టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పోప్ ఫ్రాన్సిస్ | Current affairs this week | Sakshi
Sakshi News home page

టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పోప్ ఫ్రాన్సిస్

Published Thu, Dec 19 2013 2:09 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Current affairs this week

 జాతీయం
 మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్
 మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 230 స్థానాల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 165 సీట్లు దక్కించుకుంది.
 
 మంత్రుల ప్రవర్తనా నియమావళికి కేంద్ర కేబినెట్ ఆమోదం
 రాజకీయ ఒత్తిళ్ల నుంచి ఉద్యోగస్తులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల ప్రవర్తనా నియమావళికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 12న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు నిష్పక్షపాతంగా, తటస్థంగా వ్యవహరించాలన్న దానికి కార్యనిర్వాహక వర్గం కట్టుబడి ఉండాలనే క్లాజును సవరణ ద్వారా చేర్చారు. ఈ సవరణలు కేంద్ర స్థాయిలో వెంటనే అమల్లోకి వస్తాయి.
 
 తర్వాత రాష్ట్రస్థాయిలోనూ అమలు చేయాలని కోరతారు. ఈ సవరణలు నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులను మంత్రులు ఒత్తిడి చేయకుండా అడ్డుకుంటాయి. అధికారులను ప్రలోభపెట్టే బదిలీలు, పోస్టింగ్‌లను అడ్డుకోవడంలో ఈ నియమావళి సవరణలు దోహదం చేయనున్నాయి.
 
 రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే ప్రమాణ స్వీకారం
 రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ముఖ్యమంత్రిగా ఎన్నికవడం ఇది రెండోసారి. నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమె నాయకత్వంలోని బీజేపీ 200 స్థానాలకుగాను 163 స్థానాలు గెలుచుకుంది. ఆమె 2003 నుంచి 2008 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
 
నాబార్‌‌డ చైర్మన్‌గా హర్షకుమార్ భన్వాలా నియామకం
 జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్‌‌డ) చైర్మన్‌గా డిసెంబర్ 15న హర్షకుమార్ భన్వాలా నియమితులయ్యారు. సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేసిన ప్రకాశ్ భక్షీ స్థానంలో హర్షకుమార్ బాధ్యతలు చేపడతారు. ఆయన ఇంతవరకూ ప్రభుత్వరంగ సంస్థ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్‌‌స కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేశారు.
 
 సచివాలయం - మండలాల మధ్య వీడియో అనుసంధానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు హైడెఫినిషన్ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్‌వర్క్ (ఏపీస్వాన్) ద్వారా అనుసంధానం చేసే ఈ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 9న హైదరాబాద్‌లో ప్రారంభించారు. దీంతో ఇటువంటి సౌకర్యం గల మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
 
 ఈ వ్యవస్థ రాష్ట్ర రాజధానిని 23 జిల్లాలు, 1126 మండల కార్యాలయాలతో అనుసంధానం చేస్తుంది. దేశంలోనే అతిపెద్దదైన ఈ వ్యవస్థ ప్రభుత్వ నిర్వహణలో పారదర్శకతను తీసుకువస్తుందని, సంక్షేమ పథకాల సమీక్షకు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వానికి తోడ్పడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 2000లోనే అన్ని జిల్లా కేంద్రాలకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించారు.
 
 స్వలింగ వివాహాలను తప్పుబట్టిన సుప్రీంకోర్టు
 స్వలింగ లైంగిక సంబంధాలు నేరం కాదన్న 2009 నాటి ఢిల్లీ కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్వలింగ సంపర్కం శిక్షించదగ్గ నేరమన్న భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను కోర్టు సమర్థించింది. దీన్ని తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఈ సెక్షన్ కొనసాగుతున్నంతవరకూ స్వలింగ లైంగిక సంబంధాలను చట్టబద్ధమైనవిగా పరిగణించలేమని కోర్టు డిసెంబర్ 11న తన తీర్పులో అభిప్రాయపడింది. స్వలింగ సంప్కరాన్ని చట్టబద్ధం చేయాలా? వద్దా? అనే అంశంపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల అసహజ లైంగిక కార్యకలాపాలను న్యాయస్థానం చట్టబద్ధం చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో 25
 ల క్షలమంది స్వలింగ సంపర్కులు ఉన్నట్లు అంచనా.
 
 వైమానిక దళం నుంచి మిగ్-21 తొలగింపు
 భారత వైమానిక దళం నుంచి మిగ్-21 ఎఫ్.ఎల్ యుద్ధ విమానాలను తొలగించారు. వీటి చివరి విన్యాసాలను డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లా కలైకుండ విమాన స్థావరంలో నిర్వహించారు. రష్యాకు చెందిన మిగ్-21 మొదటి బ్యాచ్‌ను 1963, మార్చి- ఏప్రిల్‌ల్లో వైమానిక దళంలో చేర్చారు. ఇవి భారత్ పొందిన మొదటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలు. ఈ విమానాలు యుద్ధ సమయాల్లో భారత్ వైమానిక దళం ఆధిపత్యాన్ని చాటాయి. 1971 భారత్ - పాకిస్థాన్ యుద్ధంలో ఈ విమానాలు తమ శక్తిని నిరూపించాయి.
 
 ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్
 ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్ డిసెంబర్ 12న ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికవడం ఇది వరుసగా మూడోసారి. నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకుగాను రమణ్‌సింగ్ నాయకత్వంలోని బీజేపీ 49 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది.
 
 మిజోరం ముఖ్యమంత్రిగా లాల్ తన్వాహ్లా
 మిజోరం సీఎంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లాల్ తన్వాహ్లా (71) డిసెంబర్ 14న ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి 1984లో ముఖ్యమంత్రి అయిన ఆయన తర్వాత 1989, 1993, 2008లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
 
 భారత్‌లో కేన్సర్‌తో ఏటా ఏడు లక్షల మంది మృతి
 భారత్‌లో ప్రతి సంవత్సరం ఏడు లక్షల మంది కేన్సర్ వల్ల మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ కేన్సర్ నివేదిక పేర్కొంది. 10 లక్షల మందికి పైగా కొత్తగా వ్యాధికి గురవుతున్నట్లు తెలిపింది. 2012లో 4.77 లక్షల మంది పురుషులలో, 5.37 లక్షల మంది మహిళలలో ఈ వ్యాధిని గుర్తించారు. 2012లో మరణించిన వారిలో 3.56 లక్షల మంది పురుషులు, 3.26 లక్షల మంది మహిళలు ఉన్నట్లు నివేదిక తెలిపింది.

 

భారతీయ పురుషుల్లో పెదవుల, నోటి కేన్సర్ వల్ల, మహిళల్లో రొమ్ము కేన్సర్ వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2012లో కొత్త కేసులు 14.1 మిలియన్లకు చేరుకున్నాయని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ద ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్‌‌చ ఆన్ కేన్సర్ (ఐఎఆర్‌సీ) ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ వ్యాప్తి, మరణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసింది.
 
 
 మైసూర్ రాజవంశీయుడు ఒడెయార్ మృతి
 మైసూర్ మహారాజ వంశీయుడు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయార్ (60) బెంగళూరులో డిసెంబర్ 10న మరణించారు. ఆయన మైసూరు లోక్‌సభ స్థానం నుంచి నాలుగుసార్లు గెలిచారు. 1399 నుంచి 1950 వరకు మైసూరును పాలించిన రాజ వంశీయుల్లో ఒడెయార్ చివరివారు. మైసూరు చివరి మహారాజు జయచామరాజేంద్ర ఒడెయార్ కుమారుడు శ్రీకంఠదత్త. 1974, సెప్టెంబర్‌లో మైసూరు సంస్థాన బాధ్యతలు చేపట్టారు.
 
 కేంద్రమంత్రి శీష్‌రాం మృతి
 కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శీష్‌రాం ఓలా (86) డిసెంబర్ 15న అనారోగ్యంతో న్యూఢిల్లీలో మరణించారు. రాజస్థాన్‌కు చెందిన ఓలా 1996లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. బాలికల విద్య కోసం కృషి చేసిన ఆయనకు
 1968లో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన రాజస్థాన్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు.
 
 
 అంతర్జాతీయం
 
 చంద్రునిపై దిగిన చైనా రోవర్
 చైనా పంపిన చాంగ్-3 అనే వ్యోమనౌక డిసెంబర్ 14న చంద్రునిపై సైనస్ ఇరిడమ్ అనే ప్రదేశంలో దిగింది. ఆ నౌకలో ఉన్న ల్యాండర్‌తోపాటు యుతు (జేడ్ ర్యాబిట్) అనే రోవర్ చంద్రున్ని చేరాయి. ల్యాండర్ నుంచి రోవర్ విడిపోయి మూడు చదరపు కిలోమీటర్లలో తిరుగుతూ చంద్రుడి అంతర్నిర్మాణం, ఉపరితలంపై సర్వే చేస్తుంది. సహజ వనరుల అన్వేషణ సాగిస్తుంది.
 
 40 సంవత్సరాల తర్వాత తొలిసారి చంద్రునిపై రోవర్ దిగింది. ఇప్పటివరకు అమెరికా, సోవియట్ యూనియన్‌లు చంద్రునిపై రోవర్లు దింపాయి. ఇది చైనా పంపిన తొలి రోవర్. చంద్రునిపై రోవర్‌ను దించిన మూడోదేశంగా చైనాకు గుర్తింపు దక్కింది. డిసెంబర్ 1న చైనా లాంగ్‌మార్‌‌చ-3బి రాకెట్ ద్వారా చాంగ్-3 వ్యోమనౌకను ప్రయోగించింది.
 
 గార్డియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా స్నోడెన్
 లండన్‌కు చెందిన ది గార్డియన్ పత్రిక ఎడ్వర్డ్ స్నోడెన్‌ను 2013 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. అమెరికా నిఘా సంస్థ సేకరించిన వర్గీకృత రహస్య సమాచారాన్ని స్నోడెన్ బహిర్గతం చేశాడు.
 
 హాలీవుడ్ నటి ఎలీనర్ పార్కర్ మృతి
 ప్రముఖ హాలీవుడ్ నటి ఎలీనర్ పార్కర్ (91) అమెరికాలోని కాలిఫోర్నియాలో డిసెంబర్ 10న మరణించారు.
 1966 నాటి ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’లో బారోనెస్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆమె చివరిసారిగా
 1991లో ‘డెడ్ ఆన్ ద మనీ’లో నటించారు.
 
 అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో -93.2 డిగ్రీల సెల్సియస్
 అంటార్కిటికా తూర్పు ప్రాంతంలో 2010లో రికార్డు స్థాయిలో -93.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు నాసా తెలిపింది. ఈ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 1983లో -89.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ గత 32 ఏళ్లుగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఉపగ్రహాల సాయంతో ఈ సమాచారం సేకరించారు.
 
 టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పోప్ ఫ్రాన్సిస్
2013 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పోప్ ఫ్రాన్సిస్‌ను టైమ్ పత్రిక ప్రకటించింది. పోప్‌గా బాధ్యతలు చేపట్టిన తొమ్మిది నెలల్లోనే కేథలిక్ చర్చి దృక్పథాన్ని అసాధారణ రీతిలో మార్చారని టైమ్ పత్రిక పేర్కొంది. ఈ ఏడాది మేటి వ్యక్తుల్లో రెండో స్థానంలో అమెరికా రహస్యాలను బయటపెట్టిన సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ నిలిచాడు. టైమ్ పత్రిక ఎంపిక చేసిన టాప్-10 జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, సిరియా అధ్యక్షుడు బసర్ అసద్ తదితరులు ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి 42వ స్థానం దక్కింది.
 
 
 క్రీడలు
 
 వన్డే సిరీస్ విజేత దక్షిణాఫ్రికా
 భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది. డిసెంబర్ 11న జరిగిన మూడో వన్డే వర్షం వల్ల రద్దు కావడంతో సిరీస్ దక్షిణాఫ్రికాకు దక్కింది. అంతకుముందు జరిగిన రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికా గెలిచింది.దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డికాక్ వరుసగా మూడు వన్డేలలో మూడు సెంచరీలు సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. డికాక్ కంటే ముందు జహీర్ అబ్బాస్, సయీద్ అన్వర్, గిబ్స్, డివిలియర్స్ వరుసగా సెంచరీలు చేశారు. ఒకే సిరీస్‌లో వరుసగా మూడు వన్డే సెంచరీలు చేసిన తొలి ఆటగాడు డికాక్.
 
 ప్రపంచ మహిళల, పురుషుల
 కబడ్డీ టైటిల్ విజేత భారత్
 ప్రపంచ కప్ మహిళల కబడ్డీ టైటిల్‌ను భారత్ జట్టు గెలుచుకుంది. జలంధర్‌లో డిసెంబర్ 12న జరిగిన ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించింది. ఈ టైటిల్‌ను భారత్ గెలుచుకోవడం ఇది వరుసగా మూడోసారి. టైటిల్ సాధించిన భారత్‌కు కోటి రూపాయల నగదు బహుమతి లభించింది. ఉత్తమ స్టాపర్‌గా అనురాణి, ఉత్తమ రైడర్‌గా రామ్ బతేరి ఎంపికయ్యారు. అదేవిధంగా భారత్ వరుసగా నాలుగోసారి పురుషుల ప్రపంచ కప్ కబడ్డీ టైటిల్‌ను గెలుచుకుంది. లూథియానాలో డిసెంబర్ 14న జరిగిన ఫైనల్స్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ గెలుపుతో భారత్‌కు ట్రోఫీతోపాటు రూ. 2 కోట్ల నగదు బహుమతి లభించింది. పాకిస్థాన్‌కు కోటి రూపాయలు దక్కాయి.
 
 2013 ఐసీసీ అవార్డులు
 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2013 సంవత్సరానికి వార్షిక అవార్డులను డిసెంబర్ 13న దుబాయ్‌లో ప్రకటించింది.
 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
 (సర్ సోబర్‌‌స ట్రోఫీ): మైకేల్ క్లార్‌‌క (ఆస్ట్రేలియా)
 టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
 మైకేల్ క్లార్‌‌క (ఆస్ట్రేలియా)
 ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్:
 చటేశ్వర్ పుజారా (భారత్)
 వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: కుమార సంగక్కర(శ్రీలంక)
 ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్:
 సుజీ బేట్స్ (న్యూజిలాండ్)
 స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్‌‌డ: మహేల జయవర్ధనే(శ్రీలంక)
 అంపైర్ ఆఫ్ ద ఇయర్ (డేవిడ్ షెపర్‌‌డ ట్రోఫీ):
 రిచర్‌‌డ కెట్లెబరో
 ఎల్‌జీ పీపుల్స్ ఛాయిస్ అవార్‌‌డ: ఎం.ఎస్. ధోని
 
 జర్మనీకి పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ టైటిల్
 డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. న్యూఢిల్లీలో డిసెంబర్ 15న జరిగిన ఫైనల్స్‌లో ఫ్రాన్‌‌సను ఓడించింది. ఇది జర్మనీకి వరుసగా రెండో టైటిల్. మొత్తానికి ఆరో టైటిల్. నెదర్లాండ్‌‌సకు మూడు, మలేషియాకు నాలుగో స్థానం దక్కగా భారత్ పదో స్థానంలో నిలిచింది.
 
 లీ చోంగ్ వీకు వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్
 బ్యాడ్మింటన్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్‌ను మలేషియాకు చెందిన లీ చోంగ్ వీ గెలుచుకున్నాడు. కౌలాలంపూర్‌లో డిసెంబర్ 15న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో టామీ సుగియార్తో (ఇండోనేషియా)ను లీ చోంగ్ వీ ఓడించాడు. ఈ టైటిల్‌ను లీ చోంగ్ వీ గెలుచుకోవడం ఇది నాలుగోసారి. 2008, 2009, 2010లో ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement