ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
జాతీయం
లోక్‌పాల్‌కు రాష్ట్రపతి ఆమోదం
లోక్‌పాల్ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసినట్లు జనవరి 1న సంబంధిత వర్గాలు ప్రకటనను విడుదల చేశాయి. లోక్‌పాల్ బిల్లుకు గతేడాది డిసెంబర్‌లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
నూతన భూసేకరణ చట్టం
నూతన భూసేకరణ చట్టం జనవరి 1 నుంచి అవుల్లోకి వచ్చింది. 1894 నాటి చట్టం స్థానంలో తీసుకువచ్చిన ఈ సరికొత్త చట్టంతో భూములు కోల్పోయే రైతులు, గిరిజనులు సహా భూవుులు కోల్పేయే వారికి పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాసం అందుతాయి, ఆయూ విషయూల్లో పూర్తిగా పారదర్శకతను పాటించాల్సి ఉంటుంది.
పంచాయుతీ సవూవేశాల ప్రత్యక్ష ప్రసారం
కర్ణాటకలో గ్రావుపంచాయుతీల సమావేశాలను వచ్చే వూర్చి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. తొలిదశలో వెయ్యి గ్రామ పంచాయతీలను లోకల్ కేబుల్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించారు.
ఉత్తరాది గ్రిడ్‌తో అనుసంధానమైన దక్షిణాది గ్రిడ్
షోలాపూర్-రాయచూర్ మధ్య 765 కేవీ సామర్థ్యం గల విద్యుత్తు సరఫరా మార్గాన్ని జనవరి1న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో నేషనల్ గ్రిడ్‌తో దక్షిణాది గ్రిడ్ అనుసంధానమైంది. ఇప్పటి వరకు ఉత్తర, తూర్పు, పశ్చిమ, ఈశాన్య గ్రిడ్‌ల మధ్య మాత్రమే అనుసంధానం ఉండేది. దక్షిణాది గ్రిడ్ అనుసంధానం వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న విద్యుత్‌ను దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు వీలు కలుగుతుంది. గ్రిడ్ అనుసంధానం లేకపోవడంతో మిగులు విద్యుత్ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొరత ఉన్న దక్షిణాదికి విద్యుత్ సరఫరా వీలయ్యేది కాదు. రాయచూర్ లైన్ నుంచి కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాలకు విద్యుత్ లైన్ల అనుసంధాన త ఉండటంతో ఇకమీదట రాష్ట్రానికి ఉత్తరాది నుంచి విద్యుత్తు సరఫరా సులభతరమవుతుంది.
జీఎస్‌ఎల్‌వీ డి-5 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌తో చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ వెహికల్ (జి.ఎస్.ఎల్.వి)-డి5 ప్రయోగం విజయవంతమైంది. జీఎస్‌ఎల్‌వీ-డి5 ద్వారా జీశాట్-14 ఉపగ్రహాన్ని జనవరి 5న శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించింది.1982 కిలోల బరువు గల జీశాట్-14 అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది టెలికాస్టింగ్, కమ్యూ నికేషన్ల కోసం 12 సంవత్సరాల పాటు సేవలందిస్తుంది.
ఇందులో 12 ట్రాన్స్ పాండర్లు ఉన్నాయి. దేశీయంగా రూ పొందించిన క్రయోజెనిక్ ఇంజన్‌తో చేపట్ట్టిన జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతం అయింది. ఈ ఇంజన్‌ను ఉపయోగించడం ఇది రెండోసారి. తొలిసారి 2010 ఏప్రిల్‌లో భారత క్రయోజెనిక్‌తో చేపట్టిన జీఎస్‌ఎల్‌వి-డి3 ప్రయోగం విఫలమైంది. ప్రస్తుత ప్రయోగం విజయవంతం కావడంతో క్రయోజెనిక్ ఇంజన్ గల అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా దేశాల సరసన భారత్ చేరింది.
జీఎస్‌ఎల్‌వీ-డి5 బరువు 414.75 టన్నులు. ఎతు ్త49.13 మీటర్లు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజెనిక్ అనే మూడు దశలు ఉన్నాయి.మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని,మూడోదైన క్రయోజెనిక్ దశలో ద్రవీకృత హైడ్రోజన్, ఆక్సిజన్ వాడారు. క్రయోజెనిక్ ఇంజన్ అత్యంత శీతల ఇంధనంతో పని చేస్తుంది. సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. 2 వేల టన్నుల బరువైన సమాచార ఉపగ్రహాలను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానం అవసరం.
ఇది ఎనిమిదో జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం. తొలిసారి జీఎస్‌ఎల్‌వీ ద్వారా 2001 ఏప్రిల్ 18న చేపట్టిన జీశాట్-1ప్రయోగం విజయవంతమైంది. తరువాత చేపట్టిన వాటిలో మూడు ప్రయోగాలు విఫలమయ్యాయి. నాలుగు విజయ వంతమయ్యాయి. విజయవంతమైన ప్రయోగాల్లో రష్యా నుంచి పొందిన క్రయోజెనిక్ ఇంజను ్లఉపయోగించారు.
మాల్దీవుల అధ్యక్షుడు యామీన్ భారత పర్యటన
మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ భారత పర్యటనలో జనవరి 2న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా భారత్ నుంచి చేసుకునే దిగుమతుల కోసం 25 మిలియన్ డాలర్ల రుణాన్ని మాల్దీవులకు అందజేస్తామని ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారు.
అలాగే మాల్దీవుల పెట్రోలియం ఉత్పత్తుల అవసరాలను తీర్చేందుకు భారత్ అంగీకరించింది. ఇరుదేశాల మధ్య ఆరోగ్య రంగంలో పరస్పర సహకార అవగాహనపై సంతకాలు జరిగాయి. మాలేలోని ఇందిరాగాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో అవసరమైన సిబ్బందికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని పొడిగించారు. ఇదిలాఉండగా మాలే విమానాశ్రయం ఆధునికీకరణకు సంబంధించిన భారత కంపెనీ జీఎంఆర్ ప్రాజెక్టును గత మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేయగా-దానిపై యామీన్ ఎటువంటి హామీఇవ్వలేదు.
తొలిదశ గగన్‌కు డీజీసీఏ ధ్రువీకరణ
భారత గగనతలంపై ఉపగ్రహ ఆధారిత విమాన నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈమేరకు ప్రతిష్ఠాత్మక నావిగేషన్.. గగన్ తొలిదశకు డీజీసీఏ నుంచి జనవరి మొదటివారంలో ధ్రువీకరణ లభించింది. దీంతో ఈ వ్యవస్థ కలిగిఉన్న అమెరికా, ఐరోపా, జపాన్ దేశాల జాబితాలో భారత్ చేరింది.
అంతర్జాతీయం
కార్మికుల రక్షణపై భారత్, సౌదీ ఒప్పందం
సౌదీఅరేబియాలో పనిచేసే భారత కార్మికుల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన ఒప్పందంపై భారత్, సౌదీ అరేబియాలు జనవరి 2న న్యూఢిల్లీలో సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై సౌదీ అరేబియా కార్మికమంత్రి మొహమ్మద్ ఫఖీ, భారత్ తరపున ప్రవాస భారతీయశాఖ మంత్రి వాయిలార్వ్రి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం యజమాని, గృహ కార్మికుడు ఇరువురి హక్కుల పరిరక్షణకు తోడ్పడుతుంది. ఇరువురి మధ్య ఒప్పందం సంబంధాలను క్రమబద్ధీకరిస్తుంది. చట్టాలను ఉల్లంఘించే ఏజెంట్లపై చర్యలు తీసుకునేందుకు తోడ్పడుతుంది.
న్యూఢిల్లీవేదికగా పెట్రోటెక్-2014
2014 అంతర్జాతీయ పెట్రోలియం సమావేశాలకు న్యూఢిల్లీ వేదిక కానుంది. ఈ సమావేశాలు జనవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజులపాటు జరగనున్నాయి. ఈ సదస్సును పెట్రోలియం, సహజవనరుల, చమురు శుద్ధి మంత్రిత్వశాఖ, పెట్రోటెక్ లిమిటెడ్‌లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 2030 విజన్ పేరుతో ఈ పెట్రోటెక్ 2014 జరగనుంది.
యూరోలోకి లాత్వియా
జనవరి 1న లాత్వియా అధికారికంగా యూరో ను తన దేశ ఆధికారిక కరెన్సీగా స్వీకరించింది. ఉత్తర యూరప్ దేశమైన లాత్వియా జనాభా 2,070,370.
రాష్ట్రీయం
భాష, సాంస్కృతికశాఖ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాష, సాంస్కృతిక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఈ శాఖను మంత్రి వట్టి వసంతకుమార్‌కు కేటాయించారు. 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో ఈ శాఖను ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. సాంస్కృతిక శాఖ కార్యకలాపాలతోపాటు భాషకు సంబంధించిన కార్యక్రమాలను కొత్తశాఖ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం చలన చిత్రాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న నాటక రంగాభివృద్ధి, ప్రాచీన భాష కేంద్రం, కొత్తగా పునరుద్ధరించిన సాహిత్య సంగీత, లలిత కళల అకాడమీ, ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న తెలుగు అకాడమీలు కొత్తశాఖ పరిధిలోకి వస్తాయి. రెండో అధికార భాషైన ఉర్దూ వ్యవహారాలు కూడా ఈ శాఖ పరిధిలోనే ఉంటాయి.
రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా జస్టిస్ గోపాలకృష్ణ
రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షునిగా జస్టిస్ తామడ గోపాలకృష్ణను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3న నియమించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ గోపాలకృష్ణ ఐదేళ్లపాటు లేదా ఆయనకు 67ఏళ్ల వయసు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగుతారు.
రాష్ట్ర ఒలింపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒలింపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు ఎల్.వెంకట్రామ్‌రెడ్డి (88) జనవరి 3న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, వాలీబాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా రెండు దశాబ్దాల పాటు సేవలందించారు. రాష్ట్రంలో 50 క్రీడాసంఘాల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు.
న్యూస్ మేకర్స్
ఖేమ్కాకు డామేహుడ్ అవార్డు
భారతసంతతికి చెందిన ప్రముఖ విద్యావేత్త ఆశాఖేమ్కా బ్రిటన్ ప్రతిష్టాత్మక డామే కమాండర్ ఆఫ్‌ది ఆర్డర్ (డి.బి.ఇ-డామేహుడ్) అవార్డుకు ఎంపికయ్యారు. 1917 లో బ్రిటీష్ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. బీహార్‌లో జన్మించిన ఆశాఖేమ్కా 1975లో బ్రిటన్ వెళ్లారు. టీవీలో బోధన కార్య క్రమాలు చేపట్టిన ఆమె-అక్కడి యువతకు విద్య, ఉపాధి, శిక్షణను అందిస్తున్నారు. బ్రిటన్‌లోని 33 కళాశాలలను భారత్‌లోని కళాశాలలతో అనుసంధానించి ఇరుదేశాలకు చెందిన విద్యార్థులలో నైపుణ్యాల అభివృద్ధికి ఆమె కృషి చేస్తున్నారు. కాగా 83 ఏళ్ల తర్వాత ఈ అవార్డు భారత సంతతికి దక్కింది. ఇంతకుముందు 1931లో మహా రాణి లక్ష్మీదేవి భాయ్ సాహిబాకు ఈ గౌరవం లభించింది.
వైమానిక దళాధిపతిగా అరూప్ రహా
భారతై వెమానికదళం 24వ అధిపతిగా ఎయిర్‌చీఫ్ మార్షల్ అరూప్హ్రా (59) 2013 డిసెంబర్ 31న బాధ్యతలు చేపట్టారు. ఏకే బ్రౌన్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన అరూప్హ్రా మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
జస్టిస్ గంగూలీ రాజీనామా
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీ జనవరి 6న పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ (డబ్ల్యూ హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
నాస్కామ్ అధ్యక్షునిగా చంద్రశేఖర్
నాస్కామ్ అధ్యక్షునిగా మాజీ టెలికమ్ కార్యదర్శి రెంటాల చంద్రశేఖర్ జనవరి 5న బాధ్యతలు చేపట్టారు. ఈయన 1975వ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి.
క్రీడలు
ఆసీస్‌దే యాషెస్
ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు క్రికెట్ టెస్టుల మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌ను ఆతిథ్య ఆసీస్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. యాషెస్ సిరీస్‌ను 5-0తో కైవసం చేసుకోవడం ఆస్ట్రేలియాకు ఇది మూడోసారి. ఇంతకుముందు ఆర్మ్ స్ట్రాంగ్ (1920-21), రికీపాంటింగ్(2006-07) నేతృత్వంలో ఈ ఘనత సాధించగా ఇప్పుడు మైకేల్ క్లార్క్ వారి జాబితాలో చేరాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన అండర్సన్
2014 జనవరి 1న క్వీన్స్‌టౌన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ కేవలం 36 బంతుల్లో సెంచరీ చేసి కొత్త రికార్డు సృష్టించాడు. దీంతో ఇప్పటి వరకు షాహిద్‌ఆఫ్రిది (పాకిస్థాన్) శ్రీలంకపై 1996లో 37 బంతుల్లో సాధించిన శతకం రికార్డును అండర్సన్ అధిగమించాడు.
చెన్నై ఓపెన్ విజేత వావ్రింకా
చెన్నై ఓపెన్ టాప్‌సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) గెలుచుకున్నాడు. ఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన ఎడ్వర్డ్ రోజర్ వాసెలిన్‌ను ఓడించాడు. చెన్నై ఓపెన్‌ను గెలుచుకోవడం వావ్రింకాకు ఇది రెండోసారి. డబుల్స్‌లో జోహాన్స్ బ్రెయిన్స్ (స్వీడన్), ఫ్రెడరిక్‌నీల్సన్ (డెన్మార్క్) జోడీ విజేతలుగా నిలిచారు.
సెరెనాకు బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్
బ్రిస్బేన్‌ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ గెలుచుకుంది. బ్రిస్బేన్‌లో జనవరి 4న జరిగిన ఫైనల్లో విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించింది. ఇది సెరెనాకు 58వ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్. పురుషుల సింగిల్స్‌ను లేటన్ హెవిట్ (ఆస్ట్రేలియా)సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో రోజర్ ఫెదరర్‌ను హెవిట్ మట్టికరిపించాడు.
నాదల్‌కు ఖతార్ ఓపెన్
ఖతార్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను రఫెల్‌నాదల్ (స్పెయిన్) గెలుచుకున్నాడు. దోహాలో జనవరి 5న జరిగిన ఫైనల్లో గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)ను నాదల్ ఓడించాడు.
ఫ్రాన్స్‌కు హాఫ్‌మన్‌కప్
హాఫ్‌మన్‌కప్ మిక్స్‌డ్ టీమ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ను ఫ్రాన్స్ గెలుచుకుంది. పెర్త్‌లో జనవరి 5న జరిగిన ైఫైనల్లో పోలెండ్‌పై విజయం సాధించింది.
అండర్-19 ఆసియాకప్ క్రికెట్ విజేత భారత్
షార్జా వేదికగా జరిగిన అండర్-19 ఆసియాకప్ క్రికెట్ విజేతగా భారత్ నిలిచింది. జనవరి 4న ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. భారత్ ఈ టైటిల్ గెలుచుకోవడం రెండోసారి. 2012లో భారత్-పాక్ సంయుక్త విజేతలుగా నిలిచాయి.
బాస్కెట్‌బాల్ ఆటగాడు ఖుషిరామ్ మృతి
ఒకనాటి ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు ఖుషిరామ్(77) న్యూఢిల్లీలో 2013 డిసెంబర్ 29న మరణించారు. 1967లో ఆయనకు అర్జున అవార్డు లభించింది. 1970 మనీలా ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో ఖుషిరామ్‌ను అత్యంత విలువైన ఆటగాడు అవార్డు వరించింది.
జీఎస్‌ఎల్‌వీ డి-5 ప్రయోగం విజయవంతం
Published Thu, Jan 9 2014 3:01 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement