అమెరికాలో భారీ పేలుడు | At least 25 injured in New York City blast | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారీ పేలుడు

Published Sun, Sep 18 2016 8:23 AM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

అమెరికాలో భారీ పేలుడు - Sakshi

అమెరికాలో భారీ పేలుడు

న్యూయార్క్: అమెరికాలోని మాన్ హటన్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో చెత్తకుండీలో విస్ఫోటనం సంభవించడంతో దాదాపు 25మంది గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోని తీసుకున్నారు.

పేలుడు సంభవించిన ప్రాంతలోని చుట్టుపక్కల షాపులు, రెస్టారెంట్లను మూసివేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించించనట్లు చెప్పారు. న్యూజెర్సీలో పైప్ లైన్ పేలుడు జరిగిన కొద్ది గంటల్లో మాన్ హటన్ లో పేలుడు సంభవించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement