పాఠశాల ఆవరణంలో బాంబు పేలడంతో ముగ్గురు గాయపడ్డారు.
న్యూయార్క్: పాఠశాల ఆవరణంలో పేలుళ్లు సంభవించి ముగ్గురు గాయపడ్డారు. పాఠశాల భవనం దెబ్బతింది. ఈ సంఘటన న్యూయార్క్లో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు.. న్యూయార్క్ లోని యోషితా లోని మహత్తాన్ పాఠశాల ఆవరణంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీకేజి కావడంతో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.
ఆ సమయంలో స్కూలు భవనంలో ముగ్గురే ఉన్నట్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు తెలిపాడు. పేలుడు ప్రభావంతో పాఠశాలలో మూడు అంతస్తులు ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ పాఠశాలలో మొత్తం 1291 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.