kicked off
-
ఒక్కొక్కరూ, రెండు సీట్లు కొనుక్కోండి : ఎయిర్‌లైన్ సిబ్బంది అమానుషం
బరువుఎక్కువగా ఉన్నారనే కారణంతో ఇద్దరు మహిళల్ని విమానం నుంచి దించేసిన అమానుష ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. మార్చి 8వ తేదీ అంతర్జీతీయ మహిళా దినోత్సవం రోజు ఈ పరిణామం జరగడం గమనార్హం. అయితే ఈ వివాదంపై స్పందించిన ఎయిర్ న్యూజిలాండ్ ఇద్దరు మహిళలకు క్షమాపణలు చెప్పింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి: ఏంజెల్ హార్డింగ్ మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి నేపియర్ నుండి ఆక్లాండ్ ఇంటికి ప్రయాణిస్తుండగా ఈ షాకింగ్ పరిణామం ఎదురైంది. విమానం ఎక్కి, విమానం రన్‌వేపైకి చేరుకుందో లేదో అటెండెంట్ వచ్చి సీట్ ఆర్మ్‌రెస్ట్‌ను కిందకు దించేందుకు ప్రయత్నించింది. దీనిపై ఎందుకని ప్రశ్నిస్తే అది సరిగ్గా ఫిట్ అయ్యేంతవరకు విమానం టేకాఫ్ చేయబోనని పైలట్ చెప్పినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో తన పట్ల అటెండెంట్ చాలా దురుసుగా వ్యవహరించిందని ఏంజెల్ హార్డింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు సిబ్బంది తమను కిందకు దించేస్తామని బెదిరించారట. దీంతో ఈ వివాదం మరింత ముదిరి విమానాన్ని బోర్డింగ్ ప్రదేశానికి తీసుకొచ్చారు. మరోవైపు తమకు ఇబ్బంది కలుగుతోంది అంటూ మిగిలిన ప్రయాణీకులు ఒత్తిడి తేవడంతో బాధిత మహిళల్ని దిగిపోవాలని సిబ్బంది కోరారు. అయితే ఇలా ఎందుకు బాధిత మహిళలు గట్టిగా నిలదీశారు. ఇక్కడ సిబ్బంది సమాధానంతో వారు షాకయ్యారు. ఒక్కొక్కరు రెండు సీట్లు బుక్ చేసుకోవాలంటూ వ్యంగ్యంగా మాట్లాడటంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇలాంటి అవమానకర పరిస్థితి మనమందరం మనుషులం,మరెవ్వరికీ తన లాంటి అవమానం ఎదురుకాకూడదంటూ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు. దీన్ని విచారించిన సంస్థ బాధితులకు క్షమాపణలు చెప్పింది. వారి విమాన ప్రయాణ బిల్లును చెల్లించి, వారి ఖర్చు లన్నింటినీ భరించింది. అలాగే ప్రయాణికులతో హుందాగా నడుచుకునేలా చూస్తామని ఎయిర్‌లైన్ ప్రతినిధి హామీ ఇచ్చారు. అయితే ఈ అవమానానికి తగిన పరిహారం చెల్లించాల్సిందే అంటూ హార్డింగ్ స్నేహితుడు పట్టుపడుతున్నాడు. -
మోడల్‌కు విమానంలో తీవ్ర అవమానం
న్యూయార్క్ : అమెరికా ప్రముఖ ఫిట్నెస్ మోడల్ జెన్ సెల్టర్కు తీవ్ర అవమానం జరిగింది. న్యూయార్క్‌కు చెందిన విమానంలో నుంచి ఆమెను అర్థాంతరంగా, అకారణంగా దించివేశారు. అది కూడా ఓ ఐదారుగురు పోలీసులు చుట్టుముట్టి బలవంతంగా దింపేశారు. ఇది తన జీవితంలోనే అత్యంత పెద్ద అవమానం అని సదరు ఎయిర్‌లైన్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రమ్, ట్విటర్ వంటి వివిధ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో ఫిట్‌నెస్‌కు సంబంధించిన టిప్స్ చెబుతూ తన ఫొటోలను జెన్ సెల్టర్ పెడుతుంటారు. పైగా ఈమె ఫిట్నెస్ మోడల్ కూడా. అయితే, శనివారం రోజు మియామిలో న్యూయార్క్‌కు చెందిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో జెన్ తన సీట్లో కూర్చున్నారు. అప్పటికే విమానం బయలుదేరకుండా రెండున్నరగంటలు ఆలస్యం అయింది. అయితే, ఎలాగో విమానం బయలుదేరడం లేదు కదా కాసేపు నిల్చొని తన కోటును తీసేసి విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. అయితే, ఆమె నిల్చోగని విమాన సిబ్బంది ఆమెను కూర్చోవాలని చెప్పారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. విమానంలో నుంచి దిగిపోవాలని వారు గొడవపడ్డారు. పైలట్‌కు కూడా ఈ విషయం సిబ్బంది చెప్పగా అతడు ఎయిర్పోర్ట్ అధికారులకు చెప్పారు. దాంతో ఓ ఐదారుగురు పోలీసులు విమానంలోకి వచ్చి ఆమెను బలవంతంగా దించేశారు. ఆమె పక్కన ఉన్నవాళ్లు ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించినా ఆమెను ఫ్లైట్‌లో ఉంచకుండా దింపేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సైతం ఆమె పంచుకున్నారు. Just like that, 5 cops coming at me. Worst experience American Air ✌🏼 pic.twitter.com/1LY1NrAQ3k — Jen Selter (@JenSelter) 28 January 2018 Current situation @AmericanAir .. insane. pic.twitter.com/kIOh3VysnU — Jen Selter (@JenSelter) 28 January 2018 Here is a video of an innocent passenger who on her own decided to get off the plane based on how badly @AmericanAir treated us all. pic.twitter.com/DZ4kkHOlox — Jen Selter (@JenSelter) 28 January 2018 -
అల్లా అన్నందుకు ఫ్లైట్ దించేశారు!
పారిస్: పారిస్, ఇతర ఉగ్రదాడుల నేపథ్యంలో ఇటీవల 'ఇస్లామోఫోబియా' పెరిగిపోయింది. ముఖ్యంగా విమానప్రయాణాల్లో ఇది ఒకింత ఎక్కువైందనే చెప్పాలి. తాజాగా పారిస్ నుంచి అమెరికాలోని సిన్సినాటీకి వెళ్తున్న ఓ పాకిస్తానీ-అమెరికన్ జంటకు ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. తమ పదో పెళ్లిరోజు సందర్భంగా పారిస్‌లో సంతోషంగా గడిపి తిరిగి అమెరికా వెళ్తుండగా.. అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బంది వారిని ఫ్లైట్ దించేశారు. బాధితులు నజియా మీడియాతో తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త ఫైజల్లో ఆమె పారిస్ నుంచి సిన్సినాటీ వెళ్లే విమానంలో ప్రయాణానికి సిద్ధంగా ఉంది. ఫ్లైట్ మరికాసేపట్లో బయలుదేరుతుందనగా.. హిజాబ్ ధరించిన ఆమెపై విమాన సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. దీనికి తోడు ఫైజల్‌కు చెమట రావడం గమనించిన విమానసిబ్బంది వారిపై మరింత అనుమానంతో పైలట్‌కు ఈ విషయాన్ని తెలిపినట్లు ఆమె వెల్లడించింది. దీంతో.. మీరు లగేజీతో పాటు విమానం నుంచి బయటకు వెళ్లాలని సిబ్బంది కోరారని ఆమె వెల్లడించింది. తాము 'అల్లా' అనడం వల్లనే విమానసిబ్బంది ఫ్లైట్ నుంచి దించేశారని ఆమె ఆరోపించింది. ఈ చర్యను కేవలం ఇస్లమోఫోబియాగా నజియా వెల్లడించింది. అనంతరం వారిని ఫ్రెంచ్ పోలీస్ అధికారి విచారించాడని, వారి పారిస్ టూర్ గురించి ప్రశ్నించిన అధికారి.. ఎలాంటి సమస్యా లేదని తెలిపినట్లు నజియా పేర్కొంది. ఈ చర్యపై ముస్లిం సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్(సీఏఐఆర్) సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే.. దీనిపై డెల్టా ఎయిర్‌లైన్స్ సమాధానమిస్తూ.. 'తమ సంస్థలో ప్రయాణికులపట్ల ఎలాంటి వివక్షతకు తావు లేదు' అని ప్రకటించింది. -
కపుల్స్ పెళ్లి రోజు ఎంజాయ్‌లో ఉండగా..
చికాగో: చెమటపట్టిందని ఓ ముస్లిం దంపతులను అమెరికాకు చెందిన విమానంలో నుంచి దింపేశారు. వారు అల్లా అని కూడా సంబోధించారనే కారణంతో వారిని అర్థాంతరంగా విమానంలో నుంచి పంపించేశారు. పాక్ సంతతికి చెందిన నజియా, ఫైజల్ అనే అమెరికా దంపతులు అమెరికాకు చెందిన విమానంలో ప్యారిస్ నుంచి ఓహాయోలోని సిన్సినాటికి బయలుదేరారు. మొత్తం తొమ్మిదిగంటల ప్రయాణం. విమానంలోకి ఎక్కిన తర్వాత నజియా తన షూ విప్పేసి తల్లిదండ్రులకు ఎస్సెమ్మెస్ పెట్టి హెడ్ ఫోన్ పెట్టుకొని సీట్లో వాలిపోయింది. అదే సమయంలో ఈ విమానానికి చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ సిబ్బంది వారి వద్దకు వచ్చారు. తాను ఆ ముస్లిం దంపతులను అసౌకర్యంగా భావిస్తున్నానని విమాన సిబ్బంది పైలెట్ కు చెప్పింది. అంతేకాకుండా ఆమె అనుమానాస్పదంగా కనిపించిందని, ఆమెకు చెమటలు కూడా ప్రారంభమయ్యాయని, ఆమె భర్త కూడా రహస్యంగా ఫోన్ దాచుకునే ప్రయత్నం చేశాడని.. అదే క్రమంలో వారిద్దరు అల్లా అని అరవడం తనకు వినిపించిందని చెప్పింది. దీంతో విమానాశ్రయంలో సిబ్బందికి ఫోన్ చేసిన పైలెట్ వారిద్దరిని దించే వరకు విమానం కదలదని చెప్పేశాడు. 'మేం అప్పటికే 45 నిమిషాలపాటు మా సీట్లలో కూర్చున్నాం. అప్పుడే ఓ విమాన సిబ్బంది వచ్చి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి మాతో కిందికి వస్తారా అని అడిగాడు. మా వస్తువులు కూడా తెచ్చుకోవాలా అని ప్రశ్నించాం. మీ సామాను మొత్తం తీసుకొని రండి అని చెప్పాడు. మీరు ఈ విమానంలో వెళ్లడం లేదు అన్నాడు. అనంతరం మమ్మల్ని ఫ్రెంచ్ పోలీసులు ప్రశ్నించారు. మాతో ఎలాంటి సమస్య లేదని చెప్పారు' అని ఫైజల్ చెప్పింది. పదో సంవత్సర వివాహ వేడుక సందర్భంగా హాలీడేలో ఉన్న వాళ్లిద్దరికి ఈ చేదు అనుభవం ఎదురైంది. అనంతరం వారు వేరే విమానంలో వెళ్లారు. కాగా, ఈ ఘటనపట్ల ఓ ముస్లిం సంస్థ విమానసంస్థకు నోటీసులు ఇవ్వగా తాము ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పింది. తమ సంస్థ తరుపున ఎవరి విషయంలో అసలు వివక్ష చూపించబోమని.. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తామని సదరు సంస్థ తెలిపింది.