news media
-
నచ్చకపోతే భారత్‌లో పనిచేయవద్దు: వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై పరువు నష్టం కేసు వేసిన విషయంలో హైకోర్టు.. వికిపీడియాకు గురువారం ‘కోర్టు ధిక్కార నోటీసులు’ జారీ చేసింది. భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారతదేశంలో తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని హైకోర్టు తెలిపింది.కాగా ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐను వికీపీడియా తన పేజీలో ప్రస్తుత ప్రభుత్వానికి 'ప్రచార సాధనం'గా పేర్కొంది. దీంతో వికీపీడియా తన ప్లాట్‌ఫారమ్‌లో సవరణలు చేసుకోవడానికి వ్యక్తులను అనుమతిస్తోందని ఏఎన్ఐ ఆరోపించింది. తమ గురించి తప్పుడు సమాచారం ఎడిట్ చేసింది వికీపీడియా, దాని ఎడిటర్లు కాదని, ముగ్గురు బయటి వ్యక్తులు అని పేర్కొంది. ఈ క్రమంలో వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై ఢిల్లీ కోర్టులో రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.అయితే వికీపీడియాలో ఈ సవరణలు చేసిన వారి వివరాలను బహిర్గతం చేయాలని కోర్టు సదరు సంస్తను ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ఆ వివరాలును వెల్లడించలేదని ఏఎన్ఐ తెలిపింది. దీనిపై వికీపీడియా స్పందిస్తూ.. తమ వైపు నుంచి కొన్ని పత్రాల సమర్పణ పెండింగ్‌లో ఉందని, వికీపీడియా భారతదేశంలో ఆధారితం కానందున వారి వివరాల వెల్లడికి ఆలస్యం అయిందని కోర్టుకు తెలిపింది.అయితే వికీపీడియా సమాధానంపై కోర్టు సంతృప్తి చెందలేదు. ‘ప్రతివాది భారతదేశంలో ఒక సంస్థ కాకపోవడం ప్రశ్న కాదు. మేము మీ వ్యాపార లావాదేవీలను ఇక్కడ మూసివేస్తాము. వికీపీడియాను బ్లాక్ చేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతాము.. ఇంతకుముందు కూడా ఇలాగే చేశారు. మీకు భారతదేశం నచ్చకపోతే, దయచేసి ఇక్కడ పని చేయవద్దు’ అంటూ మండిపడింది.తదుపరి విచారణను అక్టోబర్‌కు వాయిదా వేసిది. అంతేగాక వచ్చే విచారణలో కంపెనీ ప్రతినిధి తప్పక హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. ఈ వెబ్సైట్ యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది. -
పూర్తిగా అదానీ చేతికి మరో ప్రముఖ మీడియా సంస్థ..
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం రాఘవ్ బెహల్ నెలకొల్పిన డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియాలో (క్యూబీఎంఎల్) మిగతా 51 శాతం వాటాను వ్యాపార దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేయనుంది. తమ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ (ఏఎంఎన్ఎల్) ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. లావాదేవీ పూర్తయ్యాక ఏఎంఎన్ఎల్కు క్యూఎంఎల్ పూర్తి అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది. బీక్యూ ప్రైమ్ పేరిట మీడియా ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించే క్యూబీఎంఎల్‌లో ఏఎంఎన్ఎల్ గతంలో రూ. 48 కోట్లకు 49% వాటాలను కొనుగోలు చేసింది. గతంలో బ్లూమ్‌బెర్గ్ క్వింట్గా పిలిచే బీక్యూ ప్రైమ్‌ను యూఎస్ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ మీడియా, భారత్‌కు చెందిన క్వింటిలియన్ మీడియా సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. అయితే, బ్లూమ్‌బెర్గ్ గత ఏడాది మార్చిలో ఆ భాగస్వామ్యం నుంచి వైదొలిగింది. -
నెట్వర్క్18 మీడియా క్యూ3 వీక్.. 97 శాతం పతనం!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 97 శాతం పతనమై రూ. 9 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 307 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 1,850 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ3లో రూ. 1,657 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం వ్యయాలు 45 శాతం పెరిగి రూ. 1,939 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్వర్క్18 మీడియా షేరు బీఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 63 వద్ద ముగిసింది. చదవండి: స్విగ్గీ సంచలనం..డెలివరీ బాయ్స్‌కు, వారి కుటుంబ సభ్యులకు.. -
డిజిటల్ న్యూస్ స్టార్టప్స్ కోసం గూగుల్ ’ల్యాబ్’
న్యూఢిల్లీ: దేశీయంగా స్వతంత్ర స్థానిక న్యూస్ స్టార్టప్‌ల కోసం టెక్ దిగ్గజం జీఎన్ఐ స్టార్టప్స్ ల్యాబ్ ఇండియా పేరిట యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. దీని కింద ఆర్థికంగా, నిర్వహణపరంగా ఆయా అంకుర సంస్థలు నిలదొక్కుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో నాలుగు నెలల పాటు శిక్షణనిస్తుంది. ఇందుకోసం ఎకోస్, డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్‌తో జట్టు కట్టింది. భారతీయ భాషల్లో ప్రచురిస్తున్న న్యూస్ స్టార్టప్ సంస్థలేవైనా ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు తేది అక్టోబర్ 18. తొలి బ్యాచ్ కోసం 10 స్వతంత్ర డిజిటల్ న్యూస్ పబ్లిషింగ్ సంస్థలను ఎంపిక చేస్తారు. -
భారత్‌లో యాహూ న్యూస్ బంద్
Yahoo News India: వెబ్ సర్వీసుల ప్రొవైడర్ యాహూ.. భారత్‌లో న్యూస్ ఆపరేషన్స్‌ను నిలిపివేసింది. 20 ఏళ్ల సేవలకు నేటితో(ఆగష్టు 26) పుల్‌స్టాప్ పెట్టింది. ఈ మేరకు న్యూస్ ఆధారిత వెబ్సైట్ల కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించిన యాహూ.. మెయిల్ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. అమెరికాకు చెందిన వెబ్ సేవల కంపెనీ యాహూ.. ఇవాళ్టి నుంచి వార్తా సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. గురువారం నుంచి ఎలాంటి కొత్త కంటెంట్‌ను పబ్లిష్ చేయకపోవడం విశేషం. అయితే ఈ షట్‌డౌన్‌తో మిగతా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా.. ఎలాంటి కంటెంట్‌ను పబ్లిష్ చేయబోదు. యాహూ అకౌంట్‌తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేద’’ని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది. క్లిక్ చేయండి: వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డు.. ఇలా చేయొచ్చు ఇక ఈ ప్రకటనతో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్‌కు సంబంధించిన కంటెంట్ నిలిచిపోనుంది. ఎఫ్‌డీఐ కొత్త రూల్స్.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను.. అదీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది. డిజిటల్ కంటెంట్.. ముఖ్యంగా యాహూ క్రికెట్‌పై ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా యాహూ సేవలు ప్రీమియం, లోకల్ కంటెంట్ అందిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్కి పర్యాయపదంగా యాహూను.. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్ 2017లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ముట్టుకోకుండానే ఫోన్ పని చేస్తుందిక -
రాహుల్ ట్విటర్లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటారు: శివసేన
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీతో కూడిన మహావికాస్ అఘడి కూటమి సర్కార్‌లో విభేదాలున్నట్లు ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శలు చేయడం ఆ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తిగా మారింది. రాహుల్ గాంధీ ట్విట్టర్లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటున్నారంటూ శివసేన అధికార పత్రిక సామ్నాలో ఎద్దేవా చేసింది. ఇక మోదీ ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపడంలో ముందున్నప్పటికీ, అది కేవలం ట్విట్టర్‌కు మాత్రమే పరిమితమైందని అందులో ధ్వజమెత్తారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకభిప్రాయం తీసుకురావడంలో రాహుల్ విఫలమయ్యారని రాసుకొచ్చింది. అదే సమయంలో విపక్షాలను ఏకం చేయడంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ విజయం ప్రశంసలు కురిపించింది. శరద్ పవార్ మాదిరిగా రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి ఉంటే ఆ ప్రతిపక్షం బలంగా ఉండి ఉండేదని వివరించింది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ధీటుగా స్పందించారు. ఈ పరిణామాలను చూస్తుంటే విభేదాలున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ -
ఫేస్బుక్ వివాదం: మోదీతో ఆస్ట్రేలియా చర్చలు
సిడ్ని: గూగుల్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు.. వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్ సంస్థ ఫేస్బుక్ సంచలనాత్మక తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆసీస్‌లోని ఫేస్బుక్ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. దీనిపై ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆస్ట్రేలియా పైకి మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తున్నప్పటికీ చర్చలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలు జరిపింది. దీనిపై ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితిని మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని వివరించారు. అదే సమయంలో ఫేస్‌బుక్‌కు సైతం చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ యథాస్థితిని తీసుకొచ్చేందుకు ఫేస్బుక్ యాజమాన్యం త్వరతగతిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ తరహా యుద్ధం సరైనది కాదని పేర్కొన్నారు. కాగా, ‘ఫేస్బుక్ నిర్ణయం సార్వభౌమ దేశంపై దాడి’అని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ అభివర్ణించారు. ‘ఇది టెక్నాలజీపై నియంత్రణను దుర్వినియోగం చేయడమే’అని మండిపడ్డారు. ఆ బిల్లును ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించింది. సెనెట్ ఆమోదించాక చట్టరూపం దాలుస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌కు, వార్తాసంస్థలకు మధ్య సంబంధాన్ని ఈ చట్టం తప్పుగా అర్థం చేసుకుందని ఫేస్బుక్ వ్యాఖ్యానించింది. కాగా, ఆసీస్ మీడియా అవుట్ లేట్లను, కొత్తకంటెంట్ను కనబడకుండా నిరోధించారని ఫేస్బుక్ కోశాధికారి ఫైడెన్బర్గ్ తెలిపారు. ఆసీస్ ప్రధాని బెదిరింపు ధోరణిని మానుకోవాలని కూడా కోరారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆసీస్ వైపు చూస్తున్నాయని అన్నారు. ఆసీస్ కంటేంట్‌ను నిలిపడం కన్నావేరే మార్గం కనిపించలేదని అన్నారు. ఇప్పటికే భారత ప్రధాని మోదీతోను, కెనెడాకు చెందిన జెస్టిస్ ట్రూడోతో చర్చించామని ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. కాగా , నిషేధం విధించినప్పటి నుంచి స్వదేశీ, విదేశీ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మైఖేల్ మిల్లర్ తెలిపారు. ఫేస్బుక్ నిషేధ ప్రభావంను ఇంకా ప్రజలు పూర్తిగా ఎదుర్కొలేదని అన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మిల్లర్ కోరారు. ఇక్కడ చదవండి: ఫేస్బుక్ వర్సెస్ ఆస్ట్రేలియా -
రకుల్ పిటిషన్‌పై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : రియా చక్రవర్తి డ్రగ్స్ కేసుకు సంబంధించి తన పేరును మీడియా కథనాలలో చర్చించకుండా చర్యలు తీసుకోవాలని రకుల్ ప్రీత్‌సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. డ్రగ్ కేసులో తన పేరు మీద వార్తలు రాయడం వల్ల తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని, ఇలాంటి కథనాలు ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలో రకుల్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ చేపట్టగా రకుల్ తరపున న్యాయవాది అమన్ హింగోరాని తమ వాదనలు వినిపించారు. నటి దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 17న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి చర్చలను తీసుకున్నారో సూచిస్తూ స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. అలాగే మీడియాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్లను జస్టిస్ నవీన్ చావ్లా ఆదేశాలు జారీ చేశారు. అయితే రకుల్ తన పిటిషన్లో డ్రగ్ కేసులో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో విచారణ పూర్తి చేసి, తగిన నివేదికను కోర్టు ముందు దాఖలు చేసే వరకు మీడియా తనపై వార్తలు ప్రసారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. అయితే దీనిపై తక్షణమే ఆదేశాలు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను కోర్టు ఆక్టోబర్ 15కు వాయిదా వేసింది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో భాగంగా రియా చక్రవర్తిని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ కోణం బయట పడిన విషయం తెలిసిందే. రియాను అరెస్టు చేసిన ఎన్సీబీ ఆమె స్టేట్మెంట్ల ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్లను కూడా విచారించింది -
ఫేస్బుక్, గూగుల్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా
కాన్బెర్రా: వార్తా కథనాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆస్ట్రేలియా మీడియాకు చెల్లించాలని ప్రముఖ డిజిటల్ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్ సంస్థలను ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన చర్చలను జరపాలను ఆర్థిక శాఖ మంత్రి జోష్ ఫ్రైడెన్‌బర్గ్ శుక్రవారం పేర్కొన్నారు. లేదంటే కోడ్ ఉల్లంఘించిన కారణంగా సదరు కంపెనీలపై దాదాపు 7 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆగస్టు 28 వరకు సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఈ ఏడాది చివరి నాటికి దీనికి సంబంధించి చట్టం అమల్లోకి తెస్తామని జోష్ ఫ్రైడెన్‌బర్గ్ వివరించారు. (అమెరికాలో టిక్‌టాక్ నిషేధం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు) చాలాకాలంగా తమ కంటెంట్‌ను ఉపయోగిస్తూ డిజిటల్ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయని ఇప్పటికే పలు మీడియా సంస్థలు ఆరోపించాయి. కాపీరైట్ కింద తమకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే తమ కంటెంట్‌ను వాడి డిజిటల్ సంస్థలు ఉచితంగా డబ్బును కూడగడుతున్నాయని ఫిర్యాదు చేశాయి. తమ ఉద్యోగులు ఎంతో కష్టపడి వార్తా కథనాలు ప్రసారం చేస్తే వాటిని ఇష్టారాజ్యంగా, ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వాడుకుంటున్నాయని పలు మీడియా సంస్థలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. దీంతో ఆస్ర్టేలియా ప్రభుత్వం అక్కడి మీడియాకు మద్దతుగా నిలిచాయి. ప్రస్తుతం ఈ ముసాయిదా కోడ్ ఫేస్బుక్, గూగుల్ లాంటి అతి పెద్ద డిజిటల్ సంస్థలకే వర్తిస్తాయని, త్వరలోనే మరిన్ని సంస్థలకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (సెక్యూరిటీ గార్డుకు రూ.31 కోట్లు) -
పీసీఐ, ఎడిటర్స్ గిల్డ్‌పై సుప్రీం అసంతృప్తి
న్యూఢిల్లీ: అత్యాచారాలు, లైంగిక దాడుల వార్తల రిపోర్టింగ్‌లో నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ఎడిటర్స్ గిల్డ్, ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫెడరేషన్ ప్రతినిధులు తమ ముందు హాజరుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో తమకు సహకరించాలని గతంలోనే కోర్టు పైన పేర్కొన్న మీడియా నియంత్రణ సంస్థలకు లేఖలు పంపింది. కాగా, గురువారం జరిగిన విచారణకు న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ(ఎన్బీఎస్ఏ) తరఫు లాయర్ మాత్రమే హాజరయ్యారు. లైంగిక దాడులు, రేప్ ఘటనలను రిపోర్ట్చేస్తున్న సమయంలో చట్టబద్ధ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని బెంచ్..ఎన్బీఎస్ఏ లాయర్‌ను ప్రశ్నించింది. -
ఒక్క క్లిక్‌తో నేటి టాప్ న్యూస్
సాక్షి, అమరావతి : యువనేస్తం పథకం ప్రారంభసభలో విద్యార్థులతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు ఖంగుతిన్నారు. ఈ పథకం ఎన్నికల కోసమే పెట్టారా..ఎన్నికలు ముగియగానే ఈ పథకాన్ని మూసేస్తారా అని విద్యార్థులు ప్రశ్నించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) విద్యార్థుల ప్రశ్నలకు ఖంగుతిన్న చంద్రబాబు రేవంత్ గుట్టంతా ఆ హార్డ్‌డిస్క్‌లో ఉందా? కోల్‌కత్తాలో భారీ పేలుడు నోబెల్ : 55 ఏళ్లలో ఫిజిక్స్‌లో తొలిసారి మహిళకి... నా సినిమా ఆపాలని చూస్తున్నారు ‘ఇక ధోనిపై అంచనాలు తగ్గించుకోండి’ హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు! -
బాబూమోహన్.. బంగ్లా ఫ్యాన్స్.. నేటి విశేషాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గజపతినగరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన రాజన్న తనయుడికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ బీజేపీలో చేరిపోయారు. అగ్రరాజ్యం అమెరికాలో అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న తెలుగువాళ్లు భాషాపరంగానూ ముందంజలో ఉన్నారని వెల్లడైంది. ఇక బాలీవుడ్లో తనుశ్రీ దత్తా ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆసియాకప్ ఫైనల్లో మూడో అంపైర్ నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు సోషల్ మిడియాలో కారాలు-మిరియాలు నూరుతున్నారు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ‘గజపతి’ నియోజకవర్గంలో ఘన స్వాగతం అమెరికాలో అన్నింటా తెలుగువారే! టీఆర్ఎస్కు మరో షాక్ నవవధువుపై సామూహిక అత్యాచారం మరి అక్షయ్ సంగతేంటి : తనుశ్రీ హవ్వా.. అది అవుటా? -
శబరిమల, రేవంత్.. నేటి ప్రధానాంశాలు
సాక్షి, హైదరాబాద్: శబరిమల ఆలయంలో మహిళలపై ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటివరకు కొనసాగుతున్న పాత విధానాన్ని ఎత్తివేయాలని ఆదేశించింది. మరోవైపు ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు విచారించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కాగా, హైదరాబాద్‌లోని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ నివాసం వద్ద పోలీసులను భారీ సంఖ్యలో మొహరించారు. తనుశ్రీ దత్తా ఆరోపణలు, వన్డేల్లో మరో డబుల్ సెంచరీ.. మరిన్ని విశేషాలు మీ కోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) శబరిమల కేసు : సుప్రీంకోర్టు కీలక తీర్పు బాబును ఎందుకు వదిలేస్తున్నారు? రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసు భద్రత ఇమ్రాన్ ఖాన్‌పై భార్య ప్రశంసలు మరో బాంబు పేల్చిన తనుశ్రీ వన్డేల్లో మరో డబుల్ సెంచరీ -
అయోధ్య.. రేవంత్.. ఈరోజు విశేషాలు
సాక్షి, హైదరాబాద్: అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మరోవైపు తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు కలకలం రేపాయి. తనను ఎదుర్కొలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించగా, తమ ప్రమేయం లేదని టీఆర్ఎస్ పేర్కొంది. అవినీతికి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారని వైఎస్సార్ సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. సమంత ట్రోలింగ్, వీరేంద్రుడి ట్వీట్ మరిన్ని విశేషాలు మీకోసం.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) అయోధ్యపై సుప్రీం కీలక తీర్పు రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫైర్ హెచ్ 4 వీసా రద్దు వద్దు సమంత డ్రెస్సింగ్‌పై మళ్లీ రచ్చ! పాక్ ఓటమి.. సెహ్వాగ్ ట్వీట్ -
ఒక్క క్లిక్‌తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 271వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని లక్కవరపు కోట మండలం రంగరాయపురం నుంచి ప్రారంభించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఎస్. కోట అధికార పార్టీ ఎమ్మెల్యే లలిత కుమారి సొంత ఊరు లక్కవరపుకోటలో జననేతకు జననీరాజనం పలికారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) జననేతకు నీరాజనం పలికిన లక్కవరపుకోట కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా దంపతులు ఉగ్ర భయం 40మంది పోలీసుల రాజీనామా అందరూ చూస్తుండగానే అత్తాపూర్‌లో దారుణ హత్య బోయపాటికి బాలయ్య డెడ్‌లైన్..! బౌలింగ్ చేస్తావా.. నిన్నే మార్చాలా వివో వి 9 ప్రొ లాంచ్ : స్పెషల్ డిస్కౌంట్ -
ఒక్క క్లిక్‌తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 270వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని కొత్త వలస మండలం నుంచి ప్రారంభించారు. అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) వైఎస్ జగన్‌ను కలిసిన దివ్యాంగులు, జిందాల్ కార్మికులు కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు..! మెగాస్టార్ టైటిల్‌తో చరణ్..! రాజీవ్ ఖేల్‌రత్న అందుకున్న కోహ్లి వోడాఫోన్ ఐడియా క్యాష్ బ్యాక్ ఆఫర్లు మావో హత్యాకాండలో భీమవరం మహిళ! -
ఒక్క క్లిక్‌తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ప్రజాసంకల్పయాత్రలో నడిచేది తనే అయినా.. నడిపించేది మాత్రం ప్రజల అభిమానమేనని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎక్కడ పులివెందుల.. ఎక్కడ కొత్తవలస అని, దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానంతోనే ప్రజాసంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు మైలురాయి దాటిందని స్పష్టం చేశారు. 269వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కొత్తవలస బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) నడిచేది నేను.. నడిపించేది ప్రజల అభిమానం: వైఎస్ జగన్ మెట్రో సేవలను వినియోగించుకోవాలి: గవర్నర్ అలుపెరుగని బాటసారి @ 3000 కి.మీ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సీనియర్ నటుడు టీ20 సిరీస్ భారత మహిళలదే పేటీఎం మాల్ సేల్ : ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు -
ఎమ్మెల్యే కాల్చివేత, వినాయక నిమజ్జనం ఇవే నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు (43) కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) మావోయిస్టుల ఘాతుకం: అరకు ఎమ్మెల్యే కాల్చివేత గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి వైఎస్సార్సీపీలో చేరిన రిటైర్డ్ డీఐజీ ఒక్కడే కానీ మూడు గెటప్స్ ఆసియాకప్ : పాక్‌దే బ్యాటింగ్ -
ఒక్క క్లిక్‌తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్ట్లందరికి ఇళ్లు స్థలాలు మంజూరు చేస్తామని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 267వ రోజు పాదయాత్రలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందచేశారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) జర్నలిస్ట్‌లకు ఇళ్ల స్థలాలు : వైఎస్ జగన్ హరీశ్‌రావుకు పొమ్మనలేక పొగబెడుతున్నారు! రాఫెల్ డీల్ : రగులుతున్న రగడ నవాబ్ : అన్నదమ్ముల యుద్ధం! ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు: జడేజా జియోలో కొత్త ఐఫోన్లు -
ఈ రోజు ప్రధానాంశాలు.. ఒక్క క్లిక్‌తో
సాక్షి, హైదరాబాద్: తామేమి మనుషులను తినే పులులం కాదంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. అక్రమ మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వమే చోద్యం చూస్తే ఎలా అని మొట్టికాయలేసింది. మరోవైపు తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. కుంతియాను దుర్భాషలాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ నోటీసులు పంపింది. ప్రణయ్ హత్యపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈరోజు వార్తా విశేషాలు మరిన్ని మీకోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) అక్రమ మైనింగ్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు కోమటిరెడ్డి, వీహెచ్‌పై అధిష్టానం సీరియస్ అత్యధిక వేతనాలు పొందింది వారే! క్యాటరింగ్ పేరుతో అశ్లీల నృత్యాలు ప్రణయ్ హత్యపై రాంగోపాల్‌వర్మ కామెంట్ ‘మా ఆయన కోసం కాదు.. దేశం కోసం చూస్తా’ -
ఒక్క క్లిక్‌తో.. ఈరోజు వార్తా విశేషాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 24న మరో మైలురాయిని చేరుకోనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని చిరస్థాయిలో గుర్తుంచుకునేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో ముందుస్తు ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇక ఆసియాకప్‌లో టీమిండియా ఆటగాళ్లు గాయాల బారిన పడి స్వదేశానికి పయనమవుతున్నారు. ఈరోజు విశేషాలు మీ కోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) పాదయాత్ర @ 3,000 కిలోమీటర్ల మైలురాయి ఆజాద్‌ను చుట్టుముట్టిన ఆశావాహులు నా భార్యే కారణం: మనోహరచారి పొదుపు ఖాతాలపై పెరిగిన వడ్డీ రేట్లు కౌశల్‌ను సాగనంపేందుకు స్కెచ్? మరో ఇద్దరు భారత క్రికెటర్లు ఔట్.. -
ఒక్క క్లిక్‌తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు మరువకముందే మరో ఘోర ఘటన రాష్ట్ర రాజధానిలో కలకలం సృష్టించింది. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) హైదరాబాద్‌లో మరో మారుతీరావు సుప్రీంకోర్టు ముందుకు ‘ముందస్తు ఎన్నికలు’ ‘కోడెల’ తనయుడి వీరంగం ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌కు గ్రీన్‌సిగ్నల్ బాలీవుడ్‌కు విజయ్ దేవరకొండ..! ఆ క్యాచ్ శ్రీశాంత్ వదిలేస్తే.. చెంప పగిలేది భలే ఆఫర్ : పెట్రోల్‌పై 50 శాతం డిస్కౌంట్ -
ఒక్క క్లిక్‌తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు అమరావతిలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. కాగా టీచర్లను అరెస్ట్‌ను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) టీచర్ల అరెస్ట్‌ను ఖండించిన వైఎస్ జగన్ ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు: రాహుల్ ప్రణయ్ కేసు: మీడియా ముందుకు నిందితులు 20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ‘సమంత మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ’ టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన హాంకాంగ్ ఎయిర్టెల్ సరికొత్త ప్లాన్ : 105జీబీ డేటా -
ఒక్క క్లిక్‌తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : భీమిలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎక్కడ భూములు కనిపించినా కబ్జా చేస్తున్నారని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడి పాలనపై మండిపడ్డారు. 264వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) భూములు కనిపిస్తే కబ్జా చేస్తున్నారు: వైఎస్ జగన్ ‘కారు’లోనే కొండా దంపతులు విజయ్ దేవరకొండ ‘నోటా’పై వివాదం నైట్‌రైడర్స్‌దే టైటిల్ సూ..పర్ సేల్ : రూ.500కే టికెట్ -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్‌తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం 263వ రోజు ప్రజాసంకల్పయాత్ర పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమైంది.అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దీనిలో భాగంగా బాక్సింగ్ క్రీడాకారిణి బగ్గు మౌనిక జననేతను కలిశారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) జగన్‌కు అడుగడుగునా వినతుల వెల్లువ జైళ్లోనే చచ్చిపోరా: ప్రణయ్ సోదరుడు ‘షా అవసరం లేదు.. సామాన్యుడు చాలు’ ప్రశాంత్ కిషోర్ రాజకీయ అరంగేట్రం సైరా : ఒక్క సీన్‌కే 45 కోట్లు అందరివాడు ధోని ఉండగా.. టెన్షన్ ఎందుకు? పెట్రో షాక్ : సెంచరీ దిశగా ఇంధన ధరలు