మోడల్‌కు విమానంలో తీవ్ర అవమానం | Model Jen Selter kicked off American Airlines flight | Sakshi
Sakshi News home page

మోడల్‌కు విమానంలో తీవ్ర అవమానం

Published Mon, Jan 29 2018 9:46 AM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

Model Jen Selter kicked off American Airlines flight - Sakshi

జెన్‌ సెల్టర్‌ ( ఫిట్‌నెస్‌ మోడల్‌ )

న్యూయార్క్‌ : అమెరికా ప్రముఖ ఫిట్‌నెస్‌ మోడల్‌ జెన్‌ సెల్టర్‌కు తీవ్ర అవమానం జరిగింది. న్యూయార్క్‌కు చెందిన విమానంలో నుంచి ఆమెను అర్థాంతరంగా, అకారణంగా దించివేశారు. అది కూడా ఓ ఐదారుగురు పోలీసులు చుట్టుముట్టి బలవంతంగా దింపేశారు. ఇది తన జీవితంలోనే అత్యంత పెద్ద అవమానం అని సదరు ఎయిర్‌లైన్‌ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రమ్‌, ట్విటర్‌ వంటి వివిధ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంలలో ఫిట్‌నెస్‌కు సంబంధించిన టిప్స్‌ చెబుతూ తన ఫొటోలను జెన్‌ సెల్టర్‌ పెడుతుంటారు. పైగా ఈమె ఫిట్‌నెస్‌ మోడల్‌ కూడా. అయితే, శనివారం రోజు మియామిలో న్యూయార్క్‌కు చెందిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌లో జెన్‌ తన సీట్‌లో కూర్చున్నారు. అప్పటికే విమానం బయలుదేరకుండా రెండున్నరగంటలు ఆలస్యం అయింది.

అయితే, ఎలాగో విమానం బయలుదేరడం లేదు కదా కాసేపు నిల్చొని తన కోటును తీసేసి విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. అయితే, ఆమె నిల్చోగని విమాన సిబ్బంది ఆమెను కూర్చోవాలని చెప్పారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. విమానంలో నుంచి దిగిపోవాలని వారు గొడవపడ్డారు. పైలట్‌కు కూడా ఈ విషయం సిబ్బంది చెప్పగా అతడు ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు చెప్పారు. దాంతో ఓ ఐదారుగురు పోలీసులు విమానంలోకి వచ్చి ఆమెను బలవంతంగా దించేశారు. ఆమె పక్కన ఉన్నవాళ్లు ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించినా ఆమెను ఫ్లైట్‌లో ఉంచకుండా దింపేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సైతం ఆమె పంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement