American Airlines
-
8 రోజుల అనంతరం తెనాలికి చేరిన రవితేజ మృతదేహం
తెనాలిరూరల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందిన గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌కు చెందిన తాడిబోయిన రవితేజ భౌతికకాయం శుక్రవారం సాయంత్రం తెనాలి చేరుకుంది. అమెరికా నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రవితేజ భౌతికకాయాన్ని అంబులెన్స్ ద్వారా తెనాలి తీసుకు వచ్చారు. ఈ నెల 18న అమెరికాలోని టెక్సాస్‌లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి రవితేజ మృతి చెందిన విజయం తెలిసిందే. రవితేజ తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి జయలక్ష్మి కొడుకుకు మంచి చదువు చెప్పించి పెంచి పెద్ద చేసింది. ఓవైపు చదువుకుంటూనే కోకోకోలా కంపెనీలో ఉద్యోగం చేస్తూ డబ్బులు కూడపెట్టుకున్న రవితేజ ఎంఎస్ కోసం గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. అక్కడ టెక్సాస్‌లో ట్రైన్ యూనివర్శిటీలో ఎంఎస్ చేస్తూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 18న స్నేహితులతో కలిసి అక్కడ స్విమ్మింగ్‌పూల్‌లో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దాదాపు ఎనిమిది రోజుల అనంతరం శుక్రవారం సాయంత్రం రవితేజ భౌతికకాయం తెనాలి చేరుకుంది. తెనాలిలో భారీ ఊరేగింపుగా రవితేజ భౌతికకాయాన్ని ఐతానగర్‌లోని నివాసానికి తీసుకువెళ్లారు. రజక చెరువు సెంటర్ నుంచి లింగారావు సెంటర్ మీదుగా రవితేజ నివాసానికి రాత్రికి భౌతికకాయం చేరుకుంది. రవితేజ భౌతిక భౌతికకాయాన్ని చూసి తల్లి జయలక్ష్మి, సోదరుడు కన్నీటి పర్యంతమయ్యారు. పేద కుటుంబానికి చెందిన తాము కొడుకు ప్రయోజకుడవుతాడని అమెరికా పంపిస్తే అనుకోని ప్రమాదంలో అతడు మృతి చెందాడంటూ కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి జయలక్ష్మి గుండెల విసేలా రోదించారు. శనివారం ఉదయం రవితేజ భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. -
ఈ గాలి.. ఈ నేలా..
‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..’ అంటూ బంగారు భవిష్యత్తును ఊహించుకుంటూ విదేశాలకు వెళ్లిన వృత్తి నిపుణులు రూట్ మార్చారు. ‘ఈ గాలి..ఈ నేలా అని పాడుకుంటూ తిరిగి నగరానికి వచ్చేస్తున్నారు. అలా వచ్చేస్తున్న మన దేశీయుల్లో సిటీకి చెందిన వారితో పాటు ఇతర నగరాలకు చెందిన వారు కూడా ఉండడం విశేషం. ఈ అనూహ్యమైన పోకడని వెల్లడించింది ఇంటర్నేషనల్ మొబిలిటీ ట్రెండ్స్.. నివేదిక. విదేశీ ఉద్యోగాల్లో ఇమడలేకపోతున్న యువ నిపుణులు పని వెతుక్కుంటూ నగరానికి తిరిగి వచ్చేస్తున్నారు. ఈ రివర్స్ మైగ్రేషన్ అమెరికా, యు.కె, కెనడా వంటి దేశాల నుంచి బాగా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ మొబిలిటీ ట్రెండ్స్‌పై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వెలువరించిన తాజా నివేదిక ఈ విశేషాలను వెల్లడించింది. విదేశాల్లో ఉంటూ అక్కడ పని చేయడానికి ఇష్టపడే భారతీయుల సంఖ్య 2020లో 78 శాతం కాగా అది మూడేళ్లు తిరిగేసరికి 2023 కల్లా.. 54 శాతానికి పడిపోయిందని పేర్కొంది. విదేశాల్లో చేస్తున్న పనిపట్ల అయిష్టతతో భారత్‌కు వలసలు పెరిగాయని, ఇలా తిరిగొస్తున్న వారిలో అత్యధికులు ఎంచుకుంటున్న టాప్ 3 నగరాలుగా వరుసగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఉన్నాయని తేలి్చంది. కారణాలెన్నో... ఇలా విదేశీ ఉద్యోగాలపై మోజు తగ్గిపోతుండడానికి ‘ఆర్థిక, వృత్తి పరమైన కారణాలతో పాటు అనేక అంశాలు‘ కీలకంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. ‘ప్రధానంగా ఆరి్థక అంశాలతో పాటు వృత్తి పరమైన వృద్ధి అవకాశాల కోసం మాత్రమే ఇలా వలస వెళ్లాలని భావిస్తారు. ఆ విధంగా చూస్తే ఇలా తిరిగి వస్తున్నవారిలో ఉద్యోగ అవకాశాల నాణ్యత కోసం 52 శాతం మంది, ఆదాయం, జీవన వ్యయం కోసం, 37 శాతం ఆవిష్కరణ డిజిటలైజేషన్ కోసం 29 శాతం మంది విదేశాలను వదలాలని నిర్ణయించుకుంటున్నారు. కుటుంబ అనుకూల వాతావరణం, భద్రత, జీవన నాణ్యత కూడా ప్రధాన కారకాలు‘ అని నివేదిక వెల్లడించింది. మన నగరానికే ఎందుకంటే... ఇలా విదేశాల నుంచి మన దేశానికి తిరిగి వస్తున్నవారిలో అత్యధికులు నగరాన్ని ఎంచుకోవడానికి నగరంలో ఐటీ రంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం, జీవన వ్యయం తక్కువగా ఉండడం, నగరం సురక్షితం అనే ఇమేజ్... వంటివి కారణాలుగా ఇటీవల నగరానికి మకాం మార్చిన వారు చెబుతున్నారు. ‘కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశాను కాబట్టి అమెరికాలో మంచి ఉద్యోగం వస్తుందని ఆశించాను. కానీ నేను ఆశించింది జరగలేదు. పైగా నా మీద ఆధారపడి నా భార్య నాతో వచ్చేసింది, జీవితం గడపడానికి నేను ఒక కనీ్వనియన్స్ స్టోర్‌లో ఉద్యోగం చేయాల్సి వచి్చంది. ఇలా లాభం లేదని నిర్ణయించుకుని ఇంటికి తిరిగి వచ్చాను’ అని ఎస్.సుదర్శన్ రావు చెప్పారు. అతను వెళ్లే ముందు నగరంలో తనకి ఆరంకెల జీతంతో ఉద్యోగం ఇచి్చన అదే కంపెనీ..తిరిగి వచ్చిన తర్వాత కూడా అతనికి మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని అందించింది ‘ కేవలం ఐటీ రంగంలోనే కాదు, ఫైనాన్స్, ఫార్మా తదితర రంగాలలో కూడా నగరంలో మంచి అవకాశాలు ఉన్నాయి‘ అని మరో ఉద్యోగి చరణ్ అంటున్నారు. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన ఖైతాన్ ఖురేషీ కూడా తన కెనడియన్ కలలను వదులుకుని నగరానికి వచ్చేశారు. ‘కెనడాలో నా నెలవారీ ఖర్చులు అక్కడ నేను సంపాదించగలిగిన దానికంటే చాలా ఎక్కువ. పైగా నేను ఎడ్యుకేషన్ లోన్ కూడా చెల్లించాల్సి ఉంది. వచ్చే నెల బడ్జెట్‌కు కేటాయింపుల కంటే ఇండియాకు టిక్కెట్ కొనడమే చౌక అని అనుకున్నా’ అంటూ ఆయన నవ్వుతూ చెప్పారు. మాట సాయం కీలకమే... విదేశాల్లో మనవారికి కొరవడుతున్న ఎమోషనల్ సపోర్ట్ కూడా కీలకమని వీరు అంటున్నారు. తమ రివర్స్ మైగ్రేషన్‌కు భావోద్వేగ మద్దతు లభించకపోవడం కూడా కొందరు కారణాలుగా పేర్కొన్నారు. ‘బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ తర్వాత అమెరికాలో గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించడం నా అదృష్టంగా భావించాను. అయితే మాట్లాడటానికి ఎవరూ లేకపోవడం, ఇంటి పనులతో పాటు తీవ్రమైన పని షెడ్యూల్..అది నిర్వర్తించడానికి కనీస అవసరమైన భావోద్వేగ మద్దతు లేకపోవడం నన్ను నిరాశకు గురిచేసింది’ అని నగరానికి తిరిగి వచ్చి ఇక్కడ తనవారితో కలిసి ఆనందంగా గడుపుతున్న అద్నాన్ అన్నారు. -
అమెరికా విమానంలో వ్యక్తి అలజడి..
వాషింగ్టన్: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అలజడి సృష్టించాడు. విమానం గాల్లో ఎగురుతుండగానే అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయతి్నంచాడు. తోటి ప్రయాణికులు భయాందోళనతో గట్టిగా అరుస్తున్నా పట్టించుకోలేదు. దాంతో వారంతా అతడిని బంధించి, బలంతంగా సీట్లో కూర్చోబెట్టి, మళ్లీ లేవకుండా టేపుతో కట్టేశారు. అమెరికాలో న్యూమెక్సిలో రాష్ట్రంలోని అల్బుక్విర్కీ సిటీ నుంచి షికాగోకు బయలుదేరిన 1219 విమానంలో(బోయింగ్ 737) ఇటీవలే ఈ ఘటన చోటుచేసుకుంది. అల్బుక్విర్కీ ఎయిర్‌పోర్టు నుంచి విమానం బయలుదేరిన 30 నిమిషాలకు సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులంతా అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి, అల్బుక్విర్కీ ఎయిర్‌పోర్టులో దించారు. గందరగోళానికి కారణమైన ప్రయాణికుడిని కిందికి దించి, పోలీసులకు అప్పగించారు. అతడు ఎందుకలా చేశాడన్నదానిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
Interesting World Facts: ఆశ్చర్యం కలిగించే ప్రపంచ నిజాలు
-
Delhi: తాగిన మైకంలో మూత్రం పోసి క్షమాపణలు.. అరెస్ట్
న్యూఢిల్లీ: మరో పీ గేట్ ఘటన వెలుగు చూసింది. న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. తప్పతాగిన స్థితిలో ఓ భారతీయ విద్యార్థి మూత్రవిసర్జన చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికుడు ఎలాంటి ఫిర్యాదు చేయకున్నా.. విమానయాన సంస్థ రంగంలోకి దిగి ఆ విద్యార్థిని అరెస్ట్ చేయించింది. శుక్రవారం రాత్రి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఏఏ292 న్యూయార్క్ నుంచి బయలుదేరింది. శనివారం రాత్రి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. అయితే.. ఈ మధ్యలో ఓ ప్రయాణికుడు తప్పతాగిన మైకంలో మూత్ర విసర్జన చేశాడు. అది కాస్త పక్కనే ఉన్న ప్యాసింజర్‌కు తాకింది. దీంతో విమాన సిబ్బందికి విషయం తెలియజేశాడు సదరు ప్రయాణికుడు. అయితే.. మూత్ర విసర్జన చేసింది విద్యార్థి కావడం, ఫిర్యాదు చేస్తే అతని కెరీర్ దెబ్బ తింటుందనే ఉద్దేశం, పైగా క్షమాపణలు చెప్పడంతో.. ఈ ఘటనపై బాధితుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ, విమానయాన సంస్థ మాత్రం ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సిబ్బంది వెంటనే విషయాన్ని పైలట్‌కు తెలియజేశారు. పైలట్, ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో.. ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. విమానం ల్యాండ్ కాగానే సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. ప్రయాణికుడు విమానంలో అనుచితంగా ప్రవర్తించినట్లు రుజువైతే.. క్రిమినల్ చట్టాల ప్రకారం శిక్షలతో పాటు కొంతకాలం అతనిపై విమానయాన వేటు విధించే అవకాశం ఉంటుంది. గత నవంబర్‌లో ఇదే తరహాలో ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. శంకర్ మిశ్రా అనే వ్యక్తి తాగిన మైకంలో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసి జైలుకు వెళ్లి.. బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ఇండియా స్పందన సరైన రీతిలో లేదన్న అభియోగాలతో.. విమానయాన సంస్థకు 30 లక్షల రూ. జరిమానా కూడా విధించింది డీసీసీఏ. -
Las Vegas: రన్ వేపై రెండు విమానాలు ఢీ.. నలుగురు మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఉత్తర లాస్ వేగస్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. రన్‌వే పై రెండు చిన్న విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో విమానాల్లోని మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం సమయంలో జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46, సింగిల్ ఇంజిన్ సెస్నా 172లు ఢీకొన్నాయని తెలిపారు. 'ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46 విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రన్ వేపై సెస్నా 172ను ఢీకొట్టింది. దాంతో పైపర్ పీఏ 46 రన్ వే 30కి తూర్పు వైపు పడిపోయింది. సెస్నా సమీపంలోని నీటి కుంటలో పడింది.' అని ఎఫ్ఏఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక్కో విమానంలో ఇద్దరు ఉండగా.. మొత్తం మంది మరణించినట్లు సిటీ అగ్నిమాపక విభాగం తెలిపింది. ఇదీ చదవండి: America Indiana City: ఇండియానా షాపింగ్ మాల్లో కాల్పులు.. ముగ్గురి మృతి.. దుండగుడి హతం -
పుతిన్‌కు బిగ్ షాక్.. బైడెన్ వార్నింగ్ ఇదే..
వాష్టింగన్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. ఏడు రోజులుగా జరుగుతున్న హోరాహోరి పోరులో రెండు దేశాల సైన్యం శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి. చావును సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న ఉక్రెయిన్ సైన్యం తెగువ చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు రష్యా చర్చను వ్యతిరేకిస్తూ ఆర్ధికపరమైన కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ పుతిన్ మాత్రం వెనకంజ వేయకుండా తగ్గేదేలే అన్నట్టుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉండగా రష్యాకు అగ్ర రాజ్యం అమెరికా మరో వార్నింగ్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగవారం కాంగ్రెస్ సంయుక్త సమావేశం ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు ఉంటుందని పేర్కొన్న బైడెన్.. రష్యాతో జరిగే పోరాటంలో అమెరికా మాత్రం పాల్గొనబోదని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ గడ్డపై అమెరికా బలగాలు రష్యాతో పోరాడబోవని బైడన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సైన్యం రష్యా బలగాలను నిలువరిస్తూ వారి దాడులను తిప్పికొడుతోందని ప్రశంసించారు. ఉక్రెయిన్ దేశ పౌరులు సైతం తుపాకులు చేతపట్టుకొని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై సైనిక దాడులకు దిగిన రష్యా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. రష్యా, పుతిన్‌పై రానున్న కాలంలో యుద్ద ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పుతిన్ గెలిచినా, ఓడినా.. ఆర్థిక పరంగా, ఇతర అంశాల విషయంలో రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఓ నియంత.. అతడి అంతు చూస్తామంటూ బెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు.. బైడెన్.. రష్యాపై మరిన్ని ఆంక్షలను విధించారు. రష్యా విమానాల రాకపోకలు అమెరికా మీదుగా వెళ్లకుండా గగనతలాన్ని మూసివేసింది. ఫలితంగా రష్యా విమానాలు ఇకపై అమెరికా మీదుగా రాకపోకలు సాగించలేవు. కాగా, ఇప్పటికే యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాలు రష్యా గగనతలాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెందిన విలాసవంతమైన అపార్ట్మెంట్లు, ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. -
ఘోర విమాన ప్రమాదం.. ఏడుగురు యువకులు..
వాషింగ్టన్ : ఓ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన అమెరికా నార్త్ కరోలినా రాష్ట్రంలోని ఔటర్ బ్యాంక్స్ వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఎనిమిది మంది యువకులతో హైడ్ కౌంటీ ఎయిర్పోర్ట్ నుంచి పిలాటస్ పీసీ-12/47 అనే సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్అయింది. అనంతరం 25 నిమిషాల్లో 29 కిలోమీటర్ల(18 మైళ్లు) దూరం ప్రయాణించిన తర్వాత రాడార్‌తో ఆ విమాన సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయిందని కోస్ట్ గార్డ్ అధికారులు నిర్ధారించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సముద్రంలో సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలో సముద్రంలో విమాన శకలాలను సిబ్బంది గుర్తించారు. ఆ ప్రాంతంలోనే ఓ వ్యక్తి మృతదేహాన్ని కూడా కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గల్లంతైన మరో ఏడుగురి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, వీరంతా కార్టెరెట్ కౌంటీకి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. -
న్యూయార్క్ - న్యూఢిల్లీ ఫ్లైట్‌కి ఊహించని సమస్యలు
American Airlines Russian Airspace Issue: అమెరికా - ఇండియాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసుగా అమెరికా ఎయిర్‌లైన్స్ ప్రారంభించిన సర్వీసుకి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. మార్గమధ్యంలో తలెత్తున్న ఇబ్బందుల కారణంగా షెడ్యూల్ టైంకి ఈ విమానం నడిపించడం మా వల్ల కాదంటున్నారు అమెరికన్ పైలెట్లు. ఇండియా, అమెరికాల మధ్య గతంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ డైరెక్టు విమానాలు నడిపించినా 2012లో రద్దు చేసింది. తాజాగా న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి బోయింగ్ 777 (300ఈఆర్) సర్వీసులను ప్రారంభించింది. ఈ రెండు నగరాల మధ్య దూరం 7320 మైళ్లు ఉండగా ప్రయాణ సమయం 16 గంటలలోపుగానే షెడ్యూల్ చేశారు. అయితే ఈ షెడ్యూల ప్రకారం విమానాలు నడిపించడం వీలు కావడం లేదంటూ వన్ టైం అట్ టైం వెబ్సైట్ కథనం ప్రచురించింది. అయితే ఈ విమానం మార్గమధ్యంలో కొద్ది సేపు రష్యా ఎయిర్ స్పేస్ మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తమ గగన తలం ఉపయోగించుకోవడంపై రష్యా అభ్యంతరం వ్యక్తం చేయడంతో రూటు మార్చి నడిపిస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం 16 గంటలు మించుతోంది. ఫలితంగా విమానం షెడ్యూల్ ప్రకారం నడిపించడంలో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో న్యూయార్క్ - న్యూఢిల్లీ విమాన సర్వీసులో తలెత్తున్న ఇబ్బందులు పరిష్కరించాలంటూ అమెరికన్ పైలెట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారితే మరోసారి ఈ సర్వీసులు కొనసాగింపుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కరోనా సంక్షోభం చక్కబడిన తర్వాత ఇప్పుడిప్పుడే ఇండియా - అమెరికాల మధ్య ప్రయాణాలు ఊపందుకుంటున్నాయి. ఎన్నారైలు తమ ప్రయాణాలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ విమాన సర్వీసు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు తెర మీదకు వచ్చాయి. చదవండి: విదేశాల నుంచి ఇండియా వచ్చే వారికి అలెర్ట్! డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ -
‘వామ్మో ఏంటా బట్టలు.. ముందు ఫ్లైట్ దిగు’
ఆడవాళ్ల వేషధారణ సొసైటీలో ఎడతెగని ఓ చర్చాంశం. అయితే తన దేశంలో వివక్ష ఎదురవుతుందనే.. ఆమె వెస్ట్రన్ దేశాలకు వలస వెళ్లింది. అక్కడ తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుంది. కానీ, ఊహించని రీతిలో అక్కడా ‘చేదు’ అనుభవమే ఎదురయ్యిందంటూ కన్నీళ్లతో వాపోయింది. కానీ.. దెనిజ్ సెపినర్(26).. టర్కీ ఫిట్నెస్ మోడల్. అయితే అక్కడి సంప్రదాయలు ఆమెను ప్రొఫెషనల్‌లోకి అనుమతించలేదు . దీంతో అమెరికాకు వలస వెళ్లింది. ఫిట్నెస్ మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ గుర్తింపు దక్కించుకున్న మొదటి టర్కీ బాడీ బిల్డర్ కూడా ఈమెనే. ఈ క్రమంలో బికినీ మోడలింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు జులై 8న మియామీ నుంచి టెక్సాస్‌కు బయలుదేరింది. అయితే ఫ్లైట్ ఎక్కిన కాసేపటికే సిబ్బంది ఒకరు వచ్చి.. ‘మీరు దిగిపోవాలి’ అన్నాడు. ఆమె అది జోక్‌గా అనుకుందట. దీంతో ‘మీ బట్టలు బాగోలేవు. మీ వల్ల ఇందులో ఉన్న ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. దిగిపోండి’ అని మరోసారి చెప్పాడట. కావాలంటే తన టీషర్ట్‌తో కాళ్లను కప్పేసుకుంటానని ఆమె చెప్పినప్పటికీ.. వినకుండా ‘మీరు నగ్నంగా ఉన్నారు. దిగిపోవాల్సిందేన’ంటూ ఆమెతో దురుసుగా వ్యవహరించారట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకుని వాపోయిందామె.‘ఆ మాట వినగానే భయమేసింది. వణికిపోయా. వాళ్లసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నేనేం నగ్నంగా లేను కదా. రాత్రంతా ఒంటరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయా. నా దేశంలో స్వేచ్ఛ లేదనే ఇక్కడికి వచ్చా. కానీ, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు’ అంటూ కన్నీళ్లతో వీడియోను పోస్ట్ చేసింది దెనిజ్. ట్విస్ట్ అయితే దెనిజ్ దుస్తులు మరీ బికినీ తరహాలో కురచగా ఉన్నాయని, అందుకే ఆమెను దించేశామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ‘ఫ్లైట్స్‌లో వెళ్లేవాళ్లకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా పడితే అలా బట్టలు వేసుకొస్తే.. అవతలి వాళ్లు ఇబ్బంది పడతారు కదా. ఆమె వేషధారణ అసభ్యంగా ఉందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం మా సిబ్బంది చేసింది. కానీ, ఆమెనే దురుసుగా ప్రవర్తించడంతో ప్రతిగా అలా చేయాల్సి వచ్చింద’ని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. దీంతో ఆమెకే నెగెటివ్ కామెంట్లు వస్తుండడంతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు కాసేపు ప్రైవసీ పెట్టేసిందామె. -
పిచ్చి పట్టిందా.., పారాచుట్ లేకుండా విమానం నుంచి దూకేశాడు..
వాషింగ్టన్ డిసి : పారా చుట్ లేకుండా సరదాగా విమానం నుంచి దూకితే ఎలా ఉంటుంది? అని ఎవరితోనైనా చెబితే ఏం ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందా?. వెళ్లి డాక్టర్ కి చూయించుకోమని సలహా ఇస్తారు. సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తి తన స్నేహితులతో అలాగే చెప్పాడు. చెప్పడమే కాదు పారా చుట్ లేకుండా విమానం నుంచి దూకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టెక్సాక్ కు చెంది ఐకిన్స్ వృత్తి రిత్యా పైలెట్. స్కై డ్రైవర్ కూడా. ఇటీవల ఐకిన్స్ పారాచుట్ లేకుండా విమానం నుంచి కిందకి దూకాడు. దీంతో ఆయన అభిమానులు, సన్నిహితులు సంతోషం వ్యక్తం చేశారు. అయినా ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం ఐకిన్స్ కు కొత్తేమి కాదు. 2016 లో పారాచూట్ లేకుండా విమానం నుండి దూకి గిన్నిస్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. తాజాగా 25,000వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి కిందకి దూకాడు. కింద పడే సమయంలో 150 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్న నెట్ లోకి జారేలా ప్లాన్ చేశాడు. అతనికి ఐరన్ మ్యాన్ చిత్రానికి స్టంట్‌గా పనిచేసిన ప్రొఫెషనల్ స్కైడ్రైవర్ ఫెలిక్స్ సాయం చేయడంతో గాల్లో నుంచి సునాయాశంగా కిందకి దూకాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై పలువురు నెటిజన్లు అతని సాహసానికి ఫిదా అవుతుంటే, చిప్ దొబ్బినట్లుంది అందుకే ఇలాంటి సాహసం చేస్తున్నాడంటూ మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. చదవండి : Corona: వేపచెట్ల కిందే చికిత్స... ప్రాణం నిలుస్తోంది! -
రెండో రోజూ యూఎస్ మార్కెట్ల జోరు
వరుస నష్టాలకు చెక్ పెడుతూ వారాంతాన జోరందుకున్న యూఎస్ స్టాక్ మార్కెట్లు సోమవారం సైతం లాభపడ్డాయి. డోజోన్స్ 410 పాయింట్లు(1.5%) ఎగసి 27,584 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 53 పాయింట్ల(1.6%) బలపడి 3,352 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 204 పాయింట్లు(1.8%) జంప్‌చేసి 11,118 వద్ద స్థిరపడింది. శుక్రవారం సైతం ఇండెక్సులు ఇదే స్థాయిలో పురోగమించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19తో సవాళ్లు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు, కంపెనీలకు అండగా వాషింగ్టన్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్యాకేజీపై నేడు తిరిగి చర్చలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. దీంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫాంగ్ స్టాక్స్ అప్ ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ 2.5-0.7 శాతం మధ్య లాభపడగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 3.4 శాతం జంప్‌చేసింది. ఇతర కౌంటర్లలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ 4 శాతం ఎగసింది. ప్రభుత్వం నుంచి 5.5 బిలియన్ డాలర్ల రుణాన్ని పొందడంతో ఈ కౌంటర్‌కు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. కొద్ది రోజులుగా నిలిచిపోయిన 737 మ్యాక్స్ విమానాలపై అంచనాలతో బోయింగ్ కంపెనీ 6.4 శాతం దూసుకెళ్లింది. కాగా.. ప్రత్యర్థి కంపెనీ డబ్ల్యూ పీఎక్స్ ఎనర్జీని 2.56 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు డెవాన్ ఎనర్జీ తాజాగా పేర్కొంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ 16-11 శాతం చొప్పున జంప్‌చేశాయి. లండన్‌లో కార్యకలాపాలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వార్తలతో ఉబర్ టెక్నాలజీస్ 3.2 శాతం పుంజుకుంది. -
40 వేల మందిపై వేటు : అమెరికన్ ఎయిర్‌లైన్స్
కరోనా సంక్షోభంతో టెక్సాస్-ఆధారిత విమానయాన సంస్థ అమెరికన్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయి, కుదేలైన సంస్థ దాదాపు 40వేల మందిని ఉద్యోగాలనుంచి తొలగించేందుకు నిర్ణయించింది. డెల్టా ఎయిర్‌లైన్స్1,941 మంది పైలట్లకు ఉద్వాసన పలకనున్నట్టు ప్రకటించిన మరుసటి రోజు మరో సంస్థ ఈ బాట పట్టడం గమనార్హం. అక్టోబరులో 19వేల మంది సహా మొత్తం 40 వేల ఉద్యోగులను తగ్గించుకోనున్నామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ మంగళవారం తెలిపింది. యూనియన్ కార్మికులు 17500 మంది, 1600 మంది పైలట్లు, 8100 మంది విమాన సహాయకులు, మేనేజ్మెంట్ స్థాయిలో మరో 11,500 మంది ఇందులోఉంటారని తెలిపింది. మరో ఆరునెలల పాటు సిబ్బంది జీతాల చెల్లింపు, తదితర అవసరాల నిమిత్తం ఫెడరల్ ప్రభుత్వం మరో 25 బిలియన్ డాలర్లను విమానయాన సంస్థలకు ఇస్తే తప్ప ఈ తొలగింపులను నివారించే పరిస్థితి లేదని తెలిపింది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు,సిబ్బంది వేతనాలు, తదితర అవసరాల నిమిత్తం మార్చిలో అమెరికా ప్రభుత్వం నుంచి 25 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని విమానయాన సంస్థలు అందుకున్నాయి. అయితే ఆ తరువాత కూడా విమాన సేవల పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో మరో 25 బిలియన్ డాలర్ల ప్యాకేజీ కోసం ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు ఉద్యోగులపై వేటు వేయనుంది. ఈ మేరకు సంస్థ సీఈఓ డౌపార్కర్, ప్రెసిడెంట్ రాబర్ట్ ఐసోమ్ ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించారు. కొంతమంది ఉద్యోగులు బైఅవుట్స్, ముందస్తు పదవీ విరమణ, దీర్ఘకాలిక సెలవులకు అంగీకరించారనీ, అయినా కోతలు తప్పడం లేదని పేర్కొన్నారు. 140,000 మంది ఉద్యోగులతో ఉన్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ అక్టోబరు నాటికి లక్ష కన్నా తక్కువ ఉద్యోగులకే పరిమితం కానుంది. అమెరికాలో కరోనావైరస్ వ్యాప్తికి కొన్నివారాల తరువాత, ఏప్రిల్ నాటికి 95 శాతం విమాన ప్రయాణాలు క్షీణించాయి. ఆ తరువాత కొద్దిగా కోలుకున్నా, గత ఏడాదితో పోలిస్తే 70 శాతం పతనం నమోదైంది. దీంతో ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని స్తితిలో అమెరికా విమానయాన సంస్థలు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల తొలగింపు బాటపడుతున్నాయి. మరోవైపు మహమ్మారి సృష్టించిన మాంద్యంపై పోరుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయ్నతాలు, నాలుగు రోజుల రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరుగుతున్న క్రమంలో ఈ ప్రకటన రావడం విమానయాన సంస్థల సంక్షోభానికి అద్దం పడుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఒంటి కాలితో గెంతుకుంటూ వెళ్లమన్నారు
న్యూయార్క్ : సరైన సౌకర్యాలు కల్పించలేదని, అవమానించటమే కాకుండా మానసిక ఒత్తిడికి గురిచేశారంటూ ఓ మహిళ అమెరికన్ ఏయిర్‌లైన్స్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీలపై న్యాయపోరాటానికి దిగింది. ఈ సంఘటన అమెరికాలోని ఉతాహ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. ఇడాహోకు చెందిన దివ్యాంగురాలైన టామీ షూ స్పేర్స్ ఆగస్టు 10న సాల్ట్ లేక సిటీనుంచి చార్లోటీకి వెళ్లటానికి చీప్ ఓ ఏయిర్ అనే ఆన్లైన్ సంస్థలో టిక్కెట్ బుక్ చేసుకుంది. దివ్యాంగురాలైన ఆమెకు అమెరికన్ ఏయిర్ లైన్స్ గానీ, చీప్ ఓ ఏయిర్ సంస్థగానీ విమానాన్ని ఎక్కటానికి వీల్ చైర్ కేటాయించలేదు. ప్రయాణ సమయంలో విమానంలోని వాష్‌రూమ్‌ను వాడుకోవాలని అడిగితే. వీల్‌చైర్ లేదని, వాష్‌రూమ్ వరకు ఒంటికాలుతో గెంతుకుంటూ వెళ్లమని సలహా ఇచ్చారు సిబ్బంది. చివరకు దోక్కుంటూ వెలుతుండగా ఓ నర్సు ఆమెపై జాలిచూసింది. వాష్‌రూం వరకు తీసుకెళ్లింది. వాష్ రూం ఉపయోగించుకోవటానికి కూడా దారుణమైన ఆంక్షలు పెట్టారు. తలుపు తెరిచే వాడుకోమన్నారు.( కరోనా: వారు మరణించే అవకాశం ఎక్కువ!) అంతేకాకుండా ఏయిర్ లైన్స్ సిబ్బంది తనో దివ్యాంగురాలనే కనీస జాలి లేకుండా ప్రవర్తించారు. దీంతో కలత చెందిన ఆమె అమెరికన్ ఏయిర్ లైన్స్, చీప్ ఓ ఏయిర్లపై డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ నార్తెన్ డిస్ట్రిక్ట్ ఆప్ ఉతాహ్ను ఆశ్రయించింది. మంగళవారం రెండు సంస్థలపై దావా వేసింది. దీనిపై స్పందించిన అమెరికన్ ఏయిర్‌లైన్స్‘‘ మేము మా ప్రయాణికుల బాగోగుల విషయంలో జాగ్రత్తగా ఉంటాము. ఆమె ఎందుకిలా మాపై ఫిర్యాదు చేసిందో తెలియటం లేదు. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నామ’’ ని తెలిపారు. చీప్ ఓ ఏయిర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ మా కస్టమర్లకు ఎవరికైనా ప్రత్యేక సౌకర్యాలు కావాల్సి వస్తే అందుకోసం మా సైట్లో ఏర్పాట్లు ఉన్నాయి. మా రికార్డు ప్రకారం ఆమె ప్రత్యేక సౌకర్యాల కోసం వినతి చేసుకోలేదు. ఆమె చాలా ఇబ్బంది పడ్డందుకు మాకు బాధగా ఉంది. ఈ సమస్య ఏయిర్‌లైన్స్, ఆమెకు మధ్యది. మాకు దానితో సంబంధం లేదు’’ అన్నారు. ( కరోనా భయం: మాస్క్ మాటున కన్నీళ్లు!) -
కరోనా భయం: మాస్క్ మాటున కన్నీళ్లు!
న్యూయార్క్: ‘నా జీవితం, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ప్రమాదంలో ఉన్నట్లు నేను నిజంగా భావించాను. నేను అక్కడ కూర్చుని నిశ్శబ్దంగా మాస్క్ మాటున ఏడ్చాను. ఎందుకంటే నేను ఎంతో ప్రమాదకరమైన స్థలంలో ఉన్నట్టు అనిపింది’.. ఎరిన్ స్ట్రెయిన్ అనే మహిళ అన్న మాటలివి. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఆమె శనివారం అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 338 విమానంలో న్యూయార్క్ సిటీ నుంచి షార్లెట్‌కు వచ్చారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈ ప్రయాణం తనకు భయానక అనుభవం కలిగించిందని ఆమె ‘డైలీ మెయిల్’కు వెల్లడించారు. (కరోనా వైరస్: మరో దుర్వార్త) విమానం ప్రయాణికులతో కిక్కిరిసి ఉందని, ఎవరూ భౌతిక దూరం పాటించలేదని ఆమె వాపోయారు. కొంతమంది మాస్క్‌లు కూడా ధరించలేదని తెలిపారు. మిడిల్ సీటులో కూర్చున్న తనకు ఆరోగ్యం పట్ల ఆందోళన కలిగిందని చెప్పారు. ‘అసలు ఈ విమానం ఎందుకు ఎక్కానా అనిపించింది. నా చుట్టుపక్కల అంతా జనమే ఉన్నారు. ఎవరూ కూడా భౌతిక దూరం పాటించలేదు. తమకు తాముగా ఎవరూ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఎవరికైనా దగ్గు, తుమ్ము వస్తుందని తల తిప్పితే మనుషులు ఉన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇలాంటి పరిస్థితిని చూసి నాకు ఏడుపు వచ్చింది. మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు ఇతరులకు హాని జరగకుండా మాస్క్ ధరించాలన్న కనీస విచక్షణ కూడా ప్రయాణికులకు లేకపోవడం బాధ కలిగించింద’ని ఎరిన్ స్ట్రెయిన్ పేర్కొన్నారు. విమానంలోని ఫొటోలు, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై అమెరికన్ ఎయిర్‌టైన్ స్పందించింది. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, వైద్యాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా విమాన సర్వీసులను నడుపుతున్నామని తెలిపింది. విమానంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తున్నామని.. తమ సిబ్బంది గ్లోవ్స్, మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. తనకు ఎదురైన భయానక అనుభవం నేపథ్యంలో తిరుగు ప్రయాణం టిక్కెట్‌ను రద్దు చేసుకుంటానని ఎరిక్ స్ట్రెయిన్ చెప్పారు. కాగా, అమెరికాలో కరోనా విజృంభణ న్యూయార్క్‌లోనే అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలకు చేరువలో ఉండగా, 17,303 మరణాలు సంభవించాయి. ఒక్క న్యూయార్క్ సిటీలోనే దాదాపు లక్షా 60 వేల కోవిడ్ కేసులు నమోదు కాగా, 12,287 మంది చనిపోయారు. కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ వ్యాఖ్యలు -
డ్రెస్ సరిగాలేదని ఫ్లైట్ దింపేశారు..!
జమైకా : కుమారుడితో కలిసి విమానప్రయాణం చేస్తున్న ఓ మహిళా డాక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఉక్కపోత కారణంగా ఆమె సౌకర్యవంతమైన దుస్తులు ధరించడంతో ఫ్లైట్ ఎక్కేదిలేదంటూ విమాన సిబ్బంది అడ్డుచెప్పారు. హోస్టన్‌లో నివాసముండే డాక్టర్ తిషా రోయి స్వదేశం జమైకాలో వారంరోజులు పర్యటించి తన ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి అమెరికాకు తిరుగుపయనమయ్యారు. వేడి వాతావరణం కారణంగా ఒళ్లంతా చెమటపట్టడంతో ఆమె సౌకర్యవంతంగా డ్రెస్సింగ్ చేసుకుని విమానం ఎక్కేందుకు వెళ్లారు. అయితే, ఆమె డ్రెస్ అభ్యంతరకరంగా ఉందని, పైన జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ సిబ్బంది తెగేసి చెప్పారు. అప్పటికే ఫ్లైట్ టేకాఫ్‌కు సమయం దగ్గర పడటంతో.. తన దగ్గర జాకెట్ లేదని.. కనీసం ఓ దుప్పటైనా ఇవ్వండని తిషా సిబ్బందిని కోరింది. ఫ్లైట్ సిబ్బంది ఎలాంటి సాయం చేయకపోగా మరింత కటువుగా మాట్లాడారు. దాంతో చేసేదేంలేక తిషా, ఆమె కుమారుడు వెనుదిరిగారు. ఈ ఘటనపై విచారిస్తున్నామని... డాక్టర్‌కు ఫ్లైట్ చార్జీలు రిఫండ్ చేస్తామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ చెప్పింది. తనకెలాంటి రిఫండ్ ఇవ్వలేదని, నల్లజాతీయురాలిని కాబట్టే తన దుస్తులపై అనవసర రాద్దాంతం చేశారని తిషా ఆరోపించారు. తనలాగే డ్రెస్ చేసుకున్న మరో మహిళను ప్రయాణానికి అనుమతించారని విమర్శించారు. తనపట్ల జాతి, లింగ వ్యతిరేకత చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఫ్లైట్ ఎక్కేముందు దిగిన ఫొటోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. -
శరీరం నుంచి దుర్వాసన వస్తోందంటూ...
మిచిగాన్కు చెందిన యూదు దంపతులకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చేదు అనుభవం ఎదురైంది. శరీరం నుంచి దుర్వాసన వస్తోందన్న కారణంగా 19 నెలల చిన్నారితో సహా ఆ దంపతులను అత్యవసరంగా విమానం నుంచి దించేశారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మిచిగాన్కు చెందిన యోసి ఆడ్లర్ అనే వ్యక్తి భార్య, తన చిన్నారితో కలిసి హాలిడే ట్రిప్ కోసం మియామీ వచ్చాడు. ట్రిప్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం విమానం ఎక్కిన కొద్ది సేపటి తర్వాత.. ఆడ్లర్ దంపతులు అత్యవసరంగా విమానం దిగిపోవాలంటూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ క్రమంలో తమను దించేయడానికి గల కారణమేంటని అడగగా.. ‘మీ శరీరం నుంచి దుర్వాసన వస్తోందని ప్రయాణికులతో పాటు, మా సిబ్బంది కూడా ఫిర్యాదు చేశారు. కాబట్టి మీరు దిగిపోవాల్సిందే’ అంటూ క్రూ మెంబర్ ఇచ్చిన సమాధానం విని షాక్‌కు గురయ్యారు. యూదులం అయిన కారణంగానే ఇలా.. తమకు జరిగిన అవమానం గురించి ఆడ్లర్ మీడియాతో మాట్లాడుతూ...‘ యూదులమనే కారణంగానే మాకు చేదు అనుభవం ఎదురైంది. మమ్మల్ని ఎందుకు దించేస్తున్నారని అడిగినపుడు..మీ మతస్తులు స్నానం చేయరు కదా.. అలాగే మంచి దుస్తులు ధరించరు అంటూ వారు ఇచ్చిన సమాధానం కలచివేసింది. నిజంగా సాటి మనుషులమనే భావన ఉంటే మంచి దుస్తులు ఇచ్చి, సువాసనలు వెదజల్లే సెంట్ ఇచ్చి ఉండవచ్చు కదా. కానీ అసలు కారణం అది కాదు. అందుకే మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా దింపేసారు. అయితే నాకు సంబంధించిన వస్తువులు మాత్రం కార్గోలో వెళ్లిపోయాయి. మరుసటి రోజు విమానం ఎక్కేవరకు హోటల్లో బస చేసేందుకు చాలా ఖర్చయింది. అది ఎవరు కడతారు. మాకు జరిగిన అవమానానికి ఎవరు సమాధానం చెబుతారు. ఇంటి దగ్గర నా ఎనిమిది పిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఈ ఘటనపై స్పందించిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ .. ‘ఆడ్లర్ శరీర దుర్వాసన వల్ల మా సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే అతడిని దింపేశాం. జాతి వివక్ష చూపలేదు. మియామీ ఎయిర్‌పోర్టులో అతడికి కావాల్సిన సదుపాయాలు కల్పించాం. అయితే మేము ఇచ్చిన వాచర్లు పనిచేయలేదని ఆడ్లర్ చెప్పాడు. ఈ విషయంపై మేము విచారణ చేశాం. ఆ తర్వాత గురువారం ఉదయం టికెట్లు బుక్ చేసి పంపించేశాం’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక.. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఎయిర్‌లైన్స్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మోడల్‌కు విమానంలో తీవ్ర అవమానం
న్యూయార్క్ : అమెరికా ప్రముఖ ఫిట్నెస్ మోడల్ జెన్ సెల్టర్కు తీవ్ర అవమానం జరిగింది. న్యూయార్క్‌కు చెందిన విమానంలో నుంచి ఆమెను అర్థాంతరంగా, అకారణంగా దించివేశారు. అది కూడా ఓ ఐదారుగురు పోలీసులు చుట్టుముట్టి బలవంతంగా దింపేశారు. ఇది తన జీవితంలోనే అత్యంత పెద్ద అవమానం అని సదరు ఎయిర్‌లైన్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రమ్, ట్విటర్ వంటి వివిధ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో ఫిట్‌నెస్‌కు సంబంధించిన టిప్స్ చెబుతూ తన ఫొటోలను జెన్ సెల్టర్ పెడుతుంటారు. పైగా ఈమె ఫిట్నెస్ మోడల్ కూడా. అయితే, శనివారం రోజు మియామిలో న్యూయార్క్‌కు చెందిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో జెన్ తన సీట్లో కూర్చున్నారు. అప్పటికే విమానం బయలుదేరకుండా రెండున్నరగంటలు ఆలస్యం అయింది. అయితే, ఎలాగో విమానం బయలుదేరడం లేదు కదా కాసేపు నిల్చొని తన కోటును తీసేసి విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. అయితే, ఆమె నిల్చోగని విమాన సిబ్బంది ఆమెను కూర్చోవాలని చెప్పారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. విమానంలో నుంచి దిగిపోవాలని వారు గొడవపడ్డారు. పైలట్‌కు కూడా ఈ విషయం సిబ్బంది చెప్పగా అతడు ఎయిర్పోర్ట్ అధికారులకు చెప్పారు. దాంతో ఓ ఐదారుగురు పోలీసులు విమానంలోకి వచ్చి ఆమెను బలవంతంగా దించేశారు. ఆమె పక్కన ఉన్నవాళ్లు ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించినా ఆమెను ఫ్లైట్‌లో ఉంచకుండా దింపేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సైతం ఆమె పంచుకున్నారు. Just like that, 5 cops coming at me. Worst experience American Air ✌🏼 pic.twitter.com/1LY1NrAQ3k — Jen Selter (@JenSelter) 28 January 2018 Current situation @AmericanAir .. insane. pic.twitter.com/kIOh3VysnU — Jen Selter (@JenSelter) 28 January 2018 Here is a video of an innocent passenger who on her own decided to get off the plane based on how badly @AmericanAir treated us all. pic.twitter.com/DZ4kkHOlox — Jen Selter (@JenSelter) 28 January 2018 -
విమానంలో ప్రయాణికురాలిపై సిబ్బంది దాడి
వాషింగ్టన్: అమెరికాలో విమానంలో ఓ ప్రయాణికురాలిని సిబ్బంది ఆమె పాప కుర్చీతోనే కొట్టిన సంఘటన వెలుగుచూసింది. దీంతో ఆ ఉద్యోగిని సదరు విమాన సంస్థ సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. శుక్రవారం శాన్ఫ్రాన్సిస్కో నుంచి డల్లాస్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్(ఏఏ) విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమాన సంస్థ ఉద్యోగి ఒకరు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోలో ప్రయాణికురాలితో నిందితుడు గొడవ పడుతున్నట్లు కనిపించింది. బాధితురాలిని కాపాడటానికి ఓ వ్యక్తి జోక్యం చేసుకోవడంతో కేబిన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని న్యూయార్క్ డైలీ న్యూస్ పేర్కొంది. ఆ వ్యక్తికి, నిందితుడికి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో బాధితురాలు తన పాపతో పక్కకు నిల్చొని ఏడుస్తూ ఉందని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. -
క్యూబాకు అమెరికా విమాన రాకపోకలు
హవానా: క్యూబా అమెరికా దేశాల మధ్య నిలిచిపోయిన విమాన రాకపోకలు క్యూబా విప్లవ యోధుడు, ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణానంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. మంగళవారం తొలి వాణిజ్య విమానం అమెరికా నుంచి బయలుదేరి క్యూబా రాజధాని హవానాలో దిగింది. దీంతో 50 ఏళ్ల అనంతరం అమెరికా నుంచి తొలిసారిగా విమానం క్యూబాలో అడుగిడినట్లైంది. క్యాస్ట్రో మరణంతో ఆ దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్న నేపథ్యంలో ఆయన సంస్మరణ సభలకు హాజరయ్యే ప్రయాణికుల దృష్ట్యా అమెరికా నుంచి క్యూబాకు విమాన రాకపోకల్ని పునరుద్ధరించాలని అమెరికన్ ఎయిర్ లైన్స్ నిర్ణయించింది. ఈ తాజా నిర్ణయం పట్ల క్యూబా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య విమానాల రాకపోకలు పునఃప్రారంభమైన సందర్భంగా హవానాలోని జోస్మార్టి అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే పొడవునా విమానంపై ఫైర్ట్రక్కులనుంచి నీటిని వెదజల్లుతూ క్యూబా ప్రజలు స్వాగతం పలికారు. ‘ఈ హవానా దీవిని సందర్శించడం నాకిది మూడోసారి. ఈ రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు పునఃప్రారంభం కావడం పట్ల నేనెంతో ఉద్వేగానికి గురయ్యా’నని మియామీలో జన్మించిన క్యూబన్ అమెరికన్ జొనాథన్ గొంజాలెజ్ తెలిపారు. ఇదిలా ఉండగా రెండేళ్ల క్రితం క్యూబా అధ్యక్షుడు రావుల్ క్యాస్ట్రో, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భేటీ సందర్భంగా ఈ రెండు దేశాల మధ్య విమాన రాకపోకల పునరుద్ధరణకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. -
ఉగ్ర కలకలం.. విమానం అత్యవసర ల్యాండింగ్
డల్లాస్: విమానంలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని అత్యవసరంగా టెక్సాస్‌లోని లబ్బక్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. కాలిఫోర్నియా నుంచి విమానం డల్లాస్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. కాలిఫోర్నియాకు చెందిన జెర్రీ బా గుయెన్ (24) అనే యువకుడు తోటి ప్రయాణికులకు హానికలిగించే విధంగా ప్రవర్తించాడని తెలిపిన ఎయిర్‌లైన్స్ అధికారులు మిగతా వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలతో జెర్రీపై కేసు నమోదు చేశారు. స్థానిక అసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిందితుడిని లబ్బాక్ కౌంటీ జైలుకు తరలించారు. ఈ ఘటనతో 143 మంది ప్రయాణికులతో ఉన్న విమానం గంట ఆలస్యంగా డల్లాస్ ఫోర్ట్‌వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. -
కో పైలట్ నిర్వాకానికి విమానం రద్దు
వాషింగ్టన్: కో పైలట్ చేసిన నిర్వాకానికి విమాన సర్వీసును చివరి నిమిషంలో రద్దు చేయాల్సి వచ్చింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ కో పైలట్ మద్యంతాగి విధులకు హాజరుకావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం డెట్రాయిట్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. విధులకు హాజరయినపుడు విమానాశ్రయంలో కో పైలట్‌కు బ్రీత్ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా, ఆయన మద్యం తాగినట్టు వెల్లడైంది. దీంతో పోలీసులు కో పైలట్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. దీనికారణంగా డెట్రాయిట్ నుంచి ఫిలడెల్ఫియాకు వెళ్లాల్సిన 736 ఫ్లయిట్‌ను అమెరికన్ ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది. ఇతర విమాన సర్వీసుల్లో వెళ్లాల్సిందిగా ప్రయాణకులను కోరింది. ప్రయాణికుల భద్రతకు తాము అధిక ప్రాధాన్యమిస్తామని, అంతరాయం కలిగించినందుకు క్షమాపణలు చెప్పామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. కాగా కో పైలట్ పేరును వెల్లడించలేదు. ఆయనకు మత్తు దిగాక విడిచిపెట్టారు. -
పైలట్‌కు ఇబ్బందని నలుగురిని దించేశారు
న్యూయార్క్: విమాన సిబ్బందికి నచ్చలేదని నలుగురు ప్రయాణికులను బలవంతంగా దించివేసిన ఘటన ఆందోళన రేకెత్తించింది. ఒక సిక్కు యువకుడు సహా అతని స్నేహితులు నలుగుర్ని విమానం దిగిపోవాల్సిందిగా అమెరికన్ ఎయిర్ లైన్స్ అదేశించింది. లేదంటే విమానాన్ని ఆపివేస్తామన్నారు. దీంతో వివాదం రాజుకుంది. ఒక సిక్కు యువకుడు, ముగ్గురు ముస్లిం యువకులతో కలిసి టొరంటో నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు విమానంలో బయలుదేరారు. షాన్ ఆనంద్, ఆలం, డబ్ల్యూ.హెచ్, ఎంకె, ఈ నలుగురు విమానం ఎక్కి సర్దుకుని కూర్చొనే లోపే వారికి చేదు అనుభవం ఎదురైంది. విమానంనుంచి దిగిపోవాల్సింది విమాన అటెండెంట్ అదేశించింది. దీంతో షాకైన యువకులు వాదనకు దిగారు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి వారిని బలవంతంగా గెంటేసి మరీ విమానం ఎగిరిపోయింది. దీనిపై షాన్ , అతని స్నేహితులు ఎయిర్ లైన్స్ సంప్రదించినపుడు అధికారులు విచిత్రమైన వాదనకు తెరతీశారు. వారి ఇంటి పేర్ల ఆధారంగా బంగ్లాదేశ్ ముస్లిం, అరబ్ ముస్లింలను గుర్తించిన విమాన సిబ్బంది ఆందోళనకు లోనయ్యారని తెలిపారు. ముఖ్యంగా పైలట్ వారు విమానంలో ఉంటే తమకు అసౌకర్యంగా ఉంటుందని వాదించారన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడంతో ఆ యువకులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థపై సుమారు 62 కోట్ల (9 మిలియన్ డాలర్లు) పరిహారం చెల్లించాల్సింది కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధమంటూ, ప్రోటోకాల్ పేరుతో ఎయిర్ లైన్స్ సంస్థ తమను మానసికంగా వేధించిందని ఆనంద్ ఆరోపించాడు. అందరూ తనను క్రిమినల్‌గా చూస్తోంటే చాలా బాధేసిందని డబ్ల్యూ.హెచ్ అనే మరోయువకుడు వాపోయాడు. -
గాల్లో విమానం.. పైలెట్ చనిపోయాడు
సిరాకస్(అమెరికా): కొన్ని వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతోంది. అది కూడా గమ్యస్థానానికి ఇంకా చాలా దూరంలో ఉంది. అనుకోకుండా పైలెట్‌కు అస్వస్థత.. కొద్ది సేపటికే మృతి. దీంతో తొలుత కంగారు పడిన కో పైలెట్ తిరిగి ధైర్యంగా వ్యవహరించి సురక్షితంగా విమానం దించేశాడు. అమెరికాకు చెందిన విమానం పైలెట్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై గాల్లోనే ప్రాణాలు విడిచాడు. దీంతో కో పైలెట్ జాగ్రత్తతో వ్యవహరించి ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా విమానాన్ని దించివేశాడు. అయితే, ఈ విషయం ముందుగా ప్రయాణీకులకు తెలియకుండా అతడు జాగ్రత్తపడటంతో ఓ భారీ ఆందోళన, భయానికి తావివ్వకుండా చేసినట్లయింది. ఆదివారం రాత్రి 11.55 గంటలకు అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం 550 ఫోనిక్స్ నుంచి బోస్టన్‌కు బయలు దేరింది. అయితే ప్రయాణం మధ్యలోనే పైలెట్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యి, ఆ వెంటనే ప్రాణాలుకోల్పోవడంతో వెంటనే విమానం బాధ్యతలు పూర్తి స్థాయిలో కో పైలెట్ తీసుకున్నాడు. మధ్యలోనే సిరాకస్కు చెందిన విమానాశ్రయ అధికారులను సంప్రదించి మెడికల్ ఎమర్జెన్సీ ఉందని, వెంటనే విమానాన్ని దించివేయాలనుకుంటున్నానని, అందుకు అనుమతివ్వాలని కోరాడు. దీంతోపాటు రన్ వే దగ్గరికి వెంటనే ఎమర్జెన్సీ అంబులెన్స్‌ను పంపించాలని కోరాడు. ఇందుకు సిరాకస్ అధికారులు అంగీకరించడంతో దానిని సోమవారం ఉదయం 7గంటల ప్రాంతంలో సురక్షితంగా దించివేశాడు. అలా దించిన తర్వాతనే పైలెట్ చనిపోయాడని, అందుకే విమానం అత్యవసరంగా దిగిందని, తోటి ప్రయాణీకులకు, సిరాకస్ విమానాశ్రయ అధికారులకు తెలిసింది. కో పైలెట్ నిర్వహించిన బాధ్యతలను విమానాశ్రయ అధికారులు మెచ్చుకోగా.. అందులోని ప్రయాణీకులు మాత్రం ఒక్క క్షణం గుండెలపై అమ్మో అని చేతులేసుకున్నారు. ఎయిర్ బస్ ఏ 320 ద్వారా ప్రయాణీకులను బోస్టన్ నగరానికి తరలించారు. ఇందులో మొత్తం 147మంది ప్రయాణీకులు ఉన్నారు. కాగా, కో పైలెట్ కూడా పైలెట్‌కు ఉండే సామర్థ్యతను కలిగి ఉంటాడని, అతడు ప్రమాదాలను నివారించగలడని అమెరికా ఎయిర్ లైన్స్ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా ఎయిర్ లైన్స్‌లో ప్రయాణంలో ఉండగా ఏడుగురు పైలెట్లు, ఒక చార్టర్ పైలెట్ మరణించాడు. -
ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థ ఆవిర్భావం
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన సంస్థ ఆవిర్భవించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, యూఎస్ ఎయిర్వేస్ ఈ రెండు సంస్థలు విలీనమై కొత్తగా అమెరికన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ సంస్థ ఏర్పడింది. విలీన ప్రక్రియను పూర్తి చేశామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ మాజీ మాతృసంస్థ ఏఎంఆర్ కార్పొరేషన్, యూఎస్ ఎయిర్‌వేస్‌లు పేర్కొన్నాయి. కొత్తగా ఏర్పడిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ సోమవారం నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయింది. ఈ సంస్థ రోజుకు 6,700 విమానాలను 50 దేశాల్లోని 330 నగరాలకు నడుపుతుంది. యూఎస్ ఎయిర్వేస్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు కలిసి అజేయమైన సంస్థను స్థాపించాయని కొత్తగా ఏర్పాటైన అమెరికన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న పార్కర్ పేర్కొన్నారు.