అభ్యసనంలో అతిముఖ్యమైన కారకం? | Grand Test for AP TET Paper - I | Sakshi
Sakshi News home page

అభ్యసనంలో అతిముఖ్యమైన కారకం?

Published Thu, Feb 6 2014 2:52 PM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM

Grand Test for AP TET Paper - I

చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగీ
 
 1.సిలబస్ రచనా పద్ధతుల్లోని సర్ఫిలాకార పద్ధతిని సమర్థించే వికాస నియమం?
 1)వికాసం నిరంతరం జరుగుతుంది
 2)వికాసం క్రమానుగతమైంది
 3)వికాసం సంచితమైంది
 4)వికాసం సాధారణం నుంచి నిర్దిష్టతకు దారితీస్తుంది
 
 2.కింది వాటిలో సరికాని జత?
 1)శారీరక పెరుగుదల వేగంగా జరిగే దశ - శైశవదశ
 2)ఉద్వేగాలు ధారాపాతంగా ఏర్పడేదశ - పూర్వ బాల్యదశ
 3)భిన్న లింగీయులతో జట్టు క్రీడల్లో పాల్గొనే దశ- ఉత్తర బాల్యదశ
 4)ఒత్తిడి, ఒడిదుడుకుల దశ - కౌమారదశ
 
 3.పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలోని దశలకు సంబంధించి సరి కానిది?
 1)వస్తు స్థిరత్వ భావన పొందని దశ - సంవేదన చాలక దశ
 2)మేక్ బిలీవ్ ప్లేకు సంబంధించిన దశ - పూర్వ ప్రచాలక దశ
 3)నిగమన వివేచనం కనిపించే దశ - మూర్త ప్రచాలక దశ
 4)సమస్యా పరిష్కారంలో పరికల్పనను రూపొందించుకునే దశ - అమూర్త ప్రచాలక దశ
 
 4.కోల్‌బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికానిది?
 1)బడికి వెళ్లడానికి అవసరాలు తీర్చుకోవడం - పూర్వ నైతిక స్థాయిలోని ఒకటో దశ
 2)బడికి వెళ్లడానికి బహుమతులు తీసుకోవడం - పూర్వ నైతిక స్థాయిలోని రెండోదశ
 3)ఉపాధ్యాయుల సంతృప్తి కోసం బడికి వెళ్లడం - సాంప్రదాయక నైతిక స్థాయిలోని మూడోదశ
 4)ప్రధానోపాధ్యాయుని అధికారానికి లోబడి బడికి వెళ్లడం-సంప్రదాయ నైతికస్థాయిలోని నాలుగోదశ
 
 5.కింది వాటిలో వ్యక్త్యంతర్గత భేదాన్ని సూచించనిది?
 1)రాణి గణితంలో కంటే సాహిత్యంలో మిన్న
 2)రాజు సాహిత్యంలో కంటే గణితంలో మిన్న
 3)రాజు తరగతి విద్యార్థులలో దక్షత గలవాడు
 4)విశాల్ శారీరకంగా బలవంతుడు- మానసికంగా బలహీనుడు
 
 6.ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి సరికానిది?
 1)శాబ్దిక పరీక్షలన్నీపేపర్ పెన్సిల్ పరీక్షలు.
 2)అశాబ్దిక పరీక్షలన్నీ నిష్పాదన పరీక్షలు.
 3)సంస్కృతి సహిత పరీక్షలన్నీ సంస్కృతి రహిత పరీక్షలో ప్రామాణికమైనవి.
 4)వేగ పరీక్షలలో సులభత నుంచి క్లిష్టతకు ప్రశ్నలు ఉండవు.
 
 7.కింది వాటిలో సహజసామర్థ్యం గల విద్యార్థి?
 1)గౌతమ్ విభిన్న ఆలోచనలు గల విద్యార్థి
 2)దేవీ సౌమ్య ఉద్వేగ పరిపక్వతగల విద్యార్థిని
 3)చాణక్య కార్టూన్స్, కామిక్స్ అమితంగా ఇష్టపడే విద్యార్థి
 4)రేష్మా చిత్రలేఖనంలో ప్రతిభ చూపే విద్యార్థిని
 
 8.మూర్తిమత్వ పరీక్షల్లో ప్రక్షేపక పరీక్షకానిది?
 1) బెల్స్ అడ్జెస్ట్‌మెంట్ ఇన్వెంటరీ
 2) రోషాక్ సిరామరకల పరీక్ష
 3) ఇతివృత్త గ్రాహ్య పరీక్ష
 4) చిల్డ్రన్ అప్పర్ సెప్షన్ టెస్ట్
 
 9.తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు మూడు సమూహాలుగా విభజించాడు. అందులో మొదటి సమూహం వారికి ఇంటిపని చేస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. రెండో సమూహం వారికి ఇంటిపని ఇచ్చాడు. కానీ దండన, బహుమతి ప్రకటించలేదు. మూడో సమూహం వారికి ఇంటిపని చేయకపోతే దండన తప్పదని తెలిపాడు. ఇందులో నియంత్రిత సమూహం ఏది?
 1) 1     
 2) 2     
 3) 3
 4) 1,3
 
 10.ఆరో తరగతి చదువుతున్న సాయి పాఠశాలలోని ఆటలు, స్నేహితులు ఆకర్షణగా ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులు ఆకర్షణగా లేకపోవడంతో చదువు కొనసాగించడమా లేదా వదిలివేయడమా అనేది నిర్ణయించుకోలేక పోతున్నాడు. ఆ విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ?
 1) ఉపగమ-ఉపగమ    
 2) ఉపగమ-పరిహార
 3) పరిహార-పరిహార    
 4) అనుమతి- నిరాకరణ
 
 11.రక్షకతంత్రాలకు సంబంధించి సరి కానిది?
 1)వెంకీ చిన్న పిల్లవానివలె ఏడవడం - ప్రతిగమనం
 2)వెంకీ పరీక్ష తప్పటానికి ఉపాధ్యాయుడు కారణం అని చెప్పడం - హేతుకీకరణ
 3)ప్రేమలేఖలు రాసే వెంకీ ప్రేమకథలు రాసి రచయితగా గుర్తింపుపొందడం- ఉదాత్తీకరణ
 4)అవుట్‌డోర్ గేమ్స్ ఆడలేని వెంకీ ఇండోర్ గేమ్స్‌లో రాణించడం - పరిహారం
 
 12.పిల్లల్లో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంత కర్త?
 1) వైగాట్‌స్కీ        
 2) ఛామ్‌స్కీ
 3) పియాజె        
 4) కోఫ్కా
 
 13.కార్ల్ రోజర్స్ వికాస సిద్ధాంతం దృష్టి కేంద్రీకరించనది?
 1) ఆత్మాశ్రయ వాస్తవికత
 2) ైచైతన్యవంతమైన అనుభవాలు
 3) సంజ్ఞానాత్మక అనుభవాలు
 4) స్వీయభావన
 
 14.కింది వాటిలో బోధన- అభ్యసన ప్రక్రియలో అభ్యాసకుని ప్రాధాన్య ఉపగమం?
 1)నేను ఒక సబ్జెక్టును ఎలా బోధించాలి?
 2)నేను బోధించే అంశాన్ని విద్యార్థులు ఎంత చక్కగా నేర్చుకుంటారు?
 3)నేను తరగతిలో బోధించడానికి సామగ్రిని ఎంత సక్రమంగా నిర్వహిస్తాను?
 4)విద్యార్థులు అర్థం చేసుకునే విధంగా ఎంత సమర్థంగా భావనను వివరించగలను?
 
 15.విద్యార్థి అవుట్‌లైన్ పటం గీయాలంటే కింది అభ్యసనా సిద్ధాంతం ఆధారంగా నేర్చుకోవాలి?    
 1) పావ్‌లోవ్ ఎస్ టైప్ అభ్యసనం
 2) స్కిన్నర్ ఆర్ టైప్ అభ్యసనం
 3) థార్‌‌నడెక్ ఆర్- ఎస్ అభ్యసనం
 4) బండూరా పరిశీలనా అభ్యసనం
 
 16.ప్రయోగశాలలో పరికరం సరిగా ఉపయోగించిన విద్యార్థికి ఉపాధ్యాయుడు బహుమతిచ్చాడు. ఆ బహుమతి వల్ల ప్రేరణ పొందిన విద్యార్థి ప్రయోగం నిర్వహణను అభ్యసించాడు. ఇందులో ఇమిడి ఉన్న మనోవైజ్ఞానిక భావన?
 1) పావ్‌లోవ్ ఎస్ టైప్ అభ్యసనం
 2) స్కిన్నర్ ఆర్ టైప్ అభ్యసనం
 3) థార్‌‌నడైక్ ఆర్- ఎస్ అభ్యసనం
 4) బండూరా పరిశీలనా అభ్యసనం
 
 17.నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, వర్షపాతం, అడవులు, మృత్తికలు, నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, పరిశ్రమలు, రవాణా, ఎగుమతులు, దిగుమతులు అనే భౌగోళిక శాస్త్ర భావనలు విడివిడిగా అభ్యసించడం కంటే మొ త్తంగా అభ్యసించడంలోని మనో వైజ్ఞానిక భావన?
 1) పావ్‌లోవ్ ఎస్ టైప్ అభ్యసనం
 2) కోహ్లెర్ అంతర్‌దృష్టి అభ్యసనం
 3) థార్‌‌నడైక్ ఆర్- ఎస్ అభ్యసనం
 4) బండూరా పరిశీలనా అభ్యసనం
 
 18.కుడిచేతితో బొమ్మలు గీసే వ్యక్తి ఎడమచేతితో బంతిని విసిరే నైపుణ్యాన్ని సాధించడం?
 1) అనుకూల బదలాయింపు
 2) ప్రతికూల బదలాయింపు
 3) శూన్యబదలాయింపు
 4) ద్విపార్శ్వ బదలాయింపు
 
 19.9989328365 అనే నంబర్ నేర్చుకొన్న విద్యార్థి కింది ఏ స్మృతి టెక్నిక్ ఉపయోగించి 9014143632 అనే నంబర్ నేర్చుకోవడం జరుగుతుంది?
 1) రిహార్సల్    
 2) నెమోనెక్స్
 3) ఆక్రానిక్స్
 4) ఛంకింగ్
 
 20.కింది వాటిలో అంతర్గత ప్రేరణ సందర్భం?
 1)ఇతరుల నుంచి ప్రశంసలందుకోవాలనే ఉద్దేశంతో పనిచేయడం
 2)గమ్యాన్ని సాధించాలనే వాంఛ
 3)పరీక్షలో ర్యాంక్ సాధించడానికి అధ్యయనం చేయడం
 4)ఇతరులను ఆనందపరచడానికి పనిచేయడం
 
 21.చాలక వికాసానికి  ఉదాహరణ కానిది?
 1) ఆట సామగ్రిని ఉపాయంగా వినియోగించడం
 2) వస్తువులను విసరడం
 3) ఒక పాదం మీద స్కిప్పింగ్ చేయడం
 4) ఎత్తుపెరగడం
 
 22.అభ్యసనంలో అతిముఖ్యమైన కారకం?
 1)ఉపాధ్యాయుడు-శిక్షణ
 2)బోధన పద్ధతులు -శిక్షణ
 3)అభ్యాసకుడు, ఉపాధ్యాయుడు, అభ్యసన సామగ్రి
 4)గ్రంథాలయం, ప్రయోగశాల
 
 23.పాఠశాలలో మార్గదర్శకత్వం వహించే వారికి సంబంధించి కింది వాటిలో సరైంది?
 1)వారు పిల్లల సమస్యలను పరిష్కరిస్తారు
 2)వారి భావాలను పిల్లలపై మోపి వారిని ఆ ప్రకారం నడుచుకోమంటారు
 3)పిల్లల సమస్యలను పరిష్కరించడంలో వారికి సహాయ పడతారు
 4)పిల్లల తరపున నిర్ణయాలు తీసుకొని పరిష్కారాలను ఆదేశిస్తారు
 
 24.కౌన్సిలీకి మంచి మార్గదర్శకత్వం అందించడానికి కౌన్సిలర్ చేపట్టవలసిన మొదటి చర్య?
 1)కౌన్సిలీతో మంచి సామరస్యతను ఏర్పరచుకోవడం
 2)ఉపయోగించడానికి సరైన సాధనాలను ఎన్నుకోవడం
 3)ఉపాయాత్మక ప్రశ్నల ద్వారా సమాచారాన్ని రాబట్టడం
 4)సేకరించిన సమాచారం, కౌన్సిలీ భావసూచనల ద్వారా సమస్యను విశ్లేషించడం
 
 25.సమ్మిళిత విద్య లక్ష్యం?
 1)అంగవైకల్యత కలిగిన పిల్లలను రక్షించడం
 2)బుద్ధిమాంద్యం కలిగిన పిల్లల అవసరాలను తీర్చడం
 3)ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అందరి అవసరాలు తీర్చడం
 4)పిల్లలందరి అవసరాలు తీర్చడం
 
 26.బెదిరింపులుండని అభ్యసనా వాతావరణాన్ని సృష్టించడానికి ఉపాధ్యాయునికి ఇటువంటి నాయకత్వ శైలి అవసరం?
 1) జోక్యరహిత
 2) భాగస్వామ్య
 3) ఆకర్షణీయ    
 4) నియంతృత్వ
 
 27.మూల్యాంకనానికి సంబంధించి సరి కానిది?
 1)అభ్యసనం కోసం అంచనా- లోపనిర్ధారణ మూల్యాంకనం
 2)అభ్యసనా ప్రక్రియలో అంచనా - సమగ్ర మూల్యాంకనం
 3)అభ్యసనాన్ని అంచనా వేయడం - సంకలన మూల్యాంకనం
 4)అభ్యసనాన్ని అంచనావేస్తూ ఉండడం- నిరంతర సమగ్ర మూల్యాంకనం
 
 28.ఒక్కొక్క జ్ఞానేంద్రియానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి బోధించాలని పేర్కొన్న విద్యా విధానం?
 1) ప్రోబెల్ -కిండర్‌గార్డెన్
 2) మాంటిస్సోరి - చిల్డ్రన్‌హౌస్
 3) పెస్టాలజీ- యార్డన్‌బోర్డింగ్
 4) ప్లేటో- జిమ్నాషియా
 
 29.విద్యాహక్కుచట్టం - 2009 ప్రకారం సరి కానిది?
 1)మొత్తం ఉపాధ్యాయుల సంఖ్యలో ఖాళీల సంఖ్య 10 శాతానికి మించ కూడదు.
 2)విద్యార్థికి అతని వయసుకు తగిన తరగతిలో ప్రవేశాన్ని కల్పించాలి.
 3)నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని చట్టంలో ప్రస్తావించడం
 4)8వ తరగతిలోపు బోర్డు పరీక్షలు నిర్వహించడం
 
 30.జాతీయ పాఠ్యప్రణాళిక చట్రంప్రకారం సరి కానిది?
 1)ఇంగ్లిష్‌ను బోధనామాధ్యమంగా ఉపయోగించడం
 2)నిరంతర సమగ్రమూల్యాంకనం
 3)బహుభాషా విధానాన్ని తెలియజేయడం
 4)అభ్యసనంలో నిర్మాణాత్మక ఉపగమం ఉపయోగం
 తెలుగు
 
 కింది గద్య భాగాన్ని చదివి 31నుంచి 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
 సాంస్కృతిక పునరుజ్జీవనం రెండు చేతులా పెంపొందించిన మహానుభావులు ముగ్గురూ వెనువెంటనేరావడం మన మహా భాగ్యం. వారు పదితరాలలో పదివందల మందితో జరిగే పనిని ఒక్క చేతి మీదిగా నడపగలిగారు. వారిలో ఒకరు కందుకూరి వీరేశలింగం (1848-1919). ఆయన తెలుగు దృక్పథంలోనే వినూత్నమైన మార్పు తేగలిగారు. బ్రహ్మ సమాజ స్థాపన ద్వారా సాంఘిక సంస్కరణలకు బీజావాపనం చేశారు. అనేక మూఢాచారాలను వెక్కిరించి వేళాకోళం చేసి తప్పుకోకుండా వాటి సమూల నిర్మూలనకు తెగించి పోరాడారు. తొలి నవల రాశారు.
 
 తొలి కవుల చరిత్ర, తొలి నాటకం, తొలి స్వీయ చరిత్ర.. ఇలా చాలా ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే సృజనాత్మక సాహిత్యంలో ఒక వినూత్న ప్రయోగం చేసి చిన్నకథకు ప్రాణం పోసి, వచన వ్యావహారిక సాంఘిక నాటకానికి ప్రాణప్రతిష్ఠ చేసి దేశమును ప్రేమించమనీ, మంచిని పెంచుకోమనీ ప్రబోధించి అజరామరుడైన గురజాడ అప్పారావు (1861-1915) రెండోవారు. సాహిత్యంలో వ్యావహారిక భాషకు పట్టం కట్టి వచనం విస్తరించేందుకు కృషిచేసి, తన జీవితంలోనే ఉద్యమ సాఫల్యాన్ని చవిచూసి సంతృప్తుడైన గిడుగు రామ్మూర్తిపంతులు (1862-1963) మూడోవారు.
 
 31.సాంస్కృతిక పునరుజ్జీవనానికి ముగ్గురు మహానుభావులు చేసిన కృషి ఎలాంటిది?
 1)వందలాది మందితో జరిగే పనిని ఒక్కరే చేశారు.
 2)పది తరాల్లో పదివందల మందితో జరిగే పనిని ఒక్క చేతి మీదిగా నడిపించారు.
 3)పది వందల మందితో జరిగే పనిని ఒక్కరే చేశారు
 4)పది తరాల్లో జరిగే పనిని ఒక్కరే చేయగలిగారు
 
 32.మూఢాచారాల  నిర్మూలన కోసం పోరాడింది?
 1) కందుకూరి వీరేశలింగం    
 2) చిలకమర్తి
 3) గురజాడ    
 4) గిడుగు రామ్మూర్తి
 
 33.వ్యావహారిక సాంఘికనాటకానికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది?
 1) పానుగంటి
 2) కందుకూరి
 3) గురజాడ    
 4) గిడుగు
 
 34.సాహిత్యంలో వచనం విస్తరణకు కృషి చేసింది?
 1) రాయప్రోలు    
 2) గురజాడ
 3) కందుకూరి    
 4) గిడుగు
 
 35.తెలుగు సాహిత్యంలో ప్రక్రియలన్నింటికీ శ్రీకారం చుట్టిన రచయిత?
 1) చిలకమర్తి    
 2) కందుకూరి
 3) గురజాడ    
 4) గిడుగు
 
 అపరిచిత పద్య భాగం
 కింది అపరిచిత పద్యాన్ని చదివి 36 నుంచి 40 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
 సిరిగలవాడు మైమరిచి చిక్కిననాడు, తలంచి పుణ్యముల్
 పొరిపొరి చేయనైతినేనని పొక్కిన గల్గునే? గాలిచిచ్చుపై
 కెరలిన వేళడప్పిగొని కీడ్పడువేళ జలంబుగోరి త
 త్తరమున ద్రవ్వినంగలదే? దాశరథీ కరుణాపయోనిధీ!
 
 36.ఈ శతక పద్య రచయిత?
 1) బద్దెన
 2) మారద వెంకయ్య
 3) కంచర్ల గోపన్న
 4) ధూర్జటి
 
 37. ఈ పద్యం ఏ వృత్తానికి సంబంధించింది?
 1) ఉత్పలమాల    
 2) చంపకమాల
 3) శార్దూలం    
 4) మత్తేభం
 
 38.‘పొక్కిన’ పదానికి అర్థం?
 1) కమలిన    2) సంతోషించిన
 3) తినిన    4) కుమిలిన
 
 39.ధనమున్నప్పుడు పుణ్యకార్యాలు చేయకుండా చివరలో చింతించే వ్యక్తికి కవి చెప్పిన దృష్టాంతం?
 1)    గాలి నిప్పుపై విజృంభించేటప్పుడు నీటిపై ప్రయత్నించడం
 2)    దాహం వేసినప్పుడు బావిని తవ్వేందుకు ప్రయత్నించడం
 3)    సమయం మించిన తర్వాత కుమిలిపోవడం
 4)    ైపైవన్నీ
 
 40.‘త్రవ్వినంగలదే!’ పదాన్ని విడదీస్తే...?
 1) త్ర వ్వినం+గలదె    2) త్రవ్వినన్+కలదె
 3) త్రవ్వినం+కలదె    4) త్రవ్వినన్+గలదె
 
 41.ఉభయ కవి మిత్రుడు అనే బిరుదున్న కవి?
 1) నన్నయ    2) తిక్కన    3) పోతన    4) ఎర్రన
 
 42.జాషువా ‘గబ్బిలం’,‘ నాకథ’ ఏ ప్రక్రియకు చెందిన రచనలు?
 1) పద్యకావ్యం-ఖండకావ్యం
 2) ఖండకావ్యం-స్వీయ చరిత్ర
 3) సందేశ కావ్యం -స్వీయ చరిత్ర
 4) పద్యకావ్యం- ఆత్మకథ
 
 43.రాయప్రోలు వారి ‘లలిత’, ‘ఆంధ్రావళి’ ఏ ప్రక్రియకు చెందిన రచనలు?
 1) పద్యకావ్యం-వచన కావ్యం
 2) అనువాదకావ్యం-ఖండకావ్యం
 3) గేయకావ్యం-ఖండకావ్యం
 4) వచన కావ్యం-ఖండకావ్యం
 
 44.‘మాధవి తనపనేదో తానుచేసుకుంటానన్నది’.. ఇది ఏ వాక్యం?
 1) కర్మణి వాక్యం    2) ప్రత్యక్ష వాక్యం
 3) క్రియారహిత వాక్యం    4) పరోక్షవాక్యం
 
 45.‘రేపు పరీక్ష జరగవచ్చు’ అనే వాక్యం?
 1) అనుమత్యర్థకం    2) సంభావనార్థకం
 3) నిశ్చయార్థక వాక్యం    4) నిషేధార్థక వాక్యం
 
 46.వర్ణమాల ప్రకారం సరైన వరుసక్రమం?
 1) గ-డ-జ-వ-ద    2) గ-జ-డ-ద-బ
 3) గ-డ-ద-బ-జ    4) గ-బ-డ-జ-ద
 
 47.‘దేశాభివృద్ధికి ప్రణాళికలెన్ని వచ్చినా చాలా మందికి పేదరికం పోలేదు’ అనే వాక్యంలో అసమాపక క్రియ?
 1) క్త్వార్థకం        2) ఛేదర్థకం
 3) అప్యర్థకం        4) ప్రశ్నార్థకం
 
 48.‘అత్యంత’ పదంలో ఉన్న సంధి?
 1) యణాదేశ సంధి    2) వృద్ధి సంధి
 3)సవర్ణదీర్ఘ సంధి    4) గుణ సంధి
 
 49.‘బాపురే’ పదం ఏ భాషాభాగానికి చెందింది?
 1) క్రియ    2) విశేషణం
 3) సర్వనామం    4) అవ్యయం
 
 50.బహువ్రీహి సమాసానికి ఉదాహరణలు?
 1) చక్రపాణి, కుంభాకారుడు, నెలతాల్పు
 2) నలువ, చక్రపాణి, కమలాక్షుడు
 3) శీతాద్రి, చక్రపాణి, పీతాంబరుడు
 4) ముక్కంటి, సంసారసాగరం, పూబోడి
 
 51.‘శశవిషాణం’ అనే జాతీయానికి అర్థం?
 1) చంద్రుని వెన్నెల    2) చంద్రునిలో మచ్చ
 3) కుందేటికొమ్ము    4) చంద్రునిమీద పాషాణం
 
 52.‘‘కార్యము’’ అనే పదానికి వికృతి?
 1) కారము    2) కర్జము    3) కోరము    4) కరణం
 
 53.‘నోట్లో వేలు- నెత్తి మీదరాయి’ పొడుపు కథకు అర్థం?
 1) గడియారం    2) వడ్డాణం
 3) కడియం    4) ఉంగరం
 
 54.‘సన్యాసి’ పదంలో జరిగిన అర్థ విపరిణామం?
 1) అర్థసంకోచం    2) అర్థవ్యాకోచం
 3) అర్థాపకర్ష    4) అర్థగౌరవం
 
 55.‘మాతృభాష తల్లిపాల వంటిది’ అని పేర్కొన్నది?
 1) గాంధీ    2) కొమర్రాజు లక్ష్మణరావు
 3) ఠాగూర్    4) వావిలాలగోపాలకృష్ణయ్య
 
 56.సాధారణంగా ఉక్తలేఖనాన్ని మూడుసార్లు చెప్పాలి. మొదటిసారి చెప్పినప్పుడు విద్యార్థి చేయాల్సిన పని?
 1) వినాలి- రాయాలి    2) తప్పులు సరిచూసుకోవాలి
 3) ఏకాగ్రతతో వినాలి    4) రాయాలి
 
 57.గద్యబోధన సందర్భంలో ఉపాధ్యాయుడు వ్యాకరణాంశాలు బోధించాల్సిన సమయం?
 1) చర్చ అనంతరం    
 2) బాహ్యపఠనం తర్వాత
 3) విద్యార్థుల మౌనపఠనానికి ముందు
 4) ఉపాధ్యాయుడి ఆదర్శ పఠనం కంటే ముందు
 
 58.లఘుతర ప్రశ్నలు సిద్ధం చేసేటప్పుడు ఉపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం?
 1)మాదిరి సమాధానాలను ముందే రాసుకోవాలి.
 2)ప్రతి ప్రశ్నను ఫలితాలను బట్టి రూపొందించాలి
 3)ప్రతి ప్రశ్నకు స్పష్టమైన ఒకే సమాధానం రావాలి
 4)కాదు, లేదు వంటి ప్రశ్నలు అడగాలి
 
 59.బోధనా లక్ష్యాలను ‘టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్’లో వివరించిన విద్యావేత్త?
 1) గ్విన్    
 2) బెంజమిన్ బ్లూమ్స్
 3) సిసిరో    
 4) లివింగ్‌స్టన్
 
 60.కృత్యాధారపద్ధతికి (అపెప్) మరో పేరు?
 1) డాల్టన్ పద్ధతి    2) నాటకీకరణ పద్ధతి
 3) మనోవైజ్ఞానిక పద్ధతి    4) చర్చా పద్ధతి
 
 ENGLISH
 
 61.In letter writing subscription is ____ and it terminated with____.
 1) The beginning of the letter; a comma
 2) The end of the letter; a comma
 3) The beginning of the letter; a full stop
 4) The end of the letter; a full stop
 
 62.If pronouns of different persons are to be used together in a sentence, the serial order of persons should be as follows:
 1)first person, second person, third person
 2)second person, first person, third person
 3)second person, third person, first person
 4) third person,second person,  first person
 
 63.The following sentence has been divided into four parts 1, 2, 3 and 4. There is an error in these parts. Detect the error and identify the part.
 The Renaissance is one of the most (1)/ interesting (2)/period in the history of architecture (3)/and indeed, of art in general (4).
 64.Which of the sentence is correctly punctuated.
 1)High and low, rich and poor must die!
 2)High and low, rich and poor, must die.
 3)High and Low, Rich and Poor must die.
 4)High and low, rich and poor must die.
 
 65.He was so learned that he seemed to know everything.
 Choose the correct compound form.
 1)He was very learned and so seemed to know everything.
 2)He was too learned to know everything.
 3)He was very learned but did not know anything.
 4)He was very learned and knows everything.
 
 66.The following sentence is in positive form.
 Very few companies in the world are as famous as the Reliance.
 Select the superlative form.
 1)The Reliance is not the most famous of all the companies in the world..
 2)The Reliance is one of the most famous companies in the world.
 3)The Reliance is the most famous of all the companies.
 4)The Reliance is famous than many other companies in the world.
 
 67.Material (Choose the correct antonym.)
 1) aerial    
 2) watery
 3) hollow    
 4) spiritual
 
 68.He is a good poet but not _____ Shakespeare. Fill in the suitable article.
 1) a     2) an     3) the    4) no article
 
 69.    The arrow pierced _______ the villain's heart. Fill in the suitable preposition.
 1) from     2) beside     3) into     4) through
 
 70.    Past perfect continuous tense is used for an action that was in progress over a period of time in the past. Select the best example from the given sentences.
 1)    I had been working in this office for five years by 2000.
 2)    He had been working in this office since 2000.
 3)    He had worked in this office for five years.
 4)    He had working this office for  five years.
 
 Choose the passive form of the sentence .
 71."He writes a novel." (Convert the given sentence into past perfect tense.)
 1) He wrote a novel.
 2) He was writing a novel
 3) He had written a novel
 4) He had been writing a novel
 
 72.One must do one's duty.
 1) One's duty must be done by one.
 2) One must be done his duty.
 3) One must be done with one's duty.
 4) Duty must be done.
 
 73.She said to him,"Are you not happy with what you have got?" The indirect form is:
 1) She told him whether he is not happy with what he had got,
 2)    She asked him if he was not happy with what he got.
 3)    She asked him whether he was not happy with what he has got.
 4)    She asked him if he was not happy with what he had got
 
 74.Choose the most appropriate one word substitute.
 A player who acts not by speaking, but wholly by gesticulations.
 1) Pantomine
 2) Patricide
 3) Patent     
 4) Paronyms
 
 75.A Necromaneer is:
 1) Doctor         2) Magician
 3) Neurologist     4) Agriculturist
 Read the following passage carefully and choose the best answer out of the four alternative.
 The chief condition of happiness bearing certain physical prerequisites, is the life of reason the specific carry and power of man. Virtue or rather excellence, will depend on clear judgement , selfcontrol, symmetry of desire, artistry of means, it is not the possession of the simple man, nor the gift of innocent extent, but the achievement of experience in the fully developed man. Yet there is a road to it, a guide to excellence, which may save many detours and delays; it is the middle way the golden mean. The qualities of character can be arranged in triads in each of which the first and the last qualities will be extremes and vices, and the middle quality a virtue or an excellence. So between cowardice and reshness is courage: between stinginess and extravagance is liberally; between sloth and greed is ambition between humility and pride is modesty; between secrecy and loquacity is honesty; between moroseness and buffoonery is good humour between quarrelsomeness and flattery is friendship between Hamlet's indecisiveness and Quixote's impulsiveness is self control 'Right' in ethics or conduct is not different from right in mathematics or engineering; it man correct and fit what works best to the best results.
 
 76.What is the main idea of passage?
 1)    The qualities of character are there -extremes and middle.
 2)    In some respects ethics and mathematics resemble.
 3)    Happiness can be achieved by following the middle path.
 4) None of there.
 
 77.    What is the implied meaning of the passage?
 1)    Happiness depends upon physical and mental qualities.
 2)    Self control is necessary.
 3)    Excellence should be achieved.
 4)    Rational approach lies in following the middle path.
 
 78.synonym of excellence?
 1)    Inferiority
 2)    Failure
 3)    Imperfection
 4) Eminence
 
 79.Which of the following is not the middle path of different qualities?
 1) Liberality     2) Ambition
 3) Friendship     4) Secrecy
 
 80.who among the following is not the writer of either Hamlet or Don Quixote?
 1) Benjonson     2) Shakespeare
 3) Cerventes     4) None of these
 
 81.Which of the following is the suitable title for the passage?
 1) Qualities of character
 2) Chief condition of happiness
 3) Golden mean
 4) None of this
 
 82.She cooks well, ________ ? Add the question tag.
 1) Didn't she    
 2) Did she
 3) Doesn't she    
 4) isn't she
 
 Choose the correct meaning of the idioms and phrases
 83.'At arms length"
 1) length of arm     2) At a distance
 3) insult         4) very near
 
 84.On the spur of the moment
 1) at once         2) get delayed
 3) give justice     4) practically
 
 85.Eliciting the grammar rules from the student rather than telling them is:
 1) inductive method    2) bilingual method
 3) deductive method    4) none
 
 86.In learning language every student besides acquiring L, S, R, and W skills, should also develop Reference skill . Which reference material is preferred by the student if he has to look for synonyms and antonyms
 1) Thesaurus     2) Dictionary
 3) Encyclopedia     4) atlas
 
 87.Reading for information is:
 1) Intensive reading    2) Extensive reading
 3) Reading Aloud    4) none
 
 88.    _____test will help to find out a set of qualities of an individual to solve specified problems.
     1) aptitude test     2) Diagnostic
     3) Achievment    4) unit test
 
 89.    which of the following letters are written in the same technique.
     1) b f a s t     2) l t g d e
     3) a e d g         4) b f a l
 
 90.    in language learning speaking is primary and help in interaction and communication. As an ELT how would you promote speaking skills.
     1) use translation method
     2) introduce dialogue technique
     3) Make them write a composition
     4) Introduce word stress
 
 పరిసరాల విజ్ఞానం
 
 91.వర్మీ కంపోస్ట్ తయారీకి తవ్విన గుంటలో అడుగు భా గం నుంచి పై భాగం వరకు వరుసగా వీటిని వేస్తారు?
     1)    పేడ, వానపాములు ్ధ పీచు, చెత్త  ్ధ గడ్డి
     2)    చెత్త, గడ్డి  ్ధ పీచు, పేడ  ్ధ వానపాములు
     3)    పీచు  ్ధ చెత్త, గడ్డి  ్ధ పేడ, వానపాములు
     4)    వానపాము, పేడ ్ధ చెత్త, పీచు  ్ధ గడ్డి
 
 92.మొట్టమొదటిసారిగా ఎవరి కాలంలో ‘రాజ్యం’ అవతరించింది?
     1) సింధు నాగరికత    2) ఆర్య నాగరిక త
     3) మగధ వంశం    4) సింధు ప్రజల పూర్వీకులు
 
 93.    రామయ్య ఏకైక కుమారుడు వేణు, రంగయ్య కుమారుడు రామ్. రామ్, లక్ష్మణులు సోదరులు. లక్ష్మణ్ సోదరి వేణుకు భార్య, రామయ్య భార్య రామ్ భార్యకు ఏమవుతుంది?
     1) అత్త    2) పిన్ని    3) అక్క    4) కూతురు
 
 94. ‘జలుబు’ వ్యాధికారకం?
     1) రినో వైరస్    2) వెరిసెల్లా వైరస్
     3) ఆర్థోమిక్సో వైరస్    4) పారా వైరస్
 
 95.    కింది వాటిలో తప్పుగా జతపరచింది?
     1) ఏకవార్షికాలు-వరి, గోధుమ, చిక్కుడు
     2) ద్వివార్షికాలు -క్యారెట్, బీట్‌రూట్, ముల్లంగి
     3) బహువార్షికాలు-మామిడి, వేప, చింత
     4) పైవేవీకావు
 
 96.    మానవుని దంతసూత్రం?
     1) 2/2, 1/1 , 2/2, 3/3
     2) 1/2, 2/1, 3/2, 3/3
     3)1/1, 2/2, 3/3, 2/2,
     4) 3/2, 3/3 ,1/2, 2/1
 
 97.    కింది వాటిలో ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవి?
     1) నత్త    2) అమీబా    3) కప్ప    4) బల్లి
 
 98.    బాత్‌రూమ్‌లను శుభ్రం చేయడానికి ఉపయోగించేది?
     1) వెనిగార్    2) ఎసిటికామ్లం
     3) హైడ్రోక్లోరిక్ ఆమ్లం    4) కార్బోనికామ్లం
 
 99.    మనశరీరానికి తక్షణ శక్తిని అందించేవి?
     1) చక్కెరలు     2) ప్రోటీన్లు
     3) కొవ్వులు    4) విటమిన్లు
 
 100. జైపూర్‌లో నివసించే వారికి ఏ రకమైన ఇళ్ల్లు సౌకర్యం?
     1) వెదురుకర్ర ఇళ్లు    2) మట్టి ఇళ్లు
     3) చెక్క ఇళ్లు    4) గుడారాలు
 
 101. ఓజోన్‌పొర దెబ్బతినడానికి కారణమవుతున్న క్లోరోఫ్లోరోకార్బన్ల విడుదలను నిలువరించాలంటే?
     1)    రిఫ్రిజిరేటర్, ఏసీల వినియోగం తగ్గించాలి
     2)    మోటారు వాహనాల వాడకం నియంత్రించాలి
     3)    శబ్ద కాలుష్య తీవ్రతను తగ్గించాలి
     4)    శబ్ద, వాయు కాలుష్య కార కాల వాడకం తగ్గించాలి.
 
 102. వర్షాకాలంలో కలుషిత నీరు తాగడంతో వచ్చే వ్యాధి?
     1) కలరా    2) మలేరియా
     3) డయేరియా    4) కోరింతదగ్గు
 
 103. 82బీని డిగ్రీల తూర్పు రేఖాంశంపై గల ఒక పట్టణంలో స్థానిక సమయం మధ్యాహ్నం 12బీ గంటలు అయితే లండన్‌లో ఎంత సమయం అవుతుంది?
     1) సాయంత్రం 6 గంటలు
     2) ఉదయం 7 గంటలు
     3) సాయంత్రం 7 గంటలు
     4) ఉదయం 6 గంటలు
 
 104. వీటిలో ‘సర్వభక్షకి’
     1) తొండ    2) కోడి    3) బల్లి    4) సాలెపురుగు
 
 105. ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే అంతర్జాతీయ కొలమానం?
     1) కెలోరీమీటర్    2) కాండిలా
     3) సెల్సియస్    4) కెల్విన్
 
 106. ఏ నేలల్లో పొటాష్, ఫాస్ఫారికామ్లాలు ఎక్కువ?
     1) నల్లరేగడి    2) ఎర్రనేలలు
     3) ఒండ్రునేలలు    4) లాటరైట్
 
 107.  వైరస్ వల్ల వచ్చే ట్రిస్టిజ అనే వ్యాధి వేటికి వస్తుంది?
     1) పాడి పశువులు    2) గొర్రెలు
     3) నిమ్మ, కొబ్బరి    4) చీనీ, బత్తాయి
 
 108. భూమి తన చుట్టు తాను తిరగడానికి పట్టే కాలం?
     1) 23 గంటల 56 నిమిషాల 6 సెకన్లు
     2) 23 గంటల 56 నిమిషాల 8.05 సెకన్లు
     3) 23 గంటల 56 నిమిషాల 7 సెకన్లు
     4) 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు
 
 109. బీఆర్ అంబేద్కర్ జన్మించిన సంవత్సరం?
     1) 1889    2) 1890    3) 1891    4) 1892
 
 110. కింది వాటిని జతపరచండి?
     1. భరతనాట్యం     ్చ. ఆంధ్రప్రదేశ్
     2. కూచిపూడి     ఛ. తమిళనాడు
     3. కథక్     ఛి. ఉత్తరప్రదేశ్
     4. కథాకళి     ఛీ. కేరళ
     1) 1-ఛ, 2-్చ, 3-ఛి, 4-ఛీ
     2) 1-్చ, 2-ఛ, 3-ఛీ, 4-ఛి
     3) 1-ఛి, 2-ఛ, 3-ఛీ, 4-్చ
     4) 1-ఛీ, 2-ఛ, 3-్చ, 4-ఛి
 
 111. రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఉప రాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఆ సమయంలో ఈ విధంగా జరుగుతుంది?
     1)    ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేస్తాడు
     2)    ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షుడుగా కూడా వ్యవహరిస్తాడు
     3)    ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి హోదాలోనే జీతభత్యాలను స్వీకరిస్తాడు
     4)    పైవన్నీ
 
 112. శక్తిమంతమైన హక్కు?
     1) స్వాతంత్య్రపు హక్కు
     2) రాజ్యాంగపరిహారపు హక్కు
     3)వాక్ స్వాతంత్య్రపు హక్కు    4) ఆస్తిహక్కు
 
 113. ఐక్యరాజ్యసమితి దినోత్సవం?
     1) అక్టోబర్ 10    2) అక్టోబర్ 14
     3) అక్టోబర్ 20    4) అక్టోబర్ 24
 
 114. సమాచారహక్కు చట్టం కింది వారికి వర్తించదు?
     1) ఏపీ వక్ఫ్‌బోర్డు    2) ఎన్‌సీఈఆర్‌టీ
     3) రాజకీయ పార్టీలు    4) పైవన్నీ
 
 115. ‘సబిత’కు విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన వార్తలు మ్యాగజైన్స్ నుంచి కత్తిరించి దాచే అలవాటు ఉంది. దీన్ని బట్టి ఆమె ఏ లక్ష్యం సాధించినట్టు?
     1) అవగాహన    2) వినియోగం
     3) అభిరుచి    4) నైపుణ్యం
 
 116. ఉపాధ్యాయుడు యూనిట్‌టెస్ట్‌లో ఇచ్చిన ప్రశ్న ఇలా ఉంది. బొద్దింక ఆర్థ్రోపొడా జీవి. వానపాము______ అనేది ఏ రకమైన ప్రశ్న?
     1) పూరక ప్రశ్న    2) సాదృశ్య ప్రశ్న
     3) వర్గీకరణ ప్రశ్న    4) ఏకాంతర ప్రశ్న
 
 117. జశ్వంత్ విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు. అతను విద్యార్థులకు మిత్రుడిగా, సలహాదారుడిగా, మార్గదర్శిగా, పర్యవేక్షకుడిగా ఉండాలనుకుంటే ఏ బోధనా పద్ధతిని ఉపయోగించాలి?
     1) ఉపన్యాస పద్ధతి    2) ప్రదర్శనా పద్ధతి
     3) చారిత్రక పద్ధతి    4) ప్రాజెక్ట్ పద్ధతి
 
 118. లక్ష్యాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
 1)ధరకు, డిమాండ్‌కు మధ్య విలోమ సంబంధాన్ని బాలు గుర్తించాడు - అవ గాహన
 2)ఉష్ణోగ్రతకు ఎత్తై ప్రాంతాలకు మధ్య పరస్పర సంబంధాన్ని అఖిల స్థాపించింది-వినియోగం
 3)సూర్య కుటుంబం నమూనాను తయారు చేసి గ్రహాలు, ఉపగ్రహాలను రాధ విశ్లేషించింది-నైపుణ్యం,వినియోగం
 4)నవనీత తప్పు, ఒప్పు ప్రశ్నలలో ఒప్పు అనే సమాధానాన్ని సత్యమని గుర్తించింది-అవగాహన
 
 119. బోధనోపకరణాలకు సంబంధించి సరికానిది?
 1)విజయనగర సామ్రాజ్యంలో వంశాల క్రమాన్ని చూపే చార్టు- ఫ్లో చార్టు
 2)భారత స్వాతంత్య్ర ఉద్యమంలోని సంఘటనలను తెలిపే చార్టు- టైంలైన్ చార్టు
 3)హిమాలయాలు ఈశాన్యంలో పెట్టనికోట వలె ఉన్నాయి అని తెలిపే మ్యాప్ - రిలీఫ్ మ్యాప్
 4)భారతదేశంలో1951-2011 వరకు అక్షరాస్యత అభివృద్ధిని సూచించే గ్రాఫ్-సచిత్రగ్రాఫ్
 
 120. కింది బోధనా పద్ధతులలో సరి కానిది?
 1)శివాజీ జీవిత చరిత్రను బోధించడానికి అనువైన పద్ధతి- కథన పద్ధతి
 2)సూర్య కుటుంబం పాఠ్యాంశం బోధించడానికి అనువైన పద్ధతి - ప్రాజెక్ట్ పద్ధతి
 3)ఎత్తై ప్రాంతాలు చల్లగా ఉంటాయా? అనే సమస్యను బోధించడానికి అనువైన పద్ధతి- ఆగమన పద్ధతి
 4)భారతదేశంలోని శాసనాలు, చిరస్మారకాలు అనే పాఠ్యాంశం బోధించడానికి అనువైన పద్ధతి - మూలాధార పద్ధతి
 
 
 మ్యాథమెటిక్స్
 
 121. 3, 4ల మధ్యలేని అకరణీయ సంఖ్య?
     1) 29/9    2) 28/9    3) 15/4    4) 5/3
 
 122. 360 చ.మీ. వైశాల్యం కలిగిన సమాంతర చతుర్భుజం భూమి, ఎత్తుల నిష్పత్తి 5:2. అయితే ఆ సమాంతర చతుర్భుజం ఎత్తు ఎంత?
     1) 30 మీ.     2) 9 మీ.    3) 12 మీ.     4) 10 మీ.
 
 123. రెండు వృత్తాల వ్యాసాల నిష్పత్తి 2:3 అయితే వాటి చుట్టుకొలతల నిష్పత్తి?
     1) 2:3     2) 3:2    3) 4:9     4) 9:4
 
 124. సమబాహు త్రిభుజం భ్రమణ సౌష్టవ కోణం?
     1) 60ని    2) 90ని     3) 120ని     4) 180ని
 
 125. పూర్ణ సంఖ్యలు భాగహారం దృష్ట్యా పాటించే ధర్మం?
     1) సంవృత        2) స్థిత్యంతర
     3) సహచర        4) ఏదీకాదు
 
 126. ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకు +3 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కు లు, జవాబు రాయకుంటే 0 మార్కులు కేటాయించారు. రాణి రాసిన జవాబుల్లో 12 సరైనవి. అప్పుడు ఆమె పొందిన మార్కులు 20. అయితే ఆమె రాసిన తప్పు జవాబులెన్ని?
     1) 10     2) 8    3) 12     4) 4
 
 127. వీటిలో సరికాని దాన్ని గుర్తించండి?
 
     1)      2)  
 
     3)      4)
 
 128. 0.5 ొ 0.05=?
     1) 0.1     2) 10     3) 0.01     4) 100
 
 129. కింది వాక్యాల్లో అసత్యాన్ని గుర్తించండి?
     1)    ధన అకరణీయ సంఖ్య సమాన అకరణీయ సంఖ్యలన్నీ ధనరాశులే
     2)    {పతిపూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య
     3)    7/8, 9/8, 8/8 లు సమాన అకరణీయ సంఖ్యలను సూచిస్తాయి
     4)    {పతిదశాంశ సంఖ్యను అకరణీయ సంఖ్యారూపం లో రాయొచ్చు
 
 130. రాము తండ్రి ప్రస్తుత వయసు, రాము ప్రస్తుత వయసుకు మూడు రెట్లు ఎక్కువ. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం 70 సంవత్సరాలు. అయితే రాము తండ్రి ప్రస్తుత వయసు ఎంత?
     1) 60 సం॥    2) 50 సం॥    3) 40 సం॥    4) 45 సం॥
 
 131. 30ని పూరక కోణం ఎంత?
     1) 150ని     2) 60ని     3) 330ని     4) 240ని
 
 132. పటంలో //ఆఇ అయితే కోణం గీ ఎంత?
     1) 75ని     2) 45ని
     3) 90ని     4) 60ని
 
 133. ఒక సంఖ్యలో 40శాతం 800కి సమానమైన ఆ సంఖ్య?
     1) 3200     2) 3000    3) 2000     4) 2400
 
 134. 42 ్ఠడ్డ2 పరిమాణం?
     1) 42     2) 2    3) 4     4) 42
 
 135. 1+2్ఠ3్ఠ2కు ఎంత కలిపినా ్ఠ2-్ఠ-1 వస్తుంది?
     1) 4్ఠ23్ఠ+2     2) 4్ఠ2+3్ఠ2
     3) 4్ఠ23్ఠ+1     4) 4్ఠ23్ఠ2
 
 136. 42ని2ని+3ని విలువ?
     1) 45ని     2) 43ని    3) 1    4) 0
 137. 11తో నిశ్శేషంగా భాగించబడని సంఖ్య?
     1) 20801     2) 10824     3
 
 
 138. వీటిలో కాప్రేకర్ స్థిరాంకం?
     1) 6714     2) 6174    3) 7614     4) 7416
 
 139. 12+4272ను సూక్ష్మీకరిస్తే ?
     1) 21     2) 21    3) 37     4) 45
 
 140. వీటిలో సరైంది?
     1) క్రమభిన్నం వ్యుత్క్రమం క్రమభిన్నం
     2) అపక్రమభిన్నం వ్యుత్క్రమం అపక్రమ భిన్నం
     3) మిశ్రమ భిన్నం వ్యుత్క్రమం మిశ్రమ భిన్నం
     4) ప్రతి సహజసంఖ్య వ్యుత్క్రమం క్రమభిన్నం
 
 141. 68 మి.మీ.లను కి.మీ.లలో పేర్కొంటే?
     1) 0.68 కి.మీ.     2) 0.0068 కి.మీ.
     3) 0.00068 కి.మీ.    4) 0.000068 కి.మీ.
 
 142. 9 అనేది?
     1) సంయుక్త సంఖ్య     2) సహజ సంఖ్య
     3) పూర్ణసంఖ్య    4) అన్నీ
 
 143. భావన ఒక నవల్లో 1/4 భాగాన్ని ఒక గంటలో చదువుతుంది. అయితే ఆమె రెండున్నర గంటల్లో చదవగలిగే భాగం ఎంత?
     1) పూర్తిభాగం     2) 5/8 భాగం
     3) సగభాగం     4) 8/5 భాగం
 
 144. 18,453ను సమీప వందలకు సవరించి రాయగా?
     1) 18,000     2) 18,400    3) 18,500     4) 19,000
 
 145. సంశ్లేషణ పద్ధతి దోషం కానిది?
     1) నూతన ఆవిష్కరణకు అవకాశం
     2) సుదీర్ఘమైన పద్ధతి
     3) సోపానాలు గుర్తురాక మధ్యలోనే వదిలేస్తారు
     4) సంపూర్ణ అవగాహనకు తావుండదు
 
 146. కష్టమైన సమస్యను సాధించడానికి ముందు తేలికైన సమస్యను తీసుకొని సాధన చేసి ఆ సాధనా విధానాన్ని క్లిష్టమైన సమస్యను సాధించడానికి ఉపయోగించేది?
     1) ఆధారిత పద్ధతి     2) చిత్రీకరణ పద్ధతి
     3) పునఃప్రవచన పద్ధతి    4) సాదృశ్యాల పద్ధతి
 
 147. విద్యార్థి భిన్నాలకు సంబంధించిన నిత్య జీవిత సమస్యలను విశ్లేషణ చేస్తాడు. ఇది ఏ లక్ష్యానికి చెందింది?
     1) అవగాహన     2) అభిరుచి
     3) వినియోగం     4) సహజీకరణం
 
 148. బాహ్యప్రేరణ కంటే అంతఃప్రేరణకు ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచించే బోధనా పద్ధతి?
     1) మాంటిస్సోరి పద్ధతి    2) కిండర్ గార్డెన్ పద్ధతి
     3) సమస్యా పరిష్కార పద్ధతి
     4) ప్రయోగశాల పద్ధతి
 
 149. ప్రత్యామ్నాయ ప్రతిస్పందనల రకానికి చెందిన ప్రశ్నలకు సంబంధించి సరికానిది?
     1)అనిశ్చిత వాక్యాలు ఇవ్వరాదు
     2)విద్యార్థికి జవాబులు రాయడంలో స్వేచ్ఛ ఉండదు
     3)బోధనా లక్ష్యాల్లో నైపుణ్యాన్ని మాత్రమే పరీక్షిస్తుంది
     4)ఇచ్చిన వాక్యం నిర్దిష్టంగా ఉండాలి
 
 
 150. చతురస్రంలోని కర్ణం దానికి రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజానికి సమానం అని తెలిపింది?
 1) పైథాగరస్
 2) యూక్లిడ్
 3) ఆర్యభట్ట
 4) మహావీర
 
 
 సమాధానాలు
     1) 2;    2) 3;    3) 3;    4) 1;    5) 3;
     6) 2;    7) 4;    8) 1;    9) 2;    10) 2;
     11) 2;    12) 2;    13) 3;    14) 2;    15) 3;
     16) 2;    17) 2;    18) 3;    19) 4;    20) 2;
     21) 4;     22) 3;     23) 3;     24) 1;     25) 4;
     26) 2;     27) 2;     28) 2;     29) 4;     30) 1;
     31) 2;     32) 1;     33) 3;     34) 4;     35) 2;
     36) 3;     37) 2;     38) 4;     39) 4;     40) 2;
     41) 2;     42) 3;     43) 2;     44) 4;     45) 2;
     46) 2;     47) 3;     48) 1;     49) 4;     50) 2;
      51) 3;     52) 2;     53) 4;     54) 3;     55) 2;
     56) 3;     57) 3;     58) 1;     59) 2;     60) 3;
     61) 2;    62) 2;    63) 3;    64) 4;    65) 1;
     66) 2;    67) 4;    68) 3;    69) 4;    70) 1;
     71) 3;     72) 4;     73) 4;     74) 1;     75) 2;
     76) 3;     77) 4;     78) 4;     79) 4;     80) 1;
     81) 2;     82) 3;     83) 2;     84) 1;     85) 3;
     86) 1;     87) 2;     88) 1;     89) 3;     90) 2;
     91) 3;     92) 2;     93) 2;     94) 1;     95) 4;
     96) 1;     97) 2;     98) 3;     99) 1;     100) 2;
     101) 1;    102) 3;    103) 2;    104) 2;    105) 4;
     106) 3;    107) 4;    108) 4;    109) 3;    110) 1;
     111) 3;    112) 2;    113) 4;    114) 3;    115) 3;
     116) 2;    117) 4;    118) 4;    119) 4;    120) 2;
     121) 4;     122) 3;     123) 1;     124) 3;     125) 4;
     126) 2;     127) 2;     128) 2;     129) 3;     130) 4;
     131) 2;     132) 4;     133) 3;     134) 3;     135) 4;
     136) 3;     137) 4;     138) 2;     139) 1;     140) 4;
     141) 4;     142) 4;     143) 2;     144) 3;     145) 2;
     146) 4;     147) 3;     148) 1;     149) 3;     150) 1.
 
 రూపొందించినవారు
 మోజెస్, (చైల్డ్‌డెవలప్‌మెంట్ అండ్ పెడగాగీ)
 డా॥పి.వి. సుబ్బారావు, (తెలుగు)
 బి. శ్రీనివాస్, (పరిసరాల విజ్ఞానం)
 ఎన్. వాసుదేవ రెడ్డి, (మ్యాథమెటిక్స్)
 అమీనా ఆజమ్, (ఇంగ్లిష్)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement