష్ఠసంఖ్య ఏది? 1) 9980 2) 9960 3) 9840 4) 9720 82.ఏ కనిష్ట సంఖ్యకు నాలుగు కలిపితే వచ్చే సంఖ్య 10, 15, 20 లచే నిశ్శేషంగా భాగించబడుతుంది? 1) 52 2) 56 3) 64 4) 72 83.ఒక యంత్రం ప్రస్తుత విలువ రూ.10,000. ఆ యంత్రం ప్రతి ఏటా తన విలువలో 10 శాతం కోల్పోతున్నట్ల యితే రెండేళ్ల తర్వాత యంత్రం విలువ ఎంత? 1) రూ. 8,000 2) రూ. 8,100 3) రూ. 8,500 4) రూ. 9,000 84.ఎ, బిల నెలసరి వేతనాల నిష్పత్తి 5:6. వారిద్దరికీ 10శాతం ఇంక్రిమెంట్ ఇస్తే వారి కొత్త వేతనాల నిష్పత్తి ఎంత? 1) 5:6 2) 6:5 3) 3:4 4) 4:7 85.20% 400 - 30% 120 విలువ ఎంత? 1) 34 2) 44 3) 42 4) 38 86.ఒక చతురస్ర కర్ణం 10 మీటర్లు. అయితే దాని వైశాల్యం ఎంత? 1) 100 చ.మీ 2) 75 చ .మీ 3) 50 చ.మీ 4) 45 చ.మీ 87.ఎ, బి లు వరుసగా రూ. 4 లక్షలు, రూ. 5 లక్షల పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించారు. సంవత్సరం చివర వారికి రూ. 45 వే లు లాభం వస్తే అందులో ఎ వాటా ఎంత? 1) రూ. 20 వేలు 2) రూ. 21వేలు 3) రూ. 22 వేలు 4) రూ. 30వేలు 88.రాము రూ. 6 వేల పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించాడు. 4 నెలల తర్వాత రాజు రూ. 10 వేల పెట్టుబడితో ఆ వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివర వారి లాభాల నిష్పత్తి ఎంత? 1) 3:5 2) 3:2 3) 9:10 4) 15:17 89.40 శాతాన్ని సామాన్య భిన్నంగా రాస్తే....? 1) 5/2 2) 2/5 3) 1/4 4) 3/4 90.0.23 ణ 0.4 =? 1) 9.2 2) 0.92 3) 0.092 4) 0.0092 91.’అ’, ’ఆ’ లు సోదరులు. ’ఇ’, ’ఈ’ లు సోదరీమణులు. ’అ’ కూతురు ’ఇ’ ఐతే ’ఈ’ కి ’అ’ ఏమవుతారు? 1) తండ్రి 2) పెదనాన్న 3) కొడుకు 4) సోదరుడు 92.ఒక కోడ్ భాషలో RED ను TGF గా రాస్తే, అదే కోడ్ భాషలో KY ని ఏ విధంగా రాస్తారు? 1) ULZ 2) UMA 3) VNB 4) RJX 93.ఒక వ్యక్తి దక్షిణ దిశలో 5 కి.మీ ప్రయాణించి ఎడమవైపు 10 కి.మీ ప్రయాణించాడు. తర్వాత ఎడమవైపు 5 కి.మీ ప్రయాణించి చివరగా కుడివైపు 12 కి.మీ ప్రయాణించాడు. ఇప్పుడతను తన ప్రారంభ స్థలం నుంచి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? 1) 22 కి.మీ. తూర్పు 2) 22 కి.మీ. పడమర 3) 2 కి.మీ. తూర్పు 4) 2 కి.మీ. పడమర 94.A, E, I, _, U 1) J 2) N 3) O 4) W 95.2, 10, 30, 68, 130, .....? 1) 200 2) 210 3) 216 4) 222 96.4 గంటల 10 నిమిషాల సమయంలో అద్దంలో ప్రతిబింబించే సమయం ఎంత? 1) 7 గంటల 50 నిమిషాలు 2) 6 గంటల 50 నిమిషాలు 3) 7 గంటల 10 నిమిషాలు 4) 6 గంటలు 10 నిమిషాలు 97. 2 4 6 3 1 4 6 5 4 2 4 6 1 5 4 6 2 అమరికలో 4 కంటే ముందు బేసిసంఖ్య, 4 తర్వాత 6 ఉండే విధంగా ఎన్ని 4లు కలవు? 1) 4 2) 3 3) 2 4) 1 98.40 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో రాజు అనే విద్యార్థి పై నుంచి నాలుగో ర్యాంకు సాధిస్తే కింది నుంచి అతని ర్యాంకు ఎంత? 1) 35 2) 36 3) 37 4) 38 99.పరుగెత్తడం : అలసిపోవడం :: చిచిచిచి:చిచిచిచి 1) ఉపాధ్యాయుడు : విద్యార్థి 2) జింక : జంతువు 3) ఉపవాసం : ఆకలి 4)ై పెవన్నీ 100. కిందివాటిలో భిన్నంగా ఉన్న దాన్ని కనుక్కోండి? 1) 1 2) 64 3) 729 4) 1296 జవాబులు 1) 2 2) 1 3) 3 4) 2 5) 1 6) 3 7) 2 8) 4 9) 2 10) 3 11) 1 12) 2 13) 2 14) 4 15) 2 16) 4 17) 3 18) 2 19) 2 20) 4 21) 1 22) 2 23) 1 24) 1 25) 2 26) 3 27) 1 28) 2 29) 1 30) 1 31) 3 32) 3 33) 1 34) 4 35) 2 36) 3 37) 2 38) 2 39) 3 40) 1 41) 4 42) 1 43) 2 44) 2 45) 1 46) 1 47) 3 48) 4 49) 1 50) 2 51) 1 52) 4 53) 4 54) 3 55) 3 56) 2 57) 2 58) 1 59) 3 60) 4 61) 2 62) 1 63) 2 64) 4 65) 1 66) 4 67) 2 68) 4 69) 4 70) 1 71) 3 72) 2 73) 4 74) 4 75) 4 76) 1 77) 3 78) 3 79) 2 80) 3 81) 2 82) 2 83) 2 84) 1 85) 2 86) 3 87) 1 88) 3 89) 2 90) 3 91) 1 92) 2 93) 1 94) 3 95) 4 96) 1 97) 3 98) 3 99) 3 100) 4 రూపొందించినవారు ఎ.శ్రీనివాసులు రెడ్డి - కరెంట్ అఫైర్స బి. శ్రీనివాస్ - సోషల్ స్టడీస్ ఎస్. సత్యనారాయణ - బయాలజీ నాగరాజశేఖర్ - ఫిజికల్ సైన్స అల్లాడి అంజయ్య - గ్రామీణాంశాలు బి. రవిపాల్ రెడ్డి - అర్థమెటికల్, లాజికల్ రీజనింగ్ -
ఉద్యోగానికి గ్యారెంటీ వెటర్నరీ సైన్స్
శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు లక్ష్యం? పశువైద్య విద్యలో నాణ్యత పెంచి, తద్వారా పశుగణాభివృద్ధిలో పురోగతి సాధించాలనే లక్ష్యంతో 2005 లో నాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అత్యుత్తమ ప్రమాణాలతో వెటర్నరీ కోర్సులను అందించడంతో పాటు పరిశోధన ఫలితాలను, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం.. పశుగణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం.. డెయిరీ టెక్నాలజీ, ఫిషరీ రంగాన్ని అభివృద్ధి చేయడం.. శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యాలు. ఆ లక్ష్య సాధనలో ఆశాజనకంగా ముందుకు సాగుతున్నాం. దాంతోపాటు పశుసంవర్థ్ధక శాఖ క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. పాలిటెక్నిక్ వెటర్నరీలో ప్రవేశానికి అర్హతలేమిటి? ఈ కోర్సును అందిస్తున్న కళాశాలలేవి? శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 10 యానిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కాలేజీలు; ఒక ఫిషరీ పాలిటెక్నిక్ ఉన్నాయి. యానిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కాలేజీల్లో.. ఒక్కోదానిలో 20 చొప్పున మొత్తం 200 సీట్లు ఉన్నాయి. డిప్లొమా ఇన్ యానిమల్ హజ్బెండరీ కోర్సులో చేరడానికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల ప్రాతిపదికన ప్రవేశం కల్పిస్తారు. కోర్సు కాలవ్యవధి రెండు సంవత్సరాలు. కోర్సులో భాగంగా విద్యార్థులకు సబ్జెక్టు థియరీతోపాటు ప్రాక్టికల్ పరిజ్ఞానం కూడా కల్పిస్తారు. విద్యార్థులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తాం. ఫిషరీ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్ని సీట్లున్నాయి? అర్హతలు, ప్రవేశ ప్రక్రియ వివరాలు తెలపండి? వీటి సంఖ్యను పెంచే అవకాశం ఉందా? కృష్ణా జిల్లాలోని భావదేవరపల్లిలో మాత్రమే ఫిషరీ సైన్స్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇందులో 30 సీట్లు ఉన్నాయి. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థుల నుంచి డిమాండ్ పెరిగితే సీట్ల సంఖ్యను పెంచుతాం. వెటర్నరీ, ఫిషరీ సైన్స్‌లో డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ కోర్సులు చేసేందుకు అవకాశముంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలను దక్కించుకోవచ్చు. ఫిషరీ సైన్స్‌లో పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆక్వారంగంలో, ప్రైవేట్ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ (బీవీఎస్సీ) కోర్సును అందించే కళాశాలలు ఎన్ని ఉన్నాయి? ఈ కోర్సులో ప్రవేశానికి అర్హతలు ఏమిటి? మన రాష్ట్రంలో తిరుపతి, రాజేంద్రనగర్ (హైదరాబాద్), గన్నవరం (కృష్ణా జిల్లా), ప్రొద్దుటూరు (వైఎస్ఆర్ జిల్లా), కోరుట్ల (కరీంనగర్ జిల్లా)లో వెటర్నరీ కళాశాలలున్నాయి. వీటిలో తిరుపతి, రాజేంద్రనగర్, గన్నవరం వెటర్నరీ కళాశాలల్లో ఒక్కోదాంట్లో 60 చొప్పున మొత్తం 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రొద్దుటూరు, కోరుట్లలోని కళాశాలల్లో సుమారు 30 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా అదనంగా 30 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఎన్ఆర్ఐ కోటాలో ఒక్కొక్క కళాశాలకు 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా బీవీఎస్సీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. బీవీఎస్సీ కోర్సులు పూర్తిచేసిన వారికి ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా అవకాశాలు ఏమిటి? బీవీఎస్సీ పూర్తిచేసి ఉద్యోగం లభించక ఖాళీగా ఉండే పరిస్థితి ఎంతమాత్రం లేదని చెప్పొచ్చు. బీవీఎస్సీ పూర్తిచేసిన వారికి వెంటనే పశుసంవర్థ్ధక శాఖలో ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత విద్యాపరంగా చూస్తే.. ఎంవీఎస్సీ, పీహెచ్డీ కోర్సులు చేయవచ్చు. బ్యాచిలర్ స్థాయిలో ఎన్ని ఫిషరీ కళాశాలలు ఉన్నాయి. ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి? నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరులోని ఫిషరీ సైన్స్ కళాశాల మాత్రమే బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ కోర్సును అందిస్తుంది. ఇందులో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. డిమాండ్‌ను బట్టి సీట్ల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఫిషరీ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు మత్స్య శాఖలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే ప్రైవేటు కంపెనీల్లో కూడా అవకాశాలను దక్కించుకోవచ్చు. ఆసక్తి ఉంటే సంబంధిత విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. బీటెక్ డెయిరీ టెక్నాలజీ కోర్సు, కళాశాలల వివరాలు తెలపండి? బీటెక్ డెయిరీ టెక్నాలజీ కోర్సును తిరుపతి, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని డెయిరీ టెక్నాలజీ కళాశాలలు అందిస్తున్నాయి. ఒక్కో కళాశాలలో సుమారు 30 సీట్ల చొప్పున మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్ (ఎంపీసీ) ర్యాంక్ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డెయిరీ, వెటర్నరీ, ఫిషరీలో పీజీ కోర్సులకు సంబంధించి ప్రవేశ ప్రక్రియ వివరాలు తెలపండి? వెటర్నరీకి సంబంధించి పీజీ కోర్సు.. ఎంవీఎస్సీని తిరుపతి, రాజేంద్రనగర్, గన్నవరంలోని వెటర్నరీ కళాశాలలు అందిస్తున్నాయి. ఈ మూడు కళాశాలల్లో కలిపి 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఆయా కాలేజీల్లో అడ్మిషన్ కల్పిస్తారు. అలాగే ఫిషరీ సైన్స్‌లో పీజీ కోర్సును ముత్తుకూరు (నెల్లూరు జిల్లా)లోని ఫిషరీ కళాశాల అందిస్తుంది. ఈ కోర్సుకు సంబంధించి 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. యూనివర్సిటీ పరిధిలో ఎన్ని పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి? వీటి స్థాపన ప్రధాన ఉద్దేశం ఏమిటి? తెలంగాణ ప్రాంతంలో నాలుగు, సీమాంధ్రలో తొమ్మిది పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. పరిశోధనలు నిర్వహించడం, అరుదైన పశు జాతులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవడం వీటి ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వెటర్నరీ కళాశాలలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) గుర్తింపు ఉందా? కళాశాలల సంఖ్యను పెంచే అవకాశం ఉందా? ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వెటర్నరీ కళాశాలలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) గుర్తింపు లభించింది. ప్రస్తుతానికి కళాశాలల సంఖ్య పెంచే ఆలోచన లేదు. పశు సంపదకు సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? వాటి ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? తెలంగాణలో ఒకటి, సీమాంధ్రలో ఒకటి కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. రైతులకు పశుపోషణలో శిక్షణ ఇవ్వడం, కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని పశుపోషణపై అవగాహన కల్పించడం వీటి ప్రధాన లక్ష్యాలు. వెటర్నరీ సైన్స్, ఫిషరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నారా? ఏ సంస్థలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి? వెటర్నరీ విద్యార్థులకు కోర్సు పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. గెజిటెడ్ హోదాలో ఉద్యోగంలో చేరుతున్నారు. అలాగే ఫిషరీసైన్స్, డెయిరీ టెక్నాలజీ విద్యార్థులకు కూడా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించడంలేదు. కొన్ని బ్యాంక్‌లు, ఇతర సంస్థలు సంబంధిత క్యాంపస్‌లను సందర్శించి తమకు కావాల్సిన విద్యార్థులను నియమించుకుంటున్నాయి. ప్రపంచంలో మన దేశం పాల ఉత్పత్తిలో, పశుసంపదలో అగ్రస్థానంలో ఉంది. ఈ స్థానాన్ని నిలుపుకునే క్రమంలో ఒంగోలు జాతి, ముర్రా జాతి గేదెలు మొదలైన వాటి సంరక్షణ కు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒంగోలు, ముర్రా జాతి పశు సంపదలు నశించి పోకుండా నాలుగు కేంద్రాల్లో ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టాం. గుంటూరు జిల్లాలోని లాంఫాం, పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి, ప్రకాశం జిల్లా చదలవాడ, కర్నూలు జిల్లాలోని మహానందిలో ఒంగోలు జాతి పశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆ జాతి నశించకుండా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే వెంకటరామన్నగూడెంలో ముర్రాజాతి పశువుల సంరక్షణకు సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పాం. పుంగనూరు జాతి పశువులు అంతరించకుండా.. పుంగనూరులో ఫాం ఏర్పాటుచేసి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. విదేశీ విశ్వవిద్యాలయాలు ఆయా ప్రాంతాల్లో అంతరించిపోతున్న పశుజాతుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. వెటర్నరీ యూనివర్సిటీ ఇలాంటి కార్యక్రమాలను చేపడుతుందా? రాష్ట్ర పశుసంవర్థక శాఖ సహాయంతో కృత్రిమ గర్భధారణ పద్ధతులను చేపడుతున్నాం. తద్వారా అరుదైన ఒంగోలు, పుంగనూరు జాతి పశువుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికీ మనదేశంలో ఎక్కువ మంది పశుపోషణ అంటే కోళ్లు, మేకలు, గొర్రెలు, కుందేళ్లు, గిన్నెకోళ్లు, ఆవులు, ఎద్దులు, గేదెలు, పందులు, చేపలు, రొయ్యల పెంపకంపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? పశుజాతి అభివృద్ధి కోసం వాటికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి? అనే విషయంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విశ్వవిద్యాలయ విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా పశుపోషణపై రైతులకు శిక్షణ ఇస్తున్నాం. -ప్రొఫెసర్ పి.సుధాకర్ రెడ్డి, రిజిస్ట్రార్, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ. ప్రపంచంలోనే అత్యధిక పశు సంపద కలిగిన దేశంగా భారత్ గుర్తింపు సాధించింది. ప్రపంచ పశు జనాభాలో భారత్ వాటా 15 శాతం. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పశు పరిశ్రమ వాటా ఎనిమిది శాతం. దేశంలో వెటర్నరీ కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు: ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)- ఇజత్‌నగర్; సీసీఎస్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (హిసార్); బాంబే వెటర్నరీ సైన్స్ కాలేజ్ (ముంబై); ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఆనంద్). బీవీఎస్సీ పూర్తిచేసి ఉద్యోగం లభించక ఖాళీగా ఉండే పరిస్థితి ఎంతమాత్రం లేదని చెప్పొచ్చు. ఇటు ప్రభుత్వ, అటు ైప్రైవేటు రంగంలోనూ మెరుగైన అవకాశాలుంటాయి. ఉన్నత విద్యాపరంగా చూస్తే.. ఎంవీఎస్సీ, పీహెచ్డీ కోర్సులు చేయవచ్చు. బి.హరిమల్లికార్జున రెడ్డి, న్యూస్‌లైన్, యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి) -
మెరుగైన మార్కులకు మార్గాలు..
ఇంజనీర్, సైంటిస్ట్.. ఇలా రకరకాల ఆశలు, ఆశయాలు. వీటిని నెరవేర్చుకునేందుకు ఇంటర్ ఎంపీసీ తొలి సోపానం! దీన్ని అధిక మార్కులతో దిగ్విజయంగా పూర్తిచేసి, కోరుకున్న కెరీర్ దిశగా అడుగులు వేయొచ్చు. ఎంసెట్, జేఈఈలో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఉన్న నేపథ్యంలో ఎంపీసీ సెకండియర్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కుల సాధనకు ప్రిపరేషన్ ప్రణాళిక.. ఇంటర్ సెకండియర్ ఎంపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ముఖ్యమైనవి. మార్కుల పరంగా చూస్తే మ్యాథమెటిక్స్‌కు 150 మార్కులు, ఫిజిక్స్‌కు 60 మార్కులు, కెమిస్ట్రీకి 60 మార్కులు కేటాయించారు. విద్యార్థులు ఇప్పటి వరకు ఒకవైపు అకడమిక్ పరీక్షలకు సిద్ధమవుతూ, మరోవైపు ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమై ఉంటారు. ఇప్పటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలపై పూర్తిగా దృష్టిసారించాలి. విద్యార్థులు మ్యాథ్స, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే లక్ష్యంగా కాకుండా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలన్న లక్ష్యంతో చదివినప్పుడే మంచి ఫలితం ఉంటుంది. కీలకం- సెకండియర్: మొదటి ఏడాదితో పోలిస్తే ద్వితీయ సంవత్సరం కీలకమైనది. విద్యార్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో వీలైనన్ని మోడల్ టెస్ట్‌లు రాయడంతో పాటు గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం, జేఈఈ మెయిన్‌లో 40 శాతం వెయిటేజీ ఉంది. అడ్వాన్స్‌డ్‌కి టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి. విద్యార్థులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని, ప్రిపరేషన్ కొనసాగించాలి. చాప్టర్లను వదిలేయొద్దు: సాధారణంగా కొందరు విద్యార్థులు కష్టంగా ఉన్నాయనే భావనతోనో లేదంటే సరైన టైమ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లో కొన్ని చాప్టర్లను చదవకుండా వదిలేస్తుంటారు. అయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఇలా చేయడం మంచిది కాదు. ప్రతి చాప్టర్‌కు దానికి ముందున్న చాప్టర్‌తో సంబంధముంటుంది. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఒకవేళ ఫస్టియర్‌లో ఏవైనా చాప్టర్లను వదిలేస్తే వాటిని ఒకసారి చదివి, తర్వాత వాటితో సంబంధమున్న సెకండియర్ టాపిక్స్‌ను చదవాలి. కచ్చితత్వానికి ప్రాధాన్యం: సెకండియర్ ఎంపీసీలో మంచి మార్కులు సాధించాలంటే విద్యార్థులు కచ్చితత్వం, సమయ పాలనకు ప్రాధాన్యమివ్వాలి. ఆయా కళాశాలల లెక్చరర్లను సంప్రదించి, గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ముఖ్యమైన చాప్టర్లను గుర్తించాలి. వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రామాణిక పాఠ్యపుస్తకాలు, లెక్చరర్ నోట్స్ నుంచి చదవాలి. ప్రతి చాప్టర్‌కు సంబంధించిన సినాప్సిస్‌ను చదవడం, అన్ని రకాల సమస్యల్ని సాధించడం అనే లక్షణాలను విద్యార్థులు అలవరచుకోవాలి. అకాడమీ అసలైన అస్త్రం: పరీక్షలకు చాలా కొద్ది సమయమే ఉంది కాబట్టి ఈ సమయంలో ఐదారు పుస్తకాలను పోగేసుకొని చదవకుండా అకాడమీ పుస్తకాలు, కాలేజీ మెటీరియల్‌కి పరిమితమై వాటిలోని అంశాలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి. సిలబస్‌ను పూర్తిగా చదవడం పూర్తయిన తర్వాత మొదటి, రెండో రివిజన్ సమయంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, ఉదాహరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థులు తొలుత తేలికైన టాపిక్స్‌ను చదవడం దిగ్విజయంగా పూర్తిచేస్తే తర్వాత కష్టమైన అంశాలను పూర్తిచేసేందుకు తగిన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. కాన్సెప్టుల పట్టు పట్టాలి! రోజులో కాలేజీ సమయాన్ని మినహాయించి ఒక విద్యార్థి ఆరు గంటలు చదువుకు కేటాయిస్తే అందులో మూడు గంటలు మ్యాథమెటిక్స్, గంటన్నర ఫిజిక్స్, గంటన్నర కెమిస్ట్రీకి కేటాయించాలి. పోటీ పరీక్షల్లో బేసిక్ కాన్సెప్ట్‌ల ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల విద్యార్థులు ప్రతి అంశానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ పాయింట్స్‌ను ప్రత్యేకంగా నోట్సు రూపంలో రాసుకొని, నిర్దిష్ట సమస్య సాధనలో వాటి అప్లికేషన్స్‌ను గుర్తించాలి. టిప్స్ కనీసం రెండు ప్రి ఫైనల్ పరీక్షలు రాయాలి. చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవాలి. పబ్లిక్ పరీక్షల కోణంలో అతి ముఖ్యమైన చాప్టర్లను, కాన్సెప్ట్‌లను గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి ప్రధాన కాన్సెప్ట్‌ను చదవడంతోపాటు సంబంధిత కాన్సెప్ట్‌నకు సంబంధించిన లెక్చర్ నోట్స్‌ను, మెటీరియల్‌ను బాగా అధ్యయనం చేయాలి. ప్రతి కాన్సెప్ట్‌ను నిర్వచించడం-విశ్లేషించడం-అనువర్తించడం విధానంలో చదవాలి. ఏ అంశాన్ని చదువుతున్నా సమయ పాలన, కచ్చితత్వం ప్రధానం. వీటిని తప్పకుండా పాటించాలి. ప్రతి సబ్జెక్టుకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి తగినట్లు ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే పూర్తిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. ఇలా చేయకుంటే ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ముఖ్యమైన సినాప్సిస్‌ను నోట్ బుక్‌లో రాసుకొని బాగా చదవాలి. విద్యార్థులు తప్పనిసరిగా మొదటి నుంచి దీర్ఘ సమాధాన, స్వల్ప సమాధాన, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలతోపాటు ఉదాహరణలపైనా దృష్టిసారించాలి. పాఠ్య పుస్తకాలను చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేయాలి. ఇలాచేస్తే చివర్లో క్విక్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది. అతి విశ్వాసం అనర్ధదాయకం. ‘సిలబస్ అంతా చదివాం.. అంతా వచ్చినట్లే’ అనే భావన వీడాలి. వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ 2-ఏ పేపర్‌కు 75 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో ఏడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. ఏడు స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు పది ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మ్యాథ్స 2-బీ పేపర్ కూడా ఇలాగే ఉంటుంది. 2-ఎలో ముఖ్యమైన చాప్టర్లు: ద్విపద సిద్ధాంతం, సంకీర్ణ సంఖ్యలు, ఈ్ఛ కౌజీఠిట్ఛ’ట సిద్ధాంతం. స్టాటిస్టిక్స్. సంభావ్యత. ద్విపద సిద్ధాంతం చాప్టర్లో లఘు సమాధాన ప్రశ్నలలో మధ్య పదం కనుగొనడం, గరిష్ట పదం, స్థిర పదం, పదాల సంఖ్య తదితరాలపై దృష్టిసారించాలి. ద్విపద సిద్ధాంతం అధ్యాయంలోని కొన్ని సమస్యలు సంక్లిష్టంగా ఉంటాయిగానీ, ఎక్కువ మార్కులు ఈ చాప్టర్‌కు కేటాయించారు కాబట్టి ప్రాక్టీస్‌కు అధిక సమయం వెచ్చించాలి. సంభావ్యతలోని రెండు అధ్యాయాలు సిద్ధాంతపరంగానే కాకుండా మార్కులపరంగా కూడా ముఖ్యమైనవి. సంభావ్యత సంకలన సిద్ధాంతం, ఇచ్చిన పట్టిక నుంచి స్థిర విలువ, మధ్యమం, విస్తృతి కనుగొనుట చాలా ముఖ్యమైనవి. ప్రస్తారాలు, సంయోగాలు చాప్టర్ కష్టమైనదైనా, ఐపీఈకి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈ చాప్టర్లో 4 మార్కులు, 2 మార్కుల ప్రశ్నలు మాత్రమే వస్తాయి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు, పాక్షిక భిన్నాలు, సాంఖ్యక శాస్త్రం.. మిగిలిన చాప్టర్లతో పోలిస్తే తేలికైనవి. మ్యాథ్స్ 2-బి: మ్యాథ్స్ 2-బీలో నిరూపక జ్యామితి, కలన గణితం రెండు విభాగాలూ ముఖ్యమైనవి. సిద్ధాంతాల పరంగా నిరూపక జ్యామితి ప్రధానమైనది అయితే కలన గణితం సూత్రాలు, వాటి అనువర్తనాల పరంగా ముఖ్యమైనది. వృత్తాలు (22 మార్కులు). నిశ్చిత, అనిశ్చిత సమాకలనాలు (33 మార్కులు). అవకలన సమీకరణాలు (13 మార్కులు). నిరూపక రేఖా జ్యామితిలో వృత్తాలు, శాంఖవాలు సిద్ధాంతపరమైనవి. వృత్తాలు అధ్యాయనాన్ని సమగ్రంగా చదివితే, శాంఖవాలు అధ్యాయం సగం అర్థమైనట్లే. వీటిలో భావనలు, విశ్లేషణలు, సంకేతాలు, సూత్రాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. 2-బిలో వచ్చే ప్రశ్నలు దాదాపు నేరుగా, ఎలాంటి తికమకలు లేకుండా వస్తాయి. ఫిజిక్స్ సెకండియర్ ఫిజిక్స్ పేపర్ 60 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థులు రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాలి. సెకండియర్ విద్యార్థులు ఫిజిక్స్‌లోని ఎలక్ట్రో స్టాటిక్, వేవ్ మోషన్, ఆప్టిక్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. డాప్లర్ ఎఫెక్ట్ చాలా ముఖ్యమైనది. మారిన సిలబస్ ప్రకారం ప్రతి చాప్టర్‌లోనూ విశ్లేషణాత్మక ప్రశ్నలు, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు తెలుగు అకాడమీ ఫిజిక్స్ పుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి. ప్రతి చాప్టర్‌కు వెనకున్న ప్రశ్నలన్నింటినీ సాధించాలి. వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మాగ్నటిక్స్ నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ముఖ్యమైన యూనిట్లు: వేవ్ మోషన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎలక్ట్రో మాగ్నటిక్స్ రే ఆప్టిక్స్ సెమీ కండక్టర్ డివెసైస్ కెమిస్ట్రీ సెకండియర్ కెమిస్ట్రీకి 60 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. విద్యార్థులు అన్నింటికీ సమాధానాలు రాయాలి. విద్యార్థులు సెకండియర్ కెమిస్ట్రీ సిలబస్‌లోని సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. కొత్త సిలబస్ ప్రకారం ఆర్గానిక్‌లో చాలా రీజనింగ్ ప్రశ్నలున్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ.. ఈ మూడింటిలో మూడు వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. దీర్ఘ సమాధాన ప్రశ్నలు (8 మార్కులు) చాలా వరకు రెండు చాప్టర్ల నుంచి కలిపి (4 + 4) అడుగుతున్నారు. కెమిస్ట్రీలో ఏదైనా చాప్టర్ చదివేటప్పుడు తెలుగు అకాడమీ బుక్‌లోని ప్రతి ముఖ్యమైన పాయింట్‌ను అండర్లైన్ చేసుకోవాలి. వాటిని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. దీనివల్ల విద్యార్థులు లఘు సమాధాన ప్రశ్నలన్నింటికీ తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారు. ముఖ్యమైన చాప్టర్లు: సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్ ఎలక్ట్రో కెమిస్ట్రీ సర్ఫేస్ కెమిస్ట్రీ మెటలర్జీ పి-బ్లాక్ ఎలిమెంట్స్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కోఆర్డినేట్ కాంపౌండ్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ -
మలిదశలో మెరవాలంటే..
మేనేజ్మెంట్ విద్యకు మేలైన మార్గాలుగా విరాజిల్లుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లతో పాటు, ప్రముఖ బి-స్కూళ్లలో అడుగుపెట్టేందుకు దారిచూపే ‘క్యాట్-2013’ ఫలితాలు జనవరి 14న వెలువడ్డాయి. మెరుగైన స్కోర్‌ను సాధించిన వారు లక్ష్య సాధనలో ఒక మెట్టు ఎక్కినట్లే! ఇప్పటి నుంచి ప్రతిష్ఠాత్మక ఐఐఎంలలో మేనేజ్మెంట్ పీజీ సీట్లను చేజిక్కించుకునే దిశగా చేసే ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు- విజయ వ్యూహాలపై ఫోకస్.. ఓ సంస్థ ప్రగతి పథంలో నడవాలంటే పక్కా ప్రణాళిక అవసరం.. ఆ ప్రణాళికను పదునైన వ్యూహాలతో పట్టాలకెక్కించగల నిర్వాహకులూ అవసరం. అందుబాటులో ఉన్న ఆర్థిక, సాంకేతిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ సంస్థలను లాభాల బాటలో పయనింపజేసే వారి కోసం యాజమాన్యాలు నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుశిక్షితులైన ‘మేనేజ్మెంట్’ మానవ వనరులను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు అందిస్తున్నాయి. వీటిలో విద్యార్జన చేయాలని చాలామంది కలలు కంటారు. ఐఐఎం- ఎంపిక విధానం: క్యాట్-2013లో సాధించిన స్కోర్, గత అకడమిక్ రికార్డు, పని అనుభవం ఆధారంగా ఐఐఎంలు అభ్యర్థులను రెండో దశ.. జీడబ్ల్యూపీఐ (బృంద చర్చ/ రిటెన్ ఎబిలిటీ టెస్ట్ - పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తాయి. ఇందులో ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ ఇస్తాయి. తుది జాబితాను రూపొందించే క్రమంలో ఐఐఎంలు క్యాట్-2013 స్కోర్; జీడబ్ల్యూపీఐ వెయిటేజ్; అకడమిక్ ప్రతిభ; పని అనుభవం; పాఠ్యేతర కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుంటాయి. వన్నె తగ్గిన జీడీ: గతంలో ఐఐఎంలు ఎంపిక ప్రక్రియకు సంబంధించిన రెండో దశలో బృంద చర్చ (జీడీ)కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవి. అయితే 2014-16 బ్యాచ్ ఎంపిక విధానంలో మొత్తం 13 ఐఐఎంలలో ఐఐఎం-లక్నో, ఐఐఎం-కోజికోడ్ మాత్రమే జీడీకి చోటు కల్పించాయి. మిగిలినవన్నీ దీన్ని తొలగించాయి. ఇవి జీడీ స్థానంలో రిటెన్ ఆప్టిట్యూడ్ టెస్ట్/రిటెన్ ఎబిలిటీ టెస్ట్/ రిటెన్ అనాలసిస్ టెస్ట్ (గిఅఖీ)ను నిర్వహించనున్నాయి. చాలా సందర్భాల్లో బృంద చర్చలో కొందరు అభ్యర్థులు అత్యుత్సాహం ప్రదర్శించి, మిగిలిన వారు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇలాంటి సందర్భాల్లో మంచి మేనేజీరియల్ నైపుణ్యాలున్నప్పటికీ కొందరు అభ్యర్థుల ప్రతిభ బయటకు రావడం లేదు. ఈ కారణాల వల్ల జీడీకి బదులు రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌ను నిర్వహించేందుకు ఐఐఎంలు ఆసక్తి చూపుతున్నాయి. రిటెన్ ఎబిలిటీ టెస్ట్: 11 ఐఐఎంలు, టాప్ బి-స్కూల్స్ రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ పరీక్షను ఒక రకంగా వ్యాస రచన పరీక్ష అని చెప్పొచ్చు. స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను బయటపెట్టుకునే అవకాశాన్ని మేనేజ్మెంట్ ఔత్సాహికులందరికీ ఇవ్వడమే లక్ష్యంగా ఈ పరీక్షను ప్రవేశపెట్టారు. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థుల భావ ప్రసార నైపుణ్యాలను, విశ్లేషణ సామర్థ్యాన్ని, ఆలోచనా శక్తిని, నిర్దేశ అంశంపై అవగాహనను పరిశీలిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన అంశాలు జనరల్ లేదా వర్తమాన వ్యవహారాలకు సంబంధించినవి ఉంటాయి. నిర్దేశ అంశంపై అభ్యర్థులు తమ ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సాధారణంగా 10 నిమిషాల నుంచి 30 నిమిషాల సమయం ఇస్తున్నారు. మంచి ఉపోద్ఘాతం, సమకాలీన అంశాలను ఉదాహరణలుగా పేర్కొనడం, వివిధ కోణాలను స్పృశించడం, అవసరమైన చోట పాయింట్ల వారీగా వివరణ, చక్కని ముగింపు ఇస్తే ఇందులో ఎక్కువ స్కోర్ సాధించవచ్చు. అక్షర దోషాలు లేకుండా చూసుకోవడం, చేతి రాతను మెరుగుపరచుకోవడం తప్పనిసరి. వేగంగా ఆలోచించే సామర్థ్యాన్ని ఒంటబట్టించుకుంటూ, సరైన ప్రాక్టీస్ చేస్తే ఈ విభాగంలో రాణించగలరు. ఉదా: ఐఐఎం- బెంగళూరు గతంలో ‘భారతీయ క్రీడా రంగానికి విదేశీ కోచ్‌లు తెల్ల ఏనుగుల మాదిరి తయారయ్యారు’ అంశాన్ని రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో ఇచ్చింది. బృంద చర్చ: సాధారణంగా బృంద చర్చలో 8 నుంచి 12 మంది అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేస్తారు. వీరికి ఒక అంశాన్ని ఇచ్చి, దానిపై విశ్లేషణాత్మకంగా చర్చించమంటారు. 15-20 నిమిషాల పాటు జరిగే బృంద చర్చ ద్వారా భావ ప్రసార నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యం, బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సమయస్ఫూర్తి వంటి అంశాలను పరిశీలిస్తారు. భవిష్యత్తు జీవితంలో ఓ సంస్థ నిర్వహణలో కీలకపాత్ర పోషించేందుకు అవసరమైన నైపుణ్యాలు అభ్యర్థిలో ఉన్నాయా? లేదా? అనేదాన్ని జీడీ ద్వారా అంచనా వేస్తారు. బృంద చర్చలో అభ్యర్థులు చివరకు అందరికీ ఆమోదయోగ్యమైన ముగింపును ఇవ్వాల్సి ఉంటుంది. బృంద చర్చలో ఎట్టి పరిస్థితిలోనూ ఇతరులతో వాదనకు దిగకూడదు. ఇతరులు చెప్పిన విషయాలతో ఏకీభవించకపోతే, అవి ఎందుకు సరైనవి కావో విఫులంగా, సున్నితంగా చెప్పాలి. బృందంలోని ఇతర అభ్యర్థులను మాట్లాడనీయకుండా అడ్డుకోరాదు. చెప్పాలనుకున్న అంశాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడంతోపాటు ఇతరులు చెప్పేవాటిని వినాలి. మీరు చెప్పిన విషయాలకు, ఉదాహరణలు జోడిస్తూ మీరు చెప్పింది నిజమని నిరూపించుకోవాలి. చివరకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం/ముగింపు కోసం ఎవరినీ బలవంతపెట్టకూడదు. గ్రూప్ డిస్కషన్లో సాధారణంగా కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన అంశాలు వస్తుంటాయి. ఈ విభాగంలో విజయం సాధించేందుకు దినపత్రికలు, మేగజైన్లలోని అంశాలపై స్నేహితులతో చర్చించాలి. ఎడిటోరియల్స్, టీవీ చర్చలను గమనించాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఎంపిక విధానంలో ఇంటర్వ్యూ కీలక దశ. దీనిద్వారా అభ్యర్థులకు తమ లక్ష్యంపై స్పష్టమైన అవగాహన ఉందో? లేదో? చూస్తారు. భావ ప్రసార నైపుణ్యాలను పరీక్షిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ అంటే కేవలం వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయనుకుంటే పొరపాటే. మేనేజ్మెంట్ కెరీర్ వైపు ఎందుకు అడుగులు వేయాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు తమ భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టమైన అభిప్రాయాలను ఏర్పరుచుకొని, ఇంటర్వ్యూకు సిద్ధపడాలి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం, మీ అభిరుచులు, మీ బలాలు, బలహీనతలపై ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో భాగంగా పత్రికల్లోని సంపాదకీయాలను చదవడం, వివిధ అంశాలపై సొంత అభిప్రాయాలను ఏర్పరుచుకోవడం చేయాలి. తక్కువ సమయంలో ఒక సమస్యకు పరిష్కార మార్గం చూపించే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం వల్ల మెరుగైన ఫలితాలుంటాయి. మెరుగైన క్యాట్ స్కోర్‌తో ఐఐఎం! మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశంలో టాప్-15లో ఉన్న సంస్థలు సాధారణంగా ఒక సీటుకు 10 నుంచి 15 మందిని రెండో దశకు ఎంపిక చేస్తాయి. రెండు దశల్లోనూ విద్యార్థులు చూపిన ప్రతిభ, అకడమిక్ నేపథ్యం, పని అనుభవం ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తాయి. ఎంపిక ప్రక్రియలో వివిధ అంశాలకు ఇచ్చే వెయిటేజ్‌లు ఇన్స్టిట్యూట్లు ఎప్పటికప్పుడు మారుస్తున్నాయి. ఐఐఎం యేతర విద్యా సంస్థలు సాధారణంగా ఎంట్రన్స్ పరీక్ష స్కోర్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఇప్పటి వరకు పూర్తిచేసిన అకడమిక్ కోర్సుల్లో 90 శాతం సాధించడంతో పాటు కనీసం మూడేళ్లు పని అనుభవం లేకుంటే ఐఐఎంలలో సీటు సంపాదించడం కష్టమని చాలామంది భావిస్తారు. అయితే ఇది నిజం కాదు. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 13 ఐఐఎంలలో కేవలం రెండు ఐఐఎంలు (బెంగళూరు, ఇండోర్) మాత్రమే ఈ రెండు అంశాలకు 20 శాతం కంటే ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాయి. అందువల్ల క్యాట్, జీడబ్ల్యూపీఐ దశల్లో మంచి ప్రతిభ కనబరిస్తే ఏదో ఒక ఐఐఎంలో సీటు పొందడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. - రామనాథ్ కనకదండి, కోర్సు డెరైక్టర్ (క్యాట్), T.I.M.E ఇన్స్టిట్యూట్. వర్తమాన అంశాలపై పట్టుండాలి బృంద చర్చ అంశాలు సాధారణంగా కరెంట్ అఫైర్స్ ఆధారంగా ఉంటాయి. మరికొన్ని అంశాలు అభిప్రాయాల ఆధారంగా ఉండొచ్చు. అందువల్ల అభ్యర్థులు ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తుండాలి. దీనికోసం పత్రికలు, మ్యాగజైన్లను ఉపయోగించుకోవాలి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో భాగంగా అభ్యర్థులు వర్తమాన వ్యవహారాలపై ముఖ్యంగా బిజినెస్ సంబంధిత అంశాలపై పట్టు సాధించాలి. ఒక సమస్యకు పరిష్కార మార్గం సూచించేలా వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఒక సంఘటన అలాగే ఎందుకు జరిగింది? ఆ స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు? వంటి పశ్నలు ఎదురవుతాయి. అభ్యర్థులు తమ వ్యక్తిగత సమాచారం, జీవితంలో సాధించిన విజయాలపై ప్రశ్న లు రావొచ్చు. ఎందుకు ఎంబీఏ చేయాలనుకుంటున్నావు? ఈ సంస్థలోనే ఎందుకు చదవాలనుకుంటున్నావు? వంటి సాధారణ ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇవ్వగలగాలి. ఇంటర్వ్యూలో విజయానికి ఆత్మవిశ్వాసం, నిజాయితీ ప్రధానం. - పల్లా రవితేజ, మేనేజ్మెంట్ స్టూడెంట్, ఐఐఎం కలకత్తా. జీడీ/రిటెన్ ఎబిలిటీ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ దశకు ఎంపిక చేసేందుకు ఐఐఎంలు నిర్దేశించిన క్యాట్- 2013 పర్సంటైల్ కటాఫ్స్ (జనరల్ కేటగిరీ) ఐఐఎం, అహ్మదాబాద్ 90 ఐఐఎం, బెంగళూరు 90 ఐఐఎం, కోల్‌కతా 95 ఐఐఎం, లక్నో 90 ఐఐఎం, ఇండోర్ 90 ఐఐఎం, కోజికోడ్ 90 రాజీవ్ గాంధీ ఐఐఎం, షిల్లాంగ్ 90 ఐఐఎం, రాంచీ 90 ఐఐఎం, రోహ్తక్ 90 ఐఐఎం, రాయ్‌పూర్ 90 ఐఐఎం, తిరుచ్చి 90 ఐఐఎం, ఉదయ్‌పూర్ 90 ఐఐఎం, కాశీపూర్ 90 టాప్ పబ్లిక్ బి-స్కూల్స్ ఐఐఎం- అహ్మదాబాద్ ఐఐఎం- బెంగళూరు ఐఐఎం-కోల్‌కతా డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఐఐటీ ఢిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఐఐటీ చెన్నై -
హాస్పిటాలిటీ కెరీర్‌కు చక్కటి వేదిక
ఎన్సీహెచ్ఎంసీటీ-జేఈఈ 2014 హాస్పిటాలిటీ రంగం సాధిస్తున్న వృద్ధి.. పెరుగుతున్న అవకాశాల కారణంగా గత కొంత కాలంగా హాస్పిటాలిటీ దాని అనుబంధ రంగం విశ్వసనీయమైన, ఆకర్షణీయమైన కెరీర్‌గా నిలుస్తోంది.. దాంతోపాటు పెరుగుతున్న అవసరాలకనుగుణంగా సరిపడ మానవ వనరులు లేకపోవడం కూడా ఈరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారి పాలిట కల్పతరువుగా మారుతోంది.. ఈ నేపథ్యంలో హాస్పిటాలిటీ రంగంలో ప్రవేశించడానికి చక్కని వేదిక.. ఎన్సీహెచ్ఎంసీటీ-జేఈఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ).. 2014 సంవతర్సానికి ఎన్సీహెచ్ఎంసీటీ-జేఈఈ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. ఎన్సీహెచ్ఎంసీటీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ).. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థ. బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)తోపాటు ఈ విభాగానికి సంబంధించిన మరో తొమ్మిది కోర్సుల మార్గదర్శకాలను, నాణ్యత ప్రమాణాలను ఎన్సీహెచ్ఎంసీటీ రూపొందిస్తుంది. ఆబ్జెక్టివ్‌గా: ఎన్సీహెచ్ఎంసీటీ-జేఈఈని ఆబ్జెక్టివ్ విధానంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాలు ఉంటాయి. వివరాలు.. విభాగాలు ప్రశ్నలు మార్కులు న్యూమరికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ 30 30 రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ 30 30 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30 30 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 60 60 ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ 50 50 మొత్తం 200 200 ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ మినహా అన్ని విభాగాల్లో నెగిటివ్ వూర్కింగ్ (0.25) ఉంది. న్యూమరికల్ ఎబిలిటీ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్: ఈ విభాగంలో మ్యాథమెటిక్స్, సెన్సైస్లోని అంశాలపై విద్యార్థుల ప్రాథమిక అవగాహన స్థాయిని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల క్లిష్టత హైస్కూల్ స్థాయిలో ఉంటుంది. మ్యాథమెటిక్స్‌లో రాణించాలంటే పని-కాలం, వడ్డీ, సగటు, దూరం-కాలం, నిష్పత్తి, కసాగు, గసాభా, సూక్ష్మీకరణ వంటి అంశాలపై పట్టు ఉండాలి. సెన్సైస్ విభాగానికి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం నుంచి దాదాపు 10 వరకు ప్రశ్నలు రావచ్చు. ఇందులో అడిగే ప్రశ్నలు మరీలోతుగా కాకుండా మధ్యస్తంగా ఉంటాయి. రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్: విద్యార్థుల్లోని విశ్లేషణాత్మక, తార్కిక సావుర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగమిది. ఈ క్రమంలో వెర్బల్, నాన్ వెర్బల్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వెర్బల్ విభాగంలో రీజనింగ్ నుంచి డెరైక్షన్-డిస్టెన్స్, క్లాసిఫికేషన్, కోడింగ్-డీ కోడింగ్, సిరీస్ టెస్ట్, రిలేషన్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, కండిషన్స్ అండ్ గ్రూపింగ్, నంబర్-ర్యాంకింగ్- టైమ్-సీక్వెన్సెస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, క్యూబ్స్, డేటా అరేంజ్మెంట్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్ వంటి అంశాలపై దృష్టిసారించాలి. నాన్ వెర్బల్ విభాగంలో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, విజువల్ ఎబిలిటీ, అనాలజీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: ఈ విభాగంలో ప్రశ్నలు స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా ఉంటాయి. జీకేకి సంబంధించి దేశాలు-రాజధానులు-కరెన్సీ, ప్రముఖ వ్యక్తులు-ప్రదేశాలు, అవార్డులు, జాతీయ చిహ్నాలు, పుస్తకాలు- రచయితలు, కళలు, సాహిత్యం వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఆయా అంశాలను భారతదేశం, ప్రపంచాన్ని నేపథ్యంగా తీసుకుని ప్రిపేర్ కావాలి. కరెంట్ అఫైర్స్ కోసం.. పరీక్ష జరిగే తేదీకి ముందు సంవత్సర కాలంలో జరిగిన ప్రధాన అంశాలను (సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు, వ్యక్తు లు, విజయాలు, అవార్డులు వంటివి) తెలుసుకోవాలి. ఇంగ్లిష్: మొత్తం ఐదు విభాగాల్లో ఇంగ్లిష్‌కు అత్యధిక వెయిటేజీ కేటారుుంచారు. ఈ విభాగంలో ఎక్కువ స్కోరు చేసే అభ్యర్థులే మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లిష్ విభాగంపై ఎక్కువ దృష్టి సారించాలి. ఇందుకోసం పదో తరగతి వరకు బేసిక్ గ్రావుర్పై పట్టు సాధించాలి. టెన్సెస్, రూల్స్ ఆఫ్ కరె క్ట్ యూసేజ్, రూల్స్ ఆఫ్ కంజెక్షన్, ప్రిపోజిషన్స్, స్పాటింగ్ ఎర్రర్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, వన్వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కంప్లిషన్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో రాణించాలంటే.. పదాలపై పట్టు సాధించాలి. ప్రతిరోజూ కొన్ని కొత్త పదాలను నేర్చుకోవాలి. కేవలం పదాలను తెలుసుకోవడానికే పరిమితం కాకుండా.. వాటి ఉపయోగంపై కూడా అవగాహన పెంచుకోవాలి. ప్రతిరోజూ ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు, మేగజైన్లను విశ్లేషణాత్మక దృష్టితో చదవాలి. వాటిలో ఉపయోగించిన పదాలు, వాక్యనిర్మాణ క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్: అన్నిటిలోకి కీలకమైన విభాగం ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్. ఈ రంగంలో కీలక పాత్ర పోషించే ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. వివిధ సందర్భాల్లో వ్యవహరించే విధానం? పనిచేసే ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలి? తరహా ప్రశ్నలు అడుగుతారు. వ్యక్తిగత విచ క్షణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఈ విభాగంలో ఇచ్చిన ఆప్షన్లన్నీ సరైనవే అనిపించే రీతిలో ఉంటాయి. అందుకే ఈ విభాగంలోని ప్రశ్నలకు నిర్ణీత మార్కు అని నిర్దేశించలేదు. 0.25. 0.5, 0.75, 1 అని ప్రతి ప్రశ్నకు మార్కులను విభజించారు. అభ్యర్థి ఇచ్చిన ఆప్షన్, నిర్దేశిత సమాధానం మధ్య సమతుల్యత ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అంటే.. ఎంచుకున్న ఆప్షన్ నిర్ణీత సమాధానానికి సరితూగకపోతే 0.25, పూర్తిస్థాయిలో సరితూగితే ఒకమార్కు కేటాయిస్తారు. వీటికి ఎటువంటి అకడెమిక్ ఓరియెంటేషన్ అవసరం లేదు. మనలోని స్కిల్స్ ఇందులో ఎక్కువ స్కోర్ చేయడానికి దోహదం చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేరుగా: ఎన్సీహెచ్ఎంసీటీ కేవలం రాతపరీక్ష ద్వారానే కాకుండా ప్రతిభావంతులకు నేరుగా ప్రవేశం కల్పిస్తుంది. ఇంటర్మీడియెట్/తత్సమాన బోర్డు పరీక్షల్లో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ గ్రూప్‌ల్లో 1 నుంచి 200 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు.. ఆయా గ్రూప్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఐహెచ్‌ఎంలలో నేరుగా అడ్మిషన్ కల్పిస్తుంది. అంతేకాకుండా కోర్సులో చేరిన తర్వాత మెరిట్ స్టూడెంట్స్‌కు చేయూతనిచ్చే ఉద్దేశంతో స్కాలర్‌షిప్స్‌ను కూడా ప్రదానం చేస్తుంది. వార్షిక పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఎన్సీహెచ్ఎంసీటీ మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్‌ను కూడా అందజేస్తుంది. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు సంవత్సరానికి రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని కూడా మంజూరు చేస్తుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కష్టపడే తత్వం, విశాల దృక్పథంతో వ్యవహరించే గుణం ఉన్న వారు హోటల్ మేనేజ్మెంట్ను కెరీర్‌గా ఎంచుకోవచ్చు. జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను చదవాలంటే ఎన్సీహెచ్ఎంసీటీజేఈఈ ఒక్కటే మార్గం. ఈ పరీక్ష ద్వారా బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో ప్రవేశం పొందొచ్చు. తర్వాత ఆసక్తి ఉంటే సంబంధిత విభాగంలో ఎంబీఏ, ఎంఎస్సీ, విదేశాల్లో ఎంఎస్ చేయవచ్చు. అవకాశాల పరంగా చూస్తే.. ఎన్సీహెచ్ఎం అనుబంధ ఇన్స్టిట్యూట్లలో 100 శాతం ప్లేస్మెంట్ లభిస్తుంది. కోర్సు పూర్తికాకముందే ఆఫర్ లెటర్ చేతిలో ఉంటుంది. ఉద్యోగాల విషయంలో ఈ రంగంలో డిమాండ్-సప్లై మధ్య భారీగా వ్యత్యాసం ఉంటోంది. ఆరు లక్షల ఉద్యోగాలు అవసరం ఉంటే.. ఒక శాతం మేర మాత్రమే మానవ వనరులు లభ్యమవుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ అభ్యర్థులకు చక్కని అవకాశాలు లభిస్తున్నాయి. వేతనాల విషయానికొస్తే.. ఐదంకెల జీతంతో కె రీర్ ప్రారంభించవచ్చు. -సుధా కుమార్, ప్రిన్సిపల్, డాక్టర్‌వైఎస్ ఎన్ఐటీహెచ్ఎం, హైదరాబాద్. 52 : ఎన్సీహెచ్ఎంసీటీ-జేఈఈ ద్వారా ప్రవేశం కల్పించే ఇన్స్టిట్యూట్ల సంఖ్య 7,454: అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య న్యూమరికల్ ఎబిలిటీ కోసం ఎస్సీఈఆర్టీ 10వ తరగతి మ్యాథ్స్, సైన్స్ పుస్తకాల్లోని ప్రాథమిక అంశాలను ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్‌లో మెరుగైన మార్కులు పజిల్స్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సర్వీస్ సెక్టార్ విభాగంలోని అన్ని ప్రశ్నలను ప్రయత్నించాలి. ఇంగ్లిష్ కోసం 10, 12వ తరగతుల్లోని గ్రామర్ అంశాలపై దృష్టి సారించాలి. రిఫరెన్స్ బుక్స్: ఎన్సీఈఆర్టీ ఏడు నుంచి పదో తరగతి మ్యాథ్స్, సైన్స్ పుస్తకాలు. ఎ గైడ్ టు లాజికల్ రీజనింగ్ - ఆర్.ఎస్. అగర్వాల్ వునోరవు, ఇండియా ఇయుర్ బుక్స్, ఇంగ్లిష్ దిన పత్రికలు. రెన్ అండ్ మార్టిన్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ. ప్రస్తుత హాస్పిటాలిటీ రంగం విలువ 117.7 యూఎస్ బిలియన్ డాలర్లు. ఇది 2022 నాటికి 418.9 యూఎస్ బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో ఆన్ బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్‌లో, ఇండియన్ నేవీ హాస్పిటాలిటీ సర్వీస్, క్రూరుుజర్లు, మల్టినేషనల్ హాస్పిటాలిటీస్ సర్వీసెస్‌లోను అవకాశాలుంటాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్‌గా స్థిర పడొచ్చు. ప్రభుత్వ పరంగా కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల్లో కూడా అవకాశాలుంటారుు. ఎన్సీహెచ్ఎంసీటీ-జేఈఈ 2014 అర్హత: 10+2/తత్సమానం. వయసు: జూలై 1, 2014 నాటికి 22 ఏళ్లు. దరఖాస్తు: ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండు విధాలుగా. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 7, 2014. పరీక్ష తేదీ: ఏప్రిల్ 26, 2014. వెబ్సైట్:https://applyadmission.net/nchmjee2014 -
ఎడ్యుకేషన్ న్యూస్
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 10 వేల ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీట్ల పెంపు నిమిత్తం ప్రస్తుతమున్న రాష్ట్ర ప్రభుత్వ/కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను అప్‌గ్రేడ్ చేయాలన్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) జనవరి 9న ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన మేరకు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను పెంచడానికి ఆయా కాలేజీలను కేంద్ర ప్రాయోజిత పథకంతో అప్‌గ్రేడ్ చేస్తారు. సుమారు రూ.10 వేల కోట్ల వ్యయం కాగల ఈ పథకం అమలుతో దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల సీట్లు పెరుగుతాయి. పథకం అమలుకు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రాలు ఉమ్మడిగా భరిస్తాయి. మొత్తమ్మీద చూస్తే దాదాపు 10,000 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నందున ఒక్కో సీటు కోసం సగటున రూ.1.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. దేశంలో ప్రస్తుతం 381 మెడికల్ కాలేజీలు ఉండగా అందులో 49,918 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కేంద్రం నిర్ణయంతో డాక్టర్-పేషంట్ నిష్పత్తి ప్రస్తుతమున్న 1:2000 నుంచి 1:1000కు తగ్గనుంది. మరో 58 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతోపాటు జిల్లా ఆస్పత్రుల అప్‌గ్రెడేషన్‌కు కేంద్రం గత వారం ఆమోదం తెలిపింది. దీనివల్ల మరో 5,800 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆశాజనకంగా హైరింగ్ ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగ నియామకాలు మెరుగుపడతాయని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీడాట్‌కామ్ తెలిపింది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో జోరు దీనికి కారణం కానున్నదని వివరిం చింది. గత ఏడాది నవంబర్లోలాగానే గత నెలలో కూడా ఉద్యోగ నియామక కార్యకలాపాలు ఉన్నాయని వివరించింది. హైదరాబాద్, ఢిల్లీలో హైరింగ్ కార్యకలాపాలు గరిష్టంగా మెరుగుపడ్డాయంటున్న ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం... బీపీవో హైరింగ్ 33 శాతం పెరిగింది. ఫార్మా 16 శాతం, టెలికం 7 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఐటీ, బీపీవో, ఫైనాన్స్ రంగాల్లో డిమాండ్ పెరగ్గా, బ్యాంకింగ్, బీమా, సరఫరా చెయిన్ మేనేజ్మెంట్లో ఉద్యోగాలు తగ్గాయి. ఇక హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో హైరింగ్ కార్యకలాపాలు బాగా మెరుగుపడగా, చెన్నైలో మాత్రం 4 శాతం తగ్గాయి. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నందున కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపడతాయి. ఫలితంగా కొత్త కొలువులు పెరుగుతాయి. ఆన్లైన్ దిశగా.. ఐసీఎస్ఐ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ఫౌండేషన్ ఎగ్జామ్‌ను ఈ ఏడాది జూన్ నుంచి ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించింది. అంతేకాకుండా వచ్చే రెండు-మూడేళ్లలో మొత్తం విధానాన్ని ఆన్‌లైన్‌లోకి మార్చాలని యోచిస్తోంది. విద్యార్థులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ-లెర్నింగ్, ఈ-ట్రైనింగ్ సౌకర్యాలను ప్రవేశపెట్ట్టనుంది. ఐసీఎస్ఐలో 35 వేల మంది సభ్యులు, నాలుగు లక్షల మంది కంపెనీ సెక్రటరీ విద్యార్థులున్నారు. ఐటీఐతో పాలిటెక్నిక్‌లోకి ఐటీఐ కోర్సును 60 శాతం మార్కులతో పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం పాలిటెక్నిక్‌లో చేరాలనుకునే విద్యార్థులు సాంకేతిక విద్యా శిక్షణ సంస్థ సిలబస్‌ను అనుసరించి నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు రాత పరీక్షలో అర్హత సాధించాలి. హోమియో కోర్సుల్లో అల్లోపతికి నో దేశంలోని హోమియోపతి కళాశాలల సిలబస్‌లో అల్లోపతి సబ్జెక్టులను ప్రవేశపెట్టేందుకు అనుమతించబోమని కేంద్ర హోమియోపతి కౌన్సిల్ (సీసీహెచ్) మంగళవారం స్పష్టం చేసింది. హోమియో కోర్సులతో పాటు సమీకృత అల్లోపతి కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని, అలాగైతే డిగ్రీలు పొందిన తర్వాత హోమియోతోపాటు అల్లోపతి వైద్యాన్ని ప్రాక్టీసు చేసేందుకూ అవకాశం ఉంటుందని పలువురు హోమియో వైద్యులు డిమాండు చేస్తున్న నేపథ్యంలో సీసీహెచ్ ఈ మేరకు తేల్చి చెప్పింది. దేశంలోని హోమియో కళాశాలలన్నింటినీ ఫిబ్రవరి 15లోగా తనిఖీ చేయాలని సీసీహెచ్ నిర్ణయించింది. -
ఎంఎస్సీ జియో ఫిజిక్స్ కెరీర్ అవకాశాలు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ను అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి? - ప్రవీణ్, నల్లగొండ. స్టాటిస్టిక్స్.. న్యూమరికల్ డేటా సేకరణ, నిర్వహణ, విశ్లేషణకు సంబంధించినది. దీని అప్లికేషన్స్‌ను ఇన్సూరెన్స్, ఫైనాన్స్, మెడిసిన్, సైకాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ తదితర విభాగాల్లో ఉపయోగిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో స్టాటిస్టిక్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్‌కతా.. స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. అడ్వాన్స్డ్ ప్రాబబిలిటీ, యాక్చూరియల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ తదితర స్పెషలైజేషన్లతో కోర్సు అందుబాటులో ఉంది. అకడమిక్ రికార్డ్‌తో పాటు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.isical.ac.in ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్. ఎంట్రన్స్‌తో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.andhrauniversity.edu.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.. స్టాటిస్టిక్స్; అప్లైడ్ స్టాటిస్టిక్స్; స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఏ లేదా బీఎస్సీ. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: svuniversity.ac.in కెరీర్: స్టాటిస్టిక్స్‌లో పీజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలుంటాయి. స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ అనలిస్ట్, స్టాటిస్టికల్ ఇన్స్పెక్టర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ తదితర అవకాశాలను అందుకోవచ్చు. ప్రైవేటు రంగంలో మార్కెటింగ్ సంస్థలు, మార్కెట్ రీసెర్చ్ కన్సల్టెన్సీలు, మార్కెటింగ్- ఆర్ అండ్ డీ విభాగాలు, విద్యాసంస్థల్లో ఉన్నత అవకాశాలు అందుబాటులో ఉంటాయి. బార్క్ అందిస్తున్న పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల వివరాలు తెలియజేయండి? - నాగార్జున, సూర్యాపేట. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్- ముంబై).. భారత్‌లో రేడియేషన్ రక్షణ, మౌలిక వసతులను పటిష్టం చేసేందుకు పరిశోధనలు చేపడుతోంది. రేడియేషన్ భద్రతకు సంబంధించి మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు పలు కోర్సులను ఆఫర్ చేస్తోంది. రేడియేషన్, రేడియో ఐసోటోపుల వివిధ అనువర్తనాల నియంత్రణ అవసరాలను తీర్చేలా ఈ ప్రోగ్రామ్‌లకు రూపకల్పన చేశారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సుల కరిక్యులంలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. బార్క్.. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రేడియాలజికల్ ఫిజిక్స్‌ను అందిస్తోంది. అర్హత: ఎంఎస్సీ ఫిజిక్స్. ఈ కోర్సును ఏడాది కాల వ్యవధితో అందిస్తున్నారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ).. ఆర్‌ఎస్‌వో లెవెల్-3 సర్టిఫికేషన్‌కు అర్హత సాధిస్తారు. వెబ్సైట్: barc.gov.in ఎంఎస్సీ జియో ఫిజిక్స్ కెరీర్ అవకాశాలను తెలపగలరు? - నీలిమ, రాజమండ్రి. జియో ఫిజిక్స్ అనేది ఎర్త్ సైన్స్‌లో ప్రత్యేక విభాగం. ఇది భూమి, భూ అంశాల స్వభావాన్ని వివరిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎర్త్‌సైన్స్, ఐఐటీ బాంబే.. ఎంఎస్సీ- అప్లైడ్ జియో ఫిజిక్స్‌లో ఎంఎస్సీని ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్/ఫిజిక్స్‌తో పాటు జియాలజీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సెన్సైస్‌లో ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేయాలి. జామ్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.iitb.ac.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. జియో ఫిజిక్స్‌లో ఎంఎస్సీ (టెక్) కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లతో బీఎస్సీ. వెబ్సైట్: www.andhrauniversity.edu.in ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్- ధన్‌బాద్.. మూడేళ్ల కాల వ్యవధితో టెక్ ఇన్ అప్లైడ్ జియో ఫిజిక్స్ ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.ismdhanbad.ac.in ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. ఎంఎస్సీ జియో ఫిజిక్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో బీఎస్సీ. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.osmania.ac.in కెరీర్: జియో ఫిజిక్స్ ప్రొఫెషనల్స్‌కు ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలలో ఉన్నత అవకాశాలుంటాయి. ఎన్జీఆర్ఐ, ఓఎన్జీసీ, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వంటివి జియో ఫిజిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. విప్రో సాఫ్ట్వేర్ టెక్నాలజీ అకాడమీ (WiSTA) కోర్సుల వివరాలు తెలియజేయండి? - అనిత, గుంటూరు. విప్రో సాఫ్ట్వేర్ టెక్నాలజీ అకాడమీ (WiSTA).. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ ప్రోగ్రామ్ చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కాల వ్యవధి నాలుగేళ్లు. ఇది ఒకవైపు ఆర్జిస్తూ మరోవైపు చదువుకునేందుకు వీలుకల్పించే ప్రోగ్రామ్. కోర్సు పూర్తయిన తర్వాత విట్ యూనివర్సిటీ-వెల్లూరు నుంచి డిగ్రీ అందుతుంది. అర్హత: గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు: ఎంట్రన్స్ టెస్ట్, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంటెక్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి? - దివాకర్, కర్నూలు. ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంటెక్‌ను అందిస్తున్న సంస్థలు: ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం వెబ్సైట్: www.andhrauniversity.edu.in జేఎన్టీయూ, హైదరాబాద్. వెబ్సైట్: www.jntuh.ac.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి వెబ్సైట్: svuniversity.ac.in కెరీర్: ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలి కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. -
పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం పన్నెండో ప్రవాసీ భారతీయ దివస్ 12వ ప్రవాసీ భారతీయ దివస్ న్యూఢిల్లీలో జనవరి 7నుంచి 9 వరకు జరిగింది. కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వివిధ రంగాల్లో సేవలందించిన 13 మంది ప్రవాస భారతీయులకు ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డులందుకున్న వారిలో మహాత్మా గాంధీ మనుమరాలు, దక్షిణాఫ్రికా మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఇలాగాంధీ, భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా సెనేటర్ లీసా మారియా సింగ్, ఫిజిలోని రామకృష్ణ మిషన్, వర్గీస్, వాసుదేవన్చంచ్లానీ, వికాస్ చంద్ర, సన్యాల్ తదితరులున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మలేసియా సహజవనరులు, పర్యావరణ మంత్రి దాతు సెరి జి. పళనివేల్ హాజరయ్యారు. పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం అణ్వస్త్ర సామర్థ్యం గల పృథ్వి -2 క్షిపణిని భారత్ జనవరి 7న ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో మొబైల్ లాంచర్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయాణించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. వెయ్యి కిలోల ఆయుధాలను మోసుకుపోగలదు. 2003లో పృథ్విని సైన్యంలో ప్రవేశపెట్టారు. అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్లో నిర్మించిన ప్లాట్‌ఫామ్ నెంబర్-1 ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌గా రికార్డుల్లోకెక్కింది. దీని పొడవు 1,355.40 మీటర్లు. ఈ విషయూన్ని నార్త్ ఈస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ ఏకే ఆటల్ జనవరి 9న వెల్లడించారు. జాతీయ యువ విధానానికి కేంద్రం ఆమోదం జాతీయ యువజన విధానాన్ని (నేషనల్ యూత్ పాలసీ-ఎన్వైపీ) జనవరి 9న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్వైపీ-2003 స్థానంలో కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. విద్య, నైపుణ్యం అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమ స్థాపన, ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవన విధానం, క్రీడలు, సామాజిక విలువలను పెంపొందించడం, సామాజిక భాగస్వామ్యం, రాజకీయాలు, ప్రభుత్వాల్లో పాలుపంచుకోవడం, సమ్మిళత సామాజిక న్యాయం వంటి అంశాలపై ఈ విధానం దృష్టి సారిస్తుంది. దేశంలోని 15-29 ఏళ్ల యువతకు ఈ విధానం వర్తిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరు దేశ జనాభాలో 27.5 శాతం ఉన్నారు. మహిళా ఉద్యోగినులకు ఎస్బీఐ కానుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మహిళా ఉద్యోగులకు రెండేళ్ల సెలవును తీసుకోవడానికి అవకాశం కల్పించింది. భార్యలేని లేదా విడాకులు తీసుకున్న పురుషులకూ ఈ వెసులుబాటు కల్పించింది. పిల్లల చదువు, తల్లిదండ్రులు, అత్తమామల ఆరోగ్యసంరక్షణ వంటి ఎలాంటి అవసరాలకైనా రెండేళ్లపాటు సెలవులు తీసుకోవచ్చని ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు. కౌమార ఆరోగ్యం కోసం కేంద్రం కొత్త పథకం కౌమారదశలో ఆరోగ్య, ఆహార, ఇతర సాంఘిక సమస్యలను అధిగమించేందుకు 10-19 ఏళ్ల లోపు వారికోసం కేంద్రం కొత్తపథకాన్ని ఆరంభించింది. దీనికి రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్కేఎస్కే) అని నామకరణం చేసింది. పథకం కింద దేశంలోని 34.3 కోట్ల మంది కౌమార బాలబాలికలకు పోషకాహారం, ప్రత్యుత్పత్తి అవ గాహన, శారీరక, మానసిక ఆరోగ్యం, లైంగిక వేధింపులు, అసాంక్రమిక వ్యాధులతోపాటు జీవనశైలిసమస్య లాంటి పలు అంశాల్లో సాయపడుతుంది. విదేశీ మదుపుదారులకు వెసులుబాటు విదేశీ మదుపుదారులు భారత్‌లో షేర్లు లేదా రుణ పథకాలలో తాము పెట్టిన పెట్టుబడులను విక్రయించి నిష్ర్కమించే అవకాశం కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ విదేశీప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించింది. ఈ నిర్ణయంతో దేశంలోకి మరింత ఎక్కువగా ఎఫ్‌డీఐ నిధులు రావడానికి తోడ్పడుతుందని రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. మార్పు చేసిన నిబంధనల ప్రకారం ఎఫ్‌డీఐ ఒప్పందాలలో ఇక మీదట ఐచ్ఛికంతో కూడిన షరతులు ఉంటాయి. ఇందులో కనీస లాకిన్ కాలంతోపాటు ప్రతిఫలాలపై ఎటువంటి హామీ లేకపోవడం వంటివాటికి చోటు కల్పించారు. పదోన్నతి ఉద్యోగి మౌలిక హక్కు : సుప్రీం పదోన్నతి ఉద్యోగి మౌలిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదోన్నతి పొందడానికి ఆ ఉద్యోగికి తగిన అర్హతలున్నాయని నిర్ధారించినపుడు తప్పనిసరిగా కల్పించాలని జస్టిస్ ఎ.కె. పట్నాయక్, జస్టిస్ జె.ఎస్. ఖేహర్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. మేజర్ జనరల్ హెచ్ ఎం సింగ్‌కు లెఫ్టినెంట్ జనరల్ స్థాయి పదోన్నతినివ్వాలంటూ సదరు ఎంపిక బోర్డు చేసిన సిఫారసును మంత్రివర్గం నియమించిన కమిటీ తోసిపుచ్చడంపై ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దేవయాని బహిష్కరణ అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయానిని జనవరి 10న బహిష్కరించింది. వీసా కేసులో విచారణ గడువును పొడిగించాల్సిందిగా దేవయాని చేసిన విజ్ఞప్తిని అమెరికా కోర్టు తోసిపుచ్చుతూ నేరాభియోగం మోపింది. అయితే కోర్టు నేరం నమోదు చేసిన నేపథ్యంలో ఈ హోదాను రద్దు చేయాల్సిందిగా అమెరికా కోరడం... అందుకు భారత్ నిరాకరించడంతో ఆమెను తక్షణమే అమెరికా విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీంతో దేవయాని న్యూయార్క్ నుంచి భారత్‌కు వచ్చేశారు. ఈ పరిణామాలపై భారత్ స్పందిస్తూ అమెరికా దౌత్యవేత్త ఒకర్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. జాన్ ఐపేకు భారత్‌గౌరవ్ పురస్కారం బహ్రెయిన్‌లో ఉన్న ప్రవాస భారతీయుడు జాన్‌ఐపే (63) ప్రతిష్ఠాత్మక భారత్ గౌరవ్ పురస్కారానికి ఎంపికచేసినట్లు ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ ప్రకటించింది. నాలుగుదశాబ్దాల పాటు బహ్రెయిన్‌లో నివశిస్తున్న ఐపే...14 ఏళ్లుగా ప్రవాస భారతీయుల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న తీరుకు ఈ అవార్డు వరించింది. ఇప్పటివరకు ఈ అవార్డును మదర్‌థెరిసా, క్రికెటర్ గవాస్కర్, నటులు షమ్మీకపూర్, రాజేశ్‌ఖన్నా, దేవానంద్ అందుకున్నారు. అంతర్జాతీయం ఫెడరల్ రిజర్వ్ చైర్ పర్సన్‌గా యెలెన్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ పర్సన్ గా జానెట్ యెలెన్ (67) నియామకానికి సెనెట్ జనవరి 7న ఆమోదం తెలిపింది. వందేళ్ల చరిత్ర కలిగి ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన సెంట్రల్ బ్యాంక్‌కు అధిపతిగా నియమితులైన తొలి మహిళ యెలెన్. ఈమె ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఫెడరల్ై ఛెర్మన్‌గా ఉన్న బెన్బెర్నాంకీ జనవరి 31న పదవీ విరమణ అనంతరం యెలెన్ ఆస్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్ బాలుడికి అంతర్జాతీయ సాహస అవార్డు తన ప్రాణాలొడ్డి పాఠశాలలోని వేల మంది విద్యార్థులను కాపాడిన 14 ఏళ్ల పాకిస్థాన్ బాలుడు ఐత్జాజ్ హసన్‌కు అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ అంతర్జాతీయ సాహస అవార్డును ప్రకటించింది. అలాగే పాక్ ప్రభుత్వం కూడా తమ దేశ అత్యున్నత సాహస అవార్డుల్లో ఒకటైన సితారా ఎ సుజాత్‌ను ఇవ్వాలని నిర్ణయించింది.జనవరి 6న పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్యా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో మానవబాంబుతో ప్రవేశిస్తున్న ఉగ్రవాదిని హసన్ అడ్డుకున్నాడు. ఆ పేలుడులో ఇద్దరూ చనిపోయారు. భారతీయ శాస్త్రవేత్తకు అధ్యయన నిధి అమెరికాలోని భారత సంతతి నాడీశాస్త్రవేత్త ఖలీల్జ్రాక్కు అక్కడి జాతీయ ఫౌండేషన్ సుమారు రూ. 5.21కోట్లు (866.90 డాలర్లు) మంజూరు చేసింది. వయసుతోపాటు వచ్చే వినికిడి సమస్యలకు చికిత్స చేసేందుకు ఉపయోగ పడేలా మెదడు చర్యా విధానంపై రజాక్ కొద్దికాలంగా పరిశోధనలు చేస్తున్నారు. వీటిని కొనసాగించేందుకు ఐదేళ్లకుగాను ఈ మొత్తం నిధిని రజాక్‌కు బహుకరించారు. ప్రపంచ ప్రశంసనీయుడు బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ప్రపంచంలోనే అత్యంత ప్రశంసనీయ వ్యక్తిగా నిలిచారు. భారత్ సహా 13 దేశాల్లో సర్వే జరిపి 30 మందితో రూపొందించిన ఈ జాబితాలో బిల్ గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. కాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండోస్థానం, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐదోస్థానం, నరేంద్రమోడీ ఏడో స్థానం, అమితాబ్‌బచ్చన్ తొమ్మిది, అబ్దుల్‌కలామ్ పది, అన్నాహజారే 14వ, కేజ్రీవాల్ 18వ, రతన్‌టాటా 30వ స్థానం పొందారు. ఈ మేరకు ద టైమ్స్ కోసం ‘యుగోవ్’ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఆరాధనీయ వ్యక్తుల జాబితా రూపొందించింది. బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా ప్రవూణం బంగ్లాదేశ్ ప్రధానవుంత్రిగా షేక్ హసీనా (అవామీలీగ్ పార్టీ) జనవరి 12న ప్రవూణ స్వీకారం చేశారు. హసీనా ప్రధాని పదవిని చేపట్టడం ఇది వరుసగా రెండోసారి, మొత్తం మీద వుూడోసారి. గత వారం పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో అవామీలీగ్ 232 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అవామీలీగ్ మిత్ర పక్షమైన జతియా పార్టీ 33 స్థానాలను కైవసం చేసుకుంది. షెరాన్ కన్నుమూత ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎరియల్ షెరాన్ (85) జనవరి 11న మరణించారు. ఈయన 2001లో ఇజ్రాయెల్ ప్రధానిగా ఎన్నికైయ్యారు. వివాదాస్పద విధానాలతో ‘ది బుల్డోజర్’గా చరిత్రకెక్కాడు. ఇజ్రాయిలీలు ఈయన్ను ‘మిస్టర్ సెక్యూరిటీ’గా పిలుస్తారు. భారత్‌ను సందర్శించిన తొలి ఇజ్రాయెల్ ప్రధాని షెరాన్. ఈయన 2003 లో భారత పర్యటనకు వచ్చారు. భూమిలాంటి గ్రహం భూమికి 200 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి గ్రహాన్ని గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. కెప్లర్ వ్యోమనౌక ద్వారా కనుగొన్న ఈ గ్రహానికి కెఓఐ-314గా పేరు పెట్టారు. హైడ్రోజన్, హీలియం వాయువులతో కూడిన ఈ గ్రహం భూమికి సమానమైన ద్రవ్యరాశితోనూ, భూమి కన్నా 60 శాగతం అధిక వ్యాసంతోనూ ఉంది. 104 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే ఈ గ్రహంలో జీవం ఉనికి ఉండటానికి అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. రాష్ట్రీయం విశాఖ ఉక్కుకు మరో కీర్తి నవరత్న హోదాగల విశాఖఉక్కు (రాష్ట్రీయఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ -ఆర్ఐఎన్ఎల్) సిగలో మరో కలికితురాయి వచ్చిచేరింది. వర్క్ ప్లేస్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచి 5ఎస్ ధ్రువీకరణపత్రం సాధించింది. దేశంలోని ఉక్కు పరిశ్రమ రంగంలో ఈ ధ్రువీకరణ పొం దిన తొలి పరిశ్రమగా విశాఖ ఉక్కు ఘనత దక్కించుకుంది. ఆర్టీసీకి మూడు జాతీయ పురస్కారాలు ఏపీఎస్ఆర్టీసీకి మూడు పురస్కారాలు లభించాయి. అత్యధిక ఇంధన పొదుపు (కేఎంపీఎల్),అర్బన్ సర్వీసుల్లో అత్యధిక ఇంధన పొదుపు (కేఎంపీఎల్), భద్రత అంశాల్లో అతి తక్కువ ప్రమాదాలు కలిగి ఉండటంతో అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) న్యూఢిల్లీ నుంచి పురస్కారాలు దక్కించుకుంది. ఇంధన పొదుపులో ఇప్పటికి 39వసారి ఆర్టీసీ అవార్డును గెలుచుకుంది. రాష్ట్రంలో గేమ్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన గేమింగ్ యానిమేషన్ మీడియాఎంటర్టైన్మెంట్ (గేమ్) ప్రాజెక్టుకు హైదరాబాద్ సమీపంలోని రాయదుర్గ్‌లో జనవరి 8న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో గేమింగ్, యానిమేషన్ ఎంటర్టైన్మెంట్, యానిమేషన్ వెబ్ డిజైనింగ్, ఇ- ఎడ్యుకేషన్,ఇ-లెర్నింగ్, పీసీ, మొబైల్ గేమింగ్, కాన్సోల్ గేమింగ్,ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమింగ్‌లకు సదుపాయాలు కల్పిస్తారు. 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 350 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇటువంటి పార్క్‌ను ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి. అంజలీదేవి మృతి అలనాటి సినీనటి అంజలీదేవి (86) జనవరి 13న చెన్నైలో కన్ను ముశారు. 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు. తెలుగులో 350కి పైగా చిత్రాల్లో నటించారు. లవకుశ, అనార్కలి, సువర్ణసుందరి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. క్రీడలు నేషన్ కప్ బాక్సింగ్‌లో నిఖత్‌కు స్వర్ణం ఆంధ్రప్రదేశ్ యువబాక్సింగ్ కెరటం నిఖత్ జరీన్ నేషన్స్ కప్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం గెలిచింది. 51 కిలోల విభాగం ఫైనల్లో పాల్టో సెవా ఎక్తరీనా (రష్యా)ను ఓడించింది. నిఖిత్ కెరీర్లో ఇది నాలుగో అంతర్జాతీయ పతకం. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ ప్రస్తుతం ప్లస్ టూ చదువుతోంది. నేషనల్ టేబుల్‌టెన్నిస్ టోర్నీ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ టైటిళ్లను పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కి చెందిన పురుషుల, మహిళ జట్లు గెలుచుకున్నాయి. పాట్నాలో జనవరి 9న ముగిసినపోటీల్లో పురుషుల టీమ్ ఫైనల్లో పశ్చిమబెంగాల్‌ను, మహిళల జట్టు ఉత్తర బెంగాల్‌ను ఓడించాయి. ఫెడరేషన్ కప్ బాస్కెట్ బాల్ 28వ ఫెడరేషన్ కప్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల టైటిల్నుఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, మహిళల టైటిల్‌ను ఛత్తీస్‌గఢ్ గెలుచుకున్నాయి. అహ్మదాబాద్‌లో జనవరి 9న ముగిసిన పోటీల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును ఓడించి ఓఎన్జీసీ పురుషుల టైటిల్ కైవసం చేసుకోగా-మహారాష్ట్రను ఓడించి ఛత్తీస్‌గఢ్ మహిళల టైటిల్‌ను గెలుచుకున్నాయి. -
ఇంగ్లాండ్ ఈజ్ రిలేటడ్ టు అట్లాంటిక్ ఓషన్
Competitive Guidance:Banks English K. LALITHA BAI Associate Professor in English, Hyderabad. In the last session we have seen comprehension passages, cloze test, substitution and rearranging the sentences to form meaningful passage. To provide a better clarity let us take a look at the other areas and practice a few more tests. Directions: which of the phrases (a), (b), (c) and (d) given below each sentence should replace the phrase printed in bold type to make the sentence grammatically correct? If the sentence is correct as it is, mark (e) i.e. No correction required as the answer. 1.Lift the handset only after paid a one rupee coin. a) Paying a one-rupee coin b) You pay one rupee coin c) You paid rupee coin d) Pay one rupee coin e) No correction required 2.Good life according to many people is to making more and more money. a) Is making b) Is made c) Are made d) Are making e) No correction required 3.His behaviour with all his employees is so pleasing, that everyone come forward for helping him. a) Came towards him for help b) Comes towards him for help c) Comes forward to help him d) Comes forward for help him e) No correction required 4. A master should never impose his servants too much work. a) His servants with too much work b) Too much work with his servants c) Too much work on his servants d) Much work for his servants e) No correction required 5. What matter does most is the quality and not the quantity. a) What does matter b) What does it matter c) That matters d) What matters e) No correction required 6. The commissioner burst into rage and ordered immediately suspension of the inspector who had arrested the innocent boy. a) Order immediately b) Order immediate c) Ordered immediate d) Ordering immediate e) No correction required 7. He would be like to have some ice-cream. a) Would like to b) Would be liked to c) Was to be liking to d) Would being liked to e) No correction required 8. Not knowing the language and had no friends in the country, he found it impossible to get job. a) Has no b) With having c) With having not d) Having no e) No correction required 9. She will not attend the meeting until she is asked to. a) Except b) Even with c) Even except d) Unless e) No correction required 10. Because of his smart work, he is in the good books of his employer. a) In the better books b) In the good book c) In the best books d) Into the best book e) No correction required 11. A student was arrested for displaying an indecently artwork in public. a) An indecent b) Indecently c) The indecently d) Any of incident e) No correction required 12. He did not like me to smoking in the presence of teacher yesterday. a) That I smoke b) My smoking c) Me smoking d) Smoking by me e) No correction required 13. The scenery around the hill stations of Himachal Pradesh is quite picturesque and enjoyed. a) Quite picturesque and enjoyable b) Quite picturesque and enjoy c) Quietly picturesque and enjoyed d) Quietly picturesque and enjoyable e) No correction required 14. Within three years, he demonstrated a dramatic improved business performance. a) Dramatic improved b) The dramatically improved c) A dramatically improved d) A dramatic improvement e) No correction required 15. Had he been presented there, he would have put an end to the happenings. a) If he had been presented b) If he had been present c) Had he present d) If he present e) No correction required Answers: 1.A - the gerund form of the verb (-ing) should be used. 2.A - 'to making' is a wrong construction in this sentence 3.C - to infinitive form of the verb should be used instead of the gerund form 4.C 5.D - the usage of 'does' is not required in this sentence 6.C - the adjective form of the word is the correct usage 7.A 8.D 9.D - the right conjunction to be used in this sentence is not 'until' whereas it is 'unless' 10.E 'to be in the good books' an expression used for appreciation 11.A- adjective should be used to qualify a noun 12.B- After 'like' a gerund should come and before gerund pronoun should be in possessive form. 13.A- the adjective of 'enjoy' is required 14.C- Determiner+ Adverb + Adjective + Noun. Here 'a' is proper. 15.B- Past conditional sentence (If+ S + had +V3, S + would have + V3) Directions: Choose the correct analogy from the four alternatives given 1.'Braille' is related to 'Blindness' in the same way as 'Sign' is related to a) Exceptional b) touch c) deafness d) presentation 2.'Boat' is related to 'Oar' in the same way as 'Bicycle' is related to a) Road b) wheel c) seat d) paddle 3. 'Match' is related to 'Victory' in the same way as 'Examination' is related to a) write b) appear c) success d) attempt 4. 'Heart' is related to 'Blood' in the same way as 'Lung' is related to a) Oxygen b) chest c) purification d) air 5. 'Face' is related to 'Expression' in the same way as 'Hand' is related to a) Gesture b) work c) handshake d) pointing 6. 'Wine' is related to 'Grapes' in the same way as 'Vodka' is related to a) apples b) potatoes c) oranges d) flour 7. 'Golf' is related to 'Holes' in the same way as 'Baseball' is related to a) innings b) goal c) points d) serve 8. 'England' is related to 'Atlantic Ocean' in the same way as 'Greenland' is related to a) Pacific ocean b) Atlantic Ocean c) Arctic ocean d) Antarctica ocean 9. 'Demographer' is related to 'People' in the same way as 'Philatelist' is related to a) fossils b) stamps c) photography d) music 10. 'Eye' is to 'See' in the same way as 'Ear' is to a) Ring b) sound c) hear d) smell 11. 'Disease' is related to 'Pathology' in the same way as 'Planet' is related to a) sun b) satellite c) astronomy d) orbit 12. 'Mountain' is related to 'Valley' in the same way as 'Enemy' is related to a) cruel b) stranger c) friend d) country 13. 'Horse' is related to 'Hoof' in the same way as 'Eagle' is related to a) claw b) clutch c) leg d) foot 14. 'Cube' is related to 'Square' in the same way as 'Square' is related to a) plane b) triangle c) line d) point 15. 'Much' is related to 'Many' in the same way as 'Measure' is related to a) count b) calculate c) measure d) weight Answers: 1.C- 'Braille' is the technique of reading and writing for the blind persons. Similarly 'Sign language' is the technique of reading and writing for the deaf persons. 2.D- 'Oar' is a device to push a 'Boat'. In the same way 'Paddle' is used to push the 'Bicycle'. 3.C- 'Victory' may be an outcome of 'Match'. Likewise 'Success' is one of the outcomes of 'Examination'. 4.A- 'Heart' is the organ which deals with the pumping and flow of 'Blood'. In the same way 'Lungs' deals with the storage and flow of 'oxygen'. 5.A- 'Expression' a person is read from the 'Face'. Likewise 'Gesture' of a person is read from the position of the 'Hand'. 6.D- 'Wine' is made from 'grapes' and 'Vodka' is made from 'Flour'. 7.A- 'Holes' is related to 'Golf'. In the same way, 'innings' is related to 'baseball'. 8.C- 'England' is situated in 'Atlantic Ocean'. 'Greenland' is situated in 'Arctic Ocean'. 9.B- 'Demographer' is related with the study of Statistics related to 'People'. Similarly 'Philatelist' is related to the study of 'Stamps'. 10.C- The function of the 'Eye' is to see and that of 'Ear' is to 'Hear'. 11.C- 'Pathology' is the branch of medical science which helps to detect symptoms of 'Diseases' and 'Astronomy' is the study to know about 'Planets'. 12.C - 'Mountain' is antonym of 'Valley'. Likewise 'Friend' is the antonym of 'Enemy'. 13.A- The lower part of feet of 'Horse' is known as 'Hoof'. In the same way, lower part of the feet of 'Eagle' is known as 'Claw'. 14.C- 'Cube' comprises 'Square' on all of its surfaces, likewise 'Square' has 'Line' on all its side. 15.A- 'Much' is synonym of 'Many'. Similarly, 'Measure' is synonym of 'Count'. -
వినువీధిలో భారత ఘనత.. జీఎస్ఎల్వీ-డీ5
భారత కీర్తిపతాక వినువీధిలో రెపరెలాడిన క్షణం.. దేశ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సువర్ణ అధ్యాయం.. రాకెట్ పరిజ్ఞానంలో మన దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన అద్భుత విజయం.. శాస్త్రవేత్తల 20 ఏళ్ల కలను సాకారం చేస్తూ జీఎస్ఎల్వీ (జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్)-డీ5 నింగికి దూసుకెళ్లి.. భారత్‌కు గ‘ఘన’ విజయాన్ని చేకూర్చింది. సి. హరికృష్ణ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ భారత అంతరిక్ష కార్యక్రమాన్ని సమూలంగా మార్చే క్రయోజెనిక్ ఇంజిన్ జీఎస్ఎల్వీ-డీ 5 రాకెట్‌ను ఇస్రో జనవరి 5న మన రాష్ట్రంలోని షార్ కేంద్రం (సతీష్‌ధావన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం) నుంచి విజయవంతంగా ప్రయోగించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో దీన్ని అభివృద్ధి చేిసింది. ఈ విజయంతో క్రయోజెనిక్ ఇంజిన్ ద్వారా జీఎస్ఎల్వీ ప్రయోగాలను ముమ్మరం చేయనుంది. కేవలం స్వదేశీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలనే కాకుండా వాణిజ్య పరంగా విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలు కూడా జీఎస్ఎల్వీ ద్వారా సాధ్యమవుతాయి. మూడు దశల నౌక: జీఎస్ఎల్వీ-డీ5 1,982 కిలోల బరువైన జీశాట్-14 కమ్యూనికేషన్ ఉపగ్ర హాన్ని లిఫ్ట్ ఆఫ్ జరిగిన 14 నిమిషాలకు భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 179 కిలోమీటర్ల పెరెజీ ఇన్ టు 35,950 కి.మీ. అపోజీ కక్ష్యలోకి జీశాట్-14ను జీఎస్ఎల్వీ-డీ5 ప్రయోగించింది. జీఎస్ఎల్వీ-డీ5 రాకెట్ ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజిన్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. దీంతో ఇస్రో రెండు దశాబ్దల కృషి ఫలించింది. లిక్విడ్ ప్రొపెల్షన్ సిస్టమ్ సెంటర్‌కు చెందిన మహేంద్రగిరి (తమిళనాడు)లోని టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రం స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. 2010 ఏప్రిల్ 1న జీఎస్ఎల్వీ-డీ3 ద్వారా క్రయోజెనిక్ దశను మొదటిసారిగా పరీక్షించడానికి ప్రయత్నించినప్పటికీ.. ఇంధనాన్ని పంప్ చేసే ఫ్యూయల్ బూస్టర్ టర్బో పంప్లో తలెత్తిన సమస్య కారణంగా ఈ ప్రయోగాన్ని చేపట్టలేకపోయారు. జీఎస్ఎల్వీ...ఒక మూడు దశల నౌక. మొదటిదశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. మూడో దశ క్రయోజెనిక్ దశ. అమెరికా ఆంక్షల కారణంగా రష్యా నుంచి క్రయోజెనిక్ టెక్నాలజీ సామర్థ్యాన్ని భారత్ పొందలేకపోయింది. 20 ఏళ్ల కల: క్రయోజెనిక్స్ సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యతను గుర్తించిన భారత్ 1991లో రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘గ్లవ్ కాస్మోస్’తో క్రయోజెనిక్ పరిజ్ఞానం పొందే ఒప్పందాన్ని కుదుర్చుకొంది. అయితే అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ సొంతంగానే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు 1993లో స్వదేశీ క్రయోజెనిక్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ రకమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడం అంత సులభం కాదు. ఇన్సులేషన్, క్రయోఫ్లూయిడ్స్, అత్యాధునిక ఇంధన ఆక్సీడైజర్ ట్యాంకులు, నిమిషానికి 40 వేలకుపైగా తిరిగే రోటర్లు ఉన్న అత్యాధునిక ఫ్యూయల్ బూస్టర్ టర్బో పంప్ (ఎఫ్‌బీటీపీ) మొదలైనవి అందుబాటులోకి తీసుకువస్తే తప్ప క్రయోజెనిక్ ఇంజిన్ల అభివృద్ధి సాధ్యం కాదు. మహేంద్రగిరి (తమిళనాడు)లోని లిక్విడ్ ప్రొపెల్షన్ సిస్టమ్ సెంటర్‌కు చెందిన టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రం చివరకు రెండు దశాబ్దాల కృషి తర్వాత క్రయోజనిక్ దశను అభివృద్ధి చేసింది. సందేహాలను దాటుకుంటూ: ఇస్రో 2010 ఏప్రిల్ 15న జీఎస్ఎల్వీ-డీ3 ద్వారా జీశాట్-4 ప్రయోగించేందుకు సిద్ధమైంది. తొలిసారిగా దేశీయ క్రయోజెనిక్ దశను ఇందులో అమర్చారు. ప్రయోగం జరిగి క్రయోజెనిక్ దశ కూడా మొదలైన కొన్ని సెకన్లకే నౌక విఫలమైంది. క్రయోజెనిక్ ఇంజిన్లోకి ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని పంప్ చేసే ఫ్యూయల్ బూస్టర్ టర్బో పంప్ విఫలమైంది. పంపు రోటర్ విడిపోవడం లేదా పంప్ కేసింగ్ బద్దలవడం ద్వారా ఇలా జరిగిందని ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ తేల్చింది. ఆ తర్వాత రష్యా క్రయోజెనిక్ దశను ఉపయోగించి 2010, డిసెంబర్ 25న నిర్వహించిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 06 ప్రయోగం కూడా విఫలమైంది. ఈ నౌక మొదటిదశలోనే విఫలమవడం ఇస్రోకు సవాలుగా మారింది. అసలు జీఎస్ఎల్వీ నిర్మాణం పైనే ఎన్నో సందేహాలు తలెత్తాయి. అప్పటికి ఇస్రో నిర్వహించిన ఏడు ప్రయోగాలలో నాలుగు మాత్రమే విజయవంతమయ్యాయి. మిగతా మూడు విఫలమయ్యాయి. అందులోనూ రెండు జీఎస్ఎల్వీ ప్రయోగాలు (జీఎస్ఎల్వీ-డీ3, జీఎస్ఎల్వీ-ఎఫ్ 06). దీంతో పూర్తిస్థాయి విశ్లేషణ, అధ్యయనాలు నిర్వహించి దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్ కలిగిన జీఎస్ఎల్వీ-డీను 2013 ఆగస్టు 19న ప్రయోగించాలని నిర్ణయించారు. అయితే ప్రయోగానికి 75 నిమిషాల ముందు రెండో దశ ద్రవ ఇంజిన్ లీకేజీని గుర్తించడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. ఇంధన ట్యాంకును కొత్తగా అల్యూమినియం, రాగి మిశ్రమ లోహం ఏఏ 2219తో నిర్మించారు. ఎఫ్బీటీపీని కూడా పూర్తిగా డిజైనింగ్ చేశారు. ఈ విధంగా మార్పులతో జీఎస్ఎల్వీ -డీ5ను రూపొందించారు. ఇందులో రూపొందించిన క్రయోజనిక్ దశలో ద్రవహైడ్రోజన్ (Liquid hydrogen) ను మైనస్ 253 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఇంధనంగా, ద్రవ ఆక్సిజన్ (Liquid oxygen)ను మైనస్ 183 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఆక్సిడైజర్‌గా ఉపయోగించారు. ఈ రకమైన క్రయోజెనిక్ ఇంజిన్ ద్వారా మాత్రమే భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కక్ష్యలోనికి ప్రవేశపెట్టే వీలుంటుంది. మొత్తం మీద జీఎస్ఎల్వీ-డీ3 లిఫ్ట్‌ఆఫ్ సమయంలో 414.75 టన్నుల బరువు తూగింది. దీని పొడవు 49.13 మీటర్లు. 1,982 టన్నుల బరువున్న జీశాట్-14 ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తోడుగా: జీఎస్ఎల్వీ కార్యక్రమంలో ఇస్రోకు ఇతర సంస్థలు సహకరించాయి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కీలక పాత్రపోషించింది. ప్రొఫెల్లెంట్ ట్యాంకులు, ముఖ్యంగా ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్ ట్యాంకులను, మొదటిదశ చుట్టూ ఉన్న స్ట్రాప్ ఆన్ బూస్టర్ మోటార్లను హెచ్ఏఎల్ సమకూర్చింది. జీఎస్ఎల్వీ వ్యవస్థల నిర్మాణం కోసం ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం ఉన్న పదార్థాలను హైదరాబాద్‌లోని మిథాని అందించింది. ఎంటీఏఆర్ ఇండస్ట్రీస్, గోద్రెజ్-బోయ్స్, ఆంధ్రా షుగర్స్ (లిక్విడ్ ప్రొపెల్లెంట్స్), అనంత్ టెక్నాలజీస్ వంటి ప్రైవేట్ పరిశ్రమలు కూడా జీఎస్ఎల్వీ-డీ5 విజయంలో పాలుపంచుకున్నాయి. అత్యాధునిక కమ్యూనికేషన్స్ ఉపగ్రహం: ఇస్రో నిర్మించిన 23వ జియోస్టేషనరీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-14. ఇది ఒక అత్యాధునిక కమ్యూనికేషన్స్ ఉపగ్రహం. దీని బరువు 1,982 కిలోలు. ఎక్స్టెండెడ్ సి-బ్యాండ్, కేయూ-బ్యాండ్ ట్రాన్స్పౌండర్ల సామర్థ్యాన్ని పెంచడం, నూతన పరిశోధనలు నిర్వహించడం జీశాట్-14 ప్రధాన లక్ష్యాలు. ఇందులో ఆరు ఎక్స్టెండెడ్ సి-బ్యాండ్ ట్రాన్స్పౌండర్లను ఏర్పాటు చేశారు. ఈ ఉపగ్రహం భారత ప్రధాన భూభాగాన్ని కవర్ చేస్తుంది. ఆరు కేయూ-బ్యాండ్ (Ku&-band) ట్రాన్స్పౌండర్లతోపాటు రెండు కా-బ్యాండ్ (Ka&-band) ట్రాన్స్పౌండర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ఫైబర్ ఆప్టికల్ గైరో, ఏక్టివ్ పిక్సల్ సన్ సెన్సర్, కా-బ్యాండ్ బీకన్, థర్మల్ కంట్రోల్ కోటింగ్ వంటి కొత్త టెక్నాలజీలను ఈ ఉపగ్రహంలో పరీక్షించనున్నారు. దీని జీవిత కాలం 12 ఏళ్లు. ప్రస్తుతం కార్యచరణలో ఉన్న తొమ్మిది జియోస్టేషనరీ ఉపగ్రహాలతోపాటు జీశాట్-14 సేవలను అందిస్తుంది. దీనిలోని రెండు సోలార్ ప్యానెళ్లు 2,600 వాట్స్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. సూర్యగ్రహణ సమయంలో ఇందులోని తేలికపాటి లిథియం ఆయాన్ బ్యాటరీలు ఉపగ్రహానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. టెలిమెడిసిన్, టెలిఎడ్యుకేషన్ రంగాల్లో జీశాట్-14 సేవలను అందించనుంది. వైఫల్యం నుంచి విజయం: జీఎస్ఎల్వీ కార్యక్రమం 1990లో ప్రారంభమైంది. దీనికి పూర్వం శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎల్వీ)-3, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఏఎస్ఎల్వీ) అనే పరిశోధన నౌకలను పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) కార్యాచరణ నౌకలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసింది. పీఎస్ఎల్వీ మొదటి ప్రయోగం విఫలమైనప్పటికీ ఆ తర్వాత జరిగిన 24 పీఎస్ఎల్వీ ప్రయోగాలు వరుసగా విజయవంతమయ్యాయి. పలు విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించారు. దాంతో విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడం సాధ్యమైంది. ఇస్రో వాణిజ్య విభాగమైన ఆంత్రిక్స్ కార్పొరేషన్ (Antrix Corporation) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,300 కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించింది. పలు దేశాలు తమ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించడానికి ఆసక్తి చూపుతుండడంతో ఆదాయం 15 శాతానికి పైగా పెరగొచ్చని ఆంత్రిక్స్ అంచనా వేస్తోంది. జీఎస్ఎల్వీ ప్రయోగాలు మరిన్ని విజయవంతమైతే దేశీయ కమ్యూనికేషన్స్ రంగాన్ని విస్తరించవచ్చు. అంతేకాకుండా డీటీహెచ్ (DTH), వీడియోకాన్ఫరెన్స్, టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, వీశాట్ (very small aperture terminal -VSAT) సేవలు విస్తృత స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. విదేశీ ఉపగ్రహాలను కూడా జీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించడానికి వీలవుతుంది. అయితే జీఎస్ఎల్వీ ద్వారా 2,000 కిలోలకుపైగా బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించడం ప్రస్తుతానికి సాధ్యం కాకపోవడంతో ఇన్శాట్ ఉపగ్రహాలను ఏరియేన్ స్పేస్ సంస్థకు చెందిన రాకెట్ ఏరియేస్ ద్వారా ప్రయోగిస్తుంది. వచ్చేస్తోంది మార్క్-3: 4,500-5,000 కిలోల బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సైతం ప్రయోగించే సామర్థ్యం ఉన్న జీఎస్ఎల్వీ-మార్క్ 3 రాకెట్‌ను ఇస్రో అభివృద్ధి చేస్తోంది. దీని బరువు 600 టన్నులు. దీనిలో అధిక శక్తిమంతమైన క్రయోజనిక్ ఇంజిన్ మూడో దశలో ఉంటుంది. దీన్ని చంద్రయాన్-2 ప్రయోగంలో కూడా ఇస్రో వినియోగించనుంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించడానికి జీఎస్ఎల్వీ-డీ5 మంచి స్ఫూర్తినిచ్చింది. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, చైనా, రష్యాల తర్వాత దేశీయ క్రయోజనిక్ ఇంజిన్ సామర్థ్యాన్ని సాధించిన దేశంగా భారత్ ఘనత సాధించింది. ఇలా కేవలం కొన్ని దేశాలకే పరిమితమైన అంతరిక్ష విజ్ఞానం ద్వారా ఇస్రో భవిష్యత్‌లో ఎంతో లాభపడనుంది. అన్ని దేశాలతో పోల్చితే స్వల్ప ఖర్చుతో అంతరిక్ష టెక్నాలజీని ఇస్రో అభివృద్ధి చేయడం కూడా భారత అంతరిక్ష కార్యక్రమానికి ఎంతో మేలు చేస్తుంది. క్రయోజెనిక్స్ అంటే అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే సాంకేతిక పరిజ్ఞానం-క్రయోజెనిక్స్. అంటే మైనస్ 150 డిగ్రీలు, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పదార్థాలపై అధ్యయనాన్ని క్రయోజెనిక్స్ అంటారు. ఈ రకమైన టెక్నాలజీని రాకెట్ ఇంజిన్ల తయారీలో ఉపయోగిస్తారు. వీటి సామర్థ్యం ఎక్కువగా ఉండటమే కాకుండా ప్రతి కిలో ఇంధనానికి ఉత్పత్తయ్యే బలం కూడా ఎక్కువ. ఉపగ్రహాలను ప్రయోగించే రాకెట్లలోనే కాకుండా క్షిపణులలో కూడా ఈ రకమైన ఇంజిన్లను ఉపయోగిస్తారు. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, చైనా, రష్యా దేశాలు మాత్రమే ఈ విధమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. కేవలం స్వదేశీ ఉపగ్రహాలతోపాటు ఇతర దేశాల ఉపగ్రహాలను ప్రయోగించడం, తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు జరిగిన జీఎస్ఎల్వీ ప్రయోగాలు వాహక నౌక ప్రయోగ తేదీ ఉపగ్రహం ఫలితం జీఎస్ఎల్వీ-డీ1 18-04-2001 జీశాట్-1 విజయం జీఎస్ఎల్వీ-డీ2 08-05-2003 జీశాట్-2 విజయం జీఎస్ఎల్వీ-ఎఫ్01 20-09-2004 ఎడ్యూశాట్ విజయం జీఎస్ఎల్వీ-ఎఫ్02 10-07-2006 ఇన్శాట్-4సీ విఫలం జీఎస్ఎల్వీ-ఎఫ్04 02-09-2007 ఇన్శాట్-4సీఆర్ విజయం జీఎస్ఎల్వీ-డీ3 15-04-2010 జీశాట్-4 విఫలం జీఎస్ఎల్వీ-ఎఫ్06 25-12-2010 జీశాట్-5పీ విఫలం జీఎస్ఎల్వీ-డీ5 05-01-2014 జీశాట్-14 విజయం -
భవ్యమైన కెరీర్‌కు రాచబాట.. నెస్ట్
ఇంటర్మీడియెట్ తర్వాత అధిక శాతం మంది విద్యార్థుల చూపు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వైపే.. అలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తే ఎన్నో చక్కని అవకాశాలు కనిపిస్తాయి.. తద్వారా భవ్యమైన కెరీర్‌కు బాటలు వేసుకోవచు. శాస్త్రసాంకేతిక రంగంలో ఎన్నో చిక్కుముడులకు సమాధానాన్ని అన్వేషించే పరిశోధన కార్యకలాపాల్లో పాలుపంచుకునే అవకాశాలు కల్పిస్త్తుంది.. నెస్ట్ (నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్). ఈ పరీక్ష ద్వారా దేశంలోని మూడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్సీ)లో ప్రవేశాన్ని ఖాయం చేసుకోవచ్చు. సైన్స్ పట్ల అమితాసక్తి కలిగి శాస్త్ర, పరిశోధన రంగాల్లో ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షించే విద్యార్ధులకు చక్కని వేదిక నెస్ట్ (నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్). దేశంలో విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించడానికి.. శాస్త్రీయ వైఖరులను పెంపొందించేందుకు నెస్ట్‌కు రూపకల్పన చేశారు. ఈ క్రమంలో మొదటి సారిగా 2007లో ఈ పరీక్షను నిర్వహించారు. పెరిగిన పోటీ: గతంతో పోల్చితే ప్రస్తుతం నెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2009లో 70 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సారి హాజరయ్యే విద్యార్థుల సంఖ్య లక్షపైగానే ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో విద్యార్థుల స్పందనను దృష్టిలో ఉంచుకుని నైసర్ కూడా సీట్లను క్రమంగా పెంచుతోంది. గతేడాది 60 సీట్లు ఉండగా..ఈ సారి సీట్లను 100కు పెంచారు. అదేవిధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్-ముంబై కూడా సీట్ల సంఖ్యను 35కు పెంచింది. పరీక్ష ఇలా: పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఎన్సీఆర్టీఈ/సీబీఎస్ఈ 11, 12వ తరగతుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు రూపొందిస్తారు. ఇందులో ఐదు విభాగాలు ఉంటాయి. మొత్తం మార్కులు 200. ప్రతి విభాగానికి 50 మార్కులు కేటాయించారు. వీటికి మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. సెక్షన్-1 అందరికీ కామన్. ఇందులో విద్యార్థుల అవగాహనను పరీక్షించే విధంగా జనరల్ సైన్స్, రీజనింగ్, కాంప్రెహెన్షన్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సెక్షన్-2 నుంచి 5 వరకు ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి నాలుగు విభాగాల్లో ప్రశ్నలు ఇస్తారు. ఈ నాలుగు విభాగాల్లో ఏవైనా మూడు విభాగాలకు మాత్రమే సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులోని ప్రశ్నలు విద్యార్థుల విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని, గ్రహణ శక్తిని పరీక్షించే విధంగా ఉంటాయి. ఈ విభాగాలకు నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. కొన్ని ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉంటాయి. ఇటువంటి ప్రశ్నలకు అన్ని సరైన సమాధానాలను గుర్తించినప్పుడే మార్కులు కేటాయిస్తారు. ప్రయోజనాలు: నైసర్, సీఈఎస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులో చేరిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందజేసే (నెలకు రూ. 5 వేలు) ఇన్స్పైర్ స్కాలర్‌షిప్‌నకు అర్హత లభిస్తుంది. సమ్మర్ ప్రాజెక్ట్‌కు రూ. 20 వేల గ్రాంట్ ఇస్తారు. చివరి సెమిస్టర్లో విద్యార్థులు సాధించిన గ్రేడ్ల ఆధారంగా బార్క్ ట్రైనింగ్ స్కూల్ అడ్మిషన్స్ కోసం నిర్వహించే ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావచ్చు. బార్క్‌లో ఏడాది శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని బార్క్, రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వేరీబుల్ ఎనర్జీ సైక్లోట్రోన్ సెంటర్ వంటి సంస్థల్లోని ఆర్ అండ్ డీ విభాగంలో రిక్రూట్ చేసుకుంటారు. ప్రవేశం కల్పించే ఇన్స్టిట్యూట్లు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-భువనేశ్వర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్-డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (ముంబై యూనివర్సిటీ) ఇంటిగ్రేటెడ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్,విశ్వభారతి-శాంతినికేతన్ ఆఫర్ చేసే కోర్సు: ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ముఖ్య తేదీలు: ఆఫ్‌లైన్/ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 8, 2014 అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్: ఏప్రిల్ 8, 2014 రాత పరీక్ష తేదీ: మే 31, 2014 రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం. ఫలితాలు వెల్లడి: జూన్ 20, 2014. వెబ్సైట్: www.nestexam.in నెస్ట్-2014 సమాచారం: అర్హత: 60 శాతం మార్కులతో 12వ తరగతి/తత్సమానం (బయాలజీ/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ). చివరి సంవత్సరం, 2012,13 సంవత్సరం ఉత్తీర్ణులు కూడా అర్హులే. వయసు: జనరల్, ఓబీసీ విద్యార్థులు 1994, జూలై 22 రోజు లేదా తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడీ విద్యార్థులకు ఐదేళ్ల వయోసడలింపునిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ రెండు విధాలుగా. దరఖాస్తు: జనరల్/ఓబీసీ-రూ.700 (ఎస్సీ/ఎస్టీ/పీడీ-రూ.350) జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష కాబట్టి జ్ఞాపకశక్తి కంటే అవగాహనకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాధ్యమైనన్నీ గత ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. దీని వల్ల సమస్య పరిష్కారంలో వేగంతోపాటు కచ్చితత్వం అలవడుతుంది. ముఖ్య ఫార్ములాలు, కీలక పాయింట్లపై క్రమ పద్ధతిలో అవగాహన పెంచుకోవడం మంచిది. ఎంట్రెన్స్‌లో ఒకే ప్రశ్న కోసం ఎక్కువ సమయం కేటాయించడం మంచిది కాదు. సమాధానం తెలియకపోతే మరొక ప్రశ్నను ప్రయత్నించడం ఉత్తమం. సెక్షన్ల వారీగా సమయ విభజన చేసుకోవాలి. విరామం, మైండ్ రిలాక్స్ కోసం 10 నిమిషాలు కేటాయించుకోవాలి. విపరీతమైన పోటీ ఉండే ఈ ఎంట్రెన్స్లలో ఈ పద్ధతి ఎంతో లాభం చేకూరుస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాన్సెప్ట్ బేస్డ్గా ఉండే ప్రశ్నలను ముందు ఎంచుకోండి. వీటి పరిష్కారానికి తక్కువ సమయం పట్టడమే కాకుండా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మిగతా విభాగాలను ఆత్మవిశ్వాసంతో చేయడానికి ఇది ఉపకరిస్తుంది. రిఫరెన్స్ బుక్స్: సబ్జెక్ట్‌ల వారీగా సీబీఎస్ఈ/ఎన్సీఆర్టీఈ పుస్తకాలు. జనరల్ జనరల్ విభాగానికి ప్రత్యేకంగా ఎటువంటి సిలబస్‌ను పేర్కొనలేదు. ఆయా అంశాల్లో విద్యార్థుల అవగాహన స్థాయిని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. ఈ క్రమంలో ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్‌కు సంబంధించిన పరిణామక్రమం, ఆయా శాస్త్రాలపై ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. రీడింగ్ కాంప్రెహెన్షన్ నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఇచ్చే వ్యాసాలు కూడా సైన్స్ అంశాలాధారితంగా ఉంటాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి కూడా కొన్ని ప్రశ్నలు ఇస్తారు. వీటిని సాధించడానికి 10వ తరగతి స్థాయి గణిత పరిజ్ఞానం అవసరం. గ్రాఫ్, వెన్డయాగ్రామ్ ఆధారిత ప్రశ్నలు కూడా వస్తాయి. మ్యాథమెటిక్స్ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, అనలిటికల్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, వెక్టార్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవి సాధారణంగా ఇంటర్మీడియెట్‌లో ఉండే అంశాలే. ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షలు, ఎంసెట్, జేఈఈ వంటి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల దృష్టి కోణంలో ప్రిపరేషన్ సాగిస్తుంటారు. కాబట్టి ఆ తరహా విధానాన్నే నెస్ట్‌కు అనుసరించండి. ఎంసెట్, జేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్) ముగిసిన తర్వాత (మే 31న) నెస్ట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత ప్రశ్నాపత్రాలను ఒక్కసారి పరిశీలిస్తూ సంబంధిత సమస్యలను ప్రాక్టీస్ చేయడం మంచిది. ప్రతి అంశంలో ఐపీఈ, ఎంసెట్, జేఈఈ స్థాయి ప్రశ్నలను క్రమంలో సాధన చేయాలి. వాటిని తార్కికంగా విశ్లేషించాలి. ఫిజిక్స్ మెకానిక్స్, థర్మల్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం, ఆప్టిక్స్, మోడ్రన్ ఫిజిక్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష కాబట్టి ప్రాబ్లమ్ లేదా ఫార్ములా దృక్పథంతోనే కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్రశ్నలు అడిగే ఆస్కారం ఎక్కువ. కాబట్టి మ్యాథమెటికల్ స్కిల్స్‌ను కూడా అలవర్చుకోవాలి. సిలబస్‌లోని అంశాలను సూత్రాలు, భావనలు, నిర్వచనాలపై పట్టు సాధించాలి. ఫిజిక్స్ పేరుకు థియరీ సబ్జెక్టయినప్పటికీ సమస్య సాధన ప్రక్రియలతో కూడిన సబ్జెక్ట్. ఒక సమస్య సాధనకు ఉపక్రమించే ముందు కచ్చితంగా సంబంధిత ప్రాథమిక భావనలు, సంబంధిత చాప్టర్లోని ఫార్ములా చార్ట్ ప్రిపరేషన్‌ను పూర్తి చేసుకునుండాల్సిందే. ఫిజిక్స్‌లో కొన్ని చాప్టర్ల మధ్య అంతర్గత సంబంధం ఉంటుంది. ఉదాహరణకు ఎలక్ట్రో స్టాటిక్స్ చాప్టర్‌పై పరిపూర్ణ అవగాహన పొందితే అందులోని కాన్సెప్ట్‌లనే కొద్దిపాటి మార్పులతో గ్రావిటేషన్, మ్యాగ్నటిజం చాప్టర్లలో కూడా అన్వయించవచ్చు. థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్‌లో కొన్ని అంశాలు ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండింటిలోనూ ఉన్నాయి. వీటిని చదివేటప్పుడు ఆ రెండు సబ్జెక్టుల సిలబస్‌ను పరిశీలిస్తూ చదివితే సమయం ఆదా అవుతుంది. ఆప్టిక్స్ విషయంలో.. జామెట్రికల్ ఆప్టిక్స్ కంటే తక్కువ సిలబస్ ఉండే వేవ్ ఆప్టిక్స్‌ను ముందు పూర్తి చేయాలి. మెకానిక్స్‌లో అధికశాతం ప్రాబ్లమ్స్ ‘లా ఆఫ్ కన్జర్వేషన్’ ఆఫ్ ‘లీనియర్ మొమెంటమ్, ఎనర్జీ, యాంగ్యులర్ మొమెంటమ్లకు సంబంధించినవే. కాబట్టి విద్యార్థులు వీటికి సంబంధించిన సిద్ధాంతాలు, పరిమితులు, సూత్రాలపై బాగా అవగాహన ఏర్పరచుకోవాలి. కెమిస్ట్రీ కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అంశాలు నేర్చుకున్నంత త్వరగా విస్మృతికి దారి తీస్తాయి. దీంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో స్టేట్స్ ఆఫ్ మేటర్; సొల్యూషన్స్; యాసిడ్స్ అండ్ బేసెస్; ఎలక్ట్రో కెమిస్ట్రీ; థర్మో డైనమిక్స్; సాలిడ్ స్టేట్; కెమికల్ కెనైటిక్స్; ఈక్విలిబ్రియం; కెమికల్ ఎనర్జిటిక్స్ కీలకమైనవి. ఈ నేపథ్యంలో సంబంధిత సూత్రాలను, ముఖ్యమైన అంశాలను నిరంతరం ప్రాక్టీస్ చేయడం వాటిని కూడా పాయింటర్ అప్రోచ్‌లో రూపొందించుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మూలకాల సాధారణ ధర్మాల మధ్య పోలికలు, భేదాలను బేరీజు వేసుకుని వాటిని నోట్స్ రూపంలో పొందుపర్చుకోవాలి. ముఖ్యంగా ఆయా అంశాల తయారీలో ఇమిడిఉన్న ధర్మాలు ఉదాహరణకు ఎలక్ట్రోడ్స్; ఎలక్ట్రోలైట్స్; మూలకాలు; ఎలిమెంట్స్ వంటి వాటి విషయంలో టాబ్యులేషన్ అప్రోచ్ ఎంతో ఉపకరిస్తుంది. బయాలజీ బయాలజీ అంటే బోటనీ, జువాలజీ రెండు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెల్ బయాలజీ, అనాటమీ-ఫిజియాలజీ, ఎకాలజీ, బోటనీ, హ్యూమన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సీబీఎస్ఈ సిలబస్‌ను అనుసరించి ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు. కాబట్టి బోర్డ్ సిలబస్‌కు-నెస్ట్ సిలబస్‌కు స్వల్ప తేడాలు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో బోర్డ్ సిలబస్‌ను చదువుతున్నప్పుడే బోటనీ, జువాలజీకి సంబంధించి ఆయా అంశాలలో నెస్ట్ సిలబస్‌కు సంబంధించి ఏయే అంశాలు ఇమిడి ఉన్నాయో క్షుణ్నంగా పరిశీలించాలి. దానికి అనుగుణంగా తమ సాధన కొనసాగించాలి. ఉదాహరణ: కుందేలు-వ్యవస్థలు చదువుతున్నప్పుడే ఆయా వ్యవస్థలకు సంబంధించి మానవుల వివిధ వ్యవస్థలలోని తేడాలను జాగ్రత్తగా గమనించి ఆ వివరాలను ప్రత్యేకంగా క్రోడీకరించుకోవాలి. ఒక్కొక్క చాప్టర్లోఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలో ఉండి తెలుగు అకాడెమీ పుస్తకాలలో లేని విషయాలను గుర్తించి వాటికి సినాప్సిస్ సిద్ధం చేసుకోవాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఒక అంశానికి సంబంధించి సోదాహరణంగా వివరణలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మొత్తం అంశం నుంచి అవసరమైన దాన్ని గ్రహించే విధంగా రీడింగ్ స్పీడ్ పెంచుకోవాలి. ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏఐపీఎంటీ), జిప్మర్, ఏఎఫ్ఎంసీ పరీక్షల గత అయిదారేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. దీనివల్ల జాతీయ స్థాయి ఎంట్రన్స్‌లలో అడిగే ప్రశ్నల క్లిష్టతపై అవగాహన వస్తుంది. -
‘ఇండియన్ రైన్’ అని ఏ నదిని పిలుస్తారు?
1.ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) మంత్రిత్వ స్థాయి సమావేశం 2013, డిసెంబర్లో ఎక్కడ జరిగింది? 1) జెనీవా 2) దోహా 3) బాలి 4) టోక్యో 2.గతేడాది డిసెంబర్ 5న మరణించిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు నోబెల్ శాంతిబహమతి ఏ సంవత్సరంలో లభించింది? 1) 1990 2) 1991 3) 1989 4) 1993 3.కాత్యాయనీ విద్మహేకు 2013 సంవత్సరానికి ఏ అవార్డు లభించింది? 1) జ్ఞాన్‌పీఠ్ అవార్డు 2) మూర్తీదేవీ అవార్డు 3) కేంద్రసాహిత్య అకాడమీ పుర స్కారం 4) కాళిదాస్ సమ్మాన్పురస్కార్ 4.చెన్నై ఓపెన్ టెన్నిస్ విజేత? 1) స్టాన్స్లాస్ వావ్రింకా 2) రోజెర్ వాసెలీన్ 3) రోజర్ ఫెదరర్ 4) ఆండీ ముర్రే 5.రమణ్‌సింగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు? 1) మధ్యప్రదేశ్ 2) రాజస్థాన్ 3) ఛత్తీస్‌గఢ్ 4) మిజోరం 6.వీకే దుగ్గల్ ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యారు? 1) మేఘాలయ 2) సిక్కిం 3) నాగాలాండ్ 4) మణిపూర్ 7.కామన్వెల్త్ దేశాధినేతల సదస్సు (చోగమ్) 2013, నవంబర్‌లో ఎక్కడ జరిగింది? 1) పెర్త్ 2) కొలంబో 3) న్యూఢిలీ 4) కౌలాలంపూర్ 8.భారతీయ మహిళా బ్యాంక్ తొలిశాఖను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గతేడాది నవంబర్ 19న ఎక్కడ ప్రారంభించారు? 1) ముంబై 2) న్యూఢిల్లీ 3) ైెహ దరాబాద్ 4) జైపూర్ 9.ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన భాషా, సాంస్కృతిక శాఖను ఎవరికి కేటాయించారు? 1) శైలజానాథ్ 2) కె. జానారెడ్డి 3) వట్టి వసంతకుమార్ 4) డి.కె.అరుణ 10.సునామీ :: జపాన్, సైక్లోన్ :: 1) గ్రీక్ 2) లాటిన్ 3) అరబ్బీ 4) ఇంగ్లిష్ 11.చిత్రావతి ఏ నదికి ఉపనది? 1) కృష్ణా 2) గోదావరి 3) పెన్నా 4) వంశధార 12.‘మానవసేవే మాధవ సేవ’ అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన సంస్థ? 1) దివ్యజ్ఞాన సమాజం 2) ఆర్య సమాజం 3) రామకృష్ణ మిషన్ 4) బ్రహ్మ సమాజం 13.గవర్నర్ కనీసం ఎంత కాలం తన పదవిలో కొనసాగవచ్చు? 1) ఐదేళ్లు 2) ఆరేళ్లు 3) ప్రధానమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 4) రాష్ట్రపతి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 14.షెడ్యూల్ బ్యాంకులను నియంత్రించేది? 1) ఫెడరల్ బ్యాంక్ 2) రిజర్వ్ బ్యాంక్ 3) పార్లమెంట్ 4) రాష్ట్రపతి 15.తొలి వేదకాలంలో ఆర్యుల నాయకున్ని ఏమని పిలిచేవారు? 1) రాజన్ 2) గ్రామణి 3) సేనాని 4) సేనాధిపతి 16.దేశాలన్నీ తమ ఆర్థిక కార్యకలాపాలను ప్రపంచమంతటా విస్తరించుకోవడాన్ని ఏమంటారు? 1) ఆధునికీకరణ 2) ప్రపంచీకరణ 3) నగరీకరణ 4) పైవన్నీ 17.ఆంధ్రప్రదేశ్‌లో కాఫీ తోటల పెంపకాన్ని ఏ జిల్లాలో చేపడుతున్నారు? 1) వరంగల్ 2) పశ్చిమగోదావరి 3) విశాఖపట్టణం 4) చిత్తూరు 18.రక్తచందనం చెట్లు ఏ జిల్లాలో ఉన్నాయి? 1) నెల్లూరు 2) నిజామాబాద్ 3) చిత్తూరు 4) ప్రకాశం 19.‘ఇండియన్ రైన్’ అని ఏ నదిని పిలుస్తారు? 1) గంగ 2) గోదావరి 3) కృష్ణా 4) బ్రహ్మపుత్ర 20.ఎర్రరక్త కణాల జీవితకాలం? 1) 24 గంటలు 2) 100 రోజులు 3) 120 రోజులు 4) ఏడాది 21.కంటికి కనిపించే కాంతి తరంగదైర్ఘ్యం ఎంత? 1) 400-700 నానోమీటర్లు 2) 800-1000 నానోమీటర్లు 3) 400-500 నానోమీటర్లు 4) లక్ష నానోమీటర్లు 22.మిశ్రమ గ్రంథి అని దేన్ని అంటారు? 1) పిట్యూటరీ 2) క్లోమం 3) అధివృక్క 4) అవటుగ్రంథి 23.పిండాన్ని-తల్లి గర్భాశయ కుడ్యానికి కలిపే నిర్మాణాన్ని ఏమంటారు? 1) అండకోశం 2) వృక్కనాళం 3) పిత్తాశయం 4) జరాయువు 24.ఎయిడ్స్ వల్ల నశించే రక్తకణాలేవి? 1) లింపోసైట్స్ 2) మోనోసైట్స్ 3) బేసోఫిల్స్ 4) థ్రాంబోసైట్స్ 25.వేడిచేయడం వల్ల నశించే విటమిన్? 1) బి 2) సి 3) డి 4) ఇ 26.ఒక గ్రాము గ్లూకోజ్ నుంచి ఎంత శక్తి విడుదలవుతుంది? 1) 3 కిలో కేలరీలు 2) 4 కిలో కేలరీలు 3) 5 కిలో కేలరీలు 4) 6 కిలో కేలరీలు 27.మిత స్థిర స్థాయిలో ఎలక్ట్రాన్ల జీవిత కాలం? 1) 10-8 సెకన్లు 2) 3ప10-8సెకన్లు 3) 10-3 సెకన్లు 4) 3ప10-3 సెకన్లు 28.ఆంధ్రప్రదేశ్‌లో అయస్కాంత క్షేత్ర తీవ్రత విలువ సుమారుగా? 1) 10-4 టెస్లా 2) 0.39ప10-6 టెస్లా 3) 0.39ప10-4 టెస్లా 4) 0.39ప10-3 టెస్లా 29.ప్రెషర్కుక్కర్లో ఉష్ణోగ్రత సుమారుగా? 1) 120 డిగ్రీల సెంటీగ్రేడ్ 2) 100 డిగ్రీల సెంటీగ్రేడ్ 3) 108 డిగ్రీల సెంటీగ్రేడ్ 4) 150 డిగ్రీల సెంటీగ్రేడ్ 30.ఈథేన్ నుంచి ఏ పద్ధతి ద్వారా పాలిథీన్‌ను పొందవచ్చు 1) కాటనేషన్ 2) ప్రతిక్షేపణ 3) పొలిమరీకరణం 4) సంకలనం 31.2,000 నుంచి 10,000 హెక్టార్ల భూమికి నీటి పారుదల అందించే ప్రాజెక్టులు ఏ తరహాకి చెందినవి? 1) చిన్న నీటిపారుదల 2) మధ్య తరహా నీటిపారుదల 3) భారీ నీటిపారుదల 4) సాధారణ నీటిపారుదల 32.ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా నీటి పారుదలను కల్పిస్తున్న వనరులు? 1) బావులు 2) చెరువులు 3) కాలువలు 4) నదులు 33.కలంకారి వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం? 1) శ్రీకాకుళం 2) సిరిసిల్ల 3) మచిలీపట్నం 4) తూర్పుగోదావరి 34.2006, సెప్టెంబర్ 1న రాజీవ్ స్వగృహ పథకాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు? 1) రంగారెడ్డి 2) మహబూబ్‌నగర్ 3) శ్రీకాకుళం 4) గుంటూరు 35.‘దక్షిణ గంగా’ అని ఏ నదిని పిలుస్తారు? 1) గోదావరి 2) కృష్ణా 3) పెన్నా 4) ప్రాణహిత 36.పట్టణ ప్రాంత నిరుపేదలకు ఉచితంగా అపార్ట్మెంట్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం? 1) రాజీవ్ స్వగృహ 2) రాజీవ్ గృహకల్ప 3) ఇందిరమ్మ 4) రాజీవ్ ఆవాస్‌యోజన 37.బీడీ తయారీకి ఉయోగించే తునికాకు ఏ ప్రాంతంలో లభిస్తోంది? 1) రాయలసీమ 2) ఉత్తరాంధ్ర 3) దక్షిణాంధ్ర 4) తెలంగాణ 38.గ్రామీణ ప్రాంత సమస్యల పరిష్కారానికి రాజీవ్ పల్లెబాట కార్యక్రమాన్ని 2004 జూన్ 13న ఎక్కడ ప్రారంభించారు? 1) రంగారెడ్డి జిల్లా - చేవెళ్ల 2) రంగారెడ్డి జిల్లా - రాజేంద్రనగర్ 3) మహబూబ్‌నగర్ జిల్లా - షాద్‌నగర్ 4) శ్రీకాకుళం జిల్లా - నందిగాం 39. పట్టణ ప్రాంత సమస్యల పరిష్కారానికి 2005 జనవరి 9న రాజీవ్‌నగర బాట కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు? 1) హైదరాబాద్ 2) చిత్తూరు 3) కర్నూలు 4) రంగారెడ్డి 40. {పస్తుతం 104 , 108 సేవలను నిర్వహిస్తున్న సంస్థ? 1) సత్యం ఫౌండేషన్ 2) జీవీకే ఫౌండేషన్ 3) ప్రేమ్‌జీ ఫౌండేషన్ 4) పైవన్నీ 41. వైఎస్సార్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించిన తేదీ? 1) 2009, నవంబర్ 1 2) 2009, అక్టోబర్ 2 3) 2010, నవంబర్ 1 4) 2010, అక్టోబర్ 2 42. స్వయం సహాయక బృందాల మహిళలకు పింఛన్ అందించే పథకం ఏది? 1) పావలా వడ్డీ 2) ప్రజాపథం 3) వైఎస్సార్ అభయహస్తం 4) రచ్చబండ 43. వైశాల్యం పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? 1) రెండో 2) మూడో 3) నాలుగో 4) ఐదో 44. ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఎంత? 1) 974 కిలోమీటర్లు 2) 1000 కిలోమీటర్లు 3) 970 కిలోమీటర్లు 4) 990 కిలోమీటర్లు 45. వైఎస్సార్ అభయ హస్తం పథకంలో భాగంగా ఏ తరగతి చదివే విద్యార్థులకు రూ. 1,200 ఉపకారవేతనం అందజేస్తారు? 1) ఒకటి నుంచి పదోతరగతి 2) ఐదు నుంచి పదోతరగతి 3) 9 నుంచి పన్నెండో తరగతి 4) ఒకటి నుంచి ఐదో తరగతి 46. ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏ పేరుతో అమలు చేస్తున్నారు? 1) వైఎస్సార్ అభయహస్తం 2) ఇందిర జీవిత బీమా పథకం 3) అంబేద్కర్ జీవనధార 4) ఇందిరా క్రాంతి పథం 47. రాష్ర్టంలోని ఏ జిల్లాలో కొమరం భీమ్ ప్రాజెక్ట్ ఉంది ? 1) నిజామాబాద్ 2) కరీంనగర్ 3) ఆదిలాబాద్ 4) వరంగల్ 48. {V>Ð]l*-ÌZÏని వ్యవసాయ కూలీలకు భూమిలేని గ్రామీణ నిరుపేదలకు వర్తించే బీమా పథకం? 1) వైఎస్సార్ అభయహస్తం 2) ఇందిర జీవిత బీమా 3) ఇందిరా క్రాంతి 4) పైవన్నీ 49. ఉపగ్రహ సమాచారంతో భూసంబంధ ఫొటోలను సేకరించి కంప్యూటరీకరించే విధానాన్ని ప్రారంభించిన పథకం ఏది? 1) పొలంబందీ 2) ఇందిరప్రభ 3) రాజీవ్ అభ్యుదయ 4) భూభారతి 50. రాష్ర్టంలో బంగాళదుంపలు ఎక్కువగా పండే జిల్లా ఏది? 1) రంగారెడ్డి 2) మెదక్ 3) విజయనగరం 4) ప్రకాశం 51. 500 మంది దళితులు నివసించే ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించే పథకం ఏది? 1) అంబేద్కర్ మంచినీటిపథకం 2) అంబేద్కర్ జీవన ధార 3) ఇందిరా నీటి పథకం 4) రాజీవ్ నీటిపథకం 52. తెలంగాణలో ఖరీఫ్ పంటను ఏమని పిలుస్తారు? 1) అబి 2) తబి 3) దాళ్వా 4) సార్వా 53. రాష్ట్రంలో సహకార వ్యవస్థకు ఆద్యుడు ఎవరు? 1) పట్టాభి సీతారామయ్య 2) మోహన్‌కందా 3) ఎన్.టి.రామారావు 4) కొండా లక్ష్మణ్ బాపూజీ 54. సహకార వారోత్సవాలను ఏ తేదీల్లో నిర్వహిస్తారు? 1) నవంబర్ 1- 8 2) నవంబర్ 14-20 3) నవంబర్ 15- 20 4) నవంబర్ 2- 9 55. ఏకగవాక్ష విధానం (సింగిల్‌విండో సిస్టమ్) ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రారంభించారు? 1) ఎన్.టి.రామారావు 2) వైఎస్ రాజశేఖరరెడ్డి 3) వైద్యనాథన్ 4) మోహన్‌కందా 56. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (కోఆపరేటివ్ బ్యాంక్ -ఆప్కాబ్)ను ఎప్పుడు ప్రారంభించారు? 1) 1950 2) 1952 3) 1963 4) 1985 57. సహకార సంఘంలో కనీస సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి? 1) 10 2) 15 3) 25 4) ఎంతమందైనా ఉండొచ్చు. 58. ‘అందరికైతాను, తనైకై అందరూ’ అనే నినాదంతో ఏర్పడిన సంస్థ? 1) ట్రస్ట్ 2) కంపెనీ 3) సహకారసంఘాలు 4) భాగస్వామ్యసంస్థ 59. చేనేత సహకార సంఘాలు ఎవరి అధీనంలో పనిచేస్తాయి? 1) ఆప్కో 2) ఆప్కాబ్ 3) ఎస్బీఐ 4) ఆర్బీఐ 60. జనతా వస్త్రాలకు అత్యంత ఆదరణ కల్పించిన ముఖ్యమంత్రి ఎవరు? 1) వైఎస్ రాజశేఖరరెడ్డి 2) మొరార్జీదేశాయ్ 3) ఎన్.టి.రామారావు 4) మర్రిచెన్నారెడ్డి 61.కింది వాటిలో 3, 4, 5, 6, 8 లతో నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఏది ? 1) 80 2)100 3) 120 4) 160 62.4 మొదటి 6 గుణిజాల సరాసరి ఎంత? 1) 5 2) 14 3) 16 4) 22 63.మూడు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లలో ఎరుపు లైట్ ప్రతి 60 సెకన్లకోసారి 72 సెకన్లకోసారి, 120 సెకన్లకోసారి మారుతాయి. అవన్నీ ఉదయం 9 గంటలకు ఒకేసారి మారితే తిరిగి అవన్నీ ఒకేసారి ఏ సమయంలో మారుతాయి? 1) 9: 02 2) 9: 04 3) 9: 05 4) 9 : 06 64.ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఆఫీస్‌కు 15 కి.మీ./గంట వేగంతో ఆఫీస్ నుంచి ఇంటికి 60 కి.మీ/గంట వేగంతో ప్రయాణించాడు. మొత్తం ప్రయాణానికి పట్టిన కాలం 30 నిమిషాలు. అయితే ఆఫీస్ నుంచి ఇంటికి ఎంత దూరం? 1) 24 కి.మీ. 2) 12 కి.మీ. 3) 6 కి.మీ. 4) 3 కి.మీ. 65.రూ. 600 లను ఎ, బి అనే ఇద్దరు వ్యక్తులు 2 : 3 నిష్పత్తిలో పంచుకుంటే బి వాటా ఎంత? 1) రూ. 120 2) రూ. 240 3) రూ. 360 4) రూ. 480 66.రెండు సంఖ్యలు 5 : 3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి వ్యత్యాసం 10. అయిన అందులో చిన్న సంఖ్య? 1) 15 2) 25 3) 35 4) 45 67.వ్యాపారి ఒక వస్తువును రూ. 1600 లకు అమ్మితే 20 శాతం నష్టం వచ్చింది. అతనికి 10 శాతం లాభం రావాలంటే ఆ వస్తువును ఎన్ని రూపాయలకు అమ్మాలి? 1) రూ. 2,000 2) రూ. 2,200 3) రూ. 2,400 4) రూ. 2,500 68.తండ్రి ప్రస్తుత వయసు, అతని కొడుకు వయసుకు 4 రెట్లు. ఐదేళ్ల తర్వాత తండ్రి వయసు, కొడుకు వయసుకు 3 రెట్లు ఉంటుంది. అయితే ఐదేళ్ల క్రితం తండ్రి వయసు, కొడుకు వయసుకు ఎన్ని రెట్లు? 1) 5 రెట్లు 2) 6 రెట్లు 3) 7 రెట్లు 4) 9 రెట్లు గమనిక: ప్రస్తుతం తండ్రీ, కొడుకుల వయసులు- 40 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఐదు సంవత్సరాల తర్వాత తండ్రీ, కొడుకుల వయసులు 45 సంవత్సరాలు,15ఏళ్లు. ఐదేళ్ల కిందట వారి వయసులు 35సంవత్సరాలు, 5 సంవత్సరాలు 69.ఒక తరగతిలో గల 25 మంది విద్యార్థుల సరాసరి వయసు 12 సంవత్సరాలు. వారితో పాటు ఉపాధ్యాయుని వయసు కూడా కలిపితే సరాసరి ఒక సంవత్సరం పెరుగుతుంది. అయితే ఉపాధ్యాయుని వయసెంత? 1) 13 సంవత్సరాలు 2) 26 సంవత్సరాలు 3) 38 సంవత్సరాలు 4) ఏదీకాదు 70.20 మంది వ్యక్తులు 30 పనులను 30 రోజులలో పూర్తి చేయగలరు. అయితే 15 మంది వ్యక్తులు 180 పనులను ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? 1) 180 2) 120 3) 60 4) 56 71.ఒక వ్యక్తి తన ఆస్తిలో ముగ్గురు కొడుకులకు 20 శాతం వాటా ఇచ్చాడు. 30 శాతం ఆస్తిని తన భార్యకు, మిగిలిన దానిలో 50 శాతాన్ని అనాధాశ్రమానికి విరాళంగా ఇస్తే చివరగా అతని వద్ద రూ. 20 వేలు మిగిలాయి. అయితే అతని మొత్తం ఆస్తి ఎంత? 1) రూ. 4 లక్షలు 2) రూ. 6 లక్షలు 3) రూ. 2 లక్షలు 4) రూ. 5 లక్షలు 72.ఒక వ్యక్తి తన పనిలో 2/3 వ వంతును 12 రోజులలో పూర్తి చేశాడు. మిగిలిన పనిని ఎన్నిరోజులలో పూర్తి చేయగలడు? 1) 3 రోజులు 2) 6 రోజులు 3) 9 రోజులు 4) 12 రోజులు 73. వ్యాపారి ఒక వస్తువును కొన్న ధర కంటే 20 శాతం అధికంగా ముద్రించి 10 శాతం డిస్కౌంట్‌తో అమ్మాడు. అయితే అతనికిఎంత శాతం లాభం వస్తుంది? 1) 10 2) 8 3) 30 4) 15 74. అ ఒక పనిని 20 రోజులలో, ఆ అదే పనిని 36 రోజులలో చేయగలరు. అ ఒంటరిగా ఆపనిని ప్రారంభించిన 5 రోజుల తర్వాత పని నుంచి తప్పుకోగా, మిగిలిన పనిని ఆ ఎన్నిరోజులలో పూర్తి చేయగలడు? 1) 18 రోజులు 2) 27 రోజులు 3) 31 రోజులు 4) 25 రోజులు 75. ఒక నీళ్ల ట్యాంకును మొదటి కుళాయి 10 నిమిషాలలో, రెండో కుళాయి 15 నిమిషాలలో నింపగలవు. కానీ దాని అడుగున ఉన్న చిన్న రంధ్రం ద్వారా పూర్తిగా నిండి ఉన్న ట్యాంకు 30 నిమిషాలలో ఖాళీఅవుతుంది. అయితే ఆ రెండు కుళాయిలు ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది? 1) 7 నిమిషాల 50 సెకన్లు 2) 7 నిమిషాల 30 సెకన్లు 3) 12 నిమిషాల 40 సెకన్లు 4) 10 నిమిషాలు 76.ఎ, బి ల మధ్య దూరం 440 కి.మీ. ఒక వ్యక్తి ఎ నుంచి బి దిశలో గంటకు 50 కి.మీ. వేగంతో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాడు. మరో వ్యక్తి అదే సమయంలో బి నుంచి ఎ దిశలో గంటకు 60 కి.మీ. వేగంతో ప్రారంభమయ్యాడు. అయితే వీరిద్దరూ ఏసమయంలో కలుసుకుంటారు? 1) మధ్యాహ్నం 12.30 2) మధ్యాహ్నం 1.00 3) మధ్యాహ్నం 2.00 4) సాయంత్రం 4.00 77.ఒక చతురస్ర వైశాల్యం 31,250 చదరపుమీటర్లు. అయితే దాని కర్ణం ఎంత? 1) 250 మీటర్లు 2) 125 మీటర్లు 3) 210 మీటర్లు 4) 245మీటర్లు 78.ఒక సమబాహు చతుర్భుజం (రాంబస్) రెండు కర్ణాలు వరుసగా 12 మీ.,16 మీ. అయితే దాని చుట్టుకొలత ఎంత? 1) 40 మీటర్లు 2) 56 మీటర్లు 3) 60 మీటర్లు 4) ఏదీ కాదు 79.ఒక త్రిభుజం మూడు భుజాలు వరుసగా 9 మీటర్లు, 12 మీటర్లు, 15మీటర్లు. అయితే దాని వైశాల్యం ఎంత? 1) 1620 చ.మీ. 2) 243 చ.మీ. 3) 54 చ.మీ. 4) 36 చ.మీ. 80.పరీక్షలో పాస్ మార్కులు 40 శాతం. ఒక విద్యార్థికి పరీక్షలో 280 మార్కులు రావడంతో 40 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. అయితే ఆ విద్యార్థి పాసవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి? 1) 400 2) 600 3)750 4) 800 81.ఒక సంచిలో 20 పైసలు, 25 పైసలు, 50 పైసల నాణేలు 1: 2: 3 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ సంచిలో మొత్తం రూ. 220 లు ఉంటే 20 పైసల నాణేలు ఎన్ని ఉంటాయి? 1) 100 2) 200 3) 300 4) 400 82.30 లీటర్ల మిశ్రమంలో పాలు, నీళ్లు 11:1 నిష్పత్తిలో ఉన్నాయి. అందుల్లోంచి 6 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి దాని స్థానంలో 6 లీటర్ల నీరు పోస్తే, కొత్త మిశ్రమంలో పాలు, నీళ్ల నిష్పత్తి ఎలా ఉంటుంది? 1) 5:2 2) 9:5 3) 10:7 4) 11:4 83.ఒక వ్యక్తి రమేశ్‌కు రూ. 600లను నాలుగేళ్లకు, సురేశ్‌కు రూ. 800లను ఐదేళ్లకుగాను బారువడ్డీ ప్రకారం ఒకే వడ్డీ రేటుతో ఇచ్చాడు. వారిద్దరి నుంచి వచ్చిన వడ్డీ రూ. 320. అయితే వడ్డీరేటు ఎంత? 1) 2 శాతం 2) 3 శాతం 3) 4 శాతం 4) 5 శాతం 84.ఆర్నెల్లకోసారి లెక్కగట్టే పద్ధతిలో సంవత్సరానికి 10 శాతం వడ్డీరేటుతో రూ. 400లకు ఒక ఏడాదికి ఎంత చక్రవడ్డీ అవుతుంది? 1) రూ. 441 2) రూ. 41 3) రూ. 40 4) రూ. 44 85.రూ. 60 వేల పెట్టుబడితో ఎ అనే వ్యక్తి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. నాలుగు నెలల తర్వాత రూ. 80 వేల పెట్టుబడితో బి అనే వ్యక్తి ఆ వ్యాపారంలో చేరాడు. ఆ సంవత్సరం చివర వారికి రూ. 34 వేలు లాభం వస్తే అందులో ఎ వాటాఎంత? 1) రూ. 16 వేలు 2) రూ. 18 వేలు 3) రూ. 20 వేలు 4) రూ. 22 వేలు 86.ఒక వ్యాపారి కొన్న ధరకే వస్తువులను అమ్ముతున్నాడు. కానీ అమ్మేటప్పుడు కిలోకు బదులుగా 800 గ్రాముల సరుకు ఇస్తున్నాడు. అయితే అతనికి ఎంత శాతం లాభం వస్తుంది? 1) 25 2) 20 3) 18 4) 16 87.ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఆఫీస్‌కు 3 కి.మీ./గంట వేగంతో ప్రయాణించడం వల్ల 9 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. తర్వాత రోజు 4 కి.మీ/గంట వేగంతో ప్రయాణించడం వల్ల 6 నిమిషాలు త్వరగా చేరుకున్నాడు. అయితే ఇంటి నుంచి ఆఫీస్‌కు ఎంతదూరం? 1) 1 కి.మీ. 2) 2 కి.మీ. 3) 3 కి.మీ. 4) 4 కి.మీ. 88.200 మీటర్లు పొడవున్న రైలు 72 కి.మీ./గంట వేగంతో ప్రయాణిస్తే, నిలబడి ఉన్న వ్యక్తిని ఎంత సమయంలో దాటుతుంది? 1) 10 సెకన్లు 2) 10 నిమిషాలు 3) 20 సెకన్లు 4) 20 నిమిషాలు 89.0.5% = ? 1) 0.5 2) 0.05 3) 0.005 4) 0.0005 90.ఏ కనిష్ట సంఖ్యను కలిపితే 4,220 కచ్చిత వర్గమవుతుంది? 1) 2 2) 5 3) 8 4)16 91.ఒక కోడ్ భాషలో ఖీఅఆఔఉ ను ్ఖఇఉ్కఒ గా రాస్తే ఇఏఅఐఖ ను ఏవిధంగా పేర్కొనాలి? 1) DIBJS 2) DJDMW 3) DJCKT 4) EJDMW 92.2, 3, 8, 31, 154, 923.... ఈ సిరీస్‌లో తర్వాత వచ్చే సంఖ్య? 1) 6460 2) 6461 3) 5538 4) 5537 93.ఒక వ్యక్తి ఉత్తరం దిశలో 4 కి.మీ. ప్రయాణించి, కుడివైపు 8 కి.మీ. ప్రయాణించాడు. తర్వాత కుడివైపు 20 కి.మీ. ప్రయాణించి, చివరగా కుడివైపు మరో 20 కి.మీ. ప్రయాణించాడు. ఇప్పుడతను తన ప్రారంభ స్థలం నుంచి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? 1) ఈశాన్యం 20 కి.మీ. 2) నైరుతి 20 కి.మీ. 3) తూర్పు 16 కి.మీ. 4) దక్షిణం 12 కి.మీ. 94.కింది వాటిలో భిన్నంగా ఉంది? 1) చతురస్రం 2) దీర్ఘచతురస్రం 3) త్రిభుజం 4) సమబాహుత్రిభుజం 95.ధీరజ్ వేదికపై బహుమతి తీసుకుంటున్న అమ్మాయిని పరిచయం చేస్తూ - ఆమె తల్లి, నా తండ్రి ఏకైక కొడుకు భార్య అని చెప్పాడు. అయితే ధీరజ్‌కు ఆ అమ్మాయి ఏమవుతుంది? 1) భార్య 2) సోదరి 3) తల్లి 4) కూతురు 96.2018వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏవారం 5 సార్లు వస్తుంది? 1) ఆదివారం 2) మంగళవారం 3) శుక్రవారం 4) ఏదీకాదు 97.కింది శ్రేణిలో తర్వాత వచ్చే అక్షరాన్ని కనుక్కోండి? A, C, F, J, O .................... 1) U 2) T 3) S 4) R 98.తమిళనాడు : చెన్నై :: కర్ణాటక :: 1) మంగుళూరు 2) బెంగళూర్ 3) త్రివేండ్రం 4) గాంధీనగర్ 99.C = 9, E = 25, G = 49 అయితే కింది వాటిలో సరైంది? 1) B = 4, F = 36 2) D = 4, M = 36 3) C = 4, R = 36 4) H = 8, I = 36 100. 1) 2) 3) 4) Answers 1) 3 2) 4 3) 3 4) 1 5) 3 6) 4 7) 2 8) 1 9) 3 10) 1 11) 3 12) 3 13) 4 14) 2 15) 1 16) 2 17) 3 18) 3 19) 2 20) 3 21) 1 22) 2 23) 4 24) 1 25) 2 26) 2 27) 4 28) 3 29) 1 30) 3 31) 2 32) 1 33) 3 34) 1 35) 1 36) 2 37) 4 38) 1 39) 4 40) 2 41) 1 42) 3 43) 3 44) 1 45) 3 46) 2 47) 3 48) 2 49) 4 50) 2 51) 2 52) 1 53) 1 54) 2 55) 4 56) 3 57) 1 58) 3 59) 1 60) 3 61) 3 62) 2 63) 4 64) 3 65) 3 66) 1 67) 2 68) 3 69) 3 70) 2 71) 1 72) 2 73) 2 74) 2 75) 2 76) 3 77) 1 78) 1 79) 3 80) 4 81) 1 82) 4 83) 4 84) 2 85) 2 86) 1 87) 3 88) 3 89) 3 90) 2 91) 2 92) 1 93) 2 94) 3 95) 4 96) 4 97) 1 98) 2 99) 1 100) 4 రూపొందించినవారు విజయేందర్ రెడ్డి - కరెంట్ అఫైర్స బి. శ్రీనివాస్ - సోషల్ స్టడీస్ ఎస్. సత్యనారాయణ - బయాలజీ నాగరాజశేఖర్ - ఫిజికల్ సైన్స అల్లాడి అంజయ్య - గ్రామీణాంశాలు బి. రవిపాల్ రెడ్డి - అర్థమెటికల్, లాజికల్ రీజనింగ్ for VRO/VRA & Panchayat Secretary Guidance visit: www.sakshieducation.com -
ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే..
నిట్లు, ట్రిపుల్ ఐటీలతో పాటు వివిధ జాతీయస్థాయి ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ మెయిన్‌లో ప్రతిభ కనబర్చాలి. ఈ పరీక్షకు 60 శాతం వెయిటేజీ ఉండగా, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన మొదటి 1,50,000 మంది విద్యార్థులు ఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హులు. ఏప్రిల్‌లో జరిగే జేఈఈ మెయిన్ -2014లో అత్యధిక మార్కుల సాధనకకు ప్రిపరేషన్ వ్యూహాలు.. మ్యాథమెటిక్స్ 2013 జేఈఈ మెయిన్ లేదా గత మూడేళ్ల ఏఐఈఈఈ పరీక్ష పత్రాలను పరిశీలిస్తే, మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ ప్రశ్నలు ఆల్జీబ్రా, కాలిక్యులస్ నుంచి వస్తున్నట్లు గమనించవచ్చు. ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతి సిలబస్‌కు సంబంధించి ఉంటున్నాయి. రాష్ట్ర ఇంటర్మీడియెట్ అకాడమీ మ్యాథమెటిక్స్ పుస్తకం లో ఉన్న చాప్టర్లతో పాటు మీన్ వాల్యూ థీరమ్; సెట్స్ అండ్ రిలేషన్స్; 3డీ లైన్స్; మ్యాథమెటికల్ లాజిక్; స్టాటిస్టిక్స్; సీక్వెన్స్ అండ్ సిరీస్‌లపై దృష్టిసారించాలి. జేఈఈ మెయిన్-2013 ప్రశ్నపత్రంలో మ్యాథమెటిక్స్ లో 30ప్రశ్నలు ఇచ్చారు. వీటిలో 16 ప్రశ్నలు(64 మార్కులు) 11వ తరగతి సిలబస్ నుంచి, 14 ప్రశ్నలు (56 మార్కులు) 12వ తరగతి సిలబస్ నుంచి వచ్చాయి. ఇంటర్ పరీక్షల తర్వాత చాలా తక్కువ వ్యవధిలో జేఈఈ మెయిన్ ఉంటుంది కాబట్టి, పటిష్టమైన ప్రిపరేషన్ ప్రణాళిక అవసరం. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షలను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో ఉన్న సమయంలో మొదటి 10 రోజులు ఇంటర్ ఫస్టియర్ అంశాల్లోని జేఈఈ స్థాయి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. 4-5 రోజులు ఇతర అంశాలైన 3-డి లైన్స్; సిరీస్; మ్యాథమెటికల్ లాజిక్; సెట్స్ అండ్ రిలేషన్స్లపై దృష్టిసారించాలి. 15 రోజులు ఇంటర్ సెకండియర్ సిలబస్‌కు కేటాయించాలి. అంటే ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షల కోసం చదువుతూ, అదే సమయంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలపై పట్టు సాధించాలి. అధిక ప్రాధాన్యత గల అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఎంసెట్‌తో పోల్చితే జేఈఈ మెయిన్‌లో తక్కువ ప్రశ్నలుంటాయి. నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. అందువల్ల ఎన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించామనే దానికంటే, ఎన్నింటికి కచ్చితమైన సమాధానాలు గుర్తించామన్నది ముఖ్యం. ఎక్కువ పుస్తకాలను చదివేకంటే ప్రామాణిక మెటీరియల్‌ను క్షుణ్నంగా చదివి, ఎన్సీఈఆర్టీ పుస్తకాలపై దృష్టిసారించాలి. జేఈఈ మెయిన్-2013 అంశాల వారీగా ప్రాధాన్యం కోఆర్డినేట్- 17 శాతం ఆల్జీబ్రా- 30 శాతం కాలిక్యులస్- 23 శాతం ట్రిగనోమెట్రీ-10 శాతం ప్రాబబిలిటీ- 3 శాతం వెక్టార్స్ అండ్ 3-డి- 10 శాతం లాజికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్- 7 శాతం - ఎం.ఎన్.రావు, సీనియర్ ఫ్యాకల్టీ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు. ఫిజిక్స్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు, జేఈఈ మెయిన్‌కు మధ్య తక్కువ వ్యవధి ఉంటుంది కాబట్టి కచ్చితమైన సమయపాలనతో ప్రిపరేషన్ కొనసాగించాలి. ప్రిపరేషన్లో భాగంగా ఏదైనా ప్రశ్నను ఈ కింది 5 పాయింట్ ఫార్ములాతో సరిచూసుకుంటే ఆ ప్రశ్నను తేలిగ్గా సాధించవచ్చు. ఇది జేఈఈ మెయిన్‌కు బాగా ఉపయోగపడుతుంది. 1.ముందుగా సాధించాల్సిన ప్రశ్న జఢత్వ చట్రం (Inertial Frame) లేదా త్వరణీకృత చట్రం (Non Inertial Frame) లో ఉందో తెలుసుకోవాలి. 2.ప్రతి వస్తువుకీ స్వేచ్ఛా వస్తు పటాలు (Free Body Diagrams) గీసి వాటిపై ఉండే బలాలను లెక్కించాలి. 3.ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రాన్ని ప్రయోగించవచ్చో లేదో చూసుకోవాలి. ఉదాహరణకు బాంబు పేలుళ్లు, తాడనాలు (Collisions), అన్ని రేడియో ధార్మికత పదార్థాల క్షీణతలు, అన్ని అణు చర్యల్లో Law of Conse-rvation of Linear Momentum ఉపయోగించాలని తెలుసుకోవాలి. 4.ఇచ్చిన ప్రశ్నకు శక్తి నిత్యత్వ సూత్రాన్ని అనువర్తింపజేయవచ్చో లేదో తెలుసుకోవాలి. ఈ ప్రాథమిక సూత్రం.. ఉష్ణంలో First law of Thermodynamics గానూ, Fluid mechanicsలో బెర్నూలీ సమీకరణంగానూ, విద్యుత్‌లో కిర్కాఫ్ రెండో నియమంగానూ, విద్యుదయస్కాంత ప్రేరణలో లెంజ్ సూత్రంగానూ కనిపిస్తుంది. 5.ఉపగ్రహాలు, దృఢ వస్తువు భ్రమణంలో కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రాన్ని ఉపయోగించాలి. ఫ్లూయిడ్ మెకానిక్స్; వేవ్స్, ఆధునిక భౌతిక శాస్త్రంలోని యంగ్ జంట చీలికల ప్రయోగం; ఫిజికల్ ఆప్టిక్స్ వంటి చిన్న యూనిట్లపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. Ex: Two coherent point sources S1 and S2 are seperated by a small distance 'd'. The fringes obtained on the screen will be.. (JEE Main 2013). (ఈ ప్రశ్న సంబద్ధ కాంతి జనకాల లక్షణాలకు సంబంధించినది). 1. points 2. straight lines 3. semicircles 4. concentric circles Ans: 4 జేఈఈ మెయిన్‌లోని 30 ప్రశ్నలకు గంటలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి కాన్సెప్టులు, వాటి అనువర్తనాలను క్షుణ్నంగా నేర్చుకుని.. అధిక మోడల్ పేపర్లను సాధన చేయాలి. జేఈఈ మెయిన్- 2013: పాఠ్యాంశం {పశ్నల శాతం ఎలక్ట్రో డైనమిక్స్ 30 హీట్ అండ్ థర్మోడైనమిక్స్ 7 మెకానిక్స్ 23 మోడర్న్ ఫిజిక్స్ 17 ఆప్టిక్స్ 13 ఎస్హెచ్ఎం అండ్ వేవ్స్ 10 మెరుగైన స్కోర్‌కు మార్గం: జేఈఈ మెయిన్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు సిలబస్‌లోని ప్రతి అంశానికి చెందిన కాన్సెప్ట్‌లు, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, కన్జర్వేషన్ థీరమ్స్లను గుర్తించాలి. ఈ మూడు అంశాలకు సంబంధించి ఒకట్రెండు అనువర్తనాలతో సారాంశ పట్టికను రూపొందించుకోవాలి. ఈవిధంగా చేస్తే మొత్తం సిలబస్‌ను 40 కాన్సెప్టులు, 50 మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, 100 వరకు అనువర్తనాలకు కుదించవచ్చు. ఈ సారాంశ పట్టికను వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రిపరేషన్ లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి, సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో వాటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. సాధనకు లొంగనిది ఏదీ ఉండదనే విషయాన్ని గుర్తించాలి. - జి. విజయసారథి, సీనియర్ ఫ్యాకల్టీ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు. కెమిస్ట్రీ కెమిస్ట్రీ పాఠ్యాంశాలను స్థూలంగా మూడు విభాగాలుగా వర్గీకరించవచ్చు. అవి.. 1. ఫిజికల్ కెమిస్ట్రీ. 2. ఆర్గానిక్ కెమిస్ట్రీ. 3. ఇనార్గానిక్ కెమిస్ట్రీ. గత ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే ఈ మూడు విభాగాలకు సమానంగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. ముఖ్యమైన అంశాలు: పీరియాడిక్ టేబుల్ కెమికల్ బాండింగ్ మోల్ కాన్సెప్ట్ (కాన్సన్ట్రేషన్స్ కలిపి) రిడాక్స్ రియాక్షన్స్ క్వాలిటేటివ్ అనాలిసిస్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ చాప్టర్లపై పట్టు సాధిస్తే, మిగిలిన చాప్టర్లను కూలంకశంగా చదివేందుకు దోహదపడుతుంది. పీరియాడిక్ టేబుల్‌పై అవగాహన పెంచుకొంటే, వివిధ అంశాలను అర్థం చేసుకోవడం తేలికవుతుంది. ఫిజికల్ కెమిస్ట్రీ: ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలను గుర్తించాలంటే తొలుత ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. ఇచ్చిన సమస్యను బట్టి సూత్రాన్ని అన్వయించుకునే సామర్థ్యం పెంపొందించుకోవాలి. విశ్లేషణాత్మకంగా ప్రిపరేషన్ సాగించాలి. మెరుగైన స్కోర్‌కు మార్గాలు: నేర్చుకున్న సూత్రాలను నోట్స్ రూపంలో పొందుపరుచుకోవాలి. ఒక టాపిక్‌ను చదవడం పూర్తయిన వెంటనే.. దానికి సంబంధించి వివిధ పుస్తకాల్లోని విభిన్న రకాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ప్రతి టాపిక్కు సంబంధించి కనీసం మూడు ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ: ఈ విభాగానికి సంబంధించి తేలిగ్గా సమాధానం గుర్తించగల స్టీరియో ఐసోమరిజమ్ తరహా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రాథమిక భావనలపై పట్టు సాధించడంతో పాటు, విస్తృత స్థాయిలో చదవడమనే ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. ఇందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్ చాలా ముఖ్యమైంది. ఈ అంశంపై పట్టు సాధిస్తే, మిగిలిన అంశాలను అవగాహన చేసుకోవడం ఏమంత కష్టం కాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంశాలను ఎంతబాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. మెరుగైన స్కోర్ సాధించాలంటే: చాప్టర్ల వారీగా రియాక్షన్స్‌ను నోట్ చేసుకోవాలి. ప్రతి రియాక్షన్‌కు సంబంధించి దాని విశ్లేషణ, వ్యవస్థ, ఉత్పత్తులు, అవసరమైన నిబంధలను ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి. రోజూ ఒక టాపిక్‌లోని కన్జర్వేషన్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్లో సబ్జెక్టివ్ వ ర్క్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యతనివ్వాలి. ఎంసెట్/జేఈఈ/ఏఐఈఈఈ గత ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ: కెమిస్ట్రీలో.. ఇనార్గానిక్ కెమిస్ట్రీ పరిధి విస్తృతం. కాబట్టి అధిక శాతం మంది విద్యార్థులు ఈ అంశాన్ని కష్టమైందిగా భావిస్తారు. వాస్తవానికి పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రిడాక్స్ రియాక్షన్స్, ఈక్విలిబ్రియం, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంశాలపై పట్టుతో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగం నుంచి కాన్సెప్ట్ బేస్డ్ (ప్రాథమిక భావనల ఆధారంగా), స్ట్రక్చర్స్ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాకుండా కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి ప్రాధాన్యత పెరిగింది. ఇనార్గానిక్ కెమిస్ట్రీలోని మెటలర్జీ, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఎస్-బ్లాక్ ఎలిమెంట్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కీలక అంశాలు. మెరుగైన స్కోర్‌కు చేయాల్సినవి: నిర్దేశించిన సిలబస్‌ను అనుసరిస్తూ.. రిప్రెజెంటేటివ్ ఎలిమెంట్స్‌కు సంబంధించి నోట్స్ రూపొందించుకోవాలి. కోఆర్డినేట్ కాంపౌండ్స్‌కు అధిక సమయం కేటాయించాలి. మెటలర్జీ, క్వాంటిటేటివ్ అనాలిసిస్‌కు సంబంధించి ఫ్లో చార్ట్స్ రూపొందించుకోవడం మంచిది. ప్రిపరేషన్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి కనీసం రోజుకు గంట కేటాయించాలి. జేఈఈ మెయిన్-2013 అంశాల వారీగా ప్రశ్నలు: అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ 3 కెమికల్ బాండింగ్ 4 Stoichiometry 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 2 కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం 1 కెమికల్ కైనటిక్స్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ 1 కెమికల్ థర్మోడైనమిక్స్ 1 జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫంక్షనల్ గ్రూప్-1 4 ఆర్గానిక్ కెమిస్ట్రీ- ఫంక్షనల్ గ్రూప్-2 2 ఆర్గానిక్ కెమిస్ట్రీ- ఫంక్షనల్ గ్రూప్-3 2 కెమిస్ట్రీ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ 2 ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ 2 కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ ఆర్గానోమెటాలిక్స్ 1 సర్ఫేస్ కెమిస్ట్రీ 1 బయో మాలిక్యూల్స్ 1 - విజయకిశోర్, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. -
యువతరానికి ‘స్మార్ట్’ జాబ్స్
మొబైల్ ఎకానమీ ఇండియా-2013 పేరిట అంతర్జాతీయ మొబైల్ ఆపరేటర్ల సమాఖ్య రూపొందించిన నివేదిక ప్రకారం 2020 నాటికి మొబైల్ ఫోన్ల రంగంలో 41 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. అంతేకాకుండా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఈ రంగం వాటా 400 బిలియన్ డాలర్ల మేర ఉండనుంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల పరిశ్రమ అపార అవకాశాలకు వేదిక కానుంది. ఈ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న అభ్యర్థులకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల రంగంలో ఉద్యోగావకాశాలపై ఫోకస్.. ఒకప్పుడు మొబైల్ అంటే మాటల ముచ్చట్లకే! కానీ, ఇప్పుడది హస్తాభరణమై భాసిల్లుతోంది. అందుకే నిన్నామొన్నటి వరకు మొరటుగా ఉన్న మొబైల్ ఇప్పుడు ‘స్మార్ట్ ఫోన్’గా ముస్తాబై యువత మనసుల్లో కొలువుదీరింది. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లు చాలా వరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ నైపుణ్యాలను సొంతం చేసుకున్న యువతకు ఉన్నత కొలువులు ఆహ్వానం పలుకుతున్నాయి. అంతేకాకుండా ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, నోట్ బుక్స్, ఐప్యాడ్ వంటి గాడ్జెట్స్ వినియోగం పెరగడంతో వాటిల్లో ఉపయోగించే అప్లికేషన్స్‌ను రూపొందించడానికి అవసరమైన మానవవనరుల అవసరం పెరుగుతోంది. దీంతో గాడ్జెట్ ప్రపంచం కొలువుల ఖజానాగా మారుతోంది. ఎవరికివారు తమ వ్యక్తిగత, ఉద్యోగ అవసరాలకు తగ్గట్లు వివిధ ఆపరేటింగ్ సిస్టిమ్స్ (ఓఎస్) ఆధారంగా పనిచేసే ఫోన్లను వాడుతున్నారు. ఈ అప్లికేషన్స్‌ను ఎక్కువ మంది వినియోగించే ఫ్లాట్‌ఫామ్స్ (ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్, బ్లాక్‌బెర్రీ మొదలైన) ద్వారా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇటీవల బ్లాక్‌బెర్రీ మెసెంజర్ (బీబీఎం)ను యాప్‌ను ప్రారంభించిన ఒక్కరోజులోనే కోటికిపైగా డౌన్లోడ్లు జరిగాయని కెనడాకు చెందిన బ్లాక్‌బెర్రీ తెలిపింది. ఈ యాప్ అమెరికాతో సహా మొత్తం 75 దేశాల్లో మొదటిస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మొబైల్ కంపెనీలన్నీ వినియోగదారులను ఆకట్టుకునేలా తాజా అప్లికేషన్స్‌ను రూపొందించే నిష్ణాతుల కోసం జల్లెడ పడుతున్నాయి. మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు తాజాగా మంచి ఫీచర్స్‌తో స్మార్ట్ఫోన్లను అందిస్తున్నాయి. ఈ మొబైల్ అప్లికేషన్స్‌ను సాధారణ వినియోగదారులకు మాత్రమే కాకుండా బిజినెస్, ఎంటర్టైన్మెంట్, మీడియా, రైల్వే, బ్యాంకులు, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్, సోషల్ మీడియా, మార్కెటింగ్, యానిమేషన్ అండ్ గేమింగ్ వంటివాటి కోసం కూడా రూపొందిస్తున్నారు. మొబైల్ ఫోన్ల పరిశ్రమల్లో వివిధ ఉద్యోగావకాశాలు: మొబైల్ ఫోన్ సిస్టమ్ ఇంజనీర్ ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, ఐఫోన్, విండోస్ మొబైల్ అప్లికేషన్స్ డెవలపర్ గేమ్ డెవలపర్ మొబైల్ ఆర్కిటెక్ట్/మొబైల్ సాఫ్ట్వేర్ ఫ్లాట్‌ఫాం ఆర్కిటెక్ట్ మొబైల్ టెక్నీషియన్స్ మొబైల్ ప్లాంట్ ఎక్విప్మెంట్ మెకానిక్ మొబైల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ మొబైల్ ఫోన్ వెరిఫికేషన్ మేనేజర్ మొబైల్ ఆర్కిటెక్ట్ కస్టమర్‌కేర్ ఆఫీసర్/కాల్ సెంటర్స్ మార్కెటింగ్ మేనేజర్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ కేపీఐ (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేర్) ఇంజనీర్ జూనియర్/సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ - 3జీ ఎంబడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీఎస్ఎం/జీపీఆర్ఎస్ నెట్వర్క్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్/టెక్నికల్ ఎనలిస్ట్ ప్రవేశం ఇలా: మొబైల్ ఫోన్ల రంగంలో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలంటే బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (మొబైల్ టెక్నాలజీ సబ్జెక్టుగా లేదా స్పెషలైజేషన్‌గా); ఎంసీఏ వంటి కోర్సులను అభ్యసించాలి. ఈ కోర్సులే కాకుండా ఇతర డిగ్రీ కోర్సులు చేసినవారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే. అయితే సైన్స్, ఇంజనీరింగ్‌లపై పరిజ్ఞానం ఉండాలి. డిగ్రీ తర్వాత మొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రత్యేక కోర్సులను చదవాలి. ఈ కోర్సులను అనేక ప్రైవేటు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు అందిస్తున్నాయి. కోర్సుల కనీస వ్యవధి దాదాపు రెండు/మూడు నెలలు ఉంటుంది. కొన్ని సంస్థలు ఆన్లైన్లో కోర్సులు అందిస్తున్నాయి. అయితే ఆన్లైన్లో కోర్సులు చేసేకంటే ప్రత్యక్షంగా ఇన్స్టిట్యూట్లో చేయడం మేలు. ఎందుకంటే ప్రాక్టికల్స్ చేసే వీలుండటంతోపాటు ఫ్యాకల్టీని అడిగి సందేహాల నివృత్తి చేసుకోవచ్చు. మనదేశంలో: మనదేశంలో ఎక్కువ (దాదాపు 65 శాతం) ఫోన్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తున్నాయి. ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోర్సును దేశవ్యాప్తంగా వివిధ కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు అందిస్తున్నాయి. కోర్సు వ్యవధి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉంటుంది. కోర్సులో భాగంగా హిస్టరీ ఆఫ్ ఆండ్రాయిడ్ నుంచి పబ్లిషింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వరకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. అవి.. అప్లికేషన్ ఫండమెంటల్స్ కాంపోనెంట్స్ అండ్ లే అవుట్స్ స్టైల్ అండ్ థీమ్స్ మల్టీమీడియా సపోర్టెడ్ క్రియేటింగ్ డైలాగ్స్ యాడింగ్ మెనూస్ అండ్ ఐకాన్స్ బేసిక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ అడ్వాన్స్డ్ యూజర్ ఇంటర్ఫేస్ యానిమేషన్ గ్రాఫిక్స్ నెట్వర్కింగ్, ఆండ్రాయిడ్ సర్వీసెస్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్ వై-ఫై, టెలిఫోనీ, బ్లూటూత్ మొదలైన అంశాలపై శిక్షణ ఉంటుంది. ఇందులో భాగంగా థియరీ, ప్రాక్టికల్స్ ఉంటాయి. తరగతి గదిలో చెప్పిన అంశాలను ఎప్పటికప్పుడు ప్రాక్టికల్‌గా అన్వయించి అభ్యర్థులు నైపుణ్యం సాధించాలి. ఐఫోన్ యాప్స్: కోర్సు కరిక్యులంలోని కొన్ని అంశాలు.. ఐఫోన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (ఎస్డీకే) ఇంట్రడక్షన్ టు ఎక్స్‌కోడ్ ఇంట్రడక్షన్ టు యూఆర్ఎల్ లోడింగ్ సిస్టమ్ ఇంటిగ్రేట్ ఐఫోన్ యాప్ విత్ అడ్రస్ బుక్, మ్యాప్ యూఐ నేవిగేషన్ బార్, యూఐ నేవిగేషన్ కంట్రోలర్ వెబ్ సర్వీసెస్ మల్టీమీడియా స్క్రీన్ ఓరియెంటేషన్స్ వ్యూ కంట్రోలర్స్ ప్రాపర్టీ లిస్ట్ టైప్స్ అండ్ ఆబ్జెక్ట్స్ విండోస్ ఫోన్-8 యాప్స్ డెవలప్మెంట్: ఆరు మాడ్యూల్స్‌గా ఉండే కోర్సులోని అంశాలు విండోస్ ఫోన్ 8 ఫ్లాట్‌ఫాం విండోస్ ఫోన్ 8 డెవలప్మెంట్ టూల్స్ డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాల్ ది టూల్స్ విండోస్ ఫోన్ 8 ఎస్డీకే ఓవర్వ్యూ అప్లికేషన్ లైఫ్ సైకిల్ అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ ఫ్రేమ్స్ అండ్ పేజ్ స్ట్రక్చర్ సిస్టమ్ ట్రే అండ్ నేవిగేషన్ డిజైన్ విండోస్ ఫోన్ 8 కంట్రోల్ యూసేజ్ యూజింగ్ సిస్టమ్ థీమ్స్ అండ్ స్క్రీన్ ఓరియెంటేషన్ లొకేషన్ అవేర్నెస్ సిస్టమ్ సెట్టింగ్ కావల్సిన నైపుణ్యాలు: సీ, సీ++లపై పట్టు ఉండాలి. హెచ్‌టీఎంఎల్ 5పై లోతైన, విశ్లేషణాత్మకమైన పరిజ్ఞానం అవసరం. జావా స్క్రిప్ట్‌పై పట్టు తప్పనిసరి. కొత్త అప్లికేషన్‌సను అభివృద్ధి చేయగల నైపుణ్యం ఉండాలి. మిగిలినవారికంటే ముందంజలో ఉండాలంటే సృజనాత్మకత తప్పనిసరి. వివిధ రకాల మొబైల్ అప్లికేషన్స్ కోసం అల్గారిథమ్‌ను అభివృద్ధి చేయడంతోపాటు, విశ్లేషించగల సామర్థ్యం ఉండాలి. ఆండ్రాయిడ్ ఎస్డీకేలపై ప్రాథమిక అవగాహన అవసరం. బ్లూటూత్, వైర్లెస్ డేటా లింక్ లేయర్, వై-ఫై, వైమాక్స్లపై కనీస అవగాహన ఉండాలి. మొబైల్ నెట్వర్క్స్ ప్రొటోకాల్స్, జీఎస్ఎం, 2.5జీ, 3జీలపై రీసెర్చ్ ఓరియెంటేషన్ ఉండాలి. మొబైల్ సెక్యూరిటీ, సమాచార భద్రతలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను గుర్తించి, పరిష్కరించగలగాలి. కెరీర్: మొబైల్ సంబంధిత కోర్సులు నేర్చుకున్నవారికి మంచి అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. విదేశీ కంపెనీలతోపాటు స్వదేశీ కంపెనీలు కూడా దాదాపు నెలకో స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఆకట్టుకునే రూపం, కొత్త ఫీచర్లతో వీటిని రూపొందించి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. డిమాండ్‌కు తగిన విధంగా నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు లేరు. ఈ నేపథ్యంలో ఈ కోర్సులు నేర్చుకుంటే చక్కటి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. సృజనాత్మకమైన ఆలోచనలతో అప్లికేషన్స్‌ను అభివృద్ధి చేస్తే సొంతంగా కంపెనీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వేతనాలు: అప్లికేషన్స్ డెవలపర్‌కు ప్రారంభంలో ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వేతనాలు లభిస్తాయి. పనితీరు, అనుభవం ఆధారంగా నెలకు రూ.50 వేలకుపైగా పొందొచ్చు. ఇతర విభాగాల్లో పనిచేసేవారు కూడా ప్రారంభంలో ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పొందొచ్చు. యాప్స్‌లో రకాలు: అవకాశాలు ఎన్ని ఉన్నప్పటికీ అప్లికేషన్స్ డిజైన్స్ అండ్ డెవలప్మెంట్ విభాగంలోనే 60 శాతంపైగా ఉద్యోగావకాశాలున్నాయి. యాప్స్‌ను చూసే స్మార్ట్ఫోన్లను ఎంచుకునేవారెందరో. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల యాప్స్.. లైఫ్‌స్టైల్ యాప్స్ హెల్త్, మెడికల్ యాప్స్ గేమ్స్ యాప్స్ హెల్త్ అండ్ మెడికల్ యాప్స్ ట్రావెల్ యాప్స్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాప్స్ ఎడ్యుకేషన్ యాప్స్ ఈ-బుక్స్ పబ్లిషింగ్ యాప్స్ బిజినెన్ యాప్స్ మల్టీమీడియా యాప్స్ మ్యాప్స్ అండ్ నేవిగేషన్ యాప్స్ టాప్ రిక్రూటర్స: గూగుల్ బ్లాక్ బెర్రీ హెచ్‌టీసీ శామ్సంగ్ పానాసోనిక్ సోనీ ఎరిక్సన్ మైక్రోమ్యాక్స్ ఎల్జీ మొబైల్స్ కార్బన్ మొబైల్స్ ఆర్థిక సేవల సంస్థలు నోకియా వీడియోకాన్ అన్నిరంగాలకూ విస్తరిస్తోంది కమ్యూనికేషన్‌కే పరిమితమైన మొబైల్ ఇప్పుడు వ్యాపార లావాదేవీల్లో కీలకంగా మారింది. రిటైల్ మార్కెటింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులకు కారణమవుతోంది. గతంలో కేవలం కార్పొరేట్ సెక్టార్లో మాత్రమే మొబైల్ టెక్నాలజీను విరివిగా ఉపయోగించేవారు. ప్రస్తుతం ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీస్, ఎం కామర్స్, హోటల్ తదితర చోట్ల మొబైల్ కీలకమవుతుంది. రాబోయే పదేళ్లలో మొబైల్ రూపకల్పనలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇప్పటికే ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, యాప్స్‌తో వ్యాపారాత్మకంగా మొబైల్ ఇండస్ట్రీ పురోగతిలో ఉంది. దీనికి తగినట్టుగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే దీనికి కావాల్సిందల్లా టెక్నాలజీ పట్ల ఆసక్తి, సృజనాత్మకత. సాధారణంగా ఈ ఇండస్ట్రీలో స్థిరపడాలంటే ‘జావా’ కోర్సు చేస్తే సరిపోతుంది. కానీ.. మొబైల్ అప్లికేషన్స్ పెరుగుతున్న కొద్దీ టెక్నాలజీను లోతుగా స్టడీ చేయాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుండాలి. జీపీఆర్ఎస్, వెహికల్ ట్రాకింగ్‌కు డిమాండ్ పెరుగుతుంది. దీనికి హై లెవల్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, ఐ.ఓ.యస్ వాటికి ప్రత్యేకమైన కోర్సులున్నాయి. దీన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే యువతీ, యువకులు సీరియస్‌గా మనసులగ్నం చేసి కోర్సులు చేస్తే ప్రయోజనం ఉంటుంది. సేవారంగంలో మొబైల్ అప్లికేషన్స్ మరింత విస్తరిస్తే ఉద్యోగ అవకాశాలు పుష్కలం. ఆయా కంపెనీలు వాటి స్థాయికి అనుగుణంగా వేతనాలు అందజేస్తున్నాయి. జాబ్‌లో చేరిన మొదటి సంవత్సరం నెలకు రూ.8వేల నుంచి రూ.10 వేల వరకూ ఉంటే.. మరుసటి ఏడాది నుంచి రెట్టింపు వేతనం అందుకునే అవకాశం ఉంది. -నాయుడు ఏ విన్నకోట, ప్రొడక్ట్ మేనేజర్, యాప్ థాట్స్ -
వెటర్నరీ కోర్సులు..ఉపాధి ఖాయం
దేశంలో వ్యవసాయం తర్వాత రైతులకు నమ్మకమైన ఆదాయానికి మార్గంగా నిలుస్తోంది పశుపోషణ, సంబంధిత కార్యకలాపాలు. వీటిని మరింత నాణ్యతతో సమర్థంగా నిర్వహించడానికి వెటర్నరీ డాక్టర్ల సేవలు అవసరమవుతాయి. పెంపుడు జంతువుల (పెట్) సంస్కృతి పెరగడంతోపాటు స్వయం ఉపాధి దిశగా పౌల్ట్రీ ఫామ్, డెయిరీ ఫామ్ వంటివి నెలకొల్పుతుండడంతో వెటర్నరీ అభ్యర్థులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో సైన్స స్ట్రీమ్ విద్యార్థుల్లో ఈ కోర్సుకు ఉపాధి దగ్గరి మార్గంగా మారుతోంది.. వెటర్నరీ సైన్స. వెటర్నరీ సైన్‌సకు సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు, కెరీర్ అవకాశాలు తదితర అంశాలపై విశ్లేషణ.. ప్రపంచంలోనే అత్యధిక లైవ్ స్టాక్ జనాభా ఉండడం.. వ్యవసాయానుబంధ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో.. సంబంధిత కోర్సులకు ఇటీవలి కాలంలో డిమాండ్ పెరుగుతోంది.. అటువంటి కోర్సుల్లో ఒకటి వెటర్నరీ సైన్స్.. డాక్టర్ కలను నెరవేర్చుకోవడానికి ప్రత్యామ్నాయంగా నిలవడంతోపాటు.. జంతువుల పట్ల ప్రేమ, ఆరాధన భావం ఉండే వారికి సరిపోయే కెరీర్.. వెటర్నరీ సైన్స్. ప్రవేశం ఇలా: వెటర్నరీకి సంబంధించి బ్యాచిలర్, పీజీ, పీహెచ్డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సుల్లో చేరడం ద్వారా వెటర్నరీ డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. బ్యాచిలర్ స్థాయిలో ఉండే కోర్సును బీవీఎస్సీ అండ్ ఏహెచ్ (బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ)గా పేర్కొంటారు. ఈ కోర్సును పూర్తి చేస్తే వెటర్నరీ డాక్టర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించవచ్చు. దీనికి అర్హత ఇంటర్మీడియెట్ (బైపీసీ). కోర్సు కాల వ్యవధి: ఐదున్నరేళ్లు (ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌తో కలిపి). బీవీఎస్సీ అండ్ ఏహెచ్ తర్వాత ఆసక్తి ఉంటే పీజీ కోర్సు చేయవచ్చు. ఈ కోర్సును ఎంవీఎస్సీ (మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్)గా వ్యవహరిస్తారు. పీజీ-స్పెషలైజేషన్స్ కొన్ని: వెటర్నరీ అనాటమీ అండ్ హిస్టాలజీ, వెటర్నరీ పాథాలజీ, యానిమల్ రిప్రొడక్షన్ గైనకాలజీ ఆబ్స్టెట్రిక్స్, క్లినికల్ వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ సర్జరీ అండ్ రేడియాలజీ, వెటర్నరీ మైక్రోబయాలజీ, యానిమల్ న్యూట్రిషన్, పౌల్ట్రీ సైన్స్ తదితరాలు. పీజీ తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్డీ చేయవచ్చు. మన రాష్ట్రంలో: మన రాష్ట్రంలో వెటర్నరీ విద్యను పర్య వేక్షించడానికి ప్రత్యేకంగా శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని తిరుపతిలో నెలకొల్పారు. ఈ యూనివర్సిటికీ అనుబంధంగా పని చేసే ఐదు కాలేజీలు బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ సాధారణంగా ఫిబ్రవరిలో వెలువడుతుంది. పరీక్ష మే నెలలో ఉంటుంది. అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ). కాలేజ్‌లు: కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ - తిరుపతి. సీట్లు: 60 ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్- గన్నవరం. సీట్లు: 60 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-హైదరాబాద్. సీట్లు: 60 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-ప్రొద్దుటూరు. సీట్లు: 30 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-కోరుట్ల. సీట్లు: 30 జాతీయ స్థాయిలో: వెటర్నరీ విద్య ప్రమాణాలను నిర్దేశించే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ప్రీ-వెటర్నరీ టెస్ట్ (ఏఐపీవీటీ)ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 30కి పైగా రాష్ట్రస్థాయి వెటర్నరీ (జమ్మూ-కాశ్మీర్ మినహా) కళాశాలల్లోని బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్) కోర్సులో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. విధులు: వెటర్నరీ డాక్టర్లు పెంపుడు జంతువుల నుంచి అన్ని రకాల జంతువులకు సాధారణ చికిత్సలతోపాటు శస్త్ర చికిత్సలు కూడా నిర్వహిస్తారు. మానవ ఉపయోగానికి దోహదం చేసే జంతువుల ఉత్పత్తి, సంరక్షణ బాధ్యత కూడా వెటర్నరీ డాక్టర్లదే. పెంపుడు జంతువులకు సంబంధించి పాటించాల్సిన జాగ్రత్తలు, ఇవ్వాల్సిన ఆహారం, వ్యాక్సినేషన్, వాడాల్సిన ఔషధాలపై వాటి యాజమానులకు వెటర్నరీ డాక్టర్లు అవగాహన కల్పిస్తారు. వేతనాలు ప్రభుత్వ సర్వీసులో క్లాస్-1 ఆఫీసర్ హోదాలో వెటర్నరీ సర్జన్‌గా నెలకు రూ. 45 వేల వేతనం లభిస్తుంది. ఐసీఏఆర్ వంటి ఇన్స్టిట్యూట్లలో శాస్త్రవేత్తగా ఎంపికైతే నెలకు రూ. 50 వేల వేతనంతో కెరీర్ ప్రారంభమవుతుంది. ప్రైవేట్ రంగంలో నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనంగా అందుకోవచ్చు. నైపుణ్యం అనుభవం ఆధారంగా నెలకు రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభిస్తే ప్రతి అపాయింట్మెంట్కు రూ. 300 నుంచి రూ. 400 వరకు చార్జ్ చేయవచ్చు. కొన్ని మెట్రో సిటీల్లో ప్రతి అపాయింట్మెంట్కు రూ.1,000 వరకు కూడా చార్జ్ చేస్తున్నారు. అవకాశాలు మన దేశంలో వెటర్నరీ గ్రాడ్యుయేట్లకు అవకాశాల పరంగా కొదవలేదని చెప్పొచ్చు. కేవలం క్లినికల్ విభాగంలోనే కాకుండా పరిశోధన, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫార్మాస్యుటికల్ వంటి రంగాల్లో పుష్కలమైన అవకాశాలను దక్కించుకోవచ్చు. వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. వీరు పశు సంవర్థక శాఖలో, వెటర్నరీ హాస్పిటల్స్, జూ పార్క్స్‌లో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. వెటర్నరీ గ్రాడ్యుయేట్లకు ఆర్మీలో కూడా అవకాశాలు ఉంటాయి. ప్రతి ఏటా ఆర్మీ కెప్టెన్ హోదాలో వెటర్నరీ డాక్టర్లను షార్ట్ సర్వీస్ కమిషన్ పద్ధతిలో నియమించుకుంటుంది. రెండేళ్ల సర్వీస్ తర్వాత పరీక్ష రాసి పర్మినెంట్ కమిషన్డ్ ఆఫీసర్ హోదా పొందొచ్చు. లైవ్ స్టాక్ సంబంధిత పరిశ్రమల ఏర్పాటు సమయంలో అందజేసే రుణాల విషయంలో వెటర్నరీ గ్రాడ్యుయేట్ల సేవలను బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు వినియోగించుకుంటున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారుు. నూతన ఔషధాల పరిశోధన కోసం ఫార్మాస్యుటికల్ సంస్థలు ఆర్ అండ్ డీ విభాగంలో వెటర్నరీ డాక్టర్లను నియమించుకుంటున్నాయి. పౌల్ట్రీఫామ్స్, డెయిరీ ఫామ్స్, రేస్ క్లబ్స్, వెటర్నరీ ఇన్స్ట్రుమెంట్స్, వ్యాక్సిన్ ప్రొడక్ట్ ప్లాంట్స్, మిల్క్ యూనియన్స్, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డులలో అవకాశాలు ఉంటాయి. ఇటీవల కాలంలో.. జంతు సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో.. సొంత క్లినిక్‌ల ఏర్పాటు ద్వారా కూడా ఆదాయం పొందొచ్చు. సంబంధిత పరిశోధనా సంస్థల్లో సైంటిస్ట్‌గా చేరొచ్చు. టీచింగ్ ప్రొఫెషన్ కూడా ఎంచుకోవచ్చు. ఆసక్తి ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా స్థిరపడొచ్చు. గెజిటెడ్ హోదాతో మన రాష్ట్రంలో పశువైద్య విద్యలో నాణ్యత పెంచ డం ద్వారా పశుగణాభివృద్ధిలో పురోగతి సాధించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా వెటర్నరీ విశ్వవిద్యాలయాన్ని 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. నాణ్యమైన విద్య, ప్రమాణాల పెంపు, అలాగే పరిశోధన ఫలితాలను, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం ఈ విశ్వవిద్యాలయం లక్ష్యాలు. రాష్ట్రంలో ఐదు కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోర్సు అందుబాటులో ఉంది. గతంలో కోరుట్ల, ప్రొద్దుటూరు కాలేజీల విషయంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ.. ప్రస్తుతం అన్ని కాలేజీలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) గుర్తింపు ఉంది. వెటర్నరీ సైన్స్ కోర్సును పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. గెజిటెడ్ హోదాతో కెరీర్ ప్రారంభమవుతుంది. బీవీఎస్సీ తర్వాత ఆసక్తి ఉంటే పీజీ, పీహెచ్డీ కోర్సులు చేయవచ్చు. తిరుపతి, రాజేంద్రనగర్, గన్నవరంలోని వెటర్నరీ కళాశాలల్లో ఎంవీఎస్సీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ మూడు క్యాంపస్‌లలో కలిపి 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. అదేవిధంగా పీహెచ్డీ కోర్సులను కూడా ఈ క్యాంపస్‌లు ఆఫర్ చేస్తున్నాయి. -పి. సుధాకర్ రెడ్డి, రిజిస్ట్రార్, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ-తిరుపతి. లక్షణాలు: జంతువుల పట్ల ప్రేమ, ఆరాధన వంటి గుణం కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అన్ని అంశాలను జంతువుల యజమానులు ప్రస్తావించకపోవచ్చు. కాబట్టి వాటిని కూడా కనుక్కునే పరిశీలనా సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. సమస్యలను వివరించడంలో ఓర్పు, సహనం చూపాలి. రెండు కోణాలు: విస్తృత అవకాశాలు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్జీవో, పరిశోధన రంగాల్లో పుష్కలమైన అవకాశాలను దక్కించుకోవచ్చు. ఇతర రంగాలకు దీటుగా ఆకర్షణీయమైన వేతనాలను అందుకోవచ్చు. ఎంబీబీఎస్ డాక్టర్‌తో పోల్చితే అంత ఆకర్షణీయమైన కెరీర్ కాదు. పని చేయాల్సిన ప్రదేశాలు అధిక శాతం గ్రామీణ ప్రాంతానికి చెంది ఉంటాయి. రోజువారీ కార్యకలాపాలు: ఉదయం 9-00: క్లినిక్ తెరవడం ఉదయం 9-30: జంతువులను పరీక్షించడం ఉదయం 11-00: సంబంధిత అంశాలపై సహాయకులకు సూచనలు ఇవ్వడం మధ్యాహ్నం 1-00: భోజన విరామం మధ్యాహ్నం 2-00: సంబంధిత మెడికల్ జర్నల్స్ చదవడం సాయంత్రం 4-00: జంతువులను పరీక్షించడం రాత్రి 7-00: విధుల ముగింపు