నటీనటుల రూపురేఖలు కూడా కొన్నిసార్లు కొంతమందికి ఫ్లస్ అవుతుంటాయి. చూడటానికి సమంత చెల్లిగా కనిపించి, జూనియర్ సమంతగా ఫేమస్ అయింది. ఆ ఫేమ్‌ను కాపాడుకుంటూనే, తన ప్రత్యేకతనూ ప్రపంచానికి పరిచయం చేస్తోంది నటి పవిత్ర లక్ష్మి.. ఆ విషయాలే..
⇒ తమిళనాడులోని కోయంబత్తూరు పవిత్ర సొంతూరు. చిన్నప్పటి నుంచి అమ్మ చీరలతో డిజైనింగ్, స్టయిలింగ్ చేయటం చాలా ఇష్టం. ఆ ప్యాషన్‌తోనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది.
⇒చదువు అయ్యాక, మోడల్‌గా మారి, కెరీర్ ప్రారంభించింది. 2015లో ‘మిస్ మద్రాస్’గా అందాల కిరీటాన్ని సాధించింది. తర్వాత ‘క్వీన్ ఆఫ్ ఇండియా 2016’ పోటీలోనూ పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.
⇒దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఓ కాదల్ కన్మణి’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసి, నటిగా మారింది. తర్వాత ‘కుక్ విత్ కోమలి’ రియాలిటీ షోలో కనిపించి పాపులారిటీతో పాటు, సినీ అవకాశాలను అందుకుంది.
⇒ తొలిసారి ‘నాయిం శేఖర్’ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. తర్వాత ‘టైమ్ ఎన్న బాస్!’ ‘ఉల్లాసం’, అదృశ్యం’ వంటి పలు చిత్రాల్లోనూ నటించింది.
⇒ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పవిత్ర, ఈ మధ్యనే సొంత యూట్యూబ్ చానెల్ ప్రారంభించి, ‘ఇన్నమ్ ఒరు మురాయ్’, ‘కనవు’ అనే తన పోయెటిక్ వ్యూ వీడియోస్‌లో నటించి వీక్షకుల ప్రశంసలు అందుకుంది.
⇒ ప్రస్తుతం తను నటించిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్’ ఆహోలో స్ట్రీమ్ అవుతోంది.
ఆరోగ్యంగా ఉంటే అందంగానూ కనిపిస్తాం. అందుకే, ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను. నా స్కిన్ కేర్ ప్రాడక్ట్స్, హెయిర్ ఆయిల్స్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. – పవిత్ర లక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment