Brazil: సుప్రీంకోర్టు వద్ద పేలుడు.. ఒకరు మృతి | An explosion occurred At Brazil Supreme Court | Sakshi
Sakshi News home page

Brazil: సుప్రీంకోర్టు వద్ద పేలుడు.. ఒకరు మృతి

Published Thu, Nov 14 2024 7:42 AM | Last Updated on Thu, Nov 14 2024 7:42 AM

An explosion occurred At Brazil Supreme Court

బ్రసీలియా: బ్రెజిల్‌ సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. రెండు సార్లు పేలుడు సంభవించగా ఒకరు మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన సిబ్బంది కోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించారు. పేలుడు కారణంగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.

వివరాల ప్రకారం.. బ్రెజిల్‌ రాజధాని బ్రసీలియాలోని సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుడు సంభవించింది. కోర్టు ప్రాంగణంలో రెండుసార్లు పేలుడు జరగడంతో ఒకరు మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు.. సుప్రీంకోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. అనంతరం, కోర్టు సమయం ముగిసిన వెంటనే భారీ స్థాయిలో పేలుళ్లు జరిగాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు. పేలుళ్ల ఘటనలో చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. పేలుడు ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. 

అయితే, పేలుడు సంభవించిన ప్రాంతానికి దగ్గరలోనే ప్రెసిడెంట్‌ లూలా డెసిల్వా భవనం కూడా ఉంది. పేలుడు జరిగిన సమయంలో ప్రెసిడెంట్‌ భవనంలో లేరని అధికారులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement