నేటి ఆధునిక సైబర్ ప్రపంచంలో ‘సమాచారం’ అతి విలువైన సంపద. ఈ సమాచార సంబంధిత వ్యవస్థల భద్రత (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెక్యూరిటీ)కు సురక్షగా నిలిచే నిపుణుల అవసరం ఇప్పుడు బాగా పెరిగింది.
ఐటీ కోర్సు.. CISSP
నేటి ఆధునిక సైబర్ ప్రపంచంలో ‘సమాచారం’ అతి విలువైన సంపద. ఈ సమాచార సంబంధిత వ్యవస్థల భద్రత (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెక్యూరిటీ)కు సురక్షగా నిలిచే నిపుణుల అవసరం ఇప్పుడు బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత పరీక్షల్లో ప్రతిభను ప్రదర్శించి, సర్టిఫికెట్ సంపాదిస్తే భారీ వేతన ప్యాకేజీలతో కొలువులను సంపాదించొచ్చు. ఇలాంటి సర్టిఫికేషన్ ప్రోగామ్‌లలో సీఐఎస్‌ఎస్‌పీ (సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెక్యూరిటీ ప్రొఫెషనల్) ముఖ్యమైంది..
సీఐఎస్‌ఎస్‌పీ.. మేనేజ్‌మెంట్ స్థాయి సర్టిఫికెషన్. దీన్ని అమెరికాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెక్యూరిటీ సర్టిఫికెషన్ కన్సార్టియం (ఐఎస్‌సీ)2 ఆఫర్ చేస్తోంది.
సీఐఎస్‌ఎస్‌పీ పరీక్ష రాయాలంటే (ఐఎస్‌సీ)2 నిర్దేశించిన పది డొమైన్లలో రెండింటిలో ఐదేళ్ల సెక్యూరిటీ ప్రొఫెషనల్ అనుభవం అవసరం. లేదా గ్రాడ్యుయేషన్‌తో పాటు నాలుగేళ్ల సెక్యూరిటీ అనుభవం ఉండాలి.
సీఐఎస్‌ఎస్‌పీ పరీక్షను ప్రస్తుతం కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఈ కింది డొమైన్లలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని అంచనా వేసేదిగా పరీక్ష ఉంటుంది.
డొమైన్లు:
యాక్సెస్ కంట్రోల్.
టెలీకమ్యూనికేషన్స్ అండ్ నెట్‌వర్క్ సెక్యూరిటీ.
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెక్యూరిటీ.
క్రిప్టోగ్రఫీ.
సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్.
ఆపరేషన్స్ సెక్యూరిటీ.
బిజినెస్ కంటిన్యుటీ అండ్ డిజాస్టర్ రికవరీ ప్లానింగ్.
లీగల్, రెగ్యులేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ అండ్ కాంప్లియన్స్.
ఫిజికల్ (ఎన్విరాన్‌మెంటల్ సెక్యూరిటీ).
సెక్యూరిటీ ప్రొఫెషనల్స్- ఉద్యోగాలు:
సెక్యూరిటీ కన్సల్టెంట్.
సెక్యూరిటీ అనలిస్ట్.
సెక్యూరిటీ మేనేజర్.
సెక్యూరిటీ సిస్టమ్స్ ఇంజనీర్.
ఐటీ డెరైక్టర్/మేనేజర్.
చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్.
సెక్యూరిటీ ఆడిటర్.
డెరైక్టర్ ఆఫ్ సెక్యూరిటీ.
సెక్యూరిటీ ఆర్కిటెక్ట్.
నెట్‌వర్క్ ఆర్కిటెక్ట్.
అవకాశాలు:
సీఐఎస్‌ఎస్‌పీ సర్టిఫికెట్ పొందిన వారికి ఉన్నత అవకాశాలు ఉంటాయి.
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్‌తో సంబంధమున్న కంపెనీలు; ఆర్థిక సంస్థల్లో అవకాశాలుంటాయి. టాప్ ఎంఎన్‌సీల్లోనూ అత్యున్నత స్థాయి అవకాశాలను అందుకోవచ్చు.
వేతనాలు: భారత్‌లో అయితే ఏడాదికి సగటున రూ.16 లక్షల వరకు వేతనం ఉంటుంది. గరిష్టంగా రూ.24 లక్షల వేతనం ఉంటుంది.
Inputs:
బి.ఎ.శశిధర్,
సీసీఐఈ సెక్యూరిటీ, సీఈహెచ్
కార్పొరేట్ ట్రైనర్, పీర్స్ టెక్నాలజీస్.