2013 - వార్తల్లో వ్యక్తులు
నూతన కాగ్ నియామకం.. ఇండిపెండెంట్ పత్రికకు భారతీయ ఎడిటర్..మిస్ యూనివర్‌సగా వెనిజువెలా భామ మారియా గాబ్రియెలా.. నల్ల సూర్యుడి అస్తమయం.. గతేడాది ప్రముఖ న్యూస్‌మేకర్స్
ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ప్రధానాధికారిగా ఎస్‌ఏ ఇబ్రహీం జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి ఐబీ చీఫ్‌గా నియమితులు కావడం ఇదే తొలిసారి.
లా కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ డి.కె.జైన్ నియమితులయ్యారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్‌గా వేద ప్రకాశ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
భారత్‌కు చెందిన ప్రేమలత అగర్వాల్ అంటార్కిటికాలోని మౌంట్ విన్‌సన్ పర్వతాన్ని అధిరోహించారు. తద్వారా ఏడు ఖండాల్లోని ఆరు ఎత్తై పర్వతాలను అధిరోహించిన భారత మహిళగా ఆమె రికార్డును సొంతం చేసుకున్నారు.
కొత్త సొలిసిటర్ జనరల్‌గా మోహన్ పరాశరన్ ఫిబ్రవరి 8న నియమితులయ్యారు. ‘సొలిసిటర్ జనరల్’ దేశంలో రెండో అత్యున్నత న్యాయాధికారి పదవి.
2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్ గురు (43) ను ఫిబ్రవరి 9న తీహార్ జైలులో ఉరి తీశారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలు చేశారు.
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మార్చి 9న ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. వివరాలు.. నాగాలాండ్-అశ్వినీ కుమార్, ఒడిశా-ఎస్‌సీ జమీర్, బీహార్-డీవై పాటిల్, త్రిపుర- దేవానంద్ కన్వర్, కేరళ-నిఖిల్ కుమార్
నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నీఫియు రియో వరుసగా మూడోసారి ఆ పీఠాన్ని అధిష్ఠించారు. త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ నాలుగో సారి సీఎం బాధ్యతలు స్వీకరించారు. మేఘాలయ ముఖ్యమంత్రిగా ముకుల్ సంగ్మా (కాంగ్రెస్) మార్చి 5న ప్రమాణస్వీకారం చేశారు.
నూతనంగా ఏర్పాటు చేసిన మేఘాలయ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా మన రాష్ట్రానికి చెందిన జస్టిస్ టి.మీనాకుమారి మార్చి23న బాధ్యతలు స్వీకరించారు.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎండీ, సీఈవోగా చిత్రా రామకృష్ణ ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్ ప్రొఫెసర్ యు.ఆర్.రావుకు అంతర్జాతీయ ఉపగ్రహ నిపుణుల సొసైటీ ‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం లభించింది.
లెఫ్ట్‌నెంట్ కమాండర్ అభిలాష్ టోమీ 150 రోజులు ఆగకుండా సముద్రంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డెరైక్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మీ కాంతం ఏప్రిల్ 9న నియమితులయ్యారు. ఈ సంస్థకు ఆమె తొలి మహిళా డెరైక్టర్.
2013-14 సంవత్సరానికి నాస్కామ్ చైర్మన్‌గా మైండ్ ట్రీ సీఈఓ కృష్ణ కుమార్ నటరాజన్ నియమితులయ్యారు.
పోలియోకు తొలిసారి ఓరల్ వ్యాక్సిన్ విజయవంతంగా రూపొందించిన పోలెండ్‌కు చెందిన డాక్టర్ హిలరీ కోప్రొవ్స్కీ (96) ఏప్రిల్ 11న మరణించారు.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ శరణ్ (జె.ఎస్.) వర్మ (80) అనారోగ్యంతో కన్నుమూశారు. అత్యాచార నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు జస్టిస్ వర్మ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే నేర న్యాయ సవరణ చట్టం- 2013 రూపొందింది.
ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి, హ్యూమన్ కంప్యూటర్‌గా గుర్తింపు పొందిన శకుంతలాదేవి (80) ఏప్రిల్ 21న జన్మస్థలమైన బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. 1977లో అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 188138517 సంఖ్యకు క్యూబ్ రూట్ చెప్పడంలో కంప్యూటర్‌తో పోటీపడి మరీ గెలుపొందారు. దీంతో అప్పటి నుంచి హ్యూమన్ కంప్యూటర్‌గా ఆమె పేరు గాంచారు.
‘ద హిందూ’ ఆంగ్ల దినపత్రిక మాజీ సంపాదకులు ఎన్. రవి ఎడిటర్‌స గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
భారత సంతతికి చెందిన బ్రిటన్ వనిత నేహాల్ బొగైటా ‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్’గా ఎంపికైంది. ఈ టైటిల్‌ను సాధించిన మొదటి బధిర యువతి నేహాల్.
కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మే 13న ప్రమాణ స్వీకారం చేశారు.
కెనడాలో భారత సాంస్కృతిక రాయబారిగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రాష్ట్ర హిందీ అకాడమీ ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యవహరించనున్నారు.
డెహ్రాడూన్‌కు చెందిన 21 ఏళ్ల తాషీ, నాన్సీమాలిక్ అనే ఇద్దరు కవల సోదరీమణులు ఎవరెస్టు శిఖరాగ్రాన్ని చేరుకొని చరిత్ర సృష్టించారు. ఇలాంటి ఘనత సాధించిన తొలి కవలలుగా రికార్డులకెక్కారు.
అరుణాచల్‌ప్రదేశ్ నూతన గవర్నర్‌గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నిర్భయ్‌శర్మ మే 16న నియమితులయ్యారు.
నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా రక్షణ శాఖ కార్యదర్శి, బీహార్ కేడర్‌కు చెందిన 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శశికాంత్ శర్మ (61) మే 23న పదవీ బాధ్యతలు చేపట్టారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఎవరెస్ట్‌ను కృత్రిమ కాలుతో అధిరోహించిన తొలి భారతీయ వనితగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాలీబాల్ మాజీ క్రీడాకారిణి అరుణిమ సిన్హా (25) రికార్డు సృష్టించింది.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) డెరైక్టర్ జనరల్‌గా, రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారుగా అవినాశ్ చందర్ మే 31న నియమితులయ్యారు.
బ్రిటన్ జాతీయ పత్రిక ది ఇండిపెండెంట్‌కు ఎడిటర్‌గా భారత జాతీయుడు రాజన్ నియమితులయ్యారు.
బ్రిటన్‌కు చెందిన ఆడమ్ కిర్బీ అనే రెండేళ్ల చిన్నారి ఐక్యూ పరీక్షలో 141 స్కోరు సాధించాడు. మేధావుల క్లబ్ ‘మెన్సా’లో సభ్యత్వం పొందిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.
కేంద్ర హోంశాఖ నూతన కార్యదర్శిగా జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ గోస్వామి జూన్ 30న బాధ్యతలు స్వీకరించారు.
కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్‌బార్ట్(88) జూలై 2న మూత్రపిండాల వ్యాధితో కాలిఫోర్నియాలో కన్నుమూశారు. ఎంగెల్‌బార్ట్.. 1963లో స్టాన్‌ఫోర్డ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ప్రస్తుతం ఎస్‌ఆర్‌ఐ ఇంటర్నేషనల్)లో పనిచేస్తున్నప్పుడు మౌస్‌ను కనిపెట్టారు.
దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు నాటి ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది.
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (56) సెప్టెంబర్ 2న ప్రమాణం చేశారు.
ప్రఖ్యాత భారతీయ రచయిత్రి సుస్మితా బెనర్జీ (43)ని అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు సెప్టెంబర్ 6న కాల్చి చంపారు. ఆమె తాలిబన్ల చెర నుంచి తప్పించుకున్న వైనంపై ‘ఏ కాబులీవాలాస్ బెంగాలీ వైఫ్’ రాసిన పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, డాల్బీ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు రే డాల్బీ (80) శాన్‌ఫ్రాన్సిస్కోలో సెప్టెంబర్ 12న మరణించారు. ఆయన డాల్బీ వాయిస్ రిడక్షన్ విధానాన్ని రూపొందించి రికార్డింగ్ పరిశ్రమలో విప్లవం తీసుకొచ్చారు.
నిర్భయ కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు... మైనర్ నిందితుడు మినహా మిగతా నలుగురినీ దోషులుగా నిర్ధారించింది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఒకరు (రామ్‌సింగ్) పోలీస్ కస్టడీలోనే మార్చి 11న ఉరివేసుకుని చనిపోయాడు. మరొక నిందితుడు మైనర్ కావటంతో బాలనేరస్థుల బోర్డుకు అప్పగించారు. మిగతా నలుగురు ముకేశ్‌సింగ్, వినయ్‌శర్మ, అక్షయ్‌ఠాకూర్, పవన్‌గుప్తాలకు మరణదండన విధిస్తూ సెప్టెంబర్ 13వ తేదీన తీర్పు చెప్పింది.
తెలుగు అమ్మాయి నీనా దావులూరి (24) సెప్టెంబర్ 16న మిస్ అమెరికాగా ఎంపికైంది. ఈ కిరీటం గెలిచిన తొలి భారతీయ సంతతి యువతి నీనా.
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఈశ్వరయ్య సెప్టెంబర్ 19న బాధ్యతలు స్వీకరించారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను పశు దాణా కుంభకోణంలో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా పేర్కొంది. సెప్టెంబర్ 30న ఇచ్చిన తీర్పులో లాలూతోపాటు మరో 44 మందిని దోషులుగా తేల్చింది. వారిలో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా ఉన్నారు.
పశుదాణా కుంభకోణానికి పాల్పడిన ఆర్‌జేడీ అధ్యక్షుడు లోక్‌సభ ఎంపీ లాలూప్రసాద్ యాదవ్, జేడీయూ ఎంపీ జగదీశ్ శర్మలను లోక్‌సభకు అనర్హులుగా ప్రకటిస్తూ అక్టోబర్ 22న లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఎస్.బాల్ శేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వీరిద్దరూ జైలు నుంచి విడుదలైన తేదీ నుంచి ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు.
అమెరికాలోని కొలంబియా సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన శ్రీనివాసన్ (46) సెప్టెంబర్ 27న బాధ్యతలు స్వీకరించారు. తద్వారా అమెరికాలో రెండో అత్యున్నత న్యాయస్థానంగా భావించే సర్క్యూట్ కోర్టు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. శ్రీనివాసన్ చండీగఢ్‌లో జన్మించారు.
హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన శ్రేష్టి రాణా (21) ఆసియా పసిఫిక్ వరల్డ్ - 2013గా ఎంపికైంది. అక్టోబర్ 30న సియోల్‌లో జరిగిన పోటీల్లో మొత్తం 49 మందిలో ఆమె విజేతగా నిలిచారు.
చైనాకు చెందిన ప్రతిష్టాత్మక చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ (సీఏఎస్)లో గౌరవ విదేశీ సభ్యుడిగా ఇటీవల భారతరత్న పురస్కారం పొందిన సీఎన్‌ఆర్ రావు ఎంపికయ్యారు. సీఏఎస్‌లో సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు సీఎన్‌ఆర్ రావు.
నల్ల సూర్యుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌మండేలా(95) డిసెంబర్ 5న తుదిశ్వాస విడిచారు. 1994-99మధ్యకాలంలో ఆయన దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడిగా కొనసాగారు. మండేలాకు 1990లో భారతరత్న, 1993లో నోబెల్ శాంతి బహుమతి లభించాయి.
క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండ్కూలర్ యునిసెఫ్ పారిశుద్ధ్య కార్యక్రమం ప్రాంతీయ ప్రచార కార్యకర్తగా నియమితులయ్యారు.
లండన్‌కు చెందిన ది గార్డియన్ పత్రిక ఎడ్వర్డ్ స్నోడెన్‌ను 2013 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది.
ఏకే-47 ఆటోమేటిక్ రైఫిల్ సృష్టికర్త మిఖైల్ కలష్నికోవ్ (94) రష్యాలోని ఉద్ముర్షియాలో డిసెంబర్ 23న మరణించారు. ఆయన 1947లో ఆ రైఫిల్‌ను రూపొందించడంతో ఏకే 47గా పేరు పెట్టారు.
ఫిలిప్పీన్స్ సుందరి మెగాన్ యంగ్ (23) మిస్ వరల్డ్-2013గా ఎంపికైంది. ఇండోనేసియాలోని బాలి దీవిలో సెప్టెంబర్ 28న జరిగిన 63వ మిస్ వరల్డ్ పోటీల ఫైనల్‌లో ఆమె విజేతగా నిలిచింది. భారత్ తరఫున మిస్ ఇండియా వరల్డ్ నవనీత్ కౌర్‌కు మిస్ మల్టీమీడియా పతకం దక్కింది.
మిస్ యూనివర్స్ కిరీటాన్ని వెనిజువెలా సుందరి మారియా గాబ్రియెలా ఇస్లర్(25) దక్కించుకుంది. నవంబర్ 9న రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఫైనల్‌లో మొత్తం 85 మంది పాల్గొన్నారు.
నల్ల సూర్యుడి అస్తమయం..
Published Thu, Jan 2 2014 1:54 PM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM
Advertisement